మూII శ్రీనారాయణ ఉవాచ :
ఆథకోప పరీతశ్చ బలదేవో మహాబలః ।
హలేన రుక్మియానంచ బభంజ మునిపుంగవ ॥
ఘోటకాన్ సారథించైవ నిహత్య జగతీపతిః ।
భూమిష్ఠంచాపి పాపిష్ఠం రుక్మిం పంతుం జగామసః ॥
రుక్మీచ శరజాలేన వారయామాస లీలయా ।
నాగాస్త్రం యోజయామాస బద్ధుం హలినమీశ్వరం ॥
నాగాస్త్రం గారుడేనైవ సంజహార హలిస్వయం ।
జగ్రాహ కోపాద్రుక్మీచ పరం పాశుపతంమునే ।
అవ్యర్థం వైరిమఠంచ శతసూర్యసమప్రభం ।
అభితో, హలినారుక్మిజృంభణాఫ్రేణ జృంభితః ॥
భూమిష్ఠః స్థాణువద్రుక్మీనిద్రాస్ట్రేడైవ నిద్రితః ।
శాల్వస్తం నిద్రితం దృష్ట్వాశతబాణాన్ ముమోచతం ॥
శైలవృష్టిం శిలావృష్టిం జలవృష్టిం చకారసః ।
జ్వలదంగార వృష్టించ శరవృష్టిం చకారహ I
బలాచ్చా]ణ సర్వాణి వారయామాస లాంగలీ ।
హలేన తద్రథం చూర్ణం చకార రణమధ్యతః ॥
ఘాటకాన్సారథించైవ జఘాన చైవలీలయా ।
కోపాద్బలేన తం హంతుం వాగ్బభూవాశరీరిణీ ।
త్యజశాల్వం కృష్ణవధ్యంతవకిం పౌరుషం రణే ।
యస్యమూర్ధ్నిచ బ్రహ్మాండం శూర్చేచ సర్షపం యథా॥
తచ్ఛుత్వాబలదేవశ్చ హలేన, తస్య మస్తకం ।
చకారచూర్ణం వ్యథితః పపా తరణమూర్ధని ॥
శాల్వస్యపతనందృష్ట్వాశిశుపాలో మహాబలీ ।
చకార శరవృష్టించ జలవృష్టింతథాభువి ॥
హలీతస్యరథం చూర్ణం చకార లాంగలేనచ ।
అర్ధచంద్రోణతద్బాణాన్ వారయామాస లీలయా!!
తం హంతుం శంకరః సాక్షాన్ని షేధం చ చకారతం ।
కృష్ణవధ్యం త్యజ బల పారదప్రవరం హరేః ॥
దంతవక్రస్య దంతంచ బభంజ సహలేనచ ।
సుప్రవృత్తస్య యుద్దేన తే సర్వేజహసుశ్చ తం ॥
బలస్య విక్రమందృష్ట్వా సర్వేవీరాః పలాయితాః ।
చక్రుః ప్రవేశనం సర్వే కుండినం వరయాత్రికాః ॥
ఏతస్మిన్నంతరే తత్ర శతానందోమహామునిః ।
కోటిభిః మునిభిసార్థం ఆజగామ హరేః పురః ॥
నారాయణుడిట్లా-
మహాబలుడైనబలరాముడు కోపంతో నిండిపోయినవాడై నాగలితో రుక్మిణి వెళ్ళుతున్న వాహనాన్ని పగులగొట్టాడు, ఓ ముని శ్రేష్ఠ (1) గుఱ్ఱములు, సారథిని చంపాడు ఆ జగతీపతి . భూమి పైనున్న ఆ పాపిని రుక్మిని చంపటానికి వెళ్ళాడు ఆతడు (2) రుక్మి తన బాణములతో అవలీలగా వాటినితొలగించసాగాడు. ఈశ్వరుడైన హలిని బంధించటానికి నాగాస్త్రమును కూర్చాడు. (3) బలరాముడు స్వయంగా గరుడాస్త్రముతో నాగాన్ని సంహరించాడు ఓ ముని! కోపంతో రుక్మి పరమైన పాశుపతాన్ని గ్రహించాడు. (4) అది వ్యర్థము కానిది. శత్రువులను మర్దించేది, నూరు సూర్యుల కాంతితో సమానమైనది.(5) బలరాముడు రుక్మికి చుట్టు జృంభాస్త్రముతో విజృంభించాడు. భూమి పై ఉండి రుక్మిరాయివలె నిద్రా స్త్రముతో నిద్రపోయాడు. శాల్వుడు నిద్రపోయిన వానిని చూచి నూరు బాణములను బలరాముని పై విడిచాడు. (6) పర్వతవృష్టిని, జలవృష్టిని, రాళ్ళవానను కురిపించాడాతడు. మండుతున్న అగ్ని వర్షాన్ని బాణవృష్టిని చేశాడతడు. (7) బలముతో అస్త్ర ములతో వాటన్నిటిని బలరాముడు తొలగించాడు. రణ మధ్యం నుండి నాగలితో వానిరథాన్ని చూర్ణం చేశాడు. (8) గుఱ్ఱములు,సారథిని అవలీలగాచంపాడు. కోపంతో బలరాముడు వాడిని చపంబోగా అశరీరవాణి విన్పించింది. (9) శాల్వుని వదులు కృష్ణుడు చంపుతాడు. యుద్ధంలో పౌరుషంతో నీకేంపని! నీ తల పై బ్రహ్మాండముంది చాటలో ఆవగింజలా. అట్టి నీకీ కోపమెందుకు. (10) అది విని బలదేవుడు నాగలితో వాని తలను పొడిచేశాడు, బాధపడుతూ వాడు, యుద్ధభూమిలో పడిపోయాడు. (11) శాల్వుడు (మూర్ఛ) చనిపోవటం చూచి మహాబలవంతుడైన శిశుపాలుడు భూమి పై బాణవృష్టిని, జలవృష్టినిచేశాడు. (12) నాగలితో బలరాముడు వాని రథాన్ని పొడిపొడిగా చేశాడు. అర్ధచంద్రముతో ఆ బాణములను అవలీలగా తొలగించాడు. (13) వాడిని చంపడానికి, శంకరుడు బలరాముని సాక్షాత్తుగా నిషేధించాడు. వాడు కృష్ణునితో చస్తాడు. వాడు హరికి ద్వార పాలకుడు. (ప్రక్కనుండేవాడు). బలరాముడ వాణ్ణి విడువు. (14) ఆతడు నాగలితో దంతవక్రుని దంతమును విరగగొట్టాడు. బాగా జరిగిన యుద్ధంతో వారందరు వాణ్ణి చూచి నవ్వారు. (15) బలరాముని ప్రతాపాన్ని చూసి వీరులంతా పరుగెత్తిపోయారు. ఈశ్రేష్ఠ యాత్రికులంతా కుండిన నగరాన్ని ప్రవేశించారు. (16) ఇంతలో శతానందుడనుమహాముని కోటిమంది మునులతో కూడి, హరి ముందుకు వచ్చాడు. (17)
మూII పురం ప్రవేశయామాస శతద్వారంచదుర్గమం ।
అగమ్యం చాపి శత్రూణాం మిత్రాణాంచ సుఖప్రదం ॥
దేవకన్యా నాగకన్యా రాజకన్యా స్తథైవచ ।
మునికన్యా వరంద్రష్టుం సస్మితాశ్చ సమాయయుః ॥
దదృశుః యోషితః సర్వానిమేష రహితేనచ ।
ప్రసన్నం కారయా మాస సస్మితశ్చంద్ర శేఖరః ॥
రతేంద్ర సారనిర్మాణ రథస్థం పరమేశ్వరం ।
సర్వేషాం పరమాత్మానం భక్తానుగ్రహ విగ్రహం ॥
నవీన జలదశ్యామం శోభితం పీతవాససా ।
చందనోక్షితసర్వాంగం వనమాలా విభూషితం ॥
రత్నకేయూరవలయ రత్నమాలాకులో జ్జ్వలం ।
రత్నకుండల యుగ్మేన గండస్థల విరాజితం ।
రతేంద్ర సార నిర్మాణ క్వణ న్మంజీరరంజితం ।
సస్మితం మురలీహస్తం పశ్యంతం రత్న దర్పణం ॥
సప్తభిః పారదైర్గో పైః సేవితం శ్వేత చామరైః ।
నవయౌవనసంపన్నం శరత్కమలలోచనం II
శరత్పూర్లెందుతుల్యాస్యం భక్తానుగ్రహకారకం ।
కోటి కందర్ప సౌందర్యం సత్యం నిత్యం సనాతనం ॥
తీర్థపూతం కీర్తిపూతం బ్రహ్మేశ, శేషవందితం !
పరమాహ్లాదకరం రూపం కోటిచంద్ర సమప్రభం ॥
ధ్యానాసాధ్యం దురారాధ్యం పరమం ప్రకృతేః పరం ।
దూర్వయా పట్ట సూత్రంచ రత్నేంద్రసారదర్పణం ॥
దధానంకర్తృకా సాధ్యం కదల్యాఃస్ఫుటమంజరీం ।
చూడాంత్రివిక్రమాకారాం మాలతీమాల్య భూషితాం ॥
పుష్పంనారీ ప్రదత్తంచ ముకుటం మస్తకోజ్జ్వలం ।
దృష్ట్వా వరం యువతశ్చ మూర్ఛాం సంప్రాపురీశ్వరం II
రుక్మిణీ జీవనం ధన్యం శ్లాఘ్యమిత్యూచురీప్సితం ।
జామాతరం సాదదర్శ రాజ్జీబీష్మక కామినీ ॥
నిమేష రహితా తుష్టా ప్రసన్న వదనే క్షణా ।
రాజా ప్రసన్నవదనః సామాత్యః సపురోహితః ॥
సమాగత్యసురాన్విప్రాన్ భూతాంశ్చ ప్రణనామ సః ।
దదౌయోగ్యాశ్రమంతేభ్యో భక్ష్యం పూర్ణం సుధోపమం ॥ దివానీశంచాప్యువాచదీయతాందీయతామితి ।
సుఖం నినాయరజనీం దేవైశ్చ బాంధవైః సహ ॥
దుర్గమమైన,నూరుద్వారములుగల నగరంలోనికి ప్రవేశ పెట్టాడు. శత్రువులకు ప్రవేశించరానిది. మిత్రులకు సుఖప్రవేశము కలది. (18) దేవకన్యలు, నాగకన్యలు, రాజకన్యలు, మునికన్యలు, వరుణ్ణి చూడటానికి నవ్వుతూ వచ్చారు. (19) ఆడవాళ్ళంతా రెప్పవేయకుండా అతనిని చూచారు. నవ్వుతూ చంద్రశేఖరుడు హరిని ప్రసన్నునిగా చేశాడు. (20) పరమేశ్వరుడు హరి, శ్రేష్ఠరత్నముల సారముతో నిర్మితమైన రథమందున్నాడు. అందరికి పరమాత్మ భక్తులననుగ్రహించే కొరకు విగ్రహం ధరించాడు. (21) నవీనమైన మేముమువలే శ్యామలవర్ణుడు, పచ్చని వస్త్రముతో శోభిస్తున్నాడు. ఒంటినిండా చందనం, పూసుకున్నాడు, వనమాలతో అలంకరింపబడ్డాడు. (22) రత్నములతో చేసిన భుజాభరణములు, కడియములు, రత్నముల మాలలు వీనితో నిండి ప్రకాశిస్తున్నాడు. రెండు రత్నకుండలములు చెవులకున్నాయి, వాటితో చెక్కిళ్ళు ప్రకాశిస్తున్నాయి. (23) శ్రేష్ఠరత్నములందు శ్రేష్ఠమైన వానితో నిర్మింపబడిన శబ్దిస్తున్న కాలి అందెలతో అలంకరింపబడినాడు, చిరునవ్వు నవ్వుతున్నాడు, చేతిలో మురళీ ఉంది. రత్నముల అద్దాన్ని చూస్తున్నాడు. (24) ఏడుగురు గోపకులు ప్రక్కన ఉన్నారు, శ్వేతచామరములతో విసురుతున్నారు. నవయౌవనంలో ఉన్నాడు. శరత్కాలమందలి కమలములతో సమానమైన కళ్ళు (25) శరత్కాలమందలి పూర్ణచంద్రునితో సమానమైన ముఖము కలిగి ఉన్నాడు. భక్తులను అనుగ్రహించుటకు కారణభూతుడు. కోటి మన్మథులంత సౌందర్యవంతుడు, సత్యస్వరూపుడు, నిత్యుడు, సనాతనుడు, (26) తీర్థమువలె పవిత్రుడు, కీర్తితో పవిత్రుడు, బ్రహ్మ, ఈశ, శేషులు నమస్కరిస్తారాతనిని, బాగా ఆనందం కలిగించే రూపము, కోటి చంద్రులంత కాంతి కలవాడు. (27) ధ్యానమునకు సాధ్యుడు కాడు, ఆరాధించుటకు కష్టమైనవాడు, పరముడు ప్రకృతికి పరుడు దూర్వ(గడ్డి)తో చేసిన పట్టసూత్రము. శ్రేష్ఠ రత్నములతో చేసిన దర్పణము. (28) కర్తృకకు (కత్తెర) సాధ్యమైన అరటి చెట్టు యొక్క విరిసిన పూగుత్తిని ధరించినవాడు, మాలతీ మాలతో అలంకరింపబడిన త్రివిక్రమాకారముగల చూడను ధరించినవాడు (తల పై) (29) స్త్రీలు ఇచ్చినపుష్పమును, తల పై ప్రకాశిస్తున్న కిరీటాన్ని ధరించాడు. అట్టి ఈశ్వరుడైన హరిని చూచి యువతులు మూర్ఛపోయారు. (30) రుక్మిణి జీవనము ధన్యమైనది. కొనియాడతగినది, కోరతగినది, అని అన్నారు ఆ స్త్రీలు. భీష్ముని స్త్రీ ఆమె రాజి అల్లుని చూచింది. (31) రెప్పవేయకుండా చూచింది. ఆనందపడింది. ఆమె ముఖము, చూపులు ప్రసన్నమైనాయి. రాజు కూడా ప్రసన్నవదనుడైనాడు. మంత్రులు, పురోహితులు వీరితో కలసి రాజున్నాడు. (32) ఆతడు వచ్చి దేవతలను, బ్రాహ్మణులను, ఇతర ప్రాణులను నమస్కరించాడు. వారికి యోగ్యమైన ఆశ్రమమును, పూర్తిగా అమృతతుల్యమైన ఆహారపదార్థాములను ఇచ్చాడు. (33) రాత్రింబగళ్ళు పెట్టండి, ఇవ్వండి, అని చెబుతూ వచ్చాడు. దేవతలతో బాంధవులతో కలిసి రాత్రిని సుఖంగా గడిపాడు. (34)
మూ॥ వసుదేవః ప్రభాతేచ ప్రాతః కృత్యం చకారసః ।
స్నాత్వా సంధ్యాదికం కృత్వా ధృత్వాధోతేచవాససీ ॥
చకారవేదమంత్రేణ శుభాధివాసనం హరేః ।
సంపూజ్య మాతృకాః సర్వాః సాక్షాచ్చ సర్వదేవతాః ॥
ప్రదాయ వసుధారించ వృద్ధి శ్రాద్ధాదికం తథా ।
బ్రాహ్మణాన్ భోజయామాస దేవాంశ్చ బాంధవాంస్తథా ॥
వాద్యంచ వాదయామాస కారయామాస మంగళం ।
సువేషం కారయామాస వరస్యాప్రతిమస్యచ ॥
సంచ కారయామాస నరయానం సుశోభనం ।
ఏవం రాజా భీష్మకశ్చ వివాహారంచ మంగలం ॥
పురోహితైః వేదమంత్రిః సర్వకర్మచకారసః ।
మణిరత్నం ధనంవాపి ముక్తామాణిక్య హీరకం ॥
భక్ష్యద్రవ్యంచ వస్త్రంచా ప్యుపహారమనుత్తమం ।
భట్టే భ్యో బ్రాహ్మణేభ్యోపి భిక్షుకేభ్యోదదౌముదా ॥
వాద్యంచ వాదయామాస కారయామాస మంగలం ।
సువేషం కారయామాస రుక్మిణ్యశ్చ మనోహరం ॥
రాజ్జీభిః మునిపత్నీభిః విధానంచ యథోచితం ।
తతః శుభే క్షణీప్రాప్తి మహేంద్రే పరమోదయే ॥
వివాహాచితలగ్నేచ లగ్నాధిపతి సంయుతే ।
సద్ధ హే క్షణ శుద్ధీచాప్యసతాందృష్టి వర్జితే ॥
శుభక్షణే శుభరోక్షేచ విశద్దే చంద్రతారయోః ।
వేధదోషాదిరహితే శలాకాది వివర్జితే ॥
దంపత్యోః శర్మయోగేచ పరిణామ సుఖప్రదే ।
ఏవం భూతేచసమయే భీష్మక ప్రాంగణం హరిఃII
ఆజగామసురైః సార్థం మునివిప్రపురోహితైః ।
జ్ఞాతిభిః బాంధవైః సార్థం పిత్రామాత్రానృపై స్తథా ।
గోపాలకైః పారదైశ్చ వయస్యైశ్చ మనోహరైః ।
భటైశ్చరణకైశ్చైవ జ్యోతిః శాస్త్ర విశారదైః ॥
వాద్యైఃనానావిధైశ్చైవ నర్తకైః గాయనైస్తథా ।
నానాశిల్పకరె శ్చైవ మాలాకారై స్తథాపరైః ॥
విద్యాధర్యప్సరోభిశ్చ కిన్నరీభిశ్చసత్వరం ।
స్థలంచ దదృశుర్దేవా మునయశ్చ నృపేశ్వరాః ॥
సర్వే సమాగతాయేచ వివాహ దర్శనోత్సుకాః ।
రంభాస్తంభ సహసైశ్చ పట్టసూత్ర పరిష్కృతైః॥
చంపకానాంచందనానాం రసాలానాంచ పల్లవైః ।
మాల్యైః నానావిధైశ్చైవ పీతరక్తసితాన్వితైః ॥
పరితోమంగల ఘట్రైః ఫలపల్లవ సంయుతైః !
కస్తూరీచందనాకైశ్చ కుంకుమేన విరాజితైః ।
పకైః లాజైః ఫలైః పుష్పైః దూర్వాభిరుపశోభితైః ।
మునిభిః బ్రాహ్మణ్చేవరాజేందైరపి వేష్టితం ॥
అను ॥ వసుదేవుడు ప్రభాతమందే ప్రొద్దునచేయవలసినదానిని నిర్వర్తించాడు. స్నానము, సంధ్యాదులు చేసి, ఉతికిన వస్త్రాలు కట్టుకుని (35) వేదమంత్రములతో హరికి శుభమైన అధివాసము చేశాడు. (తేవటం) మాతృకలందరిని పూజించి, సాక్షాత్తుగా దేవతలందరిని పూజించి, (36) వసుధారను ఇచ్చి (అగ్నికి) వృద్ధి శ్రాద్ధాదులు చేసి, బ్రాహ్మణులకు, దేవతలకు, బంధువులకు భోజనం పెట్టాడు (37) వాద్యములను వాయింపచేశాడు. మంగళము చేయించాడు. అప్రతిముడైన వరునకు మంచివేషము వేయించాడు. (38) మంచిశోభ గల నరులు లాగే బండిని సిద్ధం చేయించాడు. ఈ విధంగా రాజు భీష్మకుడు వివాహమునకు తగిన మంగళకార్యము నిర్వర్తింపచేశాడు. (39) పురోహితులతో, వేదమంత్రములతో అంతా కార్యాన్ని ఆతడు చేశాడు. మణులలో శ్రేష్ఠమైన వానిని, ధనమును, ముత్యములు మాణిక్యములు వజ్రములను (40) తినే పదార్థాలను, వస్త్రములు, చాలా ఉత్తమమైన కానుకలను భట్టులకు బ్రాహ్మణులకు భిక్షుకులకు ఆనందంగా ఇచ్చాడు. (41) వాద్యమును వాయింపచేశాడు. మంగళమును చేయించాడు. రుక్మిణికి మనోహరమైన మంచివేషమును వేయించాడు. (42) రాణులతో మునిపత్నులతో తగిన విధంగా విధానమంతా చేయించాడు. ఆ పిదప శుభక్షణమురాగా, మా హేంద్రమందు (దినము యొక్క పదమూడవ భాగము) మంచి ఆరంభమందు (43) వివాహమునకు తగిన లగ్నమందు, లగ్నాధిపతిలగ్నంలో ఉండగా, మంచి గ్రహముల చూపులతో శుద్దమై ఉండగా, దుష్టగ్రహముల దృష్టి పడని కాలమందు, (44) శుభక్షణమందు శుభ నక్షత్రమందు, చంద్రబలము, తారాబలము శుద్ధంగా ఉండగా, వేధ దోషములు వగైరా లేని క్షణాన, శలాకాదులు (బొక్క, దోషము) లేని (45) దంపతులకు సంతోష యోగ్యమైన, పరిణామంలో సుఖప్రదమైన, ఇలాంటి సమయమందు భీష్మకుని ప్రాగణమందుహరి (46) ప్రవేశించాడు, సురలతో , మునులు విప్రులు పురోహితులతో సహా వచ్చాడు. జ్ఞాతులతో, బంధువులతో, తల్లి దండ్రులతో రాజులతో కూడి వచ్చాడు. (47) గోపాలకులతో పక్కనుండే పరివారముతో మనోహరులైన వయస్యులతో కూడి వచ్చాడు. భట్టులు, గణకులు, జ్యోతిః శాస్త్ర విశారదులు కూడావెంట ఉన్నారు. (48) రకరకాల వాద్యాలు, నర్తకులు, గాయకులు, రకరకాల శిల్పకారులు, మాలాకారులు ఇతరులు వెంట ఉన్నారు. (49) విద్యాధరులు, అప్సరులు, కిన్నరులు వీరితో కలిసి త్వరగా వచ్చాడు.దేవతలు, మునులు,రాజశ్రేషులు స్థలాన్నిచూచారు. (50) వివాహాన్ని చూడాలనుకున్న వాళ్ళంతా వచ్చారు. పట్టుదారముతో అలంకరింపబడ్డ వేలకొలది అరటి స్తంభములు, (51) చంపక, చందన, రసాలముల చిగురాకులు, రకరకాల మాలలు, పచ్చవి, ఎరనివి,తెల్లనివి మాలలు ఉన్నాయి. (52) పండ్లు, చిగురాకులు గల మంగళ ఘటములు చుట్టూ ఉన్నాయి. వాటిలో కస్తూరి చందనము పూసారు. కుంకుమ పూశారు. వాటితో వెలిగిపోతున్నాయి. (53) ఆకులు, పేలాలు, పండ్లు, పూలు, గజిక వీనితో శోభిస్తున్నాయి. మునులు బ్రాహ్మణులు, రాజేంద్రులు చుట్టూ ఉన్నారు. (54)
మూ॥ రత్నేంద్ర సారనిర్మాణ వేదీయుక్తం మనోహరం ।
చర్చితం చందన స్నిగ్దైః కస్తూరీ కుంకుమాన్వితైః ।
సుగంధి శీతమందైశ్చ పవనైః సురభీకృతం ।
రత్నానాంచ సహసైశ్చ జ్వలితం జ్వలదీపకైః II
నానా ప్రకార ధూ పైశ్చగంధ ద్రవ్యైః సువాసితం ।
చితైః విచితైః వివిధైః శిల్పనాం పుణ్యకారిణాం ॥
పరితః పరితశ్చైవ శోభనార్దైః సుశోభనైః ।
గంధర్వాణాంచ సంగీతైః మధురైః మధురీకృతం ॥
విద్యాధరీణాంనృత్యైశ్చ నర్తకీనాంచ శిల్పినాం ।
తత్రనిశ్చేష్టచితైశ్చ జనరాజివిరాజితం ॥
గుప్తద్వారై గవాకైశ్చయువతీభిశ్చవీక్షితం ।
మంగలేన ఘటేనైవ విదుషాచ పురోధసా ॥
కుశహస్తేన భూ పేన దానేన దానవస్తునా ।
దృష్ట్వాత ప్రాంగణేరాజోదేవా బ్రహ్మాదయస్తథా ।
అవరుహ్యరథాత్తూర్ణంతిష్ఠంతి ప్రాంగణేముదా ।
రాజేంద్రా దానవేంద్రాశ్చమునయః సనకాదయః ॥
శ్రీకృష్ణశ్చాపి భగవాన్ పార్షదవ్రపరైః సహ !
తాన్ దృష్ట్వా సహసోతా యజవేన భీష్మకస్తథా ।
మూర్ఖావవందే దేవాంశ్చ మునీంద్రాంశ్చ నృపాంస్తథా ।
రత్నసింహాసనే చైవ సురమ్యేషు పృథక్ పృథక్ ॥
క్రమతో వాసయా మాస సంపూజ్య సాదరేణచ ।
రాజాతుష్టావ భక్త్యా చతాన్ సర్వాన్భక్తి పూర్వకం
వసుదేవం వాసుదేవం సాశ్రునేత్రః పుటాంజలిః ॥
భీష్మక ఉవాచ :
అద్యమే సఫలం జన్మజీవితంచ సుజీవితం ॥
బభూవజన్మకోటీనాం కర్మమూలనికృంతనం ।
స్వయంవిధాతా జగతాం ప్రదాతా సర్వసంపదాం ॥
స్వప్నేయత్పాదపద్మంచ ద్రష్టుంనైవ క్షమాః ప్రభో ।
తపసాం ఫలదాతాచ సస్రషాప్రాంగణేమమ ॥
స్వాత్మారామేషు పూర్ణేషుశుభప్రశ్నమభీష్పితం।
యోగీందైరపి సిద్ధేంద్రి సురేంధైశ్చ మునీంద్రకై॥
ధ్యానాదృష్టశ్చయోదేవః సశివః ప్రాంగణేమమ ।
కాలస్యకాలో భగవాన్ మృత్యోః మృత్యుశ్చ యః ప్రభుః ।
మృత్యుంజయశ్చసర్వేశో నరాణాం దృష్టిగోచరః ।
యస్యమూర్ధ్నాం సహస్రషు మూర్ని విశ్వంచరా చరం ॥
శ్రేష్ఠరత్నములలో ఉత్తమమైన వానితో నిర్మించిన వేదికగలది, మనోహరమైనది స్నిగ్ధచందనముతో పూయబడినది. కస్తూరి కుంకుమలతో కూడినది ఆ చందనము. (55) వాసనగల చల్లని, మెల్లని గాలులతో వాసనకలవి చేయబడినవి వేల కొలది రత్నములతో ప్రకాశిస్తున్న దీపములతో వెలిగి పోతున్నది. (56) రకరకాల ధూపాలతో సుగంధ ద్రవ్యముల వాసనతో వాసనగలదిగా చేయబడినది. మనోజ్ఞముగా చేసే శిల్పకారుల విచిత్రమైన రకరకాలైన చిత్రములు కలది. (57) అంతట చుట్టుముట్టి అలంకరణకు తగిన వానితో చాలా శోభనమైనది మధురమైన గంధర్వుల సంగీతముతో మధురముగా చేయబడినది (58) విద్యాధరుల నృత్యముతో, నర్తకుల నర్తనములతో శిల్పుల శిల్పములతో శోభిస్తున్నది వేదిక. కదలికలేని బొమ్మలతో, జనసమూహముతో వెలిగిపోతున్నది. (59) రహస్య ద్వారముల నుండి కిటికీల నుండి యువతులు చూస్తున్నారు మంగళరకరమైన ఘటముతో విద్వాంసుడైన పురోహితుడు (60) న్నాడు. రాజు, చేత కుశలు ధరించి, దానవస్తువులతో దానమివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి రాజును ప్రాంగణంలో చూచి రాజులు, దేవతలు, బ్రహ్మాదులు (61) రథము నుండి దిగి, త్వరగా ఆనందంతో ప్రాంగణంలో నిల్చున్నారు రాజేంద్రులు, దానవేంద్రులు, సనకాదిమునులు, (62) భగవాన్ శ్రీకృష్ణుడు, తన పక్కనుండే శ్రేష్ఠ పరివారముతో కూడా లేచాడు. వారిని చూచి త్వరగా లేచి వేగంతో భీష్మకుడు (63)తలవంచి దేవతలకు,మునులకు, రాజులకు నమస్కరించాడు. చాలా అందమైన రత్న సింహాసనములందు వారిని విడివిడిగా కూర్చోబెట్టాడు. (64) ఆదరంగా పూజించి క్రమంగా కూర్చోబెట్టాడు. భక్తిపూర్వకముగా రాజు వారినందరిని సేవిస్తూ (భక్తితో) సంతోషపరిచాడు. కళ్ళలో ఆనందబాష్పాలు రాగా, చేతులు జోడించి, వసుదేవుని వాసుదేవుని కూర్చోబెట్టాడు. సంతోషపరిచాడు. (65) భీష్మకుని వచనమిట్లా - ఇప్పుడు ఈవేళ నా జన్మ సఫలమైంది. నా జీవనము మంచి జీవనమైంది. (66) నేను కోటి జన్మలలో చేసిన కర్మలు మూలముతో సహఛేదించబడ్డాయి. స్వయంగా విధాత, జగత్తు కంతా అన్ని సంపదలనిచ్చేవాడు. (67) కలలో కూడా ఎవని పాదపద్మములను చూడటం సాధ్యంకాదో ఆ ప్రభువు, ఓ ప్రభువ! తపస్సులకు ఫలమునిచ్చేవాడు, అలాంటి స్రష్ట (బ్రహ్మ) ఇప్పుడు నా ప్రాంగణములో ఉన్నాడు. (68) పూర్ణులైన స్వాత్మారాములలో, మంగళకరుడు, అడుగ తగినవాడు, కోరతగినవాడు, యోగీంద్రులు, సిద్దేంద్రులు, మునీంద్రులు, సురేంద్రులు వీరంతా (69) ధ్యానం చేసినా కన్పించనివాడు అట్టి దేవుడు మంగళకరుడు (శివుడు) నా ప్రాంగణంలో ఉన్నాడు. ఆ ప్రభువు, కాలానికి కాలము, మృత్యువుకే మృత్యువు, ఆ భగవంతుడు (70) మృత్యుంజయుడు, సర్వేశుడు, నరులకు దృష్టిగోచరుడైనాడు. ఎవని వేయి తలల పై (శ్రేష్టుడు) చరాచరమైన విశ్వముంటుందో, ప్రధానంగా ఉంటుందో.(71)
మూ॥ నాస్త్యంతః సర్వవేదేషు సోయంచ మమప్రాంగణే ।
సర్వకామ ప్రణేయోపి సర్వాగ్రే యస్య పూజనం
శ్రేష్ఠో దేవగణానాంచ సగణేశోమమాంగణే ॥
మునీనాంవైష్ణవానాంచ ప్రవరోజ్ఞానినాం గురుః ।
సనత్కుమారో భగవాన్ ప్రత్యక్షః ప్రాంగణేమమ ॥
బ్రహ్మపుత్రాశ్చ పౌత్రాశ్చ ప్రపౌత్రాశ్చాపి వంశజాః ।
తేసర్వే మధ్య హే దైవ జ్వలంతో బ్రహ్మతేజసా ॥
అహోకల్పాంత పర్యంతం తీర్థభూతోమమాశ్రమః ।
యేషాం పదోదకైస్తీర్థం విశుద్ధం తద్గృహం మమ ॥
పృథివ్యాం యానితీర్థాని తానితీర్థాని సాగరే ।
సాగరే యానితీర్థాని విప్రపాదేషు తానిచ ॥
విప్రపాదోదకక్లిన్నా యావత్తిష్ఠతి మేదినీ ।
తావత్ పుష్కర పత్రేషు పిబంతి పితరోజలం ॥ ।
విప్రపాదోదకం భుక్త్వా దత్త్వావిప్రాయ దక్షిణాం ।
స్నాతానాం సర్వతీర్థానాం ఫలమాప్నోతి నిశ్చితం ॥
నికృంతనంచ విపదాం వ్యాధి నిర్మూల కారణం !
సుఖదంశుభదం సారం విప్రపాదోదకం నృణాం ॥
నగంగా సదృశం తీర్థం నదేవోమాధవాత్పరః ।
సనత్కుమారాత్ భక్తీన నహికల్పతరోస్తరుః II
నపుష్పం పారిజాతాచ్చనవ్రతం హరివాసరం ।
పూజనే న హిపూజ్యంచ న పత్రం తులసీపరం II
నదేవీ ప్రకృతేశ్చాపి నాధార పవనాత్పరః ॥
నహి స్తూలో మహావిష్ణోః నసూక్ష్మం పరమాణుతః ॥
నబ్రహ్మణాత్పరః పూతో నాశ్రమశ్చపరః ప్రభుః ।
నదేవో నపరః కోఆపి ఇత్యాహ కమలోద్భవః ॥
బ్రహ్మవిష్ణుశివాదీనాం ప్రకృతేశ్చపరః ప్రభుః ।
ధ్యానాసాధ్యో దురారాధ్యో యోగినామపినిశ్చితం II
నిర్గుణశ్చనిరాకారో భక్తానుగ్రహ విగ్రహః ।
స ఏవచక్షుషోనృణాం సాక్షాద్దేవశ్చ మధ్య హే ॥
అన్ని వేదములలో అంతములేనివాడు, ఆతడు నా ప్రాంగణంలో ఉన్నాడు. అన్ని కోరికలకు వశ్యము కావలసినవాడు, అందరికన్న మొదట ఎవనిని పూజిస్తామో, దేవగణములకు శ్రేష్ఠుడు అట్టిగణేశుడు నా ప్రాంగణమందున్నాడు. (72) మునులకు, వైష్ణవులకు శ్రేష్ఠుడు. జ్ఞానులకు గురువు ఐన భగవాన్ సనత్కుమారుడు నా ప్రాంగణంలో ప్రత్యక్షముగా ఉన్నాడు. (73) బ్రహ్మపుత్రులు, పౌత్రులు, ప్రపౌత్రులు, ఆవంశములో పుట్టినవారు వారంతా నా ఇంట్లో బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతూ ఇప్పుడే ఉన్నారు. (74) ఓహో! నా ఆశ్రమము కల్పము చివరిదాకా తీర్థప్రదేశమైంది. ఎవరి పాదోదకమువల్ల విశుద్ధమైన తీర్థమౌతుందో వారంతా ఇప్పుడు నా ఇంట్లో. అట్టి గృహమునాది (75) భూమి పై ఎన్ని తీర్థములున్నాయో అన్ని తీర్థములు సముద్రమందున్నాయి. సముద్రంలో ఎన్ని తీర్ధములున్నాయో బ్రాహ్మణపాదములందు అని తీర్థములున్నాయి. (76) విప్రపాదోదకముతో తడుస్తూ ఈభూమి ఎంత కాలముంటుందో అంతవరకు పితరులు పుష్కరపత్రములందు (తామర) నీటిని తాగుతారు. (77) విప్రుని పాదోదకమును తాగి, విప్రునకు దక్షిణనిచ్చిన, సర్వతీర్థముల స్నానం చేసిన వారికి కల్గేంత ఫలాన్ని పొందుతారు నిశ్చయము. (78) విపత్తును తొలగించేది వ్యాధులను నిర్మూలించేది, సుఖమునిచ్చేది, శుభమునిచ్చేది, సారమైనది, నరులకు విప్రపాదోదకము (79) గంగతో సమానమైన తీర్థములేదు, మాధవుని మించిన దేవుడు లేడు. సనత్కుమారుని మించిన భక్తుడు లేడు. కల్పతరువును మించిన వృక్షములేదు. (80) పారిజాతమును మించిన పుష్పము, హరివాసరమును మించిన వ్రతము (ఏకాదశి) లేదు. అర్చనమును మించిన పూజ్యతలేదు (గొప్పది). తులసి కన్న గొప్ప ఆకులేదు. (81) ప్రకృతిని మించిన దేవత, గాలిని మించిన ఆధారములేదు. విష్ణువును మించిన స్టూలపదార్థము, పరమాణువు కన్న సూక్ష్మ పదార్థములేదు. (82) బ్రాహ్మణున కన్న పవిత్రమైనది లేదు, ఆశ్రమమందున్న ప్రభువు కన్న పరుడు లేడు. మరో దేవుడు పరుడు మరొకడు లేడు, అని ఈ విధముగా కమలోద్భవుడు చెప్పాడు. (83) బ్రహ్మ విష్ణు శివాదుల కన్న ప్రకృతికన్న ప్రభువు పరుడు. ధ్యానముచే సాధింపబడడు, ఆరాధించుట మహాకష్టము, యోగులకు కూడా అందడు. నిశ్చయము. (84) నిర్గుణుడు, నిరాకారుడు, భక్తులను అనుగ్రహించే కొరకు రూ పెత్తినవాడు. ఆతడే నరులకు దృష్టిగోచరుడైనాడు, ఆ దేవుడు సాక్షాత్తుగా మా ఇంట్లో ఉన్నాడు.(85)
మూ॥ దేవైః బ్రహ్మేశశే షైశ్చ ధ్యాతం యత్పాదపకంజం ।
ధనేశేన గణేశేన దినేశేనాపి దుర్లభం ॥
ఇత్యుక్త్వా భీష్మకః కృష్ణం సమానీయ స్వయంపురః ।
తుష్టావ సామవేదోక్త స్తోత్రేణ పరమేశ్వరం II
భీష్మక ఉవాచ :
సర్వాంతరాత్మా సర్వేషాం సాక్షీనిర్లప్త ఏవచ ।
కర్మిణాం కర్మణా మేవకారణానాంచ కారణం ॥
కేచిద్వదంతి త్వా మేకం జ్యోతీరూపం సనాతనం ।
కేచిచ్చపరమాత్మానం జీవోయత్పతి బింబకః ॥
కేచిత్రాకృతికం జీవం సగుణం భ్రాంత బుద్ధయః ।
కేచిన్నిత్య శరీరంచ బుద్ధాశ్చ సూక్ష్మ బుద్ధయః ॥
జ్యోతిరభ్యంతరేనిత్యం దేహరూపం సనాతనం ।
కస్మాత్తేజః ప్రభవతి సాకార మీశ్వరం వినా ॥
ఏవంస్తుత్వాచ వాచాన్తః స్మరన్విష్ణుంచ నారద ।
పాద్యం పద్మార్జితే పాదపద్మే చాయందదౌముదా ॥
అర్ఘ్యంచ ప్రదదౌతత్ర దూర్వాపుష్పజలాన్వితం ।
మధుపర్కంచ సురభిం సర్వాంగే గంధ చందనం II
యత్రదత్తం మహేంద్రేణ శుభకర్మణి యాతుకం ।
పారిజాతస్య మాల్యంచ జామాతుశ్చగలేదదౌ ॥
కుబేరేణచ యద్దత్తం అమూల్యరత్న భూషణం ।
చకారవరణంతస్య సరాజాభక్తిపూర్వకం ॥
వహ్ని శుద్ధాంశుక యుగం యద్దత్తం వహ్నినాపురా ।
దదౌ తదేవ కృష్ణాయ పరిపూర్ణతమాయచ ॥
జ్వలితంరత్నముకుటం యద్దత్తం విశ్వకర్మణా ।
దదౌతన్మస్తకే రాజా కృష్ణస్య పరమాత్మనః ॥
ధూపం రత్నప్రదీపంచ నైవేద్యం సుమనోహరం ।
నానా ప్రకారపుష్పంచ రత్న సింహాసనం దదౌ ॥
సప్తతీర్దోదకంచైవ పునరాచమనీయకం ।
తాంబూలంచ వరం రమ్యం కర్పూరాది సువాసితం ।
శయ్యాం రతికరీం రమ్యాం పానార్థం వాసితం జలం ।
కృత్వాచ వరణం రాజా పరిహార చకారతం ॥
కృతాంజలిపుటీరాజా తస్మై పుష్పాంజలిందదౌ॥
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ నారాయణ నారద సంవాదే రుక్మిణ్యు ద్వాహేసప్తాధిక శతతమోధ్యాయః ॥
దేవతలు బ్రహ్మ, ఈశుడు, శేషుడు వీరు ఎవని పాదపద్మముల ధ్యానిస్తారో, ధనేశునకు, గణేశునకు, దినేశునకు లభించవో అట్టివాడు నా ఇంట్లో ఉన్నాడు (86) అని పలికి భీష్మకుడు, స్వయంగా కృష్ణుని ముందుకు తెచ్చి, పరమేశ్వరుని సామవేదోక్త స్తోత్రముతో ఆనందపరిచాడు. (87) భీష్మక వచనమిట్లా - అందరి అంతరాత్మలలో ఉండేవాడ! అందరికి సాక్షిభూతుడ! నిర్లపుడ! కర్మచేసే వారి కర్మలకు, సాక్షి! కారణములకు కారణభూతుడ! (88) కొందరు నిన్ను ఒక్కడివి, జ్యోతిస్వరూపుడవు, సనాతనుడవు అని అంటారు. కొందరు నిన్ను పరమాత్మవని, జీవుడు నీ ప్రతిబింబమని అంటారు. (89) కొందరు భ్రమించిన బుద్దిగలవారు సగుణుడవు ప్రాకృతిక జీవుడవు అని అంటారు. తెలిసిన సూక్ష్మబుద్దులు కొందరు నిత్య శరీరుడవంటారు. (90) నీవు శరీరంలో జ్యోతివి, నిత్యుడవు, దేహరూపుడవు సనాతనుడవంటారు, సాకారుడైన ఈశ్వరుడు లేకుండ తేజస్సు ఎక్కడి నుండి వస్తుంది అని అంటారు. (91) ఓ నారద! ఇట్లా స్తుతించి మాటలు ముగిశాక ఆతడు విష్ణువును స్మరించి, ఆతడు, ఆనందంతో పద్మ అర్చించిన పాదపద్మమందు పాద్యమిచ్చాడు. (92) దూర్వ, పుష్పములు, జలము వీటితో కూడిన ఆర్ష్యాన్ని ఇచ్చాడు, సురభిని, మధుపర్కమును, అన్ని అవయవములందు గంధ చందనాన్ని ఇచ్చాడు. (93) శుభకర్మయందు అరణంగా మహేంద్రుడిచ్చిన పారిజాత పూలమాలను అల్లుని మెడలో వేశాడు రాజు. (94) కుబేరుడిచ్చిన అమూల్యరత్న భూషణాన్ని, భక్తిపూర్వకముగా ఆరాజు ఆతని మెడలో వేసి వరున్ని చేశాడు. (కోరుకున్నాడు). (95) అగ్ని ఇదివరలో ఇచ్చిన వహ్నిశుద్ధమైన రెండు వస్త్రములను, పరిపూర్ణతముడైన కృష్ణునకు దానినే ఇచ్చాడు. (96) విశ్వకర్మ ఇచ్చిన వెలిగిపోతున్న రత్న కిరీటాన్ని పరమాత్మయైన కృష్ణుని తలలో రాజు, దానిని ఉంచాడు. (97) ధూపము, రత్నదీపము, మనోహరమైనవైవేద్యము, రకరకాల పూలు, రత్న సింహాసనము ఇచ్చాడు. (98) తిరిగి ఆచమనం కొరకు ఏడు తీర్థములనీటినిచ్చాడు. కర్పూరాది వాసనగల, కోరతగిన, రమ్యమైన తాంబూలము నిచ్చాడు. (99) రతిని కలిగించే శయ్యను, రమ్యమైన దానిని, తాగటానికి సువాసనగల జలమును ఇచ్చాడు. రాజు ఆతని, వరణము చేసి, ఆతనిని విడిగా చేసి (అందరి నుండి) నాడు. (100) రాజు చేతులు జోడించి ఆతనికి పుష్పాంజలిని ఇచ్చాడు (101)
అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణ, శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాద మందు రుక్మిణి వివాహ మందు నూట ఏడవ అధ్యాయము.
Summary of chapter 107 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Dedicated to the thousand-headed serpent deity Lord Anantadeva, who is an expansion of Balarāma, this chapter extolls His infinite strength and devotion. Resting upon the causal ocean, Anantadeva supports all the millions of universes effortlessly upon one of His heads like a tiny mustard seed, while continuously singing the glories of Lord Śrī Kṛshṇa with all His thousand mouths without ever reaching their end.