56 - అధ్యాయము

మూ॥ నారద ఉవాచ:

కిమపూర్వం శ్రుతంబ్రహ్మ న్రహస్యం పరమాద్భుతం ।

అనంతచరితం ధన్యం అనంతాస్యాచ్యుతస్యచ ॥

కథంకృష్ణో మహావిష్ణోః దర్పభంగం చకార సః ।

అన్యేషాం వా కథ మహోతద్భవాన్వక్తు మర్హతి ॥

స్వతః శ్రీకృష్ణచరిత మతీవ మధురం శ్రుతౌ ।

అతీవ మధురం రమ్యం కావ్యం కవిముఖాత్తతః ॥

శ్రీనారాయణ ఉవాచ:

మహావిష్ణో రహంకారో బభూవ సహ సేతిచ ।

సర్వం మల్లేమకూపేషు విశ్వాన్యేవాహమీశ్వరః॥

సంహారభైరవోభూత్వా తం స జగ్రాస లీలయా ।

స్థితేమూర్ధావశే షేచ ప్రసాదం తం చకార సః॥

సర్వాత్మనా ధ్యాయమానః స్తుతౌ భీతం కృపానిధిః ।

తచ్ఛరీరం సుసంపన్నం పునరేవ చకార సః ॥

బ్రహ్మణః సహసా బ్రహ్మన్నితిదర్పోబభూవహ ।

అహం త్రిజగతాం ధాతా కర్తాఽహమీశ్వరః స్వయం ॥

మత్పరః పూజితోనాస్తిమత్పరః పూజితేంద్రియః ।

ఇత్యేవం మనసా కృత్వా బహుదర్పో బభూవ హ ॥

తం బ్రహ్మణాం సమూహంచ దర్శయామాస తత్క్షణం ।

గోలోకే స్వసమీ పేచ వసంతం పురతో విభోః ।

పంచవక్త్రం చతుర్వక్త్రం షడ్వక్త్రంచ తతోఽధికం ॥

శతవక్త్రంచ ప్రత్యేకం బ్రహ్మాండౌఘంచ లీలయా ।

త్యక్తుకామం స్వదేహంచ వ్రీడయానతకంధరం ॥

పునః ప్రసాదం కృపయా తం చకార కృపానిధిః ।

కాలేన మోహినీ ద్వారా తమపూజ్యం చకార సః ॥

స్వకన్యాం దర్శయిత్వా తం సకామంచ చకార హ ।

 పునస్తద్దర్పభంగంచ శివద్వారా చకార సః ॥

తత్యాజ, లజ్జయాదేహం పునర్దేహం దధార సః ।

 పునశ్చకార తం పూజ్యం బ్రహ్మాణం బ్రాహ్మణః ప్రభుః ॥

జ్ఞానందదౌ మహాజ్ఞానీజ్ఞానానందః సనాతనః ।

విష్ణోర్బభూవగర్వశ్చ జగత్పాతాహమీశ్వరః ।

తమాత్మ విసృతంకృష్ణః చకార రామజన్మని ।

అహంవిశ్వం బిభర్మీతి శేషోదర్పీ బభూవ హ ॥

అను!! నారదుడిట్లన్నాడు - ఓ బ్రహ్మ ! పరమాద్భుతమైన రహస్యాన్ని ఇదివరలో లేనిదాన్ని దేన్నివిన్నావు. అనంతుడైన అచ్యుతుని అనంత చరితము ధన్యమైనది. (1) కృష్ణుడు మహావిష్ణువు దర్పభంగమును ఎట్లా చేశాడు. ఇతరుల దర్పాన్ని ఎట్లా అణచాడు. అహో ! దానిని మీరు చెప్పసమర్థులు. (2) వింటూంటే, సహజంగానే శ్రీకృష్ణ చరితము మిక్కిలి మధురమైనది. ఇంకా కవిముఖంనుండి వచ్చిన కావ్యం మిక్కిలి మధురమైంది. రమ్యమైనది. (3) శ్రీనారాయణుడిట్లన్నాడు - మహావిష్ణువునకు అహంకారముతొందరగా వచ్చింది. విశ్వము అంతా నారోమ కూపములందే ఉంది. నేనే ఈశ్వరుణ్ణి అన్న, (4) అతనిని ఆ ప్రభువు సంహార భైరవుడై అవలీలగా మింగాడు. తలమిగిలి ఉండగా ఆతనిని ప్రభువు అనుగ్రహించాడు కూడా (5) భయపడిన ఆతనిని స్తుతియందు సర్వాత్మనా ధ్యానింపబడిన కృపానిధి, తిరిగి ఆతని శరీరమును ఆ ప్రభుడు బాగా ఉండునట్లు చేశాడు. (6) బ్రహ్మకు త్వరగా గర్వమేర్పడింది. తానే బ్రహ్మనని. నేను ముల్లోకములకు ధాతను, కర్తను, నేనే స్వయంగా ఈశ్వరుణ్ణి అని, (7) నాకన్నా పూజింపబడే పరుడు లేడు. పూజింపబడ్డ ఇంద్రియములు కలవాడు నా కన్నా పరుడులేదు. ఇట్లా మనస్సులో అనుకొని, చాలా గర్వితుడైనాడు. (8) ఆ క్షణంలోనే ఆతనికి, గోలోకమందు, తన సమీపమందు విభువుకు ఎదురుగా ఉన్న బ్రహ్మల సమూహమును చూపించాడు. ఐదు ముఖములు గల, నాల్గు ముఖములు కల, ఆరు ముఖములు కల, అంతకన్నా ఎక్కువ ముఖములు కల వారిని (9) నూరు ముఖములు కలవానిని, ప్రత్యేకముగా (విడి విడిగా) బ్రహ్మాండముల సమూహమును అవలీలగా చూపాడు. సిగ్గుతో తలవంచుకున్న వానిని, తన శరీరాన్ని విడువాలని (చావాలని) అనుకున్న వానిని (10) కృపానిధియైన ప్రభువు కృపతో ఆతనిని తిరిగి అనుగ్రహించాడు. కొంత కాలానికి మోహిని ద్వారా ఆతనిని పూజానరునిగా చేశాడు ఆ ప్రభువు. (11) తన కన్యను చూపించి ఆతనిని సకామునిగా చేశాడు. తిరిగి శివుని ద్వారా ఆతనిదర్పాన్ని భంగపరిచాడు ఆ ప్రభువు. (12) సిగ్గుతో ఆతడు శరీరాన్ని వదిలాడు,తిరిగి ఆతడు దేహాన్ని ధరించాడు. తిరిగి ఆ బ్రహ్మను పూజించ తగిన వానినిగా చేశాడు. (ఆ బ్రహ్మకు చెందిన) బ్రాహ్మణుడైన ఆ ప్రభువు. (13) మహాజ్ఞాని, జ్ఞానమందే ఆనందించేవాడు. (జ్ఞాన, ఆనంద స్వరూపుడు), సనాతనుడు అగు ఆ ప్రభువు జ్ఞానాన్నిచ్చాడు, జగద్రక్షకుడను, ఈశ్వరుడును నేనే అనే గర్వము విష్ణువునకు కల్గింది. (14) ఆత్మను విస్మరించిన వానినిగా చేసి రామజన్మయందు, కృష్ణుడు (ప్రభువు) దర్పభంగం చేశాడు. నేను ఈ విశ్వాన్ని మోస్తున్నానని శేషుడు దర్పంగలవాడైనాడు. (15)

మూ॥ తద్దరం గరుడ ద్వారా చూర్ణీభూతం చకార సః ।

ఏకదా పూజితో నాగైః గరుడః కృష్ణవాహనః ॥

న పూజితశ్చ శేషేణ స్వదర్పేణ పురా మునే ।

గరుడేన జితంక్రోధాత్తమనంతం మనస్వినం ॥

చకార మోక్షణంతస్య శ్రీకృష్ణశ్చ కృపానిధిః ।

స్వయం శివః స్వదర్పిచ్చ వివాహం న చకార సః ॥

తం కృత్వా మాయయామోహం కారయామాస స్త్రీయుతం ।

పునర్జహార పత్నీంచ దక్షకన్యాం మహాసతీం ॥

వర్షం శుశోచ తద్దేహం క్రోడే కృత్వాచ శంకరః ।

నానాస్థానంచ బభ్రామ రుదన్ శోకాన్ముహుర్ముహుః ॥

జన్మాంతరే పునఃప్రాప్య తాం సతీం పార్వతీం ముదా ।

విసస్మారచ స్వజ్ఞానం దక్షశప్తః పునః శివః ॥

పునశ్చంగిరసద్వారా స్మారయామాస సత్వరం ।

ఏకదా సరథః శంభుః ప్రేరితస్త్రీపురే పురా ॥

హత్వాదైత్యం శివద్వారా త్రిపురారిం చకార తం ।

సర్వం వరంచ సర్వస్మై దాతుం శంభుః కృపానిధి: ॥

 స్వయం కల్పతరు ర్భూత్వా ప్రతిజ్ఞాంచ చకారసః ।

వృకాసురోఽను ష్టానంచ కృత్వా వవ్రే వరం విభుం ॥

దాస్యామి హస్తం యన్మూర్ద్నిభస్మసాద్భవతుక్షణాత్ ।

జగాదజగతాం నాథ ఈ ప్సితం తే భవిష్యతి ॥

ఇతి లబ్ధ్వా వరం రుద్రాద్గచ్ఛంతం శంకరం విభుం ।

హస్తందాతుంచ తన్మూర్ద్ని ప్రాధావత్సత్వరంపురా ॥

అతీవభీతఃశంభుశ్చ జగామ శరణం హరిం ।

భగవాంశ్చ శివస్యార్దే దైత్యం భస్మీ చకార సః ॥

శివంయుద్ధంచ కుర్వంతం బాణయుధేపురా విభుః ।

లీలయా జృంభణాస్త్రేణ జడీభూతం చకార సః॥

సమాగతం దక్షయజ్ఞే శంభుం దంభేన లీలయా ।

వారయామాస భగవాన్ హస్తం దత్వాచ తధ్గలే ॥

కేదారకన్యకాద్వారా శప్తో ధర్మోఽతిదైవతః ।

బభూవాతికృశోభీతః కుహ్వామేవ యథాశశీ॥

తదా తస్యచ శాపాంతే సత్యేపూర్ణో బభూవహ ।

త్రిపాద్బభూవ త్రేతాయాం ద్వాపరేచ ద్విపాదితి ॥

ఏకపాచ్చ కలౌ సోఽపి కలేరంతే పునః క్షయః ।

షోడశాంశోఽతిక్లిష్టశ్చ సస్మార చరణం విః ॥

ఆదర్పమును గరుడుని ద్వారా ఆ ప్రభువు చూర్ణముగా చేశాడు. ఒకసారి కృష్ణ వాహనమైన గరుడుడు నాగులతో పూజింపబడ్డాడు. (16) ఓ ముని! తన దర్పంతో (గర్వం) శేషుడు పూజించలేదు ఇది వరలో. అహంకారియైన ఆ అనంతుని, కోపంతో గరుడుడు జయించాడు (17). దయానిధియైన శ్రీకృష్ణుడు ఆతనికి విముక్తిని కల్గించాడు. స్వయంగా శివుడు తన అహంకారముతో ఆతడు వివాహం చేసుకోలేదు. (18) ఆతనిని మాయతో మోహితుణ్ణి చేసి స్త్రీ కలవాణ్ణిగా (వివాహితునిగా) చేశాడు. దక్షుని కూతురైన మహాసతిని, అతని భార్యను, తిరిగి తీసుకున్నాడు. (19) ఆ శంకరుడు ఆమె దేహమును ఉరము యందుంచుకొని సంవత్సర కాలము దుఃఖించాడు. శోకంతో మాటి మాటికి దుఃఖిస్తూ అనేక చోట్లకు తిరిగాడు.' (20) జన్మాంతరమందు తిరిగి ఆ సతియైన పార్వతిని పొంది ఆనందంతో తన జ్ఞానాన్ని మరిచాడు. తిరిగి శివుడు దక్షునితో శపింపబడి (21) తిరిగి అంగిరసుని ద్వారా త్వరగా (పోయిన జ్ఞానాన్ని) స్మరింప చేయించాడు. ఇది వరలో ఒకసారి శివుడు రథం యందున్న వాడై అతనిచే ప్రేరితుడై త్రిపురమందు (22) దైత్యుణ్ణి చంపాడు. శివునిద్వారా చంపించి ఆతనిని త్రిపురారిని చేశాడు. అందరికి అన్ని వరాలను ఇవ్వటానికి కృపానిధియైన శంభువు (23) స్వయంగా కల్పతరువైనాడు. ఆతడు ప్రతిజ్ఞకూడా చేశాడు. వృకుడనే రాక్షసుడు అనుష్టానము (జపము) చేసి విభువును వరము యాచించాడు (24) నేను ఎవని తలలో చేయి పెడానో వాడు ఆక్షణంలోనే భస్మం కావాలి, ఓ జగన్నాథ అని కోరగా అట్లాగే నీకోరిక నెరవేరుతుంది అని అన్నాడు. (23) అని రుద్రుని వలన వరాన్ని పొందాక, విభుడైన శంకరుడు వెళ్ళుతుండగా ఆతని తల పై చేయి పెట్టడానికి వాడు ఇదివరలో వేగంగా పరుగెత్తాడు. (26) బాగా భయపడ్డ శంభువు హరిని శరణు వేడాడు. భగవంతుడైన ఆ విష్ణువు శివునికై ఆ రాక్షసుని భస్మం చేశాడు. (27) ఇదివరలో విభువైన స్వామి బాణునితో యుద్ధమందు యుద్ధం చేస్తున్న శివుని, జృంభణాస్త్రంతో అవలీలగా జడీభూతుణ్ణి చేశాడు (కదలకుండా) ఆతడు. (28) దక్షుని యజ్ఞానికై అహంకారంతో వచ్చిన శంభుని అవలీలగా ఆతని గళమందు తన చేయి పెట్టి భగవంతుడు వారించాడు. (29) ధర్ము వాడై కేదారకన్యక ద్వారా శపింపబడి, అమావాస్య యందు చంద్రుడిలా చాలా కృశించి భయపడ్డాడు. (30) అప్పుడు ఆతడు శాపంతమందు సత్యకాలమందు (కృతయుగం) పూర్ణుడైనాడు. త్రేతాయుగమందు మూడు పాదములు కలిగి, ద్వాపరము యందు రెండు పాదములు కలవాడైనాడు. (31) కలియందు ఒకే పాదంకలవాడై ఆతడు కూడా కలి అంత మందు తిరిగి క్షీణిస్తాడు. పదహారవ అంశకలవాడై అతిక్లిష్టుడై విభువుయొక్క చరణములు స్మరించాడు. (32)

మూII తదా సత్యయుగారంభే పరిపూర్ణోఽభవత్పునః ।

పునర్యుగానురోధేన క్రమేణచ పునః క్షయః ॥

యమో మాండవ్యశాపేన శూద్రయోనిమవాప హ ।

తదా పునశ్శతాబ్దాంతే పునః శుద్ధో బభూవ హ ॥

సాంబో విమాతృశా పేన గలత్ కుషీ బభూవ సః ।

చంద్రో దర్పమదేనైవ జహారచ గురో: ప్రియాం ॥

బభూవ దర్పభంగోఽస్యయక్ష్మగ్రస్తో బభూవ సః ।

సూర్యో దర్ఫాత్తేజసశ్చ హంతుం శంకర కింకరం ॥

సుమాలిత్యభిదం దైత్యం జగామాశు గిరింప్రతి ।

అహర్నిశం దీప్తికరం కుర్వంతం విషయం రవే:।

సూర్యేణ భీతో దైత్యశ్చ శంకరం శరణం యయౌ ।

సూర్యం దృష్ట్వా శంకరశ్చ జగ్రాహ శూలమేవచ ।

భీతో దుద్రావ సూర్యశ్చ దృష్ట్వా తం శూలినం మునే ॥

జఘాన కాశ్యాం శూలేన శూలీకాశీశ్వరో రవిం ।

మూర్చాం సంప్రాప్య శూలేన దర్పభంగో బభూవహ ॥

సాంద్రాంధకారః సహసా జగ్రాహ పృథివీతలం ।

ఆశుతోషో మహాదేవో జీవయామాస తత్క్షణం ॥

తుష్టావ శంకరం సూర్యో లజ్జితోఽపి భయేనచ ।

కృత్వా తమాశిషం తుష్టో యయౌ గేహం కృపానిధిః ॥

విభుర్గరుత్మతో దర్పం బభంజ లీలయా పురా ।

నిశ్శ్వా సైః ప్రేరితస్యాపి శివస్య వృషభస్యచ ॥

ఆగచ్ఛతశ్చ వైకుంఠం పృష్ఠోకృత్వా శివంపురా ।

ద్రష్టుం సమాగతం భక్త్యా దేవం నారాయణం పరం ॥ 

వహ్ని: దర్పీ భృగోః పాత్సర్వభక్షో బభూవ హ ।

గురోః స్వభార్యాహరణాత్ దరశ్చూర్ణో బభూవ హ ॥

దుర్వాససో దర్పభంగో బభూవ హ్యంబరీషతః ।

సుదర్శనేన చక్రేణ విష్ణోః దుర్విష హేణచ ॥

జయస్య విజయస్యాపి దర్పభంగం చకార సః ।

వైకుంఠాత్పతితస్యాపి బ్రహ్మశాపాచ్ఛలేనచ ॥

నృసిం హేణ హతః సోఽపి హిరణ్యకశిపుర్యథా ।

సూకరేణ హిరణ్యాక్షో లీలయా చ రసాతలే ॥

రావణ కుంభకర్ణశ్చ నిహతౌ రామబాణతః ।

జన్మాంతరేచ లంకాయాం బ్రహ్మణా ప్రార్థితస్యచ ॥

శిశుపాలో హి నిహతః కృష్ణబాణేన లీలయా ।

దంతవక్త్రశ్చ సహసా పరిపూర్ణేఽత్రజన్మని ॥

సురాణాం దర్పభంగంచ దైత్యద్వారా చకారహ ।

అసురాణాం సురద్వారా విరోధేన పరస్పరం ॥

విధి ద్వారా దర్పభంగం భవతశ్చ చకార సః ।

భవానాసీనారదశ్చ పురా పుత్రః ప్రజాపతేః ॥

గంధర్వశ్చ పితుః శాపాత్ శూద్రీపుత్రః తతః క్రమాత్ ।

తతః పునర్నారదశ్చ ప్రసాదాదధునా విభోః ॥

మమ సాధ్యం విశ్వమితి కామోదర్పో బభూవ హ ।

తం ప్రమత్తం హరద్వారా భస్మసాచ్చ చకార సః ॥

పునఃకృత్వా ప్రసాదంతం జీవయామాస లీలయా ।

ఐకాంతికం చ తద్భక్తం సచ నాస్త్రం కరోతి హి ॥

అప్పుడు సత్యయుగారంభమందు తిరిగి పరిపూర్ణుడైనాడు. తిరిగి యుగములననుసరించి క్రమంగా తిరిగి క్షయము. (33) యముడు మాండవ్యుని శాపంతో శూద్రయోనిని పొందాడు. తిరిగి శతాబ్దముఅంతమందు శుదుడైనాడు. (34) సాంబుడు సవతి తల్లి శాపంతో స్రవిస్తున్న కుష్టు రోగం కలవాడైనాడు. చంద్రుడు దర్పపు మదంతోనే గురువుగారి ప్రియను హరించాడు. (35) ఈతనికి దర్పభంగమైంది. ఆతడు క్షయవ్యాధిగ్రస్తుడైనాడు. సూర్యుడు తన తేజస్సు యొక్క దర్పంతో శంకరుని యొక్క సేవకుని చంపదలిచాడు. (36) సుమాలి అనే పేరుగల రాక్షసుని ఒక పర్వతం దగ్గరకు త్వరగా తీసుకువెళ్లాడు. రాత్రింబగళ్ళు సూర్యుడు తన దీప్తిమంతమైన కిరణములకు విషయంగా చేశాడు (గురిగా). (37) సూర్యునకు భయపడి దైత్యుడు కూడా శంకరుని శరణువేడాడు. సూర్యుని చూచి శంకరుడు కూడా శూలమును చేత ధరించాడు. ఓ ముని ! శూలము చేతగల ఆ శివుని చూచి, భయపడి సూర్యుడు పరుగెత్తాడు. (38) కాశీశ్వరుడైన శూలి తన శూలంతో, సూర్యుని కాశియందు చంపాడు. శూలంతో మూర్చను పొందగా దర్పభంగమైంది. (39) పృథ్వీతలమును త్వరలో దట్టమైన అంధకారము ఆవహించింది. తొందరగా సంతోషడే మహాదేవుడు వెంటనే సూర్యుని బ్రతికించాడు. (40) సిగ్గుపడుతూ, భయంతో సూర్యుడు శంకరుని స్తుతించాడు. ఆతనిని ఆశీర్వదించి, సంతుష్టుడై కృపానిధి (శివుడు) గృహమునకు వెళ్ళాడు. (41) ఇది వరలో విభుడు (పాలకుడు) అవలీలగా గరుత్మంతుని దర్పాన్ని భంజింపచేశాడు. శివుని యొక్క వృషభము మొక్క నిశ్వాసములతో ప్రేరేపించబడ్డాకూడా (42) ఇదివరలో శివుని వీపు పై ఎక్కించుకొని వైకుంఠమునకు వస్తుండగా, పరుడైన నారాయణుని దేవుని భక్తితో చూడటానికి రాగా దర్పభంగమైంది. (43) భృగువు శాపం వల్ల అహంకారముగల వహ్ని సర్వభక్షకుడైనాడు. తన భార్య అపహరించబడటం వల్ల గురువు (బృహస్పతి) దర్పము చూర్ణమైనది. (44) అంబరీషుని వలన దూర్వాసునకు దర్పభంగమైంది. (45) జయవిజయులకు ఆతడు దర్పభంగం చేశాడు. బ్రహ్మశాపమనే నెపంతో వైకుంఠం నుండి పడ్డవానికి దర్పభంగమైంది. (46) ఎట్లా హిరణ్యకశిపుడు నృసింహునితో చంపబడ్డాడోవాడు అట్లాగే వరాహ అవతారంతో హిరణ్యాక్షుడు అవలీలగా రసాతలంలో చంపబడ్డాడు. (47) రామబాణంతో రావణకుంభకర్ణులు చంపబడ్డారు. బ్రహ్మను ప్రార్థించి జన్మాంతరంలో లంకలో చంపబడ్డారు.(48) కృష్ణుని బాణంతో అవలీలగా శిశుపాలుడు చంపబడ్డాడు. పరిపూర్ణమైన ఈ జన్మలో దంతవక్రుడు త్వరగా చంపబడ్డాడు. (49) సురల దర్పభంగమును రాక్షసుల ద్వారా చేయించాడు. అసురుల దర్పభంగమును సురల ద్వారా పరస్పర విరోధంతో చేయించాడు. (50) ప్రభువు విధి ద్వారా,నీ దర్పభంగాన్ని చేయించాడు. ఇదివరలో నీవు ప్రజాపతి పుత్రుడవు నారదుడవుగా ఉన్నావు. (51) గంధర్వుడువు తండ్రి శాపం కారణంగా ఆపిదప శూద్ర స్త్రీ పుత్రుడవైనావు. ఆ పిదప విభుని అనుగ్రహం వల్ల ఇప్పుడు తిరిగి నారదుడవైనావు. (52) ఈ విశ్వము నాకు సాధ్యమైంది, (ఆధీనము) అని కాముడు దర్పంగలవాడైనాడు. బాగా మదించిన వానిని హరుని ద్వారా ఆతడు భస్మంగా చేశాడు. (53) తిరిగి వానిని అనుగ్రహించి "అవలీలగా బ్రతికించాడు. ఆతని భక్తుని ఐకాంతికునిగా చేశాడు. ఆతడు అస్త్రము ధరించాడు. (54)

మూ!! చకార దర్పభంగంచ దరిణే లక్ష్మణస్యచ ।

రణే శంకరశూలేన రావణప్రేరితేనచ ॥

పునస్తం జీవయామాస రామస్య స్తవనేనచ ।

స్వయం విస్మృతవిష్ణోశ్చ బ్రహ్మశాపేన నారద ॥

చకార దర్పభంగంచ కార్తవీర్యార్జునస్యచ ।

జామదగ్న్యస్య శస్త్రేణామోఘేన పర్శునా పురా ॥

విప్రపుత్రస్య మరణే హరణే కృష్ణ యోషితాం ।

కర్ణేన సార్థం సమరే పార్థదర్పం బభంజ సః ।

బాణస్యచోషాహరణే చిచ్ఛేదచ భుజాన్విభుః ।

భృగోశ్చ దక్షయజ్ఞేచ దర్ప భంగం చకార సః ॥

పర్షురామస్య రామస్య వివాహే పథి గచ్ఛతః !

బభంజ దర్పం సమరే రామ ద్వారా పురా విభుః ॥

సుమేరోః శృంగభంగంచ వాయుద్వారా చకార సః ।

సముద్రాణాం దర్పభంగం చకారాగస్త్య భక్షణాత్ ॥

అకాలే సృష్టిహరణే తత్పుత్రమరణే పురా ।

కోపయుక్తస్య వాయోశ్చ దర్పభంగం చకార సః ।

ఉషాహరణ యాత్రాయాం ద్వారకాగమనే హరేః ।

బాణస్యచ గవాం హేతో: వరుణంచ శశాప సః ॥

కల హేగంగయా సార్థం వాణ్యా నారాయణాగ్రతః ।

సరస్వతీంచతత్యాజతస్యాదర్పం బభంజ సః ॥

దర్ప యుక్తాంచదుర్గాంచ త్యక్త్వా శంభుర్హి మలయే ।

కామంచభస్మ సాతృత్వా తపసేచయయౌ విభుః ॥

లజ్జామ వాపసాదేవీతస్యా దర్పంబ భంజసః ।

సాయయౌ తపసే విష్ణోః ప్రాప్తి హేతోః శివస్యచ ॥

భారతే సుచిరం తప్త్వా దేవీ విష్ణోర్వరేణచ ।

చకార స్వామినం శంభుం భగవంతం సనాతనం ॥

మహాసౌభాగ్యయుక్తాసా బభూవ శంకరప్రియా ।

విశ్వేషు సర్వదేవేషు పూజ్యావంద్యాస్తుతాసురైః ॥

దర్పయుక్తా మహాలక్ష్మీః బభూవసామహామునే ।

పరాభూతా పురాదేవీ జయేన విజయేనచ ।

ప్రవిశంతీ విభోర్ద్వారం దత్వా భక్తాయ వాంఛితం ।

నివారితా సా ద్వారా చ్చ తేన దౌవారికేణవై ॥

య దాత్మనస్తిరస్కారం సాభిమానా మహాసతీ ।

స్మృత్వాహరేః పాదపద్మం దేహం త్యక్తుం సముద్యతా ॥

తదా బ్రహ్మా మహేశశ్చ విష్ణుర్ధర్మశ్చ భాస్కరః ।

చంద్రశ్చకామ దేవశ్చ వైశ్వానరో ధనేశ్వరః ॥

ఋషయో మునయశ్చైవ మనవో విఘ్ననాశకః ।

మహేంద్రో వరుణశ్చైవ జగత్ప్రాణోహ తాశనః ॥

సమాయయూరుదంతస్తే పద్మాయాః పరతః పురః ।

తుష్టువుశ్చ మహాలక్ష్మీం మూలప్రకృతి మీశ్వరీం ॥

దేవా ఊచు :

క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే ।

శుద్ధసత్వస్వరూపేచ కోపాదిపరి వర్జితే ॥

అను!।దర్పముగల లక్ష్మణునిదర్పభంగమును, రావణుడు విసిరిన శంకరుని శూలంతో యుద్ధంలో చేయించాడు. (55) రాముని స్తుతితో తిరిగి ఆతనిని బ్రతికించాడు. ఓ నారద! బ్రహ్మ శాపం వల్ల స్వయంగా తాను విష్ణువునన్న విషయాన్ని మరిచాడు రాముడు. (56) జామదగ్నియొక్క వ్యర్థముకాని పరశు అనే శస్త్రంతో ఇదివరలో కార్తవీర్యార్జునుని దర్పభంగం చేశాడు. (57) విప్రపుత్రుని మరణమందు, కృష్ణుని స్త్రీ జనాన్ని తీసుకుపోయేప్పుడు, కర్ణునితో యుద్ధంలోను అర్జునుని దర్పాన్ని ఆతడు భంజింపచేశాడు. (58) విభుడు ఉషాహరణ సందర్భంలో బాణుని భుజమును చేధించాడు. దక్ష యజ్ఞమందు భృగువునకు దర్పభంగంచేశాడు, ఆతడు. (59) వివాహ సందర్భంలో ఆ దారిన వెళ్తున్న రాముని ద్వారా ఇదివరలో, విభుడు పరశురాముడైన రాముని గర్వమును యుద్ధంలో భంజింపజేశాడు. (60) ఆతడు వాయువు ద్వారా సుమేరువు యొక్క శృంగ భంగమును చేశాడు. అగస్త్యుని భక్షణ ద్వారా సముద్రములకు దర్పభంగం చేయించాడు. (61) ఆతని పుత్రుడు మరణించినప్పుడు ఇదివరలో అకాలంలో సృష్టిని హరిస్తుండగా కోపముక్తుడైన వాయువు యొక్క దర్పమును ఆతడు భంజింప చేశాడు. (62) ఉషాపహరణ యాత్రయందు హరి ద్వారకకు వెళ్ళగా, బాణుని యొక్క గోవుల కారణంగా ఆతడు వరుణుని శపించాడు. (63) నారాయణుని ఎదుట గంగతో వాణి కలహించినప్పుడు సరస్వతిని వదిలాడు. ఆతడు ఆమె దర్పమును భంజించాడు. (64) దర్పము కల్గిన దుర్గను వదిలి, శంభుడు హిమాలయమందు కాముని కూడా భస్మంగా చేసి విభుడు తపస్సుకై వెళ్ళాడు. (65) ఆదేవి సిగ్గుపడింది (అవమానంతో), ఆమె దర్పాన్ని ఆతడు భంజింపచేశాడు. ఆమె శివుని పొందే కొరకు విష్ణువును గూర్చి తపస్సుకై వెళ్ళింది. (66) దేవి, భారతమందు చాలా ఏళ్ళు తపస్సుచేసి, విష్ణువు వరంతో భగవంతుడైన సనాతనుడైన శంభుని స్వామిగా చేసుకొన్నది. (67) శంకరప్రియమైన ఆమె చాల గొప్ప భాగ్యవంతురాలైంది. విశ్వములందు అందరు దేవతలందు, దేవతలతో పూజించ తగినది, నమస్కరించ, స్తుతించతగినదిగా ఐనది (68) ఓ మహాముని! ఆమహాలక్ష్మి దర్పయుక్తురాలైంది. ఇది వరలో దేవి జయవిజయులతో అవమానించబడింది. (69) విభువు ద్వారాన్ని ప్రవేశిస్తూ భక్తునకు కోరికనేదో ఇచ్చి ఆ ద్వారపాలకునితో ద్వారం నుండి ఆమె తొలగించబడింది. (70) అభిమానం గల ఆ మహాసతి తనకు జరిగిన అవమానాన్ని తలచుకొని, హరిపాదపద్మములందు తన దేహాన్ని విడువటానికి సిద్ధపడింది. (71) అప్పుడు బ్రహ్మ మహేశుడు, విష్ణువు, ధర్ముడు, భాస్కరుడు, చంద్రుడు, కామదేవుడు, అగ్ని, కుబేరుడు (72) ఋషులు, మునులు, మనువు, వినాయకుడు, మహేంద్రుడు, వరుణుడు, వాయుదేవుడు హుతాశనుడు (73) వారంతా ఏడుస్తూ పద్మావతి యొక్క ముందరికొచ్చారు. అప్పుడు మూల ప్రకృతి, ఈశ్వరియైన ఆమెను మహాలక్ష్మిని స్తుతించారు కూడా. (74) దేవతలిట్లా అన్నారు - ఓపరాత్పరి, క్షమ స్వభావంగల దానా, భగవతి, అంబ, క్షమించు. శుద్ధ సత్వస్వరూపురాలివి కోపాదులు లేని దానివి (75)

మూ!! ఉపమే సర్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే ।

త్వయా వినా జగత్సర్వం మృతతుల్యంచ నిష్ఫలం ॥

సర్వసంపత్స్వరూపా త్వం సర్వేషాం సర్వరూపిణీ ।

రాసేశ్వర్యధిదేవీ త్వం త్వత్కలాః సర్వయోషితః ॥

కైలాసే పార్వతీ త్వంచ క్షీరోదే సింధుకన్యకా ।

స్వర్గేచ స్వర్గలక్ష్మీ స్వం మర్త్యలక్ష్మీశ్చభూతలే ॥

వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ ।

గంగా, చ తులసీ త్వంచ సావిత్రీ బ్రహ్మలోకతః ॥

కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయం ।

రాసే రాసేశ్వరీ త్వంచ వృందా వృందావనే వనే ॥

కృష్ణప్రియత్వం భాండీరే చంద్రా చందనకాననే ।

విరజా చంపకవనే శతశృంగేచ సుందరీ ॥

పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీవనే ।

కుందదంతీ కుందవనే సుశీలా కేతకీవనే ॥

కదంబ మాలా త్వం దేవీ కదంబకాననేఽపిచ ।

రాజలక్ష్మీ రాజగే హే గృహలక్ష్మీర్గృహేగృహే ॥

ఇత్యుక్త్వా దేవతాః సర్వేమునయోమనవస్తథా ।

రురుదు: నమ్ర వదనాః శుష్కకంఠోష్ఠ తాలుకాః ॥

ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం ।

యః పఠేత్రాతరుత్థాయ సవై సర్వం లభేద్ధ్రువం ॥

అభార్యోలభతే భార్యాం వినీతాంచ సుతాం సతీం ।

సుశీలాంసుందరీం రమ్యామతి సుప్రియవా దినీం ॥

పుత్రపౌత్ర వతీం శుద్ధాంకులజాం కోమలాం వరాం ।

అపుత్రోలభతే పుత్రం వైష్ణవంచిరజీవినం ॥

పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినం ।

భ్రష్టరాజ్యోలభే ద్రాజ్యం భ్రష్ట శ్రీఃలభతేశ్రియం ॥

హతబంధుః లభేద్బంధుం ధననష్టాధనం లభేత్ ।

కీర్తి హీనోలభేత్కీర్తిం ప్రతిష్ఠించలభేద్ధ్రువం ॥

సర్వమంగలదం స్తోత్రం శోకసంతాప నాశనం ।

హర్షానందకరం శశ్వత్ ధర్మమోక్ష సుహృత్ప్రదం ॥

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే శ్రీ కృష్ణ జన్మ ఖండే ఉత్తరార్థ నారాయణ నారద సంవాదే భగవద్గుణ వర్ణనే లక్ష్మీస్తోత్ర కథనం నామ షట్పంచాషత్తమోఽధ్యాయః.

అను!! దేవతా స్త్రీలందరికి (సాధ్వీమణులకు) ఉదాహరణమైన దానివి. దేవతలతో పూజింపబడే దానివి. నీవు లేకపోతే ఈ జగమంతా మృతప్రాయము, నిష్ఫలమైనది (76) నీవు సర్వసంపదల స్వరూపమువు. అందరికి అన్ని రూపములుగా ఉండే దానివి. రాసేశ్వరివి (2) అధిదేవివి స్త్రీలంతా నీ కళాస్వరూపులే. (77) కైలాసమందు నీవు పార్వతివి, క్షీరసముద్రమందు సింధుకన్యకవు. స్వర్గమందు స్వర్గలక్ష్మివి, నీవు. భూతలమందు మర్త్య లక్ష్మివి (78) వైకుంఠమందు మహాలక్ష్మివి. దేవదేవి. సరస్వతివి. గంగవు, తులసివి. బ్రహ్మలోకంలో సావిత్రి.. (79) కృష్ణునకు ప్రాణము. అధిదేవివి నీవు. గోలోకమందు స్వయంగా రాధికవు. రాసక్రీడయందు రాసేశ్వరివి నీవు. బృందావనమందు బృందవు. (80) భాండీరమందు కృష్ణప్రియవు. చందనకాననమందు చంద్రవు. చంపక వనమందు విరజవు. శతశృంగమందు సుందరివి. (81) పద్మవనమందు పద్మావతివి. మాలతీ వనమందు మాలతివి. కుందవనమందు కుందముల వంటి పలు వరుసగలదానివి. కేతకీవన మందు సుశీలవు. (82) కదంబ కానన మందు నీవు కదంబమాలవు, ఓ దేవి! రాజగృహమందు రాజలక్ష్మివే. ప్రతిగృహమందు గృహలక్ష్మివి. (83) ఇట్లా పలుకుతూ దేవతలంతా మునులు, మనువులు కూడా, తలలు వంచుకొని, కంఠము తాలుభాగము పెదవులు ఎండిపోతుండగా ఏడ్చారు. (84) అనే ఈ లక్ష్మీస్తవము శుభమైనది. సర్వదేవతలతో చేయబడింది. పుణ్యప్రదమైంది. ప్రొద్దున్నే లేచి చదివినవాడు అన్నింటిని పొందుతాడు, నిశ్చయము (85) భార్య లేనివాడు భార్యను పొందుతాడు. వినయముగల కూతురును, భార్యను పొందుతాడు. మంచిశీలము, సౌందర్యము గలిగి రమ్యమైనదానిని చాలా ప్రియంగా మాట్లాడేదానిని పొందుతాడు. (86) పుత్రులు పౌత్రులు కలిగినదానిని శుద్ధమైన దానిని, మంచి కులమందు జన్మించిన దానిని కోమలమైనదానిని, శ్రేష్ఠమైన దానిని పొందుతాడు. పుత్రులు లేనివాడు పుత్రుణ్ణి పొందుతాడు, చిరజీవియైన వాణి విష్ణు భక్తుణ్ణి (సంబంధీకుని) (87) అధిక ఐశ్వర్యం కలవానిని, విద్యావంతుని, కీర్తిమంతుని పొందుతాడు. రాజ్యభ్రష్టుడైనవాడు తిరిగి రాజ్యాన్ని పొందుతాడు. లక్ష్మిని (శ్రీ) పోగొట్టుకున్నవాడు శ్రీని తిరిగి పొందుతాడు. (88) నష్టమైన బంధువులు కలవాడు బంధువులను తిరిగి పొందుతాడు, ధన భ్రష్టుడు ధనాన్ని పొందుతాడు. కీర్తి హీనుడు కీర్తిని పొందుతాడు. ప్రతిష్ఠను కూడా పొందుతాడు, నిశ్చయము (89) ఈ స్తోత్రము అన్ని శుభములనిచ్చేది. శోకసంతాపముల నశింపచేసేది హర్ష ఆనందముల చేకూర్చేది. ఎల్లప్పుడూ ధర్మ మోక్షములను సౌహార్దాన్నిచ్చేది ఈ స్తోత్రము. (90) అని శ్రీ బ్రహ్మవైవర్త మహా పురాణమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు భగవద్గుణ వర్ణన మందు లక్ష్మీ స్తోత్ర కథన మనునది ఏబది ఆరవ అధ్యాయము. సమాప్తము. (56)