మూI శ్రీనారాయణ ఉవాచ :
కంసస్య వచనం శ్రుత్వాసోఽక్రూరో ధర్మిణాం వరః !
ఉవాచచోద్ధవం శాంతం శాంతః సంహృష్టమానసః ।
అక్రూర ఉవాచ:
సుప్రభాతాఽద్యరజనీ బభూవ మే శుభం దినం ।
తుష్టాశ్చ గురవో విప్రా దేవా మామితి నిశ్చితం ॥
కోటి జన్మార్జితం పుణ్యం మమ స్వయముపస్థితం ।
బభూవ మే సముత్పన్నం యద్యత్కర్మ శుభాశుభం ॥
చిచ్ఛేద బంధనిగడం మమ బద్దస్య కర్మణా ।
కారాగారాచ్చ సంసారాన్ముక్తో యామి హరేః పదం ॥
సుహృద్దర్థీ కృతోఽహంచ కం సేన విదుషా రుషా ।
వరేణ తుల్యో దేవస్య క్రోధో మమ బభూవ హ ॥
ప్రజరాజం సమాహర్తుం ప్రజం యాస్యామి సాంప్రతం ।
ద్రక్ష్యామి పరమం పూజ్యం భుక్తిముక్తి ప్రదాయినం ॥
నవీన జలదశ్యామం నీలేందీవరలోచనం ।
పీతవస్త్ర సమాయుక్త కటిదేశ విరాజితం ॥
ధూలిధూసరితాంగంచ కిందా చందన చర్చితం ।
అధవా నవనీతాక్తమంగం ద్రక్ష్యామి సస్మితం ॥
కింవా వినోదమురలీం వాదయంతం మనోహరం ।
కింవా గవాం సమూహంచ చారయంతమితస్తతః ॥
కింవా వసంతం గచ్ఛంతం శయానంవా సునిశ్చితం ।
నీదేశం కీదృశం చాద్య సుదృష్ట్వా చ శుభేక్షణే ॥
యత్పాదపద్మం ధ్యాయంతే బ్రహ్మవిష్ణు శివాదయః ।
నహి జానాతి యస్యాంత మనంతోఽనంత విగ్రహః ॥
యత్ర్పభావం నజానంతి దేవాః సంతశ్చ సంతతం ।
తస్య స్తోత్రే జడీభూతో భీతా దేవీసరస్వతీ ॥
దాసీ నియుక్తా యద్దా స్యే మహాలక్ష్మీశ్చ లక్షితా ।
గంగా యస్య పదాంభోజాన్నిఃసృతా సత్వరూపిణీ ॥
జన్మమృత్యుజరావ్యాధిహరా త్రిభువనాత్పరా ।
దర్శన స్పర్శనాభ్యాంచ నృణాం పాతకనాశినీ ॥
ధ్యాయతే యత్పదాంభోజం దుర్గా దుర్గార్తినాశినీ ।
త్రైలోక్యజననీ దేవీ మూలప్రకృతిరీశ్వరీ ॥
లోమ్నాం కూ పేపు విశ్వాని విష్ణోశ్చ యస్యచ ।
అసంఖ్యాని విచిత్రాణి స్తూలాత్ స్తూలతరస్యచ ॥
సచయత్షోడశాంశశ్చ యస్య సర్వేశ్వరస్యచ ।
తంద్రష్టుం యామి హేబంధో మాయామానుషరూపిణం ॥
సర్వం సర్వాంతరాత్మానం సర్వజ్ఞం ప్రకృతేః పరం ।
బ్రహ్మజ్యోతి స్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం ॥
నిర్గుణంచ నిరీహంచ నిరానందం నిరాశ్రయం ।
పరమం పరమానందం సానందం నందనందనం ॥
స్వేచ్చామయం సర్వపరం సర్వబీజం సనాతనం ।
వదంతి యోగినః శశ్వత్ ధ్యాయంతేఽహర్నిశం శిశుం ॥
అను । శ్రీనారాయణుడిట్లన్నాడు: కంసుని మాటను విని, ధర్మవంతులలో శ్రేష్ఠుడైన ఆ అక్రూరుడు శాంతుడు, సంతోషించిన మనస్సు గలవాడై, శాంతుడైన ఉద్దవునితో ఇట్లా అన్నాడు (1) అక్రూరుడిట్లా - ఈరాత్రి, సుప్రభాతంగా మారింది (మంచి ఉదయం). నాకు శుభదినమైంది. గురువులు, విప్రులు, దేవులు, నా విషయంలో ఆనందించారనేది నిశ్చయము (2) కోటి జన్మలలో సంపాదించిన పుణ్యము నాకు స్వయంగా వచ్చింది. శుభ, అశుభమైన కర్మఫలం అంతా నాకు లభించింది. (3) కర్మలతో బద్ధుడనైన నాకు బంధమనే ఈ సంకెల తొలగిపోయింది. సంసార కారాగారము నుండి ముక్తుడనై, హరి పదానికి (స్థానం) పోతున్నాను. (4) కోపంగల, విద్వాంసుడైన కంసుడు, నాకు స్నేహవస్తువైనాడు. నన్ను (యాచించి స్నేహితునిగా) చేశాడు. ఆతని (దేవుని) కోపము నాకు వరంతో సమానంగా ఐంది. (5) వ్రజమునకు రాజైన వానిని తీసుకురావటానికి, ఇప్పుడు ప్రజమునకు వెళ్తాను, (గొల్లపల్లె పశువులుండేచోట). భక్తిముక్తులను ఇచ్చే పూజ్యుడైన ఆ పరముని (పరుడు) చూస్తాను. (6) కొత్త మేఘం వలె శ్యామలవర్ణంవాడు, నల్లకలువ వంటి కళ్ళు గలవాడు, పీత వస్త్రముతో కూడిన కటి ప్రదేశం గలవాడు. (7) దుమ్ముతో బూడిద వర్ణంగా మారిన శరీరం కలవాడు, లేదా చందనంతో పూయబడ్డ శరీరం కలవాడు లేదా వెన్నతో పూయబడ్డ శరీరం కలవాడు, చిరునవ్వు గలవాడు, అట్టి వానిని చూస్తాను (8) లేదా వినోదం కొరకై మనోహరంగా మురళిని వాయిస్తున్నాడో, లేదా ఇటునటు ఆవుల సమూహమును నడిపిస్తున్నాడు, (9) లేదా ఉన్నాడో ఒకచోట వెళ్తున్నాడో, నిద్రిస్తున్నాడో అట్టివానిని తప్పకుండా చూస్తాను. ఈ వేళ ఎటువంటి ఆజ్ఞ ఇచ్చారు. బాగా (సమయం) చూచి మంచిక్షణమందు చెప్తాను. (10) బ్రహ్మ విష్ణు శివాదులు ఆతని పాదపద్మాన్ని ధ్యానిస్తున్నారు. అనంతమైన విగ్రహం గల అనంతుడు కూడా ఆతని అంతాన్ని తెలుసుకోలేదు. (11) ఆతని ప్రభావాన్ని, దేవతలు, సజ్జనులు ఎల్లప్పుడు తెలుసుకోలేరు. ఆతని స్తోత్రం చేస్తూ, భయపడి సరస్వతిదేవి జడంగా మారింది. (12) మహాలక్ష్మికూడా ఆతని ధ్యాసయందు దాసిగా నియోగించబడి కన్పిస్తోంది. సత్వరూపిణియైన గంగ ఆతని పాదాంభోజముల నుండి ప్రవహించింది. (13) అదిజన్మ మృత్యు జరవ్యాధులను తొలగించేది. త్రిభువనములన్నింటికి పరమైనది. దర్శనం వల్ల స్పర్శలవల్లను నరుల పాతకముల హరించేది. (14) త్రైలోక్యములకు తల్లి, దేవి, మూలప్రకృతి, ఈశ్వరి, తొలగింపరాని బాధలను నశింపచేయగలది ఐన దుర్గ ఆతని పాదాం భోజముల ధ్యానిస్తున్నది. (15) ఆ మహావిష్ణువు యొక్క రోమకూపములందు విశ్వములున్నాయి. స్థూలమైనదానికన్న, స్థూలతరుడైన వాని రోమములందు అసంఖ్యాకములైన, విచిత్రములైన లోకములున్నాయి. (16) ఆతడు సర్వేశ్వరునిలో పదహారవ భాగము. ఓ బంధు! మాయామానుషరూపుడైన ఆతనిని చూడటానికి వెళ్తున్నాను. (17) అంతా వాడే, అన్ని అంతరాత్మలలోనువాడే, సర్వజ్ఞుడు - ప్రకృతికన్న పరమైనవాడు, బ్రహ్మజ్యోతిఃస్వరూపుడు, భక్తులను అనుగ్రహించే కొరకు విగ్రహమైనవాడు (రూపమెత్తాడు). (18) నిర్గుణుడు, కోరికలు లేనివాడు ఆనందం అనేది ఆయనకు లేదు, ఆశ్రయము లేనివాడు, పరముడు, పరమానంద స్వరూపుడు, సానందుడు, నందనందనుడు (19) స్వేచ్ఛామయుడు, సర్వుల కన్న పరుడు, అందరికి బీజమైనవాడు, సనాతనుడు అని యోగులు ఎప్పుడు అంటూంటారు. ఆ శిశువును రాత్రింబగళ్ళు ధ్యానిస్తుంటారు. (10) (గుణాతీతుడు, సుఖదుఃఖాతీతుడు వగైరా)
మూ॥ మన్వంతర సహస్రంచ నిరాహారః కృశోదరః ।
పద్మే పాదస్తపస్తే పే పురా పాద్మేతు యత్కృతే ॥
పునః కురు తపస్యాంచ తదా ద్రక్ష్యతి మామితి ।
సకృచ్ఛబ్దంచ శుశ్రావ నదదర్శతథాఽపితం ।
తావత్కాలం పునస్తస్త్వా వరం ప్రాపద దర్శతం ।
ఈదృశం పరమేశంచ ద్రక్ష్యామ్యద్య తముద్ధవ ॥
పురా శంభుస్తపస్తే పే యావద్వై బ్రహ్మణో వయః ।
జ్యోతిర్మండల మధ్యేచ గోలోకే తం దదర్శనః ॥
సర్వతత్వం సర్వసిద్ధం సమతత్వం పరం వరం ।
సంప్రాప తత్పదాంభోజే భక్తించ నిర్మలాం పరాం॥
చకారాత్మసమం తంచ యో భక్తో భక్తవత్సలః ।
ఈదృశం పరమేశంచ ద్రక్ష్యామ్యద్య తముద్ధవ ॥
సహస్రశక్రపాతాంతం నిరాహారః కృశోదరః ।
యస్యానంతస్తపస్తే పే భక్త్యాచ పరమాత్మనః ॥
తదాచాత్మ సమం జ్ఞానం దదౌత స్మైయ ఈశ్వరః ।
ఈదృశం పరమేశంచ ద్రక్ష్యామ్యద్యతముద్ధవ ॥
సహస్ర పాతాంతం ధర్మస్తే పేచ యత్తపః ।
తదా బభూవ సాక్షీ స ధర్మిణాం సర్వకర్మణాం ॥
శాస్తాచ ఫలదాతాచ యత్రసాదాన్నృణామిహ ।
సర్వేశమీదృశమహో ద్రక్ష్యామ్యద్యత ముధవ ॥
అష్టావింశతిరింద్రాణాం పతనే యద్ధివానిశం ।
ఏవం క్రమేణ మాసాబ్ధైః శతాబ్దం బ్రహ్మణ్వయః ।
అహో యస్య నిమేషేణ బ్రహ్మణః పతనం భవేత్ ।
ఈదృశం పరమాత్మానం ద్రక్ష్యామ్యద్యతముద్ధవ ॥
నాస్తి భూరజసాం సంఖ్యా యథైవ బ్రహ్మణాం తథా ।
తథైవ బంధో విశ్వానాం తదాధారో మహావిరాట్ ॥
విశ్వవిశ్వేచ ప్రత్యేకం బ్రహ్మ విష్ణు శివాదయః ।
మునయో మనవః సిద్ధా మానవాద్యా చరాచరాః ॥
యత్షోడ శాంశః సవిరాట్ సృష్టో నష్టశ్చ లీలయా ।
ఈదృశం సర్వశాస్తారం ద్రక్ష్యామ్యద్య తముద్ధవ ॥
ఇత్యేవముక్త్వాఽక్రూరశ్చ పులకాంచిత విగ్రహః ।
మూర్ఛాం ప్రాప సాశ్రునేత్రో దధ్యే తచ్చరణాంబుజం ॥
బభూవ భక్తి పూర్ణశ్చ స్మారం స్మారం పదాంబుజం ।
కృత్వా ప్రదక్షిణంవాఽపి కృష్ణస్య పరమాత్మనః ॥
ఉద్దవశ్చత మశ్లిష్య ప్రశశంస పునః పునః ।
సచ శీఘ్రం యయౌ గేహం అక్రూరోఽపి స్వమందిరే ॥
ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ నారాయణ నారద సంవాదే అక్రూరహర్వోత్కర్షకథనంనామపంచ షష్టితమోఽధ్యాయః. ॥
అను! మన్వంతర సహస్రములు, నిరాహారుడై, కృశోదరుడై,పద్మమందు బ్రహ్మతపస్సు చేశాడు. ఇది వరలో పాద్మమందు కృతయుగంలో చేశాడు. (21) మళ్ళీ అంత తపస్సు చెయ్యి అప్పుడు నన్ను చూడగలవు, అని ఒకసారి మాటవినబడింది. ఐనా ఆతనిని చూడలేదు. (22) అంతకాలము తిరిగి తపస్సుచేసి వరాన్ని పొందాడు, ఆతనిని చూచాడు. అలాంటి పరమేశుని ఈరోజు చూడబోతున్నాను. ఓ ఉద్ధవ! (23) బ్రహ్మవయస్సు ఎంతో, అంతకాలము శివుడు తపస్సు చేశాడు, ఇది వరలో, జ్యోతిర్మండల మధ్యమందు, గోలోకమందును, ఆతనిని చూచాడు. (24) సర్వతత్వుడు, సర్వసిద్ధుడు, నాకు తత్వము, పరుడు, వరుడు, ఆతనిని పొందాడు. ఆతని పదాంబుజములందు, నిర్మలమైన, స్థిరమైన భక్తిని పొందాడు శివుడు (25) తన భక్తుని, భక్తవత్సలుడు తన ఆత్మ సమంగా చేశాడు. ఇలాంటీపరమేశుని ఈరోజు చూడబోతున్నాను. ఓ ఉద్దవ! (26) వేయి ఇంద్రులు పడిపోయేంతకాలము నిరాహారుడై, కృశోదరుడై అనంతుడు భక్తితో పరమాత్మనుగూర్చి తపస్సు చేశాడు (27) అప్పుడు ఆ ఈశ్వరుడు, ఆతనికి ఆత్మ సమమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇలాంటి పరమేశుని ఈవేళ చూడబోతున్నాను. (28)వేయి ఇంద్రులు పడిపోయేంత కాలము ధర్ముడు తపస్సు చేశాడు. అప్పుడు ఆతడు అందరు చేసే కర్మలకు, ధర్మములకు (కలవారికి) సాక్షియైనాడు. (29) ఆతని అనుగ్రహం వల్ల శాసించేవాడు, ఫలమునిచ్చేవాడు, ఐనాడు ఇక్కడి నరులకు ఇలాంటి సర్వేశుని ఈరోజు చూడబోతున్నాను ఓ ఉద్ధవ! (30) ఇరువది ఎనిమిది మంది ఇంద్రుల పతనమునకై ఎన్ని రాత్రిబంగళ్ళెతాయో (పతనము 1 పగలు 1 రాత్రి) ఆక్రమంగామాస, అబ్దములతో నూరు సంవత్సరాలు బ్రహ్మ వయస్సు (31) అలాంటి బ్రహ్మ విభువు యొక్క రెప్పపాటు కాలములో పతనమౌతాడు, ఎంత ఆశ్చర్యకరం. ఇలాంటి పరమాత్మను ఈవేళ చూడబోతున్నాను, ఓ ఉద్ధవ! (32) భూమిమీది రేణువుల సంఖ్య తెలియనట్లే బ్రహ్మల సంఖ్య అనంతము. అట్లాగే విశ్వములకు బంధువు (బంధము) వాటికి ఆధారము, మహావిరాట్టు (33) ప్రతివిశ్వమందు, బ్రహ్మవిష్ణు శివాదులు ప్రత్యేకము (విశ్వం=సృష్టి), మునులును, మనువులు, సిద్ధులు, మానవాదులు, చరాచరములు ప్రత్యేకము. (34) పదహారు భాగములుగా ఏదుందో ఆ విరాడ్రూపము, అవలీలగా సృష్టినందింది. నశించింది. ఇలాంటి ఆ సర్వశాసకుణ్ణి ఈరోజు చూడబోతున్నాను, ఓ ఉద్దవ! (35) అని ఈవిధముగా పలికి అక్రూరుడు పులకాంకిత విగ్రహుడై మూర్చనందాడు, కన్నీళ్ళతో, ఆతని చరణాంబుజములను ధ్యానించాడు. (36) ఆతని పదాంబుజములను స్మరిస్తూ, స్మరిస్తూ భక్తిపూర్ణుడైనాడు. పరమాత్మయైన కృష్ణునకు ప్రదక్షిణం చేశాడు (ధ్యానిస్తూ). (37) ఉద్దవుడు ఆతనిని కౌగిలించుకొని మాటి మాటికి ప్రశంసించాడు. అతడు శీఘ్రముగా గృహమునకు వెళ్ళాడు. అక్రూరుడు కూడా తన మందిరమునకు వెళ్ళాడు. (38) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ మందు నారాయణ నారద సంవాదమందు అక్రూరుని ఆనందాతిరేకమును చెప్పటమనునది అరువది ఐదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 65 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Distraught by the departure of Lord Kṛshṇa, the devoted Uddhava met Vidura on the banks of the Yamunā and shared the heartbreaking news of the Lord's disappearance. Following Kṛshṇa's final instructions, Uddhava traveled to the sacred solitude of Badarikāśrama in the Himālayas, where he engaged in continuous meditation and chanting of the Lord's holy names, eventually attaining eternal residence in the spiritual world through the grace of his master.