శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు పలికెను :
ఏతస్మిన్నంతరే తత్ర శంకరః సముపస్థితః ।
సస్మితో వృషభేంద్రస్థో విభూతి భూషణః స్వయం॥
వ్యాఘ్రచర్మాంబరధరో నాగయజ్ఞోపవీతకః ।
స్వర్ణాకార జటాధారమర్ధచంద్రం చ సందధత్ ॥
త్రిశూల పట్టిశకరో బిభ్రత్ఖట్వాంగముత్తమం ।
నద్రత్నసార రచిత స్వరయంత్రకరో ముదా ॥
వాహనాదవరుహ్యాశు భక్తి నమ్రాత్మ కంధరః ।
ప్రణమ్య కమలాకాంతం వామే చోవాన భక్తితః ॥
వ్యాఘ్ర చర్మము పస్త్రముగా ధరించి సర్పమే యజ్ఞోపవీతమైన వాడును బంగారము వలె మెరిసెడీ జడల ముడి పైన ఆర్థ చంద్రుని కూర్చుకొన్న వాడును త్రిశూలము పట్టీ శాయుధము ఉత్తమమైన ఖట్వాంగమును ధరించిన వాడును శ్రేష్ఠమైన రత్నముల చూర్ణముతో నిర్మించబడిన స్వరయంత్రమును (జంత్రవాద్యమును) హస్తమున ధరించిన వాడును ఐన శంకరుడు వృషభరాజము పై నెక్కి (నంది) చిరునవ్వుతో అక్కడికి వచ్చెను. భక్తితో శిరస్సు వంచి వాహనము పై నుండి దిగి కమలానాథునకు (విష్ణువుకు నమస్కరించి భక్తితో అతని ఎడమ ప్రక్కన నిలిచెను.
ఆజగ్ముర్మునయస్సర్వే సురాః శక్రాదయస్తథా ।
ఆదిత్యా వసవో రుద్రా మనవః సిద్ధచారణాః ॥
పులకాంచిత సర్వాంగాస్తుష్టువుః పురుషోత్తమం ।
ప్రణమ్య తం శివం సర్వే సురాంశ్చ నమ్రకంధరాః ॥
అక్కడికి మునులందరును ఇంద్రాది దేవతలును ఆదిత్యులు వస్తువులు రుద్రులు మనుషులు సిద్ధులు చారణులు చేరవచ్చిరి. సర్వాంగములు ఆనందముతో పులకలెత్తగా శ్రీమన్నారాయణుని స్తుతించిరి. దేవతలందరు తలలు వంచి శివునికి నమస్కరించిరి.
ఏతస్మిన్నంతరే తత్ర సంగీతం శంకరో జగౌ ।
కృత్వాఽతీవ సుతాలం చ స్వరయంత్ర సమన్వితః ॥
ఆవయోశ్చ గుణాఖ్యానం రాస సంబంధి సుందరం ।
సమయోచిత రాగేణ మనోమోహన కారణా ॥
యత్ర వైకుoఠమానేన చైకతానేన చారు ।
పదభేద విరామేణ గురుణా లఘునా క్రమాత్ ॥
గమకేనాతి దీర్ఘేణ మదేన మధురేణ చ।
భవేతి దుర్లభం సృష్టం ప్రీత్యా సేన వినిర్మితం ॥
పులకాంచిత సర్వాంగః సామ్రనేత్రః పునః పునః ।
ఓ దేవీ! ఇంతలో అక్కడ శంకరుడు జంత్రవాద్యమును గ్రహించి మన యొక్క సుందరమైన రాసక్రీడకు సంబంధించిన మన గుణములను చెప్పునట్టి సంగీతమును పాడెను. అది మిక్కిలి యోగ్యమైన భౌళలయలతోను సమయోచితమైన రాగములతోను మనస్సులకు మోహకారణమయ్యేను. ఆ సంగీతము వైకుంఠమునకు తగిన సుందరమైన తానముతోను పద భేదములందలి విశ్రాంతితోను గురు లఘు క్రమముతోను అతి దీర్ఘముగాక మరియు హ్రస్వముగాక ఉన్నట్టి మధురమై మత్తెక్కించి గమకముతోను కూడీ సంసారములో అతి దుర్లభమై ప్రీతితో తాను సృష్టించిన, విశేషనిర్మాణ లక్షణములు గల ఆ గానమును కన్నులలో ఆనంద బాష్పములు సర్వాంగమున పులకలు మాటి మాటికేర్పడగా శివుడు పాడెను.
తదేవ శ్రుతి మాత్రేణ మూర్ఫోం ప్రాపుర్విచేతనాః ।
బభూవూరుద్ర రూపాశ్చ మునయ: పురతః ప్రియే ।
రుద్రరూపా: సురాః సర్వే విధాతృ హరి పార్షదా: ॥
నారాయణశ్చ లక్ష్మీశ్చ గాయకాశ్చ శివః స్వయం ।
జలపూర్ణం చ వైకుంఠం దృష్ట్వా త్రస్తోఽ హమీశ్వరీ ॥
గత్వా మూర్తీర్వనిర్మాయ సర్వాశ్చ తాదృశీ రితీ ।
తత్స్వరూపాస్తదస్రాశ్చ తత్స్వవాహన భూషణాః॥
తత్స్వభావా స్తన్మనస్కా స్తత్తద్విషయమాససాః ।
స్థానం నిర్మాయ పరితో వైకుంఠస్య చతుర్ధశి ॥
ఓ ప్రియరాధా! మునులందరు అతని గానము విన్నంతలోనే స్మృతి దప్పి మూర్ఛపోయిరి. ఆ తరువాత మునులు సర్వదేవతలు బ్రహ్మ శ్రీహరి యొక్క పారద్రులు నారాయణుడు లక్ష్మీదేవి శివుడు అందరును రుద్రరూపులైరి. అందరు అటువంటి (శివుని వంటి) రూపములను నిర్మించుకొనిరి. అవే రూపములు అవే ఆస్తములు, అవే వాహనములు అవే భూషణములు అదే స్వభావము అదే మనస్సు కలవారైరి. అదే విషయమందు (గానానందము) మసస్సులు గలవారై వైకుంఠము యొక్క నాలుదిక్కులందును స్థానములు నిర్మించుకొనిరి. వైకుంఠమంతయు జలపూర్ణమయ్యెను. అది చూచి నేను భయపడితిని.
తదధీష్టాతృ దేవీ చ ఆజగామ స్వమాలయం ।
శరీరజా సురాణాం సా బభూవ నురనిమ్నగా ॥
ముక్తిదా చ ముమూక్షూణాం భక్తానాం హరిభక్తిదా ।
కోటి జన్మార్జితం పాపం వివిధం పాపినామహో ॥
యస్యాశ్చ స్పర్శవాయోశ్చ సంపరేణ వినశ్యతి ।
కిం వా న జానే ప్రాణేశి న్సర్శ దర్శనయో: ఫలం ॥
కిముత స్నాన జన్యం చ కథయామీ నిరూపణం।
నర్వతీర్థాత్సరం వృథ్యాం పుష్కరం పరికీర్తితం ॥
వేదోక్తం చ తదేవాస్యాః కలాం నార్హతీ షోడశీం ।
ఆ సంగీతాధిదేవత జలరూపమున తన ఆనంద స్థానమైన వైకుంఠమునకు చేరవచ్చెను. గాన తన్మయులైన సురల శరీరములనుండి పుట్టిన ఆ రస ప్రవాహము దేవనది అయ్యెను. అది మోక్షాపేక్ష గలవారికి ముక్తిదాయినీ, భక్తులకు పారిభక్తిని కూర్చునది. పాపాత్ములయొక్క బహుజన్మల సంచితమైన పాపము ఏ నదిని స్పర్శించి వీచిన గాలి సోకగనే నశించునో ఆ నదిని దర్శించుట వలన స్పృశించుట వలన ఎంత ఫలము లభించునో! నేనెరుగను. ఇక స్నానమొనర్చుట వలన కలుగు ఫలమును ఎట్లు నిరూపించి చెప్పుదును! అన్ని తీర్థముల కంటే ఈ భూమి మీద పుష్కరము యొక్క అతిశయము వేదమున చెప్పబడినట్లు కీర్తింపబడినది. అటువంటి పుష్కర తీర్థము ఈ నదియొక్క పదునారవ భోగమునకును సరితూగదు.
భగీరథేన చానితా తేన భాగీరధీ స్మృతా॥
గామాగతా స్రోతసోంఽశాద్గంగాతేన ప్రకీర్తితా। జాను ద్వారా పురా దూ జహ్నానాఽఽవీయ కోవతః ॥
తస్య కన్యా స్వరూపా సా జాహ్నవి తేన కీర్తితా ।
భీష్మః స్వయం వనుర్జాతః తస్మాంశాత్తేన భీష్మసూః ॥
ధారాభిస్తినృభి: స్వర్గం పృథివీముతలం తథా ।
మమాయా చ గచ్ఛంతీ తేన త్రిపథ గామినీ ॥
ప్రధాన ధారయా స్వర్గే సా చ మందాకినీ స్మృతా ।
యోజనాయత విస్తీర్ణా ప్రస్థే చ యోజనా సృజో ॥
క్షీరతుల్యజలా శశ్వదత్యుత్తుంగ తరంగిణీ ।
వైకుంఠాద్భ్రహ్మలోకం చ తతః స్వర్గం సమాగతా ॥
న్వర్గాద్ధిమాద్రి మార్గేణ వృథివీమాగతా ముధా ।
సా ధారాఽలక నందాఖ్యా లవణోదేన మిశ్రితా॥
భగీరథునిచేత (భూమికి) తేబడినందున భాగీరథి యనియు, వైకుంఠమందలి ప్రపోహము యొక్క అంశ వలన భూమికి వచ్చినందున గంగయనియు చెప్పబడినది. జహ్న మహర్షి కోపముతో త్రాగి జానువు (మోకాలు) ద్వారా తిరిగి ఇచ్చినందున అతని కన్యా స్వరూపమై జాహ్నవి అని కీర్తింపబడినది. వసువు స్వయముగా భీష్ముడుగా ఆమెకు జన్మించినందున “భీష్మసూ?” (భీష్ముని గన్నది) అనియు మూడు ప్రవాహధారలుగా నా ఆజ్ఞచేత స్వర్గమున భూమండలమున అతలమున ప్రవహించుచున్నందున త్రిపథగామీని అనియు వ్యవహరింపబడుచున్నది. ఒక యోజనము వెడల్సు అంతే లోతు ప్రవాహము గలిగి, మాటి మాటికి మిక్కిలి ఎత్తైన అలలు గల పొలవంటి నీరు గల ఆ నది వైకుంఠము నుండి బ్రహ్మలోకమునకు అక్కడి నుండి స్వర్గమునకు చేరవచ్చినది. అక్కడ దానికి "మందాకిని” అని వ్యవహారము. ఆ నదీ ప్రవాహమే స్వర్గము నుండి హిమవత్పర్వత మార్గమున పృధివిని జేరవచ్చినది. ఆ ప్రవాహమునకు “అలకనంద” యని పేరు. అది లవణ సముద్రముతో కలిసినది.
శుద్ధ స్పటిక సంకాశా బహవేగవతీ సతీ।
పాపినాం పాప శుష్కేంధం దగ్ధుం పావక రూపిణీ ॥
అహో సగరవంశేభ్యో నిర్వాణ ముక్తిదాయినీ ।
వైకుంఠ గామీనీ సా చ సోపానరూపీజీ వరా ॥
ఆతోఽపి మృత్యుసమయే సతాం పుణ్యస్వరూపిణాం ।
ఆదౌ పాదౌ చ సన్యస్య ముఖే తోయం ప్రదీయతే ॥
గంగా సోపానమారుహ్య సంతో యాంతి నిరామయం ।
ఆ బ్రహ్మ లోకం సంలంఘ్య రథస్థాశ్చ నిరాపదః ॥
దైవాత్పురా ప్రాక్తనేన మగ్నం చేత్కృత పాతకైః ।
లోమ ప్రమాణ వర్షం చ మోదంతే హరి మందిరే ॥
తతో భోగో భవేత్తేషాం నిశ్చితం పాపపుణ్యయోః ।
అతి స్వల్నేన కాలేన కాల వ్యూహం చ బీభ్రతాం ॥
తతః పుణ్యవతాం గేహే లబ్ధ్వా జన్మ చ భారతే।
సంప్రాప్య నిశ్చలాం భక్తిం భవంతి హరిరూపిణః ॥
స్వచ్ఛమైన స్ఫటికముల వంటి వర్ణము గలదై బహవేగము గల ఈ నది పాపుల యొక్క పాపములనెడి ఎండు కట్టెలను కాల్చు అగ్ని రూపిణి. ఓహో! సగర వంశము వారికి ఆనందమును ముక్తిని యిచ్చినట్టేది. భూలోక జీవులకు శ్రేష్ఠమైన మెట్ల రూపమున ఉపయుక్తమై వైకుంఠమును పొందించును. అందువలనే పుణ్య మూర్తులైన సత్పురుషులకు మృత్యు సమయములో (మరణ కాలముందు) రెండు పాదములను శోధించి నోటిలో గంగా జలము పోయబడుచున్నది. అట్టి జీవులు గంగయనెడి మెట్లనెక్కి పాపసంబంధమైన ఆపదలు తొలగిపోయి బ్రహ్మలోకము వరకున్ను లంఘించి (దాటీ) సత్పురుషులై బాధారహితమైన ప్రదేశమునకు రథమెక్కి పోదురు (ముక్తిని పొందుదురు. దైవికముగా పూర్వజన్మకర్మవశమున పాపులై మునిగీ ఉన్నను (గంగా జలపానము అంత్యకాలమున చేసినందువలన) శరీరమున రోమములెన్నీ ఉండునో అన్ని సంవత్సరముల కాలము హరి మందిరములో (వైకుంఠములో) ఆనందింతురు. తరువాత వారికి అంతవరకే నిశ్చితమై యున్న పాపపుణ్యముల యొక్క అనుభవము కొద్దికాలములోనే పూర్తియగును. తరువాత భారత వర్షములో పుణ్యాత్ముల యింట జన్మించి నిశ్చలమైన భగవద్భక్తిని పొంది హరీ రూపులగుదురు (సాయుజ్య ముక్తిని పొందుదురు.
మృతద్విజానాం దేహాంశ్చ దైహచ్చూద్రా మహంతి చేత్ ।
పద ప్రమాణ వర్షం చ తేషాం చ నరకే స్థితిః ॥
తత స్తేషాం చ సాహాయ్యం కరోతి హరిరూపిణీ ।
దదాతి ముక్తిం తేభ్యోఽపి క్రమేణ చ కృపామయీ ॥
జన్మ పుణ్యవతాం గేహే కారయిత్వా చ భారతే ।
స్థలం దదాతి వైకుంఠే నిశ్చితం జన్మభిస్త్రిభిః ॥
యాత్రాం కృత్వా తు యః శుద్ధౌ స్నాతుం యాతి సురేశ్వరీం ।
పద ప్రమాణ వర్షం చ వైకుంఠే మోదతే ధ్రువం ॥
గంగాం ప్రాప్యానుషంగేణ స్నాతి చేత్సమలో నరః ।
ముచ్యతే సర్వ పాపేభ్యః పునర్యది న లిప్యతే ॥
కలౌ పంచ సహస్రాబ్దం స్థితిస్తస్యాశ్చ భారతే ।
తస్యాం చ విద్యమానాయాం కః ప్రభావః కలేరహో ॥
కలౌ దశసహస్రాణి వర్షాని ప్రతిమా మమ।
తిష్ఠంతి చ పురాణానీ ప్రభావస్తత్ర కః కలే: ॥
దైవికముగా బ్రాహ్మణ శవములను శూద్రులు మోసికొని పోయిన యెడల ఇరవై ఐదు దేవర్షముల కాలము వారికి నరకమందునికి సంభవించును. ఆ తరువాత పాపహారిణి (హరిరూపిణి). యెన, దయామయియైన ఆ నది వారికి గూడ సహాయము చేసి క్రమముగా ముక్తినిచ్చును. భారతవర్షములో పుణ్యాత్ముల ఇంట బుట్టించి మూడు జన్మలలో వారికి వైకుంఠమున స్థానమిచ్చును. ఇది నిశ్చితము. తీర్థయాత్రలు చేయుచు శుక్ల పక్షమున ఏ వ్యక్తి గంగాస్నానము చేయబోవునో వాడు శరీర రోమముల సంఖ్యలో సాల్గవ వంతు సంవత్సరములు వైకుంఠమున మోదమనుభవించును. పాపియైన మానవుడు గూడ {యాత్రగా గాక) ఏదో ఒక కారణముగా గంగలో స్నానము చేసినను స్నానకోలానంతరము తిరిగి పాపముచేయకున్నచో సర్వ పాపముల నుండి విముక్తుడగును. భారత ఖండములో కలియుగమున ఐదువేల సంవత్సరముల వరకు గంగానది యొక్క (మహిమ) ఉనికి ఉండును. ఇక ఆ నది యుండగా కలి ప్రభవ మెక్కడిది! కలియుగములో పదివేల సంవత్సరముల కాలము నా విగ్రహములు {ప్రతిమలు) పురాణములు నిలిచియుండును. ఆ స్థితిలో భారత వర్షములో కలి ప్రభవ మెక్కడుండును
ఆతలం యాతీ యా ధారా పా చ భోగవతీ స్మృతా ।
వయ: ఫేననిభా శశ్వదతి వేగవతీ సదా ॥
ఆకారామూల్య రత్నానాం మణీంద్రాణాం చ సంతతం ।
నాగకన్యాశ్చ యత్తరే క్రీడంతి స్థిర యౌవనాః ॥
స్వయం దేవీ చ వైకుంఠం వేష్టయిత్వా చ సంతతం ।
సహస్ర యోజనా వ్రస్థే దైర్ఘ్యే చ లక్షయోజనా ॥
అస్యా వినాశః ప్రలయే నాస్త్యేవ దుహితుర్మమ ।
నానారత్నాకరం దివ్యం తత్తీరం సుమనోహరం ॥
ఇత్యేవం కథితం సర్వం జాహ్నవీ జన్మ పుణ్యదం ।
బ్రాహ్మణశ్చ ప్రతీకారో మోహినీ శాపతః శ్రుణు ॥
నీటి నురుగు వంటి రంగు గలదియు ఎల్లప్పుడు అతివేగముగా ప్రవహించునదియు ఐన ఆ గంగా ప్రవాహము అతలమును పొంది భోగవతీయని చెప్పబడుచున్నది. ఆ లోకములో ఆ నదీతీరమున అమూల్యమైన పెద్ద పెద్ద రత్నములు శ్రేష్ఠమైన ఇతర మణులుండును. స్థిరమైన యావనము గల నాగకన్యలు ఆ తీరమున క్రీడింతురు. గంగాదేవి వైకుంఠములో వేయి యోజనముల లోతు లక్షయోజనముల పొడవుతో వైకుంఠమును చుట్టిముట్టి ఎప్పుడును ప్రవహించుచుండును. ఆ నదీ తీరము దివ్యమైన నానా విధ రత్నములకు నిలయము. మిక్కిలి మనోహరము. నా పుత్రియైన ఆ నదికి ప్రళయమునందును నాశము లేదు. ఇట్లు మొత్తము పుణ్యప్రదమైన జాహ్నవీ జన్మము చెప్పబడినది. ఇక మోహినీ శాపము వలన బ్రహ్మకు జరిగిన ప్రతీకారము వినుము.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే జాహ్నవీ జన్మ ప్రస్తావోనాము చతుస్రాంశోఽధ్యాయః.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు వారాయణ వారదసంవాదరూపమైన జాహ్నవీ జన్న ప్రస్తావమనెడి ముప్పది నాల్గవ అధ్యాయము నమాప్తము.
Summary of chapter 34 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Overwhelmed by the poignant agony of separation, the Gopīs united in singing soul-stirring songs of lamentation known as the Gīta-govinda prayers, calling out for Kṛshṇa with streaming tears. Moved by their unshakeable devotion, Lord Śrī Kṛshṇa suddenly reappeared before them in His most enchanting form, accompanied by Goddess Śrī Rādhā, the queen of Goloka who had descended to share in His earthly pastimes. The Gopīs rejoiced with boundless ecstasy as the divine couple reunited, bathing in the cooling moonlight and resuming their divine pastimes on the golden banks of the Yamunā.