58 - అధ్యాయము

మూ! శ్రీమన్నారాయణ ఉవాచ:

బభూవ దర్పః పృథ్యాశ్చ సర్వాధారాఽహమేవచ ।

పృథుద్వారాచ తద్దర్పం జఘాన చైవతత్ప్రభుః ॥

బభూవదర్పం సావిత్ర్యా వేదమాతాఽహమేవచ ।

కాలేచ కార తస్యాశ్చ సపుత్రాయా అదర్శనం ॥

బభూవ దర్పో గంగాయా అహం నిర్వాణదేతిచ ।

జహ్ను ద్వారాచ తద్దర్పం జహార జగతాం పతిః ॥

జహారమనసాదర్పం దుర్గా ద్వారా పురామునే ।

విరజోపగతం కృష్ణం భర్త్సయా మాస కోపతః ॥

ప్రవిశంతం రాసగృహం గోపీభిః వినివారితం ।

దౌవారికాభిః వేత్రైశ్చ దాడితం తంచ దర్పతః ॥

సుదామ్నా నిజభక్తేన రాధా శప్తా బభూవ హ ।

దైవేన సహసా ధ్వస్తా గోలోకాదాగతా ధరాం ॥

వృషభానుస్త్రీయం జాతా, కలావత్యాంచ నారద ।

కృష్ణస్తదనురోధేన కంపభీతిచ్ఛలేనచ ॥

సమాగతో నందగేహం తేనాహం నందనందనః ।

సుదామ్నం శాపవిచ్ఛేద పాలనార్థం జగత్పతిః ॥

పునర్జగామ మధురామిత్యాహ కమలోద్భవః ।

అస్యాః పరమభిప్రాయం కోవా జానాతి నారద ॥

కథం జాతః సమాయాతో మధురాయాశ్చ గోకులం ।

ఇత్యేవం కథితం సర్వమపరం శ్రూయతామితి ॥

యథా జగామ మధురాం నందాత్సనందనందనః ।

శోకం నందో, యశోదాచ యథా సంప్రాప దైవతః ॥

యథా గోపాశ్చ గోప్యశ్చ గావో వృందావనే వనే ।

వనే వనే వా వన్యా స్తే వన్యా జానంతి కించన ॥

వనంరమ్యం వన్యపదమపి త్యక్త్వా వనే వనే ।

శ్మశానేవాఽశ్మ శానేవా బభ్రామ భామినీ మునే ॥

గ్రామంఽత్యక్త్వాచ బభ్రామ చేతనాఽచేతనా క్షణం ।

క్షణేన వర్జితా సాచ ప్రార్థయంతీ ప్రతిక్షణం ॥

క్షణం క్షణం సా శ్వసంతీ చింతనం కుర్వతీ క్షణం ।

క్షణం విశంతీ తల్పే చ క్షణముత్థాయ తిష్ఠతి ॥

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే అష్ట పంచాషత్తమోఽధ్యాయః.

శ్రీనారాయణుడిట్లన్నాడు:

అన్నిటికి ఆధారము నేనే అని పృథివికి దర్పమేర్పడింది. ఆ దర్పాన్ని పృథు మహారాజుద్వారా ప్రభువు సంహరింప చేశాడు. (1) వేదమాతను నేనే అని సావిత్రికి దర్పమేర్పడింది. ఒక సందర్భంలో పుత్రులతో కూడిన ఆమెను కన్పించకుండా చేశాడు.(2) నేనే నిర్వాణాన్ని ఇచ్చే దాన్ని అని గంగకు దర్పమేర్పడింది. జగత్పతి ఆమె' దర్పాన్ని జహ్నుద్వారా హరింపజేశాడు (3) ఓ ముని! ఇది వరలో మనసదర్పమును దుర్గ ద్వారా హరింపజేశాడు. విరజను చేరిన కృష్ణుని కోపంతో బెదిరించసాగింది. (4) రాస గృహంలో ప్రవేశిస్తున్న వానిని గోపికలు నివారించారు. ద్వారపాలకులు, వేత్రహస్తులు దర్పంతో అతనిని కొట్టారు (5) తన భక్తుడైన సుదామునితో రాధ శపింపబడింది. త్వరగా దైవంతో తోసివేయబడి గోలోకం నుండి భూలోకానికి వచ్చింది. (6) వృషభాను భార్యయందు కలావతి యందు పుట్టింది, ఓ నారద (కృష్ణుడు) ఆమెను అనుసరిస్తూ కంసుని భయమనే నెపంతో (7) నందుని గృహమునకు వచ్చాను. అందుకే నన్ను నందనందను డంటారు. సుదాముని శాపవిచ్ఛేదమును పాలించే కొరకు జగత్పతి వచ్చాడు (8) తిరిగి మధురకు వెళ్ళాడు అని బ్రహ్మ అన్నాడు. ఈతని గొప్ప అభిప్రాయాన్ని ఎవరు తెలుసుకుంటారు, ఓ నారద! (9) ఎట్లా పుట్టాడు, మధుర నుండి గోకులానికి ఎట్లా వచ్చాడు, 'అని ఈవిధముగా చెప్పినది అంతా ఇంకా విను అని (10) నందుని నుండి నందనందనుడు మధురకెట్లా వెళ్ళాడో, నందుడు యశోద, దైవం వల్ల దుఃఖాన్నేట్లా పొందారో (11) ఎట్లా గోపులు, గోపికలు, ఆవులు, వృందావన మందు దుఃఖించారో విను. ప్రతి అడవి యందు వనంలో నివసించే వాళ్ళున్నారు. ఆ వన్యులు ఏదో కొంచెం తెలుసుకొని ఉంటారు. (12) అందమైన అడవి ఆ ఆడవి స్థానాన్ని కూడా వదలి ప్రతి అడవిలో, శ్మశానం, శ్మశానంకాని చోట, ఆమె తిరిగింది. ఓ ముని! (13) చేతనా చేతనములన్ని కొంతకాలము ఊళ్ళను వదిలి తిరిగాయి. పండగఅనేది లేకుండా ఆమె ప్రతిక్షణము ప్రార్థిస్తూ తిరిగింది. (14) ప్రతిక్షణము నిట్టూర్పు విడుస్తూ, క్షణకాలము చింతిస్తూ, క్షణ కాలం పడక యందుచేరి, కొంత సేపు లేచి కూర్చొని ఉండేది (15) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మ ఖండమందు ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాద మందు ఏబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.