బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

69 - అధ్యాయము

మూ నారద ఉవాచ:

అతఃపరం కిం రహస్యం రాధాకేశవయోర్వద

నిగూఢతత్వమ స్పష్టం తన్మే వ్యాఖ్యాతు మర్హసి

శ్రీనారాయణ ఉవాచ :

శృణు నారద వక్ష్యామి రహస్యం పరమాద్భుతం

గోపనీయంచ వేదేషు పురాణేషు పురావిదాం

పునః సకామో భగవాన్కృష్ణ: స్వేచ్ఛామయోవిభుః

రేమే స రమయసార్థం విదగ్ధశ్చ విదగ్ధయా

చతుఃషష్ఠికలాశక్త్యా యథా కాంతా కలావతీ

కామశాస్త్రేషు నిపుణా విదగ్ధా రసికేశ్వరీ

శృంగారలీలానిపుణా శశ్వత్కామాచ కాముకీ

సుందరీ సుందరీ ష్వేవ శశ్వత్ సుస్థిర యౌవనా

పితృణాంమానసీ కన్యా ధన్యా మాన్యాచ మానినీ

శంభోః శిష్యా జ్ఞానయుతా శతకల్పాంత జీవినీ

వేదవేదాంగనిపుణా యోగినీతి విశారదా

నానారూపధరా సాధ్వీ ప్రసిద్ధ సిద్ధయోగినీ

తత్కన్యా రాధికా దేవీ మాతృతుల్యాచ కాముకీ

చకార నానా భావం సాసుశీలా స్వామినం ప్రతి

చతుఃషష్టికలామానం శృగారంచ చకార సః

తథా విశిష్టయా సాకం రాసే రాసరసోత్సుకః

తాం నఖాగ్రక్షతశ్రోణీం నఖక్షతపయోధరాం

లుప్త చందన సిందూరాం కబరీశిథిలాం సతీం

సుఖసంభోగమగ్నాంచ నగ్నాంచ శోకమూర్ఛితాం

పులకాంచిత సర్వాంగీం నిద్రా దేవీం సమాయయౌ

దృష్ట్వా తాం నిద్రితం కృష్ణః కృపయాచ కృపానిధిః

రురోద మాయయా మాయీ మాయేశోలోకశిక్షయా

కృత్వావక్షసిరాధాంచ చుచుంబచపునః పునః

స్నాతాంచనేత్ర సలిలైః ప్రాణాధిష్ఠాతృదేవతాం

ప్రాణాధికాం ప్రియతమాం ధారయా మాసవాససీ

వహ్నిశుద్ధేఽతి సూక్ష్మచామూల్యే విశ్వసుదుర్లభే

కబరీం రచయామాస దదౌ కుంకుమ చందనం

తద్గాత్రేచ గలే హారమమూల్యం రత్న నిర్మితం

సిందూరంచ దదౌతస్యాః సీమంతాధః స్థలేఽమలే

దాడిమీకుసుమాకారం యుక్తం చందన బిందుభిః

చకార పద్మకం గండే నానాచిత్రవిచిత్రకం

దదౌ తత్పాద పద్మేచ రత్నమంజీరరంజితం

పాదాంగుళినఖాగ్రేచ సుందరాలక్తకం దదౌ

నానాసువేషోజ్జ్వలితాం తాం నిద్రాకులితాం విభుః

పునశ్చకార మోహేన గాఢాలింగన మీప్సితం

పునశ్చ చుంబనం కృత్వా నివేశ్యచస్వవక్షసి

సుష్వాప జగతాం స్వామీ కామీ విరహ కాతరః

ఏతస్మిన్నంతరే కాలే బ్రహ్మా లోకపితామహః

అను! నారదుడిట్లన్నాడు: ఈపిదప రాధకేశవుల రహస్యమేమిటో చెప్పు. అస్పష్టమైన, నిగూఢమైన తత్వమును దానిని నాకు వ్యాఖ్యానించగలవు అనగా (1) శ్రీనారాయణుని వచనమిట్లా - ఓ నారద! పరమ అద్భుతమైన రహస్యాన్ని చెబుతాను, విను . వేదములలో, పురాణములలో, పురా విదులకు దాచతగిన దానిని చెబుతాను. (2) విభువు! స్వేచ్ఛామయుడు, భగవంతుడైన కృష్ణుడు తిరిగిన కాముడైనాడు. విదగుడు, విదగ్ధయైన (నేర్పరి) రమతో కూడి ఆతడు రమించాడు. (3) చతుష్టష్టికళల శక్తితో, కళావతియైన కాంత వలె, కామశాస్త్రములందు నిపుణమైన విదగ్ధయైన, ఆరసికేశ్వరి, (4) శృంగార లీలలందు నిపుణురాలైన, ఎల్లప్పుడు కామముగల ఆకాముకి, సుందర స్త్రీ లందే సుందరురాలైన, ఎల్లప్పుడు, స్థిరమైన యౌవనముగల ఆమె (5) తలిదండ్రులకు మనస్సంకల్పముతో కల్గిన కన్య, ధన్యురాలు, మాన్యురాలు ఐన ఆమానిని, శంభునకు శిష్యురాలు, జ్ఞానం కలది శతకల్పాంతముల కాలము జీవించే ఆమె (6)వేద వేదాంగములలో నిపుణురాలు, యోగనీతియందు విశారదురాలు, నానా రూపముల ధరించేది, సాధ్వి, సిద్ధయోగిని అని ప్రసిద్ధమైన ఆమె, (7) ఆకన్య దేవి, రాధిక, మాతతో సమానము, కాముకి కూడా. ఆ సుశీల స్వామిని గూర్చి రకరకాల భావములను ప్రకటించింది. (8) రాసరసమందు ఉత్సుకుడైన ఆతడు విశిష్టురాలైన ఆమెతో కూడి, రాసక్రీడయందు చతుః షష్టికళలకు సరితూగేట్టుగా శృంగారమాచరించాడు. (9) గోటికొనలతో పిరుదు భాగములను గిల్లి, ఆమె రొమ్ములను గోళ్ళతో గిల్లి చందనము సింధూరము చెదిరిపోగా, తలవెంట్రుకలు (కొప్పు) విడిపోయి ఉన్న ఆ సతిని (10) సుఖసంభోగమందు మునిగి, నగ్నంగా, శోకమూర్చితమై ఉన్న, శరీరమంతా గగుర్పాటు కలిగి, ఉన్న , ఆనిద్రాదేవిని చేరాడు (11) నిద్రిస్తున్న ఆమెను జూచి కృష్ణుడు, కృపానిధి, కృపతో, మాయకు ఈశుడైన ఆతడు, లోకములకు తెలియజేసే కొరకు, ఆమాయగాడు, మాయగా (అమాయకంగా) ఏడ్చాడు. (12) రాధను వక్షమందుంచుకొని మాటిమాటికి ముద్దాడాడు. కన్నీళ్ళతో స్నాతమైన, ఆప్రాణాధిష్ఠాతృదేవతను (13) ప్రాణాధికురాలైన ప్రియతమను వస్త్రములను ధరింపజేశాడు (వస్త్రములు కట్టాడు). ఆ వస్త్రములు వహ్నితో శుద్ధమైనవి. అతి సూక్ష్మమైనవి. అమూల్యమైనవి. విశ్వమందు లభింప శక్యముకానివి (14) కొప్పుముడివేశాడు (వెంట్రుకలు కూర్చాడు). కుంకుమ చందనములు ఇచ్చాడు (పెట్టాడు) ఆమె మెడయందు, శరీరమందు అమూల్యమైన రత్నహారము వేశాడు. (15) సీమంతము యొక్క క్రింద భాగమందు,స్వచ్ఛమైన చోట ఆమెకు సిందూరం పెట్టాడు. చందనపు చుక్కలతో కూడిన, దానిమ్మపువ్వు లాంటి ఆకారంలో సింధూరం పెట్టాడు (16) గండభాగమందు (చెక్కిలి) నానా చిత్ర విచిత్రములు కల పద్మకమును పెట్టాడు (పద్మం చిత్రించాడు). ఆమె పాదపద్మములందు, రత్నములతో చేసిన కాలిఅందెలను అలకంరించాడు. (17) పాదముల వేళ్ళగోళ్ళకొనలలో సుందరమైన లత్తుక పూశాడు. రకరకాలైన మంచి వేషములతో వెలిగిపోతున్న, నిద్రలో మునిగిన ఆమెను విభుడు (18) మోహంతో తనకిష్టమైన గాఢాలింగనమును చేశాడు (కౌగిలించుకున్నాడు) తిరిగి ముద్దాడి, తన వక్షమందుంచుకొని, (19) విరహంతో అధీరుడై, జగత్తులకు స్వామియైన, ఆకామి, నిద్రించాడు. ఈ మధ్యకాలంలో, లోకపితామహుడైన బ్రహ్మ.

మూ శివశేషాదిభిర్దేవైః మునీంద్రైస్సార్దమాయయా

ఆగత్య గత్వా శిరసాతుష్టావ సంపుటాంజలిః

సామవేదోక్త స్తోత్రేణ పరిపూర్ణతమం విభుం

బ్రహ్మోవాచ :

జయజయ జగదీశవందిత చరణ నిర్గుణ, నిరాకార, స్వేచ్ఛామయ భక్తానుగ్రహ, నిత్యవిగ్రహ, గోపవేష, మాయయా, మాయేశ, సువేష, సుశీల, శాంత, సర్వకాంత, దాంత, నితాంత, జ్ఞానానంద, పరాత్పరతర, ప్రకృతేఃపర, సర్వాంతరాత్మరూప, నిర్లిప్త, సాక్షిస్వరూప, వ్యక్తఅవ్యక్త, నిరంజన, భారావతారణ, కరుణార్ణవ, శోకసంతాపగ్రసన, జరామృత్యు భయాదిహరణ, శరణ పంజర, భక్తానుగ్రహకాతర, భక్తవత్సల, భక్తసంచితధన, ఓం నమోస్తుతే

సర్వాధిష్ఠాతృదేవాయే త్యుక్త్వా వై ప్రీణనాయచ

పునఃపునరువా చేదం మూర్ఛితశ్చ బభూవ హ

ఇతి బ్రహ్మకృతం స్తోత్రం యః శృణోతి సమాహిత :

తత్సర్వాభీష్టసిద్ధిశ్చ భవత్యేవ న సంశయః

అపుత్రో లభతే పుత్రం ప్రియాహీనోలభేత్ప్రియాం

నిర్ధనోలభతే సత్యం పరిపూర్ణతమం ధనం

ఇహలోకే సుఖంభుక్త్వా చాంతే దాస్యం లభేద్ధరేః

అచలాం భక్తి మాప్నోతి ముత్తైరపి సుదుర్లభాం

స్తుత్వాచ జగతాం ధాతా ప్రణమ్యచ పునఃపునః

శనైః శనైః సముత్థాయ భక్త్యా పునరువాచ హ

బ్రహ్మఉవాచ:

ఉత్తిష్ట దేవదేవేశ పరమానందకారణ

నందనందన, సానంద నిత్యానంద నమోఽస్తుతే

ప్రజ నందాలయం నాథ త్యజ వృందావనం వనం

స్మర సుదామ శాపంచ శతవర్షనిబంధనం

భక్త శాపానురోధేన శతవర్షం ప్రియాం త్యజ

పున రేతాంచ సంప్రాప్య గోలోకంచ గమిష్యసి

గత్వా పితృగృహం దేవ పశ్యాక్రూరం సమాగతం

పితృవ్యమతిథిం మాన్యం ధన్యం వైష్ణవ మీశ్వరం

తేనసార్ధం మధుపురీం భగవాన్ గచ్ఛ సాంప్రతం

కురు శంభోర్ధనుర్భంగం భగ్నంవైరిగణం హరే

హన కంసం దురాత్మానం తాతం బోధయ మాతరం

నిర్మాణం ద్వారకాయాశ్చ భారావతరణం భువః

దహవారణ సీంశంభోః శక్రస్య సదనం విభో

శివస్యజృంభణం యుద్ధే బాణస్యభుజకృంతనం

రుక్మిణీహరణంనాథ ఘాతనం నరకస్యచ

షోడశానాం సహస్రంచ స్త్రీణాంపాణిగ్రహం కురు

త్యజప్రియాం ప్రాణసమాం వ్రజేశ్వర వ్రజం వ్రజ

ఉత్తిష్ఠోత్తిష్ఠ భద్రం తే యావద్రాధా న జాగ్రతి

ఇత్యేవముక్త్వా బ్రహ్మాచ సేందైర్దేవగణెస్సహ

జగామ బ్రహ్మలోకంచ శేషశ్చ శంకరస్తథా

పుష్పచందన వృష్టించ కృష్ణస్యోపరి దేవతాః

చక్రుః ప్రీత్యాచ భక్త్యాచ వాగ్భభూవాశరీరిణీ

 వధ కంసం వధార్హంచ స్వపిత్రోర్మోక్షణం కురు

శయం కురు భువోభారం నారదేత్యేవమేవచ

అను శివుడు, శేషుడు మొదలగు దేవతలతో, మునీంద్రులతో కూడా వచ్చాడు. వచ్చి, శిరస్సు వంచి నమస్కరించి, చేతులు జోడించి స్తుతించాడు.(21) సామవేదమందు చెప్పిన స్తోత్రముతో పరిపూర్ణతముడైన విభుని ఇట్లా స్తుతించాడు.(22) బ్రహ్మవచనమిట్లో - ఓ జగదీశ! జయము, జయము. (దేవతలతో నమస్కరింపబడే చరణములు కలవాడ నిర్గుణుడ! నిరాకారుడ! స్వేచ్చా మయుడ! భక్తులకు అనుగ్రహించేవాడ! శాశ్వతమైనవిగ్రహము (శరీరం) కలవాడ! గోపవేషము ధరించినవాడ! మాయావి మాయకు ఈశుడ! సువేష! సుశీల! శాంత! అన్ని విధముల మనోహరమైనవాడ!దాంతుడ! (స్వేచ్ఛ) మిక్కిలిగా జ్ఞాన ఆనంద స్వరూపుడ! పరునికన్న పరతరుడ! ప్రకృతికి పరమైనవాడ! అన్ని అంతరాత్మల రూపుడ! నిర్లిప్త (అంటని) సాక్షిస్వరూపుడ! వ్యక్తుడ! అవ్యక్త స్వరూప! నిరంజనుడ! (భూ) భారమునుదించేవాడ! కరుణాసముద్ర! శోకసంతాపమును మింగేవాడ! జర, మృత్యువు, భయము, మొదలైనవి హరించేవాడ! శరణాగతునకు పంజరమైనవాడ! భక్తులను అనుగ్రహించుటకై చెదిరిన మనస్సు కాలవాడ! భక్తుల పై వాత్సల్యము కలవాడ! భక్తులనే కూర్చిన ధనముగలవాడ! ఓం! నీకు నమస్కారము (23) అన్నింటికి అధిష్టాతవైనదేవ! అని పలికి సంతోషింపచేసేకొరకు, దీనిని మళ్ళీ మళ్ళీ చెప్పాడు. మూర్ఛితుడు కూడా ఐనాడు. (24) అని బ్రహ్మ చేసిన స్తోత్రాన్ని ఎవడు శ్రద్ధగా వింటాడో, అతనికి సర్వ అభీష్టముల సిద్ధిఔతుంది, అనుమానం లేదు. (25) పుత్రులులేనివాడు పుత్రులపొందుతాడు ప్రియలేనివాడు ప్రియను పొందుతాడు. ధనహీనుడు, పరిపూర్ణమైన ధనమును పొందుతాడు, సత్యము. (26) ఈలోకంలో సుఖమనుభవించి, చివర హరిదాస్యాన్ని పొందుతాడు. ముక్తికి కూడా లభించనంతగా, నిశ్చలమైన భక్తిని పొందుతాడు. (27) జగత్తునకు ధాతయైన బ్రహ్మ స్తుతించి, మళ్ళీమళ్ళీ నమస్కరించి, మెల్లమెల్లగా లేచి, భక్తితో తిరిగి ఇట్లన్నాడు. (28) బ్రహ్మ వచనమిట్లా - ఓ దేవ! దేవులందరికి ఈశుడ! పరమ ఆనందమునకు కారణమైనవాడ! లే. ఆనందం కలవాడ! నిత్యం ఆనందం కలవాడ! నందనందన! నీకు సమస్కారము. (29). ఓ నాథ! నందుని ఆలయానికి వెళ్ళు. వృందావనమును విడిచి పెట్టు.సుదాముని శాపాన్ని, నూరు సంవత్సరాల పరిమితమైనదాన్నిస్మరించు. (30) భక్తుని శాపవశంగా (అడ్డంకి) నూరు సంవత్సరాలు ప్రియను వదులు. తిరిగి ఈమెను పొంది గోలోకానికి వెళ్తావు. (31) ఓ దేవ! పితృగృహమునకు వెళ్ళి అక్కడికి వచ్చిన అక్రూరుని చూడు. నీకు చిన్నాన్న, అతిథి. మాన్యుడు. ధన్యుడు, వైష్ణవుడు, ఈశ్వరుడు. (32) ఓ భగవన్! ఇప్పుడు, అతనితో కలసి మధురాపురికి వెళ్ళు. శంభుని ధనుస్సు విరిచేయి. ఓ హరి! శత్రుగణాన్ని భగ్నం చేయి. (33) దురాత్ముడైన కంసునిచంపు. తండ్రిగారిని, తల్లిని, మేల్కొలుపు. ద్వారక నగర నిర్మాణం చేయి. భూభారాన్ని తగ్గించు. (34) శివుని, వారణాసిని కాల్చు. ఓవిభు! ఇంద్రుని గృహంకాల్చు. యుద్ధంలో శివుని ఆధిక్యాన్ని తగ్గించు. బాణుని భుజములను కత్తిరించు. (35) ఓ నాధ! రుక్మిణిని హరించు, నరకుని వధించు. పదహారువేల స్త్రీలను పెళ్ళాడు. (36) ప్రాణసమమైన ప్రియను విడిచి పెట్టు. ఓవ్రజేశ్వరా! ప్రజమునకు వెళ్ళు. నీకు మేలు జరుగని, లే లే రాధ లేవకముందే, (37) అని ఇట్లా పలికి బ్రహ్మ ఇంద్రుడు దేవతలు వీరితో కూడి బ్రహ్మలోకమునకు వెళ్ళాడు. శేషుడు, శంకరుడు వెళ్ళారు. (38) దేవతలు కృష్ణుని పై పుష్పచందనవర్షాన్ని కురపించారు, ప్రీతితో భక్తితో చేశారు. అప్పుడు అశరీరవాణి పలికింది - ఇట్లా (39) చంపతగిన కంసుని చంపు. నీ తలిదండ్రులను విడిపించు. భూభారం తగ్గించు, ఓ నారద! అని ఈవిధంగానే అన్నారు.

మూ ఇత్యేవం తద్వచః శ్రుత్వాభగవాన్ భూతభావనః

రాధాం భగవతీం త్యక్త్వా సముత్తస్థాశనైః శనైః

యయౌహరిః కియదూరం నిరీక్ష్యచ పునః పునః

క్షణం తస్థౌ చందనానాం వనే వాససమీపతః

విహాయ రాధా నిద్రాం సా సముత్త స్థౌ స్వతల్పతః

న నిరీక్ష్య హరిం శాంతం కాంతంచ ప్రాణవల్లభం

హానాథ రమణ ప్రేష్ఠ ప్రాణేశ ప్రాణవల్లభ

ప్రాణచోరప్రియతమ క్వగతోఽసీత్యువాచహ

క్షణమన్వేషణం కృత్వా బభ్రమ మాలతీవనం

ఉవాస క్షణముత్తస్థౌ క్షణం సుష్వాప భూతలే

రురోదక్షణమత్యుచైః విలలాప ముహుర్ముహః

ఆగచ్ఛాగచ్ఛ హేనా థే త్యేవముక్త్వా పునఃపునః

మూర్ఛాం సంప్రాప సంతాపాత్సంతప్త విరహానలైః

భూతలేచ తృణాచ్చన్నే పపాతచ యథా మృతా

ఆయయుస్తత్ర గోప్యశ్చ బ్రహ్మన్ శతసహస్రశః

కాశ్చిచ్చామరహస్తాశ్చ గృహీత్వా చందన ద్రవం

తాసాం మధ్యేప్రియాళీ తాం కృత్వా రాధాం స్వవక్షసి

మృతామివ ప్రియాం దృష్ట్వా రురోద ప్రేమవిహ్వలా

సజలం పకంజదలం పంకోపరి నిధాయచ

స్థాపయామాస తాం రాధాం నిశ్చేష్ఠాంచ మృతామివ

గోపీభిః సేవితాం తత్ర రుచిరైః శ్వేతచామరైః

చంద నద్రవయుక్తాంచ స్నిగ్ధవస్త్రాన్వితాం సతీం

దదర్శ కృష్ణః తత్రైత్య తామేవ ప్రాణవల్లభాం

నివారితశ్చ గోపీభిః బలిష్ఠా భిశ్చ నారద

యథా నీత: సాపరాధో దండ్యః రాజభటాదిభిః

చకార రాధాoక్రోడేచ సమాగత్య కృపానిధిః

చేతనాం కారయామాస బోధయామాస బోధనైః

సంప్రాప్య చేతనాందేవీ దదర్శ ప్రాణవల్లభాం

బభూవ సుస్థిరా దేవీ తత్యాజ విరహజ్వరం

చకార కాంతం సాకాంతా గాత్రాలింగన మీప్సితం

నానాప్రకార శృంగారం చకార మధుసూదనః

ఉవాస రత్నతల్పేచ రాధాంకృత్వా స్వవక్షసి

రాధాసఖీ రత్నమాలా విదగ్ధా సర్వపూజితా

ఉవాచ కృష్ణం మథురం నీతిసార మనుత్తమం

రత్నమాలో వాచ

శృణు కృష్ణ ప్రవక్ష్యామి పరిణామసుఖావహం

హితం తథ్యం నీతిసారం దంపత్యోః ప్రీతికరణం

సంమతం కామశాస్త్రేషు నీతౌ వేదపురాణయోః

లౌకికవ్యవహారేషు ప్రశస్యం సుయశస్కరం

నారీణాంచ యథామాతా ప్రియోభ్రాతాచ బంధుషు

తతః ప్రియశ్చ పుత్రశ్చ పుత్రాదేవప్రియ: పతిః

అని ఈధంగా భూతభావనుడు (విష్ణువు, సృష్టికర్త) భగవంతుడు అ మాటలను విని భగవతియైన రాధను వదలి మెల్లమెల్లగా లేచాడు. (41) తిరిగి తిరిగి (ఎదిరి) చూస్తూ, హరి కొద్దిదూరం వెళ్ళాడు. గృహసమీపంలో ఉండే, చందన వనమందు కొద్దికాలమున్నాడు. (42) ఇంతలో రాధ నిద్ర నుండి లేచినది. ఆమె తన పడకనుండి లేచింది. శాంతుడు, కాంతుడు, ప్రాణవల్లభుడు ఐన హరిని చూడనందువల్ల (కన్పించ) (43) హానాథ! రమణ! ప్రాణేశ! ప్రాణవల్లభ! ప్రేష్ఠ! (మిక్కిలి ఇష్టమైనవాడ) ప్రాణచోర! ప్రియతమ! ఎక్కడికెళ్ళావు, అని పలికింది. (44) కొంచెం సేపు వెతికి, మాలతివనంలో తిరిగింది. కొంచం సేపు కూర్చున్నది. క్షణంలోనే లేచింది, అంతలోనే భూమి పై పడుకుంది. (45) క్షణంలో చాలా పెద్దగా ఏడ్చింది. మాటిమాటికి ఏడ్చింది. రా,రా, ఓనాథ అని ఈ విధంగా మాటిమాటికి పలికింది.(46) సంతాపంతో, విరహానలముతో బాగా తపించి మూర్చపోయింది. గడ్డితో కప్పబడిన(ఉన్న) భూమిపై చచ్చిన దానివలె పడిపోయింది. (47) ఓ బ్రహ్మా! వేలనూర్లకొలది గోపికలు అక్కడకొచ్చారు. కొందరు చేతుల్లో చామరాలు ధరించారు. కొందరు చందన ద్రవాన్ని తెచ్చారు.(48) వారిమధ్యలో ప్రియమైన చెలికత్తె ఆ రాధను వక్షమందుంచుకొని, ప్రియమిత్రురాలును చనిపోయిన దానినిగా చూచి (భావించి) ప్రేమవిహ్వలయై (అస్వాధీన) ఏడ్చింది. (49) బురద పైన నీరుగల పద్మదళములనుంచి, నిశ్చేష్టయే చనిపోయిన దానిలా ఉన్న ఆరాధను ఉంచింది. (50) అక్కడ గోపికలు అందమైన, తెల్లని చామరములతో సేవిస్తున్న చందన ద్రవము కలిగిన, నిగనిగలాడే వస్త్ర ముగల సతిని (51) ప్రాణవల్లభను ఆమెను, అక్కడికి వచ్చి కృష్ణుడు చూచాడు. బలిష్టులైన గోపికలు వారించగా, ఓ నారద! ఆమెను చూచాడు. (52)రాజుగారి భయం మొదలగువానితో, అపరాధం చేసినవాడు, దండనీయుడు ఎట్లా తీసుకుపోబడుతాడో అట్లా తీసుకెళ్ళారు. కృపానిధి వచ్చి, రాధను వక్షమందుంచుకొన్నాడు. (53) చైతన్యవంతురాలిని చేయసాగాడు. బోధనలతో బోధింపసాగాడు. దేవి, చైతన్యాన్ని పొంది, ప్రాణవల్లభుని చూచింది. (54) దేవి సుస్థిరురాలైంది. విరహజ్వరాన్ని విడిచింది. ఆకాంత! తనకాంతుణ్ణి ఇష్టమైన విధంగా ఆతని శరీరాన్ని కౌగిలించుకుంది. (55) మధుసూదనుడు రకరకాలైన శృంగారములు చేశాడు. రాధను, తన వక్షమందుంచుకొని రత్నతల్పమందున్నాడు. (56) రాధకు సఖి, నేర్పరి, అందరితో గౌరవింపబడేది, రత్నమాల కృష్ణునితో మధురంగా, నీతిసారముగల, ఉత్తమమైన మాటలను ఇట్లా అంది. (57) రత్నమాల వచనమిట్లా - పరిమాణంలో సుఖం కల్గించేదాన్ని చెబుతాను. ఓ కృష్ణ విను. హితమైనది., యదార్థమైనది. నీతి సారముగలది. దంపతులకు ప్రీతికారణమైనది చెప్తాను. (58) వేద పురాణముల నీతి యందు, కామశాస్త్రములందు సమ్మతమైనది, లౌకిక వ్యవహారములందు ప్రశంసించతగినది, మంచికీర్తినిచ్చేది (59) చెప్తాను. స్త్రీలకు తల్లి ఎట్లాగో బంధువులలో భాత అట్లా ప్రియమైనవాడు. ఆ పైన పుత్రుడు ప్రియమైనవాడు. పుత్రునికన్నను పతి ప్రియమైనవాడు.

మూ!! శతపుత్రాత్ప్రియః స్వామీ సాధ్వీనాం సాధుసంమతః

రసికానాం విదగ్దానాం నహి భర్తుః పరః ప్రియః

యది భర్తా విదగ్ధశ్చవిదగ్దానాం సుఖావహః

అన్యథా విషతుల్యశ్చ విషమశ్చేత్ ఖలః ఖలు

సంసారే చానృతే వత్స దంపత్యోః ప్రీతిరేవచ

పరస్పరం చ సమతా ప్రియసౌభాగ్యమీప్సితం

దంపత్యోః సమతా నాస్తి యత్రయత్రహి మందిరే

అలక్ష్యః తత్రత త్రైవ విఫలం జీవనం తయోః

సుస్వామినాం విభేదశ్చ పరం దుఃఖంచ యోషితాం

శోకసంతాపబీజంచ జీవితం మరణాధికం

స్వప్నే జాగారణేచాపి పతిః ప్రాణాశ్చయోషితః

పతిదేవ గురుః స్త్రీణాం ఇహ లోకే పరత్రచ

అస్మాత్త్వయిగతే నాథే మూర్ఛాం సంప్రాప రాధికా

పపాత సహసా భూమౌతృణాచ్ఛన్నచ భూతలే

మయా దత్తం ముఖే ఽస్యాశ్చ శీతలం జలముత్తమం

తదాశ్వాసో బభూవాస్యాశ్చేతనం బాల్యమేవచ

క్షణం వదితి హేనాథ కృష్ణేతి క్షణం సఖీ

క్షణంరోదితి సంతప్తా మూర్ఛాం ప్రాప్నోతి తత్క్షణం

రాధికాయాః శరీరంచ సంతప్తం విరహానలై :

దగ్ధ లోహయష్టిసమమస్పృశ్య మనలోపమం

స్వప్నేజాగరణే రాత్రి దివాసుచ గృహేవనే

జలే స్థలే చాంతరిక్షేఽభ్యుదయే చంద్రసూర్యయోః

నాస్తి భేదశ్చ రాధాయా మృతతుల్యా జడాకృతి :

శశ్వత్పశ్యతి స్థానస్థా సర్వం విష్ణుమయం జగత్

స్నిగ్ధ పంకే పంకజానాం సజలాని దలానిచ

నిపత్య తత్కృతే తల్పే సుష్వాప విరహాతురా

సేవితా సాప్రియాలీభిః సతతం శ్వేతచామరైః

చందనద్రవసంసిక్తా స్నిగ్ధ వస్త్రసమన్వితా

రాధాంగస్పర్శమాత్రేణ పంకః సంప్రాప శుష్కతాం

స్నిగ్ధాని పద్మపత్రాణి బభూవుర్భస్మసాత్ క్షణం

చందనం శుష్కతాం ప్రాప వర్ణశ్చంపక సన్నిభః

బభూవ కజ్జలాకారః కేశస్య వర్ణతో హరే

సిందూరబిందూరుచిరః శ్యామతాం ప్రాప తత్ క్షణం

వేషో విలాసో లీలాచ క్రీడా త్యక్తా బభూవ హ

రత్నమాలాతు తందృష్ట్వా గత్వా కృష్ణాంతికం తదా

ఉవాచ మధురం వాక్యం రాధాహితకరం పరం

రత్నమాలోవాచ :

హే కృష్ణ! కమలాకాంత! త్వద్వియోగేన మత్సఖీ !

ప్రాణాంస్త్యక్ష్యతి శీఘ్రం స యదినాయాస్యసి ధ్రువం

విచార్య మనసాకృష్ణ యత్తత్సముచితం కురు

నభవేత్కామినీ హత్యా యేన నీతివిశారద

అను నూరుగురు పుత్రులకన్న స్వామిప్రియమైనవాడు, సాధ్విమణులకు, ఇది సజ్జన సమ్మతమైనది. రసికులు, నేర్పరు రాండ్రకు భర్తకన్న పరమప్రియమైన వాడులేడు. (61) భర్తనేర్పరియైతే, విదగ్ధలకు (నేర్పరి) సుఖం కల్గిస్తాడు. లేనిచో విషతుల్యుడు. ఖలుడు, విసముడైతే (సమంకాకపోతే) విషతుల్యుడు (62) అసత్యమైన సంసారంలో దంపతుల పరస్పరప్రీతి, పరస్పరసమత, ప్రియమైనది సౌభాగ్యకరమైనది. ఈప్సితము, ఓవత్స! (63) దంపతుల మధ్య సమత్వంలేని ఇంట్లో అక్కడ అలక్ష్మి నివసిస్తుంది. అట్టి దంపతుల జీవనము విఫలము. (64) మంచిస్వామితో విభేదము స్త్రీలకు మిక్కిలి దుఃఖమిచ్చేది. శోకసంతాపములకు మూలము బ్రతుకు, మరణం కన్న మిన్న (65) కలలోగాని మెలకువలోగాని స్త్రీలకు భర్త ప్రాణములతో సమానము. ఈ లోకంలో పరంలోకంలోను స్త్రీలకు పతియే గురువు. (66) ఈమెనుండి నీవుకూడా దూరంకాగా ఓ నాథ! రాధిక మూర్చనందింది. గడ్డితో కప్పబడ్డ భూమి పై వెంటనే పడింది. త్వరగా భూమి పై పడింది. (67) నేను ఈమె ముఖం పై చల్లని మంచినీళ్ళను చల్లాను. అప్పుడు కొంచెం ఊరట కలిగింది ఈమెకు. చిన్నపిల్లలవంటి చైతన్యం (కొంచెం) కలిగింది. (68) ఒకసారి, ఓనాథ! అంటుంది. మరుక్షణం ఓ కృష్ణ అంటుంది. ఓ సఖీ అంటుంది. బాగా తపించిపోతూ కొద్ది సేపు ఏడుస్తుంది. మరుక్షణంలోనే మూర్చనందుతుంది. (69) రాధికశరీరము విరహాగ్నితో తపించిపోయింది. కాల్చిన ఇనుపచువ్వలా ఐంది. ముట్టరాకుండా, అగ్నిలా ఐంది. (70) కలలో, మెలకువలో, రాత్రింబగళ్ళు, ఇంట్లో, వనంలోను, నీటిలో, భూమి పైనా, ఆకాశంలో సూర్యచంద్రులవృద్ధిలో (71) రాధకు ఏమాత్రం భేదం లేదు. అన్ని వేళలా మృతతుల్యురాలు. జడాకృతిగా ఉంది. ఎప్పుడూ స్థానంలో ఉన్నట్లుగా, లోకమంతా విష్ణుమయమైనట్లుగా , ఎప్పుడూ చూస్తోంది. (72) నిగనిగలాడే (పచ్చి) బురదలో, తామరపూల యొక్క తడిగల దళాలు క్రిందపరచి, వాటితో చేసిన పడకయందు, విరహాతురమైన ఈమేను పడుకోబెట్టాము. (73) ఎప్పుడూ, తెల్లటి విసనకర్రలతో ఆమెను, ప్రియమైన చెలికత్తెలు సేవిస్తున్నారు. ఆమె వంటినిండా చందన ద్రవంపూశారు (తడిపారు). నిగనిగలాడే వస్త్రంకట్టారు. (74) ఈరాధ, శరీరస్పర్శమాత్రంతోనే బురదంతా ఎండిపోయింది. నిగనిగలాడే తామరదళాలు, క్షణంలో భస్మమైనాయి. (75) చందనం ఎండిపోయింది. చంపకం పువ్వులా దానిరంగు మారింది. వెంట్రుకల రంగులా, కాటుకలా నల్లగా ఐంది. ఓహరి! (76) అందమైన సిందూరబిందువు, ఆక్షణంలోనే నల్లబడింది. వేషము, విలాసము, లీల క్రీడ, అన్నిటిని విడిచి పెట్టింది. (77) రత్నమాల రాధనుచూచి, అప్పుడు కృష్ణుని దగ్గరకు వెళ్ళి, రాధకుమేలు చేసే ఉత్తమమైన మాటను మధురంగా ఇట్లా చెప్పింది. (78) రత్నమాల ఇట్లా అంది - ఓ కృష్ణ! కమలాకాంత! నీవియోగంతో మాచెలి ఉంది. నీవు తొందరగా రాకపోతే తప్పకుండా ప్రాణాలు వదులుతుంది. (79) ఓ కృష్ణ! మనస్సులో ఆలోచించి సముచితమైంది చేయి. ఓ నీతి విశారద! కామినిహత్య కాకుండాచూడు. (80)

మూII రత్నమాలావచః శ్రుత్వా ప్రహస్యోవాచమాధవః

హితం సత్యం నీతిసారం పరిణామసుఖావహం

భగవానువాచ :

ఈశో యద్యపిశక్తోఽహం ని షేధం ఖండితుం ప్రియే

తథాఽపినక్షమో రత్నేనియతేర్నకరోమ్యహం

బ్రహ్మాండేషుచ సర్వేషు మర్యాదా స్థాపితా మయా

తయా కర్మ ప్రకుర్వంతి మునయశ్చ సురానరాః

సుధామ శాపాద్విచ్ఛేదః శతవర్షమనీప్సితః

భవిష్యత్యేవ దంపత్యోః ఆవయోరేవ సుందరి

భేదో జాగరణేస్యాశ్చమ యాసహసుమధ్యమే

సంశ్లేష: సంతతం స్వప్నే మద్వరేణ భవిష్యతి

ఆధ్యాత్మికీ మయా దత్తా శోకచ్చేదో భవిష్యతి

రాధాం బోధయ భద్రం తే యాస్యామినంద మందిరం

 ఇత్యుక్త్వా జగతాం నాథో యయౌ నందాలయంప్రతి

రాధికాం బోధ యామాసుః ఆళాసంఘాశ్చ నారద

గత్వాగృహంచ పితరం ననామ మాతరం తథా

చకార మాతా క్రోడేచ నవనీతంచ నూతనం

మాతృదత్తంచ తాంబూలం చఖాద శీతలం జలం

ఉవాచ తత్ర జగతాం నాథోమాతృసమీపతః

సర్వైర్గోపసమూ హైశ్చ సేవితః శ్వేతచామరైః

మాల్యచందన తాంబూలం తేచ తస్మై దుదుర్ముదా

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే శ్రీకృష్ణగమనం నామ ఏకోన సప్తతితమోఽధ్యాయః

అను ! రత్నమాల మాటలు విని నవ్వి మాధవుడిట్లన్నాడు. హితమైనది, సత్యమైనది, నీతిసారము, పరిణామంలో సుఖమిచ్చేది ఆమాట (81) భగవంతుని వచనమిట్లా - నేను ఈశుణ్ణి నేను శక్తుణ్ణి, ఓ ప్రియే! ఈ నిషేధమును ఖండించగలను. ఐనా అసమర్ధుణ్ణి. ఓ రత్న! (రత్నమాల) నియయ (విధి) కారణంగా నేను చేయడం లేదు. (82) బ్రహ్మాండములన్నిటిలో ఒక మర్యాదను (నియమం) నేను స్థాపించాను. దాని ప్రకారమే మునులు, సురలు, నరులు కర్మ ఆచరిస్తున్నారు. (83) నూరు సంవత్సరాలు, కోరనటువంటిది ఈవిచ్ఛేదము, సుదాముని శాపంవల్ల కల్గింది. ఓ సుందరి!మా ఈ దంపతులకు విచ్ఛేదం కలిగి తీరుతుంది. (84) ఓ సుమధ్యమ! ఈమెకు నాతో విచ్ఛేదము, మెలకువలో కల్గుతుంది. నా వరం వల్ల కలలో ఎప్పుడు సంయోగం కల్గుతుంది. (85) నేనీమెకు ఆధ్యాత్మికత నిచ్చాను. ఈమెదుఃఖం తొలగిపోతుంది. రాధను మేల్కొలుపు. నీకు క్షేమం జరగని. నందుని ఇంటికి వెళ్తాను (86) అని పలికి జగన్నాథుడు నందుని ఇంటికి వెళ్ళాడు. ఓ నారద! చెలికత్తెలంతా రాధను మేల్కొలుపసాగారు. (87) ఇంటికివెళ్ళి తండ్రికి, తల్లికి నమస్కరించాడు. తల్లి ఒడిలో కూర్చో పెట్టుకొని నూతనమైన వెన్ననిచ్చింది. (88) తల్లి ఇచ్చిన తాంబూలాన్ని తిన్నాడు. చల్లని నీటిని త్రాగాడు. తల్లి దగ్గర జగన్నాథుడిట్లన్నాడు. (89) తెల్లని చామరములతో గోపాలగోపికలంతా సేవిస్తున్నారు, మాలలు, చందన తాంబూలములు వారు ఆనందంతో ఆతనికిస్తున్నారు. (90) అనిబ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు శ్రీకృష్ణగమన మనునది అరువది తొమ్మిదవ అధ్యాయము.