నారద ఉవాచ - నారదుడు పలికెను :
మహామునే రహస్యం చ శ్రుతం బ్రహ్మన్ కీమద్భుతం ।
మృతే మునౌ కిం చకార శ్రీకృష్ణో భక్తవత్సలః ॥
ఓ మహామునీ! ఎంతటి అద్భుతము రహస్యమునైన కథ వింటిని! అష్టావక్రముని నిర్యాణము చెందగా భక్తులయందు వాత్సల్యము గల శ్రీకృష్ణుడేమీ చేసెను ?
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ ముని పలికెను :
దృష్వా మృతం మునీం కృష్ణః సంస్కారం కర్తుముద్యతః ।
కృత్వా వక్షసి తద్ధేహం రురోదోచ్చైర్యథా నరః ॥
బాహుభ్యాం చ సమాశ్లిష్య పీపేషోద్రిక్త మోహతః ।
నిర్గతం భస్మనికరం శవాద్వజ్రాంగ ఘర్షణాత్ ॥
రక్తమాంసాస్థి హీనం తచ్ఛరీరం చ మహాత్మనః ।
షష్టి వర్ష సహస్రాణి నిరాహారః కృతో మునే ॥
దగ్ధం లోహిత మాంసాస్థి జ్వలతా జఠరాగ్నినా ।
బ్రహ్మజ్ఞాన విహీనస్య హరి పాదాబ్జ చేతసః ॥
శ్రీకృష్ణుడు మృతిచెందిన మునిని చూచి అగ్ని సంస్కారము చేయబూనెను. అతని శరీరమును తన వక్షస్థలమున చేర్చుకొని సామాన్య నరుని వలె భోరుమని ఏడ్చెను. చేతులతో ఆలింగనము చేసికొని పొంగిన వ్యామోహముతో గట్టిగా నలిపెను. అతని వజ్రాంగస్పర్శ వలన శవము నుండి బూడిద రాలేను. అష్టావక్రమహాత్ముని శరీరము ఆరవై వేల సంవత్సరముల నిరాహారము (ఉపవాసము) వలన రక్తమాంసములు ఎముకలు లేనిదిగా ఉండెను. అతనీ రక్తమాంసాస్టులు జఠరాగ్ని చేతనే కాల్చబడి ఉండెను. అతడు బ్రహ్మజ్ఞానము లేనివాడగుట వలన కేవల హరిపాద భక్తితో (ఉపవాసములు చేసి) అతడట్లయ్యెను.
చితాం చందన కాష్ఠేన నిర్మాయ మధుసూదనః ।
కృత్వాఽగ్ని కార్యం తత్రైవ స్థౌపయామాస శోకతః ॥
దదౌ చితాయామగ్నిం చ కాష్ఠం దత్త్వా శవోవరి ।
జ్వలితాయాం చితాయాం చ మూర్ఛామాప క్షణం విభుః ॥
తద్దేహే భస్మసాద్భూతే నేదుర్దుందుభయో దివి ।
బభూవ పుష్ప వృష్టిశ్చ తత్క్షణాద్గగనాదహో ॥
మధుసూదనుడు శ్రీగంధపు కర్రలతో చితిని పేర్చి హోమము చేసి దుఃఖముతో ముని శరీరమును దాని పై పెట్టేను. శవముపై కట్టెలు పేర్చి చితికి అగ్ని ముట్టించెను. అది కాలుచుండగా క్షణకాలము స్వామీ మూర్ఛిల్లెను. ఆ మునీ దేహము భస్మము కాగా ఆకాశమున దేవ దుందుభులు మ్రోగెను. అప్పుడే ఆకాశము నుండి పుష్పవర్షము కురిసెను.
ఏతస్మిన్నంతరే తత్ర రత్నసార వినిర్మితం ।
స్యందనం చ మనోయాయి వస్త్ర మాల్య పరిచ్ఛదం ॥
పార్షద ప్రవరైర్యుక్తం శ్రీకృష్ణ సదృశైర్వరైః ।
ఆవిర్బభూవ గోలోకాత్సుందరం పురతో హరేః ॥
అవరుహ్య రథాత్తూర్ణం పార్షద ప్రవరా హరేః ।
సర్వే సమాన రూపాస్తే ప్రణమ్య రాధికేశ్వరౌ ॥
ధృతవంతం సూక్ష్మదేహం ప్రణమయ్య మునీశ్వరం ।
రధే కృత్వా తు తం దేహం జగ్ముర్గోలోకముత్తమం ॥
ఇంతలో ఆ ప్రదేశమునకు శ్రేష్ఠములైన రత్నములతో నిర్మించబడి వస్త్రములతో పుష్పమాలలతో అలంకరింపబడి మనోవేగముతో ప్రయాణము చేయునట్టి ఒక రథమక్కడ ఆవిర్భవించెను. దానీయందు శ్రీకృష్ణుని వంటీ రూప సౌందర్యము గల పారదులుండిరి. అది గోలోకము నుండి శ్రీహరి ముందు దిగెను. శ్రీకృష్ణునితో సమాన రూపము గల ఆ శ్రేషులైన పారదులు రథము నుండి త్వరగా స్వామి ముందు దిగి రాధాకృష్ణులకు ప్రణామములు చేసిరి. సూక్ష్మదేహమును ధరించిన ఆ మునీశ్వరునితో ఆ దంపతులకు నమస్కరింప జేసి ఆ మునీని రధమందుంచు కొని ఉత్తమమైన గోలోకమున కేగిరి.
గతే మునీంద్రే గోలోకం బృందావన వినోదినీ ।
బభూవ విస్మీతా సాధ్వీ పప్రచ్ఛ జగదీశ్వరం ॥
ముని అట్లు గోలోకమున కేగగా బృందావనమున వినోదమనుభవించుచున్న ఆ సాధ్వి రాధాదేవి ఆశ్చర్యము పొంది జగదీశ్వరుని ఇటు ప్రశ్నించెను.
శ్రీరాధికోవాచ - రాధాదేవి ఇట్లనెను :
కోఽయం నాథ మునిశ్రేష్ఠః సర్వావయవ వక్రీమః ।
ఆతిఖర్వ జనాకారస్తే జీయా నతీకుత్సితః ॥
కథం వా నిర్గతం భస్మ దేహాధన్య కిమద్భుతం ।
సాక్షాద్విలీనం యత్తేజ స్త్వత్పాదాబ్జేఽ నలోపమం ॥
రథస్థః పుణ్యవాన్ సద్యో గోలోకం చ జగామ హ ।
స్వాత్మారామస్య యద్ధేతో రోదనం తే బభూవ హ ॥
త్వయా కృతం చ సత్కారమశ్రుపూర్ణేన చక్షుషా ।
సర్వం వివరణం తూర్ణం సంవ్యస్య కథయ ప్రభో ॥
నాథా! అవయవములన్నియు వంకరగా నున్న ఈ మునీరాజెవ్వడు? మిక్కిలి పొట్టి రూపము గలవాడు తేజోవంతుడు చూచుటకసహ్యముగా నున్నాడే. అతని దేహము నుండి భస్మమెట్లు బయటకు వచ్చెను? ఎంత ఆశ్చర్యము! సాక్షాత్తుగా నీ పాద పద్మమునందు అగ్నివలె ప్రకాశించు ఆ తేజస్సు లీనమైనదే! రథమందు కూర్చుండి ఆ పుణ్యాత్ముడు వెంటనే గోలోకమున కేగినాడు కదా! ఆత్మారాముడవైన నీవతని కోసము భోరుమని ఏడ్చితివి. స్వయముగా కన్నుల నీరు నింపుకొని అతనిని సత్కరించితివి. ప్రభూ! వెంటనే ఈ విషయమంతయు నాకు వివరించి చెప్పుము.
రాధీకా వచనం శ్రుత్వా ప్రహస్య మధుసూదనః ।
కథాం కథితుమారేభే యుగాంతరగతామపి ॥
రాధ మాట విని శ్రీహరి నవ్వి యుగాంతరమునకు చెందిన కథను చెప్పుటకారంభించేను.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :
రహస్యమష్టావక్రీయం విఖ్యాతం సర్వతః ప్రియే ।
పశ్చాచ్చ్రోష్యసి కాలేన ప్రసంగే వీదుషాం ముఖాత్ ॥
అష్టావక్రో మునీంద్రోఽపి విఖ్యాతో భువన త్రయే ।
పరిపూర్ణం యద్యశసా జన్మనా తజ్జగత్రయం ॥
ప్రియురాలా! అష్టావక్రునకు చెందిన ఈ రహస్యము అంతట విశేషముగా చెప్పుకోబడినదే. నీవు దీనిని మునుముందు ప్రసంగవశమున విద్వాంసుల ద్వారా వినగలవు. అష్టావక్రమునీంద్రుడు ముల్లోకముల యందు ప్రసిద్ధుడు. అతని జన్మకథచేత కీర్తిచేత జగత్రయము నీండినది.
కృష్ణస్య వచనం శ్రుత్వా విమనస్కా హరిప్రియా ।
ఉవాచ మధురం యత్నాచ్ఛుష్కకంఠోష్ఠ తాలుకా ॥
శ్రీకృష్ణుని మాట విన్న వారికి ప్రియురాలైన రాధ మనస్సు చిన్న బుచ్చుకొని విచారముతో కంఠము పెదవులు దవడలు తడి ఆరిపోగా ప్రయత్నించి మధురముగా ఇట్లు పలికెను.
రాధికోవాచ - రాధ పలికెను :
యత్తృషాలోర్మనః పూర్ణం న బభూవ సుధాంబుధౌ ।
స వితృష్తో భవతి కిం గోష్పాదోదక పానతః ॥
వేదానాం వేదవక్తృణాం వీధాతుర్జనకస్య చ ।
మహావిష్ణోరీశ్వరస్త్వం కోఽన్యో వక్తాస్తి త్వత్పరః ॥
రాధికా వచనం శ్రుత్వా తుష్టః కృష్ణో బభూవ హ।
ఉవాచ గోపనీయం చ రహస్యం పరమాద్భుతం ॥
దప్పిగొన్న వానీకి అమృతసముద్రము వలన మనస్సు తృప్తి చెందనప్పుడు ఇక గోష్పదమందలి ఉదకము (ఆవుడెక్క దిగబడి నంత గుంటలోని నీరు) ను పానము వలన తృప్తి కలుగునా! వేదములకు వేద పాఠకులకు చతుర్ముఖ బ్రహ్మకు ఆతని జనకుడైన మహావిష్ణువునకును నీవు ప్రభువువు. నీకన్న ఇంకొకడెవడు ఈ కథ చెప్పగలవాడున్నోడు? అన్న రాధ వాక్కులు విని కృష్ణుడు సంతసించి ప్రయత్నించి దాచదగిన పరమాద్భుతమైన ఆ రహస్యమును (కథను) ఇట్లు చెప్పెను.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :
శ్రుణు కాంతే ప్రవక్ష్యేఽహమితిహాసం పురాతనం ।
శ్రవణాత్కథనాద్యస్య నర్వం పాపం ప్రణశ్యతి ॥
మహా విష్ణోర్నాభిపద్మాద్బభూవ జగతాం విధిః ।
మమాంశస్య మత్కలయా జలాకీర్ణే జగత్త్రయే ॥
పుత్రా బభూవు శ్చత్వారో బ్రహ్మణో మానసాత్పురా ।
నారాయణ పరాస్సర్వే జ్వలంతో బ్రహ్మతేజసా ॥
శిశవః పంచవర్షీయా నగ్నా అజ్ఞానినో యథా ।
బాహ్యజ్ఞాన విహీనాశ్చ బ్రహ్మ తత్త్వ విశారదాః ॥
సనకశ్చ సనందశ్చ తృతీయశ్చ సనాతనః ।
సనత్కుమారో భగవానేతే చత్వార ఏవ చ ॥
తానువాచ జగద్ధాతా సృష్టిం కురుత పుత్రకాః ।
తే న తస్థుః పితుర్వాక్యే ప్రయయుస్తపసే మమ ॥
మనోహరీ! వినుము. చెప్పుట వలన వినుట వలన సర్వపాపములు నశించునట్టి పురాతనమైన ఇతిహాసమును నీకు చెప్పుదును. ముల్లోకములు జలముతో నిండి ఉన్న ప్రళయకాలమందు నా అంశయైన మహా విష్ణువు యొక్క నాభి కమలమునుండి నా అంశతోనే జగత్సృష్టికర్త యైన బ్రహ్మ ఉద్భవించెను. ఆ బ్రహ్మ మనసంకల్పము వలన మొదట అతనికీ నలుగురు పుత్రుల కలిగిరి. వారందరు బ్రహ్మతేజస్సుతో వెలుగుచు నారాయణ భక్తులైరి. ఐదు సంవత్సరముల వయస్సు గల ఆ శిశువులు అజ్ఞానుల వలె నగ్నముగా నుండి బాహ్యప్రపంచ జ్ఞానమెరుగక బ్రహ్మ తత్త్వ విశారదులుగా నుండిరి. సనకుడు సనందుడు సనాతనుడు సనత్కుమారుడు అను ఆ కుమారులను చూచీ బ్రహ్మ “కుమారులారా! సృష్టిచేయుడు” అని పలికెను. వారు పితృవాక్యముందు నిలువక నన్ను గూర్చి తపస్సు చేయుట కొరకు వనములకు వెళ్లిపోయిరి.
విధాతా విమునస్కశ్చ తనయేమ గతేషు చ ।
పితుర్దుఃఖాయ ప్రభవేత్పుత్ర శ్చేదవచస్కరః ॥
కుమారులట్లు వెళ్లిపోగా విధాత మనస్సులో విచారపడెను. పుత్రుడన్నవాడు తండ్రి చెప్పినట్లు చేయడేని తండ్రికి దుఃఖకారకుడగును.
జ్ఞానేన నిర్మమే వుత్రాన్ స్వాంగేషు చ తపోధనాన్ ।
వేదవేదాంగవిజ్ఞాంశ్చ జ్వలతో బ్రహ్మతేజసా ॥
అత్రిః పులస్త్యః పులహో మరీచర్భృగురంగిరాః ।
క్రతుర్వసిష్ఠో వోఢుశ్చ కపిలశ్చాసురిః కవిః ॥
శంకుః శంఖః పంచశీఖః ప్రచేతాస్తే తపోధనాః ।
బహుకాలం తపస్తప్త్వా చక్రుః సృష్టిం తదాజ్ఞయా ॥
కలత్రవంతస్తే సర్వే సంసారం కర్తుమున్ముఖాః ।
బభూవుః పుత్రపౌత్రాశ్చ సర్వేషాం చ తపస్వినాం ॥
తదస్తు చ కథా బహ్వీ మునివంశానుకీర్తనీ ।
చార్వీ పుణ్య స్వరూపా చ ప్రకృతం శ్రుణు సుందరి ॥
పిదప బ్రహ్మ తన జ్ఞాన శక్తితో తన శరీరావయవములందు బ్రహ్మ తేజస్సుతో జ్వలించువారును వేదవేదాంగ వేత్తలును ఐన తపోధనులగు పుత్రులను సృష్టించెను. వారు అత్రి పులస్త్యుడు పులహుడు మరీచి భృగువు అంగిరసుడు క్రతువు పసిష్ఠుడు వోడుడు కపిలుడు ఆసురీ కవి శంకువు శంఖుడు పంచశీఖుడు ప్రచేతసుడు అన్న తపోధనులు. వారు బ్రహ్మ ఆజ్ఞతో బహుకాలము తపస్సు చేసి సృష్టిచేసిరి. వారందరు భార్యలను స్వీకరించి సంసారము చేయుటకున్ముఖులైరి. ఆ తపస్వులకు అందరికీ పుత్రులు పౌత్రులు కలిగిరి. సుందరము పుణ్య స్వరూపము బహుముఖము ముని వంశములను తరముగా కీర్తించునది ఐన ఆ కథ అటులుండనిమ్ము. ఓ సుందరీ! ప్రస్తుతాంశము వినుము.
ప్రచేతసః సుతః శ్రీమానసితో మునిపుంగవః ।
సకలత్రస్తపస్తే పే దివ్యం వర్ష సహస్రకం ॥
న బభూవ సుతస్తస్య ప్రాణాంస్త్యక్తుం సముద్యతః ।
తం సంబోదుం బభూవాథ సత్యా వాగశరీరరిణీ ॥
కథం త్యజసి ప్రాణాంస్త్వం గచ్ఛ శంకర సన్నిధిం ।
సిద్ధం కురు గృహీత్వా చ మంత్రం శంకర వక్త్రతః ॥
మంత్రాధిష్ఠాతృదేవీ తే సద్యః సాక్షాద్భవిష్యతి ।
వరేనాభీష్ట దేవ్యాశ్చ పుత్రస్తే భవితా ధ్రువం॥
శ్రుత్వైతచరితం విప్రో జగామ శివసన్నిధిం ।
యోగీనామవ్యగమ్యం చ శివలోకం నిరామయం ॥
సకలత్రో యథాయోగీ తుష్టావ యోగినాం గురుం ।
పుజాంజలి యుతో భూత్వా భక్తి నమ్రాత్మకంధరః ॥
ప్రచేతసునీ పుత్రుడైన అసితుడను తేజశ్శాలియగు మునిపుంగవుడు భార్యతో గూడి వేయి దేవతాసంవత్సరముల కాలము తపస్సు చేసెను. ఐనను సుతుడు కల్గలేదు. అప్పుడా ఋషి ప్రాణత్యాగమునకు పూనుకొనేను. “అతనికీ బోధచేయుటకు సత్యమైన అశరీరవాణీ ఇట్లు విన్పించెను. “ఓయీ! ప్రాణములెందుకు వదిలుచుంటివి. శంకరుని సన్నిధికేగి అతని ముఖతః మంత్రోపదేశము పొంది నీ కోరికను సిద్ధపరచుకొనుము. ఆ మంత్రాదిషానదేవత వెంటనే నీకు సాక్షాత్కరించును. ఆ అభీష్టములు తీర్చు దేవి యొక్క వరము వలన నీకు పుత్రుడు కలుగును ఇది సత్యము”. ఆ వాక్కులు బ్రాహ్మణుడు వినీ యోగులకును పొంది సాధ్యము కానీది సంసార రోగములు లేనిది ఐన శివలోకమున కేగెను. భార్యతో గూడీ ఆ యోగి భక్తితో శిరస్సు వంచి అంజలిపుటము (దోసిలి) బూనీ యోగులగు గురువగు శివుని ఇటు స్తుతించెను.
అసిత ఉవాచ - ఆసితుడిట్లు పలికెను :
జగద్గురో నమస్తుభ్యం శివాయ శివదాయ చ ।
యోగీంద్రాణాం చ యోగీంద్ర గురూణాం గురవే నమః ॥
మృత్యోర్మృత్యు స్వరూపేణ మృత్యు సంసార ఖండన ।
మృత్యోరీశ మృత్యు బీజ మృత్యుంజయ నమోఽస్తు తే ॥
కాలరూపం కలయతాం కాలకాలేశ కారణ ।
కాలాదతీత కాలస్య కాలకాల నమోఽస్తు తే ॥
గుణాతీత గుణాధార గుణబీజ గుణాత్మక ।
గుణివ గుణినాం బీజగుణినాం గురవే నమః ॥
బ్రహ్మ స్వరూప బ్రహ్మజ్ఞ బ్రహ్మవేత్తా తత్పర ।
బ్రహ్మబీజ స్వరూపేణ బ్రహ్మబీజ నమోఽస్తు తే ॥
ఇతి స్తుత్వా శివం నత్వా పురస్తస్థౌ మునీశ్వరః ।
దీనవత్సాశ్రునేత్రశ్చ పులకాంచిత విగ్రహః ॥
“ఓ జగద్గురూ! నీకు నమస్కారము. మంగళము నిచ్చు శివునకు యోగీంద్రులకు యోగీశ్వరుడవు గురువులకు గురువగు నీకు నమస్కారము. మృత్యువుకు మృత్యురూపుడవై మృత్యువును సంసారమును ఖండించువాడా! మృత్యువునకు ప్రభువా మృత్యువుకు మూలమైనవాడా! మృత్యుంజయా! నీకు నమస్కారమగు గాక. కాలరూపమును (నిమేషము నుండి పరాంతము వరకు) లెక్కించు (గణించు) వారికిని, కాలమునకు, కొలనాథులకు మూలమైనవాడా! కాలమునకతీతమైనవాడా! కాలమునకు కాలకాలుడా! నీకు నమస్కారము. త్రిగుణాతీతో! ఆ త్రిగుణముల కాధారమైన వాడా! పంచభూత గుణములకు బీజమైనవాడా! ఆణిమాద్యష్ట గుణములు మోక్ష దశయందలి అష్ట గుణముల స్వరూపమైన వాడా! యోగులకు ఈశుడా! అష్టసిద్ధులు లభించిన వారికి బీజమైనవాడా! గుణవంతులకు గురువగు నీకు నమస్కారము. బ్రహ్మాస్వరూపా! బ్రహ్మవేత్త! బ్రహ్మధ్యాన తత్పరా! బ్రహ్మమను బీజస్వరూపముతో విలసిల్లు బ్రహ్మా కారణమైనవాడా! నీకు నమస్కారము”. మునీశ్వరుడు (అసితుడు) ఇట్లు స్తుతించి శివునకు నమస్కరించి బాష్పములు నిండిన కన్నులతో పులకాంకురముల గల శరీరముతో దీనుని వలె ముందు నిలిచెను.
అసితేన కృతం స్తోత్రం భక్తి యుక్తశ్చ యః పఠేత్ ।
వర్షమేకం హవిష్యాశీ శంకరస్య మహాత్మనః ॥
న లభేద్వైష్ణవం పుత్రం జ్ఞాననం చిరజీవినం ।
భవేద్ధనాఢ్యో దుఃఖీ చ మూకో భవతి పండితః ॥
అభార్యో లభతే భార్యాం నుశీలాం చ పతివ్రతాం ।
ఇహ లోకే సుఖం భుక్త్వా యాత్యంతే శివసన్నిధిం ॥
ఇదం స్తోత్రం పురా దత్తం బ్రహ్మణా చ ప్రచేతసే ।
ప్రచేతసా స్వపుత్రాయాసితాయ దత్తముత్తమం ॥
అసితుడొనర్చిన ఈ శంకర స్తోత్రమును ఒక సంవత్సరము భక్తియుక్తుడై కేవలము హవిషము తినుచు (పులగము - బియ్యము కడుగనిది) పఠించినవాడు జైనీయు చిరంజీవియు విష్ణుభక్తుడు ఐన పుత్రుని పొందును. దరిద్ర దుఃఖము గలవాడు పఠించిన ధనౌఢ్యుడగును. మూగవాడు పరించిన పండితుడగును. భార్యలేనివాడు సుశీలయు పతివ్రతయునగు భార్యను పొందును. ఈ లోకమున సుఖముననుభవించి జన్మాంతమున శివ సన్నిధిని పొందును. ఈ స్తోత్రము పూర్వము బ్రహ్మచేత ప్రచేతసునికి, అతని వలన అతని పుత్రుడైన అసితునికి ఉపదేశింపబడినది.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను
సమాకర్ణ్య మునేః స్తోత్రం భగవాన్ శంకరః స్వయం ।
ఉవాచ బ్రహ్మణః పుత్రం స్వభక్తం భక్తవత్సలః ॥
భగవంతుడైన శంకరుడు ముని స్తోత్రమును విని భక్తవత్సలుడు కనుక తన భక్తుడు బ్రహ్మ సంతానమైన అసితుని గూర్చి ఇట్లు పలికేను.
శంకర ఉవాచ - శంకరుడనెను :
స్థిరో భవ ముని శ్రేష్ఠ జానామి తవ వాంఛితం ।
పుత్రస్తే భవితా సత్యం మదంశేన చ మత్సమః ॥
దాస్యామి మంత్రమతులం సర్వేషాం చ నుదుర్లభం ।
ఇత్యుక్త్వా చ దదౌ మంత్రం తవైవ షోడశాక్షరం ॥
స్తోత్రం పూజా విధానం చ కవచం పరమాద్భుతం ।
సంసార విజయం నామ పురశ్చరణ పూర్వకం ॥
వరం దాతుమిష్టదేవీ ప్రత్యక్షా భవితేతి చ ।
ఇత్యుక్త్యా వీరతో రుద్రః స తం నత్వా జగామ హ ॥
“ఓ మునివరా! మనస్సు స్థిరము చేసికొనుము. నీ కోరిక నెరుగుదును. నీకు నా అంశతో నాతో సమానుడైన పుత్రుడు నీకు కలుగును. సత్యము. ప్రపంచవాసులందరికి మిక్కిలి దుర్లభమైన సాటిలేని ఒక మంత్రమును నీకిత్తును” అని పలికి నీ యొక్క షోడశాక్షర మంత్రమును (రాధాదేవి మంత్రము) స్తోత్రము పూజావిధానములను, సంసార విజయమనెడి అద్భుతమైన కవచమును వాటిని పురశ్చరణ చేయవలసిన విధముతో బాటు మునికి శంకరుడిచ్చెను. “నీకిష్టమైన వరమిచ్చుటకు దేవి ప్రత్యక్షము కాగలదు” అని పలికి రుద్రుడు మాటలు చాలించెను. మునీ శివునకు నమస్కరించి వెడలి పోయెను.
జజావ పరమం మంత్రం సోఽసీతః శతవత్సరం ।
సాక్షాద్భూత్వా వరస్తస్మై త్వయా దత్తః పురా సతి ॥
వుత్ర స్తే భవితా సత్యం మహాజ్ఞానీ నుతేతి చ ।
వరం దత్త్యా త్వమగమో గోలోకం మమ సన్నిధిం ॥
కాలేన చ సుతస్తస్య శివాంశేన బభూవ హ ।
బ్రహ్మిష్టో దేవలోనామ్నా కందర్ప సమసుందరః ॥
ఆ అసితముని ఆ పరమ మంత్రము నూరు సంవత్సరముల కాలము జపించెను. అప్పుడు నీవు సాక్షాత్కారమై అతనికి వరమిచ్చి యుంటివి. “నీకు మహాజ్ఞానియైన పుత్రుడు జన్మించగలడు కుమారా!” అని పలికి నా సన్నిధికి గోలోకమునకు వచ్చితివి. కొంతకాలమునకు ఆ అసితమునికి శివాంశ గల పుత్రుడు పుట్టెను. వాడెప్పుడును బ్రహ్మము నందే మనస్సు గలవాడు మన్మథునితో సమానమైన సుందరుడు దేవలుడన్న నామముతో నుండెను.
సుయజ్ఞనృపతేః కన్యాం రత్నమాలావతీం ముదా ।
తాం సుందరీం వివాహేన జగృహే సర్వ మోహినీం ॥
స్థానే స్థానే చ రహసి శతవర్షం తయా సహ ।
స రేమే నీవుణః శ్రేష్ఠః స్త్రీణాం రమణకర్మణి ॥
కాలాంతరే స విరతో బభూవ ముని పుంగవః ।
సుఖం సర్వం పరిత్యజ్య ధర్మిష్ఠః శ్రీహరిం స్మరన్ ॥
ఉత్థాయ రాత్రౌ శయనాద్విరక్తశ్చ తపోధనః ।
స యయౌ తపసే కాంతే గంధమాదన పర్వతే ॥
ఆ దేవలుడు సుయజ్ఞనృపతి కన్యను రత్నమాలావతి యన్న సుందరిని సర్వలోకులను మోహింపజేయునట్టి దానిని వివాహము చేసికొనెను. స్త్రీల నానందపరచుటయందు నేర్చుగల దేవలుడొమెతో అనేక స్థానములందు విహరించుచు నూరు సంవత్సరములు ఏకాంతమున రమించెను. ఆ ముని కొంతకాలము తరువాత ధర్మిష్ఠుడై శ్రీహరిని స్మరించుచు సర్వ సుఖములను పరిత్యజించి సంసార జీవితమును విరమించెను. ఆ తపోధనుడు వీరుడై ఒకనాటి రాత్రీ శయ్య నుండి లేచి తపస్సు కొరకు మనోహరమైన గంధమాదన పర్వతమున కేగెను.
నిద్రాం త్యక్త్యా చ తత్కాంతా న దృష్ట్వా స్వామినం సతీ ।
విలలాప భృశం శోకాత్ప్రదగ్ధా విరహాగ్నినా ॥
ఉత్తిష్ఠంతీ నిర్విశంతీ రురోదోచ్త్చెర్ముహుర్ముహుః ।
తప్త పాత్రే యథా ధాన్యం బభూవ తన్మనస్తదా ॥
ఆహారం చ పరిత్యజ్య ప్రాణాంస్తత్యాజ సుందరీ ।
చకార తత్పుతస్తస్యాః కర్మ నిర్హరణదీకం ॥
పతివ్రత అగు అతని భార్య మేల్కొని తన భర్తను చూడక విరహాగ్నితో మిక్కిలి దగ్గురాలై శోకముతో మిక్కిలి దుఃఖించెను. శయ్యనుండి లేచుచు పడిపోవుచు మాటి మాటికి గొంతెత్తి ఏడ్చెను. ఆమె మనస్సు. కాలుచున్న పాత్రలోని ధాన్యము వలె (పేలపు గింజవలె) ఆయెను. ఆమె ఆహారము మానుకొని ప్రాణములను త్యజించెను. ఆమె తనయుడామెకు అగ్ని సంస్కారాది కర్మలు చేసెను.
తపశ్చకార స మున్గిరంధమాదన గహ్వరే ।
దివ్యం వర్ష సహస్రం చ మమ భక్తో జితేంద్రియః ॥
తం దదర్శ హ దైవేన రంభా శృంగార లోలుపా ।
అతీత సుందరం శాంతం కందర్పమివ సుందరం ॥
సా చ తం కథయామాస నిర్జనే సముపస్థితా ।
విధాయ వేషం యత్నేన త్రైలోక్య చిత్తమోహినీ ॥
భక్తుడగు దేవలముని జితేంద్రియుడై గంధమాదన పర్వత గుహలో వేయి దేవతా సంవత్సరముల కాలము తపస్సొనర్చెను. అప్పుడు దైవికముగా మన్మథుని వలె మిక్కిలి సుందరుడుగా నున్న అతనినీ కామాసక్తురాలైన రంభ చూచెను. ఆ జనరహిత ప్రదేశములో అతని వద్ద కేగిన రంభ ముల్లోకములందలి జనుల మనస్సులను మోహింపజేయునదే ప్రయత్న పూర్వకముగా - మంచి వేషము ధరించి అతనితో ఇట్లనెను.
రంభోవాచ - రంభ ఇట్లనెను :
నిబోధ సాధో మద్వాక్యం కామినీనాం మనోహరం ।
త్యక్త్యా కోఠోరం రహసి భజ మాం సుఖదాయికాం ॥
త్వం వరేషు వరః పృద్వ్యాం వరారోహా స్వయంవరా ।
విదగ్ధయా విదగ్ధస్య దుర్లభో నవ సంగమః ॥
యజ్ఞం కుర్వంతి భూపాలా భారతే స్వర్గహేతుకం ।
స్వర్గ భోగ నిమిత్తం చ భోగసారా వయం మునే ॥
స్తనయోర్యుగ్మమూర్వోర్మే సుందరం ముఖ పంకజం ।
హాస భ్రూభంగ సహితం దృష్ట్వా కో న లభేత్సుఖం ॥
స్త్రీరసః సుఖసారశ్చ మునీనామభివాంఛితః ।
రసికా సుఖ సంభోగో నిర్జనే చాతి దుర్లభః ॥
దేవో వా మానుషో వాఽపి గంధర్వో వాఽథ రాక్షసః ।
స్త్రీ సుఖేష్వస్య విజ్ఞేయో రంభాయా రతివంచితః ॥
ఓ సాధూ! కామినీ జనమునకు మనస్సును హరించునదైన నా వాక్యమును వినుము. ఈ కఠోర తపస్సును వదిలి సుఖదాయకురాలగు నన్ను భజింపుము. నీవు భూమి మీద వరింపదగిన పురుషులలో శ్రేష్టుడవు. స్వయముగా వరించి వచ్చిన సుందరిని నేను. మన్మథ తంత్రమునందు నేర్పు గల స్త్రీ పురుషుల యొక్క క్రొత్త కలయిక ప్రపంచమున దుర్లభము సుమా! భారత పర్వములో భూపాలుడు స్వర్గ ప్రాప్తికి మూలమైన యజ్ఞము చేయుచున్నారు. స్వర్గమందు భోగానుభవమే యజ్ఞమునకు కారణము. ఓ మునీ! భోగ సారభూతులము మేమే సుమా! నా స్తనముల జంటను నా ఊరువులను (తొడలను) సుందరమైన ముఖపద్మమును చిరునవ్వు బొమముడిపాటు గల దానిని చూచి ఎవడు సుఖము పొందడు ? స్త్రీరసమే (కలయిక) మునులకు కోరబడిన సుఖసారము. రసికురాలైన స్త్రీ యొక్క సుఖానుభవము అందున ఏకాంత ప్రదేశములో మిక్కిలి దుర్లభము. దేవజాతి గాని మనుష్యుడు గాని గంధర్వుడు రాక్షసుడు గాని రంభయొక్క సుఖమెరుగనివాడు రతీవంచితుడు (సుఖములో మోసగింపబడినవాడు).
రహస్యుపస్థితాం కాంతాం న భజేద్యో జితేంద్రియః ।
గాత్రలోమ ప్రమాణాబ్దం కుంభీపాకే వసేద్ధ్రువం ॥
సత్యం తస్యాశ్చ వధభాక్ తచ్ఛావేన ప్రణశ్యతి ।
విధాతా మోహినీ శాపాదపూజ్యో భువనత్రయే ॥
యేన త్యక్తోపస్థితాం తం యథా పశ్యతి పుంశ్చలీ ।
స్వామి పుత్ర స్వబంధూనాం స తథా ఘాతకం రుషా ॥
పరం ప్రియం చ సర్వేషాం జారం జానాతి పుంశ్చలీ ।
యది తేన పరిత్యక్తా తం హంతుం సా తు దక్షిణా ॥
పుంశ్చలీ హింస్ర జంతుభ్యో నవ ఘాతీభ్య ఏవ చ ।
దుష్టా శశ్వద్దయా హీనా దురంతా ప్రతిజన్మని ॥
త్యజ ధ్యానం మునిశ్రేష్ఠ భుంక్ష్వేదం తపసః ఫలం ।
రహస్యుపస్థితాం మాం చ గృహీత్వా సుచిరం సుఖం ॥
ఎవడు ఇంద్రియ జయము గలవాడై ఏకాంతమున చేరవచ్చిన కాంతను భజించడో (పొందడో) పోడు శరీరమందున్న రోమముల సంఖ్య గల సంవత్సరముల కాలము కుంభీపాక నరకమున నివసించును. ఇది నిశ్చయము. ఆ స్త్రీని వధించిన ఫలమనుభవించువా ఆమె శాపము చేత నశించును. పూర్వము సృష్టికర్త మోహినీ శాపము వలన ముల్లోకములందు పూజింపదగని వాడయ్యెను. ఒక జారీణి కోరికతో పురుషుని జేరబోయి అతని చేత త్యజింపబడినచో (తిరస్కరింప బడినచో) భర్తను పుత్రులను బంధువులను హత్యజేసిన వానిని చూచినప్పటికంటే అధిక కోపముతో ఆ పురుషుని జూచును. జారిణి అందరిలో తాసు గోరిన జార పురుషునినే మిక్కిలి ప్రియునిగా దలంచును. ఒకవేళ వాని చేత పరిత్యక్తురాలైనచో వానిని చంపుటకును సమర్ధురాలగును. క్రొత్తగా హత్య చేయుటకు మరిగిన క్రూర జంతువుల కంటె జారిణి దుష్టురాలు. మాటి మాటికీ దయాహీనురాలు. జన్మజన్మకు దుష్పలితములు కల్గించునది. ఓ మునిరాజా! ధ్యానమును త్యజింపుము. ఇదిగో! నీ తపఃఫలమైన నన్ను ఏకాంతమున చేరవచ్చిన దానిని గ్రహించి చాలకాలము సుఖమనుభవించుము.
స రంభావచనం శ్రుత్వా తామువాచ భయాకులః ।
హితం తధ్యం నీతిసారం పరిణామ సుఖావహం ॥
అతడు రంభ వచనము వీనీ భయముతో మనస్సు చెదరి సత్యమును హితమును చివరికి సుఖము కలిగించునట్టి నీతి సారమును ఆమెతో పలికెను.
దేవల ఉవాచ - దేవలుడనెను :
శ్రుణు రంభే ప్రవక్ష్యామి వేదసారం పరం వచః ।
కులధర్మోచితం సత్యం బ్రాహ్మణానాం తపిస్వినాం ॥
ధర్మోఽయం యుక్తకాలే చ స్వయోషితి రతో ద్విజః ।
సర్వత్ర పూజితః శశ్వదిహలోకే పరత్ర చ ॥
బ్రాహ్మణః క్షత్రియో వైశ్యో యో రతః పర యోషితి ।
యాతి తస్యాపూజితన్య రుష్టా లక్ష్మీర్గృహాదపి ॥
ఇహాతినింద్యః సర్వత్ర నాధికారీ స్వకర్మను ।
పరత్రైవాంధకూపే చ యావద్వర్షశతం వ సేత్ ॥
గ్రాహ్యా చోపస్థితా స్త్రీ చ గృహిణి న తపిస్వినా ।
త్యాగే దోషః కామినీనాం శాపఖాక్చాపభాగ్గృహీ ॥
బ్రహ్మా జగద్విధాతాఽపి న విరక్తః కలత్రవాస్ ।
త్యాగే దోష స్తత్కదాచిన్నాస్మాకం త్యక్తయోషితాం ॥
స్వభార్యాం చ పరిత్యజ్య యో గృహ్ణాతి పరస్త్రీయం ।
యశోధనాయుషాం హానిర్భవేజ్జీవన్మృతస్య చ ॥
భువి నాస్తి యశో యస్య జీవనం తస్య నిష్ఫలం ।
సునంవదా కిం రాజ్యేన సుఖేన చ తపస్వినః ॥
నిష్కామేన చ వృద్ధేన మయా కిం తే ప్రయోజనం ।
సువేషం సుందరం మాతర్యువానం పశ్య సుందరి ॥
ఇత్యేవం వచనం శ్రుత్వా చుకోపాప్సరసాం వరా ।
ఉవాచ భూయో వాక్యం తం త్రస్తా ప్రస్ఫురతాధరా ॥
“రంభా! వేద సారమైన ఉత్తమ వాక్యము చెప్పుచున్నాను వినుము. తపస్వులైన బ్రాహ్మణులకు కులధర్మమునకుచితమైన సత్యవాక్యమిది. యోగ్యమైన ఋతుకాలమందు మాత్రమే తన భార్యయందు బ్రాహ్మణుడు సుఖమనుభవించుట ధర్మము. అతడు ఇహపరలోకములందంతట మాటి మాటికీ పూజితుడగును. బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు వీరిలో ఎవడు పరస్త్రీయందు ఆసక్తి కలవాడగునో ఆ అయోగ్యుని యందు లక్ష్మీ కోపము పొంది వాని గృహము నుండి వెళ్లిపోవును. ఈ లోకమున వాడతినింద్యుడు. స్వజాతి కర్మాచరణకును వాడధికారికాడు. పరలోకమున వాడు శతసంవత్సరముల వరకు అంధకూప నరకమున వసించును. కోరి వచ్చిన స్త్రీని గృహస్థుడు గ్రహించ వచ్చును గాని తపస్వీ స్వీకరింపరాదు. నీవు చెప్పిన కామినీ త్యాగదోషము శాపానుభవము పాపానుభవము గృహస్థునకే. జగత్కర్తయగు బ్రహ్మ విరక్తుడు గాడు భార్య గలవాడే. భార్యనే త్యజించి విరక్తులమైన మాకు నిన్ను త్యజించుట వలన ఎప్పుడును దోషము లేదు. తన భార్యను పరిత్యజించి ఎవడు పరస్త్రీని గ్రహించునో ఆ జీవన్మృతునకు (బ్రతికీ ఉండియు చచ్చినవానికి) యశస్సు ధనము ఆయుష్యముల యొక్క హాని జరుగును. భువిలో కీర్తిలేని వాని జీవితము నిష్ఫలము. ఇక తపస్వికి సంపదతో రాజ్యముతో శరీర సుఖముతో పనియేమి ? నిష్కాముడను వృద్ధుడను ఐన నాతో నీకేమి ప్రయోజనము? తల్లి! మంచివేషము సుందర రూపము గల యువకునీ చూచుకోమ్ము”. ఇటువంటి మాటలు విని అప్సరసలలో శ్రేష్టురాలైన రంభ కోపము పొంది భయపడి కదలుచున్న క్రింది పెదవి గలదై మరల ఇట్లు పలికెను.
రంభోవాచ - రంభ పలికెను :
చారు చంపక వర్ణాభః కందర్ప సమ సుందరః ।
తపః ప్రభావా త్సశ్రీకః సువేషః సమ్మతః స్త్రీయాః ॥
త్వయా వినాఽన్యం కం యామీ కో వాఽస్తి త్వత్పరః పుమాన్ ।
పుంశ్చలీ త్వాం పరిత్యజ్య కా జీవతి స్మరాతురా ॥
శీఘ్రం మాం భజ విప్రేంద్ర దగ్ధం కామాగ్నినా సదా ।
కామో నశ్యతి మాం త్వత్తో యథారంభాం మతంగజః ॥
న చేచ్చోపం ప్రదాస్యామి వద వేదవిదాం వర ।
మాం వా దారుణ శాపం వా సత్వరం గ్రహణం కురు ॥
దగ్ధాః ప్రాణా మనోదగ్ధం స్వాత్వా వా ఇతి సంతతం ।
నవ శృంగార పీయూష పాన నిర్వాణతాం వ్రజేత్ ॥
స్వాంతర్దుఃఖేన దుఃఖార్తో యో యం శపతి నిశ్చితం ।
తం శాపం ఖండితుం శక్తో న విధాతా జగత్పతిః ॥
సుందరమైన సంపెంగ పూవన్నెతో ప్రకాశించువాడు మన్మథుని వంటి అందగాడు తపో మహిమ వలన తేజస్సు గలవాడు మంచి వేషము గల పురుషుడు స్త్రీలకు నచ్చినవాడు. నిన్ను విడిచి ఎవని వద్దకు పోదును? నీకన్న వేరుగా పురుషుడెవడున్నాడు? మన్మధపీడితురాలైన జారిణీ నిన్ను విడిచి ఎవలె బ్రతుకును? ఓ బ్రాహ్మణా! కామాగ్ని దగ్గురాలనైన నన్ను త్వరగా భజించుము. అరటి చెట్టును మదగజము నశింపజేసినట్లు నీవలన నన్ను మన్మధుడు నశింపజేయును. ఓ వేదవేత్తలలో శ్రేష్ఠుడా! నా కోరిక తీర్చనిచో నిన్ను శపింతును. చెప్పుము. నన్ను గాని దారుణమైన శాపమును గాని త్వరగా గ్రహింపుము. ప్రాణములు దగ్ధమైనవి. మనస్సు దగ్ధమైనది. తన ఆత్మగానీ దగ్డమెల్లవేళల కానిమ్ము. క్రొత్త శృంగారమను అమృతపానము వలన పూర్ణానందమును మానవుడు పొందగలడు. మనో దుఃఖము చేత దుఃఖారుడైన వ్యక్తి నిశ్చయముగా ఒకనిని శపించిన యెడల ఆ శాపమును ఖండించుటకు సృష్టికర్తయైన విధాతకును శక్తిచాలదు.
ద్వీజో రంభావచః శ్రుత్వా బభూవ ధ్యాన తత్పరః ।
నోవాచ కించిన్మౌనస్థః సా తం కోపాచ్చశాప హ ॥
హే వక్రచిత్త తే విప్ర సర్వాయవ వక్రిమం ।
శరీరమంజనాకారం రూప యౌవన వర్జితం ॥
అతీవ వికృతాకారం త్రిషు లోకేషు గర్హి తం ।
పురాతనం తపో నష్టం సద్యో భవతు నిశ్చితం ॥
ఇత్యుక్త్వా పుంశ్చలీ కామాత్కామలోకం జగామ హ ।
ఆ ద్విజుడు రంభ వాక్కులు విని మౌనముగా నుండి ఏమీ పలుక లేదు. భగవద్ధ్యానములో మగ్నుడయ్యెను. అప్పుడామె కోపముతో అతనిని శపించెను. “ఓయీ! వంకర బుద్ధిగలవాడా! నీ శరీరము అన్ని అవయవములందు వంకరదనము గలదియు కాటుకవంటి రంగు గలదియు రూపయౌవనములు లేనిదియు, మీక్కిలి వికార రూపముతో ముల్లోకములలో అసహ్యించుకోనునదియు అగుగాక. నీ పూర్వ తపస్సు వెంటనే నశించుగాక” అనీ ఆ జారిణి కామముతో పలికి కోరిన లోకమునకు (మన్మధలోకము) వెళ్లిపోయెను.
అచిరేణ మునీంద్రశ్చ న దదర్శ హరేః పదం ॥
వదారవింద విరహాత్సముద్విగ్నో బభూవ హ ।
స్వాంగం చ దృష్ట్వా వికృతం పూర్వ పుణ్య వివర్జితం॥
కృత్వోగ్నికుండం శోకేన ప్రాణాంస్త్యక్తుం సముద్యతః ।
మయా దృష్టో వరో దత్తో దీవ్యజ్ఞానేన బోధితః ॥
ఆశ్వాసశ్చ కృతః ప్రీత్యా తతః శాంతో బభూవ హ ।
అంగాస్యష్టౌ చ వక్రాణి దృష్ట్వా తూర్ణం మహామునేః ॥
అష్టావక్రేతి తన్నామ కౌతుకేన మయా కృతం ।
మద్వాక్యాన్మలయ ద్రోణీమయమాగమ్య సత్వరః ॥
షష్టి వర్ష సహస్రాణి చకార పరమం తపః ।
తపోఽవసానే మద్భక్తో మయా యుక్తః కృతః ప్రియే ॥
వెంటనే మునీంద్రుడు ధ్యానములో శ్రీహరి పాదములను దర్శించలేకపోయెను. నా పాదరవిందముల ఎడబాటు వలన ఉద్వేగము పొంది పూర్వపుణ్యముల చేత వర్ణితమై వికారమైన తన అంగమును చూచుకొని దుఃఖముతో అగ్నికుండము సిద్ధము చేసి అందులో పడి మరణించుటకు పూనుకొనెను. అప్పుడు నేను దర్శనమిచ్చి దివ్యజ్ఞానము బోధించి వరమిచ్చితిని. ప్రేమతో ఓదార్చితిని. అప్పుడతడు శాంతిపొందెను. ఆ మహాముని యొక్క అష్టాంగములు వక్రముగానుండుట చూచి ఆసక్తితో వెంటనే “అష్టావక్రా!” అని సంబోధించి నామకరణము చేసితినీ. నా వాక్యముననుసరించి ఇతడు త్వరగా మలయద్రోణికి వచ్చి అరవై వేల సంవత్సరములు గొప్ప తపస్సు చేసెను. ఓ ప్రియురాలా! (రాథా!) తపస్సు ముగిసిన తరువాత నా భక్తుడు నాతో కూడియున్నవాడుగా చేయబడెను.
నర్వస్మిన్ ప్రళయే నష్ఠే న మద్భక్తః ప్రణశ్యతి ।
సుచిరేణైవ తపసా జ్వలతా జఠరాగ్నినా ॥
త్యక్తాహారస్యాంతరం చ భస్మపూర్ణం తతో మునేః ।
ఆగతం మలయ ద్రోణీం మునిహేతోర్మయా ప్రియే ॥
అష్టావక్రాచ్చ మద్భక్తో స భూతో న భవిష్యతి ।
ఏవం భూతస్తపోనిష్ఠః ప్రపౌత్రో బ్రహ్మణో మునిః ॥
నిష్ఫలః పుంశ్చలీ శాపా ద్బ్రహ్మాఽపూజ్యో యథా పురా ।
ఇత్యేవం కథితం సర్వం రహస్యం చ మహాత్మనః ॥
సుఖదం పుణ్యదం గూఢం కిం భూయః శ్రోతు మిచ్ఛసి ॥
ప్రళయకాలమున మొత్తము సృష్టి నశించినను నా భక్తుడు నశించడు. సుదీర్ఘకాల తపస్సు వలనను మండుచున్న జఠరాగ్ని వలనను ఆ ముని యొక్క గర్భము ఆహారము త్యజించుట వలన భస్మముతో నిండినది. ప్రియురాలా! నేనిప్పుడు ఈ ముని కారణముగానే మలయద్రోణికి వచ్చితిని. అష్టావక్రుని కంటే వేరొకడంతటి భక్తుడు నాకింతకు ముందు లేడు. ఇక ముందుండబోడు. బ్రహ్మయొక్క మునిమనుమడగు ఈ ముని ఇంతటి తపోనిష్ఠుడు. పూర్వము జారిటీ శాపము వలన బ్రహ్మ కూడ పూజానర్హుడి నిష్ఫలుడయ్యెను. ఇట్లు ఆ మహాత్ముని మొత్తము రహస్యము నీకు చెప్పితిని. ఇది సుఖమును పుణ్యములను ఇచ్చును. ఈ చరిత్ర గూడమైనది. ఇంకేమి వినగోరుచున్నావు?
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే రాధా ప్రశ్నే త్రింశత్తమోఽధ్యాయః.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన రాధా ప్రశ్న అసు ముప్పదియవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 30 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Seeking to reveal the highest spiritual reality to His earthly father and cowherd companions, Lord Kṛshṇa led them to the holy lake known as Brahma-sarovara, where He instructed them to take a plunge into the sacred waters. As the cowherds immersed themselves, they were instantly elevated to the spiritual realm of Vaikuṇṭha, beholding the infinite majesty of Nārāyaṇa seated upon a golden throne surrounded by liberated souls and celestial rays. Stunned by this transcendent vision, Nanda Bābā and the cowherds realized that their beloved Kṛshṇa was none other than the Supreme Parabrahman Himself, returning safely to Vṛndāvana with hearts overflowing with pure devotion.