బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

79 - అధ్యాయము

మూశ్రీనంద ఉవాచ:

రాహుగ్రస్తః కథం సూర్యః చంద్రోవా పి జగత్ర్పభో

నేష్టచంద్రః కథం భాద్రే చతుర్ధ్యాంచాసితే సితే

వేదానాంజనకస్త్వంచ కంపృచ్ఛామిత్వయా వినా

వేదేపురాణే గోప్యం యన్న జానంతి విపశ్చితః

ఇతి తద్వచనం శ్రుత్వాచేదం వచనమబ్రవీత్

శ్రీభగవానువాచ :

అతిథ్యం వచనం చేదం నిషిద్దం వైదికైరపి

క్షమస్వనంద భద్రంతే ప్రశ్నమన్యంకురుష్వమాం

విశ్వస్తంవచనం తాత నప్రకాశ్యం మనీషిభిః

విఘ్నఃప్రకాశేభవతి సతాంఛిద్రం చదైవతః

నంద ఉవాచ :

కథయస్వజగన్నాథనభర్తే వంచనంకురు

అదృశ్యాచాపిదేవేశా రాహుగ్రస్థౌ చపుణ్యదౌ

శ్రీభగవానువాచ :

శృణునంద ప్రవక్ష్యామి కథామేతాంపురాతనీం

యాంశ్రుత్వా నిష్కలంకశ్చ తీర్థస్నాయీభవేన్నరః

సర్వపాతకినందృష్ట్వా యత్సాహం లభతేనరః

ఆఖ్యానశ్రవణేనైవ భస్మీభూతం భవిష్యతి

ఏకదాజమదగ్నిశ్చ మహాకౌతూహలాన్వితః

రేణుకాసహితస్తుష్టో జగామనర్మదాతటం

నిర్జనే నర్మదాతీరే విజహారతయాసహ

నవోడయాచసుందర్యా నవయౌవన యుక్తయా

సువేషయా సుస్మితయా రత్నభూషణయుక్తయా

నతయాస్తన భారేణ శ్రేణీభారేణ మందయా

సుందరీణామతులయా శ్వేతచంపక వర్ణయా

సుపూర్ణచంద్రాననయా కటాక్షయుతయా తథా

అతీత సూక్ష్మాంబరయా కామబాణార్తయావ్రజ

పులకాంచితసర్వాంగ సంభోగేనాపి మూర్చయా పుంస్కోకిలయుతేరమ్యేశబ్దితేసుమధుంవ్రతే

సుగంధివాయుసంయుక్తే పుష్పతల్పాన్వితేశుభే

చందనోక్షిత సర్వాంగం వస్త్ర మాల్యధరంమునిం

మహారాజరసాఢ్యంత మువాచభాస్కరః స్వయం

వేదకర్తు: ప్రపౌత్రస్త్వం బ్రహ్మణశ్చ జగత్పతేః

చతుర్వేద విధేయేషుసు నిష్ణాతః సదాశుచిః

వేదాంగకర్తా ధర్మజ్ఞః శ్రేష్ఠో వేదవిదాం వరః

మహాతపస్వీతేజస్వీ బ్రహ్మచారీచ సువ్రతీ

యుష్మద్విధోక్తం శాస్త్రంచ పఠిత్వాన్య శ్చ పండితః

వేదప్రణిహితో ధర్మోహ్య ధర్మస్త ద్వీపర్యయః

ధర్మంత్యజతిధర్మజ్ఞోహ్య దర్మేణరతః కథం

దివామైథున దోషంచ వక్తి వేదోవిశేషతః

అహంచ ధర్మిణాం సాక్షీతేనత్వాంకథయామితే

సూర్యస్యవచనం శ్రుత్వాతత్యాజ మైథునం ద్విజః

దృష్ట్వాపురోవిప్రరూపం సూర్యతేజస్వినం సురం

ఉవాచ సూర్యం రక్తస్యః కోపలజ్జా సమన్వితః

రేణుకాలజ్జితాతత్ర విధాయ వాససీసతీ

శ్రీనందుని వచనము - ఓ జగత్ర్పభు! సూర్యుడు కాని చంద్రుడు కాని రాహుగ్రస్తులెందుకైనారు. భాద్రపదశుక్ల కృష్ణ పక్షములందు చతుర్థియందు చంద్రుణ్ణి ఎందుకు చూడరాదు. (1) నీవు వేదములకు జనకుడవు. నిన్నుకాక ఎవరినడుగుతాను. వేదములలో, పురాణములందు గోప్యంగా ఉన్నదానిని విద్వాంసులు తెలుసుకోలేరు. అనే ఆమాట విని ఇట్లా అన్నాడు (2) భగవంతుని వచనము - ఈ మాట అబద్దము. వైదికులు దీనిని నిషేధించారు. ఓ నంద! క్షమించు, నీకు మేలు కలుగని. నన్ను మరో ప్రశ్నఅడుగు. (3) ఓతండ్రి! మాటను నమ్మాలి. బుద్దిమంతులు ప్రకాశింపచేయరాదు. ప్రకాశింపచేస్తే విఘ్నమౌతుంది. సజ్జనుల ఛిద్రము (దోషము) దైవతమైనది. (4) నందుడిట్లన్నాడు - ఓ జగన్నాథ! చెప్పండి. భక్తుని వంచించరాదు. దేవేశులు కన్పించనివారు ఐనా రాహువుచే మింగబడెడివారు,పుణ్యము నిచ్చువారు. (5) భగవంతుని వచనమిట్లా - పురాతనమైన ఈ కథను చెప్తాను విను ఓ నంద! విను. దానిని వింటే నరుడు తీర్థమందుస్నానము చేసిన వాడౌతాడు, నిష్కలంకుడౌతాడు. (6) అన్ని పాపములు చేసినవాణ్ణి చూస్తే వచ్చే పాపము ఈ ఆఖ్యానము విన్నందు వల్లనే భస్మమౌతుంది. (7) ఒకసారి జమదగ్ని చాలా కుతూహలముకలవాడై, రేణుకతో (భార్య) కూడి, ఆనందంగా నర్మదాతీరానికి వెళ్ళాడు. (8) ఆమెతో కలిసి జనంలేని నర్మదా తీరంలో విహరించాడు. ఆమెకు కొత్తగా పెళ్ళైంది. సుందరి, నవయౌవ్వనం కలది. (9) మంచి వేషము కలది, చిరునవ్వు కలది, రత్నపు సొమ్ములు కలది. స్తనముల బరువుతో కొంచెం వంగింది, పిరుదుల బరువుతో కొంచెం మెల్లగా నడుస్తోంది. (10) సుందరీ మణులతో పోల్చ వీలులేనిది, తెల్లని చంపక పువ్వు రంగు గలది, పూర్ణచంద్రుని వంటి ముఖం కలది, చూపులు అట్లాగే ఉన్నాయి. (11) చాలా సూక్ష్మమైన (సన్నని) వస్త్రం ధరించింది. కాముని బాణంతో బాధపడుతోంది. ఓప్రజ! శరీరమంతా పులకరించి ఉంది. సంభోగం వల్ల మూర్ఛపోయింది. (12) పుంస్కోకిలతో కూడి రమ్యంగా కూస్తున్న తుమ్మెదలు రమ్యంగా ధ్వనిస్తున్న, మంచి వాసనగల గాలి వీస్తుండగా, పుష్పతలమందు, శుభసమయమందు (13) ఒంటినిండా చందనం పులుముకొని, వస్త్రము మాలలు ధరించిన మునిని, మహారాస రసముతో కూడిన ఆతనితో భాస్కరుడు స్వయంగా ఇట్లా అన్నాడు. (14) నీవు వేదకర్తకు ప్రపౌత్రుడవు, ఆతడు జగత్పతి, బ్రహ్మ, నాలు వేదములు నీకు విధేయములు, అందులో నీవు చాలా నిష్ణాతుడవు. ఎప్పుడూ శుచివి. (15) వేదాంగకర్తవు ధర్మజ్ఞుడవు, శ్రేష్ఠుడవు, వేద విదులలో శ్రేష్టుడవు. మహాతపస్వివి. తేజస్వివి, బ్రహ్మచారివి, మంచి నియమములు కలవాడవు. (16) శాస్త్రమంతా నీవంటివారు చెప్పిందే, దాన్ని చదివి మరొకడు పండితుడౌతాడు. వేదములలో చెప్పబడ్డవి ధర్మము. దానికి విరుద్దమైంది అధర్మము. (17) ధర్మజ్ఞుడవై ఉండి ధర్మం విడిచావు. అధర్మంగా రమించావెందుకు. వేదము విశేషంగా దీవామైథునము (పగలు భార్యను కలియటాన్ని ) దోషంగా చెప్తుంది. (18) నేను ధర్మములకు సాక్షిని. అందుకే నేను నీకు చెబుతున్నాను. సూర్యుని మాటను విని ద్విజుడు మైథునాన్ని విడిచాడు. (19) ఎదురుగా బ్రాహ్మణ రూపంలో సూర్యునంత తేజస్సుగల సూర్యుణ్ణి చూచి, కోపములజ్జ కలిగినవాడై ముఖమంతా ఎర్రబడగా సూర్యునితో ఇట్టన్నాడు, ముని. అక్కడ సిగ్గుపడి రేణుక సతి వస్త్రము ధరించింది.

మూ జమదగ్నిగువాచ –

కోభవాన్నండితం మన్యోనత్వదన్యోఽస్తి పండితః

అహంభృగోర్భగవతః శిష్యస్త్వంకశ్యపస్యచ

చతుర్వేదాంశ్చ జానామి ధర్మాధర్మనిరూపణే

వేదప్రణిహితో ధర్మోహ్య ధర్మస్త ద్వీపర్యయః

అజ్ఞానీపురుషః శశ్వత్ జడితశ్చ స్వకర్మణా

తేజీయసాంనదోషాయ వప్నేః సర్వభుజోయథా

అన్యభవాంశ్చ ధర్మశ్చ సాక్షీసర్వేచ కర్మణాం

ఫలదాతాచ శాస్త్రజ్ఞో యతస్త్వత్తనయస్సదా

నవైష్ణవానాం శాస్తా రోయూయమస్మాకమేవచ

నవాసుదేవభక్తానామశుభం విద్యతేక్వచిత్

హరేః సుదర్శనం చక్రం శశ్వద్రక్షతివైష్ణవాన్

నారాయణశ్చ భగవాన్ స్వయం బ్రహ్మాచ శంకరః

శాస్తాయమశ్చనా స్మాకం త్వంవైనాపి దివాకర

రాజపుత్రోయథాస్థానే వయం స్వచ్ఛందగా మినః

శక్తోఽహం భస్మ సాత్కర్తుం యమం సర్వ సురాం స్తథా

మహేంద్ర ప్రభృతీన్ సూర్య క్షణేనై వావ హలీలయా

కస్త్వం ధర్మం ప్రవక్తామేయాహి స్వస్థానమేవచ

మమశాస్తాతు భగవాన్ శ్రీకృష్ణః ప్రకృతేః పరః

అద్యమే నిర్జనే స్థానే రసభంగస్త్వయాకృతః

మమశాపాతాదదృశ్యోరాహుగ్రస్తో భవిష్యసి

ద్రష్టుంత్వాం యేఘనాః సర్వే దూరీభూతాభవంతితే

త్వామాచ్ఛన్నం కరిష్యంతి వాయునాప్రేరితాస్తథా

స్వతేజసాభవాన్ గర్వాద్ధతతేజా భవిష్యసి

మేఘాచ్ఛన్నః స్వల్పతేజారాహుగ్రస్తో భవాన్భవ

బ్రాహ్మణస్య వచః శ్రుత్వాభగవాన్ భాస్కరః స్వయం

తతః పుటాంజలిర్భూత్వా తుష్టావమునిపుంగవం

శ్రీభాస్కర ఉవాచ :

అవధ్యాః సర్వధర్మజ్ఞ ధన్యామాన్యాః పురస్కృతాః

నారాయణశ్చ భగవాన్ శంభుర్ర్బహ్మా స్వయం ప్రభుః

గణేశశ్చాపి శేషశ్చ ధర్మశ్చాపి సనాతనః

స్తువంతి బ్రాహ్మణం సర్వేవిప్రరూపి జనార్ధనం

క్షమస్వవైష్ణవః శుద్ధః స్వధర్మంచ సమాచర

వైష్ణవానాం కుతః కోపోహృదియేషాం జనార్దనః

అస్మాభిః పూజితావిప్రాయుష్మాభిః పూజితాః సురాః

పరస్పరం స్నేహపాత్రం చేదమాచరణంద్విజ

అహమేవత్వయాశప్తో మహాశప్తో భవాన్భవ

అన్యధామం వదంత్యేవ సూర్యం నిస్తేజసంజనాః

పరాభూతః క్షత్రియేణ భవిష్యసి ద్విజేశ్వర

మరణం క్షత్రియాస్త్రేణ భవతశ్చ భవిష్యతి

సూర్యస్యవచనం శ్రుత్వాచుకోప బ్రాహ్మణః పునఃతంశశాపాతి రక్తస్యః శంభునా నిర్జితో భవాన్

ఉభయోః కలహం జ్ఞాత్వా కశ్య పేన సహవ్రజ

ఆజగామస్వయం బ్రహ్మావిధాతా జగతామపి

జమదగ్ని ఇట్లన్నాడు - నీకు నీవుగా పండితునిగా భావించుకునే, నీవెవరు. నీకంటే వేరైన పండితులు లేరా (21) నేను భగవంతుడైన భృగువునకు శిష్యుడను. నీవు కశ్యపునకు చెందినవాడవు. ధర్మాధర్మములని రూపణయందు నాల్గు వేదములను కూడా ఎరిగినవాడను. (22) వేదములలో చెప్పబడ్డది ధర్మము. దానికి భిన్నమైనది అధర్మము. పురుషుడు ఎల్లప్పుడు అజ్ఞానిగా ఉన్నాడు. తన కర్మవల్ల జడుడైనాడు. (23) అగ్ని ఎట్లా అన్నిటిని భక్షిస్తాడో అట్లా తేజస్వంతులకు ఇది దోషం కాదు. ఇతరులు, నీవు, ధర్మము, అందరు కర్మలకు సాక్షి. (24) నీతనయుడెప్పుడు, ఫలాన్ని ఇచ్చేవాడు, శాస్త్రమెరిగినవాడు కాబట్టి. మీరు, వైష్ణవులకు శాసకులుకారు. మాకు కూడా కారు. (25) వాసుదేవభక్తులకు అశుభములేదుకదా. వైష్ణవులను, హరి యొక్క సుదర్శన చక్రము ఎల్లప్పుడు రక్షిస్తుంటుంది. (26) భగవాన్ నారాయణుడు స్వయంగా, బ్రహ్మ శంకరుడు, యముడు మాకు శాసకులుకారు. ఓ సూర్యుడ! నీవు కూడా శాసకుడవుకావు, (27) రాజపుత్రుడు ఎట్లా స్వేచ్ఛగా తిరిగేవాడో మేమూ అట్లాగే స్వచ్ఛందంగా ఉండేవాళ్ళం. నేను, యముణ్ణి, దేవతలందరిని భస్మం చేయటానికి సమర్ధుణ్ణి. (28) ఓ సూర్యుడ! మహేంద్రుడు మొదలగువారిని, క్షణకాలంలో అవలీలగా భస్మం చేయగలను. నాకు ధర్మం చెప్పటానికి నీవెవ్వడివి. నీస్థానానికి నువ్వు వెళ్ళు. (29) నన్ను శాసించేవాడు, ప్రకృతికి పరమైనవాడు, భగవంతుడైన శ్రీకృష్ణుడు. ఈ రోజు, నిర్జనమైన ఈ ప్రదేశంలో నాకు నీవు రసభంగాన్ని చేశావు. (30) నాశాపంవల్ల పాపదృష్టి కలవాడవు, రాహువుచే మింగబడేవాడవు ఔతావు. నిన్ను చూడటానికి, దూరమయ్యే మేఘములన్ని (31) వాయువుతో ప్రేరేపించబడి నిన్ను కప్పివేస్తాయి. నీవు, నీ తేజోగర్వంతో, తేజస్సును పోగొట్టుకుంటావు. (32) మేఘములతో కప్పబడి, తేజస్సు అల్పంగా కలిగి, రాహువుతో మింగబడతావు నీవు. బ్రాహ్మణుని మాటను విని భగవాన్ భాస్కరుడు స్వయంగా, ఆపిదప, చేతులు జోడించి, మునిశ్రేష్ఠుని స్తుతించాడు. (33) భాస్కరుని వచనమిట్లా - అన్ని ధర్మములనెరిగిన ఓ ముని! బ్రాహ్మణులు అవధ్యులు, ధన్యులు, గౌరవించతగినవారు, ముందు ఉంచుకోతగినవారు. (34) భగవాన్ నారాయణుడు, శంభువు, బ్రహ్మ స్వయంగా ప్రభువు, గణేశుడు, శేషుడు సనాతనమైన ధర్మము. (35) వీరంతా బ్రాహ్మణుని స్తుతిస్తారు. విప్రరూపుడైన జనార్దనుడు అని. క్షమించు. వైష్ణవుడు శుద్దుడు. నీ ధర్మాన్ని ఆచరించు. (36) హృదయంలో జనార్డునుని కలిగి ఉన్న వైష్ణవులకు కోపమెక్కడిది  మేము విప్రులను పూజిస్తాము. మీరు దేవతలను పూజిస్తారు. (37) ఓద్విజ ఇట్లా చేయటమనేది పరస్సరము స్నేహమునకు పాత్రమైనది (స్థానము). నీవు నన్ను శపించావు. నేను నిన్ను శపిస్తున్నాను. (38) లేకపోతే, జనులంతా నన్ను సూర్యుడు తేజోహీనుడు అని అంటారు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడ! క్షత్రియునితో అవమానింపబడుతావు. (39) నీకు క్షత్రియునితో మరణం కలుగుతుంది. సూర్యుని మాటను విని బ్రాహ్మణుడు తిరిగి కోపగించాడు ముఖమంతా ఎర్రబడగా ఆ బ్రాహ్మణుడు, సూర్యుని శపించాడు. నీవు శివునితో జయింపబడుతావు. (శివుడు జయిస్తాడు) అని (40) ఇద్దరి తగాదా తెలిసి కశ్యపునితో ప్రేరేపింపబడి, ఓ ప్రజ! స్వయంగా,బ్రహ్మ జగత్తుల నేర్పరచేవాడు, వచ్చాడు.

మూII ఆగత్యబ్రహ్మసంత్రస్తంబోధయామాస భాస్కరం

మునిశ్రేష్ఠంచ ధర్మజ్ఞం ధర్మజ్ఞానాం గురోర్గురుః

బ్రహ్మఉవాచ :

క్షమస్వభాస్కరత్వంచ సాక్షాన్నారాయణోభవాన్

యుష్మాకం పరిపాలకశ్చాష్యవధ్యో బ్రాహ్మణః సదా

అహంకరోమిభవతో విప్రశాపాంతముల్బణం

అత్రాహమాగతస్త్రస్తో భృగుణాప్రేరితస్తతః

స్ఫుటోఽహం ప్రేరితశ్చాపికశ్య పేన మరీచినా

శాంతోభవసురశ్రేష్ఠ సాక్షీత్వం సర్వకర్మణాం

కుత్రచిద్దివసే బ్రహ్మంస్త్వాం తత్రకుత్రచిత్క్షణం

భవిష్యసి ఘనాచ్ఛన్న: సద్యోముక్తో భవిష్యసి

న్యూనాతిరిక్తే వర్షేచ రాహుగ్రస్తో భవిష్యసి

తత్రాదృశ్యశ్చ కేషాం చిత్పుణ్యదృశ్యో హికస్యచిత్

అన్యధా సర్వకాలేన పుణ్యదృశ్యో భవాన్ భువి

త్వాం దృష్ట్వాచన మస్కృత్య సర్వేనిష్పాపినోజనాః

జన్మ సప్తాష్టరి: ఫాంక చతుర్థేదశమే తథా

జన్మర్ క్షేనిధనం నృణాం అదృశ్యస్త్వం భవిష్యసి

అస్తకాలేఘనాచ్చన్నే మధ్యాహ్నస్థే జలేఽపివా

అర్దోదితేచ కాలేచ పాపదృశ్యో భవిష్యసి

భార్యాదుఃఖ నిమిత్తేన భార్యయా హేతుభూతయా

శ్వశురేణ శాలకేన హతతేజా భవిష్యసి

అన్యధా తవతేజశ్చ సంజ్ఞా సహితుమక్షమా

మలేసుమాలియుద్దేచ శంభునాత్వం పరాజితః

ఇత్యేవముక్త్యాసూర్యంచ బోధయామాస బ్రాహ్మణం

నమ్రః శాపపరాభూతం లజ్జితం కోపితం వ్రజ

హేవిప్ర స్వగృహం గచ్ఛ గచ్ఛవత్స యథాసుఖం

త్వత్తే జసాక్షణేనైవ భస్మీ భూతం భవేజ్జగత్

సూర్యస్త్వత్పరిపాల్యశ్చ భవాన్ సూర్యస్య నిత్యశః

పరస్పరంచ పూజ్యశ్చ సంబంధః పోష్యపోషకః

హర్యం శేనక్షత్రియేణ కార్తవీర్యార్జునేవచ

భవిష్యసిన సందేహః పరాభూతోద్విజోమృతః

పురాతేప్రాక్తనం సర్వం కదా చిన్నహి ఖండితం

నారాయణశ్చ స్వాంశేన తవపుత్రో భవిష్యతి

త్రి:సప్తకృత్వో జగతీం నిఃక్షత్రాంచ కరిష్యతి

మృత్యు స్తే యశసోబీజం భవిష్యతి మహీతల్పే

ఇత్యేవ ముక్త్వా బ్రహ్మాచ యయౌగేహంవ్రజేశ్వర

ప్రయయౌ జమదగ్నిశ్చ భాస్కరశ్చ స్వమందిరం

ఇత్యేవం కథితం తాత ఆఖ్యానం పుణ్యకారకం

రాహుగ్రస్తో భాస్కరశ్చాప్య దృశ్యోయేన హేతునా

చతుర్థ్యాముదితశ్చంద్రో భాద్రేమాసి సితాగితే

అదృశ్యోనష్టరూపశ్చ ప్రయతాం యేన హేతునా

రాహుగ్రస్తః కలంకీవా పరాశప్తో యయా పితః

సర్వంత్వాం కథయిష్యామి కథామేతాం పురాతనీం

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే భగవన్నంద సంవాదే ఏకోనాశీతితమోఽధ్యాయః

బ్రహ్మ వచ్చి భయపడిన భాస్కరుని మేల్కొలుపసాగాడు. గురువులకు గురువైన బ్రహ్మ, ధర్మజ్ఞులలో ధర్మజ్ఞుడైన మునిశ్రేష్టుని ఉద్బోధించసాగాడు. (42) బ్రహ్మవచనమిట్లా - భాస్కర! నీవు క్షమించు. నీవు సాక్షాత్తుగా నారాయణుడవు. మీకు పాలింపతగినవాడు. బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ చంపదగినవాడు కాదు. (43) నేను, అధికమైన విప్రుని శాపమునకు అంతమును నీకు చెప్తాను. నేను భయపడి ఇక్కడికి వచ్చాను. ఆ పైన భృగువు పంపించాడు. (44) మరీచికశ్యపుడు స్పష్టంగా చెప్పి పంపగా వచ్చాను, నేను. ఓ సురశ్రేష్ఠుడ! నీవు శాంతించు. అన్ని కర్మలకు నీవే సాక్షివి. (45) ఓ బ్రహ్మన్ (సూర్య!) ఏదో ఒక రోజున, ఏదో ఒకక్షణంలో నిన్ను మేఘాలు ఆవరిస్తాయి. వెంటనే విడిపోతాయి. (46) అధిక మాసం, క్షామమాసం వచ్చిన సంవత్సరంలో నిన్ను రాహువు మింగుతాడు. అక్కడ కన్పించకుండా పోతావు కొందరికి. కొందరికి కన్పించి పుణ్యం కల్గిస్తావు. (47) లేకపోతే అన్ని కాలములలోను నీ దర్శనము భూమి పై పుణ్యదర్శనము. నిన్ను చూచి, నమస్కరించి జనులంతా పాపహీనులౌతారు. (48) జన్మ, ఏడు, ఎనిమిది, పన్నెండు, నాలుగు, పది స్థానములందు, జన్మనక్షత్రమందు నరులు నిన్ను చూడకూడదు. చూస్తే మరణం సంభవిస్తుంది. (49) అస్తమయ కాలమందు, మేఘములు కప్పినప్పుడు, మధ్యాహ్న కాలమందు, నీటియందు సగం ఉదయించిన కాలమందు నిన్ను చూచిన పాపము కల్గుతుంది. (50) భార్య వల్ల దుఃఖకారణంగా, భార్యయే కారణమైన దానితో, మామతో, భావమరిదితోను నీతేజం నష్టమౌతుంది. (51) లేకున్న నీతేజాన్ని సంజ్ఞ (భార్య) కూడా సహించలేదు. మాలి సుమాలి యుద్ధంలో నీవు శివుని చేతిలో ఓడిపోతావు. (52) అని సూర్యునితో అని, బ్రాహ్మణునికి బోధించసాగాడు. ఓ ప్రజ! నమ్రంగా ఉన్న శాపంతో తిరస్కరింపబడ్డ, సిగ్గుపడుతున్న, కోపంతో ఉన్న బ్రాహ్మణునితో అన్నాడు. (53) ఓ బ్రాహ్మణ! నీ ఇంటికిపో. ఓ వత్స! సుఖంగా వెళ్ళు. నీతేజస్సుతో క్షణకాలంలో లోకం భస్మమౌతుంది. (54) సూర్యుని నీవు పాలించాలి. సూర్యుడు, నిన్ను నిరంతరం పాలించాలి. ఇద్దరు పరస్పరము పూజించుకోతగినవారు. మీ సంబంధము పోష్యపోషక సంబంధము. (55) విష్ణువు అంశమైన, క్షత్రియుడైన కార్తవీర్యార్జునునితో నీవు అవమానింపబడుతావు, అనుమానము లేదు. అవమానింపబడ్డ ద్విజుడు మృతప్రాయుడు. (56) నీ ప్రాచీనమైన కర్మ అంతా ఎప్పుడూ ఖండింపబడదు. నారాయణుడు తన అంశతో నీ కొడుకుగా జన్మిస్తాడు. (57) ఇరువది ఒక్క మారులు భూమి పై క్షత్రియులు లేకుండా చేస్తాడు. ఈభూమి పై నీకీర్తికి మృత్యువు కారణమౌతుంది. (58) ఓవ్రజేశ్వర! ఇట్లా చెప్పి బ్రహ్మ తన గృహమునకు వెళ్ళాడు. జమదగ్ని వెళ్ళాడు. భాస్యరుడు తన గృహమునకు వచ్చాడు. (59) ఓ తండ్రి! ఈ విధముగా పుణ్యమునకు కారణమైన ఆఖ్యానమును చెప్పాను. ఏ కారణంగా రాహుగ్రస్తుడైన సూర్యుడు అదృశ్యుడౌతాడు, (60) భాద్రపద మాస శుక్లకృష్ణ పక్షాల్లో చవితి చంద్రుడు, అదృశ్యుడు (చూడతగనివాడు) నష్టరూపుడౌతాడు చెప్పండి, వింటాను. (61) రాహుగ్రస్తుడు కళంకి అని ఇదివరలో నేను శపించాను, ఓ తండ్రి! పురాతనమైన ఈ కథనంతా నీకు చెప్తాను. (62) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు భగవంతుడు, నందుడు వీరి సంవాదమందు డెబ్బడి తొమ్మిదవ అథాయ్యము.