మూII శ్రీకృష్ణఉవాచ:
గచ్ఛగచ్ఛగృహంగచ్ఛ వ్రజరాజ వ్రజం వ్రజ ।
సర్వతత్వం త్వయాజ్ఞాతం దృష్టాశ్చ మునయః సురా ॥
శ్రుతంమే ధన్యమాఖ్యానం నానాఖ్యానం సుదుర్లభం ।
దుర్గాయాః స్తోత్రరాజంచ జన్మపాప నికృంతనం ॥
స్థితంతత్తే నిగదితం హరేణచ సుఖేనచ ।
మత్కృతం బాలభావేనచాపరాద్ధంచ తత్ క్షమ ॥
యత్సుఖం నకృతం తాత పిత్రోశ్చ నృపమందిరే ।
కృతం సుఖం తత్పరంచ స్వర్గాదపి సుదుర్లభం ॥
మదీయంప్రియవాక్యంచ ప్రహ్వత్వం వినయం నయం ।
పరిహాసం బహుతరం యశోదాం గోపికాగణం ॥
బాలకానాం సమూహంచ రాధించాపి విశేషతః ।
ఏకత్రచ స్థితం తేషుబంధువర్గేషు కర్మణా ॥
ఇహైవాపి సుఖంభుక్త్వా గచ్చ గోలోక ముత్తమం ।
సార్థం యశోదయా తాత రోహిణ్యగోపికా గణైః ॥
గోపానాంబాలకై స్సార్థం వృషభానేన గోపకైః ।
రాధామాత్రా కలావత్యా రాధయా సహయాస్యసి ॥
రథానాం శతలక్షంచ గోలోకా దాగతం పితః ।
అమూల్యరత్న నిర్మాణం హీరహార పరిష్కృతం ॥
మణిమాణిక్యముక్తానాం మాలాజాల విభూషితం ।
వహ్నిశుద్ధాంశుకై: రమ్యైః ఆచ్ఛన్నం పీతవర్ణకై: ॥
పార్షదప్రవరై రమ్యైః వేష్టితం శ్వేతచామరైః ।
సద్రత్న దర్పణై రమ్యైః గోపికాభిశ్చ గోపకై: వేష్టితంచ తదారుహ్య కౌతుక ద్యాస్యసి ధ్రువం ॥
త్యక్త్వాచ పార్థివందేహం దివ్యదేహం విధాయచ ।
అయోనిసంభవా రాధా రాధామాతా కలావతీ ॥
యాస్యత్యేవహి తేనైవ నిత్యదే హేన నిశ్చితం ।
పితృణాం మానసీ కన్యా ధన్యామాన్యా కలావతీ ॥
ధన్యాచ సీతామాతాచ దుర్గామాతాచ మేనకా ।
అయోని సంభవా దుర్గా తారా సీతాచ సుందరీ ॥
అయోనిసంభవా స్తాశ్చ ధన్యామేనా కలావతీ ।
ఇత్యేవం కథితం తాత గోపనీయం సుదుర్లభం
వరోఽయం దత్త స్తుభ్యంచ మయాచ దుర్గయా తథా ॥
అను ॥ శ్రీ కృష్ణుడిట్లన్నాడు : వెళ్ళు వెళ్లు ఇంటికి వెళ్ళు. ఓవ్రజమునకు రాజ! ప్రజమునకు వెళ్ళు. తత్వమంతా నీకు తెలిసింది. మునులు, సురలు వీరిని చూశావు. (1) ధన్యమైన ఆఖ్యానమును నేను నీకు విన్పించాను. అనేక ఆఖ్యానములు (కలది) సుదుర్లభమైనది. దుర్గయొక్క స్తోత్రరాజము జన్మమనే పాపమును తొలగించేది. (2) హర్షంతో సుఖంగా ఉన్నదానిని నీకు చెప్పాను. చిన్నపిల్లవాడిగా నేను చేసిన తప్పులను క్షమించు. (3) ఓ తండ్రి! నృపమందిరంలో, తండ్రిగారి మందిరంలో ఏ సుఖాన్ని పొందలేదు? (అన్నీ పొందాను) 'ఇక్కడ పొందిన సుఖము పరమైనది స్వర్గంలో కూడా దుర్లభమైనది . (4) నా తీయని మాటలు, వినయము, నయము (మృదుత) ప్రహ్వము (ఆసక్తి) పరిహాసము, యశోదతో, గోపికా గణంతో ఎక్కువగా నేను చేసినది (5) పిల్లల సమూహము, విశేషించి రాధను గూర్చి నది. కర్మవల్ల ఆ బంధు వర్గంతో ఒక చోట ఉన్నాను. (6) ఇక్కడ కూడా సుఖాన్ని అనుభవించి ఉత్తమమైన గోలోకానికి వెళ్ళు. ఓ తండ్రి! యశోదతో, రోహిణితో, గోపికా గణంతో కూడా వెళ్ళు. (7) గోపబాలకులతో, వృషభములు గల గోపకులతో సహా వెళ్ళు. కళావతి రాధామాతతో, రాధతో కూడా వెళ్ళు. (8) ఓ తండ్రి! గోలోకం నుండీ, శతలక్ష రథములు వచ్చాయి. అమూల్యమైన రత్నములతో నిర్మింపబడింది, వజ్రముల హారములతో అలంకరింపబడ్డాయి. (9) మణులు, మాణిక్యములు ముత్యములు మాలల సమూహంతో అలంకరింపబడ్డాయి. అగ్ని తప్తమైన వస్త్రములతో అందమైన పచ్చని వస్త్రములతో చుట్టబడ్డాయి. (10) ప్రక్కలలో తెల్లని చామరలు ధరించి పార్షదులు (ప్రక్కల నుండు వారు) అందంగా ఉన్నారు. రత్నములు పొదిగిన అద్దములు అందంగా ఉన్నాయి. వానిని ధరించి గోపికలు గోపాలురు అందంగా ఉన్నారు. అట్లా ఉన్న దానిని ఎక్కి, ఉత్సాహంగా వెళ్తావు, నిశ్చయము. (11) పార్థివశరీరాన్ని వదలి, దివ్య దేహం ధరించి, అయోనిజయైన రాధ, రాధ తల్లి కళావతి (12) దానితోనే వెళ్తుంది. నిత్యదేహంతో వెళ్తుంది, నిశ్చయము. పితరుల మానసిక కన్య కళావతి ధన్యురాలు, మాన్యురాలు. (13) సీత, దుర్గ, మేనక ఈ తల్లులు ధన్యురాండ్రు. దుర్గ, తార, సుందరి సీత వీరు అయోని సంభవలు. (14) వారు అయోని సంభవలు ధన్యలు, కళావతి, మేన ధన్యలు అని, ఓ తండ్రి! దాచదగిన, చాలా దుర్లభమైన దానిని ఇట్లా చెప్పాను. నీకీ వరమిచ్చాను నేను, దుర్గకూడా ఇచ్చింది.
మూII శ్రీకృష్ణస్య వచః శ్రుత్వా ప్రత్యువాచ వ్రజేశ్వరః ।
పునరేవ జగన్నాథం తద్భక్తో భక్తవత్సలం ॥
నంద ఉవాచ
యుగానాంచ చతుర్ణాంచ యంయం ధర్మం సనాతనం ।
క్రమేణ కృష్ణ విస్తీర్ణం కృత్వా మాం కథయ ప్రభో ॥
కలిశేషే భవేద్యద్యద్గుణ దోషం కలే స్తథా ।
కాగతిర్వా పృథి వ్యాశ్చ ధర్మశ్చ ప్రాణినాం తథా ॥
నందస్యవచనం శ్రుత్వా హృష్టః కమలలోచనః ।
కథాం కథితు మారేభే విచిత్రాం మధురాన్వితాం ॥
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే ఉత్తర భాగే నారాయణ నారద సంవాదే భగవన్నంద సంవాదే ఏకోన నవతితమోఽధ్యాయః ॥
అను ॥ శ్రీకృష్ణుని మాటను విని ప్రజేశ్వరుడు (వ్రజమునకు అధిపతి) భక్తవత్సలునితో జగన్నాధనితో భక్తుడు మళ్లా ఇట్లన్నాడు. (16) నందుని వచనమిట్లా - నాలుగు యుగములకు ఏఏ ధర్మము సనాతనమైనదో దానిని, క్రమంగా విస్తరించి నాకు చెప్పు ప్రభూ (17) కలిశేషమందు ఏమేమి జరుగుతుందో, కలియొక్క గుణదోషము లేమిటో, పృథివి యొక్క గతి ఏమిటి, ధర్మము గతి, ప్రాణులగతి ఏమిటో వివరించండి. (18) అనిన నందుని మాటను విని, కమలలోచనుడు ఆనందించి విచిత్రమైన, మధురమైన కథను చెప్పనారంభించాడు. (19) అని శ్రీబ్రహ్మవైవర్త మహా పురాణ శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తర భాగమందు నారాయణ నారద సంవాదమందు భగవంతుడునందుడు వారిద్దరి సంవాదమందు ఎనుబది తొమ్మిదవ అధాయ్యము .
Summary of chapter 89 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
This chapter compiles a sacred anthology of seed-mantras, meditation verses, and protective Kavacha armors dedicated to Lord Śrī Kṛshṇa, Goddess Śrī Rādhā, Lord Śiva, Lord Brahmā, and Goddess Lakshmī. The text provides explicit instructions on chanting counts, ritual purification, and mental focus required to awaken the spiritual potency of these Mantras. Practicing these divine vibrations establishes an impenetrable shield of protection around the devotee, shielding them from evil influences and granting spiritual perfection.