బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

70 -  అధ్యాయము

మూII శ్రీనారాయణ ఉవాచ:

యథాఽక్రూరః స్వశరణం గత్వా కంసే నప్రేషితః

చకార శయనం తల్పే భుక్తామిష్టాన్న ముత్తమం

సకూర్పురం చ తాంబూలం చఖాద వాసితం జలం

జగామ నిద్రాం సుఖతః సుఖసంభోగమాత్రతః

తతో దదర్శ సుస్వప్నం పురాణశ్రుతిసంమితం

నిశావశేషసమయే వాద్యాది పరివర్జితే

అరోగీబద్ధకేశశ్చ వస్త్రయుగ్మ సమన్వితః

సుతల్పశాయీ సుస్నిగ్ధశ్చింతా శోకవివర్జితః

కిశోరవయసంశ్యామం ద్విభుజం మురలీధరం

పీతవస్త్ర పరీధానం వనమాలా విభూషితం

చందనోక్షిత సర్వాంగం మాలతీమాల్య శోభితం

భూషితం భూషణార్హంచ సద్రత్న మణిభూషణైః

మయూరపిచ్చచూడంచ సస్మితంపద్మలోచనం

ఏవం భూతం ద్విజశిశుం దదర్శప్రథమంమునే

తతోద దర్శరుచిరాంపతిపుత్ర వతీం సతీం

పీతవస్త్ర పరీధానాం రత్నభూషణ భూషితాం

జ్వలత్ర్పదీపహస్తాంచ శుక్ల ధాన్యకరాం వరాం

శరచ్చంద్రనిభాస్యాంచ సస్మితాం వరదాం శుభాం

తతో దదర్శ విప్రంచ ప్రకుర్వంతం శుభాశిషం

శ్వేతపద్మం రాజహంసం తురగంచ సరోవరం

దదర్శ చిత్రితం చారు ఫలితం పుష్పితం శుభం

ఆమ్రనింబనారికేళ గుర్వర్కకదలీతరుం

దశంతం శ్వేతసర్పంచ స్వాత్మానం పర్వతస్థితం

వృక్షస్థంచ గజస్థంచ తరిస్థం తురగస్థితం

వీణాం వాదితవంతంచ భుక్తవంతంచ పాయసం

దధిక్షీరయుతాన్నంచ పద్మపత్రస్థమీప్సితం

కృమివిట్ సహితాంగంచ రుదంతం మోహితం తదా

శుక్ల ధాన్యపుష్పకరం క్షణం చందనచర్చితం

ప్రాసాదస్థం సముద్రస్థం ఆత్మానంచ సలోహితం

ఛిన్నభిన్నం క్షతాంగంచ మేదపూయసమన్వితం

తతో దదర్శ రజతం మణిం శుభ్రంచ కాంచనం

ముక్తా మాణిక్య రత్నంచ పూర్ణకుంభజలం శుభం

అను శ్రీ నారాయణుడిట్లన్నాడు !

అక్రూరుడు, తన శరణు పొంది, కంసునితో పంపబడ్డాక, ఉత్తమమైన మధురమైన భోజనమును భుజించి పడకయందు పడుకున్నాడు (1) వాసనగలనీటిని తాగి కర్పూరము గలిగిన తాంబూలము భుజించాడు. సుఖభోగం కలగగానే సుఖంగా నిద్రపోయాడు. (2) పురాణములు శ్రుతులలో చెప్పినట్టు ఆపిదప మంచికలగన్నాడు. వాద్యాదులన్ని లేనప్పుడు నిశియొక్క చివరిసమయంలో కలగన్నాడు (3) రోగం లేని వాడు వెంట్రుకలు ముడుచుకొన్నవాడు, రెండు వస్త్ర ములుగలవాడు, మంచిపడక పై పడుకొన్నవాడు, నిగనిగలాడుతున్నవాడు, చింతశోకములు లేనివాడు (4) కిశోర (చిన్న) వయస్సు వాడు, శ్యామలశరీరంవాడు, రెండుచేతులవాడు, మురళి ధరించినవాడు, పీతవస్త్రమును కట్టుకున్నవాడు, వనమాలతో అలంకరింపబడ్డవాడు (5) ఒంటినిండా చందనం పూసుకున్నవాడు, మాలతి మాలతో శోభిస్తున్నవాడు, ధరించతగిన మంచిరత్నములతో మణుల భూషణములతో అలంకరింపబడ్డవాడు, (6) తలలో నెమలి ఫింఛమువాడు, చిరునవ్వుగలవాడు, పద్మలోచనుడు, ఇలాంటి విధంగా ఉన్న బ్రాహ్మణ శిశువును మొదట కలలో చూచాడు, ఓముని! (7) ఆపిదప అందమైన, పతిపుత్రులుగల సతిని చూచాడు. ఆమె పీతవస్త్రాన్ని కట్టుకుంది. రత్నభూషణములు అలంకరించుకొంది. (8) వెలుగుతున్న దీపం ఆమెచేతిలో ఉంది. చేతిలో తెల్లని ధాన్యముంది, శ్రేష్ఠురాలు. శరత్కాలమందలి చంద్రునిలాంటి ముఖం గలది, నవ్వుతోంది, వరమిచ్చేది శుభమైనది. (9) ఆ పిదప, శుభ ఆశీస్సులనిస్తున్న విప్రుని చూచాడు. శ్వేతపద్మమును, రాజహంసమును, గుర్రమును, సరోవరమును (10) చిత్రించిన, బాగాపండిన, పుష్పించిన, శుభమైన మామిడి, వేప, కొబ్బరి పెద్ద జిల్లేడు, అరటి, ఈచెట్లను చూచాడు. (11) పర్వతమందున్న వృక్షమందున్న ఏనుగు పై ఉన్న గుర్రము పై ఉన్న తడియందున్న (ఓడ, లేదా మబ్బు) తనను కరుస్తున్న తెల్లని సర్పాన్ని చూచాడు. (12) తాను వీణవాయిస్తున్నట్టుగా, పాయసం తిన్నట్టుగా, తామరాకులో ఉన్న తన కిష్టమైన పెరుగు, పాలతో కూడిన అన్నం తిన్నట్టుగా కలగన్నాడు. (13) అప్పుడే శరీరం నిండా పురుగులు, మలము ఉన్నట్టుగా, ఏడుస్తున్నట్టుగా, మోహంపొందినట్టుగా, మళ్ళీ తెల్లని ధాన్యము, పుష్పము చేత ధరించినట్టు, క్షణకాలము చందనం అంతటా పూసుకున్నట్టు (14) మేడలో ఉన్నట్లు సముద్రంలో ఉన్నట్లు, తాను ఎర్రగా ఉన్నట్లుగా, తాను ఛిన్నము, భిన్నముఐనట్లు, శరీరం నిండా గాయాలైనట్లుగా, మేద (శరీరంలో ఉండేది) పూయములు కలిగి ఉన్నట్టుగా కలగన్నాడు. (15) పిదప వెండిని, మణిని చక్కని బంగారాన్ని ముత్యములు, మాణిక్యములు రత్నములు, శుభమైన పూర్ణకుంభ జలమును చూచాడు.

మూII సురభించ సవత్సాంచ వృషభేంద్రం మయూరకం

శుకంచ సారసం హంసం చిల్లం ఖంజనమేవచ

తాంబూలం పుష్పమాల్యంచ జ్వలదగ్నిం సురార్చనం

పార్వతీప్రతిమాం కృష్ణ ప్రతిమాం శివలింగకం

విప్రబాలాంచ బాలాంచ సుపక్వఫలితాం కృశిం

దేవస్థలీంచ రాజేంద్రం సింహంవ్యాఘ్రం గురుం సురం

దృష్ట్వా స్వప్నం సముత్తస్థౌచ కారాహ్నికమీప్సితం

ఉద్ధవం కథయామాస సర్వం వృత్తాంతమేవచ

ఉద్ధవాజ్ఞాం సమాదాయ కృత్వా గురుసురార్చనం

యాత్రాంచకార శ్రీకృష్ణం ధ్యాత్వా మనసి నారద

దదర్శ వర్త్మన్యేవంచ మంగలార్హంశుభప్రదం

వాంఛా ఫలప్రదం రమ్యం పురోమంగల సూచకం

వామే శివం శివాం పూర్ణంకుంభం నకుల చాషకం

పతిపుత్రవతీం సాధ్వీం దివ్యాభరణ భూషితాం

శుక్ల పుష్పంచ మాల్యంచ ధాన్యంచ ఖంజనం శుభం

దక్షిణే జ్వలదగ్నించ విప్రంచ వృషభం గజం

వత్సప్రయుక్తాం ధేనుంచ శ్వేతాశ్వం రాజహంసకం

వేశ్యాంచ పుష్పమాలాంచ పతాకాం దధిపాయసం

మణిం సువర్ణం రజతం ముక్తా మాణిక్యమీప్పితం

మద్యం మాంసం చందనంచ మాధ్వీకం ఘృతముత్తమం

కృష్ణసారం ఫలం లాజసిద్ధాన్నం దర్పణం తథా

విచిత్రితం విమానంచ సుదీప్తాం ప్రతిమాం తథా

శుక్లోత్పలం పద్మవనం శంఖం చిల్లం చకోరకం

మార్జారం పర్వతం మేఘం మయూరం శుకసారసం

శంఖ కోకిల వాద్యానాం ధ్వనిం శుశ్రావ మంగలం

విచిత్రకృష్ణసంగీతం హరిశబ్దం జయధ్వనిం

ఏవంభూతం శుభం దృష్ట్వా శ్రుత్వా సంపృష్టమానసః

ప్రవివేశ హరిం స్మృత్వా పుణ్యం వృందావనం వనం

దదర్శ పురతో రమ్యం రాసమండల మీప్సితం

చందనాగరు కస్తూరీ పుష్పచందనవాయునా

వాసితం మంగళఘటైః రంభాస్తంభైర్విరాజితం

అమ్రపల్లవ సంఘైశ్చ పట్టసూత్ర విచిత్రిత్యై

శోభితైః పరితః శశ్వత్ పద్మరాగ వినిర్మితం

శోభితం శోభనార్హం చ త్రికోటిరత్నమందిరైః

రమ్యైః కుంజకుటీరైశ్చ రాజితం శతకోటిభిః

రాసం వృందావనం దృష్ట్వా కియదూరం యయౌచ స:

అను! లేగదూడతో కూడినకామధేనువును, వృషభేంద్రమును, నెమలిపిల్లను,చిలుకను, బెగ్గురు పక్షిని, హంసను, చీపరపిట్టను, కాటుకపిట్టను, (17) తాంబూలమును, పుష్పమాలలను, మండుతున్న అగ్నిని, దేవపూజను, పార్వతిప్రతిమ, కృష్ణప్రతిమ, శివలింగము, (18) విప్రబాలిక, బాలికను, బాగా పండిన ఫలించిన పంటను, దేవస్థలమును, రాజశ్రేష్ఠుణ్ణి, సింహాన్ని, వ్యాఘాన్ని గురువును, సురను, (19) వీటన్నిటిని కలలో చూచి, వెంటనే లేచాడు. ఇష్టమైన దివసంలో చేసే (విధి) కార్యాలను (ఆహ్నికం) నిర్వర్తించాడు. ఈ విషయమంతా ఉద్ధవునకు చెప్పాడు. (20) ఉద్దవుని ఆజ్ఞను తీసుకొని, గురువుల దేవతల పూజచేసి, నస్సులో శ్రీకృష్ణుని ధ్యానించి, యాత్ర చేశాడు, ఓ నారద! (21) మార్గంలో మంగళమునకు తగిన, శుభప్రదమైన కోరిన ఫలితాన్ని ఇచ్చే, రమ్యమైన ముందు శుభసూచకమైన వానిని ఇట్లా చూచాడు. (22) ఎడమ భాగంలో ఆడ,మగ నక్కలను, పూర్ణకుంభమును, ముంగిసను, పాలపిట్టను (చాషకం), పతిపుత్రులుగల సాధ్విని దివ్య ఆభరణములు అలంకరించుకున్నదాన్ని , (23) తెల్లని పూవును, మాలను, ధాన్యమును, కాటుకపిట్టను శుభ్రమైన వానిని (ఎడమలో) కుడి ప్రక్కన మండుతున్న అగ్నిని, బ్రాహ్మణుని, ఎద్దును, ఏనుగును, (240 దూడతో కూడిన ఆవును, తెల్ల గుర్రాన్ని, రాజహంసను, వేశ్యను, పుష్పమాలను దండాను, పెరుగు, పాయసమును (25) మణి, బంగారము, వెండి, ముత్యములు, ఇష్టమైన మాణిక్యములు, మద్యము, మాంసము, చందనము, ఇప్పసారాయి, మంచినేయిని (26) నల్లజింక, పండు, పేలాలు, వండిన అన్నము. అట్లాగే అద్దము, చిత్రించిన విమానము, బాగా వెలుగుతున్న ప్రతిమను (27) తెల్లకలువను, పద్మవనము, శంఖము, చీపరపిట్ట, మొగ్గ, పిల్లి, పర్వతము, మేఘము, నెమలి, చిలుక, బెగ్గురుపక్షి వీటిని చూచాడు. (28) శంఖము, కోకిల వాద్యముల ధ్వనిని మంగళ ప్రదమైన వానిని విన్నాడు. విచిత్రమైన కృష్ణుని (కోకిల) సంగీతమును, హరి (చిలుక) శబ్దమును జయధ్వనిని విన్నాడు. (29) ఈరకమైన శుభములను చూచి, శబ్దములు విని ఆనందించిన మనస్సుగలవాడై, హరిని స్మరిస్తూ, పుణ్యప్రదమైన వృందావనమను వనమును ప్రవేశించాడు. (30) ఎదుట రమ్యమైన, ఇష్టమైన రాసమండలాన్ని చూచాడు. చందనము, అగరు, కస్తూరి, పుష్పములు, చందనము వీటితో కూడిన గాలితో (31) ఆ స్థలమంతా వాసనతో నిండిపోయింది. మంగళఘటములతో, అరటిస్తంభములతో ఆప్రదేశం వెలుగుతోంది. మామిడి చిగుళ్ళ సమూహములతో, పట్టుదారములతో చిత్రించబడింది (గుచ్చబడింది). (32) వాటితో వెలిగిపోతోంది అంతటా... ఎల్లప్పుడూ పద్మారాగమణులతో నిర్మింపబడింది. శోభనార్హమైన త్రికోటిరత్న మందిరములతో శోభిస్తోంది. (33) అందమైన శతకోటి కుంజ కుటీరములతో వెలుగుతోంది. రాస (క్రీడ) ముగల వృందావనమును చూచి, ఆతడు కొంత దూరం వెళ్ళాడు. (34)

మూ దదర్శ పురతో రమ్యం నందవ్రజమనుత్తమం

పరం వైకుంఠసంకాశం వైకుంఠనిలయం శుభం

రత్నసోపాన సంయుక్తం రత్నస్తంభైర్విరాజితం

నానా చిత్ర విచిత్రాఢ్యం సద్రత్న వలయాన్వితం

ఖచితం మణిసారేణ రచితం విశ్వకర్మణా

ద్వారి దృష్టేన మార్గేణ రాజద్వారం వివేశ సః

పతాకారత్నజాలాఢ్యం ముక్తామాణిక్యభూషితం

రత్నదర్పణ శోభాడ్యం రత్నచిత్రవిచిత్రితం

రత్నవీధీ విరచితం మంగలం మంగలైర్ఘటైః

అక్రూరాగమనం శ్రుత్వా సాహ్లాదో నంద ఏవచ

సహితో రామకృష్ణాభ్యాం జగామానువ్రజాయవై

వృషభాన్వాదిభిర్యుక్తః కృత్వా వేశ్యాం పురః సరాం

పూర్ణకుంభం గజేంద్రంచ కృత్వాగ్రే శుక్ల ధాన్యకం

కృష్ణాం గాం మధుపర్కంచ పాద్యం రత్నాసనాదికం

గృహీత్వానోదరః శాంతః సస్మితో వినతస్తథా

ఆనందయుక్తో నందశ్చ సగణః జహబాలకః

దృష్ట్వాఽక్రూరం మహాభాగం తూర్ణమాలింగనం దదౌ

ప్రణీము: శిరసా సర్వే గోపా జగృహరాశిషం

పరస్పరంచ సంయోగో బభూవ గుణవాన్మునే

క్రోడే చకారాక్రూరశ్చ కృష్ణం రామం క్రమేణచ

చుచుంబ గండయుగలే పులకాంచితవిగ్రహః

సాశ్రునేత్రోఽతిసాహ్లాదః కృతార్థః సిద్ధవాంఛితః

దదర్శ కృష్ణం ద్విభుజం క్షణం శ్యామలసుందరం

పీతవస్త్ర పరీధానం మాలతీమాల్యభూషితం

చందనోక్షిత సర్వాంగం పరం వంశీధరం వరం

స్తుతం బ్రహ్మేశ శేషాద్యైః మునీంద్రైః సనకాదిభిః

వీక్షితం గోపకన్యాభిః పరిపూర్ణతమం విభుం

క్షణం దదర్శ క్రోడస్థం సస్మితంచ చతుర్భుజం

లక్ష్మీసరస్వతీయుక్తం వనమాలా విభూషితం

సునందనందకుముదైః పార్షదైః పరి సేవితం

సేవితం సిద్ధసంఘైశ్చ భక్తీ నమ్రైః పరాత్పరం

క్షణం దదర్శ దేవం తం పంచవక్త్రం త్రిలోచనం

శుద్ధ స్ఫటికసంకాశం నాగరాజ విరాజితం

దొంగబరం పరబ్రహ్మ భస్మాంగంచ జటాయుతం

జపమాలాకరం ధ్యాన నిష్ఠం శ్రేష్టంచ యోగినాం

క్షణంచతుర్ముఖం ధ్యాననిష్ఠం శ్రేష్ఠం మనీషిణాం

క్షణం ధర్మస్వరూపంచ వేషరూపం క్షణం క్షణం

క్షణం భాస్కరరూపంచ జ్యోతీరూపం సనాతనం

క్షణం పరమశోభాడ్యం కోటికందర్పనిందితం

కామినీ కమనీయంచ కాముకం కామసంయుతం

ఏవం భూతం శిశుం దృష్ట్యా స్థాపయామాస వక్షసి

ఎదురుగా రమ్యమైన పరమైన, వైకుంఠముతో సమానమైన, శుభమైన వైకుంఠునకు నిలయమైన, ఉత్తమమైన నందవ్రజమును చూశాడు. (35) రత్నపు మెట్లు గలది, రత్నస్తంభములతో వెలుగుతోంది, రకరకాలైన విచిత్రములైన చిత్రములు కలది, మంచిరత్నవలయములు కలది, (36) సారమైన మణులు పొదగబడింది, విశ్వకర్మ రచించింది, ఐన ద్వారమందు కన్పించిన మార్గం గుండా ఆతడు రాజద్వారాన్ని ప్రవేశించాడు. (37) పతాకముల రత్నజాలములు కలది, ముత్యములు మాణిక్యములతో అలంకరించబడింది, రత్నదర్పణముల శోభగలది, రత్న చిత్రములతో చిత్రించబడింది. (38) రత్నములతో వీధులు చేయబడింది, మంగళకరమైన ఘటములతో కూడింది, మంగళమైనది ఆ ప్రదేశము. అక్రూరుడు వచ్చాడని తెలిసి, నందుడు ఆనందపడి, రామకృష్ణులతో కలిసి ఆతనిని అనుసరించటానికై వెళ్ళాడు. (39) వృషభములను, విద్యావంతులను వెంట తీసుకొని, వేశ్యలను ముందుంచుకొని, పూర్ణకుంభము, గజశ్రేష్ఠము తెల్లని ధాన్యము ముందుంచుకొని (40) నల్లని ఆవును, మధుపర్కము, పాద్యము రత్న ఆసనాదులు వెంట తీసుకొని, ఆదరంతో, శాంతుడై, చిరునవ్వుతో అట్లాగే వినతుడై వెళ్ళాడు (41) ఆనందంతో నందుడు, తనవాళ్ళ సమూహంతో, పిల్లతోకూడి, వెళ్ళి, మహాభాగుడైన అక్రూరుని చూచి, త్వరగా కౌగిలించుకున్నాడు. (42) గోపకులందరు శిరస్సువంచి నమస్కరించారు. ఆశీస్సులు స్వీకరించారు. ఓముని! గుణవంతుడ ! వారికి పరస్పరము సంయోగమైంది. (43) కృష్ణుని, రాముని వరుసగా అక్రూరుడు తన వక్షం పై ఉంచుకున్నాడు. పులకంతో శరీరం నిండిపోగా వారి రెండు చెక్కిళ్ళను ముద్దాడాడు. (44) కళ్ళలో ఆనందబాష్పాలు నిండగా, మిక్కిలి ఆనందించినవాడై, కృతార్థుడై సిద్ధించిన కోరికగలవాడై, రెండు చేతులు గల, శ్యామలవర్ణంలో సుందరుడైన కృష్ణుని క్షణకాలము చూచాడు. (45) పీతవస్త్రాన్ని ధరించాడు, మాలతీమాలతో అలంకరింపబడ్డాడు. ఒంటి నిండా చందనం పూసుకున్నాడు, పరుడు, వంశీధరుడు, వరుడు. (46) బ్రహ్మ ఈశశేషాదులు ఆతనిని స్తుతిస్తారు. సనకాదిమునులతో స్తుతించబడేవాడు. గోపకన్యలతో చూడబడుతున్నాడు. పరిపూర్ణతముడు విభువు. (47) ఆలాటివానిని, తన వక్షమందున్నవానికి, చిరునవ్వు నవ్వుతున్న, నాలుగు చేతులుగల, కృష్ణుని క్షణకాలము చూచాడు. లక్ష్మీసరస్వతులు తోడున్నారు, వనమాలతో అలంకరింపబడ్డాడు. (48) ప్రక్కలో సునంద, నంద, కుముదులు సేవిస్తున్నారు. భక్తితో నమ్రులై సిద్ధుల సంఘములు, ఆపరాత్పరుని సేవిస్తున్నారు. (49) ఐదుముఖములుగల, త్రిలోచనునిగా, ఆ దేవుని క్షణకాలం చూచాడు. శుద్దస్పటికం వలె తెల్లగా ఉన్నాడు. నాగరాజు మెడలో వెలుగుతున్నాడు. (50) దిగంబరుడు, పరబ్రహ్మ భస్మాంగుడు, జడలుగలవాడుగా చూచాడు. చేతిలో జపమాల ఉంది, ధ్యాన నిష్ఠతో ఉన్నాడు. యోగులకు శ్రేష్ఠుడు ఆతడు. (51) మనీషులకు శ్రేష్ఠుడైన, ధ్యాననిష్టుడైన చతుర్ముఖునిగా ఆతనిని చూచాడు. క్షణకాలము ధర్మస్వరూపునిగా, మరుక్షణంలో శేషరూపునిగా (52) క్షణకాలము సూర్యునిలా, నటించిన ప్రపంచ తెలుగు తుది నుంచి అందిసనాతనుడైన జ్యోతిరూపునిగా చూచాడు. క్షణకాలము పరమశోభకలవానిగా కోటికందర్పులను తిరస్కరించే వానిగా చూచాడు. (53) కామినులకు కమనీయుడు, కాముకుడు, కామంగలవాడు, ఇట్లా ఉన్న (ఐన) శిశువును చూసి వక్షమందుంచుకున్నాడు.

మూII రత్నసింహాసనే రమ్యేనంద దత్తేచ నారద

కృత్వా ప్రదక్షిణం భక్త్యా పులకాంచిత విగ్రహః

ప్రణమ్య శిరసా భూమౌ తుష్టావ పురుషోత్తమం

అక్రూర ఉవాచ:

నమఃకారణరూపాయ పరమాత్మ స్వరూపిణే

సర్వేషామపి విశ్వానాం ఈశ్వరాయ నమో నమః

పరాయ ప్రకృతేరీశ పరాత్పరతరాయచ

నిర్గుణాయ నిరీహాయ నీరూపాయ స్వరూపిణే

సర్వదేవస్వరూపాయ సర్వదేవైశ్వరాయచ

సర్వదేవాధిదేవాయ విశ్వాదిభూతరూపిణే

అసంఖ్యేషు చ విశ్వేషు బ్రహ్మ విష్ణు శివాత్మక

స్వరూపాయాదిబీజాయ తదీశ విశ్వరూపిణే

నమో గోపాంగనేశాయ గణేశేశ్వర రూపిణే

నమః సురగణేశాయ రాధేశాయ నమోనమః

రాధారమణరూపాయ రాధారూపధరాయచ

రాధారాధ్యాయ రాధాయాః ప్రాణాధికతరాయచ

రాధాసాధ్యాయ రాధాధిదేవప్రియతమాయచ

రాధాప్రాణాధిదేవాయ విశ్వరూపాయ తే నమః

వేదస్తుతాత్మ వేదజ్ఞరూపిణే వేదినే నమః

వేదాధిష్ఠాతృదేవాయ వేదబీజాయ తే నమః

యస్య లోమసు విశ్వాని చాసంఖ్యానిచ నిత్యశః

మహద్విష్ణోరీశ్వరాయ విశ్వేశాయనమో నమః

స్వయం ప్రకృతి రూపాయ ప్రాకృతాయ నమో నమః

ప్రకృతీశ్వర రూపాయ ప్రధాన పురుషాయచ

ఇత్యేవం స్తవనం కృత్వా మూర్చామా పసభాత లే

పపాత సహసా భూమౌ పునరీశం దదర్శ సః

బహిఃస్థం హృదయస్థంచ పరమాత్మానమీశ్వరం

పరితః శ్యామరూపంచ విశ్వస్థం విశ్వమేవచ

అక్రూరం మూర్ఛితం దృష్ట్వా నందః సాదరపూర్వకం

రత్న సింహాసనే రమ్యే వాసయామాస నారద

పప్రచ్ఛ, సర్వంవృత్తాంతం కింస్విద్దృష్టమితి త్వయా

మిష్టాన్నం భోజయామాస కుశలంచ పునః పునః

అక్రూర: కథయామాస కంసవృత్తాంతమీప్సితం

ఓ నారద! నందుడు చూపిన రమ్యమైన రత్న సింహాసనమందు కూర్చొని, భక్తితో ప్రదక్షిణం చేసి, శరీరమంతా పులకరించగా, శిరసు భూమి పై ఉంచి నమస్కరించి పురుషోత్తముని స్తుతించాడు. (55) అక్రూరుని వచనమిట్లా: కారణరూపునకు నమస్కారము, పరమాత్మస్వరూపునకు నమస్కారము. (56) విశ్వములన్నింటికి ఈశ్వరుడైన వానికి నమస్కారము. పరునకు, ప్రకృతికి ఈశుడైన పరుని కన్న పరతరుడైన వానికి నమస్కారము (57) నిర్గుణునకు, నిరీహునకు, నీరూపునకు (రూపంలేని) రూపంకలవానికి, సర్వదేవతల స్వరూపునకు, సర్వదేవులకు ఈశ్వరుడైన వానికి (58) సర్వమైన విశ్వములలో బ్రహ్మ విష్ణు శివాత్మకుడైనవాడ(నికి) (59) స్వరూపునకు, ఆది బీజమునకు, వానికి ఈశుడైన విశ్వరూపునకు నమస్కారము. గోపాంగనలకు ఈశుడైన వానికి నమస్సులు. గణేశ ఈశ్వరరూపునకు నమః (60) సురగణేశునకు నమస్కారము. రాధేశునకు నమస్సులు. రాధారమణరూపునకు, రాధా రూపధరునకు నమస్కారము. (61) రాధతో ఆరాధింపబడేవానికి, రాధకు ప్రాణముకన్న అధికమైన వానికి నమస్కారము. రాధచే సాధింపబడేవానికి, రాధ అధిదేవునకు ప్రియతముడైన వానికిని నమస్కారము. (62) రాధా ప్రాణమునకు అధి దేవుడైన వానికి, విశ్వరూపుడవైన వానికి నీకు నమస్కారము. వేదములచే స్తుతించబడ్డ, ఆత్మ వేదమెరిగిన (వేద) స్వరూపుడవైన, తెలిసిన నీకు నమస్కారము (63) వేదములకు అధిష్ఠాతృ దేవునకు వేదబీజునకు, నీకు నమస్కారము. ఎవని రోమములందు, అసంఖ్యాకములైన విశ్వములు, ఎల్లప్పుడుంటాయో (అట్టినీకు) నమస్కారము. (64) మహద్విష్ణువునకు ఈశ్వరుడైనవానికి విశ్వేశునకు నమస్సులు. స్వయంగా ప్రకృతి రూపుడైన వానికి, ప్రాకృతునకు నమస్కారము. (65) ప్రకృతి ఈశ్వర రూపునకు ప్రధానపురుషునకు నమస్కారము. ఈవిధముగా స్తుతించి సభాస్థలమందు మార్ఛనందినాడు. (66) త్వరగా భూమిపై పడ్డాడు. తిరిగి ఈశుణ్ణి ఆతడు చూచాడు. బయట ఉన్నవానిగా హృదయమందున్న వానిగా పరమాత్మను, ఈశ్వరుని చూచాడు. (67) అంతటా ఉన్నవానిగా, శ్యామలరూపునిగా, విశ్వమందున్నవానిగా, విశ్వరూపుడైన వానిగా చూచాడు. మూర్ఛితుడైన అక్రూరుని చూచి, నందుడు ఆదరపూర్వకముగా (68) ఓ నారద! రమ్యమైన రత్నసింహాసనమందు కూర్చోబెట్టాడు. నీవు ఏమి చూచావు అని వృత్తాంతమంతా అడిగాడు. (69) మాటిమాటికి కుశలమడుగుతూ, మధుర ఆహారాన్ని భుజింపజేశాడు. ఇష్టమైన కంస వృత్తాంతమును అక్రూరుడు చెప్పసాగాడు. (70)

మూ స్వప్రితో: మోక్షణార్థంచ గమనం రామకృష్ణయోః

ఇత్యక్రూరకృతం స్తోత్రం యః పఠేత్సుసమాహితః

అపుత్రో లభతే పుత్రమభార్యో లభతే ప్రియాం

అధనో ధనమాప్నోతి నిర్భూమిరుర్వరాం మహీం

హతః ప్రజః ప్రజాలాభం ప్రతిష్ఠించాప్రతిష్ఠితః

యశః ప్రాప్నోతి విపులమయశస్వీ చలీలయా

అథ సుష్వాప సమయే పరం సంహృష్టమానసః

రమ్యే చంపకతల్వేచ కృష్ణం కృత్వా స్వవక్షసి

 ప్రాతరుత్థాయ సహసా కృత్వాహ్నిక మనుత్తమం

స్వరధే స్థాపయామాస రామంకృష్ణం జగత్పతిం

గవ్యం పంచప్రకారంచ నానాద్రవ్యం సుదుర్లభం

వృషభానుంచ నందంచ సునందం చంద్ర భానకం

నానా ప్రకారం వాద్యంచ మృదంగమురజాదికం

పటహం పణ వంచైవ ఢక్కాం దుందుభిమానకం

సజ్జాంసన్నహనీం కాంస్య పట్ట మర్దలమండవీం

వాదయామాస సానందం నందగోపోవ్రజేశ్వరః

శ్రుత్వా వాద్యంచ గోప్యశ్చ గమనం రామకృష్ణయోః

దృష్ట్వా కృష్ణం రథస్థం తమాయయుః కోపపీడితాః

కృష్ణేన వారితాః సర్వాః ప్రేరితా రాధయా ద్విజ

బభంజురీశ్వరరథం పాదాఘాతేన లీలయా

తత్ర సర్వేషు గోపేషు హాహాకారం కృతేషుచ

ప్రయయుః బలవత్యశ్చ కృష్ణం కృత్వా స్వవక్షసి

కాచిత్ క్రూరం తమక్రూరం భర్త్సయామాస కోపతః

కాచిద్బద్ధ్వాచ వస్త్రేణ చాక్రూరం ప్రయయుస్తతః

కాచిత్తం తాడయామాస కంకణేన కరేణచ

తద్వస్త్రం హారయామాస కృత్వావివసనంమునే

క్షతవిక్షత సర్వాంగం దృష్ట్వాక్రూరంచ మాధవః

జగామ రాధానికటం బోధయామాస తాం పునః

ఆధ్యాత్మికేన యోగేన వినయేనచ సాదరం

అక్రూరం బోధయామాసబోధయామాస తాం విభుః

ఆకాశాత్పతితం దివ్యం మంత్రప్రస్థాపితం రథం

విచిత్ర వస్తు సంయుక్తం దదర్శ పురతో హరిః

ఖచితం మణిరాజేన రచితం విశ్వకర్మణా

తం దృష్ట్వా మాతృభవన మాజగామ జగత్పతిః

భూక్త్యా పీత్వా సుఖం సుప్త్వా భగవాన్ సహబాంధవైః

తస్థౌ మునీంద్ర దేవేంద్ర బ్రహ్మేశశేషవందితః

సుషుపు: గోపికాఃసర్వాః పరం సంహృష్టమానసాః

పుష్పతల్పే చ రమ్యేచ రాధయా సహ నారద

సర్వేచానందయుక్తాశ్చ జనా గోకులవాసినః

కేచిద్గోపాశ్చ ననృతు: కేచిత్సంగీత తత్పరాః

ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే గోపీ విషయోనామ సప్తతితమోఽధ్యాయః

తన తలిదండ్రులను విడిపించటానికి రామకృష్ణులు వెళ్ళాలి అని అక్రూరుడు చేసిన స్తోత్రమును సావధానంగా చదివినవారు (71) పుత్రులేనివారు పుత్రుని పొందుతారు, భార్యలేనివాడు భార్యను పొందుతాడు, ధనహీనుడు ధనాన్ని పొందుతాడు. భూమిలేనివాడు, అన్ని పాడిపంటలతో కూడిన భూమిని పొందుతాడు (72) సంతానం చనిపోయిన వాడు సంతాన లాభమును పొందుతాడు, ప్రతిష్ఠలేనివాడు ప్రతిష్ఠను పొందుతాడు కీర్తిలేనివాడు అవలీలగా విస్తారంగా కీర్తిని పొందుతాడు. (73) మిక్కిలి ఆనందించిన మనస్సుగలవాడై, అందమైన చంపకతల్పమందు కృష్ణుని తన వక్షమందుంచుకొని, సకాలమునకు నిద్రించాడు. (74) ప్రొద్దున్నే లేచి త్వరగా ఉత్తమమైన ఆహ్నికమును నిర్వర్తించి జగత్పతిమైన రాముని కృష్ణుని తన రథమందుంచుకున్నాడు. (75) ఐదురకాలైన గోసంబంధ వస్తువులను (పాలు వగైరా), వృషభానువు గల (కాంతి) నందమును సునందమును, చంద్రభానువుగల దానిని (76) రకరకాల వాద్యములు మృదంగము, మురజ మొదలగువానిని, పటహ, పణవ ఢక్క, దుందుభి, ఆనకములను, (77) సజ్జ, సన్నహని, కంచు పట్టగల మర్దలమాండవిని, ప్రజేశ్వరుడైన నందగోపుడు, ఆనందంతో వాయించసాగాడు. (78) గోపికలు వాద్యమువిని రామకృష్ణులు వెళ్తున్నారని తెలిసి, కృష్ణుడు రథం పై కూర్చోవటం చూచి, కోపపీడితులై ఆతని దగ్గరకొచ్చారు. (79) కృష్ణుడు వారి నందరిని వారిస్తున్నా రాధతో ప్రేరేపింపబడి, ఓ ద్విజ! తమ పాదఘాతములతో (తన్నుట) అవలీలగా ఈశ్వరుని రథాన్ని విరగగొట్టారు. (80) అక్కడున్న గోపకులంతా హాహాకారం చేశారు. బలవంతులైన స్త్రీలు కృష్ణుని తమ వక్షమందుంచుకొని వెళ్ళిపోయారు. (81) ఒకతే కోపంతో క్రూరంగా ఆ అక్రూరుని భయ పెట్టసాగింది. కొందరు వస్త్రంతో అక్రూరుని బంధించి అక్కడినుంచి వెళ్ళిపోయారు. (82) ఒకతే కంకణముగల కరముతో అక్రూరుని కొట్టసాగింది. ఓ ముని! ఆతని వస్త్రాన్నిహరించి వివస్తు చేయసాగింది. (83) దెబ్బలతో గాయపడ్డ సర్వావయవములుగల అక్రూరుని చూచి మాధవుడు, రాధ దగ్గరకు వెళ్ళి తిరిగి ఆమెకు బోధచేయసాగాడు. (84) సాదరంగా వినయంతో ఆధ్యాత్మిక యోగంతో అక్రూరుని మేల్కొలిపాడు. విభువు ఆమెను మేల్కొలిపాడు. (85) ఆకాశమునుండి వచ్చిన, దివ్యమైన, మంత్రముతో బయలుదేరిన రథమును, విచిత్ర వస్త్ర ములుకల దానిని, హరి ఎదురుగా చూచాడు. (86) విశ్వకర్మ నిర్మించిన మణిశ్రేష్ఠములు తాపింపబడిన దానిని చూచి జగత్పతి మాతృభవనమునకు వచ్చాడు. (87) తిని, తాగి, సుఖంగా నిద్రపోయి భగవంతుడు బాంధవులతో కూడా, మునీంద్ర, దేవేంద్ర బ్రహ్మేశ, శేషులతో నమస్కరింపడి ఉన్నాడు. (88) మిక్కిలి ఆనందించిన మనస్సుగలవారై గోపికలంతా నిద్రపోయారు. ఓ నారద! పుష్పముల పడక పై అందమైన దాని పై రాధతో సహానిద్రించాడు. (89) గోకులమందున్న జనులంతా ఆనందించినవారై, కొందరు గోపులు నాట్యం చేశారు. కొందరు సంగీత తత్పరులై (పాటలు) పాడినారు. (90) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు గోపీ విషయ మనునది డెబ్బదవ అధ్యాయము (70).