బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

37 - హరనిర్మాల్య శాప ప్రసంగము

శ్రీరాధికోవాచ - రాధాదేవి పలికెను :

 ఏవం భూతన్య చ విభోః నర్వేశస్య మహాత్మనః

న శస్తం కథముచ్ఛిష్ణం బ్రూహి సందేహ భంజన

ఇటువంటి మహాత్ముడు విభుడు నైన ఈశ్వరుని యొక్క ఉచ్ఛిష్టము (తినగా మిగిలిన పదార్థము - ఎంగిలి - నైవేద్యము) ఎట్లు ప్రశంసింపబడలేదు? (ఇతరులు స్వీకరించుటకు చెప్పబడలేదు) ఓ సందేహములను తీర్పు స్వామీ! చెప్పుము.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :

శ్రుణుదేవి ప్రవక్ష్యే హమితిహాసం పురాతనం

పాపేంధనానాం దహనే జ్వలదగ్ని శిఖోషమం

సనత్కుమారో వైకుంఠమేకదా చ జగామ హ

 దదర్శ భక్తవంతం చ నాథం నారాయణం ద్విజః

తుష్టావ గూడైః స్తోతైశ్చ ప్రణమ్య భక్తితో ముదా

అవశేషం దదౌ తస్మై సంతుష్టా భక్తవత్సలః

ఓ దేవీ! పాపములనెడి కర్రలను కాల్చుటలో మండుచున్న అగ్విజ్వాలవంటిదైన ఒక పురాతన ఇతిహాసమును చెప్పుదును వినుము. ఒకసారి సనత్కుమారుడు వైకుంఠమునకు పోయి భక్తులతో కూడియున్న శ్రీమన్నారాయణుని దర్శించేను. భక్తి సంతోషములతో నమస్కరించి రహస్యములైన తత్త్వములు గల స్తోత్రములతో స్తుతించెను. అందుకు సంతోషించిన భక్తవత్సలుడు (శ్రీమన్నారాయణుడు) ఆ సనత్కుమారునికి తాను భుజించిన పదార్థము యొక్క శేషభాగమును ఇచ్చెను.

ప్రాప్త మాత్రేణ తత్రైవ భుక్తం తేనైవ కించన

కించిద్రరక్ష బంధూనాం భక్షణాయ చ దుర్లభం

సిద్ధాశ్రమే చ యద్దత్తం గురవే శూలపాణయే

 భక్త్యుద్రేకాదు తత్సర్వం భుక్తం చ ప్రాప్తిమాత్రతః

భుక్త్యా సుదుర్లభం వస్తు ననర్త ప్రేమ విహ్వలః

పులకాంకీత సర్వాంగః పాత్ర నేత్రో ముదాన్వితః

గాయన్మము గుణాన్ భక్త్యా సుకంఠః పంచవక్రతః

 రాగభేదైక తానేన తాలమానేన సుందరం

పపాత మధుర స్త్రచ్ఛంగం చ వ్యాఘ్రచర్మ చ

 స్వయం నిపత్య పశ్చాచ్చ రుదన్మూర్ఫామవాప హ

ఆతీవ కమనీయం తద్రూపం ధ్యాత్వైక మానసః

 సహస్ర దళ మధ్యస్థం మాం పశ్యన్ హృత్సరోరుహే

అది తనకు లభించగనే సనత్కుమారుడక్కడనే కొద్దిగా భుజించి దుర్లభమైన ఆ భగవంతుని భుక్త శేషమును తన ఆత్మ బంధువులకొరకని కొద్దిగా మిగిలించుకొనెను. సిద్ధాశ్రమమునకు పోయి తనకు గురువైన శంకరునికి దానినిచ్చాను. అది లభించగనే భక్తి ఉప్పొంగగా భుజించిన పరమేశ్వరుడు మిక్కిలి దుర్లభమైన ఆ వస్తువు లభించినందుకు ప్రేమ పరవశుడై నృత్యము చేసెను. సర్వాంగముల యందు పులకలేర్పడగా సంతోషము వలన కన్నులతో నీరు నిండగా ఆ ఐదు ముఖముల శివుడు మంచీకంఠ స్వరముతో రాగ తాళములతో మనోహరముగా ఆలోపన చేయుచు అనేక రాగములలో నొ గుణములను గానము చేసెను. ఆనంద పారవశ్యములో చేతిలోని డమరువు ఊదేడి కొమ్ము ధరించిన పులితోలు క్రిందపడి పోయినవి. తరువాత స్వయముగా నేలమీద పడి రోదించుచు మూర్ఛిల్లెను, తన హృదయ పద్మములో సహస్ర దళముల మధ్యనున్న - మిక్కిలి కోరదగిన నా రూపమును ధ్యానించి నన్ను దర్శించి స్థిర చీతుడై ఉండెను.

ఏతస్మిన్నంతరే దేవీ దుర్గా దుర్గాశినాశినీ

ముదా జగామ శీఘ్రం తత్రసన్న వదనేక్షణా

రుదంతం మూర్ఛితం దృష్ట్వా పతంతం చ భక్తితః

ప్రహస్య వార్తాం పప్రచ్ఛ కుమారం శూలపాణినః

 నర్వం తాం కథయామాన కుమారః సంపుటాంజలిః

శ్రుత్వా చుకోవ సా దేవీ శివం ప్రస్పురితాధరా

తాం శపుముద్యతాం దేవీముత్థాయ చ త్రిలోచనః

బోధయామాస ఏవిధం తుషావ సంపుటాంజలిః

శ్రుత్వా మనోహరం స్తోత్రం న శశాప శివం శివా

దుష్టం చక్రే తదుచ్ఛిష్ఠమభక్ష్యం విదుషామపి

ఇంతలో సరక బాధలను నశింపజేయునట్టి దుర్గాదేవి ప్రసన్నమైన ముఖము చూపులు గలదై సంతోషముతో అక్కడికి వచ్చెను, భక్తితో నేలమీద బడి యేడ్చుచు మూర్ఛిల్లి యున్న శివుని జూచీ నవ్వి ఆ శూలపాణి వార్తను గురించి సనత్కుమారుని అడిగెను. అతడు ఆమెకంజలి పట్టి సర్వ వృత్తాంతము చెప్పెను. అది విని పెదవులు వణకుచుండగా ఆ దేవి శివుని యందు కోపము పూనెను. త్రినేత్రుడు లేచి తనను శపించుటకు పూనుకున్న దేవికి అనేక విధములుగా విషయము బోధించెను. అంజలి పట్టి ఆమెను స్తుతించెను. మనోహరముగా నున్న ఆ స్తోత్రము విని పార్వతీ శివుని శపించలేదు కానీ శంకరుని ఉచ్ఛిష్టము (ఎంగిలియైన పదార్థము. తినగా మిగిలిన పదార్థము, నైవేద్యము) బుధులెవ్వరును తినగూడని దుష్ట పదార్థముగా శపించెను.

స లోకానాం ప్రభావశ్చ తపః సౌభాగ్య తేజసాం

బ్రహ్మాండే సర్వ సంహర్తా చకం పే పార్వతీభయే

ఉవాచ తం జగన్మాతా నీతిసారం వరం వచః

 గుణప్రసూః సకోపా చ రక్తపంకజలోచనా

 అహో తపః ప్రభావశ్చ తేజనశ్చ న జీవినాం

స బ్రహ్మాండస్య చ సంహర్తా చకం పే శైలకన్యకా

తపసౌభాగ్యము వలన తేజస్సు గలవారైన జీవుల యొక్క మహిమనే కాదు ఈ బ్రహ్మాండమందు సర్వము సంహరింపగల (లయము చేయగల) శివుడు పార్వతీ భయముతో వణికి పోయెను. అప్పుడా జగన్మాత సదుణ నిలయ, కోపముతో కన్నులు ఎర్రదామరలవలె కాగా ఇట్లు పలికెను. ఇతర ప్రాణుల యొక్క తేజస్సు కంటే మాత్రమే కాదు. బ్రహ్మాండములను లయము చేయు వాని తేజస్సు కంటెను ఆమె తపః ప్రభావమాశ్చర్యకరము. శైలకన్యక శివుని చలింపచేసెను.

పార్వత్యువాచ - పార్వతీ పలికెను :

త్వం పోష్టా జగతాం పాతా మమైవ చ విశేషతః

వక్తా చతుర్ణాం వేదానాం జనకశ్చ స్వయం విభుః

ముక్తి ప్రదాతా భక్తానాం దాతా చ సర్వసంపదాం

త్వం చేత్కరోషి దుర్నీతిం కో వా ధర్మం చ పాతి వై

సదా తే పరిపాల్యాహం పోష్యా భక్త్యా చ కింకరీ

వంచితో కర్మదో షేణ హరి నిర్మాల్య భక్షణే

సర్వ జగముల యొక్క పోషకుడవు విశేషించి నా రక్షకుడవు నీవే. చతుర్వేదములను ఉత్పత్తి చేసినవాడవు. బ్రహ్మకు చెప్పినవాడవు. స్వయముగా ప్రభువువు నీవు. భక్తులకు ముక్తిప్రదాతవు. సర్వ సంపదలిచ్చుపోడవు. అట్టి నీవే స్వయముగా నీతి విరుద్ధమైన కర్మ చేసినప్పుడు ఇక ఎవడు ధర్మమును రక్షించును? ఎల్లప్పుడు నీకు పరిపాలింపదగిన - పోషింపదగిన దానను. భక్తితో సేవించు దాసురాలిని. నా కర్మదోషము వలన హరి భుక్త శేషమును భక్షింపకుండ నీ చేత మోసగింపబడితిని.

కించిచ్ఛుద్ధం హిరణ్యేస కించి ద్వస్తు చ వాయునా

కించిత్ ప్రక్షాళనే నైవ నర్వం విష్నోర్నివేదనాత్

విష్ణోర్నివేదిన్నేన యష్ట్రవ్యాః సర్వదేవతాః

 పితరోతిథయశ్చైవమితి వేదేమ నిశ్చితం

అనివేద్యమభక్ష్యం చ నైవేద్యముదరే హరేః

 త్యక్త్వా కరోతి యో భక్త్యా పార్షద ప్రవరో భవేత్

అమృతం సర్వ వస్తూనామిష్ట సారం సుదుర్లభం

విష్ణోర్నివేదనాన్నస్య కలాం నార్హ తి షోడశీం

 హంత్యకాలిక మృత్యుం తదమృతం మూఢరంజనం

 నైవేద్యం చ హరేరేవ హరితుల్యం కరోత్యహో

ఒక్కొక్క పదార్థము బంగారము వలన, ఒక్కొక్క వస్తువు వాయువు సోకుట వలన, ఒక పదార్థము నీటితో కలుగుట వలన అన్ని వస్తువులును విష్ణువుకు సమర్పించుట వలన పరిశుద్ధమగుచున్నవి, విష్ణువుకు నైవేద్యము పెట్టిన అన్నముతోనే సర్వదేవతలకు పితృదేవతలకు అతిధులకు ఆహుతులిచ్చే శ్రాద్ధము చేసి సంతర్పణ చేసి అర్చించవలెనని సర్వవేదములందు నిశ్చయించబడినది. శ్రీహరి గర్భములో ఉంచని (నివేదన చేయని) పదార్ధము భుజింపగూడదని దానిని వదిలివేసి ఎవడు భక్తితో భగవంతునికి నివేదించియే భుజించునో వాడు పరములో విష్ణు పారదులలో శ్రేష్ఠుడగును. సర్వ వస్తువులలో మిక్కిలి ఇష్టమైన రుచి గల దుర్లభమైన అమృతము, విష్ణువుకు నివేదించిన అన్నము యొక్క మహిమకు పదహారవ భాగముగా గూడ సరితూగదు. మూడులనానందపరచునట్టి అమృతము అకాల మృత్యువును నశింపజేయును. ఇక హరికి నివేదించిన పదార్థమైతే భుజించిన వ్యక్తిని విష్ణువుతో సమానునిగా (ముక్తునిగా) చేయును.

యదృచ్ఛయా తం నైవేద్యం యో భుంక్తే సాధుసంగతః

షష్టి వర్ష సహస్రాణాం ప్రొప్నోతి తపసః ఫలం

యో నివేద్య హరిం భుంక్తే భక్త్యా భక్తశ్చ వీత్యశః

కిం వా తపస్యాం కర్తా చ స హరే స్తేజపా సమః

శ్రుతం పురా త్వన్ముఖతః పుష్కరే ముని సంసది

 అహం వేద విధాతా న కిమహం వక్తుమీశ్వరీ

 సుచిరం చ తపస్తస్త్వా మయా లబ్ధస్త్యమీశ్వరః

త్వయా విష్ణోః ప్రసాదేన వంచితాం కథం ప్రభో

ఎవడు సాధుజనులతో కూడియున్నందు వలన ప్రయత్నము లేకుండ (దైవికముగా) లభించిన హరి నైవేద్యమును భుజించ గల్గునో వాడరవది వేల సంవత్సరములు తపస్సు చేసిన ఫలము పొందును. ఎవడు శ్రీహరికి నిత్యము భక్తితో పదార్థము నివేదించి భుజించునో ఆభక్తుడు తేజస్సులో హరితో సముడగును. ఆ స్థితి ఏ తపస్సు చేసిన వాడు పొందగల్గును? పూర్వము పుష్కర క్షేత్రములో మునుల సభలో నీవు చెప్పగా ఈ విషయము వినియుంటిని. నేను వేదకర్తను గాను. నీకు చెప్పుటకు నేనేమి సమర్ధురాలను? సుదీర్ఘ కాలము తపస్సు తపించి ఈశ్వరుడవైన నిన్ను భర్తగా పొందితిని. ఈనాడు నీవు విష్ణు నివేదిత ప్రసాదమునీయక నన్నెట్లు మోసగించితివి స్వామీ!

 యతో న దత్తం నైవేద్యం వీష్ణోర్మహ్యం త్వయాధునా

అతో మత్తో గృహాణైతత్ ఫలమేవ మహేశ్వర

అద్య ప్రభృతి యే లోకా నైవేద్యం భుంజతే తవ

తే జన్మెకం సారమేయా భవిష్యంత్యేవ భారతే

ఇత్యుక్త్వా పార్వతీ మాతా రురోద పురతో విభోః

దృష్టిః పపాత తత్కంఠే నీలకంఠో బభూవ హ

ఓ మహేశ్వరా! ఈనాడు నాకు నీవు విషు నైవేద్యమీయనందువలన నా నుండీ ఈ ఫలము స్వీకరించుము. ఈనాటి నుండి ఈ భారతవరములో ఏ జనులు నీకు నైవేద్యము పెట్టిన పదార్థమును భుజింతురో వారు ఒకసారి శునక జన్మనెతుదురు అని పలికి పార్వతీ మాత భర్త ముందు రోదించెను. అప్పుడామె దృష్టి పరమేశ్వరుని కంఠమందు పడి అతడు సల్లని కంఠము గలవాడయ్యెను.

తదా శివః శివాం భక్త్యా కృత్వా వక్షసి సాదరం

తన్మానభంగం స్తోత్రేణ వినయేన చకార హ

కరేణ చక్షుషోర్నిరం సంమృజ్య చ పునః పునః

బోధయామాన వివిధైర్నీతి వాక్యైర్మనోహరైః

పరితుష్టా చ సా దేవీ భర్తారం నమువాచ హ

కలేవరం చ త్యక్త్యామీ నైవేద్యేన వీనా హరేః

బిభర్తి దేహం సతతం తవ సౌభాగ్య వర్ధనం

కథం వహామీ సౌభాగ్య రహితం చ కలేవరం

అపూర్వం తవ నైవేద్యం జన్మమృత్యు జరామరం

కృతం దుష్టం చ యత్తస్మాత్పశ్య దేహం త్యజామీ చ

అప్పుడు శివుడు పార్వతిని ప్రేమాదరములతో వక్షస్థలమున చేర్చుకొని (కౌగిలించుకొని) వినయ పూర్వక నుతీలో ఆమె అహంకారమును (కోపమును) పోగొట్టెను, చేతితో ఆమె కన్నీటిని మాటి మాటికి తుడిచివేయుచు మనోహరములైన అనేక నీతివాక్యములతో బోధచే సెను. ఆ దేవి శాంతురాలై భర్తతో ఇట్లనెను. నీవు శ్రీహరి నైవేద్యము వలన ఎల్లప్పుడు సౌభాగ్యము పెంచుకొను దేహమును భరించుచున్నావు. ఆ సౌభాగ్యము (హరి నైవేద్య భోజనము) లేని ఈ శరీరమును నేనెట్లు భరింతును ? హరి నైవేద్యము లభించని నా శరీరమును త్యజింతును. అంతేకాక జన్మ మృత్యువులను ముసలితనమును హరించివేయునట్టి అపూర్వమైన నీ యొక్క నైవేద్యమును శాపముతో దుష్టముగా చేసితిని కనుక నేనీ దేహమును త్యజించుచున్నాను. చూడుము.

లింగోపరి చ యద్దత్తం తదేవాగ్రాహ్యమీశ్వర

సువవిత్రం భవేత్తన్య విష్ణో రైవేద్యమిశ్రీతం

ఇత్యేవ ముక్త్వా సా దేవీ దేహం త్యక్తుం సముద్యతా

 త్రతో పోరస్తత్పురతః స్తుత్వా చ స్వీచకార హ

ప్రభూ! లింగము పైన ఏ పదార్థము నీకని నివేదింపబడునో అది గ్రహింపగూడనీదగును. విష్ణువు యొక్క నైవేద్యముతో కలిసినప్పుడు దానికి పవిత్రత ఏర్పడును. ఇట్లు పలికి ఆ దేవి దేహత్యాగము చేయబూనుకొనెను. హరుడు భయపడి ఆమెను నుతింపనారంభించెను.

శంకర ఉవాచ - శంకరుడు పలికెను :

స్థిరా భవ మహాదేవి చండికే జగదంబికే

మమపరాధమఖిలం క్షంతుమర్హసి సుందరి

మాం భృత్యం తపసా క్రితం కృపాం కురు మమోపరి

బ్రహ్మవిష్ణు మహేశానాం బీజభూతే సనాతని

అహో గోలోక నాథస్య గుణాతీతన్య నిర్గుణే

 సర్వశక్తి స్వరూపే చ సదైవ సహచారిణీ

సాకారే చ విరాకారే నిత్యే స్వేచ్ఛామయే ప్రియే

కృపయా తద్విభోరేవ మమ వక్షసి సాంప్రతం

సర్వబీజ స్వరూ పే చ మహామాయే మనోహరే

సర్వ సిద్ధి ప్రదే దేవి ముక్తిదే కృష్ణ భక్తిదే

ఇచ్ఛైవం శ్రీహరేః సాక్షాత్ నాహం దాతుమపి క్షమః

తదా దేహాం పరిత్యజ్య నిర్గుణం వ్రజ నిర్గుణే

ఇత్యేవముక్త్యా పురశస్తస్థౌ చ చంద్రశేఖరః

 బభూవ సుప్రసన్నా సా ప్రణనామ హరం వరం

ఓ మహాదేవి! కోపము ప్రకటించిన చండికా! జగదంబా! సుందరీ! నా అపరాధముంతను క్షమింపుము. ఓ సనాతనీ! బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు బీజభూతురాలా! నీ తపస్పుతో కొనబడి నీచేత పోషింపబడుచున్న నాయందు దయచూపుము. త్రిగుణములకు అతీతుడైన గోలోక నాధుని యొక్క సర్వశక్తుల స్వరూపమైనదానా! నిర్గుణ స్వభావా! ఎల్లప్పుడు నన్ను విడువని సహచారిణీ! స్వేచ్ఛననుసరించి సాకార నీరాకారములు కలదానా! ప్రియా! ఆ ప్రభువు యొక్క కృపచేతనే ఇప్పుడు నా వక్షస్థలముందుంటివి. ఓ మహామాయా! సర్వ బీజస్వరూపిణీ. సర్వసిద్ధులిచ్చుదానా! ముక్తిని కృష్ణ భక్తిని ఇచ్చుదేవీ మనోహరీ! నీకు శ్రీహరి నివేదన నీయకుండుట సూటిగా ఆ స్వామీ ఇచ్చేయే. దానిని కాదని నీకిచ్చుటకు నేను సమర్థుడను కాను. అట్లే శ్రీహరి ఇచ్ఛననుసరించి నీవు నీ దేహము త్యజించి నిర్గుణ స్థితిని పొందుము. అని పలికి ఆ చంద్రశేఖరుడు ఆమె ముందు నిలిచేను. ఆ నుతికామె ప్రసన్నురాలై హరునికి నమస్కరించెను.

 ఇత్యేవం పార్వతీస్తోత్రం శంకరేణ కృతం పురా

యః పరేద్విపదా గ్రస్తః న భయాదేవ ముచ్యతే

మిత్ర భేదో భవేదూరం తత్సంప్రీతిర్భవేత్పురా

పార్వతీ పరితుష్టా చ న త్యజేత్తస్య మందిరం

ఇట్లు పూర్వము పరమేశ్వరుడు రచించిన (చేసిన) పార్వతీ స్తోత్రమును ఆపదలలో చిక్కు కొన్న వాడెవడు పఠించినను అతడా భయము నుండి విమోచనము పొందును. మిత్రభేదము (మిత్రుల నడుము కలిగిన భేదాభిప్రాయము) దూరమై (తొలగిపోయి), వారికి సంతోషము కల్గును. పార్వతీదేవి సంతుష్టురాలై అతని మందిరము విడువకుండును.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు పలికెను :

శ్రుత్వా ప్రతిజ్ఞాం నాథస్య పరితుష్టా బభూవ సా

 జగామ స్వర్ణదీం తూర్ణం స్నానార్థం శంకరాజ్ఞయా

 స్నాత్వా సంపూజ్య భక్త్యా చ సురమిష్టం చ నిర్గుణం

చకార ప్రస్తుతం శీఘ్రం మీష్టాన్నం వ్యంజనావీ చ

శివః స్నాత్వా చ నంపూజ్య బ్రహ్మజ్యోతిః సనాతనం

తుష్టావ పరయా భక్త్యా మామేవ హృదయ స్థితం

గత్వా సర్వమహం భుక్త్వా తస్మై దత్వాభివాంఛితం

 నైవేద్యం పార్వతీ లేభే తన మూలం సమాగతా

భుక్త్యా వశేషం సా దేవీ నహభర్రా ముదావ్వితా

తుష్టార శంకరం భక్త్యా ప్రణనామ ముహుర్ముహః

 ఇత్యేవం కథితం సర్వం త్వయా పృష్ఠం సురేశ్వరి

అభిశప్తం శంకరస్య విర్మాల్యం యేన హేతునా

భర్త ప్రతిజ్ఞను విన్న పార్వతీ దేవి సంతుష్టురాలయ్యెను. శంకరుని ఆజ్ఞననుసరించి ఆమె ఆకాశగంగకు పోయి స్నానము చేసి భక్తితో నిర్గుణుడైన తన ఇష్టదైవమును (విష్ణువును) పూజించి అప్పటికి తగినట్లు శీఘ్రముగా కూరగాయలతో బాటు మధుర భోజనము వండెను. శివుడును స్నానము చేసి సనాతనుడు తన హృదయమందు స్థిరముగా ఉన్నవాడును జ్యోతిరూపమున సున్న పరబ్రహ్మము అగు నన్నే చక్కగా పూజించి గొప్ప భక్తితో స్తుతించెను. నేనక్కడికి పోయి ఆ పదార్థములన్నిటిని భుజించి అతనికి అభివాంఛితము (కోరుకున్న దానిని) ఇచ్చితిని. అప్పుడు పార్వతి నా నైవేద్యమును పొంది దాని ప్రభావము వలన నీ సన్నిధికి చేరెను. ఆ పార్వతీ దేవి సంతోషము పొంది భర్తతో బాటు నా నైవేద్య శేషమును భుజించి భక్తితో శంకరుని స్తుతించి మాటి మాటికి నమస్కరించెను. ఓ సురేశ్వరీ! రాధా! శంకరుని నైవేద్యము ఏ కారణము వలన శపింపబడెనో నీవడిగిన ప్రశ్నకు సర్వము సమాధానము చెప్పితినీ అని శ్రీకృష్ణుడు పలికెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే హర నిర్మాల్య శాప ప్రసంగో నామ సప్తత్రింశోధ్యాయః

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన హర నిర్మాల్య శాప ప్రసంగమనెడి ముప్పది ఏడవ అధ్యాయము సమాప్తము.