బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

130 - అధ్యాయము

మూ నారద ఉవాచ :

సర్వం శ్రుతం మహాభాగనావ శేషమభీప్సితం

కిమపూర్వం పురాణంచ బ్రహ్మవైవర్త మిష్టదం

అధునాకింకరిష్యామి తన్మాంబ్రూహి జగద్గురో

ఆజ్ఞాం కురుతపస్యాంచ కర్తుంయామి హిమాలయం

శ్రీనారాయణ ఉవాచ :

ఉపబర్హణ గంధర్వః పంచాశత్కామినీపతిః

జన్మాంతరేభవానా సీదధునా బ్రహ్మపుత్రకః

తా స్వేకాచ సతీరమ్యాతపసా శంకరం పరం

ఆరాధ్యచ వరంలేభే వాంఛితం నారదంపతిం

సాచ సృంజయ కన్యాచ స్వర్ణష్ఠీవీ మహోదరా

తాంవివాహం కురు ష్వేతి శంకరాజ్ఞా కథం వృథా

సుందరీం సుందరీ ష్వేవ కోమలాం కమలాకలాం

పతివ్రతాం మహాభాగాం రమ్యాం సుప్రియవాదినీం

కాముకీం కమనీయాంచ శశ్వత్ సుస్థిర యౌవనాం

విధాత్రాలఖితం కర్మ ప్రాక్తనంకేనవార్యతే

నాభుక్తం క్షయతే కర్మ కల్వకోటి శతైరపి

అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మశుభాశుభం

సూత ఉవాచ:

నారాయణవచః శ్రుత్వా హృదయేన విదూయతా

ప్రణమ్య ప్రయయౌ శీఘ్రం నారదః సృంజయాలయం

శౌనక ఉవాచ:

అహోసూత మహాభాగ శ్రుతంకిం పరమాద్భుతం

కిమపూర్వం రహస్యంచ సరసంత పురాతనం

అధునాశ్రోతు మిచ్ఛామి వివాహం నారదస్యచ

అతీంద్రియస్యచమునేః బ్రహ్మపుత్రస్య సాంప్రతం

సూత ఉవాచ :

నారదోమూఢ రూపశ్చ దృష్ట్వా సృంజయ కన్యకాం

తపస్వినీం మహాభాగం విష్ణువ్రత పరాయణాం

యయౌబ్రహ్మసభాం రమ్యాం సర్వదేవైః సమావృతాం

ప్రణమ్య పితరం శాంతః సర్వంతత్వమువాచ తం

బ్రహ్మప్రహృష్టవదనః శ్రుత్వావార్తాం శుభావహాం

తపస్వినంత పుత్రంచ సంభాష్య జగతాంపతిః

రత్ననిర్మాణ యానేన సార్థందేవైః శుభే క్షణే

పుత్రంకృత్వాచ పురతో యయౌ సృంజయ మందిరం

అను నారదుడిట్లా - ఓ మహాభాగ! అంతా విన్నాను. కోరతగినది మిగిలింది ఏమీ లేదు. బ్రహ్మవైవర్తము ఎంతో అపూర్వ పురాణము. ఇష్టాన్నిచ్చేది (1) ఓ జగద్గురు! ఇప్పుడేం చేయాలో దాన్ని నాకు చెప్పండి. ఆజ్ఞ ఇవ్వండి. తపస్సు చేసుకోవటానికి హిమాలయానికి వెళ్లాను. (2) శ్రీనారాయణుడిట్లా - ఉపబర్షణ అనే గంధర్వుడు ఏబదిమంది స్త్రీలకు పతి.పూర్వజన్మలో వాడివి నువ్వే. ఇప్పుడు బ్రహ్మపుత్రుడివి. (3) అందులో ఒక స్త్రీ రమ్యమైనది. తపస్సుతో పరుడైన శంకరుని ఆరాధించి వరంపొందింది. ఇష్టమైన నారదుని పతిగా పొందింది. (4) ఆమె ఇప్పుడు సృంజయుని కన్య స్వర్ణమును కక్కేది. మహాఉదర. ఆమెను వివాహం చేసుకో. శంకరుని ఆజ్ఞ ఎట్లా వ్యర్థమౌతుంది. (5) సుందరీ మణులతో సుందరి, కోమల, కమలము (లక్ష్మి) వంటి కాంతి గలది. పతివ్రత, మహాభాగ, రమ్యమైనది. చాలాప్రియంగా మాట్లాడేది. (6) కాముకి, కమనీయ, ఎప్పుడూ చాలా స్థిరమైన యౌవనం కలది. బ్రహ్మరాసిన ప్రాచీనమైన కర్మను ఎవడు తప్పించగలడు. (7) నూర్ల కోట్ల కల్పములైనా కర్మ అనుభవించకుండా క్షీణించదు. శుభమైనా అశుభమైనా చేసిన కర్మఫలాన్ని తప్పక అనుభవించాలి. (8) సూతుడిట్లా - నారాయణుని మాటను విని మనస్సులో బాధపడుతూ, నమస్కరించి త్వరగా నారదుడు సృంజయుని ఇంటికి వెళ్ళాడు. (9) శౌనకుడిట్లా – ఓమహాభాగ! ఓ సూతుడ విన్నావా, ఈపరమాద్భుతాన్ని ఎంత అపూర్వమైనది రహస్యమైనది, సరసమైనది.పురాతనమైనది. (10) ఇప్పుడు నారదుని వివాహాన్ని గూర్చి వినదలిచాను. అతీంద్రియుడు, ముని, బ్రహ్మ పుత్రుడు ఐన ఆతని సంగతి ఇప్పుడు వినదలిచాను. (11) సూతుడిట్లో -నారదుడు మూఢరూపుడై సృంజయుని కన్యకను చూచాడు. ఆమె తపస్విని, మహాభాగురాలు, విష్ణువత పరాయణురాలు (12) అందరు దేవతలతో కూడి యున్న రమ్యమైన బ్రహ్మసభకు వెళ్ళాడు. తండ్రికి నమస్కరించి శాంతుడై అంత తత్వాన్ని ఆతనికి చెప్పాడు. (13) బ్రహ్మ ఆనందించిన ముఖముతో శుభమైన వార్తను విని తపస్వియైన పుత్రునితో సంభాషించి జగతాంపతి (14) రత్నములతో నిర్మించిన విమానం పై దేవతలతో పాటు శుభక్షణమందు పుత్రుని ముందు పెట్టుకొని సృంజయుని మందిరానికి వెళ్ళాడు.

మూ తచ్ఛ్భత్వా స్పంజయోరాజారత్నభూషణ భూషితాం

గృహీత్వా కన్యకాంరమ్యాం నారదాయ దదౌముదా

సర్వస్వందక్షిణాందత్వా మణిముక్తాదికం తథా

పుటాంజలియుతో భూత్వాపరిహారం చకారసః

కన్యాంసమర్ప్యబ్రహ్మాణం రాజాచయోగినాం వరః

రురోదభృశముచ్చైశ్చ వత్సేవత్స ఇతీరితం

క్వయాసిత్యక్త్వా మధేహం శూన్యం కమలలోచనే

అహంయామివనం ఘోరంత్వాంత్యక్త్వా జీవితోమృతః

ప్రణమ్య పితరం కన్యారుదంతం మాతరంతథా

రుదంతీంతంరుదం తీసాఽప్యారురోహ రథం విధేః

గృహీత్వాచ సభార్యంచ పుత్రంధాతా ముదాఽన్వితః

ప్రయయౌ బ్రహ్మలోకంచ దేవేంద్రైః మునిభిస్సహ

బ్రాహ్మణాన్భోజయామాస సాంగేమంగలకర్మణి

దేవానపీచ సిద్ధాంశ్చ వాదయామాస దుందుభిం

నారదస్తుమునిశ్రేష్ఠో బాధితః పూర్వకర్మణా

యస్యయత్ర్ఫాక్షనంవిప్ర దుర్లంఘ్యంకేశవార్యతే

సురమ్యేపుష్పతలే చ సుగంధి చందనార్చితే

సరేమే రామయసార్థంబుబుధ్ న దివానిశం

ఏవంకృత్వావివాహంచ విరతోమునిసత్తమః

ఉవాసబ్రహ్మలోకేషు వటమూలే మనోహరే

తత్రాజగామ నగ్నశ్చ ప్రజ్జ్వలక్ర్బహ్మ తేజసా

సనత్కుమారో భగవాన్ సాక్షాచ్చబాలకో యథా

సృష్టః పూర్వశ్చవయసాయథైవ పంచహాయనః

అచూడొనుపనీతశ్చ వేదసంధ్యా విహీనకః

కృషైతి మంత్రంజపతి యస్యనారాయణో గురుః

అనంతకాల కల్పంచ భ్రాతృభిశ్చత్రిభిస్సహ

వైష్ణవానా మగ్రణీశో జ్ఞానినాంచ గురోర్గురుః

ఆరాద్దృష్వా నారదస్తం భ్రాతరంచ సతాం వరం

సహసాశిరసాభూమౌ దండవత్ర్పణనామ తం

ఉవాచనారదంబాలః ప్రహస్య పరమార్థకం

దానిని విని సృంజయరాజు రత్న ఆభరణములతో అలంకరింపబడిన రమ్యమైన కన్యకను తెచ్చి ఆనందంతో నారదునకిచ్చాడు. (16) తన సర్వస్వమును దక్షిణగా ఇచ్చి మణులు ముత్యాలు మొదలైనవి ఇచ్చి చేతులు జోడించి ఆమెను వదిలాడు. (17) బ్రహ్మకు కన్యను సమర్పించిరాజు యోగులలో శ్రేష్ఠుడు చాలా పెద్దగా ఓవత్స! ఓవత్స! అని అంటూ దుఃఖించాడు. (18) నా ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్తున్నావు, ఓకమలలోచన నీవు లేక నా ఇల్లు శూన్యము. నేను ఘోరమై వనానికి వెళ్తాను. నిన్ను విడిచి జీవించటం చావుతో సమానము. (19) కన్య తండ్రికి ఏడుస్తున్న తల్లికి నమస్కరించి, ఏడుస్తున్న తల్లిని విడిచి ఏడుస్తు కన్య విధి రథాన్నిఎక్కింది. (20) ధాత, ఆనందంతో భార్యతో కూడిన పుత్రుని తీసుకొని, దేవేంద్రులు మునులతో కూడి బ్రహ్మ లోకానికి వెళ్ళాడు. (21) మంగళ కర్మ పూర్తిగా ముగిశాక బ్రాహ్మణులను భుజింపచేశాడు. దేవతలను సిద్ధులను భుజింపచేసి, దుందుభిని వాయించమన్నాడు. (22) మునిశ్రేష్ఠుడైన నారదుడు పూర్వ కర్మతో బాధితుడైనాడు. ఎవని పూర్వకర్మ ఎట్టిదో దానిని ఎవడూ తప్పించుకోలేడు, ఓ విప్ర! అది దాటరానిది. (23) రమ్యమైన పూలపడకయందు మంచివాసనగల చందనము పూయబడిన దానియందు ఆతడు తన స్త్రీతో కూడి రమించాడు. ఆతనికి రాత్రింబగళ్ళు తెలియలేదు. (24) ఇట్లా వివాహం చేసుకొని మునిసత్తముడు విరమించాడు. మనోహరమైన వటమూలమందు బ్రహ్మలోకమందున్నాడు. (25) అక్కడి నగ్నంగా, బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతూ భగవాన్ సనత్కుమారుడు సాక్షాత్తు పిల్లవాడిలా వచ్చాడు. (26)సృష్టికి పూర్వంవాడు, కాని వయస్సు చూస్తే ఐదేళ్ళ వాడిలా ఉన్నాడు. తల పై చూడము (కొప్పు లేదు. ఉపనయం కాలేదు. వేదము సంధ్య ఏవీలేనివాడు. (27) కృష్ణ అనే మంత్రాన్ని జపిస్తున్నాడు. ఆతనికినారాయణుడు గురువు. అనంతమైన కల్పకాలముల వరకు ముగ్గురు భ్రాతలతో కూడి (28) ఉన్నాడు. వైష్ణవులలో అగ్రంగా ఉన్నవారికి, నాయకుడు . జ్ఞానుల యొక్క గురువులకు గురువు. దూరం నుండే నారదుడు ఆతనినిచూచి, భ్రాతను సజ్జనులకు వరుడైన వానినిచూచి (29) త్వరగా శిరస్సువంచి ఆతనికి దండమువలె ప్రణామం చేశాడు. బాలుడు నారదుని చూచి నవ్వి పరమార్థాన్ని ఇట్లా చెప్పాడు.

మూ సనత్కుమార ఉవాచ :

అయేభ్రాతః కింకరోషి కుశలం యువతీపతే

స్త్రీపుంసోర్వర్ధతే ప్రేమనిత్యంతన్నిత్య నూతనం

అర్గళం జ్ఞానమార్గస్య భక్తి ద్వారకపాటకమ్

మోక్షమార్గ వ్యవహితం చిరంబంధన కారణం

పీయూషబుద్ధ్యాగరలం భుంక్తే పాపీ నరాధమః

పరం నారాయణంత్యక్త్వా యస్యాస్తే విషయే మనః

సవంచితో మాయయాచామృతం త్యక్త్వా విషం భజేత్

సర్వేషాం కామభోగోఽస్తి కర్మణా మీశ్వరం వినా

వయం విధాతుః పుత్రాశ్చ సాబుద్ధిరితి దేహినాం

యదితే నాస్తి భోగశ్చ కథం గంధర్వ జన్మచ

 కథందాసీ సుతస్త్వంచ ముక్తశ్చ భక్తసంగతః

నిర్గచ్ఛతప సేభ్రాతః త్యజమాయామయీం ప్రియాం

సుపుణ్యే భారతే వర్షే తపసా భజమాధవం

స్థితే నారాయణే స్వేశే పరేస్వపద దాతరి

 విషయీ విషయాంధశ్చ వంచితో మాయయాధ్రువం

 గృహాణమమ మంత్రంచ కృష్ణ ఇత్యక్షర ద్వయం

సర్వేషామేవ మంత్రాణాం సారాత్సారం పరాత్పరం

సర్వేషుచ పురాణేషు వేదేషుచ చతుర్పుచ

ధర్మశాస్త్రేషు తంత్రేషునాస్త్యే వాస్మాత్పరోమనుః

నారాయణేన దత్తోమే పుష్కరే సూర్యపర్వణి

 అసంఖ్య కల్పంజప్త్వాఽహం భూమి సర్వపూజితః

ఇత్యుక్త్వా స్నాపయిత్వాతం దదౌతస్మై పరం మనుం

దివానిశం సజపతి పూతయా మణిమాలయా

తస్మైశుభాశిషం దత్వా మంత్రంచ వైష్ణవాగ్రణీః

గోలోకం ప్రయయౌద్రష్టుం భగవంతం సనాతనం

నారదస్తుమనుం ప్రాప్య సర్వసిద్ధి ప్రదం వరం

శ్రీకృష్ణేనిశ్చలభక్తి: పూర్వకర్మనికృంతనే

త్యక్త్వామాయామయీం భార్యాం భారతం తపసేయయా

కృతమాల్యానదీతీరే దదర్శ శంకరం పరం

దృష్ట్వాచ సహ సామూర్ద్న ప్రణనామ శివం మునిః

తమువాచ జగన్నాథోభక్తంచ భక్తవత్సలః

సనత్కుమారుడిట్లా – ఓభ్రాత! ఏం చేస్తున్నావు, ఓ యువతికి పతియైనవాడ క్షేమమా. స్త్రీ పురుషులకు (మీకు) ప్రేమ పెరుగుతోందా, ప్రతిరోజు, అదినిత్యనూతనమైనది. (31) జ్ఞానమార్గానికి బేడెము. భక్తి ద్వారానికి తలుపులు. మోక్షమార్గానికి అడ్డంకి చాలా బంధనానికి కారణము. (32) పాపియైన నరాధముడు అమృతమనే బుద్ధితో విషాన్ని తాగుతున్నాడు. పరుడైన నారాయణుని వదలి, ఈ నీమనస్సు విషయముల యందుంది. (33) అట్లా ఉన్నవాడు మాయతో వంచితుడై అమృతాన్ని వదిలి విషం తింటాడు. కర్మచేసే వారందరికి కామభోగమున్నది, ఈశ్వరునకు తప్ప (34) మనము విధాత పుత్రులము అని ప్రాణులకు ఆ బుద్ధి ఉండాలి. నీకు భోగం లేకపోతే మరి గంధర్వ జన్మ ఎట్లా వచ్చింది. (35) దాసీసుతుడవెట్టైనావు. భక్తుల సంగతితో ఎట్లా ముక్తుడవైనావు. ఓభ్రాత! మాయామయిమైన ప్రియను వదలు. తపస్సుకు బయలుదేరు. (36) చాలాపుణ్యమైన భారతదేశంలో తపస్సుతో మాధవుని సేవించు. మనకు ఈశుడు, పరుడు, తన స్థానాన్ని ఇచ్చేవాడు ఐన నారాయణుడుండగా (37) విషయములకు లోనైనావు. విషయములతో గుడ్డివాడవైనావు. మాయతో వంచింపబడ్డావు. నిశ్చయము. కృష్ణ అను రెండక్షరములుగల నామంత్రాన్ని స్వీకరించు. (38) అన్ని మంత్రములకన్న సారము కన్న సారమైనది. పరముకన్న పరమైనది. అన్ని పురాణములలో, నాలుగు వేదాలలో (39) ధర్మశాస్త్ర ములలో, తంత్రములలో దీనికన్న పరమమైన మంత్రము లేదు. సూర్యపర్వంలో పుష్కరక్షేత్రమందు నారాయణుడు నాకు దీన్నిచ్చాడు. (40) అసంఖ్యకల్పముల కాలముదీనిని జపించి నేను అందరితో పూజింపబడుతూ తిరుగుతున్నాను. అని పలికి అతనికి స్నానం చేయించి, ఆతనికి శ్రేష్ఠమైన పరమైన మంత్రాన్ని ఇచ్చాడు. (41) పవిత్రమైన మణులమాలతో రాత్రింబగళ్ళు జపిస్తున్నాడు. ఆతనికి శుభాశీస్సులనిచ్చి వైష్ణవాగ్రణి మంత్రం కూడా ఇచ్చి (42) సనాతనుడైన భగవంతుని, చూచుటకు గోలోకానికి వెళ్ళాడు. నారదుడు మంత్రాన్ని పొంది, కోరతగిన సర్వశ్రేష్ఠమైన సిద్ధినిచ్చే దానిని పొంది (43) నాడు. శ్రీకృష్ణుని పై నిశ్చలమైన భక్తి కలిగింది. అదిపూర్వ కర్మలను తెగకో సేది. మాయామయిఐన భార్యను వదిలి భారత వర్షానికి తపస్సుకై వెళ్ళాడు. (44) కృతమాలానదీ తీరమందు పరుడైన శంకరుని చూచాడు. చూచి త్వరగా శివునకు తలవంచి నమస్కరించాడు. ముని! ఆ భక్తునితో భక్త వత్సలుడైన జగన్నాథుడిట్లన్నాడు.

మూ శ్రీమహాదేవ ఉవాచ :

అహోనారద దృష్ట్వా త్వాం ప్రసన్నోఽహం స్వ తేజసా

భక్తానాం దర్శనం యత్రసుదినంతచ్ఛరీరిణాం

అయంపిపరమోలాభోదేహినాం భక్త సంగమః

సస్నాతః సర్వతీర్ధేషు యోదదర్శచ వైష్ణవం

అపిప్రాప్తో మహామంత్రః సర్వతంత్ర సుదుర్లభః

మయాదత్తీగణేశాయ సుందాయస్వాత్మజాయచ

మహ్యందన్తశ్చ కృష్ణేన గోలోకే రాసమండలే

బ్రహ్మణేచాపి ధర్మాయ ధర్మో నారాయణాయచ

బ్రహ్మా సనత్కుమారాయ తుభ్యందన్తశ్చతేనవై

మంత్ర గ్రహణమాత్రేణ జనో నారాయణో భవేత్

విచారణంచనాస్త్యత్ర కాలాకాలం శుభాశుభం

పంచలక్షజ పేనైవ పునశ్చరణమస్యచ

ధ్యానంచ సామవేదోక్తం తేనధ్యాయేచ్చవైష్ణవః

ధ్యానంచ పాపదహనం కర్మమూల నికృంతనం

కృష్ణంనవ ఘనశ్యామంకిశోరం పీతవాససం

శతకోటిందు సౌందర్యం దధానమతులం పరం

భూషితం భూషణా ఘైస్తైరమూల్య రత్ననిర్మితైః

చందనోక్షిత సర్వాంగం కౌస్తుభేనవిరాజితం

మయూరపిచ్చచూడంచ మాలతీ మాల్య మండితం

ఈషద్దాస్య ప్రసన్నాస్యం నిత్యోపాస్యం శివాదిభిః

ధ్యానాసాధ్యం దురారాధ్యం నిర్గుణం ప్రకృతేః పరం

సర్వేషాం పరమాత్మానం భక్తానుగ్రహ విగ్రహం

వేదానిర్వచనీయంతం వరం సర్వేశ్వరం భజే

ధ్యానేనానేన తం ధ్యాత్వా భగవంతంసనాతనం

భజ తం పరమానందం సత్యం నిత్యం పరాత్పరం

ఇత్యుక్తా స్వపదంశంభుః జగామ పరమేశ్వరః

తంప్రణమ్యజగన్నాథం నారద స్తపసేయయౌ

నారదఃశ్రీహరిం స్మృత్వా యోగాత్త్యక్త్వా కలేవరం

నిలీకః పాదపద్మేచ పాదపద్మార్చితే హరేః

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే నారద వివాహాది ప్రకరణం త్రింశదధిక శతతమోఽధ్యాయః

మహాదేవుడిట్లా - ఓ నారద! నిన్నుచూచి నీతేజస్సుతో ప్రసన్నుడనైనాను. (46) భక్తులదర్శనమైతే అది ప్రాణులకు మంచిరోజు. దేహధారులకు భక్తసంగమం వల్ల ఇదే పరమమైన లాభము. (47) వైష్ణవుని చూచినవాడు అన్ని తీర్థములలో స్నానంచేసినట్లే. అన్ని తంత్రములకన్న చాలా దుర్లభమైన మహామంత్రాన్ని పొందావు కదా. (48) నాకొడుకైన స్కందునకు, గణేశునకు నేనిచ్చానిది. గోలోకంలో రాసమండలంలో కృష్ణుడు నాకిచ్చాడు. (49) బ్రహ్మ ధర్మునకిచ్చాడు. ధర్ముడు నారాయణునకిచ్చాడు. బ్రహ్మ సనత్కుమారునకిచ్చాడు. ఆతడు నీకిచ్చాడు. (50) మంత్రాన్ని తీసుకున్నంత మాత్రంలో జనులు నారాయణులౌతారు. ఇంకేది ఆలోచించరాదు (లేరు) కాలమనో కాలం కాదనో శుభమనో, అశుభమనో ఆలోచించరాదు. (51) దీని పునశ్చరణ ఐదు లక్షల జపము. సామవేదంలో చెప్పిన ధ్యానముతో వైష్ణవుడు ధ్యానించాలి. (52) ధ్యానమనేది పాపాలను కాలుస్తుంది. కర్మమూలమును ఛేదిస్తుంది. కృష్ణుడు, వర్ష మేఘమువలె శ్యామలవర్ణుడు, పిల్లవాడు, పచ్చని వస్త్రం ధరించాడు. (53) నూరుకోట్ల చంద్రులంత సౌందర్యవంతుడు సాటిలేనివాడు. పరముడు. భూషణ సమూహములతో అలంకరింపబడ్డవాడు. అవి అమూల్య రత్నములతో చేయబడ్డాయి. (54) ఒంటినిండా చందనం అలుముకున్నాడు. కౌస్తుభమణితో ప్రకాశిస్తున్నాడు. తలలో నెమలి ఫించముంది. మాలతి మాలతో అలంకరిపబడ్డాడు. (55) కొద్దిగా నవ్వుతున్న ప్రసన్నమైన ముఖం కలవాడు. శివుడు మొదలగు వారు నిత్యం ఉపాసిస్తారు. ధ్యానమునకందడు. ఆరాధించడం కష్టము. నిర్గుణుడు. ప్రకృతికి పరమైనవాడు. (56) అందరికి పరమాత్మ, భక్తులను అనుగ్రహించే కొరకు రూపమెత్తాడు. వేదములకు చెప్పరానివాడు. అట్టి వరుడైన సర్వేశ్వరుని భజిస్తాను. (57) ఈ ధ్యానంతో ఆతనిని ధ్యానించాలి. ఆతడు సనాతనుడు, భగవంతుడు.సత్యము, నిత్యము, పరాత్పరుడు, పరమానందుడైన ఆతనిని భజించు (58) అని పలికి శంభుడు, పరమేశ్వరుడు తన స్థానానికి వెళ్ళాడు. ఆ జగన్నాథుని నమస్కరించి నారదుడు తపస్సుకు వెళ్ళాడు. (59) నారదుడు శ్రీహరిని స్మరించి యోగంతో శరీరాన్ని వదిలి, పద్మ అర్చించిన హరిపాద పద్మములందు నిలీనమైనాడు. (60) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణ శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు నారద వివాహాది ప్రకరణమనునది నూటముప్పదవ అధ్యాయము.