బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

18 - విప్రపత్నీ మోక్షణ ప్రస్తావము

శౌనక ఉవాచ - శౌనకముని ఇట్లనెను :

అహో కిమద్భుతం సుత రహస్యం సుమనోహరం

శ్రుతం కృష్ణస్య చరితం సుఖదం మోక్షదం వరం

ఓ సూత పౌరాణికుడా ! ఎంత అద్భుతము. శ్రీకృష్ణ చరిత్ర మిక్కిలి మనోహరమైనది. వినునప్పుడు సుఖదాయకమైనది. దానికి ఫలముగా శ్రేష్ఠమైన మోక్షమిచ్చునది. దానిని వింటిమి. ఎంత ఆశ్చర్యము. ఇది రహస్య విషయము.

నూత ఉవాచ - సూతుడు పలికెను :

శ్రుత్వా నగర నిర్మాణం నారదో ముని సత్తమః

పప్రచ్ఛ కృష్ణ చరితమపరం సుమనోహరం

మునిశ్రేష్ఠుడైన నారదుడు నగర నిర్మాణ వృత్తాంతము విని మనోహరమైన కృష్ణ చరిత్రలోని తరువాతి భాగమును అడిగెను.

నారద ఉవాచ - నారదుడనెను :

శ్రీకృష్ణాఖ్యాన చరితం పీయూషమృషిసత్తమ

జ్ఞాన సింధో నిగది మాం శిష్యం చ శరణాగతం

ఓ ఋషివర్యా ! జ్ఞాన సముద్రుడా! శ్రీకృష్ణుని ఆఖ్యాన చరిత్రము (నడచుచుండగా కన్నుల ముందు చూచిన కధ) అమృతము వంటిది. నిన్ను శరణుపొందిన శిష్యుడనగు నాకు దానినింకను చెప్పుము.

నారదస్య వచః శ్రుత్వా ముదా నారాయణః స్వయం

ఉవాచ పరమీశస్య చరితం పరమాద్భుతం

నారదుని మాట విని నారాయణ మహర్షి స్వయముగా సంతోషముతో పరమాద్భుతమైన అపరమేశుని చరిత్రనిట్లు చెప్పెను.

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :

ఏకదా బాలకైః సార్థం బలేన సహ మాధవః

జగామ శ్రీమధువనం యమునా తీర నీరజం

విచేరుర్గోసహస్రైశ్చ చిక్రీడుర్బాలకాస్తదా

విశ్రాంతాస్తృట్పరీతాశ్చ క్షుధా చ పరిపీడితాః

తమూచుర్గోపశిశవః శ్రీకృష్ణం వరయా ముదా

క్షుదస్మాన్ బాధతే కృష్ణ కింకుర్మో బ్రూహి కింకరాన్

ఒకసారి మాధవుడు (శ్రీకృష్ణుడు) గోప బాలకులతో బలదేవునితో గూడి యమునా నదీ జలముతో వర్ధిల్లిన - ఆ నది ఒడ్డుననే యున్న శ్రీమధువనమున కేగెను. అక్కడ ఆ బాలకులందరు. గోబృందములతో అంతట సంచరించిరి. ఆటలాడుకొని అలసిపోయిరి. వారిని ఆకలిదప్పులు బాధించేను. శ్రీకృష్ణుని జేరబోయి చిన్న చిన్న గోపాలబాలురు “ఓ కృష్ణా ! ఆకలి మమ్ము బాధించుచున్నది. నీ సేవకులమైన మేము ఏమి చేయవలెనో చెప్పుము” అని పలికిరి.

శిశూనాం వచనం శ్రుత్వా తానువాచ దయానిధిః

హితం తథ్యం చ వచనం ప్రసన్న వదనేక్షణః

ఆ చిన్నవారి మాట విని దయానిధియైన శ్రీకృష్ణుడు ప్రసన్నమైన ముఖమండలముతో చూపులతో వారికి హితమైన సత్యవాక్యమిట్లు పలికెను.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :

బాలాగచ్ఛత విప్రాణాం యజ్ఞస్థానం సుఖావహం

అన్నం యాచత తాంచ్ఛీఘ్రం బ్రాహ్మణాంశ్చ క్రతూన్ముఖాన్

విప్రా ఆంగిరసాః సర్వే స్వాశ్రమే శ్రీవనాంతికే

యజ్ఞం కుర్వంతి విప్రాశ్చ శ్రుతి స్మృతి విశారదాః

నిఃస్పృహా వైష్ణవాస్సర్వే మాం యజంతి ముముక్షవః

మాయయా మాం న జానంతీ మాయామానుషరూపిణం

న చేద్దదతి యుష్మభ్యమన్నం విప్రాః క్రతూన్ముఖాః

తత్కాంతా యాచత క్షిప్రం దయాయుక్తాః శిశూస్ప్రతి

ఓ బాలులారా ! ఈ మధువనమునకు సమీపముననే బ్రాహ్మణుల ఆశ్రమమున్నది. వారందరు ఆంగీరసులు (అంగీర మహర్షి వంశస్తులు) తమ ఆశ్రమములో వారు యజ్ఞము చేయుచున్నారు. సుఖకరమైన ఆ యజ్ఞ స్థానమునకు మీరు వెళ్లి యజ్ఞకార్యమగ్నులై ఉన్నవారిని అన్నము పెట్టుమని యాచించండి. వారు శ్రుతులు స్మృతులలో ఆరితేరిన పండితులు విష్ణుభక్తులు. ఏ కోరికలు లేకుండ కేవలం మోక్ష పేక్షతో వారు నన్నుద్దేశించియే యజ్ఞము చేయుచున్నారు. ఐసను నా మాయ వలన నన్ను వారు లీలగా మనుష్య రూపము ధరించిన పరమాత్మనని ఎరుగరు. యజ్ఞకార్య మగ్నులైన వారొకవేళ మీకన్నము పెట్టనిచో వెంటనే వారి భార్యలను యాచించండి. వారు శిశువుల యందు దయగలవారు కనుక మీకొరకన్నము నీతురు.

శ్రీకృష్ణవచనం శ్రుత్వా యయుర్భాలకపుంగవాః

పురతో బ్రాహ్మణానాం చ తస్థురానమ్రకంధరాః

ఇత్యూచుర్భాలకాః శీఘ్రమన్నం దత్త ద్విజోత్తమాః

న శుశ్రువుర్ద్విజాః కేచిత్ కేచిత్ శ్రుత్వా స్థితాః స్థితాః

శ్రీకృష్ణుని వాక్కులు విని బాలురలో కొంచెము పెద్దవారు పోయి బ్రాహ్మణుల ముందు శిరస్సులు వంచి నిలబడి “ఓ బ్రాహ్మణోత్తములారా ! ఆకలిగొన్న మాకు త్వరగా అన్నము పెట్టండి” అనగా ఆ మాటలను కొందరు బ్రాహ్మణులు చెవిని బెట్టలేదు. కొందరు వినికూడ కదలక ఉన్న చోటనే ఉండిరి.

తే యయూరంధనాగారం బ్రాహ్మణ్యో యత్ర పాచికాః

గత్వా బాలా విప్రభార్యాః ప్రణేముర్నతకంధరాః

నత్వోచుర్బాలకాస్సర్వే విప్రభార్యాః పతివ్రతాః

అన్నం దత్త మాతరోఽతస్మాన్ క్షుథార్తాన్ బాలకానపి

ఆ గోపబోలురు బ్రాహ్మణస్త్రీలు వంటచేయుచున్న వంటశాలలోనికి వెళ్లి తలలు వంచి విప్రుల భార్యలకు నమస్కరించిరి. పతివ్రతలైన విప్రభార్యలతో ఆబాలురీట్లనిరి “ఓ తల్లులారా! ఆకలితో బాధపడుచున్న చిన్న పిల్లలమగు మాకు అన్నము పెట్టండి”.

బాలానాం వచనం శ్రుత్వా దృష్ట్వా తాంశ్చ మనోహరాన్

వప్రచ్ఛుః సాదరం సాధ్వ్యః స్మేరానన సరోరుహాః

ఆ బాలుర మాటలు విని సుందరముగా నున్న వారిని చూచి చిరునవ్వు గల ముఖపద్మములతో నున్న ఆ సాధ్వీమణులు ఆదరముగా నడిగిరీ.

విప్రపత్న్య ఊచుః - బ్రాహ్మణుల భార్యలనిరి :

కే యూయం ప్రేషితాః కేన కాని నామాని కోవిదాః

దాస్యామోఽన్నం బహువిధం వ్యంజనైస్సహితం వరం

మీరెవరు? మిమ్మెపరు పంపిరి? మీ నామము లేవీ? కూరగాయలతో బాటు అనేక విధములైన మంచి భోజనము మీకు పెట్టుదుము”.

బ్రాహ్మణీనాం వచః శ్రుత్వా తా ఊచుస్తే ముదాన్వీతాః

స్నిగ్ధా హసంతః స్ఫీతాశ్చ సర్వే గోపాలబాలకాః

బ్రాహ్మణ స్త్రీల మాటలు విని సంతోషించిన గోపబాలురు ప్రేమ భావముతో నవ్వుచు విచ్చిన ముఖములతో ఇట్లనిరి.

బాలా ఊచుః - బాలురు పలికిరి :

ప్రేషితా రామకృష్ణాభ్యాం వయం క్షుత్పిడితా భృశం

దత్తాన్నం మాతరోఽస్మభ్యం క్షప్రం యామస్తదంతికం

ఇతో విదూరే భాండీరే వనాభ్యంతరమేవ చ

వటమూలే మధువనే వసంతౌ రామకేశవౌ

విశ్రాంతౌ క్షుధితౌ తౌ చ యాచేతేఽన్నం చ మాతరః

క్రిము దేయమదేయం వా శీఘ్రం వదత నోఽధునా

“ఓ తల్లులారా! బలరామకృష్ణులు మమ్మిచటికి పంపిరి. మిక్కిలి ఆకలి బాధతోనున్నోము. మాకొరకన్నము పెట్టుడు. మేము త్వరగా వారి వద్దకు పోయెదము. ఇక్కడికి సమీపమున భాండీర వనము లోపలి మధువనములో మళ్లీచెట్టు క్రింద బలరామకృష్ణులున్నారు. అలసట తీర్చుకొనుచు ఆకలిగొనియున్న వారు అన్నము యాచించినారు. పెట్టగలరా లేదా త్వరగా మాకు చెప్పవలసినది”.

గోపానాం వచనం శ్రుత్వా హృష్టానందాశ్రులోచనాః

పులకాంకిత సర్వాంగాః తత్పాదాబ్జమనోరథాః

నానావ్యంజన సంయుక్తం శాల్యన్నం సుమనోహరం

పాయసం పిష్టకం స్వాదు దధి క్షీరం ఘృతం మధు

రౌప్యే కాంస్యే రాజతే చ పాత్రే కృత్వా ముదాన్వితాః

తాన్పర్వా విప్రపత్న్యశ్చ ప్రయయుః కృష్ణసన్నిధిం

నానామనోరథం కృత్వా మనసా గమనోత్సుకాః

పతివ్రతాస్తా ధన్యాశ్చ శ్రీకృష్ణ దర్శనోత్సుకాః

గోపాల బాలుర మాటలు విని పతివ్రతలైన విప్రపత్నులు సంతోషముతో కన్నుల యందు ఆనంద బాష్పములు నిండగా దేహమంతయు పులకాంకురము లేర్పడగా శ్రీ కృష్ణుని పాదపద్మములందే తమ సంకల్పములు (తలపులు) పెట్టి నానా విధములైన శాకములతో కూడిన శాల్యన్నము (మంచి బియ్యపు అన్నము) రుచి గల పిండి వంటకమైన పాయసము పెరుగు పాలు నెయ్యి తేనె వెండి కంచు బంగారు పాత్రలలో పెట్టుకొని నానావిధమైన కోరికలను మనస్సులో తలచుకొనుచు శ్రీకృష్ణ దర్శనము నందు తహతహగలవారై శ్రీకృష్ణుని సన్నిధికేగిరి.

శ్రీకృష్ణం దదృశుర్గత్వా రామo చ సమబాలకం

పటమూలే వసంతం తముడుమధ్యే యథోడుపం

శ్యామం కిశోర వయసం పీతకౌశేయ వాససం

సుందరం సస్మితం శాంతం రాధాకాంతం మనోహరం

శరత్పార్వణ చంద్రాస్యం రత్నాలంకార భూషితం

రత్నకుండల యుగ్మాభ్యాం గండస్థల విరాజితం

రత్నకేయూర వలయ రత్న నూపుర భూషితం

ఆజానులంబికాం శుభ్రం బిభ్రతం రత్నమాలీకాం

మాలతీ మాలయా కంఠవక్ష స్థ్సలవిరాజితం

చందనాగురు కస్తూరీ కుంకుమాంచిత విగ్రహం

సునఖం సుకపోలం చ వక్వబింబాధరం వరం

పక్వదాడిమబీజాభం బిభ్రతం దంతముత్తమం

శిఖిపిచ్ఛసమాయుక్తం బద్ధ చూడం పరాత్పరం

కదంబ పుష్ప యుగ్మాభ్యాం కర్ణమూలే విరాజితం

ధ్యానాసాధ్యం యోగినాం చ భక్తానుగ్రహకాతరం

బ్రహ్మేశశేష ధర్మేంద్రైః స్తూయమానం మునీశ్వరైః

ఆ విప్రపత్నులు వటవృక్ష మూలమందు బాలకులలో బలరామునితో గూడియున్న శ్రీ కృష్ణుని దర్శించిరి. నక్షత్రముల నడుము చంద్రుని వలే అతడు ప్రకాశించుచుండెను. కిశోర (బాల్య) వయస్సు కలిగి శ్యామసుందర శరీరమున పసుపుపచ్చ పట్టు వస్త్రము ధరించిన ఆ రాధారమణుడు చిరునవ్వుతో శాంత మనోహరుడుగా నుండెను. శరత్పూర్ణిమ నాటి చంద్రుని వంటి ముఖమండలము - రత్నకుండలములతో తళతళ లాడుచున్న చెక్కిళ్లు (చెంపలు) రత్నాల దండకడియములు రత్న కంకణములు రత్నాల అందెలు మోకాళ్ల వరకు వ్రేలాడుచున్న శుభ్రమైన రత్నమాల - ఇట్టి ఆభరణములతో అలంకృతుడై మాలతీ పుష్పమాల కంఠమున వక్షస్థలమున విరాజిల్లుచుండగా ఆ స్వామి అద్భుతముగా నుండెను. పండిన దొండపండు వంటి సుందరమైన క్రింది పెదవి, పండిన దానిమ్మ పండులోని విత్తులవంటి చక్కని పలువరుస, చక్కని కపోలములు (చెక్కిళ్ళు) - కొండె కొప్పున చెక్కిన నెమిలి యిక - చెవుల సందులలో చెక్కిన కడిమి పూలు - సుందరముగా వెలుచున్న మూర్తితో అపరాత్పరుడు యోగులకు కూడ ధ్యానమునకు చిక్కనివాడు, భక్తులననుగ్రహించవలెనన్న తొందర గలవాడు, బ్రహ్మరుద్ర ధర్మ శేషేంద్రాది దేవతల చేత మునుల చేత స్తుతింపబడుచున్నవాడు వారికీ కన్పించెను.

దృష్ట్వైవమీశ్వరం భక్త్యా ప్రణేముర్ద్విజ యోషితః

స్వానాం జ్ఞానానురూపం చ తుష్టువుర్మధుసూదనం

ఈ విధముగా నున్న పరమేశ్వరుని బ్రాహ్మణ స్త్రీలు దర్శించి భక్తితో నమస్కరించి తమకున్న జ్ఞానము బట్టి ఆ మధుసూదనుని ఇటు స్తోత్రమొనర్చిరి.

విప్రవత్న్య ఊచుః - బ్రాహ్మణుల భార్యలీట్లనిరిః

త్వం బ్రహ్మ పరమం ధామ నిరీహో నిరహంకృతిః

నిర్గుణశ్చ నిరాకారః సాకారః నగుణః న్వయం

సాక్షిరూవశ్చ నిర్లిప్తః వరమాత్మా నీరాకృతిః

ప్రకృతిః పురుషస్త్వం చ కారణం చ తయోః పరం

సృష్టి స్థిత్యంతవిషయే యే చ దేవాస్త్రయః స్మృతాః

తే త్వదంశాః సర్వబీజా బ్రహ్మవిష్ణుమహేశ్వరాః

స్వామీ ! నీవు అన్నిటియందు వ్యాపించి యుండు వరబ్రహ్మవు. శ్రేష్ఠమైన లక్షణములకు స్థానము నీవు. నత్యకాముడవు కనుక నీకందని కోరికలు లేనందున ఎట్టి కోరికలు లేనివాడపు. తమోగుణమైన అహంకారము నీయందుండదు. నిర్గుణుడివందురు ఐనను నగుణుడవు (అనగా అశుద్ధ గుణములు లేకుండ లోక కల్యాణ గుణములు గలవాడవు). నిరాకారుడవయ్యు భక్తుల కందుబాటులో నుండుటకు సాకారుడవు. జీవుల కర్మలను చూచి నియమించు సాక్షివి నీవు ఐనను నీకెవరియందును ద్వేషము మమకారము లేనందున నిర్లిపుడవు (ఏది అంటని వాడవు) ఒకే విధమైన ఆకారము లేని పరమాత్మవు. ఈ ప్రకృతి నీ రూపమే. ఆత్మలు నీవే. ప్రకృతికి జీవునకు మూలము ఆధారము నీవే. సృష్టి - రక్షణ - లయము అను విషయములో ఏ ముగ్గురు దేవతలు చెప్పబడిరో ఆ బ్రహ్మవిష్ణు మహేశ్వరులు సృష్టికి బీజభూతులు - (కారణమయినవారు) నీ అంశభూతులు కదా.

యస్య లోమ్నాం చ వివరే చాఖిలం విశ్వమీశ్వర

మహావిరాణ్మహావిష్ణుస్త్వం తన్య జనకో విభో

తేజస్త్వం చాపి తేజస్వీ జ్ఞానం జ్ఞానీ చ తత్పరః

వేదేఽనిర్వచనీయస్త్వం కస్త్వాం స్తోతుమిహేశ్వరః

మహదాది సృష్టి సూత్రం పంచ తన్మాత్రమేవ చ

బీజం త్వం సర్వశక్తీనాం సర్వశక్తి స్వరూవకః

సర్వశక్తీశ్వరః నర్వః సర్వ శక్త్యాశ్రయః సదా

త్వమవీహః స్వయం జ్యోతిః నర్వానందః సనాతనః

ఏ గొప్ప విరాట్పురుషుని యొక్క రోజు కూపమున మొత్తము విశ్వమీమీడియున్నదో అట్టి మహావిష్ణువును కన్న తండ్రివి నీవు. తేజస్సు నీవే తేజస్సు గల గలవాడవు నీవే. జ్ఞానము జ్ఞానివగు నీయందిమిడి యున్నది. వేదము నందు నీవింతవాడవిట్టివాడవని నిర్వచనము చేయ వీలు లేనట్టివాడవు. నిన్ను స్తుతించుటకెవడు. ఈశ్వరుడు (తగిన అధికారి). సృష్టి మూలమైన మహత్తు మొదలగునవి పంచతన్మాత్రలు (స్థూలమైన పంచభూతములకు మూలమైన భూత సూక్ష్మములు) అను సర్వశక్తులు నీవే. సర్వశక్తులరూపము నీవే. సర్వము నీవే. తీరని కోరికలు లేని ఆనీహుడవు. స్వయం ప్రకాశరూపుడవు. సర్వానందములు గల సనాతనుడవు నీవే.

అహోఽప్యాకారహీనస్త్వం సర్వవిగ్రహవానపి

నర్వేంద్రియాణాం విషయం జానాసి నేంద్రియా భవాన్

సరస్వతీ జడిభూతా యత్స్తోత్రే యన్నిరూవణే

జడీభూతో మహేశశ్చ శేషో ధర్మో విధిః స్వయః

పార్వతీ కమలా రాధా సావిత్రి వేదనూరపి

వేదశ్చ జడతాం యాతి కే నా శక్తా వివశ్చితః

వయం కిం స్తవం కుర్మః స్త్రియః ప్రాణేశ్వరేశ్వర

ప్రసన్నో భవ నో దేవ దీనబంధో కృపాం కురు

అన్ని రూపములు ధరించు వాడవైనను నీవాకార రహితుడవు. అన్నీ ఇంద్రియముల వలన పొందబడు జ్ఞానము నీకున్నది ఐనను అది నీవింద్రియము కలిగి ఉండుట వలన కాదు. ఎవనిని స్తుతించుటలో ఎవడిట్టివాడని నిరూపించుటలో సరస్వతి జడురాలైనదో, (జ్ఞానము లేనిది) మహేశుడు శేషుడు ధర్ముడు స్వయముగా బ్రహ్మ కూడ జడులైరో - పార్వతీయు లక్ష్మీయు రాధాదేవియు సావిత్రియు వేదమాత గాయత్రియు వేదమును జడత్వమును పొందుదురో అట్టి నిన్ను స్తుతించుటకు ఏ విద్వాంసులకు శక్తి కలదు ? ప్రాణేశ్వరులకు ఈశ్వరుడవైన స్వామీ ! స్త్రీలమైన మేము నిన్నేముని స్తుతింతుము. ఓ దీనబంధూ ! మా యందు ప్రసన్నుడవు కమ్ము. దయ చూపుము.

ఇతి పేతుశ్చ తావివ్రపత్న్యస్తచ్చరణాంబుజే

అభయం ప్రదదౌ తాభ్యః ప్రసన్న వదనేక్షణః

ఇట్లు పలికి ఆ బ్రాహ్మణుల భార్యలు అతని చరణారవిందములపై వడిరి. ప్రసన్నమైన ముఖమండలము చూపులు గలవాడై స్వామీ వారికి అభయమిచ్చెను.

విప్రవత్నీ కృతం స్తోత్రం పూజాకాలే చ యః పఠేత్

న గతిం విప్రపత్నీనాం లభతే నాత్ర సంశయః

విప్రపత్నులొనర్చిన స్తోత్రమును పూజా సమయములో ఎవడు పఠించునో ఆ వ్యక్తి ఏప్రపత్నులు పొందిన ఉత్తమ గతిని పొందుననుటలో సంశయము లేదు.

నారాయణ ఉవాచ - నారాయణమహర్షి పలికెను :

తాః పాదాంభోజపతీతా దృష్ట్వా శ్రీమధుసూదనః

వరం వృణుత కల్యాణం భవితా చేత్యువాచ హ

శ్రీకృష్ణస్య వచః శ్రుత్వా విప్రపత్న్యో ముదాన్వితాః

తమూచుర్వచనం భక్త్యా భక్తినమ్రాత్మ కంధరాః

తన పాదపద్మముల మీద బడిన వారిని చూచి మధుసూదనుడు పరమును కోరుకొనుడు. మీకు శుభము జరుగును అని పలికెను. శ్రీకృష్ణుని వాక్కు విని ఏప్రపత్నులు సంతోషించి భక్తితో శిరస్సులు వంచి స్వామితో ఇట్లనిరీ.

ద్విజపత్య ఊచుః - బ్రాహ్మణుల భార్యలిట్లు పలికిరి :

వరం కృష్ణ న గృహ్ణీమో నః స్పృహా త్వత్పదాంబుజే

దేహి స్వం దాస్యమన్మభ్యం దృఢాం భక్తిం నుదుర్లభాం

వశ్యామోఽసుక్షణం వక్త్ర నరోజం తవ కేశవ

అసుగ్రహం కురు విభో న యాస్యామో గృహం పునః

శ్రీకృష్ణా! నీవిచ్చు వరము మేము గ్రహింపము. నీ పాద పద్మములమీదనే మాక పేక్ష (కోరిక) కలదు. మాకు నీ దాస్యమును మిక్కిలి దుర్లభమైన దృఢభక్తిని ఇమ్ము. ఓ కేశవా ! ప్రతీక్షణము నీ ముఖకమలమును దర్శించుచుందుము. గృహములకు తిరిగిపోము. ప్రభూ ! మాకీవరము నిచ్చి ముమ్ము దయచూడుము.

ద్విజపత్నీ వచః శ్రుత్వా శ్రీకృష్ణుః కరుణానిధిః

ఓ మిత్యుక్త్యా త్రిలోకేశస్తస్థౌ బాలకసంసది

ప్రదత్తం విప్రపత్నీభిర్మిష్టమన్నం సుధోపమం

బాలకాన్ భోజయిత్వా తు న్వయం చ బుభుజే విభుః

విప్రపత్నుల మాటలు విని కరుణానిధియైన శ్రీకృష్ణుడు “సరీయే” అని అంగీకార వాక్యము పలికి ఆ త్రిలోకనాథుడు బాలకుల సభలో కూర్చుండిను. విప్రపత్నులు తెచ్చి యిచ్చిన, అమృతము వలె రుచికరమైన అన్నమును బాలకులకు తానుగా తినబెట్టి స్వామి కూడ భుజించెను.

ఏతస్మిన్నంతరే తత్ర శాతకుంభం రథం పరం

దదృశుర్విప్రమత్న్యశ్చ వతంతం గగనాదహో

రత్నదర్పణ సంయుక్తం రత్నసార పరీచ్ఛదం

రత్నస్తంభైర్నిబద్ధం చే సద్రత్న కలశోజ్జ్వలం

శ్వేతచామర సంయుక్తం వహ్ని శుద్ధాంశుకాన్వితం

పారిజాత ప్రసూనాసాం మాలాజలైర్విరాజితం

శతచక్ర సమాయుక్తం మనోయాయి మనోహరం

వేష్టితం పార్షదైర్దివ్యైర్వనమాలా విభూషితైః

పీతవస్త్ర పరీధానై రత్నాలంకార భూషితైః

నవయౌవన సంపన్నైః శ్యామలైః సుమనోహరైః

ద్విభుజైర్మురలీహస్తై ర్గోపవేష ధరైర్వరైః

శిఖిపిచ్ఛగుంజమాలా బద్ధవక్రిమ చూడకైః

ఇంతలో ఆకాశము నుండి క్రిందికి దిగివచ్చుచున్న దివ్యమైన బంగారు రథమును విప్రపత్నులు చూచిరి. ఆ రథము రత్న దర్పణములతో (అద్దాలు) రత్నాలంకారములతో ఉత్తమ రత్న కలశముల కాంతితో ప్రకాశించుచు రత్నాల స్తంభములతో కూర్చబడియుండెను. తెల్లని చామరేములు అగ్నివలి ఎట్టిగా ప్రకాశించు వస్త్రములు పారిజాత పుష్పముల మాలలతో అది విరాజిల్లుచుండెను. సుందరముగా సున్న ఆ రథము నూరు చక్రములు కలదై మనస్సుతో సమానముగా ప్రయాణించునది - నవయౌవన వంతులు శ్యామల వర్ణులు మిక్కిలి మనోహరముగా (సుందరముగా) నున్న దివ్యపారదులు ఆ రథమును చుట్టి యుండిరి. వారందరు పీతాంబరములు (పసుపువన్నె వస్త్రములు) ధరించి రత్నాలంకారములు పాదముల వరకు వ్రేలాడు పుష్పహారము లలంకరించుకొని ఉండిరి. నెమిలి యీకలు గురివింద గింజల మాలలు వంకరగా (ఒక ప్రక్కకు) ముడివేసిన కొండెకొప్పుల మీద ధరించి సుందర గోపాల వేషములు ధరించిన వారందరు పిల్లనగ్రోవులు పట్టుకొని ద్విభుజులై (రెండు చేతులు గలవారు) ఉండిరి.

ఆవరుహ్య రథాత్తూర్ణం తే ప్రణమ్య హరేః పదం

రథమారోహణం కర్తుమూచుర్భ్రాహ్మణ కామినీః

విప్రభార్యా హరిం నత్వా జగ్ముర్గోలోకమీప్సితం

బభూవుర్గోపికాస్సద్యః త్యక్త్యా మానుష విగ్రహాన్

హరిశ్ఛాయాం వినిర్మాయ తాసాం చ విష్ణుమాయయా

ప్రస్థాపయామాస గృహాన్ బ్రాహ్మణానాం స్వయం విభుః

ఆ దివ్యపారదులు రథము నుండి దిగి శ్రీహరి పాదములకు నమస్కరించి రథము నెక్కవలసినదిగా బ్రాహ్మణ స్త్రీలకు చెప్పిరి. విప్రపత్నులు శ్రీవారికి నమస్కరించి మనుష్య దేహములు విడిచి అప్పటికప్పుడు గోలోకమందలి గోపికారూపములు పొంది కోరుకున్న గోలోకమునకేగిరి. విభుడైన శ్రీహరి (కృష్ణుడు) విష్ణుమాయతో ఆ ద్విజపత్నుల ఛాయారూపములను సృష్టించి బ్రాహ్మణ గృహములకు స్వయముగా పంపించెను.

విప్రాశ్చ భార్యా ఉద్దిశ్య పరమోద్విగ్నమానసాః

అన్వేషణం ప్రకుర్వంతో దదృశుః పధి కామినీః

దృష్ట్వోచుర్బ్రాహ్మణాః సర్వే తాస్తే చ వినయాన్వితాః

పులకాంకిత సర్వాంగాః ప్రసన్న వదనేక్షణాః

బ్రాహ్మణులు తమ భార్యల గురించి మిక్కిలి తొందరపడు మనన్పులతో వెదుకుచు వెదుకుచు వచ్చి త్రోవలో తమ స్త్రీలను చూచిరి. వారందరు తమ భార్యలను చూడగానే శరీరములు పులకించి ప్రసన్నమైన ముఖములు చూపులు గలవారై భార్యలతో వినయముగా నిట్లు పలికిరి.

బ్రాహ్మణా ఊచుః - బ్రాహ్మణులనిరి :

అహోఽతిధన్యా యూయం చ దృష్టో యుష్మాభిరీశ్వరః

అస్మాకం జీవనం వ్యర్థం వేదపాఠోఽవ్యనర్థకః

వేదే పురాణే సర్వత్ర విద్వద్భిః పరికీర్తితాః

హరేర్విభూతయః సర్వాః సర్వేషాం జనకో హరిః

తపో జపో ప్రతం జ్ఞానం వేదాధ్యయన మర్చనం

తీర్థస్నానమనశనం సర్వేషాం ఫలదో హరిః

మీరు భగవంతుని దర్శించి ధన్యులైతిరి. ఆశ్చర్యము. మా జీవితము మా వేదపఠనమంతయు వ్యర్థము. వేదములు పురాణములు విద్వాంసులు ఏకకంఠముగా ఈ సమస్త ప్రపంచము శ్రీవారి విభూతి అనియు అందరికి శ్రీహరియే జనకుడనియు కీర్తించిరి. తపస్సులకు జపములకు ప్రతములకు జ్ఞానమునకు వేదాధ్యయనమునకు అర్చనలకు తీర్థస్నానములకు ఉపవాసవ్రతములకు అన్నిటికీ ఫలదాత శ్రీహరి.

శ్రీకృష్ణః సేవితో యేన కిం తస్య తపసాం ఫలైః

ప్రాప్తః కల్పతరుర్యేన కిం తస్యాన్యేన శాఖినా

శ్రీకృష్ణో హృదయే యన్య తస్య కిం కర్మభిః కృతైః

కిం వా స సాగరస్యేవ పౌరుషం కూపలంఘనే

ఇత్యేవముక్త్యా విప్రాశ్చ గృహీత్వా కామినీ వరాః

ఆజగ్ముః స్వగృహం హృష్టాస్తాభిః సార్థం చ రేమిరే

శ్రీకృష్ణుని సేవించిన వారికి తపస్సు యొక్క ఫలములతోనేమి పని ? కల్పతరువు లభించిన వానికి ఇతర వృక్షములతోనేమి ప్రయోజనము ? శ్రీకృష్ణుడివని హృదయమున వసించునో ఆ వ్యక్తికి కర్మలతోను కర్మ ఫలములతోను పనియేమి ? సముద్రము దాటిన వానికి చేద బావిని లఘించుట ఒక పౌరుష కార్యమా ? ఇట్లు ఆ బ్రాహ్మణులు భార్యలతో పలికీ వారిని గృహములకు గొని పోయిరి. ఆనందముగా వారితో సంసార నిర్వహణము చేసిరి.

తాసాం తతోఽధికం ప్రేమక్రీడాసు సర్వకర్మసు

దాక్షిణ్యం మాయయా శక్త్యా బ్రాహ్మణానామతర్కితం

విష్ణుమాయాశక్తి వలన ఆ బ్రాహ్మణులకు తమ భార్యలక్రీడా విలాసముల యందు వారు చేయు పనుల యందు ఊహకందని అధికమైన ప్రేమ దాక్షిణ్యభావము ఏర్పడెను.

అధ నారాయణః సోఽయం బలేన శీశుభిః సహ

జగాము స్వాలయం తూర్ణం పూర్ణ బ్రహ్మ సనాతనః

ఇత్యేవం కథితం సర్వం హరేర్మాహాత్మ్యముత్తమం

పురా శ్రుతం ధర్మవక్త్రాత్ కీం భూయః శ్రోతుమిచ్ఛసి

సనాతనుడు పూరబ్రహ్మ ఐన నారాయణుడు (శ్రీకృష్ణుడు) ఆ తరువాత బలదేవునితో బాలురతో గూడి త్వరగా తమ నివాసమునకు పోయెను. ఇట్లు ఉత్తమమైన శ్రీహరి మాహాత్మ్యము మొత్తము ధర్మరుషి ముఖము నుండి పూర్వము నేను విన్నది విన్నట్లు చెప్పితిని. ఇంకేమీ వీనగోరుచున్నావు ?

నారద ఉవాచ - నారదుడనేను :

ఋషీంద్ర కేన పుణ్యేన బభూవ విప్రయోషితాం

మునీంద్ర యోగసిద్ధానాం దుర్లభా గతిరీశ్వరీ

ఇమాః కా వా పుణ్యవత్యః పురా తస్థుర్మహీతలం

ఆజగ్ముః కేన దోషేణ వద సందేహభంజనం

ఋషివరా ! మునీంద్రులకు యోగసిద్ధులకు దుర్లభమైన ఈశ్వరప్రాప్తి (మోక్షము) విప్ర స్త్రీలకు ఏ పుణ్యము వలన లభించెను ? ఈ పుణ్యవతులు ఎవరు ? పూర్వమీ భూమండలము మీద ఎక్కడ నివసించిరి. లేదా ఏ దోషము వలన భూమి మీదికి వచ్చిరి ? ఈ సందేహములు తొలగించు సమాధానము తెల్పుము.

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి ఇట్లనెను :

సప్తర్షీణాం రమణ్యశ్చ రూపేణాప్రతిమాః పరాః

గుణవత్యః సుశీలాశ్చ ధర్మిష్ఠాశ్చ పతివ్రతాః

సవీన యౌవనాః సర్వాః పీనశ్రోణిపయోధరాః

దివ్యవస్త్ర పరీధానా రత్నాలంకార భూషితాః

తప్త కాంచనవర్ణాభాః స్మేరానన నరోరుహాః

మునీనాం మోహితుం శక్తా మాననం వక్రచక్షుషా

సప్తఋషుల భార్యలు మంచి గుణవతులు సతీశీలము గలవారు ధర్మమునందే మనస్సు నీలిచిన పతివ్రతలు. రూపములో గూడ సాటిలేనివారు. అందరు ఎల్లప్పుడు క్రొంగొత్తగా కన్పించు యావనము గలవారు. బలసిన పిరుదులు స్తనములు గలిగి దివ్య వస్త్రములు ధరించి రత్నాలంకార భూషితలై ఉండువారు. వారి శరీరపు రంగు కాచిన బంగారు కాంతితో ముఖములు చిరునవ్వుతో వెలుగుచుండును. సహజమైన వంకర చూపుతో (కటాక్షములు - కడగంటి చూపులు) మునుల మనస్సులను మోహపరచు శక్తి కలిగియుండిరి.

దృష్ట్వా తాసాం స్తన శ్రోణి ముఖానీ సుందరాణి చ

అనలశ్చకమే తాశ్చ మదనానల పీడితః

అగ్నిస్థాన స్థితానాం చ శిఖయా సురతోన్ముఖః

స్పృష్ట్వా చాంగాని తాసాం చ బభూవ హతచేతనః

పతివ్రతా న జానంతి పతిపాదాబ్జ మానసాః

అగ్నిరంగావి తాసాం చ దర్శం దర్శం ముమోహ చ

వారి సుందరమైన మధ్యప్రదేశమును స్తనములను ముఖములను చూచి అగ్నిదేవుడు మన్మధాగ్ని చేత పీడితుడై వారిని కామించెను. అగ్ని కుండ సమీపమున (యజ్ఞసమయములో) కూర్చున్న వారిని బుద్ధి నశించి సురతమునంద పేక్ష కలవాడై తన జ్వాలలతో వారి అంగములను స్పృశించుచు మాటిమాటికి చూచుచు వ్యామోహముతో స్మృతి తప్పుచుండెను. భర్త పాదకమలమునందే మనస్సు గల ఆ పతివ్రతల కదేమీ తెలియకుండెను.

వహ్నేశ్చ మానసం జ్ఞాత్వా భగవానంగిరా మునిః

శశాప తం చేత్యువాచ నర్వభక్షో భవేతి చ

వహ్నిః నచేతసో భూత్వా తుషావ మునిపుంగవం

ప్రీడయా నమ్ర వదనశ్చకంపే బ్రహ్మతేజసా

భగవంతుడగు అంగిరసముని అగ్ని మనస్సు తెలిసికొని “(శుద్ద - అశుద్ధములన్న భేదము పాటింపక) అన్ని పదార్థములను భక్షించువాడవగుదువుగాక” అని శపించెను. అగ్ని అప్పుడు తెలివి తెచ్చుకొని సిగ్గుతో తలవంచుకొని ఆ బ్రహ్మ తేజస్సుకు వణికి పోయి ఆ మహర్షిని స్తుతించెను.

క్రుద్ధో మునివరః స్పృషాః కామీన్యశ్చ శశాప హ

యా యూయం పాపయుక్తా మానుషీం యోనీమేవ చ

భారతే బ్రాహ్మణానాం చ గృహే లభత జన్మ వై

కరిష్యంతి వివాహం చ యుష్మాకం కులజా ద్విజాః

శ్రుత్వా వాక్యం మునేస్తాశ్చ రురుదుః ప్రేమవిహ్వలోః

పుటాంజలి యుతాః నర్వా ఊచుస్తం విదుషాం వరం

క్రోధము చెందిన ముని వరుడు అగ్నిచేత స్పృశింపబడిన ఆకామినులను పాపయుక్తలైన మీరు మనుష్య జన్మనెత్తుటకు పొండు. భారతవర్షమున బ్రాహ్మణ గృహములలో జన్మింతురు గాక అని శపించి మిమ్ము నత్కులమున బుట్టిన బ్రాహ్మణులు వివాహమాడుదురని పలికెను. ఆముని వాక్యమును విని భర్తలయందలి ప్రేమచేత చెదరిన మనస్సులు గలవారై ఆ ఋషిపత్నులేడ్చిరి. చేతులు జోడించి అందరు ఆ విద్వద్వరునితో ఇట్లనిరి.

మునిపత్న్య ఊచుః - మునిపత్నులు పలికిరి :

న త్యజాస్మాన్ మునిశ్రేష్ఠ విష్పాపాశ్చ వతీప్రతాః

అజానంత్యః పరస్పష్టా న చ నస్త్యకుమర్హసి

భక్తానాం కింకరీణాం చ న దండంకర్తుమర్హసి

యుష్మాకం చరణాంభోజం కదా ద్రక్ష్యామ హే పదం

ఖడ్గచ్ఛేదాద్వజ్రపాతాత్పర్వ ప్రహరణాన్మునే

దారుణః కాంతవిచ్ఛేదః సాధ్వీనాం దుస్సహః సదా

బ్రహ్మిష్ఠానాం గుణవతాం పరాన్ కాంతాన్ మహామునీన్

ఏవం భూతాన్ కథం త్యక్త్వా యాస్యామః పృథివీ తలం

యాస్యామో యదీ విప్రేశ కదాఽత్రాగమనం వద

అజ్ఞాన స్పర్శదోషశ్చ న స్యాన్నో విధిబోధితః

ఓ మునిరాజా ! ఏ పాపము చేయని పతివ్రతలమైన మమ్ము పరుడు స్పృశించినది కూడ తెలియని వారిని విడిచి పెట్టవలదు. విడిచి పెట్టదగదు. మేము మీయందు భక్తిగల సేవికలము. మమ్మీట్లు దండించవలదు. మీ పాదపద్మములను మేము మరల ఎప్పుడు చూడగలము ? సాధ్వీజనులకు ప్రియమైన భర్త ఎడబాటు కత్తిచేత నరకుట కంటే పిడుగు పాటుకంటే అన్ని విధములైన దెబ్బల కంటెను ఓర్చుకొనరాని భయంకర సంఘటన. బ్రహ్మము నందే మనసు నిలిచియున్నవారు గుణవంతులలో శ్రేష్ఠులైనవారు మహామునులు అగు. మీరందరు మాకు ప్రియమైనవారు. ఇట్టి వారిని వదిలి మేము భూమి మీదికెట్లు పోగలము?  ఓ ద్విజవరా! ఒక వేళ పోయినచో - శాస్త్రమున చెప్పబడిన - తెలియకుండ సంభవించిన పరస్పర్శ దోషము మాకెట్లు తొలగిపోయి మరల ఇక్కడికి ఎప్పుడు తిరిగి వత్తుమో చెప్పుము.

అహల్యయా పునః ప్రాప్తః స్వామీంద్రస్య ప్రధర్షణాత్

సా సంభోగాత్ పునః శుద్దా స్పర్శనాద్వర్జితా వయం

విచారం కురు ధర్మిష్ఠ వేదవేదాంగ పారగ

విశ్వకర్తుశ్చ పుత్రస్త్వం సర్వవేదవిదాం వరః

అన్వేషాం చ భయాత్కాంతా ప్రజంతి శరణం పతిం

స్వకాంత భయనంవిగ్నాః శరణం కం ప్రజంతి తాః

అభయం దేహి ధర్మిష్ఠ భయయుక్తాభ్య ఏవ చ

పుత్రే శీష్యే కళత్రే చ కోదండం కర్తుమక్షమః

దుర్బలః సబలో వాపి స్వవస్తూనామపీశ్వరః

స్వద్రవ్య విక్రయం కర్తుం న చాన్యో రక్షితుం క్షమః

ఇంద్రుని ఒరపిడి వలన అతనితో సంభోగము సలిపిన ఆహల్య మరల శుద్ధి పొంది తిరిగి తన భర్తను పొందెను. ఓ వేదవేదాంగముల జ్ఞానము పూర్ణముగా తెలిసినవాడా ! నీవు సృష్టికర్త పుత్రుడవు. సర్వవేదవేత్తలలో శ్రేష్టుడవు. ఇతరుల వలన ఏర్పడిన భయమునకు స్త్రీలు భర్తను శరణు పొందుదురు. ధర్మముందు నిలిచిన స్వామీ ! భయముతో గూడిన మాకు అభయ మీమ్ము. పుత్రునియందు శిష్యుని యందు భార్యయందు శిక్ష విధించుటకెవడు సమర్థుడు కాడు ? ఎందుకనగా అతడు దుర్బలుడు గాని బలవంతుడు గాని తన వస్తువుల కధికారి గదా ! ఐనను తన ద్రవ్యమును విక్రయించుట యజమానికి తగదు. అట్లే ఆ ద్రవ్యమునకధికారి కానివాడు రక్షించుటయు తగదు.

కామినీనాం వచః శ్రుత్వా దయాలుర్మునిపుంగవః

ప్రేమ్ణా రురోద తాసాం చ నిరీక్ష్య ముఖపంకజం

వేదవేదాంగ పారజ్ఞో జ్ఞానీనాం యోగినాం వరః

పత్నీ విచ్ఛేద విషయే మూర్ఛాం ప్రాప తదాపి నః

సర్వే బభూవుః శోకార్తా విరహోద్విగ్న మానసాః

నిరీక్ష్య తాసాం వక్త్రాణి తస్థుః పుత్తలికా యథా

కృత్వా విలాపం సుచిరం సర్వవేద విదాం వరః

భ్రాతృభిశ్చ సహాఽలోచ్య తా ఉవాచ శుచాఽఽతురః

ఆ స్త్రీల మాటలు విని దయాస్వభావము గల ఆంగిరసముని పుంగవుడు వారి ముఖ పద్మములను చూచి ప్రేమతో ఏడెను. వేద వేదాంగముల సారమెరిగినవాడు జ్ఞానులలో యోగులలో శ్రేష్టుడైనప్పటికిని ఆ ముని భార్య వియోగమును తలచుకొని మూర్ఛపొందెను. ఆ ఋషులందరును భార్యల విరహమునకు ఉద్విగ్నమైన మనస్సులు గలవారై భార్యల ముఖములను చూచి శోకారులైరి. బొమ్మలవలె బీరీపోయిరి. సర్వవేదవేత్తలలో ఉత్తముడైన ఆంగిరసముని చాల సేపు దుఃఖించి సోదరులతో ఆలోచించి దుఃఖముతో త్వరపడుచు ఆ స్త్రీలతో నిట్లనెను.

ఆంగిరా ఉవాచ - ఆంగీరసముని అనేను :

యూయం శ్రుణుత వక్ష్యామీ వచనం నత్యమేవ చ

న్వకర్మభోగినాం భోగమాకర్మాచ్చ శ్రుతౌ శ్రుతం

గతో భోగశ్చ యుష్మాకమస్మాభిః సహ నిశ్చితం

గతే భోగే పునర్భోగో న హి వేదే నిరూపితః

శుభాశుభం చ యత్కర్మ భారతే కృతిభిః సహా

నాభుంక్తం క్షీయతే కర్మ జన్మకోటిశతైరపి

సత్యమైన వాక్యము చెప్పుచున్నాను. వినుడు. తమ కర్మఫల మనుభవించు వారికి ఆ యనుభవము కర్మశక్తి యున్నంతవరకుండును అనీ వేదమునందు చెప్పబడినది. మీకు మాతో భోగానుభవము తీరిపోయినదని నిశ్చయింపబడినది. కర్మభోగానుభవము క్షయమైన పిదప మరల అనుభవమన్నది వేదమున చెప్పబడలేదు. భారత వర్షములో శుభాశుభ కర్మల ఫలము ఎంతవారికిని అనుభవించకుండ కోటి జన్మలెత్తినను నశించదు (అనుభవించకుండకర్మక్షయము కాదు).

పరభుక్తాం తు కాంతాం చ యో భుంక్తే ననరాధమః

న పచ్యతే కాలసూత్రే యావచ్చంద్ర దీవాకరౌ

న సా దైవే న సా ఫైత్ర్యే పాకార్హా పావనంయుతా

తస్యా ఆలింగనే భర్త భ్రష్ట శ్రీ స్తేజసా హతః

దేవతాః పితరస్తన్య హవ్యదానే చ తర్పణే

నుఖినో న భవంత్యేవమిత్యాహ కమలోద్భవః

పరపురుషుడనుభవించిన స్త్రీని ఏనరాధముడు (నీచ భర్త) అనుభవించునో అతడు చంద్రసూర్యులున్నంత వరకు కాలసూత్రనరకమున పక్వము చేయబడును. అట్టి స్త్రీ (పరపురుషుడనుభవించిన స్త్రీ) దైవకార్యమునందు పితృకార్యము నందు - వంటచేయుటకు పనికి రాదు. అట్టి స్త్రీని ఆలింగనము చేసికొన్న భర్త యొక్క తేజస్సు నశించును. సంపద భ్రష్టమై పోవును. అతడు చేసిన హవ్యదానము (హోమము) వలన దేవతలు సుఖమనుభవించరు, తర్పణము (తిలోదకములు విడుచుట) వలన పితృదేవతలు సుఖమనుభవించరు అని బ్రహ్మ చెప్పెను.

తస్మాద్యత్నేన భార్యాయా రక్షణం కురుతే సుధీః

అన్యథా పాపభాగ్భర్తా నిశ్చితం నరకం వ్రజేత్

పదే పదే సావధానః కాంతాం రక్షతి వండితః

న ప్రతీ స స్థలి యోషా దోషాణాం చ కరండీకా

కలత్రం పాక పాత్రం చ నదా రక్షితుమర్హతి

పరస్పర్శాదశుద్ధాం చ శుద్ధాం స్వస్పర్శనే సదా

న్వకాంతం చ పరిత్యజ్య పరం గచ్ఛతి యాఽధమా

కుంభీపాకం సా ప్రయాతి యావచ్చంద్ర దివాకరౌ

తామేవ యమదూతాశ్చ సంస్థాప్య నరకాంతరే

ఉత్తిష్ఠతి విదూరాచ్చేత్కుర్వంతి దండ తాడనం

నర్పప్రమాణాః కీటాశ్చ తీక్షదంష్ట్రాః నుదారుణాః

దశంతి పుంశ్చం తత్ర సతతం చ దివానీశం

వికృతాకారశబ్దం చ కరోతి శాశ్వతం భియా

న మమార ప్రహారేణ సూక్ష్మదేహ విధారిణీ

ముహూర్తార్థం సుఖం భుక్త్యా లోకేఽత్ర యశసా హతా

పతితా పరలోకే చ గతిమేతాదృశీం లభేత్

పరస్పృష్టా చ వై నారీ యా స్పృహాం కురుతే పరం

సాఽపి దుష్టా పరిత్యాజ్యా చేత్యాహ కమలోద్భవః

తస్మాన్నారీ పరైర్యత్నాదదృష్టా కృతిభిః కృతా

అనూర్యం పశ్యా యా దారాః శద్ధాస్తాశ్చ పతివ్రతాః

స్వచ్ఛందగామినీ యా చ స్వతంత్రా సూకరీ నమా

అంతర్దుష్టా సదా సైవ నిశ్చితం పరగామినీ

స్వామి సాధ్యా చ యా నారీ కులధర్మభియా స్థితా

కాంతేన సార్ధం సా కాంతా వైకుంఠం యాతి నిశ్చితం

అందువలన పండితుడు తగినంత ప్రయత్నించి భార్యను రక్షించుకొనును. తన విధిని (రక్షణ కార్యము) చక్కగా నిర్వహించని నరుడు (భర్త) పాప భాజనుడై నిశ్చయముగా సరకము పొందును. అందుకే తగిన ఏకాగ్రతతో అడుగడుగున పండితుడు తన భార్యను రక్షించుకొనును గాని ప్రతనియమములు పూనినవాడు గానీ ఒక పదవిలో నున్నవాడు గాని చేయలేడు. స్త్రీ దోషములకు స్థానము. కనుక ఎల్లప్పుడు భార్యను వంట పాత్రను (మట్టికుండ) పరస్పర్శ సంభవించకుండ శుద్ధముగా రక్షించుకొనవలెను. ఏ నీచురాలు తనభర్తను వదిలి పరుని పొందునో ఆ స్త్రీ సూర్యచంద్రులున్నంతవరకు కుంభీపాక నరకము (కుండలలో పెట్టి పాపిని వండుట) ను పొందును. ఆమెను యమదూతలు వేరోక అనుభవము కల్గించు నరకములో నిలిపి దూరము నుండి కజ్జలతో కొట్టుదును. జారిణి స్త్రీని వాడి కోరలు కల క్రూరమైన కీటములు (పురుగులు) సర్పములంత పెద్దవి రాత్రింబవళ నరకములో కొరుకుచుండును. సూక్ష్మము సుకుమారమునైన దేహము ధరించిన ఆ దుష్టురాలు (యాతనాశరీరము) ఆ బాధలకు భయముతో బొబ్బలు పెట్టుచు వికారమైన ఆకారము పొందును. దెబ్బలకు చావదు. ఒక సగము ముహూర్త కాలము తుచ్ఛసుఖమనుభవించిన (జారిణి స్త్రీ ఈ లోకమున అపకీర్తి పొంది పరలోకమున ఇట్టి దుర్గతిని పొందును. పరుని చేత స్పృశించబడిన ప్రియును పరపురుషుని పొందవలెనని కోరుకున్న స్త్రీయును దుష్టురాలే పరిత్యజింపదగినదే అని బ్రహ్మ చెప్పెను. అందుకే నేర్పుగల సజ్జనులు స్త్రీని ప్రయత్నతో పరుని కంటబడకుండ కాపాడుకొందురు. అసూర్యం పశ్య (సూర్యునికి కన్పించని స్త్రీ) యైన భార్య పరిశుద్ధురాలు పతివ్రత. స్వేచ్ఛగా పురుషులను పొందు స్త్రీ స్వతంత్రముగా తిరుగు స్త్రీ వంటిది. పరగామిని దుష్టత్వమును లోపల దాచుకొన్న స్త్రీయని నిశ్చయము. ఏ స్త్రీ భర్తచేత క్రమశిక్షణలో పెట్టబడుచు కులధర్మభీతితో ప్రవర్తించునో ఆమె భర్తతో బాటు వైకుంఠమునకు పోవుట నిశ్చయము.

యాత యూయం చ పృథివీం మానుషీ యోనిమీప్సతాం

కృష్ణదర్శనమాత్రేణ గోలోకం యాస్యథ ధ్రువం

హరీణా నిర్మితా ఛాయా యుష్మాకం యోగమాయయా

తా విప్రమందిరే స్థిత్వా చాగమిష్యంతి నో ధ్రువం

పునరంశేన నః పత్న్యా భవిష్యధ న సంశయః

యుష్మాకం మమ శాపశ్చ బభూవ చ పరాధికః

ఇత్యేవముక్త్వా స మునిర్విరరామ శుచాన్వితః

తా ఆగత్య మహీం శాపాద్బభూపుర్విప్రయోషితః

మీరు భూమి మీదికి పోయి మనుష్య జన్మను పొందుడు. శ్రీకృష్ణుని దర్శించినంతలోనే అతడు నిశ్చయముగా మీ ఛాయారూపములను నిర్మించును. ఆ ఛాయా స్త్రీలు బ్రాహ్మణ గృహములలో నిలువగా తిరిగి మావద్దకు మీమీ అంశలతో వచ్చి మాకు భార్యలగుదురు. కనుక నా శాపము మీకు వరము కంటే శ్రేష్ఠము ఇట్లు పలికి వారి యెడబాటు అను విషాదముతో కూడిన వాడై సంభాషణ ముగించెను. ఆ సప్తఋషి భార్యలే భూమీ మీదకి వచ్చి అతని శాపకారణముగా వీఘ్ర స్త్రీలుగా పుట్టిరి.

దత్త్వాన్నం హరయే భక్త్యా ప్రజగ్ముర్హరిమందిరం

బభూవ నిశ్చితం తాసాం శాపశ్చ సంపదోఽధికః

భక్తితో వారు శ్రీహరికన్నము సమర్పించి హరిమందిరమున (గోలోకము) కేగిరి. వారికి నిశ్చయించిన శాపము సంపద కంటే అధిక ఫలదాయకమయ్యెను.

నింద్యా నీచాచ్చ సంపత్తిర్విపత్తిర్మహతో వరా

అహో సద్యః సతాం కోపశ్చోపకారాయ కల్పతే

వినా విపత్తేర్మహిమా కుతః కస్య భవేద్భువి

భూతాః కాంత పరిత్యాగాన్ముక్తా బ్రాహ్మణ యోషితః

ఇత్యేవం కథితం సర్వం హరేశ్చరితముత్తమం

అహో పుణ్యవతీనాం చ మోక్షాఖ్యానం మనోహరం

నీచుని వలన పొందు సంపద నింద్యము. గొప్పవాని వలన కలిగేడు ఆపద శ్రేష్టమైనది. ఆశ్చర్యము! అప్పటికపుడేర్పడిన సాధువుల కోపము ఉపకారము సమకూర్చును. ఎవనికి గాని ఎక్కడ గాని ఆపదలేకుండ మహిమ (గొప్పస్థితి) ఎట్లు కల్గును. ప్రియులైన భర్తల నెడబాయుట వలన (త్యజించుట వలన) బ్రాహ్మణ స్త్రీలు ముక్తిని పొందిరి. ఈ విధముగా ఉత్తమమైన హరి చరిత్ర మొత్తము పుణ్యవతులైన స్త్రీలు మోక్షము పొందుటయను మనోహర చరిత్రము నీకు చెప్పితిని.

శ్రీకృష్ణాఖ్యాసం విప్రేంద్ర నూత్నం నూత్నం పదే పదే

న హి తృప్తి: శ్రతపతాం కేన శ్రేయసి తృవ్యతే

యావద్రమం తత్కధీతం యచ్ఛ్రుతం గురువక్త్రతః

వద మాం వాంఛితం యత్తే కిం భూయః శ్రోతుమిచ్ఛసి

ఓ విప్రేంద్రా! (నారదా) శ్రీకృష్ణ చరిత్ర అడుగడుగున మాటమాటలో క్రొంగ్రత్తగా నుండును. వీనువారికి తృప్తియుండదు. ఇంకను వినవలెననిపించును. ఔను. శ్రేయస్సులభించు దానియందేననికి చాలునని తృప్తి యేర్పడును. దీనిని గురుముఖత వింటినో ఏది రమ్యమైనదో అది చెప్పితిని. ఇంకేమి వినగోరుచున్నావు. నీకోరిక ఏమిటో చెప్పుము.

నారద ఉవాచ - నారదుడనేను :

యద్యచ్ఛ్రుతం త్వయా పూర్వం గురువక్త్రాత్ కృపానిధే

మంగలం కృష్ణ చరితం తన్మే బ్రూహి జగద్గురో

ఓ దయానిధీ ! జగదురూ ! నీవు గురుముఖమున పూర్వమేదేది వింటివో ఆయా మంగళకరమైన కృష్ణ చరిత్ర మొత్తము నాకు చెప్పుము.

సూత ఉవాచ - సూతుడనెను :

శ్రుత్వా దేవర్షి వచనమృషిర్నారాయణః స్వయం

అపరం కృష్ణమాహాత్మ్యం ప్రవక్తుముపచక్రమే

ఆ దేవ ఋషియైన నారదుని మాట విని నారాయణ మహర్షి స్వయముగా కృష్ణమాహాత్మ్యములోని వేరొక ఘట్టమును చెప్పనారంభించెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే విప్రవర్నీ మోక్షణ ప్రస్తావో నామాష్టాదశోఽధ్యాయః.

ఇది బ్రహ్మవైవర్తపురాణములో శ్రీకృష్ణ జన్మఖండములో విప్రపత్నులు మోక్షము పొందిన ప్రస్తావ మనెడి పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.