శ్రీ నారాయణ ఉవాచ :
ఏకదా నందపత్నీ చ స్నానార్థం యమునాం యయౌ ।
గవ్యపూర్ణం గృహం దృష్ట్యా జహాన మధుసూదనః ॥
దధిదుగ్ధాజ్య తక్రం చ నవనీతం మనోరమం ।
గృహస్థితం చ యత్కించిచ్చఖాధ మధుసూదనః ॥
మధు హైయంగవీనం యతౌ స్వస్తికం శకట స్థితం ।
భుక్త్వా పీత్వాంశుకైర్వక్త్రసంస్కారం కర్తుముద్యతం ॥
దదర్శ బాలకం గోపి స్నాత్వాఽ గత్య స్వమందిరం ।
గవ్యశూన్యం భగ్నభాండం మధ్వాది రక్తభాజనం ॥
నారాయణముహర్షి యిట్లు పలికెను :
ఒకసారి నందుని భార్యయగు యశోద స్నానము కొరకు యమునా నదికి వెళ్లగా ఆవులపాడితో నిండియున్న ఇంటిని చూచీ మధుసూదనుడు (శ్రీకృష్ణుడు) నవ్వను. (తన విలాస లీలలకు సమయము చిక్కినందున). ఇంటియందున్న పెరుగు పాలు నెయ్యి మజ్జిగ మనస్సు నానందపరచు వెన్న మొత్తము తీని - త్రాగీ వస్త్రములతో ముఖమును తుడుచుకొనుటకు ప్రయత్నించుచున్న బాలకునీని స్నానము చేసి ఇంటికి చేరవచ్చిన ఆ గోపిక (యశోద) చూచెను. పాడియంతయు శూన్యమై పగిలియున్న కుండలను బానలను, తేనె మొదలగు పదార్థములు ఏమి లేకుండ శూన్యమైన పాత్రలను ఆమె చూచెను.
దృష్ట్వా పప్రచ్ఛ బాలాంశ్చ అహో కర్మేదమద్భుతం ।
యూయం వదత సత్యం చ కృతం కేన సుదారుణం ॥
యశోదావచనం శ్రుత్వా సర్వమూచుశ్చ బాలకాః ।
చఖాద సత్యం బాలస్తం నాస్మభ్యం దత్తమేవ చ ॥
అక్కడ నున్న బాలురను చూచీ ఆమె “అబ్బా! ఈ పని చాలా ఆశ్చర్యముగా నున్నది. మీరు సత్యము చెప్పండి. ఎండీ దారుణమైన పనిచేసెను” అని ప్రశ్నించెను. ఆమె మాట విని ఆ బాలురు మొత్తము వృత్తాంతమును చెప్పిరి. “ఈ బాలుడే (శ్రీకృష్ణుడు) మొత్తము తిన్నాడు. ఇది సత్యము. మాకే మాత్రము పెట్టలేదు” అని అనిరి.
బాలానాం వచనం శ్రుత్వా చుకోప నందగేహినీ ।
వేత్రం గృహీత్వా దుద్రావ రక్తపంకజలోచనా ॥
పలాయమానం గోవిందం గ్రహీతుం న శశాక హ ।
ధ్యానాసాధ్యం శీవాదీనాం దురాపమపి యోగినాం ॥
యశోదాభ్రమణం కృత్వా విశ్రాంతా ఘర్మసంయుతా ।
తస్థౌ కోవపరీతాత్మా శుష్కకంఠౌష్ఠ తాలుకా ॥
విశ్రాంతాం మాతరం దృష్ట్వా కృపాలుః పురుషోత్తమః ।
సంతస్థౌ పురతో మాతుః సస్మితో జగదీశ్వరః ॥
బాలురమాట విని నందునీ యిల్లాలు కోపముతో కన్నులు ఎఖదామరపలె కాగా బెత్తము తీసుకొని పరుగెత్తాను. శివుడు మొదలగు దేవతాశ్రేష్ఠుల ధ్యానమునకు లొంగనివాడు (గోచరముగానివాడు) యోగిజనులకు పొందరాసిపోడగు గోవిందుడు పరుగులు పెట్టుట వలన ఆమె అతనిని పట్టుకొనలేకపోయెను. యశోద అటు తిరిగి తిరిగి ఓడలంతయు చెమటలు పోసి - గొంతు దవడల పెదవులు ఎండిపోయి - బాగుగా అలిసి - అతిశయించిన కోపముతో నిలిచిపోయెను. అలిసిపోయిన తల్లిని చూచి దేయదలచినవాడై ఆ పురుషోత్తముడు - జగదీశ్వరుడగు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో తల్లిముందర నిలిచెను.
కరే ధృత్వా చ తం దేవీ సమానీయ స్వమాలయం ।
బద్ధ్వా వస్త్రేణ వృక్షే చ తతాడ మధుసూదనం ॥
బద్ధ్వా కృష్ణం యశోదా సా జగామ స్వాలయం ప్రతి ।
హరిస్తస్థౌ వృక్షమూలే జగతాం పతిరీశ్వరః ॥
శ్రీకృష్ణ స్పర్శమాత్రేణ సహసా తత్ర నారద ।
పపాత వృక్షః శైలాభః శబ్దం కృత్వా భయానకం ॥
సువేషః పురుషో దివ్యో వృక్షాదావిర్బభూవ హ।
దివ్యస్యందసమారుహ్య జగామ స్వాలయం పురః ॥
ప్రణమ్య జగతీనాథం శాతకౌంభ పరిచ్ఛదం ।
తనకు చిక్కిన కుమారుని చేతబట్టుకోని యశోదాదేవి తన మందిరమునకు వచ్చి ఇంటి ముందున్న వృక్షమునకు వస్త్రముతో కట్టివేసి శ్రీకృష్ణుని తాడించెను (కొట్టెను). అట్లు బంధించి ఆమె యింటిలోనికీ బోయెను. జగత్తులకు పతియగు శ్రీహరి చెట్టు మొదట అట్లే నీలిచియుండెను. ఆ ప్రభువు తాకినంతనే పర్వతమంతయున్న చెట్టు హఠాత్తుగా భయంకర శబ్దముతో నేలగూలెను. ఆ వృక్షము నుండి మంచి అలంకారము గల దివ్యపురుషుడొకడు ఆవిర్భవించి (పుట్టీ - లేచి) స్వర్ణాభరణములు పీతాంబరము ధరించియున్న - జగన్నాధునకు (శ్రీకృష్ణునకు) నమస్కరించి ప్రకాశించేడి రథము నెక్కి తన లోకమునకు వెళ్లిపోయెను.
కిశోరః సస్మితో గౌరో రత్నాలంకార భూషితః ॥
రత్నాభరణములచేత అలంకరింపబడియున్న ఆ బాలుడు చిరునవ్వు నవ్వుచు తెల్లని కాంతి ప్రసరింప జేసెను.
సా వృక్షపతనం దృష్ట్యా భియా త్రస్తా వ్రజేశ్వరీ ।
క్రోడే చకార బలం తం రుదంతం శ్యామసుందరం ॥
ఆజగ్ముర్గోకులస్థాశ్చ గోపాగోప్యశ్చ తద్గృహం ।
యశోదాం భర్త్సయామానుః శాంతిం చక్రుః శిశోర్ముదా ॥
ప్రజమునకు రాణియైన యశోద వృక్షము పడిపోవుట చూచి భయముతో వణికి చేరవచ్చి ఏడ్చుచున్న ఆ శ్యామసుందరుడగు బాలునెత్తుకొనెను. ఆ ధ్వని వీని గోకులములోని గోపాలురు గోపికలు నందునీ యింటికీ పరుగున వచ్చి ఆ శిశువును ఏడ్వకుండ ఓదార్చుచు యశోదను కోపముతో బెదరించిరి.
అత్యంత స్థవిరే కాలే తనయోఽయం బభూవ హ ।
ధనం ధాన్యం చ రత్నం వా తత్సర్వం పుత్రహేతుకం ॥
సుమతిర్నాస్తి తే సత్యం జ్ఞాతం నంద వ్రజేశ్వరి ।
స భక్షితం యత్పుత్రేణ తత్సర్వం నిష్ఫలం భువి ॥
పుత్రం బద్ధా గవ్య హేతోర్వృక్షమూలే చ నిష్ఠురే ।
గృహకర్మణి వ్యగ్రాయాం దైవాద్వృక్షః పపాత హ ॥
వృక్షస్య పతనాద్గోపి భాగ్యాద్బాలోఽపి జీవితః ।
ప్రణష్టే బాలకే మూఢే వస్తూనాం కిం ప్రయోజనం ॥
ఓ సందరాణీ ! ప్రజేశ్వరీ ! మిక్కిలిగా వయస్సు గడిచిపోయిన ముసలితనమున నీకు కొడుకు పుట్టినాడు. ధనధాన్యములు రత్నములు మొదలగు అమూల్య వస్తువులన్నియు పుత్రుల ఉపయోగము కొరకే కదా ! అమ్మా! నీకు మంచి బుద్ధిశక్తి లేదని మాకు స్పష్టముగా తెలిసినది. పుత్రుడు తినని పదార్థమెంత యున్నయు వ్యర్థమే సుమా. ఓ కఠినురాలా ! పాడి నష్టమైనదని పిల్లవానిని చెట్టుకు కట్టివేసి ఇంటిపనులలో మునిగియుంటివే. దైవికముగా చెట్టుపడిపోయెను. చెట్టుకూలి పోయినను నీ భాగ్యము వలన కొడుకు జీవించినాడు. మూఢురాలా ! ఈ బాలకుడు (పసివాడు) చచ్చిన యెడల నీకు వస్తువులన ఏమి ఉపయోగము ?
ఆశిషం యయుజుర్విప్రా వందినశ్చ శుభావహాం ।
ద్విజేన కారయామానుర్నామసంకీర్తనం హరేః ॥
ఏవం కృత్వా జనాస్సర్వే ప్రయయుర్నిజమందిరం ।
అప్పుడు బ్రాహ్మణులు వందీజనులు బాలునకు శుభాశీస్సులు పలికిరి. ఒక సహ్రాహ్మణుని చేత శ్రీహరీ నామ సంకీర్తనము (సహస్ర నామస్తోత్రపారాయణము) జరిపించిరి. ఇట్లు కార్యము నిర్వహించి జనులందరు తమ తమ యిండ్లకేగిరీ.
ఉవాచపత్నీం నందశ్ప రక్తపంకజలోచనః ॥
అప్పుడు సందుడు కోపముతో కన్ను లెఱ్ఱ తామరలవలె కాగా భార్యతో నీక్రింది విధముగా పలికెను.
నంద ఉవాచ :-
యాస్యామి తీర్ధమద్యైవ కంఠేకృత్వా తు బాలకం ।
అథవా త్వం గృహాద్గచ్ఛ త్వయా మే కింప్రయోజనం ॥
శతకూపాధికా వాపీ శతవాపీ సమం సరః ।
సరశ్శతాధికో యజ్ఞః పుత్రీ యజ్ఞశతాధికః ॥
తపోదానోద్భవం పుణ్యం జన్మాంతర సుఖప్రదం ।
సుఖప్రదో హి సత్పుత్ర ఇహైవ చ పరత్ర చ ॥
పుత్రాదపి పరో బంధుర్న భూతో న భవిష్యతి ।
ఏవముక్త్వా స్వభార్యాం చ తస్థౌ నందః స్వమందిరే ।
యశోదా రోహిణీ చైవ నియుక్తా గృహకర్మణి ॥
నందుడు యిట్లు పలికెను :
బాలకుని మెడకు గట్టుకొని నేడే నేను తీర్థయాత్రలకు వెళ్లిపోదును. లేదా నీవింటి నుండి వెళ్లిపొమ్ము. నీతో నాకేమి ఉపయోగము. సూరు చేదబావులకన్న ఓక దిగుడు బావి మేలు. ఒక సరస్సు (ఊట, చెరువు) వంద దిగుడు బావులకు సమానము. నూరు సరస్సులకన్న ఒక యజ్ఞమధికమైనది. వంద యజ్ఞముల కంటే ఒక పుత్రుడధికము. తపస్సు దాసముల వలన కలుగు పుణ్యము ఇంకొక జన్మలో సుఖమిచ్చును. పుత్రుడు ఈ లోకమందు పరలోకమందును సుఖమును కలిగించును. ఇట్లు నందుడు భార్యతో పలికి శాంతుడై తన యింట నిలిచెను. యశోదయు రోహిణియు గృహకర్మలందు నిమగ్నులై ఉండిరి.
నారద ఉవాచ :-
సువేషః పురుషః కో వా వృక్షరూపీ చ గోకులే ।
భగవన్ హేతునా కేన వృక్షత్వం సమవాప హ ॥
నారదుడు యిట్లు పలికెను :
ఓ భగవన్ ! గోకులమున వృక్షరూపమున నున్న సువేషము గల ఆ పురుషుడెవరు ? ఏ కారణము వలన వృక్షరూపము పొందిస్తాడు?
నారాయణ ఉవాచ :-
కుబేర తనయః శ్రీమాన్ నామ్నా యో నలకూబరః ।
జగామ నందనవనం క్రీడార్ధం సహరంభయా ॥
నిర్జనే సరనస్తీరే పుష్పోద్యానే మనోహరే ।
వటవృక్షనమీ పే చ సౌరభే పుష్పవాయునా ॥
విధాయ పుష్పశయనం రత్నదీ పైశ్చ దీపితం ।
చందనాగురు కస్తూరీ కుంకుమద్రవనంయుతం ॥
పరితః పుష్పమాల్యైశ్చ క్షౌమవస్త్రైశ్చ వేష్టితం ।
తత్ర రంభాం సమానీయ విజహార యథేచ్ఛయా ॥
శృంగారాష్టప్రకారం చ విపరీతాదికం సుఖం ।
చుంబనం షట్ప్రకారం చ యధాస్థానం నిరూపితం ॥
అంగ ప్రత్యంగ నంయోగ త్రివిధాశ్లేషణం ముదా ।
సఖదంత ఖరక్రీడాం చకార రసికేశ్వరః ॥
నారాయణమహర్షి యిట్లు పలికెను :
కుబేరుని పుత్రుడు నలకూబరుడన్న పేరు గలవాడు క్రీడార్థమై రంభతోబాటు నందన వనమున కేగెను. మనోహరమైన ఒక పుష్పోద్యానములో సరస్సు ఒడ్డున మఱ్ఱిచెట్టు సమీపమున నీర్జన ప్రదేశములో పూలగాలితో పరిమళవంతమైన చోట పుష్పశయ్యనమర్చి చందనము అగురు కస్తూరి కుంకుమ ద్రవములతో దానిని తీర్చి రత్నాల దీపములతో వెలుచు చుట్టు పూలదండలు పట్టు వస్త్రములు వ్రేలాడుచుండగా వాడు రంభను చేరదీసి యథేచ్ఛగా విహరించెను. వివరీతాది ప్రవర్తనలతో ఎనిమిది రకములైన శృంగార క్రీడా సుఖమును, ఆయాస్థానములందు నిరూపించబడిన ఆరు ప్రకారముల చుంబసమును(ముద్దు) ఉభయుల అంగాంగములను కలుపు మువ్విధముల ఆలింగనమును నఖముల దంతముల వాడియైన క్షతముల క్రీడను చేయుచు ఇట్లారసిక శేఖరుడు క్రీడించెను.
జలాత్ స్థలే స్థలాత్తోయే కామశాస్త్రవిశారదః ।
జలమందును అటనుండి స్థలప్రదేశమునను మరల స్థలము నుండి జలమందును ఆకామశాస్త్ర నైపుణ్యము గల నలకూబరుడు విహరించెను.
రతిభోగం ప్రకుర్వంతం దదర్శ దేవలో మునిః ॥
నగ్నాం రంభాం ముక్తకేశీం పీనశ్రోణి వయోధరాం ।
నఖదంతక్షతాంగీం చ పులకాంచీత విగ్రహాం ॥
పశ్యంతీం ప్రాణనాథం చ పశ్యంతం సస్మితం ముదా ।
వక్రభ్రూభంగ సంయుక్తాం కాముకిం చ దదర్శ తాం ॥
రత్నకుండల యుగ్మేన గండ స్థల విరాజితాం ।
విచిత్ర రత్నమాల్యైశ్ప పుష్పమాల్యైశ్చ భూషితాం ॥
కింకిణీజాలసంయుక్తాం సిందూరబిందు సంయుతాం ।
తయా యుక్తం పులకితం నోత్తిష్టంతం స్మరాన్వితం ॥
ముడివిడిపోయిన తలవెండ్రుకలతో - బలసిన పిరుదులు స్తనములతో - నఖముల యొక్క దంతముల యొక్క గాయములతో - నిలువెల్ల పులకించిన శరీరముతో - వంకరలైన బోమముడుల చూపులతో - రత్న కుండలముల కాంతితో వెల్లుచున్న చెక్కిళ్లతో (చెంపలతో) చిత్ర విచిత్రములైన రత్నహారములతో - పుష్పహారములతో - మువ్వల మొలనూలితో - నుదుట సిందూరపు చుక్కబొట్టుతో - ప్రాణనాథుడైన నలకూబరుడు తన పైననే చూపులు నిలుపగా ప్రేమ చిరునవ్వులతో నతని చూచుచున్న నగ్నమూర్తియైన రంభను, ఆమెతో గూడి యుండి (హఠాత్తుగా కన్పించిన మహర్షిని చూచి గూడ) పులకించిన శరీరముతో మరల మన్మథక్రీడకు పూసుకొన్న నలకూబరుని దేవలముని చూచెను.
వృక్షత్వం యాహి పాపి ష్ఠేత్యువాచ మునిపుంగవః ।
శశాప రంభాం కామార్తాం మానుషి త్వం భవేతి చ ॥
జన్మేజయస్య సుభగా భవితా కామినీతి చ ।
త్వమేవ గోకులం గచ్ఛ వృక్షరూపీ భవేతి చ ॥
శ్రీకృష్ణ స్పర్శమాత్రేణ పునరాయాస్యసి గృహం ।
రంభే త్వమింద్రసంయోగాత్పునరాయాస్యసి ధ్రువం ॥
ఇత్యేవముక్త్యా స మునిర్జగామ నిజమందిరం ।
కుబేరతనయః శ్రీమాన్ స జగాన నిజాలయం ॥
ఇత్యేవం కథితం విప్ర రంభాఖ్యానం వదామి తే ।
“ఓ పాపిష్టుడా! వృక్షరూపమును పొందుము. గోకులమునకు పోయి ఈ శాపమనుభవించుము. శ్రీకృష్ణ స్పర్శ లభింపగనే శాపము తీరి మరల నీ లోకము పొందుదువు గాక” అని ముని నలకూబరుని శపించి కామర్తురాలైన రంభను చూచి నీవు మనుష్య స్త్రీగా జన్మింతువు గాక. జనమేజయుని సుందర పత్నీవగుదువు. ఇంద్ర సంయోగము వలన తిరిగీ, శాపవిమోచనము పొంది ఈ లోకమునకు వతువు అని పలికి ముని తన ఆశ్రమమునకు వెళ్లిపోయెను. కుబేరపుత్రుడు తన గృహమున కేగెను. నారదా ! నీ ప్రశ్నకు ఉత్తరము చెప్పితిని. ఇక రంభ కథ చెప్పుదును వినుము.
నుచంద్రస్య గృహే రంభా లలాభ జన్మ భారతే ॥
కన్యా లక్ష్మీ స్వరూపా చ బభూవ సుందరీ వరా ।
తాం చ సాలంకృతాం కృత్వా సుచంద్రో నృపతీశ్వరః ॥
నానా కౌతుక సంయుక్తాం దదౌ జన్మేజయాయ చ ।
జన్మేజయస్య సుభగా బభూవ మహిషి వరా ॥
స్థానే స్థానే నిర్జనే చ రాజా రేమే తయా సహ ।
రంభ భారతఖండమున సుచంద్రనృపతీ యింట జన్మించెను. ఆకన్య శ్రేష్ఠమైన సౌందర్యము గలదై లక్ష్మీస్వరూపముగా నుండెను. ఆ సుచంద్రుడు కన్యను చక్కగా నలంకరించి నానా విధ మంగళ పదార్థములతో బాటు జనమేజయునకు కన్యాదానము చేసెను. ఆ సౌభాగ్యవతి జనమేజయునకగ్రమహిషియయ్యెను. ఆ రోజు జనరహితమైన అనేక ప్రదేశములలో విహరించుచు నామెతో సుఖమనుభవించెను.
ఏకదా నృపతిశ్రేష్ఠశ్పాశ్వమేధేన దీక్షితః ॥
అశ్వసంగోవనం కృత్వా తస్థౌ శక్రశ్ప మందిరే ।
యజ్ఞాశ్వం రుచిరం మత్వా కౌతుకేన చ సుందరీ ॥
ద్రష్టుం జగామ సా సాధ్వీ చాశ్వమేకాకినీ ముదా ।
శక్రోఽ శ్వనికటే భూత్వా ధర్షయామాస తాం సతీం ॥
తయా నివార్యమాణశ్చ రేమే తత్ర తయా సహ ।
మూర్ఛామవావ శక్రశ్చ బబుధే న దివానిశం ॥
సా చ సంభోగమాత్రేణ దేహం తత్యాజ యోగతః ।
నృపస్య లజ్ఞయా భీత్యా శక్రః న్వర్గం జగామ హ ॥
ఒకసారి ఆ రాజశ్రేష్ఠుడు అశ్వమేధయాగమారంభించి దీక్షలోనుండెను. ఇంద్రుడు యజ్ఞాశ్వమును మాటుగా చేసుకొని ఆ మందిరముననే ఉండెను. పూజాకాలమున చూచిన యజ్ఞాశ్వము చాల యందముగానున్నదని భావించి సుందరియగు రాజపత్ని ఆసక్తితో దానిని చూచుటకై ఒంటరిగా అక్కడికి వెళ్లెను. ఆ సాధ్విని చూచి ఇంద్రుడు ఆ యశ్వము ప్రక్కనే ప్రత్యక్షమై ఆ సతిని బలాత్కరించెను. ఆమె నివారించుచున్నను ఆగక ఇంద్రుడక్కడ ఆమెతో రమించెను. ఆ తరువాత రాత్రి పగలు తెలియక ఇంద్రుడక్కడనే మూర్ఛపోయెను. ఆమె అట్లు ఇంద్రుని సంభోగమాత్రము చేత (బ్రతుక నిష్టపడక) యోగశక్తితో దేహత్యాగము చేసెను. ఇంద్రుడాతర్వాత తను చేసిన పనికి సిగ్గుపడి రాజుకు భయపడి స్వర్గమునకేగిను.
రాజా శ్రుత్వా మృతాం దృష్ట్వా విలలాప భృశం ముహః ।
యజ్ఞం సమాప్య విప్రేభ్యో దదౌ పూర్ణాం చ దక్షిణాం ॥
రంభా చ మానవం దేహం త్యక్త్వా స్వర్గం జగామ హ ।
ఇత్యేవం కథితం సర్వం వృక్షార్జున విభంజనం ॥
నలకూబర మోక్షశ్చ రంభాయాశ్చ మహామునే ।
పుణ్యదం కృష్ణ చరితం జన్మమృత్యుజరాపహం ।
ఇత్యేవం కథితం సర్వమపరం కథయామి తే ॥
రాజు తన భార్య మరణించిన వార్త విని చూచి మాటి మాటికి మిక్కిలి దుఃఖించెను. ఆ వెనుక యజ్ఞము ముగించీ బ్రాహ్మణులకు నిండు దక్షిణలిచ్చెను. రంభయు మానవ శరీరము వదిలి స్వర్గమునకేగెను. ఓ నారదమహామునీ ! నీకేవిధముగా మద్ది చెట్టును (స్వామి) విరుచుట (కూల్చుట) రంభాసలకూబరులు శోషమోక్షము పొందుట చెప్పితిని. శ్రీకృష్ణచరిత్రము జన్మమృత్యువులను జరను (ముసలితనమును) తొలగించునట్టిది, పుణ్యప్రదమైనది. ఇక నీకు తరువాతి కథను చెప్పుదును.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే వృక్షార్జునభంజనం నామ చతుర్దశోఽధ్యాయః ॥
ఇది బ్రహ్మవైవర్తపురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన ఆర్జునవృక్ష భంజనమనెడి పదునాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 14 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Enraged by the failure of his spies to find the newborn child, King Kaṃsa dispatched the fierce, poisonous witch Pūtanā, who could assume any deceptive form she desired, to kill all infants in Gokula. Disguising herself as an extraordinarily beautiful celestial woman, Pūtanā entered Gokula and approached baby Kṛshṇa, offering her poisonous breast for Him to suck. Smiling knowingly, the infant Kṛshṇa sucked not only her breast milk but drew out her very life air along with all her sins, causing the massive witch to drop dead in her true terrifying demoness form across the forest, where Her body was liberated and transformed into fragrant wood when burned by the cowherds.