శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు వలికెను :
మోహినీ స్తవనేనైవ కామస్తుష్టో బభూవ హ।
చకార శరసంధానమంతరిక్షే స్థితః స్వయం॥
మంత్ర వూతం మహాస్త్రం చ చిక్షేప ఏతరం ముదా ।
బభూవ చంచలో బ్రహ్మా కామాస్తేణ చ కాముకః ॥
క్షణం నిరీక్షణం చక్రే మోహిన్యా స్యే పునః పునః ।
జ్ఞానం ప్రాప్య తధా ధాతా విరరామ హరిం స్మరన్॥
బుబుధే మనసా సర్వం చరితం మన్మధస్య చ।
శశావ తం నుతమపి విధాతా క్రోధ విహ్వలః ॥
మోహినీ యొక్క స్తోత్రముతో మన్మథుడు సంతసించి స్వయముగా ఆకాశమందు నిలిచి బోణము నెక్కు పెట్టెను. మంత్ర పూతమైన ఆ మహాస్త్రమును సంతోషముతో తండ్రి (బ్రహ్మ) పైకి విసిరెను. ఆ కామాస్త్రముతో బ్రహ్మ మనస్సు చలించి కాముకుడయ్యెను. మోహినీ ముఖములోనికి ఒక క్షణకాలము మాటి మాటికి చూచుచు వ్యామోహము పొందెను. అప్పుడా వీధాత జ్ఞానము పొంది శ్రీహరిని స్మరించుచు మోహినిని చూచుట చాలించెను. తన మనస్సుతో మన్మధునీ చరిత్రనంతను తెలిసికొనెను. బ్రహ్మ క్రోధముతో విహ్వలుడై (తన నిగ్రహము తప్పి) కుమారుడైనను వానిని (మన్మధుని శపించెను.
హే కామ యావనోన్మత్త మూడైశ్వర్యేణ గర్విత।
భవితా దర్ప భంగస్తే గురోర్మే హేలనాదితి ॥
హతోద్యమో జగామాశు మన్మధో మధునా సహ ।
బ్రహ్మణః శాపభీతశ్చ శుష్క కంఠోష్ఠ తాలుకః ॥
ఓ కాముడా! యావనము వలన పిచ్చి ఏర్పడిన వాడా! మూడుడా! ఐశ్వర్యము చేత గర్వించినవాడా! తండ్రినైన నన్ను హేళన చేయుట వలన (తిరస్కారముతో అవమానించుట వలన) నీ దర్చము {గర్వము) మున్ముందు భంగము కాగలదు అనెను. మన్మధుడది విని తన ప్రయత్నము వ్యర్థమై వేగముగా వసంతునితో గూడి పారిపోయెను. బ్రహ్మశాపమునకు భయపడి కంఠము పెదవులు దవడలు ఎండిపోయిన మన్మథుడు పారిపోయెను.
ఇత్యువాచ జగద్ధాతా మోహినీం మదనాతురాం ।
చతుర్వక్త్రం చ పశ్యంతీం సస్మితం వక్రచక్షుషా ॥
ఆ జగత్కర్త తన విషయములో మదన బాధ గలదై చిరునవ్వుతో వంకర చూపుతో తనను చూచుచున్న మోహినీతో ఇట్లు పలికెను.
బ్రహ్మోవాచ - బ్రహ్మ వలికెను :
మాతర్మోహిని గచ్ఛ త్వం నిష్ఫలం కర్మ చాత్ర తే ।
జ్ఞాత స్తవాభిప్రాయశ్చ నాహం యోగ్యోఽస్య కర్మణః ॥
వేదే జుగుప్సితం కర్మ తదేవ కర్తుమక్షమ: ।
వేదకర్తా న్వయమహం వ్యవస్థా కారకో భవే ॥
ఆకీర్తిం వేదవక్తుశ్చ వింద్యం చ కమతః వరం ।
ఉపస్థితా చ యా యోషిదత్యాజ్యా రాగిణామపి ॥
శ్రుతౌ శ్రుతమతి త్యాజ్యా నర్వదైవ తపస్వినాం ।
అహో నర్వై: పరిత్యాజ్యా పుంశ్చలీ చ విశేషతః॥
ధనాయుః ప్రాణ యశసాం నాశినీ దుఃఖదాయినీ ।
స్వకార్య తత్పరా శశ్వత్పర కార్య వినాశినీ ॥
నిష్టురా నవఘాతిభ్యః సర్వావద్ఛీజ రూపిణీ ।
విద్యుద్దీప్తిర్జలే రేఖా లోభాన్నైత్రీ యథా భవేత్ ॥
వర ద్రోహాద్యధా సంపత్కులటా ప్రేమ తత్సమం ।
సర్వేభ్యో హింస్ర జంతుభ్యో వివద్బీజా సదైవ హీ ॥
ఓ తల్లీ! మోహినీ! నీవు వెళ్లిపొమ్ము, ఇక్కడ నావద్ద) నీ కర్మలన్నియు నిష్ఫలమగును (వ్యర్థము). నీ అభిప్రాయము తెలిసికొంటిని. ఆ పనికి నేను యోగ్యుడను కాను. నీవు కోరిన పని వేదమందు ఛీ కొట్టబడినది. ఆ నింద్యకర్మను చేయుటకు నేనసమర్థుడను. ఈ ప్రపంచములో ఒక కట్టుబాటు ఏర్చరచు వేదకర్తనైన నేను స్వయముగా ఎట్రీ కర్మ చేయుదును? వేద పఠనము చేయు నాకు ఇంతకంటే నింద్యము అపకీర్తి కల్గించునది ఏది? చేరవచ్చిన కాముకురాలైన స్త్రీ కాముకులకు విడువగూడనిది అని వేదమందు వినవచ్చినను.
తపస్విజనుల కెల్లవేళల ఆమె త్యాజ్యురాలే అగును. విశేషించి జారిణియైన స్త్రీ అందరికి పరిత్యజింపదగినదే. తన కోరిక తీర్చుకొనుట యందు మాత్రమే ఆసక్తురాలగు జారిణి పరుల యొక్క ధనమును ఆయుష్యమును కీర్తిని ఇతర సత్కార్యములను నశింపజేసి మాటి మాటికీ దుఃఖము నిచ్చును. సర్వాపదలకు బీజరూపిణి ఐన జారిణి క్రొత్తగా హత్యలకు పూనుకొన్న వారికంటే క్రూరురాలు. మెరుపులోని ప్రకాశము నీటియందు గీసిన రేఖ (గీత) లోభి స్నేహము పరద్రోహము వలన లభించు సంపద ఎట్టీవో కులటా ప్రేమ కూడ అటువంటిదే (చంచలము) అట్టి స్త్రీ అన్ని క్రూరజంతువుల కన్న ఆపదలకు మూలమైనది.
యో విశ్వ సేత్తాం సమ్మూడో విపత్తస్య పదే పదే।
త్వం చ రూపవతీ ధన్యా వంచితా కాముకైస్సదా॥
యూనాం సంపత్స్వరూపా చ విషతుల్యా తపస్వినాం ।
త్వం మే వాస్పరసాం శ్రేష్టా నర్వదా స్థిర యావనా॥
తవైవ కర్మ యోగ్యం చ యూనం పశ్య చ సుందరి।
త్వం విదగ్ధా చ యోషిత్సు విదగ్ధాన్వేషణం కురు ॥
విదగ్ధాయా విదగ్ధేన నంగమో గుణహాన్ భవేత్ ।
జరాఽతురోఽహం వృద్ధశ్చ తపస్వీ వైష్ణవో ద్విజః ॥
అన్వతంత్రః వరాధీన: కా రతిః పుంశ్చలీషు మే ।
అయే వత్సే గచ్ఛ శీఘ్రం విహాయ పితరం చ మాం ॥
నామ్నాఽహం చ జగత్పష్టా తస్మాత్తవ పితా సదా ।
మన్మధం చంద్రమిత్రం చ జయంతం నలకూబరం ॥
స్వర్వైద్యౌ చంద్రతనయం దితిపుత్రాంశ్చ సుందరాన్ ।
కామశాస్త్రేషు నిపుణాన్ రతికర్మ విశారదాన్॥
యా మాం యాసి హి తాన్న్స్యక్యా సా విదగ్ధ చ కాముకీ ।
అట్టి కుంటనెవడు మిక్కిలి మూఢుడై విశ్వసించునో వానికడుగడుగున ఆపదయే. సరే నీవేమో మంచీ రూపము గల ధన్యురాలవు. కాముకుల చేత వంచింపబడితివి. నీవు యువకులకు భోగలక్ష్మీ స్వరూపురాలవు. తపస్విజనులకు విషము వంటిదానవు. అప్సరసలలో శ్రేష్ఠురాలవు. ఎల్లప్పుడు స్థిరముగా నుండు యౌవనము గలదానవు. ఓ సుందరీ! నీవు కోరెడి కర్మకు యోగ్యుడైన పడుచువానిని చూచుకొనుము. స్త్రీలలో నీవు మంచి నైపుణ్యము గలదానవు, నీకు తగిన విదగ్గుని (కామ విద్యా నిపుణునిని వెదకుము, నేనేమో ముసలితనముతో పీడింపబడువాడను. వృద్ధుడను. తపస్విని, విష్ణుభక్తీ గల బ్రాహ్మణుడను. నేను స్వతంత్రుడను గాను. పరాధీనుడను (విష్ణువుకు అధీనమైన ప్రవర్తన గలవాడను. ఇట్టి నాకు జారిణుల యందు ఆసక్తి యెక్కడ? ఓ బిడ్డా! తండ్రినైన నన్ను వదిలి శీఘ్రముగా పొమ్ము, పేరును బట్టి (వ్యవహారమును బట్టి కూడ) నేను జగత్పష్టను. అందువలన ఎల్లప్పుడు నీకు తండ్రిని. కాముకురాలవు కామవిద్యలో నిపుణురాలవు ఐన నీవు చంద్రుని మిత్రుడైన మన్మథునిని జయంతునిని నలకూబరుని దేవవైద్యులైన అశ్వినీ దేవతలను చంద్రపుత్రుడైన బుధుని సుందరులైన దితి పుత్రులను కామశాస్త్ర నిపుణులు రతికర్మలో ఆరితేరినవారు ఎందరో ఉండగా వారందరిని వదిలి పెట్టి నన్ను పొంద వచ్చితివీ!
సదా సంభోగవిషయే శ్రియం ప్రార్థయతే పుమాన్॥
స్త్రీచేత్ప్రయాతి పురుషం విపరీతం విడంబనం ।
సర్వేషాం చైవ రత్నానాం స్త్రీరత్నం దుర్లభం వరం ॥
స్వయం ప్రార్దయతే స్వామీ న తు స్వామినమేవ చ ।
యోషీజ్ఞాతివ దీక్ తాశ్చ స్వయం యాః సముపస్థితాః ॥
భవేద్దూరం స్వల్పమూల్యం రత్నం స్వయముపస్థితం ।
నిత్యం పుమాన్ శ్రియం యాతి స్త్రీ వా యాతీ చ న ప్రియం ॥
లోకాచారేపు వేదేషు న స్త్రీ యాశీ పరప్రియం ।
స్వవస్తు భుంక్తే యః కాలే శాక్రోక్త విధి పూర్వకం॥
స పూజ్యో న భవేత్పూజ్యో యద్రతిః పరవస్తువు।
ఎల్లప్పుడు సంభోగ విషయములో పురుషుడు స్త్రీని ప్రార్థించును. ఒకవేళ స్త్రీయే పురుషుని వద్దకు కోరిపోయిన యెడల అది విపరీతము మరియు మోసపుచ్చుట యగును. అన్నీ రత్నములలో దుర్లభమును శ్రేష్ఠమునై నది స్త్రీరత్నము. భర్తయును తన భార్యను ప్రార్థించును కానీ భార్య భర్తను ఆ విషయమున ప్రార్థించదు. స్త్రీ జాతి యందే స్వయముగా పురుషుని గోరి చేరవచ్చిన స్త్రీలు తిరస్కార యోగ్యలు. స్వయముగా చేరవచ్చిన రత్నము గూడ స్వల్పమైన వెలగలదియే దూరముగా విడిచి పెట్టబడును. కాబట్టి సదా పురుషుడు స్త్రీని చేరబోవునే తప్ప స్త్రీ తన ప్రియుని జేరబోదు. ఇక లోకాచారమందు వేదముందు గానీ పరుని ప్రియునిగా భావించి స్త్రీ చేరబోదు. ఏ వ్యక్తియైనను తన వస్తువును శాస్త్రమున చెప్పబడిన మర్యాద పూర్వకముగా యోగ్యకాలమందు అనుభవించునో వాడు పూజ్యుడు. పరుల వస్తువుల యందేవనీకాసక్తి ఉండునో వాడు పూజ్యుడు కాడు.
కః కన్య శత్రురబలే నిశామయ జగత్రయే ॥
స్వేంద్రియాః శత్రవః సర్వే శత్రుతా యన్నిమిత్తతః ।
వేదోక్తాచరణీ సర్వం మిత్రం చ జగతాం జగత్ ॥
కృతే వద విరుద్ధే చ మిత్రం శత్రుర్ఛవేద్ధ్రువం ।
వేదోక్తం కృతవంతం చ హరిస్తుష్టో దివానీశం ॥
హరౌ తుష్టే జగత్తుష్టం తస్మిన్ రుష్ట భవేద్రివుః।
ఓ అబలా! వినుము. ఈ ముల్లోకములలో ఎవనికెవడు శత్రువు ఇంద్రియముల కారణముననే శత్రుత్వ మేర్పడును. కనుక తన ఇంద్రియములన్నియు తనకు శత్రువులు. వేదమున చెప్పబడినట్లాచరించుట వలన సర్వజగత్తు (జగత్తులోని జీవులు) మిత్రమగును. వేదమునకు విరుద్ధముగా చేయబడినప్పుడు మిత్రుడే శత్రువగుట నిశ్చయము. వేదోక్తముగా (వేదమున చెప్పబడినటు) కర్మలోనర్చిన వానిని గూర్చి శ్రీహరి ప్రసన్నుడుగా నుండును. శ్రీహరి సంతుష్టుడైనప్పుడు జగమంతయు సంతుష్టి చెందును. అతడు కోపించినచో జగమంతయు శత్రువగును.
కుత్రాస్తి కులటా జాతిః సాధ్వీ జాతిశ్చ కుత్ర వా ॥
స్వకీయాచరణాత్సర్వం భవే భవతి కర్మణః ।
స్త్రీ జాతి: ప్రకృతేరంశో నారాయణ వినిర్మితా ॥
దుశ్శీలా వుంశ్చలీ నింద్యా నుశీలా చ పతివ్రతా ।
పతివ్రతాస్తు త్రివిధా: పుంశలీషు చ యోషితః ॥
తాసామేవం విధా నాస్తి స్వయం యాతి పరబ్రీయం ।
స్త్రీజాతీనాం చ మధ్యే చ కాఽస్యేవం కులకజ్జలా ॥
భవే రత్యై న్వయందృష్ట్వా వేషం కృత్వా ప్రయాతి తం ।
క్షోభితా యది పశ్యంతీ భక్ష్య ద్రవ్యమసాధ్యకం ॥
వైకల్యాన్న హి తత్సాధ్యం సామాన్యమేవ కేవలం ।
ఇత్యేవముక్త్వా జగతాం విధాతా వీరరామ చ ॥
వక్తుం సముద్యతా షా చ కోపప్రస్ఫురితాధరా ॥
ఈ సృష్టిలో కులలో జాతీయనీ సాధ్వి జాతీయనీ ఎక్కడున్నది? అంతయు తన కర్మాచరణను బట్టియే కులట - సాధ్వి అగుచున్నది. స్త్రీజాతియన్నది నారాయణుని చేత నిర్మించబడిన ప్రకృతి యొక్క అంశయే. దుష్టశీలము గల జారిణి నింద్య అగును. మంచి శీలము గల స్త్రీ పతివ్రతగా ప్రశంసించబడును. పతివ్రతలు జారిణులు సామాన్యులు అని స్త్రీలు మూడు విధములు. అట్టి స్త్రీ జాతులలో స్వయముగా పర పురుషుని ప్రియునిగా భావించి (పరస్త్రీకి ప్రియుడైన వానిని} చేరబోవునట్టిది లేదు. ఈ ప్రపంచములో పరుని చూచి స్వయముగా తానలంకరించుకొని రతి కొరకు వానిని చేరబోవుచు, కులమునకు కల్మషము తెచ్చునట్టి స్త్రీ ఉండదు. తాను సాధింపలేని భక్ష్య ద్రవ్యమును (అనుభవింపదగిన వస్తువును) చూచినదై క్షోభ చెందిన స్త్రీకి కేవలము తన వైకల్యము వలన అది సాధింపబడదు. కేవలము సాధారణ వస్తువు లభించవచ్చును” అని ఇట్లు పలికి ఆ జగత్కర్త (సృష్టికర్త బ్రహ్మ} మాటలు విరమించెను. అప్పుడు ఆ మోహినీ కోపముతో పెదవులు వణకుచుండగా మాట్లాడుటకు పూనుకొనెను.
మోహిన్యువాచ - మోహిని పలికెను :
జ్ఞాతం సర్వం జగద్ధాతశ్చరితం తవ సాంప్రతం॥
త్వయా నీబోధితా నీతిర్మనో మే న స్థిరం భవేత్ ।
భూతం త్వయా విశిష్టం చ యావద్దృష్టః క్షణే భవాన్॥
త్వద్వక్త్ర దృష్టి మాత్రేణ నర్వే జారాశ్చ విస్మృతాః ।
దేహం కామాగ్నినా దగ్ధం యదా త్యక్తుం సముద్యతా ॥
నీషిషేధ చ మాం రంభా ప్రదదౌ మంత్రమీదృశం ।
తదా కామ సహాయేన త్వత్పమీపమీహాఽగతా ॥
స మధుస్తవ శాపేన స జమ హతోద్యమః ।
అహా గంతుమశక్తాఽహం త్వయా యద్యపీ భర్త్సితా ॥
సర్వాంగే ష్వేవ మే జాడ్యం బభూవ సాంప్రతం విభో ।
కృపాం కురు కృపాసింధో న మం హంతుం త్వమర్హసి ॥
ఓ జగత్కర్తా! ఇప్పుడు నీ చరిత్ర అంతయు తెలిసికొంటిని. నీవు నాకు నీతిని బోధించితివీ కానీ నా మనస్సు కుదుట బడుట లేదు. ఏ క్షణమున నీవు నాకంట బడితివో అప్పుడే నీయందు నాకు విశేష లక్షణము కన్పించినది. నీ ముఖమును చూడగనే నాకు ముందు పరిచయ మున్న జారులందరినీ మరచిపోతిని. నా దేహము కామాగ్నితో దగ్ధమైనది. నిన్ను వదిలి పోవుటకు (కోరిక తీరక) పూనుకొనగా నన్ను రంభ నిషేధించి ఇటువంటి సలహా ఇచ్చెను. అప్పుడు మన్మథుని సహాయముతో నీ వద్దకు వచ్చితిని, అతడు నీ శాపముతో తన ప్రయత్నము వ్యర్థము కాగా వసంతునితో బాటు వెళ్లిపోయెను. నీచేత ఎంతగా బెదరింపబడినను నేనిక్కడి నుండి పోవుటకశక్తురాలనైతిని. ఓ విభూ! ఇప్పుడు నా సర్వాంగములందు కదలలేని స్థితి ఏర్పడినది. ఓ కృపాసాగరా! నన్ను దయజూడుము. సన్ను చంపదగదు.
తవాశ్లేషణ మాత్రేణ విజ్వరాఽహం సునిశ్చితం ।
త్వమేవ జగతాం ధాతా కులటాఽహం చ కర్మణా ॥
నంతో గర్వం న కుర్వంతి కర్మ సాధ్యాశ్చ జీవినః ।
కశ్చిత్ ప్రయాతి యానేన వహంతీ తం చ కేచన॥
కరం గృహ్ణాతి నృపతిః కర్మణా దదతి ప్రజాః ।
కశ్చిత్ సింహాసనస్థశ్చ నృపమాత్రశ్చ కశ్చన ॥
కర్మణా వాహకా: కేచిత్ కేచిద్వాహన పాలకాః ।
సూకరీ జఠరం కశ్చిత్సంప్రయాతి స్వకర్మణా ॥
కశ్చిచ్చయ్యాశ్చ జఠరం తవ పుత్రాశ్చ కేచన ।
కేచీత్కృత్వా హరేర్భక్తిం కర్మణే తస్య పార్షదాః ॥
కేచిద్భవంతి కృమయో విష్ఠాయాం దైవదోషతః ।
స్వర్గం ప్రయాంతి రాజేంద్రా: కేచిచ్చ స్వస్వకర్మణా ॥
కేచిత్ప్రయాంతి నరకం విణ్మూత్రే తత్ర పచ్యతే ।
కర్మణా కశ్చిదీంద్రేద్రః సురాణాం ప్రవరః స్వయం ॥
నీ ఆలింగన మాత్రము చేతనే నా మదన జ్వరము తొలగిపోవుననుట నిశ్చయము. నీ కర్మను బట్టి నీవు జగత్కర్తవు. నేను నా కర్మను బట్టి కులటను. జీవులు కర్మచేత సాధింపబడువారు కనుక సత్చురుపులు గర్వించరు. ఒకడు వాహనమెక్కిపోవును. కొందరు (జీవులు} వానిని మోయుదురు. పాలన కర్మ ద్వారా రాజు పన్నులు స్వీకరించును. పాలితులైన ప్రజలు పన్నులు చెల్లింతురు. ఒకడు సింహాసనాధిపతియగును. కొందరు సాధారణ రోజులుగా నుందురు. కర్మను బట్టి కొందరు వాహకులు (మోయువారు) మరికొందరు వాహనములను పోషించువారగుదురు. (అశ్వములు మొదలగు వానిని) ఒకడు తన కర్మఫలమును బట్టి ఆడపంది కడుపునబడును. ఒకడు మెత్తని శయ్యలను ఉత్తమ జీవి గర్భమును పొందును. కొందరు నీ పుత్రులగుదురు. కొందరు హరి భక్తి నాచరించి ఆ కర్మవలన విష్ణువు యొక్క పార్షదులు (వైకుంఠములోని పరివారము అగుదురు. కర్మ దోషము వలన కొందరు మలములో పురుగులగుదురు. తమ తమ ధర్మకార్యముల వలన కొందరు రాజులు స్వర్గమునకేగుదురు. మరికొందరు నరకమునకు పోయి అక్కడ మలమూత్రములందు బడి కర్మఫలము తీర్చుకుందురు. కర్మను బట్టీయే ఒకడు స్వయముగా దేవతలలో శ్రేష్టుడై ఇంద్రులకింద్రుడగును.
కేచిత్సురా నరా: కేచితేచిచ్చ క్షుద్ర జంతవః ।
కేచిచ్చ కర్మణా వీప్రా వర్ణశ్రేష్టా మహీతలే ॥
కేచిద్భూషా వైశ్య శూద్రాః కేచిచ్చ మ్లేచ్ఛ జాతయః।
కేచిత్స్వకర్మణా ప్రాజ్ఞా జ్ఞానేన సర్వదర్శినః ॥
కేచిన్మూర్ఖాః కేచిదంధాః స్వాంగ హీనాశ్చ కేచన ।
కేచిచ్ఛాస్త్రం బోధయంతి శిష్యవర్గాన్ స్వకర్మణా ॥
కేచిత్పఠంతి సర్వార్థం జానంతి గురువక్త్రతః ।
భవంతి కర్మణా కేచిద్దే హే స్థావర జంగమే ॥
కర్మ మూలముననే కొందరు సురలు కొందరు నరులు కొందరు క్షుద్ర జంతువులు కొందరు వర్ణము చేత శ్రేష్ఠులైన బ్రాహ్మణులు కొందరు భూమిపతులు వైశ్యులు శూద్రులు కొందరు ప్లేచ్ఛ జాతులుగా జన్మింతురు. కొందరు తమ సత్కర్మ చేత విద్వాంసులు జ్ఞానము వలన సర్వము చూడగలవారునగుదురు. మరికొందరు మూర్ఖులు గ్రుడ్డివారు అంగ విహీనులు అగుదురు. కొందరు కర్మఫలము వలన శిష్యులకు శాస్త్రము బోధించు వారగుదురు. కొందరు గురుముఖమున (గురువ చెప్పుట వలన) పఠించి సర్వ విషయములను తెలిసికొందురు. కర్మ వలననే కొందరు స్థావర (చెట్లు తీగలు పర్వతములు} జంగమ (తిరుగునట్టి జీవులు) దేహములను ధరింతురు.
తపస్వీ నవఘాతీచ త్వం చ బ్రహ్మా చ కర్మణా ।
కాచిత్స్వకర్మణా సాధ్వీ పూజ్యేహ చ పరత్ర చ ॥
కాచిద్వేశ్యా తదాహారం భుంక్తే కృత్వాంగ విక్రయం ।
ఒకతపస్వీ గాని హంతకుడు గాని బ్రహ్మవగు నీవు గాని తన కర్మ వలననే అట్టి వారగుదురు. ఒక స్త్రీ సాధ్వియై ఇహ పరలోకములలో పూజ్యురాలు అగుట గూడ తన కర్మవలననే సుమా. మరియొక స్త్రీ వేశ్యయై తన శరీరమమ్ముకొని ఆహారము భుజించుటయు ఆ కర్మవలననే జరుగుచున్నది.
స్వర్వేశ్యాఽహం నురపురే సురభోగ్యా సుపూజితా ॥
యేషామాలింగనేనైవ కర్మణాం ఖండనం భవేత్।
మనస్స్వభావ బీజం చ స్వభావః కర్మబీజకః॥
తత్కర్మఫల బీజం చ సర్వేషాం జనకో హరి: ।
ఫలం దదాతి నియతం కర్మద్వారా విభుః స్వయం ॥
సర్వేభ్యో బలవాన్నిత్యం కర్మరూపీ జనార్దనః ।
కుతో హేతోర్నిందితాఽహం త్వయైప బర్స్తితా కథం ॥
జగత్ర్సష్టురీశ్వరస్య పాదాబ్జం ద్రష్టుమగతా ।
స్వప్నే యస్య పదద్వంద్వం న హి పశ్యంతి యోగిసః॥
తమీశ్వరం పతింకర్తుమిచ్చయా న్వయమాగతా ।
గత్వా హి కస్యచిత్ స్థానమస్పృశ్యేహ పరత్ర చ ॥
కన్యచిత్పాదరజసా యశసా భారతి యోషితః ।
ఇత్యుక్త్వా మోహినీ శీఘ్రం గత్వోవాస హరేః పురః ॥
నేను దేవతల నగరములో మిక్కిలి ఆదరింపబడి సురలకు అనుభవ యోగ్యమైన స్వర్గవేశ్యను. అట్టి వారి ఆలింగనము వలన కర్మల యొక్క ఖండనము (కర్మనాశము) జరుగును. మనస్సు జన్మపరంపరల స్వభావమే కారణముగా గలది. ఆ స్వభావము బహుజన్మల కర్మలే బీజముగా గలది. ఆ కర్మలన్నియు తరువాతి అనుభవములకు బీజము. ఈ అన్నింటికి కర్త శ్రీహరి. ఆ ప్రభువు స్వయముగా కర్మమూలముగా నియతమైన శాస్త్రము ద్వారా నియమించబడిన) ఫలమిచ్చుచున్నాడు. అన్నిటికంటే కర్మరూపియైన జనార్ధనుడు బలవంతుడన్నది శాశ్వత సత్యము. అయ్యా! ఏకారణముగా నేను నీ చేత నిందించబడితిని? ఎందుకు బెదరింపబడితిని? జగత్కర్తవు ఈశ్వరుడవైన నీ పాద పద్మములు దర్శింప వచ్చితిని. యోగులు స్వప్నమున గూడ ఎవని పాద ద్వంద్వమును చూడగలుగుచు లేరో ఆ ఈశ్వరుని పతిని జేసుకొను కోరికతో స్వయముగా వచ్చితిని. ఏ స్థానము ఇహపరములందును పొందరానిదో - ఎవని పాదధూళి చేత స్త్రీలు కీర్తితో ప్రకాశింతురో అట్టి స్థానమునకు వచ్చితిని అని పలికి మోహిని శీఘ్రముగా పోయి మనోహరుని ముందు నిలిచెను.
న్వయం విధాతా జగతాం చకం పే కులటా భయాత్ ।
సస్మితా వక్రనయనా కామభావం చకార హ ॥
స్వాంగం చ దర్శయామాన కామబాణ ప్రపీడితా ।
ఏతస్మిన్నంతరే కామః సర్వజ్ఞః సర్వయోగవిత్॥
ఆవిర్భూయ పంచబాణాన్నిచిక్షేప చ బ్రహ్మణి ।
నమ్మోహనం సముద్వేగం బీజ స్తంభితకారణం ॥
ఉన్మత్త బీజం జ్వలదం శశ్వచ్చేతస హారకం ।
ఏతాస్సక్షివ్య మదనోఽప్యంతరిక్ష స్థిత: స్వయం॥
కింకరాన్ ప్రెషయామాస నమ్మోహాయ పితుర్ముదా ।
వసంతం కోకిలాలీశ్చ గంధవాతం మనోహరం ॥
నియుజ్యాభ్యంతరం గత్వా తద్వికారం చకార హ।
పుంస్కోకిలః కలం రావమువాచ తత్సమీపతః ॥
షట్పదః సుందరం సూక్ష్మం గుగుంజే పురతః స్థితః।
శశ్వద్వనౌ గంధవహో మందోఽతీశీతల: ప్రియే ॥
సతతం ముదితస్తత్ర బభ్రామ చ మధు: స్వయం ।
పులకాంచిత సర్వాంగో బభూవ జగతాం విధిః ॥
అప్పుడు ఆ కులటా భయము వలన జగత్కర్తయగు బ్రహ్మ వణికి పోయెను. మోహినీ చిరునవ్వు, వంకరచూపులతో కామభావము ప్రకటించుచు మన్మధ బాణ పీడితురాలైతన అంగములను ప్రదర్శించెను. ఇంతలో సర్వయోగము లెరిగిన - సర్వజ్ఞుడైన మన్మధుడావిర్భవించి బ్రహ్మమీద సమ్మోహనము (మిక్కిలి మోహము కల్గించునది) సముద్వేగము (మిక్కిలి ఉద్వేగము కల్గించునది) సృష్టిబీజమును, మనస్సు స్తంభింపజేయునది, ఉన్మత్త బీజము (పిచ్చికి మూలము) శరీరము మండించు జ్వలదము మాటి మాటికీ చైతన్యము హరింపజేయునది అగు పంచబాణములను ప్రయోగించెను. మదనుడిట్లు పంచబాణములను విసరి అంతరిక్షమున నిలిచి తన తండ్రియైన బ్రహ్మను ఇంకను సమ్మోహ పరచుటకు తన కింకరులను పంపెను. వసంతుని కోకిలలను తుమ్మెదలను మనస్సును హరించు సుగంధ వాయువును నియోగించి తాను లోన ప్రవేశించి బ్రహ్మలో మార్పు కళించెను. గండుకోయిల బ్రహ్మముందు ఇట్లని చెప్పరాని మధుర ధ్వనీతో కూసెను.
తుమ్మెద అతని ముందు నిలిచి సుందరముగా సూక్ష్మముగా ధ్వని చేసెను. ఓ ప్రియురాలా! రాధా! (కథ చెప్పెడి శ్రీకృష్ణుని పిలుపు మిక్కిలి చల్లగా నున్న సుగంధవాయువు మెల్లమెల్లగా మాటి మాటికి వీచెను. వసంతుడాప్రాంతమున సంతోషముతో విహరించెను. బ్రహ్మ నిలువెల్ల పులకించెను.
దదర్శ మోహినీ భావం ప్రహస్య చ పునః పునః ।
అతీవ వక్రనయనా కామాస్త్ర హతచేతనా॥
విధాతా బబుధే సర్వం సర్వబంధ నిబంధనం ।
నియంతుం న మనః శక్త: సస్మార శ్రీ హరీం భియా ॥
తుష్టావ మనసా కృష్ణం శాంతం దృక్పంకజ స్థితం ।
ద్విభుజం మురలీ హస్తం హరిం పీతాంబరం పరం ॥
అతివ కమనీయం చ కిశోరం స్థిరయావనం ।
రత్నాలంకార భూషాఢ్యం సస్మితం శ్యామసుందరం॥
మన్మధ బాణముల చేత చైతన్యము నశించి మిక్కిలి వంకర చూపులతో మోహిని బ్రహ్మను చూచి అతని భావము గుర్తించి మరల మరల నవ్వెను. సృష్టికర్త అన్ని బంధములకు మూలమైన ఆ సర్వమును తెలిసికొని తన మనస్సును అదుపులో పెట్టుకొన జాలక భయపడి శ్రీహరిని స్మరించెను. రెండు హస్తములతో తన కన్నుల ముందు శాంత రూపముతో మురళీధారియై పీతాంబరమును గట్టుకొన్న శ్రీకృష్ణుని మనస్సుతో స్తుతించెను. ఆ స్వామి కిశోర (బాల) రూపము నుండియు స్థిర యౌవనము గలిగి రత్నాలంకార భూషణములతో అతిశయించి మిక్కిలి సుందరముగా నుండి చిరునవ్వు చిందించుచు శ్యామ సుందరుడుగా నుండెను.
బ్రహ్మోవాచ - బ్రహ్మ పలికెను :
రక్ష రక్ష హరే మాం చ నిమగ్నం కామసాగరే।
దుష్కీర్తి జలపూర్ణే చ దుష్పారే బహుసంకటే ॥
భక్తి విస్మృతి బీజే చ వివత్సోపాన దుస్తరే ।
అతీవ నిర్మల జ్ఞాన చక్షుః ప్రచ్ఛన్న కారణే ॥
జన్మోర్మి సంఘ సహితే యోషిన్నక్రౌఘ సంకులే ।
రతిస్రోత స్సమాయుక్తే గంభీరే ఘోర ఏవ చ ॥
ప్రధమామృత రూపే చ పరిణామ విషాలయే ।
యమాలయ ప్రవేశాయ ముక్తి ద్వారవితిస్కృతే ॥
బుధ్యా తరణ్యా విజ్ఞానైరుద్ధరాస్మానత: స్వయం ।
స్వయం చ త్వం కర్ణధారః ప్రసీద మధుసూదన ॥
మద్విధాః కతిచిన్నాథ నియోజ్యా భవకర్మణి ।
నంతి విశ్వేశ విధయో హే విశ్వేశ్వర మాధవ ॥
న కర్మ క్షేత్రమేవేదం బ్రహ్మలోకోఽయ మీప్సితం।
తథాఽపి న స్పృహా కామే త్వద్భక్తి వ్యవధాయకే ॥
ఓ శ్రీహరీ! కామ సాగరమున మునిగిన నన్ను రక్షింపుము రక్షింపుము. ఈ సాగరము అపకీర్తయన్న జలముతో నిండి అనేక సంకటములు కల్గించుచు ఒడ్డుకు చేర శక్యము గానీ.. నీ పాద భక్తిని మరిపించుటకు కారణమైనది. ఆపదలనెడి మెట్లు కలదై దాటుటకశక్యమైనది. నిర్మల జ్ఞానమనెడి నేత్రమును మిక్కిలి మూసివేయునది. బహాజన్మలనెడి అలలతోను స్త్రీలనెడి దట్టమైన మొసళ్లతోను విషయాసక్తి అనెడీ లోతైన ప్రవాహముతోను ఘోరమైనది. ఆరంభమున అమృతము వలె నుండి అంత్యములో విష నీలయమైనది. యమాలయ ప్రవేశమునకు, ముక్తి ద్వారమును విస్మరణకు కారణమైనది. ప్రభూ! ఇట్టి మౌరసముద్రము నుండీ జ్ఞాన విజ్ఞాన సహితమైన బుద్ధియనెడి ఓడ ద్వారా నీవే నన్నుద్ధరింపుము. నీవే కర్ణధారుడవు (ఓడను నడుపు సాధనము ధరించినవాడు} ఓ మధుసూదనా! అనుగ్రహింపుము. ఓ మాధవా! ఈ సృష్టికర్మలో సావంటి వారెందరో నీ చేత నియోగింపబడిన విధులు {బ్రహ్మలు)న్నారు. నీవు విశ్వములకు అందలి జీవులకును ఈశ్వరుడవు. ఇది కర్మక్షేత్రము {భూలోకము) కాదు. కోరబడిన బ్రహ్మలోకము. ఐనప్పటికి నీ పాద భక్తిని మరిపించు కామమునందు మాకు కోరిక కలుగుచున్నది.
హే నాథ కరుణాసింధో దీనబంధో కృపాం కురు।
త్వం మహేశ మహాజ్ఞాత దుస్స్వప్నం మాం న దర్శయ ॥
ఇత్యుక్త్వా జగతాం ధాతా విరరామ సనోతనః।
ధ్యాయం ధ్యాయం మత్పదాబ్జం శశ్వతస్మార మామితి ॥
బ్రహ్మణా చ కృతం స్తోత్రం భక్తియుక్తశ్చ యః పఠేత్ ।
న చైవాకర్ణ్య విషయే న నిమగ్నో భవేద్ద్రువం॥
మమ మాయాం వినిర్జిత్య సంజ్ఞానం లభతే ధ్రువం ।
ఇహ లోకే భక్తియుక్తో మద్భక్త ప్రవరో భవేత్ ॥
ఓ నాథా! కరుణా సముద్రుడా! దీనజనబంధూ! నీవు సమస్తము తెలిసిన మహాప్రభువువు. నాకీ దుష్ట స్వప్నము చూపించుము. నన్ను దయచూడుము. ఇట్లు సనాతనుడైన సృష్టి కర్త పలికి ముగించాను. నా పాదపద్మములను (శ్రీకృష్ణుని వాక్కులివి ధ్యానించి ధ్యానించి సన్నీట్లు పలుసార్లు స్మరించెను, బ్రహ్మచేత చేయబడిన ఈ స్తోత్రమును భక్తియుక్తుడై ఏపడు పఠించునో లేదా ఏసునో వాడు విషయములందు (సంసార భోగములందు) మునిగిపోడు. ఇది నిశ్చయము. వాడు నామాయను జయించి ఉత్తమ జ్ఞానమును పొందుట సత్యము. ఈ లోకమందును భక్తియుక్తుడై నా భక్తులలో శ్రేష్టుడగును.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే బ్రహ్మ మోహినీ సంవాదే ద్వాత్రింశోఽధ్యాయః.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన దానిలో బ్రహ్మ మోహినీ సంవాదమును ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 32 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Surrounded by millions of radiant Gopīs who were manifestations of pure devotion, Lord Kṛshṇa expanded Himself through His mystic potency so that every single maiden felt the personal touch of Kṛshṇa standing right beside her in an infinite circle of divine love. As they danced the ecstatic Rāsalīlā under the blossoming kadamba trees, celestial beings watched from the heavens, showering flowers and playing divine music while the rotation of time paused for months in a single divine night. The narrative emphasizes that this dance was completely transcendent, representing the eternal union of the Supreme Soul and His loving devotee energies.