బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

71 - అధ్యాయము

మూII శ్రీనారాయణ ఉవాచ:

రాధికాయాంచ సుప్తాయాం సుప్తాసు గోపికాసుచ

పుష్పచందనతల్పే చ వాయునా సురభీకృతే

తృతీయ ప్రహరేఽతీతే నిశాయాంచ శుభేక్షణే

శుభచంద్రర్క్షయోగే చామృతయోగసమన్వితే

సౌమ్యస్వామియుతేలగ్నే సౌమ్యగ్రహవిలోకితే

పాపగ్రహాసమాసక్త దుష్టదోషాదివర్జితే

యశోదాం బోధయామాస కారయామాస మంగళం

బంధూనాశ్వాసయామాస సముత్థాయ హరిః స్వయం

వాద్యం నిషేధయామాస రాధికాభయభీతవత్

స్వతంత్రో విశ్వకర్తాచ పాతా భర్తా స్వతంత్రవత్

ప్రక్షాల్య పాదయుగలం ధృత్వా ధౌతేచవాససీ

ఉవాచ(స) సంస్కృతే స్థానే విలిస్తే చందనాదినా

ఫలపల్లవ సంయుక్తం సంస్కృతం చందనాదిభిః

వామే కృత్వా పూర్ణకుంభం వహ్నిం విప్రం స్వదక్షిణే

పతిపుత్రవతీం దీపం దర్పణం పురతస్తథా

దూర్వాకాండంచ సుస్నిగ్ధం పుష్పం ధాన్యంసితం శుభం I

గురుదత్తం గృహీత్వాచ ప్రదదే మస్తకోపరి

ధృతం దదర్శమాధ్వీకం రజతం కాంచనందధి

చందనం లేపనం కృత్వా పుష్పమాలాగలేదధౌ

గురువర్గం బ్రాహ్మణంచ వందయామాస భక్తితః

శంఖధ్వనిం వేదపాఠం సంగీతం మంగలాష్టకం

విప్రాశీర్వచనం రమ్యం శుశ్రావ పరమాదరం

ధ్యాత్వా మంగలరూపంచ సర్వత్ర మంగలప్రదం

చిక్షేప దక్షిణం పాదం సుందరం స్వాత్మ విగ్రహం

విహృత్యనాసికాం వామభాగం మధ్యమయా విభుః

విసృజ్య వాయు సంపూర్ణం నాసా దక్షిణరంధ్రతః

తతో యయౌ నందనందో నందస్య ప్రాంగణం వరం

సానందః పరమానందో నిత్యానందః సనాతనః

నిత్యోఽనిత్యో నిత్యబీజస్వరూపో నిత్యవిగ్రహః

నిత్యాంగభూతో నిత్యేశో నిత్యకృత్య విశారదః

నిత్యానూతన రూపశ్చ నిత్యనూతన యౌవనః

నిత్యోనూతన వేషశ్చ వయసా నిత్యనూతనః

నిత్యనూతన సంభాషో యత్ప్రేమ నిత్యనూతనం

నిత్యనూతన సంప్రాప్తిః సౌభాగ్యం నిత్యనూతనం

సుధారసపరం మిష్టం యద్వాక్యం నిత్యనూతనం

నిత్యనూతన భక్తంచ యత్పదం నిత్యనూతనం

స్థాయం స్థాయంప్రాంగణేఽస్మి న్మాయేశో మాయయాయుతః

అతీవరమ్యే సుస్నిగ్ధో బభూవ గమనోన్ముఖః

రంభస్తంభసమూ హైశ్చ రసాలపల్లవాన్వితైః

పటసూత్రనిబద్ధైశ్చ సుందరైశ్చ సుసంస్కృతే

పద్మరాగేణ ఖచితే రచితే విశ్వ కర్మణా

కస్తూరీ కుంకుమాక్తైశ్చ చందనైశ్చ సుసంస్కృతే

తత్రతస్థౌ స్వయంకృష్ణః సహాక్రూరః సబాంధవః

యశోదయాసమాశ్లిష్టో వామపార్శేన, మాయయా

నందేనానందయుక్తీనాశ్లిష్టో దక్షిణ పార్శ్వతః

సంభాషితో బాంధవైశ్చ పిత్రా మాత్రాన చుంబితః

ఇతి బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ నారాయణ నారద సంవాదే యాత్రామంగళంనామైక సప్తతితమోఽధ్యాయః

అను !! శ్రీనారాయణుడిట్లన్నాడు:

భకు ఎన్ని రకాల భావన. రాధిక నిద్రించాక, గోపికలు కూడా నిద్రించాక, గాలితో వాసనగలధిగా చేయబడ్డ పుష్పచందన తల్పమందు (1) రాత్రియందు తృతీయ ప్రహరగడిచాక, శుభ గ్రహముల) ఈక్షణమందు (చూపులు) చంద్ర, నక్షత్రముల శుభయోగమందు, అమృతయోగంతో కూడినవేళ (2) సౌమ్య స్వామికూడిన (బుధుడు కూడిన) లగ్నమందు, సౌమ్యగ్రహముల వీక్షణముండగా, పాపగ్రహములతో కూడిన దుష్టదోషాదులు లేకుండ ఉండగా (3) యశోదను మేల్కొలిపాడు. మంగళమును చేయించాడు. హరి స్వయంగా లేచి బంధువులను ఓదార్చాడు. (4) రాధికా భయంతో భయపడుతున్నట్టుగా వాద్యములను ఆపివేయించాడు. స్వతంత్రుడు, విశ్వమునకు కర్త, భర్త, స్వతంత్రునివలె విశ్వమును పొందేవాడు. (5) పాదములను కడుగుకొని, ఉతికిన బట్టలను ధరించి శుభ్రము చేయబడి చందనాదులు పూయబడిన చోట కూర్చున్నాడు. (6) ఫలములు చిగురాకులతో కూడిన చందనాదులతో అలంకరింపబడిన, పూర్ణ కుంభమును ఎడమభాగమందుంచుకొని, అగ్నిని బ్రాహ్మణుని తనకుడిభాగమందుంచుకొని (7) పతిపుత్రులుగల స్త్రీని, దీపమును, అద్దమును ఎదురుగా ఉంచుకొని, నిగనిగలాడే దూర్వాకాండమును, తెల్లని పుష్పమును, శుభకరమైన ధాన్యమును ఉంచుకొని (8) గురువు ఇచ్చిన దానిని తీసుకొని తల పై ధరించాడు. ఇప్పసారాయి, వెండి, బంగారము, పెరుగు ధరించి కనబడ్డాడు. (9) చందనమును పూసుకొని, పుస్పమాలను మెడలో ధరించాడు. భక్తితో గురువర్గమును బ్రాహ్మణుని నమస్కరించాడు. (10) శంఖధ్వనిని, వేదపాదమును, సంగీతమును, మంగళాష్టకమును, రమ్యమైనవిపుల ఆశీర్వచనమును పరమాదరంతో విన్నాడు. (11) అంతట మంగళాన్నిచ్చే, మంగలస్వరూపుని ధ్యానించి, సుందరమైన తన విగ్రహమును, కుడిపాదమును ఉంచాడు. (12) నాసికను విదలించి, విభువు మధ్యమస్థాయిలో వామభాగమును, గాలితో నింపి ముక్కు యొక్క కుడిరంధ్రంనుంచి వాయువును వదిలాడు. (13) ఆపై నందనందనుడు శ్రేష్ఠమైన నందుని ప్రాంగణమునకు వెళ్ళాడు. ఆనందం కలవాడు, పరమానందుడు, నిత్యానందుడు, సనాతనుడు, ఆతడు. (14) నిత్యుడు, అనిత్యుడు, నిత్యబీజ స్వరూపుడు, నిత్య విగ్రహుడు, నిత్య అంగభూతుడు, నిత్యేశుడు, నిత్యకృత్యములందు విశారదుడు (15) నిత్యము నూతనరూపం కలవాడు నిత్యము నూతన యౌవనుడు, నిత్యుడు, నూతన వేషం కలవాడు వయస్సుతో నిత్యనూతనుడు. (16) నిత్యము నూతనంగా సంభాషించేవాడు, ఆతని ప్రేమ నిత్యనూతనము. ఆతని సంప్రాప్తి నిత్యనూతనము.

ఆతని సౌభాగ్యము నిత్యనూతనము. (17) ఆతని వాక్కు సుధారసంవలె పరమైనది. తీయనిది, నిత్యనూతనము. ఆతని భోజనము నిత్యనూతనము, ఆతని చోటు నిత్యనూతనము. (18) ఆప్రాంగణమందు ఉంటూ, వుంటూ మాయుక 'ఈశుడైనవాడు, మాయతోకూడినవాడై, మిక్కిలి అందంగా, మంచి స్నిగ్ధరూపముకలవాడైనాడు, పోవటానికి ఉన్ముఖుడైనాడు. (19) అరటి స్తంభముల సమూహములతో, మామిడి చిగుళ్ళతో కూడిన, పటసూత్రములతో కట్టబడిన, సుందరమైన, చక్కగా సంస్కరింపబడిన, (20) పద్మరాగమణులు పొదగబడిన, విశ్వకర్మ రచించిన, కస్తురి కుంకుమలతో పూయబడిన, చందనములతో బాగా సంస్కరింపబడిన (21) ఆ చోట కృష్ణుడు అక్రూరుడు, బాంధవులు వారితో కూడి స్వయంగా ఉన్నాడు. మాయ ఐన యశోద ఎడమభాగంలో ఉంది (22) ఆనందముతో నిండిన నందుడు కుడి భాగంలో ఉన్నాడు, బాంధవులతో మాట్లాడాడు. తలిదండ్రులు ఆతనిని ముద్దాడారు. (23) అని బ్రహ్మ వైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మ ఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు యాత్రామంగళమనునది డెబ్బది ఒకటవ అధ్యాయము సమాప్తము.