బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

127 - అధ్యాయము

మూ శ్రీనారాయణ ఉవాచ :

శ్రీకృష్ణ వచనం శ్రుత్వా ప్రహృష్టా గోపికాముదా

మందిరం ప్రయయుః సర్వాః ప్రణమ్య రాధికాం ప్రభుం

రాధా శృంగార భావంచ కళాషోడశపూర్వకం

చకారసస్మితా సాధ్వీ వక్రచంచల లోచనా

దత్వాచ చందనం మాల్యం స్వామినే పునరేవచ

రహస్యంచ పరీహాస్యం పునరేవ చకారసః

ఆకృష్య రాధికాం కృష్ణః సనీయ స్వవక్షసి

ఓష్ఠాధరం కపోలంచ గండయుగ్మంచుచుంబచ

 రాధాచుచుంబకృష్ణస్య ముఖచంద్రం మనోహరం

చకార కృష్ణం ప్రాణేశం బాహుభ్యాంచ స్వవక్షసి

శృంగారం షోడశవిధం కామశాస్త్రోక్త మీప్సితం

స్త్రీ పుంసోస్తోష జనకం చకార భగవాన్బ్రభుః

నఖవిక్షిత సర్వాంగాదశనేనాథ దక్షతా

 పులకాంచిత దేహానే తంద్రిసా వామనస్తనీ

మూర్ఛితాసుఖసంభోగాద్విలగ్నా హతచేతసా

శ్వాసమాత్రావశేషాచ నిద్రాముద్రితలోచనా

రతిశూరాకోమలాంగీ కాంతవక్షస్థలస్థితా

శీతేసుఖోష్ణ సర్వాంగీ గ్రీష్మేసాసుఖశీతలా

శృంగారకాలేసుఖదా సాంద్రశ్రోణిపయోధరా

నితంబభారానమ్రాచ ప్రసంగేసుఖదాయికా

విదగ్ధారసికాశ్రేష్టా కాముకీచ వరాంగనా

సహసాచేతనం ప్రాప్యశుశ్రావ కోకిలధ్వనిం

శ్రుత్వాపరమభీతా సాదీనా దీన విశంకయా

ఉవాచ పరమాసాచ పరమేశం పరాత్పరం

బాహుశ్రోణియుగాభ్యాంచ నిబధ్యచ పునః పునః

రాధికోవాచ :

రాసంగచ్ఛమహాభాగ పుణ్యం వృందావనం వనం

తత్రక్రీడాం కరిష్యామి జలేనచస్థలేనచ

పునర్యాస్యామి మలయంసుందరం మణిమందిరం

అపరంయద్రహస్యం.జన్మనా నశ్రుతం మయా

తత్రయామిత్వయాసార్ధం ఇతిమే లాలసాపరా

పరస్పరైకాలాపేన ప్రయయౌరజనీ శుభా

 అరుణోదయకాలేఽపి నత్యజేన్మాధవంసతీ

మాధవః ప్రీతివచసా బోధయామాససాధనాత్

 ప్రాతః కృత్యంతతః కృత్వాస్వారురోహరథం హరిః

గోపీభీరాధయాసార్థం శరత్కమలలోచనః

యోజనాయతవిస్తీర్ణం గృహై స్త్రీశతకోటిభిః

మణీంద్రసారనిర్మాణైః జ్వలద్భిరుపశోభితం

గోలోకాదాగతం తత్ర మనోయామి మనోహరం

సహస్ర చక్రసంయుక్తం సహస్రాశ్వైః ప్రచాలితం

మణిస్తంభైః త్రికోటీభీరత్న రాజివిరాజితం

 ముక్తి మాణిక్యపరమైః హీరహారై: సుశోభితం

నానాచితైర్విచితైశ్చ శ్వేతచామరదర్పణైః

వహ్నిశుద్ధాంశుకైర్దీపైః మాలాజాలైర్విభూషితం

రత్ననిర్మాణతలైశ్చ పుష్ప చందన చర్చితం

సమానరూపవేషైశ్చ గోపీలక్షైః సమావృతం

నారాయణుడిట్లా - శ్రీకృష్ణుని మాటను విని చాలా ఆనందించి సంతోషంతో గోపికలు రాధికకు, ప్రభువునకు నమస్కరించి అందరు మందిరానికి వెళ్ళారు. (1) రాధ తన శృంగార భావాన్ని షోడశ కళల పూర్వకముగా చేసుకొన్నది. ఆసాధ్వి, చిరునవ్వు నవ్వుతూ, పంకజముల వంటి కళ్ళను వంకరగా తిప్పుతూ (2) స్వామికి చందనము మాలలు మాటిమాటికి ఇస్తూ ఉంది. ఆతడు రహస్యమైన పరిహాసమును మళ్ళీమళ్ళీ చేశాడు. (3) కృష్ణుడు రాధికను లాగి తన రొమ్ముపైకి తీసుకొని పెదవులు, చెక్కిళ్ళు దవడలు వీటిని ముద్దాడాడు. (4) రాధ, మనోహరమైన కృష్ణుని ముఖచంద్రాన్ని ముద్దాడింది. తన ప్రాణేశుడైన కృష్ణుని తన రొమ్ముపైకి చేతులతో లాగింది. (5) కామశాస్త్రములో చెప్పబడ్డ, కోరతగిన శృంగారము పదహారు విధాలు. స్త్రీ పురుషులకు ఆనందాన్నిచ్చేది. దాన్ని భగవాన్ ప్రభువు చేశాడు. (6) ఒంటినిండా గోళ్ళతో గిల్లాడు ఆమెను, పళ్ళతో ఆమె కింది పెదవిని ముద్దాడాడు, కొరికాడు. ఆమె శరీరమంతా పులకాంకురాలతో నిండింది. ఆమె రొమ్మలు చిన్నగా లేదా వంగి ఉన్నాయి. నిద్రమత్తులో ఉందామె. (7) సుఖసంభోగము వల్ల మూర్ఛపోయింది. మునిగిపోయింది. చైతన్యం కోల్పోయింది. శ్వాసమాత్రం మిగిలి ఉంది. లోచనములు నిద్రతో ముద్రించబడ్డాయి. (మూసుకుంది) (8) రతియందు శూరురాలు, కోమలమైన అవయవములు కలది, కాంతుని వక్షఃస్థలమందు ఉంది. శీతసమయంలో సుఖముతో ఆమె శరీరమంతా వేడెక్కింది. వేడిమిలో ఆమె సుఖం వల్ల చల్లగా ఉంది. (9) శృంగార కాలమందు సుఖాన్నిచ్చేది. చక్కని (దట్టమైన) కటిభాగము, రొమ్ముల భాగముకలది. పిరుదుల భారముతో కొంచం వంగింది. ప్రసంగంలో సుఖాన్నిచ్చేది. (10) తెలివికలది, రసికురాలు, శ్రేష్ఠురాలు, కాముకి, కోరతగిన స్త్రీ. త్వరగా చైతన్యాన్ని పొంది కోకిల ధ్వనిని విన్నది. (11) విని చాలా భయపడ్డది. ఆ దీనురాలు, నాశం కలుగుతుందనే అనుమానంతో, ఆ పరమురాలు, పరాత్పరుడైన పరమేశునితో ఇట్లా అంది. చేతులు, కటి భాగములతో మాటిమాటికి ఆతనిని బంధిస్తూ అన్నది. (12) రాధిక ఇట్లా - ఓమహాభాగ రాసక్షేత్రమునకు పుణ్యమైన బృందావన వనానికి వెళ్ళు. అక్కడ నీళ్ళలో, భూభాగంలో క్రీడిద్దాము. (13) తిరిగి సుందరమైన మణులతో చేసిన మందిరమునకు మలయమునకు వెళ్తాము. ఇంకా ఏదైనా రహస్యము పుట్టిన నాటినుండి నేను విననిది చెప్పుదువుగాని. (14) నీతో పాటు అక్కడికి వెళ్ళుదాము, అని ఇదినా మిక్కిలి కోరిక. పరస్పరము ఒకరికొకరు మాట్లాడటంతో శుభమైన రాత్రి గడిచిపోయింది. (15) అరుణోదయ కాలమందు కూడా, మాధవుడిని ఆసతి వదలలేదు. మాధవుడు తీయని మాటలతో సాధనం నుండి మేల్కొలిపాడు. (16) ప్రాతఃకాలకృత్యాన్ని ఆ పిదప చేసుకొని తన రథాన్ని హరి ఎక్కాడు. గోపికలతో రాధతో కూడా ఆశరత్కాల మందలి కమలముల వంటి కన్నులుగల కృష్ణుడు రథమెక్కాడు. (17) ఎన్నో యోజనములతో విశాలమై విస్తృతమైనది, మూడువందల కోట్ల గృహములు కలది. వజ్రములలోని శ్రేష్ఠమైన వానితో నిర్మింపబడి వెలిగిపోతున్నవి, వానితో శోభిస్తున్నది. (18) అక్కడికి (బృందకు) మనోహరమైన చోటికి మనోవేగంతో పోగల ఆతడు గోలోకం నుండి వచ్చాడు. వేయి చక్రములతో కూడినది, వేయి గుఱ్ఱములు దానిని కదిలిస్తున్నాయి. (19) మూడుకోట్ల మణిస్తంభములతో రత్నముల కాంతితో ప్రకాశిస్తోందది. ముత్యములు మాణిక్యములు, శ్రేష్ఠమైన వజ్రముల హారములతో చక్కగా శోభిస్తోంది. (20) రకరకాల చిత్రములతో విచిత్రములతో, తెల్లని చామరములు, అద్దములతో, వహ్నితో శుద్ధిచేయబడిన వస్త్రములతో, వెలుగుతున్న మాలల సమూహముతో అలంకరించబడ్డది. (21) రత్నములతో చేసిన పడకలు, వాటిపై పూలు చందనము చల్లారు. సమాన రూపము, వేషములు కల, లక్ష గోపికలు అక్కడ ఉన్నారు.

మూ రథేన తేన భగవాన్ పునర్బృందావనం యయౌ

తత్రగత్వానిశాకాలే విజహారజలే స్థలే

శృంగారం సుచిరంకృత్వా వనేషూపవనేషుచ

రాధికాందర్శయామాస యథాసర్వంచ నూతనం

విస్పందకే సురసనే మహేంద్ర నందనేవనే

సుమేరుశిఖరే రమ్యే పర్వతే గంధమాదనే

శైలేశైలే సుందరేచ కందరే కందరే వనే

పుష్పోద్యానే సురహసినద్యాంనద్యాం నదేనదే

సముద్రపులినే రమ్యేపారిజాతవనే వనే

సుభద్రపుష్పభద్రేచనారాయణ సరోవరే

పవన స్యైవ నిలయేమలయేచ సురాలయే

త్రికూటే భద్రకూటేచ పంచకూటే సకూటకే

దేవానాంకమనీయాయాం కొంచవ్యాంచతథైవచ

సముద్రేచ సముద్రేచ ద్వీ పేద్వీపే మనోహరే

ఖర్వటే ప్రవరే రమ్యేపుణ్యచంద్ర సరోవరే

సుపార్శ్వేమునిపార్శ్వేచ సరేమేరామయాసహ

 శీఘ్రంచ పునరాగత్య జంబూద్వీపంచ పుణ్యదం

 ద్వారకాందర్శయామాస పర్వతం రైవతం తథా

 గోకులంపునరాగత్య గోపగోకుల సంకులం

తత్రదృష్ట్వాచ భాండీరం పుణ్యం బృందావనం యయౌ

శ్రీకృష్ణా గమనం శ్రుత్వా యశోదానంద ఏవచ

గోపీగోప్యశ్చ వృద్ధాశ్చాప్యశ్రనేత్రా నిరాకులాః

వారణేంద్రం పురస్కృత్య వేశ్యాంచ నటనర్తకాః

 పతిపుత్రవతీం సాధ్వీం బ్రాహ్మణీం బ్రాహ్మణం తథా

యథాదేవాశ్చ వహ్నించ దృష్ట్వానందంచ మాతరం

ఆయుయుఃబాలకృష్ణశ్చ రాధయాసహమాధవః

మాతుఃక్రోడ మారురోహప్రహస్య మధుసూదనః

నందం యశోదయా సార్థం చుచుంబముఖపంకజం

ఆశ్లేష్యభృశముచ్చైశ్చ నిషేచనేత్రజైర్జలైః

స్వయంచ భగవాన్ కృష్ణయశోదాయాస్తనంపపౌ

తాదృశం దదృశుః సర్వేయాదృశోమధురాం యయౌ

మురలీహస్త విన్యస్తం రత్నభూషణభూషితం

యథైకాదశవర్షయం శోభితం పీతవాససా

 మయూరపిచ్ఛచూడంచ మాలతీ మాల్యమండితం

మందిరం వేశయామాస రాధయాసహ మాధవం

యశోదామంగళం కృత్వాభోజయామాస బ్రాహ్మణాన్

పూజాంచకార గోపీనాం మునీనాంచ యథాజనః

మణిరత్నం ప్రవాళంచ సువర్ణం పరమంతథా

ముక్తామాణిక్య హీరంచ బ్రాహ్మణేభ్యోదదౌముదా

గజరత్నం గవాంరత్నం అశ్వరత్నం మనోహరం

ఆసనానిచ పాత్రాణి భూషణాని తథైవచ

ధాన్యాన్యపీచసస్యాని వస్త్రాణిచ తథాదదౌ

అపూర్వం దర్శయామాస రాధయా సహమాధవం

 గోపీగణంచ మిష్టాన్నం సాదరేణాపినారద

దుందుభీన్వాదయామాస కారయామాస మంగళం

దేవాంశ్చ భోజయామాస సానందంచ మనోహరం

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ నారాయణ నారద సంవాదే సప్తవింశత్యధిక శతతమోఽధ్యాయః

ఆ రథంలో భగవంతుడు తిరిగి బృందావనానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి రాత్రిపూట జలములందు, భూప్రదేశమందు విహరించాడు. (23) వనములందు, ఉపవనములందు చాలా సేపు శృంగారాన్ని చేసి రాధికకు అదంతా చూపించాడు. అంతా కొత్తఐనట్లు చూపాడు. (24) కదలికలేని విస్పందకమందు మంచివాసనగల (సురసన) మ హేంద్రమందు, నందనవనమందు, మేరుశిఖరమందు, రమ్యమైన గంధమాదన పర్వతమందు (25) ప్రతి పర్వతమందు, సుందరమైన ప్రతిగుహయందు, వనమందు, పుష్పోద్యానమందు మంచిరహస్య ప్రదేశమందు, ప్రతినదియందు (తూర్పునకు ప్రవహించేది)' ప్రతి నదమందు (పడమరకు ప్రవహించేది) (26) సముద్రపు ఇసుకయందు, రమ్యమైన ప్రతిపారిజాతవనమందు, సుభద్రయందు పుష్పభద్రయందు, నారాయణ సరోవరమందు (27) వాయువునకు నిలయమైన మలయపర్వతమందు, సురాలయమందు, త్రికూట, భద్రకూటములందు, పంచకూటమందు, కూటకముగలదాని యందు (శిఖరం) (28) దేవతలకు కమనీయమైన కాంచనియందు, ప్రతిసముద్రమందు, మనోహరమైన ప్రతిద్వీపమందు (29) శ్రేష్ఠమైన రమ్యమైన ఖర్వటమందు (కొండ సందుపల్లె) పుణ్యమైన చంద్రసరోవరమందు, సుపార్శ్వమందు, ముని పార్శ్వమందు ఆతడు రామతో కలిసి (స్త్రీ) రమించాడు. (అత్తి, మామిడి) (30) త్వరగా తిరిగి వచ్చాడు, పుణ్యమునిచ్చే జంబూద్వీపానికి వచ్చాడు. ద్వారకను చూపించాడు, రైవత పర్వతాన్ని చూపాడు. (31) గోపాలురు, గోపికలు, గోవులు వీనితో వ్యాకులమైన గోకులమునకు తిరిగి వచ్చి అక్కడ భాండీరమును చూచి (ముంజచెట్టు) పుణ్యమైన బృందావనానికి వెళ్ళాడు. (32) శ్రీకృష్ణుని రాకను విని యశోద, నందులు, గోపాలురు, గోపికలు వృద్ధులు, కంటనీరు పెట్టుకున్నారు. నిశ్చలంగా ఉన్నారు. (33) ఏనుగును ముందుంచుకొని వేశ్యలు, నటనర్తకులు పతిపుత్రులుగల సాధ్విని బ్రాహ్మణస్త్రీని బ్రాహ్మణుని వెంటనుంచుకొని వచ్చారు. (34) దేవతలు వహ్నిని ముందుంచుకొని వచ్చినట్టు వచ్చారు. నందుని, తల్లిని చూచి బాలకృష్ణుడు, రాధతో కూడా మాధవుడు వచ్చారు. (35) మధుసూదనుడు నవ్వి తల్లి రొమ్ము పై కూర్చున్నాడు యశోదతో పాటు నందుని ముఖపంకజమును ముద్దాడాడు. (36) కౌగిలించుకొని మిక్కిలి, పెద్దగా, కన్నీళ్ళతో తడిపాడు. స్వయంతా తాను భగవాన్ కృష్ణుడు యశోద పాలను తాగాడు. (37) మధుర కు పోయినప్పుడున్నటువంటి కృష్ణుని మళ్ళా అంతా ఇప్పుడు చూచారు. మురళి చేతియందుంది. రత్న అలంకారములు అలంకరించుకున్నాడు. (38) పదకొండేళ్ళపిల్లవాడిలా, పచ్చని వస్త్రంతో శోభిస్తున్నాడు. తలలో నెమిలి ఫించము ఉంది. మాలతీమాలతో అలంకరింపబడ్డాడు. (39) రాధతోకూడా మాధవుని మందిరంలోకి ప్రవేశ పెట్టారు. యశోదమంగళాన్ని చేసి బ్రాహ్మలకు భోజనం పెట్టింది. (40) గోపికలకు మునులకు, ఉన్న జనులకు పూజచేసింది. మణులు రత్నములు, పగడము, చాలా బంగారము (41) ముత్యములు మాణిక్యములు వజ్రములు, ఇవన్నీ బ్రాహ్మణులకు ఆనందంతో ఇచ్చింది. గజశ్రేష్ఠములను, శ్రేష్ఠగోవులను, మనోహరమైన శ్రేష్ఠ అశ్వములను ఇచ్చింది (42) ఆసనములు, పాత్రలు, ఆట్లాగే సొమ్ములు, ధాన్యములు, సస్యములు వస్త్రములు ఆట్లాగే ఇచ్చింది (గింజలు, వరి). (43) రాధతో మాధవుడిని ఇదివరలో ఎన్నడూ చూడనట్టు కొత్తగా చూచింది. ఓనారద! గోపికల సమూహానికి మధురమైన ఆహారాన్ని ఆదరంతో పెట్టింది. (44) దుందుభులనువాయింపచేసింది. మంగళకార్యం చేసింది. దేవతలను భుజింపచేసింది. ఆనందంగా మనోహరంగా ఉంది. (45) అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు నూట ఇరువది ఏడవ అధ్యాయము.