బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

83 - అధ్యాయము

మూ!! నందఉవాచ-

వేదానాం కరణం త్వం చ బ్రహ్మాదీనాంచ పుత్రక

సర్వం కథయ భద్రం తే కం పృచ్ఛామి త్వయా వినా

విప్రాణాం యోహి ధర్మశ్చ క్షత్రవిట్ శూద్రకర్మణాం

సంన్యాసినాంచ యో ధర్మో యతీనాం బ్రహ్మచారిణాం

విప్రాణాం విధవాస్త్రీణా వైష్ణవానాం సతామపి

పతివ్రతానాం స్త్రీణాంచ తత్సర్వం వక్తుమర్హసి

గృహిణాం గృహిణీనాంచ శిష్యాణాంచ విశేషతః

పుత్రాణాం చాపి కన్యానాం పితరం మాతరం ప్రతి

స్త్రీ జాతిశ్చ కతివిధా భక్త: కతివిధః ప్రభో

బ్రహ్మాండం చ కతివిధం వందనంచ కిమాత్మకం

కిం నిత్యం కృత్రిమం కించ బ్రూహి సర్వం క్రమేణచ

శ్రీభగవానువాచ:

సంధ్యాపూతః సదావిప్రః కురుతే మమ సేవనం

నిత్యం భుంక్తే మత్ర్ప సాదమనివేద్యకదాచన

అన్నం విష్ఠా జలం మూత్రం యద్విష్ణోరనివేదితం

విష్ణుప్రసాదభోజీచ జీవన్ముక్తశ్చ బ్రాహ్మణః

నిత్యం తపస్యానిరతః శుచిః శాంతశ్చ శాస్త్రవిత్

వ్రతతీర్థాశ్రితోధర్మీ నానాధ్యాపన సంయుతః

విష్ణుమంత్రం గృహీత్వాచ కృత్వాచ గురు సేవనం

గృహీత్వా తదనుజ్ఞాంచ పశ్చాద్భవతి సంగృహీ

దక్షిణాం నిత్యపూజానాం గురవేచ నివేదయేత్

గురూణాం పోషణం నిత్యం కర్తవ్యం నాత్రసంశయః

సర్వేషామపి వంద్యానాం పితాచైవ మహాన్ గురుః

పితుః శతగుణై ర్మాతా మాతుః శతగుణైః సురః

మంత్రదస్తంత్రదశ్చైవ సురాణాంచ చతుర్గుణః

నారాయణశ్చ భగవాన్ గురుః ప్రత్యక్ష ఈశ్వరః

ఉద్దేశే దీయతే తస్మై సురాయేతి శ్రుతో శ్రుతం

ప్రత్యక్ష భోక్తా స్వగురుః స్వయం దేహీ జనార్దనః

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురురేవ స్వయం శివః

గురౌచ సర్వదేవాశ్చ తిష్ఠంతి సతతం ముదా

గురౌతుష్ట హరిస్తుష్టో యస్మింస్తుష్టేచ దేవతాః

గురుః పుత్రసమం స్నేహం శిష్యేషు నకరిష్యతి

లభతే బ్రహ్మహత్యాంచ భుంక్తే కృత్వాచ నాశిషం

స్వధర్మనిరతో విప్రో బ్రాహ్మణశ్చ సదాశుచిః

విష్ణు సేవీ సదావిప్రః తదన్యోఽప్యశుచిః సదా

బ్రాహ్మణో వృషవాహశ్చ శూద్రాణాం సూపకారకః

బ్రాహ్మణో దేవలశ్చైవ సంధ్యాహీనశ్చ దుర్బలః

బ్రాహ్మణశ్చ ది వాశాయీ శూద్ర శ్రాద్ధన్న భోజనః

శూద్రాణాం శవ దాహీచ తేచ శూద్రసమా ద్విజాః

శాలగ్రామ మహామంత్రం కృత్వా పూజాం విధానతః

భుంక్తే నైవేద్య శేషంచ తత్పాదోదకమేవచ

హరేః పాదోదకం పీత్వా తీర్థస్నాయీభవేన్నరః

ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి

నందుడిట్లన్నాడు - వేదములకు, బ్రహ్మాదులకు నీవే కారణము ఓపుత్ర! అంతా చెప్పు. నీకు క్షేమం కలగని, నిన్ను కాక ఎవరిని అడుగుతాను. (1) బ్రాహ్మణుని ధర్మము, క్షత్రియ వైశ్యశూద్రుల ధర్మము, సన్యాసుల ధర్మము, యతిబ్రహ్మచారుల ధర్మము ఏమిటో చెప్పు. (2) విప్రుల, విధవస్త్రీల, వైష్ణవుల, సజ్జనుల, పతివ్రతల స్త్రీల ధర్మాలేవి. అదంతా చెప్పు (3) గృహస్థుల, ఇల్లాండ్ర ధర్మము, విశేషించి శిష్యుల ధర్మము, పుత్రుల, కన్యల ధర్మము తలిదండ్రుల విషయంలో ఏమిటి చెప్పు. (4) స్త్రీ జాతి ఎన్ని విధాలు భక్తులు ఎన్ని రకాలు, ఓ ప్రభు! బ్రహ్మాండము ఎన్ని విధాలు. వందనము ఆచరించటమెట్లా? నిత్యమైనదేది, కృత్రిమమైనదేది, అంతాక్రమంగా చెప్పండి. (5) శ్రీభగవంతుడిట్లన్నాడు - బ్రాహ్మణుడెప్పుడూ సంధ్యతో పవిత్రుడౌతాడు. ఎప్పుడూ నన్ను సేవిస్తాడు. (6) ఎప్పుడూ నా ప్రసాదాన్ని తింటాడు. ఎప్పుడూ నివేదన చేయకుండా తినడు. అట్లా తింటే అన్నము మలముతో సమానము. నీరు మూత్రంతో సమానము, విష్ణు నివేదన కాని దిట్లా (7) విష్ణుప్రసాదం తిన్న బ్రాహ్మణుడు జీవన్ముక్తుడు. ఎప్పుడు తపస్సు యందు ఆసక్తి కనపరుస్తాడు. శుచి, శాంతుడు, శాస్త్రవేత్త (8) వ్రతతీర్థముల ఆశ్రయించేవాడు, ధర్మ మాచరించేవాడు, అనేక విషయాలు బోధిస్తాడు. గురు సేవచేసి విష్ణు మంత్రాన్ని స్వీకరిస్తాడు (9) ఆతని అనుజ్ఞపొంది ఆపై మంచి గృహస్థుడౌతాడు. నిత్యపూజల దక్షిణను గురువుకు నివేదిస్తాడు. (10) గురుపోషణ ఎల్లప్పుడూ చేయాలి, అనుమానం లేదు. నమస్కరించదగిన వారందరిలో తండ్రి గొప్ప గురువు. (1) తండ్రికన్న నూరింతలెక్కువ తల్లి. తల్లికన్న నూరింతలెక్కువ దేవత. దేవతలకన్న నాల్గింత లెక్కువ మంత్రము నిచ్చేవాడు, తంత్రము నిచ్చేవాడు. (12) భగవాన్ నారాయణుడు, గురువు ప్రత్యక్షమైన ఈశ్వరుడు. సురునకు అని ఆతని నుద్దేశించి ఇవ్వాలి, అని శ్రుతిలో విన్పిస్తోంది. (13) తన గురువు ఎదురుగా భుజించేవాడు. జనార్దనుడు స్వయంగా దేహధారియై వచ్చినట్టు. గురువు బ్రహ్మ గురువు, విష్ణువు, శివుడు స్వయంగా గురువే. (14) దేవతలంతా ఎల్లప్పుడూ ఆనందంతో గురువు యందుంటారు. గురువు ఆనందిస్తే హరి ఆనందిస్తాడు. ఆతడు ఆనందిస్తే దేవతలంతా ఆనందిస్తారు. (15) గురువు శిష్యులను పుత్రునితో సమానంగా ప్రేమగా చూడకపోతే, ఆశీర్వదించకుండా తింటే బ్రహ్మహత్యా పాపాన్ని పొందుతాడు. (16) తన ధర్మాన్ని పాటించే విప్రుడు, బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ శుచియే. విష్ణువును సేవించేవిప్రుడు ఎప్పుడూ శుచి. ఇతరుడు ఎప్పడూ అశుచియే. (17) వృషభము ఎక్కే బ్రాహ్మణుడు, శూద్రులకు వంటవండే బ్రాహ్మణుడు, నంబి బ్రాహ్మణుడు, సంధ్యాహీనుడు, దుర్బలుడు, (18) బ్రాహ్మణుడు పగలు నిద్రించేవాడు, శూద్ర శ్రాద్ధాన్నాన్ని భుజించేవాడు, శూద్రశవాన్ని మోసేవాడు ఇలాటి బ్రాహ్మణులు శూద్ర సములు. (19) శాలగ్రామ మహామంత్రాన్ని జపించి, విధానంగా పూజించి, ఆశాల గ్రామపాదోదకాన్ని త్రాగి, నైవేద్య శేషాన్ని భుజించాలి. (20) హరిపాదోదకాన్ని త్రాగిన నరుడు తీర్థస్నానం చేసిన వాడౌతాడు. పాపాలన్నిటినుండి ముక్తుడై ఆతడు విష్ణులోకానికి వెళ్తాడు.

మూII సస్నాతః సర్వతీర్ధేషు సర్వయజ్ఞేషు దీక్షితః

శాలగ్రామశిలాతోయైఃయోఽభిషేకం సమాచరేత్

గంగాజలాద్దశగుణం శాలగ్రామజలంవ్రజ

నిత్యం భుంక్తే చయో విప్రో జీవన్ముక్తః సురైః సమః I

విప్రాణాం నిత్య కృత్యంచ విష్ణోర్నైవేద్యభోజనం

యత్నేన పూజనం తస్య తత్పాదోదక, సేవనం

నిత్యం త్రిసంధ్యం కురుతే భక్త్యాచ మమ పూజనం

ఏకాదశ్యాంచ భుంక్తేచ మమపై జన్మ వాసరే

శివరాత్రౌచ హేతాత శ్రీరామనవమీదినే

నచ భుంక్తే ప్రతీ యోహి జీవన్ముక్తో హి స ద్విజః

పృథ్వివ్యాం యాని తీర్థాని తస్య పాదే నతానిచ

విప్రపాదోదకంపీత్వా తీర్థస్నా యీభవేన్నరః

విప్రపాదోదక క్లిన్నా యావత్తిష్ఠతిమేదినీ

తావత్పుష్కర పత్రేషు పిబంతి పితరో జలం

విష్ణు ప్రసాద భోజీచ పవిత్రాం కురుతే మహీం

తీర్థానిచ నరాంశ్చైవ జీవన్ముక్తో హి సద్విజః

సర్వతీర్ధేషు సస్నాతో వ్రతానాంచ ఫలం లభేత్

పదేపదేఽశ్వమేధస్యలభతే నిశ్చితం ఫలం

వహ్నివాయుసమః పూతః తేజసా భ్కారోపమః

యమదూతం యమం చైవ సచ స్వప్నే న పశ్యతి

వైకుంఠే మోదతే సోఽపి పార్షదో హరిణాసహ

నభవేత్తస్య పాత్రోహి విప్రస్యహరి సేవినః

విష్ణుమంత్రోపాసకశ్చ సఏవవైష్ణవో ద్విజః

బ్రాహ్మణో వైష్ణవః ప్రాజ్ఞో నహితస్మాత్పరః పుమాన్

వేదోక్తోవా పురాణోక్త స్తంత్రోక్తోవా మునిః శుచిః

విచారతో గృహీత్వా తం శైవః శాక్తశ్చ వైష్ణవః

గురువక్త్రాద్విష్ణుమంత్రో యస్య కర్ణేవిశత్యయం

తం వైష్ణవం మహాపూతం ప్రవదంతి మనీషిణః

మంత్రగ్రహణమాత్రేణ జీవన్ముక్తో భవేన్నరః

భీత్వా బ్రహ్మాండమఖిలం యాస్యత్యేవ హరేః పదం

పూర్వాన్సప్తపరాన్సప్త సప్తమాతామహాదికాన్

సోదరానుద్ధరేద్భక్తః తత్రసూం తత్రసూం తథా

జ పేన్నారాయణం క్షేత్రే పురశ్చరణపూర్వకం

పురుషాణాం సహస్రంచ లీలయాత్మానముద్ధరేత్

మంత్రగ్రహణమాత్రేణ ఫలమేతద్ర్వజేశ్వర

పురశ్చరణ సంపర్కాత్పురుషాణాం శతం శతం

ఏకాంతికో వైష్ణవశ్చ పుంసాం లక్షం సముద్ధరేత్

క్రియా విష్ణుపదే యస్య సంకల్పాశ్చ బహిష్కృతాః

ద్విజాః సురా మమ ప్రాణా భక్తః ప్రాణాత్పరః ప్రియః

విశ్వేషు ప్రియపాత్రేషు నమేభక్తాత్పరః ప్రియః

తేజీయాంసం గురుం దృష్ట్వా సర్వత్ర రక్షితుం క్షమం

కరోతి మంత్రగ్రహణం తస్మాద్భూయాద్విచక్షణః

వయోహీనాత్ జ్ఞానహీనాద్విద్యాహీనాత్తథైవచ

జాతిహీనాధ్గురోరంత్రం గృహీయా న్న కదాచన

అను శాలగ్రామశిలను తోయముతో (నీరు) అభిషేకమొనర్చినవారు, వారు అన్ని తీర్థములలో స్నానం చేసినట్లే. అన్ని యజ్ఞములలో ఆతడు దీక్ష వహించినట్లే (22) ఓ ప్రజ! గంగా జలముకన్న శాలగ్రామ జలము పదింతలెక్కువ పుణ్యకారి. ఆ జలాన్ని రోజు సేవించిన విప్రుడు జీవన్ముక్తుడు, దేవతలతో సమమైనవాడు. (23) విష్ణువునకు నివేదించిన దానిని భుజించుట బ్రాహ్మణుల నిత్యవిధి. ప్రయత్నపూర్వకముగా విష్ణుపూజ, విష్ణుపాదోదకమును, సేవించుట చేయాలి. (24) ప్రతిరోజు మూడు పూటల భక్తితో విష్ణుపూజను చేసిన వారు, ఏకాదశిరోజున భుజించనివారు, నా జన్మ నక్షత్రమందు భుజించనివారు, (25) ఓ తండ్రి! శివరాత్రినాడు, శ్రీరామనవమినాడు తిననివారు నియమంగా ఉన్నవారు (ప్రతి) అలాటి బ్రాహ్మణుడు జీవన్ముక్తుడు. (26) భూమి పై ఎన్ని తీర్ధములున్నాయో అవి విప్రపాదోదకంలో నాల్గవ వంతుతో సమానం. విప్రపాదోదకాన్ని సేవించిన, నరుడు, తీర్థము నందు స్నానం చేసిన వాడితో సమానము. (27) ఏప్రపాదముల ఉదకంతో భూమి ఎంత కాలం తడిసి ఉంటుందో అంతకాలం పితరులు పుష్కర పత్రమందు (తామరాకు) జలము తాగుతారు. (28) విష్ణుప్రసాదాన్ని తినేవాడు భూమిని పవిత్రపరుస్తాడు. తీర్థములను, నరులను పవిత్ర పరుస్తాడు. ఆ బ్రాహ్మణుడు జీవన్ముక్తుడు. (29) ఆతడు అన్ని తీర్థములలో స్నానం చేసినట్లే. అన్ని వ్రతముల ఫలాన్ని పొందుతాడు. అడుగడుగునా అశ్వమేధ ఫలమును పొందుతాడు, నిశ్చయము. (30) అగ్ని వాయువులతో సమానుడాతడు. పవిత్రుడు తేజస్సులో సూర్యునితో సమానం. యమదూతనుకాని యముణ్ణి కాని ఆతడు కలలోకూడా చూడడు. (31) విష్ణువుతో పాటు ఆతని ప్రక్కన ఉంటూ ఈ విష్ణు భక్తుడు వైకుంఠమందు ఆనందిస్తాడు. విష్ణువును సేవించిన విప్రునకు క్రిందపడటం (రావటం) ఉండదు. (32) విష్ణుమంత్రోపాసన చేసే బ్రాహ్మణుడే వాడే వైష్ణవుడు. బ్రాహ్మణుడు, వైష్ణవుడు, ప్రాజ్ఞుడైనవాడు. వానికన్న పరుడైన పురుషుడు లేడు. (33) వేదంలో చెప్పబడ్డ లేదా పురాణంలో లేదా తంత్రంలో చెప్పబడ్డ వారెవరైనా మునిఐనవాడు శుచి, శైవుడైనా, శాక్తుడైనా, వైష్ణవుడైనా,ఆతనిని విచారించి స్వీకరించాలి (గురువుగా) (34) గురు ముఖం నుండి ఈ విష్ణు మంత్రము ఎవని చెవిలో పడుతుందో ఆ వైష్ణవుని చాలా పవిత్రమైనవానిగా, బుద్ధిమంతులు చెబుతారు. (35) మంత్రాన్ని గ్రహించినంత మాత్రంచేత నరుడు జీవన్ముక్తుడౌతాడు. బ్రహ్మాండ భాండాన్ని చీల్చుకొని హరిపదమును చేరుకుంటాడు. (36) పూర్వీకులైన ఏడు తరాలను, పరులైన ఏడు తరాల వారిని, మాతామహాదులైన వారిని ఏడుతరాలవారిని, సోదరులను విష్ణు భక్తుడు ఉద్ధరిస్తాడు. అట్లాగే వారి సంతానాన్ని ఆ తరువాతి వారి సంతానాన్ని ఉద్దరిస్తాడు. (37) క్షేత్రమందు పురశ్చరణ పూర్వకముగా నారాయణుని (మంత్రాన్ని) జరిపించాలి. వేయిమంది పురుషులను, అవలీలగా తనను ఉద్ధరించుకుంటాడు. (38) ఓ ప్రజేశ్వర! మంత్రమును గ్రహించినంత మాత్రముననే వచ్చే ఫలమిది. పురశ్చరణ సహవాసం వల్ల నూర్ల నూర్లపురుషులను ఉద్దరిస్తాడు. (39) “ఏకాంతిక” వైష్ణవుడు (విశేష నియమాలీతనికి) లక్షమంది పురుషుల నుద్ధరిస్తాడు. విష్ణుపదమందు తన క్రియల, సంకల్పముల బహిష్కరించాలి (40) ద్విజులు, దేవతలు నా ప్రాణములు, భక్తుడు ప్రాణముకన్న ఎక్కువ ప్రియమైనవాడు. విశ్వంలో ప్రియమైన వానిలో నాకు భక్తునికన్న ప్రియమైనవాడు, పరుడు లేదు. (41) తేజస్సు గల గురువును చూచి అన్ని విధాల రక్షించగల సమర్థుడైన గురువును చూచి ఆతని వద్ద మంత్రాన్ని గ్రహించాలి. కనుక మంత్రం గ్రహించేముందు గురువు విషయంలో విచక్షణుడై ప్రవర్తించాలి. (42) వయస్సులో తక్కువైన (తనకన్న) వాడు, జ్ఞానహీనుడు, విద్యాహీనుడు, అట్లాగే జాతిహీనుడు ఇట్టివారి నుండి గురుమంత్రాన్ని ఎప్పుడూ స్వీకరించరాదు.

మూII శాస్త్రార్థం చాక్షతం మంత్రం నగృహ్ణీయాత్కదాచన

మూర్ఖాదాశ్రమహీనాచ్చ పితుః సన్యాసినస్తథా

రోగిణో వంశహీనాచ్చ భార్యా హీనాత్తథైవచ

మంత్రక్షిప్తాత్తథా మంత్రం నగృహ్లియా త్కదాచన

విష్ణు మంత్రం నగృహ్ణియాద్విష్ణు భక్తి విహీనతః

నచశైవాన్న శాక్తాచ్చ గృహ్ణియాద్వైష్ణవా ద్ద్విజాత్

వయో హీనాత్త థాఽల్పాయుఃజ్ఞానహీనాదపండితాత్

విద్యాహీనాద్భవే న్మూడో జాతిహీనాత్ క్షయోభవేత్

మూర్ఖాన్మూర్ఖోభవేత్సద్యో దుఃఖీ స్వాశ్రమ హీనతః

యశోహానిః పితుశ్చైవ మృత్యుః సంన్యాసినస్తథా

రోగిణో వ్యాధియుక్తశ్చ నిర్వంశో వంశహీనతః

భార్యాహీనోఽపి స్త్రీ హీనాన్మంత్రక్షిప్తాత్తు తత్సమః

విష్ణుభక్తి విహీనాచ్చ భక్తిహీనో భవేన్నరః

శైవాచ్ఛాక్తా ధ్గృహీత్వాచ హరౌ భక్తి ర్నవర్ధతే

బ్రాహ్మణో వైష్ణవః శుద్ధః పక్వాన్నం దాతుమీశ్వరః

పక్వాన్నం హరయే దాతు మక్షమశ్చేతరోజనః

ఓంకారోచ్చారణాధోమాచ్ఛాల గ్రామశిలార్చనాత్

మహ్యం పక్వాన్నదానాచ్చ విప్రాదన్యో వ్రజేదధః

ఉదాసీనాద్దురాచారాన్న గృహ్ణియా న్మనుం సుధీః

దైవాద్యదిచగృహ్ణియాద్ధనహీనో భవేద్ద్రువం

బ్రాహ్మణానాం సదా భక్ష్యం హవిష్యంచ నిరామిషం

ఆమిషస్య పరిత్యాగాత్సూర్యవత్తేజసా భవేత్

నిత్యం నూతన భాండేన కర్తవ్యః పాక ఏవచ

అథవా పక్షపర్యంతం తతస్త్యాజ్యం మనీషిభిః

స్థానం సుసంస్కృతం కృత్వా పాకం నిర్వర్త్య పూజకః

స్థానే పరిష్కృతే విప్రో దత్వా మహ్యంత భక్తితః

తదా నివేద్య భుక్త్వాచ దత్వా విప్రాయ సాదరం

అనివేద్యచ భుక్త్వాచ సురాపీతిర్భవేద్ద్విజః

చంద్రసూర్యో పరాగేవై వాఽశౌచే మృత జాతయోః

స్పృష్టేనాశుచినా సద్యః పాకభాండం పరిత్యజేత్

భ్రష్టద్రవ్యం తథాఽన్నంచ ధృత్వాధౌతే చ వాససీ

పాదప్రక్షాలనం కృత్వా భుక్త్వా స్థానే పరిష్కృతే

ద్విర్భోజనం నకర్తవ్యం స్థితే సూర్యే ద్విజాతిభిః

నిష్ఫలం తద్భవేత్కర్మ భుక్త్వాచ నరకం వ్రజేత్

యాత్రాం యుద్ధం నదీతీరం పునరోజనమైథునే

వర్జయేచ్చ్రాద్ధదివసే హవిష్యాశీచ సంయమీ

ద్విజాయ విష్ణుభక్తాయ పాత్రం దద్యాద్బుధాయచ

వృషలీపతయే చైవ న దద్యాచ్ఛూద్రయాజినే

సంధ్యా హీనాయ దుష్టాయ వృషవాహాయ యత్నతః

శుకవిక్రవియిణే చైవ దేవలాయ కదాచన

ప్రదత్తం పాత్రవేతేభ్యో బ్రాహ్మణం నరకం నయేత్

పాత్రం భుక్త్వా తద్దివసే మైథునాన్నరకం వ్రజేత్

సర్వేభ్యః పాతకీ తాత కన్యావిక్రయ కారకః

మూల్యం గృహీత్వా యో దద్యాత్స మహారౌరవం వ్రజేత్

మూరుని నుండి, ఆశ్రమ పాలన (గృహస్థాది) (భ్రష్ట) చేయని వాని నుండి, తండ్రి నుండి, సన్యాసి నుండి శాస్త్రార్థము, అక్షత(లు), మంత్రము ఎప్పుడూ తీసుకొనరాదు. (44) రోగి, వంశహీనుడు, భార్యాహీనుడు, అట్లాగే మంత్రము నుండిజారినవాడు (మంత్రశుద్ధిలేనివాడు) వీరినుండి ఎప్పుడూ మంత్రాన్ని గ్రహించరాదు. (45) విష్ణుభక్తి లేని వాని నుండి విష్ణుమంత్రాన్ని గ్రహించరాదు శైవుడు, శాక్తుడు, వైష్ణవుడైనబ్రాహ్మణుడు వీరి నుండి విష్ణుమంత్రం గ్రహించరాదు. (46) తక్కువ వయస్సు వాని నుండి గ్రహిస్తే అల్పాయుస్కుడు, జ్ఞానహీనుని నుండి గ్రహిస్తే అపండితుడు, విద్యాహీనుని నుండి గ్రహిస్తే మూర్ఖుడు ఔతాడు. జాతి హీనుని నుండి మంత్రాన్ని గ్రహిస్తే నాశనము నందుతాడు. (47) మూరుని వల్లనైతే మూర్ఖుడు, ఆశ్రమహీనుని నుండి మంత్రగ్రహణం చేస్తే వెంటనే దుఃఖితుడౌతాడు. తండ్రి నుండైతే కీర్తినాశనము సంన్యాసినుండైతే మృత్యువు సంభవిస్తాయి. (48) రోగగ్రస్తునినుండైతే వ్యాధి వస్తుంది. వంశహీనుని నుండి స్వీకరిస్తే నిర్వంశుడౌతాడు స్త్రీ హీనుని నుండి మంత్రం స్వీకరిస్తే భార్యాహీనుడౌతాడు, మంత్రం నుండి జారినవానినుండి మంత్రం స్వీకరిస్తే వానితో సమానుడౌతాడు (మంత్రం నిష్ప్రయోజనం) (49) విష్ణుభక్తిలేని వాని నుండి ఐతేనరుడు భక్తిహీనుడౌతాడు. శైవుని నుండి లేదా శాక్తుని నుండి స్వీకరిస్తే విష్ణువు పై భక్తి పెరగదు. (50) వైష్ణవ బ్రాహ్మణుడు శుద్దుడు పక్వానాన్ని ఇవ్వటానికి సమర్థుడు. హరికి పక్వాన్నం ఇవ్వటానికి ఇతర జనులు అసమర్థులు. (51) ఓంకార ఉచ్ఛారణము, హోమము, శాలగ్రామశిల యొక్క పూజ, నాకు పక్వాన్నము ఇవ్వటము ఇవి బ్రాహ్మణుడు కాక ఇతరుడుచేస్తే అధఃపతితుడౌతాడు. (52) ఉదాసీనుడు, దురాచారుడు వీరినుండి బుద్దిమంతుడు మంత్రం స్వీకరించరాదు. ఒకవేళ విధివశాత్తు గ్రహిస్తే, ధనహీనుడౌతాడు, నిశ్చయము. (53) బ్రాహ్మణుడు ఎల్లప్పుడు మాంసం లేని హవిష్యాన్ని భుజించాలి. ఆమిషం వదిలితే (మాంసం), సూర్యునివలె తేజస్వంతుడౌతాడు. (54) రోజు కొత్తకుండతో పాకాన్ని చేయాలి లేదా పది హేనురోజుల వరకు చేయాలి. ఆపై బుద్దిమంతులు దానిని పారవేయాలి (వాడరాదు), (55) పూజచేసేవాడు, పాకస్థానాన్ని శుద్ధిచేసి వంటచేసి, పూజాస్థానాన్ని శుద్ధిచేసి విప్రుడు భక్తితో నాకు నివేదన చేయాలి. (56) అట్లా నివేదనచేసి, బ్రాహ్మణునకు ఆదరపూర్వకంగా పెట్టి, తినాలి. నివేదించకుండా, తింటే ఆ బ్రాహ్మణుడు సురాపానం చేసినవాడౌతాడు. (57) సూర్యుచంద్రుల గ్రహణమందు, జాతమృత ఆశౌచములందు అశుచి కల్గినందువల్ల వెంటనే వంటపాత్రలను పారవేయాలి. (58) భవ్రమైన ద్రవ్యము, అన్నము విడువాలి. ఉతికిన వస్త్రములు ధరించి, పాదప్రక్షాళనచేసుకొని పరిష్కరింపబడిన (శుద్ది) స్థానంలో భుజించాలి. (59) సూర్యుడున్నప్పుడు, బ్రాహ్మణ జాతివారు రెండుసార్లు భుజించరాదు. (పగలు ఒకపూటనే భోజనం చేయాలి) లేకున్న ఆతని కర్మ అంతా నిష్పలమౌతుంది. తింటే నరకానికి వెళ్తాడు. (60) యాత్ర, యుద్ధము, నదీతీరము, రెండు సార్లు భోజనము, మైథునము వీటిని హవిష్యం తినే వాడు, సంయమం గలవాడు (నియమవంతుడు) శ్రాద్దంరోజున విడిచి పెట్టాలి (చేయరాదు), (61) ద్విజునకు, విష్ణుభక్తునకు, పండితునకు పాత్రమును ఇవ్వాలి. వృషలీపతికి, శూద్రులకు యాజి (యాగం) యైనవానికి ఇవ్వరాదు. (62) సంధ్య హీనునకు, దుష్టునకు, వృషభం ఎక్కేవానికి (వ్యాపార బ్రాహ్మణుడు) ప్రయత్నపూర్వకముగానైనా, చిలుకలమ్మే వానికి, దేవలునకు (నంబి) ఎప్పుడూ ఇవ్వరాదు. (63) వారికి పాత్రదానంచేస్తే ఆ బ్రాహ్మణుడు నరకానికి వెళ్తాడు. పాత్రను తిని (భోంచేసి) ఆరోజు మైథునమాచరిస్తే నరకానికి పోతాడు. (64) ఓ తండ్రి అందరికన్న పాతకి కన్యను అమ్మేవాడు. వెలతీసుకొని ఇచ్చేవాడు (కన్యను) మహారౌరవ నరకానికి పోతాడు.

మూ కన్యాలోమప్రమాణాంతం వర్షంచ పితృభిస్సహ

కుంభీపాకే పచ్యతేచ పుత్రశ్చాపి పురోహితః

తస్మాత్కన్యాం సుపుత్రాయ దానం కుర్యాద్విచక్షణః

శూద్రవ ద్భ్రాహ్మణేభ్యశ్చ నైవ తద్వంశజాయచ

విప్రవైష్ణవయోర్ధర్మః కథితశ్చ వ్రజేశ్వర

యదుక్తంచ పురాణైశ్చ చతుర్భిః శ్రుతిభిస్తథా

ద్విజార్చనం క్షత్రి యాణాంతథా నారాయణార్చనం

రాజ్యాంనాంపాలనం చైవ రణే నిర్భయతా తథా

నిత్యం దానం బ్రాహ్మణేభ్య: శరణాగతరక్షణం

పుత్రతుల్యం ప్రజానాంచ దుఃఖినాం పరిపాలనం

శస్త్రాస్త్రాణాంచ నైపుణ్యం రణే శాండీర్యమేవచ

తపశ్చ ధర్మకృత్యంచ యత్నతః కురుతే సదా

పండితం నీతిశాస్త్రజ్ఞం నిత్యంచ పరిపాలయేత్

నియోజయేత్సభామధ్యే నిత్యం సద్భిశ్చ సంయుతే

హస్త్యశ్వరథ పాదాతం సేనాంగంచ చతుష్టయం

పాలయేద్యత్నతో నిత్యం యశస్వీచ ప్రతాపవాన్

రణే నిమంత్రితశ్చైవ దానే, న విముఖో భవేత్

రణేవా యస్త్యజేత్ప్రాణాంస్తస్య స్వర్గో యశస్కరః

వైశ్యానామపి వాణిజ్య మీశ్వరః కృషిపాలనే

విప్రదేవార్చనం దానం తపస్యా వ్రత సేవనం

విప్రాణామర్చనం నిత్యం శూద్రధం, యతే

తత్కృషీ తద్ధన గ్రాహీ శూద్రశ్చాండాలతాం వ్రజేత్

గృధ్ర: కోటిసహస్రాణి శతజన్మని సూకరః

శ్వాపదః శతజన్మాని శూద్రో విప్రధనాపహః

యః శూద్రో బ్రాహ్మణీగామీ మాతృగామీచ పాతకీ

కుంభీపాకే పచ్యతే స యావదై బ్రహ్మణః శతం

కుంభీపాకే తప్తతైలే భుక్తః సర్పైరహర్నిశం

శబ్దంచ వికృతాకారం కురుతే యమతాడనాత్

తతశ్చాండాలయోనిఃస్యాత్ సప్తజన్మసు పాతకీ

సప్తజన్మసు సర్పశ్చ జలూకాః సప్తజన్మసు

జన్మకోటి సహస్రంచ విష్ఠాయాం జాయతే కృమిః

పుంశ్చలీనాం యోనికృమి: స భవేత్సప్తజన్మసు

గవాంవ్రణకృమిఃస్యాచ్చ పాతకీ సప్తజన్మసు

యోనౌ యోనౌ భ్రమత్యేవం న పునర్జాయతే నరః

సంన్యాసినాంచ యో ధర్మో మన్ముఖాచ్చనిశామయ

దండగ్రహణమాత్రేణ నరో నారాయణో భవేత్

పూర్వకర్మాణి దగ్ధ్వాచ పరకర్మనికృంతనం

కురుతే చింతయేన్మాంచ హ్యాయాతి మమ మందిరం

సంన్యాసినః పదస్పర్శాత్ సద్యః పూతా వసుంధరా

సద్యః పునంతి తీర్థాని వైష్ణవస్య యథా ప్రజ

సంన్యాసినశ్చ స్పర్శేన నిష్పాపో జాయతే నరః

సంన్యాసినం భోజయిత్వా చాశ్వమేధఫలం లభేత్

నత్వాచ కామతో దృష్ట్వా రాజసూయ ఫలం లభేత్

ఫలం సంన్యాసినాం తుల్యం యతీనాం బ్రహ్మచారిణం

అను! కన్యకు ఎన్ని వెంట్రుకలున్నాయో అంతకాలం, అన్ని సంవత్సరాలు,పితరులతో కూడా కుంభీపాక నరకంలో వండబడుతాడు. వానీపుత్రుడు, పురోహితుడు కూడా (66) అందువల్ల కన్యను మంచి పుత్రునకు విచక్షణడు, దానం చేయాలి ఆతడు శూద్రునితో సమానము. బ్రాహ్మణుడు ఆతని వంశజనులకు కన్య నివ్వరాదు.(67). ఓవ్రజేశ్వర! విప్ర వైష్ణవ ధర్మాన్ని చెప్పాను. పురాణములు, నాలుగు వేదములు చెప్పిన దానినిచెప్పాను. (68) క్షత్రియుడు, ద్విజార్చనము, నారాయణ పూజ చేయాలి. రాజ్యపాలనము. యుద్ధమందు నిర్భయంగా ఉండటము చేయాలి. (69) బ్రాహ్మణులకు రోజుదానము చేయాలి. శరణాగత రక్షణ చేయాలి. ప్రజలను కొడుకులలాగా చూచుకోవాలి. దుఃఖితులను రక్షించాలి. (70) శస్త్రాస్త్రములందు నైపుణ్యమును చూపాలి. యుద్ధమందు పరాక్రమం చూపాలి.ఎప్పుడు తపస్సు, ధర్మకృత్యము ప్రయత్నంగా రక్షించాలి. (71) తపస్సుధర్మము ఆచరించే పండితుని నీతిశాస్త్రజ్ఞుని ఎల్లప్పుడూ పరిపాలించాలి. ఎల్లప్పుడూ సజ్జనులు కలిగిన సభామధ్యంలో వారినుంచాలి. (72) హస్తి, గుర్రము, రథము, పదాతి సైన్యము అనే నాలు రకాల, సేనాంగ మునుంచాలి. కీర్తిగల, ప్రతాపవంతుడైనరాజు ప్రయత్నపూర్వకంగా ఎల్లప్పుడూ 'ఆనాల్గింటిని పాలించాలి. (73) యుద్ధంకై నియంత్రణ చేశాక దానంలో విముఖుడు కారాదు. రణంలో మరణించినవానికి స్వర్గము కీర్తి లభిస్తాయి. (74) వైశ్యులకు వాణిజ్యము, కృషి, రక్షణ ప్రధానము. బ్రాహ్మణ, దైవ అర్చనము, దానము, తపస్సు, వ్రత సేవనము ప్రధానము. (75) ఎప్పుడూ బ్రాహ్మణుని అర్చించుట శూద్ర ధర్మము అని విధించారు. ఆతని సేద్యము (పని) చేసి ఆతని ధనము గ్రహించుట వల్ల శూద్రుడు చండాలుడౌతున్నాడు. (76) వేలకోట్ల సంవత్సరాలు గద్దగా,నూరు జన్మలు పందిగా, నూరుజన్మలు పులిగా విప్రధనాన్ని అపహరిస్తే శూద్రుడు ఇట్లా జన్మిస్తాడు. (77) బ్రాహ్మణస్త్రీని పొందితే శూద్రుడు, తల్లిని పొందినంత పాతకి, బ్రహ్మయొక్క నూరు సంవత్సరాల కాలము వాడుకుంభీపాక నరకంలో వండబడుతాడు. (78) కుంభీపాక నరకంలో, కాగిన నూనెలో పాములచే రాత్రింబవళ్ళు కరువబడ్డాడు. యముడు కొడూ ఉన్నందువల్ల వికృతాకారమైన శబ్దాన్ని చేస్తాడు. (79) ఆ పిదప చండాల యోని ఔతాడు. ఏడు జన్మలు పాతకియై ఉంటాడు. ఏడు జన్మలు సర్పంగా, ఏడు జన్మలు జలగగా జన్మిస్తాడు. (80) వేయి కోట్ల జన్మలు మలమందు పురుగౌతాడు. ఏడు జన్మలు వ్యభిచారస్త్రీ యోనియందు పురుగౌతాడు. (81) ఆపాతకి ఏడు జన్మలలో గోవుల పుండులో పురుగౌతాడు. యోని నుండి యోనికి ప్రతియోనిలో ఇట్లా తిరుగుతాడు. నరుడుగా జన్మించడు (82) సంన్యాసుల ధర్మాన్నినేను' చెప్తున్నాను. నాముఖం నుండి విను. దండమును గ్రహించిన మాత్రం చేత నరుడు నారాయణుడౌతాడు. (83) పూర్వకర్మలు దగ్ధమౌతాయి. పరకర్మలనాశనమౌతుంది. నన్ను చింతిస్తూ నా మందిరానికి వస్తాడు. (84) సంన్యాసి పార స్పర్శవల్ల భూమి వెంటనే పవిత్రమౌతుంది. వైష్ణవునకు ఎట్లాగో అట్లా తీర్థములు సంన్యాసి వల్ల వెంటనే పవిత్రమౌతాయి. ఓ ప్రజ! (85) సంన్యాసి స్పర్శతో నరుడు పాపరహితుడౌతాడు. సంన్యాసికి భోజనం పెత్తే అశ్వమేధ ఫలాన్ని పొందుతారు. (86) నమస్కరించి, ప్రేమగా చూస్తే రాజసూయ ఫలం లభిస్తుంది. సంన్యాసుల,యుతుల బ్రహ్మచారుల వల్ల కలగిలే ఫలము సమానమే.

మూ!! సంన్యాసీ యాతి సాయాహ్నే క్షుదితో గృహిణాం గృహం

సదన్నంవా కదన్నంవా తద్దత్తంనైవ వర్జయేత్

నయాచతేచ మిష్టాన్నం నకుర్యా త్కోపమేవచ

న ధనగ్రహణం కుర్యాదేకవాసా నిరీతః

శతగ్రీష్మ సమానశ్చ లోభ మోహ వివర్జితః

తత్ర స్థిత్వైకరాత్రంచ ప్రాతరన్యత్ స్థలం వ్రజేత్

యానమారోహణం కృత్వా గృహీత్వా గృహిణో ధనం

గృహం కృత్వా గృహీ రమ్యాత్స్వధర్మాత్పతితో భవేత్

కృత్వాచ కృషివాణిజ్యం కువృత్తిం కురుతేచ యః

స సంన్యాసీ హతాచారః స్వధర్మాత్పతితో భవేత్

అశుభంచ శుభం వాపి స్వకర్మ కురుతే యది

బహిష్కృతః స్వధర్మీ వాఽప్యుపహాస్యశ్చ వైభవేత్

బ్రాహ్మణీ పతిహీనా యా భవేన్నిష్కామినీ సదా

ఏకభుక్తా దినాంతే సా హవిష్యాన్నరతాసదా

న ధత్తే దివ్యవస్త్రంచ గంధ ద్రవ్యం సుతైలకం

స్రజంచ చందనం చైవ శంఖసిందూర భూషణం

త్యక్త్వామలిన వస్త్రాస్యాన్నిత్యం నారాయణం స్మరేత్

నారాయణస్య సేవాంచ కురుతే నిత్యమేవచ

తన్నామోచ్చారణం శశ్యత్ కురుతే నాన్యభక్తితః

పుత్రతుల్యంచ పురుషం సదా పశ్యతి ధర్మతః

మిష్టాన్నం నచ భుంక్తే సానకుర్యాద్విభవంవ్రజ

ఏకాదశ్యాం నభోక్తవ్యం కృష్ణ జన్మాష్టమీదినే!!

శ్రీ రామస్య నవమ్యాంతు శివారాత్రౌ పవిత్రయా !

అఘోరాయాంచ ప్రేతాయాం చంద్రసూర్యోపరాగయోః

భ్రష్టం ద్రవ్యం పరిత్యజ్య భుజ్యతే పరమేవచ

తాంబూలం విధవాస్త్రీణాం యతీనాం బ్రహ్మచారిణాం

సంన్యాసినాంచ గోమాంస సురాతుల్యం శ్రుతౌశ్రుతం

రక్తాశాకం మసూరంచ జంబీరం పర్ణమేవచ

అలాబుర్వర్తు లాకారా వర్జనీయాచ తైరపి

పర్యంకశాయినీనారీ విధవా పాతయేత్పతిం

యానమారోహణం కృత్వా విధవా నరకం వ్రజేత్

నకుర్యాత్కేశ సంస్కారం గాత్ర సంస్కారమేవచ

కేశవేణీజటారూపం తత్ క్షౌరం తీర్థకం వినా

తైలాభ్యంగం నకుర్వీత నహి పశ్యతి దర్పణం

ముఖంచ పరపుంసాంచ యాత్రాంనృత్యం మహోత్సవం

నర్తనం గాయనం చైవ సువేషం పురుషం శుభం II

శృణుయాచ్చ సతాం ధర్మం సామవేదనిరూపితం

పరమార్థం పరంచైవ నిబోధ కథయామి తే

అధ్యాపన మధ్యయనం శిష్యాణాం పరిపాలనం

గురూణాం సేవనం నిత్యం ద్విజదేవార్చనం తథా

సిద్ధాంతశాస్త్ర నైపుణ్యం భావనం స్వాత్మతోషణం

వ్యాఖ్యానం పరిశుద్ధంచ గ్రంథాభ్యస్తంచ సంతతం

అను!! సంన్యాసి, యతి, సాయంకాలమందు ఆకలిగొని గృహస్థుల ఇంటికి వెళ్ళాలి. మంచి అన్నంకాని చెడ్డ అన్నంకాని వారిచ్చింది. పారేయకూడదు. (88) మధుర ఆహారాన్ని యాచించరాదు. కోపగించరాదు. ధనం తీసుకోరాదు. ఒంటి (కే) వస్త్రంతో, కోరికలేకుండా ఉండాలి. (89) చలి, వేడిమి రెండు సమానమాతనికి, లోభమోహములు విడిచి పెట్టాలి. అక్కడ ఒక రాత్రి ఉండి, తెల్లవారి మరోచోటికి పోవాలి. (90) వాహనమెక్కటంచేస్తే గృహస్థుల ధనం తీసుకుంటే, ఇల్లు కట్టుకొని గృహం కలవాడైతే, మంచిదైన తన ధర్మం నుండి పతితుడౌతాడు. (91) కృషి, వ్యాపారము చేసి, చెడువృత్తిని చేసేవాడు, అట్టి సంన్యాసి ఆచారంను చెరిచినవాడౌతాడు. తన ధర్మంను పతితుడౌతాడు. (92) చెడ్డదికాని మంచిదికాని తన కర్మను ఆచరించినట్లైతే (పూర్వంది), తన ధర్మమందున్నా బహిష్కరింపబడి, నవ్వుల పాలౌతాడు. (93) భర్తలేని బ్రాహ్మణస్త్రీ ఎప్పుడూ, కామంలేనిది కావాలి. దినము చివర ఆమె ఒక పూట తినాలి. ఎప్పుడూ హవిష్యాన్నమునే తినాలి. (94) మంచి (దివ్యమైన) వస్త్రమును ధరించరాదు. గంధ ద్రవ్యమును, వాసనగల తైలములు వాడరాదు. పూలమాల, చందనము, శంఖము, సిందూర భూషణములు ధరించరాదు. (95) వాటిని వదలి, ఎప్పుడూ అమలినమైన (సాధారణమైన) వస్త్రం ధరించాలి. ఎప్పుడూ నారాయణుని స్మరించాలి. ఎప్పుడూ నారాయణుని సేవ చేయాలి. (96) వేరే భక్తి లేకుండా, ఎప్పుడూ నారాయణుని నామోచ్చారణ చేయాలి. పరపురుషుని ఎప్పుడూ ధర్మంగా పుత్రునితో సమంగా చూడాలి. (97) మధుర ఆహారాన్ని ఆమె తినరాదు. ఓప్రజ! ఆమె వైభవమును కూర్చుకోరాదు. ఏకాదశి, కృష్ణ జన్మాష్టమి ఈరోజు లందు తినరాదు. (98) శ్రీరామనవమియందు, శివరాత్రినాడు పవిత్రంగా ఉండాలి. ప్రేత శివసన్నిధి చేరితే, సూర్యచంద్రుల గ్రహణమందు (99) తినరాదు. భ్రష్టమైన ద్రవ్యమును వదలి, పరమైనదే తినాలి. తాంబూలమును, విధవన్రీ, యతి, బ్రహ్మచారి తినరాదు (100) సంన్యాసులకు గోమాంసము సురతో సమానము, అని శ్రుతులలో వినపడింది. ఎర్రని కూరను, సెనగలు, నిమ్మ, మోదుగ (101) గుండ్రని సొరకాయ, వీటిని వారు విడిచి పెట్టాలి. మంచం పై పడుకునే స్త్రీ, విధవ, భర్తను అధః పతితుని చేస్తుంది (102) పల్లకినెక్కితే (వాహనం) విధవ నరకానికి వెళ్తుంది. కేశముల సంస్కారము (అలంకరణ) శరీరాలంకరణ చేసుకోరాదు (103) కేశముల జడ జడలరూపంగా ఉండరాదు. వాటి క్షారాన్ని తీర్థములందు తప్ప (ఇతరత్ర) చేసుకోరాదు. తైలాంభ్యంగము చేయరాదు. అద్దం చూడరాదు (104) పరపురుషుల ముఖం చూడరాదు. యాత్ర,నృత్యము, మహోత్సవము, నాట్యము, పాడటము చేయరాదు. మంచివేషం గల పురుషుని, శుభమును చూడరాదు (105) సజ్జనుల ధర్మాన్ని వినాలి. సామవేదంలో చెప్పినదాన్ని వినాలి. పరమార్దమైన దానిని పరమైన (శ్రేష్ఠం) దానిని నీకు చెబుతున్నాను. మేలుకో (106) చదివించడం, చదవటం, శిష్యపాలనము, గురు సేవ, ఎప్పుడూ ద్విజుల దేవుళ్ళ అర్చన చేయాలి (107) సిద్ధాంత శాస్త్రములందు నైపుణ్యం సంపాదించాలి. వాటిని భావించాలి. ఆత్మ సంతుష్టుడు కావాలి. వాటిని వ్యాఖ్యానించాలి. పరిశుద్దుడై ఉండాలి. ఎప్పుడూ గ్రంథాభ్యాసం చేయాలి (చదవిందాన్ని వ్యాఖ్యానించాలి).

మూII వ్యవస్థా పరిశుద్ధ్యర్థం విచారో వేదసంమతః

శాస్త్రార్థాచరణం చైవ కర్తవ్యం స్వయమేవచ

దేవాహ్నికేషు నైపుణ్యం వేదాచరణ మీప్సితం

వేదోక్త భక్షణం చైవ పవిత్రా చరణం సదా

పతివ్రతానాం యం ధర్మం తన్నిబోధవ్రజేశ్వర

నిత్యంతు భర్తర్యౌత్సుక్యాత్ తత్పాదోదకమీప్సితం

భక్తి భావేన సతతం భోక్తవ్యం తదనుజ్ఞయా

వ్రతం తపస్యాం దేవార్చాం పరిత్యజ్య ప్రయత్నతః

కుర్యాచ్చరణ సేవాంచ స్తవనం పరితోషణం

తదాజ్ఞా రహితం కర్మ న కుర్యాద్వైరతః సతీ

నారాయణాత్పరం కాంతం ధ్యాయతే సతతం సతీ

పరపుంసాం ముఖంచైవ సువేష పురుషం పరం

యాత్రామహోత్సవం నృత్యం నర్తనం గాయనం వ్రజ

పరక్రీడాంచ సతతం నహి పశ్యతి సువ్రతా

యద్భక్ష్యం స్వామినోనిత్యం తదేవమపి యోషితాం

నహిత్యజేత్తు తత్సంగం క్షణమేవచ సువ్రతా

ఉత్తరే నోత్తరం దద్యాత్ స్వామినశ్చ పతివ్రతా

న కోపం కురుతే శుద్ధా తాడితాచాపి కోపతః

క్షుధితం భోజయేత్కాంతం దద్యాత్పానంచ భోజనం

నబోధయేత్తం నిద్రాలుం ప్రేరయేన్నైవకర్మసు

పుత్రాణాంచ శతగుణం స్నేహం కుర్యాత్పతిం సతీ

పతిర్భంధుర్గతిర్బర్తా దైవతం కులయోషితః

శుభందృష్ట్వా సుధాతుల్యం కాంతం పశ్యతిసుందరీ

సస్మితం వదనం కృత్వా భక్తి భావేన యత్నతః

పురుషాణాం సహస్రంచ సతీ స్త్రీచ సముద్ధరేత్

పతిః పతివ్రతానాంచ ముచ్యతే సర్వపాతకాత్

నాస్తి తేషాం కర్మభోగః సతీనాం వ్రతతేజసాం

తయా సార్థం చ నిష్కర్మీ మోదతే హరిమందిరే

పృథివ్యాం యాని తీర్థాని సతీపాదేషు తాన్యపి

తేజశ్చ సర్వదేవానాం మునీనాంచ సతీషుచ

తపస్వినాం తపః సర్వం ప్రతీనాం యతృలం వ్రజ

దానే ఫలం యద్దాతృణాం తత్సర్వ తాసుసంతతం

స్వయంనారాయణః శంభుః విధాతాజగతామపి

సురాః సర్వేచమునయో భీతాస్తాభ్యాంచ సంతతం

సతీనాం పాదరజసాసద్యః పూతావసుంధరా

పతివ్రతాంనమస్కృత్యముచ్యతే పాతకాన్నరః

 త్రైలోక్యం భస్మసాత్కర్తుం క్షణేనైవ పతివ్రతా

స్వతేజసా సమర్థానా మహాపుణ్యవతీసదా

సతీనాంచపతిః సాధుః పుత్రోనిః శంక ఏవచ

నహితస్యభయంకించిద్దేవేభ్యశ్చ యమాదపి

శతజన్మ పుణ్యవతాంగే హేజాతా పతివ్రతా

పతివ్రతాప్రసూః పూతాజీవన్ముక్తః పితా తథా

సతీస్త్రీ ప్రాతరుత్థాయ త్యక్త్వాచరాత్రివాససం

భర్తారంచన మస్కృత్యకరోతిస్త వనం ముదా

వ్యవస్థపరిశుద్ది కొరకు (లేక) విచారణ చేయుటము (చర్చ) వేద సమ్మతమైనది. స్వయంగా శాస్త్రార్జాచరణ చేయాలి (109) దేవసంబంధి ఆహ్నికకార్యములందు నైపుణ్యము, వేద విహితాచరణము కోరతగినది. వేదములలో చెప్పిన వానిని భుజించుట, ఎప్పుడూ పవిత్రమైన నడక ఉండాలి. (110) ఓవ్రజేశ్వర! పతివ్రతల ధర్మాన్ని చెప్తాను విను. ప్రతిరోజు, భర్తమీద ఉత్సుకతతో, కోరికతో భర్త పాదోదకాన్ని సేవించాలి (111) భర్త అనుజ్ఞతో భక్తి భావంతో ఎప్పుడూ భుజించాలి. వ్రతము, తపస్సు, దేవార్చన వీటిని వదలి ప్రయత్నంగానైనా (112) భర్తచరణ సేవ చేయాలి (వదలటం, కాదు. ఇది ముఖ్యమని చెప్పటం). భర్త స్తుతి, చేయాలి. సంతోషపరచాలి. విరోధంతో సతి, ఆతని అనుజ్ఞలేకుండా ఏకర్మ చేయరాదు (113) సతి, ఎప్పుడూ, నారాయణుని కన్నను భర్తను పరమైన వాణ్ణిగా తలవాలి. పరపురుషుని ముఖం చూడరాదు. పరుడైన మంచి వేషం గల పురుషుని చూడరాదు. (114) యాత్ర మహోత్సవము, నృత్యము, నాట్యము, పాట, ఇతరుల క్రీడ, ఎప్పుడూ చూడరాదు, సువ్రతురాలు, ఓ ప్రజ!, (115) భర్త ఏదితింటే స్త్రీ అదే తినాలి, రోజూ. ఆతని సంగమును (తోడు) క్షణకాలం కూడా వదలరాదు, సువ్రత! (116) ఎదురు సమాధానం చెప్పరాదు భర్తకు, పతివ్రత. కోపంతో కొట్టినా శుద్ధురాలు కోపగించరాదు (117) ఆకలిగొన్న భర్తను భుజింపచేయాలి. పానీయము, భోజనము ఇవ్వాలి. నిద్రపోతున్న ఆతనిని లేపరాదు. పనులు పురమాయించరాదు (118) సతి, భర్త పై పుత్రుల పై కన్న నూరు రెట్లు ఎక్కువ స్నేహంచూపాలి. పతియే బంధువు, గతి, భర్త, దేవత, కులస్తీకి (119) స్వచ్ఛంగా (సున్నంలాగా) అమృతంలాగా భర్తను చూస్తే ఆ స్త్రీ శుభాన్ని పొందుతుంది, చిరునవ్వుతో ప్రయత్నంగా భక్తి భావంతో చూడాలి (120) సతియై స్త్రీ వేయిమంది పురుషులను ఉద్దరిస్తుంది (తన శక్తితో). పతివ్రత భర్త అన్ని పాపముల నుండి ముక్తుడౌతాడు (121) వ్రతంతో తేజ స్వంతులైన సతులకు కర్మ భోగము లేదు. కర్మ చేయనివాడూ, వారితోపాటు హరి మందిరమందు ఆనందిస్తాడు (122) భూమియందలి తీర్ధములన్ని సతీపాదములందున్నాయి. సర్వ దేవతల, మునుల తేజస్సు సతులలో ఉంది (123) తపస్వుల తపస్సు, ప్రతుల వ్రత ఫలము అదంతా సతులలో ఉంది, ఓ ప్రజ దాతల దానఫలము అదంతా సతులలో ఎప్పుడూ ఉంటుంది (124) స్వయంగా నారాయణడు, శంభువు, జగద్విధాత, దేవతలు, మునులు, అంతా వారిని చూచి ఎప్పుడూ భయపడుతారు (125) భూమి సతుల పాదధూళితో వెంటనే పవిత్రమౌతుంది. పతివ్రతకు నమస్కరిస్తే నరుడు పాతకం నుండి ముక్తుడౌతాడు (126) పతివ్రత క్షణకాలంలో ముల్లోకాలను భస్మంచేస్తుంది. ఆమె తన తేజస్సుతో ఈపని చేయసమర్ధురాలు. ఎప్పుడూ మహాపుణ్యవతి సతి (127) సతుల భర్త సాధువు (సజ్జనుడు) పుత్రుడు శంకారహితుడు. వానికి దేవతల నుండికాని యముని నుండికాని భయం లేదు (128) నూరు జన్మల పుణ్యంగల వారి ఇంట్లో పతివ్రత జన్మిస్తుంది. పతివ్రత తల్లి పవిత్రమైంది. అట్లాగే తండ్రి జీవన్ముక్తుడు (129) సతియైన స్త్రీ ప్రొద్దున్నే లేచి రాత్రి కట్టిన వస్త్రాన్ని విడిచి, భర్తకు నమస్కరించి, ఆనందంతో ఆతనిని స్తుతిస్తుంది.

మూ గృహకార్యం తతః కృత్వా స్నాత్వా ధౌతేచ వాససీ

గృహీత్వా శుక్లపుష్పంచ భక్తితః పూజయేత్పతిం

స్నాపయిత్వా సుపూతేన జలేన నిర్మలేనచ

తస్మై దత్వా ధౌతవస్త్రం తత్పాదౌక్షాలయేన్ముదా

ఆసనే వాసయిత్వాచ దత్వాభాలేచ చందనం

సర్వాంగలేపనం కృత్వా దత్వామాల్యం గలేఽపిచ

సామవేదోక్తమంత్రేణ భోగద్రవ్యైః సుధోపమైః

సంపూజ్య భక్తితః కాంతం స్తుత్వాచ ప్రణమేన్ముదా

ఓంనమః కాంతాయ శాంతాయ సర్వదేవాశ్రయాయ స్వాహా

ఇత్యనేనైవ మంత్రేణ దత్వా పుష్పంచ చందనం

పాద్యార్ఘ్యం ధూపదీపౌచ వస్త్రం నైవేద్యముత్తయం

జలం సువాసితం శుద్ధం తాంబూలంచ సువాసితం

దత్వా స్తోత్రం పఠేద్యద్యత్కృతంవై పాఠ్యమేవచ

ఓంనమః కాంతాయ భర్త్రేచ శిరశ్చంద్ర స్వరూపిణే

నమః శాంతాయ దాంతాయ సర్వదేవాశ్రయాయచ

నమో బ్రహ్మస్వరూపాయ సతీప్రాణపరాయచ

నమస్యాయచ పూజ్యాయ హృదాధారాయ తే నమః

పంచప్రాణాధిదేవాయ చక్షుషస్తారకాయచ జ్ఞానాధారాయ పత్నీనాం పరమానందరూపిణే

 పతిర్భ్రహ్మాపతిర్విష్ణుః పతిదేవమహేశ్వరః

పతిశ్చ నిర్గుణాధారో బ్రహ్మరూప నమో స్తుతే

క్షమస్వ భగవన్ దోషం జ్ఞాన జ్ఞానకృతంచ యత్

పత్నీబంధో దయాసింధో దాసీదోషం క్షమస్వ మే

ఇదం స్తోత్రం మహాపుణ్యం సృష్ట్యాదౌ పద్మయాకృతం

సరస్వత్యాచ ధరయా గంగయాచ పురావ్రజ

సావిత్ర్యాచ కృతుపూర్వం బ్రహ్మణేచాపి నిత్యశః

పార్వత్యాచ కృతం భక్త్యా కైలాసే శంకరాయచ

మునీనాంచ సురాణాంచ పత్నీభిశ్చ కృతంపురా

పతివ్రతానాం సర్వాసాం స్తోత్రమేతచ్ఛుభావహం

ఇదం స్తోత్రం మహాపుణ్యం యా శృణోతి పతివ్రతా

నరోఽన్యోవాఽపి నారీవాలభతే సర్వవాంఛితం

అపుత్రో లభతే పుత్రం నిర్ధనో లభతే ధనం

రోగీచ ముచ్యతే రోగాద్భద్ధో ముచేత బంధనాత్

పతివ్రతాచ స్తుత్వాచ తీర్థస్నానఫలంలభేత్

ఫలంచ సర్వతపసాం వ్రతానాంచ ప్రజేశ్వర

ఇదం స్తుత్వా నమస్కృత్య భుంక్తే వా తదనుజ్ఞయా

ఉక్తః పతివ్రతాధర్మో గృహిణం శ్రూయతాం ప్రజ

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారదసంవాదే భగవన్నంద సంవాదే త్ర్యశీతితమోఽధ్యాయః.

అను ఆ పై ఇంటిపని చేసి స్నానం చేసి ఉతికిన వస్త్రం ధరించి, తెల్లని పుష్పాన్ని తీసుకొని భక్తితో పతిని పూజించాలి (131) మంచి పవిత్రమైన నిర్మలమైన జలంతో స్నానం చేయించి ఆతనికి ఉతికిన వస్త్రాన్ని ఇచ్చి, ఆతని పాదములను ఆనందంతో కడగాలి. (132) ఆసనంలో కూర్చోబెట్టి, నొసట చందనం దిద్ది శరీరమంతా (సుగంధము) పూసి, కంఠమందు హారముంచి (133) సామవేదోక్త మంత్రంతో స్వచ్చమైన భోగద్రవ్యములతో భక్తితో పూజించి, భర్తను స్తుతించి, ఆనందంతో నమస్కరించాలి. (134) ఓం కాంతునకు, శాంతునకు నమస్సులు సర్వదేవతలకు ఆశ్రయమైన వానికి స్వాహా, ఈ మంత్రంతో పుష్పము చందనము ఇచ్చి (135) పాద్యము, అర్ఘ్యము, ధూపము, దీపము, వస్త్ర ము, నైవేద్యము ఉత్తమమైనది, జలము మంచి వాసనగలది శుద్ధమైనది ఇచ్చి, మంచివాసన గల తాంబూలమిచ్చి (136) చదువతగిన స్తోత్రములన్నీ చదవాలి నిర్ణయిచిన (వానిని). ఓంకాంతునకు, భర్తకు శిరస్సులో చంద్రుడుగల వాని (శివుని) స్వరూపడైన భర్తకు నమస్కారము (137) శాంతునకు దాంతునకు, దేవతలందరికి ఆశ్రయమైన వానికి నమస్సులు. బ్రహ్మ స్వరూపునకు, సతికి ప్రాణం వంటివాడైన వానికి నమస్సులు (138) నమస్కరించతగిన వానికి, పూజ్యునకు, హృదయమున కాధారమైన నీకు నమస్కారము. పంచప్రాణములకు అధిదేవుడవైన నీకు, కళ్ళకు కనుపాపలాంటి వాడవైన నీకు, జ్ఞానమునకు ఆధారమైన వానికి, భార్యకు, పరమ ఆనంద స్వరూపుడవైన నీకు నమస్కారము (139) పతిబ్రహ్మ పతివిష్ణువు. పతియే పరమేశ్వరుడు. పతి నిర్గుణమునకు ఆధారమైన బ్రహ్మరూపుడు. అట్టి నీకు నమస్కారము. (140) జ్ఞానంవల్లకాని అజ్ఞానంవల్లకాని చేసిన దోషాన్ని - క్షమించు, ఓ భగవన్! పత్నికి బంధువ! ఓ దయాసింధువ! దాసినైన నా దోషాన్ని క్షమించు (141) ఈ స్తోత్రము మహాపుణ్యప్రదమైనది. సృష్టికి మొదట్లో పద్మచేసింది. సరస్వతి, భూమి, గంగ, ఇదివరలో చేశారు, ఓ ప్రజ! (142) నిత్యము బ్రహ్మకొరకు సావిత్రి ఇదివరలో చేసింది. కైలాసంలో శంకరునికొరకు పార్వతి భక్తితో చేసింది (143) మునుల, సురల భార్యలు ఇదివరలో చేశారు. పతివ్రతలందరి స్తోత్రమిది. ఇది శుభకరమైనది (144) ఈ స్తోత్రము మహాపుణ్యమైనది. పతివ్రత వింటే, ఇతర పురుషులు, స్త్రీలు కాని వింటే అన్ని కోరికలను పొందుతారు (145) సంతానహీనుడు సంతానాన్ని పొందుతాడు. ధనహీనుడు, ధనాన్ని పొందుతాడు. రోగి రోగం నుండి ముక్తుడౌతాడు. బద్దుడు బంధం నుండి ముక్తుడౌతాడు (146) పతివ్రత స్తుతిస్తే తీర్థస్నానఫలాన్ని పొందుతుంది. ఓవ్రజేశ్వర! ఇది అన్ని తపస్సులకు, వ్రతములకు ఫలము (147) ఇట్లా స్తుతించి, నమస్కరించి ఆమె ఆతని అనుజ్ఞతో భుజిస్తుంది. ఓ ప్రజ! పతివ్రతా ధర్మాన్ని చెప్పాను. గృహిణులకు చెందినది (148) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు భగవంతుడు, నందుడు వీరి సంవాదమందు ఎనుబది మూడవ అధ్యాయము.