శ్రీ నారాయణ ఉవాచ :
యేన వా ప్రార్ధితః కృష్ణ ఆజగామ మహీతలం ।
యం యం విధాయ భూమౌ న జగామ స్వాలయం విభుః ॥
భారావతరణోపాయం దుష్టానాం చ వధోద్యమం ।
సర్వం శే కథయిష్యామి నువిచార్య విధానతః ॥
ఎవని ప్రార్థన మూలముగా కృష్ణుడు భూమండలమునకు వచ్చెనో, ఏయే కార్యములు చేసి ఆ విభుడు స్వస్థానమునకు తిరిగిపోయెనో, భూభ్రమును తొలగించుటకు ఏయే ఉపాయములు దుష్టుల వధించుట వంటి ప్రయత్నములు ఏమి చేసెనో అది యంతయు చక్కగా ఆలోచించే క్రమముగా నీకు చెప్పుదును.
అధునా గోవవేషం చ గోకులాగమనం హరేః ।
రాధా గోపాలికా యేన నిబోధ కథయామి తే ॥
శంఖచూడవధం పూర్వం సంక్షేపాత్ కథితం శ్రుతం।
అధునా తత్సువిస్తార్య నిబోధ కథయామి తే ॥
మొదట హరి గోపవేషమును ధరించుట అవతరించుట) గోకులమునకు వేంచేయుటయు, రాధాదేవి గోపికయగుటకు గల కారణమును చెప్పెదను. ఇంతవరకే శంఖచూడ వధను సంక్షేపముగ చెప్పగా వినియుంటివి. ఇప్పుడు అదియంతయు వివరించెదను.
శ్రీదామ్నః కలహాశ్చైవ బభూవ రాధయా సహ ।
శ్రీదామా శంఖచూడశ్చ శాపాత్తస్యా బభూవ హ ॥
రాధాం శశాప శ్రీదామా యాహి యోనిం చ మానవీం।
వ్రజే వ్రజాజాంగనా భూత్వా వీచరస్వ మహీతలే ॥
భీతా శ్రీదామ శపాత్సా శ్రీకృష్ణం సమువాచ హ ।
గోపీరూపా భవిష్యామి శ్రీదామా మాం శశావ హ ॥
కముపాయం కరిష్యామీ వద మాం భయభంజన ।
త్వయా వినా కథమహం ధరిష్యామి స్వజీవనం ॥
క్షణమేకం యుగశతం కాలనాథ త్వయా వినా।
చుక్షుర్నిమేష విరహాద్భవేదంధం మనో మమ ॥
శరత్పార్వణ చంద్రాభం సుధాపూర్ణాననం తవ ।
నాథ చక్షుశ్చకోరాభ్యాం పిచామ్యహమహర్నిశం ॥
త్వమాత్మా మే మనః ప్రాణా దేహమాత్రం వహామ్యహం।
దృష్టి శక్తిశ్చ చక్షుస్త్వం జీవనం పరమం ధనం ॥
స్వప్నే జ్ఞానే త్వయి మనః స్మరామీ త్వత్పదాంబుజం।
తవ దాస్యం వినా నాథ న జీవామి క్షణం విభో ॥
ఒకసారి గోలోకమున శ్రీరామునకు రాధాదేవికీ కలహము సంభవించెను. ఆమె శాపము వలన శ్రీదాముడు శంఖచూడుడై జన్మించెను. శ్రీరాముడు కూడ రాధాదేవికి “మనుష్య జన్మనెత్తి భూమి మీద గోకులములో గోపికపై చరించు” మని శాపమొసగెను. ఆ శాపమునకు భయపడి ఆమె శ్రీకృష్ణునితో శ్రీరాముడు నన్ను గోపీరూపమేతుమని శపించెను. ఓ భయభంజకుడా! నీవు లేకుండ నేనెట్లు బ్రతుకగలను. దీనికి ఏమి ఉపాయమో చెప్పుము. నీవు లేకుండ నాకు ఒక క్షణము నూరు యుగములగును. కనురెప్ప పాటు నీ యెడబాటు కలిగినను నా మనస్సు గ్రుడ్డిదగును. నాథా! శరత్కాల పూర్ణిమ నాటి చంద్రుని వంటి కాంతితో అమృతపూర్ణమైన నీ ముఖమండలమును నా కన్నులు అను చకోరపక్షులు రాత్రింబవళ్లు త్రాగుచున్నవి, నీవు నా ఆత్మవు. మనస్సువు, నాప్రాణములును నీవే. కేవలము నేను దేహమును మాత్రమే భరించుచున్నాను. నా కన్నులు నీవే. చూడగల శక్తివి కూడ నీవే. నౌ జీవనము, నా పరమ ధనము నీవే. జాగ్రత్ స్వప్నదశలందును నా మనస్సు నీయందే నిలిచి నీ పాదపద్మములనే స్మరించును. నాథా! నీ దాస్యము లేకుండ క్షణము కూడ జీవించలేను అనీ అనెను.
కృష్ణస్తద్వచనం శ్రుత్వా బోధయామాస సుందరం ।
వక్షసీ ప్రేయసీం కృత్వా చకార నిర్భయాం చ తొం ॥
మహీతలం గమిష్యామి వారా హే చ వరాననే ।
మయా సార్థం భూగమనం జన్మ తే2పి నిరూపితం ॥
ప్రజం గత్వా ప్రజే దేవి వీహరిష్యామీ కాననే ।
మమ ప్రాణాధికా త్వం చ భయం ఓం తే మయి స్థితే ॥
తామిత్యుక్త్యా హారిస్తత్ర విరరామ జగత్పతిః ।
ఆతో హేతోర్జగన్నాథో జగామ నందగోకులం ॥
కిం వా తన్య భయం కంసాద్భయాంతకారకస్య చ।
మాయా భయచ్చలేనైవ జగామ రాధికాంతికం ॥
విజహార తయా సార్ధం గోపవేషం విధాయ సః ।
సహ గోపాంగనాభిశ్చ ప్రతిజ్ఞా పాలనాయ చ ॥
బ్రహ్మణా ప్రార్థితః కృష్ణ: సమాగత్య మహీతలం ।
భారావతరణం కృత్వా జగామ స్వాలయం విభుః ॥
శ్రీకృష్ణుడు రాధాదేవి మాటలు విని ఆ ప్రియురాలిని వక్షస్థలమున చేర్చుకొని ఇట్లు బోధించి నిర్భయురాలిని చేసెను. “సుందరీ! నేను వరాహాకల్పమున భూమిపై అవతరింతును. నాతో పాటు నీకును మానవ జన్మ నిరూపితమైనది. గోకులమున అవతరించి అచటి అడవులలో విహరింతును. నీవు నా ప్రాణములకంటే అధికురాలవు. నేనుండగా నీకేమి భయము”, జగత్పతియగు శ్రీహరి ఇట్లు పలికి ఆమెనోదార్చెను. ఆ కారణముగా జగన్నాధుడు నందగోకులమున కేగెను. భయమునకు అంతకుడైన ఆస్వామికి కంసుని వలన భయమేమి? భగవన్మాయయే భయవేషమున రాధ వద్దకేగెను. తన ప్రతిజ్ఞా పాలనము కొరకు గోపవేషము ధరించి ఆ ప్రభువు రాధతో గోపాంగనలతో విహరించెను. బ్రహ్మచేత ప్రార్థించబడిన గోలోక కృష్ణుడు భువిపై అవతరించి భూభారము తొలగించి మరల గోలోకమునకు ఏగెను.
శ్రీదామ్నః కలహాశ్చైవ కథం వా రాధయా సహ।
సంక్షేపాత్కధితం పూర్వం సంవ్యస్య కథయాధునా॥
నారదుడు ఇట్లనెను :
రాధాదేవితో శ్రీదామునకు కలహమెట్లు సంభవించెనో పూర్వము సంగ్రహముగా చెప్పితిరీ. ఇపుడు వివరించి చెప్పుడు.
శ్రీనారాయణ ఉవాచ :
ఏకదా రాధయ సార్ధం గోలోకే శ్రీహరి: న్వయం ।
విజహార మహారణ్యే నిర్జనే రానమండలే ॥
రాధికా సుఖసంభోగాత్ బుబుధే న స్వకం పరం ।
కృత్వా విహారం శ్రీకృష్ణ స్తామపృష్ట్వా విహాయ చ ॥
గోపికాం విరజామన్యాం శృంగారార్థం జగామ హ ।
బృందారణ్యే చ విరజా సుభగా రాధికా సమా ॥
తస్యా వయస్యాః సుందర్యో గోపీనాం శతకోటయః ।
కృష్ణ ప్రాణాధికా గోపీ ధన్యా మాన్యా చ యోషితాం ॥
రత్నసింహాసనస్థా సా దదర్శ హరివంతికే ।
దదర్శ శ్రీహరిస్తాం చ శరచ్చంద్ర నిభాననాం ॥
మనోహరాం సస్మితాం చ వశ్యంతీం వక్ర చక్షుషా।
సదా షోడశ వర్షీయాం ప్రోద్భిన్న నవ యౌవనం॥
రత్నాలంకార శోభాడ్యాం భూషితాం శుక్లవాససా।
పులకాంకిత సర్వాంగీం కామబాణ ప్రపీడితాం ॥
దృష్ట్వా తాం శ్రీహరిస్తూర్ణం విజహార తయా సహ ।
పుష్పతలే మహారణ్యే నిర్జనే రత్నమండపే॥
మూర్ఛామపోప విరజా కృష్ణ శృంగార కౌతుకాత్ ।
కృత్వా వక్షసి ప్రాణేశం కోటికందర్ప సన్నిభం॥
నారాయణ ముని ఇట్లు పలికెను ;
ఒకసారి గోలోకమున నిర్జన మహారణ్యమున రాసమండలమున శ్రీహరి రాధతో విహరించెను. రాధాసుఖ సంపర్కము వలన తనను పరులను ఎరుగనంత మైమరచెను. అట్లు విహరించిన శ్రీకృష్ణుడామెకు చెప్పకుండ వదిలివేసి విరజయను పేరుగల వేరొక గోపిక పొందుకోసము పోయేను. బృందావనములోని విరజ రాధతో సమానురాలగు సుందరి. ఆమె చెలికత్తెలు శతకోటి సంఖ్యగల సుందర గోపికలు. స్త్రీలలో ధన్యురాలు, మాన్యురాలు ఐన విరజ కృష్ణునకు ప్రాణాధికమైనది. రత్నసింహాసనమందు కొలువున్న ఆమె సమీపమున నున్న హరీని చూసెను. శ్రీహరియు శరదృతువునందలి చంద్రుని వంటి ముఖము కలదియు వంకర చూపులతో విలాసముగా తనను చూచుచు చిరునవ్వుతో తన మనస్సును హరించునదియు ఎల్లప్పుడు పదునారేండ్ల వయస్సుతో నవయౌవనము కలదై రత్నాలంకార శోభతోను తెల్లని వస్త్రములతోను, మన్మధ బాణముల చేత మిక్కిలి పీడితురాలై సర్వాంగములు పులకించియున్న ఆ విరజను చూచి, అచ్చటి రత్నమండపములోని పూలపాన్పుపై ఆమెతో విహరించెను. ఆ విరజయు కోటి మన్మధ సుందరుడగు ప్రాణేశుని వక్షస్థలమున చేర్చుకొని శృంగారకేళీలో తన్మయురాలై మూర్ఛపొందెను.
తయాసక్తం శ్రీహరిం చ రత్నమండప సంస్థితం ।
దృష్వా చ రాధికాళ్యశ్చ చక్రుస్తాం చ నివేదనం ॥
తాసాం చ వచనం శ్రుత్వా సుష్వాప చ చుకోప చ ।
భృశం రురోద సా దేవీ రత్నపంకజలోచనా ॥
తా ఉవాచ మహాదేవీ మాం తం దర్శయితుం క్షమా: ।
యది సత్యం భ్రూత యూయం మయా సార్థం ప్రగచ్ఛత॥
కరిష్యామి ఫలం గోప్యాః కృష్ణస్య చ యధోచితం ।
కో రక్షిఽతాద్య తస్యాశ్చ మయి శాస్తిం ప్రకుర్వతి ॥
శీఘ్రమానయతాళ్యశ్చ తయా సార్థం హరిం ప్రియం ।
అంతర్వక్రం సస్మితం చ విషకుంభం సుధాముఖం ॥
మదాశ్రయం సమాగంతుం యూయం దాసం న దాస్యథ।
తమేవ మండపం రమ్యం యాత సంరక్షతేశ్వరం ॥
రాధీకావచనం శ్రుత్వా కాశ్చీత్ గోప్యో భయాన్వితాః ।
తాస్సర్వాః సంపుటాంజల్యో భక్తి సమ్రాత్మ కంధరాః ॥
తామూచుః పురతః స్థిత్వా నర్వా ఏవ ప్రియాం సతీం ।
ఆళ్య ఊచు:
వయం తం దర్శయిష్యామో విరజా సహితం విభుం ॥
శ్రీహరి ఆమెతో, రత్నమండపముందుండగా చూచిన రాధాదేవి చెలులు ఆమెవార్తను నివేదించిరి. వారి మాటలు విని రాధ మూర్ఛిల్లినట్లే కోపించెను. ఎర్రతామరల వంటి కన్నులు గల ఆమె మిక్కిలి ఏడ్చెను. ఆమె పిదప ఇట్లు పలికెను. మీరు సత్యము చెప్పుచుంటిరేని, నాకతని చూప సమరులేని నాతోబాటు నడువుడు, ఆ కృష్ణునకు ఆ గోపికకు తగిన కర్మ ఫలమునందింతును, నేనామెను శిక్షించుచుండగా ఎవడు రక్షించునో చూచెదను. లోపల వక్రాలోచనలు గలవాడు పైకి చిరునవ్వులు చిందించువాడు పైన అమృతము, లోన విషకుంభమైనవాడు అగు హరిని ఆమె విరజ) తో పాటు నా యింటికి తీసికొని రండు. మీరా దాసుని పట్టి తేనిచో ఆ రమ్యమండపమునకే అతని వద్దకు నడవండి అనెను. రాధాదేవి వచనములు వీసి భయము చెందిన కొందరు గోపికలు చేతులు జోడించి భక్తితో శిరస్సులు పంచి ఆమె ముందు నిలబడి తమకు ప్రియమైన ఆమెతో విరజాసహితుడైన హరిని నీకు చూపింతుము అని చెలులు పలికిరి.
తాసాం చ వచనం శ్రుత్వా రథమారుహ్య సుందరీ ।
జగామ సార్ధం గోపీభిస్త్రి షష్టి శతకోటిభిః ॥
వారీ పలుకులు విని రాధాసుందరి అరువదిమూడు శతకోట్ల గోపికలతో బాటు రథమెక్కి పోయెను.
రత్నేరద్రసార రచితం కోటి సూర్య సమప్రభం ।
మణీంద్ర సారరచితం కలశానాం త్రికోటిభిః ॥
రాజితం చిత్ర రాజీభిర్యైజయంతీ విరాజితం ।
లక్షచక్ర సమాయుక్తం మనోయాయి మనోహరం ॥
మణిసార వీకారైశ్చ కోటీస్తంభైః సుశోభితం ।
నానా చిత్ర విచిత్రైశ్చ సహితైః సుమనోహరైః ॥
సిందూరకారమణీభిర్మధ్య దేశే విభూషితైః ।
రత్న కృత్రిమ సింహైశ్చ రథ చక్రోర్ధ్వ సంస్థితైః॥
చతుర్లక్ష పరిమితైశ్చిత్రఘంటా సమన్వితై: ।
చిత్ర పుత్తలి శోభ్యార్వీచితైశ్చ విరాజితం ॥
రతిమందిర లకైశ్చ రత్నసార వినిర్మితైః ।
మణిసారకపాటైశ్చ శోభిడ్యైర్విచిత్రైశ్చ వాజిభిః ॥
మణీంద్ర సారకలశై: శేఖరోజ్జ్వలితైర్యుతం ।
భోగద్రవ్య సమాయుక్తం వేషద్రవ్య సమన్వితం॥
శోభితం రత్నశయ్యాభీ రత్నపాత్ర ఘటాన్వితం ।
హరిన్మణీనాం వేదీనాం సమూహేన సమన్వితం ॥
కుంకుమాభ మణీనాం చ సోపానైః కోటిభిర్యుతం ।
శ్యమంతకై: కౌస్తుభైశ్చ రుచకై: ప్రవరైస్తథా ॥
వద్మకృత్రిమ కోటీనాం శతకైశ్చ సుశోభితం ।
చిత్రకానన వాపీఖిర్విశిష్ఠాభిర్విరాజితం ॥
రతేంద్రసార రచితకలశోజ్జ్వల శేఖరం ।
శతయోజనమూర్ధ్వం చ దశయోజన విస్తృతం॥
పారిజాతప్రసూనానాం మాలా కోటి విరాజితం ।
కుందానాం కరవీరాణాం యూధికానాం తథైవ చ ॥
సుచారు చంపకానాం చ నాగేశానాం మనోహరైః ।
మల్లికానాం మాలతీనాం మాధవీనాం సుగంధినాం ॥
కదంబానాం చ మాలానాం కదంబైశ్చ విరాజితం ।
సహస్రదళ పద్మనాం మాలాభిశ్చ విరాజితం ॥
చిత్ర పుష్పోద్యాన నరః కాననైశ్చ విభూషితం ।
నర్వేషాం స్యందనానాం చ శ్రేష్టం వాయువహం పరం ॥
తత్సూక్ష్మ వస్త్ర సారాణేం వరైరాచ్ఛాదితం వరం ।
రత్న దర్పణ లక్షాణాం శతకైశ్చ సమన్వితం॥
శ్వేత చామరకోటీభిశిర్వజ్ర కోటిభిరన్వితం ।
చందనాగరు కస్తూరీ కుంకుమ ద్రవ చరిత్ర: ॥
పారిజాత ప్రసూనానాం కోట తల్ప విరాజితం ।
కోటిఘంటా నమాయుక్తం పతాకా కోటిభిర్యుతం ॥
రత్నశయ్యా కోటిభిశ్చ చిత్ర వజ్ర పరిచ్ఛదైః ।
చందనాకైశ్చంపకానాం కుంకుమైశ్చ విచిత్రితైః॥
పుష్పోవధాన సంయుకై: శృంగారారా భీరన్వితం।
అదృశ్యై రశ్రుతైర్దవ్యైః సుందరైశ్చ విభూషితం ॥
ఏవం భూలోధ్రధాతూర్ణమవరుహ్య హరిప్రియా ।
జగామ సహసా దేవీ తం రత్న మండపం మునే ॥
ఆ రథము శ్రేష్ఠమైన రత్నములతో నిర్మించబడినది. కోటి సూర్యుల ప్రభతో మణులతో నిర్మించిన మూడు కోట్ల శిఖరకలశములతో చిత్ర సమూహములతో ధ్వజములతో లక్ష చక్రములతో మనోహరముగా ఉండి మనస్సు వలె నడుచుచుండెను. శ్రేష్ఠమైన మణులతో నీర్మించిన కోటీ స్తంభములు మనోహరముగా విచిత్ర చిత్రములతో నిండియుండెను. స్తంభముల మధ్య భాగములు సింధూర వర్ణమణులతో వేలుగుచుండెను. రథచక్రములయొక్క పై భాగములందు రత్న నిర్మితములైన సింహములుండెను. నాలుగు లక్షల ఘంటలతోను ఆశ్చర్యము కల్గించు బొమ్మల సొగసుతోను రత్నసార నిర్మితములైన అనేక నివాసమందిరములతోను మణి కవాటములతోను వాటిపై విచిత్రములైన గుర్రపు బొమ్మల శోభతోను ఫై భాగములందు వెలుగుచున్న మణుల కలశములతోను ఆ రథము విరాజిల్లుచుండెను. అందు భోగద్రవ్యములు అలంకార సామగ్రితో కూడిన రత్నపాత్రలు కుంభములు రత్న నిర్మితశయ్యలు ఇంద్రనీలమణి నిర్మితములైన వేదికలు కుంకుమపువ్వు వన్నె గల అనేక సోపానములు (మెట్లు) శ్రేష్ఠములై వెలుచున్న శ్యమంతక కౌస్తుభమణులు పద్మాకారములతో కోటానుకోట్లు వెల్లుచుండెను. ఆ రథమున అక్కడక్కడ విచిత్రమైన అడవులు దిగుడు బావులు విశిష్టముగా ఉండెను. ఆ రథ ప్రమాణము సూరు యోజనముల ఎత్తు పది యోజనముల వెడల్పు కలిగియుండెను. పారిజాతములు, మొల్లలు, కరవీరము (గన్నేరు)లు, సంపెంగలు, నాగమల్లెలు, మల్లెలు, మాలతీ మాధవీ (బండి గురువింద పుష్పములు, కలీమీ పువ్వులు సుగంధములైన మాలాకోటులై సహస్రదళ పద్మముల మాలలును కలిగి ఆ రథము అద్భుతముగా వెలుగుచుండెను. చిత్రములైన పుష్పోద్యానములు, సరస్సులు, వనములు కలిగి రథములలో శ్రేష్ఠమై వాయువే వాహనముగా అది పోవుచుండెను. సుందర సూక్ష్మ వస్త్రముల చేత కప్పబడి వందల రత్న దర్పణములు శ్వేతచామరములు కోట్లకొలది వజ్రములతో చందనము అగరు కస్తూరి కుంకుమపువ్వుల ద్రవము పులిమిన పారిజాత పుష్పముల శయ్యలతోను కోటి రత్న శయ్యలతోను వజ్రాలంకారములతోను గంధము పూసిన కేసరి పులిమిన సంపెంగ పూల తలగడలతోను శృంగార యోగ్యములైన అద్భుత సుందర వస్తువులతోను కోటీ పతాకములు ఘంటలతోను ఆ రథము శోభించుచుండెను. ఓ నారదమునీ! ఇటువంటి రథము పై వెళ్లిన హరిప్రియయగు రాధాదేవి రత్నమండపము చేరగానే రథము దిగీ ద్వారము వద్దకు చేరెను.
ద్వారే నియుక్తం దదృశే ద్వారపాలం మనోహరం ।
లక్షగోఫై: పరివృతం స్మేరానన సరోరుహం ॥
గోషం శ్రీరామనామానం శ్రీకృష్ణ ప్రియ కింకరం ।
తమువాచ రుషా దేవీ రక్త పంకజలోచనా ॥
లక్షమంది గోపజనులతో చిరునవ్వు గల ముఖముతో శ్రీ కృష్ణునకు ప్రియమైన సేవకుడగు శ్రీరాముడన్న గోపాలుడు ద్వారపాలకుడుగా నియమించబడియుండెను. ఎర్రదామరల వంటి కన్నులు గల రాధాదేవి కోపముగా అతనితోనిట్లనెను.
గచ్చ దూరం గచ్ఛ దూరం రతిలంపటకీంకర ।
ఓదృశీం మత్పరాం కాంతాం ద్రక్ష్యామీ త్వత్ర్పభోరహం ॥
రాధికావచనం శ్రుత్వా నీశ్శంకః పురతః స్థితః ।
తామేవ న దదౌ గంతుం వేత్ర పాణిర్మహాబలః ॥
తూర్ణం చ రాధికాళ్యశ్చ శ్రీదామానం నకింకరం ।
బలేస ప్రేరయామానుః కోపేన స్ఫురితాధరాః॥
ఓ కాముకుని సేవకుడా! దూరమునకు తొలగిపొమ్ము. నీ ప్రభువుయొక్క ప్రేయసి నాకంటే ఎంత శ్రేష్ఠురాలో చూచెదను. ఆమె షూటలు విని మహాబలవంతుడుసు చేత బెత్తము ధరించిన వాడును అగు శ్రీరాముడు ఆమెకు అడ్డముగా నీర్భయముగా నిలిచి లోనికి పోనీయలేదు. వెంటనే రాధ చెలులు కోపముతో పెదవులు వణకగా అతని సేవకులతో పాటు శ్రీదాముని బలవంతముగా నెట్టివేసిరి.
శ్రుత్వా కోలాహలం శబ్దం గోపీకానాం హరి: స్వయం ।
జ్ఞాత్వా చ కోపితాం రాధామంతర్ధానం చకార హ ॥
విరజా రాధికాశబ్దాదంతర్ధానం హరేరపి ।
దృష్ట్వా రాధాం భయార్తా సా జహొ ప్రాణాంశ్చ యోగతః ॥
సద్యస్తత్ర సరిద్రూపం తచ్ఛరీరం బభూవ హ ।
వ్యాప్తం చ వర్తులాకారం తయా గోలోకమేవ చ ॥
కోటయోజన విస్తీర్ణం ప్రస్థే2తినిమ్నమేవ చ ।
ధైర్ఘ్యే దశగుణం చారు నానారత్నాకరం పరం ॥
ఆ గోపికల కోలాహల ధ్వని విని శ్రీహరి రాధాదేవి కోపమును తెలిసికొని అంతర్ధానమయ్యెను. రాధా శబ్దమును విని హరి అదృశ్యమగుట చూచి భయముతో ఖిన్నురాలైన విరజాదేవి యోగముతో ప్రాణములు విడిచెను. ఆమె వెంటనే నదీరూపము ధరించి ఎత్తు నుండి పల్లమునకు గోలోకమును గుండ్రముగా చుట్టి వచ్చుచు నానావిధ రత్నములకు నెలవై కోటి యోజనముల వెడల్పుతో పదికోట్ల యోజనముల పొడవుగా వ్యాపించెను.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే నారాయణ నారద సంవాదే విరజానద ప్రస్తావ వర్ణనం నామ ద్వితీయోధ్యాయః॥
ఇది శ్రీ బ్రహ్మవైవర్త్ర్త మహాపురాణములోని శ్రీ కృష్ణ జన్మఖండములో నారాయణ నారద సంవాదమందు విరజా నది యొక్క ప్రస్తావ వర్ణనము అను రెండవ అధ్యాయము.
Summary of chapter 2 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Distressed by the tyranny of wicked Asura kings such as Kaṃsa, Jarasandha, and Shishupāla who had plunged the world into adharma and suffering, the personified Earth goddess assumed the form of a weeping cow and approached Lord Brahmā for shelter. Lord Brahmā, along with Lord Śiva and all the principal Devas, traveled to the shores of the cosmic ocean to offer heart-wrenching prayers of refuge to the Supreme Lord Śrī Vishṇu. Listening to their appeals, an ethereal divine voice resonated from the heavens, assuring the assembled deities that the Supreme Lord Śrī Kṛshṇa would soon descend into the prison of Mathura to relieve the earth of her burden and establish eternal righteousness.