బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

126 - అధ్యాయము

మూ శ్రీనారాయణ ఉవాచ :

గణేశ పూజనంకృత్వా మాధవోయాదవైఃసహ

దేవైర్మునిభిరన్యైశ్చ దేవీభిస్సహ నారద

అంశేనదేవోదేవీభీ రుక్మిణ్యాద్యాభిరేవచ

ప్రయయౌ ద్వారకాం రమ్యాం తస్థౌసిద్ధాశ్రమే స్వయం

కృత్వాసుప్రీతి సంభాషాం సార్థం గోలోకవాసిభిః

గోపైః సుహృద్భిర్నందేన మాత్రాగోప్యా యశోదయా

ఉవాచమాతరంతాతం సునీతంచ యథోచితం

గోపాంశ్చ గోకులస్థాంశ్చ బంధువర్గాంశ్చ సాంప్రతం

శ్రీభగవానువాచ :

గచ్ఛనందవ్రజంనంద తాతప్రాణస్యవల్లభ

మాతర్యశోదే త్వమపి పరమార్థ యశస్విని

భుక్త్వాకాలావశేషంచ గచ్ఛగోకులముత్తమం

సాలోక్యముక్తిం దాస్యామి సార్థం గోకులవాసిభిః

ఇత్యుక్త్వా భగవాన్ కృష్ణః పిత్రోరనుమతేనచ

జగామరాధికా స్థానం నందశ్చ గోకులం తథా

దదర్శరాధాం రుచిరాం ముక్తాహారాంచ సస్మితాం

యథా ద్వాదశ వర్షీయాం శశ్వత్ సుస్థిర యౌవనాం

రత్నోచ్చై రాసనస్థాంచ గోపీత్రిశతకోటిభిః

ఆవృతాంవేత్ర హస్తాభిః సస్మితాభిశ్చ సాంప్రతం

దృష్ట్వాచ దూరతోరాధా శ్రీకృష్ణం ప్రాణవల్లభా

శిశువేషం సువేషంచ సుందరేశంచ సస్మితం

నవీనజలదశ్యామంపీత కౌశేయవాససం

చందనోక్షిత సర్వాంగం రత్నభూషణ భూషితం

మయూర పింఛచూడంచ మాలతీ మాల్యశోభితం

ఈషద్దాస్య ప్రసన్నాస్యం భక్తానుగ్రహవిగ్రహం

క్రీడాకమల మమ్లనం ధృతవంతం మనోహరం

మురళీహస్త విన్యస్తం సుప్రశస్తంచ దర్పణం

జవేనచ సుముత్థాయ గోపీభిః సహసాదరం

ప్రణమ్య పరయా భక్త్యా తుష్టావ పరమేశ్వరం

రాధికోవాచ :

అద్యమేసఫలం జన్మజీవితంచ సుజీవితం

యద్దృష్ట్వాముఖ చంద్రంతేయ సుస్నిగ్ధంలోచనం మనః

పంచప్రాణాశ్చస్నిగ్దాశ్చ పరమాత్మాచ సుప్రియః

ఉభయోః హర్షభీజంచ దుర్లభం బంధు దర్శనం

శోకార్ణవే నిమగ్నాహం ప్రదగ్ధా విరహానలైః

త్వద్దృష్ట్యామృత వృష్ట్యాచ సుసిక్తాద్యసుశీలతా

శివాశివ ప్రదాహంచ శివబీజా త్వయాసహ

శివస్వరూపానిశ్చేష్టాప్య దృష్టాచ త్వయానా

త్వయిశిష్టతిదేహేచ దేహీశ్రీమాన్ శుచిః స్వయం

సర్వశక్తి స్వరూపాచ శివరూపా గతేత్వయి

స్త్రీపుంసోర్విరహోనాథ సామాన్యశ్చ సుదారుణః

యాంత్యేవశక్తిభిః ప్రాణావిచ్ఛేధాత్పరమాత్మనః

శ్రీనారాయణుడిట్లా –

గణేశపూజచేసి మాధవుడు యాదవులతో కూడా ఓనారద! దేవతలు, మునులు, ఇతరులు, దేవేరులు అందరితో కలసి (1) తన అంశగల దేవతలు, దేవేరులతో రుక్మిణి మొదలగు వారితో కలసి రమ్యమైన ద్వారకకు వెళ్ళాడు. స్వయంగా సిద్ధాశ్రమమందు ఉన్నాడు. (2) గోలోకమందున్న వారితో కూడి ప్రేమతో సంభాషణచేసి స్నేహితులైన గోపకులతో, నందునితో, తల్లిగోపిక యశోదతో సంభాషణ చేసి (3) తల్లితో, తండ్రితో సునీతి గల వారితో తగిన విధంగా మాట్లాడాడు. గోపాలురు, గోకులమందున్నవారు, బంధువర్గము అందరితో అప్పుడు ఇట్టన్నాడు. (4) శ్రీభగవానుడిట్లా – ఓతండ్రి! నందుడ! నంద ప్రజానికి వెళ్ళు, మాతండ్రి గారి ప్రాణమునకు ప్రియమైన ఓతల్లి! యశోద కీర్తిమంతురాల, మిక్కిలి ఆర్యురాల, నీవుకూడా వెళ్ళు. (5) మిగిలిన కాలాన్ని అనుభవించి, ఉత్తమమైన గోకులానికి వెళ్ళు. గోకులవాసులతో కూడా సాలోక్యముక్తిని ఇస్తాను. (6) అని పలికి భగవానుడైన కృష్ణుడు తండ్రి అనుమతితో రాధిక ఉన్నచోటికి వెళ్ళాడు. నందుడు గోకులానికి వెళ్ళాడు. (7) అందమైన, చిరునవ్వు నవ్వుతున్న ముత్యాల హారము ధరించిన రాధను చూచాడు. ఆమె పన్నెండేళ్ళ అమ్మాయిలా ఉంది. ఎప్పుడు స్థిరమైన యౌవ్వనం కలదానివలె ఉంది. (8) మూడు వందల కోట్ల గోపికలు ఆమె చుట్టూ ఉన్నారు. రత్నములతోచేసిన ఉన్నత ఆసనం పై ఆమె ఉన్నది. గోపికలు వెదురు కర్రలు చేత ధరించి ఉన్నారు. ఇప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు. (9) దూరం నుండే శ్రీకృష్ణుని రాధ, ప్రాణవల్లభురాలగు ఆమె చూసింది. చిన్నపిల్లవాడి వేషము, మంచి వేషము, సుందరమైన వారికి నాయకుడిలా, చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. (10) కొత్త మేఘమువలె (నీరిచ్చే మేఘం) శ్యామలవర్ణుడు, పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించాడు. ఒంటినిండా చందనం పూసుకున్నాడు, రత్నముల అలంకారములతో అలంకరింపబడ్డాడు. (11) తల పై మయూర పింఛాన్ని ధరించాడు. మాలతీ మాలతో అలంకరించుకున్నాడు. కొద్దినవ్వుతో కూడిన ప్రసన్నమైన ముఖం కలిగి ఉన్నాడు. భక్తులను అనుగ్రహించే కొరకు రూపమెత్తినవాడు (12) వాడని, మనోహరమైన కమలాన్ని విలాసమునకై ధరించాడు, మురళిని చేతియందు కలిగియున్నాడు, చాలా ప్రశస్తమైన దర్పణం కలిగియున్నాడు. (13) అట్టి కృష్ణుని చూచి,వేగంగా లేచి, గోపికలతో పాటు, ఆదరంగా, చాలా భక్తితో నమస్కరించి పరమేశ్వరుని స్తుతించింది. (14) రాధిక ఇట్లా - ఈవేళ నాజన్మ సఫలమైంది. నా జీవనము మంచి జీవనమైంది, నీ స్నిగ్ధమైన ముఖచంద్రుణ్ణి,కళ్ళను, మనస్సును చూచానుకదా.(15) ఐదు ప్రాణములు నిగనిగనైనాయి. పరమాత్మ మంచిప్రియమైనవాడు. ఇద్దరికి ఆనందానికి మూలము. బంధు దర్శనము చాలా దుర్లభము కదా. (16) నేనుశోక సముద్రంలో మునిగి ఉన్నాను. విరహాగ్నితో కాలిపోయాను. నీచూపులనే అమృత వరంతో ఈవేళ బాగా తడుపబడ్డాను. మంచిశీలము (స్వభావము) కలిగింది. (17) నేను మంగళురాలను, మంగళాన్ని ఇచ్చేదాన్ని. నీతో కూడి శివబీజురాలినై నాను. నిన్ను చూడకుండా, నీవు లేకుండా శివస్వరూపురాలనైనా నిశ్చేష్టురాలనే, (18) నీవు దేహమందుంటే శరీరధారి శ్రీమంతుడు స్వయంగా శుచి, సర్వశక్తి స్వరూపురాలైనా, శివరూపురాలైనా నీవు వెళ్ళిపోతే అశుచి (19) సామాన్యంగా స్త్రీ పురుషుల విరహము చాలా భయంకరమైనది, ఓనాథ పరమాత్మవిచ్ఛేదంతో శక్తులతో ప్రాణాలు వెళ్ళిపోతాయి.

మూ ఇత్యుక్త్వా రాధికాదేవీ పరమాత్మానమీశ్వరం

స్వాసనే వాసయామాసకృత్వా పాదార్చనం ముదా

రత్నసింహాసనే శ్రీమానువాసరాధయాస

గోపీభిః సహితః శశ్వత్ సేవితః శ్వేతచామరైః

చందనా సా దదౌ గాత్రేసుగంధి చందనం హరేః

సస్మితా రత్నమాలా సా రత్నమాలాంగలేదదౌ

పద్మైః పద్మార్చితే పాదపద్మే పద్మావతీసతీ

అర్ఘ్యం దదౌ సా సజలందూర్వాం పుష్పంచ చందనం

మాలతీ మాలతీమాల్యం చూడాయాంచ హరేర్దదౌ

చంపాపుష్పస్య పుటకందదౌచ పార్వతీసతీ

పారిజాతాపహరయే పారిజాతందదౌముదా

సకర్పూరంచ తాంబూలం వాసితంశీలం జలం దదౌకదంబమాలా సా కదంబమాలికాం శుభాం

క్రీడాకమలమమ్లానమ మూల్యం రత్నదర్పణం

దదౌహస్తే హరేర్దేవ కమలాసాసుకోమలా

వరుణేన పురాదత్తం వస్త్రయుగ్మంచ సుందరం

సాక్షాద్గోరోచనాభంచ సుందరీ హరయేదదౌ

మధుపాత్రం వధూస్తస్మై మధురం మధుపూర్ణకం

సుధాపూర్ణం సుధాపాత్రదదౌ భక్త్యాసుధాముఖీ

చకారపుష్పశయ్యాంచ గోపీచందన చర్చితాం

అమ్లన మాలతీపుష్పమాలాజాల విభూషితాం

ర త్నేంద్ర సారనిర్మాణ మందిరే సుమనోహరే

మణీంద్రముక్తామాణిక్య హీరహార విభూషితే

కస్తూరీ కుంకుమాక్తేన వాయునాసురభీకృతే

రత్నప్రదీపశతకైః జ్వలద్భిశ్చ సుదీపితే

ధూపితే సతతంధూ పైః నానా వస్తుసమన్వితైః

కృత్వాశయ్యాం రతికరీం యయుఃగోప్యశ్చ సస్మితాః

దృష్ట్వారహసితల్పంచ సురమ్యం సుమనోహరం

మాధవో రాధయాసార్థం వివేశరతి మందిరం

నానా ప్రకారహాస్యంచ పరిహాసం స్మరోచితం

ద్వయోర్బభూవతల్పేచ మదనాతురయోస్తథా

మాల్యం దదౌచకృష్ణాయ తాంబూలంచ సువాసితం

కస్తూరీ కుంకుమాక్తంచ చందనం శ్యామవక్షసి

చారు చంపకపుష్పంచ చూడాయాం ప్రదదౌసతీ

సహస్ర దళసంసక్త క్రీడాపద్మం కరేదదౌ

ప్రక్షిప్యమురళీం హస్తాత్ ప్రదదౌ రత్నదర్పణం

పారిజాతస్య కుసుమమమాలానం పురతోదదౌ

ఉవాచ మధురం రాధారహస్యం మధురం వచః

సస్మితా సస్మితం శాంతం కాంతం కాంతా మనోహరం

శ్రీరాధికోఉవాచ :

నిష్ఫలం మంగళ ప్రశ్నం మంగళం మంగళాలయే

సర్వమంగళ బీజేచ మాంగల్యే మంగళప్రదే

తథాపికుశలప్రశ్నం సాంప్రతం సమయోచితం

లౌకికోవ్యవహారోఽపి వేదేభ్యో బలవాంస్తథా

అని పలికి రాధికదేవి, పరమాత్మను, ఈశ్వరుడిని ఆనందంతో పాదములకు అర్చన చేసి, ఆతని ఆసనం పై కూర్చో పెట్టింది. (21) శ్రీమాన్, కృష్ణుడు రత్నసింహాసనమందు రాధతో సహ కూర్చున్నాడు. గోపికలు ఎల్లప్పుడు తెల్లని చామరలతో ఆతనిని సేవించారు. (22) చందన అను స్త్రీ వాసనగల చందనమును హరి శరీరమందు ఉంచింది. రత్నమాల అను గోపిక చిరునవ్వుతో, రత్నమాలను ఆతని కంఠమందుంచింది. (23) పద్మావతి అను స్త్రీ పద్మములతో పద్మపూజించిన పాదపద్మములందు, అర్ఘ్యమును, జలము, దూర్వా, పుష్పములు, చందనము ఇచ్చింది. (24) మాలతి అను గోపిక, హరి, తల పై మాలతీ మాలను ఉంచింది. పార్వతి అను స్త్రీ చంప పుష్పముల గుత్తిని ఇచ్చింది. (25) పారిజాత అను గోపిక పారిజాత పుష్పాన్ని హరికి ఆనందంతో ఇచ్చింది. కదంబమాల అను గోపిక కర్పూరంతో కూడిన తాంబూలాన్ని, వాసనగల చల్లని నీటిని, కదంబమాలను, శుభమైన దాన్ని ఇచ్చింది. (26) కమల అను గోపిక చాలా కోమలురాలు, వాడిపోని, కమలమును విలాసము కొరకు అమూల్యమైన రత్నపు అద్దమును హరిచేతికి ఇచ్చింది. (27) సుందరి అను గోపిక, వరుణుడు ఇదివరలో ఇచ్చిన,సుందరమైన రెండు వస్త్రములను సాక్షాత్తుగోరోచనపు కాంతిగలవానిని, హరికి ఇచ్చింది. (28) ఒక సుదాముఖి! మధురమైన, మధువుతో నిండిన, మధుపాత్రను, సుధతో నిండిన, సుధాపాత్రను భక్తితో ఆమె హరికి ఇచ్చింది. (29) ఒక గోపిక చందనము పూయబడిన, వాడని మాలతీ పుష్పమాలల సమూహంతో అలంకరింపబడ్డ పుష్పశయ్యను ఏర్పరచింది. (30) శ్రేష్ఠ వజ్రములతో నిర్మింపబడ్డ మందిరంలో, చాలా మనోహరమైన దానిలో శ్రేష్ఠమణులు, ముత్యములు, మాణిక్యములు, వజ్రములు, వీటిహారములతో అలంకరింపబడ్డ (31) కుంకుమ కస్తూరి వీనితో పూయబడ్డ గాలితో సుగంధము (వాసన) కలదిగా చేయబడ్డ, నూర్లకొలది రత్న దీపముల వెలుతురులతో చక్కగా దీపాలు కూర్చబడిన (32) అనేక వస్తువులతో కూడిన ధూపములతో ఎల్లప్పుడూ ధూపం వేయబడిన, రతిని కల్గించే శయ్యను ఏర్పరచి నవ్వుతూ గోపికలు వెళ్ళిపోయారు. (33) చాలా అందమైన చాలా మనోహరమైన పడకను రహస్యంగా చూచి, మాధవుడు రాధతో కూడి రతి మందిరంలోకి ప్రవేశించాడు. (34) ప్రేమకు తగిన (స్మర) రకరకాల హాస్యమును, పరిహాసమును, మదనాతురులైన వారిద్దరు పడకయందు చేసుకున్నారు. (35) కృష్ణునకు మాలను, వాసనగల తాంబూలాన్ని ఇచ్చింది. శ్యాముని రొమ్ముపై కస్తూరి కుంకుమలతో కూడిన చందనం పూసింది. (36) ఆసతి మంచి చంపక పూలతో కూడిన మాల)ను తల పై ఉంచింది. సహస్ర దళములతో కూడిన క్రీడా (విలాసమునకై) పద్మమును చేతికిచ్చింది. (37) మురళిని హస్తం నుండి పారేసి, రత్నదర్పణాన్ని ఇచ్చింది. వాడిపోని, పారిజాతపు పూవును ముందుంచింది. (38) రహస్యంగా మధురమైనమాటను రాధ మధురంగా పల్కింది. ఈమె నవ్వుతోంది, ఆతడు నవ్వుతున్నాడు శాంతంగా మనోహరంగా, స్త్రీ మనోహరంగా ఉన్నాడు. (39) శ్రీరాధ ఇట్లా - మంగళములకు నిలయమైన వానిని మంగళమును గూర్చి, క్షేమ ప్రశ్నను వేయటం వ్యర్థం. అన్ని మంగళములకు బీజమైన, మంగళాన్నిచ్చే, మంగళ స్వరూపడైన వాడిని మంగళ ప్రశ్నవేయడం వ్యర్థం (40) ఐనా ఇప్పుడు కుశల ప్రశ్నవేయటం సమయానికి తగినదే. లౌకిక వ్యవహారమైనా వేదములకన్న బలవత్తరమైనది.

మూ కుశలం రుక్మిణీ కాంతసత్యభామేశ సాంప్రతం

మహేంద్రేణ సమంయుద్ధం లీలయాచ యదాజ్ఞయా

పారిజాతతరుoస్వర్గాత్ ఉత్పాట్య చామరావతీం

గత్వా విజిత్య దేవాంశ్చ తస్యైదత్తమితిశ్రుతం

పుణ్యకంచ కృతంతేన పారిజాతేన సువ్రతా

త్వామేవ సాధ్యం కాంతంచ సంపూర్ణే దక్షిణాందదౌ

బ్రహ్మేశశేషా సాధ్యస్త్వం తయాసాధ్యంకృతః కథం

సర్వాభ్యః కామినీభ్యశ్చ సత్యభామాబిభర్షిచ

రుక్మిణ్యాః ప్రేమసౌభాగ్య మతిరిక్తంచ గౌరవం

భయంమానంచ ధన్యాయాం సత్యాయాం సతతంశ్రుతం

సత్యంజాంబవతీ కాంతవదమాంచ సునిశ్చితం

తాసుసర్వాసు కాంతాసు కస్యాస్తే ప్రేమచాధికం

శృంగారే సర్వభావేవా తాసుకా రసికాపరా

త్వయిస్నిగ్ధ విదగ్ధాకా తాసుధన్యాతిసువ్రతా

సాస్త్రీ భావానురక్తి యా భార్యాం పాతిపతిశ్చసః

ప్రేమాతిరిక్తం స్త్రీ పుంసోస్రైలోక్యేషు సుదుర్లభం

రసికాస్త్రీ విజానాతి సతీగుణవతీపతిం

గుణజ్ఞం రసికం శూరం సుశీలం సురతౌ ముదా

దూరాద్ధావతి పద్మార్థం మధులోభాన్మధు వ్రతః

భేకస్తన్నహిజానాతి తన్మూర్ద్ని పాదముత్సృజేత్

యంత్రీజానాతి సంగీత రసం యంత్రంచనైవచ

దుగ్ధస్వాదం విదగ్ధశ్చ న దర్వీనైవ భాజనం

పరిపక్వఫలాస్వాదం జానంతి భోగినః సుఖం

ఏకత్రావస్థితాః శశ్వత్ నకించిత్ఫలినో యథా

సుశీతల జలాస్వాదం విజానంతి కృషీవలాః

నచవాపీనత ఘటశ్చైకత్రా వస్థితోయథా

భోగినోహివిజానంతి శాలిస్వాదు రసంపరం

ఏకత్రావస్థితం చేత్తు నక్షేత్రం భాజనం యథా

బుబుధే చందనాఘ్రాణం చందనార్టీచ భోగవిత్

నగర్దభోభారవాహీ నతస్య పాత్రికా యథా

యంనజానంతి వేదాశ్చ బ్రహ్మేశానాదయస్తథా

యోగినోమునయ స్సిద్ధాః తంకింజానంతి యోషితః

సౌభాగ్యం గౌరవం ప్రేమ దుర్లభం నిత్యనూతనం

యోషితాంచ పరంనైవ చూర్ణీభూతం క్షణేనచ

అత్యుచ్చ్రితో నిపతనం ప్రాప్నోత్యేన ధ్రువంప్రభో

ఆరాద్విపత్తిర్భీజంచ వైష్ణవానాం విహింసనం

శ్రీదామచ మయాశప్తః త్వద్భక్తో భక్తవత్సలః

ఏతాదృశీవిపత్తర్మే పుత్రశ్రీదామ శాపతః

ఈశ్వరః కస్యవా బంధుః ప్రియోవావిప్రియస్తథా

సతతం భక్తిసాధ్యశ్చయో భక్తశ్చతదీశ్వరః

వేదాచ్చ వైదికాస్సంతః పురాణాని వదంతిచ

రాధాయామాధవ స్సాధ్యోభగవానితి నిష్ఫలం

ఓ రుక్మిణి కాంతుడ! క్షేమమా. సత్యభాకు ఈశుడ ఇప్పుడు క్షేమమా. ఆమె ఆజ్ఞతో మ హేంద్రునితో సమానంగా యుద్ధాన్ని అవలీలగా చేశావు. (42) పారిజాతపు చెట్టును స్వర్గంనుండి పెకిలించావు. అమరావతికి వెళ్ళి దేవతల జయించి చెట్టును ఆమెకిచ్చావని విన్నాను. (43) ఆ పారిజాతంతో పుణ్యకమనే వ్రతాన్ని చేసింది. సాధ్యుడవైన మనోహరుడవైన నిన్నే సంపూర్ణమందు దక్షిణగా ఇచ్చింది. (44) బ్రహ్మ, ఈశ, శేషులకు అసాధ్యుడవైన నీవు ఆమె కెట్లా సాధ్యుడవైనావు. అందరు స్త్రీల (భార్యల) కంటే సత్యభామను భరిస్తున్నావు. (45) రుక్మిణి యందు ప్రేమ, సౌభాగ్యము, అంతకు మించి గౌరవము. భయము అభిమానము ధన్యమైన సత్యభామ యందు ఎల్లప్పుడు అని విన్నాము. (46) ఓ జాంబవతీకాంతుడ! నాకు నిశ్చయమైన యదార్థమేమిటో చెప్పు. ఆ స్త్రీలందరిలో నీ ప్రేమ ఎవరి యందధికము. (47) శృంగారమందు, అన్ని భావములందు వారిలో రసికురాలు, పరురాలెవ్వరు. నీయందు మృదువుగా ప్రవర్తించేది (ప్రేమతో) తెలివికలది, ధన్యురాలు, చాలా మంచివ్రతము కలది. వారిలో ఎవతే ఉంది. (48) భర్త పై భావము యందు అనురక్తురాలైన భార్య భార్య, భార్యను రక్షించేవాడు నిజమైన భర్త. స్త్రీ పురుషులకు ప్రేమను మించినది ముల్లోకములలో మరొకటి లేదు. అదిచాలా దుర్లభము. (49) రసికురాలైన స్త్రీ, సతి, గుణవతి పతిని గుర్తిస్తుంది. గుణముల నెరిగిన, రసికుడైన, శూరుడైన, సుశీలుడైన వానిని ఎల్లప్పుడు మంచిరతియందు గుర్తిస్తుంది. (50) తుమ్మెద తేనె మీది ఆశతో పద్మం కొరకు దూరం నుండి పరుగెత్తుతుంది. కప్పకు, ఆసంగతి తెలియదు. దాని తల పై కాలు పెడుతుంది. (51) యంత్రము వాయించేవాడు సంగీతరసమెరుగును. యంత్రానికి తెలియదు. పాలరుచి తెలివికలవాడు గ్రహిస్తాడు. గంటెకో, గిన్నెకో తెలియదు. (52) సుఖమును అనుభవించే వారు బాగా పండిన పండు రుచిని తెలుసుకోగలరు. ఎప్పుడు ఒకేచోట ఉన్నటువంటి ఫలము గలవి (చెట్లు) కొంచెము కూడా తెలుసుకోలేవు. (53) కృషీవలుడు చాలా చల్లని నీటి రుచిని తెలుసుకుంటాడు. బావికాని, కుండకాని ఒకేచోట ఉన్నవి గుర్తించలేవు. (54) అన్నము యొక్క రుచికరమైన రసమును, పరమైన దానిని భోగులు తెలుసుకుంటారు. ఒక్కచోట ఉన్న పొలముకాని పాత్రగాని గ్రహించవు. (55) భోగ మెరిగినవాడు చందనము కోరేవాడు చందనపు వాసనను తెలుసుకోగలడు. బరువు మోసే గాడిదకాని, చందనపుగిన్నెకాని గ్రహించవు. (56) వేదములు కాని, బ్రహ్మ ఈశానాదులు కాని తెలుసుకోలేని వానిని, యోగులు, మునులు, సిద్ధులు తెలుసుకోలేని వానిని ఆడవారేమి తెలుసుకుంటారు. (57) నిత్యనూతనమైన సౌభాగ్యము,గౌరవము, ప్రేమ దుర్లభము. స్త్రీలకు, పరమైనది లేదు. క్షణంలో చూర్ణమౌతుంది. (58) ఓ ప్రభు! చాలా ఎక్కువైనది (ఎత్తైనది) పడిపోతుంది నిశ్చయము. వైష్ణవులను హింసించుట దూరం నుండే ఆపదలకు బీజము (59) శ్రీరాముని నేను శపించాను. ఆతడు నీ భక్తుడు, భక్తవత్సలుడు. శ్రీరాముని శాపంవల్ల నాకీ విపత్తి, ఓపుత్ర! (60) ఈశ్వరుడు ఎవనికి బంధువు, ఎవనికి, ప్రియమైనవాడు, ఎవరికి అప్రియుడు. ఎప్పుడూ భక్తితో ఆతనిని సాధించాలి. భక్తునకు ఆయన ఈశ్వరుడు (61) వానివాడే అని వేదం, వైదికులు, సజ్జనులు, పురాణములు చెప్తున్నాయి. మాధవుడు రాధకు సాధ్యుడు. ఆ భగవానుడు, అనే మాట నిష్పలమైనది.

మూ జిత్వాచ సగణం శంభుం బాణస్య భుజకృంతనం

కృత్వాచ రుక్మిణీ పౌత్రః సమానీతః సభార్యకః

అహోత్వయి సమాయాతే రుక్మిణీకిమువాచహ

ప్రేమస్థితం సమానంతే కింవివృధ్ధంచ గౌరవం

కురుపాండవ యుద్దేన కురవోనిహతాస్త్వయా

పాండవార్థేతథాభూషాః క్వసామ్యం పరమాత్మనః

సాక్షాన్మ హేంద్ర జాతస్య కౌంతేయస్యార్జునస్యచ

రాజమండల మధ్యస్థోభవానేవహి సారథిః

తేన భక్తేన శుద్దేన భీష్మేణచ మహాత్మనా

లజ్జితేనకిముక్తంతే మహతీషు సభాసుచ

దేవైరపికథం దృష్టో బ్రహ్మేశశేష సంజ్ఞకైః

భక్తసింహైర్మృతై స్సర్వై:న చోక్తం కించిదేవసః

యశ్చానిర్వచనీయశ్చ వేదేషుచ చతుర్షుచ

పురాణేష్వితి హాసేషు ప్రకృతేః పర ఈశ్వరః

నిర్గుణశ్చ నిరీహశ్చ నిర్లిప్తః సర్వకర్మణాం

కర్మణాం సాక్షిరూపశ్చ భక్తానుగ్రహ విగ్రహః

పరంబ్రహ్మ పరంజ్యోతిః పరమేశః పరాత్పరః

పరమాత్మాచ సర్వేషాం సూత్నర రథస్థితః

త్వయాకుబ్జాచ సంభుక్త వృద్ధాక్షత్రియ కామినీ

అపుత్రిణీచాధికాంధీయూనాస్పృశ్యాచ ప్రాక్తనాత్

త్వయాచనిహతః కంసో మాతుల: కేన హేతునా

ఆయాస్యతీతికృత్వాచ గతంన పునరాగతం

నిహత్యయాదవాన్ సర్వాన్ విభజ్య ద్వారకాం పురీం

త్వాంనిబధ్య సమానతుమీశ్వరీ వారితాజనైః

ఇత్యుక్తా రాధికాదేవీభృశముచ్చైః రురోదసా

మూర్ఛాం సంప్రాప సహ నిర్నిశ్వాసాబభూవహ

గోప్యోగవాక్ష జాలస్థాః శుశ్రువుః దదృశుస్తథా

దృష్ట్వాతామాయయుస్సర్వా ఊచూరాధామృతేతిచ

ఉచ్ఛైస్తా రురుదుస్సర్వాః క్రోడీకృత్వాచరాధికాం

ఊచుస్తారక్షరక్షేతి హరేనరహరే ప్రభో

గోప్య ఊచుః

కింకృతం కింకృతం కృష్ణత్వయా రాధా మృతాచ నః

రాధాం జీవయభద్రంతే యాస్యామః కాననంవయం

అన్యథాస్త్రీవధంతుభ్యం దాస్యామః సర్వయోషితః

గోపీనాం వచనం శ్రుత్వా రాధికాయాశ్చమాధవః

ఉవాచజీవయామాససుధాదృష్ట్యాచ నారద

ఉత్తస్థౌరాధికాదేవీ రుదంతీ మానినీ సతీ

గోప్యస్తాంభోదయామాసుః క్రోడేకృత్వాపునః పునః

శ్రీకృష్ణ ఉవాచ :

శృణురాధే ప్రవక్ష్యామి జ్ఞానమాధ్యాత్మికం పరం

యచ్చ్రుత్వాహలికో మూర్ఖః సద్యోభవతి పండితః

జాత్యాహంజగతాం స్వామీకిం రుక్మిణ్యాది యోషితాం

కార్యకారణ రూపోఽహం వ్యక్తో రాధే పృథక్ పృథక్

గణములతో కూడిన శంభుని జయించి, బాణునిచేతులు ఖండించి, భార్యతోకూడిన రుక్మిణీ పౌత్రుణ్ణి తెచ్చావు. (63) అహో! నీవు రాగానే రుక్మిణి ఏమన్నది. నీ ప్రేమ సమానంగానే ఉన్నదా లేదా గౌరవం పెరిగిందా (64) నీవు కురుపాండవయుద్ధంలో కౌరవుల చంపించావు. పాండవుల కోసం రాజులుచచ్చారు. పరమాత్మకు సామ్యమెక్కడిది. (65) సాక్షాత్తు మహేంద్రునకు కల్గిన, కౌంతేయుడైన అర్జునునకు రాజుల సమూహం మధ్యలో ఉండి నీవే సారథివైనావు. (66) శుదుడైన, మహాత్ముడైన భక్తుడైన, ఆభీష్ముడు సిగ్గుపడుతూ, పెద్ద సభలలో నీతో ఏమన్నాడు. (67) బ్రహ్మ ఈశ, శేష అను పేర్లుగల దేవతలు కూడా ఎట్లాచూచారు. అందరు భక్తసింహాలు, మరణించారు. ఆతడేమీ మాట్లాడలేదు. (68) నాలుగు వేదాలలో అనిర్వచనీయుడు, పురాణ ఇతిహాసములలోనూ అనిర్వచనీయుడు ప్రకృతికి పరుడు, ఈశ్వరుడు. (69) నిర్గుణుడు, నిరీహుడు, నిర్లిప్తుడు, అన్ని కర్మలకు,కర్మలు చేసేవారికి సాక్షిరూపుడు, భక్తులను అనుగ్రహించేందుకు రూ పెత్తిన వాడు. (70) పరంబ్రహ్మ పరంజ్యోతి, పరమేశ్వరుడు, పరాత్పరుడు, అందరికి పరమాత్మ, సూతుడైన నరుని రథముయందున్నాడు. (71) వృద్ధురాలు, క్షత్రియస్త్రీ, సంతానంలేనిది, అధికంగా అవయవములు కలది, అట్టి కుఱ్ఱయువకురాలై, నీతో స్పృశింపబడి అనుభవింపబడింది, ప్రాక్తన కర్మవల్ల, (72) నీమేనమామ కంసుని, నీవు ఎందుకు చంపావు. రాగలదు (డు) అని చెప్పి వెళ్ళాను. తిరిగిరాలేదు. (73) యాదవులనందరిని చంపి, ద్వారకను విభజించి, నిన్ను బంధించి తీసుకెళ్ళటానికి వచ్చిన ఈశ్వరిని జనులు వారించారు. (74) అని పలికి దేవి రాధిక చాలా పెద్దగా ఏడ్చింది. వెంటనే మూర్ఛపోయింది. నిశ్వాసములేనిదైంది. (75) గోపికలు గవాక్షజాలములందుండి విన్నారు, చూచారు. చూచి అంతా వచ్చారు. రాధ చచ్చింది అని అన్నారు. (76) రాధికను ఉరము నందుంచుకొని గట్టిగా వారంతా దుఃఖించారు. ఓ ప్రభు హరి నరహరి రక్షించు రక్షించు అనివారన్నారు. (77) గోపికలిట్లా – ఓకృష్ణ! నీవేంచేశావు, నీవేం చేశావు. మా రాధ నీవల్ల చనిపోయింది. రాధను బ్రతికించు. నీకు క్షేమమగుగాక. మేము అడవికి వెళ్ళిపోతాము. (78) లేకున్న స్త్రీ హంతకుడని మా ఆడవాళ్ళమంతా నీకు బిరుదిస్తాము. (79) గోపికల మాట విని రాధికమాటను విని, మాధవుడు అన్నాడు. అమృతం వంటి చూపుతో ఆమెను బ్రతికించాడు. ఓ నారద! (80) ఏడుస్తూ, ఆమానిని, సతి, దేవి, రాధిక లేచింది. రొమ్మున అదుముకొని ఆగోపికలు మాటిమాటికి ఆమెకు చెప్పసాగారు. (81) శ్రీకృష్ణుడిట్లా – ఓరాధ! ఆధ్యాత్మికమైన పరమైన జ్ఞానాన్ని భోదిస్తాను, విను. దీనిని విని, మూరుడైన రైతు వెంటనే పండితుడౌతాడు. (82) జాతి పరంగా నేను జగత్తునకు స్వామిని. రుక్మిణి మొదలగు స్త్రీలకు స్వామికావటానికేముంది. కార్యకారణ రూపంగా నేను విడివిడిగా వ్యక్తుడనౌతాను, ఓ రాధ!

మూ ఏకాత్మాహంచ విశ్వేషాం జాత్యాజ్యోతిర్మయః స్వయం

సర్వప్రాణిషువ్యక్త్యాచాప్యా బ్రహ్మాది తృణాదిషు

ఏకస్మింశ్చ భుక్తవతి నతు ష్టోఽన్యో జనస్తథా

మయ్యాత్మనిగతే స్యేకోమృతోపన్యః సుజీవతి

జాత్యాహం కృష్ణరూపశ్చ పరిపూర్ణమతః స్వయం

గోలోకే గోకులేరమ్యే క్షేత్రే బృందావనేవనే

ద్విభుజో గోపవేషశ్చ స్వయం రాధాపతిః శిశుః

గోపాలై: గోపికాభిశ్చ సహితః కామధేనుభిః

చతుర్భుజోఽహం వైకుంఠే ద్విధారూపఃసనాతనః

లక్ష్మీ సరస్వతీకాంతః సతతం శాంతి విగ్రహః

యన్మానసీ సింధుకన్యా మర్త్య లక్ష్మీపతిర్భువి

శ్వేతద్వీపేచక్షీరోదే తత్రాపిచ చతుర్భుజః

అహం నారాయణర్షీశ్చ నరోధర్మః సనాతనః

ధర్మవక్తాచ ధర్మిష్ఠో ధర్మవర్త్మ ప్రవర్తకః

శాంతిర్లక్ష్మీ స్వరూపచ ధర్మిష్ఠాచ పతివ్రతా

అత్రతస్యాః పతిరహం పుణ్యక్షేత్రేచభారతే

సిద్దేశః సిద్దిదః సాక్షాత్ కపిలోఽహం సతీపతిః

నానారూపధరోఽహంచ వ్యక్తిభేదేన సుందరీ

అహంచతుర్భుజశ్శశ్వద్దార్వత్యాం రుక్మిణీపతిః

అహంక్షీరోదశాయీచ సత్యభామా గృహేశుభే

అన్యాసాంమందిర్నేహంచ కాయవ్యూహాత్ పృథక్ పృథక్

అహం నారాయణరిశ్చ ఫాలునస్యాస్య సారథిః

సనరర్షిర్ధర్మ పుత్రో మదంతో బలవాన్ భువి

తపసారాధిత స్తేన సారథ్యేఽహంచ పుష్కరే

యథాత్వం రాధికాదేవీగోలోకే గోకులే తథా

 వైకుంఠేచ మహాలక్ష్మీః భవతీచ సరస్వతీ

భవతీమృత్యు లక్ష్మీశ్చ క్షీరోదశయినః ప్రియా

ధర్మపుత్ర వధూస్త్వంచ శాంతిర్లక్ష్మీ స్వరూపిణీ

కపిలస్యప్రియాకాంతా భారతే భారతీ సతీ

త్వంసీతా మిథిలాయాంచ త్వచ్ఛాయా ద్రౌపదీసతీ

ద్వారవత్యాం మహాలక్ష్మీః భవతీరుక్మిణీ సతి

పంచానాం పాండవానాంచ భవతీ కలయాప్రియా

రావణేన హృతాత్వంచ త్వంచ రామస్యకామినీ

 నానారూపాయథాత్వంచ ఛాయయాకలయాసతీ

 నానారూపస్తథాఽహంచ స్వాంశేన కలయా తథా

పరిపూర్ణతమోఽహంచ పరమాత్మా పరాత్పరః

ఇతితేకథితం సర్వమాధ్యాత్మిక మిదం సతి

రాధేసర్వాపరాధం మే క్షమస్వపరమేశ్వరి

శ్రీకృష్ణవచనం శ్రుత్వా పంతుష్టాచరాధికా

పరితుష్టాశ్చ గోప్యశ్చ ప్రణేముః పరమేశ్వరం

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరాఠీ నారాయణ నారదసంవాదే షడ్వింశత్యధిక శతతమోఽధ్యాయః

అను విశ్వములోని వారందరికి నేనొకడినే ఆత్మను జాతితో నేను స్వయంగా జ్యోతిర్మయుడను. అన్ని ప్రాణులలో వ్యక్తరూపంగా ఉన్నాను (వ్యక్తిగానున్నాను) బ్రహ్మమొదలు తృణాదుల వరకు అన్నిట ఉన్నాను. (84) ఒకడు తింటే మరోజనుడు సంతోషపడడు. ఆత్మయైన నాలోకి ఒకడుపోతే చచ్చినా, మరొకడు చక్కగా బ్రతుకుతాడు. (85) జాతిగానేను కృష్ణరూపుణ్. అందుకే స్వయంగా పరిపూర్ణుడను. గోలోకమందు గోకులమందు రమ్యమైన క్షేత్రమందు బృందావనమందు (86) రెండు చేతులతో, గోపవేషంతో శిశువుగా, స్వయంగా రాధ పతిని. గోపాలురు గోపికలు కామధేనువులు వీనితో కూడి (87) ఉంటాను. వైకుంఠంలో నాలుగు చేతులతో ఉంటాను రెండు రూపాలు నావి సనాతనుడను. లక్ష్మీ సరస్వతులకు కాంతుడను ఎల్లప్పుడూ శాంతివిగ్రహుడను. (88) మానసికమైన సింధుకన్య మర్త్యలక్ష్మికి భూమి పై పతిని. శ్వేతద్వీపమందు, పాలసముద్రమందు అక్కడా నాలుచేతులవాడినే, (89) నేను నారాయణ ఋషిని. నరుడు సనాతన ధర్మము. ధర్మాన్ని చెప్పేవాడు. ధర్మమందుండేవాడు. ధర్మమార్గాన్ని నడిపేవాడు (90) శాంతి, లక్ష్మీస్వరూపురాలు. ధర్మమందుండేది. పతివ్రత. ఇక్కడ ఆమెకు భర్తను నేను. ఈపుణ్యక్షేత్రమైన భారతమందు (91) సిద్ధికి ఈశుడను, సిద్ధిని ఇచ్చేవాడిని సాక్షాత్తు కపిలుడను. సతీపతిని. నేను రకరకాల రూపాలు ధరించేవాడిని, వ్యక్తి భేదంతో రూపాలు వేరు, ఓసుందరి! (92) ద్వారకలో రుక్మిణికి పతిని, ఎప్పుడూ నాలుచేతులవాడిని. శుభమైన సత్యభామ ఇంటియందు, నేను పాలసంద్రమందు పడుకునేవాడిని. (93) ఇతరుల ఇళ్ళలో నేను శరీర భేదంతో వేరువేరుగా ఉంటాను. నేను నారాయణ ఋషిని. ఈ ఫల్గుణుని సారథిని. (94) ఆ నరులలో ఋషి ధర్మపుత్రుడు నా అంశ. భూమిలో బలవంతుడు నన్ను పుష్కరక్షేత్రంలో తపస్సుతో సారథిగా కమ్మని ఆరాధించగా నేను సారథినయ్యాను. (95) నీవు గోలోకంలో గోకులంలో రాధికవుదేవివి. వైకుంఠంలో మహాలక్ష్మివి. నీవే సరస్వతి. (96) నీవు మృత్యులక్ష్మివి. పాలసంద్రంలో పడుకునేవాని ప్రియవు. నీవు ధర్మపుత్రుని వధువువు. శాంతి, లక్ష్మీ స్వరూపురాలవు. (97) కపిలుని ప్రియకాంతవు. భారతదేశమందు భారతి అను స్త్రీవి. మిథిలలో నీవు సీతవు. నీఛాయ ద్రౌపదిపతి. (98) ద్వారవతిలో మహాలక్ష్మివి నీవు రుక్మిణి అను సతివి. పంచపాండవులకు నీవు ఒకకళగా ప్రియవు. (99) రావణునితో అపహరింపబడ్డ దానవు నీవు. నీవు రాముని భార్యవు. నీకెట్లా నానా రూపాలుగల దానవో ఛాయగా, కళగా ఉంటావో (100) అట్లానేనూ నానా రూపాలు గల వాడినే నా అంశంతో, నా కళాభాగంతో నేను పరిపూర్ణతముడను, పరమాత్మను పరాత్పరుడను. (101) అని నీకు ఈ ఆధ్యాత్మిక విషయమంతా ఓసతి! చెప్పాను. ఓ పరమేశ్వరి! రాధ! నా సర్వాపరాధములను క్షమించు (102) శ్రీకృష్ణుని మాటవినిరాధిక ఆనందించింది. గోపికలు ఆనందించి పరమేశ్వరునకు నమస్కరించారు (103) అని బ్రహ్మవైవర్తమహాపురాణ శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నాదర సంవాద మందు నూట ఇరవై ఆరవ అధ్యాయము.