మూ॥శ్రీ నారాయణ ఉవాచ :
ఇత్యేవం కథితం సర్వం సర్వేషాం దర్పభంజనం ।
ఇంద్రస్యదర్ప భంగంచ విస్తరేణ నిశామయ ॥
ఇంద్రో దర్పాత్సభాయాంచ రత్న సింహాసనాద్వరాత్ ।
నోత్తస్థౌ స్వగురుం దృష్ట్వా బ్రహ్మిష్ఠంచ బృహస్పతిం ॥
గురుర్జ గామాతిరుష్టః స్వాపమానే సమత్సరః ।
తథాపి కృపయా ధర్మీం స్నేహాచ్చ న శశాప తం ॥
వినా శాపేన తద్దరశ్చూర్ణిభూతో భభూవ హ ।
అన్యశ్చ న్నశపే ధర్మాత్ర్పేమ్ణావాచాఽతికిల్బిషం ॥
తథాపితంచ ఫలతిధర్మస్తంహంతి నారద ।
యోఃయం హింస్రం సాపరాధం శపేత్కో పేనధార్మికః ॥
వినాశః సాపరాధస్య ధర్మో నష్టశ్చ ధర్మిణః ।
తేనాధర్మేణ శక్రస్య బ్రహ్మహత్యా బభూవహ ॥
భీతస్త్యక్త్వా స్వరాజ్యంచ ప్రయయౌ స సరోవరం ।
సరసః పద్మసూత్రేచ నివాసంచ చకార సః ॥
గంతుం నశక్తి హత్యాచ పుణ్యం విష్ణు సరోవరం ।
శ్రేష్ఠం భారత వర్షేచ తపః స్థానం తపస్వినాం ॥
తదేవ పుష్కరం తీర్థం ప్రవదంతి పరావిదః ।
రాజ్య భ్రష్టం హరిందృష్ట్వా హరిభక్త నరాధిపః ॥
బలాజ్ఞహార తద్రాజ్యం నహుషోనామ ధార్మికః ।
దృష్ట్వా శచీం వరారోహాం అనపత్యంచ సుందరీం ॥
స్వర్గగంగాంచ గచ్ఛతీం హృదయేన విదూయతా ।
నవయౌవన సంపన్నాం రత్నాలంకార భూషితాం ॥
సుకోమలాం తాం సుదతీం వదంతీంచ మహాసతీం ।
మూర్ఛాంసంప్రాప రాజేంద్రః కామేన యావనేనచ ॥
ఉవాచ: తత్పురఃస్థిత్వా సువినీతశ్చ దాసవత్ ॥
నహుష ఉవాచ:
ధాతుర్గతిర్విచిత్రాఽహో నబోధ్యాచ సతమపి ॥
ఈదృశీ స్త్రీ భ గాంగస్య లుబ్ధస్య పరయోషితి ।
ఈదృశీ సుందరీయస్య పరభార్యాసు,తన్మనః ॥
నారాయణుడిట్లన్నాడు: ఈ విధముగా అందరి .గర్వ భంగమును అంతా చెప్పాను. ఇంద్రుని గర్వభంగమును విస్తారంగా వినండి (1) ఇంద్రుడు దర్పంవల్ల సభలో శ్రేష్ఠమైన రత్న సింహాసనం నుండి లేవలేదు, బ్రహ్మిష్ఠుడైన బృహస్పతిని తన గురువును చూచికూడా లేవలేదు (2) తనకు అవమానం జరుగగా మాత్సర్యం కలవాడై చాలా కోపగించి గురువు వెళ్ళిపోయాడు. అట్లేనాధర్మం కలిగినవాడై కృపతో, స్నేహం వల్లను ఆతనిని శపించలేదు. (3) శాపం లేకుండానే ఆతని దర్పము చూర్ణమైంది. ఇతరుడైతే ధర్మబుద్ధి వల్ల ప్రేమవల్ల నోటి మాటతో అతిపాపాత్ముని శపించడు (4) ఐనా ఆతనికి ఫలితం వస్తుంది. ఓ నారద! ధర్మము వానిని హింసిస్తుంది. హింసించ తగిన సాపరాధుడైన వానిని ధార్మికుడు కోపంతో శపిస్తే (5) అపరాధం చేసిన వాడునశిస్తాడు. ధర్మి యొక్క ధర్మం నశిస్తుంది. ఆధర్మంతో ఇంద్రునకు బ్రహ్మహత్య పాపం కలిగింది. (6) భయపడి ఆతడుతన రాజ్యాన్ని వదలి సరోవరమునకు వెళ్ళాడు. సరస్సులోని తామరతూడు దారంలో తన నివాస మేర్పరచుకున్నాడు, అతడు. (7) హత్యపాపము పోలేకపోయింది. అది పుణ్యమైన విష్ణుసరోవరము, శ్రేష్ఠమైనది. ఈ భారత వర్షంలో, తపస్వులకు తపస్సునకు స్థానము. (8) పురావొదులు దానినే పుష్కర తీర్థమని అంటారు. రాజ్యభ్రష్టుడైన ఇంద్రుని చూచి, హరిభక్తుడైనరాజు (9) ధార్మికుడు నహుషుడనే వాడు బలవంతంగా ఆరాజ్యాన్ని హరించాడు. వరారోహ (గొప్ప పిరుదులు కలది), సంతానము లేనిది, సుందరి ఐన శచీదేవిని చూచాడు. (10) స్వర్గ గంగకు వెళ్తున్నది. హృదయంలో భాధపడుతోంది. నవయౌవనం కలది. రత్న అలంకారములతో అలంకరించుకున్న (11) మిక్కిలి కోమలమైనది, మంచి పలువరుస గలది, ఏదో మాట్లాడుతున్నది, అట్టి మహాసతిని చూచి, ఆ రాజేంద్రుడు యౌవనంతో, కామంతో మూర్ఛనందాడు. ఆమె ఎదురుగా నిలబడి చాలా వినయంగా, దాసుని వలెను ఇట్లా అన్నాడు (12) నషుహునిమాట - ధాతనడక చాలా విచిత్రమైంది సజ్జనులకు గూడా అర్థం కానిది. (13) భగాంగునకు (కోరికలేనివానికి) లుబునకు ఇటువంటి స్త్రీ, పరస్త్రీ యందు నా మనస్సు, ఇలాటి సుందరి ఎవనిదో? నా మనస్సు పరుని భార్య యందు లగ్నమైంది. (14)
మూII అస్యా అగ్రేచ కా రంభా కోర్వశీ కా తిలోత్తమా ।
కావా మేనా ఘృతాచీవా రత్నమాలా కరావతీ ॥
కాలికా సుందరీ భద్రావతీ చంపావతీ తథా ।
ఏతాశ్చాప్సరస శ్చాన్యాః కలాం నార్హంతి షోడశీం ॥
ఇమాం విహాయ మూడోఽన్యాం కథం గచ్ఛతి మందధీః ।
అస్మాకం యోషితో యాశ్చ చేటీతుల్యాశ్చనిశ్చితం ॥
మాం భజస్వ వరారోహే సుప్రీతా భవకింకరం ।
యధా రాధాచ గోలోకే కృష్ణవక్షసి రాజతే ॥
వైకుంఠోరసి వైకుంఠే యధా లక్ష్మీః సరస్వతీ ।
బ్రహ్మలోకేచ బ్రహ్మాణీ యథైవ బ్రహ్మవక్షసి ॥
యథా మూర్తిః మహాసాధ్వీ ధర్మవక్షః స్థలస్థితా ।
పాతాలతలలక్ష్మీర్వా యదైవానంత వక్షసి ॥
యధా పుష్టిః గణేశేచ దేవ సేనా చకార్తికే ।
వరుణే వరుణానీచ యథా స్వాహా హుతాశనే ॥
యథా రతిః కామదేవే యథా సంజ్ఞా దినేశ్వరే ।
వాయోఃపత్నీ యథావాయౌ యధా చంద్రే చ రోహిణీ ॥
యథాఽదితిర్దేవమా తా తవ శ్వశ్రూశ్చ కశ్య పే ।
యథా హిమాలయే మేనా పితృకన్యాచ మాన సే ॥
లోపాముద్రా యథాఽగస్త్యే యథాతారా బృహస్పతౌ ।
కర్దేమే దేవహూతీచ వసిష్టేఽరుంధతీ యథా ॥
మనౌచ శతరూపేవ దమయంతీ నలే యథా ।
తథా భవత్వం సౌభాగ్యా మమ వక్షసి సుందరి ॥
లీలయాచ సహ స్రేంద్రాన్ చేత్తుం శక్తోఽహామీశ్వరః ।
నారీ వాంఛతి జారంచ స్వామినో బలవత్తరం ॥
సుమేరుగిరికూటేచ దుర్గమేఽతిరహఃస్థలే ।
అథవా మలయేరమ్యే రమ్యే చందన వాయునా ॥
విశ్రంభకే సురసనే కింవానందన కాననే ।
నికటే శతశృంగస్య పుష్పభద్రానదీతటే ॥
గోదావరీ తీరనీరే సమీ పే శీతవాయునా ।
చంపావతీ నదీ తీరే రమ్యే చంపకకాననే ॥
శ్మశానేఽతిశ్మశానే చరమ్యేఽతిని జనేవనే ।
శైలేశైలేఽతిరహసి కందరేకందరే వనే ॥
ద్వీ పేద్వీపే దుర్గదుర్గేనద్యాంనద్యాంనదే నదే ।
సముద్రపులినేరమ్యేసర్వజంతు వివర్జితే॥
విదగ్ధయా విదగ్ధేన సంగమోనిర్జనే సుఖః ।
పుష్పచందన శయ్యాయాం పుష్పచందన చర్చితే ॥
ఈమె ముందు,రంభ ఎంతటిది, ఊర్వశి తిలోత్తమ లెంతటివారు మేనక, ఘృతాచి, రత్నమాల, కలావతి (15) కాలిక, సుందరి, భద్రావతి, చంపావతి ఈ అప్సరలంతా, ఇతరులు కూడా ఈమె పదహారవ కళను కూడా పొందలేరు. (16) ఈమెను వదలి మూఢుడు, మందబుద్దివాడైనా ఇతర స్త్రీ నెట్లా చేరుతాడు. మా స్త్రీలంతా చేటిలతో సమానము, అనుమానములేదు: (17) ఓ వరారోహ! నన్ను పొందు, మిక్కిలి ప్రీతిని పొందు, నీకింకరుణ్ణి, గోలోకమందు రాధ ఎట్లా కృష్ణుని వక్షమందు ఉంటుందో '18) వైకుంఠమందు, వైకుంఠుని ఉరమందు లక్ష్మి ఎట్లా ఉందో బ్రహ్మాణి సరస్వతి బ్రహ్మలోక మందు బ్రహ్మ వక్షమందు ఎట్లా ఉందో (19) మహాసాధ్విమూర్తి ఎట్లా ధర్ముని వక్షఃస్థలమందు ఉందో, పాతాలతల లక్ష్మి ఎట్లా అనంతుని వక్షమందు ఉన్నదో (20) గణేశుని యందు పుష్టి ఎట్లా ఉందో, కార్తికేయుని యందు దేవ సేన ఎట్లా ఉందో, వరుణుని యందు ఆతని భార్య (వరుణాని) ఎట్లాగో, అగ్నియందు స్వాహా ఎట్లాగో (21) మన్మథుని యందు రతి ఎట్లానో, సూర్యుని యందు సంజ్ఞ, వాయుపత్ని వాయువు యందు, రోహిణి చంద్రుని యందు, (22) అదితి దేవమాత, మీ అత్త కశ్యపుని యందు, మానసయైన పితృకన్య, మేన హిమవంతుని యందు (23) అగస్త్యుని యందు లోపాముద్ర, బృహస్పతి యందు తార, కర్దముని యందు దేవహూతి, వసిస్తుని యందు అరుంధతి, (24) మనువు యందు శతరూప, నలుని యందు దమయంతి, వీరంతా ఎట్లాగో అట్లాగ ఓ సుందరి! నా వక్షఃస్థలమందు నీవు సౌభాగ్యమంతురాలివి కమ్ము (25) అవలీలగా వేయిమంది ఇంద్రులను ఛేదించుటకు సమర్ధుణ్ణి నేను ఈశ్వరుణ్ణి. స్వామికన్న బలవంతుడైన జారుని స్త్రీ కోరుతుంది. (26) సుమేరుగిరి కూటమందు, దుర్గమమైన అత్యంత రహస్య స్థలమందు, లేదా చందన వాయువుతో రమ్యమైన మలయపర్వతరమ్య ప్రదేశమందు (27) ఓ సురసన! విశ్వసించతగిన నందన కాననమందు కాని, పుష్పభద్రానదీతట మందున్న శతశృంగ పర్వత సమీపమందుకాని, (28) గోదావరి తీరమందలి నీటియందు, చల్లనిగాలి కలిగిన దాని సమీపమందుకాని, చంపావతీ నదీతీరమందలి అందమైన చంపక కాననమందుకాని (29) శ్మశానమందుకాని శ్మశానానికి చాలా దగ్గరలో (దూరంలో) కాని రమ్యమైన మిక్కిలి జనం లేని వనమందుకాని, పర్వతమందు అతి రహస్య స్థలంలోకాని, కందరమందో, వనమందో (30) ద్వీపమందో, దుర్గమమైన దుర్గమందో, నది యందో, నదమందో ఏ జంతువు లేని అందమైన సముద్రపు ఒడ్డుయందో (31) విదగ్ధకు (నేర్పరి, చొరవ) విదగ్గునితో, నిర్జన ప్రదేశంలో సంగమము సుఖకరము. పుష్పములు చందనం గల శయ్య, పుష్పచందనములతో పూయబడిన వారికి సుఖకరము. (32)
మూII మాం గృహీత్వా కురు రతిం పుష్పచందనచర్చితం ।
బ్రహ్మణశ్చ వరైర్దేవి జరామృత్యువివర్జితం ॥
మాం కురుష్వ పతిం భద్రే నిత్యం సుస్థిర యౌవనం ।
సువేషం సుందరం ధీరం కామశాస్త్రవిశారదం ॥
శరత్పార్వణ చంద్రాస్యం చంద్రవంశ సముద్భవం ।
ఆగతా ముర్వశీం మహ్యాం త్యక్తవంతం చ యాచతీం ॥
నమే స్పృహా పరస్త్రీషు త్వాం దృష్ట్వాలోలుపం మనః ।
త్యక్తా మయా స్వభార్యాశ్చ రత్నభూషిణ భూషితాః ॥
అథవా రక్షితా స్సర్వాః దాస్వీకృత్వా వరాననే ।
రత్నేంద్రసారాం మాలాం తే దాస్యామి వరుణస్యచ ॥
నిర్జిత్య వరుణం యుద్ధే బ్రహ్మాస్త్రేణాతీతేజసా ।
వహ్నిశుద్ధం వస్త్రయుగం జిత్వా వహ్నిం సుదుర్బలం ॥
దాస్యామ్యద్యైవ తే దేవి నియోజ్యం మాం నియోజయ ।
మణీంద్రసారనిర్మాణ మకరాకారకుండలే ॥
దాస్యామి దేవాన్నిర్జిత్య దేవమాతుశ్చ సుందరి ।
కరభూషణయుగ్మం చాత్యమూల్య రత్న నిర్మితం ॥
దాస్యామ్యద్యై వరోహిణ్యాశ్చంద్రం జిత్వాఽతిదుర్లభం ।
యక్ష్మగ్రస్తమతికృశం మమైవ పూర్వపూరుషం ॥
వినా యుద్ధేన భీతో మాంకృపయా వా ప్రదాస్యతి ।
అల్పరత్న వినిర్మాణం క్వణన్మంజీరయుగ్మకం ॥
దాస్యామ్యదైవ పార్వత్యా భిక్షాం కృత్వా మహేశ్వరం ।
ఆశుతోషం స్తుతివశం భక్తే శంచ కృపామయం ॥
సర్వసంపత్తి దాతారం పరం కల్పతరుంశుభే ।
అమూల్యరత్న నిర్మాణ కేయూర యుగలం ప్రియే ॥
దాస్యామితేఽద్య గంగాయా యుద్ధం కృత్వాసుదుర్లభం ।
బహులీ యుగలం చారు సూర్యపత్న్యా మనోహరం ॥
సద్రత్నసార నిర్మాణం దాస్యామ్యద్యసుశోభనే ।
అమూల్యరత్న నిర్మాణం దర్పణం చాతి నిర్మలం ॥
దాస్యామి తే కామపత్న్యా: కామం జిత్వాచ లీలయా ।
క్రీడాకమల మమలానం కమలా యాశ్చసుందరి ॥
భిక్షం కృత్వాచ దాస్యామి స్తుత్వాచ కమలాపతిం ।
అంగుళీయకరత్నాని విశ్వేషు దుర్లభానిచ ॥
సావిత్ర్యాశ్చ ప్రదాస్యామి కృత్వాచ బ్రహ్మణస్తథా ।
స్వయం గీతం ప్రగాయంతీం మూర్ఛనా శ్రుతిసంయుతాం ॥
వాణీవీణాం ప్రదాస్యామి కృత్వా నారాయణవ్రతం ।
రత్న పాశక సంఘంచ విశ్వకర్మ వినిర్మితం ॥
కుబేర పత్న్యా దాస్యామి పాదాంగులి విభూషణం॥
అను! పుష్పచందనములతో పూయబడిన, నన్ను స్వీకరించి రతిని చేయి ఓ దేవి! బ్రహ్మ వరములతో ముసలితనము, చావులేని వాణ్ణినేను. (33) ఓ భద్ర! (శ్రేష్ఠమైనదాన) ఎప్పుడు సుస్థిరమైన యౌవనము గలనన్ను పతిగా చేసుకో. మంచి వేషం కల వాణ్ణి, సుందరుణ్ణి, ధీరుణ్ణి, కామశాస్త్ర విశారదుణ్ణి, నన్ను భర్తగా చేసుకో (34) శరత్పూర్ణిమ నాటి చంద్రుని వంటి ముఖం కలవాణ్ణి చంద్రవంశంలో పుట్టినవాణ్ణి, భూమి పైకి వచ్చిన, యాచించిన, ఊర్వశిని వదలినవాణ్ణి (35) నాకు పరస్త్రీల పై స్పృహ (కోరిక) లేదు. నిన్ను చూసి నామనస్సు లోలుపం కలదైంది (ఇచ్ఛ). నేను నా భార్యలను వదిలాను, రత్నభూషణములతో అలంకరించుకున్న వాళ్ళను వదిలాను. (36) ఓ వరానన! (కోర తగిన ముఖం) వారందరినీ దాసీలను చేసి రక్షిస్తాను. వరుణుని యొక్క రత్నేంద్ర సారమాలను (37) బ్రహ్మాస్త్రంతో, మిక్కిలి తేజోవంతమైన దానితో యుద్ధంలో వరుణుని జయించి నీకిస్తాను. చాలా దుర్బలుడైన వహ్నిని జయించి, వహ్నిశుద్దమైన వస్త్రములు రెంటిని (38) ఓ దేవి! నీకు ఈరోజే (ఇప్పుడే) ఇస్తాను. నన్ను నియోజకునిగా (భృత్యుడు, యజమాని) నియోగించుకో. మణీంద్రసార నిర్మితమైన మకరాకార కుండలములను (39) దేవమాతకు చెందిన వానిని దేవతలను జయించి నీకిస్తాను, ఓ సుందరి! మిక్కిలి అమూల్యరత్నములతో నిర్మించిన రెండు ఆభరణములను నీకరములకై (40) అతిదుర్లభమైన వాటిని రోహిణి దగ్గర ఉన్నవాటిని, చంద్రుణ్ణి జయించి ఇప్పుడే నీకిస్తాను. ఆతడు క్షయవ్యాధిగ్రస్తుడు. చాలా కృశించినవాడు మా పూర్వపురుషుడే (41) యుద్ధం లేకుండానే భయపడికాని, లేదా నామీది దయతోగాని నాకిస్తాడు. అల్ప (చిన్న) రత్నములతో నిర్మింపబడిన, ధ్వనించేకాలి అందెలను రెంటిని (42) పార్వతికి చెందిన వాటిని శివుని భిక్షమడిగియైనా ఈవేళే నీకిస్తాను. ఆతడు త్వరగా ఆనందించేవాడు, స్తుతికి పరవశుడు, భక్తులకు ఈశుడు, దయామయుడు (43) ఓ శుభే! అన్ని సంపదలనిచ్చే, పరమమైన కల్పతరువును నీకిస్తాను. అమూల్యమైన రత్నములతో నిర్మింపబడిన భుజకీర్తులను రెండిటిని, ఓ ప్రియ! (44) గంగకు చెందిన వాటిని, చాలా దుర్లభమైన వాటిని యుద్దము చేసి నీకిస్తాను. సూర్యపత్నికి చెందిన, మనోహరమైన, అందమైన భుజాభరణముల రెంటిని (45) మంచి రత్నముల సారములతో నిర్మింపబడిన వాటిని, ఓ సుశోభన! ఈవేళ నీకిస్తాను. అమూల్యరత్నములతో నిర్మింపబడిన, అతి నిర్మలమైన దర్పణమును (46) కామపత్నికి చెందిన దానిని అవలీలగా కాముని జయించి నీకిస్తాను. ఓ సుందరి! కమలకు చెందిన వాడిపోని క్రీడాకమలాన్ని (47) కమలాపతినిస్తుతించో, బిక్షమడిగో నీకిస్తాను. విశ్వములందు దుర్లభములైన అంగుళీయక రత్నములను (48) సావిత్రికి బ్రహ్మకు చెందిన (వానిని) స్తవం చేసి అడిగినీకిస్తాను. స్వయంగా తాను పాటపాడుతున్న మూర్చన శ్రుతులతో కూడిన (49) వాణియొక్క వీణను నారాయణ వ్రత మాచరించి నీకిస్తాను. విశ్వకర్మచే నిర్మింపబడిన రత్నపాశముల సంఘమును (50) కుబేరపత్నికి చెందిన దానిని, పాదాంగుళి విభూషణమును నీకిస్తాను (50 1/2)
మూ॥ ఇత్యేవముక్త్యా నహుషః పపాత తత్పదాంబుజే ॥
ఉవాచ తం శచీత్రస్తా రాజమార్గ గతం నృపం ।
ఉత్థాప్య తం కరేధృత్వా శుష్కకంఠోష్ఠ తాలుకా ।
స్మారం స్మారం పదాంభోజం మహా సాధ్వీ హరేర్గురోః ॥
శచ్యువాచ-
శృణు వత్స మహారాజ హేతాతభయభంజన ॥
భయత్రాతా చ రాజాచ సర్వేషాం పాలకః పితా ।
భ్రష్టశ్రీశ్చ మహేంద్రోఽద్య త్వంచ స్వర్గేనృపోఽధునా ॥
యో రాజా స పితా పాతా ప్రజానామేవనిశ్చితం ।
గురుపత్నీ రాజపత్నీ దేవపత్నీ తథా వధూః ॥
పిత్రోః స్వసా శిష్యపత్నీ భృత్యపత్నీ చ మాతులీ ।
పితృపత్నీ తృపత్నీ శ్వశ్రూశ్చ భగినీసుతా ॥
గర్భధాత్రీష్టదేవీచ పుంసః షోడశమాతరః ।
త్వం నరో దేవభార్యాఽహం మా తాతే దేవసంమతా ॥
గచ్చవత్సాదితిం రంతుం యదిచేచ్ఛసి మాతరం ।
సర్వేషాం నిష్కృతిశ్చాస్తి న వత్స మాతృగామినాం ॥
కుంభీపాకే తే పచంతి యావద్వై బ్రహ్మణోవయః ।
తతో భవంతి కృమయః కల్పాః సప్త భవంతి యే ॥
తతశ్చ కుష్ఠినో మ్లేచ్ఛా భవంతి సప్త జన్మసు ।
నాస్త్యేవ నిష్కృతి స్తేషామిత్యాహ కమలోద్భవః ॥
ఏవం విట్క్షత్ర శూద్రాణాం బ్రాహ్మణీగమనే నృప ।
వేదేషు నిష్కృతిర్నాస్తి చే త్యాంగిరస భాషితం॥
స్వర్గ సంపత్తి భోగశ్చ సుఖంసంసారిణాం ధ్రువం ।
ముముక్షూణాంచ మోక్షశ్చ మోక్షశ్చైవ తపస్వినాం ॥
బ్రాహ్మణానాంచ బ్రాహ్మణ్యం మునీనాం మౌనమేవచ ।
వేదాభ్యాసో వైదికానాం కవీనాం కావ్య వర్ణనం ॥
విష్ణుదాస్యం వైష్ణవానాం విష్ణుభక్తిరసం పరం ।
విష్ణుభక్తిం వినా నైవ ముక్తిం వాంఛంతి వైష్ణవాః॥
మలాడ్యేషుచ ఖేదేషు దుర్గంధినిలయేఘచ ।
సాధూనాం కిం సుఖం సాధో స్త్రీణాం యోనిషుమాం వద ॥
కులప్రదీపే రాజేంద్ర రాజ్ఞాం మండలవర్తినాం ।
లబ్ధంచ భారతేజన్మ పుణ్యేన బహుజన్మనాం ॥
పద్మానాం చంద్రవంశ్యానాం నృపాణాం దీప్తి హేతవే ।
త్వమావిరాసీ స్తేజస్వీ గ్రీష్మ మధ్యాహ్న భాస్కరః ॥
సర్వేషామాశ్రమాణాంచ స్వధర్మశ్చయశః పరం ।
స్వధర్మహీనా నరకే పతంతి మూఢచేతసః ॥
బ్రాహ్మణస్య స్వధర్మశ్చ త్రిసంధ్యమర్చనం హరేః ।
తత్పాదోదక నైవేద్యభక్షణంచ సుధాధికం ॥
అన్నం విష్టా జలం మూత్రం అనివేద్యం హరేర్నృప ।
భవంతి సూకరాః సర్వే బ్రాహ్మణా యాది భుంజతే ॥
ఆజీవం భుంజతే విప్రా ఏకాదశ్యాం నభుంజతే ।
కృష్ణజన్మదినే చైవ శివరాత్రౌ సునిశ్చితం ॥
తథా రామనవమ్యాంచ యత్నతః పుణ్యవాసరే ।
బ్రాహ్మణానాం స్వధర్మశ్చ కథితో బ్రహ్మణా నృప ॥
అను!! అని ఈ విధముగా పలికి నహుషుడు ఆమె పాదాంబుజములందు పడ్డాడు (51) రాజమార్గమందున్న రాజుతో, శచీదేవి భయపడి అతనితో ఇట్లా అన్నది. ఆతనిని లేపి, చేతితో పట్టుకొని, ఎండిపోయిన కంఠ ఓష్ఠ తాలుభాగములు కలదై (గొంతు, పెదవులు, దవడలు) ఆమహాసాధ్వి గురువైన హరియొక్క పాదాంభోజములను స్మరిస్తూ, స్మరిస్తూ (52) శచి ఇట్లా అంది - ఓ వత్స! మహారాజ! ఓ తండ్రి! భయమును తొలగించేవాడా, విను (53) అందరికి భయముల నుండి రక్షకుడు, రాజు. పాలకుడు, తండ్రి. ఈవేళ ఇంద్రుడు శ్రీనుండి భ్రష్టుడైనాడు. నీవు ఇప్పుడు స్వర్గంలో రాజువు (54) ఎవడు రాజో వాడు తండ్రితో సమానం, రక్షకుడు ప్రజలకు అనుమానం లేదు. గురుపత్ని, రాజపత్ని, దేవపత్ని, వధువు (కోడలు) (55) తండ్రి చెల్లెలు, తల్లి చెల్లెలు, శిష్యుని భార్య, భృత్యుని భార్య, మేనత్త, తండ్రి భార్య, భ్రాతృపత్ని, అత్త, చెల్లెలు, కూతురు (56) తల్లి ఇష్టదేవి ఇట్లా పదహారుగురు పురుషునకు తల్లులు. నీవు నరుడవు. నేను దేవ భార్యను. నీ తల్లి దేవతలకు ఇష్టమైనది (57) ఓవత్స! రమించుటకు. ఇష్టము కలవాడవైతే అదితిని, తల్లిని రమించుటకు వెళ్ళు. అందరికి, నిష్కృతి ఉంది కాని తల్లిని పొందిన (రతి) వానికి నిష్కృతి లేదు, ఓవత్స. (58) బ్రహ్మ వయస్సు ఉన్నంతకాలం, వాడు కుంభీపాక నరకంలో వండబడుతాడు. ఆ పిదప కృమిజన్మవచ్చి ఏడు కల్పముల కాలముంటాడు (పురుగు) (59) ఆ పిదప కుష్ఠురోగులు, మ్లేచ్చులుగా ఏడు జన్మలుంటారు. వారికి నిష్కృతే లేదు అని బ్రహ్మ అన్నాడు (60) ఈ విధముగా వైశ్య, క్షత్రియ, శూద్రులు బ్రాహ్మణ స్త్రీని పొందితే, ఓ రాజా! వేదములందు నిష్కృతి లేదు, అని అంగిరసునిమాట (61) సంసారులకు స్వర్గ సంపత్తి భోగము, సుఖము నిశ్చయము. ముముక్షులకు మోక్షము, తపస్వులకు కూడా మోక్షము. (62) బ్రాహ్మణులకు బ్రాహ్మణ్యము, మునులకు మౌనము, వైదికులకు, వేదాభ్యాసము, కవులకు కావ్య వర్ణనము (63) వైష్ణవులకు విష్ణు దాస్యము, విష్ణు భక్తి రసము పరమైనది. వైష్ణవులు విష్ణుభక్తి తప్ప ఇతరమైన ముక్తిని కోరరు. (64) మలముతో కూడిన, తడి తడియైన, దుర్వాసనకు నిలయమైన స్త్రీల యోనులందు సాధువులకు ఏం సుఖముంటుంది, ఓ సాధు! నాకు చెప్పు (65) ఓ రాజేంద్ర ! మండలాకారముగా నున్న రాజుల (చుట్టూ ఉన్న) కులమును వెలిగించే భారత దేశమందు, అనేక జన్మల పుణ్యం వల్ల నీకు జన్మ లభించింది. (66) చంద్ర వంశపు రాజులనే పద్మముల దీప్తి కొరకు, తేజస్వంతుడవైన నీవు గ్రీష్మ కాలమందలి మధ్యాహ్న సూర్యుని వలె ఆవిర్భవించావు (67) అన్ని ఆశ్రమములవారికి తన ధర్మాచరణ మిక్కిలి కీర్తికారి. తమధర్మ హీనులైన, మూఢచేతసులు నరకంలో పడ్డారు. (68) బ్రాహ్మణుని స్వధర్మమేమంటే మూడు సంధ్యలందు హరిఅర్చన చేయడం. ఆ హరి పాదోదకము, నైవేద్యము తినుట, అమృతము కన్న మిన్న (69) హరికి, నివేదించని అన్నము మలము, జలము మూత్రము, ఓ రాజ! నివేదించని దాన్ని భుజిస్తే బ్రాహ్మలంతా సూకరము లౌతారు (పందులు) (70) బ్రతికినంత కాలం భుజిస్తారు విప్రులు, కాని ఏకాదశినాడు భుజించరు. (రాదు) కృష్ణ జన్మదినమందు, శివరాత్రి యందు తినరాదు నిశ్చయము (71) అట్లాగే రామనవమి యందును భుజించరాదు. ప్రయత్నించి పుణ్యదినమందు తినరాదు. ఇది బ్రాహ్మల స్వధర్మము అనిబ్రహ్మ చెప్పాడు, ఓ రాజ ! (72)
మూII వ్రతం పతివ్రతానాంచ పతి సేవా పరంతపః ।
యథాపుత్రః పరపతి: ఏష ధర్మశ్చ యోషితాం ॥
పాలయంతి యథా భూపాః ప్రజాః పుత్రానివౌరసాన్ ।
ప్రజాః స్త్రియఃశ్చ పశ్యంతి రాజానో మాతరం యథా ॥
యజ్ఞం కుర్వంతి విష్ణోశ్చ సేవనం దేవవిప్రయోః ।
నివారణంచ దుష్టానాం శిష్టానాం ప్రతిపాలనం ॥
ఇతి ధర్మః క్షత్రియాణాం కథితో బ్రహ్మణా పురా ।
వాణిజ్యం చైవ వైశ్యానాం స్వధర్మో ధర్మ సంచయః ॥
శూద్రాణాం విప్ర సేవాచ పరోధర్మో విధీయతే ।
సర్వన్యాసో హరౌ భూప ధర్మః సంన్యాసినాం ధ్రువం॥
రక్తైకవాసా దండీ చ బిభర్తి మృత్కమండలుం ।
సర్వత్ర సమదర్శీచ స్మరేన్నారాయణం సదా ॥
కరోతి భ్రమణం నిత్యం గేహే గేహే నతిష్ఠతి ।
విద్యామంత్రంచ కస్మైచిన్నదదాతి చ లోభతః ॥
కరోతి నాశ్రమంభిక్షుః కరోతి నాన్యవాసనాం ।
కరోతినాన్యసంగంచ నిర్మోహః సంగవర్జితః ॥
న స్వాదు భుంక్తే లోభాచ్చ స్త్రీ ముఖం నహిపశ్యతి ।
న వాంఛితం భక్ష్యవస్తు యాచతే గృహిణంవ్రతీ ॥
ఇతి సన్యాసినాం ధర్మమిత్యాహ కమలోద్భవః ।
ఇతితే కథితం పుత్ర గచ్ఛవత్స యథా సుఖం ॥
ఇత్యుక్త్వాచ మ హేంద్రాణీ విరరామ చ వర్త్మని ।
ఉవాచ నహుషో రాజా శచీం వక్ర ప్రకంధరః ॥
నహుష ఉవాచ:
త్వయా యత్కథితం దేవి సర్వం తత్తు విపర్యయం ।
యథార్థధర్మం వేదోక్తం నిబోధ కథయామితే ॥
కర్మణాం ఫలభోగశ్చ సర్వేషాం సురసుందరి ।
నైవ స్వర్గె న పాతాలే నాన్యద్వీపే శ్రుతౌశ్రుతం ॥
కృత్వా శుభాశుభంకర్మ పుణ్యక్షేత్రేచ భారతే ।
అన్యత్ర తత్ఫలం భుంక్తే కర్మీ కర్మనిబంధనాత్ ॥
హిమాలయాదాసముద్రం పుణ్యక్షేత్రంచ భారతం ।
శ్రేష్ఠం సర్వస్థలానాంచ మునీనాంచ తపః స్థలం ॥
తత్ర లబ్ద్వా జన్మ జీవీ వంచితో విష్ణుమాయయా ।
శశ్వత్కరోతి విషయం విహాయ సేవనం హరేః ॥
కృత్వా తత్ర మహత్పుణ్యం స్వర్గం గచ్ఛతి పుణ్యవాన్ ।
గృహీత్వా సర్వకన్యాశ్చ చిరంస్వర్గే ప్రమోదతే ॥
స్వర్గమాగచ్ఛతి నరో విహాయ మానవీం తనుం ।
స్వశరీరేణాగతోఽహం మత్పుణ్యం పశ్య సుందరి ॥
పతి సేవ పతివ్రతలకు వ్రతము, పరమమైన తపస్సు. పరపతి పుత్రునితో సమానము స్త్రీలకు ఇది ధర్మము. (73) ప్రజలు తమ సంతానాన్ని రక్షించినట్లు రాజు ప్రజలను రక్షించాలి. ప్రజలు తమ తల్లిని చూసినట్లుగా రాజు స్త్రీలను (తల్లిలా) చూడాలి.
యజ్ఞం చేయటం, విష్ణువును, దేవ, విప్రులను సేవించుట, దుష్టుల నివారణము, శిష్టులను రక్షించుట (75) ఇది క్షత్రియ ధర్మము అని బ్రహ్మ ఇదివరలో చెప్పాడు. వైశ్యులకు వాణిజ్యము, ధర్మము సంపాదించుకొనుట స్వధర్మము. (76) శూద్రులకు విప్ర సేవ పరమధర్మంగా విధించబడింది. ఓ రాజ! సర్వము హరియందు వదలుట సన్యాసుల ధర్మము, నిశ్చయము. (77) ఎర్రటి ఒకేవస్త్రాన్ని ధరించుట, దండము ధరించుట మట్టికమండలువు ధరించుట, అంతటా (అందరియందు) సమానదృక్పథము, ఎప్పుడూ నారాయణుని స్మరించుట (78) రోజూ తిరుగుట, ఇంటింటా ఉండక పోవుట, లోభంతో, విద్యనుకాని మంత్రాన్ని కాని ఎవ్వరికి చెప్పకుండుట (79) భిక్షువు ఆశ్రమము నిర్మింపకుండుట, ఇతరుల వస్త్రమును ధరింపకుండుట, ఇతరులతో సహవాసము చేయకుండుట, మోహరహితుడుగా నుండుట, చేరిక (నలుగురితో) లేకుండుట, (80) మోహరహితుడుగా పదార్థాన్ని తినకుండుట, స్త్రీ ముఖమును చూడకుండుట, తినతగిన పదార్థాన్ని ఇష్టమైన దానిని ప్రతి (సన్యాసి) గృహస్థును యాచించకుండుట (81) ఇవన్ని సన్యాసి ధర్మములు అని బ్రహ్మ అన్నాడు. అని నీకు చెప్పాను. ఓ పుత్ర! ఓ వత్స! సుఖకరంగా వెళ్ళు (82) అని, మార్గంలో మహేంద్రాణి పలికి ఊరకుంది. అప్పుడు రాజైన నహుషుడు వంకరగా బాగా తలతిప్పి శచితో ఇట్లా అన్నాడు (83) నహుషుడిట్లో అన్నాడు - ఓ దేవి, నీవేదైతే చెప్పావో అదంతా విపర్యయము (తలక్రిందులు). వేదమందు చెప్పిన యథార్థ ధర్మాన్ని నీకు చెప్పుతాను, తెలుసుకో (84) ఓ వేద సుందరి! అందరు తమ కర్మల ఫలమును అనుభవించాలి. స్వర్గమందో, పాతాలమందో, ఇతర ద్వీపమందుకాదు అని శ్రుతియందు చెప్పారు (విన్నాం). (85) పుణ్యక్షేత్రమైన భారతమందు శుభమైనదో, అశుభమైనదో కర్మచేసి, ఆ కర్మ చేసినవాడు, కర్మలకు బద్ధుడైనందువల్ల (బంధం) ఆ ఫలాన్ని మరోచోట అనుభవిస్తాడు. (86) హిమాలయంనుండి సముద్రం దాకా పుణ్యక్షేత్రము, ఈ భారతభూమి. అన్ని స్థలముల కన్న శ్రేష్ఠమైనది. మునులకు తపస్సు చేసుకునే ప్రదేశము. (87) అక్కడ జీవి జన్మను పొంది, విష్ణు మాయతో వంచితుడై, హరి సేవను వదిలి నిరంతరం ఎల్లప్పుడు విషయముల సేవ చేస్తున్నాడు. (88) అక్కడ మహాపుణ్యమును చేసి పుణ్యవంతుడు స్వర్గమునకు వెళ్తాడు. కన్యలందరిని స్వీకరించి, స్వర్గంలో చిరకాలము ఆనందంగా ఉంటాడు. (89) నరుడు, మానవశరీరాన్ని వదలి స్వర్గానికి వస్తాడు. నేనే నా శరీరంతో వచ్చాను. ఓ సుందరి! నా పుణ్యమెంతో, చూడు (90)
మూ॥ అనేక జన్మపుణ్యేన చాగతః స్వర్గమేప్సితం ।
తతః కిం కేన పుణ్యేన దర్శనం మే త్వయా సహ ॥
నహి కర్మస్థలమిదం స్వర్భోగస్థలమేవచ ।
భోగస్థలే భోగవస్తు నహి త్యక్తుం ప్రశస్యతే ॥
భావానురక్తా రసికా భోగ్యా త్వం భోగినామిహ ।
ద్రవ్యమస్వామికం భోగ్యం సుఖం త్యజతి మందధీః ॥
అవిరోధసుఖత్యాగీ పశురేవ, న సంశయః ।
గచ్ఛ కాంతే గృహం గత్వా కురుతల్పం మనోహరం ॥
రమణీయం చ రహసి వరం రతికరం పరం ।
త్యజ ద్వైధంచ మనసో నిశ్చితం వరవర్ధిని ॥
వరాననే మయసార్థం మోదస్వ వరమందిరే ।
అమూల్యరత్నమాలాంచ మణిరాజవిరాజితాం ॥
భిక్షాం కృత్వాచ దాస్యామి లక్ష్మీవక్షసిశోభితాం ।
మణిం చానంతశిరసః సర్వేషామతి దుర్లభం ॥
దుష్ప్రాప్యం త్రిషులోకేషు తుభ్యం దాస్యామి సుందరి ।
మణిరత్నం కౌస్తుభం చ యో నారాయణ వక్షసి ॥
భిక్షాం కృత్వా తు దాస్యామి కృత్వా నారాయణ వ్రతం ।
చంద్రశేఖర మౌళేశ్చ యద్వాఢ్యం చంద్రభూషణం ॥
జరామృత్యువ్యాధిహరం శక్తం క్రీడాకరం వరం ।
అతీవ విశ్వదుష్ప్రాప్యం విశ్వవంద్యంచ సుందరం ॥
విశ్వనాథవ్రతం కృత్వా తుభ్యం దాస్యామి నిశ్చితం ।
దాస్యామితే శ్రీసూర్యస్య మణిశ్రేష్ఠం స్యమంతకం ॥
భక్త్యా సూర్యవ్రతం కృత్వా త్రిషులోకేషు దుర్లభం ।
అష్టౌభారాన్ సువర్ణంచ యశ్చ నిత్యం ప్రసూయతీ ॥
జరామృత్యుహరం చైవ పరం క్రీడాకరం ప్రియే ।
అమూల్యరత్ననిర్మాణం పాత్రరత్నం మనోహరం ॥
సంతతం మధుపూర్ణంచ దాస్యామి మదనస్యచ ।
అమూల్యరత్ననిర్మాణం పాత్రరత్నం మనోహరం ॥
నానాచిత్రవిచిత్రాఢ్యం నిర్మాణ మీశ్వరేచ్ఛయా ।
నిర్మలం మండలాకారం మణిరాజ విరాజితం ॥
హస్తలక్ష పరిమితం చతురస్రంచ సుందరి ।
పద్మా పద్మాసనం శ్రేష్ఠం ప్రేష్ఠం తస్యాః సుదుర్లభం ॥
ధ్రువం తుభ్యం ప్రదాస్యామి కృత్వా పద్మాలయావ్రతం ।
ఇత్యేవముక్త్వా నహుషః కృత్వా వర్త్మనిరోధనం ॥
పునఃపపాత చరణే మహేంద్రాణ్యా ముహుర్ముహః ।
నృపస్యవచనం శ్రుత్వా శుష్కకంఠోష్ఠ తాలుకా తమువాచ మహేంద్రాణీ స్మారం స్మారం గురుం హరిం ॥
అనేక జన్మల పుణ్యం వల్ల కోరిన స్వర్గానికివచ్చాను. ఇంకేమి నాకు, నీ దర్శనము ఏదో ఒక పుణ్యం వల్ల లభించింది. (91) ఇది కర్మస్థలము కాదు. స్వర్గము భోగస్థలమే. భోగస్థలమందు భోగవస్తువును వదలటం ప్రశస్తముకాదు. (92) ఇక్కడ భోగులకు నీవు, భావానురక్తురాలివి, (మనోవికారం) రసికురాలివి, అనుభవించతగినదానివి. యజమాని లేని ద్రవ్యమును అనుభవించుట, సుఖకరము. తెలివి తక్కువవాడు దాన్ని వదులుతాడు. (93) విరోధం లేని సుఖాన్ని వదిలేవాడు పశువే, అనుమానం లేదు. వెళ్ళు, ఓ కాంత! (కోరతగినది) ఇంటికి వెళ్ళి మనోహరమైన పడకను ఏర్పాటు చేయి (94) రమణీయమైనది, రహస్యంతో ఉండేది, శ్రేష్ఠమైనది, మిక్కిలి రతిని కూర్చేది అట్టి పడకను ఏర్పరచు. మనస్సుయందు ద్వైధీభావాన్ని (ఔనా కాదా అన్నట్లు) వధులు, నిశ్చయము, ఓవరవర్షిని (మంచిరూపం) (95) ఓ వరానన! నాతోపాటు, వరమైన మందిరమందు ఆనందించు శ్రేష్టమైన మణులతో వెలిగిపోయే అమూల్యమైన రత్నమాలను (96) లక్ష్మి వక్షః స్థలమందు ప్రకాశించే దానిని యాచించి నీకిస్తాను. అందరికి అతిదుర్లభమైన, అనంతుని శిరస్సు యందలి మణిని (97) ముల్లోకములలో లభించని దానిని ఓ సుందరి! నీకిస్తాను. నారాయణుని వక్షః స్థలమందు ఉన్న కౌస్తుభ మణిరత్నమును (98) నారాయణ వ్రతము చేసి, ఆతనిని యాచించి, నీకిస్తాను. చంద్రశేఖరమౌళి యొక్క సంపన్నమైన చంద్రభూషణమును (99)ముసలితనము, మృత్యువు, వ్యాధి వీనిని హరించేదానిని, సమర్థమైన దానిని, ఆనందం కల్గించేదానిని, ప్రియమైన దానిని, మిక్కిలిగా విశ్వమందు కష్టసాధ్యమైన దానిని (లభించని) విశ్వములతో నమస్కరించతగిన దానిని, సుందరమైన దానిని (100) విశ్వనాథ వ్రతముచేసి, సంపాదించి నీకిస్తాను. నిశ్చయము. శ్రీసూర్యుని యొక్క మణులలో శ్రేష్ఠమైన శ్యమంతకమణిని, నీకిస్తాను. (101) భక్తితో సూర్యవ్రతం చేసి, ముల్లోకములలో దుర్లభమైన దానిని, ప్రతినిత్యం ఎనిమిది భారముల (2 వేల పలములు, 1 భారము) బంగారం ఇచ్చేదాన్ని (పుట్టించేది) 102) జర, మృత్యువులను హరించేది, శ్రేష్టమైనది. ఆనందాన్నిచ్చేది, అలాంటిదాన్ని ఓ ప్రియా! నీకిస్తాను. అమూల్యరత్నములతో నిర్మింపబడిన, మనోహరమైన, శ్రేష్ఠమైన పాత్రను (103) ఎప్పుడూ మధువుతో నిండిన దానిని, మన్మథునికి చెందిన దానిని, నీకిస్తాను. అమూల్యమైన రత్నములతో నిర్మించబడిన దానిని, తేజస్సులో సూర్యునితో సమానమైన దానిని (104) రకరకాలైన చిత్రవిచిత్రములు కలదానిని, ఈశ్వరేచ్ఛతో నిర్మింపబడిన దానిని నిర్మలమైనది, మండలము (వర్తులము)గా ఉండేది, శ్రేష్ఠమైన మణులతో ప్రకాశించేది (105) లక్ష చేతుల పరిమితి గలది (కొలత), చదరంగా ఉండేది, అట్టి శ్రేష్ఠమైన చాలా ఇష్టమైన, దుర్లభమైన (లక్ష్మి యొక్క) పద్మయొక్క పద్మాసనమును, ఓ సుందరి! (106) పద్మాలయ వ్రతమును చేసి, సంపాదించి తప్పకుండా నీకిస్తాను. అని ఇట్లా పలికి నహుషుడు, ఆమె మార్గాన్ని అడ్డగించి (107) తిరిగి మాటి మాటికి మహేంద్రాణి యొక్క పాదములందు పడ్డాడు. రాజు మాటలు విని, కంఠము, పెదవులు, తాలువులు ఎండిపోగా (తడారిపోగా) గురువైన హరిని మాటి మాటికి స్మరిస్తూ, మహేంద్రాణి ఆతనితో ఇట్లా అంది (108)
మూII శచ్యువాచ :
అచేతనస్య మూఢస్య కార్యాకార్య మజానతః ॥
శ్రోష్యామ్యద్య కతివిధాం కథాం కామాతురస్యచ ।
మధుమత్తః సురామత్తః కామమత్తో విచేతనః ॥
మృత్యుం న గణయేత్కామీ కామేన హృతమానసః ।
త్యజమామద్య హేమత్త మాతృతుల్యాం రజస్వలాం ।
ఋతోః ప్రథమో దివసో హ్యద్య నృప మే ధ్రువం ।
ప్రథమే దివసే స్త్రీచ చాండాలీ సా రజస్వలా ॥
ద్వితీయేదివసే మ్లేచ్ఛా తృతీయే రజకీ తథా ।
శుద్ధా భర్త శ్చతుర్ధేఽహ్ని నశుద్ధా దైవ పైత్ర్యయోః ।
అసచ్ఛూద్రాసమా సాచ తద్దినే చ పరంప్రతి ।
ప్రథమే దివసే కాంతాంయో హి గచ్ఛేద్రజస్వలాం ॥
బ్రహ్మహత్యా చతుర్థాంశం లభతే నాత్ర సంశయః ।
సపుమా న్న హి కర్మార్హో దైవేపిత్ర్యేచ కర్మణి ।
అధమః సచ సర్వేషాం నిందితశ్చాయశస్కరః ।
ద్వితీయే దివ సేనారీం యో ప్రజేచ్చ రజస్వలాం ॥
కామతః పరిపూర్ణశ్చ గోహత్యాం లభతే ధ్రువం ।
ఆజీవనం నాధికారీ పితృవిప్రసురార్చనే ॥
అమనుష్యోఽయశస్యః స్యాదిత్యాంగిరసభాషితం ।
తృతీయ దివసే జాయాం యోహిగచ్ఛేద్రజస్వలాం ॥
సమూడో భ్రూణహత్యాంచలభతేనాత్ర సంశయః ।
పూర్వవత్సతితః సోఽపి నచార్హః సర్వకర్మసు ॥
అసచ్ఛూద్రా చతుర్ధేఽహ్ని నగచ్ఛేత్తాం విచక్షణః ।
యది మాం మాతరం మూఢ గ్రహీష్యసి బలేనచ ॥
ఋతావతీతే దివసే గమనంచ కరిష్యసి ।
శచ్యాశ్చ వచనం శ్రుత్వా ప్రహస్య నహుషస్తథా ॥
అను!! శచీదేవి ఇట్లా అంది । అచేతనుడు, మూడుడు, ఏది చేయాలో, ఏది చేయకూడదో తెలియనివాడు (109) కామాతురుడు ఐన వాని కథ ఎన్ని విధములుగా ఉంటుందో ఈవేళ వినబోతున్నాను (వినిపించ). మధువుచే మత్తుడు, (ఇప్పసార), సురాపాన మత్తుడు, కామముచే మత్తుడు, విచేతనుడు (110) (వీరు) కామంతో ఆవరించబడిన మనస్సుగల కామి మృత్యువును లెక్కింపరు. ఓ మత్తుడ ! నేను తల్లిలాంటిదాన్ని రజస్వలను, నన్ను ఈ వేళ విడిచి పెట్టు (111) ఓ రాజ! ఈవేళ నాకు ఋతువు (ముట్టు)లో తొలిదివసము, నిశ్చయము. ముట్టులో తొలిరోజున స్త్రీ చాండాలి అనబడుతుంది. (112) రెండవరోజున మ్లేచ్ఛ, అట్లానే మూడవ రోజున రజక (చాకలిది). నాల్గవ రోజున భర్తకొరకైతే శుద్ధమైనది. దైవపితృ కార్యములందు శుద్ధురాలు (113) కాదు. ఆమె ఆరోజున పరము కొరకైతే అసచ్చూద్రురాలితో సమానమైనది. రజస్వలయైన కాంతను తొలిరోజున పొందినవాడు (114) బ్రహ్మహత్యలో నాల్గవ భాగమును పొందుతాడు. ఇందులో అనుమానం లేదు. వాడు (ఆపురుషుడు) దైవ, పితృకర్మలందు కర్మారుడుకాడు. (115) వాడు అందరికన్నా అధముడు, నిందితుడు, అపకీర్తి కరుడు. రెండవరోజు రజస్వల స్త్రీని పొందినవాడు (116) కామంతో పరిపూర్ణుడైతే గోహత్యాపాపమును పొందుతాడు నిశ్చయము. (బ్రతికినంత కాలం పితృ, విప్ర, సురల, అర్చన యందు అధికారి కాడు (117) వీడు మనిషికాడు, అపకీర్తి గల వాడు ఔతాడు అని అంగీరసుని వచనము. రజస్వలమైన భార్యను తృతీయదివసమందు ఎవడు పొందుతాడో (118) మూడుడు భ్రూణ హత్యాపాపాన్ని పొందుతాడు, ఇందులో అనుమానం లేదు. ముందు వానివలె వాడు కూడా పతితుడే. అన్ని కర్మలలోను అరుడు కాడు (119) నాల్గవరోజున ఆ స్త్రీ అసచ్ఛూద్ర. విచక్షుణుడు ఆమెను పొందరాదు. ఓ మూడుడ! తల్లిలాంటి దానినైన నన్ను బలవంతంగా పొందదలిస్తే (120) ఋతుదివసములుగడిచాక పొందాలనుకుంటే (తగదు. తల్లిని అని). శచి, వచనమును విని, నవ్వి అట్లా నహుషుడు (121)
మూ॥ ఉవాచ మధురం శాంతః శక్రకాంతాంచ సువ్రతాం ।
దేవపత్నీ సదాశుద్ధా తన్న్యూనం మానవంప్రతి ॥
శయనే భోజనే దేవీ నాశుద్ధా మానవం ప్రతి ।
రజస్వలాయాః సంభోగే కర్మక్షేత్రేచ భారతే ॥
త్వయోక్తం చ భవేత్సాపం నాత్ర దుర్గేచ సుందరి ।
కర్మక్షేతేఽపి తత్కర్మ యద్వేదోక్తం శుభాశుభం ॥
న భవేద్వైష్ణవానాంచ జ్వలతాం బ్రహ్మతేజసా ।
యథా ప్రదీప్తే వహ్నౌచ శుష్కానిచ తృణానిచ ॥
భవంతి భస్మీభూతాని తథా పాపాని వైష్ణవే ।
వహ్ని సూర్యబ్రాహ్మణేభ్య: తేజీయాన్వైష్ణవః సదా ॥
రక్షితో విష్ణుచక్రేణ స్వతంత్రో మత్తకుంజరః ।
న విచారో న భోగశ్చ వైష్ణవానాం స్వకర్మణాం ॥
లిఖితం సామ్ని కౌథుమ్యాం కురు ప్రశ్నం బృహస్పతిం ।
అస్మాంశ్చ సర్వేజానంతి చంద్రవంశ్యాంశ్చ వైష్ణవాన్ ॥
దేవమన్యం న సేవంతే చంద్రవంశ్యా హరించినా ।
సద్వంశ ప్రభవోయోహి బ్రాహ్మణః క్షత్రియోఽథవా ॥
విష్ణు మంత్రం నగృహ్ణాతి వంచితో దేవమాయయా ।
కోవా మంత్రశ్చకే దేవా నహి శాస్తా యమో మమ ॥
సర్వాన్ శాస్తుం సమర్థోఽహం బ్రహ్మవిష్ణు శివాన్వినా ।
శయ్యాంకురు గృహం గత్వా శీఘ్రం యాస్యామి తే గృహం॥
ఋతుపాపం మయిభవేత్తవ కిం గచ్ఛ శోభనే ।
ఇత్యుక్త్వా నహుషో రాజాప్రపుల్లవదనేక్షణః ॥
రత్నయానం సమారుహ్య యయౌ నందనకాననం ।
న యయౌ సా శచీ గేహం ప్రజాగామ గురోర్గృహం ॥
గత్వా కుశాసనస్థంచ దదర్శచ బృహస్పతిం ।
తారా సేవిత పాదాబ్జం జ్వలంతం బ్రహ్మతేజసా ॥
జపమాలాకరం శశ్వజ్ఞపంతం కృష్ణమీప్సితం ।
పరమం పరమానందం పరమాత్మాన మీశ్వరం ॥
నిర్గుణంచ నిరీహంచ స్వతంత్రం ప్రకృతేః పరం ।
స్వేచ్చామయం పరంబ్రహ్మ భక్తానుగ్రహవిగ్రహం ॥
తమానందా శ్రునేత్రంచ నమామ శిరసా భువి ।
రుదతీ సాశ్రు నేత్రాచ మజ్జంతీ భక్తిసాగరే ॥
శోకార్ణవే నిమజ్జంతీ హృదయేనవిదూయతా ।
తుష్టావ భీతా స్వగురుం బ్రహ్మిష్ఠంచ కృపానిధిం ॥
సువ్రతముకల శక్రకాంతను గూర్చి, మధురముగా, శాంతముగల నహుషుడు ఇట్లన్నాడు. దేవపత్ని ఎప్పుడూ శుద్ధురాలు. నీవు చెప్పినది అది తక్కువయైన మానవకాంత గూర్చి (122) మానవునకు, దేవత (స్త్రీ) శయనమందు, భోజనమందును అపరిశుద్ధురాలుకాదు. కర్మక్షేత్రమైన భారతదేశమందు, రజస్వలను సంభోగిస్తే (123) నీవు చెప్పిన పాపం కల్గుతుంది. ఓ సుందరి! ఈదుర్గమందు కాదు వేదోక్తమైన ఆ శుభ అశుభకర్మలు కూడా కర్మక్షేత్రమందు (124) బ్రహ్మతేజస్సుతో వెలిగిపోయే వైష్ణవులకు కాదు. అగ్నిమండుతూ ఉంటే ఎండిన గడ్డిపోచలు (125) భస్మమైనట్లుగా వైష్ణువుని యందు పాపములు భస్మమౌతాయి. వైష్ణవుడు ఎల్లప్పుడు అగ్ని, సూర్యుడు, బ్రాహ్మణుడు వీరికన్న తేజస్వంతుడు (126) విష్ణుచక్రంతో రక్షింపబడుతూ ఉన్నస్వతంత్రమైన మదించిన ఏనుగు. వైష్ణవులకు, తమ కర్మలను గూర్చిన విచారము లేదు. అనుభవము లేదు (127) సామవేద మందు కౌథుమియందు చెప్పబడింది, బృహస్పతిని అడుగు. చంద్రవంశ్యులమైన వైష్ణవులుగా మమ్ములను అందరు తెలుసుకొని ఉన్నారు (128) చంద్రవంశపు వారు హరిని తప్ప మరోదేవుని సేవించరు. సద్వంశమందు పుట్టిన బ్రాహ్మణుడుకాని, క్షత్రియుడు కాని (129) దేవమాయతో వంచింపబడి విష్ణుమంత్రమును గ్రహింపడు. మంత్రమేమిటి? దేవతలెవరు? యముడు మమ్ములను శాసించేవాడు కాదు (130) బ్రహ్మ విష్ణువులను తప్ప అందరిని శాసించుటకు సమర్ధుణ్ణనేను. ఇంటికివెళ్ళి శయ్యను ఏర్పరచు. త్వరగా నీ ఇంటికి వస్తాను (131) ఋతుగమనం వల్ల కలిగే పాపం ఏదైనా ఉంటే అదినన్నే పొందుతుంది. నీకేమిటి, ఓ శోభన! వెళ్ళు. అని పలికి రాజు నహుషుడు ముఖము, చూపులు వికసించగా (132) రత్నముల పల్లకిని ఎక్కి నందనకాననమునకు వెళ్ళాడు. ఆశచి ఇంటికి వెళ్ళలేదు. గురువు (బృహస్పతి) ఇంటికి వెళ్ళింది (133) వెళ్ళి కుశాసనమందు కూర్చున్న బృహస్పతిని చూచింది. తార ఆతని పాద కమలములను సేవిస్తోంది. ఆతడు బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నాడు (134) చేతిలో జపమాల ఉంది.ఎప్పుడైన తనకిష్టమైన కృష్ణుని జపిస్తున్నాడు. పరమమైన, పరమానంద స్వరూపుడైన, ఈశ్వరుడైన పరమాత్మను జపిస్తున్నాడు. (135) నిర్గుణుడు, నిరీహుడు, స్వతంత్రుడు, ప్రకృతికన్నపరుడు, స్వేచ్ఛామయుడు, పరమైన బ్రహ్మ భక్తులననుగ్రహించే కొరకు రూపమెత్తినవాడు అట్టి కృష్ణుని జపిస్తూ (136) ఉన్న, ఆనందాశ్రువులు నిండిన కనులుగల గురువును భూమి పై తలుంచి నమస్కరించింది. ఆమె ఏడుస్తోంది. నేత్రములందు కన్నీళ్ళున్నాయి. భక్తి సాగరంలో మునిగిఉంది (137) దుఃఖసముద్రంలో మునుగుతూ హృదయంలో తనను తాను నిందించుకుంటూ (పరితపిస్తూ), భయంతో బ్రహ్మిష్ణుడు, కృపానిధియైన తన గురువును స్తుతించింది. (138)
మూ॥ శచ్యువాచ:
రక్షరక్ష మహాభాగ మాం భీతాం శరణాగతాం ।
త్వమీశ్వరః స్వదాసీంచ నిమగ్నాం శోకసాగరే ॥
అనీశ్వరశ్చేశ్వరోవా బలవాన్వా సుదుర్బలః ।
స్వశిష్యభార్యాం పుత్రాంశ్చ శాసితుంచ సదా క్షమః ॥
దూరీభూతః స్వరాజ్యాచ్చ స్వశిష్యశ్చ కృతస్త్వయా ।
శాంతిర్బభూవ దోషస్య చాధునా నిగ్రహం కురు ॥
అనాధాం సర్వశూన్యాం మాం శూన్యాంతాం అమరావతీం ।
సంపచ్ఛూన్య మాశ్రమం మే పశ్యరక్ష కృపానిధే ।
దస్యగ్రస్తాం చ మాం రక్ష దేశం కింకర మానయ ।
దత్వా చరణ రేణూంస్తం శుభాశీర్వచనం కురు ॥
సర్వేషాంచ గురూణాంచ జన్మదాతా పరోగురుః ।
పితుః శతగుణా మాతా పూజ్యా వంద్యా గరీయసీ॥
విద్యాదాతా మంత్రదాతా జ్ఞానదో హరిభక్తిదః ।
పూజ్యో వంద్యశ్చ సేవ్యశ్చ మాతుః శతగుణో గురుః ॥
మంత్రాద్యుద్ధిరణేనైవ గురురిత్యుచ్యతే బుధైః ।
అన్యో వంద్యో గురురయ మన్యశ్చారోపితోగురుః ॥
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా ।
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవేనమః ॥
అదీక్షితస్య మూర్ఖస్య నిష్కృతి ర్నాస్తి నిశ్చితం ।
సర్వకర్మస్వనర్హస్య నరకే తత్వశోః స్థితిః ॥
జన్మదాతాఽన్నదాతాచ మతాఽన్యే గురవస్తథా ।
పారం కర్తుం నశక్తాస్తే ఘోరసంసారసాగరే ॥
విద్యామంత్ర జ్ఞానదాతా నిపుణః పారకర్మణి ।
సశక్తః శిష్యముద్ధర్తు మీశ్వరశ్చేశ్వరాత్పరః ॥
గురుర్విష్ణుః గురుర్బ్రహ్మా గురుర్దేవో మహేశ్వరః ।
గురుర్ధర్మో గురుఃశేషః సర్వాత్మా నిర్గుణోగురుః ॥
సర్వతీర్థాశ్రమశ్చైవ సర్వాదేవాశ్రయో గురుః ।
సర్వదేవస్వరూపశ్చ గురురూపీ హరిః స్వయం ॥
అభీష్టదేవే రుషేచ గురుః శక్తి హి రక్షితుం ।
గురౌ రుష్టేఽభీష్ట దేవో నహి శక్తశ్చ రక్షితుం ॥
సర్వే గ్రహాశ్చయం రుష్టారుష్టాశ్చ దేవబ్రాహ్మణాః ।
త్వమేవరుష్టో భవసి గురురేవహి దేవతాః ॥
న గురోశ్చ ప్రియశ్చిత్మా న గురోశ్చ ప్రియః సుతః ।
ధనం ప్రియంచన గురోఃనచ భార్యాప్రియాతథా ॥
న గురోశ్చ ప్రియో ధర్మోన గురోశ్చ ప్రియంతపః ।
న గురోశ్చ ప్రియం సత్యం న పుణ్యం చగురోః పరం ॥
గురోః ప న శాస్తాచ నహి బంధు: గురోఃపరః ।
దేవోరాజాచ శాస్తాచ శిష్యాణాంచ సదా గురుః ॥
యావచ్ఛక్తి దాతుమన్నం తావచ్ఛాస్తా తమన్నదః ।
గురుః శాస్తాచ శిష్యాణాం ప్రతి జన్మని జన్మని ॥
అను!! శచి ఇట్లా అంది - ఓ మహాభాగ! భీతురాలిని, శరణాగతురాలిని ఐన నన్ను రక్షించు రక్షించు. నీవు శక్తిమంతుడివి. శోకసాగరమందు మునిగిన నీదాసినైన, నన్ను రక్షించు (139) ఈశ్వరుడు లేని వాడైనా, ఈశ్వరుడు కలవాడైనా, బలవంతుడైనా మిక్కిలి దుర్బలుడైనా (గురువు), తన శిష్యుని భార్యను, పుత్రులను శాసించుటకు, ఎల్లప్పుడు యుక్తమైనవాడే (140) నీవు, నీ శిష్యుని తన రాజ్యమునుండి దూరమయ్యేట్టు చేశావు. దోషశాంతి ఉంది. ఇప్పుడు మేర (హద్దు) కల్పించు (141) అనాధను సర్వశూన్యను ఐన నన్ను, శూన్యమైన ఆ అమరావతిని, సంపదలతో శూన్యమైన నా ఆశ్రమాన్ని చూడు. ఓ కృపానిధి! రక్షించు (142) శత్రువుతో గ్రహించబడే నన్ను రక్షించు. ఈదేశమునకు నీకింకరుని తీసుకురా. ఆతనికి నీ చరణ రేణువులను ఇచ్చి, ఆతనికి శుభ ఆశీర్వచనములిమ్ము (143) అందరిగురువులకన్న జన్మనిచ్చినవాడు పరుడైన గురువు. తండ్రికన్న నూరురెట్లెక్కువ తల్లి. ఆమె పూజించతగింది, నమస్కరించ తగింది, గొప్పది (ప్రధానము), (144) విద్యనిచ్చువాడు, మంత్రమునిచ్చువాడు, సేవ్యుడు, తల్లికన్న నూరురెట్లు ఎక్కువ గురువు (145) మంత్రము మొదలగువానిని చెప్పడం వల్లనే గురువని చెప్పబడతాడు, బుధులచే, నమస్కరించతగిన ఈ గురువు వేరు. ఆరోపింపబడిన గురువు మరొక్కడు (146) అజ్ఞానమను చీకటితో గుడ్డిమైన వానికి జ్ఞానమనే కాటుకపుల్లతో కళ్ళు తెరిపించేవాడు, అలాంటి ఈ గురువునకు నమస్కారము (147) దీక్షితుడుకాని వానికి మూరునకు నిష్కృతిలేదు, నిశ్చయము. అన్ని కర్మలలోను అనరుడైన వానికి ఆ పశువునకు నరకమందు ఉనికి (148) జన్మదాత, అన్నదాత, అట్లాగే ఇతరమైన గురువులు ఉన్నారని తెలుసు. ఘోరమైన సంసార సాగరము నుండి దాటించుటకు వారంతా సమర్థులుకారు (149) విద్య, మంత్ర, జ్ఞానములనిచ్చేవాడు దాటించుటలో, నిఫుణుడు. అతడు శిష్యుని ఉద్ధరించుటకు సమర్థుడు. ఈశ్వరుడు.ఈశ్వరునికన్న పరమైనవాడు (150) గురువు విష్ణువు, గురువు బ్రహ్మ గురువు దేవుడు, మహేశ్వరుడు. గురువు ధర్మము, గురువు శేషుడు, నిర్గుణుడైన (గుణాతీతుడైన) గురువు అన్ని ఆత్మలలో ఉండేవాడు (151) సర్వతీర్థములకు ఆశ్రయుడు, సర్వదేవతలకు ఆశ్రయుడు గురువు. సర్వదేవతల స్వరూపుడు, గురు రూపంలో ఉన్న స్వయంగా హరి ఆతడు (152) ఇష్టదైవం కోపగిస్తే రక్షించుటకు గురువు సమర్థుడు. గురువుకోపగిస్తే అభీష్టదైవం రక్షించ సమర్థుడు కాడు (153) ఎవని పై గ్రహములన్ని కోపగించాయో, దేవబ్రాహ్మణులు కోపగించారో అవినీవే కోపగించినట్టు. గురువే దేవతలు కదా (154) గురువుకన్న ఆత్మ ప్రియమైందికాదు. గురువుకన్న సుతుడు ప్రియమైన వాడుకాడు. గురువుకన్న ధనము ప్రియమైనది కాదు అట్లాగే ప్రియమైన భార్యకూడా గురువుకన్న ప్రియమైనదికాదు (155) గురువుకన్న ధర్మము ప్రియము కాదు, తపము ప్రియము కాదు. సత్యము ప్రేమ పాత్రమైనది కాదు. గురువుకన్న పరమైన పుణ్యములేదు (156) గురువుకన్న మరో శాసకుడు లేడు, గురువుకన్న పరమైన బంధువులేడు. దేవుడు, రాజు, శాసకుడు ఇవన్నీ శిష్యులకు గురువే ఎల్లప్పుడు (157) అన్నం పెట్టటానికి ఎంతకాలం శక్తి ఉంటుందో, అంతకాలమే అన్నం పెట్టేవాడు, వాడిని (తినేవాడిని) శాసించగలడు. కాని, ప్రతిజన్మలోను శిష్యులకు గురువు శాసకుడు ఔతాడు.
మూII మంత్రో విద్యా గురుర్దేవః పూర్వలబ్ధో యథాపతిః ।
ప్రతిజన్మని బంధేన సర్వేషాముపరిస్థితః ।
పితాగురుశ్చవంద్యశ్చ యత్ర జన్మని జన్మదః ।
గురవోఽన్యే తథా మాతా గురుశ్చ ప్రతిజన్మని ॥
విప్రాణాం త్వం వరిష్ఠశ్చ గరిష్ఠశ్చ తపస్వినాం ।
బ్రహ్మిష్టో బ్రహ్మవిద్ర్బహ్మన్ ధర్మిష్ఠః సర్వధర్మిణాం ॥
తుష్టో భవ మునిశ్రేష్ఠ మాంచశక్రంచ సాంప్రతం ।
త్వయి తుష్టే సదా తుష్టా భవంతి గ్రహ దేవతాః ॥
ఇత్యుక్త్వా సా శచీబ్రహ్మన్ పునరుచ్చైరురోద హ ।
దృష్ట్వాతద్రోదనం తారా దురోదోచైర్ముహుర్ముహు: ॥
పపాత చరణే తారా దురోదచ పునః పునః ।
అపరాధం క్షమేత్యుక్త్వా గురుస్తుష్టోఽప్యువాచ తాం ॥
గురు రువాచ :
ఉత్తిష్ఠ తారే శచ్యాశ్చ సర్వం భద్రం భవిష్యతి ।
సద్యఃప్రాప్స్యతి భర్తారం మ హేంద్రంచ మదాశిషా ॥
ఇత్యుక్త్వా స గురుస్తత్ర విరరామచ నారద ।
పపాత చరణేతారా పునరేవరురోధ చ ॥
గృహీత్వాచ శచీం తారా సంస్థాప్యచ స్వవక్షసి ।
బోధయామాస వివిధ మాధ్యాత్మకమనుత్తమం ॥
శచీకృతం గురుస్తోత్రం పూజాకాలేచ యః పఠేత్ ।
గురుశ్చాభీష్ట దేవశ్చ సంతుష్టః ప్రతి జన్మని ॥
గ్రహదేవద్విజాస్తంచ పరితుష్టాశ్చ సంతతం ।
రాజానో బాంధవాశ్చైవ సంతుష్టాః సర్వతః సదా ॥
గురుభక్తిం విష్ణుభక్తిం వాంఛితం లభతే ధ్రువం ।
సదా హర్షో భవేత్తస్య నచ శోకః కదాచన ॥
పుత్రార్థీ లభతే పుత్రం భార్యార్థీ లలభతే ప్రియాం ।
సుస్వరూపాం గుణవతీం సతీం పుత్రవతీం ధ్రువం ॥
రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బంధనాత్ ।
అస్పష్టకీర్తి: సుయశాః మూరో భవతి పండితః ॥
కదాచిద్బంధువిచ్ఛేదో న భవేత్తస్య నిశ్చితం ।
నిత్యం తద్వర్ధతే ధర్మో, విపులం నిర్మలం యశః ॥
లభతే పరమైశ్వర్యం పుత్రపౌత్ర ధనాన్వితం ।
ఇహ సర్వసుఖం భుక్త్వా ప్రాప్యతే శ్రీహరేః పదం ॥
నభవేత్త త్పునర్జన్మ హరిదాస్యం లభేద్ధ్రువం ।
విష్ణుభక్తిరసాబౌచ నిమగ్నశ్చ భవేద్ధ్రువం ॥
శశ్వతిబతి శాంతశ్చ విష్ణుభక్తిరసామృతం ।
జన్మమృత్యుజరావ్యాధి శోకసంతాప నాశనం ॥
పలు ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే మ హేంద్ర దర్పభంగ ప్రకరణేశచీ కాపనోదనే శచీకృత గురుస్తోత్ర కథనం నామేకోన షష్టితమోఽధ్యాయః॥
భర్త ఎట్లా పూర్వజన్మననుసరించి లభిస్తాడో అట్లాగే మంత్రము, విద్య, గురువు, దైవములభిస్తారు. అన్ని జన్మలలో బంధనంగా అందరికన్నా పైన ఉన్నాడు (159) ఏ జన్మలో జన్మనిస్తాడో ఆ తండ్రి గురువు, నమస్కరింప తగినవాడు. ఇతర గురువులు అట్లాగే. తల్లి ప్రతి జన్మలోనూ గురువే (160) విప్రులలో నీవు శ్రేష్ఠుడవు, తపస్సులలో గొప్పవాడివి. ఓ బ్రహ్మన్! బ్రహ్మజ్ఞానం కలవారిలో బ్రహ్మనెరిగినవాడివి (161) మునిశ్రేష్ఠ! ఆనందించు నన్ను, ఇంద్రుని ఇప్పుడు ఆనందింపజేయి. నీవు ఆనందిస్తే, ఎల్లప్పుడు గ్రహదేవతలు సంతుష్టులౌతారు. (162) ఓ బ్రహ్మన్! ఆ శచీదేవి ఇట్లా పలికి, తిరిగి పెద్దగా ఏడ్చింది. ఆ ఏడ్పును చూచి తారకూడా మాటిమాటికి పెద్దగా ఏడ్చింది (163) తార, పాదముల పై పడింది, మాటిమాటికి ఏడ్చింది. నా అపరాధాన్ని క్షమించు, అని పడింది. గురువు ఆనందపడి ఆమెతో ఇట్లన్నాడు (164) గురు విట్లా ఓ తారా! లే. శచికి అంతా మంచే జరుగుతుంది. నా ఆశీస్సులతో, మ హేంద్రుని తన భర్తను, వెంటనే పొందుతుంది (165) అని పలికి ఆ గురువు విరమించాడు, ఓ నారద. తార, చరణములందు పడింది, తిరిగి ఏడ్చింది కూడా (166) శచిని, తార పట్టుకొని తన రొమ్ము యందు ఉంచుకొని, ఉత్తమమైన, అనేకరకాలైన ఆధ్యాత్మ విషయములను బోధించింది (167) పూజాకాలమందు, శచిచేసిన గురుస్తోత్రాన్ని చదివిన వారికి గురువు, అభీష్టదైవము ప్రతిజన్మలో సంతుష్టుడౌతాడు (168) గ్రహ, దేవ, ద్విజులు, సంతోషించి, ఆతనిని, ఎల్లప్పుడు అనుగ్రహిస్తారు. రాజులు బంధువులు సంతుష్టులై ఎల్లప్పుడు అన్ని విధముల సహకరిస్తారు (169) గురుభక్తిని విష్ణుభక్తిని, వాంఛితమును పొందుతారు, నిశ్చయము. ఆతనికెప్పుడూ ఆనందమే ఉంటుంది. ఎప్పుడూ దుఃఖముండదు (170) పుత్రులను కోరేవాడు పుత్రుని, భార్యను కోరేవాడు ప్రేమను పొందుతారు. మంచి రూపము గల, గుణవంతురాలైన పుత్రులను పొందే సతిని పొందుతారు, నిశ్చయము (171) రోగంతో బాధపడేవాడు రోగవిముక్తుడౌతాడు, బంధితుడు బంధనమునుండి ముక్తుడౌతాడు. అరకొరగా కీర్తికలవాడు మంచి కీర్తిని పొందుతాడు. మూర్ఖుడు పండితుడౌతాడు (172) ఆతనికెప్పుడూ బంధువిచ్ఛేదము కలుగదు, నిశ్చయము. ధర్మము రోజూ పెరుగుతుంది అతనికి, విపులము, నిర్మలమైన యశములభిస్తుంది (173) పుత్రపౌత్ర ధనములతో కూడిన పరమైశ్వర్యమును పొందుతాడు. ఇక్కడ అన్ని సుఖాలు అనుభవించి శ్రీహరిస్థానాన్ని పొందుతాడు (174) ఆతనికి పునర్జన్మలేదు నిశ్చయంగా హరిదాస్యము లభిస్తుంది. విష్ణుభక్తి రసాళిలో మునిగిపోతాడు, నిశ్చయము. (175) విష్ణుభక్తి రసామృతమును ఎల్లప్పుడు తాగుతాడు, శాంతుడుగా ఉంటాడు జన్మమృత్యుజరా, వ్యాధి, శోక, సంతాపములను నశింపచేసేది ఈ స్తోత్రము (176) అని శ్రీబ్రహ్మవైవర్తమందు మహాపురాణమందు శ్రీకృష్ణు జన్మ ఖండమందు, ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాద మందు ఇంద్రుని దర్పభంగమనే ప్రకరణమందు శచీదేవి శోకమును తొలగించే దానియందు శచిచేసిన గురుస్తోత్రమును చెప్పుట అనునది ఏబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము. (59)
Summary of chapter 59 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Fulfilling the inevitable decree of time and cosmic destiny that required the departure of the Yādava dynasty from earth, the young Yādava princes playfully dressed the noble youth Jambavatī's son Samba in female garments and brought him before the visiting sages Vasishṭha, Nārada, and Vishvāmitra, mocking them and asking if the pregnant woman would give birth to a boy or a girl. Recognizing the prank through their mystic vision, the enraged sages cursed the princes, declaring that the boy would give birth to a magical iron mace that would completely annihilate the entire Yādava clan.