బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

62 - అధ్యాయము

మూనారద ఉవాచ:

బ్రహ్మన్ కేన ప్రకారేణ రామో దాశరథిః స్వయం

చకార మోక్షణం కుత్ర యుగే గౌతమ యోషితః

రామావతారం సుఖదం సమా సేన మనోహరం

కథయస్వ మహాభాగ శ్రోతుం కౌతూహలం మమ

శ్రీనారాయణ ఉవాచ:

బ్రహ్మణా ప్రార్థితో విష్ణుః జాతో దశరథాత్స్వయం

కౌసల్యాయాంచ భగవాన్ శ్రేతాయాంచ ముదాన్వితః

కైకేయ్యాం భరతశ్చైవ రామతుల్యో గుణేనచ

లక్ష్మణశ్చాపి శత్రుఘ్నః సుమిత్రాయాం గుణార్ణవః

విశ్వామిత్రప్రేషితశ్చ శ్రీరామశ్చ సలక్ష్మణః

ప్రయయౌ మిథిలాం రమ్యాం సీతా గ్రహణ హేతవే

దృష్ట్వా పాషాణ రూపాంచ రామోవర్త్మనికామినీం

విశ్వామిత్రంచ పప్రచ్ఛ కారణం జగదీశ్వరః

రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాతపాః

ఉవాచ తత్ర ధర్మిష్థో రహస్యం సర్వమే వచ

కారణం తన్ముఖాచ్ఛుత్వా రామో భువనపావనః

పస్పర్శ పాదాంగులినా సా బభూవచ పద్మినీ

సా రామాశిషం కృత్వా ప్రయయౌ భరృమందిరం

శుభాశిషం దదౌ తస్మై భార్యాం సంప్రాప్య గౌతమః

రామస్సమిథిలాం గత్వా ధనుర్భంగం శివస్యచ

చకార పాణిగ్రహణం సీతాయాశ్చైవ నారద

కృత్వా వివాహం రాజేంద్రో భృగుదర్పం నిహత్యచ

అయోధ్యాం ప్రయణా రమ్యాం క్రీడాకౌతుక మంగలః

రాజా పుత్రం నృపం కర్తుం ఇయేష కృతసాదరం

సప్తతీర్దోదకం తూర్ణం అనీయ మునిపుంగవాన్

కృతాధివాసం శ్రీరామం సర్వమంగల సంయుతం

దృష్ట్వా భరతమాతాచ కైకేయీ శోకవిహ్వలా

వరయామాస రాజానం పూర్వమంగీకృతం వరం

రామస్య వనవాసంచ రాజత్వం భరతస్య

వరం దాతుం మహారాజో నేయేష ప్రేమమోహితః

ధర్మసత్యభయేనైవోవాచ రామో నృపం సుధీ:

నారదుని వచనమిట్లా -బ్రహ్మన్ ! దశరథ రాముడు స్వయంగా ఏ విధంగా ఏ యుగంలో గౌతమ పత్నికి విముక్తి కల్గించాడు. (1) సుఖమునిచ్చే, మనోహరమైన రామావతారాన్ని గూర్చి క్లుప్లంగా ఓ మహాభాగ! నాకు చెప్పండి. నాకు వినటానికి కుతూహలంగా ఉంది. (2) శ్రీనారాయణుడిట్లా అన్నాడు - బ్రహ్మతో ప్రార్థింపబడి విష్ణువు దశరథుని వల్ల స్వయంగా జన్మించాడు. ఆనందంతో త్రేతాయుగమందు కౌసల్య యందు జన్మించాడు. (3) కైకేయి యందు భరతుడు జన్మించాడు. గుణంలో రామునితో సమానుడు. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు సుమిత్రయందు జన్మించారు. గుణములకు సముద్రము వంటివారు. (4) విశ్వామిత్ర ప్రేషితుడై (పంపటం) లక్ష్మణునితో పాటు రాముడు సీతను గ్రహించటం కొరకు రమ్యమైన మిథిలకు వెళ్ళాడు. (5) దారిలో పాషాణ రూపంలో ఉన్న కామినిని, రాముడు చూచి, జగదీశ్వరుడు విశ్వామిత్రుని కారణమడిగాడు (పాషాణం కావడానికి) (6) రాముని మాటను విని మహాతపస్వియైన విశ్వామిత్రుడు ధర్మిష్ణుడు అప్పుడు రహస్యం అంతా చెప్పాడు. (7) కారణమును ఆతని ద్వారా విని భువనముల పవిత్రీకరించే రాముడు పాదాంగుళితో ఆమెను స్పృశించాడు. ఆమె పద్మంలా వికసించింది (స్త్రీ అయింది). (8) ఆమె రాముని ఆశీర్వదించి భర్భమందిరానికి వెళ్ళింది. గౌతముడు భార్యను పొంది రామునకు శుభాశీస్సులను ఇచ్చాడు. (9) ఆ రాముడు మిథిలకు వెళ్ళి శివధనుర్భంగం చేసి, సీతను వివాహమాడాడు, ఓ నారద! (10) ఆరాజేంద్రుడు వివాహమాడి పరశురాముని దర్పభంగంచేసి, వివాహోత్సవం వల్ల కల్గిన ఆనందం కలవాడై రమ్యమైన అయోధ్యకు వెళ్ళాడు. (11) సాదరంగా ఆహ్వానించి పుత్రుని రాజు (దశరథుడు) రాజునుగా (రాముని) చేయాలని తలచాడు. ఏడు తీర్థప్రదేశముల ఉదకం త్వరగా తెప్పించి, ముని పుంగవుల రప్పించి, (12) అధివాసము చేయించి శ్రీరాముని అన్ని మంగళములతో కూడిన వానిని చేశాడు.

 (అధివాసం = రాజును చేయటానికి ముందు చేసే మంగళస్నాన ఉపవాసాదులు) భరతుని మాతయైన కైకేయి ఇది చూచి, శోకంతో తల్లడిల్లిపోయి (13) ఇదివరలో అంగీకరించిన వరములను ఇమ్మని రాజును కోరింది. రాముని వనవాసము,భరతునకు రాజత్వము అడిగింది. (14) ప్రేమ మోహితుడై రాజు వరములివ్వటానికి ఇష్టపడలేదు. బుద్దిమంతుడైన రాముడు ధర్మ సత్యముల భయముతో, రాజుతో ఇట్లన్నాడు.

మూ! శ్రీరామ ఉవాచ :

తడాగ, శతదానేన యత్పుణ్యం లభతే నరః

తతోఽధికంచ లభతే వాపీ దానేన నిశ్చితం

దశవాపీ ప్రదానేన యత్పుణ్యం లభతేనరః

తతోఽధికం చ లభతే పుణ్యం కన్యా ప్రదానతః

దశకన్యాప్రదానేన యత్పుణ్యం లభతే నరః

తతోఽధికంచ లభతే యజైకేన నరాధిప

శతయజ్ఞేన యత్పుణ్యం, లభతే పుణ్యకృజ్ఞనః

తతోఽధికంచ లభతే పుత్రాస్యదర్శనేనచ

దర్శనే శతపుత్రాణాం యత్పుణ్యం లభతే నరః

తత్పుణ్యం లభతే నూనం పుణ్యవాన్సత్యపాలనాత్

సహి సత్యాత్పరో ధర్మో నానృతాత్పాతకం పరం

నహి గంగా సమం తీర్థం న దేవః కేశవాత్పరః

నాస్తి ధర్మాత్పరోబంధుః నాస్తి ధర్మాత్పర్ధనం

ధర్మాత్రియః పరః కోవా స్వధర్మం రక్ష యత్నతః

స్వధర్మే రక్షితే తాత శశ్వత్సర్వత్ర మంగలం

యశస్యం సుప్రతిష్ఠాచ ప్రతాపః పూజానం పరం

చతుర్దశాబ్దం ధర్మేణ త్యక్త్వా గృహ సుఖం భ్రమన్

వనవాసం కరిష్యామి సత్యస్య పాలనాయతే

కృత్వా సత్యంచ శపథమిచ్ఛయాఽనిచ్ఛయాఽథవా

నకుర్యాత్పాలనం యోహి భస్మాంతం తస్య సూతకం

కుంభీపాకేచప చతి యావచ్చంద్రదివాకరౌ

తతో మూకోభవేత్కుష్టీ మానవః సప్తజన్మసు  

ఇత్యేవముక్త్వా శ్రీరామో విధాయ వల్కలం జటాం

ప్రయయాచ మహారణ్యే సీతయలక్ష్మణేనచ

పుత్రశోకాన్మహారాజస్తత్యాజ స్వతనుం మునే

పాలనాయ పితుః సత్యం రామో బభ్రమ కాననే

కాలాంతరే మహారణ్యే భగినీ రావణస్యచ

భ్రమంతీ కాననే ఘోరే భర్రా సార్థం సుకౌతుకాత్

దదర్శ రామం కులటా కామార్తా రాక్షసీ తదా

పులకాంచిత సర్వాంగీ మూర్ఛా మాప స్మరేణచ

శ్రీరామ నికటం గత్వా సస్మితోవాచ కాముకీ

శశ్వద్యౌవనసంయుక్తా ఆతిప్రౌఢ కామదుర్మదా

శూర్పణ ఖోవాచ:

హేరామ హేఘనశ్యామ రూపధామగుణాన్విత

భావానురక్తం వనితాం మాం గృహాణ సునిర్జనే

శ్రుత్వా శూర్పణఖా వాక్యం ధర్మం సంస్కృత్య ధార్మికః

ఉవాచ మధురం వాక్యం శాపభీతశ్చ నారద

శ్రీరామవచనమిట్లా :

నూరు తటాకముల దానంతో నరుడు ఏపుణ్యాన్ని పొందుతాడో, అంతకన్నా ఎక్కువ పుణ్యాన్ని వాపీదానం పొందుతాడు, నిశ్చయము. (16) పదిబావుల దానంతో వచ్చేపుణ్యం కన్న, ఎక్కువ పుణ్యమును కన్యాదానం వల్ల పొందుతాడు. (17) పందిమంది కన్యల దానంవల్ల వచ్చే పుణ్యముకన్న, ఎక్కువ పుణ్యాన్ని ఒక యజ్ఞం చేస్తే పొందుతాడు, ఓ రాజ! (18) పుణ్యంచేసిన జనుడు, నూరు యజ్ఞములవల్ల పొందే పుణ్యముకన్న, ఎక్కువ పుణ్యమును పుత్రుని ముఖదర్శనం వల్ల పొందుతాడు. (19) నూరుగురు పుత్రుల దర్శనం వల్ల కలిగే పుణ్యము ఎంతో, అంతటి పుణ్యమును, పుణ్యవంతుడు సత్యవాక్య పాలనవల్ల తప్పక పొందుతాడు. (20) సత్యముకన్న ఉత్తమ ధర్మంలేదు. అసత్యముకన్న పరమైన (అధికమైన) పాతకములేదు. గంగతో సమానమైన తీర్థములేదు.

కేశవుని కన్న పరుడైన దైవం లేడు. (21) ధర్మమును మించిన బంధువు లేడు. ధర్మమును మించిన ధనములేదు. ధర్మమునకన్న ప్రియమైనది ఇతరమేమున్నది. అందువల్ల నీధర్మాన్ని రక్షించుకో, ప్రయత్నించియైనా. (22) తనధర్మం రక్షింపబడితే, ఎప్పుడు అంతటా మంగళమే ఔతుంది, ఓ తండ్రిగారు! కీర్తికరము. మంచిప్రతిష్ఠ ప్రతాపము, పరముగా పూజించతగినది ధర్మము. (23) పదునాల్గు సంవత్సరాలు గృహసుఖాన్ని వదలి ధర్మంగా తిరుగుతూ, నీ సత్యమును పాలించే కొరకు వనవాసం చేస్తాను. (24) ఇష్టపూర్తిగా లేదా ఇష్టం లేకుండా గాని, సత్యం శపథం చేసి, పాలించనివానికి చచ్చేవరకు సూతకము. (25) సూర్యచంద్రులున్నంత వరకు ఆతడు కుంభీపాక నరకమందు వండబడుతాడు. ఆ రువాత మూగవాడు, ఆ పై నరుడు ఏడు జన్మలలో కుష్టురోగి ఔతాడు (26) అని పలికి శ్రీరాముడు నారచీరలు జడలు ధరించి, సీతలక్ష్మణులతో కలిసి, మహారణ్యమునకు వెళ్ళాడు. (27) ఓముని! పుత్రశోకంతో మహారాజు తన శరీరాన్ని వదిలాడు. తండ్రిగారి సత్యప్రతిజ్ఞను పాలించటానికి రాముడు అడవిలో తిరిగాడు. (28) ఒక సమయంలో రావణుని చెల్లెలు ఆమహారణ్యమందు, ఘోరమైన అడవియందు, చాలా ఉత్సాహంగా భర్తతో పాటు తిరుగుతూ (29) కామార్హురాలు, కులట ఐన ఆ రాక్షసి అప్పుడు రాముణ్ణి చూసింది. శరీరమంతా పులకాంకురములు గలదై కామంతో మూర్ఛపొందింది. (30) ఆకాముకి శ్రీరాముని దగ్గరకు వెళ్ళినవ్వుతూ ఇట్లా అంది. రాక్షసి 'ఎప్పుడూ మౌవనం గలది, మిక్కిలి పౌడ, కామంతో బాగా మదించి ఉంది. (31) శూర్పణఖ ఇట్లా అంది - ఓరామ, ఘనశ్యామ, రూపంగలవాడ, గుణవంతుడ, ఎవ్వరూలేని ఈచోట, భావంతో అనురక్తురాలనైన నన్ను స్వీకరించు (32) శూర్పణఖ వాక్యమును విని, ఆధార్మికుడు ధర్మాన్ని తలచి, శాపానికి భయపడి, తీయనిమాటన్నాడు. ఓ నారద!

మూII శ్రీరామ ఉవాచ:

అంబ మాతః సభార్యోఽహ మభారం గచ్ఛ మేఽనుజం

దుఃఖం ప్రియోఽన్యాం ప్రభజేదితరంచ సుఖాలయం

రామస్యవచనం శ్రుత్వా ప్రయయౌ లక్ష్మణం ముదా

దదర్శ లక్ష్మణం శాంతం కాంతంచ లక్షణాన్వితం

మాం భజస్వ మహాభాగేత్యువాచ చ పునః పునః

లక్ష్మణః తద్వచః శ్రుత్వా తామువాచ కుతూహలాత్

లక్ష్మణ ఉవాచ:

విహాయ రామం సర్వేశం హేమూడే దాసమిచ్ఛసి

సీతా దాసీచ మత్పత్నీ సీతాదోసోఽహమేవచ

భవ సీతాసపత్నీత్వం గచ్ఛ రామం మదీశ్వరం

తవపుత్రోభవిష్యామి సీతాయాశ్చ యథా సతి

లక్ష్మణస్య వచః శ్రుత్వా కామేన హృతమానసా

ఉవాచ లక్ష్మణం మూఢా శుష్కకంఠోష్ఠతాలుకీ

శూర్పణఖోవాచ:

యది త్యజసి మాం మూఢ కామాత్స్వయ ముపస్థితాం

యువయోశ్చ విపత్తిశ్చ భవిష్యతి న సంశయః

బ్రహ్మాచ మోహినీం త్యక్త్వా విశ్వేఽపూజ్యో బభూవ సః

రంభాశాపేన దక్షశ్చ ఛాగమస్తో బభూవ సః

స్వర్వైద్యశ్చోర్వశ్మీపాద్యజ్ఞ భాగవివర్జితః

రూపహీనః కుబేరశ్చ మనోశాపేన లక్ష్మణ

కామో ఘృతాచీ శాపేన బభూవ భస్మసాచ్ఛివాత్

బలిర్మదాలసాశాపాద్భ్రష్ట రాజ్యో బభూవహ

శాపేన మిశ్రకేశ్యాశ్చ హృతభార్యో బృహస్పతిః

మమశాపాత్తథా రామో హృతభార్యో భవిష్యతి

కామాతురాం యౌవనస్థాం భార్యాం స్వయముపస్థితాం

నత్యజేద్ధర్మభీతశ్చ శ్రుతం మాధ్యందినే పురా

ఇహ త్యక్త్వా విపద్గ్రస్తః పరత్ర నరకం వ్రజేత్

శ్రుత్వా శూర్పణఖావాక్య మర్ధచంద్రేణ లక్ష్మణః

చిచ్ఛేద నాసికాం తస్యాః క్షురధారేణ లీలయా

తస్యా భ్రాతాచ ముముధే బలవాన్ ఖరదూషణః

స సైన్యో లక్ష్మణాస్త్రేణ స జగామ యమాలయం

చతుర్దశ సహస్రంచ రాక్షసాన్ ఖరదూషణం

మృతాన్ దృష్ట్వా శూర్పణఖా భర్తృయామాస రావణం

సర్వం నివేదనం కృత్వా జగామ పుష్కరం తదా

బ్రహ్మణశ్చ వరం ప్రాప కృతాచ దుష్కరంతపః

ఉవాచ తాదృశీం దృష్ట్వా నిరాహారాం తపస్వినీం

సర్వజ్ఞస్తన్మనో మత్వా కృపాసింధుశ్చ నారద

బ్రహ్మోవాచ:

అప్రాప్య రామం దుష్ప్రాపం కరోషి దుష్కరం తపః

జితేంద్రియాణాం ప్రవరం లక్ష్మణం ధర్మలక్షణం బ్రహ్మవిష్ణుశివాచీనామీశ్వరం ప్రకృతేః పరం

జన్మాంతరేచ భర్తారం ప్రాప్స్యసి త్వం వరాననే

ఇత్యేవముక్త్యా బ్రహ్మాచ జగామ స్వాలయంముదా

దేహం తత్యాజ సా వహ్నౌ సాచ కుబ్జ బభూవహ

అధశూర్పణఖా వాక్యాత్కోపాత్కంపితవిగ్రహః

జహార మాయయా సీతాం మాయావీ రాక్షసేశ్వరః

సీతాం న దృష్ట్వా రామశ్చ మూర్ఛాం ప్రాప చిరంమునే

చేతనాం కారయామాస భ్రాతాచాధ్యాత్మికేనచ

తతోబభ్రామగహనం శైలంచ కందరం నదం

అను! శ్రీరాముడిట్లన్నాడు: అంబ! మాత! నేను భార్యకలవాణ్ణి, భార్యలేని నా తమ్ముని దగ్గరకు వెళ్ళు. ప్రియుడు పరస్త్రీని పొందితే దుఃఖము కల్గుతుంది. ఇతరమైనది సుఖమునకు నిలయము (34) రాముని మాటను విని లక్ష్మణుని దగ్గరకు ఆనందంగా వెళ్ళింది. శాంతుడు, మనోహరమైనవాడు (కోరతగిన) మంచి లక్షణములుగల లక్ష్మణుని చూచింది. (35) ఓ మహాభాగ నన్ను పొందు అని మాటిమాటికి అన్నది. లక్ష్మణుడు ఆ మాటలు విని, కుతూహలముగా ఆమెతో అన్నాడు. (36) లక్ష్మణుడిట్లన్నాడు - ఓ మూఢురాల! సర్వేశుడైన రాముని వదిలి దాసుడనైన నన్ను కోరుతున్నావు. నాభార్య సీతకు దాసి, నేను సీతకు దాసుణ్ణి. (37) నాప్రభువైన రాముని చేరు. నీవు సీతకు సవతివికా, సీతకు ఏవిధముగా పుత్రునిగా ఉన్నానో అట్లా నీకు కూడా పుత్రుడినౌతాను ఓ సతి! (38) లక్ష్మణుని మాటలు విని కామంతో నిండిన మనసుగలదై, కంఠ, ఓష్ఠతాలు భాగములు ఎండిపోవుచుండగా ఆ మూఢురాలు లక్ష్మణునితో ఇట్లా అంది. (39) శూర్పణఖ ఇట్లా అంది - కామంవల్ల స్వయంగా వచ్చిన దానిని నన్ను వదిలితే ఓ మూడుడ! మీకు ఆపద సంభవిస్తుంది, అనుమానం లేము (40) బ్రహ్మమోహినిని వదిలి విశ్వమందాతడు అపూజ్యుడైనాడు. రంభాశాపంతో దక్షుడు మేకపోతు తలగలవాడైనాడు. (41) దేవవైద్యుడు ఊర్వశి శాపంతో యజ్ఞభాగం లేకుండా ఐనాడు. ఓ లక్ష్మణ! మేనకశాపంతో కుబేరుడు రూపం లేనివాడైనాడు. (42) కాముడు ఘృతాచీ శాపంతో శివుని వల్ల భస్మమైనాడు. బలి మదాలస శాపం వల్ల రాజ్యం పోగొట్టుకున్నాడు. (43) మిశ్రకేశి శాపంతో బృహస్పతి భార్యను పోగొట్టుకున్నాడు. నా శాపంతో రాముడుకూడా భార్యను పోగొట్టు (హరణం) కుంటాడు. (44) కామాతురాలు, యౌవనంలో ఉన్నది, భార్యగా స్వయంగా వచ్చింది అట్టి దానిని ధర్మభీతుడై విడిచి పెట్టరాదు, అని ఇదివరలో మాధ్యందిన శ్రుతిలో విన్నాము. (45) ఇక్కడ విడిచి పెట్టి ఆపదలకు లోనై పరంలో నరకం పొందుతాడు. శూర్పణఖ మాటను విని లక్ష్మణుడు, అర్ధచంద్రాకారం గల (46) కత్తి అంచుతో అవలీలగా ఆమె ముక్కును కోశాడు. ఆమె అన్న(లేదా తమ్ముడు) బలవంతుడైన ఖరదూషణుడు ఆతనితో యుద్ధం చేశాడు. (47) ససైన్యుడై లక్ష్మణుని అస్త్రంతో యమమందిరానికి వాడు వెళ్ళాడు. ఖరదూషణుని పదునాలుగు వేలమంది రాక్షసులను చంపాడు లక్ష్మణుడు. (48) చచ్చిన వారిని చూచి శూర్పణఖ రావణుని భయ పెట్టింది. అంతా చెప్పిఅప్పుడు పుష్కర తీర్థానికి వెళ్ళింది. (49) దుష్కరమైన తపస్సుచేసి బ్రహ్మవరాన్ని పొందింది. నిరాహారంగా తపస్సు చేస్తున్న ఆమెను ఆ విధంగా చూచి బ్రహ్మ ఆమెతో అన్నాడు. (50)ఓ నారద! సర్వజ్ఞుడు, కృపాసింధువు ఐన బ్రహ్మ ఆమె మనస్సును తెలుసుకొని (51) బ్రహ్మఇట్లన్నాడు : పొందశక్యం కాని రాముని పొందకపోయి, దుష్కరమైన తపస్సు చేస్తున్నావు. ధర్మలక్షణములు గల, జితేంద్రియులలో శ్రేష్ఠుడైన లక్ష్మణుని పొందలేదు. బ్రహ్మ విష్ణు శివాదులకు ఈశ్వరుడు, ప్రకృతికన్న పరుడు (52) ఓ వరానన! నీవు మరో జన్మలో భర్తగా పొందుతావు ఆతనిని అని ఈ విధముగా పలికి బ్రహ్మ తన గృహమునకు ఆనందంగా వెళ్ళాడు. (53) ఆమె అగ్నిలో ప్రాణాన్ని వదిలింది. ఆమే మరోజన్మలో కుబ్జగా ఐనది. ఇక శూర్పణఖ వాక్యంతో కోపంతో శరీరం వణుకుతుండగా (54) మాయావియైన రాక్షసేశ్వరుడు (రావణుడు) మాయతో సీతను ఎత్తుకొనిపోయాడు. ఓముని! సీతకన్పించనందువల్ల రాముడు చాలా సేపు మూర్చనందాడు. (55) ఆధ్యాత్మికంగా, రాముని, లక్ష్మణుడు చైతన్యవంతుని చేశాడు. ఆ పిదప, గహనమైన పర్వతాలు, గుహలు, నదులు తిరిగారు.

మూII అహర్నిశంచ శోకార్తో మునీనామాశ్రమం మునే

చిరమన్వేషణం కృత్వా న దృష్ట్వా జానకీం విభుః

చకార మిత్రతాం రామః సుగ్రీవేణ స్వయం ప్రభుః

నిహత్య వాలినం బాణైః దదౌ రాజ్యం చ లీలయా

సుగ్రీవాయచ మిత్రాయ స్వీకార పాలనాయ వై

దూతాన్ప్రస్థాపయామాస సర్వత్ర వానరేశ్వరః

తస్థౌ సుగ్రీవభవనే శ్రీరామశ్చ సలక్ష్మణః

హనూమతే వరందత్వా రమ్యం రత్నాంగుళీయకం

సీతాయైశుభ సందేశం ప్రాణధారణ కారణం

తంచ ప్రస్థాపయామాస దక్షిణాం దిశముత్తమాం

సుప్రీత్యాఽలింగనం దత్వా పాదరేణూన్ సుదుర్లభాన్

హనుమాన్ ప్రయయౌ లంకాం సీతాన్వేషణ హేతవే

రామాదధీత సందేశో యయౌ రుద్రకలోద్భవః

అశోక కాననే సీతాం దదర్శ శోకకర్శితాం

నిరాహారామతికృశాం కువ్వేం చంద్రకలామివ

సతతం రామరామేతి జపంతీం భక్తి పూర్వకం

బిభ్రతీంచ జటాభారం తప్తకాంచన సన్నిభాం

ధ్యాయమానాం పదాబ్జంచ శ్రీరామస్య దీవానిశం

శుద్ధశయ్యాం సుశీలాంచ సువ్రతాంచ పతివ్రతాం

మహాలక్ష్మీ లక్ష్మ యుక్తాం ప్రజ్వలంతీం స్వతేజసా

పుణ్యదాం సర్వతీర్థానాం దృష్ట్వా భువనపావనీం

ప్రణమ్య మాతరం దృష్ట్వా రుదంతీం వాయునందనః

రత్నాంగులీయం రామస్య దదౌ తస్యై ముదాఽన్వితః

రురోద ధర్మీ తాం దృష్ట్వా ధృత్వా తచ్చరణాంబుజం ఉవాచ రామసందేశం సీతా జీవన రక్షణం

హనుమానువాచ:

పారే సముద్రం శ్రీరామః సన్నద్ధశ్చ సలక్ష్మణః

బభూవ రామమిత్రంచ సుగ్రీవో బలవాన్కపిః

రామశ్చ వాలినం హత్వా రాజ్యం నిష్కంటకం దదౌ

సుగ్రీవాయ మిత్రాయ తద్భార్యాం వాలినాహృతాం

సుగ్రీవశ్చతవోద్ధారం స్వీచకార చ ధర్మతః

వానరాశ్చ యయుః సర్వే తవాన్వేషణకారణాత్

ప్రాప్య మంగళవార్తాంచ మత్తీరాజీవలోచనః

గంభీరం సాగరం బద్ద్వా సోఽచిరేణాగమిష్యతి

నిహత్య రావణం పాపం స పుత్రంచ స బాంధవం

కరిష్యత్యతిరేథైవ హేమాతస్తవమోక్షణం

అద్యరత్నమయీం లంకాం నిఃశంకస్త్వత్ప్రసాదతః

భస్మీభూతాం కరిష్యామి మాతః పశ్యచ సస్మితం

మర్కటీడింభతుల్యాంచ లంకాం పశ్యామి సువ్రతే

మూత్రతుల్యం సముద్రంచ శరావమివ భూతలం

పిపీలికా సంఘమివ ససైన్యం రావణం తథా

సంహర్తుంచ సమర్ధోఽహం ముహూర్తార్ధన లీలయా

రామప్రతిజ్ఞా రక్షార్థంన హనిష్యామి సాంప్రతం

స్వస్థా భవ మహాభాగే త్యజభీతిం మదీశ్వరి

వానరస్యవచః శత్వా రురోదోచ్చై ర్ముహుర్ముహుః

ఉవాచ వందనం భీతా సీతా రామపతివ్రతా

రాముడు, రాత్రింబగళ్ళు శోకంతో బాధపడుతూ, మునుల ఆశ్రమాలలో చాలానాళ్ళు వెతుకుతూ, ఓముని! విభువు సీతను చూడలేదు. (57)ప్రభువు రాముడు స్వయంగా సుగ్రీవునితో మైత్రి చేశాడు. బాణములతో అవలీలగా వాలిని చంపి రాజ్యమును సుగ్రీవునికిచ్చాడు (58) స్వీకరించిన దానిని పాలించేవాడు, మిత్రుడు, సుగ్రీవుడు ఆతనికి రాజ్యమిచ్చాడు. వానరేశ్వరుడు, అంతటా దూతలను పంపించాడు. (59) లక్ష్మణునితో పాటు శ్రీరాముడు సుగ్రీవ భవనంలో ఉన్నాడు. హనుమంతునకు, ఇష్టమైన, రమ్యమైన రత్నాంగుళీయకమును ఇచ్చి (60) ప్రాణములు ధరించుటకు ఉపకరించే శుభ సందేశమును, సీతకై (ఇవ్వమని చెప్పి) అందించి, ఉత్తమమైన దక్షిణ దిక్కుకై ఆతనిని బయలుదేరదీశాడు. (61) మిక్కిలి ప్రేమతో రాముడు కౌగిలించుకొన్నాడు. సుదుర్లభమైన పాదరేణువులను పొంది, హనుమంతుడు, సీతను అన్వేషించే కొరకు లంకకు బయలుదేరాడు. (62) రుద్రకళతో ఉద్భవించినవాడు, రామునితో సందేశాన్ని పొంది వెళ్ళాడు. శోకముతో కృశించిన సీతను అశోకవనంలో చూచాడు. (63) ఆహారం లేకుండా, మిక్కిలి కృశించిన ఆమెను అమావాస్య యందు చంద్రకళవలె ఉన్నదానిని చూచాడు. భక్తి పూర్వకంగా ఎప్పుడూ రామ! రామ! అని జపిస్తున్నది ఆమె. (64) వేడిచేసిన బంగారంలా ఉంది. జడల బరువును కలిగి ఉంది. రాత్రింబగళ్ళు శ్రీరాముని పాదాబ్జములను ధ్యానిస్తున్నది. (65) శుద్ధమైన పడకగలది సుశీల, సువ్రత, పతివ్రత ఆమె. మహాలక్ష్మి చిహ్నములు కలది, తన తేజస్సుతో వెలిగిపోతోంది. (66) సర్వతీర్ధములకు పుణ్యమును కల్గించేది, లోకపావని (పవిత్రం చేసేది) అట్టి సీతను చూచి, ఆమెకు నమస్కరించి ఏడుస్తున్న ఆతల్లిని చూచి వాయునందనుడు (67) ఆనందంతో ఆమెకు రాముని రత్నాంగుళీయకాన్నిచ్చాడు. ధర్మస్వరూపుడైన వాయునందనుడు ఆమెను చూచి ఏడ్చాడు. ఆమె చరణాంబుజములను పట్టుకొని, సీత బ్రతుకుటకు కారణమయ్యే రామసందేశమును చెప్పాడు. (68) హనుమంతుడిట్లన్నాడు - సముద్రపు అవతలి ఒడ్డులో లక్ష్మణునితో కూడి శ్రీరాముడు (యుద్ధ) సన్నద్ధుడై ఉన్నాడు. (69) బలవంతుడైన కపి, సుగ్రీవుడు రాముని మిత్రుడైనాడు. రాముడు వాలిని చంపి, శత్రువులు (ముళ్ళు) లేకుండా చేసి రాజ్యమును సుగ్రీవునికిచ్చాడు. (70) వాలిచే హరింపబడిన ఆతని భార్యను, మిత్రుడైన సుగ్రీవునికి తిరిగి ఇచ్చాడు. సుగ్రీవుడు ధర్మముగానే ఉద్గారమును(రక్షణకు) స్వీకరించాడు. (71) నిన్ను వెదికే కొరకు వానరులంతా వెళ్ళారు. రాముడు రాజీవలోచనుడు నా ద్వారా నీ మంగళవార్తను విని (72) గంభీరమైన సాగరమును బంధించి రాముడు త్వరలో వస్తాడు. పుత్రులు, బాంధవులతో కూడిన రావణుని పాపిని చంపి (73) ఓ తల్లి! త్వరలోనే నీకు విముక్తిని కల్గిస్తాడు. నీ అనుగ్రహంతో, ఈవేళ, రత్నమయమైన లంకను, అనుమానం లేకుండా (74) భస్మం చేస్తాను, ఓ తల్లి! నవ్వుతూ చూస్తుండు. ఓ సువ్రత! లంక ఆడకోతి పిల్లతో సమానంగా (చిన్నగా) కన్పిస్తోంది. (75) సముద్రము మూత్రంతో సమానంగా, భూమి మూకుడు అంతగా (చిన్నగా), అట్లాగే సైన్యముతో కూడిన రావణుడు చీమల గుంపువలె కన్పిస్తున్నారు. (76) అవలీలగా అర్ధముహూర్తంలో సంహరించటానికి నేను సమర్ధుణ్ణి. రామప్రతిజ్ఞను రక్షించే కొరకు ఇప్పుడు వారిని చంపటం లేదు. (77) ఓ మహాభాగిని! స్వస్థురాలవై ఉండు. ఓ నాఈశ్వరి! భయాన్ని వదలు. వానరుని మాటను విని, పెద్దగా మాటి మాటికి ఏడ్చింది. రామునియందుపతివ్రతయైన సీత భయపడి ఈమాట అన్నది.

మూII సీతోవాచ:

అయే జీవతి మే రామో మచ్ఛోకార్ణవ దారుణాత్

అపి మే కుశలీ నాథః కౌసల్యానందనః ప్రభుః

కీదృశశ్చ కృశాంగశ్చ జానకీ జీవనోఽధునా

కిమాహారశ్చ కింభుంక్తే మమ ప్రాణాధిక: ప్రియః

అపి పారే సముద్రస్య సత్యం సీతాపతిః స్వయం

అపి సత్యంస సన్నద్ధో న శోకేన హతః ప్రభుః

అపి స్మరతి మాం పాపాం స్వామినో దుఃఖరూపిణీం

మదర్థేకతి దుఃఖం సంప్రాప, స, మదీశ్వరః

హారో నారోపితః కంటే పురా వ్యవహితో రతే

అధునైవావయోర్మధ్యే సముద్రః శతయోజనః

అపి ద్రక్ష్యామి తం రామం కరుణాసాగరం ప్రభుం

కాంతం శాంతం నితాంతం చ ధర్మిష్ఠం ధర్మకర్మణి

అయి సేవాం కరిష్యామి పాదపద్మే పునః ప్రభోః

పతి సేవావిహీనాయాః మూఢాయా జీవనం వృథా

అయిమే ధర్మపుత్రశ్చ సత్యం జీవతి లక్ష్మణః

మచ్ఛోక సాగరే మగ్నో భగ్నదర్పో మయా వినా

వీరాణాం ప్రవరో ధర్మీ దేవకల్పశ్చ దేవరః

అవి సత్యం స సన్నధ్ మత్ర్పభోరనుజః సదా

అపి ద్రక్ష్యామి సత్యం తం లక్ష్మణం ధర్మలక్షణం ప్రాణానామధికం ప్రేమ్ణా ధన్యం పుణ్య స్వరూపిణం

ఇత్యేవం వచనం శ్రుత్వా దత్వాప్రత్యుత్తరం శుభం

భస్మీ భూతాంచ లంకొంచ చకార లీలయా మునే

పునః ప్రబోధంతస్యైచ దత్వా వాయుసుతః కపిః

ప్రయయౌ లీలయా వేగాద్యత్ర రాజీవలోచనః

సర్వం తత్కథయామాస వృత్తాంతం మాతురేవచ

సీతా మంగలవృత్తాంతం శ్రుత్వా రామో రురోదన

రురోదోచ్చైః లక్ష్మణశ్చ సుగ్రీవశ్చాపి నారద

వానరా రురుదుస్సర్వే మహాబలపరాక్రమాః

నిబోధ్య సేతుం లంకాంచ ప్రయయౌ రఘునందనః

స సైన్యః సానుజః శీఘం సన్నద్ధశ్చాపి నారద

నిహత్యరావణం రామో రణం కృత్వా సబాంధవం

చకార మోక్షణం బ్రహ్మన్ సీతాయాశ్చ శుభే, క్షణే

కృత్వా పుష్పకయానేన సీతాం సత్యపరాయణాం

అయోధ్యాం ప్రయ శీఘ్రం క్రీడాకౌతుక మంగలైః

క్రీడాం చకార భగవాన్ సీతాం కృత్వాచవక్షసి  

విజహౌ విరహ జ్వాలాం సీతా రామశ్చ తత్క్షణం

సప్తద్వీపేశ్వరో రామో బభూవ పృథివీతలే

బభూవ నిఖిలాపృథ్వీ ఆధివ్యాధివివర్జితా

బభూవతూ రామపుత్రా ధార్మికౌచ కుశీలవౌ

తయోశ్చపుత్రః పౌత్రైశ్చ సూర్యవంశోద్భవానృపాః

ఇతి తే కధితం వత్స శ్రీరామచరితం శుభం

సుఖదం మోక్షదం సారం పారపోతం భవార్ణవే

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే ఉత్తరార్ధ నారాయణ నారద సంవాదే శ్రీరామ చరితం నామ ద్విషష్టితమోఽధ్యాయః

సీత ఇట్లా అంది - నన్ను గూర్చి దారుణమైన దుఃఖ సముద్రం నుండి (తేరుకొని) నా రాముడు బ్రతికున్నాడా (79) ప్రభువు కౌసల్యానందనుడు నానాథుడు క్షేమంగా ఉన్నాడా. జానకికి బ్రతుకుదెరువైన (బ్రతికించే) రాముడు కృశాంగుడు ఇప్పుడు ఎట్లున్నాడు. (80) నా ప్రాణాధికమైన ప్రియుడు ఏ ఆహారంతో ఉంటున్నాడు, ఏమి తింటున్నాడు. సముద్రమునకు అవతలి ఒడ్డున సీతాపతి స్వయంగా ఉన్నాడా? నిజమా? (81) నిజంగా ఆతడు సనదుడై ఉన్నాడా? ఆ ప్రభువు శోకంతో నాశం కాలేదా. స్వామికి దుః ఖరూపమైన, పాపినైన నన్ను స్మరిస్తున్నాడా (82) నా ఈశ్వరుడైన ఆతడు నా కొరకు ఎంత దుఃఖాన్ని పొందాడో, రతియందు వ్యవధానం (అడ్డంకిగా) కల్గిస్తుందని, ఇదివరలో కంఠంలో హారం వేసుకోలేదు. (83) ఇప్పుడేమో ఇద్దరి మధ్య శతయోజన విస్తీర్ణమైన సముద్రముంది. ప్రభువు, కరుణా సాగరుడు ఐన ఆ రాముని చూడగలనా. (84) కాంతుడు, శాంతుడు, ధర్మకర్మయందు మిక్కిలి ధర్మిష్ణుడు, అట్టి ప్రభువు పాదపద్మములందు తిరిగి నేను సేవను చేయగలనా. (85) పతి సేవ చేయని మూఢురాలి. జీవనము వృధా, ధర్మ(మునకు) పుత్రుడైన నా లక్ష్మణుడు నిజంగా జీవించి ఉన్నాడా? (86) నాకై దుఃఖసాగరమందు మునిగి, నేను లేనందువల్ల దర్పంభగ్నమై ఉన్నాడా. వీరులలో శ్రేష్ఠుడు, ధర్మ స్వరూపుడు, దేవకల్పుడు (సమానుడు) నా మరిది. (87) నా ప్రభువునకు తమ్ముడైన ఆతడు ఎల్లప్పుడు సన్నద్ధుడై ఉన్నాడా? నిజమా? ధర్మలక్షణములు కల ఆ లక్ష్మణుని, నిజంగా చూస్తానా? నాకు ప్రాణముల కన్న అధికుడు, ప్రేమచే ధన్యుడు, పుణ్య స్వరూపుడు ఆతనిని చూస్తానా? (88) అనే ఇట్లాంటి మాటలను విని శుభమైన ప్రత్యుత్తరమును ఇచ్చి, అవలీలగా లంకను భస్మంగా చేశాడు, ఓ ముని! (89) తిరిగి ఆమెను మేల్కొలిపి, కపి, వాయుసుతుడు, రాజీవలోచనుడున్న చోటికి (రాముని దగ్గరకు) అవలీలగా, వేగంగా వచ్చాడు. (90) తల్లియొక్క వృత్తాంతమంతా దానిని చెప్పాడు. సీతయొక్క మంగళ వృత్తాంతమును విని రాముడు దుఃఖించాడు. (91) లక్ష్మణుడు, గట్టిగా రోదించాడు. సుగ్రీవుడు కూడా దుఃఖించాడు. ఓ నారద! మహాబలపరాక్రమ వంతులైన వానరులు అంతా రోదించారు (92) సేతువును బంధించి రఘునందనుడు లంకకు వెళ్ళాడు సైన్యంతో కూడి, తమ్మునితో కూడి సన్నద్ధుడై త్వరగా వెళ్ళాడు, ఓ నారద! (93) యుద్ధంచేసి, బాంధవులతో కూడిన రావణుని చంపి, రాముడు, మంచి ముహూర్త మందు సీతకు విముక్తి కల్గించాడు, ఓ బ్రహ్మ! (94) సత్యపరాయణయైన సీతను పుష్పక విమానమందుంచి త్వరగా అయోధ్యకు వెళ్ళాడు. క్రీడకౌతుక మంగళములతో సంతోషంతో శోభనపు పెళ్ళికొడుకై (95) భగవంతుడు రాముడు, సీతను వక్షమందుంచుకొని క్రీడించాడు. ఆక్షణంలో రాముడు, సీత విరహజ్వాలను వదిలారు (ముక్తులైనారు) (96) పృథివీతలమందు రాముడు సప్తద్వీపములకు ఈశ్వరుడైనాడు. ఈ భూమి అంతా ఆధి వ్యాధులు లేకుండా అయినది. (ఆధి= మనోవ్యథ) (97) రామునకు పుత్రులుగా ధార్మికులు కుశుడు, లవుడు అని కలిగారు. వారి పుత్రులు పౌత్రులతో ఏర్పడిన రాజులుసూర్య వంశమందలి వారు (పుట్టిన) (98) అని ఓవత్స! నీకు శుభమైన శ్రీరామచరిత్రను చెప్పాను. ఈకథ సుఖమునిచ్చేది, మోక్షమునిచ్చేది, సారమైనది. సంసారసాగరమందు ఆవలి ఒడ్డుచేరుటకు నావవంటిది (99) అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు శ్రీరామచరితమనునది అరువది రెండవ అధ్యాయము సమాప్తము.