నారద ఉవాచ - నారదుడిట్లనెను :
ద్వాదశీలంఘనే దోషః శ్రుతన్యన్ముఖతో మునే ।
పరాభవే మునేశ్చైవ నృపత్రాణం హరేరహో ॥
అధునా శ్రోతుమిచ్ఛామి సర్వేషామీప్పితం చ మే ।
ఏకాదశీ వ్రతస్యాస్య విధానం వద నిశ్చితం ॥
అహో శ్రుతో శ్రుతం కించిన్మత భేదాన్న నిశ్చితం।
ప్రతీసారి కారణముఖాచ్ఛోతుం కౌతూహలం మమ ॥
ఓ నారాయణ మహర్షీ! ద్వాదశి తిధిలో సకాలమున పారణము (ఉపవాసానంతర భోజనము) చేయక ఉల్లంఘించుట వలన కలుగు దోషమును నీద్వారా విన్నాను, దుర్వాసమునికి జరిగిన అవమానము శ్రీహరి రాజును రక్షించుట అన్నవి వింటిని. ఆశ్చర్యము. ఇప్పుడు నాకు అందరి కోరికలు తీర్చు ఏకాదశీ వ్రతము చేయు విధానమును వివరించి చెప్పుము. వేదము ద్వారా కొంతవిని తెలిసికొన్నను మతభేదమును బట్టి (భిన్నభిన్నములుగా తెలియ వచ్చినందున ఇది యిట్లని దృఢము కాలేదు. ఇప్పుడు శ్రుతులకు మూలమైన నీ వలన వినుటకు కుతూహలముతో (ఆనకీ) ఉన్నాను.
నారాయణ ఉవాచ - సారాయణ మహర్షి పలికెను :
ఏకాదశీవ్రతమిదం దేవానామపి దుర్లభం।
శ్రీకృష్ణప్రీతి జనకం తపః శ్రేష్ఠం తపస్వినాం ॥
దేవానాం చ యధా కృష్ణో దేవీం ప్రకృతిర్యథా ।
ఆశ్రమాణాం యధా విప్రో వైష్ణవానాం యధా శివః॥
యథా గణేశః పూజ్యానాం యథా వాణీ విపశ్చితాం ।
శాస్త్రాణాం చ యథా వేదాన్తర్ధానాం జాహ్నవీ యథా ॥
తేజసానాం యధా స్వర్ణం ప్రాణినాం వైష్ణవే యథా ।
ధనానాం చ యథా విద్యా సంగీనాం చ యథా ప్రియా ॥
ప్రమధానాం యథా రుద్రః శ్రేయసాం చ యథా మతిః ।
ఆత్మా యథేంద్రియాణాం చ చంచలానాం యథా మనః ॥
గురు స్త్రీణాం యథా మాతో బంధూనాం చ యథా పతిః ।
బలిషానాం యథా దైవం కొలః కలయతాం యథా ॥
సుశీలం చైవ మిత్రాణాం శత్రూణాం రుగ్యథా మునే।
యధా కీర్తి: కీర్తిమతాం గృహిణాం చ యథా గృహం ॥
యథా ఖలో హింసకానాం దుష్టానాం చైవ పుంశ్చలీ ।
తేజస్వినాం గ్రహేశశ్చ సహిష్ణనాం యథా క్షితిః ॥
యథాఽమృతం భక్షణానాం దాహకానాం యథా నలః ।
యధా శ్రీర్ధనదాతృణాం సతీనాం చ యథా సతీ ॥
ప్రజేశానాం యథా బ్రహ్మా సరితాం సాగరో యథా ।
యధా సాము ప్రతీనాం చ గాయత్రీ ఛందసాం యథా ॥
వృక్షాణాం చ యధోని శ్వత్థః పుష్పాణాం తులసీ యథా ।
యథా మార్గో ఏ మాసానామృతూనాం చ యథా మధుః ॥
ఆదిత్యానాం యథా నూర్యో రుద్రాణాం శంకరో యథా ।
యథా భీష్మ వసూనాం చ వర్షాణాం భారతం యథా ॥
దేవరీణాం యథా త్వం చ బ్రహ్మరీణాం యథాభృగుః ।
నృపాణాంచ యథారామః సిద్ధానాం కపిలో యథా ॥
యథా సనత్కుమారశ్చ యోగినాం జ్ఞానినాం వరః ।
ఐరావతో గజేంద్రాణాం పూనాం శరభో యధా ॥
యథా హిమాద్రిః శైలానాం మణీనాం కౌస్తుభ యథా ।
సరస్వతీ నదీనాం చ యథా పుణ్య స్వరూపిణీ ॥
గంధర్వానాం చిత్రరథో యథా శ్రేష్ఠశ్చ నారద।
యథా కుబేరో యక్షాణాం సుమాలీ రక్షసాం యథా ॥
యథా శ్రేషాచ నారీణాం శతరూపా వరానరా ।
మనూనాం చ యథా శ్రేష్ఠః స్వయం స్వాయంభువే మనుః ॥
సుందరీణాం యథా రంభా యథా మాయా చ మయినాం ।
ఏకాదశీవ్రతమిదం ప్రతానాం చ వరం తథా ॥
శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రమైన ఈ ఏకాదశీ వ్రతము తపస్విజనులకు శ్రేష్ఠమైన తపస్సు. దేవతలకు దుర్లభమైనదీ సుమా. దేవ గణములలో శ్రీకృష్ణుని వలె, దేవీ గణములో మూల ప్రకృతి వలె, వస్త్రములలో బ్రాహ్మణుని వలె, విష్ణు భక్తులలో పరమ శివుని వలె, పూజ్యులలో ప్రథమపూజ్యుడగు గణేశుని వలె, విద్యావంతులలో సరస్వతి వలె, శాస్త్రములలో వేదముల వలె, పుణ్యతీర్థములలో గంగానదీ వలె, తేజస్సు గల ద్రవ్యములలో బంగారము వలె, జీవులలో వైష్ణవుని వలె, ధనములలో విద్య వలె, సంగము కలవారిలో భార్య వలే, ప్రమధులలో రుద్రుని వలె, శ్రేయము గూర్చు వారిలో మతి (ముందూహించు బుద్ధి) వలె, ఇంద్రియములలో ఆత్మ వలే, చంచల పదార్థములలో మనస్సు వలె, గౌరవించదగిన స్త్రీలలో తల్లి వలె, బంధువులలో భర్తవలె, శత్రువులలో రోగము వలె, కీర్తి గలవారిలో కీర్తి వలె, గృహస్థులలో గృహము వలె, హింసించువారిలో క్రూరుని వలె, దుష్టస్త్రీలలో జారిణి వలె, తేజోవంతులలో గ్రహరాజు (సూర్యుడు) వలె, ఇతరుల దోషమును సహించుకొనువారిలో భూదేవి వలె, తిను పదార్థములలో అమృతము వలె, కాల్పువారిలో అగ్నివలె, ధనమిచ్చువారిలో లక్ష్మిదేవి వలె, స్త్రీలలో పతివ్రత వలె, ప్రజాపతులలో బ్రహ్మ వలె, జలస్థానములలో సాగరము వలె, వేదములలో సామము వలె, మంత్రములలో గాయత్రి వలె, వృక్షములో అశ్వత(రావి) వృక్షము వలె, పుష్పములలో తులసీదళము వలె, మాసములలో మార్గశిరము వలె, ఋతువులలో వసంతము వలె, ఆదిత్యులలో అదితి సంతానము) సూర్యుని వలె, రుద్రులలో శంకరుని వలె, వసువులలో భీష్ముని వలె; వర్షము(భూభాగము) లలో భారతవర్షము వలె, దేవర్షులలో నీ వలె, (నారదుడు) బ్రహ్మరులలో భృగువు వలె, నృపులలో శ్రీరాముని వలె, సీదులలో కపిలుని వలె, జ్ఞానయోగులలో శ్రేష్ఠుడైన సనత్కుమారునీ వలె, గజేంద్రములలో ఐరావతము వలె, మృగములలో శరభము వలె, శైలములలో హిమాద్రి వలె, మణులలో కౌస్తుభము వలె, నదులలో పుణ్య స్వరూపిణి ఐన సరస్వతీనది వలె, గంధర్వులలోచిత్రరధుని వలె, యక్షులలో కుబేరుని వలె, రాక్షసులలో సుమాలి వలె, స్త్రీజాతి మొత్తములో శ్రేష్ఠురాలైన శతరూపాదేవి వలె, మనువులలో స్వాయంభువ మనువు వలె, సుందర స్త్రీలలో రంభవలె, మాయా విద్యలు గలవారిలో విష్ణుమాయ వలె, ఓ నారదమహర్షి ప్రతములలో ఏకాదశీవ్రతము మిక్కిలీ ఉత్తమము శ్రేష్ఠమునైనది.
కర్తవ్యం చ చతుర్ణానాం వర్ణానాం నిత్యమేవ చ ।
యతీనాం వైష్ణవానాం చ బ్రాహ్మణానాం విశేషతః ॥
నాల్గు వర్ణముల వారికిది ఆచరింపదగినది. విశేషించి యతీశ్వరులకు విష్ణుభక్తులకు బ్రాహ్మణులకు తప్పక ఆచరణీయము సుమా.
నత్యం సర్వాణి పాపాని బ్రహ్మహత్యాదికాని చ ।
సంత్యేవౌదనమాశ్రిత్య శ్రీకృష్ణప్రతవాసరే॥
భుక్వైతాని చ పాపాని యో భుంక్తే తత్ర మందధీః ।
ఇహాథిపాతకీ స్కోపి యాత్యంతే నరకం ధృవం॥
ఏకాదశీ ప్రమాణాని యుగసంఖ్యాకృతాని చ ।
కుంభీపాకే మహారే స్థిత్వా చాండాలతాం వ్రజేత్ ॥
గలిత వ్యాధి యుక్తశ్చ తతః సప్తసు జన్మసు ।
పశ్చాన్ముక్తో భవేత్సపాదిత్యాహ కమలోద్భవః ॥
సత్యముగా బ్రహ్మహత్యాది సమస్త పాపములు ఏకాదశీదినమునాడు అన్నమునాశ్రయించి యుండును. ఏ మందబుద్ధి ఆ రోజున అన్నము తినునో వాడు పాపములనే భుజించును కనుక అతిపాపియైనవాడు అంత్యమున నరకము పొందుట నిశ్చయము. ఆనాడు ఏకాదశీ ఎన్నిగడియలుండునో అన్ని యుగములు వాడు మహాఘోరమైన కుంభీపాక నరకములో ఉండి చండాలుడుగా భూమి పైన జన్మించును. ఆ తరువాత ఏడు జన్మలు గొంతువ్యాధితో బాధలు పడి పాపము నుండి అప్పటికి విముక్తుడగునని బ్రహ్మచెప్పెను.
ఇత్యేవం కథితం బ్రహ్మన్ యో దోషస్తత్ర భోజనే।
ద్వాదశీలంఘనే దోషో మయోక్తశ్చ శ్రుతః పురా॥
ఓ బ్రాహ్మణా! ఏకాదశినాడు భుజించినందువలన ఏ దోషము కల్గునో అది ఇట్లు చెప్పితిని. ద్వాదశి పారణ సతిక్రమించిన దోషము పూర్వమే చెప్పగా వింటివి.
దశమీ లంఘనే దోషం నిబోధ కథయామి తే।
పురా శ్రుతో ధర్మవక్రాద్వేదసారోధృతోఽపి చ ॥
దశమీం యః కలామాత్రాం మూడో జ్ఞానేన లంఘయేత్ ।
యాతి శ్రీస్తధృహాత్తూర్ణం శాపం దత్త్యా తు దారుణం ॥
ఇహ తద్వంశ హానిశ్చ యశోహానిర్భవేధ్రావం ।
అంతే మన్వంతర శతనంధకూపే వసేద్ ద్విజ ॥
పూర్వము ధర్మఋషి (నరనారాయణుల గన్నతండ్రి) వేదసారమునుద్ధరించి తానుగా దేనిని. నాకు చెప్పెనో దానిని దశమి నుల్లంఘించుట వలన (ఆనాటి కృత్యము పాటింపనందున) కలుగు దోషమును నీకు చెప్పెద వినుము. ఉదయకాలమున కళామాత్రముగా దశమి ఉన్న దినమును ఏ మూడుడు అజ్ఞానముతో (ఆనాడు శాస్త్రము విధించిన నియమము పాటింపక, ఉల్లంఘించునో అతనికి లక్ష్మీదేవి క్రూరమైన శాపమిచ్చి ఆ గృహము నుండి వెంటనే వెళ్లిపోవును. ఈ లోకమున హనికి వంశహాని కీర్తిహాని సంభవించుట నిశ్చయము. మరణానంతరము వాడు సూరు మన్వంతరముల కాలము అంధకూపనరకమున వసించును.
దశమ్యేకాదశీవాది ద్వాదశీ యత్ర వానరే ।
తత్ర భుక్త్యా పరదినే ఉపోష్య ప్రతమాచరేడ్॥
ద్వాదశ్యాం చ వ్రతం కృత్వా త్రయోదశ్యాం తు పారణం ।
ద్వాదశీలంఘనే దోషో ప్రతినాం తవ్న విద్యతే ॥
ఏనాడు (ఏదినమందు) దశమి ఏకాదశి మరియు ద్వాదశి (ఒక సూర్యోదయము నుండి మరునాడు సూర్యోదయము వరకు మూడు తిథులు) ఉండునో ఆ స్థితిలో ఆనాడు భుజించి మరునాడు ద్వాదశీ తిథినాడు) ఏకాదశ్యుపవాసవ్రత మాచరించవలెను. ఆ పరిస్థితిలో ద్వాదశినాడు ఏకాదశీవ్రతమాచరించి తరువాతి త్రయోదశినాడు పారణము చేయవలెను. ఇట్లు చేయుట వలన ద్వాదశినాడు పారణము చేయక ఉల్లంఘించిన దోషము వ్రతమాచరించు వారికి లేదు. (అనగా దశమీతో కూడిన ఏకాదశినాడుపవసించరాదని భావము).
సంపూర్ణైకాదశీ యత్ర ప్రభాతే కించిదేవ సా ।
తత్రోపోష్యా ద్వితీయా చ పరా చేద్యది వర్ధతే ॥
ఒక దినము సంపూర్ణముగా ఏకాదశి తిథి యుండి మరునాడు ప్రభాతకాలమున కొద్దిగా ఏకాదశితిథి ఉన్నచో రెండవ నాడే ఉపవసించవలెను. ఐతే తరువాతి ద్వాదశి వృద్ధిలో ఉండవలెను. అనగా ఉపవాసము దినము తరువాతీనాడు ద్వాదశి తిథి ఉండవలెను.
షష్టి దండాత్మికా యత్ర ప్రభాతే చ తిథిత్రయం।
కుర్వంతి గృహిణః పూర్వం చైవ యత్యాదయస్తథా ॥
అరువది గడియల కాలపరిమాణములో (ఒక సూర్యోదయము నుండి మరియొక సూర్యోదయము వరకు) తిథిత్రయము ఏర్పడినచో (దశమీ ఏకాదశీ ద్వాదశి తిథులు ఉన్నచో) ఏ ప్రభాత కాలమున ద్వాదశి కలదో దానికన్న ముందు దినమే గృహస్థులును యతీశ్వరులు - మొదలైన వారును ఉపవసించవలెను.
పరత్రానశనం కృత్వా నిత్యకృత్యం సమాచరేత్।
ప్రతే జాగరణం సర్వం పూర్వతైవాచరేద్బుధః॥
తరువాతి దీనము కూడ (ఏకాదశీ వృద్ధిలో) ఉపవసించవలెను. లేనిచో నిత్యకృత్యము వ్రతమందలీ జాగరణము మొదలైనవి అన్ని బుధుడు పూర్వదినము నందే ఆచరించవలెను.
తత్పూర్వ దివసే నిత్యం ప్రతే కృత్వా పరేహనీ ।
ఏకాదశ్యాం వ్యతీతాయాం పారణం తు సమాచరేత్॥
పూర్వదినమందే ఉపవాస వ్రతమైనప్పుడు అది ఆచరించి తరువాతి దినము నందు ఏకాదశి గడచిపోగా ద్వాదశితిథిలో పారణము చేయవలెను.
వైష్ణవానాం యతీనాం చ విధవానాం తధైవ చ ।
సర్వాః సమా ఉద్యోష్యాస్తా శిక్షూణాం బ్రహ్మచారిణం॥
విష్ణుభక్తులు యతులు విధవాస్త్రీలు సన్యాసులు బ్రహ్మచారులు అన్ని ఏకాదశులలో ఉపవాసము చేయవలెను. (శుక్షకృష్ణ పక్షముల భేదము వీరికి లేదు!
శుక్లామేవ తు కుర్వంతి గృహిణో వైష్ణవేతరాః।
న కృష్ణాలంఘనే దోషస్తేషాం వేదేషు నారద ॥
ఓ నారదా! వైష్ణవులు కానట్టే గృహస్థులు శుక్లపక్షమందలి ఏకాదశీ ఉపవాసమునే చేయుచున్నారు. కృష్ణపక్ష ఏకాదశిని ఉల్లంఘించినందున (ఉపవాసము చేయనందుని వేదములలో వారికి దోషము లేదని చెప్పబడినది.
శయనీ బోధనీమధ్యే యాకృష్ఠికాదశీ భవేత్ ।
సైనోసోష్యా గృహస్థిన నాన్యా కృష్ణా కదాచన॥
ఇత్యేవం కధితో బ్రహ్మన్నిర్ణయాయం శ్రుతౌ శ్రుతః ।
గృహస్తుడు (37 శ్లోకమునందలి వాడు కాక ఇతరుడు) శయనైకాదశి నుండి బోధనైకాదశి వరకు ఆ నడుమ వచ్చు అన్ని కృష్ణవక్ష ఏకాదశులలో మాత్రమే ఉపవాస వ్రతము చేయవలెను. ఇతరములైన కృష్ణపక్ష ఏకాదశులలో చేయరాదు. ఓ బ్రాహ్మణా! వేదముల ద్వారా వినవచ్చిన ఈ ఏకాదశ్యుపవాస నిర్ణయము నీకు చెప్పితిని. (ఆషాఢ శుక్ల ఏకాదశి శయనైకాదశి. కార్తీక శుక్ల ఏకాదశినీ బోధన (ఉత్థాన) ఏకాదశి అందురు. ఈ రెంటి నడుము వచ్చు కృషైకాదశులు అనగా ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజమాసములలో వచ్చు కృష్ణపక్ష ఏకాదశులలో సాధారణులు కూడ అన్ని ఏకాదశుల వలె ఉపవాస వ్రతమాచరించవలెనని భావము).
ప్రతస్యాస్య విధానం చ నిబోధ కథయామి తే ॥
ఇక ఈ వ్రతమాచరించు విధానము నీకు చెప్పుదును వినుము.
కృత్వా హవిష్యం పూర్వాహ్ణే న చ భుంక్తే పునర్థలం।
ఏకాకీ కుశ శయ్యాయాం నక్తం శయనమాచరేత్ ॥
బ్రాహ్మీ ముహూర్తే చోత్థాయ ప్రాతః కృత్యం విధాయ చ ।
నిత్యకృత్యం విధాయాధ తతః స్నానం సమాచరేత్ ॥
ప్రజోపవాసం నంకల్ప్య శ్రీకృష్ణ ప్రీతిపూర్వకం ।
కృత్వా నంధ్యాం తర్పణం చ విధాయాహ్నికమాచరేత్ ॥
నీత్యపూజాం దినే కృత్వా ప్రత ద్రవ్యం సమాహరేత్ ।
కృత్వా షోడశోపచారం ప్రదృష్టం వీధిబోధితం ॥
ఆసనం వసనం పాద్యమర్యం పుష్పానులేపనం ।
ధూపం దీపం చ నైవేద్యం యజ్ఞసూత్రం చ భూషణం ॥
గంధం స్నానీయ తాంబూలే మధుపర్కం వునర్జలం ।
ఏతాన్యాహృత్య దివసే వ్రతం నక్తం నమాచరేత్॥
దశమినాడు మధ్యాహ్నమునకు ముందే హవిష్యము (బియ్యము కడుగకుండ పప్పు శాకములు కలిపిన బియ్యమునకే చోట ఉడికించి నైవేద్యము పెట్టిన అన్నము) భుజించి ఇక ఆనాడు రాత్రికి మంచినీరు కూడ త్రాగక దుర్భలపై ఒక్కడే పడుకోవలెను. మరునాడు బ్రాహ్మీ ముహూర్త కాలములో (సూర్యోదయము కన్న ఐదు గడియల ముందు) నిద్ర లేచి ప్రాతఃకృత్యము (దేహవిధులైన, మలమూత్ర విసర్జనలు దంతధావనము} లాచరించి స్నానము చేయవలెను. ఏకాదశీవ్రతోపవాసము చేయుదునని శ్రీకృష్ణప్రీత్యర్థము సంకల్పించి సంధ్యావందనము దేవ ఋషి పితృతర్పణములు జపహోమాదులు ఆహ్నికవిధులు {నిత్యకృత్యములు - నిత్యకర్మ) ఆచరించవలెను. తన ఇష్టదైవము యొక్క నిత్యపూజను చేసి ఒక ప్రతమునకు కావలసిన ద్రవ్యమును సంపాదించవలెను. షోడశోపచార పూజకు తగినట్లు ఆయనపీఠము అలంకరించు వస్త్రము అర్ఘ్యపాద్యములకు తగిన సుగంధజలము పుష్పములు మంచి గంధము ధూపమునకు ఊదుమొదలైన పొగ దినుసులు. దీపము యజ్ఞోపవీతము భూషణములు నైవేద్య పదార్థము స్నానజలము (అభిషేకమునకు) మధుపర్కము పానీయజలము ఇట్టి వాటిని పగలు సమకూర్చుకొని ఆ రాత్రి ప్రతమాచరించవలెను.
ఉపవీశ్యాననే పూతో ధృత్వా ధౌతేయవాససీ ।
ఆచమ్య శ్రీహరి నవ్వో స్వస్తివాచనమాచరేత్ ॥
ఆరోష్య మంగల ఘటం ధాన్యాధారే శుభే క్షణే ।
ఫల శాఖాచందనాక్తం వేదోక్తం మునిభిర్ముదా॥
దేవషట్కం సమావాహ్య పృథగ్గాన్యేః సమాచరేత్।
పూజాం పంచోపచారైశ్చ ప్రకృషిశు విచక్షణః॥
గణేశ్వరం దీనకరం వహ్నిం విష్ణుం శివం శివాం ।
సంపూజ్యేతాన్ ప్రణమ్యాథ వ్రతం కుర్యాద్ధరిం స్మరన్॥
నారాధ్య దేవషట్కం చ యది కర్మ నమాచరేత్ ।
నిత్యం నైమిత్తికం చొపీ తత్సర్వం నిష్ఫలం భవేత్ ॥
ఇత్యేవం కథితం సర్వం ప్రతాంగ భూతమేవ చ ।
కణ్వశాభోక్త మిష్టం చ ప్రతం శ్రుణు మహామునే ॥
సాయంత్రము స్నానసంధ్యలు చేసి పవిత్రుడై ధౌత వస్త్రములు ధరించి ఆసనమందు కూర్చుండి ఆచమనమొనర్చి శ్రీహరికి నమస్కరించి స్వస్తివాచనము చేయవలెను. శుభముహూర్తములో ధాన్యపీఠము మీద చందనము పూసి మామిడాకులు టెంకాయతో కూడిన మంగళ కలశమునుంచవలెను. మంత్రవేత్తలతో కూడి వేదోక్త రీతిలో ఇతర ధాన్యపీఠముల మీద గణేశుని, సూర్యుని, అగ్నిని, విష్ణువును, శివుని, పార్వతిని ఆవాహన చేసి (ఆర్గురు దేవతలను) ప్రశస్తముగా గంధపుష్ప ధూపదీప నైవేద్యములనెడి పంచోపచారములతో వారిని పూజించి నమస్కరించి ఆ తరువాత వారిని స్మరించుచు వ్రతము చేయవలెను. ఈ ఆర్గురు దేవతలను పూజించకుండ ప్రతకర్మ చేసినచో నిత్యనైమిత్తిక కర్మలన్నియు నిష్ఫలమై పోవును. ఓ మహామునీ! నీకిట్లు కణ్వ శాఖలో చెప్పబడిన ఏకాదశీవ్రతమునకంగభూతమైన దానిని మొత్తము చెప్పితిని. ఇక ఇష్టమైన ఏకాదశీ వ్రత (విధానము) మును వినుము.
సామవేదోక్త ధ్యానేన ధ్యాత్వా కృష్ణం పరాత్పరం।
పుష్పం చ శిరసి న్యస్య పునర్ధ్యానం నమాచరేత్ ॥
ధ్యానం శ్రుణు నిగూఢం చ సర్వేషామపి వాంఛితం ।
న ప్రకాశ్యమభక్తాయ భక్తప్రాణాధికం వరం ॥
శ్రీకృష్ణ పరమాత్మను సామవేదమునందు చెప్పబడిన ధ్యానముతో ధ్యానించి శిరస్పున (కలశముపై - విగ్రహము పై) పుష్పముంచీ మరల ధ్యానించవలెను. అందరికి వాంఛితమైన రహస్యమైన ధ్యానమును చెప్పుదును వినుము. ఇది భక్తులకు తమ ప్రాణముల కంటే శ్రేష్ఠమైనది. భక్తుడు కానీ వానికిది తెలుపరాదు.
నవీన నీరదో యద్వచ్ఛ్యామ సుందర విగ్రహం ।
శరత్ళార్వణ చంద్రాభం వినింద్యాన్య మనుత్తమం ॥
శరతూర్యోదయాబ్దానాం ప్రభామోచనలోచనం ।
స్వాంగ సౌందర్య శోభాభీ రత్నభూషణ భూషితం ॥
గోపీలోచన కో ణైశ్చ ప్రసన్నై రతి సూచకైః ।
శశ్వన్నిరీక్ష్యమాణం తత్రాణిరివ వినిర్మితం ॥
రాసమండల మధ్యస్థం రాసోల్లాస సముత్సుకం ।
రాధావక్ర శరచ్చంద్ర నుధాపాన చకోరకం ॥
వానకారులోనీ కొత్త మేఘము వలే శ్యామసుందరమైన ఆకారము గలవాడును, శరదృతువులోని పున్నమ చంద్రుని కాంతిని తిరస్కరించు పవిత్రమైన ముఖమండలము గలవాడును, శరదృతువులో సూర్యోదయ కాలమందలి పద్మముల కాంతినీ దొంగిలించిన కన్నులు గలవాడును, తన అవయవ సౌందర్యశోభలతో ధరించిన రత్నాభరణములకే అలంకారముగా నున్నవాడును, ప్రసన్నములు ప్రేమసూచకములు ఐన గోపికల యొక్క ప్రక్క చూపులతో మాటి మాటికీ చూడబడువాడును, వారి ప్రాణముల చేత నిర్మింపబడినట్లున్న వాడును, రాసమండల మధ్యభాగమున నీలచి రాసక్రీడా వీహారమునందు త్వరగలవాడును, రాధాదేవి ముఖమనెడి శరత్కాలచంద్రునిలోని అమృతమును పానము చేయుచున్న చకోర పక్షియును.
కౌస్తుభేన మణీంద్రేణ వక్షఃస్థల సముజ్జ్వలం।
పారిజాత ప్రసూనానాం మాలాజాలైర్విరాజితం ॥
సద్రత్న సారనిర్మాణం కీరీటోజ్వలశేఖరం ।
వినోదమురలీ న్యస్తహస్తం పూజ్యం సురాసురైః ॥
ధ్యానాసాధ్యం దురారాధ్యం బ్రహ్మాదీనాం చ వందితం।
కారణం కారణానాం దుస్తమీశ్వరమహంభజే ॥
కౌస్తుభమను మణి రాజముతో ప్రకాశించు వక్షసులము గలవాడును, పారిజాత పుష్పముల మాలలతో అలంకరింపబడినవాడును, ఉత్తమ రత్నములతో నిర్మితమైన కిరీట మలంకరించిన శిరస్సు గలపోడును, వినోదముగా మురళి చేత బట్టినవాడును, సురాసురులచేత పూజింపబడువాడును, ధ్యాసమున కందనివాడును ఆరాధింప శక్యము గాని వాడును, బ్రహ్మాది దేవతల చేత నమస్కరింపబడువాడును సృష్టికి మూలమైన అన్నిటికి తానే మూలమైన వాడును ఎవడో ఆ పరమేశ్వరుని నేను భుజించుచున్నాను.
ధ్యాత్యా నేన తనవాహ్య చోపహారాణి షోడశ ।
దత్వా సంపూజయేద్భక్త్యా మంత్రైరేభిశ్చ నారద॥
ఓ నారదా! ఈ ధ్యాన శ్లోక సమూహముతో ధ్యానించి అతనినావాహన చేసి పదహారు ఉపహారములు (షోడశోపచారములు) సమర్పించి ఈ (క్రింది) మంత్రములతో భక్తితో పూజించవలెను.
ఆసనం స్వర్ణనిర్మాణం రత్నసార పరిచ్ఛదం ।
నానాచిత్రవిచిత్రాడ్యం గృహ్యతాం వరమేశ్వర ॥
ఓ పరమేశ్వరా! స్వర్ణముతో నిర్మించబడినదియు, శ్రేష్ఠమైన రత్నములతో అలంకరింపబడినదియు, వివిధములైన చిత్ర విచిత్ర శిల్పములు గలదియు నైన ఈ ఆసన పీఠమును స్వీకరించుము. (దీని పై కూర్చుండుము దీనిని పీఠముగా గ్రహింపుము).
వహ్ని ప్రక్షాలితం వస్త్రం నిర్మితం విశ్వకర్మణా।
మూల్యా నిర్వచనీయం చ గృహ్యతాం రాధికాపతే ॥
ఓ రాధానాథా! విశ్వకర్మచేత నిర్మించబడినదియును, వెలకట్టరానిదియును, అగ్నిచేత పవిత్రము చేయబడినదియు ఐన ఈ దీవ్యవస్త్రమును స్వీకరింపుము.
పాద ప్రక్షాళనార్హం చ నువqపాత్ర నంస్థితం ।
సువాసితం శీతలం చ గృహ్యతాం కరుణానిధే ॥
ఓ కరుణానిధీ! సుగంధ ద్రవ్యము కలుపుట వలన పరిమళము గలదియు, చల్లగానున్నదియు బంగారు పాత్రలోనున్నట్టిది, పొద ప్రక్షాళనకు యోగ్యమైనది అగు ఈ జలమును స్వీకరింతువు గాక.
ఇడ మర్త్యం పవిత్రం చ శంఖతీయ సమన్వితం।
వుషదూర్వాచందనాక్తం గృహ్యతాం భక్తవత్సల ॥
భర్శలయందు వాత్సల్యము గల స్వామి! పుష్పములు గరికపోచలు శ్రీగంధముతో కూడి, శంఖగర్భజలము చేర్చిన పవిత్రమైన ఈ జలమును నీ హస్త ప్రక్షాళనకు స్వీకరించుము.
సువాసితం శుక్లపు ష్పం చందనాగురు సంయుతం ।
సద్యస్తే ప్రీతి జనకం గృహ్యతాం సర్వకారణ ॥
చరాచర సమస్త ప్రపంచమునకు మూలమైన స్వామీ! చందనము అగురు ద్రవ్యములతో కూడి పరిమళవంతముగా చేయబడిన నీకు వెంటనే ప్రీతిని కూర్చునట్టి ఈ తెల్లని పుష్పమును గ్రహింతువు గాక.
చండనాగురు కస్తూరీ కుంకుమోశీరముత్తమం ।
సర్వేసితమిదం కృష్ణ గృహ్యతామనులేపనం॥
ఓ శ్రీకృష్ణా! చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వు వటవేళ్ల చూర్ణములు కూర్చిన అన్నిటికన్న కోరదగిన ఈ అను లేపము. (శరీరమునకు పులుముకొనెడి గంధము)ను స్వీకరింతువు గౌక.
రసో వృక్ష విశేషస్య నానాద్రవ్య సమన్వితః ।
సుగంధియుక్తః సుఖదో ధూపో యం ప్రతిగృహ్యతాం ॥
ఒక విశేష వృక్షము యొక్క జిగురునై ఇతర ద్రవ్యములను కూర్చుట వలన మంచి వాసనగలదిగా నుండీ సుఖము నిచ్చునట్టి ఈ ధూపమును (చూర్ణమును అగ్ని మీద వేయుట వలన ఏర్పడు పొగ) స్వీకరింపుము.
దివానీశం సుప్రదీప్తో రత్నసార వినిర్మితః ।
పునర్దాంత నాశబీజం దీపో యం ప్రతిగృహ్యతాం ॥
శ్రేష్ఠమైన రత్నముల చేత నిర్మితమై రాత్రింబగళ్లు బాగా వెల్డించబడినదై మరల సంసారమను అంధకారమేర్పడకుండ దానిని నాశము చేయు బీజము (విత్తనము) వంటి ఈ దీపమును స్వీకరింపుము.
నానా విధానిద్రవ్యాణి స్వాదూని సురభీజీ చ।
చోష్యాదీనీ పవిత్రాణి స్వాత్మారామ ప్రగృహ్యతాం ॥
ఓ ఆత్మారాముడా! ఆత్మల యందు ఆనందరూపమున వెలువాడు) రుచి గలవీయు సువాసనతో కూడినవియు పవిత్రములు ఐన నానావిధ భోజన ద్రవ్యములు పుడిసిటబట్టి జుర్రేడు పానీయము (చోష్యము) మొదలుగా గల వానిని స్వీకరింపుము.
సావిత్రగ్రంథి సంయుక్తం స్వర్ణతంతు వినిర్మితం।
గృహ్యతాం దేవదేవేశ రచితం చారుకారుణా॥
ఓ దేవదేవేశా! మంచి పనితనము గల వ్యక్తి చేత బంగారు దారముతో నిర్మించబడిన సావిత్రీ గ్రంథి గల (బ్రహ్మముడి అని వ్యవహారము) యజ్ఞోపవీతమును స్వీకరింపుము.
అమూల్యరత్నరచితం సర్వావయవ భూషణం ।
త్విషా జాజ్వల్యమానం చ గృహ్యతాం నంద నందన ॥
అమూల్య రత్నముల చేత నిర్మించబడి గొప్ప తేజస్సుతో ప్రకాశించుచున్న సర్వాయవములకు అంకరించుకోదగిన ఆభరణములను ఓ నందనందనా స్వీకరింతువు గాక.
ప్రధానో వర్ణనీయశ్చ సర్వమంగల కర్మణి ।
ప్రగృహ్యతాం దీనబంధో గంధోయం మంగల ప్రదః॥
ఓ దీనబంధూ! సర్వశుభకర్మలయందు ముఖ్యముగా చెప్పబడునట్టి మంగళకరమైన ఈ గంధమును స్వీకరింతువు గాక.
ధాత్రీ శ్రీఫల పత్రోత్థం విష్ణుతైలం మనోహరం ।
వాంఛితం సర్వలోకానాం భగవన్ ప్రతిగృహం॥
ఓ భగవానుడా! ఉసిరీక మారేడు పత్రముల నుండి సిద్ధము చేయబడి విష్ణు తైలమను పేర మనోహరమై పరిమళము గలిగి సర్వప్రాణులు కోరదగినట్టి ఈ సుగంధ తైలమును స్వీకరింతువుగాక.
వాంఛనీయం చ సర్వేషాం కర్పూరాది సువాసితం ।
మయా నివేదితం నాథ తాంబూలం ప్రతిగృహ్యతాం ॥
ఓ నాధా! పచ్చకర్పూరము మొదలగు ద్రవ్యముల చేత పరిమళించునదియు అందరు జీవులకు కోరదగినదియు ఐన నాచేత సమర్పింపబడుచున్న ఈ తాంబూలమును స్వీకరింతువు గాక.
సర్వేషాం ప్రీతిజనకం సుమీష్టం మధురం మధు ।
సద్రత్నసార పాత్రస్థం గోపీకాంత ప్రగృహ్యతాం ॥
ఓ గోపికా మనోహరా! సర్వజీవులకు ప్రీతి కళించునదియు, శుభ్రపరుపబడినదియు రత్నసార పాత్రలో నున్నదియు అగు మధురమైన తేనెను స్వీకరింతువు గాక.
నిర్మలం జాహ్నవీతోయం సుపవిత్రం సువాసితం ।
పునరాచమనీయం చ గృహ్యతాం మధుసూదన ॥
ఓ మధుసూదనా! మిక్కిలి పవిత్రమైన స్వచ్ఛమైన గంగాజలము సువాసన ద్రవ్యములు చేర్చి పరిమళము గలది ఐన ఆచమనీయమును (పుక్కిలించి ఉమియు జలము) పూజాంతమున మరల స్వీకరింతువు గాక.
ఇతిషోడశోపచారాన్ దత్త్వా భక్తో ముదాన్వితః ।
మంత్రేణానేన పుష్పాణి మాల్యం దత్త్వా ప్రయత్నతః॥
నానాప్రకార పుష్పైశ్చ గ్రధితం శక్తతంతునా।
ప్రవరం భూషణానాం చ మాల్యం చ గృహ్యతాం ప్రభో ॥
భక్తుడు సంతోషముతో ఇట్లు షోడశోపచారములు సమర్పించి శ్రద్ధతో ఈ క్రింది మంత్రముతో (నానా ప్రకారపు మైశ్చ) పుష్పములను మాలలను అర్పించవలెను. “ఓ ప్రభూ! నానావిధములైన పుష్పములను తెల్లని దారమున కూర్చబడిన అలంకారములలో శ్రేష్ఠమైన ఈ మాలను స్వీకరించుము”.
ఇతి పుష్పాంజలిం దద్యాన్మూల మంత్రేణ చ ప్రతీ ।
కుర్యాత్తత్ స్తవనం భక్త్యా పుటాంజలియుతః సుధీః ॥
వ్రతమాచరించు విద్వాంసుడు ఇట్లు పుష్పాంజలీని మూలమంత్రమునుచ్చరించుచు సమర్పించవలెను. భక్తితో చేతులను మొగ్గగా జోడించి పట్టుకొని క్రింది విధముగా భగవంతుని స్తవనము (స్తుతి) చేయవలెను.
భక్త ఉవాచ - భక్తుడిట్లు పలికెను (పలుకవలెనని భావము) :
హే కృష్ణ రాధికానాథ కరుణా సాగరప్రభో ।
సంసార సాగరే ఘోరే మాముద్ధర భయానకే ॥
శతజన్మకృతా యాస్యాదుద్విగ్నస్య మమ ప్రభో ।
స్వకర్మ పాశనిగడెర్బర్ధస్య మోక్షణం కురు॥
ప్రణతం పాడవద్మే తే వశ్య మాం శరణాగతం ।
భవపాశ భయాదీతం పాహి త్వం శరణాగతం॥
భక్తిహీనం క్రియాహీనం వీధిహీనం చ వేదతః ।
వసుమంత్రవిహీనం యత్తత్సంపూర్ణం కురు ప్రభో ॥
వేదోక్త విహితాజ్ఞానా త్వాంగ హీనే చ కర్మణి ।
త్వన్నామోచ్చారణేనైవ సర్వం పూర్ణం భవేద్ధరే ॥
ఓ శ్రీకృష్ణా! రాధానాథా! కరుణాసముద్రుడా! ప్రభూ! భయంకరమైన ఘోర సంసారమును సముద్రమున పడీన నన్ను ఉద్ధరింపుము, అనేక జన్మలెత్తుట వలన కల్గిన శ్రమతో మనస్సు చంచలమై కర్మపాశములనెడీ ఇనుప గొలుసుల చేత బంధింపబడి ఉన్న నన్ను వీటినుండి విడిపింపుము. సంసార పాశముల వలన ఏర్పడు ఫలమునకు వెరచి నీ పాదపద్మములందు ప్రణతుడనైన (తలవాల్చి మొక్కిన) శరణాగతుని సన్ను కటాక్షించుము. భక్తిహీనము చేయవలసిన క్రీయా శూన్యము వేదమును బట్టి శాస్త్ర హీనము, ద్రవ్యములు మంత్రములు శూన్యమైన నా పూజ ఏది కలదో దానిని అన్ని నిండుగా గలదానిగా చేయుము స్వామీ! శ్రీహరీ! నేను నీ గురించి చేసిన కర్మ (పూజ) వేదమందు చెప్పబడిన విధానము తెలియనట్టిది భక్తి ద్రవ్యమంత్రములు శూన్యమైనది ఐనను కేవలము నీ నామోచ్చారణము చేతనే సర్వము పూర్ణమగును కదా!
ఇతి స్తుత్వా తం ప్రణమ్య దత్త్వా విప్రాయ దక్షిణాం ।
మహోత్సవం విధాయాథ కుర్యాజ్ఞాగరణం ప్రతీ ॥
కృత్వా ప్రచోపవాసం చ యది నిద్రాం నిషేవతే ।
పునరేవ జలం భుంక్తే ప్రతార్థవల భాగ్భవేత్ ॥
యత్నేన చ హవిష్యాన్నం సకృదేవ సమాచరేత్ ।
మంత్రేణానేన వీపేంద్ర శ్రీకృష్ణ చరణం స్మరన్॥
ఈ విధముగా స్వామిని స్తుతించి నమస్కరించీ బ్రాహ్మణునికి దక్షిణ సమర్పించి మహోత్సవము చేసి (స్తోత్రములు, భజనలు, గానము, నృత్యప్రదర్శనము, మంగళ వాద్యముల మ్రోగించుట మొదలగునవి భగవతీతిగా చేయుట) వ్రతమొనర్చు వ్యక్తి జాగరణము చేయపలెను. ప్రజోపవాసములు చేసి ఒకవేళ నిద్రపోయినను జలపానము చేసినను వ్రతములో సగము ఫలమే లభించును. (ఆహారము స్వీకరింపదగిన నిర్ణీత సమయములో దశమి పగలు ద్వాదశీ ఉదయము) ఓ బ్రాహ్మణా! ఈ మంత్రముతో శ్రీకృష్ణుని స్మరించుచు ప్రయత్నపూర్వకముగా ఒక్కసారి మాత్రమే హవిష్యాన్నము స్వీకరించవలెను.
అన్నం హి ప్రాణినాం ప్రాణా బ్రహ్మణా నిర్మితం పురా।
దేహి మే విష్ణురూపం త్వం ప్రతోవవాసయోః ఫలం ॥
అన్నమే జీవులకు ప్రాణముగా పూర్వము బ్రహ్మచేత నిర్మితమైనది. ఓ ప్రభూ! నీవు విష్ణురూపమైన అన్నమును నాకు ప్రజోపవాసములకు ఫలముగానిమ్ము.
ఏవం యః కురుతే భక్త్యా భారతే ప్రతముత్తమం ।
పూర్వాన్సప్త వరాన్పప్త స్వాత్మానముద్ధరేధ్రువం ॥
మాతరం భ్రాతరం చైవ శ్వశ్రూం చ శ్వశురం సుతాం ।
జామాతరం తథా భృత్యముద్ధరేన్ని శ్చితం నరః ॥
ఇత్యేవం కథితం విప్ర శ్రీకృష్ణచరితవ్రతం ।
సుఖదం మోక్షదం సారమవరం కథయామి తే ॥
ఇట్లు ఎవడు భారతఖండమున భక్తితో ఈ వ్రతమాచరించునో వాడు తనకన్న పూర్వులనేడు తరముల వారినీ తన తరువాతి ఏడు తరముల వారిని తనను కూడ ఉద్ధరించుకొనుట నిశ్చయము. తల్లిని తోడబుట్టిన వానిని అత్త మామలను బిడ్డను అల్లుని సేవకుని గూడ ఆ మానవుడుద్ధరించును. ఇది సత్యము. ఓ నారదా! ఇట్లు ఏకాదశీవ్రతమును గూర్చి చెప్పితిని. సుఖకరము మోక్షప్రదము సారవంతమైన శ్రీకృష్ణ చరితలోని ఇంకొక కథాఘట్టమును చెప్పెదను.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే ఏకాదశీ వ్రత నిరూపణం నామ షడ్వింశోధ్యాయః॥
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన ఏకాదశీ వ్రత నిరూపణమను ఇరువది ఆరవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 26 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
During a joyous game of hide-and-seek in the forests of Vṛndāvana, a powerful demon named Pralamba infiltrated the cowherd boys in disguise, waiting for an opportunity to kidnap Balarāma. Pairing up for a piggyback racing game where the losers carried the winners, Pralamba carried Balarāma on his back and began flying rapidly into the sky. Balarāma increased His divine weight until Pralamba was forced to resume his massive demon form, whereupon Balarāma struck him fiercely on the head with His fist, crushing the demon's skull and liberating his soul before returning joyfully to His friends.