6 - శ్రీకృష్ణస్తోత్ర రాజపఠనము

శ్రీనారాయణ ఉవాచ :

ధ్యాత్వా స్తుత్వా చ తిష్ఠంతో దేవాస్తే తేజసః పుర:।

దదృశుస్తేజసో మధ్యే శరీరం కమనీయకం ॥

సజలాంభోద వర్ణాభం సస్మితం సుమనోహరం ।

పరమాహోదకం రూపం త్రైలోక్య చిత్త మోహనం ॥

గండస్థలకపోలాభ్యాం జ్వలన్మకరకుండలం ।

సద్రత్న నూపురాభ్యాం చ చరణాంభోజరాజితం ॥

వహ్నిశుద్ధ హరిద్రాభామూల్య వస్త్ర విరాజితం ।

మణిరతేంద్ర సారాణాం స్వేచ్చా కౌతుక నిర్మితైః ॥

భూషితం భూషణే రమ్యైస్తద్రూపేణైవ భూషితైః।

వినోదమురళీ యుక్త బింబాధర మనోహరం ॥

ప్రసన్నేక్షేణ పశ్యంతం భక్తానుగ్రహకాతరం।

సద్రత్న గుటికాయుక్త కవచోరః స్థలోజ్జ్వం॥

కౌస్తుభాసక్త సద్రత్న ప్రదీప్త తేజసోజ్జ్వలం ।

నారాయణ ఋషి ఇట్లు పల్కెను :

ఆ దివ్య తేజస్సు ముందు నీలచిన దేవతలిట్లు ధ్యానించి. స్తుతించి ఆ తేజస్సు నడుమ కోరదగిన సుందర రూపమును దర్శించిరి, నీటితో కూడిన మేఘము వన్నెవంట (నీల) వర్ణము గలదియు, మనోహరమైన చిరునవ్వుతో కూడినదియు, మూడు లోకములందలి జీవుల మనస్సులను మోహింపజేయునదియు, పరమానంద కరమైనదియు, రెండు చెంపల మీద వెలుగుచున్న మొసలి ఆకారము గల చెవుల కమ్మలు గలదియు, పాదపద్మములకు జాతి రత్నముల అందెలు గలదియు, అగ్నిలో కాల్చి శుద్ధి చేయబడిన పసుపువంటి రంగు గల అమూల్య వస్త్రముతో విరాజిల్లుచున్నదియు, శ్రేష్ఠమైన మణులతో రత్నములతో తన కోరికకు ఆసక్తికి తగినట్లుగా నిర్మించబడిన భూషణములతో అలంకరింపబడి సుందరమైన తన రూపము చేత ఆ నగలకే ఆభరణముగా ఒప్పుచున్నదియు, దొండపండువలె మనోహరమైన క్రింది పెదవి మీద విలాసముగా పిల్లనగ్రోవి గలదియు, ప్రసన్నమైన చూపులతో చూచుచున్నదియు, భక్తులననుగ్రహించుటకై త్వరపడుచున్నదియు, రత్నగుటికలతో (గుండీలు} కూడియున్న కవచము వక్షస్థలమున మెరయుచున్నదియు, కౌస్తుభము మొదలగు మేలి రత్నముల దివ్యతేజస్సుతో గొప్పగా వెలిగిపోవుచున్నదియునగు (శ్రీకృష్ణరూపమును) ఆకారమును దేవతలు దర్శించిరి.

తత్రతేజసి చార్వంగీం దదృశూరాధికాభిధాం ॥

పశ్యంతం సస్మితం కాంతం పశ్యంతీం వక్ర చక్షుషా ।

ముక్తా పంక్తి వినింద్యైక దంత వం పంక్తి విరాజితాం ॥

ఈషద్ధాస్య ప్రసన్నాస్యాం శరత్పంకజ లోచనాం ।

శరత్పార్వణ చంద్రాభావినిందాస్య మనోహరాం ॥ బంధుజీవప్రభాముష్టాధరౌష్ఠరుచిరాననాం।

రణన్మంజీర యుగ్మేన పాదాంబుజ విరాజితాం॥

 మణీంద్రాణాం ప్రభామొష నఖరాజి విరాజితాం।

కుంకుమాభా సమాచ్ఛాద్య పదాధో రాగ భూషితాం ॥

 అమూల్య రత్న సారాణాం రశనాశ్రోణి భూషితాం ।

 హుతాశన విశుద్ధాంశుకామూల్యజ్జ్వలితోజ్జ్వలాం॥

 మహామణీంద్ర సారాణాం కింకిణీ మధ్య సంయుతాం।

సద్రత్న హారకేయూర కరకంకణ భూషితాం ॥

రత్నేంద్ర సార రచిత కపోలోజ్జ్వల కుండలాం ।

కర్ణోపరి మణీంద్రాణాం కర్ణభూషణ భూషితాం ॥

ఖగేంద్ర చంచునాసాగ్ర గజేంద్ర మౌక్తికాన్వితాం।

మాలతీ మాలయా వక్ర కబరీ భార శోభితాం ॥

మాలయా కౌస్తుభేంద్రాణాం వక్షస్థల సుశోభితాం।

పారిజాత ప్రసూనాం మాలాజాలోజ్జ్వలాంబరాం ॥

రత్నాంగుళీయ నికరై: కరాంగుళి విభూషితాం ।

దివ్య శంఖ వికారైశ్చ చిత్రరాగ విభూషితైః ॥

సూక్ష్మ సూత్రాకృతై రమ్యైర్భూషితాం శంఖభూషణైః।

సద్రత్న సారగుటీకారాజే సూత్ర సుశోభితాం ॥

ప్రతప్త స్వర్ణవర్ణాభామాచ్ఛాద్య చారు విగ్రహాం ।

నితంబ శ్రోణి లలితాం పీనస్తన నతాంబరాం ॥

భూషితాం భూషణెస్సర్వే: సౌందర్యేణ విభూషితైః ।

ఏస్మితాస్త్రిదశాస్సర్వే దృష్ట్వా తామీశ్వరీం వరాం ॥

తుష్టువుస్తే సురాః సర్వే పూర్ణ సర్వమనోరథా: ॥

దేవతలా తేజస్పులో (శ్రీకృష్ణరూపముతో బాటు) రాధికయను పేరు గల సుందరమూర్తిని దర్శించిరి. చిరునవ్వుతో తనను చూచుచున్న తన ప్రియుని (శ్రీకృష్ణుని) ఆమె ఓరచూపులతో దర్శించుచుండెను. ఆమె పలువరుస ముత్యాలపంక్తిని తిరస్కరించునదిగా యుండెను. కొద్దిపాటి నవ్వుగల ప్రసన్నముఖ మండలముతో, శరదృతువు నందలి పద్మములవంటి కన్నులతో, శరత్పూర్ణిమనాటి చంద్రకాంతిని వెక్కిరించు సుందరముఖముతో, బంధుజీవ పుష్పవస్త్రమును దొంగిలించునట్టి క్రింది పెదవి వలన సుందరముగానున్న ఆననముతో, మ్రోయుచున్న అందేల జంటతో వెలయుచున్న పాదపద్మములతో, ఎర్రని మణుల కాంతిని తిరస్కరించునట్టి గోళ్లతో, కుంకుమ పువ్వు వన్నెను కప్పి పుచ్చునంతటి పాదముల క్రింది భాగపు (అరికాళు) ఎర్రదనముతో, అమూల్యములు శ్రేష్ఠములైన రతనాల మొలనూలుతో అలంకృతమైన శ్రోణి భాగముతో, నడుము క్రింది (వెనుకవైపు) భాగము) కణకణలాడు అగ్నివలె వెలుగుచున్న పవిత్ర వస్త్రము చేత గొప్పగా ప్రకాశించుచున్న వెలుగుతో, శ్రేష్టమైన మహామణుల మువ్వలు గల నడుముతో, రత్నములు ముత్యములు కూర్చిన కంఠహారముతో, దండకడియములు కంకణములు గల హస్తములతో, ఆ దేవి అద్భుతముగా విరాజిల్లుచుండెను. గరుడుని ముక్కువంటీ ఆమేనాసాగ్రమున ఏనుగు ముత్తైపునగ అలంకరింపబడి ఉండెను. ఒకప్రక్కకు వంకరగా చుట్టిన ఆమె కొప్పు పైన మాలతీపుష్పమాల శోభిల్లుచుండెను. పారిజాత ప్రసూనముల మాలలతో ఆమె వస్త్రములు వెలిగిపోవుచుండెను. ఆమె వక్షస్థలమున కౌస్తుభమణుల హారము శోభిల్లుచుండెను. ఆమె కరాంగుళులు (చేతులళు) రత్నాల ఉంగరములతో అలంకరింపబడియుండెను. - దివ్యశంఖముయుములైన, సన్నని సూత్రరూపములుగానున్న, చిత్రవర్ణములతో గూడిన శంఖ భూషణములు (కంకణములు కడియములు గాజులు) ఆమె హస్తములకు ధరించియుండెను. మిక్కిలి కాల్చిన బంగారు వన్నెవంటీ కాంతిగల తన సుందర విగ్రహమును మేలిమి రత్నములను గ్రుచ్చిన సూత్రములతో (రత్నాల కవచముతో) కప్పిపుచ్చుచు - సుందరమైన శ్రోణి నితంబములతో, నడుము క్రింది భాగము పిరుదులు పుష్టిగానున్న స్తన భారముతో వంగినట్లున్న ఆకారముతో, తన సౌందర్యము చేత ఆభరణములకు వన్నె తెచ్చుచున్న అలంకారముతో వెలుగుచున్న ఉత్తమరాలు, ఈశ్వరి అగు రాధాదేవిని దర్శించి త్రిదశులందరు ఆశ్చర్యపడి నిండిన మనోరథములతో ఇట్లు స్తుతించిరి.,

బ్రహ్మోవాచ :

తవచరణ సరోజే మన్మనశ్చంచరీకో భ్రమతు సతత మీశ ప్రేమభక్త్యా సరోజే।

భువన విభవ భోగాత్తాప శాంత్యౌషధాయ సుదృఢ సుపరిపక్వాం దేహి భక్తిం చ దాస్యం॥

బ్రహ్మ ఇట్లు పలికెను :

ఓ ప్రభూ! నామనస్సనెడి తుమ్మెద నీ పాదమను పద్మమునందు ప్రేమభక్తులతో ఎల్లప్పుడు తిరుగాడుగాక. లోకాధిపత్యమను సంపద యొక్క అనుభవము వలన ఏర్పడిన తాపము శమించుటకు ఔషధముగా నీయందు సుదృఢముగా నిలుచునట్టి, సుపరిపక్వమైన భక్తిని, నీ దాస్యమును నాకిమ్ము.

శంకర ఉవాచ :

భవ జలనిధి మగ్న శ్చిత్తమీనో మదీయో భ్రమతి సతతమస్మిన్ మౌరసంసార కూపే । విషయమతివినింద్యం సృష్టి సంహార రూపమవనయ తవ భక్తిం దేహి పాదారవిందే ॥

శంకరుడిట్లు పలికెను :

సంసార సముద్రమున మునిగిన నా చిత్తమనెడి చేప ఎల్లప్పుడీ ఘోరమైన సంసార కూపమున (ఇరుకు చేదబావి) తిరుగుచున్నది.

విషయ సుఖములందు తగుల్కొని యున్న మనస్సు చేత మీక్కిలి నిందింపదగిన, జన్మ మృత్యురూపమైన ఈ సంసార బంధమును తొలగించుము. నీ పాదపద్మములందు భక్తిని నాకొసగుము.

ధర్మ ఉవాచ :

తవ నిజజన సార్ధం సంగమో మే మదీశ భవతు విషయబంధచ్ఛేదనే తీక్ష్మ ఖడ్గః। తవచరణ సరోజే స్థాన దానైక హేతుర్థనుషి జనుషి భక్తిం దేహి పాదారవిందే ॥

ధర్ముడిట్లు పలికెను :

ఓ నా ప్రభూ! నా విషయవాంఛయను బంధమును ఛేదించుటకు నీ భక్తవర్గముతో సహవాసము అనెడి వాడికత్తె నాకు సమకూరుగాక. నీ పాదపద్మముల వద్ద స్థానమిచ్చుటకు మూలమైన నీపాదారవింద భక్తీని జన్మ జన్మకు ప్రసాదించుము.

ఇత్యేవం స్తవనం కృత్వా పరిపూర్ణైక మానసాః ।

కామరూపన్య పురతస్తిష్ఠంతో రాధికాపతేః ॥

సురాణాం స్తవనం శ్రుత్వా తానువాచ కృపానిధీః ।

హితం తథ్యం చ వచనం స్మేరానన సరోరుహః ॥

మన్మధ సుందరాకారుడైన రాధికాపతి (శ్రీకృష్ణుడు) ముందు నీలిచి దేవతలిట్లు స్తుతించి పరిపూర్ణమైన తృప్తి చెందిన మనస్సులు గలవారు కాగా ఆ దయానిధి వారి స్తోత్రమును విని చిరునవ్వు గల ముఖపద్మము గలవాడై హితము సత్యమైన వాక్కుతో వారితోనిట్లు పలికెను.

శ్రీకృష్ణ ఉవాచ :

తిష్ఠతాగచ్ఛత సురా మదీయా నాత్ర సంశయః।

శివాశ్రయాణాం కుశలం ప్రష్టుం యుక్తం న సాంప్రతం॥

నిశ్చింతా భవతాత్రైవ కా చింతా వో మయి స్థితే ।

 స్థితోఽహం సర్వజీవేషు ప్రత్యక్షోఽ హం స్తవేన వై ॥

యుష్మాకం యమభిప్రాయం సర్వం జానామి నిశ్చితం ।

శుభాశుభం చ యత్కర్మ కాలీ ఖలు భవిష్యతి ॥

 మహత్ క్షుద్రం చ యత్కర్మ సర్వం కాలకృతం సురాః।

స్వే స్వే కాలే చ తరపః ఫలితా: పుష్పిణస్సదా ॥

పరిపక్వ ఫలాః కాలే కాలే పక ఫలాన్వితాః ।

సుఖం దుఃఖం వీవత్సంపచ్ఛోక చింతా శుభాశుభం ॥

 స్వకర్మ ఫలనిష్ఠం చ నర్వకాలేఽ వ్యుపస్థితం ।

 న హి కస్య ప్రియ: కో వా విప్రియో వా జగత్రయే ॥

కాలే కార్యవశాత్సర్వే భవంత్యేవాప్రియాః ప్రియాః ।

రాజానో మసవః పృధ్వ్యాం దృష్టా యుష్మాభిరత్ర వై ॥

స్వకర్మఫల పాకేన సర్వే కాలవశం గతాః ।

యుష్మాకమధునా చైవ గోలోకే యత్ క్షణం గతం ॥

పృథివ్యాం తత్ క్షణేనైవ సప్త మన్వంతరం గతం।

ఇంద్రాన్సప్త గతాస్తత్ర దేవేంద్రశ్చాష్టమోఽ ధునా॥

 కాలచక్రం భ్రమత్యేవ మదీయం చ దివానిశం ।

ఇంద్రాశ్చ మానవా భూపా: సర్వే కాలవశం గతాః ॥

 కీర్తి: పృథ్వ్యాం పుణ్యమద్య కథామాత్రావశేషితం ।

 అధునా పి చ రాజానో దుష్టాశ్చ హరినిందకాః ॥

బభూవుర్బహవో భూమౌ మహాబల పరాక్రమా: ।

సర్వే యాస్యంతి రాజానః కాలాంతరవశం ధ్రువం ॥

ఉపస్థితోఽపి కాలేయం వాతో వాతి నిరంతరం।

 వహ్నిర్దహతి సూర్యశ్చ తపత్యేవ మమాజ్ఞయా ॥

వ్యాధయః సంతి దేహేషు మృత్యుశ్చరతి జంతుషు ।

వర్షం త్యేతే జలధరాః సర్వే దేవా మమాజ్ఞయా ॥

బ్రాహ్మణ నిష్ఠా విప్రాశ్చ తపోనీష్టాస్త బోధనాః ।

బ్రహ్మర్షయో బ్రహ్మనిష్ఠా యోగనిష్ఠాశ్చ యోగినః ॥

తే సర్వే మద్ఛయాద్భీతా: స్వకర్మ ధర్మతత్పరాః ।

మద్భక్తాశ్చైవ నిశ్శంకాః కర్మనిర్మూలకారకాః ॥

ఓ సురలారా! రండి. నిలవండి. మీరు నావారు. ఈ విషయములో సందేహము లేదు. శివుని ఆశ్రయించి యున్న మిమ్ము ఇప్పుడు 'కుశలమా' అని ప్రశ్నించుట యోగ్యము కాదు. నేనుండగా మీకు విచారమెందుకు, నిశ్చింతులుకండి. సర్వజీవులందు నేనున్నాను. ఈ మీస్తోత్రము చేత మీకు కన్పించితిని. మీ మనస్సులలో నిశ్చయించుకొన్న అభిప్రాయమంతయు నేనెరుగుదును. శుభము అశుభము అగు కర్మలు అన్నియు కాలమును బట్టి ఏర్పడుచున్నవి. ఓ దేవతలారా! గొప్పది చిన్నది (ఉత్తమము-నీచము) అను కర్మలన్నీయు కాలకృతములు. చెట్లు తమతమ ఋతువు (కాలములో పుష్పించును, ఫలించును. కాలమును బట్టి కాతకాయును. పండు పండును. సుఖము-దుఃఖము, ఆపద-సంపద, శోకము-చింత, శుభము-ఆశుభము, అన్నవి తమ తమ కర్మనిష్ఠను - ఫలనిస్థను బట్టి సర్వకాలమునందు ఉపస్థితమగును (ఎదుట వచ్చి నిల్చును).

ఈ ముల్లోకములలో ఎవనికెవడు ప్రియుడు గాని అప్రియుడు గాని లేడు, ఆయా కాలములలో కార్యకారణములను బట్టి ప్రతివాడు ప్రియమైనవాడు అప్రియమైనవాడు అగుదురు. భూమియందలి షోడశమహారాజులు పదునాలురు మనువులు అందరును తమతమ కర్మఫలము పండి కాలవశులైరి (మరణించిరి. దేహములు త్యజించిరి) గోలోకమున మీకిప్పుడు ఒక్క క్షణకాలమేది గడచినదో ఆ క్షణకాలములో భూలోకమున ఏడు మన్వంతరములు గడచిపోయినవి. ఏడుగురింద్రులు గతించి ఎనిమిదవ ఇంద్రుడిప్పుడు పదవిలో సాగుచున్నాడు. ఈ నాకాలచక్రము రాత్రింబవళ తిరుగుచునే యుండును. ఇంద్రులు మనువులు మానవులు భూపాలురు అందరును గతించిరి. ఇప్పుడు భూమండలమున కీర్తి పుణ్యము అన్నవి పేరుకు మాత్రమే మిగిలియున్నవి. ఇప్పుడును భూమి మీద దుష్టులు హరినీందకులు మహాబలపరాక్రమములు గలవారు అగు రోజులున్నొరు. ఆ రాజులందరు నిశ్చయముగా కాలమునకు వశులై మరణింతురు. ఇట్టి కాలము వచ్చినను నా ఆజ్ఞ వలన వాయువు ఆగక ఎల్లప్పుడు వీచుచునే యున్నాడు, అగ్ని కాల్చుచునే యున్నాడు. సూర్యుడు ఎండగాయుచునే యున్నాడు. దేహములకు వ్యాధులేర్పడుచున్నవి. జీవులపై మృత్యువు కదలుచునే యున్నది. మేఘములు వర్షించుచునే యున్నవి. నా యాజ్ఞ వలన సర్వదేవతలు, స్వజాతి కర్మలయందు నిష్ఠగలవారై బ్రాహ్మణులు, తపస్సునందు నిష్ఠగలవారై తపోధనులు, బ్రహ్మమునందు నిష్ఠగలవారై బ్రహ్మఋషులు, యోగాభ్యాసము (భగవద్ధ్యానము) నందు నిష్ఠగలవారై యోగులు-వీరందరు నాశాసనము దాటరాదను భయముచేత భీతులై తమతమ కర్మలయందు ధర్మములందు తత్పరులై (ఆసక్తిగలవారై} స్వజాతికుచితమైన ఆయా కర్మలు ధర్మములు తమ పూర్వకర్మలను నిర్మూలించునన్న విశ్వాసముతో సందేహము లేనివారై నా భక్తులై ఉన్నారు.

దేవాః కాలస్య కాలోఽహం వీధాతా ధాతురేవ చ।

సంహారకర్తు: సంహర్తా పాతుః పాతా పరాత్పరః ॥

మమాజ్ఞయాఽయం సంహర్తా నామ్నా తేన హరః స్మృతః ।

త్వం విశ్వసృట్ సృష్టి హేతోః పాతా ధర్మన్య రక్షణాత్ ॥

బ్రహ్మాది తృణపర్యంతం నర్వేషామహమీశ్వరః ।

స్వకర్మ ఫలదాతాఽహం కర్మనిర్మూలకారకః ॥

అహం యాన్ సంహరిష్యామి కస్తేషామవిరక్షితౌ।

యానహం పాలయిష్యామి తేషాం హంతో న కోఽపి వా ॥

సర్వేషామపి సంహర్తా స్రష్టా పాతాఽహమేవ చ ।

నాహం శక్తశ్చ భక్తానాం సంహారే నిత్యదేహినాం॥

 భక్తా మమానుగా నిత్యం మత్పాదార్చన తత్సరాః ।

అహం భక్తాంతికే శశ్వత్తేషాం రక్షణ హేతవే ॥

సర్వే నశ్యంతి బ్రహ్మాండే ప్రభవంతి పునఃపునః।

న మే భక్తాః ప్రణశ్యంతి నిశ్శంకాశ్చ నిరాపదః ॥

 అతో విపశ్చితస్పర్శే దాస్యం వాంఛంతి నో పరం ।

యే మాం దాన్యం ప్రయాచంతే ధన్యాస్తేఽన్యే చ వంచితాః ॥

 జన్మ మృత్యుజరావ్యాధిభయం చ యమయాతనా ।

అన్యేషా కరిణామస్తి న భక్తానాం చ కరి చిత్ ॥

భక్తా న లిప్తా: పాపేషు పుణ్యేషు సర్వకర్మిణః ।

అహం ధునోమి తేషాం చ కర్మభోగాన్ సునిశ్చితం॥

అహం ప్రాణశ్చ భక్తానాం భక్తాః ప్రాణా మమాపి చ ।

ధ్యాయంతే తే చ మాం నిత్యం తాన్ స్మరామీ దీవానిశం ॥

 చక్రం సుదర్శనం నామ షోడశారం సుతీక్ష్ణకం।

యత్తేజ: షోడశాంశోఽపి నాస్తి సర్వేషు జీవీషు ॥

 భక్తాంతికే తు తచ్చక్రం దత్వా రక్షార్థమీప్సితం ।

 న స్వాస్థ్యం న చ ప్రీతీర్మే యామి తేషాం చ సన్నిధిం ॥

న మే స్వాస్థ్యం చ వైకుంఠే గోలోకే రాధీకాంతికే ।

యత్ర తిష్ఠంతి భక్తా స్తే తత్ర తిష్ఠామ్యహర్నిశం ॥

ప్రాణేభ్యః ప్రేయసీ రాధా స్థితోరసి దివానీశం ।

యూయం ప్రాణాధీకా లక్ష్మీర్న మే భక్తాత్పరా ప్రియా ॥

భక్తదత్తం చ యద్ద్రవ్యం భక్తాఽశ్నామి సురేశ్వరాః ।

అభక్తదత్తం నాశ్నామి ధ్రువం భుంక్తే బలిం స్వయం॥

 స్త్రీపుత్ర స్వజసాంస్త్యక్త్వా ధ్యాయం మామహర్నిశం ।

యుష్మాస్వహాయ తాన్నిత్యం స్మరామ్యహమహర్నిశం॥

దుష్టా యదా మే భక్తానాం బ్రాహ్మణానాం గవామపి ।

 క్రతూనాం దేవతానాం చ హింసాం కుర్వంతి నిశ్చితం ॥

తథాఽచీరం తే నశ్యంతి యదా వహ్నౌ తృణాని చ ।

 న కోఽపి రక్షితా తేషాం మయి హ్యంతర్యుపస్థితే ॥

యాస్యామీ పృథివీం దేవా యాత యూయం స్వమాలయం ।

 యూయం చైవాంశ రూపేణ శీఘ్రం గచ్ఛత భూతలం ॥

 ఇత్యుక్త్వా జగతాం నాథో గోపాసాహయ గోపికాః।

ఉవాచ మధురం వాక్యం సత్యం యత్పమయోచితం ॥

ఓ దేవతలారా! నేను కాలమునకు కాలపురుషుడు {శాసించువాడను సృష్టికర్తకు సృష్టికర్తను. సంహారకర్తకు సంహారకుడను. పాలన చేయు వానికి పరాత్పరుడగు పాలకుడను. నాయాలను బట్టియ, ఇతడు సంహర్త హరుడు అన్న నామముతో చెప్పబడినాడు. - సృష్టిని చేయుట వలన నీవు {బ్రహ్మ) విశ్వసపు ఐతివి. ధర్మరక్షణను ఐటి ఉడు {ధర్మదేవత) పాలకుడు ఆమెను. బ్రహ్మ మొదలుకొని అల్పమైన గడ్డిపరక వరకు అందరు జీవులకు నేను శాసకుడనగు ప్రభువును (ఈశ్వరుడను) . సమస్త జీవులకు తమ తమ కర్మలను బట్టి ఫలమిచ్చువాడను వారి వా కర్మలను నశింపజేసి మోక్షమిచ్చువాడను నేనే. సవరీని సంహరింతునో వారిని రక్షించువాడెవడు? నేనెవరిని పాలింతునో వారిని చంపువాడెవడున్నాడు {లేడు) అందరిని సంహరించువాడను సృష్టించువాడను రక్షించువాడను నేనే. ఐనను శాశ్వత దేహములు (జ్ఞానానందమయములైన ముక్తిదశయందట అకారములు) ధరించిన భక్తులను సంహరించుటకు {శరీరముల నుండి జీపులను వేరుచేయుటకు) నాకును శక్తిలేదు. నా పాదములనర్చించుటయందే ఆసక్తి గలవారై యుండు భక్తులు ఎల్లప్పుడు నన్ననుసరించియే ఉందురు. నేనెల్లప్పుడు వారిని రక్షించుటకొరకై భక్తుల వద్దనే ఉందును. సమస్త జీవులు ఈ బ్రహ్మాండమున మరల మరల చచ్చుచు పుట్టుచున్నారు. నా భక్తులు మాత్రము సందేహము లేక ఆపదలు లేక {భయాందోళనారహితులై) ఉందురు. వారెప్పుడును నళింపరు. అందువలననే జ్ఞానులందరు. దాస్యము కోరుదురే కానీ తమకొరకై వరములు కోరరు. ఎవరు నా దాస్యము కోరుకొందురో{యాచింతురో) వారు ధన్యులు. ఇతరము {దాస్యము కాక ఇతర భోగములు) కోరుకొనువారు విధివంచితులు. చావుపుట్టుకలు, ముసలి తనము, రోగముల వలన భయము, యమయాతనలు (పాపఫలితముగా యముని వలన వడు నరకబాధలు) ఇవి యన్నియు కర్మలు చేయు (కర్మిషులకు) వారి సంభవించును. కాని భక్తులకెప్పుడును లేవు. అన్ని కర్మలు చేయువారైనను భక్తులకు పుణ్యపాపములంటవు. వారి కర్మఫలములను {అవశ్యము అనుభవింపదగినవైనను) నేను వారికంటకుండ (భక్తులగుట వలన) విసిరివేయుదును. నేను భక్తులకు ప్రాణమును, వారు నాకు ప్రాణములు. వారు ఎల్లప్పుడు నన్నే తలంతురు. నేను రాత్రింబవళ్లు వారినే స్మరింతును. వాడియే పదహారు అంచులు గల సుదర్శనమనెడి చక్రము యొక్క తేజస్సులో పదునారవ భాగము తేజస్సు కూడ అందరు జీవులలో (సమిష్టిగా కలిసి లేదు. అట్టి కోరదగిన చక్రమును వారిరక్ష కొరకు ఇచ్చి భక్తుల వర్ధ ఉంచినపుడును నాకు నీలుకడగాని తృప్తిగానీ ఉండవు. నేను గూడ వారి రక్షణార్థము భక్తుల సమీపమునకీ వెళ్లుదును. నాకు వైకుంఠమున గాని గోలోకమున రాధికా సమీపమున గాని నాకు నిలుకడ (చలనములేని స్థితి) ఉండదు. ఎక్కడ భక్తులు నివసింతురే అక్కడ రాత్రింబవళ్లు నిలిచియుందును. నా ప్రాణముల కన్న ప్రియురాలైన రాధీ రాత్రింబవళ్లు నా వక్షస్థలమున నిలిచియుండును. నాకు మీరు గాని ప్రాణములకంటే అధికురాలైన లక్ష్మీగాని భక్తుల కంటే ఎక్కువ ప్రియులు కారు. ఓ సురలారా! భక్తులు నాకు సమర్పించిన ఏ పదార్థమున నను పరమ ప్రీతీతో నేను భుజింతును. భక్తుడు గానీ వాడిచ్చినదానిని వాస్తవముగా నేను తినను. ఆ నైవేద్యమును స్వయముగా వాడే భుజించుము. భక్తులు తమభార్యా పుత్రులను తమవారినందరిని విడిచి నన్ను రేయింబవళ్లు ధ్యానింతురు. కాబట్టి మిమ్ము విడిచి నేను కూడ ఎల్లప్పుడు వారినే స్మరింతును.

ఏ దురాత్ములు నాభక్తులకు బ్రాహ్మణులకు గోవులకు యజ్ఞయాగాదులకు దేవతలకు పీడలు కల్గొంతులో (హింసింతురో) ఆ దుర్జనులు అగ్నిలో ఎండుగడ్డివరి తొందరగా నశించిపోదురు. వారిని సంహరించుటకు నేనుద్యమించినపుడు ఎవడును రక్షింపజాలడు. ఓ దేవతలారా! నేను భూలోకమున కేగుదును.. మీరు మీ గృహములకు తిరిగిపొండు. మీరు కూడ మీమీ అంశలతో త్వరగా భూతలమునకు వెల్లుడు జన్మలెత్తుడు). ఇట్లు పలికి జగన్నాథుడు గోపfపీ గణములను పిలిచి సమయోచితమైన వాక్యమును మధురముగా సత్యముగా వారితో ఇట్లు పలికెను.

గోపా గోప్యశ్చ శ్రుణుత యాత నందవ్రజం పరం।

వృషభాను గృహే క్షిప్రం గచ్ఛ త్వమపి రాధికే॥

వృషభాను ప్రియా సాధ్వీ నందగోప కలావతీ ।

సుబలస్య సుతా సాచ కమలాంశ సముద్భవా ॥

పితృణాం మానసీ కన్యా ధన్యా మాన్యా చ యోషితాం ।

పురా దుర్వాసన: శాపాజ్జన్మ తస్యా వ్రజే గృహే॥

తస్యా గృహే జన్మ లభ శీఘ్రం నందవ్రజం వ్రజ ।

 తామహం బాలరూపేణ గృహ్ణామి కమలాననే ॥

 త్వం మే ప్రాణాధికారాధే తవ ప్రాణాధికోఽవ్యహం।

న కించిదావయోర్భిన్నమేకాంగం సర్వదైవ హి ॥

 శ్రుత్యైవం రాధికా తత్ర దురోద ప్రేమవిహ్వలా ।

పపౌ చక్షుశ్చకోరాభ్యాం ముఖచంద్రం హరేర్మునే ॥

ఓ గోపాలులారా! గోపికలారా! నేను చెప్పునది వినుడు. మీరెల్లరు శ్రేష్ఠమైన నందవ్రజమునకు (నందుని రేపల్లె) వెళ్ళడు (అక్కడ జన్మించుడు). రాధా! నీవు కూడా త్వరగా వృషభానుని గృహమునకు వెళ్ళము. వృషభానుని భార్య కళావతి. ఆమె పతివ్రత, పితృదేవతల మనస్సంకల్పము వలన లక్ష్మీదేవి అంశతో సుబలుడన్న వానికి బిడ్డగా జన్మించిన కన్య ఆమె. స్త్రీలలో ధన్యురాలు మాన్యురాలు. పూర్వము దూర్వాసమహర్షి శాపము కారణముగా లక్ష్మీదేవి వ్రజములో అతని (సుబలుడు) యింట జన్మించినది. వృషభానుని భార్యయగు కలావతి గర్భమున జన్మించి త్వరగా నందుని ప్రజమునకు పొమ్ము. ఓ పద్మముఖీ! నిన్న చ్చట బాలరూపమున నున్న నేను చేపట్టుదును. రాధా ! నీవు నాకు ప్రాణముల కంటే అధికురాలవు. నీకును నేనట్లే కదా! మన యిద్దరిలో రవ్వంత గూడ భేదము లేదు. ఎల్లప్పుడు ఇద్దరమొక్క శరీరమే. ఇట్లు చెప్పగా రాధాదేవి విని ప్రేమ చేత విహ్వలురాలై (మనస్సు భయముతో చెదరి) ఒక్కసారి ఏడ్చెను. ఓ నారదా! శ్రీహరి ముఖమనెడీ చంద్రుని {చంద్రకాంతిని-ముఖకాంతిని} తన నేత్రములనెడి చకోరములతో త్రాగెను.{చకోర పక్షులు ప్రియముగా చంద్రకాంతీని త్రాగినట్లు శ్రీకృష్ణముఖమును రాధ తన నేత్రములతో తనివిదీర దర్శించెను).

జనుర్లభత గోపాశ్చ గోప్యశ్చ పృథివీ తలే ।

గోపానాముత్తమానాం చ మందిరే మందిరే శుభే ॥

ఏతస్మిన్నంతరే సర్వే దదృశూ రథముత్తమం ।

మణిరత్నేంద్ర సారేణ హీరకేణ విభూషితం ॥

శ్వేత చామర లక్షేణ శోభితం దర్శణాయుతైః ।

సూక్ష్మ కాషాయ వస్త్రేణ వహ్నిశుద్ధేన భూషితం॥

సద్రత్న కలశానాం చ సహస్రేణ నుశోభితం।

పారిజాత ప్రసూనానాం మాలాజాలైర్విరాజితం ॥

పార్షద ప్రవకైర్యుక్తం శాతకుంభ మయం శుభం ।

 తేజ స్స్వరూపముతులం శత సూర్య సమప్రభం॥

 తత్రస్థం పురుషం శ్యామం సుందరం కమనీయకం ।

 శంఖచక్ర గదా పద్మధరం పీతాంబరం వరం॥

కిరీటినం కుండలినం వనమాలా విభూషితం ।

చందనాగురు కస్తూరీ కుంకుమ ద్రవచర్చితం ॥

చతుర్భుజం స్మేరవక్త్రం భక్తానుగ్రహకాతరం ।

మణిరత్నేంద్ర సారాణాం సారభూషణ భూషితం ॥

గోలోకమందలి గోపాలకులు గోపికలు భూలోకమున ఉత్తమములైన గోపకుల గృహములలో ప్రతిశుభమందిరమందును జన్మలెత్తిరి. ఇంతలో గోలోకవాసులందరు అక్కడ ఒక ఉత్తమరథమును చూచిరి. అది శ్రేష్ఠమైన మణులతో వజ్రములతో అలంకృతమై ఉండెను. ఒక లక్ష తెల్లని చామరములు పదివేల నిలువుటద్దములు వేయి రత్నకలశములు పారిజాత పుష్పమాలల సమూహములు అగ్నివలె మెరయుచున్న సన్నని కాషాయవస్త్రములు వెలయుచుండగా ఆ రధము స్వర్ణమయమై ఉండెను. శ్రేష్ఠులైన పార్షదులు కొలుచుచుండగా వాడి నడుము రధము పై నూరు సూర్యమండలములకు సాటివచ్చు తేజోరాశీ నడుమ ఒక సాటిలేని విగ్రహము గల వాడుండెను. కోరదగిన సుందర శ్యామల పురుషుడతడు. పీతాంబరమును శంఖచక్ర గదా పద్మములను ధరించి కిరీటముతో కుండలములతో కూడి చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వుల యొక్క ద్రవము పులుముకొని నిలువెత్తు వనమాల యను పూదండ ధరించి యుండెను. నానావిధ సారరత్నముల ఆభరణములతో అలంకృతుడై చిరునవ్వు మొగము భక్తులననుగ్రహించుట కొరకైన తొందర తనము గల చతుర్భుజమూర్తి అతడు (వారికి కన్పించెను).

దేవీం తద్వామతో రమ్యాం శుక్లవర్ణాం మనోహరాం ।

రత్నాలంకార శోభాడ్యాం శోభితాం పీతవాససా॥

 శరత్పార్వణ చంద్రస్యాం శరత్పంకజ లోచనాం ।

పక్వబింబాధరోష్ఠీం చ స్మేరయుక్తాం మనోహరాం ॥

వేణు వీణాగ్రంథహస్తాం భక్తానుగ్రహకాతరాం ।

విద్యాధిష్ఠాతృ దేవీం చ జ్ఞాన రూపాం సరస్వతీం ॥

అపరాం దక్షిణే రమ్యాం శరచ్చంద్ర సమప్రభాం ।

ప్రతప్త స్వర్ణవర్ణాభాం సస్మితాం సుమనోహరాం ॥

సద్రత్న కుండలాభ్యాం చ సుకపోల విరాజితాం ।

అమూల్య రత్న ఖచితామూల్య వస్త్రేణ భూషితాం ॥

అమూల్య రత్నకేయూర కరకంకణ శోభితాం ।

సద్రత్న సారమంజీర కలశబ్ద సమన్వితాం ॥

మణీంద్ర కింకిణీ యుక్త మధ్యదేశ సమన్వితాం।

పారిజాత ప్రసూనానాం మాలా వక్షఃస్థలోజ్జ్వలాం ॥

ప్రపుల్ల మాలతీమాలా సంయుక్త కబరీ యుతాం।

శరచ్చంద్ర ప్రభాముష్ణన్ముఖచారు వీభూషితాం ॥

కస్తూరీ బిందు సంయుక్త సిందూర తిలకాన్వితాం ।

 సుచారు కజ్జులాసక్త శరత్పంకజ లోచనాం ॥

 సహస్ర దల సంయుక్త లీలాకమల సంయుతాం ।

నారాయణం చ పశ్యంతం వశ్యంతీం వక్ర చక్షుషా ॥

ఆరుహ్య రథాత్తూర్ణం సస్త్రీకః సహపార్షదః ।

జగామ చ సభాం రమ్యాం గోపగోపీ సమన్వితాం ॥

దేవా గోప్యశ్చ గోపాశ్చ తస్థుః ప్రాంజలయో ముదా ।

సామవేదోక్త స్తోత్రేణ కృతేన చ సురర్షిభిః ॥

 గత్వా నారాయణో దేవః విలీనః కృష్ణ విగ్రహే ।

 దృష్ట్వా చ పరమాశ్చర్యం తే నర్వే విస్మయం యయుః॥

ఆ స్వామికి ఎడమవైపున సుందర మనోహరముగా తెల్లని వర్ణముతో రత్నాభరణముల శోభతో ఆడ్యురాలైన, పసుపు పచ్చ వస్త్రముతో (పీతాంబరము) శోభించుచున్న, శరదృతువునందలి పున్నమి నాటి చంద్రుని వంటి ముఖము గల, శరత్కాల పద్మముల వంటి నేత్రములు కల, పక్వమైన దొండపండు వంటి క్రింది పెదవి గల, మనోహరముగా చిరునవ్వు నవ్వుచున్న, వేణువు, వీణావాద్యము, పుస్తకములు చేతులందు ధరించియున్న, భక్తులను గ్రహించుటలో త్వరగల, విద్యలకు అధిష్టానదేవత యగు, జ్ఞానరూపీణీ సరస్వతీదేవి వెలసియుండెను. ఆ స్వామికి కుడివైపున కాల్చిన బంగారు వంటి ఎరుపు పసుపు వర్ణకాంతితో, శరత్కాల చంద్రుని వంటి ప్రభతో, సుందర సుమనోహరముగా చిరునవ్వు చిందించుచు, మేలిమి రతనాల కుండలముతో చెక్కిళ్లు వెలిగిపోవుచుండగా, శ్రేష్ఠరత్నములు కుట్టిన అమూల్య వస్త్రము ధరించి అమూల్య రత్నములు గల దండ కడియములు చేతికంకణములు శోభించుచుండగా, సారవంతములైన రత్నాల అందెల యొక్క ముగ్ధమనోహరమైన ధ్వనితో, మణుల మొలనూలు బిగించిన నడుముతో, పారిజాత పుష్పమాలలు వక్షఃస్థలమున ప్రకాశించుచుండగా, నిండుగా విచ్చుకొన్న మాలతీ కుసుమముల దండలు కొప్పున వెలయుచుండగా, శరత్కాల చంద్రుని కాంతిని దోచుకొనెడి ముఖమున సుందరమైన అలంకృతులతో, నల్లని కస్తూరి చుక్క తో భాటు ఎర్రని సిందూర తిలకము గలదియు, సుందరముగా తీర్చిన కాటుకతో వెలయుచున్న శరత్కాల పద్మముల వంటి కన్నులతో, వేయి రేకులతో కూడిన లీలాకమలము చేత ధరించి సుందరముగా తన్ను చూచుచున్న నారాయణుని ఓరచూపులతో విలాసముగా చూచుచున్న లక్ష్మీదేవి ఒప్పుచుండెను. ఆ చతుర్భుజ మూర్తియగు నారాయణుడు ఈ యిద్దరు స్త్రీలతో బాటు పార్షదులతో బాటు త్వరగా రథము దిగి గోపీ గోపగణములతో నిండియున్న ఆ సుందమైన సభను చేరబోయెను. దేవతలు గోపగోపీగణములు సంతోషముతో చేతులు జోడించి నిలిచిరి. సురరులు (దేవఋషులు నారదాదులు) సామవేదమున చెప్పబడిన స్తోత్రములతో స్తుతించిరి. శ్రీమన్నారాయణుడట్లు పోయి తన పరివారయుక్తముగా శ్రీకృష్ణ రూపములో లీనమయ్యెను. మిక్కిలి ఆశ్చర్యకరమైన ఆ దృశ్యమును చూచి అక్కడి వారందరు పరమాశ్చర్యమును పొందిరి.

ఏతస్కిన్నంతరే తత్ర శాతకుంభమయాద్రధాత్ ।

అమరుహ్య స్వయం విష్ణు: పాతా చ జగతాం పతిః ॥

ఆజగామచతుర్భాహర్వనమాలా విభూషితః ।

పీతాంబరధరః శ్రీమాన్ నస్మితః సుమనోహరః॥

సర్వాలంకార శోభాఢ్యః సూర్యకోటి సమప్రభః ।

ఉత్తస్థుస్తే చ తం దృష్ట్వా తుష్టువు: ప్రణతా మునే ॥

సచాపీ లీనస్తత్రైవ రాధికేశస్య విగ్రహే ।

తే దృష్ట్వా మహదాశ్చర్యం విస్మయం పరమం యయుః ॥

ఇంతలో అచ్చటికీ బంగారు రథము పై వచ్చిన గత్పతి, స్వయముగా స్థితికార్యముతో జగత్తులను కాపాడు (పాలించు) విష్ణువు, వనమాలా విభూషితుడు, పీతాంబరధారి, లక్ష్మీసమన్వితుడు, నాల్గు భుజములవాడు, చిరునవ్వుతో సుమనోహరుడైన అతడు ఆ రథము నుండి దిగి, సర్వాలంకార శోభతో కోటి సూర్య సమాన తేజస్సుతో రా అక్కడి వారందరు లేచి నిలచి (అతనిని చూడగనే) స్తోత్రము చేసిరి. ఆ స్వామి కూడ రాధికాప్రభు శరీరములోనే లీనమయ్యెను. ఆ గొప్పవింతను అక్కడివారు చూచి మిక్కిలి విస్మయము పొందిరి.

సంవిలీనే హరేరంగే శ్వేత ద్వీపనివాసిని ।

ఏతస్మిన్నంతరే తూర్ణమాజగామ త్వరాన్వితః॥

శుద్ధస్ఫటిక సంకాశో నామ్నా సంకర్షణః స్మృతః ।

సహస్ర శీర్షా పురుషః శతసూర్య సమప్రభః ॥

ఆగతం తుష్టు వుస్పర్వే దృష్ట్వా తం విషువిగ్రహం ।

న చాగత్య సతస్కంధః తుష్టావ రాధికేశ్వరం ॥

సహస్రమూర్ధా భక్త్యా చ ప్రణనామ చ నారద ।

ఆవాం చ ధర్మపుత్రౌ ద్వౌ నరనారాయణాభిధౌ ॥

లీనోఽహం కృష్ణపాధాబ్జే బభూవ ఫాల్గునోఽవరః ।

బ్రహ్మేశ శేష ధర్మాశ్చ తస్థురేకత్ర తత్ర వై      ॥

శ్వేత ద్వీపమునందు నివసించు విష్ణుదేవుడు అట్లు హరి (గోలోకకృష్ణుడు అంగమున లీనము కాగా- ఇంతలోనే శుద్ధమైన స్ఫటికమణి వంటి శరీర వర్ణముగల, సంకరణుడన్న నామము గల, సూరురు సూర్యుల వంటి తేజస్సు గల, సహస్ర శిరస్సులు గల పురుషుడు త్వరగా అక్కడికి వచ్చెను. వచ్చిన ఆ విష్ణుస్వరూపునీ చూచి అక్కడి వారందరు స్తోత్రమొనర్చిరి. అతడు రాధికా ప్రభువును స్తోత్రమొనర్చి భక్తితో వేయి తలలు వంచి నమస్కరించెను. ఓ నారదా! ధర్మఋషి పుత్రులము నారాయణుడు నరుడు అను నామములు గలవారమగు మేమిద్దరమున్నాము గదా. నేనా గోలోకమున కృష్ణపాదపద్మమున లీనమైతిని. (కృష్ణావతారకాలమున రెండవవాడగు నరుడు అర్జునుడు(ఫాలునుడు)గా జన్మించేను, అక్కడ బ్రహ్మ శంకరుడు ఆదిశేషుడు (సంకర్షణుడు) ధర్మదేవత ఒకచోట.

ఏతస్మిన్నంతరే దేవా దదృశూ రథముత్తమం ।

స్వర్ణసార వికారం చ నానారత్న పరిచ్ఛదం ॥

మణీంద్ర సారసంయుక్షం వహ్ని శుద్ధాంశుకాన్వితం ।

శ్వేత చామర సంయుక్తo భూషితం దర్పణాన్వితై: ॥

 నద్రత్న సార కలశ సమూహేన విరాజితం ।

 పారిజాత ప్రసూనానాం మాలాజలై: సుశోభితం ॥

 సహస్ర చక్ర సంయుక్తం మనోయాయి మనోహరం ।

గ్రీష్మ మధ్యాహ్న మార్తాండ ప్రభా మోషకరం వరం ॥

ముక్తామాణిక్య వజ్రానాం సమూహేన సముజ్జ్వలం ।

చిత్ర పుత్తలికా పుష్పసర: కానన చిత్రితం ॥

దేవానాం రానవానాం చ రథానాం ప్రవరం మునే ।

యత్నేన శంకర ప్రీత్యా విర్మితం విశ్వకర్మణా ॥

పంచాశద్యోజనోర్ధ్వం చ చతుర్యోజన విస్తృతం ।

రతి తుల్య వధూయుక్తైః శోభితం రతీమందిరైః ॥

ఇంతలో దేవతలచ్చట ఒక ఉత్తమమైన రథమును చూచిరి. ఆ రథము మేలిమి బంగారుతో చేయబడినది. నానావిధ రత్నాలంకార శోభితము. శ్రేష్ఠమైన మణుల సారము గలది. అగ్నివలె స్వచ్ఛమైన (ఎరుపు) వస్త్రముతో కూడినది. శ్వేతచామరములు నిలువుటద్దములతో అలంకరింపబడినది. వేయి చక్రములు గలిగి మనస్సు అంత వేగముగా ప్రయాణించుచు మనోహరమైనది. శంకరుని ప్రీత్యర్థము విశ్వకర్మ చేత పూనికతో దేవదానవులందరి రథములలో శ్రేష్ఠముగా నిర్మించబడినది. గ్రీష్మ ఋతువులోనీ రెండు జాముల సూర్యతేజస్సును దోచుకొనునట్టిదిగా, ముత్తెముల యొక్క మణుల యొక్క వజ్రముల యొక్క సమూహముతో వెలుగునది. కీలుబొమ్మలు పుష్పవనములు సరస్సులు అడవులు చిత్తరువుల రూపమున చిత్రించబడినది. ఏబది యోజనముల ఎత్తుతో నాలు యోజనముల వెడల్పుతో, రతీదేవికి సాటివచ్చు సుందరీమణులు గల రతీ మందిరములతో ఆ రథము అద్భుతముగా నుండెను.

తత్రస్థాం దదృశుర్దేవీం రత్నాలంకార భూషితాం ।

ప్రదగ్ధ స్వర్ణ సారాణాం ప్రభామోషకర ద్యుతిం॥

 తేజ స్స్వరూపామతులాం మూల ప్రకృతిమీశ్వరీం।

సహస్ర జనసంయుక్తాం నానాయుధ సమన్వితాం ॥

ఈషద్ధాస్య ప్రసన్నాస్యాం భక్తానుగ్రహకాతరాం ।

గండస్థల కపోలస్థ సద్రత్న కుండలోజ్జ్వలాం ॥

రత్నేంద్ర సార రచిత క్వణన్మంజీర రంజీతాం ।

మణీంద్ర మేఖలాయుక్త మధ్యదేశ సుశోభితాం ॥

సద్రత్నసార కేయూర కరకంకణ భూషితాం ।

మందార పుష్పమాలాభిరురస్థల సముజ్జ్వలాం ॥

నితంబ కఠిన శ్రోణిం పీవోన్నత కుచానతాం ।

శరత్సుధాకరాభాస వినిందాస్య మనోహరాం ॥

కజ్జలోజ్జ్వల రేఖాక్త వరత్నంకజ లోచనాం ।

చందనాగురు కస్తూరీ చిత్రపత్ర విభూషితాం ॥

ముక్తాపంక్తి ప్రభాముష్ట దంతరాజి విరాజితాం ।

ప్రపుల్ల మాలతీ మాలా సంసక్త కబరీం వరాం ॥

పక్షీంద్ర చంచు నాసాగ్ర గజేంద్ర మౌక్తికాన్వితాం ।

వహ్ని శద్ధాంశుకేనాతి జ్వలితేన సముజ్జ్వలాం ॥

 సీంహ పృష్ఠనమారుఢాం సుతాభ్యాం సహితాం ముదా ।

అక్కడిపోరు ఆ రథము మీది నున్న ఈశ్వరియైన మూలప్రకృతిని దర్శించిరి. జ్వలించుచున్న మేలిమి బంగారపు వన్నెను దోచుకొనుచున్న వెలుగుతో, సాటిలేని తేజస్స్వరూపముతో రత్నాలంకార భూషితయై, నానావిధములైన ఆయుధములు ధరించి సహస్రజనముతో ఇద్దరు కుమారులతో కొలువై యున్న ఆ దేవి కొద్దిపాటి నవ్వుతో ప్రసన్నమైన ముఖమండలము, భక్తుల ననుగ్రహించుటలోని త్వర, చెంపల మీది నుండి క్రిందికి ప్రసరించుచున్న రత్నకుండలముల ప్రభతో వెలయుచుండెను. మేలిరత్నములచే నిర్మించబడిన కాలియందేల ధ్వనితో, నడుము మీద వెలయుచున్న మణుల ఒడ్డాణముతో, రత్నసార నిర్మితములైన దండకడియములు కరకంకణముల అలంకారముతో, మందార పుష్పమాలలు ప్రకాశించుచున్న వక్షస్థలముతో, పుష్టిగా కఠినముగానున్న నితంబ శ్రేణీప్రదేశములతో పుష్టిగా ఎత్తుగా బరువైయున్న స్తన మండలము వలన కొద్దిగా వంగినట్లు తోచు పై భాగముతో శరత్కాలమందలి అమృత కీరణుని (చంద్రునికి కాంతినీ తిరస్కరించు నెమ్మోము (ముఖము}తో, చూచువారికి మనోహరముగా వెలయుచు, మెరుపు కాటుకను రేఖగా తీర్చిన. శరత్కాల పద్మములవంటి లోచనములతో (కన్నులు) చందనము అగురు కస్తూరి ద్రవ్యముల చేత చిత్రితములైన మకరికా పత్రరేఖల అలంకారము (చెంపల పైన రంగురంగులుగా గీసిన మొసలి చేషవంటి ఆకారరేఖలు} ముత్యాల వరుసల వన్నెను దోచుకోను పలు వరుసతో, నిండుగా విచ్చిన మాలతీ సుమమాలలలంకరించిన కొప్పుతో, గరుడుని ముక్కువంటి ముక్కు చివర వెలుగుచున్న ఏనుగు ముత్తైపు పోగుతో, అగ్నివలె ఎఱ్ఱగా మెరయుచున్న మేలి వస్త్రధారణముతో ప్రకాశించుచు ఆ దేవి సింహాము పైన.

అవరుహ్య రథాత్తూర్ణం శ్రీకృష్ణం ప్రణనాను చ॥

 సుభ్యాం నహితం దేవీ నమువాన వరాననా ।

గణేశః కార్తికేయశ్చ నత్వా కృష్ణం పరాత్పరం ॥

ననామ శంకరం ధర్మమనంతం కమలోద్భవం ।

ఉత్తస్థురారాత్తే దేవా దృష్ట్వా తౌ త్రిదశేశ్వరౌ ॥

ఆశిషం చ దదుర్దేవా వాసయామాసురంతికే ।

తాభ్యాం సహ సదాలాపం చక్రుర్దేవా ముదాన్వితాః ॥

ఆ దేవి కొడుకులతో బాటు రథము దిగి శ్రీకృష్ణునకు నమస్కరించి ఒకచోటనుండెను, గణేశుడు కుమారస్వామి పరాత్పరుడైన కృష్ణునకు నమస్కరించి ఆ వెనుక ఉన్న శంకరునకు, ధర్మదేవతకు అనంతునకు (సంకర్షణుడు - సహస్రశీరుడు} కమలోద్భవునకు (కమలమున పుట్టిన బ్రహ్మ} నమస్కరించి నిలిచిరి. దేవతలు వారిని చూచి ఆశీర్వాదములు చేసి సమీపమున కూర్చుండ పెట్టుకొని సంతోషముతో ఆ యిద్దరితో చక్కని సంభాషణము చేసిరి {ముచ్చటలాడిరి)

తస్థుర్దేవాస్సభామధ్యే దేవస్య పురతో హరేః ।

గోపా గోవ్యశ్చ బహుశో బభూవుర్విస్మయాకులాః ॥

ఆ సభామధ్యమున శ్రీహరి ముందు దేవతలందరు నిలిచి యుండిరి. ఆ దృశ్యమును చూచి గోలోకమందలి గోప గోపీగణములు మిక్కిలి విస్మయపడిరి.

ఉవాచ కమలాం కృష్ణ: స్మేరానన సరోరుహః ।

త్వం గచ్ఛ భీష్మకగృహం నానా రత్న సమన్వితం ॥

వైదర్భ్యా ఉదరే జన్మ లభ దేవి సనాతని।

తవ పాణిం గ్రహిష్యామి గత్వాఽహం కుండినం సతి ॥

అప్పుడు చిరునవ్వుతో వెలుగు ముఖపద్మముతో శ్రీకృష్ణుడు లక్ష్మీదేవితో "ఓ దేవీ! సనాతనురాలా! నీవు నానావిధ రత్న సంపద గల భీష్మకునింటికి పోయి అతని భార్య (వైదర్భి గర్భమున జన్మనెత్తుము. నేను కుండిన పురికి వచ్చి నీ పాణిగ్రహణము చేయుదును” (నిన్ను వివాహమాడుదును) అనెను.

తా దేవ్య: పార్వతీం దృష్ట్వా సముత్థాయ త్వరాన్వితాః ।

రత్నసింహాసనే రమ్యే వాసయామాసురీశ్వరీం॥

విపేంద్ర పార్వతీలక్ష్మీ వాగధిష్ఠాతృదేవతాః ।

తస్థురేకాసనే తత్ర సంభాష్య చ యథోచితం ॥

ఓ నారదా! పార్వతీదేవిని చూచి త్వరగా తమ ఆసనములనుండి లేచి ఆ దేవీ మణులు (లక్ష్మి, సరస్వతి) అందమైన రత్నసింహాసనము పై ఆ ఈశ్వరిని కూర్చుండ బెట్టిరి. పార్వతి లక్ష్మీసరస్వతి ఒకే పీఠమున కూర్చుండి యథోచితముగా మాట్లాడుకొనిరి.

తాశ్చ సంభాషయామానుః సంప్రీత్యా గోవకన్యకాః ।

ఊచుర్గోపాలికా: కాశ్చిస్ముదా తాసాం చ సన్నిధౌ ॥

ఆ ముగ్గురు గోపకన్యలతో సంప్రీతితో మాట్లాడిరి. ఆ గోపికలలో కొందరు వారి సన్నిధిలో సంతోషముగా పలికిరి.

శ్రీకృష్ణః పార్వతీం తత్ర సమువాచ జగత్పతిః ।

దేవి త్వమంశరూపేణ వ్రజ నందవ్రజే శుభే ॥

ఉదరే చ యశోదాయాః కల్యాణీ నంద రేతసా।

లభ జన్మ మహామాయే సృష్టి సంహార కారిణీ ॥

 గ్రామే గ్రామే చ పూజాం తే కారయిష్యామి భూతలే।

గృత్స్నే మహీతలే భక్త్యా నగరేషు వనేషు చ ॥

తత్రాధిష్ఠాతృ దేవీం త్వాం పూజయిష్యంతీ మానవాః ।

 ద్రవ్యైర్నానావిధైర్దివ్యైర్బలిభిశ్చ ముదాఽన్వితా: ॥

 త్వద్భూమీ స్పర్శ మాత్రేణ సూతికా మందిరే శివే ।

పితా మాం తత్ర సంస్థాప్య త్వామాదాయ గమిష్యతి ॥

 కంసదర్శన మాత్రేణ గమిష్యసి శివాంతీకం ।

భారావతరణం కృత్వా గమిష్యామీ స్వమాశ్రమం ॥

జగత్పతియైన శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ పార్వతీ దేవీతో ఇట్లనెను. ఓ దేవీ! నీవు అంశరూపముతో శుభమైన నందుని వ్రజమునకు పొమ్ము. ఓ సృష్ట సంహారము చేయుదానా! మహామాయా! కల్యాణీ! నందుని వీర్యము ద్వారా యశోదాదేవి గర్భమున జన్మించుము. భూమండలమున భూమియందు ప్రతీనగరములో ప్రతి వనములో ప్రతి గ్రామమున భక్తితో జనులు అక్కడక్కడ అధిష్టాన దేవతగా (ప్రధాన దేవతగా పూజించునట్లు నీ పూజలు చేయింతును. మానవులు నానావిధ ద్రవ్యములతో దివ్యమైన బలులతో సంతోషముగా నిన్నర్చింతురు. నందుని యింట యశోద సూతికా గృహమున నీవు భూమిని తాకినంత మాత్రమున (పుట్టగానే నన్ను గన్న తండ్రి నన్నక్కడ ఉంచి నిన్ను తీసుకొని పోవును. కంసుడు నిన్ను దర్శించగానే నీవు (అవతారము చాలించి) శివుని సమీపమునకు పోదువు. నేను భూమీ యొక్క భారమును దింపి సోలోకమునకు వెళ్లిపోదును.

ఇత్యుక్త్వా శ్రీహరి సూర్ణమువాచ చ షడాసనం।

అంశరూపేణ వత్స త్వం గమిష్యసి మహీతలం ॥

జాంబవత్యాశ్చ గర్భే చ లభ జన్మ సురేశ్వర ।

అంశేన దేవతాస్సర్వా గచ్ఛంతు ధరణీ తలం॥

భాగహారం కరిష్యామీ వసుధాయాశ్చ నిశ్చితం ।

ఇత్యుక్త్వా రాధికానాథ స్తస్థౌ సీంహాసనే వరే ॥

ఇట్లు పలికి శ్రీహరి ఆరు ముఖములు గల కుమారస్వామితో నాయనా! నీవును అంశరూపమున భూతలమునకు వెళ్లుము. ఓ సురేశ్వరా! నీవు జాంబవతి గర్భమున జన్మించుము. దేవతలారా మీరందరు తమ అంశలతో ధరణీ తలమునకు పొండు. నిశ్చయముగా భూదేవీ భారమును తొలగింతును అని పల్కి రాధానాధుడు సింహాసనముపై కూర్చుండెను.

 తస్థుర్దేవాశ్చ దేవ్యశ్చ గోపా గోవ్యశ్చ నారద ।

ఏతస్మిన్నంతరే బ్రహ్మా తస్థౌ సముత్తస్థా హరేః పురః ॥

పుటాంజలిర్జగత్కాంతమువాచ వినయాన్వితం ॥

బ్రహ్మోవాచ :

అవధానం కురు విభో కింకరన్య నివేదనం ॥

ఆజ్ఞాం కురు మహాభాగ కన్య కుత్ర స్థలం భువి ।

 భర్తా పాతోద్ధారకర్తా సేవకానాం ప్రభుస్సదా ॥

స భృత్యః సర్వదా భక్త ఈశోజ్ఞాం కరోతి యః।

కే దేవా: డేన రూపేణ దేవ్యశ్చ కలయా కయా ॥

కుత్ర కస్యాభిధేయం చ విషయం చ మహీతలే ।

 బ్రహ్మణో వచనం శ్రుత్వా ప్రత్యువాచ జగత్పతి:॥

ఓ నారదా! దేవతలు దేవీమణులు గోపాలకులు, గోపికలు నిలిచి యుండగా ఇంతలో బ్రహ్మ శ్రీహరి ముందు చేతులు జోడించి జగన్మనోహరుడైన స్వామితో వినయముతో ఇట్లు పలికెను. ఓ ప్రభూ! ఈ సేవకుని విజ్ఞాపనమును చిత్తగించవలెను. సేవకులమగు మాకు నీవు ప్రభువువు. మమ్ము భరించువాడవు పొలించువాడవు, ఉద్ధరించువాడవు నీవే. ఓ మహానుభావా! భూమండలమున ఎవరికెక్కడ జన్మస్థలము? ఏ దేవతలు ఏ దేవీ మణులు ఏ రూపమున ఏ కళతో జన్మించవలెను? ఎవనికీ ఏ పేరుతో వ్యవహారము? మహీతలమున ఏ దేశము ఎవరికి నిర్దేశించబడినది? ఎవడు ఈశ్వరుడవగు నీ ఆజ్ఞను సర్వదా పాలించునో వాడే నీ భక్తుడు. నీచేత పోషింపబడువాడు అని అనెను.

శ్రీకృష్ణ ఉవాచ :

యత్ర యస్యావకాశం చ కథయామీ విధానతః ।

కామదేవో రౌక్మిణీయో రతి ర్మాయావతీ సతీ ॥

శంబరస్య గృహే యా చ ఛాయారూపేణ సంస్థితా ।

త్వం తస్య పుత్రో భవితా నామ్నాఽనిరుద్ధ ఏవ చ॥

భారతీ శోణితపురే బాణపుత్రీ భవిష్యతి ।

అనంతో దేవకీ గర్భాద్రౌహిణేయో జగత్పతిః ॥

మాయయా గర్భనంకర్షాన్నామ్నా సంకర్షణః ప్రభుః ।

కాలిందీ సూర్యతనయా గంగాంశేన మహీతలే ॥

ఆర్థాంశేనైవ తులసీ లక్ష్మణా రాజకన్యకా ।

సావిత్రీ వేదమాతా చ నామ్నా నాగ్నజితీ సతీ ॥

వసుంధరా సత్యభామా శైభ్యాదేవీ సరస్వతీ ।

రోహిణీ మిత్రవిందా చ భవితా రాజకన్యకా: ॥

సూర్యపత్నీ రత్నమాలా కలయా చ జగత్ర్పభో: ।

 స్వాహాంశేన సుశీలా చ రుక్మీణ్యాధ్యా: స్త్రియో నవ॥

దుర్గాంశార్దా జాంబవతీ మహీషీణాం దశ స్మృతాః ।

 ఆర్థాంశేన శైలపుత్రీ యాతు జాంబవతో గృహం ॥

కైలాసే శంకరాజ్ఞా చ బభూవ పార్వతీం పురా।

కైలాస గామినం విష్ణుం శ్వేతద్వీప నివాసినం ॥

ఆలింగనం దేహి కాంతే నాస్తి దోషో మమాజ్ఞయా ॥

ఇట్లు పలికిన బ్రహ్మవాక్కులు విని జగన్నాథుడు “ఎక్కడ ఎవనికి ఏయవకాశమీయబడినదో క్రమముగా చెప్పుదును” అని శ్రీకృష్ణపరమాత్మ ఇట్లు పలికెను. మన్మధుడు రుక్మిణీ పుత్రుడుగా జన్మించును. రతీదేవి మాయలెరుగునది కాన శంబరాసురుని గృహమున ఛాయారూపమున నీలిచియుండును. ఆ రతీ ప్రద్యుమ్నులకు (రుక్మిణీ పుత్రుడు) నీవు పుత్రుడవై జన్మించి అనిరుద్ధనామముతో వ్యవహరింపబడుదువు. భారతీదేవి శోణితపురములో బాణాసురుని పుత్రికగా జన్మించును. జగత్పతి యగు అనంతుడు దేవికీ గర్భమున ప్రవేశించి మోయవలన ఆమె గర్భమునుండి సంకర్షింపబడి (చక్కగా లాగబడి) రోహిణీ గర్భము చేరి ఆమె పుత్రుడుగా జనించును. ఆ ప్రభువు గర్భసంకర్షణ కారణముగా సంకర్షణుడన్న నామముతో ప్రసిద్ధుడగును. సూర్యపుత్రీకయగు యమున కాళిందియన్న పేరుతో గంగాదేవి అంశతో జన్మించును. తులసీదేవి అర్ధాంశతో లక్ష్మణయను రాజకన్యగా, వేదమాత యగు సావిత్రీ దేవి నాగ్నజితియను నామముతో, భూదేవి సత్య భామగా, సరస్వతీదేవి శైబ్యగా, రోహిణీ దేవి (చంద్రుని భార్య) మిత్రవిందయను రాజకన్యగా, జగత్ర్పభువగు సూర్యుని యొక్క భార్య అంశతో రత్నమాల, స్వాహాదేవి (అగ్ని భార్య) అంశతో సుశీల, ఇట్లు రుక్మిణి మొదలగు స్త్రీలు తొమ్మండుగురు జన్మింతురు. దుర్గాదేవి అర్ధాంశయగు జాంబవతితో కలిసి పదిమంది మహిషులు (శ్రీకృష్ణావతారమున పట్టపురాణులు) చెప్పబడుదురు. ప్రస్తుతము పార్వతీదేవి తన అర్థాంశతో జాంబవంతుని గృహమునకేగుగాక. పూర్వము పార్వతీ దేవికి కైలాస పర్వతము మీద శంకరాళ్ల లభించినది. శ్వేత ద్వీప నివాసియగు విష్ణువు కైలాసమునకేగగా “ఓ ప్రియురాలా! పార్వతీ!} నా ఆజ్ఞతో ఈ విష్ణువునకు ఆలింగన మిమ్ము నీకు దోషము లేదు” అనెను.

బ్రహ్మోవాచ :

కథం శివాజ్ఞా తాం దేవీం బభూవ రాధికాపతే ।

విష్ణోః సంభాషణే పూర్వం శ్వేతద్వీపనివాసినః॥

శ్రీ భగవానువాచ :

పురా గణేశం ద్రష్టుం చ వ్రజగ్ము: సర్వదేవతాః ।

శ్వేతద్వీపాత్స్వయం విష్ణుర్జగామ శంకరాలయే ॥

దృష్ట్వా గణేశం ముదితః సమువాస వరాననే ।

 సుఖేన దదృశుః సర్వే త్రైలోక్య మోహనం వపుః ॥

 ఓ రాధినాధా! శ్వేత ద్వీపవాసియగు విష్ణువుతో సంభాషించునప్పుడు పార్వతీదేవికి శివుని ఆజ్ఞ ఎట్లు లభించెను? అని బ్రహ్మదేవుడడుగగా భగవంతుడగు రాధాపతి ఇట్లు పల్కెను. పూర్వము గణేశుని దర్శించుటకై సర్వదేవతలు శంకరునీ నివాసమునకు (కైలాసమునకు వెళ్లిరి. స్వయముగా విష్ణువు శ్వేతద్వీపము నుండి అక్కడకు పోయెను. అతడు గణేశుని దర్శించి సంతోషించి ఉత్తమాసనము మీద కూర్చుండెను. అప్పుడక్కడి వారందరు ముల్లోకములను మోహింపజేయు విష్ణువును సుఖముగా దర్శించిరి.

కిరీటిసం కుండలినం పీతాంబరధరం వరం ।

సుందరం శ్యామరూపం చ నవయౌవన నంయుతం॥

చందనాగురు కస్తూరీ చందన ద్రవ సంయుతం ।

రత్నాలంకార శోభాడ్యం స్మేరానస సరోరుహం ॥

రత్నసింహానర్థం చ పార్షదైః పరివేష్టితం ।

వందితం చ సురైస్సర్యై: శివేన పూజితం స్తుతం ॥

తం దృష్ట్వా పార్వతీ విష్ణుం ప్రసన్నవదనేక్షణా ।

ముఖమాచ్ఛాదితం చక్రే వాససా క్రీడయా సతీ॥

నవయౌవనము గలవాడు సుందరుడు శ్యామవర్ణుడు కిరీటధారి కుండలాలంకృతుడు పీతాంబరధారి చందనము ఆగురు కస్తూరీ మొదలగు సుగంధ వస్తువుల ద్రవము పులిమిన విగ్రహము గలవాడు, రత్నాలంకారముల శోభతో అధికుడై చిరునవ్వు ముఖపద్మమున వెలుగగా పార్షదుల చేత చుట్టు సేవింపబడుచు రత్న సింహాసనముననున్న విష్ణువును దర్శించి సురలందరు నమస్కారములు చేయగా శివుడును పూజించి స్తుతించెను. అట్టి విష్ణువును పార్వతీ దేవి ప్రసన్నముఖము, కన్నులు కలదై చూచీ విలాసముగా ఆ సాధ్వి వస్త్రముతో తన ముఖము కప్పుకొనెను.

అతీవ సుందరం రూపం దర్శందర్శం పునః పునః ।

 దదర్శ ముఖమచ్చాద్య నిమేషరహితా సతీ ॥

పరమాద్భుత వేషం చ సస్మితా వక్ర చక్షుషా ।

సుఖసాగర సమ్మగ్నా బభూవ వులకాంచితా ॥

క్షణం దదర్శ పంచాస్యం శుభ్రవర్ణం త్రిలోచనం ।

త్రిశూల పరీఘదరం కందర్ప కోటి సుందరం ॥

క్షణం దదర్శ శ్యామం తమేకాస్యం చ ద్విలోచనం ।

చతుర్భుజం పీతవస్త్రం వనమాలా విభూషితం॥

 ఏకం బ్రహ్మ మూర్తిభేదమఖేదం వా నిరూపితం ।

దృష్ట్వా బభూవ సా మాయా నకామా విష్ణుమాయయా॥

మిక్కిలి సుందరముగా నున్న ఆవిష్ణురూపమును ముఖమునకు కప్పుకోనియే మరల మరల చూచి చూచి ఆసతి కనురెప్పపాటు లేనిది. పరమాద్భుతమై ఆ వేషమును చిరునవ్వుతో వంకరచూపుతో చూచి శరీరము పులకలేత్తగా సుఖసముద్రమున మునిగిపోయెను. ఒక క్షణము సేపు ఐదు ముఖములు గలవాడును,' మూడు కన్నులు గలవాడును త్రిశూలము పరిఘ ధరించినవాడును కోటి మన్మధ సుందరుడును తెల్లని వర్ణము గలవాడగు శంకరుని దర్శించి మరియొక క్షణము నల్లనివాడును ఏకముఖుడును రెండు కన్నులు గలవాడును నాల్గు భుజములు (హస్తములు) గలవాడును పీతవస్త్రము (పసుపు వన్నె వస్త్రము) వనమాలల చేత అలంకృతుడగు విష్ణువు నామె చూచెను. ఒకే పరబ్రహ్మ యొక్క ఆకారము వలన ఏర్పడిన భేదము భేదరహితముగా నిరూపింపబడినదో అన్నట్లున్న తత్త్వమును చూచి ఆ మాయాదేవి వీపుమాయ చేత కోరికలు కలదయ్యెను. (సకామా-కాముకురాలు.

మదంశాశ్చ త్రయో దేవా బ్రహ్మవిష్ణు మహేశ్వరాః ।

తాభ్యామౌత్కర్ష పాతాచ్చ శ్రేష్ఠః సత్త్వ గుణాత్మకః ॥

ఓయీ! బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురు దేవతలు నా అంశలే ఐనను ఆ బ్రహ్మమ హేశ్వరుల కంటె సత్త్వగుణమే తన స్వరూపమగుట వలన (బ్రహ్మమహేశ్వరులు రజస్తమో, గుణాత్మకులు) ఉత్కృష్ణస్థితి కలిగీ విష్ణువు శ్రేష్ఠుడయ్యెను. (ఇది కథ నడుమ శ్రీకృష్ణుని వివరణము).

దృష్ట్వా తం పార్వతీ భక్త్యా పులకాంచిత విగ్రహా।

మనసా పూజయామాన పరమాత్మానమీశ్వరం॥

మొదట మనోవికారము పొందిన పార్వతీదేవి అతనిని చూచి భక్తితో పులకలెత్తిన శరీరము కలదై ఆ పరమాత్మను మనస్సులో పూజించెను.

దుర్గాంఽతరాభిప్రాయం చ బుబుధే శంకరః స్వయం ।

సర్వాంతరాత్మా భగవానంతర్యామీ జగత్పతిః ॥

జగత్ర్పభువు సర్వజీవుల కంతరాత్మ ఆత్మలలో వెలుగువాడు భగవంతుడు అగు శంకరుడు పార్వతి చెప్పకుండగనే ఆమె అభిప్రాయమును తెలిసికొనెను.

దుర్గాం నిర్జనమాహూయ తామువాచ హరః స్వయం ।

బోధయామాస వివిధం హితం తథ్యమఖండితం॥

పార్వతిని ఏకాంత ప్రదేశమునకు పిలిచి శంకరుడామెకు స్వయముగా హితము సత్యము ఐనదానిని భిన్నభిన్నముగా నుండియు అఖండితము {ఏకస్వరూపము) ఐన తత్త్వమును బోధించెను.

శ్రీ శంకర ఉవాచ :

నివేదనం మదీయం చ నిబోధ శైలకన్యకే ।

శృంగారం దేహి భద్రం తే హరయే పరమాత్మనే ॥

అహం బ్రహ్మా చ విష్ణుశ్చ బ్రహ్మైకం చ సనాతనం ।

వేదైకో వేదరహితో విషయాన్మూర్తి భేదకః॥

ఏకో ప్రకృతి స్పర్వేషాం మాతా త్వం సర్వరూపిణీ ।

 న్వయంభూరసి వాణీ త్వం లక్ష్మీర్నారాయణోరసి ॥

మమ వక్షసి దుర్గా త్వం నిబోధాధ్యాత్మకం సతి।

శివస్య వచనం శ్రుత్వా తమువాచ సురేశ్వరీ ॥

శ్రీశంకరుడిట్లు పలికెను :

ఓ శైలపుత్రీ! నేను నివేదించు మాటను వినుము. పరమాత్మయగు శ్రీహరికి శృంగార సేవచేయుము. నీకు మంగళమగును. నేను బ్రహ్మ విష్ణువు ముగ్గురము సనాతనమైన ఒకే పరమాత్మ (బ్రహ్మ) రూపులము. వేదములకతీతమైన ఏకరూపమని తెలిసికొనుము. సృష్టిస్థితి సంహారములు రజస్సత్త్వ తమస్సులు అన్న విషయములను బట్టి వేరు వేరు ఆకారములతో సున్నాము. జీవకోటికంతటికి మూలమైన నీవు ఒకే ఒక మాతవు. సర్వరూపములు నీవే. బ్రహ్మ వద్ద సరస్వతివి నీవు. నారాయణుని వక్ష స్థలమున లక్ష్మివి నీవు. నా హృదయమున దుర్గవు నీవు. ఇది అధ్యాత్మ తత్త్వముగా తెలిసికొనుము. ఇట్లు పల్కిన శివుని వాక్కు విని పార్వతి అతనితో ఇట్లనెను.

పార్వత్యువాచ :

దీనబంధో కృపాసింధో మామకృపా కథం ।

సుచిరం తపసా లబ్ధో నాధస్త్వం జగతాం మయా ॥

మాదృశీం కింకరీం నాథ న పరిత్యక్తుమర్హసి ।

అయోగ్యమీదృశం వాక్యం మా మా వద మహేశ్వర ॥

 తవ వాక్యం మహాదేవ కరిష్యామ్యేవ పాలనం ।

 దేహాంతరే జన్మ లబ్ధ్వా భజిష్యామి హరీం హర ॥

ఇత్యేవం వచనం శ్రుత్వా వీరరామ మహేశ్వరః ।

ఉచ్ఛైర్జహాసాభయద: పార్వత్య చాభయం దదౌ ॥

పార్వతి ఇట్లు పలికెను :

దీనులకు బంధూ! కృపా సముద్రుడా! నా యందు నీకీ నిర్దయ ఎందులకు? ఓ జగత్తులకు నాధుడా! నేను చిరకాలము తపస్సు చేయగా నాకు లభించితివి. నావంటి సేవకురాలిని నీవు విడిచి పెట్టవలదు. ఓ మహేశ్వరా! అయోగ్యమైన ఇబీమాట నన్ననవలదు. స్వామీ నీ మాటను ఆజ్ఞగా తప్పక పాలింతును, మరల నేను జన్మించి ఇంకొక దేహముతో విష్ణువును సేవింతును. ఇట్లు పల్కిన ఆమె మాటలు విని అభయప్రదుడు అగు మహేశ్వరుడు బిగ్గరగా నవ్వి పార్వతికి అట్లే అని అభయమిచ్చి సంభాషణ చాలించెను.

తత్ప్రతిజ్ఞాపాలనాయ పార్వతీ జాంబవద్గృహే।

లభిష్యతి జనుర్ధాతర్నామ్నా జాంబవతీ సతీ॥

ఓ బ్రహ్మదేవుడా! (శ్రీహరి వాక్కు) పార్వతీదేవి ఆ ప్రతిజ్ఞను పాలించుట కొఱకే జాంబవతియన్న పేరుతో జాంబవంతుని ఇంట జన్మనెత్తగలదు.

బ్రహ్మోవాచ :

భూమౌ కతివిధే భూ పే సంస్థితే పార్వతీ కథం ।

లలాభ భారతే జన్మ నిందితే భాల్లుకే గృహే ॥

బ్రహ్మ ఇట్లనెను :

భూమియందు ఎందరో రాజులుండగా పార్వతి భారతవర్షమున నిందించబడు ఎలుగుబంటి గృహమున ఎందుకు జన్మపొందెను?

శ్రీకృష్ణ ఉవాచ :

రామావతారే త్రేతాయాం దేవాంశాశ్చ యయుర్మహీం ।

హిమాలయాంశో భల్లూకో జాంబవాన్నామ కింకరః ॥

రామస్య వరదానేన చిరంజీవీ శ్రీయాయుతః।

కోటి సింహ బలాధానం విధత్తే చ మహాబలః ॥

పితురంశగృహే దుర్గా జగామాంశేన భూతలం ।

పూర్వం పూర్వస్య వృత్తాంతం కథితం శ్రుణు మన్ముఖాత్ ॥

శ్రీ కృష్ణుడిట్లనెను :

త్రేతాయుగమున రామావతార కాలమునందు దేవతలు తమ అంశలతో భూమికి పోయిరి. హిమాలయ పర్వతాంశతో జాంబవంతుడన్న పేరుతో ఎలుగుబంటీగా సేవచేసి రాముని వరదానము వలన చీరంజీవియై రామభక్తి యను సంపద గలవాడై ఆ మహాబలుడు కోటిసింహముల బలము ధరించెను. అట్టి తన తండ్రి అంశగలవాని యింట జన్మించుటకై పార్వతి తన అంశతో భూమి మీదికి వెళ్లెను. ఇంతవరకే కొంత పూర్వవృత్తాంతము చెప్పితిని కదా. ఇంకను నావలన తరువాత వచ్చు విషయములు వినుము.

సర్వేషాం చ సురాణాం వై వంశా గచ్ఛంతు భూతలం ।

నృపపుత్రా మత్సహాయా భవిష్యంతి రణే విధే॥

కమలా కలయా సర్వా భవంతు నృపకన్యకాః ।

మన్మహిష్యో భవిష్యంతీ సహస్రాణాం చ షోడశ॥

ధర్మోఽయమంశ రూపేణ పాండుపుత్రో యుధిష్ఠిరః ।

వాయోరంశాద్భీమ సేనః స వ హ్యర్జునః న్వయం ॥

నకుల సహదేవశ్చ స్వర్వైద్యాంశ సముద్భవౌ ।

సూర్యాంశః కర్ణ వీరశ్చ విదురః న యమః స్వయం ॥

దుర్యోధనః కలేరంశః సముద్రాంశశ్చ శంతను:।

 అశ్వత్థామా శంకరాంశో ద్రోణో వహ్న్యంశ సంభవః॥

 హుతాశనాంశోభగవాన్ ధృష్ట ద్యుమ్నో మహాబలః ।

చంద్రాంశోఽవ్యభిమన్యుశ్చ భీష్మశ్చైవ వసూద్భవః ॥

వసుదేవః కశ్యపాంశోఽవ్యదిత్యంశా చ దేవకీ ।

వస్వంశోనంద గోపశ్చ యశోదా వసుకామినీ॥

 ద్రౌపదీ కమలాంశా చ యజ్ఞకుండ సముద్భవా ।

 సుభద్రా శతరూపాంశా దేవకీ గర్భసంభవా ॥

దేవా గచ్ఛంతు పృథివీమంశేన భారహారకాః ।

కలయా దేవ పత్స్యశ్చ గచ్ఛంతు పృథివీతలం ॥

ఇత్యేవముక్త్వా భగవాన్ విరారమ చ నారద ।

సర్వం వివరణం శ్రుత్వా తత్రోవాస ప్రజాపతిః ॥

ఓ బ్రహ్మా! మొత్తము దేవతల వంశములు భూతలమునకు పోదురు గాక. వారు రాజపుత్రులై యుద్ధరంగమున నాకు సహాయమగుదురు. కమల (లక్ష్మి అంశతో దేవతాస్త్రీలందరు రాజకన్యలుగా జన్మించీ ఒక వేయి పదహారుగురు నాకు మహిషులుగా అగుదురు. ఈ ధర్మదేవుని అంశతో పొండు పుత్రుడైన ధర్మరాజు, వాయువు అంశతో భీమ సేనుడు స్వయముగా ఇంద్రుడు అర్జునుడై, "దేవవైద్యులైన అశ్వినీ దేవత లిద్దరీ ఆంశలతో నకులసహదేవులు జన్మింతురు. వీరుడైన కర్ణుడు సూర్యాంశతో, యముడు స్వయముగా విదురుడై కలి అంశతో దుర్యోధనుడు సముద్రుని అంశతో శంతనుడు, శంకరాంశతో అశ్వత్థామ, అగ్నీ అంశతో ద్రోణుడు జన్మింతురు. భగవంతుడగు హుతాశనుని {అగ్నియొక్క) అంశతో మహాబలవంతుడైన ధృష్టద్యుమ్నుడు, చంద్రుని అంశతో అభిమన్యుడు, వసువు భీష్ముడుగా జన్మీంతురు. కశ్యపప్రజాపతీ అంశతో వసుదేవుడు, అదితీ అంశతో దేవకీదేవి, నందగోపుడు వసువు అంశతోను, యశోద వసువు భార్య అంశతో ను, యజ్ఞకుండమున జన్మించిన ద్రౌపది లక్ష్మి అంశతోను, దేవకీ గర్భమున జన్మించు సుభద్ర శతరూప అంశతోను జన్మింతురు. దేవతలందరు తమ అంశలతో భూమిభారమును హరించు పొరుగా, దేవపత్నులు తమ అంశలతోను పృథివి మీదికీ పోదురుగాక. ఓ సారదా! ఇట్లు భగవంతుడైన శ్రీహరి పలికి ముగించెను. ఈ వివరణమంతయు వినీ ప్రజాపతి (బ్రహ్మ) అక్కడ నిలిచియుండెను.

కృష్ణస్య వామే వాగ్దేవీ దక్షిణే కమలాలయా ।

పురతో దేవతాస్సర్వాః పార్వతీ చాపి నారద ॥

 గోప్యో గోపాశ్చ వరితో రాధా వక్షస్థలస్థితా ।

ఏతస్మిన్నంతరే సా చ తమువాచ ప్రజేశ్వరీ ॥

కృష్ణునకెడమవైపున సరస్వతీయు కుడివైపున కమలాలయము (లక్ష్మి) ముందర దేవతలందరు పార్వతియు, గోపాలకులు గోపికలు చుట్టును, స్వామి వక్షస్థలమున రాధాదేవియు ఉన్న సందర్భమున ప్రజేశ్వరి గోలోకనాయిక) అగు రాధ హరితో ఇట్లు పలికెను.

రాధికో వాచ:

శ్రుణు నాధ ప్రవక్ష్యామి కింకరీవచనం ప్రభో।

ప్రాణా దహంతి సతతమాందోలయతి మే మనః॥

చక్షుర్నిమీలనం కర్తుమశక్తా తవ దర్శనే ।

త్వయా వినా కథం నాథ యాస్యామి ధరణీతలం ॥

కియత్కాలాంతరేణైవ మేలనం మే త్వయా నహ ।

ప్రాణేశ్వర బ్రూహి సత్యం భవిష్యత్యేవ గోకులే॥

నిమేషం చ యుగశతం భవితా మే త్వయా నహ।

కం ద్రక్ష్యామి క్వ యాస్యామి కో వా మాం పాలయిష్యతి ॥

మాతరం పితరం బంధుం భ్రాతరం భగినీం సుతం ।

త్వయా వినాఽహం ప్రాణేశ చింతయామి న కంచన ॥

కరోషి మాయయా ఛన్నాం మాం చేన్మాయేశ భూతలే ।

 విన్మృతాం విభవం దత్యా మే సత్యం శపథం కురు ॥

అనుక్షణం మమ మనో మధుపో మధుసూదన ।

కరోతు భ్రమణం నిత్యం సమాధ్వీకే పదాంబుజే॥

యత్ర యత్ర చ యస్యాం వా యోనౌ జన్మ భవత్విదం ।

 త్వం స్వస్య స్మరణం దాస్యం మహ్యం దాస్యసి వాంఛితం ॥

 కృష్ణస్త్యం రాధికాఽహం చ ప్రేమ సౌభాగ్యమావయోః।

న విస్మరామి భూమౌ చ దేహి మహ్యం వరం వరం ॥

 యథా తన్వా సహ ప్రాణాః శరీరం ఛాయయా సహ ।

తథాఽఽవయోర్జన్మ యాతు దేహి మహ్యం వరం ప్రభో ॥

చక్షుర్నిమేష విచ్ఛేదో భవితా నావయోర్భువి।

తత్రాగత్యాపి కుత్రోపీ దేహిమహ్యం పరం ప్రభో ॥

 మము ప్రాణైస్తవ తనుం కే వా కరుణా హరే ।

ఆత్మనా మురలిపాదౌ మనసా వా వినిర్మితౌ॥

 స్త్రీయః కతివిధాస్పంచి పురుషా వా పురుష్టుత ।

నాస్తి కుత్రాపి కాంతా వా కాంత్యా శక్త్యా చ మాదృశీ॥

 తవ దేహార్థభాగేన కేన వాఽహం ఏనిర్మితా ।

అయమేవావయోర్భేదో నాస్ర్యతస్త్వయి మే మనః ॥

మమాత్మా మానసం ప్రాణాన్వయి సంస్థాపితా యథా ।

తవాత్మ మానసప్రాణ మయి వా సంస్థితాస్తథా॥

అతో నిమేష విరహాదాత్మనోర్విక్లబం మనః ।

ప్రదగ్ధం సంతతం ప్రాణా దహంతి విరహ శ్రుతౌ ॥

ఇత్యేవముక్త్వా సా దేవీ తత్త్రైవ నురనుందరీ ।

 భూయోభూయో రురోరోచైర్దృ తచ్చరణాంబుజం ॥

రాధాదేవి ఇట్లు పలికెను :

ఓ ప్రభూ! నొ నాథా ! ఈ నీ సేవకురాలు పలుకు మాటలు వినుము. నాప్రాణములు కొలుచున్నవి, ఎల్లప్పుడు నా మనస్సు ఊగిసలాడుచున్నది. నీ దివ్యదర్శన సమయములో కన్ను మూయుటకుసు అశక్తురాలనగు నేను నీవు లేకుండ భూతలమున కెట్లు వెళుదును? ఓ ప్రాణేశ్వరా! ఎంతకాలము తరువాత మరల గోకులమున గోలోకము) నీతో నాకు కలయిక ఏర్పడును? సత్యము చెప్పుము. నీవు లేకుండ నాకు ఒక నిమిషము నూరు యుగములగును. ఎవరిని చూతును? ఎక్కడకు పోదును? నన్నెవరు పాలింతురు? ఓ ప్రాణేశా! నీవు కాకుండ తల్లిని గావి, తండ్రిని గాని, చుట్టమును గాని, అన్నదమ్ములను గాని, అక్క చెల్లెండను గాని, ' ఎవరిని కూడ స్మరించను. ఓమాయేశా! నన్ను భూతలమున నీ మాయతో కప్పుదువేని. (మరువబడిన పూర్వవైభవము గలదానీగా చేతువేని) నా శపథమును (ముందు వివరింపబోవుదానీని) సత్యమొనర్చుము. ఓ మధువను రాక్షసుని చంపిన మహానుభావా! నా మనస్సనెడి తుమ్మెద - తేనెలూరు నీపాదపద్మమునందు ప్రతిక్షణము విడువకుండ తిరుగుచుండుగాక. ఎక్కడెక్కడ ఏయే తల్లి గర్భమునందు (ఏయే శరీరరూపమున) నాకు జన్మ ఏర్పడునో ఆ ప్రతిజన్మలోను నీ స్మరణము { నీమీద. తలంపు! నీ దాస్యము నా కోరికగా నాకు అనుగ్రహింపుము. నీవు శ్రీకృష్ణుడవు నేను రాధను అనియు, మన యిద్దరి ప్రేమ సౌభాగ్యమును భూమి యందలి జన్మలో నేను మరువకుండునట్లు శ్రేష్టమైన వరము నాకిమ్ము, శరీరముతోపాటు ప్రాణములవలె ఆకారముతో పాటు నీడవలె మన ఇద్దరి జన్మ అవినాభావమై ఒకటి లేకుండ ఇంకొకటి ఉండనట్లు) ఉండునట్లు నాకు వరమిమ్ము స్వామీ! ఓ శ్రీహరీ! నా ప్రాణముతో నీ శరీరము, నా ఆత్మతో నీ మురళి, నామనస్సుతో నీ పాదములు నాయొక్క ఏదో అంశతో నీ దయ నీర్మించబడినవి. ఓ నిగమసంస్తుతా! స్త్రీలుగాని పురుషులు గానీ ఎన్నోవిధములుగా నున్నారు. కానీ ఎక్కడ కూడ ఏ స్త్రీ కూడ కాంతిలో శక్తితో నావంటిది లేదు. మన ఉభయులకు భూమండలమున కేగినపుడు గాని ఎక్కడ గాని కనురెప్పపాటంతకాలము వియోగము ఏర్పడకుండుగాక. అట్టి వరము నాకిమ్ము. నేను నీ దేహమందలీ ఏదో ఒక అర్థభాగము చేత నిర్మించబడితిని. అందువలననే మన ఇద్దరికి భేదము లేదు. అందువలననే నా మనస్సు నీపై నిలిచియున్నది. నా ఆత్మ, మనస్సు. '.. ప్రాణములు నీయందు సంస్థాపితములై ఉన్నట్లే నీ ఆత్మ మనఃప్రాణములు సాయందు నిలిచియున్నవి. అందువలననే ఒక నిమిషము ... పాటు ఎడబాటు {వీరపాము) వలన మన మనస్సు విక్షబము (తల్లడము) పొందును. వియోగమన్న మాట విన్నంతనే మనస్సు కాలిపోవును. ప్రాణములు మండిపోవును. ఇట్లు దేవతాగ్రేషురాలగు రాధాసుందరి పలికి ఆ స్వామి పాదములు పట్టుకొని ఆ గోలోక సభలో పెద్ద ధ్వనీతో మరి మరి ఏడ్చెను.

 క్రోడే కృత్వా తు తాం కృష్ణా ముఖం సంమృజ్య వాససా ।

బోధయామావ వివిధం సత్యం తథ్యం హితం వచః ॥

ఆమెను శ్రీకృష్ణుడు ఒడిలోనికి చేర్చుకొని వస్త్రముతో ముఖము తుడిచి త్రికాల సత్యము హితకరము వాస్తవము ఐన వాక్కుతో అనేక విధములుగా బోధచేసెను.

శ్రీకృష్ణ ఉవాచ :

ఆధ్యాత్మికం పరం యోగం శోకచ్ఛేదన కారకం।

శ్రుణు దేవి ప్రవక్ష్యామి యోగీంద్రాణాం చ దుర్లభం॥

ఆధారాధేయయోః సర్వం బ్రహ్మాండం పశ్య సుందరి ।

ఆధార వ్యతిరేకేణ సాస్త్యాధేయస్య సంభవః ॥

ఫలాధారం చ పుష్పం చ పుష్పాధారం చ పల్లవం ।

 స్కంధశ్చ పల్లవాధరః స్కంధాధారస్తరుస్స్వయం॥

వృక్షాధారోఽప్యంకురశ్చ జీవశక్తి సమన్వితః ।

ఆష్టి రేకాంకురాధారశ్చాష్ట్యాధారో వసుంధరా ॥

శేషో వసుంధరాధార: శేషాధారో హి కచ్చప:।

వాయుశ్చ కచ్చపాధారో వాయ్వాధారోఽ హామేవ చ ॥

 మమాధార స్వరూపా త్వం త్వయి తిష్ఠామి సాంప్రతం ।

త్వం చ శక్తి నమూహా చ మూల ప్రకృతిరీశ్వరీ ॥

త్వం శరీర స్వరూపాఽసి త్రిగుణాఽఽ ధారరూపిణీ ।

తవాత్మాహం నిరీహశ్చ చేష్ఠావాంశ్చ త్వయా సహ ॥

 పురుషాద్వీర్యముత్పన్నం వీర్యాత్చంతతిరేవ చ ।

తయోరాథారరూపా చ కామినీ ప్రకృతేః కలా ॥

వినా దే హేస క్వాత్మా చ క్వ శరీరం వినాఽఽత్మనా ।

ప్రాధాన్యం చ తయోర్దేవి వినా త్వాఽద్య కుతో భవః ॥

 న కుత్రాప్యావయోర్ళేడో రాధే సంసార బీజయోః।

యత్రాత్మా తత్ర దేహం చ న భేదో వినయేన కిం ॥

శ్రీకృష్ణుడిట్లు పలికెను :

ఓ దేవీ ! యోగీంద్రులకు దుర్టభమైనట్టి జీవుల శోకమును ఛేదించుటకు మూలమైనట్టి శ్రేష్టమైన అధ్యాత్మ యోగమును చెప్పేదను వినుము. ఓ సుందరీ! మొత్తము బ్రహ్మాండము ఆధార, ఆధీయముల (ధరించునది ఆధారము, ధరించబడునది ఆధేయము) మయము. ఆధారమునకు భిన్నముగా ఆధేయము యొక్క పుట్టుక ఉండదు, ఫలమునకు ఆధారము పుష్పము. పుష్పమున కాధారము చిగురు. చిగురుకు ఆధారము స్కంధము {చెట్టుకొమ్మ లేదా బోది) స్కంధమునకు ఆధారము చెట్టు చెట్టుకు అంకురము (మొలక) ఆధారము. అది జీవశక్తితో (విత్తనములోనిది) కూడియున్నది. అట్టి అంకురమునకు తల్లి వేరు ఆధారము. దానికి భూమి ఆధారము. భూమికి ఆదిశేషుడు అతనికి కచ్చపము (తాబేలు) ఆ ఆదికూర్మమునకు పాయువు ఆధారము. వాయువునకు ఆధారము నేను. నాకు ఆధార స్వరూపురాలవు నీవు, ఇప్పుడు నేను నీయందే నిలిచియున్నాను. నీవు శక్తుల నమూహము గల మూలప్రకృతి నాయికవు. సత్వ రజస్తమోగుణాత్మికవు. శరీరస్వరూపిణివి. ఆధారరూపిణివి. నేను నీకాత్మను. నిరీహుడనై ఉండి {కోరికలు లేనివాడను} కూడ నీతో కలిసి చేష్టలు గలవాడనైతిని. పురుషుని నుండి వీర్యము జనించును.వీర్యము వలన సంతానము కలుగును. ఆ రెంటికాధార రూపురాలు ప్రకృతి అంశమైన కామినియే (స్త్రీ). దేహము లేకుండ ఆత్మ గాని ఆత్మలేకుండ శరీరము కాని ఎక్కడివి? నీవు లేకుండ శరీరాత్మలకు ప్రాధాన్యము ఎట్లేర్పడును? సంసార బీజభూతులమైన మన యిద్దరికి భేదమెక్కడిది? ఎక్కడ ఆత్మయుండునో అక్కడ దేహముండును. ఆ రెంటికి భేదము లేదు. ఇక వినయముతో పనియేమి?

యథా క్షీరే చ ధావల్యం దాకా చ హుతాశనే ।

భూమౌ గంధం జలే శైత్యం తథా త్వయి మయి స్థితే ॥

ధావల్యదుగ్ధయో రైక్యం ధాహికానలయోద్యథా ।

భూగంధ జలశైత్యానాం నాస్తి భేదస్తథాఽవయోః ॥

పాలలో తెల్లదనము, అగ్నియందు కాల్చెడి శక్తి, భూమియందు గంధము (పాసన) నీటిలో చల్లదనము వలె మన ఇద్దర ముందుము. . తెల్లదనమునకు పాలకు, కాల్చుశక్తికి అగ్నికి, భూమికి గంధమునకు జలమునకు శైత్యగుణమునకు, ఐక్యమే తప్ప భేదము లేనట్లు మన . ఉభయులకును ఐక్యమే తప్ప భేదము లేదు.

మయా వినా త్వం నిర్జీవా చాదృశ్యోఽహం త్వయా వినా ।

త్వయా వినా భవం కర్తుం నాలం సుందరి నిశ్చితం ॥

వీనా మృదా ఘటంకర్తుం యధా నాలం కులాలకః ।

వినా స్వర్ణం స్వర్ణకారోఽలంకారం కర్తుమక్షమః॥

స్వయమాత్మా యథా నిత్య స్తథో త్వం ప్రకృతిః స్వయం ।

సర్వశక్తి సమాయుక్తా సర్వాధారా సనాతనీ ॥

మమ ప్రాణ సమా లక్ష్మీర్వాణీ చ సర్వమంగళా ।

బ్రహ్మేశానంత ధర్మాశ్చ త్వం మే ప్రాణాధికా ప్రియా ॥

సమీవస్థా ఇమే సర్వే సురా దేవ్యశ్చ రాధికే ।

ఏభ్యోఽవ్యధికా నోచేత్కథం వక్షస్థలస్థితా ॥

త్యజాశ్రుమోక్షణం రాధే భ్రాంతి చ నిష్ఫలాం సతి ।

 విహాయ శంకాం నిశ్శంకం వృషభాసుగృహం ప్రజ ॥

నేను లేకుండ నీవు జీవరహితవు. నీవు లేకుండ నేను కన్పించను. ఓ సుందరీ! నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు లేకుండ సృష్టిచేయుటకు నేను సమర్థుడను కాను. మట్టిలేకుండ కుండలు చేయుటకు కుమ్మరి ఎట్లు అశక్తుడో, బంగారము లేకుండ నగలు చేయుటకు ఎట్లు కంసాలి అసమర్థుడో (అట్లుగానే మనస్థితి ఉన్నది) ఆత్మరూపుడనగునేనెట్లు నిత్యుడనో ప్రకృతిరూపిణీవీ అగు నీవు అట్లే సర్వశక్తులు గల, సర్వాధారవగు సనాతనివి. లక్ష్మీ, సరస్వతి, పార్వతీ, బ్రహ్మ, అనంతుడు, ధర్ముడు, వీరు నాకు ప్రాణసములు. నీవు నాకు ప్రాణముల కన్న అధికముగా ప్రియురాలవు. ఇక్కడ నున్న సర్వదేవతలు దేవతాస్త్రీలునాకు ప్రాణసములే. నీవు వీరందరికంటే అధికురాలవు కాకున్నచో నా వక్షస్థలమందేట్లు నిలచితివి? రాధా! కన్నులనీరు విడుచుట త్యజించుము. నిష్ఫలమైన భ్రాంతిని శంకను విడిచి సందేహించకుండ వృషభానుని ఇంటికి పొమ్ము.

కలావత్యాశ్చ జఠరే మాసానాం నవ సుందరి।

వాయునా పూరయిత్వా చ గర్భం రోధయ మాయయా॥

దశమే నమను ప్రాప్తే త్వమావీర్భవ భూతలే ।

స్వాత్మరూపం పరిత్యజ్య శిశురూపం విధాయ చ ॥

వాయు నిస్సారణే కాలే కలావత్యాః సమీపతః ।

 భూమౌ వీవసనీభూయ పతితో రోధిషి ధ్రువం॥

అయోని సంభవా త్వం చ భవితా గోకులే సతి ।

అయోని సంభవోఽహంచ నాపయోధర్భ సంస్థితిః ॥

భూమి సంస్పృష్టమాత్రం మాం గోకులే ప్రాపయిష్యతి ।

 తవ హేతోర్గమిష్యామి కృత్వా కంసభయం ఛలం ॥

యశోదామందిరే మాం చ సానందం నందనందనం ।

 నిత్యం ద్రక్ష్యసి కల్యాణి మమాశ్రేషణ పూర్వకం॥

స్మృతిస్తే భవితా కాలే వరేణ మమ రాధికే।

స్వచ్చందం విహరిష్యామి నిత్యం బృందావనే॥

త్రిస్సప్త శతకోటీ ర్గోపీభి ర్గోకులం వ్రజ ।

 త్రయస్త్రింశద్వయస్యాభిః సుశీలాదిభిరేవచ॥

ఓ సుందరీ! వృషభానుని భార్యయగు కళావతి గర్భమును మాయాశక్తితో తొమ్మిది నెలలు వాయువుతో నింపి నిరోధించుము. పదియవ నెల రాగానే నీ ఆత్మరూపమును వదిలి పెట్టి శిశురూపమును కూర్చుకొని భూతలమందు జన్మించుము. గర్భమున నిరోధించిన గాలి బయటకు వచ్చువేళకు కళావతి సమీపమున నగ్నరూపముతో భూమి పై పడి నీవు (శిశువు వలె ఏడవు. గోకులమున నీవును నేనును (గర్భమున ప్రవేశించుట మొదలగు లక్షణములు లేకుండ} అయోని సంభవులముగా జన్మింతుము. మన ఇద్దరికిని, మనుష్య గర్భమునందుండుట అన్నస్థితి ఉండదు. నేను భూమి మీద పడగనే {మధురలోని చెరసాలలో) నన్ను (వసుదేవుడు) నందుని గోకులమునకు చేర్చును. కంసుని వలన ప్రమాదమును భయమును ఒక మీషగా చూపి నీకొరకు గోకులమునకు వత్తును. యశోదా మందిరమున నందుని కుమారునిగానున్న నన్ను నీవు ప్రతిరోజు కౌగిలించుకొనుచు దర్శించుచుందువు. ఓ కల్యాణీ! రాధా!! నా వరము వలన నీకప్పుడు పూర్వస్మృతి ఉండును, సుందర బృందావనములో స్వేచ్ఛగా నీతో కలిసి విహరింతును. సుశీల మొదలగు ముప్పది ముగ్గురు స్నేహితురాండ్రతో, డెబ్బది మూడు శతకోటుల గోపికలతో (దాసీజనము) నీవు గోకులమునకు పొమ్ము.

సంస్థాప్య సంఖ్యారహితా గోపీర్గోకుల ఏవచ।

తా ఆశ్వాన్య ప్రబోధ్యైశ్చ మితయా చ సుధాగిరా ॥

అహం గోపాల సుహృదః సంస్థాప్యాత్రైవ రాధికే।

వసుదేవాశ్రమం పశ్చాద్యాస్యామీ మధురాంపురీం॥

వ్రజం వ్రజంతు క్రీడార్థం మమ సంగే ప్రియాత్ ప్రియాః।

వల్లభానాం గృహే జన్మ లభంతే గోపకోటయః॥

ఇత్యేవ ముక్త్యా శ్రీకృష్ణో విరరామ చ నారద।

ఊషుర్దేవాశ్చ దేవ్యశ్చ గోపా గోప్యశ్చ తత్ర వై ॥

ఈ గోపికా సమూహమును లేక్కకందనంతగా గోకులమున నిలిపి గోలోక మెడబాసినందు వలన వారికి కలుగు విచారమును అమృతము వంటి ఉపదేశవాక్కులతో పోగొట్టుము. సా మీత్రులైన ఈ గోపాలకులను కూడ అచ్చట ఏలిపి తరువాత మధురాపురిలోని వసుదేవుని మందిరమునకు పోదును. నా సంగమునే ఇష్టపడుట వలన మిక్కిలి ప్రియులైన వీరందరు నాతో విలాస క్రీడల కొరకుగాను గోకులమునకు పోదురు గాక. ఆక్కడి గొల్లల యిండ్లలో గోపాలకులుగా జన్మింతురు గాక. ఓ నారదా! శ్రీకృష్ణుడిట్లు పలికి సంభాషణ చాలీంచెను. దేవగణము గోపకుల గణము అచ్చటనే నిలిచియుండెను.

బ్రహ్మేశశేషధర్మాశ్చ శ్రీకృష్ణం తం పరాత్పరం ।

శివా పద్మా నరస్వత్య స్తుష్టువు: వరద ముదా॥

బ్రహ్మ శంకరుడు ఆదిశేషుడు ధర్మదేవత లక్ష్మి పార్వతి సరస్వతి పరాత్పరుడైన శ్రీకృష్ణుని పరమ సంతోషముతో స్తోత్రమొనర్చిరి.

భక్త్యా గోపాశ్చ గోవ్యశ్చ విరహ జ్వరకాతరాం।

తత్ర నంస్తూయ శ్రీకృష్ణం వ్రజేముః ప్రేమ విహ్వలాః ॥

ప్రాణాధీకం ప్రియం కాంతం రాధాపూర్ణమనోరథం ।

స్వామియందలి ప్రేమచేత చెదరిన మనస్సులు గలవారును, స్వామి ఎడబాటు అనెడి జ్వరమునకు బెదిరిపోవువారును ఐన గోపికలు గోపాలకులు తమ ప్రాణములకంటె అధికప్రియుడు రాధాదేవి కోరికల పంట ఐన శ్రీకృష్ణుని స్తుతించి భక్తితో నమస్కరించిరి.

 పరితుష్టోఽభవద్భక్త్యా విరహజ్వర కాతరాం॥

సాశ్రుపూర్ణాతిదీనాం చ దృష్ట్వా రాధాం భయాకులం ।

ప్రబోధ వచనం శ్రుత్యమువాద తోం హరి: స్వయం॥

గోపాలకుల భక్తికి స్వామి మిక్కిలి సంతోషించెను. తన వియోగ (జ్వరమునకు)నకు భయపడుచు కన్నీరు విడుచుచు దుఃఖించుచున్న రాధాదేవిని స్వామీ స్వయముగా వినిపించదగిన ప్రబోధ వాక్కులతో ఇట్లు ఓదార్చెను.

శ్రీకృష్ణ ఉవాచ :

ప్రాణాధికే మహాదేవి స్థిరా భవ భయం త్యజ ।

యథా త్వం చ తథాఽ హం చ కా చింతా తే మయి స్థితే ॥

కింతు తే కథయిష్యామి కించిదేవాస్త్యమంగలం ।

వర్షాణాం శతకం పూర్ణం త్వద్విచ్ఛేదో మయా సహ ॥

శ్రీదామ శాప జన్యేన కర్మభోగేన సుందరి ।

భవిష్యత్యేవ మమ చ మధురాగమనం తతః ॥

శ్రీకృష్ణుడిట్లనెను :

ఓ మహాదేవీ! సుందరీ! నా ప్రాణములకంటె అధికురాలా! మనస్సు కుదుట పరచుకొమ్ము, భయము త్యజించుము. నీకెట్లు విచారపడుచున్నావో నీవియోగమునకు నేసల్లే విచారించుచుంటిని, నేనుండగా నీకుందుకు చింత? ఒకమాట వినుము. మనకొక ఆపద ఏర్పడినది. శ్రీరాముని శాపము వలన ఏర్పడిన కర్మానుభవమది. నిండుగా నూరేళ్లు నా వీయోగము నీవనుభవించవలసియున్నది. అందువలననే నేనును మధురకేగవలసి వచ్చినది.

తత్ర భారావతరణం పిత్రోర్భంధనమోచనం ।

మలాకార తంతువాయ కుబ్జికానాం చ మోక్షణం ॥

ఘాతయిత్వో చ యవనం ముచుకుందస్య మోక్షణం ।

ద్వారకాయాశ్చ నిర్మాణం రాజసూయస్య దర్శవం॥

ఉద్వాహం రాజకన్యానాం నహస్రాణాం చ షోడశ ।

దశాధిక శతస్యాపీ శత్రూణాం దమనం తథా ॥

మిత్రోపకరణం చైవ వారాణస్యాశ్చ దహనం ।

హరస్య జృంభణం తత్ర బాణన్య భుజకృంతనం ॥

పారిజాతన్య హరణం యద్యత్కర్మాణి తాని చ ।

గమనం తీర్థయాత్రాయాం ముని సంఘ ప్రదర్శనం ॥

సంభాషణం చ బంధూనాం యజ్ఞసంపాదనం పీడుః।

శుభక్షణే పునస్తత్ర త్వయా సార్థం ప్రదర్శనం॥

 కరిష్యామి చ తత్రైవ గోపికానాంచ దర్శనం ।

 తుభ్యమధ్యాత్మికం దత్వా పునన్సత్యం త్వయా సహా ॥

 దీవానిశమవిచ్చేదో మయా సార్థమతః పరం ॥

భవిష్యతి త్వయా సార్థం పునరాగమనం వ్రజే ।

కాంతే విచ్ఛేద సమయే వర్షాణాం శతకే సతి ॥

 నిత్యం సంమీలనం న్వప్నే భవిష్యతి త్వయా నహ।

మమ నారాయణాంశో యస్తన్య యానం చ ద్వారకాం ॥

శతవర్షాంతరే సాధ్యమేతదేవ సునిశ్చితం।

భవిష్యతి పునస్తత్ర వనే రాసస్త్వయా సహ ॥

 పునః పిత్రోశ్చ గోపీనాం శోక నమ్మర్జనం పరం ।

కృత్వా భారావతరణం పునరాగమనం మమ॥

భూలోకమున నా కార్యము భూభారమును తొలగించుట. తలిదండ్రులను కారాగృహము నుండి విడిపించుట, మాలాకారునకు (పూలదండలిచ్చిన వానికీ) వస్త్రములు చేయువానికీ కుళ్లకు మోక్షప్రదానము, యవనుని సంహరించి ముచుకుందునకు మోక్షమిచ్చుట, ద్వారాకనగర నిర్మాణము, రాజసూయయాగము దర్శించుట, ఒకవేయి పదునారుగురు రాజకన్యలను వివాహమాడుట, నూటపదిమంది ముఖ్యశత్రువులను వధించుట, మిత్రులకుపకారము చేయుట, కాశీనీ గాల్చుట, శంకరుని నిలదీసి బాణాసురుని భుజములను నరికివేయుట, పారిజాత వృక్షమును స్వర్గము నుండి తెచ్చుట, తీర్థయాత్రలకేగుట, మునిదర్శనము, బంధుసహవాసము, తండ్రిచేయు యజ్ఞమును నిర్వహించుట, ఒకశుభవేళలో నీకును గోపికలను దర్శనమిచ్చి నీకు ఆధ్యాత్మవిద్యను బోధించుట, రాత్రింబగళ్లు ఎడబాటు లేకుండ మనము కలిగియుండుట, నీతో కలిసి మరల గోకులమునకు వెళ్లి అచ్చట బృందావనములో నీతో రాసకేళి యొనర్చుట, అచ్చట మరల నందయశోదలను {పెంచిన తలిదండ్రులను) గోపికలను నా వియోగ దుఃఖితులైన వారినీ ఓదార్చుట నారాయణాంశతో నున్న నేను మరల ద్వారక కేగుట ఇట్లు నూరేండ్లలో ఏయే కర్మలు చేయవలసి యున్నవో అన్నిటిని నిశ్చితముగా చేసి భూభారము తొలగించి మరల ఇచ్చటికి వచ్చుట జరుగును. ఓ ప్రియురాలా! ఈ నూరు సంవత్సరముల మన వియోగకాలములో ప్రతిదినము స్వప్నములో నీతో సమ్మేళనము (కలియుట) సంభవించును.

త్వయా సహాపి గోలోకం గోపైర్గోపీభిరేవ చ ॥

నీవు ఈ గోపాలకులు గోపికలు మీ అందరితో బాటు మరల గోలోకమునకు తిరిగి వచ్చుట సంభవించును.

మమ నారాయణాంశస్య వాణ్యా చ పద్మయా నహ ॥

వైకుంఠ గమనం రాధే నిత్యన్య పరమాత్మనః ।

శ్వేత ద్వీపం ధర్మగేహమంశానాం చ భవిష్యతి ॥

దేవానాం చైవ దేవీనామంశా యాస్యంతి స్వక్షయం ।

పునస్సంస్థితిరత్రైవ గోలోకే మే త్వయా నహ ॥

ఇత్యేవం కథితం సర్వం భవిష్యం చ శుభాశుభం ।

మయా నిరూపితం యత్తత్కాంతే కేన నివార్యతే॥

ఇత్యేవముక్త్వా శ్రీకృష్ణః కృత్వా రాధా న్వవక్షసి।

తస్థౌ తస్థు: సురాస్సర్వే సురపత్న్యశ్చ విస్మితాః ॥

నారాయణాంశతో నిత్యుడనై పరమాత్మగా నున్న నేను వాణీ లక్ష్మీయుతముగా వైకుంఠమునకేగుటయు, నా ఇతరాంశలు శ్వేతద్వీపమునకు ధర్మదేవ గృహమునకు చేరుటయు జరుగును. దేవులు దేవపత్నులయొక్క అంశలు తమ తమ నివాసస్థానములకు చేరుదురు. గోలోకమున నీతోబాటు నేను మరల నీవసింతును. ఇట్లు జరుగనున్న విషయము మొత్తము శుభాశుభములతో బాటు నీకు చెప్పితిని. నా చేత ఇట్లు జరుగవలయునని నిరూపణ (నిర్ధారణ చేయబడినప్పుడు ఓ ప్రియా ఎవడు నివారించును. ఇట్లు పలికి శ్రీకృష్ణుడు రాధాదేవిని తన వక్షస్థలమున చేర్చుకొని నిలిచెను. సర్వదేవతలు వారి భార్యలును ఆ దృశ్యమును గాంచీ ఆశ్చర్యపడి అట్లే నిలిచి యుండిరి.

ఉవాచ శ్రీహరిర్దేవాన్ దేవీశ్చ సమయోచితం ।

 దేవాగచ్చత కార్యార్థం స్వాలయం విషయోచితం ॥

గచ్ఛ పార్వతి కైలాసం సుతాభ్యాం స్వామినా సహ ।

మయా నియోజితం కర్మ సర్వం కాలే భవిష్యతి ॥

భవితా కలయా జన్మ సర్వేషాం చ ప్రజేశ్వరి ।

క్షుద్రాణాం చైవ మహతాం దేవం లంబోదరం వినా ॥

శ్రీహరి అప్పుడు సమయోచితముగా దేవతలతో "ఓ దేవతలారా! ప్రస్తుతోంశమునకు తగిన కార్యము కొరకుగాను మీమీ నివాస స్థానములకు (లోకములకు వెళ్లడు. ఓ పార్వతీ! నీవు నీ భర్తతో ఇద్దరు కుమారులతో కలిసి కైలాసమునకు పొమ్ము. నాచేత నియోగించబడిన సర్వకార్యములు తగిన కాలములో జరుగును. ఓ ప్రజేశ్వరీ! రాధా! ఒక వినాయకుడు తప్ప మిగిలిన అందరు దేవతల జన్మము ఉచ్ఛనీచ భేదము లేకుండ నా అంశతోనే సంభవించును,

ప్రణమ్య శ్రీ హరిం దేవాః స్వాలయం ప్రయయుర్ముదా ।

 లక్ష్మీం సరస్వతీం భక్త్యా ప్రణమ్య పురుషోత్తమం ॥

హరిణా యోజితం కర్మ కర్తుం వ్యగ్రా మహీం యయుః।

భర్ర్తా నిరూపితం స్థానం దేవానామపి దుర్లభం ॥

దేవతలు పురుషోత్తముడైన శ్రీహరికి లక్ష్మీ సరస్వతులకు భక్తితో ప్రణమిల్లి (నమస్కరించి తమ తమ లోకములకు వెళ్లిరి. ఆ ప్రభువుచేత తమకు ఏర్పరచబడిన కర్మ నెరవేర్చుటకు (విధి నిర్వహణకు) శ్రద్ధగలవారై భూలోకమునకు వెళ్లిరి. ఆ స్వామి నిరూపించిన స్థానము {అవతారములో తమ పాత్రను) స్వయముగా లభించుట దేవతలకును అసాధ్యమే కదా!

ఉవాచ రాధికాం కృష్ణో వృషభానుగృహం ప్రజ ।

 గోప గోపీ సమూహైశ్చ సహ పూర్వం నిరూపితైః ॥

అహం యాస్యామి మధురాం వనుదేవాలయం ప్రియే । వశ్పాత్కంస భయ వ్యాజాత గోకులం తవ సన్నిధిం ॥

రాధాదేవీతో శ్రీకృష్ణుడు “ఓ ప్రియురాలా! పూర్వము నిర్ధారించిన గోప గోపీ జనముతో గూడి నీవు వృషభాను గృహమునకేగుము. నేను మధురలోనీ వసుదేవుని గృహమునకేగుదును. ఆ తరువాత అటనుండీ కంసభయమును ఒక మిషగా పెట్టి గోకులమునకు నీ వద్దకు వత్తును” అనేను.

రాధా ప్రణమ్య శ్రీకృష్ణం రక్తపంకజ లోచనా ।

భృశం రురోద పురతః ప్రేమ విచ్చేద కాతరా॥

స్థాయం స్థాయం క్వచిద్యాంతీ గత్వాగత్వా పునః పునః ।

పుసః పునః సమాగత్య దర్శం దర్శం హరేర్ముఖం ॥

పపౌ చక్షు శ్చకోరాభ్యాం నిమేషరహితా సతీ ।

శర త్పార్వణ చంద్రాభ సుధాపూర్ణం ప్రభోర్ముఖం ॥

తతః ప్రదక్షిణీకృత్య సప్తధా పరమేశ్వరీ ।

ప్రణమ్య సప్తధా చైవ పునస్తస్థౌ హరేః పురః॥

ఎర్రదామరల వంటి నేత్రములు గల రాధాదేవి శ్రీకృష్ణునకు నమస్కరించి ప్రేమ విచ్ఛేదమునకు (ఎడబాటు వలన ప్రేమ తరిగిపోవునేమో అని భయము కలదై స్వాతి ముందు మిక్కిలి దుఃఖించెను. నిలిచి నిలిచి కొద్దిగా ముందుకు పోయి పోయి మరల వెనుకకు వచ్చి కలిసి మాటి మాటికి హరి ముఖము చూచుచు - కనురెప్పలు వాల్చక శరదృతువులోని పున్నమినాటి చంద్రుని వలె అమృత పూర్ణమై యున్న ప్రభువు ముఖమును తన నయన చకోరములతో (చకోర పక్షి చంద్రునిలోని అమృతము వంటి వెన్నెలను త్రాగునట్లు) త్రాగెను (అత్యంత ప్రేమతో చూచెను). ఆ తరువాత ఆ పరమేశ్వరి ఏడుసార్లు ప్రదక్షిణించి ఏడు విధములుగా నమస్కరించి హరీ ముందు మరల నిలిచెను.

ఆజగ్ముర్గోపికానాం చ త్రీసృప్త శతకోటయః ।

ఆజగామ చ గోపానాం సమూహ: కోటిసంఖ్యకః॥

గోపానాం గోపికానాం చ సమూహై: సహరాధికా ।

 పునః ప్రణమ్య తం రాధా తత్ర తస్థౌ చ నారద ॥

త్రయ స్త్రీంశద్వయస్యాభిః గోపీభిః సహసుందరీ ।

గోపానాం చ నమూహైశ్చ ప్రణమ్య ప్రయయౌ మహీం॥

హరిణా యోజితం స్థానం ప్రజగ్ముర్నంద గోకులం ।

వృషభాను గృహం రాధా గోపీగోప గృహం యయౌ ॥

ఓ నారదా! ఇరువది యొక్క శతకోటుల గోపికలును కోటిసంఖ్య గల గోపాలురును అక్కడికి వచ్చిరి. ఆ సమూహముతో గూడి పోవలసిన రాధ మరల నమస్కరించి నిలిచెను. ఆ సుందరి ముప్పది ముగ్గురు స్నేహితురాండ్రతో బాటు గోపికలు గోపాలకులను సమూహములుగా గ్రహించి స్వామికి నమస్కరించి భూమికి ప్రయాణించెను. శ్రీహరి ఏర్పరచిన స్థానములకు నందగోకులమునకు వారు చేరబోయిరి. రాధాదేవి వృషభాను గృహమున కేగెను.

మహీం గతాయాం రాధాయాం గోపీబీః సహగోపకై:।

బభూవ శ్రీహరిన్సద్యః పృథివీం గమనోత్సుకః॥

సంభాష్య గోపాన్ గోపీశ్చ నియోజ్య స్వీయ కర్మణి ।

మనోయాయీ జగన్నాథో జగామ మధురాం హరిః॥

పూర్వం యద్యదపత్యం చ దేవకీ వసుదేవయోః ।

బభూవ సద్యస్తత్కంసః పుత్ర షట్కం జఘాన హ ॥

శేషాంశం సప్తమం గర్భం మాయయాఽకృష్య గోకులే ।

నిధాయ రోహిణీ గర్భే జగామ చాజ్ఞయో హరేః ॥

గోపగోపీజనముతో రాధాదేవి భూమికి వెళ్లిన వెనుక వెంటనే శ్రీహరి కూడ పృధివీతలమున కేగుటకు ఆసక్తి గలవాడై మిగిలిన గోప గోపీజనముతో మాట్లాడి వారి వారి విధులలో (కర్మలలో) వారినీ నియోగించి ఆ జగన్నాధుడు మన స్సే వాహనముగా ప్రయాణము చేసి మధురానగరికి వెళ్లాను. ఇతనికన్న ముందు దేవకీ వసుదేవులకు ఎట్లెట్లు సంతానము కలెనో అట్లట్లు వెంటనే కంసుడు ఆ సంతానమును (ఆరుగురు పుత్రులను సంహరించెను. శేషుని అంశతో దేవకీకి ఏర్పడిన ఏడవ గర్భమును హరియాజ్ఞననుసరించి మాయాదేవి రోహిణీదేవి గర్భమున చేర్చి (గర్భసంకర్షణము - పిండమును ఒక గర్భము నుండి వేరొక గర్భములోనికి మార్చుట) తనకు నిర్దేశించిన స్థానమునకు - (యశోద గర్భములోనికి) పోయెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే నారాయణ నారద నంవాదే షష్ఠోఽధ్యాయః॥

ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండములో నారాయణ నారద సంవాదములో ఆరవ అధ్యాయము నమాప్తము.