నారద ఉవాచ - నారదుడనెను :
శ్రుతం కిమద్భుతం బ్రహ్మన్ హరేశ్చరితమంగలం ।
విశేషతస్తవ ముఖే హ్యతీవ సుమనోహరం ॥
మృతాయాం మువికన్యాయాం శాపాద్దుర్వాససో మునేః ।
కిం చకార సమాగత్య తన్మే బ్రూహి తపోధన ॥
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి ఇట్లు పలికెను :
సరస్వతీ నదీతీరే తపస్యాం కుర్వతో మునేః।
పపాత దౌతమూర్ధ్వాచ్చ ధార్యమాణం చ వాయునా॥
పృథివ్యాం పతితే వస్త్రే తవస్త్యక్త్వా మునీశ్వరః ।
ధ్యానేన బుబుధే సర్వం కన్యాసంబంధి సంకటం ॥
జగామ శోకావిష్టోఽపి తూర్ణం జామాతురాశ్రమం ।
సి షేచ పృథివీ రేణూన్ ధశ్వన్నయన బిందునా ॥
గత్వాఽఽలయ సమీపం చ విప్రః కాతర మానసః।
హే వత్సే కందలీత్యేవమువాచ చ పునః పునః ॥
ఓ బ్రహ్మభూతుడా! శ్రీహరి యొక్క మంగళకరమైన చరిత్రము ఎంత అద్భుతమైనది ! విశేషించి నీ వాక్కుల ద్వారా మిక్కిలి మనోహరమైన దానిని వింటిని. దూర్వాసముని శాపము వలన ఔర్వముని పుత్రిక (కందలి) అట్లు మరణించగా ఆ తండ్రి ఏమి చేసెనో? ఓ తపోధనుడా! నాకా విషయము తెలుపుము. అనగా నారాయణ మహర్షి ఇట్లనెను. ఔర్వముని సరస్వతీనదీ తీరమున తపస్సు, చేయుచుండగా కేవలము వాయువుచేతనే పట్టుకొనబడిన అతని తలమీదుగా (కప్పువలె) నిలిచియున్న ధౌతవస్త్రము (ఉదికిన పంచె) పై నుండి క్రిందపడెను. ఆ వస్త్రమట్లు నేలమీద పడగా మునీశ్వరుడు వెంటనే తపస్సు విడిచి యోగ శక్తి వలన తన బిడ్డకు వచ్చిన ఆపదను తెలిసికొనెను. శోకమాతనిని కప్పివేయగా వెంటనే ఆలుని ఆశ్రమమునకు పోయెను. ఆశ్రమ సమీపమున కేగి ఆ బ్రాహ్మణుడు భయాందోళనతో “బిడ్డా! కందలీ!” అని మరల మరల పిలిచెను.
శ్వశురస్య స్వరం జ్ఞాత్వా దూర్వాసా భయవిహ్వలః।
బహిర్బభూవ శీఘ్రం చ పపాత చరణాంబుజే ॥
ప్రణమ్య శ్వశురం శోకాద్విలలాప భృశం పునః ।
ప్రవృత్తిం కథయామాస మూలతో మునిసత్తమం ॥
శ్రుత్వా వార్తాం శుచాఽఽవిష్టః పపాత ధరణీ తలే।
మూర్ఛామాప మహాజ్ఞానీ విశ్చేష్టో హి యథామృతః॥
మృతం దృష్ట్వా స దుర్వాసా మునే మనసి సంకటం ।
చేతనాం కారయామాన ప్రయత్నేన మహామునేః॥
నంప్రాప్య చేతనాం శీఘ్రమువాచ తం పురఃస్థితం।
జామాతరం శోకయుతం భీతం ప్రణత కంధరం॥
మహాశోకాదశ్రు పూర్ణం రక్తపంకజ లోచనం ।
కోపాత్కంపితవాన్ శశ్వత్సంత్రస్తం స్ఫురితాధరః॥
మామగారి కంఠస్వరము గుర్తించి దూర్వాసముని భయముతో మనస్సు చెదరి వెంటనే బయటకు వచ్చి ఔర్వుని పాదములపై పడెను. మామకు నమస్కరించి దుఃఖముతో మిక్కిలి ఏడ్చెను. మొదటినుండి జరిగిన వృత్తాంతమంతయు ఆ మునికి చెప్పెను. ఆ వార్తను విని ఔర్వుడు దుఃఖము క్రమ్ముకొనగా గొప్పజ్ఞానియయ్యును నేలమీద పడిపోయి మూర్ఛిల్లెను. మరణించినవానివలె చేష్టలుడిగెను. ఓ నారదా! చచ్చినట్లున్న మామను చూచి దూర్వాసమునికి మనస్సులో కష్టమనిపించి అతడు ప్రయత్నముతో ఔర్వమహామునికి చైతన్యము వచ్చునట్లు చేసెను. స్మృతికి వచ్చిన ఔర్వుడు ఎదురుగా నిలిచియున్న అల్లునిచూచి కోపము పట్టజాలక పెదవులు మాటి మాటికి అదరుచుండగా పలికెను. దూర్వాసుడు భయముతో తలవంచుకొని మహాదుఃఖముతో కన్నులెర్రబడి కన్నీరు నిండగా నిలబడెను.
ఔర్వ ఉవాచ - ఔర్వముని ఇట్లనెను :
ఆయే బ్రహ్మన్నత్రివంశ పౌత్రస్త్వం జగతీపతేః।
స్వల్పదోషే బహుతరః కృతో దండస్త్వయా కథం ॥
త్వజ్జన్మ శంకరాంశేన శిష్యన్తన్య జగద్గురోః ।
వేదవేదాంగ ఏజ్ఞశ్చ సర్వజ్ఞో గుణవాన్ స్వయం॥
అనసూయా మహాసాధ్వీ కమలాంశా తవ ప్రసూః ।
న జానే కేన దోషేణ తవ చైతాదృశీమతిః ॥
గుణవాన్ జనకో యస్య మాతా గుణవతీ సతీ ।
తయోః పుత్రో దయాహీనో గతిః సూక్ష్మా శ్రుతేరహో ॥
ఓయీ బ్రాహ్మణుడా! అత్రి వంశీయుడా! నీవు సృష్టికర్త పౌత్రుడవు. స్వల్పదోషమునకు అత్యధికమైన శిక్ష నెట్లు విధించితివి ? శంకరుని అంశతో నీవు జన్మించితివి. ఆ జగద్గురువునకు శిష్యుడవు. వేదవేదాంగ వేత్తవు. సర్వజ్ఞుడవు. స్వయముగా గుణవంతుడవు. నిన్ను గన్న తల్లి మహాసాధ్వియైన అనసూయాదేవి. లక్ష్మ్యంశ సంభూతురాలు. ఏ దోషము వలన నీకిటువంటి బుద్ధి యేర్పడినదో నేనెరుగను. ఎవనీ తండ్రి సద్గుణవంతుడో! ఎవని తల్లి గుణవతి మరియు పతివ్రతయో! అట్టి తల్లిదండ్రుల పుత్రుడు దయాహీనుడు! ధర్మము యొక్క గతి సూక్ష్మమై తెలియరానిదయ్యెను. ఆశ్చర్యము !
మమ ప్రాణాధికా కన్యా ముదా త్వయి సమర్పితా।
మహాగుణాన్వితా స్వల్ప దోషేణ పరిమిశ్రితా ॥
వాగ్దుష్టాయాశ్చ దండో హి పరిత్యాగః శ్రుతౌ శ్రుతః।
త్వయా క్రోధాద్యది త్యక్తా పిత్రా యత్నేన పాలితా ॥
మదపత్యం స్వల్పదోషే యతో భస్మీకృతం త్వయా ।
పరాభవస్తవ మహాన్ భవిష్యతి న సంశయః ॥
మహతాం క్షుద్రజంతూనాం సర్వేషాం జీవినాం సదా।
స్రష్టా పాతా శాస్తా చ భగవాన్ కరుణానిధిః ॥
ఇత్యుక్త్వా చ మునిశ్రేష్ఠో విలప్య చ పునః పునః ।
హేఽoబ వత్సేహ్యయీత్యుక్త్వా జగామ స్వాలయం రుషా ॥
నాకు ప్రాణముల కంటె అధిక ప్రియమైన కన్యను సంతోషముతో నీకర్పించితిని. ఆమె మహాగుణవతి. స్వల్పమైన దోసమోమెలోనుండెను. వాగ్దుష్టురాలైన స్త్రీని పరిత్యజించుటయే శిక్షవిధించుట యని వేదమందు వినబడినది. నీవు కోపముతో విడిచిపెట్టినచో ఆమెను తండ్రి ప్రయత్నించి పోషించువాడు. నా బిడ్డలో స్వల్పదోషమును చూచి నీవు భస్మము చేసితివి. అందువలన నీకు గొప్ప పరాభవము (అవమానము) ముందు జరుగగలదు. ఇందులో సందేహము లేదు. గొప్పవారిని అల్పులను సర్వప్రాణులను ఎల్లప్పుడు సృష్టించువాడు రక్షించువాడు శిక్షించువాడు (శాసించువాడు) దయానిధియగు భగవంతుడే సుమా. ఇట్లు పలికి ఔర్వముని మరల మరల దుఃఖించి అమ్మా! బిడ్డా! అని పలుకుచు కోపముతో తన నివాసమునకేగెను.
గతే మునీంద్రే దుర్వాసా విలలాప భృశం పునః ।
జ్ఞానేన విస్మృతః శోకో బభూవ ద్విగుణః పునః ॥
శోకానలో హి కాలేన విచ్ఛిన్నో జ్ఞాన భస్మనా ।
బంధుదర్శనదుఃఖేంధదానేన వర్ధతే వునః ॥
స్మారం స్మారం ప్రియాం తత్ర విలప్య చ పునః పునః ।
బోధయిత్వా స్వమాత్మానం తపస్యాయాం మనో దధౌ॥
ఇత్యేవం కథితం సర్వం మునేః శాపస్య కారణం ।
బభూవ తన్య కాలేన దుస్పహశ్చ పరాభవః ॥
ఔర్వముని వెళ్లిపోగా దూర్వాసుడు మరల మిక్కిలి దుఃఖించెను. జ్ఞానము వలన మరపున బడిన శోకము మరల ద్విగుణమయ్యెను. కాలము గడచిన తరవాత జ్ఞానాగ్ని చేత శమింపజేయబడిన దుఃఖమను అగ్ని బంధు దర్శనము వలన కల్గిన శోకమును ఇంధనములు (కర్రపుల్లలు) వేయుట వలన మరల వృద్ధి చెందును. అతడు ప్రియురాలిని తలచుకొని తలచుకొని అక్కడ మరల మరల విలపించి తన మనస్సునకు బోధ సలిపి తపస్సులో స్థిరపడెను. ఇట్లు దూర్వాసుని శాపమునకు కారణము చెప్పితిని. కొంతకాలమునకతనికి భరింపరాని అవమానము జరిగెను.
నారద ఉవాచ - నారదుడనెను :
దుర్వాసాః శంకరస్యాంశః శివతుల్యశ్చ తేజసా।
తేజస్వీ కో మహానేవ చకార తత్పరాభవం ॥
దూర్వాసముని శంకరుని అంశకదా! తేజస్సులో శివునితో సమానుడు కదా! ఏ మహాతేజస్వి అతనికి పరాభవము కలిగించెను ?
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :
అంబరీషో హి రాజేంద్రః సూర్యవంశ సముద్భవః।
శ్రీకృష్ణ చరణాంభోజే తన్మనాః సంతతం మునే॥
న రాజ్యేషు న భార్యాసు న పుత్రేషు ప్రజాసు చ ।
న సంపత్సు క్షణం చిత్తం పుణ్యకర్మార్జితాను చ ॥
ధ్యాయతేఽహర్నిశం ధర్మీ స్వప్నే జ్ఞానే హరిం ముదా ।
మహాజితేంద్రియుః శాంతో విష్ణువ్రత పరాయణాః ॥
ఏకాదశీ వ్రతరతః కృష్ణపూజాను తత్పరః ।
సర్వకర్మ న్వలిప్తశ్చ కర్తె కృష్ణార్పితేషు చ॥
ఓ నారదమునీ! సూర్యవంశమున జన్మించిన అంబరీషుడను రాజేంద్రుడు ఎల్లప్పుడు శ్రీకృష్ణ పాదపద్మములందే మనస్సు గలవాడై - రాజ్యమునందుగాని భార్యల యందు గాని పుత్రుల మీద గాని ప్రజల మీద గాని పూర్వజన్మలోని పుణ్యకర్మల వలన సమకూరిన సంపదల మీద గాని ఒక క్షణము గూడ మనసు పెట్టకుండెను. అతడు గొప్ప జితేంద్రియుడు శాంతమనస్కుడు ధర్మకార్యములాచరించు ధర్మాత్ముడు. కలలోగాని మేల్కొని యున్నప్పుడుగాని రాత్రింబగళ్లు ముదముతో శ్రీహరినే ధ్యానించును. విష్ణువ్రతములందే ఆసక్తి గలవాడు కనుక ఏకాదశీవ్రతము నందు శ్రీకృష్ణ పూజనమందు మనస్సు లగ్నము చేసి తాను చేయు కర్మలన్నిటిని కృష్ణార్పణము చేయుచు నేను కర్తనని అహంకార మమకారములు లేకపోవుటచే వాటి వలన సంభవించు దోషములు (పుణ్యపాపములు) అంటకుండనుండెను.
సుతీక్ష్ణం షోడశారం చ హరేశ్పక్రం సుదర్శనం ।
తేజసా హరితుల్యం చ సూర్యకోటి సమప్రభం ॥
బ్రహ్మాదిభిః స్తూయమానం పూజితం చ సురాసురైః ।
ప్రభుణా రక్షితం శశ్వద్రక్షాయై నృపసన్నిధా॥
బ్రహ్మాది దేవతల చేత స్తుతింపబడునది దేవదానవులచేత పూజింపబడినది కోటిసూర్యుల ప్రభ గలది వాడియైన పదహారు అంచులు గలది ఐన శ్రీహరి యొక్క సుదర్శనమనెడి చక్రము సర్వకాలరక్షగా స్వామిచేత ఆ రాజువద్ద ఉంచబడినది.
ఏకాదశీ వ్రతం కృత్వా ద్వాదశీ దివసే సతి ।
స్నాత్వా విధాయ పూజాం చ కాలేన విధిపూర్వకం॥
దత్త్వా దానం బ్రాహ్మణేభ్యః సువర్ణ రజతాదికం ।
బ్రాహ్మణాన్ భోజయిత్వా చ భోజనార్ధమువాస హ ॥
అట్టి అంబరీషుడు ఏకాదశీ వ్రతము నాచరించి ద్వాదశినాడు ఉదయకాలముననే స్నానము చేసి వీధి (శాస్త్రము) ప్రకారము భగవంతుని పూజించి బ్రాహ్మణులకు వెండి బంగారములను దానము చేసి బ్రాహ్మణులను భుజింపజేసి తాను భుజించుటకు కూర్చుండెను.
ఏతస్మిన్నంతరే విప్రస్తవస్వీ క్షుధితో మునే ।
దండి ఛత్రీ శుక్లవాసా బిభ్రత్తిలకముత్తమం ॥
జటిలోఽతికృశస్త్రస్తః శుష్కకంఠోష్ఠతాలుకః ।
తత్రాజగామ భగవాన్ దుర్వాసా నృపతేః పురః ॥
ఓ నారదా! ఇంతలో నొక బ్రాహ్మణుడు తపస్సు చేసినవాడు చేతిలో బ్రహ్మదండము గొడుగు ధరించినవాడు తెల్లని వస్త్రములను నుదుట తిలకమును ధరించినవాడు జటాధారి మిక్కిలి బక్కచిక్కి ఆకలిగొని ప్రాణములు పోవునేమో అన్న భయముతో నున్నవాడు గొంతు దవడలు పెదవులు ఎండిపోయిన వాడగు దుర్వాసుడు ఆ రాజు ముందుకు వచ్చెను.
స చ దృష్ట్యా మునీంద్రం తముత్థాయ చ ప్రణమ్య చ।
దత్త్వా పాద్యం చ సంప్రీత్యా స్వర్ణ సింహాసనం దదౌ॥
తస్మై దత్త్వాఽశిషం విప్రః సమువాస సుఖాసనే ।
పప్రచ్ఛ రాజా తం ప్రీతః కాఽజ్ఞా తే వద కామితం॥
నృపేంద్రవచనం శ్రుత్వా తమువాచ మహామునిః ।
బుభుక్షితస్య మే రాజన్ దేహ్యన్నం విధిపూర్వకం ॥
కిం త్వఘమర్షణ మంత్రం తు జప్త్వాఽయామ్యచిరేణ వై ।
క్షణం ప్రతీక్షతాం రాజన్నిత్యుక్త్వా చ గతో మునిః॥
అప్పుడు రాజు మునీంద్రుని చూచి లేచి నమస్కరించి పాద్యజలమిచ్చి బంగారు పీఠము వేసెను. ఆ ముని, రాజు నాశీర్వదించి కూర్చుండెను. అప్పుడు రాజు ప్రీతితో “ఏమి యాజ్ఞ ? మీ కోరిక ఏమి" అని యడుగగా ఆ మహాముని “రాజా! ఆకలి గొన్న నాకు శాస్త్రానుసారము భోజనము పెట్టుము. అఘమర్షణ మంత్రజపముతో స్నానమాడి త్వరగా వత్తును. ఒక్క క్షణము నిరీక్షించుము” అని పలికి మరల వెడలిపోయెను.
గతే విప్రేతు రాజర్షిశ్చింతాం ప్రాప దురత్యయాం ।
విలోక్య విగత ప్రాయాం ద్వాదశీం భయసంయుతః ॥
ఏతస్మిన్నంతరే తత్ర నమాయాంతం గురుం ముదా ।
నత్వా నివేద్య సర్వం తు నృపతిః సమువాచ హ ॥
నాయాతి మునిశార్దూలః ప్రయాణి ద్వాదశీ తిథిః ।
సంకటేఽస్మిన్ విధేయం చ వివిచ్య విధిపూర్వకం॥
శీఘ్రం వద మునిశ్రేష్ఠ భద్రాభద్రం చ మామితి॥
శ్రుత్వా నృపోక్తిం త్వరితమువాచ మునిపుంగవః ।
హితం తథ్యం చ వేదోక్తం పరిణామ సుఖావహం ॥
బ్రాహ్మణుడట్లు పలికి వెళ్లిపోగా దాటిపోనున్న ద్వాదశీ తిథిని గమనించి రాజు భయముతో దురంతమైన విషాదము పొందెను. ఇంతలో తన వద్దకు వచ్చుచున్న గురువును చూచి సంతోషముతో నమస్కరించి రాజు పరిస్థితినంతయు విన్నవించెను. "ఓ మునిరాజా! మునివరుడైన దూర్వాసుడు వచ్చుట లేదు. ద్వాదశీ తిథియేమో వెళ్లిపోవుచున్నది. ఈ సంకట పరిస్థితిలో శాస్త్రీయముగా ఏది చేయదగినదో దానినాచరించుట వలన కలిగిడి భద్రము అభద్రము లేవియో విచారించి శీఘ్రముగా చెప్పుము” అని ప్రశ్నించిన రాజు వాక్కులు విని వెంటనే ముని పుంగవుడు హితము సత్యము వేదోక్తమును చివరికి (ఫలించుదశలో) సుఖము కల్గించునట్టి మాటను వచించెను.
వశిష్ఠ ఉవాచ - వశిష్ఠ మహర్షి పలికెను :
ద్వాదశ్యాం నమతీతాయాం త్రయోదశ్యాం తు పారణం ।
ఉపవాస ఫలం హత్వా వ్రతినం హంతి నిశ్పితం॥
బ్రహ్మహత్యా సమం పాపం భవేత్తస్య శ్రుతౌ శ్రుతం ।
భక్ష్యద్రవ్యం సురాతుల్యమిత్యాహ కమలోద్భవః ॥
న భోజయిత్వా మూఢశ్చేతిధిం సముపస్థితం ।
న త్రస్తః క్షుధితో భుంక్తే కుంభీపాకే ప్రజేద్ ధ్రువం॥
శతవర్షం తత్ర తిష్ఠన్నరశ్చండాలతాం వ్రజేత్ ।
వ్యాధియుక్తో దరిద్రశ్చ భవేజ్ఞన్మని జన్మని॥
అతోఽతిసూక్ష్మం కిం బ్రూమోఽధునా పరమసంకటే ।
రక్షాం కురు ద్వయోర్ధర్మం సమాలోక్య వదామి తే ॥
ఉపవాస ఫలం రక్ష కృష్ణస్య చరణోదకం ।
భుక్త్వా శీఘ్ర మపోరాజంస్తద్భక్షణమభక్షణం ॥
ఇత్యుక్త్వా బ్రహ్మణః పుత్రో విరరామ మహామునే ।
ఋభుజే తజ్జలం కించిత్కృష్ణ పాదాంబుజం స్మరన్॥
రాజా! ద్వాదశి దాటిపోయిన పిదప త్రయోదశి తిథిలో పారణము (ఉపవాసము తరువాత చేయు భోజనము) చేయుట ఉపవాస ప్రతమును ఉపవసించినవానిని నశింపజేయును. అది బ్రహ్మహత్యతో సమమైన పాపమని వేదములో వినిపించును. అప్పుడు భుజించిన పదార్థము కల్లుతో సమానమని బ్రహ్మ చెప్పెను. ఇక ఆ సమయములో చేరవచ్చిన అతిథిని తినబెట్టకుండి మూఢుదు ఆఖలికి భయపడి తాను తిన్న యెడల వాడు కుంభీపాక నరకము పొందుట నిశ్చయము. నూరేండ్లందులో నుండి చండాలుడై జన్మించును. జన్మజన్మకు దరిద్రుడు వ్యాధియుక్తుడగును. అందువలన ఈ సంకటమైన సమయములో అతిసూక్ష్మమైన ధర్మమును చెప్పెదను వినుము. రెండు ధర్మముల నిప్పుడు కాపాడుము (పౌరణము అతిథి సత్కారము). ఓ రాజా! త్వరగా నీవు శ్రీకృష్ణ పాదోదకమును త్రాగి ఉపవాస ఫలమును రక్షించుకొనుము. స్వామి శ్రీ పాదజలము త్రాగుట భక్షించుట కాదు. ఇట్లు బ్రహ్మపుత్రుడైన వసిష్ఠ మహర్షి పలుకగా అంబరీషుడు శ్రీకృష్ణుని పాదపద్మములను స్మరించుచు కొద్దిగా స్వామి పాదజలమును త్రాగెను.
ఏతస్మిన్నంతరే బ్రహ్మన్నాజగామ మునీశ్వరః ।
చిచ్ఛేద కోపాత్పర్వజ్ఞః స్వజటాం నృపతేః పురః ॥
తతః సముత్థితః శీఘ్రం పురుషోఽగ్ని శిఖోపమః ।
ఖడ్గహస్తో మహాభీమో రాజేంద్రం హంతుముద్యతః॥
ఓ నారదా! ఇంతలో దూర్వాసముని అక్కడికి చేరవచ్చి సర్వజ్ఞుడు కనుక రాజు భగవంతుని తీర్థము గ్రహించినందుకు కోపించి తన జడనొక దానిని పీకి రాజు ముందు వేసెను. వెంటనే దాని నుండి అగ్ని జ్వాలవంటి పురుషుడు భయంకరముగా ఖడ్గహస్తుడై ఉద్భవించి రాజును చంపబూనుకొనెను.
హరేశ్చక్రం చ తం దృష్ట్వా సూర్యకోటి సమప్రభం ।
చిచ్ఛేద కృత్యాపురుషం బ్రాహ్మణం ఛేత్తు ముద్యతం ॥
దృష్ట్వా సుదర్శనం విప్రో దుద్రావ భయ విహ్వలః ।
ద్విజః పశ్చాత్తం దదర్శ జ్వలదగ్ని శిఖోపమం ॥
బ్రహ్మాండ క్రమణం కృత్వా నిర్విణ్ణోఽ తిభయాకులః ।
తం చ మత్వా జగన్నాథం బ్రహ్మాణం శరణం యయౌ ॥
కోటిసూర్యులతో సమానమైన తేజస్సు గల శ్రీహరి చక్రము ముని జడనుండి పుట్టిన ఆకృత్యా పురుషుని చూచి వెంటనే నరికి వేసెను అట్లే దూర్వాసమునిని నరకుటకు వచ్చుచున్న ఆ సుదర్శన చక్రమును చూచి ఆ బ్రాహ్మణుడు భయముతో మనస్సు చెదిరి పరుగెత్తెను. మండుచున్న అగ్నిజ్వాలవలె తన వెనుకబడి వచ్చుచున్న చక్రమును చూచి భయదుఃఖములతో బ్రహ్మాండమంత తిరిగి సృష్టికర్తను తలచుకొని అతడన్నిటికి నాధుడని బ్రహ్మను శరణుజొచ్చెను.
త్రాహి త్రాహిత్యేవముక్త్వా వివేశ బ్రహ్మణః సభాం ।
ఉత్థాయ బ్రహ్మా విప్రేంద్రం పప్రచ్ఛ కుశలం మునే ॥
సర్వం స కధయామాన వృత్తాంతం మూలతో విధిం ।
శ్రుత్వా బ్రహ్మా నిశశ్వాస తమువాచ భయాకులః ॥
ముని బ్రహ్మ సభలో ప్రవేశించి రక్షించుము రక్షించుమనగా బ్రహ్మలేచి నిలబడి కుశలప్రశ్ననడిగెను. అతడు బ్రహ్మకు మొదటి నుండి జరిగిన వృత్తాంతము చెప్పెను. బ్రహ్మ విని భయముతో నిట్టూర్పు విడిచి ఇట్లనెను.
బ్రహ్మోవాచ - బ్రహ్మ పలికెను :
హరిదానం వత్ప శప్తుం గతోఽసి కన్య తేజసా ।
రక్షితా యస్య భగవాస్తం కో హంతా జగత్త్రయే ॥
క్షుద్రాణాం మహతాం చైవ భక్తానాం రక్షణాయ చ ।
రరక్ష సంతతం చక్రం శ్రీహరిర్భక్త వత్సలః ॥
యో మూఢో వైష్ణవం ద్వేష్ఠి విష్ణు ప్రాణనమం ద్విజ ।
తస్య సంహార కర్తారం సంహర్తుమీశ్వరో హరిః ॥
శీఘ్రం స్థానాంతరం గచ్ఛ వత్స త్రాణం న వాఽధునా ।
అన్యథా త్వాం మయా సార్థం హనిష్యతి నుదర్శనం ॥
కిం బ్రహ్మలోకం బ్రహ్మాండం దగ్ధుం శక్తం క్షణేన యత్ ।
తేజసా విష్ణు తుల్యం యత్కేనాన్యేన నివార్యతే ॥
నాయనా! ఎవని తేజస్సుతో హరిదాసుని శపింపబోతివి ? సాక్షాత్తుగా భగవంతుడెవనికి రక్షకుడో అట్టివానిని ముల్లోకములలో చంపగలవాడెవ్వడు ? నీచుల నుండి గొప్ప వారిని భక్తులను రక్షించుటకొరకే భక్తవత్సలుడైన శ్రీహరి చక్రమెల్లప్పుడు ధరించెను. ఏ మూఢుడు విష్ణువునకు ప్రాణసముడైన వైష్ణవుని (విష్ణుభక్తుని) ద్వేషించునో, నంహరింపబూనుకొనునో అట్టి వ్యక్తిని సర్వేశ్వరుడైన శ్రీహరి సంహరించును. కాబట్టి నాయనా నీకిప్పుడిక్కడ రక్షణలేదు. వేరే ఎక్కడికైనను త్వరగా పొమ్ము. లేనిచో సుదర్శన చక్రము నిన్ను నన్ను చంపగలదు. తేజస్సులో విష్ణు తుల్యమైన ఆ చక్రము ఈ బ్రహ్మలోకమునేమి ? క్షణములో బ్రహ్మాండమంతటిని (పదునాల్గు లోకములను) కాల్చుటకు శక్తి గలది. వేరే ఏ తేజస్సుతో దానినాపతరము!
బ్రహ్మణో వచనం శ్రుత్వా తతో దుద్రావ బ్రాహ్మణః ।
త్రస్తో జగామ కైలాసం శంకరం శరణం భియా ॥
కృపా నిధాన మాం రక్షత్యువాచ శంకరం భియా ।
స హి ఏప్రచ్ఛ కుశలం సర్వజ్ఞో బ్రాహ్మణం శివః ॥
ఉవాచ దీనదీనేశః సంహర్తా జగతాం క్షణాత్ ।
స్థిరో భవ ద్విజశ్రేష్ఠ మదీయం వచనం శ్రుణు॥
బ్రహ్మ వాక్కు విని భయపడి ఆ విప్రుడు అక్కడి నుండి పరిగెత్తి కైలాసమునకు పోయి భయముతో శంకరుని శరణుజొచ్చెను. కృపానిధీ! నన్ను కాపాడుమని శంకరునితో పలుకగా - సర్వము తెలిసిన వాడు కనుక శివుడు ఆద్విజుని కుశలప్రశ్న అడుగక “ఓ బ్రాహ్మణుడా! స్థిరముగా నుండుము నా మాట వినుము” అని దీనులకు ప్రభువు జగములను క్షణములో లయము చేయువాడగు శంకరుడిట్లు పలికెను.
శంకర ఉవాచ - శంకరుడిట్లు పలికెను:
పౌత్రస్త్వం జగతాం ధాతురత్రేశ్చ తనయో మునే ।
వేదజ్ఞాతాఽ సి సర్వజ్ఞ మూర్ఖతుల్యం తు కర్మ తే ॥
వేదేషు చ పురాణేషు సేతిహాసేషు సర్వతః ।
నిరూపితో యః సర్వేశస్తం న జానాసి మూఢవత్॥
అహం బ్రహ్మా చ ఇంద్రశ్చ ఆదిత్యా వసవస్తథా ।
ధర్మేంద్రశ్చ నురాన్సర్వే మునీంద్రా మనవస్తథా ॥
ఆవిర్భూతాస్తిరోభూతా యస్య భ్రూ భంగ లీలయా ।
తస్య ప్రాణాధికం భక్తం హంసి త్వం కస్య తేజసా ॥
ఓమునీ! జగములను సృష్టించు బ్రహ్మ మనుమడవు. అత్రి మహర్షి పుత్రుడవు. వేదపండితుడవు. సర్వమెరిగినవాడవు. కాని నీవు చేసిన పని మూర్ఖుల కర్మతో సమానముగా నున్నది. వేదములలో పురాణేతి హాసములలో అన్నిటియందు సర్వేశ్వరుడని నిరూపింపబడిన విష్ణువును మూఢుని వలె తెలియకున్నావు. నేను బ్రహ్మ ఇంద్రుడు ఆదిత్యులు వసువులు ధర్మదేవత సర్వదేవతలు మునీంద్రులు మనువులు అందరు ఏ ప్రభువు యొక్క కనుబొమల కదలిక చేతనే ఆవిర్భవించుచు లయము చెందుచున్నారో - అట్టి స్వామికి ప్రాణాధికుడైన భక్తుని చంపబూనితివే. ఎవని తేజస్సుతో ఆపని తల పెట్టితివి?
అహం బ్రహ్మా చ కమలా దుర్గా వాణీ చ రాధికా ।
న హి భక్తాత్పరాః ప్రేమ్ణా భక్తాశ్చ సర్వతః ప్రియాః॥
క్షుద్రాంశ్ప మహతో భక్తాన్ శశ్వద్రక్షతి యత్నతః ।
సర్వాంతరాత్మా భగవాంశ్చక్రేణ దుస్సహేన చ ॥
నియుజ్య చక్రం దుర్వీర్యం స్వాత్మతుల్యం చ తేజసా ।
తథాఽపి న ప్రతీతిశ్చ స్వయం గచ్ఛతి రక్షితుం ॥
స్వకీయ గుణనామ్నాం చ శ్రవణాదశి సంభ్రమః ।
భక్త సంఘే భ్రమత్యేవ ఛాయేవ సంతతం హరిః ॥
కాంతా ప్రాణాధికా శశ్వన్న హి కోఽపి తతోఽధికః ।
భక్తాన్ ద్వేష్టి స్వయం సా చేత్తూర్ణం త్యజతి తాం ప్రభుః ॥
నేను బ్రహ్మ లక్ష్మీదేవి పార్వతి సరస్వతి రాధాదేవి ఆ స్వామికి భక్తుని కంటె ప్రేమచేత ఎక్కువకారు. అతనికి అందరి కంటె భక్తులు ప్రియమైనవారు. సర్వజీవులకు అంతరాత్మయైన ఆ భగవంతుడు జాతకర్మలను బట్టి నీచులు శ్రేష్ఠులని చూడక భక్తుల నందరిని ఎదురులేని చక్రాయుధముతో ప్రయత్నించి మాటిమాటికి రక్షించుచుండును. తేజస్సులో తనతో సమానమైన గొప్ప వీర్యము గల చక్రమును భక్తుల రక్షణకేర్పరచి కూడ అంతటితో నమ్మి ఊరకుండక మిక్కిలి త్వరగలవాడై ఎల్లప్పుడు శ్రీహరి వారినడుమ నీడవలె తీరుగును. అతనికి లక్ష్మీదేవి ప్రాణాధికురాలు. అంతకు మించి వేరొకడెవడు లేడు. అట్టి తన కాంత భక్తులను ద్వేషించినచో వెంటనే ఆ స్వామి ఆమెను వదిలివేయును.
సర్వేషాం చ ప్రియా విప్రాః స్వశరీరాదపి ద్విజ ।
బ్రాహ్మణేభ్యః ప్రియ భక్తాః ప్రాణేభ్యశ్చ హరేరపి ॥
ఈశ్వరస్య ప్రియః కో వాఽప్రియః కో వా జగత్త్రయే ।
యః శిష్టస్తం భజేచ్ఛశ్వ ద్ధ్యాయతే స చ తం సదా ॥
మహతి ప్రళయే బ్రహ్మన్ బ్రహ్మాండౌఘే జలపుతే ।
స తత్ర నాశో భక్తానాం సర్వేషాం చ భవిష్యతి ॥
భజ బ్రాహ్మణ గోవిందం స్మర తస్య పదాంబుజం।
సర్వాపదో వినశ్యంతి శ్రీహరేః స్మరణాదపి ॥
వ్రజ శీఘ్రం చ వైకుంఠం వైకుంఠః శరణం తవ ।
దాస్యత్యేవాభయం తుభ్యం కరుణాసాగర విభుః ॥
ఓ బ్రాహ్మణా! శ్రీహరికి అందరిలో బ్రాహ్మణులు తన శరీరము కంటే కూడ ప్రియులు. బ్రాహ్మణుల కంటె తన ప్రాణముల కంటె ప్రియమైన వారు భక్తులు. ఆ సర్వేశ్వరునికి ఈ ముల్లోకములలో ప్రియుడు అప్రియుడెవ్వడు? ఎవడందరికంటె ఉత్తమ లక్షణములు గలవాడో శ్రీహరి వానిని తాను భజించునుఎల్లప్పుడు స్మరించును. ఓ బ్రాహ్మణా! మహాప్రళయమై ఈ బ్రహ్మాండమంతయు నీటిలో మునిగినప్పుడు కూడ భగవద్భక్తులకు నాశము కలుగదు: గోవిందుని భజించుము. అతని పాదపద్మములను స్మరింపుము శ్రీహరిని స్మరించినంతలో సర్వాపదలు నశించును. నీవు త్వరగా వైకుంఠమునకు పొమ్ము. ఆ వైకుంఠుడే నీకు రక్షకుడు. అతడు కరుణాసముద్రుడు. నీకు తప్పక అభయమిచ్చును.
ఏతస్మిన్నంతరే వ్యాప్తం కైలాసం చక్రతేజసా ।
యధా చ సూర్యకిరణెసుప్రదీప్తం మహీతలం ॥
దగ్ధా జ్వాలాకరాలైశ్చ సర్వే కైలాస వాసినః ।
త్రాహి త్రాహిత్యేవముక్త్యా శంకరం శరణం యయుః ॥
దృష్ట్వా చక్రం దుర్విషహం శంకరః కరుణానిధిః ।
పార్వత్యా సహ సంప్రీత్యా బ్రాహ్మణాయాశిషం దదౌ॥
తేజః సత్యం తపః సత్యం యదిచేచ్పిర సంచితం ।
కృతాపరాధో భీతశ్చ ద్విజో భవతు విజ్వరః ॥
ఇంతలో సూర్యకిరణములతో భూమండలము వెలిగినట్లు కైలాసమంతయు చక్రతేజస్సుతో నిండిపోయెను. కైలాస వాసులందరు భయంకరమైన చక్రజ్వాలలతో కాలిపోయిరి. రక్షించుము రక్షించుమని శంకరుని శరణుజొచ్చిరి. దయానిధియైన శంకరుడు ఓర్చుకొన శక్యముగాని చక్ర తేజస్సును చూచి పార్వతితో కలిసి ఆ బ్రాహ్మణునికి ఆశీస్సులిచ్చెను. నేను చిరకాలమునుండి సమకూర్చుకొన్న తేజస్సు తపస్సు తథ్యమైన యెడల అపరాధము చేసి భీతుడై ఉన్న ఈ విప్రుడు బాధారహితుడగు గాక.
పార్వత్యువాచ - పార్వతి ఇట్లనెను :
యత్ర్పభోర్మమ పుణ్యేమ బ్రాహ్మణః శరణాగతః ।
మమాశిషా మహాభీత్యా శీఘ్రం భవతు విజ్వరః॥
ఇత్యేవముక్త్యా కృపయా విరరామ శివా శివః ।
మునిః ప్రణమ్య దేవేశం వైకుంఠం శరణం యయౌ ॥
నా పతిదేవుని యొక్క ఏ పుణ్యముల మీద ఆధారపడి ద్విజుడు శరణుజొచ్చెనో. నా ఆశీస్సు వలన మహా భయము నుండి త్వరగా ఇతడు విముక్తుడై బాధలేనివాడగు గాక. ఇట్లు కృపతో పార్వతీపరమేశ్వరులు పలికిరి. ముని వారికి నమస్కరించి వైకుంఠుని శరణు గోరబోయెను.
గత్వా వైకుంఠభవనం మనోయాయీ మునీశ్వరః ।
దృష్ట్వా సుదర్శనం పశ్చాద్వివేశాంతఃపురం హరేః ॥
దదర్శ శ్రీహరిం విప్రో రత్న సింహాసన స్థితం ।
శంఖ చక్ర గదా వద్మధరం పీతాంబరం పరం ॥
శ్యామం చతుర్భుజం శాంతం లక్ష్మీకాంతం మనోహరం ।
రత్నాలంకార శోభాఢ్యం రత్నమాలా విభూషితం॥
ఈషద్ధాస్య ప్రసన్నాస్యం భక్తానుగ్రహకాతరం ।
నద్రత్న సార రచితం కిరీటోజ్జ్వల శేఖరం ॥
పార్షద ప్రవరేంధ్రైశ్చ సేవితం శ్వేతచామరైః ।
పద్మా సేవిత పాదాబ్జం సరస్వత్యా స్తుతపురం ॥
సునంద నందకుముద ప్రచండాదిభిరావృతం ।
గుణానువాదం గాయంతం తంత్రైః పశ్యంత మీప్సితం॥
ఏవం భూతం ప్రభుం దృష్ట్వా దండవత్ప్రణనామ చ ।
తుష్టావ సామవేదోక్త స్తోత్రేణ పరమేశ్వరం॥
దూర్వాసముని మనోవేగముతో వైకుంఠమునకు పోవుచు వెనుక బడి వచ్చుచున్న సుదర్శనము చూచి శ్రీహరి అంతఃపురమును ప్రవేశించెను. అక్కడ రత్నసింహాసనముపై కూర్చుండియున్న శంఖ చక్రగదాపద్మములను హస్తములందు ధరించియున్న- పీతాంబరముతో శోభిల్లు శ్రీహరిని ద్విజుడు దర్శించెను. శ్యామవర్ణముతో చతుర్భుజములతో శాంతస్వరూపముతో మనోహరముగా లక్ష్మీనాథుడు రత్నాభరణములను రత్నాలహారములను ధరించి ప్రకాశీంచుచుండెను. చిరునవ్వుతో సుందరముగా నున్న ముఖమండలము, భక్తుల ననుగ్రహించుటలో త్వర, శ్రేష్ఠమైన రత్నముల కిరీటముతో వెలుగుచున్న శిరస్సు తెల్లని చామరములతో సేవ చేయుచున్న పార్షదులు, చుట్టు సేవించుచున్న సునంద నంద కుముద ప్రచండాదిపరివారము, ముందర స్తోత్రమొనర్చుచున్న సరస్వతి, పాద సేవచేయుచున్న లక్ష్మీదేవి, ఇట్లు వైభవముగా కొలువుదీరియున్న ఆ వైకుంఠనాధుని దర్శించి సాష్టాంగముగా నమస్కరించినవాడై ముని సామవేదమందు చెప్పబడిన స్తోత్రముతో ఆ పరమేశ్వరునిట్లు స్తుతించెను.
దూర్వాసా ఉవాచ - దుర్వాసముని పలికెను :
త్రాహి మాం కమలాకాంత త్రాహి మాం కరుణానిధే ।
దీనబంధోఽతిదీనేశ కరుణా సాగర ప్రభో ॥
వేదవేదాంగ సంస్రష్టుర్విధాతుశ్చ స్వయం విధే।
మృత్యోర్మృత్యుః కాల కాల త్రాహి మాం సంకటార్ణవే॥
సంహారకర్తుః సంహారః నర్వేశః సర్వకారణః ।
మహావిష్ణుతరోర్బీజం రక్ష మాం భవసాగరే ॥
శరణాగత శోకార్త భయత్రాణ పరాయణ ।
భగవన్నవ మాం భీతం నారాయణ నమోఽస్తుతే ॥
కమలాకాంతా! నన్ను కాపాడుము. కరుణానిధీ నన్ను రక్షించుము. దీనుల బంధువా? దీననాథా! కరుణాసముద్రుడా! ప్రభూ! వేదములను వేదాంగములను ప్రకటించిన బ్రహ్మను విధాతను నియమించువాడా! మృత్యువుకు మృత్యువా! కాలపురుషునికి కాలరూపుడా! కష్టసముద్రమున పడిన నన్ను రక్షింపుము. ప్రళయకర్తను హరించువాడవు సర్వమునకు ప్రభువును సర్వమునకు మూలకారణమైనవాడవు. విరాట్స్వరూపమునకు సూక్ష్మబీజమైన వాడవు నీవే. సంసారసాగరమందున్న నన్ను కాపాడుము. శరణాగతులను, దుఃఖము ఆపద భయముల నుండి రక్షించుట యందాసక్తి గలవాడా! భగవంతుడా! నారాయణా! నీకు నమస్కారము. భీతుడైన నన్ను కాపాడుము.
వేదేష్వాద్యం చ యద్వస్తు వేదాః స్తోతుం చ న క్షమాః ।
నరస్వతీ జడీభూతా కిం స్తువంతి విపశ్చితః ॥
శేషః సహస్ర వక్త్రేణ యం స్తోతుం జడతాం వ్రజేత్ ।
పంచవక్త్రో జడీభూతో జడీభూతో చతుర్ముఖః ॥
శ్రుతయః స్మృతికర్తారో వాణీ చేత్ స్తోతుమక్షమా ।
కోఽహం విప్రశ్చ వేదజ్ఞః శిష్యఃకిం స్తౌమి మానద ॥
మనూనాం చ మహేంద్రాణామష్టావింశతమే గతే ।
దివానిశం యస్య విధేరష్టోత్తర శతాయుషః ॥
తస్య పాతో భవేద్యస్య చక్షురున్మీలనేన చ ।
తమనిర్వచనీయం చ కిం స్తౌమి పాహి మాం ప్రభో ॥
ఇత్యేవం స్తవనం కృత్వా పపాత చరణాంబుజే ।
నయనాంబుజ నీరేణ నీ షేచ భయ విహ్వలః ॥
వేదములలో చెప్పబడిన ఆది తత్త్వమేదో; ఆ వేదములే దానిని స్తుతించుటకును శక్తిచాలనివి. విద్యామాత సరస్వతి మూగబోయిన చోట ఇక ఇతర విద్వాంసులేమి స్తుతింతురు. ఏ పరమాత్మను స్తుతించుటకు వేయి ముఖములు గల ఆది శేషుడు ఐదు ముఖములు గల పరమశివుడు నాల్గు ముఖములు గల బ్రహ్మ శక్తి చాలని వారైరో- శ్రుతులు స్మృతికర్తలు వాణీదేవియు స్తుతింపజాలరో అట్టి నిన్ను ఓ జ్ఞానదాతా! సామాన్య బ్రాహ్మణుడను వేదములు పఠించిన శిష్యుడిను. ఏమని సుతింతును. మనువులు మహేంద్రులు ఇరువై ఎనిమిది మంది గతించినచో ఏ బ్రహ్మకు ఒక రాత్రిపగలగునో అట్టి బ్రహ్మ యొక్క నూట ఎనిమిదేండ్ల జీవితకాలము నీవు కన్ను మూసి తెరిచినంతలో పూర్తియై అతడి పడిపోవును. అట్టి అనిర్వచనీయ మహిమ గల నిన్ను ఏమని స్తుతింతును. ప్రభూ! నన్ను కాపాడుము. ఇట్లు స్తుతించి స్వామి పాదపద్మముల పై పడి భయముతో మనస్సు చెదరి కన్నీటితో స్వామి పాదములను తడిపెను.
దూర్వాససా కృతం స్తోత్రం హరేశ్చ పరమాత్మనః ।
పుణ్యదం సామవేదోక్తం జగన్మంగల నామకం ॥
యః పఠేత్పంకట గ్రస్తో భక్తియుక్తశ్చ సంయతః ।
నారాయణ స్తం కృపయా శీఘ్రమాగత్య రక్షతి॥
రాజద్వారే శ్మశానే చ కారాగారే భయాకులే ।
శత్రుగ్రస్తే దస్యుభీతౌ హింస్ర జంతు సమన్వితే ॥
వేష్టితే రాజసైన్యేన మగ్నే పోతే మహార్ణవే।
స్తోత్రస్మరణ మాత్రేణ ముచ్యతే నాత్ర సంశయః॥
దూర్వాసముని ఒనర్చిన పరమాత్మయైన శ్రీహరియొక్క ఈ సోత్రము సామవేదమందు చెప్పబడినది. పుణ్యప్రదమైనది మరియు జగములకు మంగళకరమైనది. ఆపదలలో చిక్కుకొన్న వ్యక్తి మనో నిగ్రహము భక్తితో కూడినవాడై దీనిని పఠించినచో శ్రీమన్నారాయణుడు దయతో త్వరగా చేరవచ్చి వానిని రక్షించును. రాజద్వారమందుగాని శ్మశానమునగాని భయమూలమైన కారాగృహమందు గాని శత్రువుల చేత పట్టుబడినప్పుడు గాని దొంగల వలన భయమేర్పడినపుడు గాని క్రూర మృగముతో రాజు సైన్యముతో చుట్టుముట్టబడినప్పుడుగాని మహాసముద్రములో ఎక్కిన పడవ మునుగు చున్నప్పుడు గాని ఈ స్తోత్రముతో భగవంతుని స్మరించిన యెడల భయాపదల నుండి ముక్తుడగును. సందేహము లేదు.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే దుర్వాససాకృతం శ్రీకృష్ణస్తోత్రం సమాప్తం॥
ఇది దుర్వాసమునిచేత చేయబడిన శ్రీకృష్ణస్తోత్రము సమాప్తమైనది.
నారాయణ ఉవాచ - నారాయణమున పలికెను :
మునేశ్చస్తవనం శ్రుత్వా భగవాన్ భక్తవత్పలః ।
ప్రహస్యోవాచ మధురం పీయూష వృష్టివన్ముదా॥
భక్తులయందు వాత్పల్యము గలవాడగు భగవంతుడు దూర్వాసముని స్తోత్రమును విని సంతసించి మధురముగా నవ్వుచు అమృతము వర్షించినట్లు ఇట్లు పలికెను.
శ్రీభగవానువాచ - భగవంతుడిట్లు పలికెను :
ఉత్తిష్టోత్తిష్ఠ భద్రం తే భవిష్యతి వరేణ మే।
కింతు మే వచనం నిత్యం శ్రుణు సత్యం సుఖావహం ॥
అన్వేషాం చ భవేద్ జ్ఞానం శ్రుత్వా శాస్త్రం సతాం ముఖాత్ ।
స్వమూర్తిమంతి శాస్త్రాణి భవేత్పంతశ్పరంతి హి ॥
కర్మవేద విరుద్ధం చ సర్వేషామతిగర్హి తం ।
కరోతి విద్వాంశ్పేద్ జ్ఞాత్వ స చ జీవన్మృతాధికః॥
పురాణేషు చ వేదేషు చేతిహాసేషు బ్రాహ్మణ ।
వైష్ణవానాం చ మహిమా శ్రుతః నర్వైశ్చ సర్వతః ॥
అహం ప్రాణా వైష్ఠవానాం మమ ప్రాణాశ్చ వైష్ఠవాః ।
తానేవ ద్వేష్ఠ యో మూఢో మమామానాం చ హింసకః॥
పుత్రాన్ పౌత్రాన్ కలత్రాంశ్చ రాజ్యం లక్ష్మీం విహాయ చ ।
ధ్యాయంతే సతతం యే మాం కో మే తేభ్యం పరః ప్రియః ॥
పరాభక్తాన్న మే ప్రాణా న చ లక్ష్మీర్న శంకరః।
స భారతీ స చ బ్రహ్మా న దుర్గా న గణేశ్వరః ॥
న బ్రాహ్మణా న వేదాశ్చ న వేదజననీ పరా ।
న గోపీ న చ గోపాలా న రాధా ప్రాణతః ప్రియా ॥
ఇత్యేవం కథితం సర్వం సత్యం సారం చ వాస్తవం ।
న ప్రశంసా పరం తేషాం తే చ ప్రాణాధికాః ప్రియాః ॥
ఓయీ! లే లెమ్ము. నా వరము వలన నీకు మంగళమగును. ఐనను సత్యమును సుఖముకూర్చునదియు ఐన నా మాట వినుము. సత్పురుషుల ద్వారా విన్న శాస్త్రము వలన ఇతరులకు(సామాన్యులకు) జ్ఞానమేర్పడును. శాస్త్రములే సత్పురుషుల రూపములను దాల్చి చరించుచున్నవని (సత్పురుషుల విషయములో) తలంచవలెను. వేదవిరుద్ధమైన కర్మలాచరించుట అందరికిని మిక్కిలి గర్షించదగినదే. ఇది తెలిసికూడ అట్లా చరించినవాడు విద్వాంసుడైనను జీవస్మృతుని కంటె (బ్రతికియుండియు చచ్చిన వ్యర్థుడు) ఎక్కువ నీచుడు. ఓ బ్రాహ్మణా! పురాణములలో వేదములలో ఇతిహాసములలో వైష్ణవుని (విష్ణుభక్తుడు) మహిమ చెప్పబడినది. అంతట అందరిచేత అది వినబడినది వైష్ణవులకు నేను ప్రాణమును, నాకు వైష్ణవులు ప్రాణములు. వారిని ద్వేషించిన మూఢుడు నా ప్రాణములను హింసించువాడే. వైష్ణవులు పుత్రపౌత్రులను భార్యలను రాజ్యమును సంపదలను త్యజించి కూడ ఎల్లప్పుడు నన్ను ధ్యానింతురు. ఇక వారికంటె మిక్కిలి ప్రియమైనవాడివడుండును? వారిని ద్వేషించిన మూఢుడు నా ప్రాణములను హింసించువాడే, వైష్ణవులు పుత్రపౌత్రులను భార్యలను రాజ్యమును సంపదలను త్యజించి కూడ ఎల్లప్పుడు నన్ను ధ్యానింతురు. ఇక వారీకంటె మిక్కిలి ప్రియమైన వాడెవడుండును? నా ప్రాణములును నా భక్తుని కంటె శ్రేష్ఠము కావు. లక్ష్మీదేవి శంకరుడు సరస్వతి బ్రహ్మ దుర్గ గణేశ్వరుడు బ్రాహ్మణులు వేదములు శ్రేష్ఠురాలైన వేదమాత (గాయత్రి) నా ప్రాణముల కంటె ప్రియమైన గోపికలు గోపాలకును రాధాదేవియును నాకు భక్తుని కంటె శ్రేష్ణులు కారు. ఇట్లు మొత్తముగా వాస్తవము సత్యసారమును చెప్పితిని. ఇది వారిని ప్రశంసించి (అతిశయముగా) చెప్పినది కాదు. వారు నాకు ప్రాణముల కంటె అధికముగా ప్రియులు.
మాం ద్విషంతి చ యే మూఢా జ్ఞానహీనాశ్చ పంచితాః।
ఆత్మానం యే న జానంతి తే యాంతి నిరయం చిరం॥
యే ద్విషంతి చ మద్భక్తాన్ ప్రాణానామధికం ప్రియాన్ ।
తేషాం శాస్తా త్వహం తూర్ణం పరత్ర నిరయం చిరం ॥
ప్రభావోఽహం చ సర్వేషామీశ్వరః పరిపాలకః।
న చ వ్యాపీ స్వతంత్రోఽహం భక్తాధీనో దివానిశం॥
గోలోకే వాఽథ వైకుంఠే ద్విభుజం చ చతుర్భుజం ।
రూపమాత్రమిదం శశ్వత్రాణా మే భక్తసన్నిధౌ ॥
యదుక్తం భక్తదత్తం చ భక్షణీయం చ తన్మమ ।
అభక్ష్యం ద్రవ్యమన్యేన దత్తం చేదమృతోపమం॥
నన్నెవరు ద్వేషింతురో వారు మూఢులు జ్ఞానహీనులు మోసగింపబడినవారు. తమ ఆత్మనగు నన్నెవరెరుగరో వారు దీర్ఘకాలము సరకమును పొందుదురు. నాకు ప్రాణముల కంటె ప్రియమైన భక్తులనెవరు ద్వేషించుచున్నారో వారిని నేను త్వరగా శిక్షింతును. ఈ దేహము వదలగనే దీర్ఘకాలము నరకప్రాప్తీయే వారికి విధింతును. నేను సమస్త జీవులకు సృష్టి స్థానమును. ప్రభువును. పరిపాలకుడను. సర్వత్ర వ్యాపించి ఉండువాడను స్వతంత్రుడను. అట్టి నేను రాత్రింబగళ్లు భక్తులకధీనుడనై (వారివశమై) ఉందును. గోలోకమున ద్విభుజములతో వైకుంఠమున చతుర్భుజములతో రూపమునకు మాత్రముందును. ఎల్లప్పుడు నా ప్రాణములు భక్తులవద్దనే ఉండును. భక్తుడేది నాకని చెప్పునో ఏది సమర్పించునో దానిని నేను భక్షింతును. భక్తుడు గాని వాడు అమృతము వంటి పదార్థమిచ్చినను నాకది ఆభక్ష్యము (తినగూడనిది) అగును.
అంబరీషం నృపశ్రేష్ఠం నిరీహం తమహింసకం ।
కథం హంసి దయాశీలం సర్వప్రాణిహితే రతం ॥
దయాం కుర్వంతి యే సంతః సతతం సర్వ జంతుషు ।
తాన్ ద్విషంతి యే మూఢాస్తేషాం హంతాఽహమేవ చ ॥
భక్తానాం హింసకం శత్రుమహం రక్షితుమక్షమః ।
అంబరీషాలయం గచ్ఛ స త్వాం రక్షతుమీశ్వరః ॥
రాజశ్రేష్ఠుడును దయాశీలుడును కోరికలు లేనివాడును ఇతర ప్రాణులను హింసించనివాడగు అంబరీషుని - అన్ని ప్రాణుల హితమునకై ఆసక్తి పడు వానిని నీవేట్లు చంపజూచితివి? సర్వప్రాణులయందెవరు దయగలవారో వారే సజ్జనులు. వారిని ద్వేషించువారు మూఢులు. అట్టి మూఢులను నేను నశింపజేయుదును. భక్తులను హింసించువానిని, భక్తుల శత్రువును రక్షించుటకు నేను సమర్థుడను కాను. నీవంబరీషుని గృహమునకే పొమ్ము. నిన్ను రక్షించుటకతడే ప్రభువు.
నారాయణ ఉవాచ - నారాయణ ముని పలికెను :
ఇదం వాక్యం చ తచ్ఛ్రుత్వా బ్రాహ్మణో భయవిహ్వలః।
విషణ్ణమానసస్తస్థౌ స్మరన్ కృష్ణ పదాంబుజం॥
ఏతస్మిన్నంతరే బ్రహ్మా భవాన్యా నహ శంకరః ।
ధర్మశ్చేంద్రాదయో దేవా ఆజగ్ముర్ముని పుంగవాః ॥
ప్రణమ్య తుష్టువున్సర్వే పరమాత్మానమీశ్వరం ।
పులకాంచిత సర్వాంగా భక్తినమ్రాత్మ కంథరాః ॥
భగవంతుడు పలికిన ఈ మాటలు విని బ్రాహ్మణుడు (దూర్వాసుడు) భయముతో మనస్సు చెదరినవాడై విషాదముతో కూడిన మనస్సుతో శ్రీకృష్ణ పాదపద్మములను స్మరించుచు నిలుచుండెను. ఇంతలో బ్రహ్మయు భవానీ శంకరులును ధర్మదేవతయు ఇంద్రాది దేవతలును మునిశ్రేష్ఠులును అక్కడికి చేరవచ్చిరి. అందరు నమస్కరించి సర్వాంగములు పులకరించగా భక్తితో శిరస్సులు వంచి ఆ పరమాత్మను స్తుతించిరి.
బ్రహ్మోవాచ - బ్రహ్మ అనెను :
స్వాత్మ స్వరూప నిర్లిప్త భక్తానుగ్రహ కాతర ।
భక్తాపరాధజనకం రక్ష బ్రాహ్మణ పుంగవం ॥
జీవుల అంతరాత్మ స్వరూపుడా! ఏ విధమగు కల్మషములంటనివాడా! భక్తులననుగ్రహించుట యందు త్వరగల స్వామీ! భక్తునికపరాధమొనర్చిన ఈ బ్రాహ్మణ పుంగవుని రక్షించుము.
మహాదేవ ఉవాచ - మహాదేవుడనెను :
దీనబంధో జగన్నాథ నాయం విప్రో జగద్బహిః ।
కృతాపరాధం దీనం చ పాహిమం శరణాగతం॥
దీనులకు బంధువైనవాడా! జగత్తంతటికి నాధుడా! ఈ విప్రుడు నీ అధీనములోని జగత్తుకంటె బయటివాడు కాడు. అపరాధము చేసినను దీనుడై శరణు చొచ్చినాడు. కావున ఇతనిని కాపాడుము.
పార్వత్యువాచ - పార్వతి ఇట్లనెను :
భక్త ఏకాంబరీషస్తే న ద్విజా న నురా వయం।
సర్వేషామీశ్వరస్త్వం చ రక్ష విప్రం కృతాగనం ॥
అంబరీషుడు నీ భక్తుడు. బ్రాహ్మణులు గాని దేవతలు గాని మేము గాని అంతటి వారము కాము. ఐనను నీవు మాకందరికి ప్రభువువు. అపరాధియైన ఈ విప్రుని రక్షించుము.
ధర్మ ఉవాచ - ధర్మదేవత ఇట్లనెను :
సర్వేషాం జనకస్త్వం చ పాతా దండకృదీశ్వరః ।
శిశు హేతోః శిశుం హంతి పితేత్యేవం కుతః ప్రభో ॥
ఓ స్వామీ! అందరికి నీవు కన్నతండ్రివి. రక్షకుడవు. శిక్షించుప్రభువువు. ఐనను ఒక్క శిశువును రక్షించుట కొరకు ఇంకొక శిశువును తండ్రి చంపుచున్నాడనుట ఎట్లుండును? ఎక్కడ సంభవమగును ?
ఇంద్ర ఉవాచ - ఇంద్రుడనెను :
కృపయా సమతా శశ్వత్సర్వేషు జీవిషు ప్రభో ।
అపరాధఫలం భూతమధునా పాతు మర్హసి॥
స్వామీ! ఎల్లప్పుడు సర్వజీవుల యందు కృపతో సమబుద్ధిగలవాడవు నీవు. ఇప్పుడు ఇతని అపరాధమునకు ఫలమును కూడ సమబుద్ధితో ఈయదలచితివి. ఇక అతనిని రక్షింపవలసినది.
రుద్ర ఉవాచ - రుద్రుడనెను :
శాంతిం కర్తుం సముచితముచితం సాంప్రతం కురు ।
కృతకుంఠస్య మూలస్య పాలనం కర్తు మర్హసి ॥
లోకమునకు శాంతినొనర్చుట యోగ్యము. ఇప్పుడాశాంతిని కల్గించుము. దెబ్బతిన్న మూలమును (కొంత శిక్షితుడైన బ్రాహ్మణుని) పాలించుట నీకు తగును.
దిక్పాల ఉవాచ - దిక్పాలకుడనెను:
కృతాపరాధం విప్రం చ ఛేత్తు మర్హసి న శ్రుతౌ।
అపరాధ శమం కృత్వా సదా పాతి నదీశ్వరః ॥
అపరాధము చేసినను బ్రాహ్మణుని నరకుట వేదమందు లేదు కనుక తగదు. సత్ర్పభువు (అగు నీవు) అపరాధమును క్షమించి ఎల్లప్పుడు రక్షించును.
గ్రహా ఊచుః - గ్రహములు పలికినవి :
యో ద్వేష్టిం వైష్ణవం మూఢస్తం రుష్టాస్సర్వదేవతాః।
పీడా కుర్మో వయం శశ్వత్పశ్పత్త్వం పాతుమర్హసి ॥
ఎవడు వైష్ణవుని ద్వేషించునో వాడు మూఢుడు. సర్వదేవతలు వానిపై కోపము పొందుదురు. మేము వానిని మాటి మాటికి పీడింతుము. తరువాత నీవు వానిని కాపాడదగుదువు.
మునయ ఊచుః - మునులు పలికిరి :
నాధ విప్రే పరాభూతే సర్వే జీవన్మృతావయం ।
దండం విధాతుమేకస్య భవేల్లజ్జా స్వజాతిషు ॥
నాధుడా! ఈ బ్రాహ్మణుడవమానింపబడిన యెడల మేమందరము బ్రతికియుండి కూడ మరణించిన వారమే అగుదుము. ఒక మునికి శిక్ష విధించుట వలన మా జాతికే సిగ్గుపడవలసిన స్థితి ఏర్పడును.
అత్రి రువాచ - అత్రిముని పలికెను :
త్వయైవ పుత్రో దత్తో మే క్రోధీ త్వత్పేవకః సదా ।
న కిం బిభేతి త్రైలోరే తేజస్వీ తేజసా తవ ॥
క్రోధస్వభావము గల పుత్రుని నీవే నాకిచ్చితివి. ఐనను వీడెల్లప్పుడు నీ సేవకుడు. ముల్లోకములలో ఏ తేజస్వి నీ తేజస్సునకు భయపడడు?
లక్ష్మీరువాచ - లక్ష్మిదేవి పలికెను:
క్షమాపరాధం భగవన్ బ్రాహ్మణం శరణాగతం ।
స్తువంతి దేవ విప్రాశ్ప న విప్రం హంతు మర్హసి॥
ఓ భగవంతుడా! శరణాగతుడైన బ్రాహ్మణుని అపరాధమును క్షమించుము. దేవతలు బ్రాహ్మణులును ఇతనికొరకే నిన్ను స్తుతించుచున్నారు. ఈ విప్రుని చంపుట నీకు తగదు.
సరస్వత్యువాచ - సరస్వతి పలికెను :
బోధయిష్యామి దేవానాం జనకం కామదం శ్రుతిం।
భగవన్ స్వామీ సర్వేషాం సర్వాంశ్చ పాతుమర్హసి ॥
ఓ భగవంతుడా! సర్వదేవతలకు జనకుడవు. కోరిన వరములిచ్చు వాడవును స్వామియు నైన నీకు శ్రుతిని (వేదవాక్కును) స్మరింపజేయుచున్నాను. నీవు అందరిని రక్షించుటకే తగినవాడవు, (రక్షణమన్నది నీ అర్హత సుమా).
పార్షదా ఊచుః - పార్షదులు పలికిరి :
భవతః స్మృతిమాత్రేణ సర్వేషాం సర్వమంగలం।
భవేత్సర్వాపదో యాంతి పాహీమాం శరణాగతం ॥
మిమ్ము స్మరించినంత మాత్రమున అందరికి అన్ని విధముల మంగళములు సమకూరును. అన్ని ఆపదలు తొలగిపోవును. ఈ శరణాగతుని కాపాడుము.
నర్తకా ఊచుః - నర్తకులు పలికిరి :
దారిద్ర్యభంజన వయం భిక్షుకాస్తవ సంతతం।
భిక్షాం నః సాంప్రతం దేహి పరిత్రాణం ద్విజస్య చ ॥
దారిద్ర్యమును నశింపజేయు స్వామీ! మేమెల్లప్పుడు నిన్ను భిక్షమడుగువారము. ఇప్పుడు మాకు భిక్ష పెట్టుము. బ్రాహ్మణుని రక్ష మాకు భిక్షగా ఇమ్ము.
ఏతేషాం స్తవనం శ్రుత్వా ప్రభుః శరణవత్సలః ।
ప్రహస్యోవాచ వచనం సర్వసంతోష కారణం ॥
శరణు పొందిన వారియందు దయగలవాడగు స్వామి వీరియొక్క స్తోత్రమును విని నవ్వి అందరికి సంతోషకారణమగు మాటను పలికెను.
శ్రీభగవానువాచ - భగవంతుడు పలికెను:
సర్వే శ్రుణుత మద్వాక్యం నీతియుక్తం సుఖావహం।
విప్రరక్షాం కరిష్యామి యుష్మాకమాజ్ఞయా ధ్రువం॥
కింత్వయం యాతు వైకుంఠాదంబరీషాలయం పునః ।
కరోతు పారణం తత్ర రాజ్ఞః సుప్రీతయే మునిః॥
విప్రస్తస్యాతిధిర్భూత్వా నిర్దోషం శప్తుముద్యతః ।
సుదర్శనం తు తం రక్ష్యం బ్రాహ్మణం హంతుముద్యతం ॥
పూర్ణం వర్షమయం భీతో భ్రమత్యేవ భువం సదా।
ఉపవాసీ న రాజేంద్రః నస్త్రీకశ్చ శుచాఽన్వితః ॥
తతోఽహముపవాసీ చ భక్తోపవానకారణాత్ ।
స్తనాంధం బాలకం దృష్ట్వా న భుంక్తే జననీ యథా ॥
దేవాదులారా! మీరందరు నీతియుక్తము సుఖకరమైన నామాట వినుడు. మీ ఆజ్ఞను బట్టి నిశ్చయముగా విప్రరక్షణ చేతును. కాని ఇతడీ వైకుంఠము నుండి అంబరీషుని గృహమునకు పోవుగాక. ముని అక్కడ రాజు యొక్క సంతృప్తి కొరకు పారణము (ఉపవాసానంతర భోజనము) చేయుగాక. ఈ విప్రుడతనికతిథిగా పోయి నిర్దోషియైన రాజును శపించబూనుకొనెను. సుదర్శనచక్రము తనచేత రక్షింపబడు రాజును చంపబూనిన ఈ బ్రాహ్మణుని దహింపదలచెను. ఈ ముని భయపడి నిండుగా ఒక సంవత్సర కాలము భూమియందంతట తిరుగుచున్నాడు. అక్కడ అంబరీషుడు ద్వాదశి పారణ కాలేదన్న విచారముతో భార్యతో బాటు ఉపవసించియున్నాడు. భక్తుడు ఉపవసించి యున్నందున నేను కూడ ఉపవాసముతో ఉన్నాను. చనుబాలు త్రాగని శిశువును చూచి తల్లి ఆహారము భుజింపజాలదు కదా!
మమాశిషా మునిశ్రేష్ఠః సద్యో భవతు విజ్వరః ।
పథి తత్రాస్య హింసాం చ మచ్చక్రం న కరిష్యతి ॥
అహమేవాద్య నిశ్చింతః సుఖం భోక్ష్యామి నిశ్పితం।
భక్తదత్తం చ యద్వస్తు ప్రీత్యా కృత్వా సుధోపమం ॥
లక్ష్మీదత్తం చ యద్ద్రవ్యం న చాహం భోక్తుమీశ్వరః।
వినా భక్తి ప్రదానేన న తృప్తిం దాతుమీశ్వరః॥
హే మునీంద్ర మహాప్రాజ్ఞ గచ్ఛ వత్స నృపాలయం।
సర్వే దేవాశ్చ దేవ్యశ్చ గచ్ఛంతు మునయో గృహం॥
ఇత్యుక్త్వా శ్రీహరిసూర్ణం యయౌ స్వాంతః పురం ముదా।
యయుః సర్వే ముదా యుక్తాః ప్రణమ్య జగదీశ్వరం॥
నా ఆశీస్సు వలన ఈ ముని ఈ క్షణములో నిర్భయుడగు గాక. రాజు వద్దకు పోవు మార్గములో నాచక్రమతని నిక హింసించదు. ఈనాడు నేను నిశ్చింతగా ప్రీతితో భక్తుడర్చించిన అమృతము వంటి పదార్ధమును సుఖముగా భుజింతును. లక్ష్మీదేవి అర్పించిన ద్రవ్యమైనను భక్తుని ద్వారా వచ్చిన పదార్థము వలె నేను భుజించజాలను. తృప్తిపొందలేను. ఇతరులను తృప్తిపరచజాలను. ఓ మునీంద్రా! బుద్ధిశాలీ! నాయనా! రాజగృహమునకు నీవు పొమ్ము. ఓ దేవతలారా! మునులారా! మీ మీ గృహములకు మీరు భార్యలతో బాటు వెళ్లుడు అని శ్రీహరి పలికి తన అంతఃపురములోని కేగెను. వారందరు జగదీశునకు నమస్కరించి సంతోషముతో వెళ్లిపోయిరి.
బ్రాహ్మణశ్చ మనోయాయీ జగామ నృవమందిరం।
సుదర్శనం చ తచ్చక్రం సూర్యకోటి సమప్రభం ॥
ఉపోష్య వత్సరం రాజా శుష్కకంఠోష్ఠ తాలుకః ।
సింహాసనస్థః పురతో దదర్శ మునిపుంగవం ॥
ఉత్థాయ సంభ్రమాత్సద్యః ప్రణమ్య సాదరం ముదా ।
భోజయిత్వా తు మిష్టాన్నం బ్రాహ్మణం బుభుజే స్వయం॥
భుక్త్వా తుష్టో ద్విజశ్రేష్టో యుయుజే పరవశిషం ।
జగామ స్వాలయం తూర్ణం ప్రశశంన పునః పునః ॥
ఉవాచ పధి విప్రేంద్రో మనసా విస్మయాకులః ।
మాహాత్మ్యం దుర్లభమహో వైష్ణవానామితి ద్విజః ॥
బ్రాహ్మణుడును అతని ననుసరించెడి కోటిసూర్యుల తేజస్సు గల సుదర్శన చక్రము మనోవేగముతో అంబరీషుని గృహమునకేగిరి. ఆ రాజు సంవత్సరకాలముపవసించి ఉండి కంఠము పెదవులు దవడలు శుష్కించి సింహాసనము పై అట్లే ఉండి తన యెదుట (తిరిగి వచ్చిన) మునిపుంగవుని దర్శించెను. వెంటనే సంభ్రమముతో లేచి ప్రేమాదరములతో నమస్కరించి రుచిగల భోజనమును మునికి పెట్టి భుజింపజేసి తరువాత తాను భుజించెను. బ్రాహ్మణశ్రేష్ఠుడు భుజించి తృప్తినొంది సంతోషముతో రాజునాశీర్వదించెను. మరిమరి రాజును ప్రశంసించుచు తన నివాసమునకు పోయెను. ఆ దూర్వాసముని అత్యాశ్చర్యముతో తనలో తాను విష్ణుభక్తుల మాహాత్మ్యము ఇతరత్ర దుర్లభము అని అనుకొనుచు వెళ్లెను.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే ముని మోక్షణ ప్రస్తావో నామ పంచవింఽశోధ్యాయః.
ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన మునిమోక్షణ ప్రస్తావమను ఇరువది ఐదవ అధ్యాయము సమాప్తము
Summary of chapter 25 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
During a hot summer afternoon, while the cowherd boys and cows were resting deep in the forest, a massive, roaring forest fire erupted from dried bamboos, threatening to consume all the residents of Vraja. Hearing the panicked cries of His devotees, Lord Kṛshṇa calmly instructed everyone to close their eyes, and with a single breath, He swallowed the blazing ocean of fire directly into His stomach, neutralizing the disaster completely. The cowherd boys opened their eyes in sheer amazement to find themselves safe and cool, praising Kṛshṇa as the supreme master of all mystic potencies.