నారద ఉవాచ :
సంస్థావ్య గోకులే కృష్ణం యశోదామందిరే వసుః ।
జగామ స్వగృహం నందః కిం చకార మహాప్రభుః ॥
కించకార హరిస్తత్ర కతివర్షస్థితిః ప్రభో।
బాలక్రీడనకం తన్య వర్ణయ క్రమశో మునే ॥
పురా కృతా యా ప్రతిజ్ఞ గోలోకే రాధయా సహా ।
తత్కృతం కేన విధినా ప్రతిజ్ఞా పాలనం హరేః ॥
కీదృక్ బృందావనం నామ మండలం కి విధం వద ।
రాసక్రీడాం జలక్రీడాం సంవ్యస్య వర్ణయ ప్రభో ॥
నందస్తపః కించకార యశోదా చాథ రోహిణీ ।
హరేః పూర్వం చ హలిన: కుత్ర జన్మ బభూవ హా ॥
పీయూష ఖండమాఖ్యానమపూర్వం శ్రీహరేః స్మృతం ।
విశేషతః కవిముఖాన్నివ్యం నూనం పదే పదే ॥
స్వరాసమండల క్రీడాం వర్ణయ స్వయమేవ చ ।
పరోక్ష వర్ణనాత్కావ్యం ప్రశస్తం నవ్య వర్ణనం ॥
శ్రీకృష్ణాంశో భవాన్ సాక్షాద్యోగీంద్రాణాం గురోర్గురు:।
యో యస్యాంశః స చ జనస్తస్యైవ సుఖీతః సుఖీ ॥
త్వయైవ వర్ణితౌ పాదౌ విలీనౌ తు యువాం హరేః ।
సాక్షాధ్గోలోక నాథాంశ స్త్యమేవ తత్సమో మహాన్ ॥
గోకులములో యశోదమందిరమున శ్రీకృష్ణునుంచి వసుదేవుడు తన గృహమునకేగెను. తరువాత నందుడేమీ చేసెను?
మహాప్రభువగు శ్రీహరి అక్కడ ఏమి చేసెను? ఆ ప్రభువచ్చట ఎన్ని సంవత్సరములుండెను? ఓ నారాయణమునీ! క్రమముగా నతని బాలక్రీడలను వర్ణించుము. పూర్వము గోలోకములో రాధతో చేసిన ప్రతిజ్ఞను ఏ విధముగా శ్రీహరి నెరవేర్చెను? బృందావనమనగా సెట్టిది? మండలమే విధమైనది? స్వామీ! రాసక్రీడను, జలక్రీడను చక్కగా వర్ణించి చెప్పుము. నందుడు యశోద రోహిణి ఏమి తపస్సు చేసిరి? శ్రీకృష్ణుని కన్న ముందు బలరాముడెక్కడ జన్మించెను? శ్రీహరి యొక్క ఆభ్యాసము (సమకాలము వాడు చూచి చెప్పిన సత్యకథ) అమృత ఖండము వంటిది. అపూర్వమైనది. విశేషించి కవి ముఖము నుండి క్రొత్త క్రొత్తగా వెడలిన ప్రతిపదము కలది. పరోక్ష వర్ణన వలన క్రొత్త వర్ణనలు గల కావ్యముత్తమమైనది. నీవు నేరుగా శ్రీకృష్ణాంశగలవాడవు. యోగీంద్రులలో గురువునకు గురువువు. కావున నీ రాసమండల క్రీడను స్వయముగా వర్ణించి చెప్పుము. ఏ వ్యక్తి ఎవని అంశమో వాడు ఆ మూలవ్యక్తి సుఖమును బట్టి సుఖము గలవాడగును. శ్రీహరి పాదములు నీచేతనే వర్ణింపబడినవి. మీరిద్దరు (నరనారాయణులు హరితో కలిసిన భాగములు నీవు నేరుగా గోలోకనాథుని అంశమువు. అతనితో సమమైన గొప్పదనముగలవాడవు.
నారాయణ ఉవాచ :
బ్రహ్మేశ శేష విఘ్నేశా: కూర్మో ధర్మోఽహ మేవచ ।
నరశ్చ కార్తికేయుశ్చ శ్రీకృష్ణాంశా వయం నవ ॥
అహో గోలోకనాధస్య మహిమా కేన వర్జ్యతే।
యం స్వయం న విజానీమో న వేదాః కిం విపశ్పితః ॥
సూకరో వామనః కల్కిర్భౌద్ధ; కపిల మీనకౌ ।
ఏతే చాంశా: కలాశ్చాన్యే సంజ్యేవ కథితా మునే ॥
నారాయణముని ఇట్లు పలికెను :
ఓ నారదమునీ! బ్రహ్మ శంకరుడు ఆదిశేషుడు విఘ్నేశ్వరుడు ఆదీకూర్మము ధర్ముడు నేను నరుడు (నారాయణమహర్షి సోదరుడు} కుమారస్వామి ఈ మేము తొమ్మండుగురము శ్రీకృష్ణుని అంశగలవారము. ఏ ప్రభువును మేమే స్వయముగా ఎరుగజాలము. వేదము లెరుగజాలవు. అట్టి గోలోక నాధుని మహిమ వర్ణించనెవరి తరము! ఇక అతనిని గూర్చి విద్వాంసులేమెరుగుదురు?! ఆదివరాహము వామనుడు కల్కి బుద్ధుడు కపిల మహర్షి మత్స్యావతారమూర్తి వీరందరు స్వామీ అంశలే. ఇతరులు అతని కళలుగా ఉన్నవారని చెప్పబడిరి కదా!
కూర్మోనృసింహో రామశ్చ శ్వేత ద్వీప విరాడ్విభుః ।
ఆదికూర్మము నృసింహుడు శ్రీరాముడు శ్వేతద్వీపమందు విరాజిల్లు వ్యాపకమూర్తి అంశలు.
పరిపూర్ణ తమః కృష్ణో వైకుంఠే గోకులే స్వయం॥
శ్రీవైకుంఠమున గోలోకమున నున్న స్వామియే స్వయముగా శ్రీకృష్ణుడయ్యెను కనుక శ్రీకృష్ణుడు పరిపూర్ణతముడు.
వైకుంఠే కమలాకాంతో రూపభేదాచ్ఛతుర్భుజః ।
గోలోకే గోకులే రాధాకాంతోఽయం ద్విభుజః స్వయం॥
వైకుంఠలోకమున నున్న లక్ష్మీ మనోహరుడు రూపభేదమును బట్టి. నాలు హస్తములు గలవాడు. రాధావల్లభుడగు శ్రీకృష్ణుడు గోలోకమున గోకులమున తానుగా రెండు హస్తములు గలవాడాయెను.
అస్యైవ తేజో నిత్యం చ చిత్తే కుర్వంతి యోగినః।
భక్తాః పాదాంబుజం తేజః కుత స్తేజస్వినం వినా॥
ఇతనీ తేజస్సునే యోగిజనులు ఎల్లప్పుడు మనస్సున ధ్యానింతురు. భక్తులతనీ పాదపద్మములను ధ్యానింతును. తేజస్వి లేని తేజను ఎక్కడిది?
శృణు విప్ర వర్ణయామి యశోదానందయోస్తతః ।
రోహిణ్యాశ్చ యతో హేతోర్ధదృశుస్తే హరేర్ముఖం॥
వసూనాం ప్రవరో నందో నామ్నా ద్రోణ స్తపోధనః ।
తస్య పత్నీధరా సాధ్వీ యశోదా సా తపస్వినీ ॥
రోహిణీ సర్పమాతా చ కద్రూశ్చ సర్పకారిణీ ।
ఏతేషాం జన్మచరితం నిబోధ కథయామి తే ॥
ఓ ద్విజుడా వినుము. ఏ కారణము వలన యశోదానందులు రోహిణియు శ్రీహరి (కృష్ణుడు) ముఖము దర్శించిరో ఆ మూలకారణము వర్ణింతును. వసువులలో శ్రేష్ఠుడైన ద్రోణుడనువాడు మంచి తపోధనుడు. అతడే నందుడుగా, ద్రోణుని ధర్మపత్నియగు ధరాదేవి {మంచీ తపస్వినీ} యశోదగా, సర్పముల తల్లియగు కద్రువ రోహిణిగా జన్మించిరి. వీరి జన్మచరిత్రను చెప్పుదును తెలిసికొనుము.
ఏకదా చ ధరా ద్రోణౌ పర్వతే గంధమాదనే ।
పుణ్యదే భారతే వరే గౌతమాశ్రమ సన్నిధౌ ॥
చక్రతుశ్చ తపస్తత్ర వర్షాణామయుతం మునే।
శ్రీకృష్ణ దర్శనార్థం చ నిర్జమే సుప్రభాతటే ॥
న దదర్శ హరిం ద్రోణో ధరా చైవ తపస్వీవీ।
కృత్వాఘ్నికుండం వైరాగ్యాత్ప్రవేష్టుం సముపస్థితో ॥
తౌ మర్తుకామౌ దృష్ట్యా చ వాగ్బభూవా శరీరిణీ ।
ద్రక్ష్యథః శ్రీహరి పృథ్య్వాం గోకులే పుత్ర రూపిణం ॥
జన్మాంతరే వసుశ్రేష్ఠ దుర్ధశౌ యోగినాం విభుం ।
ధ్యానాసాధ్యం చ విదుషాం బ్రహ్మాదీనాం చ వందితం ॥
శ్రుత్వైవం తద్ధరా ద్రోణౌ జగ్మతుః స్వాలయం సుఖాత్ ।
ఒకప్పుడు దంపతులైన ధరాద్రోణులు పుణ్యప్రదమైన భారత వర్షములో గంధమాదన పర్వతమునందు గౌతమాశ్రమ సమీపమున . పదివేల సంవత్సరములు తపస్సు చేసిరి. జన రహితమైన సుప్రభానదీ యొడ్డున శ్రీకృష్ణ దర్శనము కొరకు వారట్లు తపస్సు చేసిరి శ్రీహరిని దర్శించలేకపోయిరి. విరక్తి కలిగి వారు అగ్నికుండము చేసి అందులో పడి మరణించుటకు సిద్ధపడిరి. ఆ దంపతుల స్థితిని చూచి అశరీరవాణి ఇట్లు విన్పించెను. “పసువులలో శ్రేష్టుడా! ధ్యానమునకందనివాడును (విద్వాంసులకు కూడ} బ్రహ్మాది దేవతలచేత సమస్కరింపబడువాడును యోగీశ్వరుడునగు శ్రీహరిని దర్శించు భాగ్యము మీకిప్పుడు లేదు. ఇంకొక జన్మ భూమీ మీద పొంది గోకులమున పుత్రుని రూపమున శ్రీహరిని దంపతులగు మీరు దర్శించగలరు”. ఆ దేవవాణిని విని ఆ ధరాదేవియు ద్రోణుడును సుఖముగా తమ గృహమునకు పోయిరి.
లబ్ధ్వా తు భారతే జన్మ దృష్టం తాభ్యాం హరేర్ముఖం ॥
యశోదానందయోరేవం కథితం చరితం తవ ।
నుగోప్యం దేవతానాం చ రోహిణీ చరితం శృణు ॥
భారతమున వారిద్దరు జన్మించి శ్రీహరి ముఖమును దర్శించిరి. వారే యశోదానందులు. వారి కథ నీకు చెప్పితిని, దేవతలకును తెలియని మిక్కిలి రహాస్యమైన రోహిణి చరిత్ర చెప్పెదను వినుము.
ఏకదా దేవ మాతాచ పుష్పోత్సవ దినే సతీ ।
విజ్ఞాపనం చరద్వారే చకార కశ్యపం మునే ॥
సుస్నాతా సుందరీ దేవీ రత్నాలంకార భూషితా ।
చకార వేషం ఏవిధం దదర్శ దర్పణే ముఖం ॥
కస్తూరీ బిందునా సార్థం సిందూర బిందు సంయుతం ।
రత్నకుండల శోభాడ్యం పత్రాభరణ భూషితం ॥
గజమౌక్తిక సంయుక్తం నాసాగ్రం సుమనోహరం।
శరత్పార్వణ చంద్రాన్యం శరత్పంకజ లోచనం ॥
వక్రభ్రూభంగినా యుక్తం వీచిత్ర కజ్ఞలోజ్జ్వలం।
పక్వ దాడిమ బీజాభ దంతపంక్తి వీరాజితం ॥
పక్వ బింబాధరోష్ఠం చ సస్మితం సుందరం తథా ।
ఆతీవ కమనీయం చ మునీంద్ర చిత్త మోహనం ॥
ఏవం భూతం ముఖం దృష్ట్వా సుందరీ స్వగృహే స్థితా ।
పశ్యంతీ పతి మార్గం చ కామబాణ ప్రపీడితా ॥
ఒకసారి దేవమాతయైన అదితి వసంతోత్సవ దినమునాడు వార్తాహరుని ద్వారా తన భర్తయగు కశ్యప ప్రజాపతిని ఆహ్వానించుచు విజ్ఞాపనము పం పెను. సుందరియగునాదేవి చక్కగా స్నానమాడి రత్నాభరణములు అలంకరించుకోని పలువిధములుగా మంచి వేషము కూర్చుకొని అద్దములో తన ముఖమును చూచుకొనెను. కస్తూరీ తిలకముతోబాటు సిందూరపు చుక్కబొట్టు, రత్నకుండలము శోభతోబాటు చెక్కిళ్లపై మకరికా పత్రరేఖలు, ఆభరణముల అలంకారము, ఏనుగు ముత్తెముతో కూడి మిక్కిలి మనోహరముగా నున్న తీర్చిన ముక్కు, శరదృతు పూర్ణిమనాటి చంద్రుని వంటి ముఖమండలము, శరత్కాలమందలి పద్మములవంటి కన్నులు, వంకరలు తిరిగియున్న బొమముడి, విచిత్రమైన కాటుకకొంత, పండిన దానిమ్మ వితులవంటి కాంతి గల పలువరుస చిరునవ్వుతో గూడి సుందరమై పండిన దొండపండు వంటి క్రింది పెదవితో ప్రకాశించుచు ఇట్లు మిక్కిలి కోరదగిన (చూచువారికి), మునీంద్రుల మనస్సులను మోహింపజేయునట్టి తన ముఖమును చూచుకొని మన్మథ బాణములచేత పీడింపబడీ భర్తవచ్చు మార్గమును. చూచుచు తన మందిరమున ఉండెను.
శుశ్రావ వార్తా మదితి కశ్యవం కద్రు సంయుతం ।
రత్నసార సమానం భే తస్యా వక్షస్థలే స్థితం ॥
శ్రుత్వా చుకోప సాధ్వీ సా హతాశా రశీకాతరా।
న శశావ పతం ప్రేమ్ణా శశావ సర్పమాతరం ॥
న దేవాలయ యోగ్యా సా ధర్మిష్ఠా ధర్మనాశినీ ।
దూరం గచ్ఛతు స్వర్లోకాదాత్మయోనిం చ మానవీం॥
కశ్యపుడు శ్రేష్ఠమైన రత్నసంపదతో ప్రకాశించు వక్షస్థలము గల కద్రువతో కూడియున్నాడన్న వార్తను విని సాధ్వియగు అదితి భర్త సమాగమము కొరకు వణకుచు హతాశయై (ఆశచంపబడి) కోపము పొందెను. ఐనను పతిమీదీ అనురాగములో అతనిని శపింపక కద్రువ నిట్లు శపించెను, ధర్మమునందు నిలిచియుండియు ధర్మమును నశింపజేసిన కద్రువ స్వర్గమున నుండదగదు. స్వర్గలోకము నుండి దూరముగా తొలగిపోవు గాక. మానవజన్మనెత్తుగాక.
శ్రుత్వైవం సా చరద్వారా శశాప దేవమాతరం ।
సా చైవం మానవీం యోనిం యాతు మర్త్యే జరాయుతాం ॥
ఆ కద్రువ వార్తాహరుని వలన శాపవార్త విని ఆమె కూడ దేవమాతయగు అదితికి భూలోకమున ముసలితనముతో కూడి యుండు మానవజన్మనెత్తుగాక అని శాపమొసగెను.
కశ్యపో బోధయామాస కద్రుం చ సర్వమాతరం।
లే యాస్యసి మర్త్యం చ మయా సహ శుచిస్మితే ॥
త్యజ భీతిం లభ సుఖం ద్రక్ష్యసి శ్రీహరేర్ముఖం ।
ఏవముక్త్యా కశ్యపశ్చ జగామ చాదీతేర్గృహం ॥
సర్పమాత యయిన కద్రువసు కశ్యపుడు “ఓ ప్రకాశించు చిరునవ్వుగలదానా! యోగ్యమైన కాలములో నాతో కలిసి భూలోకమున మనుష్య జన్మనెత్తుదువు. అప్పుడు శ్రీహరి ముఖమును దర్శింతువు కనుక శాపభీతి వదలుము. సుఖము పొందుము” అనీ ఓదార్చి అదితి గృహమున కేగెను.
వాంఛాం పూర్ణాంచ తస్యాశ్చ చకార భగవాన్ విభుః ।
ఋతో తత్ర మహేంద్రశ్చ బభూవ చ సురర్షభః ॥
అదితిర్దేవకీ చైవ సర్పమాతా చ రోహిణీ ।
కశ్యపో వనుదేవశ్చ శ్రీకృష్ణ జనకో మహాన్ ॥
రహస్యం గోపనీయం సర్వం నిగదితం మునే।
అధునా బలదేవస్య జన్మాఖ్యానం మునే శృణు ॥
అనంతస్యా ప్రమేయస్య సహస్ర శిరసః ప్రభోః ।
జ్ఞానబలాది షడ్గుణ విరాజితుడు విభువైన కశ్యపుడు ఋతుస్నాతమైయున్న అదితి కామవాంఛను తీర్చెను. ఆ సందర్భముననే ఆమెకు దేవరాజైన మహేంద్రుడు జన్మించెను. అదితియే దేవకిగా కద్రువయే రోహిణిగా కశ్యపుడే శ్రీకృష్ణ జనకుడగు వసుదేవుడుగా జన్మించిరి. సారదా! ఇదీ దాచదగిన దేవరహస్యము దీనిని నీకిపుడు చెప్పితిని. ఊహకందని మహిమలు గలవాడును సహస్ర శీరములు గలవాడును ప్రభువునగు అనంతుని అంశతో జన్మించిన బలదేవుని కథను వినుము.
రోహిణీ వసుదేవస్య భార్యారత్నం చ ప్రేయసి ॥
జగామ గోకులం సాధ్వీ వసుదేవాజ్ఞయా మునే ।
సంకర్షణస్య రక్షార్ధం కంనబీతా పలాయితా ॥
దేవక్యాః సప్తమం గర్భం మాయా కృష్ణాజ్ఞయా తదా।
రోహిణ్యాం జఠరే తత్ర స్థాపయామాన గోకులే ॥
సంస్థాప్య చ తదా గర్భం కైలాసం సా జగామ హ ।
వసుదేవుని భార్యలలో శ్రేష్ఠురాలు ప్రియురాలు ఐనది రోహిణి. ఆమె భర్త ఆజ్ఞ వలన తన గర్భమున బడిన సంకరుని రక్షకోరకు కంసునికి భయపడి గోకులమునకు పోయెను. దేవకి ఏడవ గర్భమునే శ్రీహరి ఆజ్ఞననుసరించి విష్ణుమాయ గ్రహించి గోకులమున నున్న రోహిణి గర్భమున ప్రవేశ పెట్టి (కంసుని వ్యామోహపరచుటకే శ్రీహరి ఆజ్ఞ ప్రకారము అనంతుడు దేవకి గర్భమున చేరి అటునుండి రోహిణిగర్భమునకు మార్చబడెను. అందుకే అతనికి సంకర్షణుడన్న పేరు కలెను) కైలాసమునకేగెను.
దీనాంతరే కతిపయే రోహిణీ నందమందిరే ॥
సుషావ పుత్రం కృష్ణాంశం తప్త రౌప్యాభమీశ్వరం ।
ఈషద్ధాస్యం ప్రసన్నాస్యం జ్వలంతం బ్రహ్మ తేజసా ॥
కొన్ని దినముల తరువాత నందమందిరమున రోహిణిదేవి మెరియుచున్న వెండి వంటి శరీర కాంతి గలవాడును చిరునవ్వుతో ప్రసన్న ముఖము గలవాడును బ్రహ్మతేజస్సుతో వెలుగుచున్నవాడును కృష్ణాంశగల మహానుభావుడు నగు పుత్రుని గనెను.
తస్యైవ జన్మమాత్రేణ దేవా ముముదిరే తపో।
న్వరే దుందుభయో నేదురానకా మురజాదయః ॥
జయశబ్దం శంఖశబ్దం చక్రుర్దేవా ముదాన్వీతాః ।
నందో హృష్టో బ్రాహ్మణేభ్యో ధనం బహువిధం దదా ॥
చిచ్చేద నాడీం ధాత్రీ చ స్నాపయామాన బాలకం।
జయశబ్దం జగుర్గోవ్యః సర్వాభరణ భూషితాం ॥
వరపుత్రోత్సవం నందశ్చకార పరమాదరాత్।
తదా యశోదా గోపీభ్యో బ్రాహ్మణేభ్యో దదౌ ముదా ॥
ధనాని నానావస్తూని తైలం సిందూరమేవ చ ।
ఇత్యేవం కథితం వత్స యశోదానందయోస్తపః॥
జన్మాఖ్యానం చ హలినో రోహిణీ చరితం తథా ।
అతడు జన్మించగనే దేవతలానందించిరి. స్వర్గలోకమున ఆనకములు, మురజములు దేవదుందుభులు మ్రోగెను. దేవతలు సంతోషములో జయజయ ధ్వనులు చేసి శంఖములూదిరి. నందుడానంద పరవశుడై మిక్కిలి ఆదరముతో ఆ వసుదేవుని పుత్రునకు (రోహిణీ పుత్రునకు) జన్మోత్సవము చేయుచు బ్రాహ్మణులకనేక విధముల ధనమును దానమొనర్చెను. దాది శిశువు బొడ్డుకోసి బాలకుని స్నానమాడించెను. అప్పుడు యశోదాదేవియు సంతోషముతో బ్రాహ్మణులకు ధనమును గోపికలకు నానావిధ వస్తువులను నూనెను సిందూర కుంకుమను పంచిపెట్టెను. నాయనా నారదా! ఇట్లు నీకు యశోదానందుల పూర్వ జన్మతపస్సు హాలీ (సాగలీ ఆయుధముగా గల బలరాముడు) యొక్క జన్మకథ రోహిణీ చరిత్రము చెప్పబడినవి.
అధునా తే వాంఛనీయం సందపుత్రోత్సవం శృణు ॥
సుఖదం మోక్షదం సారం జన్మ మృత్యుజరాపహం ।
మంగలం కృష్ణ చరితం వైష్ణవానాం చ జీవనం॥
సర్వాశుభ వినాశం చ భక్తి దాస్య ప్రదం హరేః ।
ఇపుడు నీవు కోరదగిన నందపుత్రుని యొక్క (శ్రీకృష్ణుని) జన్మోత్సవమును వినుము. కృష్ణ చరితము మంగళకరమైనది. జన్మచరణములు ముసలితనము అనువానిని తొలగించునది. ప్రపంచమున సారవంతమై మోక్షప్రదమై సుఖానందములిచ్చునది. సర్వవిధములైన అశుభములను నశింపజేసి హరి భక్తిని హరిదాస్యము నిచ్చునది. విష్ణు భక్తులకు ప్రాణాధారమైనది.
శ్రీకృష్ణం వసుదేవశ్చ సంస్థాప్య నందమందిరే ॥
గృహీత్వా బాలీకాం హృష్టో జగామ నిజమందిరం ।
కథితం చరితం తస్యాః శ్రుతం సమ్ముఖతో మునేః॥
వసుదేవుడు శ్రీకృష్ణుని నందునియింట నుంచి అక్కడున్న బాలిను తీసుకొని సంతసముతో తన యింటికి (మధురకు) పోయెను. ఆ బాలిక చరిత్రము ఇంతవరకే చెప్పగా విని యుంటివి.
ఆధునా గోకులే కృష్ణ చరితం శృణు మంగళం ।
వసుదేవ్ గృహం యాతే యశోదా నంద ఏవ చ ॥
మంగళే సూతికాగారే జయగారే జయాన్వీతే ।
దదర్శ పుత్రం భూమిష్ఠం నవీన నీరద ప్రభం ॥
అతీవ సుందరం నగ్నం పశ్యంతం గృహాశేఖరం ।
శరత్పార్వణ చంధ్రాన్యం నీలేందీవరలోచనం ॥
రుదంతం చ హసంతం చ వేణు సంసక్త విగ్రహం ।
హస్తద్వయం సువిన్యస్తం ప్రేమవంతం పదాంబుజం॥
దృష్ట్వా నందః స్త్రీయా సార్ధం హరిం హృష్టో బభూవ హ ।
వసుదేవుడట్లు వెడలి పోగా ఇక ఇక్కడ గోకులములోని మంగళకరమైన కృష్ణ చరిత్రను వినుము, శుభప్రదమైన పురిటింట్లో యశోదానందులు భూమి మీద నున్న పుత్రుని చూచిరి. అతడు మిక్కిలి సుందరముగా నగ్నరూపముతో క్రొత్త మేఘము వంటి కాంతిలో ఇంటి పైకప్పును చూచుచుండెను. అతని ముఖము శరదృతువులోని నిండుపున్నమి నాటి చంద్రుని వలె నుండెను. కన్నులు నల్లకలువలవలే నుండెను. ఒకసారి ఏడ్చుచుండెను. మరియొకసారి నవ్వుచుండెను. పిల్లన గ్రోవి ధరించియుండెను. మనోహరమైన పాదములు చక్కని రెండు చేతులతో నున్న ఆ శ్రీహరిని (బాలుని) చూచీ యశోదానందులు మిక్కిలి హర్షము పొందిరి. వారికాపురిటిల్లు జయశ్రీతో కూడి జయగృహమయ్యెను.
ధాత్రీ తం స్నాపయా మాస శతతోయేన బాలకం।
చిచ్ఛేద నాడీం బాలస్య హర్షాద్గోప్యో జయం దదుః ।
ఆజగ్ముర్గోపికాన్ఫర్వా బృహచ్చ్రోణ్యశ్చలత్కుచా:॥
బాలికాశ్చ వయస్యశ్చ విప్ర వత్న్యశ్చ సూతికాం।
ఆశిషం యుయుజుస్పర్వా దదృశుర్బాలకం ముదా॥
క్రోడే చక్రుః ప్రశంసంత్య ఊషుస్తత్ర చ కాశ్చన ।
దాది శిశువు యొక్క నరమును (నాభి) ఖండించి చల్లని నీట ఆ బాలుని స్నానమాడీంచెను. సంతోషముతో గోపికలు జయ జయనాదములు చేసిరి. గొప్ప పిరుదులు కదలుచున్న స్తనములు గల గోపికలందరు, బాలికలు, యశోద స్నేహితురాండ్రు బ్రాహ్మణుల భార్యలు నందునింటికి చేరవచ్చి సంతోషముతో బాలుని జూచిరి. ఆ తల్లికి ఆశీర్వాదములు చేసిరి. కొందరు బాలుని రూపమును తల్లి భాగ్యమును పొగడుచు పిల్లవానీని తమ ఒడిలోనికి తీసుకొనిరి. కొందరక్కడ కూర్చుండిరి.
నంద: సచేల: స్నాతశ్చ ధృత్వా ధౌతే చ వాననీ ॥
పారంపర్యవిధిం తత్ర చకార హృష్టి మానస ।
బ్రాహ్మణాన్ భోజయామాస కారయామాస మంగలం ॥
వాద్యాని వాదయామాస వందిభ్యశ్చ దదౌ ధనం ।
తతో నందశ్చ సానందం బ్రాహ్మణేభ్యో దదౌ ధనం ॥
సద్రత్నాని ప్రవాళాని హీరకాని చ సాదరం ।
తిలానాం పర్వతాస్ నప్త సువర్ణ శతకం మునే॥
రౌప్యం ధాన్యాచలం వస్త్రం గోసహస్రం మనోహరం ।
దధీ దుగ్ధం శఠ్కరాం చ నవనీతం ఘృతం మధు॥
మీష్ఠాన్నం నల్లడ్డూకౌఘం స్వాదూని మోదకాని చ ।
భూమిం చ సర్వ సస్యాడ్యాం వాయువేగానిస్తురంగమాన్॥
తాంబూలాని చ తైలాని దత్వా హృష్టో బభూవ హ ।
నందుడు పుత్రదర్శనము కాగానే సచేలస్నానము చేసి ఉతికిన రెండు వస్త్రములు ధరించి హార్షించిన మానసముతో లోకాచారక్రమముననుసరించి శాస్త్రవిధినీ ఆచరించెను. బ్రాహ్మణులను భుజింప చేసి మంగళ వాద్యములు మ్రోగుచుండగా పుణ్యాహవాచన మంగళము చేయించెను. వందిజనులకు ధనమిచ్చెను. ఆనంద పరవశుడై జాతి రత్నములను, పగడములు, వజ్రములు, ఏడు నువ్వుల రాసులను, నూరు బంగారు నాణెములను, పిండిని, ధాన్యరాశిని, వస్త్రములను, వేయి ఆవులను, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, శర్కర తేనె, పక్వాన్నము, లడ్డూలు, రుచిగల అప్పాలను, అన్ని పంటలు పండు భూమిని, వాయువేగము గల గుఱ్ఱములను, తాంబూలములను, సుగంధ తైలములను సద్ బ్రాహ్మణులకు దానమొనర్చి సంతసించెను.
రక్షితం సూతికాగారం యోజయామాస బ్రాహ్మణాన్ ॥
తత్ర మంత్రజ్ఞ మనుజాన్ స్థవిరాన్ గోపికా గణాన్।
వేదాంశ్చ పారయామాస హరేర్నామైక మంగలం ॥
భక్త్యా చ బ్రాహ్మణ ద్వారా ఫూజయామాన దేవతా: ।
గోపాలికాశ్చ వృద్ధాశ్చ రత్నాలంకార భూషితాః ॥
సన్మీతా శీఘ్ర గామిన్య ఆజగ్ముర్నంద మందిరం ।
నానా విధాశ్చ గణకా జ్యోతిశ్శాస్త్ర విశారదాః ॥
వాక్సిద్ధాః పుస్తక కరా ఆజగ్ముర్నంద మందిరం ।
సస్మితా విప్ర పత్న్యశ్చ వయస్యాస్థవిరా వరాః ॥
బాలికా బాలకయుతా ఆజగ్ముర్నంద మందిరం ।
పురుటింటిని రక్షించుట కొరకు (ష కీడు సోకకుండ) నందుడు రక్షామంత్రము లెరిగిన బ్రాహ్మణులను, ముదుసలులైన గోపికలను ఏర్పరచెను. వేదములను మంగళకారణమైన శ్రీహరి నామావళిని చదివించెను. భక్తితో సమస్త దేవతలను బ్రాహ్మణుల చేత పూజింపజేసెను. రత్నముల యలంకారములు అలంకరించుకొన్న ముదుసలి గోపికలు చిరునవ్వుతో త్వరగా నడచుచు నందునింటికి చేరవచ్చిరి. అనేక విధములుగా లెక్కలు గట్టి జాతకములు వ్రాయువారు, వాక్సిద్ధి గలవారు అగు జ్యోతిశ్శాస్త్ర పండితులు పుస్తకములు పట్టుకొని నందునింటికి వచ్చిరి. బ్రాహ్మణుల భార్యలు కొడుకులు బిడ్డలు వెంటరాగా యువతులు వృద్ధ స్త్రీలు సుందరీమణులు నందుని మందిరమునకు చిరునవ్వు వెలుగుచుండగా వచ్చిరి.
తేభ్యోఽపి ప్రదదో రత్నం ధనానీ వివిధాని చ ॥
వర వస్త్రాణి రౌప్యాణి గోసహస్రాణి సాదరం ।
నంధ స్తేభ్యో నమస్కృత్య చకార వినయం ముదా ॥
ఆశిషం యుయుజు: సర్వే దదృశుర్భాలకం పరం ।
ఏవం సంభృత సంభారీ బభూవ వ్రజపుంగవః॥
గోకుల నాథుడగు నందుడు తన యింటికి చేరవచ్చిన వారందరికి రత్నములను వివిధ ధనములను శ్రేష్ఠమైన వస్త్రములను వెండిని గోసహస్రములను ఆదరముగా దానమిచ్చి నమస్కరించి సంతోషముగా తన వినయమును ప్రకటించెను. వారందరతనికి ఆశీస్సులు సమకూర్చి లోకాతీతుడైన ఆ బాలుని దర్శించిరి. ఇట్లు నందుడు అన్ని కార్యములు నెరవేర్చను.
గణకై: కారయామాస యద్భవిష్యం శుభాశుభం ।
ఏవం వవర్ధ బాలశ్చ శుక్లపక్షే యథా శశీ ॥
నందాలయే హలీ చైవ భుక్త్యా మాతుః పయోధరం ।
తదా చ రోహిణీ హృష్టా తత్ర పుత్రోత్సవే ముదా ॥
తైల సిందూర తాంబూలం ధనం తాభ్యో దదౌ మునే ।
దత్వాఽ శిషశ్చ శిరసి తాశ్చ తే స్వాలయం యయుః॥
యశోదా రోహిణీనందాస్తస్థుర్గేహే ముదాన్వీతాః ॥
నందుడు గణములతో బాలుని శుభాశుభ భవిష్యత్తును (జాతక ఫలితమును వ్రాయించెను). ఇట్లు బోలుడు శుక్ల పక్షమున చంద్రుని వలె వృద్ధిపొందెను. నందుని యింట బలరాముడును తల్లిపాలు త్రాగుచు పెరిగెను. రోహిణియు నందుడొనర్చిన పుత్రోత్సవము చూసి సంతోషముతో తానును ఆ వచ్చినవారికి సిందూరమును, తెలమును తాంబూలములను, ధనమును దానమొనర్చెను. వారు తల్లికొడుకుల శిరస్సులపై ఆశీస్సులు (అక్షతలు) ఇచ్చి తమ గృహములకేగిరి. ఇట్లు ,యశోదానందులు రోహిణి ఆయింటిలో సంతోషముగా నుండిరి.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే నారాయణ నారద సంవాదే నంద పుత్రోత్సవో నామ నవమోఽధ్యాయః॥
ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండములో నారాయణ నారద నంవాదములో నందపుత్రోత్సవ మనెడి తొమ్మిదవ అధ్యాయము నమాప్తము.
Summary of chapter 9 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Arriving safely in Gokula during the dead of night, Vasudeva entered the royal cowherd mansion of Nanda Bābā and Yashodā, where mother Yashodā had just given birth to a baby girl who was actually the divine Yogamāyā. Guided by mystic potency, Vasudeva gently placed the divine infant Śrī Kṛshṇa beside Yashodā and lifted the newborn baby girl into his arms, returning swiftly across the Yamunā to the Mathura prison cell. As Vasudeva laid the infant girl beside Devakī, the heavy iron chains locked shut once more, the prison doors sealed themselves tight, and the infant girl let out a loud cry that instantly awoke the prison guards.