శ్రీనారాయణ ఉవాచ:
స ఏవ భగవాన్ కృష్ణః సర్వాత్మా పురుషః పరః ।
దురారాధ్యోఽతిసాధ్యశ్చ సర్వారాధ్యః సుఖప్రదః ॥
నిజభక్తాతిసాధ్యశ్చ భక్త స్యారాధ్యఏవచ ।
శశ్వత్ దృశ్యః స్వభక్తస్య అభక్తస్యాదృశ్యఏవచ ॥
దుర్ జ్ఞేయం తస్యచరితం కార్యం హృదయ ఏవచ ।
బద్ధాస్తన్మాయయా సర్వే మోహితాశ్చ దురంతయా॥
యద్భయాద్వాతివాతోఽయం కూర్మంధత్తే నిరాశ్రయః ।
కూర్మోఽనంతం విధత్తేచ యద్భయేన నిరంతరం ॥
బిభర్తి శేషో విశ్వంచ యద్భయేన చ నారద ।
సహస్రశీర్షాపురుషః శిరసశ్చైకదేశతః ॥
సప్త సాగర సంయుక్తా సప్తద్వీపా వసుంధరా ।
శైలకానన సంయుక్తా పాతాలాః సప్త ఏవచ ॥
సప్త స్వర్గాశ్చవివిధాః బ్రహ్మలోక సమన్వితాః ।
ఏవంవిశ్వం త్రిభువనం కృత్రిమం పరికీర్తితం ॥
యద్భయేన విధాత్రాన ప్రతిసృష్టౌ చ నిర్మితం ।
ఏవం విశ్వాన్యసంఖ్యాని లోమకూపైర్మహాన్విరాట్ ।
యద్భయేన విధత్తేచ యదంశో ధ్యాయతేహియం ।
విష్ణుః పాతి చ సంసారం యద్భయేన కృపానిధిః ॥
కాలాగ్నిరుద్రోయద్భీతః కాలః సంహరతే ప్రజాః ।
మృత్యుంజయో మహాదేవో యద్భయాద్ద్యాయతేచయం ॥
షడ్గుణైరనురాగైశ్చ విరాగీ విరతః సదా ।
యద్భయేనదహత్యగ్నిః సూర్యస్తపతియద్భయాత్ ॥
యద్భయాద్వర్షతీంద్రశ్చ మృత్యుశ్చరతి జంతుషు ।
యద్భయేన యమశ్శాస్తా పాపినాం ధర్మ ఏవచ ॥
ధత్తేచ ధరణీ లోకాన్యద్భయేన చరాచరాన్ ।
సూయతే ప్రకృతిః సృష్టౌ యద్భయాన్మహదాదికం ॥
దుర్ జ్ఞేయంతదభిప్రాయం కోవాజానాతి పుత్రక ।
యత్ర్పభావం నజానంతి బ్రహ్మ విష్ణు మహేశ్వరాః ॥
కథం జానామి తచ్చేష్టామహం వత్స సుమందధీః ।
కథం జగామ మథురాం త్యక్త్వావృందావనం వనం ॥
అను ॥ గణేశునకు నమస్కారము. నారాయణుడు ఇట్లా అన్నాడు. ఆ భగవంతుడే కృష్ణుడు అన్ని ఆత్మలలోనివాడు (అన్నిటిని ఆత్మగా గలవాడు). పరుడైన పురుషుడు. అతి కష్టముచే ఆరాధించతగినవాడు. సాధించుటకు అతీతమైనవాడు. అందరిచే ఆరాధించతగినవాడు. సుఖమునిచ్చువాడు. (1) తన భక్తులకు సాధించుటకు శ్రేష్ఠమైనవాడు. భక్తునకు ఆరాధించతగినవాడే. తన భక్తునకు ఎప్పుడూ కన్పించేవాడు. భక్తుడుకాని వానికి కన్పించనివాడు (2) అతని చరిత్ర ఎరుగరానిది. హృదయం యందే అతని పని. అందరూ అతని మాయతో బద్ధులైనవారే, అంతము లేని, మాయతో మోహమందినవారే (3) ఆతని భయంవల్ల ఈగాలి వీస్తోంది. ఏ ఆధారము లేకుండా కూర్మమును భరిస్తోంది. కూర్మము అనంతుణ్ణి, ఆతని భయంతో నిరంతరం భరిస్తోంది. (4) ఓ నారద! ఆతని భయంతో శేషుడు విశ్వాన్ని మోస్తున్నాడు. వేయి తలలు గల పురుషుడాతడు. తన తలలోని ఒక భాగంతో మోస్తున్నాడు. (5) ఈ వసుంధర సప్త సాగరములతో కూడినది. ఏడు దీవులు కలది. పర్వతములు, అడవులతో కూడినది. ఏడు పాతాళ(లేక)ములున్నాయి. (6) బ్రహ్మలోకముతో కూడిన వివిధములైన ఏడు స్వర్గములున్నాయి. ఇట్లా మూడు భువనములుగల ఈ విశ్వము కృత్రిమమని చెప్పబడింది. (7) అతని భయంతో బ్రహ్మ ప్రతిసృష్టియందు నిర్మిస్తున్నాడు. ఈ రకముగా విశ్వములు అసంఖ్యాకములైనవి. రోమకూపములతో మహావిరాట్ స్వరూపుడు (8) ఎవని భయంతో ఏ అంశము ధరించబడుతోందో, ఎవనిని ధ్యానిస్తున్నాడో అతడే పరుడు. ఆతని భయంతో కృపగల విష్ణువు సంసారాన్ని రక్షిస్తున్నాడు. (9) ఆతని భయంతో కాలాగ్నిరుద్రుడైన కాలుడు ప్రజలను సంహరిస్తున్నాడు. ఎవని భయంతో మృత్యుంజయుడైన మహాదేవుడు, ఎవనిని ధ్యానిస్తున్నాడో అతడు పరుడు. (10) అనురాగాదులతో షడ్గుణముతో కూడి ఉండి ఎప్పుడూ విరాగిగా విరతుడుగా ఉంటాడు. ఆతని భయంతో అగ్ని కాలుస్తోంది. సూర్యుడు మండుతున్నాడు. (11) ఇంద్రుడు వర్షిస్తున్నాడు. ప్రాణులందు మృత్యువు సంచరిస్తున్నాడు. పాపులను యముడు శాసిస్తున్నాడు. ధర్మము కూడా ఉంటున్నది. (12) భూమి చరాచరలోకములను ధరిస్తోంది. సృష్టియందు ప్రకృతి మహదాదులను వానిభయం వల్లనే సృష్టిస్తోంది. (13) ఆతని అభిప్రాయము తెలుసుకొనుట కష్టము. ఓ పుత్ర! ఎవరు తెలుసుకుంటారు. బ్రహ్మ విష్ణుమహేశ్వరులే ఆతని ప్రభావాన్ని తెలుసుకోలేరు. (14) ఓ వత్స! మిక్కిలి మందబుద్ధిగల నేను ఆతని చేష్టను ఎట్లా తెలుసుకుంటాను. బృందావనమందలి అరణ్యమును వదలి మధురకు ఎట్లా వెళ్ళాడు.
మూ॥ కథం తత్యాజ గోపీశ్చ రాధాం ప్రాణాధికాం ప్రియాం ।
యశోదాం బాంధవాదీంశ్చ నందం వా నందనందనః॥
దర్పహా దర్పదః సోఽపి సర్వేషాం సర్వదఃసదా ।
బభంజ రాధా దర్పంచ సుదామ్నః శాపకారణాత్ ॥
అన్యేషాం భావనా హేతోః బ్రహ్మప్రాప్తిస్తథాభవేత్ ।
ఏవం కించి ద్వితర్కంచ కురుతే కమలోద్భవ:॥
చకార దర్పభంగంచ మహావిష్ణుః పురా విభుః ।
బ్రహ్మణశ్చ తథా విష్ణోః శేషస్యచ శివస్యచ ॥
ధర్మస్యచ యమస్యాపి సాంబస్య చంద్రసూర్యయోః ।
గరుడస్యచ వహ్నేశ్చ గురోః దుర్వాససస్తథా ।
దౌవారికస్య భక్తస్య జయస్య విజయస్యచ ।
సురాణామసురాణాంచ భవతః కామశక్రయోః ॥
లక్ష్మణస్యార్జునస్యాపి బాణస్యచ భృగోస్తథా ।
సుమేరోశ్చ సముద్రాణాం వాయోశ్చవరుణస్యచ ॥
సరస్వత్యాశ్చదుర్గాయాః పద్మాయాశ్చ భువస్తథా ।
సావిత్ర్యైశ్చైవ గంగాయా మనసాయాస్తథైవచ ॥
ప్రాణాధిష్ఠాతృదేవ్యాశ్చ ప్రియాయాః ప్రాణతోఽపిచ ।
ప్రాణాధికారాధాయా అన్యేషామపి కా కథా ॥
హృత్వాదర్పంచ సర్వేషాం ప్రసాదంచ చకార సః ।
కర్తా హర్తా పాలయితా స్రష్టా స్రష్టుశ్చ సర్వతః ॥
యంస్తోతు మీశోనాలంచ పంచవక్త్రైస్తు శంకరః ।
స్తోతుం నాలం చతుర్వక్త్రో విధాతా జగతామపి ॥
స్తోతుంనాలమనంతశ్చ సహస్ర వదనైరహో ।
స్వయం విష్ణుర్విశ్వ వ్యాపీ నాలంస్తోతుం జనార్దనః॥
మహా విరాణ్నశక్తోఽపి యం స్తోతుం పరమేశ్వరం ।
కంపితా యస్యపురతః ప్రకృతిః పరమాత్మనః ॥
సరస్వతీజడీభూతా యం స్తోతుం పరమేశ్వరం ।
మహిమానం నజానంతి వేదా యస్యచ నారద ॥
ఇత్యేవంకథితో బ్రహ్మన్ ప్రభావః పరమాత్మనః ।
నిర్గుణస్యచ కృష్ణస్య కిం భూయః శ్రోతు మిచ్ఛసి ॥
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే ఉత్తరార్ధ నారాయణ నారద సంవాదే శ్రీకృష్ణ ప్రభావ వర్ణనం నామ పంచ పంచాశత్తమోఽధ్యాయః ॥
నందనందనుడు గోపికలను, ప్రియమైన ప్రాణాధికమైన రాధను, యశోదను, బాంధవాదులను నందుణ్ణికాని ఎట్లా విడిచి పెట్టాడు.
(16) దర్పమును హరించేవాడు, దర్పమును ఇచ్చేవాడు ఆతడు. అందరికి ఎల్లప్పుడు అన్నీ ఇచ్చేవాడు కూడా. సుదాముని శాప కారణంగా, రాధా దర్పమును భంజింపచేశాడు. (17) అట్లాగే ఇతరులకు భావనననుసరించి బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. ఇట్లా కొంచం ఆలోచిస్తాడు కూడా కమలోద్భవుడు. (18) ఇదివరలో విభువైన (శాసకుడైన) మహావిష్ణువు, బ్రహ్మకు, విష్ణువునకు, శేషునకు, శివునకు దర్పభంగం చేశాడు. (19) ధర్మునకు (డైన) యమునకు సాంబునకు, చంద్రసూర్యులకు, గరుడునకు, అగ్నికి, అట్లాగే గురువైన దూర్వాసునకు (20) ద్వారపాలకులైన, భక్తులైన జయవిజయులకు, సురలకు-అసురులకు, నీకు కామునకు, శక్రునకు (21) లక్ష్మణునకు, అర్జునునకు, బాణునకు, భృగునకు, సుమేరువుకు, సముద్రములకు, వాయువునకు, వరుణునకు, (22) సరస్వతికి, దుర్గకు, పద్మావతికి, భూమికి, సావిత్రికి, గంగకు, మనసకు (23) ప్రాణాధిష్ఠాతృ దేవతకు (ఐన) ప్రాణములకంటే, ప్రియమైన, ప్రాణాధికమైన రాధకు కూడా దర్పభంగం చేశాడు. ఇతరుల విషయం చెప్పేదే వుంది. (24) అందరి దర్పాన్ని హరించి తిరిగి అనుగ్రహించాడు కూడా ఆతడు. కర్త, హర్త, పాలకుడు, అన్నివిధముల సృష్టికర్తకు సృష్టికర్త (25) ఐదు ముఖములతో) శంకరుడు కూడా ఆతనిని స్తుతించుటకు సమర్థుడుకాడు. జగత్తునకు విధాతయైన బ్రహ్మకూడా (నాలు ముఖములతో) స్తుతింప సమర్థుడుకాడు. (26) వేయి ముఖములతో అనంతుడు కూడా స్తుతింపతగడు (లేడు). విశ్వ వ్యాపియైన, జనార్దనుడైన విష్ణువు స్వయంగా కూడా స్తుతింప సమర్థుడుకాడు. (27) ఆ పరమేశ్వరుని స్తుతించుటకు మహావిరాట్టుకూడా శక్తిమంతుడు కాడు. ఆ పరమాత్మ ఎదుట ప్రకృతి కూడా కంపిస్తుంది. (28) ఆ పరమేశ్వరుని స్తుతించలేక సరస్వతి జడురాలైంది ఓ నారద! ఆతని మహిమను వేదములు కూడా తెలుసుకోలేవు. (29) ఈ విధముగా పరమాత్మ ప్రభావము చెప్పబడింది. ఓ బ్రహ్మ ! నిర్గుణుడైన కృష్ణుని గురించి ఇంకేమి వినదలిచావు. (30) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు, శ్రీకృష్ణ జన్మఖండ మందు, ఉత్తరార్ధమందు, నారాయణ నారద సంవాదమందు శ్రీకృష్ణ ప్రభావ వర్ణన మనునది ఏబది ఐదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 55 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
During the days of peace in Dvārakā, the mighty monkey king Dvivida, an ancient associate of Narakāsura who possessed the strength of ten thousand elephants, began roaming across the earth, destroying hermitages, uprooting trees, polluting water reservoirs, and harassing sages to create chaos. When Dvivida challenged Balarāma to a duel near the Raivataka mountain, Balarāma calmly engaged the arrogant monkey in combat. After a fierce battle where Dvivida hurled massive boulders at the Lord, Balarāma struck him across the collarbone with His plow weapon, crushing the demon's chest and ending his rampage instantly.