బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

90 - అధాయ్యము

మూII శ్రీకృష్ణ ఉవాచ:

శృణునంద ప్రవక్ష్యామి సానందం మానసం యథా

కథాంరమ్యాం సుమధురాం పురాణేషు పరిష్కృతాం

పరిపూర్ణతమోధర్మో ధార్మికాశ్చ కృతయుగే

పరిపూర్ణతమం సత్యం పరిపూర్ణతమాదయా

అతీవ ప్రజ్జ్వలద్రూపా వేదాశ్చత్వార ఏవచ

వేదాంగాశ్చాపి వివిధా శ్చేతిహాసాశ్చ సంహితాః

పురాణాని సురమ్యాణి పంచరాత్రాణి పంచచ

రుచిరాణి సుభద్రాణి ధర్మశాస్త్రాణి యానిచ

విప్రా వేదవిదస్సర్వే పుణ్యవంత స్తపస్వినః

నారాయణం తే ధ్యాయన్తి తన్మనస్కా జపంతిచ

బ్రాహ్మణః క్షత్రియోవైశ్యా శ్చతుర్వర్ణాశ్చ వైష్ణవాః

శూద్రా బ్రాహ్మణ భృత్యాశ్చ సత్య ధర్మ పరాయణాః

రాజానో ధార్మికాశ్చైవ ప్రజాపాలన తత్పరాః

గృహ్ణాంత్యేవ ప్రజానాంచ షోడశాంశకరాన్నృపాః

కరశూన్యాశ్చ విప్రాశ్చ పూజ్యాః స్వచ్ఛంద గామినః

సంతతం సర్వ సస్యాఢ్య రత్నాధారా వసుంధరా

గురుభక్తశ్చ శిష్యాశ్చ పితృభక్తా స్సుతాః స్తథా

యోషితః పతిభక్తాశ్చ పతివ్రత పరాయణాః

ఋతౌ సంభోగినః సర్వే న స్త్రీలుబ్ధాః న లంపటాః

నభయందస్యు చౌర్యాణాం న తత్ర పరదారికాః

తరవః పూర్ణ ఫలినః పూర్ణక్షీరాశ్చ ధేనవః

బలవంతో జనాస్సర్వే దీర్ఘాః సౌందర్య సంయుతాః

లక్షవర్షాయుషః కేచిత్ పుణ్యవంతోహ్యరోగిణః

యథావిప్రావిష్ణుభక్తాః త్రివర్ణా విష్ణు సేవినః

జలపూర్ణా నదా నద్యః సంతతం కందరాస్తథా

తీర్థపూతా శ్చతుర్వర్ణా: తపః పూతాద్విజాతయః

మనః పూతాశ్చ నిఖిలా ఖలహీనం జగత్త్రయం

సత్కీర్తి పరిపూర్ణంచ యశస్యం మంగళాన్వితం

 పితరః సర్వకాలేషు తిథికాలేషు దేవతాః  

సర్వకాలేష్వతిథయః పూజితాశ్చ గృహే గృహే

అను శ్రీకృష్ణుడిట్లన్నాడు :

ఓ నందుడ! నీమనస్సు ఆనందపడేట్లుగా చెబుతాను, విను. పురాణములలో పరిష్కరింపబడిన రమ్యమైన మధురమైన కథను విను. (1) కృతయుగంలో ధర్మం పూర్ణంగా ఉంది అంతా ధార్మికులు. సత్యము పరిపూర్ణంగా ఉంది. దయపరిపూర్ణంగా ఉంది. (2) నాలుగు వేదముల రూపాలు మిక్కిలి వెలిగిపోతున్నాయి. వివిధమైన వేదాంగములు ఇతిహాసములు సంహితలు (3) రమ్యమైన పురాణములు, ఐదు పంచరాత్రములు, అందమైనవి, క్షేమకరమైనవి ఐనధర్మశాస్త్రములు అన్నివెలిగిపోతున్నాయి. (4) బ్రాహ్మణులంతా వేదాలనెరిగిన వారే పుణ్యవంతులు తపస్వులును. నారాయణుని వారు ధ్యానిస్తారు. వాని యందే మనస్సు నిలిపి జపిస్తారు. (5) బ్రాహ్మణులు క్షత్రియులు, వైశ్యులు, నాలుగవ వర్ణమువారు అంతా వైష్ణవులే. శూద్రులు బ్రాహ్మణులకు భృత్యులు. సత్యమందు ధర్మమందును ఆసక్తికలవారు. (6) రాజులు ధార్మికులు, ప్రజాపాలనయందు ఆసక్తికలవారు. ప్రజల నుండిరాజులు పదహారవ భాగం పన్నుగా తీసుకునేవారు. (7) విప్రులకు పన్నులేదు. వారు పూజ్యులు. స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. భూమి ఎల్లప్పుడు అన్ని పంటలతో కూడినది. రత్నములకు ఆధారమైనది. (8) శిష్యులు గురుభక్తి కలవారు. కొడుకులు తలిదండ్రుల పై భక్తిగలవారు. స్త్రీలు పతిభక్తిగలవారు, పతివ్రత ధర్మమందు ఆసక్తికలవారు. (9) అందరు ఋతుకాలమందే భార్యలను కలిసేవారు. స్త్రీలుబులు, లంపటులు లేరు. ధస్యుల భయము, దొంగల భయము లేదు. పరస్త్రీని తన భార్యగా గలవారు (వ్యభిచారులు) లేరు (10) చెట్లునిండుగా పండుతున్నాయి. ఆవులు నిండుగా పాలిస్తున్నాయి. జనులంతా బలవంతులు, పొడుగువారు, సౌందర్యవంతులు. (11) కొందరు లక్ష సంవత్సరాల ఆయుస్సు కలవారు పుణ్యవంతులు, రోగాలులేని వారు. విప్రులు విష్ణు భక్తులైనట్టుగానే మిగిలిన మూడు వర్ణములవారు విష్ణువును సేవించేవారు. (12) నదములు, నదులు నీటితో నిండి ఉంటాయి ఎప్పుడూ. అట్లాగే లోయలు కూడా, నాలుగు వర్ణముల వారు. తీర్థములతో పవిత్రమైన వారు. బ్రాహ్మణులు తపస్సుతో పవిత్రమైనవారు. (13) అందరు మనస్సుతో పవిత్రమైనవారు. ముల్లోకములలో ఖలలు లేరు. సత్కీర్తితో నిండినది. యశస్సునిచ్చేది మంగళముతో కూడినది (14) ప్రతి ఇంటిలో అన్ని కాలములలో పితరులు, తిథుల కాలములలో దేవతలు, అన్నికాలములలో అతిథులు పూజింపబడుతారు.

మూII త్రివర్ణా: విప్రభక్తాశ్చ విప్రభోజన తత్పరా:

బ్రాహ్మణస్య ముఖం క్షేత్రం అనూషర మకంటకం

నారాయణేత్కీర్తనేన హరయుక్తాస్తదుత్సవే

నదేవానాం ద్విజానాంచ విదుషాం తత్ర నిందకాః

నాత్మప్రశంసకాః కేచిత్ సర్వేపరగుణోత్సుకాః

నశత్రవో జనానాంచ సర్వే సర్వహితైషిణః

పురుషా యోషితశ్చాపి నహిమూర్ఖాశ్చ పండితాః

న దుఃఖినో జనాస్సర్వే సర్వేషాం రత్నమందిరం

మణిమాణిక్యరత్నౌఘు రత్నస్వర్ణసమన్వితం

నభిక్షుకా నరోగార్తాః శోకహీనాశ్చ హర్షితాః

నహి భూషణ హీనాశ్చ నరానార్యశ్చ కేచన

నపాపినో న ధూర్తాశ్చ నక్షుధార్తా నకుత్సితాః

జరాహీనాః ప్రాణినశ్చ శశ్వద్యౌవన సంస్థితాః

ఆధివ్యాధి విహీనాశ్చ నిర్వికారాశ్చ దేహినః

యదుక్తోవై సత్యయుగే ధర్మః సత్యం దయాదికం

పాదహీనశ్చ త్రేతాయాం సత్యార్ధం ద్వాపరేఽపిచ

ధర్మైకపాచ్చప్రథమే కలేశ్చాపి కృశోఽబలః

దుష్టానాందస్యు చౌర్యాణాం అంకురః ప్రభవేద్ర్వజ

అధర్మ నిరతా: కేచిత్ భీతాః సంగోపినస్తథా

భీతాగుప్తాశ్చ పుంశ్చల్యః భీతాశ్చ పారదారికాః

ధర్మిష్థానాం భయం శశ్వత్ అధర్మిష్థాశ్చ కంపితాః

స్వల్ప ధర్మరతా భూపా: స్వల్ప వేదరతా ద్విజాః

వ్రతధర్మరతాః కేచిత్ సర్వే స్వచ్ఛంద గామినః

యావ త్తిష్ఠంతి తీర్థాని యావత్తిష్ఠంతి సాధవః

యావిత్తిష్ఠంతి గ్రామాణాం దేవాః శాస్త్రాణి పూజనం

తావత్కించిత్తపః సత్యం స్వర్గ ధర్మాంశ ఏవచ

కలే: దోషనిధేస్తాత గుణ ఏకో మహానది

మానసంచ భవేత్పుణ్యం సుకృతం నహిదుష్కృతం

తీర్థాదికే గతే తాత నష్టా ధర్మాంశ ఏవచ

కలారూపశ్చ ధర్మశ్చ యథా కుహ్వాంనిశాకరః

నంద ఉవాచ-

తీర్థాన్యేతాని సర్వాణి తిష్ఠంత్యేవ కియద్దినం

సాధవో గ్రామ్య దేవాశ్చ శాస్త్రాణ్యేతాని వత్సక

శ్రీకృష్ణ ఉవాచ :

కలౌ దశ సహస్రాణి హరిస్తిష్ఠతి మేదినీం

దేవానాం ప్రతిమాపూజ్యా శాస్త్రాణిచ పురాణకం

తదర్ధమపితీర్థాని గంగాదీని సునిశ్చితం

తదర్ధంగ్రామదేవాశ్చ వేదాశ్చ విదుషామపి

అధర్మః పరిపూర్ణశ్చ తదంతే చ కలౌ పితః

ఏకవర్ణాభవిష్యంతి వర్ణాశ్చత్వార ఏవచ

న మంత్రపూతోద్వాహశ్చ నహి సత్యం నచక్షమా

స్త్రీ స్వీకారరతో నిత్యం గ్రామ్యధర్మ ప్రధానతః

న యజ్ఞసూత్రం తిలకం బ్రాహ్మణానాంచ నిత్యశః

సంధ్యాశాస్త్ర విహీనాశ్చ విప్రవంశాః శ్రుతంఅపి

మూడు వర్ణముల వారు విప్రులకు భక్తులు విప్రులను భుజింపచేయటంలో ఆసక్తికలవారు. బ్రాహ్మాణుని ముఖమే ఒక పొలం. అది ఊషరక్షేత్రం కాదు (చవిటినేల కాదు). ముళ్ళులేనిది. (16) ఆ ఉత్సవంలో నారాయణుని గొంతెత్తి కీర్తిస్తూ అంతా ఆనందిస్తారు. అక్కడ దేవతలను బ్రాహ్మణులను పండితులను నిందించేవాళ్ళు ఉండరు. (17) తన్నుతాను పొగడుకొనేవాడు ఒక్కడు కూడా ఉండడు. అంతా ఇతరుల గుణాల పై శ్రద్ధచూపేవారే. జనులకు శత్రువులుండరు. అందరు అందరి హితాన్ని కోరేవారు. (18) పురుషులు, స్త్రీలు కూడా పండితులు, మూర్బులుండరు. జనులంతా దుఃఖంలేకుండా ఉంటారు. అందరికి రత్నముల మందిరాలే (19) వారి ఇళ్ళు మణులు, మాణిక్యాలు, రత్నరాసులు, రత్నములు, స్వర్ణము వీటితో కూడి ఉంటాయి. భిక్షుకులుండరు. రోగార్తులుండరు. దుఃఖం లేకుండా అంతా ఆనందంతో ఉంటారు. (20) ఆడవాళ్ళుకాని మగవాళ్ళుకాని సొమ్ములు లేకుండా ఎవరూ ఉండరు. పాపులు, ధూర్తులు, ఆకలితో బాధపడేవారు కుత్సితులు ఉండరు. (21) ప్రాణులంతా ముసలితనంలేనివారు. ఎప్పుడూ యవ్వనంలో ఉండేవారే! ఆధివ్యాధులు లేనివారు.ప్రాణులు నిర్వికారులు (22) సత్యయుగంలో (కృత) ధర్మము, సత్యము, దయాదికము ఏవి చెప్పానో, అది త్రేతాయుగంలో ఒకపాదం, తక్కువగా ఉంటుంది. ద్వాపరంలో కృతయుగం కన్న సగమే ఉంటుంది. (23) కలియుగంలో ధర్మం ఒక పాదంలో ఉంటుంది. కృశించి, బలహీనంగా ఉంటుంది. ఓ ప్రజ! దుష్టులైన దస్యులు దొంగలు మొలకెత్తుతారు. (24) కొందరు అధర్మం యందే ఆసక్తి చూపుతారు. వారు భయపడేవాళ్ళు, దాచేవాళ్లు ఉంటారు. కులటలు భయంతో రహస్యంగా ఉంటారు. వ్యభిచారులు కూడా భయంగా ఉంటారు. (25) ధర్మమాచరించే వారికి భయముంటుంది. అధర్మమాచరించేవారు వణికిపోతుంటారు. రాజులు కొద్ది ధర్మం ఆచరిస్తుంటారు. బ్రాహ్మణులు కొద్దిగా వేదాల పై ఆసక్తి చూపుతారు. (26) కొందరు వ్రతాలు ధర్మము వీని పై ఆసక్తి చూపుతారు. అంత స్వేచ్ఛగా నడిచేవాళ్ళే. తీర్థములున్నంత వరకు, సాధువులున్నంత వరకు (27) గ్రామదేవతలున్నంత వరకు, శాస్త్రములు, పూజ ఉన్నంత వరకు అంతదాకా కొద్దిగ, తపస్సు, సత్యము, స్వర్గము, ధరాంశ ఉంటాయి.. (28) కలి, దోషములకు నిధి ఐనా ఓ తండ్రి! కలికి ఒక గొప్ప గుణమున్నది. మనస్సు పుణ్యభావనకలదైతే చాలు పుణ్యమే. దుష్కృతములేదు. (29) ఓ తండ్రి! తీర్థాదికములకు వెళితే చెడు (దుష్కృతం) నష్టమై ధర్మాంశ ఉంటుంది. కుహు (అమావాస్య) యందు చంద్రునివలె ధర్మము కలారూపంలో ఉంటుంది. (30) అప్పుడునందుడిట్లా - ఈ తీర్దములన్ని ఎన్నాళ్ళుంటాయి. ఓ వత్స! సజ్జనులు, గ్రామదేవతలు, ఈశాస్త్రములు ఉంటాయా అనగా (31) కృష్ణుడిట్లా- ఈ భూమి పై హరి కలిలో పదివేల సంవత్సరాలుంటాడు. దేవతల ప్రతిమను పూజించాలి. శాస్త్రములు పురాణములు పూజించాలి. (32) అందులో సంగం కాలము తీర్థములుంటాయి. గంగాదులుంటాయి, ఇది నిశ్చయము. అందులో సగం కాలం గ్రామదేవతలుంటారు. వేదములు, విద్వాంసులకుంటాయి. (33) ఓ తండ్రి! కలిలో దాని అంతమందు అధర్మం పరిపూర్ణంగా ఉంటుంది. నాలుగు వర్ణముల వారు ఒకేవర్ణం వారై (కలిసి) పోతారు. (34) మంత్రంతో పవిత్రమైన వివాహాలుండవు. సత్యము, ఓర్పు ఉండవు. గ్రామీణ ధర్మాన్ని ప్రధానంగా చేసుకొని ఎప్పుడూ స్త్రీలను స్వీకరించడానికి ఆసక్తులౌతారు. (35) రోజు బ్రాహ్మణులకు యజ్ఞోపవీతము, తిలకము ఉండవు. సంధ్యలేదు. శాస్త్రములు లేవు. శ్రుతులులేవు. ఇట్లా బ్రాహ్మణ వంశములుంటాయి.

మూసర్వైఃసార్థంచ సర్వేషాం భక్షణం నియమచ్యుతం

అభక్ష్యభక్షాలోకాశ్చ చతుర్వర్ణాశ్చ లంపటాః

నారీషు న సతీకాచిత్ పుంశ్చలీచగృహే గృహే

కరోతి తర్జనం కాంతం భృత్యతుల్యంచ కంపితం

జారాయ దత్వా మిష్టాన్నం తాంబూలం వస్త్రచందనం

న దదాత్యే వచాహారం స్వామినే దుఃఖినే పితః

పుత్రేణ భర్త్సితః తాతః శిష్యేణభర్త్సితో గురుః

ప్రజాభిః తాడితోభూపః భూ పేన తాడితాః ప్రజాః

దస్యుచోరైశ్చ దుష్టైశ్చ శిష్టాశ్చ పరిపీడితాః

సస్యహీనాచ వసుధాక్షీరహీనాశ్చధేనవః

స్వల్పక్షీరేఘృతం నాస్తి నవనీతంచ నిత్యశః

సత్యహీనా జనాః సర్వే నిత్యం మిథ్యావదంతిచ

శౌచసంధ్యాశాస్త్ర హీనా బ్రాహ్మణా వృషవాహకాః

సూపకారాశ్చ శూద్రాణాం శూద్రాణాం శవవాహకాః

శూద్రస్త్రీ నిరతాః శశ్వత్ శూద్రా విప్రవధూరతాః

ఖాదంతి యస్యవిప్రస్య భక్ష్యంచ పరిపాచకాః

మాతుః పరాం తస్యపత్నీం శూద్రా గృహ్ణాతి లంపటః

భృత్యశ్చ హత్వా రాజానం స్వయం రాజా భవిష్యతి

నారీహత్వా పతింకామాత్ భజేజ్జారంచ కౌతుకాత్

 పుత్రశ్చ పితరం హత్వా స్వయంభూపో భవిష్యతి

సర్వేస్వచ్ఛందనిరతాః శిశ్నోదరపరాయణాః

వంఖరావ్యాధియుక్తాశ్చ కుత్సితాశ్చకుచైలకాః

విక్షుణ్ణమంత్రలిప్తాశ్చ మిథ్యాయంత్ర ప్రచారికాః

జాతి హీనాశ్చ గురవో వయో హీనాశ్చ నిందకాః

రాజానశ్చాపి మ్లేచ్ఛాశ్చ యవనా ధర్మనిందకాః

సత్కీర్తి మదిసాధూనాం కుర్వంత్యున్మీలనం ముదా

పితృదేవద్విజాతీనా మతిథీనాంచ నిత్వశః

పూజానాస్తిగురూణాంచ పిత్రోశ్చపూజనం ప్రియాః

స్త్రీ బంధూనాం గౌరవంచ స్త్రీణాంచ సతతంపితః

చోరఃసత్కులజాతిశ్చ బ్రాహ్మణో దేవహారకః

మానం వహింతిలోభేన యుగధర్మేణ కౌతుకాత్

దేవాఽయతనహీనంచ జగత్సర్వం భయాకులం

అరాజకంచ దుర్నీతం సతతం కలిదోషతః

బుభుక్షితాః కుచైలాశ్చ దరిద్రావ్యాధినోనరాః

కపర్దక ఘటాధ్యక్షో రాజేంద్రోహి ఘటేశ్వరః

వృద్ధాంగుష్ఠ సమాలోకా వృక్షా శాకసమాస్తథా

తాలానాంనారికేరాణాం పనసానాంతథైవచ

 ఫలాని సర్ర్షపాణ్యేవ తత్ క్షుద్రంచతతః పరం

జలభాజనపాత్రేణ సస్యేన వాససాతథా

విహీనం మందిరం సర్వం గృహాణామపరిష్కృతం

గంధకేన పరివృతం దీపహీనం తమోయుతం

హింస్రజంతు భయాద్భీతా జనాస్సర్వేచ పాపినః

సర్వేచ ఫలలోభిష్టాః పుంశ్చల్యః కలహప్రియాః

రూపవత్యో న కామిన్యో నరాశ్చాపి న రూపిణః

నియమములనుండి దిగజారి అందరు అందరితో కలసి తింటారు.లోకులు తినకూడని వాటిని తింటారు. నాల్గు వర్ణముల వారు లంపటులౌతారు. (అత్యాసక్తి) (37) స్త్రీలలో సతి అనేది ఉండదు. ప్రతి ఇంట్లో కులటలుంటారు. భార్య భర్తను భయ పెడుతుంది. సేవకునిలా చూస్తుంది. వణికిస్తుంది. (38) జారునకు మధురమైన ఆహారాన్ని పెడ్తుంది. తాంబూలము, వస్త్రములు చందనము ఇస్తుంది. ఓ తండ్రి! దుఃఖించే భర్తకు తిండి పెట్టరు. (39) కొడుకు తండ్రిని భయ పెడుతాడు. శిష్యుడు గురువును భయ పెడుతాడు. ప్రజలు రాజును కొడతారు. రాజు ప్రజలను కొడతాడు. (40) దస్యులతో (శత్రువు) దొంగలతో దుష్టులతో శిష్టులు పీడింపబడతారు. భూమి పంటలు లేనిదౌతుంది. ఆవులు పాలులేని దౌతాయి. (41) కొద్దిపాలలో నేయుండదు. రోజు వెన్ననే ఉంటుంది. జనులంతా సత్యము నుండి హీనులౌతారు. ఎప్పుడు అబద్దాలాడుతారు. (42) శుచిత్వము, సంధ్య, శాస్త్రములు ఇవి లేకుండా బ్రాహ్మణులు ఎద్దుల పై సంచరిస్తారు. బ్రాహ్మణులు శూద్రులకు వంటచేస్తారు. శూద్రుల శవాలను దహనం చేస్తారు. (43) శూద్రస్త్రీలందు ఆసక్తి చూపుతారు. ఎప్పుడూ శూద్రులు విప్రస్త్రీలందు ఆసక్తిచూపుతారు. పరిపాచకులు (పండించేవారు) ఏ బ్రాహ్మణుని తిండి తింటారో (44) ఆ బ్రాహ్మణుని భార్యను తల్లికన్నా మిన్నయైనదానిని శూద్రులు లంపటులై గ్రహిస్తారు. భృత్యుడు రాజును చంపితాను రాజౌతాడు. (45) కామంతో స్త్రీ భర్తను చంపి, కౌతుకంతో జారుని చేరుతుంది. కొడుకు తండ్రిని చంపి తాను రాజౌతాడు. (46) అంతా స్వేచ్ఛాసక్తులౌతారు. మైధునకర్మ, తిండి వీటి మీదే ఆసక్తి చూపుతారు. కఠినులు, తీసివేయతగినవారు, రోగగ్రస్తులు, కుత్సితులు, కుత్సితమైన వేషధారణ కలవారౌతారు. (47) అవ్వుత్పన్న మంత్రాలు కలిగి ఉంటారు, అబద్దపు బీజాక్షర చక్రాలను ప్రచారం చేస్తారు. జాతిహీనులైన గురువులు ఉండగా వారిని నిందించేవారు, వయోహీనులు (తక్కువ వయస్సువారు) (48) మేచ్ఛరాజులు, యవనులు ధర్మనిందకులౌతారు. సాధు జనుల సత్కర్తిని కూడా ఆనందంతో నాశనం చేస్తారు. (49) పితృదేవద్విజాతులు, అతిథులు వీరికి రోజు పూజ ఉండదు. గురుపూజ, పితృపూజ ఉండవు. స్త్రీలకు కూడా (50) ఓ తండ్రి! ఎప్పుడు స్త్రీలు తమతరపు బంధువులను (తల్లిగారిని) గౌరవిస్తారు. సత్కులంలో పుట్టినవారు దొంగలౌతారు. బ్రాహ్మణుడు దేవుని సొత్తు హరించేవాడౌతాడు. (51) లోభంతో, యుగధర్మాన్ననుసరించి, కౌతుకంతో అభిమానాన్ని కలిగి ఉంటారు. గుళ్ళు లేకుండా ఔతుంది, జగత్తంతా భయంతో నిండిపోతుంది. (52) అరాజకము, చెడునడవడిక ఎప్పుడూ ఉంటాయి, కలిదోషం వలన, నరులు ఆకలిబాధ, కుత్సితవేషధారణ, దరిద్రము, రోగములు కలవారౌతారు. (53) గవ్వ ఘటములలో అధ్యక్షుడు. ఘటేశ్వరుడు రాజేంద్రుడు. లోకములు, ముసలివాని బొటనవేలంత వృక్షములు కొమ్మలంత సమానము. (54) తాటిచెట్ల, కొబ్బరిచెట్ల, పనసచెట్ల పండ్లు ఆవగింజలంత, ఆ పిదప అంతకన్న చిన్నగ (55) నీటి పాత్రలు వంట పాత్రలు, పంటలు, వస్త్రములు ఇవేవీలేక ఇళ్ళుంటాయి. గృహములు అలంకరణ లేకుండా ఉంటాయి. (56) గంధకం నిండి ఉంటుంది. దీపాలుండవు. చీకటుంటుంది. జనులు హింసించే జంతువుల భయం వల్ల భయపడుతుంటారు. అంతా పాపులే (57) అంతా ఫలమందు లోభం కలవారే. స్త్రీలు వ్యభిచారిణులు, కలహ ప్రియలు, స్త్రీలు సౌందర్యవతులు కారు. మగవాళ్ళూ రూపవంతులు కారు.

మూనద్యోనదాః కందరాశ్చ తడాగాశ్చ సరోవరాః

జలపద్మవిహీనాశ్చ జలహీనాఘనాస్తథా

అపత్యహీనా నార్యశ్చ కాముక్యోజార సంయుతాః

అశ్వత్థచ్ఛేదనాః సర్వే వృక్షహీనా వసుంధరా

ఫలహీనాశ్చ తరవః శాఖాస్కంధ విహీనకాః

ఫలాని స్వాదుహీనాని చాన్నానిచ జలానిచ

మానవాఃకూట వక్తారో నిర్దయా ధర్మవర్జితాః

తదంతే ద్వాదశాదిత్యః సంహరిష్యంతి మానవాన్

సర్వాన్ జంతూంశ్చ తాపేన బహువృష్ట్యా వ్రజేశ్వర

అవశిష్టాచ పృథివీ కథామాత్రావశేషితా

కలౌ గతేచ పృథివీక్షేత్రం వర్షే గతే తథా

పునః సత్యప్రవృత్తిశ్చ భవిష్యతి క్రమేణవై

ఇత్యేవం కథితం సర్వం గచ్ఛ తాత వ్రజం సుఖం

అహం దుగ్ధముఖోబాల: పుత్ర స్తే కథయామి కిం

నవనీతం ఘృతం దుగ్ధంధధితక్రం పరిష్కృతం

స్వస్తికం శుభకర్మార్హం మిష్టాన్నంచ సుధోపమం

మిష్టద్రవ్యంచ యత్కించిత్ పితృదేవనిమిత్తకం

భుక్తంబలాచ్చ తత్సర్వం బాలానాం రోదనం బలం

తత్ క్షమస్వా పరాధం మే బాలదోష పదేపదే

త్వంపితా తవపుత్రోఽహం యశోదా జననీ మమ

మదీయం పరిహాసంచ యశోదాం రోహిణీం వద

కుమారా స్యాత్ శ్రుతం సర్వం సోహమిత్యేవమీప్సితం

కీర్తయిష్యసి తత్సర్వం సర్వం గోకులవాసినం

కాలః కరోతి సంసర్గం బంధూనాం బంధుభిః సహ

కాలః కరోతి విచ్ఛేదం విరోధం, ప్రీతిమేవచ

కాలః సృష్టించ కురుతే కాలశ్చ పరిపాలనం

కాలః కరోతి సానందం కాలః సంహరతేప్రజాః

సుఖందుఃఖంభయం శోకం జరాంమృత్యుంచ జన్మచ

అందయం శోకం జరాంమృత్యుంచ జన్మచ

సర్వం కర్మానురోధేన కాలఏవ కరోతిచ

సర్వం కాలకృతం తాత విస్మయం న వ్రజం వ్రజ

కుతస్త్వం గోకులే వైశ్యో నందో వైశ్యాధిపోనృపః

వసుదేవసుతోఽ హంచ మధురాయామహోకుతః

పిత్రా మే కంపభీతేన, త్వత్గృహేచ సమర్పితః

పితుఃపరః పితాత్వంచ మాతా మాతుఃపరాజపివా

మయాదత్తైన జ్ఞానేన పార్వత్యాచ వ్రజేశ్వర

త్యజమోహం మహాభాగ గచ్ఛ తాత సుఖం గృహం

నంద ఉవాచ:

స్మర వృందావనం తాత రమ్యం పుణ్యం మహోత్సవం

గోకులం గోకులం రమ్యం సుందరం యమునాతటం

రమణీనాం సురమ్యంచ త్వత్రయం రాసమండలం

గోపాలికా గోపబాలా న్యశోదాం రోహిణీ ప్రియాం

ప్రాణాధికాం రాధికాం న కథం స్మరసిపుత్రక

వారమేకం స్వల్పదినం గోకులం గచ్ఛ వత్సక

నదులు,నదములు, కందరములు, తటాకములు, సరోవరములు, నీళ్ళు పద్మములు లేకుండా ఔతాయి. మేఘములు నీరు లేకుండా ఔతాయి. (59) స్త్రీలు సంతానహీనులౌతారు, కాముకులు, జారులతో కూడిన వారౌతారు. అందరు రాగి చెట్లను కొట్టేస్తారు. భూమి వృక్షములు లేకుండా ఔతుంది. (60) చెట్లు పండ్లు లేనివి ఔతాయి. శాఖలు, స్కందములు లేనివౌతాయి. పండ్లున్నా వానిలో రుచి ఉండదు. అన్నము, జలము రుచి ఉండవు. (61) నరులు కపటం మాట్లాడేవారౌతారు. దయాహీనులు, ధర్మంలేని వారౌతారు. ఆ చివర పన్నెండు మంది సూర్యులు మనుష్యులను సంహరిస్తారు. (62) ఓ ప్రజేశ్వర! జంతువులనన్నిటిని వేడితోనో, అతి వృష్టితోనో చంపుతారు. భూమి మిగులుతుంది. అది కథామాత్రంగా మిగులుతుంది. (63) కలివెళ్ళిపోయాక ఈ భూమి, వర్షం వస్తే భూమి చిగురించినట్లు, తిరిగి సత్యకాలం వస్తుంది క్రమంగా. (64) ఓ తండ్రి! ప్రజానికి సుఖంగా వెళ్ళు. అని ఈ విధంగా అంతాచెప్పాగదా. నేను పాలుతాగే పిల్లవాణ్ణి నీ కొడుకును, ఇంకేం చెప్పాలి . (65) వెన్న, నేయి, పాలు, పెరుగు, చల్ల చక్క చేయబడినవి. స్వస్తికము శుభకర్మకు అర్హమైనది. మిష్టాన్నము అమృతము వంటిది. (66) పితృదేవతల నిమిత్తకమైన మిష్టద్రవ్యమేదైనా బలవంతంగా తిన్నదంతా బాలురకు రోదనము బలము. (67) నేను అడుగడుగున చిన్నవానిగా చేసిన దోషము, నా అపరాధాన్ని దానిని క్షమించు. నీవు తండ్రివి. నీ కొడుకును నేను యశోద నా తల్లి. (68) నాపరిహాసాన్ని, యశోదకు రోహిణికి చెప్పు. కుమారుని ముఖం నుండి విన్నదంతా చెప్పు. వాడే నేను అని ఈరకంగా నా కోరిక. (69) అదంతా అంతా గోకులంలో ఉండేవారికి చెప్తావు. కాలము కలుపుతుంది. బంధువులను బంధువులతో, (70) కాలం విడదీస్తుంది విరోధము, ప్రీతిదేన్నైనా కాలం కల్గిస్తుంది. కాలం సృష్టిస్తుంది, కాలం పాలిస్తుంది. (71) కాలం ఆనందపరుస్తుంది. కాలం ప్రజలను సంహరిస్తుంది. సుఖము, దుఃఖము, భయము, శోకము, ముసలితనము, మృత్యువు, జన్మ (72) అన్నిటిని కర్మానుగుణంగా కాలమే చేస్తుంది. ఓ తండ్రి! అంతా కాలం చేసేదే ఆశ్చర్యపడేది లేదు. ప్రజానికి వెళ్ళు. (73) గోకులంలో వైశ్యుడవు. నందుడవు వైశ్యాధిపుడవు నృపుడవు నీవెక్కడ. వసుదేవుని కొడుకును నేను, మధురలోనేను. నేనెక్కడ (74) నా తండ్రి కంసునికి భయపడి నీ ఇంట్లో ఉంచాడు. నీవు తండ్రిని మించిన తండ్రిని, తల్లి నాతల్లిని మించినది. (75) ఓవ్రజేశ్వర! నేనిచ్చిన జ్ఞానంతో, గోపికతో కూడి, ఓ మహాభాగ! మోహాన్నివిడువు. ఓ తండ్రి! సుఖంగా ఇంటికివెళ్ళు. (76) అనగా నందుడిట్లా ఓ తండ్రి (కొడుక) ! వృందావనాన్ని పుణ్యమైన , అందమైన , గొప్ప ఉత్సవముగలదాన్ని స్మరించు. గోకులంగల గోకులాన్ని అందమైన, సుందరమైన యమునా తటాన్ని స్మరించు . (77) అందమైన నీకిష్టమైన స్త్రీల రాసమండలాన్ని స్మరించు. గోపబాలికలను, గోపాలురను యశోదను, ప్రియమైన రోహిణిని స్మరించు. (78) ఓ కొడుక! ప్రాణాధికురాలైన రాధిక నెట్లా మరుస్తావు. ఓ కొడుక! ఒకరోజు కొద్ది సమయముకై గోకులమునకు వెళ్ళు.

మూ ఇత్యేవముక్త్యా నందశ్చ క్రోడే కృష్ణం చకారసః

నేత్రాశ్రుణాచ పూర్ణేన తంసి షేచ శుచాఽన్వితః

చుచుంబ తత్గండయుగం కృత్వా వక్షసి మోహతః

సానందః పరమానందో భగవాంస్తమువాచ సః

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తె మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే ఉత్తర భాగే నారాయణ నారద సంవాదే నవతి తమోఽధ్యాయః

అనిపలికి ఆనందుడు కృష్ణుని తన ఉరము పై ఉంచుకున్నాడు. దుఃఖిస్తూ కన్నీళ్ళతో పూర్తిగా, ఆకృష్ణుని తడిపాడు. (80) మోహంతో వక్షమందుంచుకొని , ఆతని గండ స్థలాలను ముద్దాడాడు నందుడు. ఆనందంతో పరమానందంతో ఆభగవంతుడు నందునితో ఇట్లన్నాడు. (81) అని బ్రహ్మవైవర్త మహాపురాణంలో శ్రీకృష్ణజన్మఖండమందు ఉత్తరభాగంలో నారాయణ నారద సంవాదమందు తొంబదవ అధ్యాయము.