శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :
దర్పభంగః శ్రుతో దేవి శంకరస్య జగద్గురోః ।
అధునా శ్రూయతాం మత్తో దుర్గాదర్ప విమోచనం ॥
తేజసా సర్వదేవానామావిర్భూయ జగత్ప్రసూః ।
దధార కామినీ రూపం కమనీయం మనోహరం ॥
నిహత్య దానవేంద్రాంశ్చ రరక్ష దేవతాకులం ।
లేభే జన్మ తతో దేవీ జఠరే దక్ష యోషితః ॥
పినాకపాణిం జగ్రాహ సా దేవీ సురసాధనం ।
శశ్వత్పరమ భక్త్యా చ నీ షేవే స్వామినం సతీ ॥
దక్షేణ సార్ధం దేవేన బభూవ శివ శత్రుతా ।
నిరర్థకం దైవ యోగాత్పురా వై సురసంసది ॥
ఓ రాధాదేవీ! జగద్గురువైన శంకరుని యొక్క గర్వభంగము వింటివి. ఇప్పుడు నా వలన దుర్గాదేవి యొక్క గర్వ విమోచనమును వినుము. ఆ జగన్మాత సర్వదేవతలయొక్క తేజస్సు వలన ఆవిర్భవించి (అవతరించి) మనోహరమును కోరదగినదియు ఐన స్త్రీ రూపమును ధరించెను. దానవేంద్రులను సంహరించి ఆమె దేవగణములను రక్షించెను. ఆ తరువాత దక్షుని భార్య గర్భమున సతీదేవిగా జన్మించెను. దేవకార్య నిర్వహణకు ఒక సాధనముగా నున్న పినాకపాణిని (శంకరుని) ఆ దేవి వివాహమాడెను. ఆమె భర్తను పరమ భక్తితో సేవించెను. పూర్వము ప్రయోజనమేమి లేకుండ వ్యర్థముగా దక్షునికి దైవయోగము వలన దేవసభలో శివునితో శత్రుత్వము ఏర్పడెను.
దక్షశ్చకార యజ్ఞం చ తత ఆగత్య కోవతః ।
సర్వాన్విజ్ఞాపయామాన తత్త్రెవ శంకరం వినా ॥
సస్త్రీకాః దేవతాః నర్వా ఆజగ్ముర్ధక్ష మందిరం ।
సగణః శంకరః కోపాన్నజగామాభిమానతః ॥
సతి పతిం చ మోహేస బోధయామాస యత్నతః ।
న తం చాలయితుం శక్తా బభూవ చంచలా స్వయం ॥
ఆజగామ పితుర్గేహం దర్పత్తన్య వినాఽజ్ఞయా ।
తస్య శాపేన తస్యాశ్చ దర్పభంగో బభూవ హ ॥
న హి సంభాషణం చక్రే వాజ్మౌత్రేణ పితో చ తాం ।
శ్రుత్వా చ విందాం భర్తుశ్చ దేహం తత్యాజ మానతః ॥
దక్షుడక్కడి నుండి శివుని మీది కోపముతో తన స్థానమునకు వచ్చీ ఒక యజ్ఞము చేయబూని శివుని దప్ప సర్వదేవతల నాహ్వానించెను. ఆ దేవతలందరు తమ స్త్రీలతో బాటు దక్షుని గృహమునకు వచ్చిరి. శంకరుడు కోపము, ఆత్మాభిమానముతో అక్కడకు పోకుండెను. సతీదేవి అజ్ఞానముతో (తండ్రి మీది వ్యామోహముతో) ప్రయత్నించి “పోవుదమని” భర్తకెంతగానో చెప్పిను. ఆ చంచల స్వభావురాలు భర్తను కదలించుటకు శక్తురాలు కాక పోయేసు. భర్త ఆజ్ఞలేకుండ గర్వముతో ఆమె తండ్రి గృహమునకు వచ్చెను. అక్కడ భర్త శాపము వలన ఆమెకు గర్వభంగపూయెను. తండ్రి దక్షుడామెతో మాటగూడ మాట్లాడలేదు. ఆమె భర్తను గురించి దక్షుడు పల్కిన నిందా వాక్యములు విని అభిమానముతో తన శరీరమును త్యజించెను.
ఏవం ప్రియే నిగదితం సతీదర్పవిమోచనం ।
తస్యా జన్మాంతరం నిత్యం దర్పభంగం చ శ్రుయతాం ॥
లేభే జన్మ సతీ శీఘ్రం జఠరే శైలయోషితః ।
శివస్తస్యాశ్చితాభస్మ చాస్థి జగ్రాహ భక్తితః ॥
చకార మాలామస్థ్నాం చ భస్మనా తనులేపనం ।
స్మారం స్మారం సతీం ప్రేమ్ణా భ్రామం భ్రామం పునః పునః ॥
ప్రియురాలా! ఇట్లు సతీదేవియొక్క గర్వము విమోచనమైన విషయము చెప్పితిని. ఆమె యొక్క వేరొక జన్మను నిత్యమైన (ఆ జన్మలోను సంభవించిన) దర్పభంగమును విందువు గాక. సతీదేవి వెంటనే హిమవంతుని భార్య యొక్క గర్భమందు చేరి రెండవ జన్మను పొందెను. శివుడు సతీదేవి యొక్క చితాభస్మమును ఎముకలను గ్రహించి భస్మమును శరీరమునకు పులుముకొనెను. ఎముకల మాలను ధరించెను. ప్రేమతో సతీదేవిని తలచుకొనుచు మరల మరల అంతట సంచరించుచుండెను.
సుషాన మేనా తాం దేవీమతీవ సుమనోహరాం ।
సృష్టౌ వీధాతుస్తస్యాశ హ్యుపమా నాస్తి కుత్ర చ ॥
గుణ ప్రసూర్గుణాన్సర్వాన్సర్వ రూపాన్ బిభర్తి సా।
సర్వాశ్చదేవ పత్న్యస్తత్కలాం నార్హంతి షోడశీం ॥
బభూవ వర్గమానా సా శుక్తే చంద్రకలా యథా ।
అతీవ యౌవనస్థా చ శైలగేహే దినే దినే ॥
బభూవాకాశవాణి చ తాం సంబోధ్య జగత్ప్రసూం ।
శివే శివం చ తపసా కఠోరేణ లభేతి చ ॥
హిమవంతుని భార్యయగు మేనాదేవి మిక్కిలి మనోహర రూపము గల ఆ దేవీనీ బిడ్డగా కనెను. బ్రహ్మ సృష్టిలో ఆమెను పోలిన వ్యక్తి ఎక్కడ లేదు. గుణములకు జన్మస్థానమైన అన్ని సద్గుణములను అన్ని రూపములను ఆమె భరించి యుండెను. దేవపత్నులందరు ఆమె గుణరూపములలో పదునారవ ఆంశకు గూడ అర్హులు కాకుండిరి. ఆమె హిమవంతుని గృహములో శుక్లపక్షములో చంద్రకళ వలె దినదినము (పోషింపబడుచు) పెరుగుచు మిక్కిలి యావనదశను పొందెను. ఆ జగన్మాత సుద్దేశించి ఆకాశవాణీ “ఓ శివే! కఠోర తపస్సులో శివుని పతిగా పొందుమా” అని బోధించేను.
వినేశ్వరం న తపసా ప్రాప్తా హి గర్భసంభవం ।
ప్రహాస్య తస్థౌ శ్రుత్వేతి సా చ యౌవన గర్వితా ॥
మమ జన్మాంతరీయం చ భస్మాస్థి చ బిభర్తి యః ।
నమాం ప్రౌడాం కథం దృష్ట్వా న గృహ్ణాత్యత్ర జన్మని ॥
యో విదగ్ధశ్చ బ్రహ్మాండం బభ్రామ మమ శోకతః ।
స కథం మాం న గృహ్ణాతి దృష్ట్వా పరమ సుందరీం ॥
దక్ష యజ్ఞం యో బభంజ మమ హేతోః కృపానిధిః ।
స కథం మాం న గృహ్ణాతి పత్నీం జన్మని జన్మని ॥
యా యస్య పత్నీ యో యస్యా భర్తా ప్రాక్తనతః పురా ।
కుతో విశ్వే తయోర్భేదో నిషేకో నాన్యథా భవేత్ ॥
ఆ ఆకాశవాణిని విని యావనము చేత గర్వితురాలై యున్న ఆ దేవి “నేను ఈశ్వరుని ప్రమేయము లేకుండ తపస్సుతో అవసరము లేకుండ జన్మనెత్తగల్గితిని” అని నవ్వి తపస్సుకనీ పూనుకొనక అట్లే నిలిచెను. నా యొక్క పూర్వ జన్మకు చెందిన భస్మమును అస్థికలను ధరించిన అతడు (శివుడు) యవనముతో లౌడనై యున్న నన్ను చూచీ ఈ జన్మలో ఎట్లు వివాహ మాడకుండును? నా వీయోగ దుఃఖము వలన మీక్కిలి తపించి ఎవడు బ్రహ్మాణమంతయు భ్రమణము (తిరిగెనో) చేసెనో అట్టి శంకరుడు మిక్కిలి సుందరినైన నన్ను చూచి ఎట్లు గ్రహింపకుండును? ఆ దయానిధి నా కారణముగానే (నా కొరకే) దక్షయజ్ఞమును భగ్నము చేసెను కదా! అట్టివాడు జన్మజన్మలకు తన పత్నినైన నన్నెట్లు స్వీకరింపడు? ఆది నుండి పూర్వజన్మలయందు ఏ స్త్రీ ఎపనిభార్యయో ఏ పురుషుడెవతెకు భర్తయో ఆ ఉభయుల భేదము (దాంపత్యము సరిపోవుట) ఈ విశ్వమున ఎట్లు సంభవించును. గర్భధారణమున్నది ఇంకొక విధముగా (పూర్వజన్మల దాంపత్యమునకు భిన్నముగా) జరుగదు.
సర్వరూప గుణాధారం మత్వా స్వమతమానతః ।
న చకార తపస్సాధ్వీ స విజ్ఞాయ తమీశ్వరం ॥
సుందరీమ చ సర్వాసు మత్తో నాస్త్యేవ సుందరీ ।
హృదీతి మత్వా గర్వేణ న చకార తపః శివా ॥
రూప యౌవన వేషాణాం పుమాన్ గ్రాహీ స్వయోషితాం ।
శివో మచ్ఛ్రుతి మాత్రేణ మాం గృహ్ణాతి వినా తపః ॥
హృదీతి మత్వా గిరిజా తస్థౌ హిమగిరేర్గృ హే ।
శశ్వత్సహచరీ మధ్యే క్రీడోన్మత్తా దివానీశం ॥
ఇట్లు సర్వరూపములకు సర్వ సద్గుణములకు తానే మూలమని అతి గర్వముతో నున్న ఆ సాధ్వి ఈశ్వరుని గూర్చి తెలిసికొనలేక (తమ వివాహము కొరకు ఆకాశవాణి చెప్పిన ప్రకారము) తపస్సు చేయకుండెను. మొత్తము సౌందర్యవతులలో నాకంటే మించి సుందరి ఎవ్వరు లేనే లేదని గర్వముతో ఆ శివ పార్వతి తపస్సు చేయలేదు. పురుషుడు తన భార్యల యొక్క రూపమును యౌవనమును అలంకారమును విశేషముగా గ్రహించును. ఇక శిపుడైతే నన్ను గూర్చి విన్నంతనే తపస్సు లేకుండనే నన్ను గ్రహించును. ఇట్లు భావించి పార్వతి హిమవంతుని గృహములో చెలికత్తెల నడుమ రాత్రింబగళ్లు మాటిమాటికి క్రీడోన్మత్తురాలై (ఆటల పిచ్చిలో మునిగి) నీలిచియుండెను.
ఏతస్మిన్నంతరే తూర్ణం దూతః శైలేంద్రసంనది ।
ఉవాచాగత్యమధురం తత్పురః సంపుటాంజలిః ॥
ఇంతలో ఒకనాడు పర్వతరాజు సభలోనికి వేగముగా ఒక దూత వచ్చి అతని ముందు అంజలి జోడించి మధురముగా ఇట్లు పలికెను.
దూత ఉవాచ - దూత అనెను :
ఉత్తిష్ఠోతిష్ఠ శైలేంద్ర గచ్చాక్షయ వటాంతికం ।
ఆ జగామ మహాదేవః నగణో వృషవాహనః ॥
మధుపర్కాదికం దత్వా భక్తినమ్రాత్మ కంధరః ।
పూజనం కురు శైలేంద్ర దేవేంద్రం తమతీంద్రియం ॥
సిద్ధిస్వరూపం సిద్ధేశం యోగీంద్రాణాం గురోర్గురుం ।
మృత్యుంజయం కాలకాలం బ్రహ్మ జ్యోతిః సనాతనం ॥
పరమాత్మ స్వరూపం చ సగుణం నిర్గుణం విభుం ।
భక్తి ధ్యానార్థమమలం దధానం దేహమీశ్వరం ॥
పర్వతరాజా! లే లెమ్ము. అక్షయ వటవృక్షము వద్దకు పొమ్ము. మహాదేవుడు వృషభ వాహనమెక్కి తన గణములతో అక్కడికి వచ్చియున్నాడు. భక్తితో నీ శిరస్సు వంచి నమస్కరించి మధుపర్కము (పూజ్యుడైన అతిథికి పెరుగు తేనె కలిపి ఇచ్చుట) మొదలగునవి సమర్పించి సాధారణములైన ఇంద్రియములకు గోచరించని ఆ దేవదేవుని పూజించుము. ఆ స్వామి సిద్ధిస్వరూపుడు. సిద్ధులకు ఈశుడు. యోగీంద్రులకు పరమ గురువు. కాలునికి కాలపురుషుడు. మృత్యుంజయుడు. సనాతనమైన బ్రహ్మమును జ్యోతి అతడు. సగుణ నిర్గుణ లక్షణములు గల పరమాత్మ స్వరూపమతనిది. సర్వవ్యాపి. భక్తులు తనను ధ్యానించుటకని దోషరహితమైన ఆకారము ధరించిన ఈశ్వరుడాయన (అతనిని దర్శించబోమ్ము).
శైలో దూతవచః శ్రుత్వా సముత్తస్థౌ ముదాన్వితః ।
మధుపర్కాదికం నీత్వా జగామ శంకరాంతీకం ॥
దేవీ దూతవచః శ్రుత్వా ప్రసన్న వదనేక్షణా ।
హృదీతి మేనే మద్ధేతోరాజుగామ మహేశ్వరః ॥
చకార వేషమతులం దధార వస్త్రముత్తమం ।
రత్నేంద్ర సారాలంకారాన్ రత్నమాలాం మనోహరాం ॥
పారిజాత ప్రసూనానాం మాలార చందన సంయుతాం ।
చకార శంకరార్థం చ ముత్వా మాలాం మనోహరాం ॥
రత్న సింహాసనస్థా సా దదర్శ దర్పణే ముఖం ।
కస్తూరీ బిందునా సార్థం సిందూరబిందు భూషితం ॥
ఆరక్త నేత్ర యుగలం నిర్మలాంజన సంయుతం।
శరన్మధ్యాహ్న మమలం యథాపంక్తివేష్టితం ॥
సుకోమలౌష్ఠ యుగలం తాంబూల రాగ సంయుతం ।
అతీవ సుందరం రమ్యపక్వ బింబ ఫలం యథా ॥
హిమవంతుడు దూత వాక్కు విని సంతోషముతో సింహాసనము నుండి లేచెను. మధుపర్కము మొదలగునవి తీసుకొని శంకరుని వద్ద కేగెను. పార్వతీదేవి దూత మాటవిని కలకలలాడు ముఖము నేత్రములు గలదై “మహేశ్వరుడు నాకొరకే ఇక్కడకు వచ్చా”నని తనలో అనుకొనెను. అప్పుడామె సాటిలేని విధముగా తన నలంకరించుకొనెను. ఉత్తమ వస్త్రమును శ్రేష్టమైన ఇంద్రనీల రత్నాభరణములను మనస్సును హరించెడి రత్నమాలను, శ్రీగంధము పులిమిన పారిజాత పుష్పముల మాలను ధరించెను. శంకరుని కొరకని మనోహరమైన పుష్పమాలను నిర్మించెను. అప్పుడు రత్నసింహాసనము పై కూర్చుండి అద్దములో తన ముఖమును చూచుకొనెను. నల్లని కస్తూరి చుక్కతో పాటు ఎర్రని సిందూరపు తిలకము ధరించెను. శరదృతువులోని పట్టపగటివేళలోని ఎఱదామరలు తుమ్మెదల బారులో చుట్టబడి ఉన్నట్లు ఎర్రచారికలు గల రెండు కన్నులకు చక్కని కొటుకదిద్ది తీర్చుకొనెను. మిక్కిలి కోమలములైన పెదవులకు తొంబూల రోగము దిద్ది మీక్కిలి సుందరమైన దొండపండును పోలునట్లు చేసెను.
రత్నకుండల దీష్త్యా చ గండస్థల వీరాజితం ।
సూర్యోదయేన జ్వలితం సుమేరు శిఖరం యథా ॥
అత్యనిర్వచనీయం చ దంతపంక్తి మనోహరం ।
యథాముక్తా సమూహం చ సజలం జలదాగమే ॥
గజముక్తా సమాయుక్తం సుచారు నాసికోత్తమం ।
సుశోభితం యథారుం స్వర్ణదీ జలధారయా ॥
మాలతీ మాల్య సంయుక్త కబరీభర సంయుతం ।
బక పంక్తి సుశోభాడ్యం నవీనం జలదం యథా ॥
తప్త కాంచన వర్ణాభం చారువక్షః స్థలోజ్ఞ్వలం ।
రత్నేంద్ర సారహారాక్తం కస్తూరీ కుంకుమాన్వితం ॥
చారు చంపక వర్ణాభం స్తనయుగ్మం మనోహరం ।
బదరీ ఫల తుల్యం చ ఛారుపత్రక శోభితం ॥
మధ్యం మనోహరం క్షీణం నిమ్ననాభిస్థలోజ్ఞ్వలం ।
అతీపి సుందరం రమ్యముదరం వర్తులాకృతి ॥
రంభిస్తంభ వినింద్యైకమూరుయుగ్మం మనోహరం ।
కామాలయం నుకఠినం నీగూడమంశుకేన చ ॥
స్థల పద్మ ప్రభాముష్ట పదయుగ్మం మనోహరం ।
రత్నపాశక సంయుక్తం సిద్ధలక్షక భూషితం ॥
దధతం రత్నమంజీరం రాజ హంసాసుకారీ చ ।
రత్నేంద్ర సారాభరణం నిర్మితం విశ్వకర్మణా ॥
కరం సుకోమలతరం సుందరం కనకప్రభం ।
రత్నకంకణ కేయూర శంఖ భూషణ భూషితం ॥
బిభ్రత్పద్రత్న ముకురం లీలాకమల ముజ్ఞ్వలం ।
రత్నాంగులీయమతులం దధతం సుమనోహరం ॥
రత్నకుండల (కర్ణాభరణములు)ముల కాంతితో చెక్కిళ్లు ప్రకాశించుచు సూర్యోదయము వలన సుమేరు (బంగారు కొండ) పర్వత శీఖరము వలె నున్న వివరించి చెప్పనట్టి మనోహరమైన పలువరుసతో వర్షఋతువులో జలముతో కూడియున్న ముత్యముల వలెనున్న - దేవనదియొక్క జలధారలో మిక్కిలి శోభించుచున్న మేరువు వలె ఏనుగు ముత్యములు పొదిగిన సుందరమైన నాసాభరణముతో (ముక్కునగ), కొంగబారుతో మిక్కిలి శోభించుచున్న కొత్త మేఘము వలె మాలతీ పుష్పమాల నలంకరించుకొన్న వెంట్రుకల ముడితో. మంచి బంగారు వన్నె గల కొంతి గల సుందరమైన వక్షస్థలమందు కస్తూరీ కుంకుమ ద్రవములు రత్నాల హారములు ప్రకాశించుచుండగా - అందమైన సంపంగి పూలరంగుతో ప్రకాశించుచు సుందరమైన నకరికా పత్రరేఖలతో శోభించుచు బదరీఫలముల వలె (పెద్దరేగుపండ్లు) నున్న మనోహర స్తనములు గల - సన్నని నడుము లోతైన నాభితో గుండ్రముగా నున్న మిక్కిలి అందమైన ఉదరము గల - వస్త్రము చేత ఆచ్ఛాదితములైన అరటి బోదెలను తిరస్కరించు తెరలు, కఠినమైన మన్మథ నివాస స్థానము, మెట్టతామరల కాంతిని దోచుకొని మనోహరములై లతుక పూతతో రత్నాల కడియాలతో ప్రకాశించుచున్న పాదములు గల - రాజహంసల ధ్వనివంటి రత్నాల అందాలు విశ్వకర్మ నిర్మితములైన ఇతరాభరణములు ధరించిన - రత్నకంకణములు దండకడియములు శంఖాభరణములతో అలంకరింపబడి బంగారు వన్నె గల కోమలకరములు గల - మనోహరములైన రత్నాంగుళీయములు (ఉంగరములు) ధరించిన హస్తములలో ఒకదానితో రత్నముకురమును (అద్దమును) మరియొక హస్తముతో విలాసముగా కమలమును ధరించియుండెను.
దృష్ట్వా స్వరూపముతులం దధ్యౌ శంకరమీశ్వరం ।
విశిష్య మనపా శశ్వదృర్తుశ్చరణ పంకజం ॥
సాటిలేని ఇట్టి తన స్వరూపమును పార్వతి చూచుకొని తన భర్తయగు శంకరుని తలచుకొనెను. విశేషించి భర్త పాదపద్మములను మనసా స్మరించెను.
పితరం మాతరం బంధుం సాధ్వీవర్గం సహోదరం ।
అంతరే సా న సస్మార కించిదేవ శివం వినా ॥
ఆమె తన మనస్సులో శివుని దప్ప తండ్రిని గానీ తల్లిని గాని బంధువులను గాని తన చెలులను గాని సోదరుని గాని ఏ మాత్రమప్పుడు స్మరించలేదు.
అధ శైలేశ్వరస్తత్ర దదర్శ చంద్రశేఖరం ।
స్వర్ణదీ పులినాద్రమ్యాదుత్పతంతం చ సస్మితం ॥
దధతం సంస్కృతాం మాలాం జపంతం మమ నామకం ।
తప్త స్వర్ణ ప్రభాజుష్ట జటారాశీ విరాజితం ॥
వృషభస్థం శూలపాణిం సర్వభూషణ రాజీతం ।
నాగయజ్ఞోపవీతం చ సర్పభూషణ భూషితం ॥
శుద్ధ స్పటిక సంకాశం వ్యాఘ్రచర్మ ధరం వరం ।
విభూతీ భూషితాంగం తమ్మస్థిమాలం దిగంబరం ॥
పంచవక్త్రం త్రినయసం సూర్యకోటి సమప్రభం ।
పర్వత రాజైన హిమవంతుడక్కడ అక్షయపటవృక్ష సమీపమున ఆకాశ గంగానదీ పులిన ప్రదేశము (ఇసుక తిన్నెలు గల స్థలము) నుండి ఎగురుచు చిరునవ్వుతో వచ్చుచున్న చంద్రశేఖరుని దర్శించెను. ప్రాణ ప్రతినిధితో సంస్కరించబడిన జపమాలను ధరించి నానామమును జపించుచు - కరిగించిన బంగారు వన్నె గలిగిన జడలతో విరాజిల్లుచున్న ఆ శూలపాణి వృషభము మీద నుండెను. సర్వాభరణములను నాగ (సర్పము) యజ్ఞోపవీతమును అలంకరించుకొని తెల్లని స్ఫటిక వర్ణము గలిగి వ్యాఘ్రచర్మమును వస్త్రముగా ధరించి శరీరమున భస్మము పులముకొని ఆస్థిమాలను ధరించిన ఆ దిగంబరుని, ఐదుముఖములు (ప్రతి ముఖమున) మూడు నేత్రములతో కోటిసూర్యులతో సమానమైన తేజస్సు గల పరమ శివుని పర్వతరాజు చూచెను.
దదర్శ రుద్రాన్ పరితోజ్వలితాన్ బ్రహ్మతేజసా ॥
శివవామే మహాకాలం దక్షిణే సందికేశ్వరం ।
భూతప్రేత పిశాచాంశ్చ కూష్మాండాన్ బ్రహ్మరాక్షసాన్ ॥
వేతాలాన్ క్షేత్ర పాలాంశ్చ భైరవాన్ భీమ విక్రమాన్ ।
అతని చుట్టు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోవుచున్న రుద్రులను, వామ భాగమున మహాకాలుని, దక్షిణమున నందీశ్వరుని, భూతప్రేత పిశాచ కూష్మాండ బ్రహ్మరాక్షసులను, భేతాళులను, క్షేత్రపాలకులను భయంకరమైన పరాక్రమము గల భైరవులను పర్వతరాజు దర్శించెను.
సనకం చ సనందం చ కుమారం చ సనాతనం ॥
జైగీషవ్యం దేవలం చ కాణాదం గౌతమం తథా ।
పిప్పలాదం కణఖనం వోడుం పంచశిఖం కఠం ॥
జాజలిం కరఖం కర్ణం లోమశం సూర్యవర్చసం ।
కాత్యాయనం పాణినిం చ శంఖం దుర్వాసనం తతః ॥
శాతాతపం పారిభద్రముష్టావక్రం మరుద్గవం ।
ఏతాన్ పురోగమాన్నత్వా ప్రణనామ శివం గిరిః ॥
సనక సనందన సనత్కుమారులను జైగీషవ్య దేవలులను కాణాదగౌతములను పిప్పలాదుని కణఖునీ వోడుపంచ శిఖులను కఠ జాజలులను కరఖకర్ణులను సూర్యతేజన్సు గల పంచశీఖునీ కాత్యాయనుని పాణిని శంఖ దుర్వాససులను శాతాతపపారిభద్రులను అష్టావక్ర మరుద్గవులను శివుని ముందున్న ఈ పరీవార ముని గణములను చూచి నమస్కరించి హిమవంతుడు శివునికి ప్రణమిల్లెను.
మూర్ధ్నా విపత్య భూమౌ స దండవత్సంపుటాంజలిః ।
అథో అనల్పయా భక్త్యా ధృత్వా తచ్చరణాంబుజం ॥
ననామ చాశ్రునేత్రః స పులకాంచిత విగ్రహః ॥
ధర్మదత్తేన స్తోత్రేణ తుష్టావ పరమేశ్వరం ।
తుష్టే బ్రాహ్మే దినేఽతీతే పుష్కరే సూర్యవర్వణి ॥
హిమవంతుడు భూమీయందు దండము వలె పడి చేతులు అంజలిగా పట్టి నేలమీద నమస్కరించి అధిక భక్తితో శివుని పాద పద్మములను శిరస్సున ధరించి శరీరమున పులకలేర్పడగా కన్నుల నాసందబాష్పములు జారగా నమస్కరించెను. సూర్యగ్రహణ సందర్భమున పుష్కర క్షేత్రములో బ్రాహ్మీ ముహుర్తము దాటిన వేళ (సూర్యోదయానంతరము) ధర్మఋషి తనకుపదేశించిన స్తోత్రముతో హిమవంతుడు పరమేశ్వరుని స్తుతించెను.
హిమాలయ ఉవాచ – హిమవంతుడనెను:
త్వం బ్రహ్మా సృష్టికర్తా చ త్వం విష్ణుః పరిపాలకః ॥
త్వం శివః శివదీఽనంతః సర్వసంహార కారకః ।
త్వమీశ్వరో గుణాతీతో జ్యోతీరూప స్సనాతనః ॥
ప్రకృతః ప్రకృతీశశ్చ ప్రాకృతః ప్రకృతేః పరః ।
నానారూపవిధాతా త్వం భక్తానాం ధ్యానహేతవే ॥
యేషు రూపేమ యత్ప్రీతి స్తత్తద్రూపం బిభర్షి చ ॥
సూర్యస్త్వం సృష్టిజనక ఆధారః సర్వతేజసాం ।
సోమస్త్యం సస్యపాతా చ సతతం శీతరశ్మినా ॥
వాయుస్తం వరుణస్త్వం చ త్వమగ్నిః సర్వదాహకః ।
ఇంద్రస్త్వం దేవరాజశ్చ కాలో మృత్యుర్యమస్తథా ॥
మృత్యుంజయో మృత్యుమృత్యుః కాలకాలో యమాంతకః ॥
వేదస్త్వం వేదకర్తా చ వేదవేదాంగ పారగః ।
విదుషాం జనకస్త్వం చ విద్వాంశ్చ విదుషా గురుః ॥
మంత్రస్త్వం హి జవస్త్యం హి తవస్త్వం తత్ఫలప్రదః ।
వాక్త్వం వాగధిదేవీ త్వం తత్కర్తా తదురుస్స్వయం ॥
అహో సరస్వతీ బీజం కస్త్వాం స్తోతుమిహేశ్వరః ।
ఇత్యేవ ముక్త్యా శైలేంద్ర స్తస్థౌ ధృత్వా పదాంబుజం ॥
సృష్టినీ చేయు బ్రహ్మవు నీవే. పరిపాలించు విష్ణువు నీవే. మంగళముల నిచ్చు అనంతుడవు సర్వప్రళయ కారుడవగు శీవుడవు నీవే. గుణాతీతుడవు ఈశ్వరుడవు సనాతనుడవు జ్యోతిరూపముననున్నవాడవు నీవే. ప్రకృతికి నాథుడవు ప్రకృతికి చెందిన ప్రకృతుడవు అట్టి ప్రకృతికతీతుడవు నీవు. భక్తుల యొక్క ధ్యాన మూలమైన నానా రూపములను సృష్టించువాడవు నీవు. ఈ రూపమందే భక్తునికి ప్రీతియో ఆయారూపమును నీవు ధరించుచున్నావు, సర్వలేజస్సులకు అధారమైన - సృష్టి జనకుడవైన సూర్యుడవు నీవే. ఎల్లప్పుడు చల్లని కాంతిలో సస్యములను రక్షించుసోముడవు (చంద్రుడు) నీవే. పాయువు వరుణుడు సర్వము గొల్చు అగ్నీ దేవరాజగు ఇంద్రుడు కాలపురుషుడు మృత్యువు యముడు అందరు నీవే. మృత్యువును జయించి మృత్యువుకు మృత్యువై యమునికి అంతకుడైన వాడవు నీవే. వేదము వేదకర్త వేద వేదాంగముల ఆవలి తీరమును పొందినవాడవు. విద్వాంసులకు జనకుడవు. విద్యావేత్తలకు గురువువు ఐన విద్వాంసుడవు నీవే. మంత్ర జప తపములు వాటి ఫలమిచ్చువాడు నీవే. వాక్కువు వాక్కుకు అధిదేవతవు వాగ్దేవిని సృష్టించినవాడవు. ఆమె గురువువు నీవే. ఆశ్చర్యము. సరస్వతీ (విద్య) బీజమే నీవు. ఇక నిన్ను స్తుతించుటకెవడు సమర్థుడు? ఇట్లు పలికి పర్వతరాజు శివునీ పాదపద్మములను పట్టుకొని నిలిచెను.
తత్రోవాస తమాబోధ్య చావరుహ్య వృషాచ్ఛవః ।
స్తోత్రమెతవ్మహాపుణ్యం త్రీసంధ్యం యః పఠేన్నరః ॥
ముచ్యతే సర్వపాపేభ్యో భయేభ్యశ్చ భవార్ణవే ।
అపుత్రో లభతే పుత్రం మాసమేకం వఠేద్యది ॥
భార్యాహీనో లభేద్భార్యాం సుశీలాం సుమనోహరాం ।
చిరకాలగతం వస్తు లభతే సహసా ధ్రువం ॥
రాజ్యభ్రష్టో లభేద్రాజ్యం శంకరస్య ప్రసాదతః ।
కారాగారే శ్మశానే చ శత్రు గ్రస్తేఽతి సంకటే ॥
గభీఽతీజలాకీర్ణే భగ్నపోతే విషాదనే ।
రణమధ్యే మహాభీతే హింస్రజంతు సమన్వితే ॥
సర్వతో ముచ్యతే స్తుత్వా శంకరస్య ప్రసాదతః ॥
శివుడు వృషభవాహనము నుండి దిగి హిమవంతుని లేపి అక్కడ కూర్చుండెను. మహాపుణ్య ప్రదమైన ఈ స్తోత్రము నెవడు మూడు సంధ్యలలో పఠించునో ఈ సంసార సాగరమున సర్వపాపముల నుండి భయముల నుండి విముక్తి పొందును. ఒక మాసమిట్లు పరించినచో సంతానము లేని పాడు పుత్రుని పొందును. భార్యలేనివాడు సుశీలయు మిక్కిలి సుందరియైన భార్యను పొందును. చాలకాలము క్రింద పోగొట్టుకున్న వస్తువును వెంటనే పొందును. శంకరానుగ్రహము వలన రాజ్యభ్రష్టుడు రాజ్యము పొందును. కారాగారమందున్నను, శ్మశానమందున్నను శత్రువులకు పట్టుబడి సంకటదశలో ఉన్నను లోతైన నీటిలో చిక్కుకొని పడవ పగిలిన దుఃఖస్థితిలో ఉన్నను, మిక్కిలి భయంకరమైన యుద్దమధ్యమందున్నను, క్రూరజంతువుల నడుమనున్నను, ఈ స్తోత్రముతో స్తుతించి శంకరుని అనుగ్రహము వలన అన్ని విధముల ఆపదల నుండి విముక్తుడగును.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదనంవాదేఽ ష్టlత్రింశోఽధ్యాయః ॥
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన ముప్పది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 38 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Following the defeat of Keshi, King Kaṃsa dispatched his trusted minister Akrūra, a devout worshipper of Lord Vishṇu, to Vṛndāvana with the mission of inviting Kṛshṇa and Balarāma to Mathura under the pretext of attending a grand royal bow sacrifice. Arriving in Vṛndāvana, Akrūra beheld Kṛshṇa dancing with the Gopīs and fell prostrate in ecstatic tears at His lotus feet, overwhelmed by the Lord's divine effulgence. Kṛshṇa and Balarāma graciously accepted the invitation, while the residents of Vraja, especially mother Yashodā and the grieving Gopīs, plunged into profound sorrow at the prospect of separation from their beloved Lord.