బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

73 - అధ్యాయము

మూll.శ్రీనారాయణ ఉవాచ :

అథకృష్ణశ్చసానందం నందంతం పితరంబలః  

బోధయామాసశోకార్తంది వ్యైరాధ్యాత్మికాదిభిః

ఉచ్చైరుదంతం నిశ్చేష్టంపుత్రవిచ్ఛేదకాతరం

దత్వాతస్మైమణి శ్రేష్ఠమిత్యువాచ జగత్పతిః

శ్రీభగవానువాచ :

నిబోధ నంద సానందం త్యజ శోకం ముదం లభ

జ్ఞానం గృహాణమద్దత్తం యద్దత్తం బ్రహ్మణే పురా

యద్దత్తం చ శేషాయ గణేశాయేశ్వరాయచ

దినేశాయమునీశాయ యోగీశాయచ పుష్కరే

కః కస్య పుత్రః కస్తాతః కా మాతా కస్యచిత్కుతః

ఆయాంతి యాంతి సంసారం పరం స్వకృతకర్మణా

కర్మానుసారాజ్జంతుశ్చ జాయతే స్థాన భేదతః

కర్మణా కోఽపిజంతుశ్చ యోగీంద్రాణాం నృపస్త్రియాం

ద్విజపత్న్యాం క్షత్రియాణాం వైశ్యాయాంశూద్రయోనిషు

తిర్యగ్యోనిషు కశ్చిచ్చ కశ్చిత్పశ్వాది యోనిషు

మమైవ మాయయా సర్వే సానందావిషమేషుచ

దేహత్యాగే విషణ్ణశ్చ విచ్ఛేదే బాంధవస్యచ

ప్రజాభూమిధనాదీనాం విచ్ఛేదో మరణాధికః

నిత్యం భవతి మూఢశ్చ నచ విద్వాన్ శుచాయుతః

మద్భక్తి భక్తియుక్తశ్చ మద్యాజీ విజితేంద్రియః

మన్మంత్రోపాసకశ్చైవ మత్సేవానిరతః శుచిః

మద్భయాద్వాతి వాతోఽయం రవిర్భాతిచ నిత్యశః

భాతి చంద్రో మహేంద్రశ్చ కాలభేదేన వర్షతి

వహ్నిర్దహతి నృత్యశ్చ చరత్యేవ హిజంతుషు

బిభర్తి వృక్షః కాలేన పుష్పాణిచ ఫలానిచ  

నిరాధారశ్చ వాయుశ్చ వాయ్వాధారశ్చ కచ్చపః

శేషశ్చ కచ్చపాధార: శేషాధారశ్చ పర్వతాః

తదా ధారాశ్చపాతాలాః సప్త ఏవహి పంక్తితః

నిశ్చలంచ జలం తస్మాజ్జలస్థాచ వసుంధరా

సప్తస్వర్గం ధరాధారం జ్యోతిశ్చక్రం గ్రహాశ్రయం

నిరాధారశ్చ వైకుంఠో బ్రహ్మాండేభ్యః పరోవరః

తత్సరశ్చాపి గోలోకః పంచాశత్కోటియోజనాత్

ఊర్ధ్వం నిరాశ్రయశ్చాపి రత్నసార వినిర్మితః

సప్త ద్వారః సప్తసారః పరిఖాసప్త సంయుతః

లక్షప్రాకారయుక్తశ్చ తద్యా విరజయా యుతః

వేష్టితో రత్నశైలెన శతశృంగేణ చారుణా

యోజనాయుతమానంచ య స్యైకంశృంగముజ్జ్వలం   

శతకోటియోజనశ్చశైల ఉచ్చ్రిత ఏవచ

దైర్ఘ్యం తస్యశతగుణం ప్రస్థంచ లక్షయోజనం  

యోజనాయుత విస్తీర్ణస్తత్రైవ రాసమండలః

అమూల్యరత్న నిర్మాణో వర్తులశ్చంద్ర బింబవత్

అను శ్రీ నారాయణుడిట్లన్నాడు - ఇక బలవంతుడైన కృష్ణుడు ఆనందంతో ఉన్న తండ్రియైన, ఆ నందుని దుఃఖార్హుడైన వానిని దివ్యములైన ఆధ్యాత్మికాది విషయములతో ఇట్లా ఉద్బోధించసాగాడు. (1) గట్టిగా ఏడుస్తున్న, నిశ్చేష్టుడైన, పుత్రుడు విడిపోతాడని భయపడుతున్న ఆ తండ్రిని మణిశ్రేష్ఠమును ఇచ్చి జగత్పత్తి ఇట్లా చెప్పసాగాడు. (2) భగవంతుని వచనమీట్లా - ఓనందుడ! మేల్కో. ఆనందంగా ఉండు. దుఃఖాన్ని విడిచి పెట్టు. ఆనందాన్ని పొందు. నేనిచ్చే జ్ఞానాన్ని స్వీకరించు. ఈ జ్ఞానాన్ని ఇదివరలో బ్రహ్మకిచ్చాను. (3) శేషునకిచ్చాను. గణేశునకు, ఈశ్వరునకిచ్చాను. దినేశునకు, మునీశునకు, పుష్కరంలో యోగీశునకు ఇచ్చాను. (4) ఎవడు ఎవడికి కొడుకు. ఎవడు తండ్రి, తల్లెవరు. ఎవనికి ఎవడు ఎట్లా. కాని తాము చేసిన కర్మవల్ల వస్తున్నారు. సంసారంలో ప్రవేశిస్తున్నారు. (5) కర్మననుసరించి ప్రాణి స్థానభేదంతో పుడ్తోంది. కర్మవల్ల ఏప్రాణియైనా యోగీంద్రులకో, రాజస్త్రీలకో (6) బ్రాహ్మణపత్నియందో, క్షత్రియులకో, వైశ్య స్త్రీయందో, శూద్రయోనులయందో, తిర్యగ్ యోనులయందో ఎవడైనా, మరొకడు పశ్వాదియోనులయందో (7) పుట్టవచ్చును. నామాయవల్లనే అందరు విషయములయందు ఆనందంగా ఉన్నారు. బంధువులు విడిపోయినా, ప్రాణత్యాగమందును విషణులౌతున్నారు. (8) సంతానము, భూమి, ధనము మొదలగువాని విచ్ఛేదము మరణముకన్న అధికబాధాకరము. శుచిగా ఉన్నా, విద్వాంసుడు కావడం లేదు,నిత్యం మూడుడౌతున్నాడు. (9) నాభక్తుడు, భక్తికలవాడు, నన్నుపూజించేవాడు, జితేంద్రియుడు, నామంత్రోపాసకుడు, నా సేవాసక్తుడు, శుచికూడా విద్వాంసుడు కావటం లేదు. (10) గాలినాభయంతో వీస్తోంది. సూర్యుడు ప్రతిరోజు వెలుగుతున్నాడు, నాభయంవల్ల. అట్లే మహేంద్రుడు, చంద్రుడు వెలుగుతున్నారు. కాలభేదంలో ఇంద్రుడు వర్షిస్తున్నాడు. (11) అగ్నికాలుస్తోంది,ప్రాణులలో చలనం కలుగుతోంది. కాలమందు వృక్షము పూలు, పండ్లను ఇస్తోంది. (12) వాయువు నిరాధారము వాయువు ఆధారముగా గలది తాబేలు. కచ్చపము శేషునకాధారము, శేషుడు పర్వతములకాధారము. (13) అవి పాతాళములకాధారము, వరుసలో అవి ఏడు దాని నుండి జలము, నిశ్చలమైనది. భూమి జలముయందుండేది. (14) ఏడు స్వర్గములకు భూమి ఆధారము. జ్యోతిశ్చక్రముగ్రహముల నాశ్రయించినది. వైకుంఠము నిరాధారమైనది. బ్రహ్మాండములకన్న పరమైనది, వరమైనది.(15) ఆ పైన, ఏబదికోట్ల యోజనముల దూరంలో గోలోకమున్నది. అది నిరాశ్రయమైనది. రత్నముల సారములతో (వజ్రాలు) శ్రేష్ఠమైన) నిర్మింపబడింది. (16) దానికి ఏడు ద్వారములు. ఏడు నక్షత్రముల సారమిది. ఏడు పరిఖలుగలది. లక్షప్రాకారములుగలది. విరజానది గలది. (17) రత్న పర్వతంతో చుట్టబడింది. అందమైన నూరు శిఖరములుగలది. పదివేల యోజనముల పరిమాణముగలది, దాని ఒక శృంగము చాలా ఉజ్జ్వలంగా ఉంది. (18) నూరుకోట్ల యోజనముల పరిమాణము గలది పర్వతము చాలా ఎతైనది కూడా. దాని పొడవునూరురెట్లు ఎక్కువ. దాని వైశాల్యము లక్ష యోజనములు (19) పదివేల యోజనముల విశాలమైన రాసమండలము అక్కడే ఉంది. అమూల్యమైన రత్నములతో నిర్మింపబడింది. చంద్రుని బింబమువలె గుండ్రముగా ఉంది.

మూపారిజాతవనేనైవ పుష్పితేన,చ వేష్టితః

కల్పవృక్ష సహస్రేణ పుష్పోద్యాన శతేనచ

నానావిధైః పుష్పవృక్షైః పుష్పితేన చచారుణా

త్రికోటి రత్నభవనో గోపీలక్తైశ్చ రక్షితః

రత్నప్రదీపయుక్తశ్చ రత్నతల్పసమన్వితః

నానా భోగసమాయుక్తో మధువాపీశతైర్వృతః

పీయూషవాపీయుక్తశ్చ కామభోగసమన్వితః

గోలోకగృహసంఖ్యాన వర్ణనే వా విశారదః

నకోఽపి వేదవిద్వాన్వా వేదవిద్వాన్వ్రజేశ్వరః

అమూల్యరత్న నిర్మాణ భవనానాంత్రికోటిభిః

శోభితం సుందరం రమ్యం రాధాశిబిరముత్తమం

అమూల్యరత్నకలశైః ఉజ్జ్వలం రత్నదర్పణైః

అమూల్యరత్న స్తంభానాం రాజిభిశ్చ విరాజితం

నానా చిత్రవిచిత్రైశ్చ చిత్రితం శ్వేతచామరైః

మాణిక్యముక్తా సంసక్తం హరివారసమన్వితం

రత్న ప్రదీపసంసక్తం రత్నసోపానసుందరం

అమూల్యరత్నపాత్రైశ్చ తల్పరాజి విరాజితం

అమూల్యరత్నచిత్రైశ్చ త్రిభిశ్చిత్ర విచిత్రితైః

తిసృభిః పరిఖాభిశ్చ త్రిభిర్ద్వారైశ్చ దుర్గమైః

యుక్తం షోడశకక్షాభిః ప్రతిద్వారేషు వాంతరం  

గోపీ షోడశలక్తైశ్చ సన్నియుక్తై రితస్తతః

వహ్నిశుద్ధాంశుకాధానైః రత్నభూషణ భూషితైః  

తప్తకాంచనవర్ణాభైః శతచంద్ర సమన్వితైః

రాధికాకింకరీ వర్గైః యుక్త మభ్యంతరం వరం

అమూల్యరత్న నిర్మాణ ప్రాంగణం సుమనోహరం

అమూల్యరత్న స్తంభానాం సమూ హైశ్చ సుశోభితం

రత్నమంగళకుంభైశ్చ ఫలపల్లవసంయుతైః

సంయుతం రత్నవేదీభిఃయుక్తా యుక్తాభిరీప్సితం

అమూల్యరత్నముకురైః శోభితం సుందరైరహో

అమూల్యరత్న నిర్మాణం భవనానాం వరం గృహం

రత్నసింహాసనస్థాచ గోపీలక్షైశ్చ సేవితా

కోటిపూర్ణసుశోభాడ్యా శ్వేతచంపకసన్నిభా

అమూల్యరత్న నిర్మాణ భూషణైశ్చ విభూషితా

అమూల్యరత్న వసనా భిభ్రతీ రత్నదర్పణం

రత్నపద్మంచ రుచిరం సవ్యదక్షిణహస్తతః

దాడింబకుసుమాకారం సిందూరం సుమనోహరం

సుశోభితం మృగమదైః ఇష్టైశ్చందన బిందుభిః

దధతీ కబరీభారం మాలతీమాల్య మండితం

రచితం వామభాగేన మునీంద్రాణాం మనోహరం

ఏవం భూతం తత్ర రాధా గోపీభిః పరి సేవితా

పుష్పించిన పారిజాత వనంతో చుట్టబడింది. సహస్రముల కొలది కల్పవృక్షములతో, నూర్ల కొలది పుష్పోద్యానములతో చుట్టబడింది. (21) అందమైన, పుష్పించిన రకరకాల పుష్పవృక్షములతో కూడి ఉంది. లక్షల గోపికలతో రక్షించబడింది. త్రికోటిరత్న భవనమది. (22) రత్నదీపములు కలది, రత్నతల్పములు కలది. నానాభోగములు కలది.నూర్లకొలది తేనెబావులతో చుట్టబడింది. (23) అమృతపు బావులు కలది, ఇష్టమైన భోగములతో కూడినది, గోలోకములోని గృహములను లెక్కించుటలోకాని, వర్ణించుటలోకాని విశారదుడైనవాడు (24) తెలిసిన విద్వాంసుడు కాని లేడు. తెలిసిన విద్వాంసుడు వ్రజేశ్వరుడొక్కడే. అమూల్య రత్నములతో నిర్మింపబడిన మూడు శిఖరముల భవనములతో (25) శోభించునది, సుందరమైనది,రమ్యమైనది, ఉత్తమమైనది, రాధా శిబిరము. అమూల్యమైన రత్న కలశములతో,రత్న దర్పణములతో ఉజ్జ్వలమైనది. (26) అమూల్యమైన రత్నస్తంభముల సమూహముతో వెలిగిపోతోంది. రకరకాలైన, విచిత్రములైన, చిత్రములతో చిత్రింపబడింది. శ్వేత చామరములు కలది.(27) మాణిక్యములు, ముత్యములు పొదగబడింది, పచ్చదనంతో (సమూహం) కూడింది. రత్నదీపములు కలది, రత్నసోపానములతో సుందరమైనది. (28) అమూల్యమైన రత్నపాత్రములతో కూడినది. తల్పముల (పడకల) సమూహముతో వెలుగుతోంది. అమూల్యమైన రత్నచిత్రములు కలది. రకరకాలైన చిత్రములు గలవి ఆ మూడు భవనాలు. (29) మూడు పరిఖలు మూడు ద్వారాలు ప్రవేశింపవీలులేనట్టివి ఉన్నాయి. పదహారుకక్ష్యలున్నాయి. ప్రతిద్వారమందును తెరిపి ఉంది (కక్ష్య కక్ష్యకు మధ్య ఎడమ) (30) ఇటునటు నియోగింపబడిన పదహారు లక్షల గోపికలు కలది. వహ్నిశుద్ధమైన (ఉడకబెట్టి పిండిన) వస్త్రములు ధరించి, రత్నభూషణములు ధరించి (31) కాల్చిన బంగారంలా మెరిసిపోతున్న నూరు చంద్రులు కలవారి వలె ఉన్న, రాధికాకింకరుల సమూహంగల శ్రేష్ఠమైన అభ్యంతరమది. (32) అమూల్యరత్నములతో నిర్మింపబడిన ఆ ప్రాంగణము చాలా మనోహరమైనది. అమూల్యమైన రత్నస్తంభముల సమూహంతో వెలిగిపోతోంది. (33) పండు చిగురుటాకులుగల రత్నములు పొదిగిన మంగళకుంభములు గలది. రత్న వేదికలు గలది. యోగ్యులైన మనుజులతో కూడినది. (ఆయుక్తజనియమింపబడినవాడు) (34) అమూల్యమైన రత్నముల అద్దములతో నిర్మింపబడినది. భవనములలో శ్రేష్ఠమైన గృహమిది. (35) రత్నసింహాసనమందు కూర్చున్నది. లక్షమందిగోపికలతో సేవించబడుతోంది. ఉత్తమమైన (కోటి) వానితో నిండినది, మంచి శోభగలది, తెల్లని చంపకపువ్వువలె ఉంది. (36) అమూల్య రత్నములతో నిర్మింపబడిన భూషణములతో అలంకరింపబడింది, అమూల్యమైన రత్నములు పొదిగినవస్త్రము ధరించింది, రత్న దర్పణం ఎడమ చేతిలో ఉంది. (37) అందమైన రత్నపద్మము కుడిచేతిలో ఉంది. దాడిమపూవు వంటి ఆకారము గల మనోహరమైన సిందూరము (నొసట) ఉంది. (38) ఇష్టమైన చందన బిందువులతో, కస్తూరితో శోభిస్తోంది. మాలతీమాలలతో అలంకరింపబడిన కేశపాశము గలది (39) ఎడమభాగంలో (కొప్పు) ఉంచబడింది. మునీంద్రులకు మనోహరమైనది. ఇట్లా ఉంది. అక్కడ రాధ గోపికలతో సేవించబడుతోంది.

మూశ్వేతచామర హస్తాభిః తత్తుల్యాభిశ్చ సర్వతః

అమూల్య రత్ననిర్మాణైః భూషితాభిశ్చ భూషణైః

మత్ర్పణాధిష్ఠాతృదేవీ దేవీనాం ప్రవరావరా  

సుదామ్నః సాచ శాపేన వృషభానసుతాఽధునా

శతాబ్దికోహి విచ్చేదో భవిష్యతి మయాసహ

తేన భారావతరణం కరిష్యామి భువః పితః

తదా యాస్యామి గోలోకం తయాసార్థం సునిశ్చితం

త్వయా యశోదయాచాపి గోపైర్గోపీభిరేవచ

వృషభానేన తత్సత్న్యా కలావత్యాచ బాంధవైః

ఏవంచ నందం సానందం యశోదాం కథయిష్యసి

త్యజ శోకం మహాభాగ వ్రజైః సార్థం వ్రజం వ్రజ

అహమాత్మాచ సాక్షీచ నిర్లిప్తః సర్వజీవిషు  

జీవో మత్ర్పతిబింబశ్చ ఇత్యేవం సర్వసమ్మతం

ప్రకృతిర్మద్వికారాచ సాఽప్యహం ప్రకృతిస్స్వయం

యథా దుగ్ధేచ ధావల్యం నతయోరేద ఏవచ

యథా జలే తథా శైత్యం యథా వహ్నౌచ దాటాకా

యథాకాశే తథాఽశబ్ధో భూమౌగంధో యథా నృప

యథా శోభాచ చంద్రేచ యథాదినకరే ప్రభా

యథాజీ వస్తథాత్మానం తథైవ రాధయాసహ

త్యజ త్వం గోపికాబుద్ధిం రాధాయాం మయి పుత్రతాం

అహం సర్వస్య ప్రభవః సాచ ప్రకృతిరీశ్వరీ

శాయతాం నందసా నందం మద్విభూతిం సుఖావహం

పురా యా కథితా, తాత బ్రహ్మణే వ్యక్తజన్మనే

కృష్ణోఽహం దేవతానాంచ గోలోకే ద్విభుజః స్వయం  

చతుర్భుజోఽహం వైకుంఠే శివలోకే శివః స్వయం

బ్రహ్మలోకేచ బ్రహ్మాఽహం సూర్య స్తే జస్వినామహం

పవిత్రాణామహం వహ్నిః జలమేవ ద్రవేషుచ

ఇంద్రియాణాం మనశ్చాస్మి సమీరః శీఘ్రగామినాం

యమోఽహం దండకర్తృణాం కాలః కలయతామహం

అక్షరాణామకారోఽస్మి సామ్నాంచ సామ ఏవచ

ఇంద్రశ్చతుర్దశేంద్రేషు కుబేరో ధనినా మహం

ఈశానోఽహం దిగీశానాం వ్యాపకానాం నభస్తథా

సర్వాంతరాత్మా జీవేషు బ్రాహ్మణశ్చా శ్రమేషుచ

ధనానాంచ రత్నమహం అమూల్యం సర్వదుర్లభం

తైజసానాం సువర్ణోఽమొహం మణినాంకౌస్తుభః స్వయం

శాలగ్రామస్త థార్చ్యానాం పత్రాణాం తులసీతిచ

పుష్పాణాం పారిజాతోఽహం తీర్ధానాం పుష్కరః స్వయం

వైష్ణవానాంకుమారోఽహం యోగీంద్రాణాం గణేశ్వరః  

సేనాపతీనాం స్కందోఽహం లక్ష్మణోఽహం ధనుష్మతాం

రాజేంద్రాణాంచ రామోఽహం నక్షత్రాణామహం శశీ

వారు తెల్లచామరములు చేత ధరించారు. అటువంటివే ధరించి అంతట ఉన్నారు. అమూల్య రత్నములతో నిర్మింపబడిన భూషణములతో అలంకరింపబడింది ఆమె. (41) నా ప్రాణమును అధిష్ఠించిన దేవి,దేవతా (త) స్త్రీలలో శ్రేష్ఠురాలు, ఉత్తమమైనది. ఆమె ఇప్పుడు సుదామునిశాపంతో వృషభానుని సుతగా పుట్టింది. (42) నాతో ఆమెకు విచ్చేదము నూరు సంవత్సరాల కాలము ఉంటుంది. ఓ తలిదండ్రులారా! దానితో భూభారాన్ని తొలగించగలను. (43) అప్పుడు ఆమెతో కలిసి గోలోకమునకు వెళ్తాను. ఇది నిశ్చయము. నీతో యశోదతో గోపకులతో గోపీజనంతో (స్త్రీలు) కలిసి వెళ్లాను. (44) వృషభానునితో, ఆతని భార్య కళావతితో, బాంధవులతో వెళ్తాను. ఈ విధంగా నందుని, యశోదను, ఆనంద పరవశులను చేస్తాను. (45) ఓ మహాభాగ! దుఃఖాన్ని వదలు, గొల్లలతో కలిసి ప్రజమునకు వెళ్ళు. నేను ఆత్మను, సాక్షిని, నిర్లిపుడనై అన్ని జీవుల యందును వర్తిస్తాను. (46) జీవుడు నా ప్రతిబింబము అని ఇట్లా అందరికి సమ్మతమైంది. ఆ ప్రకృతి నా వికారము. నేను స్వయంగా ప్రకృతిని (47) పాలల్లో తెలుపు ఎట్లా సహజమో, వాటిని విడదీయటం సాధ్యం కాదో నీటిలో చల్లదనమెట్లా సహజమో, అగ్నిలో కాల్చేగుణమెట్లాంటిదో (48) ఆకాశంలో శబ్దమెట్లాగో, భూమికి వాసనఎట్లా సహజమో ఓరాజ! చంద్రునిలో శోభ, సూర్యునిలో కాంతి ఎట్లా సహజమో (49) నాకు (ఆత్మ) జీవునకు అట్లాగే సహజబంధము. అట్లాగే రాధతో కూడాను. నీవు, రాధ, గోపిక అనే సాధారణ బుద్దిని విడిచి పెట్టు. నేను నీపుత్రుళ్లనే విషయాన్ని మరిచిపో. (50) నేను అన్నిటి పుట్టుకకు కారణమును. ఆప్రకృతి ఈశ్వరి. సుఖావహమైన, నా విభూతిని (గొప్పతనాన్ని) ఆనందంగా విను, ఓనందుడ! (51) ఇదివరలో వ్యక్తమైన (స్పష్టమైన) జన్మలో బ్రహ్మకు ఏది చెప్పానో, ఓ తండ్రి! అదే ఇది. దేవతలకు కృష్ణుణ్ణి. గోలోకంలో స్వయంగా రెండు చేతులవాణ్ణి. (52) వైకుంఠంలో నాలుగు చేతులవాణ్ణి. శివలోకంలో స్వయంగా శివుణ్ణి. బ్రహ్మలోకంలో బ్రహ్మను, తేజస్వంతులలో నేను సూర్యుణ్ణి. (53) పవిత్రమైన వానిలోనేను అగ్నిని, ద్రవపదార్థాలలో నేను జలమును. ఇంద్రియములలో మనస్సును. వేగంగా వెళ్ళే వాటిలో గాలిని నేను. (54) దండకర్తలలో (శిక్షించేవారు) నేను యముణ్ణి. తీసుకుపోయే వాళ్ళలో నేను కాలాన్ని (కాలుణ్ణి). అక్షరములలో అకారాన్ని సామములలో సామాన్ని. (55) పదునాల్గురు ఇంద్రులలో ఇంద్రుణ్ణి. ధనవంతులలో కుబేరుణ్ణి. దిగీశులలో ఈశానుణ్ణి. వ్యాపకులలో ఆకాశాన్ని నేను (56) జీవులలో సర్వాంతరాత్మను. ఆశ్రమములలో బ్రాహ్మణుడను. ధనములలో అమూల్యమైన, అందరికి దుర్లభమైన రత్నాన్ని (57) తైజసములలో బంగారాన్ని, మణులలో కౌస్తుభ మణిని స్వయంగా, పూజించ తగిన వానిలో సాలగ్రామాగ్ని నేను. పత్రములలో తులసిని (58) పుష్పములలో పారిజాతాన్ని నేను. తీర్థములలో స్వయంగా పుష్కరతీర్థాన్ని నేను. వైష్ణవులలో నేను కుమారుణ్ణి. యోగీంద్రులలో గణేశ్వరుణ్ణి (59) సేనాపతులలో నేను స్కందుణ్ణి. ధనుర్ధారులలో నేను లక్ష్మణుడను. రాజేంద్రులలో నేను రాముడను. నక్షత్రములలో నేను చంద్రుడను. (60)

మూII మాసానాం మార్గశీర్షోఽహం ఋతూనామస్మిమాధవః

వారేష్వాదిత్యవారోఽహం తిథి ష్వేకాదశీతిచ

సహిష్ణూనాంచ పృధివీ మాతాఽహం బాంధవేషుచ

అమృతం భక్ష్యవస్తూనాం గవేష్వాజ్యమహం తథా

కల్పవృక్షశ్చ వృక్షాణాం సురభిః కామధేనుడు

గంగాఽహం సరితాంమధ్యే కృతపాపవినాశినీ

వాణీతి పండితానాంచ మంత్రాణాం ప్రణవస్తథా

విద్యాసు బీజరూపోఽహం సస్యానాం ధాన్యమేవచ

అశ్వత్థః ఫలినామేవ గురుణాం మంత్రదః స్వయం

కశ్యపశ్చ ప్రజేశానాం గరుడః పక్షిణాం తథా

అనంతోఽహంచ నాగానాం నరాణాంచ నరాధిపః

బ్రహ్మర్షిణాం భృగురహం దేవర్షిణాంచ నారదః

రాజరీణాంచ జనకో మహర్షిణాం శుకస్తథా

గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలోమునిః

బృహస్పతి: బుద్ధిమతాం కవీనాం శుక్ర ఏవచ

గ్రహాణాంచ శనిరహం విశ్వకర్మాచ శిల్పినాం

మృగాణాంచ మృగేంద్రోఽహం వృషాణాం శివవాహనం

ఐరావతో గజేంద్రాణాం గాయత్రీ ఛందసామహం

వేదాశ్చ సర్వశాస్త్రాణాం వరుణో యాదసామహం

ఉర్వశ్యప్సరసామేవ సముద్రాణాం జలార్ణవః

సుమేరు పర్వతానాంచ రత్నవత్సు హిమాలయః

దుర్గాంచ ప్రకృతీనాంచ దేవీనాం కమలాలయా

శతరూపాచ నారీణాం మత్ప్రియాణాం చరాధికా

సాధ్వీనామపి సావిత్రీ వేదమాతాచ నిశ్చితం

ప్రహ్లాదశ్చాపిదైత్యానాం బలిష్టానాం బలి: స్వయం

నారాయణర్షిర్భగవాన్ జ్ఞానినాం మధ్య ఏవచ

హనుమాన్వానరాణాంచ పాండవానాం ధనంజయః

మనసా నాగకన్యానాం వసూనాంద్రోణ ఏవచ

ద్రోణోజలధరాణాంచ వర్షాణాం భారతం తథా

కామినాం కామదేవోఽహం రంభాచ కాముకీషుచ

గోలోకశ్చాస్మిలోకానాం ఉత్తమః సర్వతః పరః

మాతృకాసు శాంతిరహం రతిశ్చసుందరీషుచ

ధర్మోఽహం సాక్షిణాం మధ్యే సంధ్యాచ వాసరేషుచ

దేవేష్వహంచ మా హేంద్రో రాక్షసేషు విభీషణః

కాలాగ్నిరుద్రో రుద్రాణాం సంహారో భైరవేషుచ

శంఖేషు పాంచ జన్యోఽహం అంగేష్వపిచ మస్తకః

పరం పురాణసూతేషు చాహం భాగవతం వరం

భారతం చేతిహా సేషు పంచరాత్రేషు కాపీలం

స్వాయం భువో మనూనాంచ మునీనాం వ్యాసదేవకః

స్వధాహం పితృపత్నీషు స్వాహా వహ్నిప్రియాసుచ

అను!! మాసములలో మార్గశీర్షాన్ని, ఋతువులలో వసంతర్తువునూ వారములలో ఆదివారాన్ని తిథులలో ఏకాదశి తిథిని (61) ఓర్పుగల వారిలో భూమిని బంధువులలో తల్లిని. తిన తగిన వానిలో అమృతాన్ని. ఆవుకు చెందిన వానితో, నెయ్యిని (62) వృక్షములలో కల్పవృక్షాన్ని. ధేనువులలో కామధేనువును. నదులలో గంగను. అది చేసిన పాపములను తొలగించేది. (63) పండితులలో వాణిని (వాక్కును). మంత్రములలో ఓంకారాన్ని, విద్యలలో బీజస్వరూపాన్ని. సస్యములలో ధాన్యాన్ని. (64) పండే చెట్లలో అశ్వత్థ వృక్షాన్ని, గురువులలో మంత్రమిచ్చే గురువును. ప్రజలకు ఈశుడైన వారిలో కశ్యపుడను, పక్షులలో గరుడుడను. (65) పాములలో అనంతుడను. నరులలో నరాధిపుడను. బ్రహ్మరులలో భృగువును, దేతరులలో నారదుడను. (66) రాజర్పులలో జనకుడను, మహరులలో శుకుడను. గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలమునిని (67) బుద్ధిమంతులలో బృహస్పతిని, కవులలో శుక్రుడను, గ్రహములలో శనిని, శిల్పులలో విశ్వకర్మను. (68) మృగములలో మృగేంద్రమును, వృషభములలో శివుని వాహనమును గజేంద్రములలో ఐరావతమును, ఛందస్సులలో గాయత్రిని (69) సర్వశాస్త్రములలో వేదమును, యాదస్సులలో (జలజంతువులలో) వరుణుడను. అప్పరసలలో ఊర్వశిని. సముద్రములలో మంచినీటి సముద్రాన్ని. (త్రాగ తగిన నీరు) (70) పర్వతములలో సుమేరువును, రత్నములు కలవానిలో హిమాలయాన్ని, ప్రకృతులలో దుర్గను, దేవిలలో (స్త్రీలు) కమలాలయను (లక్ష్మిని) (71) స్త్రీలలో శతరూపను (బ్రహ్మకూతురు). నాకిష్టమైన ప్రియతమలలో రాధికను. సాధ్వులలో సావిత్రిని, వేదమాతను నేను నిశ్చయము. (72) దైత్యులలో ప్రహ్లాదుడను బలిషులలో బలిని. భగవాన్ నారాయణ ఋషిని. జ్ఞానుల మధ్యలో ఉంటాను. (73) కోతులలో హనుమంతుడను, పాండవులలో ధనంజయుడను. నాగకన్యలలో మనసను. వసులలో (మూలికలలో) ద్రోణమును (74) మేఘములలో (జలధరం) ద్రోణనామక మేఘమును. వరములలో (దేశం) భారత(దేశము)ను. కాములలో కామదేవుడను. కాముకులలో (స్త్రీలలో) రంభను. (75) లోకములలో గోలోకమును, ఉత్తమమైన, అన్నిటికన్న పరమైన లోకాన్ని, మాతృకలలో శాంతిని, సుందరీమణులలో రతిని (76) సాక్షులలో ధర్మాన్ని వాసరములలో సంధ్యను, దేవతలలో మహేంద్రుడను, రాక్షసులలో విభీషణుడను (77) రుద్రలలో కాలాగ్ని రుద్రుడను, సంహారులలో భైరవుడను. శంఖములలో పాంచజన్యాన్ని అవయవాలలో తలను. (78) పురాణ సూత్రములలో పరమైన, వరమైన భాగవతాన్ని నేను. ఇతిహాసములలో భారతాన్ని, పాంచరాత్రములలో కపిలునికి చెందినవాడను. (79) మనువులలో స్వాయంభువమనువును, మునులలో వ్యాసదేవుడను. పితృపత్నులలో స్వధను, వహ్ని ప్రియలలో స్వాహాను.

మూ యజ్ఞానాం రాజసూయోఽహం యజ్ఞపత్నీషు దక్షిణా

శస్త్రాస్త్రజ్ఞేషు రామోఽహం జమదగ్నిసుతోమహాన్

పౌరాణికేషు సూతోఽహం నీతివత్స్వంగిరామునిః

విష్ణువ్రతం వ్రతానాంచ బలానాం దైవమేవచ

ఓషధీనామహం దూర్వా తృణానాం కుశమేవచ

ధర్మకర్మసు సత్యంచ స్నేహపత్రిషు పుత్రకః

అహం వ్యాధిశ్చ శత్రూణాం జ్వరో వ్యాధిష్వహం తథా

మద్భక్తిష్వపి మద్దాస్యం వరేషుచ వరః స్మృతః

ఆశ్రమాణాం గృహస్థోఽహం సంన్యాసీ చ వివేకినాం

సుదర్శనంచ శస్త్రాణాం కుశలంచ శుభాషిషాం

ఐశ్వర్యాణాం మహాజ్ఞానం వైరాగ్యంచ సుఖేష్వహం

మిష్టవాక్యం ప్రీతిదేషు దానేషు చాత్మదానకం

సంచయేషు ధర్మకర్మ కర్మణాంచ మదర్చనం

కఠోరేషు తపశ్చాహం ఫలేషు మోక్ష ఏవచ

అష్టసిద్ధిషు ప్రాకామ్యమహం కాశీ పురీషుచ

నగరేషు తథా కాంచీ సదేశో యత్ర వైష్ణవః

సర్వాధారేషు స్థూలేషు అహమేవ మహాన్విరాట్

పరమాణురహం విశ్వే మహాసూక్ష్మేషు నిత్యశః

వైద్యానాం అశ్వినీపుత్రౌ చౌషధీషు రసాయనం

ధన్వంతరిర్మంత్ర విదాం విషాదః క్షయకారిణాం

రాగాణాం మేఘమల్లారః కామోదస్తత్ప్రి యాసుచ

మత్పార్షదేషు శ్రీదామా మద్బంధుష్వహముద్ధవః  

పశు జంతుషు గౌశ్చాహం చందనం కాననేషుచ  

తీర్థపూతశ్చపూతేషు నిఃశంకేషుచ వైష్ణవః

నవైష్ణవాత్సరః ప్రాణీ మన్మంత్రోపాసకశ్చ యః

వృక్షేష్వంకుర రూపోఽహమాకారః సర్వవ స్తుషు

అహంచసర్వభూతేషు మయసర్వేచ సంతతం

యథా వృక్షే ఫలాన్యేవ ఫలేషుచాంకురస్తరోః

సర్వకారణరూపోఽహం నచ మత్కారణం పరం

సర్వేశోఽహం నమేఽధీశో హ్యహం కారణ కారణం

సర్వేషాం సర్వబీజానాం ప్రవదంతి మనీషిణః

మన్మాయామోహితజనాః మాం నజానంతి పాపినః

పాపగ్రస్తేన దుర్బద్ద్యా విధినా వంచితేనచ

స్వాత్మాఽహం సర్వజంతూనాం స్వామ్యహం నాదృతః స్వయం

యత్రాహం శక్తయస్తత్ర క్షుత్పిపాసాదయస్తథా

గతే మయితథా యాంతి నరదేహే యథాఽనుగాః

హేవ్రజేశ! నంద! తాత జ్ఞానం జ్ఞాత్వా వ్రజం వ్రజ

కథయస్వచ తాం రాధాం యశోదాం జ్ఞానమేవచ

జ్ఞాత్వా జ్ఞానం వ్రజేశశ్చ జగామ స్వానుగైః సహ

గత్వాచ కథయామాస తెద్వేచ యోషితాం వరే

తేచసర్వే జహుః శోకం మహాజ్ఞానేన నారద

కృష్ణో యద్యపి నిర్లిప్తో మాయేనో మాయయా రతః

యశోదయా ప్రేరితశ్చ పునరాగత్య మాధవం

తుష్టావ పరమానందం నందశ్చ నందనందనం

సామవేదోక్త స్తోత్రేణ కృతేన బ్రహ్మణా పురా

పుత్రస్య పరతః స్థిత్వా రురోదచ పునః పునః

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారద సంవాదేనందాది శోక ప్రమోచనం నామ త్రిసప్తతి తమోఽధ్యాయః

అను యజ్ఞములలో రాజసూయమును, యజ్ఞపత్నులలో దక్షిణను, శస్త్రాస్త్రములు తెలిసిన వారిలో రాముడను, గొప్పనైనవాణ్ణి జమదగ్ని సుతుడను, (81) పౌరాణికులలో సూతుడను, నీతిమంతులలో అంగిరస మహర్షిని వ్రతములలో విష్ణువుకు చెందిన వ్రతాన్ని, బలములో దైవబలాన్ని (అదృష్టం) (82) ఓషధులలో దూర్వను, తృణములలో కుశగడ్డిని (దర్బ), ధర్మకర్మలలో సత్యాన్ని స్నేహ పాత్రులలో పుత్రుణ్ణి (83) నేను శత్రువులకు వ్యాధిని, అట్లాగే వ్యాధులలో జ్వరాన్ని - నాభక్తు (కలవారి) లలో నాదాస్యము శ్రేష్ఠమైన వానిలో శ్రేష్టమైనది. (84) ఆశ్రమములలో గృహస్థాశ్రమాన్ని, వివేకులలో సన్యాసిని. శస్త్రములలో సుదర్శనాన్ని శుభాశీస్సులలో కుశలవార్తను (85) ఐశ్వర్యములలో మహాజ్ఞానాన్ని, సుఖములలో వైరాగ్యాన్ని, ప్రీతిని ఇచ్చే వాటిలో మథురమైన వాక్యాన్ని, దానములలో ఆత్మదానాన్ని, (86) సంచయములలో (సంపాదించినది), ధర్మకర్మను, కర్మలలో నాపూజను నేను. కఠోరమైన వానిలో తపస్సును, ఫలములలో మోక్షఫలాన్ని (87) అష్టసిద్ధులలో ప్రాకామ్యాన్ని (కోరికలు స్వేచ్ఛ), పురములలో కాశీపురిని, నగరములలో కాంచి నగరాన్ని, వైష్ణవుడున్న ప్రదేశాన్ని నేను, (88) స్థూలమైన సర్వ ఆధారములలోను, నేనే మహా విరాట్ స్వరూపుడిని. విశ్వంలో నేను పరమాణు రూపుడను మహాసూక్ష్మమైన వాటిలో ఎప్పుడూ ఉంటాను. (89) వైద్యులలో అశ్వినీ పుత్రులుగా నేనే, ఓషధులలో రసాయనాన్ని, మంత్ర విదులలో ధన్వంతరిని క్షయకారులలో విషాదాన్ని (90) రాగములలో మేఘమల్పారాన్ని ఆతని ప్రియమైన వానిలో, కామ(మో) దుడను, నా పారదులలో శ్రీరాముడను, నాబంధువులలో ఉద్దవుడను. (91) పశు జంతువులలో గోవును, కాననమందు చందన వృక్షాన్ని. పవిత్రమైన వానిలో తీర్థపవిత్రుడను, నిఃశంకులలో (శంకలేని వాడు) వైష్ణవుడను. నామంత్రము నుపాసించే ప్రాణి వైష్ణవుడెవడున్నాడో వానిని మించిన ప్రాణి లేదు. వృక్షములలో అంకురరూపుణ్ణి. అన్ని వస్తువులలో ఆకారాన్ని (93) అన్ని ప్రాణులలో, నేనున్నాను. నాలో అన్ని ఎల్లప్పుడున్నాయి. వృక్షమందు పండ్లు. పండ్లలో వృక్షమునకు కావలసిన మొలక ఉన్నట్లే నేనున్నాను. (94) అన్నిటికి కారణరూపుణ్ణి నేను. నాకు పరమైనకారణం లేదు. నేనందరికి ఈశుడను. నాకు అధీశుడు లేడు. నేను కారణానికి కారణాన్ని. (95) అందరికి, అన్ని బీజములకు బీజంగా మనీషులు చెప్తారు. నా మాయతో మోహింపబడ్డ జనులు, పాపులు నన్ను తెలుసుకోలేరు. (96) పాపగ్రస్తమైన దుర్జుద్ధితోగాని, విధితో వంచింపబడికాని నన్ను తెలుసుకోలేరు. అన్ని ప్రాణులకు ఆత్మను నేను, స్వామిని నేను స్వయంగా ఆదరింపబడలేదు. (97) నేనున్న చోట శక్తులుంటాయి, ఆకలిదప్పులు మొదలైన వుంటాయి. నేను వెళ్లే అవీ వెళ్తాయి. నరదేహమందు, అనుసరించిన వాళ్ళు వెళ్ళినట్లుగా (98) ఓప్రజేశ! నంద! తండ్రి! జ్ఞానాన్ని తెలుసుకొని ప్రజమునకు వెళ్ళు. ఆ రాధకు, యశోదకు జ్ఞానాన్ని బోధించు. (99) జ్ఞానాన్ని తెలుసుకొని ప్రజేశుడు తన అనుచరులతో కలిసి వెళ్ళాడు. వెళ్లి శ్రేష్ఠులైన ఆ ఇద్దరు స్త్రీలకు చెప్పాడు. (100) వారంతా శోకాన్ని విడిచారు, మహాజ్ఞానం కలవారైనారు, ఓ నారద! కృష్ణుడు నిర్లిప్తుడు ఐనా మాయకు ఈశుడు, మాయారతుడు. (101) యశోదతో ప్రేరేపింపబడి, తిరిగి మాధవుని దరికి వచ్చి, పరమానందుడైన నందనందనుని, నందుడు సంతోషింపచేశాడు. (102) సామవేదంలో చెప్పిన స్తోత్రంతో, బ్రహ్మ ఇదివరలో చేసిన (స్తోత్రంతో) దానితో, పుత్రుని ఎదురుగా నిలబడి మాటిమాటికి రోదించాడు. (103) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ మందు ఉత్తరార్ధంలోని నారాయణ నారద సంవాదమందు నందాదుల -- శోకమును తగ్గించట (తొలగించడం) మనునది (ఓదార్పు) డెబ్బది మూడవ అధ్యాయము. (73)