శ్రీనారాయణ ఉవాచ :
అపరం కృష్ణమాహాత్మ్యం శృణు కించిన్మహామునే ।
విఘ్న నిఘ్నం పాపహరం మహాపుణ్యకరం పరం ॥
ఏకదా నంద పత్నీ కృష్ణం కృత్వా స్వవక్షసి ।
స్వర్ణ సింహాసనస్థా చ క్షుధీతం తం స్తనం దదౌ॥
శ్రీనారాయణ మహర్షి ఇట్లు పలికెను:-
ఓ నారద మహామునీ! కృష్ణ మహిమను తెలుపునింకొక సంఘటనను చెప్పెదను వినుము. అది విఘ్నములను ఖండించునది. పాపములను నశింపజేయునది మరియు శ్రేష్ఠమై మహాపుణ్యములను సమకూర్చునది. ఒకసారి నందపత్ని (యశోద) ఆకలిగొని యున్న శిశువగు కృష్ణుని తన వక్షస్థలమున చేర్చుకొని బంగారు సింహాసనముందు కూర్చుండి
ఏతస్మిన్నంతరే తత్ర విప్రేంద్రైకః నమాగతః ।
వృతః శిష్య సమూహైశ్చ ప్రజ్జ్వలన్ బ్రహ్మతేజసా ॥
ప్రజపన్ పరమం బ్రహ్మ శుద్ధ స్పటిక మాలయా ।
దండీ ఛత్రీ శుక్లవాసా దంత పంక్తి విరాజితః ॥
జ్యోతిర్ర్గంధో మూర్తిమాంశ్చ వేదవేదాంగ పారగః ।
పరిబిభ్రజ్జటాజాలం తప్త కాంచన సన్నిభం ॥
శరత్పార్పణ చంద్రాస్యో గౌరాంగః పద్మలోచనః ।
యోగీంద్రో ధూర్జటేః శిష్యః శుద్ధ భక్తో గదాభృతః ॥
వ్యాఖ్యా ముద్రాకరః శ్రీమాన్ శిష్యానధ్యాపయన్ముదా ।
వేద వ్యాఖ్యం కతివిధాం ప్రకుర్వన్నివ లీలయా ॥
ఏకీభూయ చతుర్వేదాస్తేజసా మూర్తి మానివ ।
సాక్షాత్సరస్వతీ కంఠః సిద్ధాంతైక విశారదః ॥
ధ్యానైక నిష్ఠః శ్రీకృష్ణపాదాంభోజే దివానిశః ।
జీవన్ముక్తో హి సిద్ధేశః సర్వజ్ఞః సర్వదర్శనః ॥
ఇంతలో నక్కడికి శిష్య సమూహములతో గూడి ఒక బ్రాహ్మణ శ్రేషుడు విచ్చేసెను. అతడు బ్రహ్మ తేజస్సుతో వెలిగి పోవుచుండెను. తెల్లని పలువరుస ప్రకాశించుచుండగా తెల్లని వస్త్రములు ధరించి యోగదండము గొడుగు తెల్లని స్ఫటికముల జపమాల ధరించి రూపము దాల్చిన జ్యోతిష గ్రంథము వలె వెలుగుచుండెను. వేదవేదాంగములపారము ముట్టినవాడు. పరమమంత్రమును జపించుచు, తలమీది జడల సమూహము మేటి బంగారు వన్నెలో మెరిసిపోవుచుండెను. శరత్కాల పూర్ణిమ నాటి చంద్రుని వంటి ముఖమండలము పద్మముల వంటి నేత్రములు తెల్లని శరీరచ్ఛాయ గలిగి యున్న ఆ యోగీంద్రుడు శంకరుని శిష్యుడు విష్ణువు యొక్క శుద్ధ భక్తుడు. ఆ మహానుభావుడు వ్యాఖ్యానముద్రతో (విషయబోధ చేయునప్పుడు కుడిచేతి బొటనవేలు చూపుడు వేలును కలిపి పట్టుకొనుట - వ్యాఖ్యానముద్ర) వేదమంత్రముల కనేక విధముల వివరణములను లీలగా చేయుచు శిష్యులకు పాఠము చెప్పుచుండెను. తేజస్సును బట్టి నాలు వేదములోక్కటీయే ఆకారము దాల్చినట్లు శాస్త్ర తత్త్వమును సిద్ధాంతీకరించుటలో నేరుగా సరస్వతీదేవి స్వరమా అన్నట్లు నైపుణ్యము గలిగియుండెను. రాత్రింబవళ్లు శ్రీకృష్ణపాదపద్మములందే ధ్యాన నిష్ఠ గల జీవన్ముక్తుడతడు. సర్వజ్ఞుడు సర్వము చూచువాడు సీదులకు ప్రభువు అతడు.
తం దృష్ట్వా సా నముత్తస్థౌ యశోదా ప్రణనామ చ ।
పాద్యం గాం మధుపర్కం చ స్వర్ణ సింహాసనం దదౌ ॥
బాలకం పందయామాస మునీంద్ర సస్మితం ముదా ।
అతనిని చూచి యశోదాదేవి లేచి నిలబడి అతనికి నమస్కరించి పాదములు కడుగుకొనుటకు జలమును ఆవు పెరుగు తేనె కలిపిన మధుపర్కమను పదార్థమును సమర్పించి సింహాసనముపై కూర్చుండ బెట్టి సంతోషము చిరునవ్వులతో పిల్లవానితో మునికి నమస్కారము పెట్టించెను (ముని ముందు బోరగిలపడుకో బెట్టుట.
మునిశ్చ మనసా చక్రే ప్రణామ శతకం హరిం II
ఆశిషం ప్రదదౌ ప్రీత్యా వేదమంత్రోప యోగికం ।
మునియు మనస్సులో శ్రీహరికి శత నమస్కారములు చేసి శిశువును మొక్కించినందుకు ప్రీతీలో వేదమంత్రములలో ఆశీస్పులిచ్చెను.
ప్రణనామ చ శిష్యాంశ్చ తే తాం యుయుజురాశిషం ॥
ఆమె శిష్యులకును నమస్కరించెను. వారామె నాశీర్వదించిరి .
శిష్యాన్ పాద్యాదికం భక్త్యా ప్రదదౌ చ పృథక్ పృథక్ ।
సా శిష్యాంఘ్రి చ ప్రక్షాళ్య సమువాస సుఖాననే ॥
నముద్యతా సా ప్రష్టుం చ వుటాంజలియుతా సతీ ।
స్వక్రోడే బాలకం కృత్వా భక్తి నమ్రాత్మ కంధరా ॥
వేరు వేరుగా ఆ శీమ్యలకును యశోదా దేవి భక్తితో పాద్యము మొదలగునవి ఇచ్చి అందరి పాదములు కడిగి పీఠములపై కూర్చుండ జేసి తానును కూర్చుండి ఒడిలో కొడుకునుంచుకొనీ భక్తితో తలవంచి చేతులు జోడించి వారినిట్ను ప్రశ్నించ బూనుకొనెను.
స్వాత్వారామం మంగలం చ ప్రష్టుం యద్యపి న క్షమా ।
తథాఽపి భవతో నామ శివం పృచ్ఛామి సాంప్రతం ॥
అబలా బుద్ధిహీనాయా దోషం క్షంతుం సదాఽ ర్హసి ।
మూఢస్య సతతం దోషం క్షమాం కుర్వంతి సాధవః ॥
స్వాత్మారాములు (బ్రహ్మమును తపులోనే దర్శించుకొని ఆనందించువారు) మంగళమూర్తులు ఐన మిమ్ము ప్రశ్నించుటకు తగినంత దానీని కాకున్నను ప్రస్తుతము మీ మంగళకరమైన నామము నడుగుచున్నాను. అబలను తగిన బుద్ధి శక్తి లేని నా దోషమును క్షమింపవలెను. ఎల్లవేళలందును సజ్జనులు అజ్ఞానుల దోషములను క్షమింతురు.
అంగిరావాఽథ అత్రిర్వా మరీచిర్గౌతమోఽ థవా ।
క్రతుః కిం వా ప్రచేతా వా పులస్త్యః పులహోఽథవా ॥
దుర్వాసాః కర్దమస్త్యం వా వశిష్ఠో గర్గ ఏవ వా ।
జైగీషవ్యో దేవలో వా కపిలో వా స్వయం విభుః ॥
సనత్కుమారః సనకః సనందో వా సనాతనః ।
వేఢుః పంచ శిఖో వా త్వమానురిః సౌభరిః కిము ॥
విశ్వామిత్రోఽథ వాల్మీకో వామదేవోఽథ కశ్యపః ।
సంవర్తః కిముతథ్యో వా కిం కచోవా బృహస్పతిః ॥
భృగుః శుక్రశ్చ చ్యవనో నరనారాయణోఽథవా ।
సక్ధ్నిః పరాశరో వ్యాసః శుకదేవోఽథ జైమినిః ॥
మార్కండేయో లోమశశ్చ కణ్వః కాత్యాయనస్తథా ।
ఆస్తీకో వా జరత్కారుః ఋష్యశృంగో విభాండకః ॥
పౌలస్త్యస్త్వమగస్త్యో వా శరద్వాంగిరిరేవ చ।
శమీకోఽ రిష్టనేమిశ్చ మాండవ్యః ఫైల ఏవ చ ॥
పాణినిర్వా కణాదో వా శాకల్యః శాకటాయనః ।
అష్టావక్రో భాగురిర్వా సుమంతుర్వత్స ఏవ వా ॥
జాబాలో యాజ్ఞవల్క్యశ్చ వైశంపాయన ఏవ చ ।
యతిర్హంసీ పిప్పలాదో మైత్రేయః కరుష స్తథా ॥
ఉపమన్యుర్గౌరముఖోఽ రుణీరౌ ర్వోఽథ కక్షివాన్ ।
భరద్వాజో వేద శిరాః శంకుకర్ణోఽథ శౌనకః ॥
ఏతేషాం పుణ్య శ్లోకానాం కో భవాన్వద మే ప్రభో ।
ప్రత్యుత్తరార్హా నాహం చేత్తథాపి వక్తుమర్హసి ॥
కింకరః కింకరీ వాఽపి సమర్థా ప్రష్టుమీశ్వరం ।
యో యస్య సేవానియతః స కం పృచ్ఛతి తం వినా ॥
అయ్యా! తామెవరు? పుణ్య శ్లోకులైన మహరులలో ఈ క్రింది వారిలో తామెవరో చెప్పుము ప్రభూ! ఆంగీరసుడు అత్రి మరీచి, గౌతముడు, క్రతువు, ప్రచేతసుడు, పులస్త్యుడు, పులహుడు, దూర్వాసుడు, కర్దముడు, వశిష్టుడు, గర్గుడు, జైగీషవ్యుడు, దేవలుడు, కపిలుడు, సనత్కుమారుడు, సనకుడు ననందుడు, సనాతనుడు, పంచశిఖుడు, ఆసురీ సౌభరి, విశ్వామిత్రుడు, వాల్మీకీ, వామదేవుడు, కశ్యపుడు, సంవర్తుడు, ఉతథుడు, కచుడు, బృహస్పతి, భృగువు, శుక్రుడు, చ్యవనుడు, నరనారాయణులు, సక్ద్ని పరాశరుడు, వ్యాసుడు, శుకదేవుడు, జైమిని, మార్కండేయుడు, లోమశుడు, కణ్వుడు, కాత్యాయనుడు, ఆస్తీకుడు, జరత్కారువు, ఋష్యశృంగుడు, విభాండకుడు, పౌలస్త్యుడు, అగస్త్యుడు, శరద్వంతుడు, ఆంగిరి, శమీకుడు, అరిష్టనేమి, మాండవ్యుడు, పైలుడు, పాణిని, కణాదుడు, శాకల్యుడు, శాకటాయనుడు, అష్టావక్రుడు, భాగురి, సుమంతుపు, వత్సుడు, జాబాలి, యాజ్ఞవల్క్యుడు, వైశంపాయనుడు, యతి, హంసి, పిప్పలాదుడు, మైత్రేయుడు, కరుషుడు, ఉపమన్యువు, గౌరముఖుడు, అరుణీ, ఔర్వుడు, కక్షివంతుడు, భరద్వాజుడు, దేపశీరుడు, శంకు కర్ముడు, శౌనకులు అని చెప్పబడు వారలలో తామెవరు? జవాబు పొందుటకు యోగ్యను కాకున్నను చెప్పదగును. దాసుడుగాని దాసురాలుగాని తమ ప్రభువును ప్రశ్నించుటకు సమర్థులే. ఎవరు ఎవరి సేవకు నియమింపబడిరో ఆ వ్యక్తులు వారిని ప్రశ్నింపక ఇతరులనెవరినీ ప్రశ్నింతురు.
ధన్యాఽహం కృతకృత్యాఽహం సఫలం జీవితం మమ ।
త్వత్పాదాబ్జ రజస్పర్శాజ్జన్మకోట్యంహసాం క్షయః ॥
త్వత్పాదోదక సంస్పర్శాత్సద్యః పూతా వసుంధరా ।
తవాగమన మాత్రేణ తీర్థ భూతో మమాశ్రమః ॥
యే యే శ్రుతాః శ్రుతౌ బ్రహ్మన్ శ్రుతిసారా మహాజనాః ।
తెషామకో మయా దృష్టః పూర్వపుణ్య ఫలోదయాత్ ॥
శిష్యా వేధా మూర్తిమంతో గ్రీష్మ మధ్యాహ్న భాస్కరాః ।
గోకులం మత్కులం సద్యః పునంతి పాదరేణునా ॥
ఆశిషంకర్తుమర్హంతి ప్రసన్న మనసా శిశుం।
పూర్ణస్వస్త్యయనం సద్యో విప్రాశీర్వచనం ధ్రువం ॥
ఇత్యేవముక్త్వా నందస్త్రీ భక్త్యా తస్థౌ మునేః పురః ।
నరం ప్రస్థావయామాన నందమానయితుం సతీ ॥
అయ్యా! నేను ధన్యురాలనైతీనీ, సత్కార్యము లోనర్చినదాననైతిని. నా జీవితము ఫలవంతమైనది. మీ పాదపద్మముల ధూళిని స్పృశించుట వలన కోటి జన్మల పాపములు నశించిపోవును. మీ పాద జుటము తాకినంతలో ఈ నేల అప్పుడే పవిత్రమగును, మీరు వచ్చినంతలో మా యిల్లు పుణ్యభూమి యైనదీ. ఓ మహాజ్ఞానీ వేదశాస్త్రముల వలన ఏయే మహానుభావులు వేదసారభూతుడిగా తెలిసినకొనబడిరో అట్టివారిలో నోకవ్యక్తి నా పూర్వపుణ్యముల ఫలితముగా నాకు కన్పించెను. రూపము దాల్చిన వేదముల వలెనున్న మీ శిష్యులు గ్రీష్మ ఋతువులోని మధ్యాహ్న సూర్యుల వలె వెలుగుచున్నారు. ఈ గోకులమును నావంశమును తమ పాద ధూళిచే ఇప్పటిప్పటికే పావనమొనర్చుచున్నారు. ప్రసన్నమైన మనస్సులతో ఈ నాశిశువునకు ఆశీస్సులీయ తగును. సబ్రాహ్మణుల ఆశీర్వాదము నిండుగా స్వస్తి వాచనము (శుభములకు మూలము) అన్న వాక్కు నిశ్చయము. ఇట్లు నందుని గృహిణి పలికి ఆ ముని ముందు భక్తితో నిలచెను. ఆ సాధ్వి తన భర్తను (నందుని) తోడ్కొని వచ్చుటకొక మనుష్యుని పంపించెను.
యశోదావచనం శ్రుత్వా జహాస మునిపుంగవః ।
జహసుః శిష్య సంఘాశ్చ భానయంతో దిశో దశ ॥
హితం తధ్యం నీతియుక్తం మహత్ప్రీతికరం పరం ।
తామువాచ ముదా యుక్తః శుద్ధ బుద్ధిర్మహామునిః ॥
శ్రీ గర్గ ఉవాచ :
సుధామయం తే వచనం లౌకికం చ కులోచితం ।
యస్య యత్ర కులే జన్మ న ఏవ తాదృశో భవేత్ ॥
సర్వేషాం గోవ పద్మానాం గిరిభానుశ్చ భాస్కరః ।
పత్నీ పద్మాసమా యస్య నామ్నా పద్మావతీ సతీ ॥
తస్యాః కన్యా యశోదా త్వం యశోవర్ధనకారిణీ ।
వల్లవానాం చ ప్రవరో లబ్ధో నందశ్చ వల్లభః ॥
నందో యస్త్వం చ యా భద్రే బాలో యో యేన వా గతః ।
జానామి నిర్ణనే నర్వం వక్ష్యామి నంద సన్నిధౌ॥
గర్లో ఽహం యదువంశానాం చిరకాలం పురోహితః ।
ప్రస్థాపితోఽహం వనునా నాన్య సాధ్యే చ కర్మణి ॥
యశోద వాక్కులు విని ఆ ముని పుంగవుడును అతని శిష్య గణములును పదిదిక్కులను వెళ్లించుచు నవ్విరి. స్వచ్ఛమైన జ్ఞానము గల ఆ మహాముని సంతసముతో హితమును కూర్చునది సత్యమైనది నీతిమంతము శ్రేష్ఠము వినువారికి ప్రీతిని కల్గించునదియైన మాటను ఆమెతో ఇట్లు పలికెను.
గర్గమహాముని పలికెను :
నీ మాట నీ వంశమున కుచితమైనది లోకజ్ఞానము కలది అమృతమయమైనది. ఏ వ్యక్తి ఏ వంశమున జన్మనెత్తునో ఆ వ్యక్తి అట్టివాడే అగును. మొత్తము గోపాలకులలో గిరిభానుడు సూర్యుడు. పద్మావతీ యను అతని భార్య లక్ష్మితో సమానురాలు. ఆమె కన్నకూతురువు నీవు. సంబంధుల యశస్సు (కీర్తి) ను వృద్ధిపొందించు యశోదవు. గోపాలకులలో శ్రేష్టుడగు నందుడు నీకు భర్తగా లభించినాడు. ఓ సుమంగ! నందుడెవరో నీవెవరో ఈ బాలుడెవరో ఎక్కడినుండి వచ్చినో అంతయు నేనెరుగుదును. ఏకాంత ప్రదేశమున నందుని వద్ద అన్ని విషయములు నీకు చెప్పుదును. నేను గర్గుడను. చిరకాలముగా యదువంశము వారికి పురోహితుడను. ఇతరులు చేయరాని ఒక కార్యమొనర్చుట కొఱకు వసుదేవుడు పంపగా నిక్కడకు వచ్చితిని.
ఏతస్మిన్నంతరే నందః శ్రతమాత్రం జగామ హ ।
ననాము దండవద్భూమౌ మూర్ద్నా తం మునిపుంగవం ॥
శిష్యాన్ననామ మూర్ధ్నాచతే తం యుయుజురాశిషం ।
నముత్థాయాననాత్తూర్ణం యశోదానంద ఏవ చ ॥
గృహీత్వాఽoభ్యంతరం రమ్యం జగామ వీదుషాం వరః ।
గర్గో నందో యశోదా చ నపుత్రా సా ముదాన్వితా ।
వాక్యం గర్గస్తదోవాచ నీగూడం నిర్జనే మునే ॥
ఇంతలో వార్త విన్నంతలోనే నందుడింటికి వచ్చి ఆగర్గమహామునికి అతని శిష్యులకు నేలమీద సాష్టాంగముగా పండుకొని లేచి శిరస్సు వంచి నమస్కరించెను. వారతనికి ఆశీస్సులు సమకూర్చిరి. ఆసనము మీది నుండి త్వరగా యశోద లేచెను. విద్వాంసులలో శ్రేష్ఠుడగు గర్గుడు యశోదానందులను గోనీ సుందరమైన లోపలి గృహములోని కేగెను. యశోద పుత్రునితో బాటు వెళ్లి ముని చెప్పబోవు విషయము గూర్చి ఆనందముగా నుండెను. ఓ నారదమునీ! అపుడు గరుడు జనులు లేని రహస్య ప్రదేశమున రహస్య వాక్యమీట్లు పలికిను.
శ్రీ గర్గ ఉవాచ :
అయి నంద ప్రవక్ష్యామి వచనం తే సుఖావహం ।
ప్రస్థాపితోఽహం వసునా యేన తచ్ఛ్రూయతామితి ॥
వసునా సూతికాగారే శిశుః ప్రత్యర్పణం కృతః ।
పుత్రోఽయం వసుదేవస్య జ్యేష్ఠశ్చ తన్య చ ధృవం ॥
అస్యాన్నప్రాశనాయాహం నామాసుకరణాయ చ ।
గూఢన ప్రేషిత స్తేన తస్యోద్యోగం కుదు ద్విజ ॥
పూర్ణబ్రహ్మస్వరూపోఽయం శిశు స్తే మాయయా మహీం ।
ఆగత్య భారహరణం కర్తా ధాత్రా చసేవితః ।
గోలోకనాథో భగవాన్ శ్రీకృష్ణో రాధికాపతిః ॥
నారాయణో యో వైకుంఠె కమలాకాంత ఏవ చ ।
శ్వేతద్వీప నివాసీ యః పితా విష్ణుశ్చ సోఽప్యజః ॥
కపీలోఽ న్యేతదంశాశ్చ నరనారాయణావృషి ।
నర్వేషాం తేజసాం రాశిర్మూర్తిమానాగతః కిము ॥
తం వసుం దర్శయిత్వా ద శిశురూపో బభూవ హ।
సాంప్రతం సూతికాగారాదాజగామ తవాలయం॥
అయోని సంభవశ్చాయమావిర్భూతో మహీతలే ।
వాయుపూర్ణం మాతృగర్భం కృత్వా చ మాయయా హరిః ॥
ఆవిర్భూయ వసుం మూర్తిం దర్శయిత్వా జగామ హ ।
గర్గమహాముని యిట్లు పలికెను :-
ఓయి నందుడా ! నీకు సుఖము కల్గించుమాట చెప్పేదను. వినుము. వసుదేవుడే కారణమున నన్ను పం పెనో దానిని వినుము. నీ పురిటింటిలో వసుదేవుడు ఈ శిశువును ప్రత్యర్పణము (ఒకటి తీసుకొని మరియొకటి ఇచ్చునది) చేసెను. ఈ కుమారుడును (చిన్నవాడు) ఆ పెద్దవాడును (బలరాముడు) ఆ వసుదేవుని పుత్రులే. ఇది నిశ్చయము. అతడిక్కడి నుండి తీసుకొని పోయిన శిశువు నీ బిడ్డ. కంసునికి భయపడి బాలునీ దెచ్చి ఇక్కడ దించి కన్యను మధురకు గొనిపోయెను. ఈ బాలునికి అన్నప్రాశన నామకరణములు చేయుటకై.
రహాన్యముగా నతడే నన్ను పంపెను. ఈ శిశువు శ్రీకృష్ణుడు) పరిపూర్ణ బ్రహ్మ స్వరూపుడు. మాయతో నీ భూమికవతరించి భూభారము తొలగించనున్నాడు. ఇతడు బ్రహ్మచేత సేవింపబడినవాడు. ఏ స్వామి వైకుంఠమున లక్ష్మీ వల్లభుడైన నారాయణుడో ఏ జగత్పిత శ్వేతద్వీప నివాసియగు విష్ణువో జన్మరహితుడైన అతడే గోలోకనాధుడును రాధికాపతియునగు శ్రీకృష్ణ భగవానుడు. కపిలముని నరనారాయణ ఋషులు అన్యులును అతని అంశలే. సర్వలేజస్సుల రాశీ రూపము దాల్చి వచ్చెనా యన్నట్లు వసుదేవునకు దర్శనమిచ్చి తరువాత ఈ శీశు రూపము ధరించెను. ఇపుడు మధురలోని పురిటింటి నుండి నీ గృహమునకు వచ్చినోడు,శ్రీహరి తన మాయా శక్తితో తల్లి (దేవకి) గర్భమును గాలితో నింపి, ఇతడు అయోని సంభవుడు కనుక (మనుష్య గర్భమున పడుట అందులో నుండి జన్మించుట అన్న విలేనివాడు) మహీతలమున ఇట్లు స్వయముగా ఆవిర్భవించెను. ఆవిర్భవించి తన ఆకారమును వసుదేవునకు చూపి అంతర్ధానమయ్యెను.
యుగేయుగే పర్ణభేదో నామభేధోఽ స్య వల్లన ॥
శుక్ల పీతస్తధార రక్త ఇదానీం కృష్ణతాం గతః ।
శుక్లవర్ణః సత్యయుగే సుతీవ్ర తేజసా వృతః ॥
త్రేతాయాం రక్తవర్ణోఽయం పీలోఽయం ద్వాపరే విభుః ।
కృష్ణవర్ణః కలౌ శ్రీమాన్ స్తేజసాం రాళిరేవ చ ॥
పరిపూర్ణతమం బ్రహ్మ తేనె కృష్ణ ఇతిస్మ్యతః ।
ఇతనికి (పరమాత్మకు) ఒక్కొక్క యుగమున ఒక్కొక్క వర్ణము ఒక్కొక్క సోమముండును. తెల్లనివాడు, పచ్చనివాడు, ఎఱ్ఱని వాడు అని. ఇప్పుడు నల్లదనము పొందినాడు. సత్యయుగమున శుక్రవుడు, మిక్కిలి తీవ్రమైన తేజస్సుతో చుట్టబడినవాడు. త్రేతాయుగముననీతడు రక్తవర్ణుడు. ఈ విభుడు ద్వాపరమున పసుపు పచ్చని వన్నెవాడు, లక్ష్మీపతి కలియుగమున నల్లని కాంతీ గలవాడు తేజోరాశీ కూడ. ఇతడు పరిపూర్ణతమమైన పరబ్రహ్మము కనుక కృష్ణుడు అని చెప్పబడినాడు.
బ్రహ్మాణో వాచకః కోఽయమృరోఽ నంతవాచకః II
శివస్య వాచకః షశ్చ నకారో ధర్మవాచకః ।
అకారో విష్ణువచనఃశ్వేతద్వీపనివాసినః ॥
నరనారాయణార్థస్య విసర్గో వాచకః స్మృతః ।
సర్వేషాం తేజసాం రాశిః సర్వమూర్తి స్వరూపకః॥
నర్వాధారః సర్వబీజ స్తేన కృష్ణ ఇతి స్మృతః।
ఇక్కడ నుండి కృష్ణ శబ్దము యొక్క అనేకార్థములు చెప్పబడుచున్నవి. “క” అన్నది పరబ్రహ్మమును చెప్పును. ఋకారము (ఎ) అనంతుని (ఆదిశేషుని) చెప్పును. పకారము శివుని చెప్పును. నకారము ధర్మదేవతను చెప్పును. అకారము శ్వేతద్వీపపోసియైన విష్ణువును చెప్పును. విసర్గము (:) నరసారాయణార్థమును చెప్పును. ఇట్లు అన్ని తేజన్సుల రాశీ అన్ని మూర్తుల స్వరూపము గలవాడు సర్వమునకు ఆధారము అన్నిటికి మూలబీజము అగుట వలన కృష్ణుడు (కృష్ణ:) అని చెప్పబడినాడు.
కర్మనిర్మూలవచన: కృషిర్నో దాస్యవాచకః ॥
అకారో దాతృవచన స్తేన కృష్ణ ఇతిస్మృతః ।
కృష్ అన్నది కర్మనిర్మూలనమును (కర్మలను నశింపజేయుటను) తెలుపు మాట. న్ అన్నది దాస్యమును చెప్పుమాట. “ఆ” అన్నది దాతృ (ఇచ్చు) అర్థమును చెప్పుమాట. కర్మలను (జీవుల) నిర్మూలించి తన దాస్యము నిచ్చును కనుక పరమాత్మ "కృష్ణ” అని చెప్పబడినాడు.
కృషిర్నిశ్చేష్ణ వచనో నకారో భక్తివాచకః ॥
ఆకారః ప్రాప్తి వచన స్తేన కృష్ణ ఇతి స్మృతః ।
కృష్ అన్నది జీవుని కర్మత్యాగమును తెలుపును. న్ అన్నది భక్తిని తెలుపును. ఆకారము ఫలప్రాప్తిని తెలుపును. ఇట్లు జీవుల కర్మయోగ భక్తి యోగదశల వలన లభించు మోక్షమును చెప్పుటను బట్టి "కృష్ణ" అను శబ్దము చెప్పబడినది .
కృషిర్నిర్వాణవచనో నకారో మోక్షవాచకః ॥
అకారో దాతృవచన స్తేన కృష్ణ ఇతిస్మృతః ।
“కృష్” అనునది సంసార విమోచనమును. న్ కారము ముక్తిని తెలుపును. అకారము దాతృ (ఇచ్చు) అను దాని వాచకము. ఇటు బంధత్యాగమును మోక్షమును ఇచ్చునది గనుక “కృష్ణ" అని చెప్పబడినది.
సామ్నాం భగవతో నంద కోటీనాం స్మరణేన యత్ ॥
తత్ఫలం లభతే నూనం కృష్ణేతి స్మరణే నరః ।
యద్విదః న్మరణాత్పుణ్యం వచనాచ్ఛ్రవణాత్తథా ॥
కోటి జన్మాంహసో నాశో భవేద్యత్స్మరణాదికాత్ ।
విష్ణోర్నామ్నాం చ సర్వేషాం సారాత్సారం పరాత్పరం ॥
కృష్ణేతి సుందరం నామ మంగలం భక్తిదాయకం ।
ఓ నందుడా ! భగవంతుని యొక్క కోటి నామములను స్మరించుట వలన ఏమి ఫలమో ఆ ఫలమును “కృష్ణ" అను నామస్మరణమున నరుడు పొందును. దేనిని స్మరించుట వలన దేనిని పలుకుట వలన దీనిని వినుట వలన కోటి జన్మల పాపములు నశించునో విష్ణువు యొక్క అన్ని నామములలో సారతమమైనది. శ్రేష్ఠతమమైనది. “కృష్ణ” అను సుందరమైన నామము ఇది మంగళమైనది భక్తి భావము కల్గిoచునది.
కకారోచ్చారణాద్భక్తః కైవల్యం మృత్యుజన్మహం ॥
ఋకారాద్దాస్యమతులం షకారాద్భక్తి మీప్సితాం ।
నకారాత్సహవాసం చ తత్సమం కాలమేవచ ॥
తత్పారూప్యం విసర్గాచ్ప లభతే నాత్ర సంశయః ।
భక్తుడు కకారమునుచ్చరించుట వలన జన్మమరణము ఋ కారము భగవత్ దాస్యమును ప్రకారము నుచ్చరించుట వలన కోరదగిన భక్తిని, సకారము నుచ్చరించుట వలన కాలమున్నంత వరకు పరమాత్మతో కలిసి వసించుట, విసర్గనుచ్చరించుట వలన భగవంతుని సారూప్యమును ఇట్లు శ్రీకృష్ణ నామోచ్చారణ వలన సంసార బంధవిమోచనమై సామీప్య సాలోక్య సారూప్య సాయుజ్యములను చతుర్విధమోక్షములను పొందుననుమాటలో సందేహము లేదు.
కకారోచ్చారణాదేవ వేషంతే యమకింకరాః॥
ఋకారోక్తేర్నతిష్ఠంతి షకారాత్పాతకాని చ ।
నకారోచ్చారణాద్రోగా అకారాన్మృత్యురేవ చ ॥
ధ్రువం నర్వే పలాయంతే నామోచ్చారణధీరవః ।
స్మృత్యుక్తి శ్రవణోద్యోగాత్కృష్ణనామ్నో వ్రజేశ్వర ॥
ఓ గోకుల ప్రభూ ! కృష్ణ నామములోని కకారము పల్కినంత మాత్రమున యమ దూతలు వణికిపోదురు. ఋకారముచ్చరింపగనే నిలువలేక పారిపోదురు. షకారముచ్చేరించుట తోడనే పాతకములుసు నకారము పల్కగనే రోగములును అకారము పల్కుటలో మృత్యువును పారిపోగలవు. కృష్ణ నామము స్మరించుటకు పూనుకోనగనే – పల్కుటకు యత్నించగనే - వినుటకు తల పెట్టగనే ఆ నామోచ్చారణమునకు భయపడి అన్ని అమంగళములు పలాయనమై పోవును. ఇది సత్యము.
రథం గృహీత్వా ధావంతి గోలోకాత్కృష్ణకింకరాః ।
గోలోకము నుండి రథము తీసుకోని కృష్ణ సేవకులు భక్తుని వద్దకు పరిగెత్తుదురు (కృష్ణ నామము ఏనుట • అతనిని గోలోకమునకు కొని తెచ్చుట అన్నవి వారి ఉద్దేశములు).
వృథివ్యా రజసః సంఖ్యా కర్తుం శక్తి వివశ్చితః II
నామ్నః ప్రఖావసంఖ్యానం సంతో వక్తుం న చ క్షమాః ।
పురా శంకర వక్త్రేణ నామ్నోఽస్య మహిమా శ్రుతః ॥
గుణాన్నామప్రభావం చ కించిజ్జానాతి మద్గురుః ।
బ్రహ్మాఽనంతశ్చ ధర్మశ్చ సురర్షిమనుమానవాః ॥
వేదాస్సంతో న జానంతి మహిమ్నః షోడశీం కలాం ।
ఇత్యేవం కథితో నంద మహిమా చ సుతస్య చ ॥
యథామతీ యథాజ్ఞానం గురువక్త్రాద్యథా శ్రుతం ।
విద్వాంసులకు భూమియొక్క ధూళికణములను లెక్కించుట సాధ్యము కావచ్చును. కానీ సాధువులకును భగవన్నామము యొక్క ప్రభావమును లెక్కించి చెప్పుట సాధ్యము కాదు. పూర్వము శంకరుని ముఖవచనము ద్వారా నామమహిమ విని యుంటిని. భగవంతుని కల్యాణగుణముల యొక్కయు నామము యొక్కయు ప్రభావము నా గురువు కొద్దిగా ఎరుగును. సృష్టికర్తయగు బ్రహ్మాయు అనంతుడును ధర్మదేవతయు దేవరులును మనువులును మానవులును, వేదములును, సాధువులును నామ మహిమ యొక్క పదునారవ భాగమును కూడ ఎరుగరు. ఓ నందుడా ! గురు ముఖము నుండి, విన్నంత వరకు నాకున్న జ్ఞానము బుద్ధిని బట్టి నీకుమారుని (శ్రీ కృష్ణుని) మహిమ నీకు చెప్పితిని.
కృష్ణ పీతాంబరః కంసధ్వంసీ చ విష్టరశ్రవాః ॥
దేవకీనందనః శ్రీశో యశోదానందనో హరిః ।
సనాతనోఽ చ్యుతోఽనంతః సర్వేశః సర్వరూపధృక్ ॥
సర్వాధారః సర్వగతిః సర్వకారణ కారణం ।
రాధాబంధూ రాధికాత్మా రాధికాజీవనం స్వయం ॥
రాధాప్రాణో రాధికేశో రాధికారముణః స్వయం ।
రాధికా సహచారీ చ రాధామానస పూరణః ॥
రాధాధనో రాధికాంగో రాధికాసక్త మానసః ।
రాధికా చిత్తచోరశ్చ రాధాప్రాణాధికః ప్రభుః ॥
పరిపూర్ణతమం బ్రహ్మ గోవిందో గరుడ ధ్వజః ।
నామాన్యేతాని కృష్ణస్య శ్రుతాని మన్ముఖాధ్దృది ॥
జన్మమృత్యుహరాణ్యేవ రక్ష నంద శుభేక్షణ।
కృతం నీరూవణం నామ్నాం కనిష్ఠన్య యధాశ్రుతం ॥
కృష్ణుడు, పీతాంబరుడు, కంసధ్వంసి, విష్టరశ్రవసుడు, దేవకీ నందనుడు, శ్రీశుడు, యశోదానందసుడు, హరీ, సనాతనుడు, అచ్యుతుడు, అనంతుడు, సర్వేశుడు, సద్వరూపధరుడు, సర్వాధారుడు, సర్వగతి అందరు జీవులు పొందదగినవాడు) సత్వకారణకారణుడు, రాధా బంధువు, రాధికాత్ముడు, రాధికాజీవనుడు, రాధా ప్రాణము, రాధికేశుడు, రాధికారమణుడు, రాధికా సహచారి, రాధామానస పూరణుడు, రాధా ధనము, రాధికాంగుడు, రాధికాసక్తమానసుడు, రాధికా చిత్తచోరుడు, రాధాప్రాణాధికుడు, ప్రభువు, పరిపూర్ణతమమైన పరబ్రహ్మ, గోవిందుడు, గరుడధ్వజుడు, ఇవి కృష్ణ నామములు. ఇవి జన్మ మరణములను నశింపజేయునవి (ముక్తి నిచ్చునవి). శంభమైన చూపు గల నoదుడా ! నా వలన విన్న ఈ నామములను నీ హృదయమున నిలుపు కొనుము. నేను విన్న ప్రకారము నీ చిన్న కుమారుని నామములను నిరూపించితిని.
జ్యేష్ఠస్య హలినో నామ్నః సంకేతం శ్రుణు మన్ముఖాత్ ।
గర్భసంకర్షణాదేవ నామ్నా సంకర్షణః స్మృతః ॥
నాస్త్యంతోఽ స్యైవ వేదేపు తేనానంత ఇతి స్మృతిః ।
బలదేవో బలోద్రేకాద్ధలీ చ హలధారణాత్ ॥
శితివాసా నీలవాసాన్ముసలీ ముసలాయుధాత్ ।
రేవత్యా సహసంభోగాత్ రేవణీరమణః స్వయం ॥
రోహిణీ గర్భవాసాత్తు రౌహిణీయో మహామతిః ।
ఇత్యేవం జ్యేష్ఠ పుత్రస్య శ్రుతం నాము నివేదీతం ॥
పెద్దవాడైన హరి (బలరాముడు) యొక్క నామముల సంకేతమును (అర్థ వివరణమును) నావలన వినుము. గర్భసంకర్షణము వలన (దేవకి గర్భము నుండి రోహిణి గర్భములోనికి పిండము మారినందుని సంకర్షణుడు అన్న నామము చెప్పబడినది. వేదములలో ఇతని మహిమకు అంతులేనందువలన అనంతుడు అని చెప్పబడినాడు, బలాతిశయము వలన బలదేవుడనియు, హలధారణము (నాగలి పట్టుకొనుట) వలన నితనికి హలీ అని పేరు వచ్చినది. నల్లని వస్త్రముల వలన శీతివాసుడు అనియు ముసలము అను ఆయుధము (రోకలి) ధరించుటచే ముసలి అనియు రేవతీ దేవితో సుఖించునందున (భార్యగా) రేవతీరమణుడనియు నాసమేర్పడినది. రోహిణీదేవి గర్భమున జనించినందున రౌహిణేయుడైనాడు ఆ మహాజ్ఞాని (మహామతి). ఇట్లుగా నేను విన్న జ్యేష్ఠ పుత్రుని నామములు తెలుపబడినవి.
యాస్యామ్యహం గృహం నంద నుఖం తిష్ఠస్వ మందిరే ।
బ్రాహ్మణన్య వచః శ్రుత్వా నందః స్తబ్ధో బభూవ హ ॥
నిశ్చేష్టా నందపత్నీ చ జహాస బాలకః స్వయం ।
ప్రణమ్యోవాచ సందస్తం వాక్యం వినయ పూర్వకం ॥
పుటాంజలియుతో భూత్వా భక్తినమ్రాత్మకంధరః ॥
ఇక నేను వెళుదును. నందుడా, నీ మందిరమున సుఖముగా నుండుము” అను గర్గ బ్రాహ్మణుని మాటలు విని నందుడు చేష్టలు లేక నిలిచెను. యశోదయు ఆశ్చర్యపడెను. బాలకుడు స్వయముగా నవ్వెను. నందుడు వినయముగా నమస్కరించి భక్తితో తన తలవంచి చేతులు చేర్చి దోసిలి పట్టి అతనితో నిట్లనెను.
శ్రీ నంద ఉవాచ :
గతశ్చేత్త్వం తదా కర్మ కరిష్యత్యేవ కో మహాన్ ॥
స్వయం శుభేక్షణం కృత్వా కురు నామ్నాఽన్నప్రాశనం ।
యన్నామౌఘశ్చ కథితో రాధాప్రాణాధికో దశ ॥
తస్యాపీ కా వా రాధేతి కన్యకా కన్య చ ధ్రువం ।
నందన్య వచనం శ్రుత్వా జహాన మునిపుంగవః ।
నిగూఢం పరమం తత్త్వం రహస్యం కథయామి తే ॥
నందుడిట్లు పలికెను :-
స్వామీ ! నీవు వెళ్లిపోయినచో ఈ శిశువులకు చేయవలసిన సంస్కారకర్మ ఏ మహాత్ముడు చేయును? స్వయముగా నీ శుభమైన దృష్టితో చూచి నామకరణ అన్నప్రాశన కర్మలు చేయుము. రాధాప్రాణాధికుడు” అని పదినామములు చెప్పితీవే వాటిలో “రాధ” అన్న వ్యక్తి ఎవరు ? ఎవరి కూతురు ? నందుని ఈ వాక్కులు విని గర్గముని నవ్వెను. మిక్కిలి దాగి ఉన్న రహస్య తత్త్వము నీకు చెప్పుదుననేను .
శ్రీ గర్గ ఉవాచ :
శృణు నంద ప్రవక్ష్యామీ ఇతిహాసం పురాతనం ॥
పురా గోలోకవృత్తాంతం శ్రుతం శంకర వక్త్రతః ।
శ్రీదామ్నో రాధయా సార్థం బభూవ కలహో మహాన్ ॥
శ్రీదామ శాపాద్దైవేన గోపీ రాధా చ గోకులే ।
వృషభాను సుతా సా చ మాతా తస్యాః కలావతీ ॥
కృష్ణస్యార్ధాంగసంభూతా నాథస్య సదృశీ సతీ ।
గోలోకవాసినీ సేయమత్ర కృష్ణాజ్ఞయాఽధునా ॥
అయోని సంభవా దేవీ మూల ప్రకృతిరీశ్వరీ ।
మాతుర్గర్భం వాయు పూర్ణం కృత్వా చ మాయయా సతీ ॥
వాయు నిస్పరణే కాలే ధృత్వా చ శిశు విగ్రహం ।
ఆవిర్బభూవ మాయేయం పృధ్వ్యాం కృష్ణోవదేశతః ॥
గర్గమహాముని యిట్లు పలికెను :-
నందుడా ! పురాతనమైన ఇతిహాసము చెప్పేదను వినుము. గోలోకమున జరిగిన ఈ వృత్తాంతమును శంకరుని ముఖతః నేను విని యుంటిని. శ్రీదామునకు రాధాదేవికి గోలోకమున పెద్ద కలహము జరిగెను. దైవికముగా ఏర్పడిన శ్రీరాముని శాపము శ్రీకృష్ణుని అర్ధాంగము నుండి (సగము శరీరము) సంభవించిన గోలోక నివాసిని. శ్రీహరికి అన్ని విధముల పోలీస్ సతీమణి, అయోనీ సంభవురాలు మూలప్రకృతి ఈశ్వరి యైన ఆమె శ్రీహరి ఆజ్ఞ వలన ఇప్పుడీ గోకులమున - తన మాయాశక్తితో తల్లి గర్భమును (కలావతి) కేవలము
వాయువుతో నింపి, జన్మించవలసిన కాలమున వాయువు బయటకు వచ్చువేళలో, తాను శిశురూపమును ధరించి శ్రీకృష్ణుని (శ్రీహరి గోలోక ప్రభువు) ఉపదేశముననుసరించి భూమి మీద ఆవిర్భవించినది ఈమె తండ్రి వృషభానుడు. తల్లి కళవతి .
వర్ధతే సా ప్రజే రాధా శుక్లే చంద్రకళా యథా।
శ్రీకృష్ణ తేజసోఽ ర్ధేన సా చ మూర్తిమతీ సతీ॥
శ్రీకృష్ణుని తేజస్సు యొక్క అర్థభాగము ఆకారము దాల్చిన ఆ సాధ్వీ గోకులములో శుక్ల పక్షమున - చంద్రకళ వృద్ధి పొందినట్లు పెరుగుచున్నది .
ఏకామూర్తిర్ద్విధాభూతా భేదో వేదే నిరూపితః ।
ఇయం స్త్రీ సా పుమాన్ కిం వా సా వా కాంతా పుమానయం ॥
ద్వే రూపే తేజసా తుల్యే రూపేణ చ గుణేన చ ।
పరాక్రమేణ బుద్ధ్యా వా జ్ఞానేన సంవదాఽపిచ ॥
పురతే గమనేనైన కింతు సా వయసాఽధికా ।
ధ్యాయతే తామయం శశ్వదినం సా స్మరతి ప్రియం ॥
రచితా సాఽ స్య ప్రాణైశ్చ తత్ప్రాణైర్మూర్తిమానయం ।
అస్య రాధానుసారేణ గోకులాగమనం పరం ॥
ఒక పరబ్రహ్మమూర్తియే రెండుగానైనది. భేదమన్నది వేద మందు నిరూపించబడినది. ఈ శిశువు స్త్రీ ఆ శిశువు పురుషుడో ఆ శిశువు స్త్రీ ఈ శిశువు పురుషుడో రెండు రూపములు చేజస్సు రూపము గుణము పరాక్రమము బుద్ధి జ్ఞానము సంపద అన్న వానిని బట్టి ఒకదానికొకటి సమానమైనవే. భూమి మీదికి ఇతని కన్న ముందామె వచ్చుట వలన వయస్సులో అమె పెద్దది. ఇతడామెను ఎల్లప్పుడు తలంచుచుండును. ఆమె ఈ ప్రియుని ఎప్పుడును స్మరించుచుండును. ఆమె ఇతని ప్రాణములతో నిర్మించబడినది. ఆమె ప్రాణముల చేత నితడు రూపము దాల్చిసాడు. ఇతడు (శిశువగు కృష్ణుడు) రాధ ననుసరించి గోకులమున వచ్చుట శ్రేష్ఠము .
స్వీకారం సార్థకం కర్తుం గోకులే యత్ కృతం పురా !
కంసభీతిచ్ఛలేనైవ గోకులాగమనం హరేః॥
ప్రతిజ్ఞాపాలనార్థాయ భయేశస్య భయం కుతః ।
పూర్వము తపస్సు చేసిన వారి ప్రార్థనను స్వీకరించీ నందున దానిని సార్థకము చేయుటకు కంసుని భయమన్నది ఒక మిషగా (బయటకు చెప్పు కారణము) చేసి వరదానమన్న ప్రతిజ్ఞను పాలించుటకే శ్రీహరి గోకులమునకు వచ్చినాడు. భయమునే శాసించు స్వామికి ఇతరుల వలన భయమెక్కడిది.?
రాధాశబ్దస్యవ్యుత్పత్తిః సామవేదే నిరూపితా ॥
నారాయణస్తామువాత బ్రహ్మాజం నాభిపంకజే ।
బ్రహ్మా తాం కథయామాస బ్రహ్మలోకే చ శంకరం ॥
పురా కైలాస శిఖరే మామువాచ మ హేశ్వరః ।
దేవానాం దుర్లభం నంద నిశామయ వదామి తే ॥
రాధశబ్దము యొక్క వ్యుత్పత్తి (పదము యొక్క విశేషార్థము) సామవేదమున చెప్పబడినది. ఆ యర్థమును నారాయణుడు తననాభి కమలమందున్న బ్రహ్మకు చెప్పెను. ఆ బ్రహ్మ తన లోకమున శంకరునకు చెప్పెను. పూర్వము కైలాస పర్వత శిఖరము మీద మహేశ్వరుడు నాకు చెప్పెను. ఓ నందుడా ! దేవతలకు దుర్లభమైన ఆయర్థమును నీకు చెప్పెదను వినుము.
సురాసురమునీంద్రాణాం వాంఛితాం ముక్తిదాం పరాం ।
శ్రేష్ఠమై ముక్తినిచ్చు దీనిని సురలు అసురులు మునీంద్రులు వాంఛింతురు (తెలిసి కొనగోరుదురు)
రేఫోహి కోటి జన్మాఘం కర్మభోగం శుభాశుభం ॥
ఆకారో గర్భవాసం చ మృత్యుం చ రోగముత్సృజేత్ ।
ధకార ఆయుషోహానిమాకారో భవబంధనం ॥
శ్రవణ స్మరణోక్తిభ్యః ప్రణశ్యతి న సంశయః ।
“ర” కారము జన్మపరంపర వలన ఏర్పడు పాపమును పుణ్యపాప కర్మల వలన కలుగు న్వర్గ నరక రూపమైన శుభాశుభములను తెలుపును. “ఆ” కారము. గర్భవాసము (జన్మ) మృత్యువు (మరణము) రోగములను తొలగించుటను తెలుపును. "ధ” కారము ఆయుష్య హానిని, (ఆత్మదేహసంబంధముతో నుండు స్థితి నశించుట) దానిమీది “ఆ” కారము జీవునకు అనాది నుండి ఉన్న సంసార బంధము నశించుటను తెలుపును. ఇట్టి “రాధ” శబ్దమును విన్నను స్మరించిసను ఉచ్చరించినను భవబంధము నశించును (ఇదియొక అర్ధము).
రేపో హి నిశ్చలాం భక్తిం దాన్యం కృష్ణపదాంబుజే ॥
సర్వేప్సితం సదానందం సర్వసిద్ధౌఘమీశ్వరం ।
ధకారః నహవాసం చ తత్తుల్యకాలమేవ చ ॥
దదాతి సార్షి సారూప్యం తత్త్వజ్ఞానం హరేః సమం ।
ఆకార స్తేజసాం రాశిం దానశక్తిం హరౌ యథా ॥
యోగశక్తిం యోగమతిం సర్వకాలం హరిస్కృతిం ।
శ్రత్యుక్తిన్మరణోద్యోగాన్మోహజాలం చ కిల్బిషం ॥
రోగశోకమృత్యుయమా వేపంతే నాత్ర సంశయః ।
“ర” కారము శ్రీకృష్ణ పాదపద్మములందలి నిశ్చలమైన దాస్య భక్తిని, ఎల్లరచే కోరబడు సదానందమును, అణిమ మొదలగు సర్వసిద్ధులను, పరమాత్మను చెప్పును. “ధ' కారము కాలతత్త్యమున్నంతవరకు జీవునకు పరమాత్మతో కలిసి వసించు స్థితిని, సాలోక్య సారూప్యములను, శ్రీహరితో సమమైన తత్త్వజ్ఞానమును ఇన్నింటిని ఇచ్చుటను తెలుపును. “ఆ కారము శ్రీహరియందున్నట్లు యోగధారణ బుద్ధిని, దాని వలన కలు యోగశక్తిని, తేజస్సును, సర్వకాలము హరిస్మృతిని ఇచ్చుటను తెలుపును. ఇంత శక్తి గల “రాధ” శబ్దమును వినుట వలన పలుకుట వలన స్మరించుట వలన ఆ పనులకు ప్రయత్నించినందు వలన అజ్ఞాన సమూహము పాపరాశి రోగములు శోకములు మృత్యువు యముడు వణకిపోదురు. ఇందు ఎట్టి సందేహము లేదు .
రాధామాధవయోః కించిద్వ్యాఖ్యాసం చ యతః శ్రతం ॥
తదుక్తం చ యథాజ్ఞాసం సాకల్యం వక్తుమక్షమః ।
ఆరాత్ బృందావనేనంద వివాహాఽ భవితాఽ నయోః ॥
పురోహితో జగద్ధాతా కృత్వాగ్నిం సాక్షిణం ముదా ।
రాధా మాధవుల యొక్క (రాధా, కృష్ణ అను శబ్దముల యొక్క) కొద్దిపాటి వీవరణమేది నేను వినియుంటినో దానిని నాకున్న జ్ఞానమును బట్టి నీకు చెప్పితిని. సంపూర్ణముగా చెప్పుటకు సమర్థుడను గాను. ముందు ముందు సృష్టికర్త యగు బ్రహ్మపురోహితుడుగా ఆనందముతో అగ్నిసాక్షిగా బృందావనములో ఈ యుభయుం (రాధాకృష్ణులు) వివాహము జరుగగలదు.
కుబేరపుత్రమోక్షం చ గవ్యస్యాహృత్య భక్షణం ॥
హింసనం ధేనుక స్యైవ కాననే తాలభోజనం ।
బకకేశి ప్రలంబానాం హింసనం చాధ లీలయా ॥
మోక్షణం ద్విజపత్నీనాం మిష్టాన్నపానభోజనం।
భంజనం శక్రయాగస్య శక్రాద్గోకుల రక్షణం ॥
గోపీనాం వస్త్రహరణం ప్రతసంపాదనం తథా ।
తాభ్యః పునర్వస్త్రదానం వరదానం యధేప్సితం ॥
చేతసాం హరణం తాసామయం వశ్యాః కరిష్యతి ।
రాసోత్సవం మహారమ్యం నర్వేషాం హర్షవర్ధనం ॥
పూర్ణచంద్రోదయే నక్తం వసంతే రాసమండలే ।
గోపీనాం నవసంభోగాత్కృత్వా పూర్ణం మనోరథం ॥
తాభస్సహ జలక్రీడాం కరిష్యతి కుతూహలాత్ ।
విచ్ఛేదోఽ న్య వర్షశతం శ్రీదామశావహేతుకం ॥
గోపాలైర్గోపికాభిశ్చ భవితా రాధయా సహ ।
మధురాగమనం తత్ర గోపీనాం శోక వర్ధనం ॥
పునః ప్రబోధనం తాసాం దానవధ్యాత్మికన్య చ ।
స్యందనాక్రూరయో రక్షాం సద్యస్తాభ్యాం కరిష్యతి ॥
(అవతార ప్రయోజనమైన దివ్యలీలను శ్రీకృష్ణ కథాసంగ్రహమును గర్గముని తెలుపుచున్నాడు). కుబేరుని పుత్రుల శాపమోక్షణము (మద్దిచెట్లు కూల్చుట) పాలు పెరుగు వెన్నెలు దొంగిలించి తినుట, ధేనుకాసుర సంహారము, అరణ్యమున తాళఫలములను భుజించుట, బకాసురుని, ప్రలంబాసురుని, గుఱ్ఱము రూపున వచ్చిన కేళి అను రాక్షసుని సంహరించుట, బ్రాహ్మణ స్త్రీలను (ముని పత్నులను) భర్తల నిర్బంధము నుండి విడిపించి వారిచ్చిన విందులు భుజించుట, ఇంద్రుని గురించీ గోపాలకులు తల పెట్టిన యాగమును ఆపుట, ఇంద్రుని వర్షబాధ నుండి గోకులమును రక్షించుట, గోపికల వస్త్రములపహరించుట, వారిచేత కాత్యాయనీ వ్రతము చేయించుట, వారికి తిరిగి వస్త్రము లిచ్చి వరము లిచ్చుట, వారి మనసులు హరించి వశము చేసికొనుట, మిక్కిలీ రమ్యమైన అందరికి పరమును వృద్ధి పరచునటువంటిదైన రాసోత్సవము, వసంతకాలమున రాత్రి నిండు చంద్రుడుదయించు వేళలో రానమండలమున నవ సంభోగములో గోపికల మనోరథములను దీర్చుట, ఆసక్తిగా వారితో కలిసి జలక్రీడలాడుట, శ్రీరాముని శాపమూలముగా గోలోకమందలి గోపాలకులను గోపికలను రాధను నూరు సంవత్సరములు వదిలి వియోగ మనుభవించుట, మధురకు ప్రయాణము, ఆకారణముగా గోపికలకు దుఃఖము పెరుగుట, వారికి ప్రబోధము చేసి అధ్యాత్మ విద్యనుపదేశించుట, అక్రూరునికి అతని రథాశ్వములకు వారిచేత పరిచర్యలు రక్ష ఏర్పరచుట, (అన్నవి గోకులముందు శ్రీకృష్ణుని బాలలీలలు).
రథమారోహణం కృత్వా మధురాగమనం పునః ।
పితృభాతృప్రజైస్పార్థం విలంస్య యమునాం ప్రజే ll
అక్రూరాయ జ్ఞానదానం దర్శయిత్వా న్వకం జలే ।
కౌతుకేన చ సాయాహ్నే నగరాత్సర్వదర్శనం ॥
మాలాకార తంతువాయకుబ్జానాం బంధమోక్షణం ।
ధనుర్భంగం శంకరస్య యోగస్థానప్రదర్శనం ॥
హింసనం గజమల్లానాం దర్శనం నృపతేః పురః ।
కంసన్య హింసనం సద్యః పిత్రోర్నిగడమోక్షణం ॥
ప్రబోధనం చ యుష్మాక ముగ్ర సేనాభి షేచనం ।
తన్య తన్య వధూనాం చ జ్ఞానాచ్ఛోకాపనోదనం ॥
అక్రూరుడు తనను తీసుకొని పోవుటకై తెచ్చిన రధము నెక్కి మధురా నగరికి పోవుట, తండ్రియగు నందుడు అన్నయగు బలదేవుడు గోపాలకులతో బాటు యమునా నదిని దాటుట, ఆ సందర్భమున యమున నీటిలో అక్రూరునకు తనను చూపుట, జ్ఞానబోధ చేయుట, నదిని దాటిన తరువాత సాయంకాల వేళలో మధురానగరమునంతటినీ దర్శించుట, మాలాకారుడు (పూలమాలలు సిద్ధము చేసి జీవించువాడు) తంతువాయుడు (వస్త్రములు నేసి జీవించువాడు) కుబ్జ (గూని పొట్టి ఐన గంధములు సిద్ధపరచు స్త్రీ) అను వారికి భవ బంధములు తొలగించుట, యాగమండపమును దర్శించి అందులో నున్న శివధనుస్సును విరచుట, కువలయాపీడమను గజమును చాణూర ముష్టికులను మలులను సంహరించుట, రాజదర్శనము చేయుట, కంసుని సంహరించుట, వెంటనే తల్లిదండ్రుల సంకెళ్లను విడిపించుట, మీకు (దేవకి వసుదేవులకు సందాదులకు జ్ఞానబోధ చేయుట, ఉగ్రసేనుని పట్టాభిషిక్తుని జేయుట, అతని భార్యలకు కోడండ్రకు జ్ఞానబోధ చేసి (కంసమరణము వలన కలిగిన) దుఃఖమును పోగొట్టుట (అన్నవి కుమార దశలో చేసిన కార్యములు) .
భ్రాతుః స్వస్యోపనయనం విద్యాదానం గురోర్ముఖాత్।
గురు పుత్రప్రదానం చ పునరాగమనం గృహే ॥
ఛలనం సృవ సైన్యానాం యవనస్య దురాత్మనః ।
నిర్మాణం ద్వారకాయాశ్చ ముచుకుందన్య మోక్షణం ॥
ద్వారకాగమనం చైవ యాదవైస్సహకౌతుకాత్ ।
స్త్రీ సంఘానాం విహరణం తాభిఃసార్థం చ క్రీడనం ॥
సౌభాగ్యవర్ధనం తాసాం పుత్ర పౌత్రాదికస్య చ ।
మణి సంబంధీనో మిధ్యాకలంకస్య చ మోక్షణం ॥
సాహాయ్యం పాండవానాం చ భారావతరణాధికం ।
నిష్పన్నం రాజసూయస్య ధర్మపుత్రస్య లీలయా ॥
పారిజాతస్య హరణం శక్రాహంకార మర్దనం ।
ప్రత పూర్ణం చ నత్యాయా బాణాన్య భుజకృంతనం॥
మర్ధనం శివ సైన్యానాం హరన్య జృంభణం పరం ।
హరణం బాణపుత్ర్యాశ్సైవానిరుద్ధన్య మోక్షణం ॥
వారాణస్యాశ్చ దహసం విప్రదారిద్ర్యభంజనం।
విప్రపుత్ర ప్రదానం చ దుష్టానాం దమనాదికం ॥
తీర్థయాత్రా ప్రసంగేన యుష్మాభిస్సహదర్శనం ।
కృత్వా చ రాధయా సార్థం వ్రజమాగమితా పునః ॥
ప్రస్థావయిత్వా ద్వారాం చ పరం నారాయణాంశకం ।
సర్వం నిష్పాదనం కృత్వా గోలోకం రాధయా సహా ॥
గమిష్యత్యేవ గోలోకం నాధోఽయం జగతాం పతిః ।
నారాయణశ్చ వైకుంఠం గమితాస్మ త్వయా సహ ॥
ధర్మగేహమృషీద్వౌ చ విష్ణుః క్షీరోదమేవ చ ।
ఇత్యేవం కధితం నంద భవిష్యం వేదనిర్ణయం॥
అన్నయగు బలరాముడు, తాను ఉపనయనము చేసికొనుట, సాందీపని గురువు ద్వారా విద్యాభ్యాసము చేయుట, ఆ గురువునకు చచ్చిన పుత్రులను బ్రతికించి యిచ్చుట, మరల మధురకు వచ్చుట, దుష్టుడైన యవనుని సైన్యములను వంచించుట, ముచుకుందునకు మోక్షప్రాప్తి, ద్వారకానగర నిర్మాణము, ఆసక్తితో యాదవ సమేతముగా ద్వారకా నగరమున ప్రవేశించుట, రాజస్త్రీలను వివాహమాడి వారితో క్లాపురము చేయుట, సౌభాగ్యవృద్ధి పుత్ర, పౌత్రవృద్ధి, శమంతకమణికి చెందిన అసత్యమైన అపవాదు వచ్చుట, దానిని తొలగించుకొనుట, పాండవులకు తోడుగా నిలుచుట, ధర్మరాజు యొక్క రోజసూయ యాగమును లీలగా నిర్వహించుట, భూభారమును తొలగించుట, పారిజాత వృక్షమును తెచ్చుట, ఇంద్రుని గర్వమణచుట, సత్యభామ వ్రతమును పూర్తిగావించుట, బాణాసురుని భుజములను నరికివేయుట, శివ సైన్యములను మర్దించి శివుని ఉద్రేకమునాపుట, బాణాసురుని బిడ్డతో బాటు ( ఉష) అనిరుద్ధుని బంధమును విడిపించీ తెచ్చుట, కాళీని కాల్చుట, కుచేల బ్రాహ్మణుని దారిద్ర్యమును పోగొట్టుట, మరియొక బ్రాహ్మణునికి చచ్చిన పుత్రులను తెచ్చియిచ్చుట, దుష్టజన సంహారము, తీర్థయాత్రలు చేయుట గోకులములోని నందయశోదలను దర్శించుట, రాధతో బాటు మరల ప్రజమునకు వచ్చుట, ద్వారకా నగర జననమునంతటీని ప్రయాణము చేయించుట, శ్రేష్టమైన నారాయణాంశతో భూలోకమున సర్వమునిట్లు నిర్వహించే ఈ నాధుడు (శ్రీకృష్ణుడు) జగన్నాధుడు రాధతో బాటు గోలోకమున కేగును. నీతో కలిసి నారాయణుడు వైకుంఠమును పొందును. (ఇక్కడ గోలోకమున జరుగ బోవునని చెప్పినాను) నరనారాయణ ఋషులిద్దరు ధర్మగేహమున కేగుదురు. విష్ణువు పాల సముద్రమునకేగును. ఓ నందుడా ! ఈ తీరుగా వేదముందు నిర్ణయించిన భవిష్యత్తు నీకు చెప్పబడినది.
శ్రూయతాం సాంప్రతం కర్మ యదర్ధo గమనం మమ ।
మాఘశుక్ల చతుర్ధశ్యాం కురు కర్మ శుభేక్షణే ॥
గురువారే చ రేవత్యాం విశుద్ధే చంద్రతారకే ।
చంద్ర స్థే మీన లగ్నే చ లగ్నేశపూర్ణదర్శనే ॥
వణిజేకరుణోత్కృష్ఠే శుభయోగే మనోహరే ।
సుదుర్లభే దీనే తత్ర సర్వోత్కృష్టోపయోగికే ॥
ఆలోచ్య పండితైస్సార్థం కురు కర్మముదాన్వితః ।
ఇత్యుక్త్వా బహిరాగత్య స ఉవాచ మునీశ్వరః॥
హృష్టో నందో యశోదా చ కర్మోద్యోగం చకార హ ।
ఓయీ ! ఎందుకొరకిక్కడకు నేను వచ్చినో దానిని వినుము. రాబోవు మాఘశుక్ల చతుర్దశినాడు శుభకాలమున (నీవీ బాలురకు అన్న ప్రాశస నామకరణములు అను) కర్మలు చేయుము. ఆనాడు గురువారము రేవతి నక్షత్రము, రేవతి శుద్ధమైన చంద్ర నక్షత్రము. చంద్రుడున్న మీనలగ్నమున లగ్ననాధుడు పూర్ణముగా దర్శనమగు దినమందు -ఉత్కృష్టమైన వణజీ యోగము మనోహరమైన శుభ యోగము కలిగియున్న సుదుర్లభమై అన్నిట శ్రేష్ఠమై ఉపయోగ కరమైన దినమున విద్వాంసులతో ఆలోచించి సంతోషయుక్తుడవై శుభకర్మ చేయుము అని చెప్పి గర్గమునీశ్వరుడు లోపలి యింటి నుండి బయటికి వచ్చెను. అది విని యశోదానందులు హర్షము పొంది ఆ శుభకార్యము చేయుటకు తగు ప్రయత్నములు చేసిరి.
ఏతస్మిన్నంతరే ద్రష్టుంగర్గం గోపాశ్చగోపికాః ॥
బాలకాబాలికాశ్సైవ ఆజగ్ముర్నంద మందిరం ।
దదృశు స్తే ముని శ్రేష్ఠం గ్రీష్మమధ్యాహ్న భాస్కరం ॥
శిష్యసం ఘైః పరివృతం జ్వలంతం బ్రహ్మతేజసా ।
గూఢయోగం ప్రవోచంతం సిద్ధాయ వృచ్ఛతే ముదా ॥
పశ్యంతం సస్మితం వందభవనానాం పరిచ్ఛదం ।
స్వర్ణ పింహాసనస్థం చ యోగముద్రాధరం వరం ॥
భూతం భవ్యం భవిష్యం చ పశ్యంతం జ్ఞాన చక్షుషా ।
హృదీశ్వరం ప్రపశ్యంతం సిద్ధం మంత్ర ప్రభావతః ॥
బహిర్యశోదాక్రోడస్థం తాదృశం సస్మితం శిశుం ।
మహేశదత్త ధ్యానేన యద్రూపం చ నిరూపితం ॥
తం దృష్ట్వా పరమప్రీత్యా పూర్ణభూత మనోరథం ।
సాశ్రునేత్రం పులకితం నిమగ్నం భక్తి సాగరే॥
హృది పూజాం ప్రణామం చ కుర్వంతం యోగచర్యయా ।
మూర్ధ్నా ప్రణేముస్తే తం చ స చ తానాశిషం దదౌ ॥
ఇంతలో గర్గమునిని దర్శించుటకై గోపాలకులు గోపికలు బాలబాలికలు నందమందిరమునకు వచ్చిరి. గ్రీష్మఋతువులో మిట్ట మధ్యాహ్నము వెలుగుచున్న సూర్యుని తేజస్సుతో నతడు వెలుచుండెను. నందుని భవనములలోని అలంకార సామగ్రిని చిరునవ్వుతో చూచుచుండెను. యోగముద్ర ధరించి స్వర్ణసింహాసనము పై కూర్చుండి యుండెను. భూత భవిష్యత్తులను అప్రత్యక్షముగా నున్న వర్తమానమును జ్ఞాన నేత్రముతో చూచుచుండెను. మంత్రజవశక్తి వలన హృదయమున స్థిరపడి యున్న భగవంతుని చూచుచుండెను. బయట యశోద ఒడిలోనున్న తన హృదయముందున్నట్లే చిరునవ్వుతో నున్న శిశువును తన గురువగు మహేశ్వరుడొసగిన యోగము వలన ఏ రూపమును తాను చూడగలెనో అట్టి భగవంతుని దర్శించి నిండు తృప్తితో తన మనోరథము నెరవేరగా, పులకాంకురములు ఆనంద బాష్పములు కలవాడై భక్తి సాగరమున మునిగియున్న వానిని ధ్యాన యోగములో హృదయమందలి స్వామికి పూజను ప్రణామములను చేయుచున్న పానిని ఇటువంటి గర్గుని దర్శించి వారు (గొల్లలు) అతనికి ప్రణామములు చేసిరి. అతడు వారికాశీస్సులిచ్చెను.
ఆననస్థో మునిస్తస్థౌ తే జగ్ముః స్వాలయం ముదా ।
మునీ ఆసనముందుండెను. వారు తమతమ యిండ్లకు పోయిరి.
నంద స్త్వానంద యుక్తశ్చ బంధూన్ మంగల పత్రికాః ॥
ప్రస్థాపయామాన శీఘ్రమారాద్దూరస్థితాన్ ముదా।
నందుడానంద పూర్ణుడై అంతట దూరమందున్న బంధువులకు శుభపత్రికలు వ్రాయించి దూతలను పంపెను.
దధికుల్యాం దుగ్థకుల్యాం ఘృతకుల్యాం ప్రపూరితాం ॥
గుడకుల్యాం తైలకుల్యాం మధుకుల్యాం చ విస్తృతాం ।
నవనీతకుల్యాం పూర్ణాం చ తక్రకుల్యాం యదృచ్ఛయా ॥
శర్కరోదకకుల్యాం చ పరిపూర్ణాం చ లీలయా ।
తండులానాం శాలీనాముచ్చైశ్చ శతపర్వతాన్ ॥
పృధుకానాం శైలశతం లవణానాంచ నప్తచ ।
నప్తశైలాన్ శర్కరాణాం లడ్డుకానాం చ సప్త చ ॥
పరిపక్వఫలానాం చ తత్ర షోడశ పర్వతాన్ ।
యవ గోధూమ చూర్ణానాం పక్వల డ్డుక పిండకాన్ ॥
మోదకానాం చ శైలం చ స్వస్తికానాం చ పర్వతాన్ ।
కవర్ధకానామత్యుచ్ఛైఃశైలాన్ సప్త చ నారద ॥
కర్పూరాదిక యుక్తానాం తాంబూలానాం చ మందిరం ।
విస్తృతం ద్వారహీసం చ వాసితోదక సంయుతం ॥
చందనాగురు కస్తూరీ కుంకుమేన సమన్వితం ।
నానావిధాని రత్నాని స్వర్ణాని వివిధాని చ ॥
ముక్తాఫలాని రమ్యాణి ప్రవాలాని ముదాఽన్వితః ।
నానావిధాని చారూణి వాంసాసి భూషణాని చ ॥
పుత్రాన్నప్రాశనే నందః కారయామాన కౌతుకాత్ ।
కుమారుని అన్నప్రాశన సందర్భమున నందుడు ఆసక్తితో పెరుగు పాలు నెయ్యి బెల్లము నూనె తేనే వెన్న మజ్జిగ శర్కరాజలపానకము అను పదార్ధములను విస్తారమైన కాల్వలలో (ఈనాటి ట్యాంకుల వంటి వాటిలో) నిండుగా నింపించెను. శాలి తండులములు (మేలిమి బియ్యము) ఎలైన నూరు పర్వతములు, రాసులు) అటుకులు నూరు పర్వతములు (రాసులు), అన్నిరకముల లవణములు ఏడు పర్వతములు, రాసులు) శర్కర యొక్క పర్వతరాసులు ఏడు, లడ్డూల పర్వతరాసులు ఏడు, పండిన పండ్లు పదహారు పర్వతరాసులు, జవ్వలపిండితో గోధుమల పిండితో వండిన లడ్డూలు అరి సెలు పర్వతమంతటి రాసులు, స్వస్తికమను పిండివంటలు అనేక పర్వతములు (రాసులు) కవర్ధకములను పర్వతరాసులేడు సిద్ధము చేయించేను.
గంధచూర్ణమీశ్రీతమై పరిమళించుచున్న మంచినీటితోను చందనము అగురు కస్తూరీ కుంకుమ పువ్వు వంటి పరీమళ పదార్థముల లోను నిండి కర్పూరాది తాంబూల ద్రవ్యములు గల ఒక విస్తార మందిరము ద్వారములు లేకుండ ఏర్పాటు చేయబడెను, నానావిధ రత్నములు బంగారము ముత్యములు అందమైన పగడములు సంతసముతో సమకూర్చబడెను. నానావిధములైన సుందర వస్త్రములు ఆభరణములు సిద్ధపరచెను.
సంస్కారయుక్తం రుచిరం చందనద్రవచర్చితం॥
ప్రాంగణం కదలిస్తంబైః రసాలనవపల్లవైః ।
గ్రధితైః సూక్ష్మవస్త్రేణ వేష్టయామాస కౌతుకాత్ ॥
యుక్తం మంగళకుంభైశ్చ ఫల పల్లవ సంయుతైః ।
చందనాఽ గురు కంతూరీ పుష్పమాలా విరాజితైః ॥
మాల్యానాం వరవస్త్రాణాం రాశిభిశ్చ విరాజితం ।
గవాం చ మధుపర్కాణామాననానాం చ నారద ॥
ఫలానాం జలకుంభానాం సమూహైశ్చ సమన్వితం ।
నానా ప్రకారైక్వాద్యైశ్చ దుర్లభైః నుమనోహరైః ॥
ఢక్కానాం దుందుభినాం చ పటహానాం తదైవ చ ।
మృదంగ మురజాదీవామానకానాం సమూహాకైః ॥
వంశీ సన్నహనీకాంస్యశరయంత్రైశ్చ శబ్దితం ।
విద్యాధరీణాం నృత్యేన భృంగిమాభ్రమణేన చ ॥
గంధర్వనాయకానాం చ సంగీతైర్మూర్ఛనా యుతైః ।
స్వర్ణ సింహాసనానాం చ రథానాం నిఃస్వనైర్యుతం ॥
భవనము యొక్క ముందు భాగమున (వాకిలి) చక్కగా కనపూడ్చి సుందరముగా చందనద్రవముతో అలికి అరటి బోదెలు నిలిపి సన్నని వస్త్రముతో గ్రుచ్చి లేత మామిడి ఆకుల తోరణములను అంతట వేలాడదీసెను. పండ్లు చిగుళ్లు చందనము అగురు కస్తూరీ పూల మాలలతో అలంకరించిన మంగళ పూర్ణకుంభములు అక్కడ పెట్టబడెను, పుష్పమాలలు ఉత్తమ వస్త్రములు రాసులు రాసులుగా (ఇంటిలో) విరాజిల్లుచుండెను. మధుపర్క ద్రవ్యములు (అతిథుల కొరకు) ఉత్తమాసనములు ఫలములు జలకుంభములు రాసులుగా నుండెను, కనులకు చూడముచ్చటగా నున్న అనేకరకములైన ఇతరత్ర లభించనీ వాద్యములు, ఢక్కలు దుందుభులు (నగారాలు) పటహాములు తప్పెటలు) మద్దెలలు మురజములు కొమ్ము వాద్యములు పిల్లన గ్రోవులు బూరలు కంచు తాళములు శరయంత్రములు మ్రోగించబడు చుండెను. విద్యాధర స్త్రీలు సృత్యము చేయు తుమ్మెదల వలె పొడుచు గుండ్రముగా తిరుగుచుండిరి. గంధర్వ నాయకులు రాగతాళములతో సంగీతము పాడుచుండిరి. స్వర్ణ సింహాసనము సమకూర్చుట రథములు తిరుగుట వలన పెద్ద ధ్వనీ ఎర్పడెను.
ఏతస్మిన్నంతరే నందమువాచ వాచకో ముదా ।
ఆజగ్ముర్వల్లెవేంద్రాశ్చ బాంధవా వల్లవాస్తథా ॥
అశ్వస్థాశ్చ గజస్థాశ్చ రథస్థాశ్చేతి సత్వరం ।
ఆజగ్మూరాజపుత్రాశ్చ రత్నాలంకారభూషితాః ॥
ఆగతో గిరి భానుశ్చ సస్త్రీకశ్చ సకింకరః ।
రధానాం చ చతుర్లక్షం గజానాం చ తథైవ చ ॥
తురంగమానాం కోటీశ్చ శిబికానాం తథైవచ ।
ఋషీంద్రాణాం మునీంద్రాణాం విప్రాణాం చ విపశ్చితాం ॥
వందినాం భిక్షుకాణాం చ సమూ హైశ్చ సమీపతః ।
గోపానాం గోపికానాం చ సంభ్యాం కర్తుం చ కః క్షమః ॥
పశ్యాగత్య బహిర్భూయేత్యువాచ ప్రాంగణే స్థితః ।
ఇంతలోనొక వార్తాహరుడు (బయటీచార్తలు చెప్పువాడు) సంతసముతో వచ్చి "అయ్యా! మీ బంధువులు గోపాలరాజులు గోపాలురు గుఱ్ఱముల మీద, ఏనుగుల మీద, రథముల మీద చేర వచ్చినారు. రత్నాలంకార భూషితులైన రాజ కుమారులు కూడ చేరవచ్చినారు. గీరిభానుడు తన అంతఃపుర స్త్రీలను దాసదాసీ జనమును అనేకములైన రథములను ఏనుగులను గుఱ్ఱములను పల్లకీలను వేలకు మించి తీసుకొని వచ్చినాడు. ఋషీంద్రులు ముని గణములు విద్వాంసులైన బ్రాహ్మణోత్తములు వంటిజసము (స్తోత్రములు చేయువారు) భిక్షకులు గుంపులు గుంపులుగా వచ్చినారు. ఇక గోపాల గోపికాజసము యొక్క సంఖ్యను లెక్కించుటకు ఎవరి తరము! నీవు బయటకు వచ్చి చూడవలసినది" అని విన్నవించెను .
శ్రుత్యైవం తానుపవ్రజ్య సమానీయ ప్రజేశ్వరః ॥
ప్రాంగణే వాసయామాస పూజయామాస సత్వరం ।
ఋష్యాదిక సమూహం చ ప్రణమ్య శిరసా భువి ।
పాద్యాదికం చ తేభ్యశ్చ ప్రదదౌ నుసమాహితః ॥
వస్తుభిః బంధుభిః పూర్ణం బభూవ నందగోకులం ।
న కోఽపి కస్య శబ్ధం చ శ్రోతుం శక్తశ్చ తత్ర వై ॥
త్రిముహూర్తం కుబేరశ్చ శ్రీకృష్ణ ప్రీతయే ముదా ।
చకార స్వర్ణవృ ష్ట్యా చ పరిపూర్ణం చ గోకులం ॥
కౌతుకాపహ్నవం చక్రుర్బంధువర్గాశ్చ క్రీడయా ।
ఆనమ్రకంధరాన్సర్వే దృష్ట్యా నందస్య సంపదం ॥
ఆ మాట విని గోకుల రాజు (నందుడు) వారీనెదుర్కొని తీసుకొని వచ్చి తన ప్రాంగణములో కూర్చుండబెట్టి పూజామర్యాదలు చేసెను. ఋష్యాది గణములకు సాష్టాంగ నమస్కారములు చేసి శ్రద్ధతో వారికి పాద్యము మధుపర్కము మొదలగునవి సమర్పించెను, ఆ నందుని గోకులమంతయు సమకూర్చిన వస్తువులతో (పదార్దములతో) బంధువులతో నిండిపోయెను. ఒకరి మాట ఇంకొకరికి వినరానంత సందడిగా నుండెను. ఆ సమయమున కుబేరుడు శ్రీకృష్ణ ప్రీతి కొరకు సంతసముతో మూడు ముహూర్తముల కాలము బంగారు వాస కురిపించి గోకులమును పరిపూర్ణ మొనర్చెను. వచ్చిన బంధు వర్గము ఒక క్రీడగా నందుని సంపదను తలలు వంచి చూచి వేడుకను ఆశ్చర్యమును నటించిరి .
నందః కృతాహ్నికః పూతో ధృత్వా ధౌతే చ వాససీ ।
చందనాగురుకస్తూరీ కుంకుమేనైవ భూషితః ॥
ఉవాస పాదౌ ప్రక్షాళ్య స్వర్ణపిఠే మనోహరే ।
గర్గస్య చ మునీంద్రాణాం గృహీత్వాఽ జ్ఞాం వ్రజేశ్వరః ॥
ప్రజ (గోకులమునకింకొక పేరు) నాధుడగు నందుడు స్నానమాడి ఉతికి ఆరవేసిన రెండు వస్త్రములు (దోవతి పై పంచె) ధరించి చందనము అగురు కస్తూరీ కుంకుమ పువ్వుల గంధములతో అలంకరింపబడినవాడై దినకృత్యములైన పూజాదులు చేసి పాదప్రక్షాళనము. చేసికొని గర్గముని యొక్క ఇతర ముని గణముల యొక్కయు ఆజ్ఞ తీసుకొని న్వర్లపీఠముపై శుభకర్మ చేయుటకై కూర్చుండెను.
సంస్కృత్య విష్ణుమాచాంతః స్వస్తివాచనపూర్వకం।
కృత్వా కర్మ చ వేదోక్తం భోజయామాన బాలకాన్ ॥
గర్గవాక్యానుసారేణ బాలకస్య ముదాన్వితః ।
కృష్ణేతి మంగలం నామ రరక్ష చ శుభేక్షణే ॥
సఘృతం భోజయిత్వా చ కృత్వానామ జగత్పతేః ।
వాద్యాని వాదయామాస కారయామాస మంగళం॥
నానావిధాని స్వర్ణాని ధనాని వివిధాని చ।
భక్ష్య ద్రవ్యాణి వాంసాని బ్రాహ్మణేభ్యో దదౌ ముదా ॥
వందిభ్యో భిక్షుకేభ్యశ్చ సువర్ణం విపులం దదౌ ।
భారాక్రాంతాశ్చ తే సర్వే న శక్తుం గంతుమేవ చ ॥
బ్రాహ్మణాన్ బంధువర్గాంశ్ప భిక్షుకాంశ్చ విశేషతః ।
మిష్టాన్నం భోజయామాన పరిపూర్ణం మనోహరం ॥
దీయతాం దీయతాం చైవ ఖాద్యతాం ఖాద్యాతామితి ।
బభూవశబ్దోఽత్యుచ్చైశ్చ సతతం నందగోకులే ॥
మూడు మారులు ఆచమనము చేసి (అరచేతి గుంటలో నీరు పోసుకోని పుచ్చుకొనుట) గోవింద నామముస్మరించి వేదమంత్రములతో శాక్తముగా పుణ్యాహవాచనము చేసి బాలకుల సమూహమునకు భోజనము పెట్టించేను. సంతసముతో గర్గముని మాటననుసరించి శుభముహూర్తమున బాలకునికి కృష్ణ అను మంగళనామకరణము చేసి రక్ష కల్పించెను. జగత్పతియైన ఆ శిశువునకు సోమకరణము చేసి నెయ్యి తేనేతో బాటు భోజనము (అన్నప్రాశనము) పెట్టెను. మంగళవాద్యములు మ్రోగింప జేసెను. బ్రాహ్మణులకు వస్త్రములను భోజన పదార్థములను నానావిధములైన స్వర్ణాభరణములను ఇతర ధనములను దానము చేసెను. వందిమాగధులకు భిక్షుకులకు విస్తారముగా బంగారమిచ్చెను. మోయలేని ఆ ధనముతో వారు తిరిగి తమ స్థానములకు పోవుటకశక్తులైరి. బ్రాహ్మణులను బంధు వర్గమును భిక్షుకులను కన్నులకింపైన పక్వాన్నముతో నిండుగా భుజింపజేసెను. పెట్టండి పెట్టండి, తినండి తినండి అన్న శబ్దము ఎడతెగకుండ ఆ నంద గోకులములో పెద్దగా వినిపించెను.
రత్నాని పరిపూర్ణాని వాసాంసి భూషణాని చ ।
ప్రవాలాని సువర్ణాని మణి సారాణి యాని చ ॥
చారూణి స్వర్ణపాత్రాణి కృతాని విశ్వకర్మణా ।
గత్వా గర్గాయ వినయం చకార వ్రజపుంగవః ॥
శిష్యేభ్యః స్వర్ణభారాణి ప్రదదౌ వినయాన్వితః ।
ద్విజేభ్యోఽవ్యవశిష్టేభ్యః పరిపూర్ణాని నారద॥
ఆ ప్రజ నాధుడు రత్నములను వస్త్రములను బంగారు ఆభరణములను పగడములను శ్రేష్ఠములైన మణులను విశ్వకర్మ చేసిన సుందర స్వర్ణపాత్రలను గర్గముని వద్దకు తీసుకొని వెళ్లి భక్తితో సమర్పించి వినయము ప్రకటించెను. అంతే వినయముతో బంగారు మూటలను అతని శిష్యులకు దానమిచ్చెను. మిగిలిన బ్రాహ్మణ వర్గమునకును పరిపూర్ణముగా దానములు చేసెను.
శ్రీ నారాయణ ఉవాచ :-
గృహీత్వా శ్రీహరిం గర్గో జగామ నిభృతం ముదా ।
తుష్టావ పరయా భక్త్యా ప్రణమ్య చ తమీశ్వరం ॥
సాశ్రునేత్రః సపులకో భక్తి నమ్రాత్మకంధరః ।
పుటాంజలీయుతో భూత్వోవాచ కృష్ణ పదాంబుజే ॥
నారాయణ ఋషి పలికెను :-
ఆ తరువాత గర్గమహాముని సంతనముతో శ్రీకృషసత్మకొని ఏకాంత ప్రదేశమునకు పోరు ఆ ప్రభువునకు నీండు భక్తితో నమస్కరించి స్తోత్రము చేసెను. శరీరమున పులకలెత్తగా కన్నుల నానంద బాష్పములు రాగా శ్రీకృష్ణుని పాద పద్మములపై భక్తితో శిరస్సునానీంచి చేతులు జోడించి ఇట్లు ప్రార్ధించెను.
శ్రీ గర్గ ఉవాచ :-
హే కృష్ణ జగతాం నాథ భక్తానాం భయభంజన ।
ప్రసన్నో మామీశ దేహి దాన్యం పదాంబుజే ॥
గర్గమహాముని యిట్లు పలికెను :-
ఓ జగన్నాథా ! భక్తుల భయములను నశింపజేయు శ్రీకృష్ణా ! నీవు నాయందనుగ్రహము గలవాడవు కమ్ము. నీ పాద పద్మములందు దాస్యము నాకిమ్ము .
త్వత్సిత్రా మే ధనం దత్తం తేన మే కిం ప్రయోజనం।
దేహి మే నిశ్చలాం భక్తిం భక్తానామభయప్రద ॥
భక్తుల కభయమొసంగు స్వామీ ! నీ పెంపుడు తండ్రి నాకు ధనమిచ్చినాడు. దానితో నాకేమి ఉపయోగము. నాకు నీయందు నిశ్చలమైన భక్తిని ఇమ్ము .
అణిమాదిక సిద్ధిషు యోగేషు ముక్తిపు ప్రభో।
జ్ఞాన తత్త్వేఽమరత్వే వా కించిన్నాస్తి స్పృహా మమ ॥
ఓ ప్రభూ! యోగము వలన సిద్ధించు అణిమాద్యష్ట సిద్ధుల మీదగాని, ముక్తిమీదగాని, జ్ఞాన తత్త్వమందు గాని, దేవతాదశయందు గాని నాకు కొంచెము కూడ కోరిక లేదు .
ఇంద్రత్వే వా మనుత్వే హ స్వర్గలోకవలే చిరం।
నాస్తి మే మనసో వాంఛ త్వత్పాదసేవనం వినా ॥
ఇంద్రి పదవి యందు గాని చాలకాలమనుభవించదగిన స్వర్గలోక ఫలముందు గాని, మనువుల పదవి యందు గాని నా మనస్సున వాంఛ లేదు. కేవలము నీ పాద సేవయే నాకు కావలసినది .
సాలోక్యసార్షి సారూప్యే సామీ ప్యైకత్వమీప్సితం ।
నాహం గృహ్ణేమి తే బ్రహ్మంస్త్వత్పాద సేవనం వినా ॥
స్వామీ! నీ పాదములను సేవింపవలయునని తప్ప ఇతరమైన సాలోక్యసారూప్య సామీప్య సాయుజ్యములన్న మోక్ష దశలను పొందు కోరికయు నాకు లేదు. నేనవి స్వీకరింపను
గోలోకే వాపి పాతాలే వాసే నాస్తి మనోరథః।
కింతు తే చరణాంభోజే సంతతం స్కృతీరస్తు మే ॥
పాతాళమందు గాని గోలోకమందు గాని నివసించవలయునన్న మనోరథము నాకు లేదు. ఇక నాకెడతెగని స్మృతి నీ పాదపద్మములందే నిలచియుండు గాక .
త్వన్మంత్రం శంకరాత్ర్పాప్య కతిజన్మ ఫలోదయాత్ ।
సర్వజ్ఞోఽహం సర్వదర్శీ సర్వత్ర గతిరస్తు మే ॥
ఎన్ని జన్మల సుకృత ఫలము మూలముగానో శంకరుని నుండి నీ మంత్రమును పొందితిని. ఇక నిన్ను గూర్చిన సర్వతత్వము తెలిసెడి స్థితి గలవాడనై అన్నిటి యందు నిన్ను చూచువాడనై అంతట సంచరించెడి శక్తి నాకనుగ్రహించుము .
కృపాం కురు కృపాసింధో దీనబంధో పదాంబుజే ।
రక్ష మా మభయందత్వా మృత్యుర్మే కింకరిష్యతి ॥
ఓ దయాసముద్రారా ! దీనబంధూ ! నాకభయమిచ్చి నీ పాదపద్మములందు భక్తిని కృపచేయుము. ఇక నన్ను మృత్యువేమీ చేయగలును ?
సర్వేషామీశ్వరః సర్వస్త్వత్పాదాంభోజ సేవయా ।
మృత్యుంజయోఽoతకాలశ్చ బభూవ యోగినాం గురుః ॥
శంకరుడు నీ పాద పద్మములను సేవించుట వలన సర్వదేవతలకు ఈశ్వరుడు, మృత్యువును జయించిన వాడు, కాలునకే (యమునికి అంతకుడు యోగిజనులకు గురువును ఐనాడు.
బ్రహ్మా విధాతా జగతాం త్వత్పాదాంభోజ సేవయా ।
య స్యైక దివసే బ్రహ్మన్ పతంతీంద్రాశ్చతుర్ధశ ॥
ఓ పరంబ్రహ్మా ! ఎవని ఆయువులో ఒక్కదినమునే పదునాలుగు ఇంద్రులు పడిపోదురో అట్టి చతుర్ముఖ బ్రహ్మ నీపాద పద్మములను సేవించినందువలననే ఈ జగత్తులకు సృష్టికర్త ఐనాడు .
త్వత్పాద సేవయా ధర్మః సాక్షీ చ సర్వకర్మణాం ।
పాతా చ ఫలదాతా చ జిత్వా కాలం సుదుర్జయం॥
నీ పాద సేవ వలననే ధర్మదేవత జీవకోటి యొక్క సర్వకర్మలకు సాక్షియై జయించే శక్యము గాని కాలమునే జయించి జీవరక్షకుడును పుణ్యపాపకర్మల ఫలమిచ్చువాడును ఐనాడు.
సహస్ర వదనః శేషో యత్పాదాంబుజ సేవయా ।
ధత్తే సిద్ధార్ధవద్విశ్వం శివః కంఠే విషం యధా ॥
వేయి ముఖములు గల ఆదిశేషుడు నాగరాజు) నీ పాదపద్మములను సేవించినందువలననే లోకకల్యాణము కొరకు గాను శివుడు తనే గళమున విషము ధరించిన విధముగా ఆ కర్మచేత తాను ధన్యుడైనట్లు భావించి ఈ విశ్వమంతటిని తన తలల పై మోయుచున్నాడు .
నర్వసంపద్విధాత్రి యా దేవీనాం చ పరాత్పరా ।
కరోతి సతతం లక్షిః కేశైస్త్వత్పాదమార్జనం ॥
నీ దేవీ గణములో సర్వశ్రేష్ఠురాలును జగములకు సర్వసంపదలు కల్గించునదియు నగు లక్ష్మీదేవి తన తలవెండ్రుకలతో నీ పాదములను తుడుచుచున్నది.
ప్రకృతిర్బీజరూపా సా సర్వేషాం శక్తిరూపిణీ ।
స్మారంస్మారం త్వత్పదాబ్జం బభూవ తత్పరా వరా॥
సమస్త జగములకు జీవకోటికీ బీజరూపిణి (విత్తనము ఐనది)యు శక్తిస్వరూపిణి ఐన మూల ప్రకృతి నీపాదపద్మములను స్మరించి స్మరించి తనకు నియమించిన కార్యమునందు శ్రద్ధగలికియున్నది కదా.
పార్వతీ సర్వరూపా సా సర్వేషాం బుద్ధిరూపిణి ।
త్వత్పాద సేవయా కాంతం లలాభ శివమీశ్వరం ॥
సర్వదేవ స్త్రీ స్వరూపిణి ప్రాణులకు బుద్ధిశక్తిరూపిణి ఐన పార్వతీదేవి నీ పాద పద్మములను సేవించుట వలననే మంగళుడైన పరమేశ్వరుని తన ప్రియునిగా (పతి) పొందగలిగినది.
విద్యాధిష్ఠాత్రీ దేవీ యా జ్ఞానమాతా సరస్వతీ ।
పూజ్యా బభూవ నర్వేషాం సంపూజ్య త్వత్పదాంబుజం ॥
సర్వవిద్యలకు అధిష్టాన దేవత (నాయకురాలు) జ్ఞానరూపిణి యైన తల్లి (జ్ఞానము కల్గించునది) యగు సరస్వతీ దేవి ని పాదాంబుజమును సేవించియే సర్వజీవులకు పూజ్యురాలైనది .
సావిత్రీ వేద జననీ వునాతి భువన త్రయం।
బ్రహ్మణో బ్రాహ్మణానాం చ గతిస్త్వత్పాద సేవయా ॥
నీ పాదములను సేవించిన కారణముగానే వేదమాత యగు సావిత్రీ దేవి (గాయత్రీ మాత) ముల్లోకములను పవిత్రమొనర్చుచున్నది. బ్రహ్మకు (సృష్టికర్తకు) బ్రాహ్మణ వర్గమునకు నీ పాద సేవచేతనే తమ వీధినిర్వహణ సాగుచున్నది.
క్షమా జగద్భిభర్తుం చ రత్నగర్భా వసుంధరా ।
ప్రసూతిః సర్వసస్యానాం త్వత్పాదపద్మసేవయా ॥
రత్నములు తన గర్భమున గలదియు సర్వవిధములైన పంటలను జనింపజేయునదియు అగు భూదేవి నీపాద పాద పద్మముల సేవ వలననే ఈ జగత్తును మోయుటకు సమర్ధురాలగుచున్నది .
రాధా మమాంశ సంభూతా తమ తుల్యా చ తేజసా।
స్థిత్వా వక్షసి తే పాదం సేవతేఽ న్యన్య కా కథా ॥
నా జ్ఞానాంశతో అవతరించినదియు తేజస్సుతో నీకు సాటియైనదియునగు రాధాదేవి నీ హృదయమున స్థానము సంపాదించియు నీపాద సేవ చేయుచున్నది. ఇక ఇతరుని మాట యేమి చెప్పలెను.
యధా శర్వాదయో దేవా దేవ్యః పద్మాదయో యథా ।
సనాధం కురు మామీశ ఈశ్వరస్య సమాకృపా ॥
న యాస్యామి గృహం నాధ న గృహ్ణమీ ధనం తవ।
కృత్వా మాం రక్ష పాదాబ్ద సేవాయాం సేవకం రతం ॥
ఓ ప్రభూ! శివుడు మొదలగు దేవగణములు లక్ష్మి మొదలగు దేవీ గణములు ఎటు నీ వలన నాధుడు గలవారైనారో అట్లే నన్ను నాథవంతుని (నాథుడు గలవానినిగా జేయుము. పరమేశ్వరుడవగు నీ కృప నీ స్థాయికి సమానముగా నుండవలెను కదా ! స్వామీ ! నీ ధనమును స్వీకరించి ఇంటికి వెళ్లను. నీ పాద పద్మ సేవయందు అత్యాసక్తి గల సేవకునిగా నన్ను చేసి రక్షింపుము.
ఇతి స్తుత్వా సాశ్రునేత్రః పపాత చరణే హారేః ।
రురోద చ భృశం భక్త్యా పులకాంచితవిగ్రహః ॥
ఇట్లు (గర్గముని) స్తోత్రము చేసి కన్నుల నీరు బెట్టుకొని శ్రీహరి పాదముల మీద పడెను. శరీరము పులకరించగా భక్తితో మిక్కిలి దుఃఖించెను
గర్గస్య వచనం శ్రుత్వా జహాన భక్తవత్సలః ।
ఉవాచ తం స్వయం కృష్ణో మయి తే భక్తిరస్త్వితి ॥
భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు గర్గుని వాక్కులు విని నవ్వి అతనితో “నాయందు నీకు స్థిరభక్తి (ఎడతెగని స్మృతిధారి ఏర్పడుగాక” అని స్వయముగా పల్కిను.
ఇదం గర్గకృతం స్తోత్రం త్రిసంధ్యం యః పఠేన్నరః ।
దృఢం భక్తిం హరేర్దాస్యం స్మృతిం చ లభతే ధ్రువం ॥
జన్మమృత్యుజరారోగ శోకమోహాదీ సంకటాత్ ।
తీర్ణోభవతి శ్రీకృష్ణదాస సేవన తత్పరః ॥
కృష్ణస్య సహకాలం చ కృష్ణ సార్థం చ మోదతే ।
కదాచిన్న భవేత్తన్య వచ్ఛేదో హరిణా నహ ॥
గర్గమహర్షికృతమైన ఈ స్తోత్రమును ప్రాతఃకాలము మధ్యాహ్నము సాయంకాలము అను మూడు సంధ్యా సమయములందే సరుడు పఠించునో వాడు శ్రీహరి యందు దృఢమైన భక్తిని నిశ్చలమైన స్మృతిని (తదేకన్మరణను) శ్రీహరి దాస్యము చేయు భాగ్యమును పొందగలును. జన్మము మృత్యువు ముసలితనము రోగములు దుఃఖములు వ్యామోహము అనబడు శరీర సంబంధమైన సంకటముల నుండి దాటింపబడును. శ్రీకృష్ణ దాసులను (భక్తులను) సేవించుట యందు ఆసక్తిగలవాడగును. శ్రీహరి యొక్క వియోగము (సదా) అతనితో కలిసియుండి ఆనందమసుభవించును.
శ్రీ నారాయణ ఉవాచ :-
హరిం మునిః స్తవం కృత్వా దదౌ నందాయ తం ముదా ।
ఉవాచ తం గృహం యామీ కుర్వాజ్ఞామితి పల్లవ ॥
అహా వీచిత్రం సంసారో మోహజాలేన వేష్టితః ।
నమ్మేలనం చ వీరహా నరాణాం సింధు ఫేనవత్ ॥
నారాయణ మహర్షి యిట్లు పలికెను :-
గర్గుడిట్లు శ్రీహరిని స్తుతించి ఆనందముతో ఆ శిశువును నందునకిచ్చెను. “ఇక ఇంటికి పోవుదును, నాకాజ్ఞ యిమ్ము గోపాలా”! అని పల్కిను, ఓహో ఆశ్చర్యము । మోహజాలము చేత చుట్టబడిన సంసారము విచిత్రమైనది. సంయోగము (కలయిక) వియోగము (ఎడబాటు) అన్నవి నరులకు సముద్రములోని నురుగువలె సంభవించునవి
గర్గస్య వచనం శ్రుత్వా రురోద నంద ఏవ చ ।
సద్విచ్ఛేదో హి సాధూనాం మరణాదతిరిచ్యతే ॥
గర్గుని వాక్కులు విని నందుడు భోరున నేడ్చెను. సజ్జనులకు సజ్జనులతో నెడబాటు (ఎడబాయుట - వియోగము) మరణమును మించి బాధాకరము కదా .
నర్వశిష్యైః పరివృతం మునీంద్రం గంతుముద్యతం ।
సర్వే నందాదయో గోపా రుదంతో గోపికాస్తదా ॥
ప్రణేముః పరమ ప్రీత్యా చక్రుస్తం వినయం మునే ।
దత్వాఽశిషం మునిశ్రేష్ఠో జగామ మధురాం ముదా॥
ఓ నారదా ! అందరు శిష్యులతో గూడి ప్రయాణమైన మునీంద్రునికి సందుడు మొదలగు గోపాలకులు గోపికలును పరమ భక్తితో నమస్కరించి వినయమును ప్రకటించి (ఎడబాటుకు) దుఃఖించుచుండిరి. ఆ సన్ముని వారికాశీస్సులిచ్చి సంతసముతో మధురకు పోయెను
ఋషయో మునయశ్చైవ బంధువర్గాశ్చ వల్లవాః ।
నర్వే జగ్ముర్థనైః పూర్ణా: స్వాలయం హృష్టమానసాః ॥
ప్రజగ్ముర్వందిన స్పర్వే పరిపూర్ణ మనోరథాః ।
మిష్టద్రవ్యాంశుకోత్కృష్ట తురగ స్వర్ణభూషణైః ॥
ఆకంఠపూర్ణా భుక్త్యా చ భిక్షుకా గంతుమక్షమాః ।
స్వర్ణవస్త్రభరోద్రేక పరిశ్రాంతా ముదాన్వితాః ॥
సుమంద గామీనః కేచిత్కేచిద్భూమౌ చ శేరతే ।
కేచిద్వర్త్మని తిష్ఠంతశ్చోత్తిష్ఠంతశ్చ కేచన॥
కేచిదూషుః ప్రముదితా హాసంతస్తత్ర కేచన।
కవర్ధకానాం వస్తూనాం శేషాశ్చోర్వరి తాన్ బహూన్ ॥
కేచిత్తావాదదుః స్థిత్వా దర్శయంతశ్చ కేచన ।
కేచిన్నృత్యం ప్రకుర్వంతో గాయంతస్తత్ర కేచన ॥
కేచిద్బహువిధా గాధాః కథయంతః పురాతనాః ।
మరుత్త శ్వేత సగర మాంధాతౄణాం చ భూభృతాం ॥
ఉత్తానపాదనహుష సలాదీనాం చ యాః కథాః ।
శ్రీరామస్యాశ్వమేధస్య రంతిదేవన్య కర్మణాం ॥
యేషాం యేషాం సృపాణాం చ శ్రుత్వా వృద్ధ ముఖాత్కథాః ।
కథయంతశ్చ తాః కేచిచ్ఛృతవంతశ్చ కేచన ॥
స్థాయం స్థాయం గ తాః కేచిత్స్వాపంప్వాపం చ కేచన ।
ఏవం సర్వే ప్రముదితాః ప్రజగ్ముః స్వాలయం ముదా ॥
ఋషులు మునులు బంధువర్గములు గోపాలకులు నందుడిచ్చిన నిండు ధనములతో తమ తమ గృహములకు పోయిరి, వందిజనులు (స్తోత్రముచేయుట వృత్తిగా గలవారు) పిండివంటలు పక్వాన్నములు వస్త్రములు మేలిజాతి గుణములు స్వర్ణభూషణములు గ్రహీంచి కోరికలు నిండుగా తీరి వెళ్లిపోయిరి. భిక్షుకులు గొంతు వరకు భుజించి బంగారము వస్త్రముల భారమెక్కువై నడువజాలక అలిసిపోవుచు సంతోషముతో పోయిరి. (నందునింటికీ శుభకార్యార్థము వచ్చి తిరిగి పోవువారితో) కొందరు మెల్లగా నడచుచుండిరి. మరికొందరు భూమిపై పడుకొనుచుండిరి. కొందరు లేచుచుండిరి. కొందరు త్రోవలో నిలిచిపోవుచుండిరి. కొందరు సంతోషముతో ఆగిపోయి అక్కడనే యుండిరి. కొందరు నవ్వుచుండిరి. భారవస్తువులను కొందరు నేలలో దాచి పెట్టుచుండిరి. కొందరేషదార్థములను ఇతరులకిచ్చి వేసిరి. కొందరు తమకిచ్చిన వాటిని పరులకు చూపుచుండిరి. కొందరు నృత్యము చేయుచుండిరి. కొందరు పాటలు పాడుచుండిరి. కొందరు బహువిధములైన పురాతన కథలను చెప్పుచుండిరి. మరుత్తరాట్, సగర మాంధాతృ చక్రవర్తుల యొక్కయు, ఉత్తానపాద నహుష నల చక్రవర్తుల యొక్కయు కథలను చెప్పుచుండిరి. శ్రీరాముని అశ్వమేధ విశేషములను రంతిదేవుని త్యాగకర్మను ఏయే రాజుల కథలను పెద్దల వాక్కుల ద్వారా వినియుండిరో వాటినన్నింటిని కొందరు చెప్పుచుండగా మరి కొందరు వినుచుండిరి. నిలిచి నిలిచి కొందరు వెళ్లిరి. అక్కడక్కడ నిద్రించుచు లేచుచు కొందరేగిరి. ఈ తీరుగా ఎల్లరును ప్రమోదము (సంతోషము) తో తమ తమ గృహములకు వెళ్లిరి
హృష్టో సందో యశోదా చ బాలం కృత్వా చ వక్షసి ।
త స్థౌ స్వమందిరే రమ్యే కుబేర భవనోపమే ॥
ఏవం ప్రవర్ధితౌ బాలౌ శుక్లచంద్ర కలోపమౌ ।
గవాం పుచ్ఛం చ భత్తిం చ ధృత్వా చోత్తస్థతుర్ముదా ॥
శబ్దార్థం వా తదర్థం వా క్షమౌ వక్తుం దినే దినే ।
పిత్రోర్హ ర్షం చ వర్ధంతౌ గచ్ఛంతౌ ప్రాంగణే మునే ॥
ఇట్లు శుభకార్యము జరిగినందుకు) నందుడు సంతసించెను. యశోద కుమారుని తన వక్షస్థలమున నుంచుకొని ఆనందించెను. ఆ దంపతులిటు కుబేర భవనమును పోలి సుందరముగా నున్న తమ మందిరమున నివసించిరి. ఈ తీరుగా బాలురైన బలరామకృష్ణులిద్దరు శుక్ల పక్షమందలీ చంద్రకళలవలె పెరుగుచు ఆవుల తోకలను గోడలను పట్టుకొని లేచి నిలబడుచుండిరి. వరుసగా ఒక దినము నాడు ఒక శబ్దములోని పావు భాగమును మరునాడు సగము భాగమును పలుకుటకు సమర్ధులగుచు తల్లిదండ్రులకు హర్షము పెంచుచు ఇంటను వాకిలిలోను నడచుచుండిరి.
బాలో ద్విపాదం పాదం వా గంతుం శక్తో బభూవ హ ।
గంతుం శక్తో హి జానుభ్యాం ప్రాంగణే వా గృహే హరిః ॥
వర్షాధికో హి వయసా కృష్ణాత్సంకర్షణః స్వయం ।
తతో ముదం వర్ధయంతౌ వర్థితౌ చ దినే దినే ॥
ఓ నారదమునీ ! బాలుడైన శ్రీహరి (శ్రీకృష్ణుడు) మోకాళ్లతో ఇంటిలోను వాకిటను నడువ సమర్థుడై తరువాత ఒకటి రెండు అడుగులు వేయ శక్తిగలవాడయ్యేను. సంకర్షణుడు (బలదేవుడు) శ్రీకృష్ణుని కన్న ఒక యేడాది పెద్దపొడు కదా! ఇద్దరిట్లు దినదినము తల్లిదండ్రులకు ముదము పెంచుచు పెరుగుచుండిరి.
ప్రజంతౌ గోకులే బాలౌ ప్రకృష్ట గమనే క్షమౌ ।
ఉక్తవంతౌ స్ఫుటం వాక్యం మాయాబాలకవిగ్రహౌ॥
తమ మాయాశక్తితో బాలుర రూపములు ధరించి యున్న ఆ బాలురిద్దరు సంతోషముతో బాగుగా నడువ సమర్ధులై ఆ గోకులమందు
తిరుగుచు స్పష్టముగా వాక్యములు పలుకుచుండిరి.
గర్గో జగామ మధురాం వసుదేవాశ్రమం మువే ।
స తం ససాను వప్రచ్చ పుత్రయోః కుశలం తయోః ॥
మునిస్తం కథయామాస కుశలం సుమహోత్సవం ।
ఆనందాశ్రు నిమగ్నశ్చ శ్రుతమాత్రాద్బభూవ హ ॥
ఓ మునీ ! గరుడు మధురలోని వసుదేవుని నివాసమునకు పోయెను. వసుదేవుడతనికి నమస్కరించి ఆ యిద్దరు పుత్రులకుశలమడిగెను. మహర్షి వారి కుశలమును అక్కడ జరిగిన సోమకరణాన్నప్రాశన మహోత్సవమును వసుదేవునికి చెప్పెను. అది విన్నంతలోనే అతడానంద బాష్పములలో మునిగి పోయెను.
దేవకీ పరమప్రీత్యా పప్రచ్ఛ చ పునఃపునః ।
ఆనందాశ్రు నిమగ్నా సా రురోద చ మహుర్ముహుః ॥
గర్గస్తావాశిషం దత్వా జగాము స్వాలయం ముదా ।
స్వగృహే తస్థతుస్తౌ చ కుబేర భవనోపమే ॥
ఆ మాటలు వినుచున్న దేవకీ దేవి కొడుకుల మీద ప్రేమతో మరల మరల ఆ వార్తలడిగీ వినీ ఆనంద బాష్పపూర్ణురాలై కూడ (వారి ఎడబాటుకు మాటి మాటికీ దుఃఖించెను. గర్గముని వారి నాశీర్వదించి స్వగృహమునకేగెను. వారిద్దరు కుబేర భవనమును బోలిన - తమ యింట నివసించిరి.
శ్రీ నారాయణ ఉవాచ :-
యత్ర కల్పే కథా చేయం తత్ర త్వముపబర్హ ణః ।
పంచాశత్కామినీనాం చ పతీర్గంధర్వ పుంగవః ॥
తాసాం ప్రాణాధీకస్త్వం చ శృంగార నిపుణో యువా ।
తతోఽ భూద్బ్రహ్మణశ్శాపాద్దా సీపుత్రో ద్విజస్య చ ॥
తతోఽ ధునా బ్రహ్మపుత్రో వైష్ణవోచ్ఛిష్ట భోజనాత్ ।
సర్వదర్శీ చ సర్వజ్ఞః స్మారకో హరి సేవయా ॥
కథితం కృష్ణచరితం నామన్నప్రాశనాదికం ।
జన్మమృత్యుజరాతిఘ్నమపరం కథయామి తే ॥
నారాయణ మహర్షి యిట్లు పలికెను :-
ఓ నారదా ! ఈ కథ జరిగిన కల్పమునందు నీవు ఉపబర్హణుడను గంధర్వరాజూగా నుంటివి. అప్పుడు నీకు ఏబది మంది భార్యలుండిరి. మంచి యువకుడవు. శృంగార క్రీడయందు నిపుణుడవగు నిన్ను వారందరు ప్రాణములకంటెనధికముగా చూచుకొనిరి. బ్రహ్మదేవుని శాపము వలన దాసీ పుత్రుడవైతివి. ద్విజునీ పోషణలో నుండి విష్ణుభక్తుల ఉచ్ఛిష్ట (తినగా మిగిలిన విస్తరిలోని ఆహారము) మును తినినందువలన ఈ జన్మలో బ్రహ్మపుత్రుడవైతివి. హరి సేవచేయుట చేత సర్వదర్శి (ఆన్ని చూడగలవాడు)వి, సర్వజ్ఞుడవు ఇతరులకు భగవన్నామము జ్ఞాపకము చేయువాడవు (ఎప్పుడును సోమన్మరణ వలన) గా వున్నావు. జన్మము మృత్యువు జురే (ముసలితనము) లను మిక్కిలి నశింపజేయునట్టి శ్రీకృష్ణుని నామకరణ - అన్న ప్రాశన కథను నీకు చెప్పితిని. ఇక తరువాతి చరిత్ర చెప్పుదును.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే శ్రీకృష్ణాన్నప్రాశన వర్ణన నామకరణ ప్రస్తావో నామ త్రయోదశోఽధ్యాయః॥
ఇది బ్రహ్మవైవర్తపురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన శ్రీకృష్ణుని అన్నప్రాశన వర్ణన నామకరణ ప్రస్తావనను పదమూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 13 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Growing up in the pastoral bliss of Gokula, the divine brothers Kṛshṇa and Balarāma engaged in captivating childhood pastimes that enchanted the hearts of all the residents. They crawled through the dusty courtyards, played with golden calves, stole freshly churned butter from the hanging pots of neighboring cowherd homes, and played innocent pranks on mother Yashodā. Whenever Yashodā attempted to scold little Kṛshṇa, the Lord would display the entire cosmic creation within His tiny open mouth, revealing suns, oceans, and galaxies, leaving His mother bewildered and drowned in ocean-like maternal love.