10 - పూతనా మోక్షము

శ్రీనారాయణ ఉవాచ :

ఆధ కంసః సభామధ్యే స్వర్ణ సింహాసన స్థితః ।

శుశ్రావ వాచం గగనే సూనృతామశరీరిణీం॥

 కిం కరోషి మహామూఢ చింతాం స్వశ్రేయసః కురు ।

జాతః కాలో ధరణ్యాం తే తిష్ఠాపాయో నరాధిప ॥

నందాయ తనయం దత్వా వసుదేవస్తవాంతకం ।

 కన్యామాదాయ తుభ్యం చ దత్వా సంమాయయా స్థితః ॥

 మాయాంశ కన్యయం వాసుదేవః స్వయం హరి: ।

తవ హంతా గోకులే చ వర్ధతే నందమందినే ॥

 దేవక్యాః సప్తమో గర్భో వర్ధతే నందమందిరే ।

దేవక్యాః సప్తమో గర్భోన సుస్రాహామృతం నుతం॥

స్థాపయామాన మాయా తం రోహిణీ జఠరే కిల ।

తత్ర జాతశ్చ శేషాంశో బలదేవో మహాబలః ॥

గోకులే తౌ చ వర్ధేతే కాలౌ తే నందమందిరే ।

శ్రీనారాయణ మహర్షి ఇట్లు పలికెను :

ఆ తరువాత కంసుడు సభలో బంగారు సింహాసనమున కూర్చుండి యుండగా ఆకాశము నుండి సత్యమైన అశరీర వాక్కు ఇట్లు వినిపించే. “ఓ మూడుడా! ఏమి చేయుచున్నావు. నీ క్షేమము గూర్చి ఆలోచించుకొనుము. ఓ గెజా! నీకపాయము నిలిచియున్నది. భూమి మీద నీకు యముడు పుట్టినాడు. వసుదేవుడు నీకంతకుడైన తన కుమారుని సందుని కప్పగించి, అక్కడినుండి కన్యను దెచ్చి నీకిచ్చి ఎరుగనట్లున్నాడు. ఈ కన్య మాయయొక్క అంశతో పుట్టినది. వసుదేవుని పుత్రుడు స్వయముగా శ్రీహరియే. నిన్ను చంపువాడు గోకులములో నందుని యింట పెరుగుచున్నాడు. దేవకి ఏడవ గర్భము కూడ నందునింట పెరుగుచున్నది. దేవకి ఏడవ గర్భము చచ్చి జారిపడలేదు. బ్రతికియున్న ఆ పుత్రుని మాయ రోహిణీ గర్భములోనికి చేర్చి నీలిపినదట. ఆ గోకులములోనే మహాబలవంతుడైన బలదేవుడు శేషుని అంశతో పుట్టినాడు. నీకు యములైన ఆ యిద్దరు గోకులములో నందమందిరమున పెరుగుచున్నారు.

శ్రుత్వేతి వచనం రాజా బభూవానమ్రకంధరః ॥

చింతోమవాప సహసా తత్యాజాహారమున్మనాః ।

పూతనాం చ సమానీయ ప్రాణేభ్యః ప్రేయసీం సతీం॥

ఉవాచ భగినీం రాజా సభామధ్యే చ నీతివిత్ ।

ఇట్టివాక్కును రాజు విని తలవంచుకొనీ హఠాత్తుగా వీచారమగ్నుడాయెను. దుఃఖముతో ఆహారమునే వదిలివేసెను. రాజనీతి, నెరిగిన అతడు తన ప్రాణములకంటె యిష్టురాలైన పూతనను పిలిపించి సభామధ్యమున ఇట్లు పలికెను.

కంస ఉవాచ :

పూతనే గోకులం గచ్ఛ కార్యార్థం నంద మందిరం ॥

విషాక్తం చ స్తనం కృత్వా శీశమే దేహి సత్వరం।

త్వం మనోయాయినీ వత్సే మాయాశాస్త్రవిశారదా ॥

మాయామానుషరూపం చ విధాయ వ్రజ యోగిని।

దుర్వాససో మహామంత్రం ప్రాప్య సర్వత్రగామినీ॥

 నర్వరూపం విధాతుం త్వం శక్తాఽసి సుప్రతిష్ఠితే।

ఇత్యుక్త్వా తాం మహారాజస్తస్థౌ సంనది నారద॥

కంసుడిట్లనెను;

బిడ్డా పూతనా! ఒక కార్యము కొరకు నీవు గోకులములోని నందునింటికి పొమ్ము. నీ స్తనములను విషముతో నింపి అక్కడి శిశువుకు పాలిమ్ము. నీవు మనస్పంత వేగముగా పోవుదానవు. మాయాశాస్త్రములో నేర్పు గలదానవు. ఓ యోగినీ! దూర్వాసుని - మహామంత్రమును పొంది అన్నిచోట్లకు పోగలదానవై యుంటివి. ఓ కీర్తిమంతురాలా! అన్ని రూపులు ధరించుటకు నీవు శక్తిగలదానవు. కావున మాయతో మనుష్య స్త్రీ రూపము దాల్చి త్వరగా పొమ్ము” అని కంసుడు పలికి సభలో నిలిచెను.

జగామ పూతనా కంసం ప్రణమ్య కాషుచారిణీ ।

తప్త కాంచవవర్ణభా నానాలంకార భూషితా ॥

బిభ్రతీ కబరీ భారం మాలతీ మాల్య సంయుతం।

కస్తూరీ బిందునా యుక్తం సిందూరం దధతీ ముదా॥

మంజీర రశనాభ్యాం చ కలశబ్దం ప్రకుర్వతీ।

సంప్రావ్య గోష్ఠం దుర్దర్శం నందాలయ మనోహరం॥

వరిఖాభిర్గభీరాభిర్దుర్లంఘ్యాభిశ్చ వేష్ఠితం।

రచితం ప్రస్తరైర్ధివ్యైర్మితం విశ్వకర్మణా॥

ఇంద్రనీలైర్మరకలైః పద్మరాగైశ్చ భూషితం ।

సువర్ణకలశైర్దివ్యైశ్చిత్రితై: శేఖరోజ్జ్వలై:॥

 ప్రాకారైర్గగనస్పర్శైశ్చతుర్థార సమన్వితైః ।

యుక్తం లోహ కపాటైశ్చ ద్వారపాల సమన్వితైః ॥

 వేష్టితం సుందరం రమ్యం సుందరీ గణవేష్టితం।

ముక్తా మాణిక్యపరమైః పూర్ణ రత్నాదిభిర్ధనైః ॥

స్వర్ణపాత్ర ఘటాకీర్ణం గవాం కోటిభిరన్వితం।

భరణీయః కింకరైశ్చ గోపలక్షైః సమన్వితం॥

దాసీనాం చ సహస్రైశ్చ కర్మవ్యగ్రైన్సమన్వితం।

ప్రవివేశాశ్రమం సాధ్వీ నస్మితా నుమనోహరా॥

పూతన కంసునకు నమస్కరించి కోరిన విధముగా అంతట చరించగలదై స్వచ్ఛమైన బంగారము వంటి శరీరకాంతితో అనేక విధములైన అలంకారములు ధరించి ప్రయాణమొనర్చెను. వెండ్రుకల కొప్పు మీద మాలతీ పుష్పమాలిక ధరించీ, నుదుట కస్తూరి తిలకము పై ఎత్తిని సిందూరపు చుక్కబొట్టు పెట్టుకొని, కాలి అందెలు మొలనూలు మనోజ్ఞముగా మ్రోగుచుండగా, సామాన్యులకు చూడి శక్యము గాని నందుని భవనము చేత మనోహరముగా ప్రకాశించుచున్న గోష్ఠమును (గోకులము, రేపల్లె) ప్రవేశించెను. ఆ గోకులము దాట శక్యము గాని లోతైన అగడ్తలతో {కందకములు) చుట్టబడి యుండెను. విశ్వకర్మ ఆ పట్టణమును దివ్యశిలలతో నిర్మించెను. ఇంద్రనీలమణులు మరకతమణులు పద్మరాగమణులతో అలంకరింపబడి, గోపురముల మీద బంగారు కలశములు ప్రకాశించుచుండెను. ఆకాశమునంటునంత ఎత్తైన ప్రాకారములు, లోహకవాటము లమర్చిన నాలు ప్రాకార ద్వారములను రక్షించుచున్న ద్వారపాలకులతో మిక్కిలి అందముగా నున్న ఆ గోకులమును సుందరీగణములు చుట్టియుండిరి. ముత్యములు శ్రేష్ఠమైన మణులు రత్న పూర్ణములైన ధనరాసులు బంగారు పాత్ర సామగ్రి స్వర్ణ భాండములు నిండి, కోట్ల గోగణములతో గూడి, పోషింపబడు దాసజనమైన లక్షల గోపాలురతో, పనులతో, శ్రద్ధలో మునిగియున్న దాసీజనములతో నిండియున్న ఆ యాశ్రమమును (గోకులము) చిరునవ్వుతో చూచువారి మనస్సులు హరించుచున్న ఆ స్త్రీ (పూతన) ప్రవేశించెను.

దృష్ట్వా తాం ప్రవిశంతీం చ గోప్యో దృష్ట్వానుమేనిరే ।

కిం వా పద్మాలయా దుర్గా కృష్ణం ద్రష్టుం సమాగతా ॥

ప్రణేముర్గోపికా గోపాః పవ్రచ్చు: కుశలం చ తాం ।

దదౌ సింహాసనం పాద్యం వాసయామాన తత్ర వై ॥

పవ్రచ్ఛ కుశలం సా చ గోపానాం బాలకన్య చ ।

ఉవాస సస్మితా సాధ్వీ పాద్యం జగ్రాహ సాదరం ॥

నందుని గృహమున ప్రవేశించుచున్న ఆమెను చూచి గోపికలు కృష్ణుని దర్శించుటకై వచ్చిన లక్ష్మీదేవియో పార్వతియో అనుకొనిరి. .. గోపాలకులు గోపికలు నమస్కరించి కుశల ప్రశ్నలడిగిరి. పాదములు కడుగుకొనుటకు నీళ్లిచ్చి సింహాసనముపై కూర్చుండబెట్టిరి. చిరునవ్వుతో ఆ సాధ్వి గోపాలకుల యొక్క నందబాలుని యొక్క కుశలమును ప్రశ్నించీ వారిచ్చిన పాద్యము స్వీకరించి కూర్చుండెను.

తామూచుర్గోపికాస్సర్వాః కా త్వమీశ్వరి సాంప్రతం ।

 వాసస్తే కుత్ర కిం నామ కింవాత్ర కర్మ నో వద ॥

తాసాం చ వచనం శ్రుత్వా సాప్యువాచ మనోహరం ।

మధురవాసినీ గోపీ సాంప్రతం విప్రకామినీ ॥

శ్రుతం వాచిక వక్త్రేణ తత్త్వం మంగళసూచకం।

బభూవ స్థవిరే కాలే నందపుత్రో మహానీతి ॥

 శ్రుత్వాఽగతాఽహం తం ద్రష్టుమాశిషం కర్తు మీప్సితాం ।

 పుత్రమానయ తం దృష్ట్వా యామి కృత్వా తమాశిషం॥

ఓ ఈశ్వరీ! నీవెవ్వరు? నివాసమెక్కడ? నీ పేరేమి? ఇప్పుడిక్కడకు నీకేమీ పని మీద వచ్చితివి?” అని గోపికలందరామెను ప్రశ్నించగా వారి మాటలు విని ఆమె మనోహరముగా నిట్లు పలికెను. “నేను మధురా నివాసినిని. నా పేరును గోపికయే. నేను బ్రాహ్మణ స్త్రీని. “లోకులోకరికొకరు చెప్పుకోనుచుండగా, ముసలి వయస్సులో నందునకొక గొప్ప పుత్రుడు జన్మించెను” అను మంగళ సూచకమైన ఒక తత్త్వమును వింటిని. దానిని విని ఆ బాలుని చూచి ఇష్టమైన ఆశీస్పులిచ్చుటకు వచ్చితిని. ఆ పుత్రునిటుయెమ్ము, వానిని చూచి ఆశీర్వదించి వెళ్లుదును” అనెను.

బ్రాహ్మణీ వచనం శ్రుత్వా యశోదా హృష్టమానసా ।

ప్రణమయ్య సుతం క్రోడే దదౌ బ్రాహ్మణయోషితః ॥

కృత్వా క్రోడే తు తం సాధ్వీ చుచుంబ చ పునః పునః ।

స్తనం దదౌ సుఖాసీనా హరిం పుణ్యవతీ సతీ ॥

అహోఽద్భుతోఽయం బాలస్తు సుందరో గోవసుందరి।

 గుణైర్నారాయణనమో బాలోఽయమీత్యువాచ ప ॥

ఆ బ్రాహ్మణ స్త్రీ మాటలు విని యశోదాదేవి సంతోషముతో కొడుకు సామెముందు నమస్కరింపజేసి (బోర్లవేసి) ఆమె ఒడిలోనికి అందించెను. ఆ సాధ్వీ బాలుని తన యొడిలో చేర్చుకొని మరల మరల ముద్దులు పెట్టుకొనెను. కుదురుగా కూర్చుండి ఆ పుణ్యవతి శ్రీకృష్ణుని నోటికి చన్ను అందించెను. “ఏమీ అద్భుతము. ఈ బాలుడెంత సుందరుడమ్మా గోపమ్మా, ఈ పసివాడు గుణములను బట్టి నారాయణునితో సమానుడు” అని పల్కెను.

కృష్ణో విషస్తనం పీత్వా జహాస వక్షసి స్థితః ।

తస్యాః ప్రాణై స్సహ పపౌ విషక్షీరం సుధామివ ॥

తత్యాజ బాలకం సాధ్వీ ప్రాణాంస్త్యక్త్వా వపాత హ।

వికృతాకారవదనా చోత్తానవదనా మునే ॥

ఓ నారదా! శ్రీకృష్ణుడామె వక్ష స్థలమున నిలచి విషము గల స్తనమును త్రాగి నవ్వను. ఆమె ప్రాణములతో బాటు ఆ విషపు పాలను అమృతము వలె త్రాగెను. ఆ సాధ్వి బోలకుని విడిచిపెట్టి ప్రాణములు విడిచి పడిపోయేను. మాయారూపము తొలగి వికారమైన ఆకారము ముఖము గలదై నోరు తెరచెను.

స్థూలదేహం పరిత్యజ్య సూక్ష్మదేహం వివేశ పా ।

ఆరుదోహ రధం శీఘ్రం రత్నసారవినిర్మితం ॥

 పార్షద ప్రవరైర్దివ్యైర్వేష్టితం సుమనోహరైః।

 శ్వేత చామర లక్షేణ శోభితం లక్షదర్పణిః ॥

వహ్ని శౌచేన వస్త్రేణ నూక్ష్మేణ భూషితం వరం ।

నానా చిత్ర విచిత్రైశ్చ నద్రత్న కలశైర్యుతం ॥

సుందరం శతచక్రం చ వలితం రత్నతేజసా ।

పార్షదాస్తాం రధేకృత్వా జగ్ముర్గోలోకముత్తమం ॥

దృష్ట్వా తమద్భుతం లోకా గోపికాశ్చాతివిస్మితా: ।

 కంసః శ్రుత్వా చ తత్సర్వం విస్మితశ్చ బభూవ హ॥

ఆ పూతన ఆత్మ తన స్థూల దేహము వదిలి (పాంచభౌతికము) సూక్ష్మదేహమున (దేవశరీరమున) ప్రవేశించెను. వెంటనే రత్ననిర్మితమును సుందరులైన విష్ణుపార్షదులు చుట్టి ఉన్నదియు ఒక లక్ష వింజామరతో ఒక లక్ష అద్దములతో శోభించుచు అగ్నివలె ప్రకాశించెడి సన్న వస్త్రములతో అలంకరింపబడినదియు, చిత్రవిచిత్రములైన రత్న కలశములతో కూడినదియు, రత్నముల తేజస్సు మండలాకారముగా వ్యాపించినదియు నూరు చక్రములు గలదియు నగు సుందరమైన రథమునెక్కెను. ఆ పార్షదులామెను రథము ఫై ఎక్కించుకొని ఉత్తమమైన గోలోకమునకు వెళ్లిరి. ఆ అద్భుత సంఘటనను గోపికలు, అన్ని లోకముల వారు చూచి మిక్కిలి విస్మయము పొందిరి. కంసుడిదియంతయు విని ఆశ్చర్యపడెను.

యశోదా బాలకం దృష్ట్వా క్రోడేకృత్వా స్తనందదౌ ।

మంగళం కారయామాస విప్రద్వారా శిశోర్మునే ॥

దదాహ దేహం తస్యాశ్చ నందః సానందపూర్వకం।

చందనాగురు కస్తూరీ సమం సంప్రావ్య సౌరభం ॥

అప్పుడు యశోద కుమారుని జూచి ఒడిలోనికి తీసుకొని పాలిచ్చెను. శిశువునకు బ్రాహ్మణునితో మంత్ర జలము చెల్లించి రక్ష గట్టించెను. నందుడు పూతన శరీరమున కగ్ని సంస్కారము జరిపించెను. ఆ శరీరము కొలుచు సుగంధ ద్రవ్యముల పరిమళము రాగా ఆనందించెను).

నారద ఉవాచ:

సా వాకా రాక్షసి రూపా కథం పుణ్యవతీ సతీ ।

కేన పుణ్యేన తం దృష్ట్వా జగామ కృష్ణమందిరం ॥

నారదుడు పలికెను :

రాక్షసి రూపము ధరించిన ఆమె ఎవరు? ఏ పుణ్యముతో ఆ పుణ్యాత్మురాలు శ్రీహరిని (శిశురూపుని దర్శించి గోలోకమునకు వెళ్ళెను?

శ్రీనారాయణ ఉవాచ :

బలియజ్ఞే వామనస్య దృష్ట్వా రూపం మనోహరం ।

బలికన్యా రత్నమాలా పుత్ర స్నేహం చకార తం ॥

మనసా మానసం చక్రే పుత్రస్య నదృశో మమ।

పిబేద్యది స్తనం కృష్ణుః కరోమి తం చ వక్షసి॥

 హరిస్తన్మానసం జ్ఞాత్వా వపౌ జన్మాంతే స్తనం।

దదౌ మాతృగతిం త స్యై కామపూరః కృపానిధి: ॥

నారాయణ ముని పలికెను :

బలి చక్రవర్తి యజ్ఞములో మనోహరమైన పోమనుని రూపమును చూచిన బలికూతురు రత్నమాల ఆ స్వామిని పుత్రప్రేమతో చూచెను. మనస్సులో “నా పుత్రుని వంటి ఈతడు (శ్రీహరి) నా స్తనమును త్రాగినచో ఇతనిని నా వక్షస్థలమున చేర్చుకొందును గదా" అని కోరుకొనెను. శ్రీహరి ఆమె కోరికను తెలుసుకొని మరియొక జన్మలో ఆమె స్తనమును గ్రోలెను. దయానిధియు, కోరికలు తీర్చువాడగు స్వామి ఆమెకు మాతృగతి నిచ్చెను.

దత్వా విషస్తనం కృష్ణం పూతనా రాక్షసి మునే ।

భక్త్యా మాతృగతిం ప్రాప కం భజాము వినా హరిం॥

ఇత్యేవం కథితం వీవ్ర శ్రీకృష్ణ గుణ కీర్తనం।

పదే పదే సుమధురం ప్రవరం కథయామి తే ॥

నారదా! రాక్షసియైన పూతన భక్తితో కృష్ణునకు విషము గల స్తనమునిచ్చి మాతృయోగము పొందెను. మనము శ్రీహరిని విడిచి ఇంకెవ్వరినీ భజింతుము. ఓ బ్రాహ్మణా! ఈ ప్రకారము శ్రీ కృష్ణ గుణ కీర్తనము నీకు చెప్పితిని. అడుగడుగున (పదము పదమున) మిక్కిలి మధురమును శ్రేష్ఠమునైన ఈ చరిత్రమును నీకు చెప్పుదును.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే నారాయణ నారద సంవాదే పూతనా మోక్షో నామ దశమోఽధ్యాయః॥

ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండములో నారాయణ నారద సంవాదములో పూతన మోక్ష ప్రాప్తియను పదియవ అధ్యాయము సమాప్తము.