బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

121 - అధ్యాయము

మూII నారాయణ ఉవాచ:

అథకృష్ణః సుధర్మాహం నివసన్ సగణస్తథా

తత్రాజగామవిప్రశ్చ ప్రజ్వలన్ బ్రహ్మతేజసా

ఆగత్యదృష్ట్వా తుష్టావ భక్త్యాచ పురుషోత్తమం

ఉవాచ మధురం శాంతో భీతో వినయపూర్వకం

బ్రాహ్మణ ఉవాచ:

శృగాలోవాసుదేవశ్చ రాజేశోమండలేశ్వరః

త్వామువాచ సయద్వాక్యం సావధానం నిశామయ

శృగాల ఉవాచ :

వైకుంఠేవాసుదేవోహందేవేశశ్చ చతుర్భుజః

లక్ష్మీపతిశ్చ జగతాంధాతా ధాతుశ్చపాలకః

బ్రహ్మణాప్రార్థితో హంచ భారావతరణాయచ

భువోభారతవర్షం తదర్థం గమనంమమ

వసుదేవసుతోవైశ్యః క్షత్రియశ్చాప్యహం వృతః

జనంజనేన నిర్జిత్యదుర్బలంబలినాసహ

యోధయిత్వా మహాధూర్త ఘాతయామాసభూపతీన్

దుర్యోధనం జరాసంధం భూపమన్యంచ దుర్బలం

భీమేన ఘాతయామాస బలినాల్పేన భూతలే

ద్రోణం భీష్మంచ కర్ణంచ యం యమన్యంచ భూతలే

బలీయ సార్జునేనైవ ఘాతయామాస లీలయా

యంయమన్యం దుర్బలంచ ప్రసిద్ధమ ప్రసిద్ధకం

ప్రసిద్ధేన బలవతా ఘాతయామాస లీలయా

శిశుపాలం దంతక్రంకంసంచ చిరరోగిణం

మత్సుత్రం నరకం చైవదుర్బలం కేశినం సురం

స్వయం జఘానసంకేతాత్ ఛలేన సహమోతవ

నధర్మయుద్ధేకపటీసచ బాలో హ్యధార్మికః

జఘాన పూతానాం కుబ్జం స్త్రీ ఘాతీవస్త్ర హేతునా

జఘానరజకంశిష్టం అనిష్టశ్చ ప్రతారకః

హిరణ్యకశిపుందైత్యం హిరణ్యాక్షం మహాబలం

మధుంచకైటభంచైవ హత్వాహంసృష్టిరక్షకః

అహమేవస్వయం బ్రహ్మాహ్యహమేవ స్వయం శివః

అహంవిష్ణుశ్చజగతాం పాతదుష్టావహారకః

అంశేన కలయాసర్వే మనవోమునయస్తథా

స్వయం నారాయణోఽహంచ నిర్గుణః ప్రకృతేః పరః  

లజ్జయకృపయాచైవ మిత్రబుద్ధ్యాక్షమాకృతా

యద్గతంతద్గతం భద్ర యుద్ధం కురుమయాసహ

శృణోమిదూతద్వారేణ హ్యతీవోచ్చైరహం కృతం

ఉచితందమనం తస్యాప్యున్నతానాం నిపాతనం

నారాయణుడిట్లా - తన గణముతో కూడి కృష్ణుడు సుధర్మసభయందు ఉన్నాడు. అక్కడికి బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్న విప్రుడు వచ్చాడు. (1) వచ్చిచూచి భక్తితో పురుషోత్తముని స్తుతించాడు. శాంతుడు, భీతుడుఐ, మధురంగా వినయపూర్వకంగా అన్నాడు. (2) బ్రాహ్మణుడిటాల్ల - శృగాలుడు (రాజు) వాసుదేవుడు, రాజేశుడు, మండలేశ్వరుడు, ఆతడు చెప్పిన మాటను నీకు చెప్తున్నాను. సావధానంగా విను (3) శృగాలుని వచనమిట్లా - వైకుంఠంలో వాసుదేవుణ్ణి, దేవతల ఈశుణ్ణి, నాలుచేతులు కలవాడిని. లక్ష్మీపతిని, జగత్తును పాలించేవాడిని, ధాతకు ధాతను (4) భూభారాన్ని తగ్గించడాకి బ్రహ్మ నన్ను ప్రార్థించాడు. భూమి పై భారతవర్షము (దేశము)నకు వెళ్ళుటనాపని. (5) వసుదేవుని కొడుకైన వాడు వైశ్యుడు (క్షత్రియుడు), అహంకరిస్తున్నాడు. జనమును జనముతో జయిస్తున్నాడు దుర్బలుని, బలముకలవానితో చంపించి గెలుస్తున్నాడు. పరస్పరము యుద్దంచేయించి రాజులను చంపాడు, మహాధూర్తుడు (6) దుర్యోధనుడు జరాసంధుడు, దుర్బలుడైన మరోరాజు, వీరిని భీమునితో చంపించాడు. భూమి పై అల్పునకు బలవంతునకు యుద్ధం చేయించాడు. (7) ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, భూమి పై ఉన్న ఇతరులను బలవంతుడైన అర్జునునితో, అవలీలగా చంపించాడు. (8) దుర్బలులు, ప్రసిద్ధులు అప్రసిద్ధులు ఐన ఇతర రాజులందరిని, ప్రసిద్ధుడైన, బలవంతుడైన వానితో అవలీలగా చంపించాడు. (9) శిశుపాలుని, దంతవక్రుని, చిరకాల రోగియైన కంసుని, నాకొడుకు నరకుని, దుర్బలుడైన కేశుడను వానిని, ముర అనువానిని (10) స్వయంగా చంపాడు. సంకేతములతో, కపటంతో త్వరగా చంపాడు. నీ సంకేతంతో కపటంగా చంపారు. ధర్మయుద్ధంలో చంపలేదు. కపటస్వభావుడు, బాలుడు, అధార్మికుడు (11) పూతనను, కుబ్జను చంపాడు. ఆడవారిని వస్త్రం కొరకు చాకలిని చంపాడు. శిష్టుని అశిష్టుడై చంపాడు. మోసగాడు (12) దైత్యుడైన (దితిపుత్రుడు) హిరణ్యకశిపుని, మహాబలుడైన హిరణ్యాక్షుని, మధుకైటభులను చంపాడు. నేను సృష్టిరక్షకుడిని (13) నేనే బ్రహ్మను. నేనే స్వయంగా శివుడిని. నేనే విష్ణువును. జగద్రక్షకుడను. దుష్టులను అణచేవాడిని. (14) నా అంశంతో, కళతో ఉన్నవారేమనులంతా మునులుకూడా. నేనే స్వయంగా నారాయణుడిని, నిర్గుణుడిని. ప్రకృతికి పరుడను. (15) సిగ్గుతో, దయతలచి, మిత్రుడను బుద్ధితో క్షమించాను. గడిచిందిగడిచిందే. ఓభద్రుడ నాతో యుద్ధం చేయి. (16) దూతద్వారా విన్నాను. చాలా పెద్దగా అహంకరించావు. ఆతనిని అణచుట యోగ్యము (చేయాలి). ఉన్నతమైన వానినిపడగొట్టుట తగును.

మూ రణశ్ఛపరమోధర్మోఽప్యహంశాస్తాభువో ధునా

శంఖం చక్రంగదాం పద్మం గృహీత్వాఽహంచతుర్భుజః

ద్వారకాం తాం గమిష్యామి యుద్ధాయ సగణ:స్వయం

యుద్ధం కురుయదీచ్చాఽస్తి న మాంచ శరణంవ్రజ

యది మా, యాస్యతి మమశరణం శరణాగతః

భస్మీభూతాంకరిష్యామి ద్వారకాంచక్షణేనచ

సబలంచ సపుత్రంత్వాంసగణంచ సబాంధవం

క్షణేన దగ్ధుం శక్తోఽహమసహాయేన లీలయా

తపస్వినంచ వృద్ధంచ జిత్వాయుధేచ శంకరం

శక్రంభగాంగం జిత్వాచ రోగిణం బ్రహ్మశాపతః

మత్తోఽసి వీరమాత్మానం మన్యమానస్వమేవచ

స్త్రీజితో హి వృథార్థంచ పారిజాతస్య హేతునా

లంపటో యోనిలుబ్ధశ్చ రాధాధీనశ్చగోకులే

అధునాకింకరసమః సత్యాదీనాంచ యోషితాం

ఇత్యేవముక్త్వావిప్రశ్చ తూష్ణీం భూయస్థితోమునే

 శ్రీకృష్ణః సగణః శ్రుత్వా భృశముచ్చెర్జహాససః

భోజయిత్వాచ సంపూజ్య బ్రాహ్మణంచ చతుర్విధం

నినాయరజనీం దుఃఖాత్ వాక్శల్య మానసజ్వరాత్

ప్రభాతే రథమారుహ్యసగణ: సత్వరంముదా

లీలామాత్రేణ ప్రయయౌ శృగాలో నృపతిర్యతః

శ్రుత్వాశృగాలోవార్తాంతాం కృత్రిమశ్చ చతుర్భుజః

ఆజగామ హరేఃస్థానం యుద్ధాయసగణః స్వయం

కృష్ణశ్చక్రేచ సంభాషాం మిత్రబుద్ధ్యాచ లౌకికీం

ఆశ్లేషం మధురాలాపం స్నిగ్ధ నేత్రశ్చ సస్మితః

రాజానిమంత్రణంచక్రే కృష్ణోనస్వీచకరాతత్

ఉవాచకృష్ణభీతశ్చ త్యక్త్వాదంభంచ దర్శనాత్

శృగాల ఉవాచ:

చక్రేణమచ్ఛిర శ్ఛిత్వాసుశీఘ్రంద్వారకాం వ్రజ

పాపః పతతుదేహోఽయమనిత్యో నశ్వరస్తథా

అహంసుభద్ర స్తే ద్వారిజయశ్చ విజయోయథా

సర్వంజానాసి సర్వజ్ఞ మావిలంబంకురుప్రభో

లక్ష్మీ శాపేన భ్రష్టోఽహం కాలః పూర్ణోబభూవమే

శతవర్షేణ శాపాంతే యాస్యామి భవనంతవ

శ్రీకృష్ణ ఉవాచ :

పూర్వంమాం మిత్రప్రహర పశ్చాద్యుద్ధం కరోమ్యహం

సర్వం జానమివైకుంఠం గచ్ఛవత్సయథాసుఖం

అను యుద్ధము పరమధర్మము. ఇప్పుడు భూమిని శాసించేవాడిని నేను. శంఖము, చక్రము, గద, పద్మము, తీసుకొని, నేను చతుర్భుజుడనై (18) ఆ ద్వారకకు, స్వయంగా గణములతో కూడి యుద్ధానికి వెళ్లాను. కోరిక ఉంటే యుద్ధం చేయి, లేదా నన్ను శరణువేడు. (19) శరణాగతుడవై నన్ను శరణువేడకపోతే, క్షణంలో ద్వారకను భస్మం చేస్తాను. (20) నీబలముతో, పుత్రులతో, బంధువులతో, గణముతో కూడిన నిన్ను క్షణకాలంలో కాల్చివేయగల శక్తిగలవాణ్ణి, అవలీలగా ఎవరి సహాయంలేకుండా చేయగలను. (21) తపస్వి, వృద్ధుడు ఐన శంకరుని యుద్ధంలో జయించి, బ్రహ్మ శాపం వల్ల రోగియైన భగాంగుడైన ఇంద్రుని జయించి (22) మదించి ఉన్నావు. నిన్ను నీవెవీరునిగా భావించుకుంటున్నావు, పారిజాతం కారణంగా వ్యర్థంగా స్త్రీతో జయింపబడ్డావు. (ఆమెకు లొంగినావు) (23) లంపటుడవు, యోనిలుబుడవు, గోకులంలో రాధకు అధీనుడవు. ఇప్పుడు సత్యభామ మొదలగు స్త్రీలకు బంటుతో సమానుడవు. (24) అని పలికి బ్రాహ్మణుడు మౌనంగా నిలబడ్డాడు, ఓముని తనగణములతో కూడి శ్రీకృష్ణుడు ఇదంతా విని, మిక్కిలి పెద్దగా ఆతడు నవ్వాడు (25). బ్రాహ్మణుని నాలు విధాలైన పదార్థాలతో భుజింపచేసి, పూజించి, మాటలనే బాణాల ద్వారా ఏర్పడ్డ మానసిక జ్వరంతో, దుఃఖంతో రాత్రిగడిపి (26) తెల్లవారగానే తన గణముతో కూడి, త్వరగా, ఆనందంతో రథమెక్కి, శృగాలుడను రాజున్న చోటికి, తనలీలా మాత్రంతో వెళ్ళాడు. (27) శృగాలుడు ఆ వార్తను విని, కృత్రిమమైన నాలుగు చేతులు ధరించి తన గణంతో కూడి స్వయంగా, యుద్ధమునకై హరి ఉన్నచోటికి వచ్చాడు. (28) మిత్రుడు అనే ఉద్దేశ్యముతో, కృష్ణుడు లౌకికమైన మాటలు మాట్లాడాడు. నవ్వుతూ, నేత్రములలో మంచి తనము ఉట్టిపడగా కౌగిలించుకున్నాడు. మధురంగా సంభాక్షించాడు. (29) రాజు నియంత్రణ చేశాడు. కృష్ణుడు దానిని అంగీకరించలేదు. కృష్ణునకు భయపడి, చూడగానే దంభమును వదిలి ఇట్లన్నాడు. (30; శృగాలుడిట్లా - నీ చక్రంతో నా శిరస్సును ఛేదించి, త్వరగా ద్వారకకు పో, ఈ దేహము పాపం కలది, అనిత్యము, నశించేది. పడిపోనీ (31) నేను భద్రుణ్ణి, నీ ద్వారం దగ్గర జయవిజయులవలె నేనొకణ్ణి. ఓసర్వజ్ఞ నీకంతా తెలుసు. ఓప్రభు ఆలసించకు. (32) లక్ష్మీ శాపంవల్ల భ్రష్టుడనైనాను. నా శాపకాలం పూర్తైంది. నూరు సంవత్సరాలకు శాపం చివర నీ భవనానికి వస్తాను. (33) అనగా శ్రీకృష్ణుడిట్లా - ఓమిత్రుడ తొలుత నీవు నన్ను కొట్టు. ఆ తరువాతనే యుద్ధం చేస్తాను. అన్నీ తెలుసు. ఓవత్స, చాలా సుఖంగా వైకుంఠానికి వెళ్ళు.

మూ శృగాలోదశబాణాంశ్చచిక్షేప మాధవంప్రతి

తేప్రణమ్యయయుః శీఘ్రం ఆకాశం కాలరూపిణః

గదాంచిక్షేపరాజా, స ప్రలయాగ్ని శిఖోపమః

కృష్ణాంగ స్పర్శమాత్రేణ బభంజచ క్షణేనచ

ధనుశ్చిక్షేప ఖడ్గంచ కాలరూపం సుదారుణం

కృష్ణాంగ స్పర్శమాత్రేణ బభంజచ క్షణేనచ

దృష్ట్వానిరస్తం రాజాన మిత్యువాచకృపానిధిః

గృహంగత్వాసుతీక్ష్ణంచ మిత్రాస్త్రమానయేతిచ

శృగాల ఉవాచ :

నాత్మాకాశోఽస్త్ర విద్ధశ్చకిం యుద్ధమాత్మనాసహ

మాముద్ధరభవాధ్భేశ్చ ధరోద్ధారణ కారణ

భవాబ్ధిం విషమంనాథ విషయంచ విషాధికం

ఛింధిమే, నిగడం మాయాం మోహజాలం స్వకర్మణః

కర్మణామీశ్వరస్త్వంచ విధాతా ధాతురేవచ

దాతాశుభఫలానాంచ ప్రదాతా సర్వసంపదాం

కారణం ప్రాక్తనానాంచ తేషాంచ ఖండనేక్షమః

యామిగేహంచ వైకుంఠం తవైవద్వార సప్తమం

త్యక్త్యాచ నశ్వరం దేహం ప్రాకృతం పాంచభౌతికం

మిత్రస్య స్తవనం శ్రుత్వావచనంచ సుధోపమం

రుదోదసమరేతత్ర కృపయాచ కృపానిధిః

బభూవతత్ర సహసాకృష్ణనేత్రా శ్రుబిందునా

దివ్యం బిందుసరోనామ తీర్థానాం ప్రవరం పరం

తత్త్తోయ స్పర్శమాత్రేణ జీవన్ముక్తోభవేన్నరః

సప్తజన్మార్జితాత్ పాపాత్ముచ్యతేనాత్ర సంశయః

శ్రీభగవానువాచ :

కథ మేతాదృశీబుద్ధిః మిత్రతే నిర్మలం మనః

దూతద్వారా కథం చోక్తం నిష్టురందారుణం వచః

శృగాల ఉవాచ :

ఏవముక్తో మహత్వంచ తేనక్రోధాదిపగతః

అన్యథాదుర్లభంనాథ స్వప్నేఽపితవ దర్శనం

ఏతస్మిన్నంతరే యోగాద్దేహంత్యక్త్వాచ ప్రాకృతం

దృష్ట్వా కృష్ణంచ యానేన వైకుంఠం ప్రయయౌముదా

సప్తతాళ ప్రమాణంచ జ్యోతిస్తత్రమహోల్బణం

పద్మైః పద్మార్చితం పాదపద్మం నత్వాజగామహ

గత్వాచ ద్వారకాం కృష్ణోనత్వాచ పితరం ప్రసూం

శ్రీకృష్ణః సగణః శీఘ్రం దృష్ట్వాచ పరమాద్భుతం

ప్రపుల్ల వదనః శ్రీమాన్ ద్వారకాభిముఖం యయౌ

జగామ రుక్మిణీ గేహం పుష్ప చందన వాసితం

పుషచందనతల్వేచ నక్తం రేమేతయాసహ

మూర్ఛాంసంప్రాపసాభైష్మీకృష్ణం కృత్వాస్వవక్షసి

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండ ఉత్తరార్ధ నారాయణ నారద సంవాదే శృగాల వాసుదేవమోక్షణం నామ ఏకవింశత్యధిక శతతమోఽధ్యాయః

శృగాలుడు పదిబాణములను మాధవుని పై వేశాడు. అవి నమస్కరించి, కాలరూపియైన ఆకాశంలోకి త్వరగా పోయాయి. (35) ప్రళయకాలమందలి అగ్ని జ్వాలవంటి గదను రాజు వేశాడు. కృష్ణుని శరీరం తగులగానే క్షణంలో విరిగిపోయింది. (36) కాలరూపమైన, చాలా దారుణమైన ఖడ్గము, ధనువు విసిరాడు, రాజు. కృష్ణుని శరీరం తగులగానే క్షణంలో విరిగిపోయింది. (37) మరలిన రాజును చూచి కృఫానిధి ఇట్లన్నాడు. ఇంటికిపోయి చాలా తీక్షమైన అస్త్రాన్ని తీసుకురా, ఓమిత్రుడ అని (38) శృగాలుడిట్లాఆత్మ, ఆకాశము, అస్త్రముతో కొట్టబడదు. ఆత్మతో యుద్ధమేమిటి. భూమిని ఉద్ధరించేందుకు కారణమైనవాడ భవసాగరము నుండి నన్ను ఉద్దరించు. (39) భవసాగరము విషమము (సమంకాదు). ఓనాథ విషయములనే విషం అధికంగా ఉంది. నా మాయ అనే బేడెమును, నాకర్మల మోహజాలాన్ని ఛేదించు. (40) కర్మలకు ఈశ్వరుడవు నీవు. విధాతవు, ధాతకు కూడా శుభఫలములనిచ్చేవాడివి. అన్ని సంపదలనిచ్చేవాడివి. (41) ప్రాక్తనమైన వానికి కారణుడవు వాటిని ఖండించడంలో సమర్థుడవు వైకుంఠ గేహానికి (ఇంటికి) వెళ్తున్నాను. నీవైనఏడు ద్వారముల దగ్గరకు వెళ్తున్నాను. (42) ప్రాకృతమైన, పాంచ భౌతికమైన, నశ్వరమైన దేహాన్ని వదిలివెళ్లాను. మిత్రునిమాటనువిని (స్తుతిని) అమృతమువంటి మాటచెప్పాడు. (43) కృపతో, కృపానిధి యుద్ధంలో ఏడ్చినాడు. వెంటనే అక్కడ కృష్ణుని కన్నీటి బిందువుతో (44) దివ్యమైన బిందు సరమని పేరుగల తీర్థములకు శ్రేష్ఠమైన, ఉత్తమ తీర్థము వెలసినది. ఆనీరు తగిలినంత మాత్రాననే, నరుడు జీవన్ముక్తుడౌతాడు. ఏడు జన్మల నుండి ఆర్జించిన పాపం నుండి ముక్తుడౌతాడు. అనుమానం లేదు. (45) భగవండిట్లా - నీ ఈ బుధేమిటి. ఓ మిత్రుడ నీనిర్మలమైన మన స్సేమిటి. మరి దూతద్వారా కఠినమైన దారుణమైన, మాట చెప్పించటమేమిటి? (46) శృగాలుడిట్లా - నేను అట్లా అన్నాను నీతో. అందువల్ల కోపంతో ఇక్కడివచ్చావు. లేకున్న నాథ కలలో కూడా నీ దర్శనము దుర్లభము. (47) ఇంతలో యోగంతో ప్రాకృతదేహాన్ని విడిచి, కృష్ణుణ్ణి చూచి ఆనందంతో విమానంలో వైకుంఠానికి వెళ్ళాడు (48) అక్కడ చాలా పెద్దదైన ఏడు తాటిచెట్ల ప్రమాణంగల జ్యోతి కన్పించింది. పద్మములతో, పద్మతో పూజింపబడిన పద్మముల వంటి పాదములకు నమస్కరించి వెళ్ళాడతడు. (49) కృష్ణుడు ద్వారకకువెళ్ళి తల్లికి, తండ్రికి నమస్కరించి, తన గణములతో పాటు శ్రీకృష్ణుడు పరమమైన అద్భుతాన్ని త్వరగా చూచి (50) వికసించిన ముఖంతో శ్రీమాన్ ద్వారకకు అభిముఖంగా వెళ్ళాడు. పూలు చందనము వీనితో వాసనగల రుక్మిణి ఇంటికి వెళ్ళాడు. (51) పూలు చందనం గల పడక పై, ఆమెతో కూడా రాత్రిని గడిపాడు (రమించాడు) ఆ భైష్మి కృష్ణుని తన వక్షఃస్థలం పై ఉంచుకొని మూర్ఛను పొందింది. (52) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు శృగాలవాసుదేవునకు ముక్తి నివ్వటమనునది నూట ఇరవై ఒకటవ అధ్యాయము.