మూ॥ నంద ఉవాచ –
శ్రీకృష్ణ జగతాంనాథ సుస్వప్నశ్చశ్రుతో మయా ।
వేదసారోనీతిసారో లౌకికో వైదికస్తథా ॥
అధునాశ్రోతుమిచ్ఛామి పాపం యేషాం చదర్శనే ।
యస్మిన్ కర్మణివా వత్స తన్మాం కథితుమర్హసి ॥
కథితం వేదశాస్త్రోక్తం తథావేదానుయాయినః ।
శ్రోతుమిచ్ఛంతి సంతప్తాలోకాస్త్వన్ము ఖతస్తథా ॥
వేదానాంజనకస్త్వంచ వైదికానాం సతామపి ।
బ్రహ్మదీనాంసురాణాంచ మునీనాం జగతామపి ॥
శ్రుతం యత్త్వన్ముఖాం భోజాత్రమాణం వచనామృతం ।
తేనదేహోఽభిషిక్తోమే వత్స విచ్ఛేద దాహనః ॥
స్వప్నేయచ్చరణాం భోజం సర్వకామఫలప్రదం ।
బ్రహ్మాదయోనపశ్యంతి తదద్య దృష్టిగోచరం ॥
అతఃపరంత్వత్పదాబ్జం క్వపశ్యామిచపాతకీ ।
విణ్మూత్రధారీదేహోమే నిబద్ధశ్చ స్వకర్మణా ॥
ఈదృశంచ దినంవత్సకదామనభవిష్యతి ।
త్వయాబ్రహ్మాదినాథేన సంవాదో మమ పాపినః ॥
కృపాంకురుకృపానాథ మమదోషం క్షమస్వచ ।
వత్సబుద్ధ్యాచదుర్నీతం మత్కృతంచ మహేశ్వర ॥
బ్రహ్మేశశేషము నయోధ్యాయంతే త్వత్పదాంబుజం ।
సరస్వతీశ్రుతిర్యస్యస్తవనే జడతాంవ్రజేత్ ॥
ఇత్యేవముక్త్యానందశ్చ నిరానందః శుచాఽకులః ।
మూర్ఛామాపరుదిత్వాచ పుత్రవిచ్ఛేద విహ్వలః ॥
సంత్రస్తో భగవాన్ కృష్ణాబోధయామాస యత్నతః ।
పరమాధ్యాత్మికం జ్ఞానం దదౌతస్మై జగత్పతిః ॥
శ్రీభగవానువాచ ।
హేనంద జనక శ్రేష్ఠ సర్వ శ్రేష్ఠ వ్రజేశ్వర ।
చేతనం కురుకల్యాణ జ్ఞానంచ పరమంశృణు ॥
పరమాధ్యాత్మికం జ్ఞానం జ్ఞానినాంచ సుదుర్లభం ।
వేదశాస్తే గోపనీయం తుభ్యమేవదదామ్యహం ॥
నిబోధశ్రూయతాoనంద సానందః సుసమాహితః ।
జన్మమృత్యుజరావ్యాధిర్య దభ్యాసాన్నజాయతే ॥
స్థిరోభవమహారాజ వ్రజనాథ వ్రజంవ్రజ ।
జ్ఞానం లబ్ద్వాసదానందః శోకమోహవివర్జితః ॥
జలబుద్బుదవత్సర్వం సంసారంగ చరా చరం ।
ప్రభాతే స్వప్నవ న్మి ధ్యామోహకారణ మేవచ ॥
మిధ్యాకృత్రిమ నిర్మాణ హేతుశ్చ పాంచ భౌతికః ।
మాయయాసత్యబుద్ధ్యాచ ప్రతీతిం జాయతేనరః ॥
కామక్రోధలోభమోహైః వేష్టితః సర్వకర్మసు ।
మాయయామోహితః శశ్వత్ జ్ఞాన హీనశ్చ దుర్బలః ॥
నిద్రాతం ద్రాక్షు త్పిపా సాక్షమా శ్రద్ధాదయాదిభిః ।
లజ్జాశాంతి: ధృతిఃపుష్టిః తుష్టిశ్చాభిశ్చ వేష్టితః ॥
మనోబుద్దిచేతనాభిః ప్రాణజ్ఞానాత్మభిః సహ ।
సంసక్తః సర్వదేవైశ్చ యథావృక్షశ్చ వాయ సైః ॥
అను ॥ నందుడిట్లన్నాడు - శ్రీకృష్ణ! జగన్నాథ ! సుస్వప్నాన్ని గూర్చి నేను విన్నాను. వేదసారము, నీతి సారము, లౌకికము వైదికము విన్నాను. (1) వేటిని చూస్తే పాపమో ఇప్పుడు వినదలిచాను. ఏకర్మచేస్తే పాపమో, ఓ వత్స! దాన్ని నాకు చెప్పు. (2) వేదశాస్త్రములందు చెప్పబడ్డ మాట, వేదశాస్త్ర అనుయాయులు సంతప్తులు లోకులు, నీనోటి నుండి వినదలిచారు. (3) వేదములకు జనకుడవు నీవు. వైదికులైన సజ్జనులకు కూడా. బ్రహ్మాదులకు, సురులకు, మునులకు, జగత్తుకు జనకుడవు. (4) నీ నోటితో విన్నమాట ప్రమాణమైనది. అమృతవాక్కు. ఓ వత్స! వానితోనా దేహం అభిషిక్తమైతే, అది విచ్చేదమునకు, దాహమునకు కారణము. (5) కలలో ఎవని పాదకమలములు అన్ని కోరికల ఫలములనిచ్చేవో, బ్రహ్మాదులు చూడలేదో అది ఈ వేళ నా కనులకు గోచరమైంది. (6) ఇంతకన్నా నీ పాదాంబుజములను పాతకినైన నేను ఎక్కడచూస్తాను. మలమూత్రముల ధరించే నాశరీరం తనుచేసిన కర్మతో బంధింపబడింది. (7) ఓవత్స! ఇటువంటి రోజు నాకెప్పుడు లభిస్తుంది. బ్రహ్మాదులకు నాథుడవైన నీతో, పాపినైన నాకు సంవాదము (8) ఓ కృపానాథ! నా పైదయచూపు, నాదోషాన్ని క్షమించు. పిల్లవాడి బుద్ధితో చెడునడవడికనేను చేసినది దాన్ని క్షమించు, ఓమహేశ్వర! (9) బ్రహ్మ ఈశుడు, శేషుడు, మునులు నీ పాదాంబుజములను ధ్యానిస్తారు. సరస్వతి, నిన్ను స్తుతిస్తూ జడరూప మౌతుంది (స్తుతించలేక) నీకు శ్రుతి ఆమె (10) అని పలికి నందుడు, ఆనందం లేక, దుఃఖాకులుడైనాడు. మూర్చనందాడు. పుత్రుడు విడిపోతాడని చలించి ఏడ్చాడు. (11) భయపడి, భగవంతుడైన కృష్ణుడు ప్రయత్నపూర్వకంగా బోధించసాగాడు. జగత్పతి, అతనికి పరమమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చాడు. (12) శ్రీభగవానునిమాట ! ఓ నంద! ఓ తండ్రి! సర్వశ్రేష్ఠుడ! ప్రజమునకు నాథ! చైతన్యము నొదు. ఓ కళ్యాణుడ! పరమజ్ఞానాన్ని విను. (13) జ్ఞానులకును చాలా దుర్లభమైన పరమమైన ఆధ్యాత్మిక జ్ఞానమిది. వేదశాస్త్రములందు దాగినది. నీకే ఇస్తున్నాను, నేను. (14) ఓ నంద! మేలుకో, విను, ఆనందంగా, చాలా శ్రద్ధగా విను. జన్మ, మృత్యువు, ముసలితనము, రోగములు వానిని అభ్యసిస్తే (తలిస్తే) రావు (15) ఓ మహారాజ! స్థిరుడవుకా. ఓ వైజనాథ! వ్రజమునకు వెళ్ళు. జ్ఞానాన్ని పొంది ఎప్పుడూ ఆనందం కలిగి శోకమోహములు విడిచి ఉండు (16) సచరాచరమైన సంసారమంతా నీటి బుడగ వంటిది. కల వలె (ఉదయం కాగానే) మిధ్య ఔతుంది. మోహమునకు కారణము. (17) అబద్దము కృత్రిమ నిర్మాణమునకు హేతువు, పాంచ భౌతికమైన ఈ శరీరం. ఈమాయ వల్ల , ఇది నిజమనే భావన వల్లనూ నరుడు ప్రతీతిని (ఆనందాన్ని) పొందుతున్నాడు. (18) కామక్రోధ లోభమోహములతో అన్ని కర్మలలో చుట్టబడి, మాయామోహితుడై ఎప్పుడూ జ్ఞాన హీనుడౌతున్నాడు, దుర్బలుడు. (19) నిద్ర, కునికిపాట్లు (తంద్ర), ఆకలి, దప్పిక, ఓర్పు, శ్రద్ధ, దయవీనితో , లజ్జ, శాంతి, ధృతి, పుషిద్ది, తుష్టి వీనితో చుట్టబడి (20) మనోబుద్ధిచేతనలతో ప్రాణ జ్ఞాన ఆత్మలతో కలిసి, అందరు దేవతలతో, వృక్షము కాకులతో కూడినట్లు ఉన్నాడు. (21)
మూ॥ అహమాత్మాచ సర్వేశః సర్వజ్ఞానాత్మకః స్మృతః ।
మనోబ్రహ్మాచ ప్రకృతి: బుద్దిరూపాసనాతనీ ॥
ప్రాణావిష్ణుశ్చేతనా సాపద్మాతుచాధిదేవతా ।
మయిస్థితేస్థితాః సర్వేగతాస్తేఽపి గతేమయి ॥
అస్మాభిశ్చవినాదేహః సద్యః పతతి నిశ్చితం ।
పాంచభూతో విలీనశ్చ పంచభూతేషు తత్ క్షణం ॥
నామసంకేత రూపంచ నిష్ఫలం మోహకారణం ।
శోకశ్చాజ్ఞానినాంతాత జ్ఞానినాం నాస్తికించన ॥
నిద్రాదయఃశక్తయశ్చతాః సర్వాః ప్రకృతేఃకలాః ।
లోభాదయోహ్యథార్మంశాస్తథాఽహంకార పంచమః ॥
తేబ్రహ్మవిష్ణురుద్రాంశాః గుణాం సత్వాదయస్త్రయః ।
జ్ఞానాత్మకః శివోజ్యోతిరహమాత్మచ నీర్గుణః ।
యదావిశామిప్రకృతౌ తదాఽహంసగుణః స్మృతః ।
సగుణా విషయా విష్ణు బ్రహ్మరుద్రాదయస్తథా ॥
ధర్మోమదం శోవిషయీ శేషః సూర్యః కలానిధిః ।
ఏవం సర్వే మత్కలాంశామునిమన్వాదయస్సురాః ।
సర్వదేహో ప్రవిష్ణోఽహం నలిప్తః సర్వకర్మసు ।
జీవన్ముక్తశ్చమద్భక్తో జన్మమృత్యుజరాహరః ॥
సర్వసిద్ధేశ్వరః శ్రీమాన్ కీర్తిమాన్ పండితః కవిః ।
చతుస్త్రింశద్విధః సిద్ధః సర్వకర్మాపహారకః ॥
తము పైమిస్వయం సిద్ధం భక్తస్త్వన్యన్నవాంఛతి ।
ద్వావింశతి విధం సిద్ధం సిద్ధి సాధన కారణం ॥
మన్ముఖాచ్చ్రూయతానంద సిద్ధమంత్రం గృహాణచ ।
అణిమాలఘిమాప్రాప్తిః ప్రాకాశ్యం మహిమా తథా ॥
ఈశిత్వంచవశిత్వంచ తథా కామావసాయితా ।
దూరశ్రవణమేవేతి పరకాయప్రవేశనం ॥
మనోయామిత్వమేవేతి సర్వజ్ఞత్వమభీప్సితం ।
వహ్నిస్తం భంజలస్తంభం చిరంజీవిత్వ మేవచ ॥
కాయవ్యూహంచ వాక్సిద్ధిం మృతానయనమీప్సితం ।
సృష్టినాంకరణంచైవ ప్రాణాకర్షణ మేవచ ॥
ఓం సర్వేశ్వరేశ్వరాయ సర్వ విఘ్నవినాశినే ।
మధుసూదనాయ స్వాహేతి ॥
అయం మంత్రోమహాగూఢః సర్వేషాం కల్పపాదపః ।
సామవేదేచ కథితః సిద్ధానాం సర్వస్నిద్ధి దః ॥
అనేనయోగినః సిద్ధాః మునీంద్రాశ్చ సురాస్తథా ।
శతలక్ష జపేనైవ మంత్ర సిద్ధిర్భవేత్సతాం ॥
యదినారాయణే క్షేత్రే హవిష్యాన్నరతో జపేత్ ।
గత్వాకురుజపం తాతకాశికాం మణికర్ణికాం ॥
శృణునారాయణక్షేత్రం జలాధస్త చ్చతుష్టయం ।
అత్ర నారాయణః స్వామీనాన్యః స్వామీకదాచన ॥
జ్ఞానంచాత్రమృతేలోకే మూర్తిర్భవతి తస్యవై ।
వ్రతం వినాఽపిమంత్రేణ జీవన్ముక్తేన సంశయః ॥
వ్రజంకురు పవిత్రంచ వ్రజనాథ వ్రజంవ్రజ ।
పాపం యద్ధర్శనేతాత కథ యామినిశామయ ॥
అను! నేను ఆత్మను, సర్వేశుడను, సర్వజ్ఞానాత్మకుడను, మనస్సు, బ్రహ్మ ప్రకృతి, బుద్ధిరూపమైనది, ఇది సనాతనమైనది. (22) ప్రాణములు విష్ణువు. అది చేతన. పద్మ అధి దేవత.నేనుంటే అందరుంటారు, నేనుపోతే అందరు పోతారు. (23) నేను లేకుండా శరీరం వెంటనే పడిపోతుంది. నిశ్చయము. పాంచభూతము (శరీరము) తత్ క్షణమందే పంచభూతములందు లీనమౌతుంది. (24) నామసంకేతములు నిష్పలము. మోహమునకు కారణము. ఓ తండ్రి అజ్ఞానులకు శోకము, జ్ఞానులకు ఏమీ లేదు. (25) నిద్రాదిశక్తులు అవన్నీ ప్రకృతికళలు. లోభాదులు అధర్మము అంశాలు. అహంకారము ఐదవది. (26) సత్వాది మూడుగుణములు బ్రహ్మ విష్ణురుద్రాది అంశలు. శివుడు జ్ఞానాత్మకుడు. జ్యోతిస్వరూపుడనైన నేను ఆత్మ, నిర్గుణుడను (27) నేను ప్రకృతిలో ప్రవేశిస్తే అప్పుడు నేను సగుణుడనౌతాను. విషయములు సగుణములు బ్రహ్మ విష్ణురుద్రాదులు కూడా (28) ధర్మము నా అంశము. విషయి, శేషుడు, సూర్యుడు కలానిధి. ఇట్లా అన్ని మునులు , మన్వాదులు, దేవతలు నాకళాంశలు. (29) అన్ని దేహాలలో నేనున్నాను. అన్ని కర్మలలో లిప్తుడను (పూసుకోవడం) కాలేదునేను. నా భక్తుడు జన్మమృత్యు జరలను పోగొట్టుకున్నవాడు జీవన్ముక్తుడు (30) అన్ని సిద్దులకు ఈశ్వరుడు, శ్రీమంతుడు, కీర్తిమంతుడు, పండితుడు, కవి, ముప్పది నాలుగు విధములైన సిద్ధులనందినవాడు. అన్ని కర్మలను తొలగించుకున్నవాడు. (31) సిద్ధుడైన, ఆతనిని స్వయంగా చేరుతాను. భక్తుడు మరొకటికోరడు (నన్ను తప్ప). ఇరువది రెండు రకాల సిద్ధులు సిద్ధిసాధనమునకు కారణము. (32) ఓ నంద! సిద్ధమంత్రమును, నాముఖం నుండి విను, స్వీకరించు. అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకాశ్యం, మహిమా (33) ఈశిత్వము, వశిత్వము, కామముల అవసానము, దూరశ్రవణము, పరకాయ ప్రవేశము (34) మనస్సుతో వెళ్ళటం, సర్వజ్ఞత్వము. అభీప్సితము (పొందటం) వహ్ని స్తంభము, జలస్తంభము, చిరంజీవిత్వము. (35) కాయవ్యూహము, వాక్సిద్ధి, చచ్చినవానిని తీసుకు రావడం అభీప్సితము సృష్టిచేయడం, ప్రాణాకర్షణ. (36) ఓం సర్వేశ్వరాయ, సర్వవిఘ్నవినాశినే మధుసూదనాయ స్వాహా, అని ఈ మంత్రము, మహాగూఢమైనది. అందరికి కల్పవృక్షం లాంటిది. (కోరికలిచ్చేది) సామవేదంలో చెప్పబడింది. సిద్ధులకు అన్ని సిద్ధులను ఇచ్చేది. (37) దీనితో యోగులు, సిద్ధులు, మునీంద్రులు, సురలు వీరికి నూరు లక్షల జపంతో మంత్ర సిద్ది సజ్జనులకౌతుంది. (38) నారాయణ క్షేత్రమందు హవిష్యాన్నము భుజిస్తూ జపిస్తే సిద్ధి కల్గుతుంది. ఓ తండ్రి! కాశికి మణికర్ణికకు వెళ్ళి జపం చేయి. (39) నీటికింద నారాయణ క్షేత్రము నాలు విధాలుంది విను. అక్కడ నారాయణుడే స్వామి. మరోస్వామి లేడు. (40) ఇక్కడ మరణిస్తే జ్ఞానములభిస్తుంది. లోకంలో ఆతనికి రూపమేర్పడుతుంది. వ్రతం లేకున్నా మంత్రంతో జీవన్ముక్తుడౌతాడు, అనుమానం లేదు. (41) ప్రజాన్ని (దేశం) పవిత్రం చేయి, ఓ ప్రజనాథ, ప్రజానికి వెళ్ళు. దేన్ని చూస్తే పాపమో ఓ తండ్రి చెప్తాను. విను (42)
మూ॥ దుఃస్వప్నం పాపబీజంచ కేవలం విఘ్నకారణం ।
గోఘ్నంచ బ్రాహ్మణఘ్నంవా కృతఘ్నంకుటిలం తథా ॥
దేవఘ్నం పితృమాతృఘ్నం పాపం విశ్వాసఘాతినం ।
మిథ్యాసాక్షిప్రదాతారం యంచాతిధ్యవివంచనం ॥
గ్రామయజినమోవేతి దేవవిప్రస్వహారిణం ।
అశ్వత్థాఘాతినందుష్టం శివవిష్ణు వినిందకం ॥
అదీక్షితయానాచారం సంధ్యాహీనం ద్విజం తథా ।
దేవలం వృషవాహంచ శూద్రాణాంసూపకారకం ॥
శవదాహంచ శూద్రాణాం శూద్రశ్రాద్ధాన్న భోజినం ।
అవీరాంఛిన్ననాసాంచ దేవబ్రాహ్మణ నిందకాం ॥
పతిభక్తి విహీనాంచ విష్ణు భక్తి విహీనకాం ।
శూద్రాణాం విధవాంచైవ చాండాలీం వ్యభిచారిణీం॥
శశ్వత్కోపయుతం దుష్టమృణగ్రస్తంచ జారజం ।
చౌరంమిథ్యావాదినంచ శరణాగత యాయినం ॥
మాంసాపహారిణం చైవబ్రాహ్మణం వృషలీపతిం ।
బ్రాహ్మణీగామినం శూద్రం ద్విజంవారుక్షికం తథా ॥
అగమ్యాగామినం దుష్టం చతుర్వర్ణంనరాధమం ।
మాతాసపత్నీమాతాచ శ్వశ్రూశ్చ భగినీతథా ॥
గురుపత్నీపుత్రపత్నీ సోదరస్య ప్రియాసతీ ।
మాతృష్వసాపితృష్వ సౌభాగినేయ ప్రియాతథా ॥
మాతులానీ నవోఢాచ పితృవ్యస్త్రీ రజస్వలా ।
పితృమాతృప్రసూత్చైవ చాగమ్యాష్టాదశస్మృతాః ॥
కీర్తితాఃసామవేదేచ పరిపాల్యాః సతాంవ్రజ ।
ఏతా దృష్ట్వా స్పృష్ట్వాచ బ్రహ్మహత్యాం లభేన్నరః ॥
తస్మాద్ధేవేనతా దృష్ట్వా సూర్యం దృష్ట్వాహరింస్మరేత్ ।
కామతోయది పశ్యంతి వినింద్యా స్తే భవంతివై ॥
తస్మాత్సంతోన పశ్యంతి శాపభీతా వ్రజేశ్వర ।
రాహుగ్రస్తం రవిం సోమంనపశ్యంతి విపశ్చితః ॥
జన్మాష్టసప్తరి: ఫాంకదశమ స్థే దివాకరే ।
జన్మర్క్షేనిధనం చాపి చతుర్థోఽపి కలానిధే ॥
నష్టచంద్రో నదృశ్యశ్చభాద్రేమాసి, సితాసితే ।
చతుర్థ్యాముదితశ్చంద్రః పరిత్యక్తామనీషిభిః ॥
చంద్రస్తారాపహరణం కలంకమతిదుష్కరం ।
తస్మైదదాతి హేనంద! కామతోయదిపశ్యతి ॥
అకామతోనరో దృష్ట్వా మంత్రపూతంజలం పిబేత్ ।
తదాశుద్దోభవేత్సద్యోనిష్కలంకీ మహీతలే ॥
సింహఃప్ర సేనమవధీత్ సింహొజాంబవతాహతః ।
సుకుమారక మారోదీః తవ హ్యేషస్య మంతకః ॥
ఇతిమంత్రేణ పూతంచ జలం సాధుపిబేత్ ధ్రువం ।
ఇతితే కథితం సర్వమపరం కథయామితే ॥
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే భగవన్నంద సంవాదే అష్ట సప్తతితమోఽధ్యాయః ॥
అను ॥ దుఃస్వప్నము పాపమునకు బీజము కేవలము విఘ్నమునకు కారణమౌతుంది. గోవును చంపినవాడు, బ్రాహ్మణుని చంపినవాడు, కృతఘ్నడు, కుటిలుడు (43) దేవఘ్నుడు, పితృమాతృఘాతుకుడు, పాపి, విశ్వాసఘాతుకుడు, దొంగ సాక్ష్యం చెప్పేవాడు, ఆతిథ్యమందు విశేషముగా మోసగించేవాడు (44) గ్రామయాజిని అని దేవుడు విప్రుల సొమ్మును హరించేవాడు, అశ్వత్థామును చంపేవాడు (చెట్టు), దుష్టుడు, శివ విష్ణువులనిందించేవాడు (45) దీక్షితుడుకానివాడు, అనాచారి, సంధ్యాహీనుడు ఐన బ్రాహ్మణుడు, దేవలుడు, వృషభమునెక్కేవాడు, శూద్రులకు వండేవాడు (46) శూద్రుల శవాన్ని కాల్చేవాడు, శూద్రుల శ్రాద్ధ అన్నాన్ని తినేవాడు, భర్త సంతానములేనిది, ముక్కుకోయబడ్డది, దేవబ్రాహ్మణ నిందకురాలు (47) పతిభక్తిలేనిది, విష్ణుభక్తిలేనిది, శూద్రవిధవస్తీ, చండాలస్తీ వ్యభిచరించేది, (48) ఎప్పుడు కోపముగల దుష్టుడు, ఋణగ్రస్తుడు, జారస్త్రీకి కల్గినవాడు, దొంగ, మిధ్యావాది, శరణాగతుణ్ణి పంపించేవాడు (49) మాంసాపహారి, బ్రాహ్మణుడు, వృషలీపతి (స్త్రీకి), శూద్రుడు బ్రాహ్మణిని పొందేవాడు, వడ్డికిచ్చే బ్రాహ్మణుడు, (50) చేరరానిస్త్రీని చేరేవాడు, దుష్టుని, నాల్గవజాతికి చెందిన నరాధముడు, వీరిని చేరరాదు. తల్లి, సవతితల్లి, అత్త, చెల్లెలు (51) గురువుభార్య, కొడుకుభార్య, సోదరుని ప్రియమైన భార్య, తల్లి చెల్లెలు, తండ్రి చెల్లెలు, మేనల్లుని భార్య (52) మేనమామ భార్య. కొత్త పెళ్ళికూతురు, చిన్నాన్న భార్య (పెదనాన్న), రజస్వల, తండ్రికి తల్లికి చెందిన తలిదండ్రులు, ఈ పద్దెనిమిది మందిని పొందరాదని చెప్పారు. (53) ఓ ప్రజ! దీనిని సామవేదంలో చెప్పారు, సజ్జనులు వీరిని రక్షించాలి. వీరిని చూచిన, ముట్టిన (పాపబుద్ధితో) నరుడు బ్రహ్మహత్య పాపాన్ని పొందుతాడు. (54) అందువల్ల వారిని విధి వశాత్తు చూచినా సూర్యుని చూచి, హరిని స్మరించాలి. (వారిని దైవాంగా చూడాలి). కామంతో చూచిన వారు నిందించతగిన వారౌతారు. (55) అందువల్ల సజ్జనులు శాపభీతులై చూడరు, ఓ ప్రజేశ్వర! రాహువుచే మింగబడ్డ సూర్యచంద్రులను పండితులు చూడరు (56) జన్మ (ఒకటి) ఎనిమిది, ఏడు, పన్నెండు, పది స్థానములందలి సూర్యుడు, జన్మనక్షత్రమందు, నాల్గవస్థానమందు చంద్రుడుంటే మరణము సంభవిస్తుంది. (57) నష్టమైన చంద్రుని చూడరాదు, భాద్రపదంలోని శుక్లకృష్ణ పక్షములందును, చతుర్థిచంద్రుని విడువాలి (చూడరాదు) అని విద్వాంసులన్నారు. (58) చంద్రుడు తారాపహరణము చేయుట కలంకము, అతిదుష్కరమైనది. ఓ నంద! ఆతనికి ఇచ్చినా, కోరికతో చూచిన దోషమే. (59) అనుకోకుండా చూస్తే నరుడు, మంత్రపూతమైన నీటిని త్రాగాలి. అప్పుడు వెంటనే శుద్ధుడౌతాడు. భూమి పై నిష్కలంకుడౌతాడు. (60) సింహము ప్రసేనుణ్ణి చంపింది. సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఓ సుకుమార! ఏడవకు, ఈస్యమంతకమునీది. (61) అనే మంత్రంలో పవిత్రమైన జలమును, చక్కగా త్రాగాలి, నిశ్చయము. అని అంతా నీకు చెప్పాను. ఇంకా నీకు ఏమి చెప్పాలి. (62) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు భగవంతుని నందుని సంవాదమందు డెబ్బది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 78 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Illustrating the unyielding power of Truth and Dharma, Maharshi Nārada narrated the histories of King Trishanku and his illustrious descendant King Harishchandra. King Harishchandra sacrificed his kingdom, wealth, wife, and freedom to uphold a solemn promise made to Sage Vishvāmitra, enduring immense personal suffering without ever uttering a falsehood. Pleased by his flawless adherence to Truth, Lord Śrī Vishṇu Himself appeared on the cremation grounds, restored the king's family and kingdom, and elevated Harishchandra and his citizens directly to the heavenly realms.