బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

47 - రాధాశ్రీకృష్ణ సంవాదము

నారద ఉవాచ - నారదుడనెను :-

 అథ క్రీడాంతరే రాధా కిం వప్రచ్ఛ హరిం విభుం

కార కథాం కథయామాన కథ్యతాం కరుణానిధే

విలాసక్రీడ తరువాత రాధాదేవి తన విభుడైన హరినేమని ప్రశ్నించాను. అతడేకథను చెప్పెను. ఓ దయానిధీ! చెప్పుదువుగాక!

శ్రీ నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి అనెను :

ఉత్థాయ సుఖ సంభోగాప్రొధాం కృత్వా పురో హరి:

ఉవాస మలయద్రోణీం వటమూలే మనోహరే

రాధా తం పరిపప్రచ్చ నస్మితం సుమనోహరం

దర్పభంగం వజ్రభృతో నిగూఢం శ్రుతిసుందరం

సుఖక్రీడ ముగించి రాధను ముందుంచుకొని మలయపర్వత మూలములో మర్రిచెట్టు క్రింద కూర్చున్న తన మనోహరుని రాధాదేవి చిరునవ్వు నవ్వుచు ఇంతవరకు రహస్యముగా నుండి వినెడి కోరికను కల్గించునట్టి ఇంద్రుని దర్పభంగకథను గూర్చి ప్రశ్నించెను.

శ్రీ రాధికోవాచ - రాధాదేవి అనెను :

శ్రుతః యశః శూలభృతో దర్శభంగశ్చ దైవతః

పార్వత్యో దర్పభంగశ్చ వివాహశ్చ తయోరహో

 అధునా శ్రోతుమిచ్ఛామి దర్శభంగం హరేర్హ రే

 శేషాణాం చ క్రమేణేవ వద వ్యస్య జగద్గురో

శూలపాణీ యొక్క కీర్తిని, దైవికముగా ఏర్పడిన దర్పభంగమును, పార్వతి దర్పభంగమును వారి వివాహమును వింటిని. ఇప్పుడు ఇంద్రుని యొక్క దర్పభంగమును (గర్వభంగము) అట్లే క్రమముగా మిగిలిన వారి యొక్క గర్వభంగమును వినగోరుచున్నాను. శ్రీహరీ! జగద్గురూ! విస్తరించి చెప్పుమా.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు పలికెను :

దర్పభంగం సురపతేస్త్రీషులోకేషు విశ్రుతం

కర్ణపీయూషమతులం సుందరం శ్రుణు సుందరి

 పురా శతమఖో దర్సాత్కృత్వా శతమఖాన్ముదా

బభూవ నర్వదేవానామధ్యక్షః సంపదా యుతః

దినే దినే తదైశ్వర్యం వర్ధతే తపసాం ఫలాత్

 దీక్షాం తం కారయామాస సిద్ధమంత్రం బృహస్పతిః

స జజాప మహామంత్రం పుష్కరే శతవత్సరం

బభూవ మంద సిద్ధశ్చ పరిపూర్ణమనోరథః

 బ్రహ్మ స్వరూపాం ప్రకృతిం సంపన్మూఢ న మన్యతే

సా తం శశాప స్వగురోః శాపం లేభేఽ తికోపతః

సురపతికైన దర్పభంగము లోకుల చేత వినబడినదే. సుందరీ! సుందరమును కర్ణామృతమునగు సాటిలేని ఆ కథను వినుము. పూర్వమీంద్రుడు గర్వముతో నూరు యజ్ఞములు చేసి శతమఖుడన్న నామము ధరించెను. దానితో సర్వదేవాధ్యక్షుడు సంపన్నుడు ఆయెను. తపస్సుల ఫలము వలన దీనదినమతని ఐశ్వర్యము వర్ధిల్లుచుండెను. దానికి తోడుగా బృహస్పతి ఒక సిద్ధమంత్ర దీక్షనిచ్చెను. ఇంద్రుడా మహామంత్రమును పుష్కర క్షేత్రములో నూరేండ్లు జపించి మంత్ర సిద్ధిపొంది కోరిక నిండినవాడయ్యెను. సంపదల వలన మూఢుడైన అతడు బ్రహ్మయొక్క వీవర్తన రూపమైన ఈ ప్రకృతిని ఆదరించక లక్ష్య పెట్టకుండెను. ఆ ప్రకృతి అతని శపించెను. అతి కోపము పొందిన గురువు యొక్క శాపమును కూడ ఇంద్రుడు పొందెను.

ఏకదా ప్రకృతేః శాపాత్ పాతబుద్ధిం స్వసంనది

గురుం దృష్ట్యా సముత్థాయ న ననామ ముదాఽ న్వితః I

బృహస్పతిస్తతః కోపాన్నోవాస గృహామాయణా !

న తనే తారకాభ్యాశే తపసే కాననం యయౌ

 ఉవాచ మనసా దీనో యాతు సంపధరేరితి

ప్రకృతి శాపము వలన బుద్ధి దెబ్బతిన్న (బుద్ధిమాలిన) ఇంద్రుడొకసారి తన సభలో బృహస్పతిని చూచి లేవలేదు, నమస్కరించలేదు. మదించి యుండెను. అప్పుడు బృహస్పతి కోపముతో నక్కడ నిలువక ఇంటికి వచ్చెను. అతడు తారాదేవి ముందుండక తపస్సునకడవి కేగెను. మానసికముగా దుఃఖితుడైన గురువు ఇంద్రుని సంపద తొలగి పోవుగాక అని పలికెను.

ఆథ శక్రో మతం ప్రాప్య క్వ గతో తో మదీశ్వరః

ఇత్యుక్త్యా వేగతః పీఠాజ్జగామ తారకాంతికం

ప్రణమ్య మాతరం భక్త్యా నతస్కంధః పుటాంజలిః

 సర్వం నివేదనం కృత్వా రురోదోచైర్ముహుర్ముహుః

పుత్రస్య రోదనం దృష్ట్వా రురోద తారకా భృశం

వత్స గచ్ఛ గృహం నైవ గురుం ద్రక్ష్యసి సాంప్రతం

దుర్ధినొంతే గురుం ప్రాప్య పునర్లక్ష్మీమవాప్స్యసి

ఆధునో కర్మణాం భోగం భుంక్ష మూఢ దురాశయ

దుర్దినే స్వగురౌ దోషః సుదినే పరితోషణం

సుదినం దుర్దినం శక్రకారణం సుఖదు:ఖయోః

 ఇత్యుక్త్వా తారకాదేవీ విరరామ పతివ్రతో

తరువాత (సంపదలు తొలగిన) ఇంద్రుడు మతిని పొంది నా ప్రభువు. (గురుదేవుడు) ఎక్కడ పోయెనని వేగముగా పీఠము నుండి లేచి తారాదేవి వద్ద కేగెను. తల్లికి నమస్కరించి భక్తితో చేతులు జోడించి వంగి భీషయమంతయు విన్నవించి మరల మరల పెద్దగా రోదించెను. పుత్రుని యొక్క దుఃఖమును చూచి తారాదేవి కూడ మిగుల దుఃఖించెను. చిన్నవాడా! ఇంటికేగుము. ఇప్పుడు గురువును దర్శింపజాలవు. ఈ దుర్దినములై పోయిన పిదప గురువును పొంది తిరిగి లక్ష్మిని పొందగలవు. దుర్బుద్ధిగలవాడా! తెలివితక్కువవాడా! ఇప్పుడు చేసిన కర్మల ఫలమనుభవించుము. దుగ్గినము ప్రాప్తించినప్పుడు గురువుల విషయమున దోషము (అపచారము చేయుట సుదీనము సంభవించినపుడు గురువును సంతోషపరచుట ఇది కాలమహిమ. ఇంద్రా! సుఖదుఃఖములకు కారణము సుదినము దుర్దినములే కదా! ఇట్లు పలికి పతివ్రతయగు తారాదేవీ విరమించెను.

జగామ శక్రః స్నానార్థం స్వర్ణదీం సుమనోహరాం

దదర్శ తత్ర రుచిరాం మార్టంతీం చ నితంబినీం

నస్మితాం సకటాక్షాం తామహల్యాం గౌతమప్రియాం

 దృష్ట్యా చ విపుల శ్రేణీం స్తన యుగ్మం మనోహరం

స తస్యాః శక్రః సంపశ్యన్ ముమోహ కామమోహితః

 వున స చేతనాం ప్రాప్య విహాయ స్నానమీశ్వరి

మూర్తిం విధాయ తద్భరుస్తత్సమీపం జగామ హా

గత్వా తు స్నిగ్ధ వస్త్రాం తాం సమాకృష్య స్మరాతురః

చకోర ఏవిధం తత్ర శృంగారం సుమనోహరం

మూర్ఛాం సంప్రాప కామేన తంద్రాం చ ముని కామినీ

నిశ్చేష్టా సుఖ సంభోగాన్నిశ్చేష్ట స్త్రీదశాధిపః

ఇంద్రుడు స్నానము చేయుటకై దేవనదికేగెను. అక్కడ సుందర రూపము గల స్నానమాడుచున్న ఒక స్త్రీని చూచెను. చిరునవ్వులు - ఓర చూపులు గల ఆమె గౌతముని భార్యయగు అహల్య. ఇంద్రుడామె యొక్క విస్తారమైన పిరుదుల ప్రదేశమును మనోహరముగానున్న స్తనములను చూచి కామ భావము చేత మోహితుడై ఒడలు మరచెను.. తెలివికి రాగానే స్నానము వదిలి పెట్టి ఆమె భర్తయైన గౌతమునీ వేషము ధరించి ఆమెవద్దకేగెను. అట్లు చేరబోయి తడిబట్టలతో సున్న ఆమెను మన్మథ పీడితుడై తనవైపు లాగుకొనీ ఇద్దరి మనస్సులకీంపగునట్లు వివిధముగా శృంగార కర్మ ఆచరించెను. ఆ ముని కామిని సుఖమైన సంభోగము వలన కామాతిశయము చేత మూర్ఛపొంది జాడ్యము పొంది. చేష్టలు (ఏ కదలికలు) లేనిదయ్యెను. ఆ దేవరాజు కూడ నిశ్చేష్టుడై ఉండెను.

ఏతస్మిన్నంతరే తప్త్వా నమాగత్య మునీశ్వరః

 దదర్శ గేహే మిధునం మైథునే చ రతిప్రియే

దృష్ట్వా చుకోప చ స మునిర్జ్వలన్నివ హతాశనః

విజ్ఞానేనాతి రో షేణ బభంజ సురతిక్షణం

శక్రః సచేతనం ప్రాప్య దృష్ట్వా చ మునిపుంగవం

కాలస్వరూపం త్రా సేన దధార చరణాంబుజం

 కోపరక్తాస్యనయనో దేవం పాదానతం భియా

ఉవాచ నీతివచనం గౌతమః శరణాగతం

ఇంతలో మునీశ్వరుడైన గౌతముడు తపమొనర్చి ఇంటికి చేరవచ్చి ఆ యిద్దరు సంభోగించుచుండగా చూచెను. చూచిన ముని అగ్నివలె మండిపోవుచు కోపించి ఏజ్ఞానముతో అతి రోషముతో వారి రత్యానందమును భగ్నము చేసెను. ఇంద్రుడు తెలివి పొంది మునిరాజును చూచి భయముతో కాలస్వరూపుడుగా నున్న ముని పాదపద్మములను పట్టుకొనెను, భయముతో కాళ్లమీద పడిన ఇంద్రునితో కోపము వలన ఎర్రబడిన కన్నులు గల గౌతముడు నీతివచనములీట్లు పలికెను.

గౌతమ ఉవాచ - గౌతమ ముని అనెను :

ధిక్ త్వామింద్ర! సురశ్రేష్ఠ! కశ్యపాత్మజ! పండితః

 ప్రపౌత్ర జగతాం స్రష్టుర్బుద్ధిస్తే కథమీదృశీ!

మాతామహః న్వయం దక్షోదితిర్మాతా పతివ్రతా

 కర్మసాధ్య: స్వభావశ్చ కులధర్మం ప్రబాధతే

వేదం విజ్ఞాయ జ్ఞానీ త్వం యోనిలుబ్థోఽసి కర్మణా

యోనీనాం చ సహాస్రం చ తవ గాత్రే భవత్వీహ

పూర్ణవర్షం చ సతతం యోనిగంధం త్వమాప్నుహి

 తతః సూర్యం సమారాధ్య యోనిశ్చక్షుర్భవిష్యతి

 మమ ప్రాణేశ్వరీ దుషా యేన మూఢ త్వయా కృతా

 మచ్ఛా పేన గురోః కోపాద్రృష్టశ్రీర్భవ సాంప్రతం

ఇంద్రా! దేవతలలో శ్రేష్ఠుడా! కశ్యపప్రజాపతి పుత్రా! పండితుడా! జగత్కర్తయైన బ్రహ్మకు మునిమనుమడా! నీ బుద్ధి ఎట్లు ఇటువంటిదైనది. నీన్ను ఛీ కొట్టుచున్నాను. దక్ష ప్రజాపతీ నేరుగా నీ తాత (తల్లితండ్రి) తల్లియైన అదితిదేవి మహాపతివ్రత. కర్మలచేత సాధింపదగిన స్వభావము (తపస్సు మొదలగు కర్మలచేత నిగ్రహింపబడవలసిన వ్యక్తి స్వభావము) కులధర్మమునింత బాధ పెట్టుచున్నదే. వేదము తెలిసిన జ్ఞానివి కర్మచేత యోనిలుబ్ధుడవైతివి. (నీచకాముకుడవైతివి) దీని వలన నీ శరీరమందు వెయ్యి యోనులేర్చడుగాక. నిండు సంవత్సర కాలము ఎల్లవేళల యోని దుర్గంధము నీవు పొందుదువుగాక. తరువాత. సూర్యునారాధించగా అతని అనుగ్రహము వల నీయందలి యోనులు కన్నులు కాగలవు. ఓ. మూడుడా! ఏ కారణము వలన నీచేత. నా ప్రాణేశ్వరి చెడగొట్టబడెనో ఆ నా శాపము నీ గురువు యొక్క కోపము వలన నీవిప్పుడు భష్ట శ్రీకుడవు (సంపదలు భ్రష్టమైన దరిద్రుడవు) కమ్ము.

గురోర పేక్షయా మూఢ ప్రాణా నాపహృతోస్తవ

 తేజస్వినోఽ తిబంధోర్మే బంధుభేదభియా సుర

ఉత్తిష్ణోత్తిష్ఠ దేవేంద్ర గచ్ఛ వత్స స్వమందిరం

 శుభాశుభంచ యత్కించిత్సర్వం కర్మోద్భవం భవేత్

మహా మునీంద్ర వచనాద్ధతః శక్రశ్చ పుష్కరం

 చకాధారాధనం భక్త్యా నైష్కృత్యం చ చకార హ

ఓ మూడుడా! బృహస్పతి మీది ఆదరము వలన నీ ప్రాణములపహరింపబడలేదు. మిక్కిలి తేజోవంతుడు నాకు దగ్గరి బంధువైన అతని బంధుత్వమందు భేదమేర్పడునన్న భయముతో ఆ పని చేయకుంటిని, లే లే దేవేంద్రా! నీ యిల్లు చేరబొమ్ము. శుభాశుభము . లేవైనను అవియన్నియు కర్మ వలననే ఉద్భవించుచున్నవి. గౌతముడు పలికిన మాటలను బట్టి ఇంద్రుడు పుష్కర క్షేత్రమునకు పొయి భక్తితో సూర్యారాధన చేసి శాపనిష్కృతిని (పరిహారమును) చేసుకొనెను.

పాదానతామహల్యాం తామువాచ ముని పుంగవః

వనం గత్వా చిరం తిష్ఠ విధాయ మూర్తిమశ్మనః

 ఆకాపం చకమే శక్రః సర్వం జానామ్యహం ప్రియే

తథా చ పరభ్యో మే న చ భోగ్యా ప్రజాధమే

 పరవీర్యం యదుదరే కామతోఽ కామతోఽ పి వా

అహల్యే యాతి దైవేన తదుపాయం నిశామయ

ఆకామతో న దుషా సా ప్రాయశ్చిత్తేన శుద్ధ్యతి

కామ భోగేన త్యాజ్యా సౌకర్మభోగేన శుద్ధ్యతి

 పితృపాకే దైవపాకే పూజాయాం నాధికారిటీ

షష్ఠిర్వర్ష సహస్రాణీ కాలసూత్రం యయాతి సా

షష్టిర్వర్ష సహస్రాణి క్షయం కృత్వా స్వకర్మణః

స్వామినో వచనాలౌ తు ప్రణమ్య "స్వామీనం ఖియా

నాధనాథేతి కుర్వంతో రుదంతీ వనమాప సా

షష్టిర్వర్ష సహస్రాణి భుక్త్వా భోగం మునిప్రియా

శ్రీరామ చరణస్సరోత్సద్యః శుద్దా బభూవ హ

త్రైలోక్య మోహనం రూపం విధాయ ముని కామినీ

 జగాన గౌతమాభ్యాశం మునిః సంప్రాప్య సుందరీం

పాదముల మీద పడిన అహల్యను గూర్చి మునిరాజిట్లు పలికెను. ప్రియురాలా! కోమరహితవైన నిన్ను ఇంద్రుడు కొమించెను. నేనది యంతయు ఎరుగుదును. నీవు వనములోనికేగి రాతిరూపును ధరించి చాలకాలముండుము. ఓ అధమురాలా! కామము లేకున్నను పరునికీ భోగ్యవైతివి. కోరిక వలన గాని కోరిక లేక కనీ పరుని వీర్యము ఏ స్త్రీ గర్భమున దైవికముగా పడునో అట్టి నీవు నాకిప్పుడు నీవు భోగ్యవు (అనుభవింపదగినదానవు) కావు. అహల్యా! దానికుపాయము చెప్పెదను వినుము.  కామము (వాంఛ) లేనందున స్త్రీ ప్రాయశ్చిత్తముతో పరిశుద్ధురాలగును, కామసుఖానుభవములో ఆమెను త్యజించవలెను. శారీరకర్మకు తగిన పాప ఫలానుభవము వలన ఆమె పరిశుద్ధురాలగును. పితృదేవతల శ్రాద్ధకమునకు గాని వైశ్య దేవాది దేవ కర్మల పాకమునకు గాని పూజకు గానీ ఆమె అర్జురాలు కాదు. కాముకురాలు అరవై వేల సంవత్సరములు కాల సూత్ర నరకము పొంది తన కర్మ క్షయము చేసికోవలెను సుమా!” ఇట్లు పలికిన భర్త వచనముల వలన భయపడి అహల్య భర్తకు నమస్కరించి నాథా నాథా అని ఏడ్చుచు అరణ్యమును పొంది అరువై వేల సంవత్సరములు .. శిలగా పడి ఉండి కర్మఫల భోగమనుభవించి శ్రీరామచంద్రుని పాదస్పర్శచేత వెంటనే పరిశుద్ధురాలయ్యెను. తరువాత ఆ అహల్య త్రిలోక మోహనమైన రూపము ధరించి గౌతముని సమీపమున కేగెను. గౌతమముని ఆ సుందరినీ పొందెను.

అథ శక్రస్య వృత్తాంతం పరమం శృణు నుందరి

పాపఘ్నం పుణ్య బీజం తత్సంవ్యవ్య కథయామి తే

ఏకదా చ గురోః కోపాత్రకృతేరవ హేలనాత్

బ్రహ్మహత్యా వజ్రభృతో బభూవ హత చేతసః

శక్రస్యక్త గురుర్దేవగ్రస్తో దైత్య నిపీడితః

జగామ శరణం భీతో బ్రహ్మాణం జగతాం గురుం

తదాజ్ఞయా విశ్వరూపం చకార చ పురోహితం

 బభూవ తత్ర విశ్వసో దైవాద్భుద్ధి హతో హరిః

దైత్య దౌహిత్రస్య భావం విజ్ఞాయ చ విచక్షణః

 ప్రచిచ్ఛేద శిరస్తన్య తీక్షణేన లీలయా

ఓ సుందరీ! విశేషమైన ఇంద్రుని వృత్తాంతమును వివరించి చెప్పెదను వినుము. అది పాపమును నశింపజేసి పుణ్యమునకు బీజమగునట్టిది సుమా! ఒకసారి గురువు యొక్క కోపము వలనను ప్రకృతిని తిరస్కరించి నందు వలనను నష్టబుద్ధియైన ఇంద్రునికి బ్రహ్మ హత్యా పాపమేర్పడెను. తన గురువును వదిలివేసి అదృష్టము లేక దైత్యుల చేత పీడింపబడి ఇంద్రుడు జగత్తునకు తండ్రియైన బ్రహ్మను శరణుపొందెను. అతని ఆజ్ఞననుసరించి విశ్వరూపుడను వానీని పురోహితునిగా చేసికొనెను. ఆ విషయములో బుద్ధిహతుడైన ఇంద్రుడు దైవ ప్రభావము వలన విశ్వరూపుని యందు విశ్వాసము (నమ్మకము) కలవాడై నష్టపడెను. దైత్యుల బిడ్డ కొడుకైన ఆ విశ్వరూపుని భావము (హృదయములోని ఆలోచనను) తెలిసికొని విమర్శ జ్ఞానముండి కూడ తొందరపడి వాడి బాణముతో వాని శిరస్సును లీలగా ఖండించెను.

విశ్వరూప పితా త్వష్టా శ్రుత్వా సద్యశ్చుకోప హ

ఇంద్రశత్రో వివర్ధ స్వేత్యుక్త్వా యజ్ఞం చకార హ

యజ్ఞకుండాతముత్తణ్ణి వృత్తో నామ మహానురః

చకార నిగ్రహం కోపాద్దేవానామవలీలయా

శక్రో మహామునేరస్ట్రేం వజ్రం కృత్వా సుదారుణం

జఘాన వృత్రం దేవానాం కంటకం దైత్యమర్దనః

బ్రహ్మ హత్యా శనాసీరం దుదైవ హతచేతనం

 రక్తవస్త్ర పరీధానా వృత్ర స్త్రీ వేషధారిణీ

సప్తతాల ప్రమాణా సా శుష్కకంఠోష్ఠ తాలుకో

ఈషా ప్రమాణ దశనా మహాభీతం చకార తం

విశ్వరూపుని తండ్రియైన త్వష్ట తన పుత్రునింద్రుడు సంహరించినందుకు వెంటనే కోపము పొంది (సభలో) ఇంద్రుని శత్రువైనవాడు వృద్ధిపొందుగాక యని పలికీ యజ్ఞము చేసెను. మంత్ర శక్తి వలన యజ్ఞకుండము నుండి వృత్రుడను మహాసురుడు జన్మించెను. ఆ వృత్రుడన్నవాడు కోపముతో శ్రమలేకుండ దేవతలను నిగ్రహించే (శిక్షతో అదుపులో పెట్టి)ను. అప్పుడు దధీచి మహాముని యొక్క ఎముకలను మిక్కిలి దారుణమైన వజ్రాయుధముగా నిర్మించి ఇంద్రుడు దేవకంటకుడైన వృత్రుని సంహరించెను. అపుడు నష్టబుధియైన ఇంద్రుని మీదికి బ్రహ్మహత్యా పాపము రక్త వస్త్రము ధరించిన వృత్రుని భార్య వేషమున తరుముకోని వచ్చెను. ఆ స్త్రీ ఏడు తాడిచెట్ల ఎత్తుగలదై కంఠము పెదవులు దవడలు ఎండుకపోయి సాగలి కోల యంతటి. నోటి కోరలతో ఇంద్రుని మిక్కిలి భయ పెట్టెను.

ధావంతం పరీధావంతీ బలీషా హతచేతనం

ఖడ్గహస్తా దయాహీనో వేగేన పరిధావతి

ఇంద్రో దృష్ట్వా చ తొం ఘోరాం స్మారం స్మారం గురోఃవదం

 వివేశ మానస సరో మృణాల సూక్ష్మ సూత్రతః

తత్ర గంతుం న శక్తి సా బ్రహ్మణః శాపకారణాత్

సా తస్థౌ పట్ల శాఖాయాం సరసస్తట సన్నిధౌ

బుద్ధి కోల్పోయి పరిగెత్తుచున్న ఇంద్రుని వెంట దయాహీనయు ఖడ్గము ధరించినదియు బలవంతురాలైన ఆ శక్తి వేగముగా పరుగెత్తుచుండెను. ఇంద్రుడా ఫరాకృతిని చూచి తన గురువు యొక్క పాదములను స్మరించి స్మరించి తామర తూడులోని దారము ద్వారా మానన నరస్సున ప్రవేశించెను. బ్రహ్మ శాపము వలన అక్కడికి పోజాలక బ్రహ్మ హత్యా దోష శక్తి సరస్సు తీరమున గల మర్రి కొమ్మ పై నిలిచియుండెను.

ఆధాత్ర నహుషో భూపస్త్రీలోకేశో బభూవ హ

 న యయాచే శచీం దేవాస్ బలిష్ఠో దుర్బలానపి

శచీ శ్రుత్వా మహాభీతా తారకాం శరణం యయౌ

 తారా నిర్భర్య స్వపతిం భృత్యపత్నీం రరక్ష చ

శచీమాశ్వాస్య స్వగురుర్థగామ తత్సలో ముదా

 ఆజుహావ శునాసీరం కాతరం హతచేతనం

ఇక స్వర్గములో నహుషుడన్న మానవపతి త్రిలోకేశుడు (ఇంద్రుడు) అయ్యెను. ఆ నహుషుడు దేవతలను శచీ దేవిని స్వాధీనపరచుడని కోరెను. స్వర్గపతియైనందున అతడు బలాధీకుడు దేవతలు అతని చేత పాలింపబడువారు కనుక దుర్బలులైరి. (అనగా శచీదేవిని కోరుట కూడదని చెప్పలేకపోయిరి). ఈ వార్తను విన్న శచీదేవి మిక్కిలి భీతురాలై గురుపత్నియైన తారాదేవిని శరణుపొందెను. తార తన భర్తనోత్తిడి చేసి తమ శిష్యునీ భార్యను రక్షించెను. బృహస్పతి శచీదేవి నోదార్చి మానస సరస్సు వద్దకేగెను. నష్ట బుద్ధియై పిరికీ తనముతో నున్న ఇంద్రునాహ్వానించెను.

బృహన్నతిరువాచ - బృహస్పతి అనెను :

ఉత్తిష్ణోత్తిష్ఠ హే వత్స భయం కిం తే మయి స్థితే

 త్వదీశ్వరం స్వరేశైవ నీశామయ భయం త్యజ

 స్వరం బృహస్పతేర్ణత్వా సర్వ సిద్ధేశ్వరో హరిః

సూక్ష్మరూపం పరిత్యజ్య స్వరూపం చ దధార సః

 ఉత్థాయ సద్యః సంభ్రంతో గురుం తం సూర్యవర్చనం

దృష్వా సనామ సంప్రీత్యా సంప్రీతం త్యక్తకోపకం

పదాంబుజే నీపతీతం రుదంతం భయవిహ్వలం

నిధాయ వక్షనీ ప్రేమ్ణా రురోద ప్రేమ విహ్వల

రుదంతం వాక్పతిం తుష్టం తుషాన త్రిదశేశ్వరః

పుటాంజలి పులకితో భక్తి నమ్రాత్మ కంధరః

“వత్సా! లేలెమ్ము, నేనుండగా నీకు భయమెందుకు? నేను నీ గురువును.  కంఠస్వరమును విని గుర్తించుము. భయము వదలుము" అను బృహస్పతి కంఠస్వరమును గుర్తించి సర్వసిద్ధేశ్వరుడైన ఇంద్రుడు సూక్ష్మరూపమును త్యజించి తన రూపమును ధరించెను. వెంటనే లేచి సంభ్రమముతో వచ్చి సూర్యుని వంటి తేజస్సు గలిగి, పూర్వకోపమును విడిచి సంప్రీతితో నున్న బృహస్పతికింద్రుడు నమస్కరించెను. భయముతో మనస్సు చెదిరీ తన పాదముల మీద పడి రోదించుచున్న శిష్యుని గురువు ప్రేమతో కౌగిలించుకొని ప్రేమతో కదిలిపోయిన మనస్సుతో రోదించెను. ఇట్లు తన మీద తుష్టినొంది ఏడ్చెడి బృహస్పతిని చూచీ సురేంద్రుడు భక్తితో శిరస్సు వంచి పులకించి పోయి అంజలీ పట్టి స్తుతించెను.

ఇంద్ర ఉవాచ - ఇంద్రుడనెను :

 క్షమస్వ భగవన్ దోషం కృపాం కురు కృపానిధే

 భృత్యాపరాధం సతతం న గృహ్ణతి నదీశ్వరః

 స్వభార్యాసు స్వశి ష్యేషు స్వభృత్యేము సుతేషు చ

 దుర్బలః సబలోవాపీ కో దండం కర్తుమక్షమ:

త్రిషు కోటీపు దేవేపు దేన్ల కోఽహమపండితః

 త్వత్రసాదాతురశ్రేష్ఠ కృపయా వర్ధితస్త్వయా

సంహర్తమీశస్త్యం సర్వమహం కో వాపి కీటవత్

స్వయం విధాతుః పౌత్రశ్చ పునః స్రష్టుం స్వయం క్షమ

ఇతి తస్య స్తవం శ్రుత్వా వంతుణో గురుః స్వయం

ఉవాచ వచనం ప్రీత్యా ప్రసన్నవదనేక్షణః

"ఓ దయానిధీ! భగవన్! నా దోషమును క్షమించి దయచూపుము. సత్ర్పభువు తన భృత్యుని అపరాధమును పట్టుకొనడు. తన భార్యలను తన శిష్యులను తన సేవకులను తన పుత్రులను, బలవంతుడు గాని బలహీనుడు గాని శిక్షించుట కెవనికి శక్తి యుండదు. మూడు కోట్ల దేవతలలో బుద్ధి హీనుడైన చిన్న వ్యక్తిని నేను. ఓ దేవగురూ! నీ అనుగ్రహము వలన నీ కృపచేత నేను పెంచి పోషించబడితిని. నన్ను సంహరించుటకును నీవు అధికారి, నేనెవడైనను నీ ముందు పురుగు వంటి వాడను. నీవు నేరుగా సృష్టికర్త పౌత్రుడవు మరియు. స్వయముగా సృష్టింప సమర్థుడవు”. ఇట్టి ఇంద్రస్తుతిని విని గురువు సంతోషించి ప్రేమతో ప్రసన్నమైన ముఖము చూపులు కలవాడై (క్రింది విధముగా) వచనములు పలికెను.

గురురువాచ - బృహన్నతి పలికెను :

స్థిరో భవ మహాభాగ నిశ్చలాం కమలాం లభ

 సంప్రాప్య పరమైశ్వర్యం పూర్వస్మాచ్చ చతుర్గుణం

 గచ్ఛామరావతీం వత్స రాజ్యం కురు పురందర

హత శత్రుగ్మత్రసాదోద్దత్వా పశ్య శచీం సతీం

ఇత్యేవముక్త్యా స గురుః న శిష్యో గంతుముద్యతః

 దదర్శ పురతో ఫరాం బ్రహ్మహత్యాం సుదుస్సహాం

 దృష్ట్వా శక్రో మహాతస్తం గురుం శరణం యయా

బృహస్పతిర్మహాభీతస్మార మధుసూదనం

ఏతస్మిన్నంతరే తత్ర వాగ్బభూవాశరీరిణీ

స్వల్పాక్షరా చ బహ్వర్థా తాం శుశ్రావ బృహనతిః

 నంసార విజయం నామ సర్వాశుభ వినాశనం

రాధికే వచనం శ్రుత్వా శిష్యం రక్షాధునేతి చ

“ఓ అదృష్టశాలీ! స్థిరముగా నుండుము. చలనము లేని సంపదను పొందుము. పూర్వము కంటే నాల్గింతలైన పరమైశ్వర్యమును పొంది అమరావతికేగి రాజ్యమేలుము. నా అనుగ్రహమువలన శత్రు సంహారమొనర్చి పోయి పతివ్రతయగు శచీదేవిని చూడుము”, ఇట్లు పలికి గురువు శిష్యునితో పోవుటకు ముందడుగు వేసి తనముందు భరించరాని ఘోరమైన బ్రహ్మహత్యారూపమును చూచెను. - దానిని చూచిన ఇంద్రుడు మిక్కిలి భీతుడై గురువును శరణుజొచ్చెను. బృహస్పతి కూడ మిక్కిలి భీతిల్లి మధుసూదనునిని . (శ్రీహరిని) స్మరించెను. ఇంతలో అల్పమైన అక్షరములు అనేకార్థములు కల అశరీరవాణి (ఆకాశవాణి - దేవవాణి) ఏర్పడెను (వాక్కు వినవచ్చెను). ఓ రాధా! ఆ వాక్కు ఇది. “ఓ గురూ! ఈ మాట విని సర్వవిధములైన అశుభములను వినాశము చేయునట్టి సంసార విజయమను దానిని ఉపదేశించి ఇప్పుడు శిష్యుని రక్షించుము".

 తదా త్వత్కవచం దత్త్యా శిష్యాయ శిష్యవత్సలః

చకొర భస్మసాతాం చ హంకారేశైవ లీలయా

 తదా శీష్యం గృహీత్వా చ గత్వా తామమరావతీం

దదర్శచ్ఛిన్న భగ్నం చ శత్రుణా వచనాధురోః

భర్తురాగమనం శ్రుత్వా శచీ సంహృష్ణ మానసా

 ప్రణమ్య చ గురుం భక్త్యా స్వకాంతం ప్రణనాము సా

 శ్రుత్వాఽన్ని గమనమీంద్రస్య సురాఽ జగ్ము సురాః ప్రియే

 ఋషయో మునయశైవ హర్ష గద్గద మానసాః

 యోజయామాస సత్కారం నిర్మాతుమమరావతీం

పూర్ణమజ్ఞశతం శిల్సీ నిర్మమే త్వమరావతీం

అప్పుడు శిష్యునియందు ప్రేమగల గురువు తన శిష్యునికి నీ కవచమును (రాధాకవచము) ఉపదేశించి తన హుంకారము చేత అనాయాసముగా ఆ బ్రహ్మ హత్యను భస్మము చేసెను. తరువాత శిష్యుని వెంట బెట్టుకొని అమరావతికి పోయెను. గురువు చెప్పిన మాటను బట్టి ఇంద్రుడు తన శత్రువు చేత ఛిన్నాభిన్నము చేయబడిన నగరమును చూచెను. భర్త వచ్చుట విన్న శచి మిక్కిలి హర్షము గల మనస్సుతో వచ్చి భక్తితో గురువుకు తన కాంతునికి నమస్కరించెను. ఇంద్రుని రాక విని దేవతలందరు చేరవచ్చిరి. ఋషులు మునులు హరపరవశులైరి. అమరావతిని చక్కగా పునర్నిర్మించుటకు ఇంద్రుడు నియోగించగా శిల్పి అమరావతిని నిండుగా నూరేండ్లు నిర్మించెను.

నానారత్న విచిత్రాడ్యాం మణిరత్నేంద్ర నిర్మితాం

మనోహరాం నిరువమాం న హి తుష్టా యయా హరిః

 విశ్వకర్మా గృహం, గంతుం న శశాక వినాలి జయా

 పరమోధ్విగ్న. చిత్తశ్చ బ్రహ్మాణం శరణం యయా

వీజాయ చ తదభిప్రాయం తమువాచ విధిః స్వయం

తప కర్మక్షయాదేవ తావచ్చో భవితేతి చ

శ్రుత్వా తద్వచనం కారు శీఘ్ర ప్రాపామరావతీం

బ్రహ్మా జగామ వైకుంఠం ప్రణమ్యావాచ మాతరం

శ్రేష్ఠమైన రత్నముల చేత నిర్మితమై నానా రత్నముల విచిత్రముల చేత అతిశయమై మనోహరముగా .సాటి లేనిదిగా నిర్మితమైన దానిని చూచి ఇంద్రుడు సంతుష్టుడు కాలేదు. ఇంద్రుని ఆజ్ఞ లేక విశ్వకర్మ తన గృహమునకు పోవుటకు సమర్థుడు కాకుండెను. అతని అభిప్రాయమును తెలిసికొన్న బ్రహ్మ తనంత తానుగా శిల్పితో నీ కర్మ పూర్తి అగువరకు రేపటి వరకు నీ పని ముగియును అని చెప్పెను. ఆ మాట విని శిల్పి తిరిగి శీఘ్రముగా అమరావతి కేగెను. బ్రహ్మ వైకుంఠమును చేరబోయి తల్లికి (లక్ష్మీదేవికి నమస్కరించి చెప్పెను.

హరిర్రహ్మాణ మాశ్వాస్య ప్రస్థావ్య స్వగృహం చ తం

విప్రరూపం సమాస్థాయ చాజగామామరావతీం

దండీ ఛత్ర శుక్లవాసా బిభ్రత్తిలకముజ్జ్వలం

అతిఖర్వ శుక్లదంతః నస్మీతః సుమనోహరః

వయసొలితిశిశుర్బుద్ధ్యా జ్ఞానవృద్ధ్యా విచక్షణః

 స్వయం విధాతుధాతా చ దాతా చ సర్వసంపదాం

 ఇంద్రద్వారే సముత్తిష్ఠన్ ద్వారపాలముపాచ హ

బ్రూహీద బ్రాహ్మణో ద్వారే శీఘ్రం త్వాం ద్రష్టుమాగతః

 ఇత్యేవం వచనం శ్రుత్వా ద్వారి జ్ఞానం చకార తం

 స చ శీఘ్రం సమాగమ్య దదర్శ బ్రాహ్మణార్చకం

బాలకానిం బాలికానాం సమూహైః పరివేష్ఠితం

 హసద్భిశ్చ మహోత్సాహాత్సస్మితం తేజసాఽన్వితం

 ప్రణనామ హరిర్భక్త్యా తం హరిం శిశురూపిణం

 ఆశిషం యుయుజే ప్రీత్యా తం హరిర్భక్తవత్సలః

విష్ణువు బ్రహ్మనూరార్చి. అతని గృహమునకు పంపి తాను బ్రాహ్మణ రూపము ధరించి అమరావతి కేగెను. ఒక దండము ఒక ఛత్రము తెల్లని వస్త్రము ఉజ్జ్వలముగా నున్న తిలకమును ధరించి మిక్కిలి పొట్టివాడు తెల్లని పలువరుస గలవాడు చిరునవ్వుతో మిక్కిలి మనోహరముగా నున్నవాడు వయస్సులో శిశువు బుద్ధిలో జ్ఞాన వృద్ధి చేత మిక్కిలి నేర్పు గలవాడు తాను బ్రహ్మను సృష్టించి సర్వసంపద లీచ్చినవాడు ఇంద్రుని ద్వారమందు నిలిచి ద్వారపాలునీతో “బ్రాహ్మణుడు ద్వారమందున్నాడు. త్వరగా నిన్ను చూడవచ్చినాడని చెప్పుము” అని పలికెను. వాడా వార్త ఇంద్రునకు తెలిపెను. ఇంద్రుడు వచ్చి బాలకులతో బాలికతో కూడియున్న బ్రాహ్మణ బాలకునీ మహోత్సాహముతో చిరునవ్వు నవ్వుచు తేజస్సుతో కూడియున్న వానిని - చూచి భక్తితో ఆ శిశురూప హరికి నమస్కరించెను. భక్తవత్సలుడైన ఆ హరి ప్రీతితో ఇంద్రునికాశీస్సులిచ్చెను.

మధుపర్కాదికం దత్త్వా శక్రః పూజాం చకార తం

 వప్రచాగమనం కస్మాద్వదేతి విప్రబాలకం

ఇంద్రస్య వచనం శ్రుత్వా తమువాచ ద్వీజార్భకః

మేమ గంభీరయా వాచా బృహస్పతి గురోర్గురు

ఇంద్రుడు మధుపర్కము మొదలగునవి ఇచ్చి పూజించి “ఎక్కడి నుండి నీరాక చెప్పుము” అని ప్రశ్నించెను. ఇంద్రుని వాక్కు విని బృహస్పతి తండ్రికి తండ్రి (విష్ణువు) అగు ద్విజబాలుడు మేఘధ్యనివలె గంభీరముగా నున్న వాక్కుతో పలికెను.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడనెను :

 సమాగతో ఽహం త్వాం ద్రష్టుం ప్రష్టుం వచనమీప్సితం

 చిత్ర నగర నిర్మాణం సమాకర్ణాద్భుతం హరే

కతి వరం చ నిర్మాణే భవాన్ సంకల్పితో యథా

 కతిచిత్తాం విశ్వకర్మా నిర్మాణం వా కరిష్యతి

ఏవం భూతం చ నిర్మాణం స కేంద్రేణ నిర్మితం

 నైవం విధం సునిర్మాణే విశ్వకర్మా పరః క్షమ:

 బాలకన్య వచః శ్రుత్వా జహాన న నురేశ్వరః

సంపన్మదాతి మత్తశ్చ పునః పప్రచ్ఛ బాలకం

“ఓయీ! నిన్ను చూచుటకు కోరిన మాటను నిన్నడుగుటకు నేను ఇక్కడికి చేర వచ్చితిని.. అద్భుతమైన నగర నిర్మాణము గూర్చి విని యుంటిని. దీని నిర్మాణమునకు నీవెన్ని సంవత్సరములు పట్టునని అరెట్లుండవలెనని సంకల్పించితివి? ఎంతకాలము విశ్వకర్మ దానిని నిర్మించును ? ఇటువంటి నిర్మాణమయింద్రుని చేతను నిర్మించబడలేదు. ఇట్టి మంచి నిర్మాణమునకు విశ్వకర్మ సమర్థుడు కాడు”. బాలకుని మాట విని ఆ యింద్రుడు నవ్వి సంపన్మదముతో మిక్కిలి మదించి (ఐశ్వర్య గర్వముతో మిక్కిలి గర్వించి) తిరిగి బాలుని ప్రశ్నించెను.

 కతీంద్రాణాం సమూహాశ్చ త్వయా దృష్టః శ్రుఽతో థవా

 విశ్వకర్మా కతివిథనం మే బ్రూహి శిశోఽధునా

శక్రస్య వచనం శ్రుత్వా ప్రహస్య విప్రబాలకః

తమువాచ శ్రుతినుఖం పీయూష సదృశం వచః

ఓ చిన్నవాడా? ఎందరీంద్రుల సమూహమును. నీవు చూచితివి? లేదా వినియుంటివి? విశ్వకర్మ ఎటువంటివాడు. ఇప్పుడు నొకు చెప్పుము. శక్రుని మాట విని విప్రబాలుడు నవ్వి చెవికింపుగా అమృతము పంటి మాటనతనితో పలికెను.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడనెను :

 జానామి కశ్యవం తాత తవ తాతం ప్రజాపతిం

 మునిం మరీచినామానం తత్రాలం చ తపోనిధిం

నాభివద్మోద్భవం విష్ణోః సుత్వా తం విధిమీశ్వరం

రక్షితారం చ తం విష్ణుం పరం సత్త్వగుణాన్వితం

ఏకార్ణవం చ ప్రలయం సత్త్వశూన్యం భయానకం

సృష్టిం కతివిధాం శక్ర కల్పం కతివిధం ధ్రువం

 బ్రహ్మాండం చ కతివిధం బ్రహ్మవిష్ణు మహేశ్వరాన్

బ్రహ్మాండేత కశీవిధావింద్రాన్ తో గంతుమీశ్వర

యది సంఖ్యాస్త్రీ రేణూనాం ధరాయాం చ సురాధివ

తథాపి సంఖ్యా శక్రాణాం నా స్ర్యవేతి విదుర్బుథాః

శక్రస్యాయుశ్చాధికారో యుగానామేక సప్తతిః

ఆషావింశతి శక్రాణాం పతనే హర్నిశం విధేః

విధేరషోత్తర శతమాయురేవ ప్రమాణతః

సురేంద్రాణాం చ కా సంఖ్యా నాస్తి సంఖ్యా విధేరమ్

నాయనా! నీ తండ్రియగు కశ్యప ప్రజాపతి నెరుగుదును. తపోనిధియైన (మీ తండ్రిని మించిన) మరీచి మునినెరుగుదును. విష్ణువు యొక్క నాభి కమలమందు జన్మించి ఆ పరమాత్మను స్తుతించి ఆపద నుండి విష్ణువు చేత రక్షింపబడిన బ్రహ్మనెరుగుదును. సత్వగుణయుక్తుడైన పరుడు విష్ణువు నెరుగుదును. జీవకోటి లేనట్టి భయానకమైన ప్రళయమును అప్పటీ ఒక్కటీగానైన సముద్రమును ఎరుగుదును. ఎన్నియో విధములైన సృష్టులను ఎన్నో కల్పములను ఎందరో ఇంద్రులను ఎరుగుదును. వారిని తెలిసికొనుటకెవడు సమర్థుడు? ఓసురనాథా ఈ భూమియందలి రేణువులకు సంఖ్య ఉన్నచో అట్టి సంఖ్య తెలిసినను ఇంద్రులకు సంఖ్యలేదని యే పండితులు తెలిసికొందురు. ఒక ఇంద్రుని ఆయుష్యము అధికార పదవి యొక్క కాలము డెబ్బది యొక్క యుగములు, అబ్బీ ఇంద్రులు ఇరువది యెనిమిది మంది పదవుల నుండి తొలగిపోయినచో ఆ కాలము బ్రహ్మకు ఒక రాత్రిపగలగును. అట్టి బ్రహ్మయొక్క ఆయుష్యము పై ప్రమాణము ప్రకారము ఒక వంద ఎనిమిది సంవత్సరములు. అట్టి బ్రహ్మలకే సంఖ్యానియయము లేనప్పుడు దేవేంద్రుల సంఖ్యకు ఇంతయని నిర్ధారణ ఎక్కడిది? ఎట్టిది?.

బ్రహ్మాండ సంఖ్యా యత్ర క్వ బ్రహ్మవిష్ణు మహేశ్వరా

మహావిష్ణోర్లోమ కూపోద్భవే తోయే సునిర్మలే

బ్రహ్మాండేఽ స్త్రీ యథా నౌకా భవ తోయే చ కృత్రిష

 ఏవం లోమ్నః ప్రమాణేన బ్రహ్మాండా సంత్యసంఖ్యకాః

బ్రహ్మాండే చ కతివిధాః సురాః సంత్యేవ త్వత్సమా

బ్రహ్మాండముల సంఖ్య. కాని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంఖ్యకాని (సృష్టిస్థితి లయకర్తలు) ఎక్కడ? మహావిష్ణువు యొక్క శరీరమందలి ఒక్క రోమకూపమందు ఉద్భవించిన స్వచ్ఛజలమందు బ్రహ్మాండము, ఈ సంసారములోని సముద్రములో కృత్రిమమైన ఓడవలె ఉన్నది సుమా. ఇట్లు మహావిష్ణు శరీరమందలి రోమముల యొక్క సంఖ్యా ప్రమాణముతో అసంఖ్యాకములైన బ్రహ్మాండములున్నవి. బ్రహ్మాండములలో ఎందరో దేవతలు నీతో సములు ఉండియే ఉన్నారు.

ఏతస్మిన్నంతరే తత్ర దదర్శ పురుషోత్తమః

పిపీలిక సమూహం చ వ్యాయతం ధనుషాం శతం

 క్రమశస్తాన్ సన్నిరీక్ష్య జహాసొచ్చెర్ద్విజార్భకః

నోచ కించన్మొనీ చ గంభీరః సగణో యథా

దృష్ట్వ హాస్యం ఏప్రవటోర్గాథార శ్రుత్వాఽ తి స్మితః

పప్రచ్ఛ చ పునర్విద్రం శుష్కకంఠోష్ఠ తాలుకః

ఇట్లు మాట్లాడుచుండగనే పురుషోత్తముడక్కడ నూరు ధనుస్సుల పొడుగుగా వ్యాపించి చీమల బారును చూచెను. వరుసగా వచ్చుచున్న ఆ పంక్తిని చూచీ బ్రాహ్మణ బాలుడు పెద్దగా నవ్వెను. ఇంద్రుడు గంభీరముగా నుండి మౌనముగా నున్న బ్రాహ్మణ బ్రహ్మచారినీ అతని నవ్వును చూచీ అతడు చెప్పిన విషయమును వినీ మిక్కిలి ఆశ్చర్యము పొంది నోరెండుకొనిపోగా తిరిగి బ్రాహ్మణుని ప్రశ్నించెను.

ఇంద్ర ఉవాచ – ఇంద్రుడనేను-

 కథం హససి విప్రేంద్ర మాం శీఘ్రం కారణం వద

 త్వం వాకో మాయయాచ్ఛన్న శిశురూపే గుణార్ణవః

 ఇంద్రస్య వచనం శ్రుత్వా తమువాచ ద్విజార్భకః

 ఆధ్యాత్మికం నీతిసారం జ్ఞాసబీజ వరం వరం

ఓ బ్రాహ్మణి శ్రేష్ఠుడా! నన్ను గురించి ఏల నవ్వుచున్నావు. కారణము చెప్పుము. శిశురూపము ధరించిన గుణ సముద్రుడవు. కపట వేషముతో నున్న నీవు ఎవడవు? ఇంద్రుని మాటను విని బ్రాహ్మణ బాలుడు అధ్యాత్మవిద్యాసారము జ్ఞానబీజమునైన శ్రేష్ఠవాక్యమును అతనితో పలికెను.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడనేను :

దృష్టః పిపీలికా సంఘూ హేతురస్య నిగూఢకః

మా మాం వృచ్చ శోకబీజం తవాన్యదిజ్ఞాన కారణం

సాంసారికాణాం సంసార వృక్షమూల నికృంతనం

 ఆజ్ఞాన తమసిచ్ఛన్నం జ్ఞాన దీపమనుత్తమం

నిగూఢం సర్వవేదేషు సిద్ధానామపి దుర్లభం

యోగినాం ప్రాణ తుల్యం చ మూఢాంహకార భంజనం

ఇత్యుక్త్వా తత్ర నంతస్ధా సస్మితో ద్విజ పుంగవః

పునః పప్రచ్ఛ శక్రస్తం శుష్కకంఠోష్ఠ తాలుకః

చీమల బారు కనిపించినది. దీనికి గూఢమైన కారణమున్నది. నీ శోకమునకు మూలమైన దీనిని గురించి నన్ను ప్రశ్నించకుము, సంసారుల యొక్క సంసార వృక్షమూలమును (జన్మమరణ ప్రవాహమును) ఖండించునట్టిదియు సంసారము కంటే ఇతరమైన జ్ఞానమునకు (తత్వము) కారణమైనది ఇది. అజ్ఞానమును చీకటిచేత కప్పబడినదైనను జ్ఞానదీపము మిక్కిలి శ్రేష్ఠమైనది. సర్వవేదములలో ఇది దాచిపెట్టబడి యున్నది. సిదలకును దుర్లభమైనది, యోగులకు ప్రాణముతో సమానమైనది. మూఢుల అహంకారమును నశింపజేయునది అని పలికి ఆ బ్రాహ్మణ శ్రేష్టుడు నవ్వుచు ఆగిపోయెను. కంఠము పెదవులు దవడలు ఎండిపోయి (భీతితో) శక్రుడు మరల ప్రశ్నించెను.

శక్ర ఉవాచ - ఇంద్రుడనెను :

బ్రూహి విప్రవటో శీఘ్రం జ్ఞానదీపం పురాతనం

న జానామి శిశు కన్యం జ్ఞానరాశిః స్వమూర్తిమాన్

ఇంద్రవ్య వచనం శ్రుత్వా విప్రరూపీ జనార్దనః

 జ్ఞానం భాషితురేభే యోగీంద్రాణాం సుదుర్లభం

“రూపము ధరించిన జ్ఞానరాశివీ శిశువుగా వచ్చితివి. నీవెవడవు? నిన్నెరుగను. ఓ బ్రాహ్మణ బ్రహ్మచారీ! ప్రాచీన కాలమునుండి వచ్చుచు ఎప్పుడును నూతనముగా నుండునట్టి ఆ జ్ఞాన దీపమును గూర్చి నాకు తెలుపుము”. ఇంద్రుని మాట విన్న బ్రాహ్మణ  రూపమునున్న విష్ణువు యోగీంద్రులకును మిక్కిలి దుర్లభమైన జ్ఞానము గురించి చెప్పుటకొరంభించెను.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడనెను :

సృష్ఠః పిపీలికా సంఘః ఏకైకః క్రమశో మయా

సర్వే న్వకర్మణా శక్ర శక్రీభూతాః సురాలయే

అధునా కర్మణా సర్వే క్రమశో భూత జన్మనాం

ఆతీతకాలే సంప్రాప్తి భూతజాతిం పిపీలికాం

కర్మణా జీవినో యాంతి వైకుంఠం చ నిరామయం

కర్మణా బ్రహ్మలోకం చ శివలోకం చ కర్మణా

స్వర్గం స్వర్గ నమస్థానం పాతాళం చ స్వకర్మణా

 కర్మణా సరకం ఘోరం స్వాత్మదుఃఖైక కారణం

 కర్మణా నూకరీ గర్భం కర్మణా క్షుద్రజీవనం

కర్మణా పశుపత్నీనాం కర్మణా పక్షియోషితాం

 కర్మణా కీటయోనిం చ వృక్షత్వం చ స్వకర్మణా

 స్వకర్మణా సుఖీ దుఃఖీ సేవ్యః సేవక ఏవ చ

 కర్మణా బ్రాహ్మణత్వం చ దైవం చాపి స్వకర్మణా

స్వకర్మణా చ పేతత్వం బ్రహ్మత్వం చ స్వకర్మణా

కర్మణా వ్యాధియుక్షశ్చ కర్మణేవాతి సుందర

 కర్మణా స్వాంగహీనశ్చ స్వాంగవృద్ధశ్చ కర్మణా

విధాతా కర్మసూత్రేణ ఫలదాతా చ జీవినాం

కర్మ న్వభావ సాధ్యం చ స్వభావోఽభ్యాన జీవక

ఇంద్రా! ఈ చీమల బోరేదికలదో అందులో ప్రతియొక్కటి క్రమముగా సాచేత సృష్టింపబడినదే. ఈ జీవులందరు తమ కర్మమూలమున దేవలోకములో శక్రులుగా చేయబడియుండిరి. వీరందరిప్పుడు తమ కర్మ చేత క్రమముగా జంతు జన్మలు పొందుచు కాలము గడవగా చీమల శరీరములను పొందిరి, జీవులు తమ కర్మచేతనే ఆధి వ్యాధి భయములు లేని వైకుంఠమును; కర్మచేతనే బ్రహ్మ శివలోకములను, స్వర్గమును, అటువంటి భోగములో ఉన్న భూలోకమును, స్వకర్మను బట్టియే పాతాళమును పొందుదురు. ఆత్మ దుఃఖములకు ఏకకారణమైన ఘోర - నరకమును కూడ కర్మను బట్టియే పొందుదురు. కర్మ వలననే పంది జన్మను కర్మను బట్టియే క్షుద్రమైన కీటకాది జన్మలను, కర్మను బట్టియే కోడెలు గోపులు దున్నలు ఎనుములుగా పక్షులుగా ఆడపక్షులుగా, కర్మను బట్టియే పురుగుల జన్మను వృక్షలతా జన్మలను జీవులు పొందుచున్నారు. వాని వాని కర్మను బట్టియే సుఖవంతుడు దుఃఖవంతుడు ప్రభువు సేవకుడు అగుచున్నాడు. బ్రాహ్మణజన్మ దేవతాజన్మ ప్రేతజన్మ బ్రహ్మ జన్మ అన్నియు కర్మానుసారమే సంభవించును. వ్యాధికలవాడగుట, మిక్కిలి సుందరుడుగా నుండుట, అంగహీనుడు, అధికముగా అంగములు కలవాడునగుట కర్మను బట్టియే. సృష్టికర్త జీవులకు వారి వారి కర్మసూత్రముననుసరించియే ఫలమిచ్చుచున్నాడు. కర్మయన్నది జీవుని యొక్క స్వభావమును బట్టి సాధింపబడును. ఆ స్వభావమన్నది ఆభ్యాసము జీవముగా గలది.

ఇత్యేవం కథితం సర్వధ్యాత్మిక వరం వచ

 సుఖదం పుణ్యదం సారం నరకార్ణవ తారకం

 సంసారః స్వప్న వత్సర్వం దేవేంద్ర సచరాచరం

మృత్యుశ్చ మస్తక స్థాయీ సర్వేషాం కాలయోగతః

 జల బుద్బుద వత్సర్వం జీవీనాం చ శుభాశుభం

శక్ర శశ్వద్ర్యమత్యేవ నావిష్ణ సత్ర పండితః

 ఇత్యేవముక్త్వా ఏప్రశ్చ తత్ర తగ్గే చ సస్మితః

ఇటు మొత్తము ఆధ్యాత్మిక సంబంధము గల వాక్కులు చెప్పబడినవి. ఈ తత్వజ్ఞానము నరకసముద్రమును దాటించునట్టి సారము. పుణ్యములను తద్ద్వారా సుఖములను ఇచ్చునది. ఇంద్రా! ఈ చరాచర ప్రపంచము (సంసారము) మొత్తము స్వప్నము వలె క్షణభోగము కలది. వాస్తవము కానిది. అందరు జీవులకు కాలయోగమును బట్టి మృత్యువు శిరస్సుమీదనే నిలిచియున్నది. జీవులందరికీ శుభాశుభములు నీటి బుడగల వలె క్షణికములే. ఇంద్రా! ఇట్లె సుఖదుఃఖముల చక్రము తిరుగుచునే ఉండును: పండితుడైనవాడీ చక్రము పై ఎక్కడు (సంసారములో ప్రవేశించడు), అని పలికి చిరునవ్వుతో బ్రాహ్మణుడు నీలిచెను.

విస్మీతఫ్రిదశాధ్యక్షో నాత్మానం బహమన్యతే

 ఏతస్మిన్నంతరే శీఘ్రమాజగామ మునీశ్వరః

 ఆతీ వృద్ధే మహాయోగీ జ్ఞానేన వయసా మహాన్

కృష్ణాజినీ జటాధారీ బీభ్రత్తిలక ముజ్వలం

వక్షఃస్థలే రోమచక్రం బిభర్త మస్తకే కటం

స్థితం సర్వం మధ్యదేశే కించిదుత్సాటీతం న్ళుటం

నమాగమ్య ద్వయోర్మధ్యే తగ్గి స్థాణువదేవ నః

మహేంద్రో బ్రాహ్మణం దృష్ట్యా ప్రణనామ ముదా న్వితః

మధువరాదికం దత్తా పూజయామాస భక్తితః

పవచ్ఛ కుశలం విప్రం చకార వినయం పునః

తుష్యావాతిధి భావేన ముదా సోదర పూర్వకం

విప్రార్భక సేన సార్థం సంభాషాం చ చకార సః

 స్వవాంఛితం పరం ప్రాహ సర్వం వినయ పూర్వకం

ఆ ఉపదేశమునకాశ్చర్యము పొందిన దేవేంద్రుడు అప్పుడు తనను గొప్పగా భావించకుండెను. అంతకు ముందు గల గర్వము నశించెను). ఇంతలో అక్కడికొక మునీశ్వరుడు - అతి వృద్ధుడు గొప్ప యోగి జ్ఞానమును బట్టి వయస్సును బట్టి పెద్దవాడు (వృద్ధుడు) కృష్ణాజినమును జడలను ధరించి నొసట తిలకము ప్రకాశించుచుండగా ఎదురు రొమ్మున వెండ్రుకలసుడితో శిరస్సున కటముతో వచ్చెను. ఆ వక్షఃస్థలమందలి సుడిలో కొద్దిగా రోమములు పెరికివేయబడినట్లు స్పష్ట పడుచుండెను. అట్టి వృద్ధముని చేరవచ్చీ బాలుడు ఇంద్రుల మధ్య స్థలములో కదలనీ స్తంభము వలె నిలిచేను. మహేంద్రుడే మునిని చూచి సంతసముతో నమస్కరించి భక్తితో మధుపర్కాదులిచ్చి పూజించెను. కుశల ప్రశ్నవేసి వినయమును ప్రకటించెను. ఆదరముగా అతిథి దైవమన్న భావముతో స్తుతించెను. బ్రాహ్మణ బాలుడామునితో సంభాషణమారంభించి వినయ పూర్వకముగా తన శ్రేష్ఠమైన వాంఛితమును (కోరిన దానిని)  ఇట్లు చెప్పెను.

బాలక ఉవాచ - బాలకుడు పలికెను :

కుత సమాగతో విప్ర కిన్నామ తవ వా వద

 కో వా ఽత్రాగమనే హేతుర్నివాసః కేన హేతునా

 కటం కథం మస్తకే తే లోమచక్రం చ పక్షసీ

అత్యున్నతం మధ్య దేశే కించిదుత్సాటీతం మునే

మాం చే త్కృపాఽ స్తితే విప్ర సర్వం సంవ్యస్య కథ్యతాం

అత్యద్భుతమిదం సర్వం శ్రోతుం కౌతూహలం మమ

స శిశోర్వచనం శ్రుత్వా తమువాచ మహామునిః

సర్వం స్వకీయ వృత్తాంతం శక్రస్య పురతో ముదా

 “ఓ బ్రాహ్మణా! ఎక్కడి నుండి వచ్చితివి? నీ నామమేమి? ఇక్కడికెందుకు వచ్చితివి? ఏ కారణముగా ఇక్కడ నిలిచితివి? నీ తల పై కటము వక్షఃస్థలము వెండ్రుకల సుడి ఎట్లేర్పడినవి? ఉన్నతమైన వక్షఃస్థల మధ్య భాగమున కొంచెము వెండ్రుకలు పెరికినట్లుండుట ఏమి? మునీ! నా యందు దయయున్నచో సర్వము వివరించి చెప్పుదువు గాక. ఇదంతయు మీక్కిలీ అద్భుతముగానున్నది. వినుటకు నౌకాసక్తి ఏర్పడినది”, ఆ శిశు వాక్యములను విని తన వృత్తాంతమంతను ఇంద్రుని ఎదుట శిశువుకు మహాముని చెప్పెను.

మునిరువాచ - ముని పలికెను:

అల్పాయుషా మయా విప్ర కుత్రాపీ న కృతా గృహా

 నివివాహ శ్చోపజీవ్యం భిక్షపజీవినాధునా

లోమతిచ మన్నామ హేతుర్వివ్రస్యదర్శనం

వర్షాతపసు శాంత్యర్థం మస్తకస్థం కటం మమ

వక్షః స్థల స్థితం రోమచక్రం తత్కారణం శ్రుణు

సాంసారికాణాం భయదం వివేక జననం పరం

ఆయు సంఖ్యా ప్రమాణం మే లోమచక్రం చ వక్షసి

 శకైక వచనం విప్ర లోమైకోత్పాటనం మమ

ఉత్సాటీతాని లోని తేన మధ్యే స్థితాని చ

బ్రహ్మణో ద్విపరార్దే చ మమ మృత్యుర్నిరూపీతః

అసంఖ్య విధయో బ్రహ్మన్మరిష్యంతి మృతా ఆపి

కలత్రేణ చ పుత్రేణ గృహేణ కిం ప్రయోజనం

బ్రహ్మణ: వతనే చక్షుర్నిమేషశ్చ హరేర్భవేత్

తత్పాద పద్మమతులం చింతయామి నిరంతరం

 దుర్లభం శ్రీహరేర్డాన్యం భక్తి: ముకేర్గరీయసీ

 స్వప్నవత్సర్వమైశ్వర్యం తద్భక్త వ్యవధాయకం

ఇదం మదురుణా దత్తం శంభునా జ్ఞానముత్తమం

వినా భక్తిం న గృహోమి సాలోక్యాది చతుష్టయం

ఇత్యేవముక్త్యా స మునిర్ణగామ శివసన్నిధిం

 శిశురూపీ హరి స్తత్రైవాంతర్ధానం చకార హ

ఓ బ్రాహ్మణా! అల్పమైన ఆయుష్యము గల నేనెక్కడ గూడ గృహములను నిర్మించుకొనలేదు. నాకు వివాహము గాని జీవించుటకు ఆధారముగానీ లేవు. ఇప్పుడు భిక్షతో బ్రతుకుచున్నౌను. నా పేరు “లోమశుడు”. ఇక్కడికి వచ్చుటకు హేతువు బ్రాహ్మణదర్శనమే. వర్షము ఎండల నుండి ఉపశాంతి పొందుటకే కటమును శిరస్సున ఉంచుకొంటిని. ఇక వక్షఃస్థలమున వెండ్రుకల సుడి ఉండుటకు కారణము వినుము. ఇది సంసారమందున్న వారికి భయమును అట్లే శ్రేష్టమైన వివేకమును పుట్టించు సమాధానమిది. నా వక్షస్థలమున నున్న వెంట్రుకల సుడి నా ఆయుష్య సంఖ్యా ప్రమాణము తెలుపునది. ఒక్కొక్క ఇంద్రుడు పదవి నుండి తొలగి పోగా (ఇంద్రుని ఆయువు నిండగా) ఈ సుడిలోని ఒక్కొక్క వెండ్రుక రాలిపోవును. ఆకారణము చేత సుడిలోని కొన్ని రోమములు రాలిపోయినవి. నడుమ కొన్ని నీలిచియున్నవి. బ్రహ్మయొక్క ద్విపదార్ధకాలముందు నా మృత్యువు నిరూపింపబడినది. లెక్కకు మిక్కిలి సృష్టికర్తలు ఇంతవరకు ( నా ఎరుకలో) మరణించిరి. ఇంకను మరణింతురు. ఇక ఈ కొద్ది కాలము కొరకు భార్యతోకొడుకుతో గృహముతోనేమి ప్రయోజనము!? ఒక బ్రహ్మ పతనము చెందినప్పుడు శ్రీహరి యొక్క నేత్రములకొక రెప్పపాటు కలుగును. అందుకే నిరంతరము సాటిలేని అతని పాదపద్మములను ధ్యానించుచున్నాను. భక్తిముక్తులకన్న శ్రేష్ఠమైన శ్రీహరి దాస్యము దుర్లభము సుమా! స్వప్నము వంటి ఈ ఐశ్వర్యమంతయు ఆ స్వామి పాదభక్తికి ఆటంకమే. ఈ ఉత్తమ జ్ఞానమును నా గురువు శంకరుడు నాకుపదేశించెను. భక్తిలేనట్టి సాలోక్యాది చతుర్విధ భక్తినీ నేను స్వీకరించను. ఇట్లు పలికి ఆ లోమశముని శివుని సన్నిధికేగెను. శిశురూపమున నున్న శ్రీహరి (బ్రాహ్మణ శిశువు) అక్కడనే అంతర్ధానమయెను.

ఇంద్రస్తు స్వప్నవద్దృష్ట్వ బభూవ తత్ర విస్మితః

తృణమాత్రం చ సంపత్తా నా స్యేవ పరమేశ్వరే

విశ్వకర్మాణమనీయ ప్రియముక్త్వా శతక్రతు

దత్వా రత్నాని సంపూజ్య తం ప్రస్థాపితవాన్ గృహం

 సర్వం విన్యస్య పుత్రే చ శరణం గంతుముద్యతః

 శచీం రాజ్యశ్రీయం త్యక్త్వా వివేకీ క్షయకాముకః

దృష్వా వివేకినం కాంతం హృదయేన విదూయతో

 శచీ జగామ శోకార్తా సంత్రస్తా శరణం గురోః

సర్వం నీవేధనం కృత్వా సమానీయ బృహస్పతిం

బోధయామాస శక్రం తం నీతిసారేణ కామినీ

గురోః శాస్త్ర విశేషం చ దంషతీరస సంయుతం

విధాయ చ స్వయం ప్రీత్యా పాఠయామాస తం ముదా

ముని శాస్త్ర విశేషం చ బోధయామాస వాక్పతిః

 స చకార తదా రాజ్యం బృందావన వినోదిని

ఇత్యేవం కథితం సర్వం శక్రదర్పవిమోచనం

సాక్షాద్దృష్టొ దర్పభంగో నందయజ్ఞే నురేశ్వరి

ఇంద్రుడీ సంఘటననంతటిని స్వప్నము వలె చూచి ఆశ్చర్యము పొందెను. సంపదయందున్న వ్యామోహములో గడ్డిపరకయంత కూడ నాకు పరమేశ్వరుని మీద లేనే లేదు కదా! అని తలచి ఇంద్రుడు విశ్వకర్మను పిలిచి ప్రియవాక్యములు పలికి రత్నములిచ్చి పూజించి అతని నింటికి పంపించెను. శచీదేవిని రాజ్యసంపదను వదిలి పుత్రునకు సర్వమప్పగించి వివేకము గలవాడై మృత్యువును కోరి భగవంతుని శరణు పొందుటకు పూసుకొనెను. భర్త జ్ఞానియగుట చూచి హృదయము బాధపడగా భయపడి శచీదేవి శోకముతో బృహస్పతిని శరణు జొచ్చెను. అన్ని విషయములు నివేదించి బృహస్పతినీ భర్త వద్దకు చేర్చి ఆ కామీని ఇంద్రునికి నీతిసారము బోధింపజేసెను. గురువు యొక్క నీతిసారమైన శాస్త్ర విషయమునకు జోడుగా ఆమె స్వయముగా భర్తకు దాంపత్య జీవితములోనీ రసమును సమకూర్చి పఠింపజేసెను. బృహస్పతి రాజనీతి శాస్త్ర విశేషమును బోధించగా ఓ బృందావన వినోదినీ! ఇంద్రుడప్పుడు రాజ్యమును పాలించెను. ఇట్లు మొత్తము ఇంద్రుని యొక్క దర్ప విమోచనము (గర్వమును విడచుట)ను చెప్పితిని, ఓ దేవీ! నీవు నేరుగా నందుడొనర్చిన గోవర్ధన పర్వతపూజా యజ్ఞములో ఇంద్రునకు జరిగిన దర్పభంగమును చూచితివి కదా! అనెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే రాధాశ్రీ కృష్ణ సంవాదే సప్తచత్వారింశోఽధ్యాయః

ఇది బ్రహ్మావైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన రాధా శ్రీకృష్ణ ప్రసంగ రూపముననున్న నలుబది ఏడవ అధ్యాయము సమాప్తము.