శ్రీనారాయణ ఉవాచ –
నారాయణ మహర్షి పలికెను :
శ్రుణు నారద వక్ష్యామి శ్రీకృష్ణచరితం పునః ।
గోపీనాం వస్త్రహరణం వరదానం మనీషితం ॥
ఓ నారదా! మరల శ్రీకృష్ణచరీతము (ఒక ఘట్టము) చెప్పుదును వినుము. గోపీకా వస్త్రాపహారణము మరియు వారు (గోపికలు) కోరిన వరములనిచ్చుట అన్న ఘట్టమీది.
హేమంతే ప్రథమే మాసి గోపికాః కామ మోహితాః ।
కృఙ్వా హవిష్యం భక్త్యా చ యావన్మానం సునందతాః ॥
స్నాత్వా సూర్యసుతాతీరే పార్వతీం వాలుకామయీం ।
కృత్వా వాహ్య చ మంత్రేణ పూజాం కుర్వంతి నిత్యశః ॥
హేమంత ఋతువులోని మొదటి మాసమగు మార్గశిరములో కామమోహితలైన (శ్రీకృష్ణుని విషయములో) గోపికలు మొత్తము నెల భక్తిశ్రద్ధలు గలవారై హవిష్యము (పొంగలి) సిద్ధము చేసి యమునానదిలో స్నానమొనర్చీ ఆ నదీతీరముననే ఇసుకతో పార్వతీదేవిని సిద్ధము చేసి నిర్మించి మంత్రముతో ఆవాహనచేసి ప్రతిదినము పూజించుచుండిరి.
చందనాగురుకస్తూరీ కుంకుమైశ్చ మనోహరైః ।
నానాప్రకార పుష్పైశ్చ మాల్యైర్బహా విధైరపి ॥
ధూ పైర్దీ పైశ్చ నైవేద్యైర్వసైర్నానాఫలైర్మునే ।
మణిముక్తి ప్రవాలైశ్చ వాద్యై ర్నానా విదైరపి ॥
మనోహరములైన శ్రీచందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వు దైవము నానావిధపుష్పములు వివిధములైన పూలదండలు ధూపదీప నైవేద్యములు వస్త్రములు నానావిధ ఫలములు మణులు ముత్యములు పగడములు సమర్పించి నానావిధ మంగళవాద్యములతో అర్చించిరి.
హేదేవి జగతాం మాతః సృష్టిస్థిత్యంతకారిణి।
నందగోపనుతం కాంతమస్మభ్యం దేహి సువ్రతే ॥
ఓదేవీ! జగన్మాతా! సృష్టి స్థితిలయములు చేయుదానా! భక్తపాలనమను మంచి ప్రతము గలదానా! నందగోపుని సుతుడైన శ్రీకృష్ణుని మాకు కాంతునిగా నిమ్ము.
మంత్రేణానేన దేవేశీం పరిహారం విధాయ చ ।
తతః కృత్వా తు సంకల్పం పూజయన్ మూలమంత్రతః ॥
పై మంత్రముతో దేవ దేవియగు గౌరిని ప్రార్థించి ప్రాయశ్చిత్త విధీచేసికొని తరువాత దేశకాల స్మరణముతో సంకల్పము చేసి మూలమంత్రముతో పూజించుచుండిరి.
మంత్రస్తు సామవేదోక్తి యాతయామః నబీజకః ।
ఓం శ్రీదుర్గాయై సర్వవిఘ్న వినాశిన్యై నమ ఇతి॥
ఆ గోపికలు పఠించిన మంత్రము సామవేదమున చెప్పబడినది. బీజాక్షర యుక్తము. ఒక జాములో ఫలము కూర్చునది. అది ఓం శ్రీదుర్గాయై సర్వవిఘ్నవినాశిన్యై నమః అనునది.
పుష్పం మాల్యం చ నైవేద్యం ధూపం దీపం తథాశుభం।
మంత్రేణానేన తద్భక్త్యా దదుః సర్వా ముదావ్వితాః ॥
సంతోషముతో ఆ గోపికలందరు ఆ దేవత మీది భక్తితో ఆ మంత్రము చెప్పుచు పుష్పములు పూలదండలు ధూపదీప నైవేద్యములను సమర్పించిరి.
ప్రవాలమాలయా భక్త్యా చేమం మంత్రం సహస్రదా ।
జపం కృత్వా చ సుత్వా చ ప్రణేముః శిరసా భువి ॥
భక్తితో ఈ మంత్రమునే పగడముల జపమాలతో వేయి మార్లు జపించి స్తుతించి భూమిపై శిరస్సు ఆనించి నమస్కరించిరి.
సర్వమంగళ మాంగల్యే సర్వకామప్రదే శివే।
దేహి మే వాంఛితం దేవి నమస్తే శంకరప్రియే ॥
ఇత్యుక్త్యా చ నమస్కారం కృత్వా దత్వా చ దక్షిణాం।
నైవేద్యాపి సర్వాణి బ్రాహ్మణేభ్యో యయుర్గృహం ॥
“సర్వమంగళములకు మంగళమైనదానా! సర్వకామములు ఇచ్చుదానా! శివనామురాలా! శంకరప్రియురాలా! దేవీ నీకు నమస్కారము. నా వాంఛితము (కోరిక) నిమ్ము” అని పలికి నమస్కరించి బ్రాహ్మణులకు నైవేద్య దక్షిణలు సమర్పించి గోపికలు తమ గృహములకేగిరి.
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ ఋషి పలికెను :
స్తవరాజ శ్రుణు మునే తుష్టువుర్యేస పార్వతీం।
భక్త్యా గోపాంగనాః సర్వాః సర్వాభీష్టఫలప్రదాం ॥
జగత్యేకార్ణవే ఘోరే చంద్రసూర్య వివర్జితే ।
అంజనాకార జోయేన నంపుతే చ చరాచరే॥
దత్తం పురా బ్రహ్మణే చ హరిణా జలశాయినాం ।
తస్మై దత్వా సర్వమిదం నీద్రాం భేజే జగత్పతి॥
నాభిపద్మే జగత్ర్పషా మధునా కైటభేన చ ।
పీడితః వరీతుష్టావ మూలప్రకృతిమీశ్వరీం॥
ఓ నారదమునీ! గోపికలు ఏ శ్రేష్ఠమైన స్తవముతో పార్వతీదేవిని భక్తితో స్తుతించిరో అన్ని కోరికల ఫలమిచ్చునట్టి ఆ స్తోత్రమును వినుము. ఈ సృష్టి మొత్తము చంద్రసూర్యులు లేనిదై కాటుక రంగు నీటిలో చరాచరములన్నియు మునిగీ ఘోరమైన ఒకే సముద్రముగా నుండగా ఆ పూర్వకాలమున జలశాయిగా నున్న (నీటిమీద పడుకొన్నవాడు) శ్రీహరి బ్రహ్మకు దీనినుపదేశించెను. ఆ జగత్పతి మరల నిద్రాయోగములో నుండగా - అతని నాభి కమలమున నున్న సృష్టికర్త (బ్రహ్మ) ను మధుకైటభులు వచ్చి పీడించిరి. అప్పుడు బ్రహ్మ మూలప్రకృతియైన ఈశ్వరిని (ఈస్తుతితో) స్తుతించి సంతోషపరచెను.
బ్రహ్మోవాచ - బ్రహ్మా పలికెను :
దుర్గే శివే భయే మాయే నారాయణి సనాతన ।
జయే మే మంగళం దేహి నమస్తే నర్వమంగలే ॥
దైత్యనాశార్ధ వచనో దకారః పరికీర్తితః ।
ఉకారో విఘ్న నాశార్థవాచకో వేద సమ్మతః॥
రేపో రోగఘవచనో గశ్చ పాపఘ్నపాచకః।
భయ శత్రుఘ్న వచన శ్పాకారః పరికీర్తితః ॥
స్మృత్యుక్తి స్మరణాద్యస్యా తే నశ్యంతి నిశ్చితం ।
అతో దుర్గా హరేః శక్తిర్హరిణా పరికీర్తితా ॥
ఓ.దుర్గా! శివా! మాయా! నారాయణీ, సనాతనీ, జయా! సర్వమంగళా! నీకు నమస్కారము. నాకు మంగళ (శుభము} మిమ్ము, దకారము దైత్యులను నాశము చేయుట అను అర్థము చెప్పు శబ్దముగా ప్రశంసింపబడినది. ఉకారము విఘ్నములను నాశము చేయుట అను అర్థము తెలుపు పదముగా వేదపంగీకరించినది. రకారము రోగనాశకమన్న అర్థము తెల్పు పదము. గకారము పాపము నశింపజేయు అను అర్ధము తెల్పు పదము. ఆకారము భయమును శత్రువులను నశింపజేయు అను అర్థము తెలుపు శబ్దముగా కీర్తింపబడినది. స్మృతులందు చెప్పబడిన (ఏదేవి నామము కలదో) ఆ “దుర్గా" అను పదమును స్మరించుట వలన సమష్టిగా ఫైన భయ మూలములన్నియు నశించును అన్నది నిశ్చితము. అందువలననే దుర్గాదేవి హరియొక్క శక్తి అని శ్రీహరిచేత కీర్తింపబడినది. (18, 19 శ్లోకములలో ద్ + ఉ + ర్ + గ్ + ఆ = దుర్గా అను నామములోని ఒక్కొక్క అక్షరము యొక్క మహిమ వర్ణింపబడి 20 శ్లోకములో ఆ నామమహిమ కలిపి చెప్పబడినది. ఇక ముందు గూడ ఇట్లే దుర్గా నామ నిర్వచనము చేయబడినది).
విపత్తివాచకో దుర్గశ్చికారో నాశవాచకః ।
దుర్గం నశ్యతి యా నిత్యం సా దుర్గా పరికీర్తితా ॥
దుర్గ అన్న శబ్దము ఆపద అను అర్థమిచ్చును. ఆకారము (దీరము) గోశము అను అర్ధమిచ్చును. ఏ దేవి దుర్గము (ఆపద) ను నశింపజేయుచున్నదో ఆమె దుర్గా అని కీర్తింపబడినది .
దుర్గో దైత్యేంద్రవచనో ప్యాకారో నాశవాచకః ।
తం ననాశ పురా తేన బుదైర్దుర్గా ప్రకీర్తితా॥
దుర్గ అను పదము దైత్యేంద్రుని తెలుపు పదము. ఆకారము (దీర్ఘము) నాశమును తెలుపు పదము, ఆ దేవి పూర్వము (ఇకముందు ఇతర నామముల నిర్వచనము చెప్పబడినది) ఆ రాక్షసుని నశింప జేసినందున బుధుల చేత దుర్గా అని కీర్తింపబడినదీ.
శశ్చ కల్యాణవచన ఇకారోత్కృష్ణవాచకః ।
సమూహవాచకశైవ వాకారో దాతృవాచకః॥
శ్రేయస్పంథోత్కృష్టదాత్రీ శివా తేన ప్రకీర్తితా।
శివారాశిర్మూర్తిమతీ శివా తేన ప్రకీర్తితా ॥
శివో హి మోక్ష వచనశ్చాకారో దాతృవాచకః ।
స్వయం నిర్వాణ దాత్రీ యా సా శివా పరికీర్తితా ॥
శకారము కల్యాణ వాచక వర్ణము, ఇకారము ఉత్కృష్ట (శ్రేష్ఠు వాచకవర్ణము మరియు సమూహవాచకము, వాకారము ధాతృ (ఇచ్చునట్టిది) వాచక పదము. ఈ చెప్పిన దానిని బట్టి శ్రేష్ఠమైన శ్రేయోగణమును (శుభసమూహమును) ఇచ్చు దేవి కనుక శివా (శ్ + ఇ +వ్ ఆ) అని కీర్తింపబడినది. శివా అనగా రూపుదాల్చిన మంగళము అని మరియొక నిర్వచనము కనుక శివా అని ప్రశంసింపబడినది. శివ అను పదము మోక్షవాచకము ఆకారము దాతృవాచకము కనుక శివా అని ఆయెను. తాను స్వయముగా నీర్వాణము (ముక్తి) నీచ్చునది ఏ దేవియో ఆమె శివా అని కీర్తింపబడినది.
అభయో భయనాశోక్తశ్చాకారో దాతృవాచకః ।
ప్రదదాత్యభయం సద్యః సాభయా వరికీర్తితా ॥
“అభయ” అను పదము భయనాశకము అనియు, ఆకారము దాతృవాచకము (పూర్వము వలెనే) కనుక ఏ దేవి వెంటనే అభయము (భయము లేని స్థితిని నిచ్చునో ఆమె “అభయా” అని చెప్పబడినది.
రాజ్యశ్రీవచనో మాశ్చ యాశ్చ ప్రాణవాచకః ।
తాం ప్రాపయతి యా నద్యః సా మాయా ప్రకీర్తితా ॥
మాశ్చ మోక్షార్థవచనో యాశ్చ ప్రాపణవాచకః।
తం ప్రాపయతీ యా నిత్యం సా మాయా పరికీర్తితా ॥
“మా” పదము రాజ్యలక్ష్మిని తెల్పునది. “యా” పదము పొందించు అనువర్థమిచ్చును. అందువలన ఏ దేవి (శరణు పొందిన) వెంటనే రాజ్యలక్ష్మిని సమకూర్చుతో ఆమె మాయా అని చెప్పబడినది. “మా” పదము మోక్షమను అర్థమిచ్చును. “యా” పదము పొందించు అనుసర్థమిచ్చును. అందువలన ఏ దేవి శాశ్వత మోక్షమును కల్గించునో ఆమె మాయా అని కీర్తింపబడినది.
నారాయణార్జింగభూతా తేన తుల్యా చ తేజసా ।
సదా తస్య శరీరస్తా తేన నారాయణి స్మృతా॥
నారాయణుని యొక్క అర్థశరీరము వంటిదియు తేజన్పులో అతనితో సమానురాలును ఎల్లప్పుడతని శరీరమందే నిలిచి ఉండునదియు ఐనందున “నారాయణి” అని చెప్పబడినది.
నిర్గుణస్య చ నీత్యస్య వాచకశ్చ సనాతనః।
సదా నిత్యా నిర్గుణా యా కీర్తితా ఆ సనాతనీ ॥
ననాతన శబ్దము నిత్యము నిర్గుణము అన్న అర్ధములను తెలుపును. ఏ దేవి ఎల్లప్పుడు నీత్యురాలు, నిర్గుణురాలో ఆమె సనాతనీ అని కీర్తింపబడినది.
జయః కల్యాణవచనో యాకారో దాతృవాచకః ।
జయం దదాతి యా నిత్యం సా జయా పరికీర్తితా ॥
'జయ' శబ్దము కల్యాణ (శుభ్ర) మను అర్థమును తెలుపును. యాకారము ఇచ్చుట అను అర్థమును తెలుపును. ఏ దేవి ఎల్లప్పుడు జయము (శుభము) నిచ్చునో ఆమె “జయా” అని కీర్తింపబడినది.
సర్వమంగల శబ్దశ్చ సంపూర్ణేశ్వర్య వాచకః ।
ఆకారో దాతృ వచనస్తధాత్రీ సర్వమంగలా॥
“సర్వమంగళ” శబ్దము సంపూర్ణిశ్వర్యమును తెలుపును. ఆకారము “ఇచ్చుట” అను అర్థమును తెలుపును. అట్లు సంపూర్తైశ్వర్యము నిచ్చునది ఆ దేవియే కనుక “సర్వమంగళా" అని చెప్పబడినది.
నామాష్టక మిదం సారం నామార్థ నహ సంయుతం।
నారాయణేన యధత్తం బ్రహ్మణే నాభివంకజే ॥
తస్మై దత్తా నిద్రితశ్చ బభూవ జగతాం పతిః ।
మధుకైటభౌ దుర్గాం బ్రహ్మాణం పంతుముద్యతా ॥
స్తోత్రేణానేన స బ్రహ్మా స్తుతిం నత్వా చకార హ ।
సాక్షాత్ నుతా తదా దుర్గా బ్రహ్మణే కవచం దదౌ ॥
శ్రీకృష్ణకవచం దివ్యం సర్వరక్షణ నామకం ।
దత్త్యా తస్మై మహామాయా సాంతర్ధానం చకార హ॥
తన నాభి కమలముందున్న బ్రహ్మకు దేనిని నారాయణుడుపదేశించినో సారభూతమైన ఆ నామాష్టక స్తోత్రము (దుర్గా, శివా, అభయా, మాయా, నారాయణీ, సనాతనీ, జయా, సర్వమంగళా అను ఎనిమిది నామములు కలది) నామముల అర్థముతో కూడినది. ఆ జగత్పతి బ్రహ్మకుపదేశించి నిద్రించిన కాలముననే మధుకైటభులు వచ్చి బ్రహ్మను సంహరింపబూనుకొనిరి. అప్పుడు బ్రహ్మ దుర్గాదేవి నీ స్తోత్రముతో స్తుతించి నమస్కరించెను. అప్పుడు మహామాయ అగు దుర్గాదేవి సాక్షాత్తుగా స్తుతించబడినందున బ్రహ్మకు సర్వరక్షణమను పేరుగల శ్రీకృష్ణకవచమును దివ్యకవచమును ఉపదేశించి అంతర్ధానమయ్యెను.
స్తోత్రం కుర్వంతి నిద్రాం చ సంరక్ష్య కవచేన వై।
విద్రానుగ్రహతః సద్యః స్తోత్ర స్యైన ప్రభావతః ॥
శ్రీకృష్ణ కవచముతో తమను రక్షించుకొని నిద్రాదేవిని (సముద్ర పై శయనించిన స్వామితో కూడి ఉన్న దేవిని) స్తోత్రమొనర్చినవారు నిద్రాదేవి అనుగ్రహము వలన ఈ స్తోత్రమహిమ వలన వెంటనే (శ్రేయమును పొందుదురు).
తత్రాజగామ భగవాన్ వృషరూపీ జనార్దనః ।
శక్త్యా చ దుర్గయా సార్ధం శంకరస్య జయాయ చ॥
నరథం శంకరం మూర్ని కృత్వా చ నిర్భయం దదౌ।
ఆత్యూర్ధం ప్రాపయామన జయా తస్మై జయం దదౌ॥
నేత్ర స్యైవ ప్రభావణ సంప్రావ్య కవచం విధిః ।
వరం చ కవచం ప్రావ్య నిర్భయం ప్రావ నిశ్చితం ॥
బ్రహ్మా దదౌ మహేశాయ స్తోత్రం చ కవచం వరం ।
త్రిపురస్య చ సంగ్రామే సరదే వతితే హరౌ ॥
(ఈ శ్లోకములు క్రమము తప్పినట్లున్నవి. 40,41,38,39ల వరుసలో తాత్పర్యము వ్రాయబడుచున్నది.)
ఈ స్తోత్రప్రభావము చేతనే బ్రహ్మ శ్రేష్ఠమైన కవచమును (శ్రీకృష్ణ కవచమును) పొంది భయరహితుడయ్యెను. ఇది నిశ్చయము. బ్రహ్మ ఈ స్తోత్ర కవచములను మహేశ్వరునికి ఉపదేశించెను. త్రిపురాసురులతో యుద్ధము సంభవించినప్పుడు రథముతో బాటు శంకరుడు పడిపోయెను. అప్పుడే ఈ ఉపదేశము ఘటించెను. అట్టి శంకరునికి జయము కళించుట కొరకు శక్తి రూపిణియైన దుర్గాదేవితో బాటు వృషభరూపము ధరించి విష్ణుభగవానుడు ఆ యుద్ధభూమికి వచ్చెను. రథముతో బాటు శంకరుని తల పైకెత్తుకొని మిక్కిలి ఉన్నతస్థానమునకు చేర్చెను. అప్పుడు జయాదేవి శంకరునికి జయము చేకూర్చెను.
బ్రహ్మాస్త్రం చ గృహీత్వా న సనిద్రం శ్రీహరి స్మరన్।
స్తోత్రం చ కవచం ప్రావ్య జఘాన త్రిపురం హరః ॥
ఆ శంకరుడు స్తోత్ర కవచములను పొంది నిద్రాదేవితో కూడియున్న శ్రీహరిని స్మరించి బ్రహ్మాస్త్రము స్వీకరించీ త్రిపురవాసులను సంహరించెను.
స్తోణానేన తాం దుర్గాం కృత్వా గోపాలికాః స్తుతిం।
లేబిరే శ్రీహరి కొంతం స్తోత్రస్యాన్య ప్రభావతః ॥
గోపకన్యాకృతం స్తోత్రం సర్వమంగలనామకం ।
వాంఛితార్థ ప్రదం సద్యః సర్వవిఘ్న వినాశనం ॥
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం భక్తి యుక్తశ్చ మానవః ।
శైవో వా వైష్ణవో వాపీ శాక్తో దుర్గాత్రముచ్చతే ॥
రాజద్వారే శ్మశాసే చ దావాగ్నె ప్రాణసంకటే।
హింస్రజంతు భయాగ్రత్త మగ్నః పోతే మహార్ణవే ॥
శత్రుగ్రస్తే చ సంగ్రామే కారాగారే విదధతే ।
గురుశా పే బ్రహ్మశోపే బంధుభేదే చ దుస్తరే ॥
స్థానభ్ర ష్ఠే ధనభ్రష్ఠ జాతి భ్రష్ఠే వచాన్వితే ।
పతిభేదే పుత్రభేదే ఇల సర్పవిషాన్వితే ॥
స్తోత్రమ్మరణ మాత్రేణ సద్యో ముచ్యత నిర్భయః।
వాంఛితం లభతే సద్యః సర్వైశ్వర్యమునుత్తమం ॥
ఇహ లోకే హరేర్భక్తిం దృఢం చ సతతం నృతిం।
అంతే దాస్యం చ లభతే పార్వత్యాశ్చ ప్రసాదతః ॥
ఇతి బ్రహ్మవైవర్తే గోపకన్యాకృతం సర్వమంగలాస్తోత్రం ॥
ఈ స్తోత్రముతో గోపికలు దుర్గాదేవిని స్తుతించి దీని మహిమ వలన శ్రీహరినీ (శ్రీకృష్ణుని) ప్రియ భర్తగా పొందిరి. గోపకన్యలోనర్చిన సర్వమంగళ మను పేరు గల ఈ స్తోత్రము వెంటనే కోరిన ఫలములనిచ్చునది. సర్వవిఘ్నములను నశింపజేయునది. శైవుడైనను వైష్ణవుడైనను శక్తిభకుడై నను భక్తియుకుడై ఎల్లప్పుడు మూడు సంధ్యాకాలములలో దీనిని పఠించునో వాడు దాటరానీ ఆపదల నుండి విముక్తుడగును. ఓక కార్యార్థమై రాజద్వారమున ప్రవేశించునపుడు - శ్మశానమునందును, కారుచిచ్చు చుట్టుకొని ప్రాణభయమేర్పడినపుడు క్రూరజంతువుల వలన భయపడునప్పుడు - మహాసముద్రములో ఓడ మునుగుచున్నప్పుడు, యుద్ధములో శత్రువు చేతికి చిక్కినప్పుడు - కారాగార బంధనము, ఆపద ఏర్పడినపుడు - గురు శాపము గాని బ్రాహ్మణ శాపము గానీ బంధువులతో భేదాభిప్రాయ మేర్పడినపుడు గాని, ఒక స్థానము నుండి (పదవి) భ్రష్టుడైనపుడు గానీ ధనము పోయినపుడు గాని - జాతీభ్రష్టుడైనప్పుడు గాని, దుఃఖము సంభవించినపుడు గాని - భర్తతో భేదాభిప్రాయము కలినప్పుడు గానీ - పుత్రులతో భేదాభిప్రాయము ఏర్పడినప్పుడు గాని - ఖల (క్రూర)మైన సర్చవిషము వ్యాపించినప్పుడు గానీ - ఈ స్తోత్రమును స్మరించినందువలననే వెంటనే భయము నుండి విడుదల పొంది నిర్భయుడగును. స్మరించిన వెంటనే కోరిన అత్యుత్తమమైన ఐశ్వర్యము లభించును. పార్వతీదేవి అనుగ్రహము వలన ఇహ లోకములో దృఢమైన హరిభక్తిని - ఎడతెగనీ దైవస్మృతిని - శరీరాంతములో శ్రీకృష్ణ దాస్యముక్తిని మానవుడు పొందును. ఇది బ్రహ్మవైవర్త పురాణములోని గోపకన్యలు స్తుతించిన సర్వమంగళా స్తోత్రము.
అనేన స్తవరాజేన తుషువుర్నిత్యమీశ్వరం ప్రణేముః పరయా భక్త్యా యావన్మాసం ప్రజాంగనాః ॥
ఏపం పూర్ణే చ మాసే చ సమాప్రీదివసే తథా ।
స్నాతుం ప్రజగ్ముర్గోప్యశ్చ వస్త్రాణ్యాధాయ తత్తటే ॥
నానా విధాని ద్రవ్యాణి రత్నమూల్యాని నారద ।
పీత లోహిత శుక్లాని చారూడి మిశ్రితాని చ ॥
తీరావృతాన్యసంభ్యాని శ్చ తీరం సుశోభనం ।
చందనాగురు కస్తూరీ వాయునా సురభీకృతం ॥
నైవేద్యశ్చ బహవిదైః కొలదేశోద్భవైః ఫలైః ।
ధూపైః ప్రదీ పైః సిందూరైః కుంకుమైశ్చ విరాజితం ॥
ఆ ప్రజమందలి స్త్రీలు (కన్యలైన గోపికలు) మొత్తము మాసము పరమ భక్తితో ప్రతిదినము ఈ స్తవరాజములో ఈశ్వరిని స్తుతించి నమస్కరించిరి. ఇట్లు ఆ మానము ముగియగా ప్రత సమాప్తి దినమునాడు గోపికలు స్నానము చేయుటకు గాను ఒడ్డున వస్త్రములుంచి నీటిలోనికి వెళ్లిరి. నానావిధ ద్రవ్యములు రత్నములతో వెలగట్టదగిన {కొనదగిన) పసుపుపచ్చని, ఎర్రని, తెల్లని, రంగుల సుందర వస్త్రములు ఒడ్డున అసంఖ్యాకముగా నుండి వాటితో ఆ తీరము మంగళకరముగా నుండెను. చందన ఖ్యాకముగా నుండి వాటితో ఆ శ్రీరము మంగళకరముగా నుండెను. చందనము అగురు కస్తూరి వాసనలు గల గాలితో పరిమళవంతమయ్యెను. వివిధములైన నైవేద్య పదార్థములతో, ఆ కాలమున ఆ దేశమున ఫలించిన ఫలములతో, ధూపదీపములతో సిందూరము కుంకుమ పూవు పొడితో ఆ తీరము ప్రకాశించెను.
జలే క్రీడోన్ముఖా గోపాల బభూవుః కౌతుకేన చ ।
నగ్నాః క్రీడాభిరాసక్తాః శ్రీకృష్ణార్పిత మానసాః॥
శ్రీకృష్ణునికి మనస్సునర్పించిన గోపికలు కోరికతో జలక్రీడకు సిద్ధమై నీటిలో నగ్నముగా క్రీడించుచుండిరి.
దృష్ట్వా కృష్ణశ్చ వస్త్రాణి ద్రవ్యాణి వివిధాని చ ।
వాసాంస్యాదాయ వస్తూని చఖాద శీశు భిః సహ ॥
గత్వా దూరం చ గోపాలాస్తస్థుః సర్వే ముదాన్వితాః ।
వస్త్రాణి పుంజీకృత్యాదావూచుః స్కంధేతిలోలుపాః ॥
శ్రీదాస చ సుదామా చ వసుదామా తథైవ చ।
సుబలశ్చ సుపార్శ్వశ్చ శుభాంగ సుందరస్తథా ॥
చంద్రభానో వీరఖానః సూర్యభానస్తథైవ చ ।
వసుఖానో రత్నభానో గోపాలా ద్వాదశ స్మృతాః ॥
శ్రీకృష్ణో బలదేవశ్చ ప్రధానాశ చతుర్ధశ।
గోపా హరేర్వయసాశ్చ కోటీశః కోటీశో మునే॥
వస్రాజ్యదాయ తే సర్వే తసురేకత్ర దూరతః ।
శతశః పుంజీకాస్తత్ర స్థావయామాసురున్ముఖాః ॥
శ్రీకృష్ణుడు తీరమందలి వివిధ ద్రవ్యములను వస్త్రములను చూచీ గోపాలకులతో కలిసి ఆ పదార్థములన్నీ భుజించీ వస్త్రములను తీసుకొనెను. వస్త్రములను మొదలు మూటలు గట్టి ఉల్లాసముగా దూర ప్రదేశమునకు పోయి ఆ కొంటె గోపాలురు చెట్టు కొమ్మల మీద ఉంచి ఒకచోట చేరిరి. శ్రీదాముడు సుదాముడు వసుదాముడు సుబలుడు సుపార్శ్వుడు శుభాంగుడు సుందరుడు చంద్రభానుడు వీరభానుడు సూర్యభానుడు వసుభానుడు రత్నభానుడు అని పన్నెండుగురు గోపకులు. శ్రీకృష్ణుడు బలదేవుడు పై వారితో కలిసి ముఖ్యులు పదునాల్గురు. గోపాలకులందరు శ్రీకృష్ణుని వయస్సువారే గుంపులు గుంపులుగా అసంఖ్యాకులుండిరి. వారందరు వస్త్రముల మూటలు ఒకచోట చేర్చి ఆ తీరమునకెదురుగా నిలిచియుండిరి.
కించిద్వస్త్రం సమాదాయ కృత్వా చ పుంజికాం ముదా ।
సమారుహ్య కదంబాగ్రమువాచ గోపికాం హరిః॥
శ్రీకృష్ణుడు కొన్ని వస్త్రములను తీసుకొని మూటగట్టి సంతోషముతో కడిమి చెట్టు మీదికెక్కి గోపికలతో ఇట్లు పలికెను.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లనెను :
భోభో గోపాలికాః సర్వా వినషా ప్రత కర్మణి।
కృత్వా విధానం మద్వాక్యం శ్రుత్వా క్రీడత మన్మధాత్ ॥
సంకల్పితే ప్రతొర్రే చ మాసే మంగళ కర్మణి।
యూయం నగ్నాః కథం జోయే ప్రతాంగహానికారికాః ॥
పరిధేయాని వాసాంసి పుష్పమాల్యానీ యాని చ।
ప్రతిరాణి చ వస్తూని కేన నీలోని వ్కోధునా॥
ప్రతే తు నగ్నా యా స్నోతి తాం రుషో వరుణః స్వయం ।
వరుణానుచరాశ్చక్రుర్వాసో వస్తూపనిర్ఘృతిం ॥
కథం యాస్యథ నగ్నా శ్చ కిం ప్రతస్య భవిష్యతి ।
ప్రతారాధ్యా కథం సా చ వస్తూని కిం న రక్షతి ॥
చింతాం కురుత తాం పూజ్యాం తుషావ బలిరీశ్వరీం ।
యుష్మాకమీదృశీ దేవీ న శక్తా వస్తురక్షణే ॥
కథం ప్రతఫలం సావా దాతుం శక్తా సురేశ్వరీ ।
ఫలం ప్రదాతుం యా శక్తా పా శక్తా సర్వకర్మణి ॥
ఓ గోపికలారా నే మాట విని ఆ తరువాత మీ కోరిక ప్రకారము క్రీడించండి. ప్రతకర్మను శాస్త్రానుసారము చేసి చివరికి మీరందరు నష్టపోతిరి. ప్రతమునకు యోగ్యమైన ఈ మాసమందు ఒక మంగళకర్మ సంకల్పించి (ఆచరించి) వ్రతము యొక్క అంగమైన స్నానఫలమునకు హాని కల్గించుకొనుచు జలములో నగ్నముగా మీరిట్లు ప్రవేశించితిరి. మీరు ధరించు వస్త్రములను పూలమాలలను ప్రతయోగ్యమైన పదార్థములను ఇప్పుడెవడు తీసుకొని పోయెను ? ప్రతకాలములో ఏ స్త్రీ నగ్నముగా స్నానమాడునో ఆమెపై వరుణుడు అతని సేవకులు కోపించి వస్త్రములను అపహరించిరి. ఇక మీరు నగ్నముగా గృహములకెట్లు పోదురు? వ్రతము యొక్క వ్యవహారమే మగును? వ్రతము చేత పూజింపబడిన ఆ దేవి మీ వస్తువులను ఎట్లు రక్షింపదు ? విచారించండి. ఆ పూజ్యురాలిని ఈశ్వరిని ఒక బలవంతుడు స్తుతించి (వస్తువులను గ్రహించెనేమో!) ఇటువంటి మీ దేవి వస్తువులను రక్షించుటలో శక్తురాలు కానప్పుడు - ఆ సురేశ్వరి ప్రతఫలమును ఇచ్చుటకు ఎట్లు సమర్ధురాలగును? ఫలమిచ్చు శక్తి గలదైనచో అన్ని కర్మలయందు శక్తురాలే అగును.
శ్రీకృష్ణస్య వచః శ్రుత్వా చింతామాపుర్వజస్త్రియః ।
దదృశుర్యమునా తీరం వస్రవస్తు విహీనకం ॥
చక్రుర్విషాదం తోయే చ నగ్నాస్తా రురుదుర్భశం ।
క్వ గతావి చ పస్రాణి వస్తూనీత్యూచురత్ర సః ॥
కృత్వా విషాదం త త్రైవ తమూచుర్గోపకన్యకా।
పుటాంజలియుతాః సర్వా భక్త్యా వినయ పూర్వకం ॥
శ్రీకృష్ణుని మాటలను విని రేపల్లె స్త్రీలు (గోపికలు) యమునాతీరము వైపు చూడగా అక్కడ వస్త్రములు లేకుండెను. నీటిలో నగ్నముగానున్న వారప్పుడు దుఃఖము పొంగివచ్చి భోరుమని ఏడ్చిరి. “మా వస్త్రములు ద్రవ్యములు ఈ ఒడ్డున పెట్టినవెక్కడపోయెను?” ఇట్లు సంతాపపడి ఆ గోపకన్యలందరు భక్తి వినయములతో చేతులు జోడించి ఆ జలమునుండి ఇట్లు పలికిరి.
గోపాలికా ఊచుః - గోపాకన్యలిట్లనిరి;
పరిధేయాని వస్త్రాణి కింకరీణాం నదీశ్వర।
నిబోధయాత్మానమేవ స్పర్శం కర్తుం త్వమర్హ ని ॥
వ్రతార్హణి చ వస్తూని దేవస్వామి చ సాంప్రతం ।
ఆదత్తాని మోచితావి గ్రహీతుం వేదవిద్వద ॥
దేహి ధౌతావి ధృత్వా చ కరిష్యామో వ్రతం వయం ।
వస్తునాన్యేన గోవింద వస్తూనాం భక్షణం కురు ॥
ఓ మహాప్రభూ! మీ దాసీజనమైన మేము ధరించు వస్త్రములను నీవు తాకుట యోగ్యమేనా? ఆలోచించుకొనుము. ఓ వేదవేతా! వ్రతములో ఉపయోగింపదగిన దేవద్రవ్యమును దైవమున కర్పింపక ముందు నీవు గ్రహించుట తగునా ? మా వస్త్రములను మాకిమ్ము. వాటిని ధరించి మేము ప్రతము చేతుము. పూజకొరకని కూర్చుకొన్న పదార్థములను కాకుండ ఓ గోవింద ఇతర పదార్థమును గ్రహించి భుజింపుము.
ఏతస్మిన్నంతరే తత్ర శ్రీదామా వస్త్రపుంజికాం।
దర్శయిత్వా చ తాః సర్వా దూరం దుద్రావ తత్పురః ॥
దృష్ట్వా నవస్త్రం గోపాలం నర్వాసామీశ్వరీ పరా ।
సర్వావయస్యాశ్చోవాచ కోపయుక్తా జలపుతా ॥
ఇంతలో శ్రీదాముడు ఆ గోపికలకు వస్త్రముల మూటలను చూపించి వాటిని పట్టుకొని వారి ముందునుండి దూరముగా పరుగెత్తాను, వస్త్రముల మూటలతో అట్లు పోవుచున్న గోపాలుని చూచి ఆ గోపికలందరికి పరమేశ్వరి ఐన రాధాదేవి కోపము పొంది నదీజలములో సుండియే తన చెలులతో నిట్లు పలికెను.
శ్రీరాధికోవాచ - శ్రీరాధాదేవి పలికెను :
హే నుశీలే శశికలే హే చంద్రముఖి మాధవి।
కదంబపూలే హే కుతి యమునే సర్వమంగలే ॥
హే పద్మముఖి సావిత్రి పారిజాతే చ జాహ్నవి ।
సుధాముఖి శుభే పద్మే హే గౌరి హే స్వయంప్రభే ॥
కాలికే కమలే దురే హే సరస్వతి భారతి ।
అపూర్ణే రతి హే గంగే చాంబికే సతీ సుందరి ॥
కృష్ణప్రియే మధుమతి చం పే చందన సందిని ।
యూయం సర్వాః సముత్థాయ బద్ఘానయత వల్లవం॥
ఓ సుశీలా! శశీకలా! చంద్రముఖీ మాధవీ! కదంబమాలా! కుంతీ! యమునా! సర్వమంగళా! పద్మముఖీ! సావిత్రీ! పారిజాతా! జాహ్నవీ! సుధాముఖీ! శుభా! పద్మా/ గౌరీ! స్వయంప్రభా! కాళికా! కమలా! దుర్గా! సరస్వతీ! భారతీ! అపర్ణా! రతీ! గంగా! అంబికా! సతీ! కృష్ణప్రియా! మధుమతీ! చంపొ! చందస నందినీ! మీరందరు నీటిలో నుండి బయటకు పోయి ఆ గోపాలుని పట్టుకరుడు.
సర్వా రాధాజ్ఞయా తూర్ణం సముత్థాయ జలాత్రుధా।
ప్రజగ్ముర్గోపికా నగ్నా యోనిమాచ్చాద్యపాణినా ॥
ఏతాసాం సమచారిణ్యో గోప్యస్తూర్ణం సహస్రశః ।
ప్రజగ్ము సేన రూపేణ కోపాదరక్తలోచనా॥
రాధాదేవి ఆజ్ఞతో వారందరు వెంటనే నీటినుండి లేచి ఒక చేతిలో మర్మస్తాసమును దాచుకొని కోపముతో నగ్నముగనే పరిగెత్తిరి. వాళ్ల చెలికత్తెలైన గోపికలు కూడ వేనవేలమంది కోపముతో కన్నులెర్రబడగా ఆదే రూపములలో పరుగెత్తిరి.
వేగేన దుద్రువుః నర్వా శ్రీరామానం చ బాలికాః ।
వేగేన చ ప్రధావంతం బిభ్రాంతం వస్త్ర పుంజికాం ॥
జగామ శీఘ్రం శ్రీదామా యత్ర గోపాః సహాంశుకాః ।
జవేన రుద్రువు ధోవ్యస్తత్వళ్ళిద్భల సంయుతా॥
వస్త్ర చోరాంశ్చ గోపాంశ్చ వేష్టయామానురాళు తాః ।
భీయ ప్రదుర్రువుర్బాలా యత్ర కృష్ణస్సహాంశుకః ॥
శ్రీకృష్ణసహితానాలాన్వారయామాసురాశ చ।
గోపికానాం ఖియ గోపా డదుర్వప్రాణి మాధవం॥
మాధవః స్థాపయామాస స్కంధే స్కంధే తరీస్తథా।
కదంబ వృక్షః శుశఖే వక్రౌర్నానా ఏదైరపి ॥
వస్త్రాణాం పుంజికాః సర్వాః స్కంధేషు వినిధాయ చ।
ఉవాచ గోపికాః కృష్ణః పరిహాస పరం వచః ॥
వస్త్రముల మూట పట్టుకొని వేగముగా పరిగెత్తుచున్న శ్రీదాముని వెంటబడి ఆ గోపబాలికలందరు వేగముగా పరుగెత్తిరి. మూటలు పట్టుకొని ఉన్న ఇతర గోపాలురున్న చోటికీ శ్రీదాముడు పోగా బలవేగములతో గోపికలందరు వాని వెంట పరుగెత్తి తన వస్త్రములను దొంగిలించిన గోపాలురను చుట్టు ముట్టిరి. వీరికీ భయపడి గోపాలురు వస్త్రములతో శ్రీకృష్ణుడున్న చోటికి పోయిరి. గోపికలక్కడికీ చేరవచ్చీ శ్రీకృష్ణునితో బాటు అందరినీ చుట్టుముట్టిరి. గోపికలకు భయపడి గోపాలురు తాము తెచ్చిన వస్త్రములను మాధవుని కిచ్చిరి. వాటన్నిటిని స్వీకరించి మాధవుడు (శ్రీకృష్ణుడు వాటిని కదంబ వృక్షము యొక్క కొమ్మ కొమ్మకు తగిలించెను. నానా వర్ణములు గల వస్త్రములతో ఆ కడిమి చెట్టు అందముగా ప్రకాశించెను. వస్త్ర పుంజికలను (మూటలను) అన్నింటినీ అట్లు కొమ్మల మీద పెట్టి శ్రీకృష్ణుడు గోపికలతోనిట్లు పరిహాస వాక్యములు పల్కెను.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లనెను :
భో భో గోపాలికా నగ్నా ఇదానీం కిం కరిష్యథ ।
వస్త్రయాఛాం ప్రకర్తుం చ కురుతాచు పుటాంజలిం ॥
గత్వా వదత యుష్మాకమీశ్వరీమధ రాధికార।
కరోతు శీఘ్రం వస్త్రాణాం యాద్ధాం కృత్వా పుటాంజలిం ॥
అన్యథాహం న దాస్యామి యుష్మభ్యమంశుకాని చ ।
యుష్మాకమీశ్వరీ రాధా కిం కరిష్యటీ మేధునా ॥
వ్రతారాధ్యా చ యా దేవీ సావా మే కిం కరిష్యతీ ।
ఇత్యేవం కధితం నర్వం బ్రూత యూయం చ రాధీకాం॥
శ్రీ కృష్ణ వచనం శ్రుత్వా లొః సర్వా గోపకన్యకాః ।
వీక్ష్య లోచన కోణేన ప్రజగ్మూ రాధికాంతరం ॥
చక్రుర్నివేదసం గత్వా యదువాచ హరిః స్వయం ।
శ్రుత్వా జహాన రాధా బభూవ కామ పీడితా ॥
ఓ గోపికలారా! నగ్నముగా నున్న మీరిప్పుడేమి చేయుదురు. వస్త్రము లిమ్మనీ యాచించుటకుగాను చేతులు జోడించి నమస్కరింపుడు. మీ ఈశ్వరియైన రాధాదేవి వద్దకు పోయి “నా వద్దకు శీఘ్రముగా వచ్చి చేతులు జోడించి వస్త్రములను యాచించు"మన్నానని చెప్పుడు. “అట్లు చేయనిచో మీకు వస్త్రములనీయను. మీ నాయకురాలు నన్నిప్పుడేమి చేయగలదు? ప్రతముతో పూజింపబడు ఆ దేవీ మాత్రము నన్నేమీ చేయగలదు. ఈ మాటలన్నీంటినీ మీ రాధకు చెప్పుడు”. శ్రీకృష్ణుని వాక్యములను విని ఆ గోప కన్యలందరు ఓరచూపులతో చూచీ రాధ వద్దకు వెళ్లిరి. శ్రీహరి స్వయముగా నేమి పలికెన్ ఆ మాటలనట్లే రాధకు నివేదించిరి. రాధాదేవి శ్రీకృష్ణ వచనములను విని బాగా నవ్వెను. వెంటనే మన్మధ పీడితురాలయ్యెను.
శ్రుత్వా తాసాం చ వచనం పులకాంచిత విగ్రహా।
న జగామ హరేః స్థానం ప్రీడయా నస్మితా సతీ ॥
జలే యోగాససం కృత్వా దధ్యో కృష్ణ పదాంబుజం ।
బ్రహ్మేశానంత ధర్మాణాం వంద్యమీప్సితదం పరం॥
స్మారం స్మారం పదాంభోజం సాశ్రు సంపూర్ణ లోచనా।
భావాతిరేకాత్ప్రాణేశం తుష్టావ నిర్గుణం పరం॥
వారి మాటలు విని శరీరము పులకరించగా సిగ్గుతో చిరునవ్వుతో ఆ రాధాసతి శ్రీకృష్ణుడున్న స్థానమునకు పోలేదు. ఆ జలమందే యోగాసనము వేసికొని బ్రహ్మ శివ అనంత ధర్మదేవతల చేత నమస్కరింపబడువాడు - వాంఛిత ఫలమిచ్చువాడగు - శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మములను మనస్సులో ధ్యానించెను. స్వామి పాదారవిందములను స్మరించి స్మరించి ప్రేమాతిశయము వలన కన్నుల సిండ నీరు నిండుగా వైషమ్యాది గుణరహితుడును నీఖీల కల్యాణ గుణ పూర్ణుడును అగు తన ప్రాణసోధునిట్లు సుశీంచెను.
రాధికోవాచ - రాధాదేవి ఇట్లు పలికెను :
గోలోకనాథ గోపీశ మదీశ ప్రాణవల్లభ ।
హే దీనబంధో దీనేశ సర్వేశ్వర నమోఽస్తు తే ॥
గో పేశ గోసమూ హేశ యశోదానంది వర్ధన ।
నందాత్మజ సదానంద నిత్యానంద నమోస్తు తే ॥
శతమన్యోర్మన్యు భగ్న బ్రహ్మ దర్ప వినాశక ।
కాలీయ దమన ప్రాణనాథ కృష్ణ నమోస్తు తే ॥
శివానంతేశ బ్రహ్మేళ బ్రాహ్మణేశ పరాత్పర।
బ్రహ్మ స్వరూప బ్రహ్మణి బ్రహ్మ బీజ నమోస్తు తే ॥
చరాచర తరోరీజ గుణాతీత గుణాత్మక ।
గుణబీజ గుణాధార గుణేశ్వర నమోస్తు తే ॥
అణిమాదిక సిద్ధీశ సిధ్ధః సిద్ధి స్వరూపక ।
తవస్తపస్వీంస్తపసాం బీజరూప నమోస్తు తే ॥
యదనిర్వచనీయం చ వస్తు నిర్వచనీయకం ।
తత్స్వరూపతయోర్చీజ సర్వబీజ నమోస్తు తే ॥
అహం సరస్వతీ లక్ష్మీర్ధుర్గా గంగా శ్రుతీప్రసూః।
యస్య పాదార్చనాన్నిత్యం పూజ్యా తస్మై నమో నమః ॥
స్పర్శనే యన్య భృత్యానాం ధ్యానేన చ దీవానిశం।
పవిత్రాణి చ తీర్థాని తస్మై భగవతే నమః ॥
ఓ గోలోకనాథుడా! గోపినాథా! మన్నాథా! ప్రాణప్రియా! దీనబంధూ! దీననాథా! సర్వేశ్వరా! నీకు నమస్కారము. గోపాలసాయకా! గోబృందనాథా! యశోదానందమును వృద్ధిచేయువాడా! నందకుమారా! సదానందా! నిత్యానందా! నీకు నమస్కారము, ఇంద్రుని గర్వక్రోధములను భగ్నము చేసినవాడా! బ్రహ్మగర్వమును సొశము చేసినవాడా! కాళీయుని అణచినవాడా! ప్రాణశోథా! నీకు నమస్కారము. శివునకు, అనంతునకు (నాగరాజు) బ్రహ్మకు ప్రభువా! బ్రాహ్మణసాథా! పరాత్పరా! జ్ఞానస్వరూపా! బ్రహ్మజుడా! సృష్టికి బీజకల్యాణ గుణస్వరూపా! త్రిగుణములకు బీజము (విత్తనము) ఐనవాడా! సద్గుణముల కాధారమైనవాడా! గుణేశ్వరా! నీకు నమస్కారము. అణిమాద్యష్ట సీదులకు ప్రభువా! సీదులకు ఫలస్వరూపుడా! జ్ఞానరూపుడా! పరమాత్మా! తపస్సులకు (వేదములకు శాస్త్ర జ్ఞానమునకు బీజభూతుడా! నీకు నమస్కారము. ఇట్లని నిర్వచింపరాని వస్తువేదో - అందువలననే నిర్వచనీయకమునుబడు వస్తువే స్వరూపముగా గలవాడా! నిర్వచనీయ అనిర్వచనీయములకు రెంటికీ బీజభూతుడా! నర్వమునకు బీజమైనవాడా! నీకు నమస్కారము. నేను సరస్వతి లక్ష్మి దుర్గాదేవి గంగాదేవి వేదమాతయగు గాయత్రి ఏ ప్రభువు పాదముల నర్చించుట వలన పూజ్యురాండ్రమైతిమో అట్టి నీకు నమస్కారము. ఏ భగవంతుని భృత్యులను స్పృశించుట వలన రేబవళ్లు ధ్యానించుట వలన పుణ్య తీర్ధములు (పుణ్యక్షేత్రములు) పవిత్రములగుచున్నవో అట్టి దేవునకు నమస్కారము.
ఇత్యేవముక్త్యా సా దేవీ జలే సన్యస్య విగ్రహం ।
మనః ప్రాణాంళ్ళ శ్రీకృష్ణే తస్థౌ స్థాణుసమా నతి ॥
రాధాకృతం హరేః స్తోత్రం త్రిసంధ్యం యః పఠేన్నరః ।
హరిభక్తిం చ దాస్యం చ లభేద్రాధాగతీం ధ్రువం॥
ఇటు స్తుతించి రాధాదేవి తన శరీరమును జలముందే ఉంచి మనః ప్రాణములను శ్రీకృష్ణుని యందే ఉంచి ఒక స్తంభము వలె (చలనము లేక) నీలిచెను (ఉండెను). రాధ పఠించిన ఈ స్తోత్రములు మూడు సంధ్యలలో పఠించు నరుడు హరిభక్తి హరిదాస్యముక్తిని రాధాగతిని పొందగలడు.
వీపత్తౌ యః పఠేద్భక్త్యా సద్యః సంపత్తమాప్నుయాత్ ।
చిరకాల గతం ద్రవ్యం హృతం సష్టం చ లభ్యతే ॥
బంధు వృద్ధిర్భవేత్తన్య ప్రసన్నం మానసం పరం ।
చింతిగ్రస్తః పఠేద్భక్త్యా పరాం నిర్వతిమాప్నుయాత్ ॥
పతిభేదే పుత్రభేదే మిత్రభేదే చ సంకటే ।
మాసం భక్త్యా యది పఠేత్సద్యః సందర్శనం లభేత్ ॥
భక్త్యా కుమారీ స్తోత్రం చ శ్రుణుయాద్వత్సరం యది।
శ్రీకృష్ణసదృశం కాంతం గుణవంతం లభేద్ధ్రువం॥
“ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే శ్రీకృష్ణజన్మఖండే రాధాకృతం శ్రీకృష్ణస్తోత్రం”
ఆపత్కాలములో భక్తితో పఠించిన వ్యక్తి వెంటనే సంపత్తిని పొందును. చాలకాలము క్రింద అపహరింపబడిన నష్టపోయిన ద్రవ్యమును వాడు పొందును. వానీకి బంధువృద్ధి అగును. మనస్సు ప్రసన్నమగును. విచారగ్రస్తుడు భక్తితో పఠించినచో గొప్ప ఆనందమును పొందును. పతి, పుత్రులు విభేదము, మిత్రులు కనిపించని సంకట దశలో ఒక మాసము భక్తితో పఠించిన యెడల వెంటనే వారి దర్శనము లభించును. కన్య ఒక సంవత్సరకాలము భక్తితో ఈ స్తోత్రమును వినినయెడల నీశ్చయముగా శ్రీకృష్ణుని వంటి గుణవంతుడైన భర్తను పొందును.
ఇది బ్రహ్మవైవర్తములో శ్రీకృష్ణ జన్మఖండములో రాధాదేవీ చేసిన శ్రీకృష్ణ స్తోత్రము సమాప్తము.
జలస్థౌ రాధికా ధ్యాత్వా శ్రీకృష్ణ చరణాంబుజం ।
స్తుత్వైవం చక్షురున్మీల్య దృష్ట్వా కృష్ణమయం జగత్ ॥
దదర్శ యమునా తీరం వస్త్ర ద్రవ్య మయం మునే ।
దృష్ట్వా తంద్రాథవా స్వప్నమితి మేనే చ రాధికా ॥
యత్రస్థానే యదోధారే యధ్రవ్యం సంస్థితం పురా ।
వసైశ్చ సహితం నర్వం తత్ర్పాపుర్గోపకన్యకాః ॥
ఆలాదుతాయ తాం సర్వాః వ్రతం కృత్వా మనీషితం ।
సంప్రాప్య చ వరం దేవ్యస్తాస్సర్వాః స్వాలయం యయుః ॥
జలములో నున్న రాధాదేవి శ్రీకృష్ణుని పాదపద్మములను స్తుతించి కన్నులు తెరచి ప్రపంచమంతటిని కృష్ణమయముగా జూచెను. ఓ నారదా! యమునా తీరమును వస్త్రములతో పూజాద్రవ్యములతో నిండిన దానినీగా చూచెను. అట్లు చూచి నిశ్చేష్టురాలై అది కల అనుకొనెను. ఏ స్థానములో దేని మీద ఏ ద్రవ్యము ముందుంచబడెనో వస్త్రములతో బాటు ఆ మొత్తమును గోపకన్యలు పొందిరి. గోపిక లందరు నీళ్లలో నుండి లేచి వచ్చి తల పెట్టిన వ్రతమును చేసి గౌరీదేవి వలన వరమును పొంది తమతమ గృహములకేగిరి.
నారద ఉవాచ - నారదుడిట్లనెను :
వ్రతస్య కిం విధానం చ కింనామ కిం ఫలం ప్రభో ।
కాని ద్రవ్యాణి దేయాని కా దేయా తత్ర దక్షిణా ॥
వ్రశాంతే కిం రహస్యం చ బభూవ సుమనోహరం ।
వ్యాసం కృత్వా మహాభాగ వద నారాయణీం కథాం ॥
ఆ వ్రతము పేరేమి? అది చేయవలసిన విధానమేమి? ప్రభూ! అది ఏమి ఫలమిచ్చును. ఆ వ్రతములో దానమొనర్పవలసిన ద్రవ్యము లేమి? ఏమి దక్షిణ (పూజచేయించిన వానికి) ఈయవలెను. గోపికలోనర్చిన ప్రతము తరువాత మనోహరమైన ఏ రహస్య సంఘటన జరిగెను? ఓ మహానుభావా! నారాయణునకు శ్రీకృష్ణునకు సంబంధించిన ఆ కథను విస్తారముగా వివరించి చెప్పుము. (ఈ ప్రశ్నను నారదుడు నారాయణ మహర్షి నడిగెను).
సూత ఉవాచ - సూతుడు (మహర్షులతో) పలికెను :
నారదన్య వచః శ్రుత్వా ప్రహస్య మునిపుంగవః ।
కథాం కథితుమారేభే కవీంద్రాణాం గురోర్గురుః ॥
నారదుని వాక్కు విని నారాయణ మహర్షి నవ్వీ కవులకు గురువులకును గురువైన ఆ మునిరాజు కథను చెప్పుటకారంభించెను.
నారాయణ ఉవాచ - నారాయణ ఋషి పల్కెను :
సర్వం వ్రత విధానం చ మత్తో వత్స నిశామయ।
ఖ్యాతం గౌరీవ్రతం నామ మాధే మాసి కృతం స్త్రీయా ॥
పుంసాం చ ధర్మకామార్థ మోక్షదం కృష్ణభక్తికం ।
దేశభేదే ప్రసిద్ధం చ వ్రతం బిర్వాపరం స్కృతం ॥
కామదం కాముకానాం చ ఫలం కొంత నిమిత్తకం ।
ఉపోష్య పూర్వదివసే వస్త్రం ప్రక్షాల్య సంయతా ॥
ప్రాతశ్చ మార్గ సంక్రాండ్యాం భక్త్యా గత్వా పరిత్తటం ।
ధృడ్వా ధోతే చ స్నాత్వా చ నానాద్రవ్యేణ కన్యకా ॥
దేవషట్కంచ సంపూజ్య కృత్వా చావాహనం ఘటే ।
గణేశం చ దినేశం చ వహ్నిం నారాయణం శివం ॥
దుర్గాం పంచోపచారైశ్చ సంపూజ్య వ్రతమారభేత్ ।
ఘటాధః పిండికాం కృత్వా చతురస్రాం నువిస్తృతాం ॥
చందనాగరు కస్తూరీ కుంకుమైశ్చ సుసంస్కృతాం ॥
నిర్మాయ వాలుకానాం చ దుర్గాం దశభుజాం పరాం ।
ధృత్వా కపోలే సిందూరం తదధశ్పందనేందుకం ॥
తాం ధ్యాత్వావాహయేద్దేవీం తతో భూత్వా పుటాంజలిః ।
ఇమం మంత్రం పఠిత్వాదౌ తతః పూజాం సమారభేత్ ॥
నాయనా! గౌరీవ్రతమన్నది స్త్రీలచేత మార్గశిరమాసమున ఆచరింపబడు ప్రసిద్ధమైన వ్రతము. ఆ వ్రతమును చేయు విధానమంతటిని నావలన వినుము. ఇది పురుషులకు చతుర్విధ పురుషార్ధములనిచ్చు కృష్ణ భక్తి ప్రధానమైన వ్రతము. ఇది వేరు వేరు ప్రాంతములందును వెనుక ముందు ఆచరించబడు ప్రసిద్ధవ్రతముగా చెప్పబడినది. కోరికలు గలవారికి కోరికలను తీర్చునది. ప్రధానముగా (కన్యలకు! భర్త సంబంధమైన ఫలమునిచ్చును. (చక్కని యోగ్యుడైన వరునీ సమకూర్చును). ముందురోజు నియమముగా (కార్తీక అమావాస్య లేదా సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించుటకు ముందురోజు) శుచియై వస్త్రములను నీళ్లలో పిండి ఆరవేసుకొని ఆ రాత్రి ఉపవాసము చేయవలెను. మార్గశీరము (ధనుస్సు) ప్రవేశించిన నాటి ప్రాతఃకాలమున భక్తితో నదీ తీరమునకేగి (నానా ద్రవ్యములు సంపాదించుకొని) కన్య స్నానము చేసి పిండి ఆరవేసిన వస్త్రములను ధరించవలెను. ఒక కలశమును వేదిక మీద స్థాపించి దానిమీద గణేశుని సూర్యుని అగ్నిని నారాయణుని శివుని దుర్గను ఆవాహసము చేసి ఇట్లు ఆ ఆరురు దేవతలను పంచోపచారములతో (ఆవాహన చేసి గంధము, పుష్పము, ధూపము, దీపము నైవేద్యము అను ఐదు ద్రవ్యములర్పించుట) పూజించి ఇక వ్రతమాచరించవలెను. కలశము దిగువభాగమున చతురస్రాకారముగా వెడల్పుగా ఇసుక తిన్నె చేసి దాని పై పది భుజములతో దుర్గాదేవి బొమ్మను నిర్మించీ చందనము అగురు కస్తూరి కుంకుమపువ్వుపొడితో చక్కగా అలంకరించి స్థాపించవలెను. ఆ దేవి నుదుట సిందూరముతో తిలకము సలంకరించి ఆ దిగువన చందనముతో చంద్రరేఖ వ్రాయవలెను. అప్పుడు చేతులు మోడ్చి దేని ఈ క్రిందిమంత్రమును పఠించుచు ధ్యానించీ ఆవాహన చేసి పూజనారంభించవలెను.
హే గౌరి శంకరార్ధాంగి యధా త్వం శంకర ప్రియే ।
తథా మాం కురు కల్యాణి కొంతకంతో నుదుర్లభాం ॥
ఇమం మంత్రం పఠిత్వా తు ధ్యాయేద్దేవీం జగత్ర్పసూర।
ధ్యానం తత్సామవేదోక్తం నిగూఢం సర్వకామదం ॥
శ్రుణు నారద వక్ష్యామి మునీంద్రాణాం చ దుర్లభం।
ధ్యాయంత్యనేన సీదోశ్చ దుర్గాం దుర్గాతినాశినీం ॥
ఓ గౌరీదేవి! శంకరుని ప్రియురాలా! శంకరుని అర్ధాంగమైన తల్లీ! నీవు భర్తకు ప్రియురాలవైనట్లు ఓ కల్యాణీ! నన్ను కూడ నీవలెనే మిక్కిలి దుర్లభమైన భర్తకు ప్రియురాలుగా చేయుము అని ఈ మంత్రము పఠించి జగన్మాతను ధ్యానించవలెను. ఓ నారదా! సామవేదోక్తమైన సర్వవాంఛలను తీర్చునట్టి రహస్యమైన ధ్యాన మంత్రమును చెప్పెదను వినుము. ఇది మునీంద్రులకు దుర్లభమైనది. సిద్ధులందరును ఈ మంత్రముతోనే మహాదుర్గములను (గొప్ప ఆపదలను) నశింపజేయు దుర్గాదేవిని ధ్యానింతురు.
శివాం శివప్రియాం శైవాం శివవక్షః స్థలస్థితాం ।
ఈషదాస్య ప్రసన్నాస్యాం సుప్రతిష్టాం సులోచనాం ॥
నవయౌవన సంపన్నాం రత్నాభరణ భూషితాం ।
రత్నకంకణకేయూర రత్న నూపుర భూషితాం ॥
రత్నకుండల యుగ్మేన గండస్థలవిరాజితాం।
మాలతీ మాల్య సంసక్త కబర భ్రమరాన్వితాం ॥
సిందూరతిలకం చారుకనూరీ బిందునో సహ ।
వహ్ని శుద్ధాంశం రత్నకిరీటాం సుమనోహరాం ॥
మణీంద్ర సార సంగక్త రత్నమాలాసముజ్వలాం ।
పారిజాత ప్రసూనానాం మాలా జాలానులంబితాం ॥
సుపీన కఠిన శ్రోటీం బిభ్రతీం చ స్తనానతాం ।
నవయావస భారౌఘాదీషన్నమ్రాం మనోహరాం ॥
బ్రహ్మాదిభిః స్తూయమానాం సూర్యకోటి సమప్రభాం ।
పక్వ బింబాధరాప్తిం చ చారు చంపక సన్నిభాం ॥
ముక్తాపంక్తి వినింద్యైక దంతరాజి విరాజితాం ।
ముక్తి కామప్రదం దేవీం శరచ్చంద్ర ముఖీం భజే ॥
‘శివా’ నామము గల శివప్రియ శివ భక్తురాలు శివుని వక్ష స్థలమందున్నదియు, చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖము గలదియు మంచి కీర్తి గలదియు మంచి నేత్రములు గలదియు నవయౌవనమను సంపద కలదియు రత్నాలకంకణములు దండకడియములు రత్నసూపురముల (పాదముల అందెలు) వంటి రత్నాభరణములతో అలంకరింపబడినదియు, చెక్కిళ్లపై ప్రకాశించు రత్నాలకుండలములు గలదియు, మాలతీ పుష్పమాలల యందు చిక్కుకొన్న తుమ్మెదల వంటి తలవెండ్రుకల కొప్పు గలదియు, సుందరమైన కస్తూరి చుక్కబొట్టుతో బాటు ఆ పైన ఎట్టిని సిందూర తిలకము ధరించినదియు, అగ్నివలె ప్రకాశించు పట్టు వస్త్రములు రత్నకిరీటముతో మిక్కిలి మనోహరముగానున్నదియు, శ్రేష్ఠమైన మణులతో కూర్చిన రత్నహారముతో వెలిగిపోవుచున్నదియు, శరీరమున వ్రేలాడుచున్న పారిజాత పుష్పమాలలు గలదియు, పుష్టిగా కఠినముగా నున్న నితంబములు గలదియు స్తనభారముచే కొద్దిగా వంగినట్లున్నదియు, నవయావన భారము చేత ఇంపుగా కొంచెము వంగినట్లున్నదియు, బ్రహ్మాదులచేత స్తుతింపబడునదియు కోటీసూర్యుల తేజస్సుగలదీయు, పండిన దొండపండు వంటి క్రింది పెదవి గలదియు, సుందరమైన సంపంగి పూలవంటి శరీరకాంతి గలదియు, ముత్యాల వరుసను క్రిందుపరచు సుందరమైన పలువరుసతో విరాజిల్లునదియు శరత్కాలచంద్రునివంటి ముఖమండలము గలదియు, కోరిన కోర్కెలను ముక్తిని ఇచ్చునదియునగు దేవినీ భజించుచున్నాను.
ధ్యాత్యైవం మస్తకే పుష్పం విన్యస్య చ ప్రతీ ముదా ।
పుష్పం గృహీత్వా భక్త్యా చ పునర్ధ్యాత్వా చ పూజయేత్ ॥
దత్వా షోడశోపచారాన్ ప్రహృష్టం తత్ర నిత్యతః ।
పూర్వోత్తేనైవ మంత్రేణ ముదా భక్త్యా ప్రతే ప్రతీ ॥
పూర్వోత్తేనైవ స్తోత్రేణ స్తుత్వా చ ప్రణమేత్తదా ।
కృత్వా ప్రణామం భక్త్యా చ సంయతః శ్రుణుయాత్ కథాం ॥
వ్రతము చేయు వ్యక్తి ఇట్లు ధ్యానించి దేవి శిరస్సు మీద పుష్పముంచి మరల నొక పుష్పము తీసుకొని భక్తితో మరల ధ్యానించి పూజించవలెను. ప్రతిదినమాప్రదేశమందే నిండు హర్షముతో షోడశోపచారములు సమర్పించి భక్తి సంతోషములతో ఈ వ్రతమందు ముందు చెప్పిన మంత్రముతో పూజ చేయవలెను. ముందు చెప్పిన స్తోత్రముతో (133 నుండి 140 వరకు గల శ్లోకములు) స్తుతించి భక్తితో నమస్కరించి శ్రద్ధగా వ్రతకథను వినవలెను.
నారద ఉవాచ - నారదుడు పలికెను :
ప్రతం వ్రత విధానం చ ఫలం చ స్తోత్రముద్బుతం ।
ఆధువా శ్రోతుమిచ్ఛామి గౌరీవ్రత కథాం శభాం ॥
వ్రతం కేన కృతం పూర్వం భూమౌ కేన ప్రకాశితం ।
ఏతత్పర్వం నువిస్తార్య వద సందేహభంజన॥
“ఓ సందేహములను నశింప్లజేయు స్వామీ! వ్రతమును దాని నాచరించు విధానమును దాని వలన లభించు ఫలమును అద్భుతమైన స్తోత్రమును వింటిని. అన్నియు అద్భుతములు. ప్రస్తుతము శభమైన గౌరీవ్రతకథను వినగోరుచున్నాను. పూర్వము దీనినెవడాచరించెను? భూలోకముననెవడు దీనిని పరిచయము చేసెను? దీనినంతయు విస్తరించి చెప్పుము”.
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :
కుశధ్వజస్య హి సుతా నామ్నా వేదవతీ సతీ ।
తయా కృతం ప్రతమిదం మహాతీర్థ చ పుష్కరే ॥
సమాప్తి దివసే సాక్షాదభూప జగదంబికా ।
యోగినీ లక్షనంయుక్తా సూర్యకోటిసమప్రభా ॥
శాతకుంభ వినిర్మాణ రథస్థా పరమేశ్వరీ ।
ఈషద్ధాస్య ప్రసన్నాస్యా తామువాచ నుసంయుతాం॥
కుశధ్వజుని యొక్క కూతురు వేదవతి యన్న పేరు గల సాధ్వీ పుష్కర క్షేత్రములో ఈ వ్రతమునాచరించెను. ప్రతసమాప్తినాడు పరమేశ్వరియైన జగదంబిక కోటి సూర్యులకాంతితో - కనకరథము పై లక్షసంఖ్యగల యోగినులతో కొలువుదీరి వేదవతికి సాక్షాత్కరించి చిరునవ్వుతో ప్రసన్నముగా ముఖముతో ప్రతనిష్ఠలో సున్న వేదవతితో ఇట్లనెను.
పార్వత్యువాచ - పార్వతీదేవి పలికెను :
హే వేదవతి భద్రం తే వరం వృణు యథేప్పితం।
తవ ప్రతేన తుషాహం తుభ్యం దాస్యామీ వాంఛితం॥
పార్వతీవచనం శ్రత్వా దృష్వా తాం హృష్టమానపొం ।
వుటాంజలి యుతా సాధ్వీ ప్రణయ్యోవాద నారద ॥
ఓ నారదా! ప్రత్యక్షమైన పార్వతీదేవి “ఓ వేదవతీ! నీకు మంగళమగు గాక. నీకిష్టమైన వరము కోరుకొనుము. నీ వ్రతము చేత నేను సంతుష్టురాలనైతిని. నీవు కోరుకున్నదీ (నీకు లభించునట్లు వరము) ఇత్తును”. హర్షించిన మనస్సుతో ఇట్లు పల్కిన పార్వతి వాక్కు విని ఆ సాధ్వి (వేదవతి) దోసిలీ జోడించి నమస్కరించి ఇట్లనెను.
వేదవత్యువాచ - వేదవతి పలికెను :
దేవి నారాయణం కాంతం మహ్యం దేహి మనీషితం ।
వరే న్యస్మిన్ స్పృహా నాస్తి దృఢం భక్తిం చ తత్సదే॥
శ్రుత్వా వేదవతీ వాక్యం ప్రహస్య జగదంబికా ।
అవరుహ్య రధాతూర్ణం తామువాచ హరిప్రియాం ॥
“దేవీ నేను మనస్సులో సంకల్పించుకొన్నట్లు శ్రీమన్నారాయణుడే నాకు కాంతుడ (ప్రియభర్త) గునట్లు వరమిమ్ము. ఆతని పాదములందు దృఢభక్తిని కూడ వరమిమ్ము. నాకు వేరొక వరుని యందు {వివాహమాడు పురుషుడు) కోరిక లేదు”. వేదవతి వాక్కును జగదంబిక మినీ నవ్వి వెంటనే రథమునుండి దిగి ఆ హరిప్రియతో (హరినే ప్రియునిగా దలచునది) నిట్లు పలికెను
పార్వత్యువాచ - పార్వతి ఇట్లనెను :
జ్ఞాతం సర్వం జగన్మాతస్త్వం చ లక్ష్మీః స్వయం సతి ।
భారతం పాదరజసా పూతం కర్తుం త్వయాగతా ॥
త్వత్పాదరజసా సాధ్వి సద్యః పూతా వసుంధరా ॥
నిఖిలాని చ తీరాని పూతాని పరమేశ్వరి ।
వ్రతం తే లోకశిక్షార్థం తపశ్చర తపస్విని ॥
నారాయణస్య కాంతా త్వం ప్రియా జన్మని జన్మని।
భారావతరణే విష్ణుర్వసుధామాగమిష్యతి ॥
రామో దాశరధిః పూర్ణః కర్తుం దస్యు విగ్రహం ।
బ్రహ్మశాపాచ చ్యుతయోర్మోక్షణాయ చ భక్షయోః ॥
అయోధ్యాయాం చ త్రేతాయామావిర్భావో హరేరపీ ।
త్వమేవ మిధిలాం గచ్ఛ విధాయ శిశు విగ్రహం॥
తా మిమాం ప్రాప్య జనకోవ్యయోనిసంభవాం సుతాం।
పాలయిష్యతి యత్నేన సీతా త్వం చ భవిష్యసి॥
గత్వా రామోలిపి మిధిలాం త్వద్వివాహం కరిష్యతి ।
నారాయణస్య కాంతా త్వం కల్చే కల్సే భవిష్యసి ॥
ఇత్యుక్త్యా తాం సమాలింగ్య పార్వతీ స్వాలయం యయౌ ।
ఓ జగన్మాతా! నీవు స్వయముగా లక్ష్మీసాధ్వివీ అని తెలిసికొంటిని, భారతవర్షమును నీ పాదధూళీతో పవిత్రము చేయుటకు నీవు వచ్చితివి. నీ పాదధూళిచేత వసుంధర (భూమి) వెంటనే పవిత్రమైనది. ఓ పరమేశ్వరీ! నీఖిల తీర్థములు పూతమైనవి. ఈ నీ వ్రతము లోకుల కిట్లు చేయవలెనని తెలియజెప్పుటకే తపమాచరించితివి. నీవు నారాయణుని ప్రియపత్నిగా జన్మజన్మకు అవతరించుచుంటివి. విష్ణువు భూభారమును తొలగించుటకు వసుధ మీదికి వచ్చును. నారాయణుడు పూర్ణరూపుడైన దశరథ రాముడై దుష్టులను అణచివేయుటకు - బ్రాహ్మణుల శాపము వలన భూమి మీద బడిన తన భక్తుల (జయవిజయులను ద్వారపాలకులను) ను శాపవిముక్తులను చేయుటకు త్రేతాయుగములో అయోధ్యలో అవతరించును. నీవును శిశురూపము ధరించీ మిథిలకు పొమ్ము. అయోని సంభవయేన (మనుష్య గర్భ సంబంధము లేకుండ జన్మించిన) నిన్ను జనకుడు బిడ్డగా పొంది శ్రద్ధతో పాలించును. నీవు సీతానామము ధరింతువు. రాముడు మిధిలను చేరి నిన్ను వివాహామాడును. ప్రతి కల్పములో నీవు నారాయణుని పత్నివగుదువు” ఇట్లు పలికి పార్వతి ఆమెను (వేదవతి)ని కౌగిలించుకొని తన స్థానమునకేగెను.
గత్వా సా మిధిలాం సాధ్వీ శిశురూపం ఏధాయ చ ॥
లాంగలస్య రేఖాయాం నుభాత్తస్థా చ మాయయా।
విలోక్య జనక స్తాం చ నగ్నాం ముద్రితలోచనాం॥
తప్త కాంచన వర్ణాం తొం రుదంతీం తేజసాన్వితాం ।
దృష్వా జార చ గృహీత్వా చ కృత్వా వక్షసి నారద ॥
గచ్ఛంతం ప్రతి తతైవ వాగ్బభూవాశరీరిణీ ।
అయోనిసంభవాం కన్యాం కమలాం గ్రహణం కురు ॥
నారాయణస్తే జామాతా భవితేత్యేవ మేవ చః ।
శ్రుత్వా తదా దేవవాణీం గృహీత్వా కన్యకామృషిః ॥
గత్వా దదౌ స్వకాంతాయై పాలనాయ ముదాన్వితః ।
సా లబ్ధయావనా ప్రాస రామం దాశరధిం సతీ ॥
ప్రతస్యాస్య ప్రభావేణ కాంతం త్రిజగతాం పతిం।
ప్రకాశితం వశిష్టేన పృధివ్యాం భక్తి భావతః॥
ఆ సాధ్వి (వేదవతి) శిశురూపము గ్రహించి మిథిలను చేరి తన మాయాశక్తితో నాగలి చాలులో (భూమిలో) నిలిచెను. జనకుడు కన్నులు మూసుకొని నగ్నరూపమున నుండి - కరిగిన బంగారు పన్నితో - గొప్ప తేజస్సుతో కూడి - ఏడ్చుచున్న ఆ శిశువును చూచి ఎత్తుకొనీ వక్షఃస్థలమున చేర్చుకొనసు, ఆ శిశువునేతుకొని ఫోవుచుండగా ఆకాశవాణి “ఓయీ! అయోనిసంభవమైన ఈ శిశువు లక్ష్మి, ఈమెను గ్రహించి పోషించుము. నారాయణుడే నీ అల్లుడగును” అని పలుకగా ఆ దేవవాణిని వినీ రాజర్షి ఆ కన్యను పాలించుట కోసము తన భార్యకొసగెను. ఆ కన్య యావనపతియై దశరథ పుత్రుడైన రాముని భర్తగా పొందెను. ఈ వ్రత ప్రభావము వలన ముల్లోకము లకు ప్రభువైన స్వామిని కాంతునిగా పొందెను. ఈ విషయమును వశిష్ఠ మహర్షి భక్తితో ఈ లోకమున ప్రకటీంచెను.
రాధా కృత్వా ప్రతమిదం శ్రీకృష్ణం ప్రాణవల్లభం ।
గోపాంగనాశ్చ ఈ ప్రావుర్ర్వతస్యాస్య ప్రభావతః॥
ఇత్యేవం కధీతో ఏప్ర కధా గౌరీవ్రతస్య చ।
భారతే చ వ్రతమిదం యా కరోతి కుమారికా ।
స్వామినం కృష్ణతుల్యం చ సా ప్రాప్నోతి న సంశయః ॥
రాధాదేవి ఈ ప్రతము చేసి తన ప్రాణవల్లభుడైన శ్రీకృష్ణుని పొందినది. గోపాంగనలు కూడ ఈ ప్రతప్రభావము వలననే శ్రీకృష్ణుని పొందగల్గిరి. నారదా! ఇట్లు గౌరీవ్రత కథ చెప్పబడినది. భారతవర్షములో ఏ కన్య ఈ వ్రతమొనర్చునో ఆమె కృష్ణునితో సమానుడైన భర్తను పొందునన్నది నిస్సంశయమైన మాట.
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ ఋషి పలికెను :
ఏవం ప్రతం చ చక్రుస్తా యావన్మాసం చ గోపీకాః ।
పూర్వస్తోత్రేణ తాం దేవీం తుష్టువుశ్చ దినే దినే ॥
సమాప్తి దివ సే గోప్యో వ్రతం కృత్వా ముదాన్వితాః ।
కణ్వ శాఖోక్త స్తోత్రేణ తుషువుః పరమేశ్వరీం ॥
యేన సోత్రేణ తాం స్తుత్వా సీతా సత్యపరాయణా ।
సద్యః సంప్రాప కాంతం చ రామం రాజీవలోచనం ॥
మాసము దినములు గోపికలు ఈ విధముగా (పైన చెప్పిన నియమము ప్రకారము) గౌరీవ్రతమాచరించి ముందు చెప్పిన స్తోత్రముతో ప్రతిదినము స్తుతించిరి. ఇట్లు సంతోషముతో గోపికలు వ్రతమొనర్చి సమాప్తి దినమునాడు కణ్వశాఖలో చెప్పబడిన ప్రకారముగా - సత్యపరాయణ యైన సీతాదేవి ఏ స్తోత్రమును స్తుతించి పద్మముల వంటిలోచనములు (కన్నులు) గల రామచంద్రుని నాధునీగా పొందినదో - అదే స్తోత్రముతో పరమేశ్వరిని స్తుతించిరి.
జానక్యువాచ - జానకి దేవి పలికెను :
శక్తిస్వరూపే సర్వేషాం సర్వాధారే గుణాశ్రయే ।
నదిశంకరయుక్తే చ పతిం దేహి నమోస్తు తే ॥
దృష్టిస్థిత్యంతరూపేణ సృష్టి స్థిత్యంతరూపిణీ ।
సృష్టిస్థిత్యంత బీజానాం బీజరూపే నమోస్తు తే ॥
మే గౌరి సతీమర్మజ్ఞే పతివ్రత పరాయణే ।
పతివ్రతే పత్రతే పతిం దేహి నమోస్తు తే ॥
సర్వమంగల మాంగల్యే సర్వమంగల సంయుతే ।
సర్వమంగల బీజే చ నమస్త సర్వమంగలే ॥
సర్వప్రియే సర్వబీజే సర్వాశుభవినాశీని ।
సర్వే సర్వజనకే నమస్తే శంకరప్రియే ॥
పరమాత్మ స్వరూ పే చ నీత్యరూ పే సనాతని ।
సాకారే చ నిరాకారే సర్వరూ పే నమోస్తు తే ॥
క్షుత ప్లేచ్ఛా దయా శ్రద్ధా నిద్రౌ తంద్రి స్మృతిః క్షమా ।
ఏతాస్తవ కలాః నర్వా నారాయణి నమోస్తు తే ॥
లజ్జా మేధా తుష్టి వష్టి శాంతి సంపత్తి వృద్ధయః ।
ఏతాస్తవ కలాః సర్వాః సర్వరూపే నమోస్తు తే ॥
దృషాదృష్ఠ స్వరూ పే చ తయోర్బీజ ఫలప్రదే ।
సర్వానిర్వచనీయే చ మహామాయే నమోస్తు తే ॥
శివే శంకర సౌభాగ్య యుక్తే సౌభాగ్యదాయిని ।
హరిం కాంతం చ సౌభాగ్యం దేహి దేవీ నమోస్తు తే ॥
అందరు జీవులకు శక్తి స్వరూపములో నుండి అందరీకాధారమైనదానా! శుభగుణములకు ఆశ్రయమైనదానా! ఎల్లప్పుడు శంకరుని కూడియుండు దానా! నాకు పతినిమ్ము, నీకు నమస్కారము. సృష్టి స్థితిలయములొనర్చునట్టి బ్రహ్మవిష్ణు రుద్ర రూపములు ధరించుదానా! సృష్టి స్థితిలయములకు మూలకారణమైన వాటికి బీజము వంటిదానా! నీకు నమస్కారము. ఓ గౌరీదేవీ! పతిరహస్యమెరిగిన దానా! పతిని ప్రతనిష్ఠతో భజించుటయందాసక్తి గలదానా! ఓ పతివ్రత! పతీయందు దృఢసక్తి గలదానా! నీకు నమస్సులు. నాకు పతినిమ్ము, జీవుల సర్వమంగళములకు బీజభూతురాలా! ఓ సర్వమంగళా! నీకు నమస్కారము, సర్వప్రాణులకు ప్రియమైనదానా! సర్వమంగళ గుణములు. గలదానా! లోకమున సర్వమంగళముల చేత మంగళ భూతురాలా! ఓ సర్వమంగళా! నీకు నమస్కారము. సర్వప్రాణులకు ప్రియమైనదానా! సర్వ శక్తులకు బీజమైనదానా! సర్వవిధములైన అశుభములను నశింపజేయుదానా! సర్వమునకు ఈశ్వరీ! సర్వమును సృష్టించుదానా! ఓ సనాతనీ! నిత్యరూపిణీ! సాకార నీరాకార రూపములన్నియు నీవే ఐనదానా! నీకు నమస్కారము. ఓ నారాయణీ! ఆకలి దప్పి కోరిక దయ శ్రద్ధ నిద్ర సోమరితనము స్మృతి (జ్ఞాపకశక్తి) క్షమ ఇవి యన్నియు నీ ఆంశలే. నీకు నమస్కారము. లజ్ఞ మేధ తుష్టి పుష్టులు (మనస్తృప్తి శరీరపుష్టి) శాంతి సంపద అభివృద్ధి ఇవి యన్నియు నీ కళలే. సర్వరూపిణీ! నీకు నమస్కారము. కన్నులకు కన్పించునట్టి మరియు కన్పించనట్టి స్వరూపములు గలదానా! ఆ రెండు రకముల స్వరూపములకు బీజమును ఫలమును ఇచ్చుదానా! సర్వవిధముల నిర్వచింపరానీ మహామాయా! నీకు నమసామ్రు. ఓ శీవా! శంకరుడన్న సౌభాగ్యము గలదానా! సౌభాగ్యము (ముత్తైదువు తనము) నీచ్చుదానా! నాకు సౌభాగ్యమును మరియు శ్రీహరిని భర్తగాను ప్రసాదించుము. నీకు నమస్కారము.
స్తోత్రేణానేన యాం స్తుత్వో సమాప్తీ దివసే శీవాం ।
సమంతి పరయా భక్త్యా తా లభంతే హరిం పతిం ॥
ఇహ కాంతసుఖం భుక్త్యా పతిం ప్రావ్య పరాత్పరం ।
దీప్యం స్యందనమారుహ్య యాంత్యతే కృష్ణసన్నిధిం ॥
ఇతిశ్రీ బ్రహ్మవైవర్తే సీతాకృతం పార్వతీస్తోత్రం ॥
ఈ స్తోత్రముతో పార్వతీదేవిని ప్రత సమాప్తి దినమునందు ఏ స్త్రీలు (కన్యలు) స్తుతించి గొప్ప భక్తితో నమస్కరింతురో వారు శ్రీహరినే భర్తగా పొంది ఇహలోకమున ప్రియమైన పతిసుఖముననుభవించి పరములో దివ్యరథమునెక్కి శ్రీకృష్ణ సన్నిధికి ఏగుదురు. ఇది సీతాదేవి స్తుతించిన పార్వతీదేవి స్తోత్రము.
సమాప్తి దివసే రాధా గోపీఖీః సహ సంయుతా ।
దేవీం ప్రణమ్య శ్రుత్వా చ వ్రతం పూర్ణం చకార హ ॥
గో సహస్రం బ్రాహ్మణేభ్యః సువర్ణ శతకం ముదా ।
విప్రాయ దక్షిణాం దత్వా స్వగృహం గంతుముద్యతా ॥
బ్రాహ్మణానాం సహస్రం చ భోజయామాస సాదరం ।
వాద్యాని వాదయామాస భిక్షుకాయ ధనం దదౌ ॥
ప్రతసమాప్తి దినమునాడు గోపికలతో కలిసి రాధాదేవి గౌరీదేవిని స్తుతించి నమస్కరించి ప్రతము సంపూర్ణమొనర్చెను. బ్రాహ్మణులకు వేయి గోదానములు చేసి ప్రతము చేయించిన పురోహిత బ్రాహ్మణునకు నూరు బంగారు నాణెములను దక్షిణగా ఇచ్చెను. ఆదరముతో వేయి మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టి భిక్షుకులకు ధనము దానమొనర్చి మంగళకరముగా అనేక వాద్యములను మ్రోగింపజేసెను. తరువాత స్వగృహమునకు ప్రయాణమయ్యెను.
ఏతస్మిన్నంతరే తత్ర దుర్గా దుర్గాతీనాశినీ ।
ఆవిర్బభూవ గగనాజ్వలంతీ బ్రహ్మతేజసా ॥
ఈషదాస్య ప్రసన్నాస్యా యోగినీ శతనంయుతా ।
సింహస్థా చ దశభుజా రత్నాలంకార భూషితా ॥
శాతకుంభమయాద్గీవ్యాద్రత్న సారపరిచ్ఛదాత్ ।
ఆవరుహ్య రథాతూర్ణమాలింగ్యోరసి రాధీకాం॥
దృష్ట్వా గోపాంగనా దేవీం ప్రముశ్చ ముదాన్వితాం ।
ఆశిషం యుయుజే దుర్గా వాంఛా సిద్ధిర్భవిష్యతీ॥
గోపికాభ్యో వరం దత్యా తాః సంభాష్య చ సాదరం ।
ఉవాచ రాధికాం దుర్గా స్మేరానన సరోరుహా ॥
ఇంతలోనే ఆపదలను నశింపజేయు దుర్గాదేవి బ్రహ్మతేజస్సుతో వెలుగుచు ఆకాశము నుండి ఆ ప్రదేశమునకు దిగివచ్చెను. ఆమె వంద యోగినులతో గూడి రథము పై సింహమునందు గూర్చుండి యుండెను. చిరునవ్వుతో ప్రసన్నమైన ముఖము పదిహస్తములు గల ఆ దేవీ రత్నాలంకార భూషితురాలై యుండెను. శ్రేష్ఠమైన రత్నముల చేత అలంకరింపబడిన బంగారు రధము నుండి ఆమె దిగి వచ్చి రాధికాదేవిని వక్షస్థలమునకాలింగనము చేసికొనెను. ఆ దేవిని దర్శించి ముదముతో గోపికా కన్యలందరు నమస్కరింపగా “మీ వాంఛలు సిద్ధించును” అని దుర్గాదేవి వారినాశీర్వదించెను. ఇట్లు వారికి వరము లిచ్చి ఆదరముగా పల్కరించి ముఖపద్మమున చిరునవ్వు వెలుగుచుండగా రాధాదేవితో ఇట్లు పలికెను.
పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను :
రాధే సర్వేశ్వర ప్రాణాదధికే జగదంబికే ।
వ్రతం తే లోక శిక్షార్థం మాయామానుషరూపిణి ॥
గోలోకనాథం గోలోకం శ్రీశైలం గిరిజాతటం ।
శ్రీరాసమండలం దివ్యం బృందావన మనోహరం ॥
చరితం రతీచోరస్య స్త్రీణాం మానసహారకం ।
విదుషః కామశాస్త్రాణాం కింస్విత్స్మరసి నుందరి॥
శ్రీకృష్ణార్ధాంగ సంభూతా కృష్ణ తుల్యా చ తేజసా।
తవాంశ కలయా దేవ్యః కథం త్వం మానుషి సతీ ॥
భవతీ చ హరేః ప్రాణా భవత్యాశ్చ హరిః స్వయం ।
వేదే నాస్తి ద్వయోర్భేదః కథం త్వం మానుషి సతీ॥
కృష్ణాజ్ఞయా చ త్వం దేవి గోపీరూపం విధాయ చ।
ఆగతా నీ మహం శాంతే కఠం త్వం మానుషి సతీ ॥
షష్టి వర్ష సహస్రాణి బ్రహ్మా తవ్వి తపః పురా।
న తే దదర్శ పాదాబ్దం కథం త్వం మానుషీ సతీ॥
సుయజ్ఞో హి నృపశ్రేష్టో మసువంశ నముద్భవః ।
త్వతో జగామ గోలోకం కథం త్వం మానుషీ సతీ ॥
తీసృప్తకృత్వో నీర్భూపాం చకార పృథివీం భృగుః।
తవ మంత్రేణ కవచాత్ కథం త్వం మానుషి సతీ ॥
శంకరాత్రాప్య త్వన్మంత్రం సిద్ధం కృత్వా చ పుష్కరే ।
జఘాన కార్తవీర్యం చ కథం త్వం మానుషీ సతీ ॥
బభంజ దర్బాద్ధంతం చ గణేశస్య మహాత్మనః ।
త్వతో నామ భయం చక్రే కథం త్వం మానుషి సతీ ॥
మయ్యుద్ధతాయాం కో పేన భస్మసాత్కర్తుమీశ్వరః ।
రరక్షాగత్య మత్రీత్యా కథం త్వం మానుషీ సతీ ॥
రాధా! సర్వేశ్వరునికి ప్రాణముల కంటే అధికముగా ప్రియమైన జగదంబా! కపటముగా మనుష్యరూపము ధరించిన దానా! నీ ప్రతము. ఇట్లు చేయవలెనని లోకులకు నేర్పుటకే (వీవీ వ్రతమాచరించితివి.) గోలోకమును, ఆ గోలోకనాథుని, మీరుభయులు విహరించు శ్రీశైలమును, గిరిజా (నది) తటమును, మనోహరమైన బృందావనములోని దివ్యరాసముండలమును, కామ శాస్త్రపండితును స్త్రీల మానసము హరించువాడును ఐన ఆ రతీచోరుని {కృష్ణుని) చరిత్రను, స్మరించుచున్నావా (జ్ఞాపకము చేసికొనుచున్నావా!) సుందరీ! నీవు శ్రీకృష్ణుని అర్ధాంగము నుండి సంభవించినదానవు. తేజస్సులో కృష్ణునితో సమానురాలవు. దేవ స్త్రీలందరు నీ అంశలో కళామాత్రలు (16వ భాగము) ఇక నీవెట్లు మనుష్య స్త్రీవైతివి? నీవా హరికి ప్రాణము. నీకు హరి ప్రాణము. వేదమందు మీ ఉభయులకు భేదములేదని చెప్పబడినది. ఇక నీవెట్లు మనుష్య స్త్రీవి? బ్రహ్మపూర్వమరువది వేలేండ్లు తపస్సు చేసి కూడ నీ పాదపద్మమును దర్శింపలేకపోయెను నీవెట్లు మనుష్య స్త్రీవి? ఓ దేవీ! నీవు కృష్ణుని {గోలోకనాథుడు) ఆజ్ఞవలన గోపీరూపము కూర్చుకొని భూమి మీదికి వచ్చిన శాంతమూర్తివి నీవెట్లు మనుష్య స్త్రీవి? నీ మనువంశమున బుట్టిన సుయజ్ఞుడన్నరాజు నీ కృప వలన గోలోకమును పొందెను. నీవెట్లు మనుష్య స్త్రీవి? భృగురాముడు ఇరువది యొక్క మార్లు భూమిని రాజులు లేనిదానిగా రాజులను సంహరించి) నీమంత్ర, కవచ ప్రభావము చేతనే చేయగలెను. ఇక నీవెట్లు మనుష్య స్త్రీవి? నీ మంత్రమునతడు శంకరునీ ఉపదేశము వలన పుష్కర క్షేత్రములో జపించి సిద్ధిపొంది కార్తవీర్యార్జునుని సంహరించెను. అట్టి మహిమ గల నీవెట్లు మనుష్య స్త్రీవి? అతడే గర్వముతో మహానుభావుడైన గణేశుని దంతమును విరిచి నీకు భయపడెను. నీవెట్లు మనుష్య స్త్రీవి? నేను తీవ్రకోపముతో అతనిని భస్మము జేయబూనగా ఈశ్వరుడు వెంటనే వచ్చి రక్షించెను. అట్లు రక్షించుటకును నేనంగీకరించితని (నీమీది గౌరవముతో) అట్టి మహిమలు గల నీవెట్లు మనుష్య స్త్రీవగుదువు ?
కల్పేకల్పే తన పతిః కృష్ణో జన్మజన్మవి ।
వ్రతం లోక హితార్థాయ జగన్మాత స్వయాకృతం॥
అహో శ్రీదామ శా పేన భారావతరణేన చ ।
భూమౌ తవాధిష్టానం చ కథం త్వం మానుషీ సతీ ॥
అయోని సంభవా త్వం చ జన్మమృత్యుజరాపహా ।
కలావతీ నుతా పుణ్యా కథం త్వం మానుషీ సతీ ॥
త్రిష మా సేష్వతీతేషు మధుమా సే మనోహరే।
నిర్ణనే నిర్మలే రాత్రా నుయోధ్యే రాసమండలే ॥
సర్వాభర్గోపికాభిశ్చ సార్థం బృందావనే వనే ।
పారేణ హరిణాపార్ధం క్రీడా తే భవితా సతీ॥
వీధాత్రో లిఖితో క్రీడా కల్పేకల్పే మహీతలే ।
తవ శ్రీహరిణా సార్ధం కేన రాధే నివార్యతే ॥
యథాసౌభాగ్య యుక్తాహం హరన్య శ్రీహరిప్రియే ।
తథా సౌభాగ్యయుక్తా త్వం భవకృష్ణస్య సుందరి ॥
యథా క్షీరేపు ధావళ్యం యథా వహ్నా చ దాకా ।
భువి గంధో జలే శైత్యం తథా కృష్ణే స్థితిస్తవ ॥
దైవీ వా మానుషీ వాపీ గాంధర్వీ రాక్షసీ తథా ।
త్వతః వరా చ సౌభాగ్యా న భూతా న భవిష్యతి ॥
ఓ జగన్మాతా! ప్రతికల్పములోను నీ జన్మజన్మకు కృష్ణుడే నీ పతి. కేవలము లోకహితము కొరకే ఈ వ్రతము చేసితివి. గోలోకములో శ్రీరాముని శాపకారణముగా భూభారము తోలగించుట కొరకు భూమి పై నీకు ఉనికి ఏర్పడినది. ఇక నీవు మనుష్య స్త్రీవెట్లు ? నీవు ఇతరుల జన్మమృత్యువులను ముసలితనమును తొలగించి ముక్తినిచ్చుదానవు. కళావతి సుతవైనను పుణ్యమూర్తివి, అయోనిసంభవవు. ఇక ఎట్లు మనుష్య స్త్రీవి? ఇప్పటి నుండి మూడు మాసములు గడచిన తరువాత మనోహరమైన వసంత చైత్రమాసములో నిర్జన ప్రదేశములో నిర్మలమైన (వెన్నెల కాంతిగల} రాత్రియందు యోగ్యమైన రాసముండలములో బృందావనములో మొత్తము గోపికలతో బాటు హరముగా నీకు శ్రీహరితో క్రీడ ప్రవర్తిల్లగలదు. ఈ భూమి మీద ప్రతికల్పములో శ్రీహరితో నీకు విహారక్రీడను విధాత లిఖించేను, దానినెవడు నివారించగలడు. శ్రీహరిప్రియా! నేను శంకరుని యొక్క దాంపత్యఋతో ఎట్లు సౌభాగ్యవతినో నీవల్లే కృష్ణుని దాంపత్యముతో సౌభాగ్యవతీవగుము. పాలలో తెల్లదనము, అగ్నియందు వేడి, భూమియందు గంధము నీటియందు చల్లదనము ఎట్లు స్థిరమో కృష్ణుని యందు నీ ఉనికి అట్టే స్థిరము, దేవ గంధర్వ మనుష్య రాక్షస స్త్రీలలో ఏ ఒక్కతే కూడ నీకంటె సౌభాగ్యవతి ఇంతకు ముందు లేదు. ఇకముందుండబోదు.
వరాత్సరో గుణాతీతో బ్రహ్మాదీనాం చ వందితః।
స్వయం కృష్ణస్తవాధీనో మద్వరేణ భవిష్యతి॥
బ్రహ్మానంత శివారాధ్యో భవితో త్వద్వశః సతి ।
ధ్యానసాధ్య దురారాధ్యః సర్వేషామపి యోగినాం ॥
త్వం చ భాగ్యవతీ రాధే స్త్రీ జాతిను న తే పరా ।
కృత్తేన సార్ధం పశ్చాత్త్వం గోలోకం చ గమిష్యసి ॥
ఇత్యుక్త్వా పార్వతీ నద్యస్తతైవాంతర్గధే మునే ।
సార్థం గోపాలికాభిశ్చ రాధికా గంతుముద్యతా ॥
త్రిగుణాతీతుడు బ్రహ్మాదుల చేత నమస్కరింపబడువాడు పరాత్పరుడు ఐన శ్రీకృష్ణుడు నా వరము వలన తానే స్వయముగా నీకధీనుడగును. ధ్యానము చేత సాధింపరానీ వాడును ఆరాధించుటకు కష్టసాధ్యుడును (సర్వయోగులకు), బ్రహ్మ, అనంత, శీవులచేత ఆరాధింపబడువాడును అగు హరి నీవశమగును. రాధా! నీవు మిక్కిలి భాగ్యవంతురాలివి. స్త్రీ జాతీలో నీకంటే శ్రేష్ఠురాలు లేదు. ఈ జన్మ తరువాత శ్రీకృష్ణునితో బాటు నీవు గోలోకమునకు పోగలవు. ఇట్లు పలికి పార్వతీదేవి వెంటనే అక్కడ అంతర్ధానమయ్యెను. రాధాదేవి గోపికలతో బాటు గృహమునకేగ పూనుకొనెను.
ఏతస్మిన్నంతరే కృష్ణా జగామ రాధికాపురం ।
రాధా దదర్శ శ్రీకృష్ణం కిశోరశ్యామసుందరం॥
పీతవస్త్ర పరీధానం నానాలంకార భూషితం ।
ఆజామ మాలతీమాలా వనమాలా విభూషితం ॥
ఈషద్దాన్య ప్రసన్నాస్యం భక్తానుగ్రహఠాతరం।
చందనో క్షిత సర్వాంగం శరత్నంకజ లోచనం॥
శరత్పార్వణ చంద్రోస్యం సద్రత్న ముకుటోజ్జ్వలం।
పక్వదాడిమ బీజాభ దశనం సుమనోహరం॥
వినోదమురలీ హస్తన్యస్త లీలా సరోరుహం ।
కోటి కందర్ప లావణ్యం లీలాధామ మనోహరం ॥
గుణాతీతం స్తూయమానం బ్రహ్మానంత శివాచీభిః।
బ్రహ్మ స్వరూపం బ్రహ్మణ్యం శ్రుతిభిశ్చావిరూపితం ॥
ఆవ్యక్తసక్షరాస్యక్షం జ్యోతీరూపం సనాతనం ।
మాంగల్యం మంగలాధారం మండలం మంగల ప్రదం ॥
ఇంతలో రాధాదేవి ముందుకు శ్రీకృష్ణుడు విచ్చేసెను (ప్రత్యక్షమయ్యెను) అతడు బాలరూపము లోనున్న శ్యామసుందరమైన మూర్తి, ఆ వర్ణమునకు తగినట్లు పసుపుపచ్చ వస్త్రమును ధరించి నానావీధ భూషణములలంకరించుకొని యుండెను. మోకాళ్ల వరకున్న మాలతీ పుష్పమాలను “వనమాల” యను దానిని ధరించి ఉండెను. సర్వాంగమున చందనము పులుముకొనీ శరత్కాల పద్మములవంటి లోచనములతో (కన్నులు} మందహాసము (చిరునవ్వు)తో ప్రసన్నముగా నున్న ముఖముతో భక్తుల ననుగ్రహించవలెనన్న తొందరతో శరదృతువులోని పున్నమి నాటి చంద్రుని వంటి ముఖమండలము పైన రత్న కిరీటకాంతితో అతడు ప్రకాశించుచుండెను. పండిన దానిమ్మ పండులోని విత్తులవంటి వన్నె గల పలువరుసతో మిక్కిలి మనోహరముగా నుండెను. వినోదముగా మురళిని, విలాసముగా పద్మమును హస్తములందు ధరించి యుండెను. కోటి మన్మధుల లావణ్యము (శరీరమందలి తళుకు) గలిగి మనోహరమైన లీలలకు నివాసస్థానమైన ఆ స్వామిని రాధాదేవి దర్శించెను. (ఇంతవరకు కన్నులకు ప్రత్యక్షమైన ఆకారము వర్ణించబడినది. ఇక పరమాత్మ యొక్క మహిమ వర్ణించబడుచున్నది) ఆ స్వామి త్రిగుణములకతీతుడు. బ్రహ్మ అనంతుడు శివుడు మొదలగు మహాజ్ఞానుల చేత సుతింపబడువాడు. దృశ్యాదృశ్యమైన సర్వ ప్రపంచము తన స్వరూపమైనవాడు, వేదములచేత గూడ ఇట్లని నిరూపింప బడజాలని బ్రహ్మణ్య మూర్తి. నామరూపముల చేత వ్యక్తము కానివాడు. అక్షర (నాశములేని) మైన అవ్యక్త స్వరూపుడు. సనాతనుడైన జ్యోతిరూపుడు. మంగళములకు కారణమైనవాడు. ఆధారమైనవాడు. మంగళప్రదుడైన “మంగళ” నోముడు.
దృష్ట్వా తదద్భుతం రూపం సంభ్రమాత్రణనామ తం ।
తం దృష్ట్వా మూర్ఛితా రాధా కామ బాణ ప్రపీడితా ॥
దర్శం దర్శం ముఖాంభోజం సస్మితా వక్రలోచనా ।
ముఖస్యాచ్చాదనం చక్రే ప్రీడయా చ పునః పునః ॥
దృష్వా హరిస్తామువాచ ప్రసన్న వదనేక్షణః ।
గోపాలికా సమూహానాం నర్వేషాం పురతః స్థితః ॥
ఆ అద్భుతమైన రూపమును చూచి సంభ్రమము (భయము త్వర ఆదరము గల మానసిక స్థితి)తో అతనికి నమస్కరించి రాధాదేవి అతని సౌందర్యము వలన మన్మధబాణముల చేత పీడితురాలై మూర్ఛిల్లెను. ఓరచూపులతో అతని ముఖపద్మమును మరల మరల చూచి చూచి చిరునవ్వు, సిగ్గులతో ముఖమును (వస్త్రముతో) కప్పుకొనెను. గోపికాగణము ముందు నిలిచిన శ్రీహరి ప్రసన్నమైన ముఖము చూపులతో చూచి రాధతో ఇట్లనెను.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లనెను :
ప్రాణాధికే రాధికే త్వం వరం వృణు మనీషితం ।
భోబో గోపాలీకాస్సర్వా పరం వృణుత వాంఛితం॥
కృష్ణస్య వచనం శ్రుత్వా వరం వవ్రే చ రాధికా ।
గోపాలికాః ప్రహృష్టాశ్చ సర్వసంకల్ప పాదపాతి॥
నాప్రాణములకంటే అధిక ప్రియమైన రాధా! కోరుకున్న వరముగిడుగుము. ఓ గోపికలారా! మీరందరును కోరిన వరము నడుగుడు (ఇచ్చెదను) కృష్ణుని మాట విని రాధాదేవియు, మిక్కిలి సంతసించిన గోపికలును సర్వవిధముల కోరికలు తీర్చు ఆ కల్పవృక్ష స్వరూపునీ నుంది. ఇది కాపలెనని వరమును వరించిరి (కోరిరి).
రాధికోవాచ - రాధాదేవి ఇట్లనెను :
త్వత్పాదాబ్జే మన్మనోలిః సతతం భ్రమతు ప్రభో।
పాతుం భక్తిరసం పద్మే మధుపశ్చ యధా మధు ॥
మదీయ ప్రాణనాధస్వం భవ జన్మనీ జన్మనీ ।
త్వదీయ చరణాంభోజే దేహి భక్తిం నుదుర్లభాం ॥
తవ స్మృతా గుణే చిత్తం స్వప్నే జ్ఞానే దివానీశం।
భవేన్నిమగ్నం సతతమేతస్మమ మనీషితం ॥
“ప్రభూ! నీ పాదపద్మమునందు నా మనసును తుమ్మెద ఎప్పుడును తిరుగుచుండును గాక. పద్మమందలి తేనెను త్రాగు తుమ్మెదవలె అది భక్తిరసమును పానము చేయు గాక. నాకు జన్మజన్మకు నీవే ప్రాణనాధుడవు కమ్ము, మిక్కిలి దుర్లభమైన నీ పాద పద్మభక్తినీ నాకిమ్ము. స్వప్నములో మెలకువలో రాత్రింబగళ్లు నా మనస్సు నీ స్మృతియందు నీ కల్యాణ గుణముల యందు ఎల్లప్పుడు నిమగ్నమై ఉండుగాక. ఇదియే నేను తలచుకొన్న కోరిక”.
గోపాలికా ఊచుః - గోపాలికటట్లు పలికిరి :
యథా రాధాం తథా నశ్చ ప్రాణబంధో దివానీశం।
భవిష్యసి ప్రాణనాథః పాస్యసి ప్రతిజన్మనీ ॥
ఓ ప్రాణబంధూ! ప్రతిజన్మయందును రాధాదేవిని వలనే మమ్ము గూడ రేబవళ్ళ కాపాడుము, ప్రాణనాధుడవగుము.
ఆసాం చ వచనం శ్రుత్వా తథా స్వైవమువాచ హ ।
ప్రసన్నవదనః శ్రీమాన్ యశోదానందవర్ధనః ॥
క్రీడాపద్మం రాధికాయై నహస్రదల సంయుతం ।
లలితాం మాలతీమాలాం దదౌ ప్రీత్యా జగత్పతిః ॥
మాలా సమూహం పుష్పాణి గోపిభ్యో గోపికా పతీ ।
ప్రహస్య పరమ ప్రీత్య ప్రదదావిత్యువాచ హ॥
ప్రసన్నమైన పదసము గలవాడును యశోద ఆనందమును వృద్ధిపొందించు వాడునగు హరి వారి వాక్కులు విని తథాస్తు (అట్లే అగుగాక) అని పలికీ రాధాదేవికీ సహస్ర దళములు గల తన విలాన పద్మమును, సుందరమైన మాలతీ మాలను ప్రీతితో నిచ్చెను. ఆ గోపికాపతి గోపికలకును పరమ ప్రీతితో పుష్పగుచ్ఛములను పూలమాలలను ఇచ్చి నవ్వి ఇట్లు పలికెను.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లనెను :
త్రి సు మాసేవ్వతీతేషు యూయం క్రీడాం మయా సహ ।
రాసముండల రమ్యే చ బృందారణ్యే కరిష్యధ ॥
యథా హం చ తథా యూయం వాహంఖేదం శ్రుతౌ శ్రుతః ।
ప్రాణోహం చైవ యుష్మాకం యూయం ప్రాణా మన ప్రభోః ॥
ప్రతం వో లోకరక్షార్థం న హి స్వార్థమిదం ప్రియాః ।
సహాగ తాశ్చ గోలోకాధమనం చ మయా సహ ॥
గచ్ఛత స్వాలయం శీఘ్రం వోహం జన్మని జన్మనీ।
ప్రాణేభ్యో పి గరీయస్యో యూయం మే నాత్రసంశయః ॥
ఇత్యుక్త్వా శ్రీహరిస్తత్ర తస్థా సూర్య సుతాతటే ।
త స్థుర్గోపాలికాస్పర్వా వీక్ష్య కృష్ణం పునః పునః॥
సర్వాః ప్రహృష్ణ వదనాః సస్మితా వక్రలోచనాః।
ప్రీత్యా చక్షుశ్చకోరాభ్యాం ముఖచంద్రం పపు ర్హ రే॥
మూడు మాసములు గడచిన తర్వాత బృందారణ్యములోని సుందరమైన రాసమండలములో మీరు నాతో విహార క్రీడ లాడగలరు. నేనెట్లో మీరును నాకట్లే, నేను మీ ప్రాణమును. ప్రభువైన నాకును మీరు ప్రాణములే. వేదమందు మనమధ్య భేదము వినిపించదు. ఓ ప్రియకన్యలారా! మీరాచరించిన ఈ వ్రతము లోకమునకు తెలిపి వారిని రక్షించుటకే కాని మీ స్వార్థమునకు కాదు. నాతో పాటే మీరును గోలోకము నుండి భూమి మీదికి వచ్చితిరి. మరల నాతో కలిసియే మీరక్కడికి పోవుట సంభవించును. జన్మజన్మకు మీరు నాకు ప్రాణములకంటే అధికమైన వారనుటలో సందేహము లేను. ఇక మీరు శీఘ్రముగా మీయిండ్లకు పొండు. ఇట్లు పలికి శ్రీహరి యమునా నదీ తటమున నీలిచెను. ఆ గోపికలందరును శ్రీకృష్ణుని మరల మరల చూచుచు నిలిచిరి. అందరు మిక్కిలి హర్షమును ప్రకటించు ముఖములతో చిరునవ్వుతో ప్రక్క చూపులతో శ్రీకృష్ణుని ముఖచంద్రుని తమ కన్నులనెడు చకోర పక్షులతో ప్రీతిగా పానము చేసిరి. (తృప్తిగా ఆసక్తిగా చూచిరి).
తాః శీఘ్రం ప్రయయుర్గేహం జయం దత్త్వా పునః పునః ।
హరిశ్చ శిశుభిః పార్థం ప్రసన్నః ప్వాలయం యయౌ ॥
ఇత్యేవం కథితం సర్వం హరేశ్చరిత మంగలం ।
గోపీనాం వస్త్ర హరణం సర్వలోక సుఖావహం ॥
శ్రీకృష్ణునికీ జయమంగళములు మాటి మాటికీ పలుకుచు గోపికలు శీఘ్రముగా తమ గృహములకెగిరి. శ్రీకృష్ణుడును ప్రసన్నుడై గోపాల బాలురతో బాటు తన గృహమునకేగెను. ఈ విధముగా సర్వజీవులకు సుఖము గూర్చునట్టి గోపికా వస్త్రాపహరణమనెడి శ్రీకృష్ణుని మంగళ చరిత్ర మొత్తము చెప్పబడినది.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే గోపికా వస్త్రాపహరణ ప్రస్తావో నామ సప్తవింశోధ్యాయః॥
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన గోపికావస్త్రాపహరణ ప్రస్తావన అను ఇరువది ఏడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 27 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
When the cowherds of Vraja prepared for their annual grand sacrifice to Lord Indra, young Kṛshṇa convinced them to worship Govardhana Hill and the cows instead, since the mountain provided nourishing pastures and rain clouds. Furious at being denied his sacrificial share, Lord Indra unleashed torrential thunderstorms, lightning, and devastating hailstorms upon Vṛndāvana to submerge the settlement. To protect His devotees, Lord Kṛshṇa effortlessly uprooted the massive Govardhana Hill with the little finger of His left hand, holding it aloft for seven days and nights like an umbrella while all the residents of Vraja gathered safely beneath its shade.