మూII నారాయణ ఉవాచ:
దేవానాం స్తవనం శ్రుత్వా త్యక్త్యాచ రోదనం సతీ ।
ఉవాచ సుప్రసన్నాతాంస్తేషాం స్తోత్రేణ నారద ॥
మహాలక్ష్మీ రువాచ:
త్యజామిదేహం నక్రోధాన్న వైరాగ్యేణ సాంప్రతం ।
ఇదం హృది సమాలోచ్య దేవాస్తచ్చ్రూయతామితి ॥
యస్మిన్ సదీశే మహతి సర్వసామ్యేచ నిర్గుణే ।
సర్వాత్మని సదానందే సమతా తృణ శైలయోః ॥
భూభంగలీల యాలక్ష్మీ లక్షంస్రష్టుమలం చయః ।
భృత్యే స్త్రియాం యత్సమతా కిం కార్యం తస్య సేవయా॥
తత్పత్నీనాం ప్రధానాహం నిరస్తా ద్వారిణాఽధునా ।
తద్భృత్య భృత్య భృత్యేన పరిపూర్ణేననేప్సితా ॥
త్యక్ష్యామి జీవన మహం అసౌభాగ్యాచ స్వామిని ।
వహ్నౌచ కామనాం కృత్వా యథాభద్రం భవేత్పురా ॥
యాస్త్రీ భర్తురసౌభాగ్యా సాఽసౌభాగ్యాచ సర్వతః ।
శయనే భోజనే తస్యాన సుఖం జీవనం వృథా ॥
యస్యా నాస్తి ప్రియప్రేమ తస్యా జన్మ నిరర్థకం ।
తత్కిం పుత్రే ధనే రూపే సంపత్తౌ యౌవనేఽథవా ॥
యద్భక్తిర్నాస్తి కాంతేచ సర్వప్రియతమే పరే ।
సాఽశుచిర్ధర్మహీనాచ సర్వకర్మ వివర్జితా ॥
పతిర్బంధుర్గతి ర్భర్తా దైవతం గురురేవచ ।
సర్వస్మాచ్చ పరః స్వామీ న గురుః స్వామినః పరః ।
పితా మాతా సుతో భ్రాతా క్లిష్టా దాతు మిదం ధనం ।
సర్వస్వదాతో స్వామీ చ మూఢనాం యోషితాం సురాః ॥
కాచిదేవ జానాతి మహాసాధ్వీచ స్వామినం ।
అతిసద్వంశజాతాచ సుశీలా కులపాలికా॥
అసద్వంశ ప్రసూతా యా దుఃశీలా ధర్మవర్జితా ।
ముఖదుష్టా యోని దుష్టా పతిం నిందతి కోపతః ॥
అను! నారాయణుడిట్లన్నాడు - దేవతలస్తోత్రాన్ని విని, సతి, రోదనమునుమాని వారి స్తోత్రంతో మిక్కిలి ప్రసన్నురాలై వారితో ఇట్లా అంది, నారద! (1) మహాలక్ష్మి ఇట్లా అంది - నా శరీరాన్ని కోపంతో విడువటం లేదు. వైరాగ్యంతోనూ ఇప్పుడు వదలటం లేదు. దీనిని హృదయంలో ఆలోచించాను, ఓ దేవతలారా! దానిని వినండి అని అంది (2) సర్వసామ్యుడు, నిర్గుణుడు, గొప్పనైన ఏ ఈశుడుండగా అన్ని ఆత్మలు ఎల్లప్పుడు ఆనందమందుండగా, తృణము పర్వతము ఈరెంటికి సమమై యుండగా (3) తనకను బొమల కదలికల లీలతో లక్షల లక్ష్మిలను (లక్ష్మిలాంటివారిని) సృష్టించ సమర్థుడైయుండగా, భృత్యుని యందు, స్త్రీయందును ఎవడు సమంగా ప్రవర్తిస్తాడో, అతని సేవచేసి ప్రయోజనమేమి (4) నేను ఆతని భార్యలలో ప్రధానురాలిని. ఇప్పుడు ద్వారపాలకునితో వారింపబడ్డాను. ఆతని భృత్యుని భృత్యుని భృత్యునితో వారింపబడి పరిపూర్ణునితో కోరబడలేదు. (5) అందువల్ల నా జీవితాన్ని వదిలేస్తున్నాను. దురదృష్టవంతురాలైన యజమానురాలిని. అగ్ని యందు కోరికను ఏర్పరచుకొని ముందు మంచి జరిగేందుకై వదిలేస్తున్నాను. (6) ఏ స్త్రీ భర్తకు సౌభాగ్యురాలు కాదో, ఆమె అన్ని విధముల అసౌభాగ్యురాలు 'శయనమందు, భోజనమందు ఆమెకు సుఖంలేదు. ఆమె బ్రతుకు వ్యర్థము. (7) ప్రియుని ప్రేమలేని స్త్రీ జన్మ నిరర్థకము. అలాంటప్పుడు పుత్రుడు, ధనము, రూపము, సంపద, యౌవనము ఉండి ఏం ప్రయోజనము. (8) ఇతరమంతా ప్రియమైనదై కాంత(స్త్రీ)యందు భక్తిలేకపోతే, ఆమె అశుచురాలు, ధర్మహీనురాలు, అన్ని కోరికలతో వర్ణింపబడినది. (9) పతియే బంధువు, గతి, భర్తయే దైవతము, గురువు కూడా. అన్నింటి కన్నను స్వామి పరుడు. గురువు స్వామికన్న గొప్పవాడు కాడు. (10) తండ్రి తల్లి సుతుడు భాత వీరంత ఈ ధనమివ్వటానికి కష్టపడుతారు. మూడులైన స్త్రీలకు దేవతలు సర్వస్వదాత, స్వామి (11) ఎవతో ఒకతె మాత్రమే మహాసాధ్వి స్వామిని గుర్తించగలుగుతుంది. మిక్కిలి గొప్పకులంలో పుట్టినది మాత్రమే, మంచి శీలము గలది, కులపాలిక మాత్రమే గుర్తిస్తుంది.(12) అసద్వంశంలో జన్మించింది, దుఃశీల, ధర్మం విడిచి పెట్టింది, నోటిదుష్టతనం, యోనిదుష్టతనంగలది కోపంతో పతిని నిందిస్తుంది.
మూ॥ యా స్త్రీ సర్వపరం ద్వేష్టి పతిం విష్ణు సమం గురుం ।
కుంభీపాకే పచతి సా యావదింద్రశ్చతుర్ధశ ॥
వ్రతం చానశనం దానం సత్యం పుణ్యం తపశ్చిరం ।
పతిభక్తి విహానాయ భస్మీ భూతం నిరర్థకం ॥
అతః కించిన్న వక్ష్యామి నిష్టురం పతిమీశ్వరం ।
భృత్యాపరాధైర్దేవస్య ప్రాణాంస్త్యక్ష్యామినిశ్చితం ॥
పతి దోషే మహాసాధ్వీపతిం చానిష్ఠురం వదేత్ ।
యదిసోడుమశక్తాచ ప్రాణాంస్త్యజ్యతి ధర్మతః ॥
పతి సేవా వ్రతం స్త్రీణాం పతి సేవా పరం తపః ।
పతి సేవా పరోధర్మః పతి సేవా సురార్చనం ॥
పతి సేవా పరం సత్యం దానతీర్థానుకీర్తనం ।
సర్వదేవమయః స్వామీ సర్వదేవమయః శుచిః ॥ .
సర్వపుణ్యస్వరూపశ్చ ప్రతిరూపీజనార్దనః ।
యాసతీభర్తురుచ్ఛిష్టం భుంక్తే పాదోదకం సదా ॥
తస్యా దర్శముపస్పర్శం నిత్యం వాంఛంతి దేవతాః ।
తతః సర్వాణి తీర్థాని పునంతి పాపినో హ్యఘాత్॥
ఇత్యుక్త్యాచ మహాసాధ్వీ రురోదచ ముహుర్ముహః ।
ఉవాచ బ్రహ్మా భీతశ్చ భక్తి నమ్రాత్మకంధరః ॥
బ్రహ్మోవాచ:
భవిష్యతి న భద్రంచజయస్య విజయస్యచ ।
త్వయా, న శప్తౌ తౌముడౌ ప్రియాపరాధభీతయా ॥
సాపరాధంచ ధర్మిష్ఠః క్షమయా న శ పేద్యది ।
సర్వనాశోభవేత్తస్య నిశ్చితం మాచిరం సతి ॥
యదిశప్తుం సశక్తశ్చ న దండం కర్తుమీశ్వరః ।
సాపరాధేచ పురు షే ధర్మో దండం కరోతిచ ॥
సర్వం క్షమస్వ హేమాతః గచ్ఛగచ్ఛ ప్రియాంతికం ।
మాంచ త్వత్స్వామినో భక్తం నియోజ్యం సృష్టి కర్మణి ।
అను/ఏ స్త్రీ అందరికంటే పరుడైన పతిని, విష్ణువుతో సమానమైనవాణ్ణి, గురువును ద్వేషిస్తుందో ఆ స్త్రీ పదునాల్గురింద్రు లున్నంతకాలం కుంభీపాకనరకంలో వండబడుతుంది. (14) వ్రతం, భోజనం చేయకపోవటము, దానము, సత్యము, పుణ్యం చిరకాల తపస్సు, ఇవన్నీ పతిభక్తి లేని స్త్రీకి భస్మమౌతాయి, వ్యర్థము కూడా. (15) అందువల్ల నిష్టురుడైన పతియైన, ఈశ్వరుని (ప్రభువు) ఏమీ అనటంలేదు (కఠినంగా). దేవుని యొక్క భృత్యుల అపరాధం వల్ల తప్పకుండా ప్రాణములను వదులుతాను (16) పతిదోషమందు మహాసాధ్వి పతిని నిష్టురంగా పలుకరాదు. ఒకవేళ సహించడానికి అశక్తురాలైతే ధర్మంగా ప్రాణాలను వదలాలి. (17) స్త్రీలకు పతి సేవ వ్రతము, పతిసేవ పరమైన తపస్సు. పతి సేవ పరమమైన ధర్మము, పతి సేవ దేవపూజ కూడ. (18) పతి సేవ ఉత్తమమైన సత్యము. దానతీర్థముల ప్రకటనము. స్వామి అన్ని దైవతములు కలవాడు, సర్వదేవమయుడు శుచి. (19) సర్వపుణ్యస్వరూపుడు, ప్రతిరూపంలోనున్న జనార్దనుడు. ఏసతి భర్త ఎంగిలిని తింటుందో, ఎప్పుడూ భర్త పాదోదకాన్ని సేవిస్తుందో (20) ఆమె ధర్శనాన్ని స్పర్శనురోజు దేవతలు కోరుకుంటారు. అందువల్ల పాపుల పాపం నుండి అన్ని తీర్థములు పవిత్రమౌతాయి. (21) అని పలికి ఆ మహాసాధ్వి మాటిమాటికి ఏడ్చింది. అప్పుడు బ్రహ్మ భయపడి భక్తితో తన తలను వంచుకొని ఇట్లన్నాడు. (22) బ్రహ్మఇట్లన్నాడుజయునకు విజయునకు క్షేమం కలగదు. ప్రియునకు అపరాధమౌతుందనే భీతితో నీవు ఆ మూఢులను శపించలేదు. (23) ధర్మిష్ణుడు, ఓర్పుతో అపరాధం చేసిన వానిని కూడా శపించకపోతే వాని సర్వనాశమౌతుంది. తప్పదు. ఓ సతి త్వరలో ఔతుంది (24) శపించుటకు అశక్తుడై దండించటానికి సమర్థుడు కాకపోతే, సాపరాధుడైన పురుషుని ధర్ముడు దండిస్తాడు. (25) ఓ తల్లి! అన్నింటిని క్షమించు. ప్రియుని సమీపానికి వెళ్ళు. నీ స్వామిభక్తుడనైన నన్ను సృష్టికర్మయందు నియోగించ తగినవాణ్ణి, క్షమించు(26)
మూ॥ ఇత్యుక్త్వా తాం పురస్కృత్య సార్థం దేవైర్మునీంద్రకైః ।
శీఘ్రం జగామ వైకుంఠం వైకుంఠం స్తోతుమీశ్వరః ॥
తత్ర గత్వా జగన్నాథం తుష్టావ కమలాసనః ।
చతుర్వ క్రైశ్చతుర్వక్త్రః చతుర్వేదవిదాం గురుం ॥
బ్రహ్మణః స్తవనం శ్రుత్వా దృష్ట్వాలక్ష్మీం పురఃసరాం ।
రుదంతీం నమ్రవదనామువాచ కమలాపతిః ॥
శ్రీభగవానువాచ :
సర్వం జానామి సర్వజ్ఞః సర్వాత్మా సర్వపాలకః ।
సర్వశాస్తాచ సర్వాధికారణం కమలోద్భవ ॥
భక్తౌ కలత్రే బంధౌచ సర్వత్ర సమతా మమ ।
విశేషతోఽతి మద్భక్తః కలత్రాత్పర ఏవచ ॥
మద్భక్తౌ తవ పుత్రౌచ ద్వారపాలౌ దురంతరౌ ।
క్షమ మామపరాధంచ తయోశ్చ భక్తిపూర్ణయోః॥
మద్భక్తి పూర్ణో బలవాన్ దైత్యేభ్యో న బిభేతిచ ।
రక్షితో మమ చక్రేణ భక్తి మాధ్వీకదుర్మదః ॥
ఇత్యుక్త్వా జగతాం నాథో లక్ష్మీం కృత్వా స్వవక్షసి ।
సమానీయ ద్వారపాలం తమువాచేదమేవచ ॥
మాభై: వత్స సుఖం తిష్ఠ భయం కిం తే మయి స్థితే ।
మద్భక్తానాంచ కః శాస్తా గచ్ఛవతాత్మనః పదం ॥
ఇత్యుక్త్వా భగవాంస్తత్ర విరరామ మహామునే ।
యయుర్దేవాశ్చ స్వస్థానం ప్రణమ్య జగదీశ్వరం ॥
నారాయణవచః శ్రుత్వా ద్వారపాల ఉవాచ తం ।
పులకాంచిత సర్వాంగో భక్తినమ్రాత్మ కంధరః ॥
జయ ఉవాచ:
నాహం బిభేమి దేవాంశ్చ లక్ష్మీం మునిగణాంస్తథా ।
త్వదీయ చరణాంభోజ ధ్యానైకతాన మానసః ॥
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మ ఖండే నారాయణ నారద సంవాదే ఉత్తరార్ధే వైరాగ్య మోచనం నామ సప్త పంచాశత్తమోఽధ్యాయః॥
అను! అని పలికి ఆమెను ముందుంచుకొని దేవతలతో మునీంద్రులతో కూడి వైకుంఠుని స్తుతించుటకై ఈశ్వరుడు (బ్రహ్మ) వేగంగా వైకుంఠమునకు వెళ్ళాడు. (27) అక్కడికి వెళ్ళి కమలాసనుడు జగన్నాథుని స్తుతించాడు, నాల్గు ముఖములవాడు, నాలు ముఖములతో నాలుగు వేదముల నెరిగిన గురువును స్తుతించాడు. (28) బ్రహ్మయొక్త స్తుతిని విని, ముందున్న లక్ష్మిని చూచి, కమలాపతి, ఏడుస్తున్న, తలవంచుకున్న ఆమెతో ఇట్లన్నాడు. (29) శ్రీభగవంతుని మాట ఇట్లా- నేను సర్వజ్ఞు, నాకంతా తెలుసు అన్ని ఆత్మలలో ఉన్నాను, అందరిని పాలిస్తున్నాను. అన్నిటిని శాసించేవాణ్ణి, అన్నిటికి ఆది కారణమును, ఓ కమలోద్భవ! (30) భక్తుని యందు, భార్య యందు బంధువు యందు అంతటా నాకు సమబుద్ధి. విశేషించి అతిగా నా భక్తుడైన వాడు భార్యకన్నా పరుడే (ఎక్కువే). (31) నాభక్తులు నీ పుత్రులు ద్వారపాలురు అంతంచేయుటకు సాధ్యం కాని వారు, వారు. నన్ను భక్తి పూర్ణులైన వారి అపరాధమును సహించు (32) నా భక్తిపూర్ణుడైనవాడు బలవంతుడు, రాక్షసుల నుండి భయపడడు. భక్తి అనే ఇప్పకల్లుతో బాగా మదించినవాడు నా చక్రంతో రక్షింపబడతాడు. (33) అని పలికి జగన్నాథుడు లక్ష్మిని తన వక్షమందుంచుకొని, ద్వారపాలుని పిలిచి, అతనితో ఇదే అన్నాడు. (34) ఓ వత్స! భయపడొద్దు. సుఖంగా ఉండు. నేనుండగా నీకు భయమెందుకు నా భక్తులను శాసించేవాడెవడు. ఓ వత్స! నీ స్థానానికి వెళ్ళు (35) అని పిలికి ఓ మహాముని, అక్కడ భగవంతుడు విరమించాడు. దేవతలు, స్వస్థానానికి, జగదీశ్వరుని నమస్కరించి వెళ్ళారు. (36) నారాయణుని మాటలను విని ద్వారపాలురు ఆతనితో ఇట్లా అన్నారు. అన్ని అవయవములందు, పులకాంకురములెత్తగా, భక్తితో తమతల వంచుకున్నవారై అన్నారు. (37) జయుడిట్లా - నేను దేవతలకు, లక్ష్మికి, మునిగణములకు భయపడను. నీ పాదాంభోజముల ధ్యానమందే లగ్నమైన మనస్సు కలవాణ్ణి, అని అన్నాడు. (38) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్య ఖండమందు నారాయణ నారద సంవాదమందు ఉత్తరార్ధ మందు వైరాగ్య మోచనమనునది ఏబడి ఏడవ అధ్యాయము సమాప్తము. (57)
Summary of chapter 57 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Sensing Sudāmā's hesitation, Lord Kṛshṇa snatched the tiny pouch of flattened rice from his hands and ate two handfuls with ecstatic delight, declaring that this gift satisfied Him more than all the sacrifices in the universe. Although Sudāmā returned to his village empty-handed without asking for any favor, he was astonished to find his humble broken hut transformed overnight into a magnificent jeweled palace outshining the celestial abodes, filled with endless wealth, silk garments, and devoted servants sent by Kṛshṇa's grace, realizing that the Lord rewards even the smallest offering made with pure love a millionfold.