బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

52 - రాధామాధవుల రాసవర్ణనము

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు (రాధాదేవితో) పలికెను :

సర్వేషాం దర్పభంగశ్చ కధితశ్చ శ్రుతస్త్వయా

క్షుద్రాణాం మహతాం చైవ కృత ఏవ న సంశయః

అధునా చ సముత్తిష్ఠ గచ్ఛ బృందావనం వనం

గోపికా వీరహారాశ్చ శీఘ్రం పశ్యామి సుందరి

అందరి యొక్క దర్పములు (గర్వములు) భంగమైన కథలు నాచేత చెప్పబడినవి. నీవును వింటివి కదా. ఇట్లు నీచులకు గాని గొప్పవారికి గానీ ఇట్లు గర్వభంగము చేయబడినది. అందులో సందేహము లేదు. ఇప్పుడిక లెమ్ము, బృందావనమునకు పద. ఓ సుందరీ! అక్కడ గోపికలు నా విరహము కారణమున ఆర్తలై ఉన్నారు. శీఘ్రముగా వారిని చూడగలను.

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ ఋషి అనెను :

ఇత్యేవం వచనం శ్రుత్వా మానీనీ రసికేశ్వరీ

ఉవాచ కృష్ణం నయ మాం న శక్తా గంతుమీశ్వర

రాధికావచనం శ్రుత్వా ప్రహస్య మధుసూదనః

మామాకో హేజ్యేవముక్త్వా సోంతర్ధానం చకార పా

అన్న శ్రీకృష్ణ వచనమును విని అభిమానవతియు రసికురాళ్లకీశ్వరియు ఐన రాధ “నేనటకు నడవ శక్తురాలను గాను. నన్ను తీసికొని పొమ్ము” అన్న రాధ పాక్యపు విని మధుసూదనుడు నవ్వి ఐనచో సన్నెక్కుము (నాపై కూర్చుండుము) అని పలికి అంతర్ధానమయ్యెను.

సా మనోయాయిని రాధా కృత్వ చ రోదనం క్షణం

ఇతస్తతస్తమన్వేష్య బృందారణ్యం జగామ హ

మనస్సుతో సమానముగా ప్రయాణించ గల రాధ క్షణము సేపు రోదించి ఇక్కడక్కడ శ్రీకృష్ణుని కొరకు వెదకి బృందారణ్యమును చేరబోయెను.

వివేశ చందన వనం రుదంతీ శోకకాతరా

దదర్శ గోపికాస్తత్ర శోకార్తా భయవిహ్వలాః

తామ్రాసాల ఘూర్ణనయనా భ్రమంతీ సర్వకానవం

 సౌథనాణేతి కుర్వంతీర్నిరాహారా రుషా న్వితా

తా దృష్ట్వా రాధికా సా చ ప్రేమవిచ్ఛేద కాతరా

కథయామాస వృత్తాంతం మలయ భ్రమణాదికం

తాభిః సార్థం చ సా రాధా రురోద విరహాతురా

హా నాథ నాథోత్యుద్పోర్య విలప్య చ ముహుర్ముహు

శోకమున తొందరపాటు కలదై ఏడ్చుచు చందనవనమును ప్రవేశించి అక్కడ శోకము చేత ఆర్తలై భయము చేత మనస్సు చెదరి యున్న గోపికలను (రాధ) చూచెను. ముఖములెర్రబారి అడవియంతట భ్రమించుచు కన్నులు తిరుగుచుండగా వెదకుచు ఆహారము లేనివారై కోపముతో కూడియుండి నాథా నాథా అనీ పిలుచుచు దుఃఖించుచున్న గోపికలను చూచి రాధ తానుకూడ భర్తయొక్క ప్రేము విచ్ఛేదమునకు (ప్రేమ సాగక ఆగిపోవుటకు) భయపడుచు తాముభయులు మలయాద్రి మొదలగు స్థానములలో సంచరించిన వృత్తాంతమును వారికి చెప్పెను. అతని ఎడబాటుకు గోపికలతో బాటు తాను కూడ పీడనొందుచు మాటి మాటికి ఏడ్చుచు నా నాథా అనీ ఉచ్చరించుచు రాధకూడ ఏడ్చెను.

వినింద్య కృష్ణం కోపేన తగ్గయామాస చ క్షణం

క్షణం శరీరముత్రష్టుం కోపాత్సర్వాః సముద్యతాః

 ఏతస్మిన్నంత కృష్ణస్తత్ర చందన కాననే

స్వాత్మానం దర్శయామాస రాధికాం గోపికా గణం

రాధా గోపాంగనాభిశ్చ దృష్వా ప్రాణేశ్వరం ముడా

 సస్మితా చ ప్రదుదైన పులకాంచిత విగ్రహా

 తూర్ణం కృష్ణం సమాక్షిష్య జహార మురలీం రుషి

మాలాం చ పీతవసనం భగ్నం కృత్వా చ కామినీ

పునః సంధారయామాన వస్త్రం మాలాం మనోహరాం

వినోద మురలీం తుష్ణా బృందావన వినోదనీ

 చందనాగురు కస్తూరీ కుంకుమార్హం చకార తం

ముహుర్ముహుర్ముఖం వీక్ష్య చుచుంబ పరమారం

క్షణం సంతర్థయామాస క్షణం స్తోత్రం చకార హ

సకర్నూరం చ తాంబూలం క్షణం తస్మై ముదా దదౌ

క్షణకాలము రాధ కృష్ణుని కోపముతో నిందించుచు బెదరించెను. క్షణకాలము కోపముతో శరీరత్యాగము చేయుటకందరు సిద్ధపడిరి. ఇంతలో ఆచందన కాననములో శ్రీకృష్ణుడు రాధకు గోపికలకు తనను దర్శింపజేసెను (వారిముందు కనిపించెను). రాధాదేవి గోపికలతో బాటు తన ప్రాణేశ్వరుని చూచి సంతోషముతో చిరునవ్వుతో పులకించిన శరీరముతో పరుగెత్తాను. శీఘ్రముగా కృష్ణుని చేరి బిగ్గరగా కౌగిలించుకొని ఎడబాసి పోయినాడన్న కోపముతో అతని చేతిలోని మురళిని లాగుకొని అతని పూదండను త్రెంపి పీతాంబరమును చింపి - వేసెను. తిరిగి పీతాంబరమును ధరింపజేసి మనోహర పుష్పమాలను వేసెను.. అట్లే వినోదార్థము స్వామి పట్టుకొను మురళిని కూడ ఇచ్చెను. ఇట్లు సంతుష్టురాలైన ఆ బృందావన వినోదిని చందనము అగురు కస్తూరి కుంకుమ ద్రవములను అతనికి పులిమెను. మాటిమాటికాస్వామి ముఖమును చూచి మిక్కిలి ఆదరముతో, ముద్దులు పెట్టుకొనెను. క్షణము సేపు బెదిరించెను. క్షణము సేపు స్తుతించెను. క్షణకాలము ముదముతో అతనికి కర్పూర తాంబూలమిచ్చెను.

అథ గోపాంగనాః నర్వా రురుదుః ప్రేమ విహ్వాలా

సర్వం నివేదనం చక్రు స్వదుఃఖం ఏరహోద్భవం

దేహత్యాగం చ స్నానం చ స్వాహారస్య విసర్జనం

వనే వనే హర్నిశం చ శశ్వద్ర్భమణమేవ చ

క్షణం తం భర్పయామానుః స్తోత్రం చక్రు క్షణం ముదా

క్షణం దదుర్భూషణం చ క్షణం తస్మై చ చందనం

తరువాత గోపికలు అందరు ప్రేమచేత మనస్సులు చెదరి రోదనము చేసిరి. అతని యెడబాటు వలన తమకు ఏర్పడిన దుఃఖమును మొత్తమును నివేదించిరి. దేహములను త్యజింపబూనుకొనుటను స్నానభోజనములను విసర్జించుటను రాత్రింబగళ్లు  ప్రతివనములో మాటిమాటికి భ్రమించుటను (తిరుగుట) తెలియజెప్పిరి. క్షణము సేపు బెదిరించిరి. దర్శనమిచ్చినందుకు సంతోషముతో క్షణము సేపు స్తోత్రము చేసిరి. క్షణము సేపు భూషణములను సమర్చించిరి. క్షణకాలము చందనము సమర్పించిరి.

కాశ్చీచూచుః ప్రాణచోరం పశ్య రక్షతి సంతతం

ఏవం పునర్న కర్తవ్యమనేనేతి చ.కాశన

కాశ్చీదూచురిమం మధ్యే యూయం కురుత సత్వరం

నిబద్ధం ప్రేమ పోతేన హృదయే చేతి కాశ్చన

కాశ్ఛీదూచురయం నాస్తి ప్రతీతిర్న కదాచన

యత్నాచ్చేతన చోరం చ పశ్య పశ్యేతి కాశ్చన

కాశ్చిదూచుర్నిష్టురో2యం నరఘాతీతి కోపతః

న పునర్వద తే మాం చ కాశ్చనేతి చ నారద

కొందరు గోపికలు “ఓ ప్రాణచోరుడా! మమ్ములను చూడుము. ఎల్లప్పుడు రక్షింపుము” అనిరి. కొందరు మనమితనితో (విశ్వాసము) చేయరాదని పలికిరి. కొందరు స్త్రీలు “త్వరగా నీతనిని మీరు మన నడుము బంధించుడు" అనిరి. “ప్రేమ పాశములో హృదయమందు బంధించుడు” అని కొందరు గోపాంగనలు పలికిరి. కొందరేమో “ఇతడు లేడు. ఎప్పుడు కూడా ప్రసిద్ధిలేదు" అనిరి. కొందరు ఇతడు మనచేతన (మనస్సు) చోరుడు. ఈ దొంగను ప్రయత్నించి చూడుడు కని పెట్టుడు” అనిరి. కొందరు గోపికలు కోపముతో "ఇతడు నరఘాతకుడు క్రూరుడు”. “తిరిగి మన గురించి ఇట్లు పలుకడు” అని కొందరనిరి.

నిర్థనాని చ రమ్యాటీ యాని యాని వనాని చ

భ్రమేయుర్గోపికాసాని కృషేన సహ కౌతుకాత్

ఏవం తం గోపికాః సర్వాః మధ్యే కృత్వా సదీశ్వరం

 యయుర్వనాంతరే యత్ర నురమ్యం రాసమండలం

రాసం గత్వా న్వర్ణ పీరే తస్ధా స రసికేశ్వరః

నిశి భాతి యథా కాళే చంద్రస్తారాగజైస్పహ

నానామూర్తీర్విధాయాత్ర సహా తాభిర్జనార్దనః

చకార చ పునః క్రీడాం కాముకీనాం మనోహరాం

జనరహితములు సుందరములు ఐన వన ములేవేవి ఉన్నవో అన్ని వనములలో ఆసక్తి (వేడుక) తో బాటు గోపికలు కృష్ణునితో గూడి విహరింతురు. ఇట్లు గోపికలందరు ఆ సదీశ్వరుని తమ నడుమ ఉంచుకొని - ఎక్కడ శోభనకరము సుందరమునైన రాసమండలము. కలదో - ఆ వనములోనికి చేరబోయిరి. రాస స్థానమునకు పోయి ఆ రసికేశ్వరుడు స్వర్ణపీఠముపై (గోపికల నడుమ) కూర్చుండగా రాత్రి వేళ ఆకాశములో తారాగణములతో చంద్రుని వలె ప్రకాశించెను. అక్కడ జనార్ధనుడు (కృష్ణుడు) అనేక శరీరములను ధరించి కాముకురాండ్రైన. స్త్రీలకు మనోహరముగా గోపికలతో (పూర్వము వలె) మరల క్రీడించెను.

స్వయం రాధాం కరే ధృత్వా పూర్వోక్తం రతిమందిరం

విశ్వకర్మ వినిర్మాణమారురోహ స్మరాతుర

చందనాగురు కస్తూరీ కుంకుమార్తం సువాసితం

తత్ర చంపక తల్చే స నుష్వాప చ తయా సహ

నానాప్రకార శృంగారం కామ శాస్త్ర విశారదః

చకార కామీ క్రీడాం చ కామిన్యా సహ కౌతుకీ

 బభూవ సురతిక్షత్ర నుచిరం చ తయోర్మునే

రతినిషా తయోరమ్యా విరచిర్నాస్తి తత్క్షణం

 ఏవం లో తగ్ధతుస్తత్ర రాధాకృష్ణా రసోత్సుకౌ

తస్థుస్తా గోపికాభిశ్చ సురతా కృష్ణమూర్తయః

మన్మథ పీడితుడైన శ్రీకృష్ణుడు స్వయముగా రాధను చేత ధరించి విశ్వకర్మ నిర్మితమైన -  ఇంతకు పూర్వము చెప్పబడిన - రతిమందిరమును ఆరోహించెను (ఎక్కెను). ఆ మందిరము చందనము అగురు కస్తూరీ కుంకుమ ద్రవ్యముల చేత లేపనము చేయబడియుండెను. చక్కని సువాసనలు కలదిగా చేయబడి యుండెను. అందులో సంపెంగ పూల శయ్య పైన స్వామి రాధతో కూడి నిద్రించెను. ఆ కామశాస్త్ర విశారదుడు కాముకుడు ఐన హరి ఆసక్తి కలవాడై ఆ కామిని (రాధాదేవి)తో నానావిధములుగా శృంగారక్రీడలాచరించెను. ఆ దంపతులకక్కడ దీర్ఘకాలము రతిక్రీడసాగెను. ఆ సుఖమందు నిష్ఠగల ఆ దంపతులకు ఆ క్షణములో ముగింపు లేకుండెను. ఇట్లు శృంగార రస (ఆనందము) మునందాసక్తులైన రాధాకృష్ణులక్కడ అట్లుండిరి. బయట వనములో శ్రీకృష్ణుని యొక్క బహుమూర్తులు (అనేకులైన కృష్ణులు) గోపికలలో రకర్మయందు స్థిరముగా నుండిరి.

నారద ఉవాచ - నారదుడు పలికెను :

ఆదౌ రాధాం సముచ్చార్య పశ్చాత్ కృష్ణం విదుర్భుధాః

నిమిత్తమష్య మాం భక్తం పద భక్త జనప్రియ

భక్తజనులకు ప్రియమైన స్వామీ! (ఇది నారాయణుని గురించి నారదుని సంబోధనము) బుధజనులు మొదలు రాధా నామమును పలికియే తరువాత కృష్ణుని తెలిసికొనిరి (ఉచ్చరించిరి) దీనికి కారణమేమి? భక్తుడనగు నాకు తెలుపుము.

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ ఋషి అనెను :

నిమిత్తమువ్య శ్రీవిధం కథయామీ నిశామయ

జగన్మాతా చ ప్రకృతిః పురుషశ్చ జగత్సితా

గరీయసీ త్రిజగజాం మా శతగుడైః ఏతుః

రాధాకృ సేతి గౌరశేత్యేవం శబ్దః శ్రతా ప్రీతః

కృష్ణరాధేళ గౌరీతి లోకే వ చ కదా శ్రుతః

ప్రసీద రోహిణీ చంద్ర గృహాణార్ఘ్యమిదం మము

గృహాణార్యం మయ. దత్తం సంజయా సహ భాస్కర

 ప్రసీద కమలాకాంత గృహాల మను పూజనం

ఇతి దృసం సామవేదే కౌథుమే మునివత్తమ

మునిశ్రేషా! నారదా! నీవడిగిన ప్రశ్నకు మూడు విధముల సమాధానము చెప్పుదును. వినుము. ప్రకృతియే ఈ జగములకు తల్లి. పురుషుడు {ఈశ్వరుడు) ఈ జగములకు తండ్రి. ముల్లోకములలో తల్లి, తండ్రి కంటే సూరురెట్లు గొప్పది (గరీయసీ - బరువైనది - అధికురాలు). “రాధాకృష్ణ”, “గౌరీశా” అన్న శబ్దమే వేదముందు {ఆగమ శాస్త్రమందు) వినిపించుచున్నది. “కృష్ణరాధా'' “ఈశగౌరీ" అని ఎప్పుడును లోకమందును {వ్యవహారములో) వినబడలేదు. రోహిణీ చంద్రా! నా ఆర్ఘ్యమును స్వీకరించుము అనుగ్రహించుము. సంజ్ఞాదేవితో కూడిన భాస్కరా! నాచేత అర్పించబడిన అర్ఘ్యమును స్వీకరింపుము, కమలాకాంతో (లక్ష్మీవల్లభా) నా పూజను స్వీకరింపుము. అనుగ్రహింపుము. అనీయే సామవేదమునకు చెందిన కొథుము శాఖయందు - (సంబోధన వాక్యము) చూడబడినది  (కనిపించుచున్నది).

రా శబ్దోచ్చారణాదేవ స్ళీతోభవతి మాధవ

ధాశబ్రోచ్చారతః పశ్చాద్దాపత్యేష సంభ్రమ

ఆదౌ పురుషముచ్చార్య ప్ప ప్రకృతిముచ్పరేత్

 స భవేన్మాతృమాతీ చ పదోతి క్రమణే మునే

తైలెక్యే భారతం ధన్యం. కర్మక్షేత్రం చ షణ్యదం

తతో బృందావనం పుణ్యం రాధాపాదబ్దారేణునా

షష్ఠిర్వర్ష సహస్రాణి తపస్తప్తం చ వేదసా

 రాధికా చరణాంభోజ పాదరేణూపలబ్ధయే

'రా' అను అక్షరమునుచ్చరించగనే దాని వలన మాధవుడు అధికముగా పొంగిపోవును. వెంటనే 'ధా' అక్షరమునుచ్చరించుట వలన త్వరగలవాడై (పిలుపు వినవచ్చిన వైపు). పరుగెత్తుచునే ఉన్నాడు. మొదట పురుష, శబ్దముచ్చరించి తరువాత ప్రకృతి శబ్దముచ్చరించినచో వేదమొనతిక్రమించుట వలన వాడు మాతృహంతకుడు అగును. ముల్లోకములలో కర్మక్షేత్రమును పుణ్యప్రదమును అందువలననే ధన్యమును ఐనది భారతవర్షము. అందులో బృందావనము రాధాపాదపద్మ ధూళిచేత పుణ్యమైనది సుమా! బ్రహ్మదేవుడు రాధాదేవి చరణ పద్మమందలి రేణువును పొందుటకై (లభించుటకై) అరువై వేల సంవత్సరములు తపస్సు చేసెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదపందే రాధామాధవయో రాసవర్ణనం నాకు ద్వీపంచాశత్తమో ధ్యాయః

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన రాధామాధవుల రాసవర్ణనమనెడి ఏబది రెండు అధ్యాయము సమాప్తము.