బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

80 -  అధ్యాయము

మూ!! శ్రీకృష్ణ ఉవాచ :

పురాతారాగురోః పత్నీనవయౌవన సంయుతా

రత్నభూషణ భూషాఢ్యా వరసూక్ష్మాంబరాసతీ

సుశ్రోణీసస్మితా రమ్యాసుందరీ సుమనోహరా

అతీవకబరీరమ్యామాలతీ మాల్యభూషితా

సిందూరబిందునా సాకంచారు చందన బిందుభిః

కస్తూరీ బిందునాఽధశ్చఫాలమధ్యస్థలోజ్జ్వలా

రత్నేంద్ర సారనిర్మాణ క్వణన్మం జీరరంజితా

సువక్రలోచనా శ్యామా సుచారుక జ్ఞలోజ్జ్వలా

సుచారుసారముక్తా భదంతా పంక్తి మనోహరా

రత్నకుండలయుగ్మేన చారుగండ స్థలోజ్జ్వలా

కామినీష్వతులా బాలా గజేంద్రమందగామినీ

సుకోమలా చంద్రముఖీ కామాధారా చ కాముకీ

స్వర్గమందాకినీతీరే స్నాతా స్నిగ్ధాంబరావరా

శృంగారం కర్తుముద్యంతం తమువాచ గురుప్రియా

తారకోవాచ -

త్యజ మాం త్యజ మాం చంద్ర సురేషు కులపాoసన

గురుపత్నీం బ్రాహ్మణీంచ పాతివ్రత్యపరాయణాం గురుపత్నీ సంగమనే బ్రహ్మహత్యాశతం భవేత్

గురుపత్నీ విప్రపత్నీ యదిసాచ పతివ్రతా

బ్రహ్మహత్యా సహస్రంచ తస్యాః సంగమనే లభేత్

పుత్రస్త్వం తవమాతాఽహం ధైర్యం కురు సురేశ్వర

ధిక్త్వాం శ్రుత్వా సురగురుర్భస్మీభూతం కరిష్యతి

పుత్రాధికశ్చ శిష్యశ్చ ప్రియో మత్స్వామినో భవాన్

స్వధర్మం రక్ష పాపిష్ఠ మామేవం మాతరంత్యజ

దాస్యామి స్త్రీవధం తుభ్యం యది మాం సంగ్రహిష్యసి

విలంఘ్యతారావచనం తాంచ సంభోక్తు ముద్యతం

శశాప తారా కోపేన నిష్కామాసా పతివ్రతా

రాహు గ్రస్తో ఘనగ్రస్తః పాప,దృశ్యోభవాన్భవ

కలంకీ యక్ష్మణా గ్రస్తో భవిష్యసి నసంశయః

చంద్రంశప్త్వా తదాతూర్ణం కామదేవం శశాప సా

తేజస్వినా కేనచిత్త్వం భస్మీభూతో భవిష్యసి

చంద్రస్తారాం గృహీత్వాచ కృత్వాఽపి రమణం వ్రజ

క్రోడే నిధాయ ప్రయయౌ రుదంతీం తాం శుచాఽన్వితాం

నిర్జనే నిర్జనే రమ్యే శైలే శైలే మనోహరే

శ్రీ కృష్ణుని వచనమిట్లా - ఇదివరలో, గురుపత్ని తార ఉండింది. నవయౌవ్వనవతి ఆమె. రత్నభూషణములతో అలంకరించుకుంది. శ్రేష్ఠమైన సన్నని వస్త్రముల ధరించింది, ఆసతి (1)మంచి పిరుదులు కలది, చిరునవ్వుతో అందమైనది, సుందరి, మనోహరమైనది. మాలతీ మాలలతో భూషింపబడిన పెద్ద కేశసంపదతో అందమైనది. (2) సిందూరపు చుక్కతో పాటు అందమైన చందన బిందువులతో, దానికింద కస్తూరి బిందువుతో నొసటిమధ్యభాగం కలిగి వెలిగిపోతోంది. (3) రత్నములతో ఇంద్రసారమణులతో నిర్మించిన, ధ్వనించే కాలి అందెలతో శోభిస్తోంది, అందమైన ఓరచూపులు గలది, శ్యామలవర్ణము గలది అందమైన కాటుకతో ప్రకాశిస్తోంది. (4) అందమైన సారరూపమైన ముత్యములవంటి పలువరుసలతో అందమైనది. రత్నకుండలముల జంటతో అందమైన చెక్కిళ్ళతో వెలిగేది. (5) స్త్రీలలో సాటిలేనిది, బాల, గజేంద్రమువలె మెల్లని నడక గలది, చాలా సుకుమారమైనది, చంద్రుని వంటి ముఖముగలది, కామునకు ఆధారము, కాముకి (6) స్వర్గమందలి మందాకినీ తీరమందు ఆమె స్నానం చేసి, నిగనిగలాడే వస్త్రం ధరించింది శ్రేష్టమైనది. ఆమె, గురువు పాదాన్ని స్మరిస్తూ తన ఇంటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. (7) ఆమె అవయవములన్నిటిని చూచి, మన్మథ బాణంతో పీడితుడై, భాద్రపదమాస చవితి యందు చంద్రుడు చైతన్యాన్ని కోల్పోయాడు, ఓప్రజ! (8) తిరిగి క్షణంలో మేల్కొని రథంలో కూర్చొని రసికుడు, బలవంతుడైన ఆతడు , తారకను (తార) చేతితో పట్టుకొని రథం పై ఎక్కించుకున్నాడు. (9) కామంతో ఉన్మత్తుడై ఆ స్త్రీని కౌగలించుకొని, ముద్దాడాడు. శృంగారం చేయటానికి సిద్ధపడ్డ ఆతనితో గురుపత్ని ఇట్లా అంది. (10) తారవచనమిట్లా- నన్నొదులు, నన్నొదులు, ఓ చంద్ర! నీవు దేవతలలో కులనాశకుడవు. నేను గురుపత్నిని బ్రాహ్మణిని పాతివ్రత్య ధర్మాన్ని ఆచరిస్తున్నదాన్ని. గురువు భార్యను పొందితే, నూరు బ్రహ్మహత్యలు చేసిన పాపము (11) గురువు భార్య, విప్రుని భార్య, ఆమెపతివ్రత కూడా ఐతే, ఆమెను పొందితే వేయి బ్రహ్మహత్యలు చేసిన పాపఫలము వస్తుంది. (12) నీవు కొడుకువు, నీతల్లిని నేను, ఓ సురశ్రేష్ఠ! ధైర్యం వహించు, వ్యర్ధుడ! నీగురించి వింటే సుర గురువు నిన్ను భస్మం చేస్తాడు. (13) పుత్రునికన్న అధికుడవు, శిష్యుడవు, నాస్వామికి నీవు ఇష్టమైన వాడివి. ఓ పాపిష్టుడ! నీ ధర్మాన్ని రక్షించుకో. తల్లినైన (లాంటి) నన్ను ఇట్లా వదిలి పెట్టు.(14) నన్నెత్తుకుపోతే స్త్రీవధ పాపాన్ని నీకు కల్గిస్తాను. తార మాటను అతిక్రమించి, ఆమెను భోగించడానికి ఉద్యమించిన వానిని (15) ఏ కోరికలేని ఆపతివ్రత తార కోపంతో శపించింది. రాహువుతో మింగబడి, మేఘములతో కప్పబడినీవు, చూస్తే పాపం కల్గించేవాడినౌతావు. (16) కలంకితుడవు, క్షయగ్రస్తుడవు ఔతావు అనుమానం లేదు అని చంద్రుని శపించి,వెంటనే వేగంగా ఆమె కామదేవుని శపించింది. (17) ఓకాముడ! ఒక తేజస్సుకలవాని వల్ల నీవు భస్మమౌతావు అని . చంద్రుడు తారనుగ్రహించి, రమించాడు, ఓ ప్రజ! (18) తన కొమ్ముయందు ఆమెనుంచుకొని, దుఃఖిస్తున్నదాన్ని, ఏడుస్తున్నదాన్ని తీసుకొనివెళ్ళిపోయాడు. జనంలేని ప్రతిరమ్యమైన చోట, మనోహరమైన ప్రతిపర్వతంలో (ఆమెతో) రమించాడు.

మూ సరోనదనదీనాంచ తీరేతీరే మనోహరే

మధువ్రతవికోక్తేచ పుష్పోద్యానే సుపుష్పితే

రమ్యాయాం పుష్పశయ్యాయాం స రేమే రమయా సహ

చందనోక్షిత పర్వాంగో మధుపానరతః సురః

సుఖసంభోగసంసక్తో బుబుధే నది వానిశం

మలయే మలయారణ్యే మలయానిల సంయుతే

స్యందనే చందనవనే పశ్చిమోదధిసన్నిధౌ

త్రికూటే వటమూలేచ తత్ర చంద్రసరోవరే

సుచారుశతపత్రాణాం పత్రే చందన చర్చితే

సుచారు చంపకోద్యానే చంపకానిల పూజితే

క్షీరోదకాంచనీ భూమౌ క్రౌంచ కాంచన పర్వతే

రత్నశైలే మణిమయే మణిమందిర సుందరే

మాణిక్య ముక్తా సారేణ హీరహారేణ శోభితే

సుచారు వస్త్ర చిత్రాడ్యే శ్వేతచామర దర్పణైః

భూషితే రత్నదీపైశ్చ దేవక్రోడే ప్రియస్థలే

వారుణీం మదిరా పీత్వా వరుణానీ సమన్వితః

వరుణో రమతే యత్ర తత్ర రేమే తయా సహ

పావనే పవనోద్యానే పారిజాతానిలేనచ

సుగంధిమోహితే రత్నమాలాతీరేచ నిర్మలే

ఋక్షశైలే కల్పవృక్షవనే వహ్నిప్రియాశ్రయే

పపౌచ కామధేనూనాం క్షీరం క్షీరోదధేస్తటే

వహ్నిశుద్ధాంశుకయుగం వహ్నిస్తస్మై దదౌ ముదా

వరుణో రత్నమాలాంచ రత్నఛత్రం సమీరణః

తత్ర దృష్ట్వాఽసురగురుం బలిగేహాత్సమాగతం

ప్రణమ్య సర్వముక్త్వాచ చంద్రస్తం శరణం యయౌ

శుక్రస్తంబోధయామాస వచనం నీతి యుక్తితః

నిరపేక్షో మునిశ్రేష్ఠో వేదవేదాంగ పారగః

శుక్ర ఉవాచ-

శృణు వత్స ప్రవక్ష్యామి గురవే దేహి తారకాం

శంభోశ్చ గురుపుత్రాయ పౌత్రాయ బ్రహ్మణశ్చవై

పూజితాయ సురాణాంచ దేయాతస్మై నిశాపతే

ప్రియాయ తత్ర్పియాం దత్వా శీఘ్రం త్వం శరణం వ్రజ

గురుపత్నీం మాతృతుల్యాం త్యజ మద్వచనాద్విధో

కురు పాపక్షయం పాపనివృత్తిస్తు మహాఫలా

సతీనాం గురుపత్నీనాం గ్రహణేచ బలేనచ

బ్రహ్మహత్యాసహస్రాణాం పాతకం లభతే జనః

కుంభీపాకేచ పచ్యంతే యావద్వై బ్రహ్మణః శతం

సామ్యం నారాయణ స్థానే తృణ పర్వతయోః సుర

కస్త్వం వత్స హరేః స్థానే కర్మ భోగోస్తి బ్రహ్మణః

నారాయణాశ్రితాః సర్వే జీవినస్త్రి విధా భవే

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే భగవన్నంద సంవాదే తారాహరణే అశీతితమోఽధ్యా యః

సరస్సుల నదీనదముల మనోహరమైన ప్రతితీరమందు, తుమ్మెదల ఝంకారము పికముల కూజితములు గల బాగా పుష్పించిన పుప్పోద్యానములందు (20) అందమైన పుష్పశయ్య యందు ఆమెతో కూడి ఆతడు రమించాడు. ఒంటినిండా చందనం పూసుకొని, మధుపానరతుడై ఆ సురడు (చంద్రుడు) రమించాడు. (21) సుఖసంభోగమందు ఆసక్తుడై రాత్రింబగళ్ళను మరచిపోయాడు. మయలపర్వతమందు, మలయానిలముతో కూడిన మలయారణ్యమందు (22) రథమందు, చందన వనమందు, పశ్చిమ సముద్రము సమీపంలోను, త్రికూటపర్వతమందు వటమూలమందు, అక్కడి చంద్ర సరోవరమందు (23) చందనము పూయబడ్డ, అందమైన శతపత్రముల (పూల) పత్రమందు, అందమైన చంపకోద్యానమందు చంపక పుష్పములగాలి వీస్తున్న చోట (24) పాలసముద్రము దగ్గరి పచ్చని ప్రదేశములందు, క్రౌంచ పక్షులుగల కాంచన పర్వతమందు, రత్నశైలమందు, మణిమయ ప్రదేశమందు, మణులతో చేసిన మందిరపు సుందర ప్రదేశములందు (25) మాణిక్యములు ముత్యముల సారభూతమైన వానితో వజ్రహారములతో శోభించిన ప్రదేశములందు, అందమైన వస్త్రములు, చిత్రములు గల చోట, తెల్లని చామరములతో అద్దములతో (26) అలంకరింపబడ్డచోట, రత్నదీపములతో అలంకరించబడ్డ, దేవక్రోడమందు (స్థలము) ప్రియస్థలమందు రమించాడు. వారుణమైన మదిరను తాగి(ఒకరకమైన గడ్డి నుండి తీసినమదిర), వరుణదేవితో కూడి (27) వరుణుడు రమించేచోట,తారతో కూడి ఆతడు రమించాడు. పావనమైన పవనముగల (గాలి) ఉద్యానమందు, పారిజాతపు గాలితో (28) మంచివాసనతో మోహితమైనచోట, నిర్మలమైన రత్నమాలా తీరమందు, ఋక్ష పర్వతమందు, కల్పవృక్ష వనమందు, వహ్నికి ప్రియమైన ఆశ్రమమందు (29) రమించాడు. సాలసంద్రపు ఒడ్డుయందు కామధేనువు పాలను తాగాడు. వహ్నిశుద్దమైన వస్త్రయుగమును అగ్ని ఆతనికి ఆనందంతో ఇచ్చాడు. (30) వరుణుడు రత్నమాలను గాలిరత్న ఛత్రమును ఇచ్చారు. అక్కడ, బలి గృహమునుండి వచ్చిన శుక్రుని చూచి (31) నమస్కరించి, అంతా చెప్పి, చంద్రుడు ఆతనిని శరణు వేడాడు. శుక్రుడు, నీతిగల యుక్తితో కూడిన మాటను చెప్పి ఆతనిని ఉద్బోధించాడు. ఆతడు (శుక్రుడు) అపేక్షలేనివాడు, మునిశ్రేష్ఠుడు, వేదవేదాంగపారగుడు. (32) శుక్రుని వచనమిట్లా - ఓవత్స! చెపున్నాను విను. తారను గురువునకు ఇచ్చేయుము. ఆతడు బ్రహ్మకు పౌత్రుడు, శంభుని గురు పుత్రుడు. (33) దేవతలతో పూజింపబడే వాడు నిశాపతి! ఆతనికి ఇవ్వు. ప్రియుడైన ఆయనకు ఆతని ప్రియను త్వరగా ఇచ్చి నీవు ఆతనిని శరణువేడు. (34) ఓ చంద్ర! నామాట ప్రకారం తల్లితో సమానమైన గురుపత్నిని విడిచి పెట్టు. పాపము, నాశాన్ని చేసుకో. పాపనివృత్తి గొప్పఫలము. (35) సతులను, గురుపత్నులను బలవంతంగా గ్రహిస్తే, నరుడు వేయి బ్రహ్మహత్యల పాపాన్ని పొందుతాడు. (36) బ్రహ్మయొక్క నూరుసంవత్సరముల కాలమువరకు కుంభీపాక నరకమందు వండబడుతారు. ఓ సుర! నారాయణుని స్థానమందు తృణము,పర్వతము రెండు సమానమే. (37) ఓ వత్స! హరిస్టానమందు నీవెంత వాడివి. బ్రహ్మకుకూడా కర్మభోగముంది. నారాయణుని ఆశ్రయించిన జీవులందరు సంసారమందు మూడు రకాలు. (38) అని బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ, నారద సంవాదమందు, భగవంతుడు నందుడు వీరి సంవాదమందు తారను హరించుట అనునది ఏనుబదవ అధ్యాయము.