36 - శ్రీకృష్ణకృత శంకర ప్రశంస

శ్రీరాధికోవాచ - రాధాదేవి పలికెను :

ఏతేన నియమేనైవ బ్రహ్మా తత్యాజ మోహినీం ।

కథం నకులటాశాపాదపూజ్యః సంబభూవ హ॥

 కథం తస్య దర్ప భంగం చకార కమలాపతిః ।

కథయస్వ సర్వబీజం సర్వేషామీశ్వరః స్వయం ॥

ఈ నియమము వలననే బ్రహ్మ మోహినిని త్యజించెను కదా! మరి ఆ కులట శాపము వలన ఎట్లు అపూజ్యుడాయెను? శ్రీహరి అతనికి గర్వభంగమెట్లు చే సెను? నర్వేశ్వరుడవు ఆ కారణము చెప్పుము.

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :

రాసేశ్వరీ వచః శ్రుత్వా ప్రహస్య రసికేశ్వరః ।

 నిగూఢమితిహాసం చ తాం వక్తు ముపచక్రమే ॥

రసికుడైన ఆ శ్రీకృష్ణుడు రాసమండలేశ్వరి (రాధాదేవి) మాట విని నవ్వి మిక్కిలి రహస్యమైన ఇతిహాసమును ఆమెకు ఇట్లు చెప్పనారంభించెను.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :

బ్రహ్మా చిరం తపస్త్వ మత్తో లబ్ద్వా వరం వరం ।

సృష్టిం నానావిధాం కృత్వా వీధాతా న బభూవ హ॥

తపసాం ఫలదాతా చ సర్వేషాం శాస్తికృత్ర్పభుః ।

ఆత్మానమీశ్వరం జ్ఞాత్వా మహాగర్వో బభూవ హ॥

బ్రహ్మాండేషు చ సర్వేషు గర్వ పర్యంతమున్నతిః ।

ఇతి మత్వా బ్రహ్మణశ్చ దర్పభంగః కృతో మయా ॥

యేషాం యేషాం భవేద్దర్పో బ్రహ్మాండేషు పరాత్పరః ।

విజ్ఞాయ సర్వం సర్వాత్మా తేషాం శాస్తాఽహమేవ చ ॥

ప్రథమో బ్రహ్మణో గర్వో మయా చూర్ణీకృతః శ్రుతః।

శంకరన్య చ పార్వత్యాశ్చంద్రస్య చ రవేస్తథా ॥

వహ్నేద్దుర్వాసస వ తధా ధన్వంతరేః ప్రియే ।

 క్రమేణ దర్పభంగం చ కథయామీ నీశామయ ॥

 క్షుద్రాణాం మహతాం చైవ యేషాం గర్వో భవేత్ప్రియే ।

 ఏవం విధమహం తేషాం చూర్ణీభూతం కరోమీ చ ॥

బ్రహ్మ చాలకాలము తపస్సు చేసి నా వలన మంచి వరము పొంది నానావిధమైన సృష్టిని చేసి విధాత అయ్యెను. సర్వజీవులకు తపస్సుకు ఫలదాతయైనవాడు శిక్షించువాడు ప్రభువును నేనే ఈశ్వరుడనని భావించి బ్రహ్మ మహా గర్విష్టి యయ్యెను. సర్వ బ్రహ్మాండ ములలో అభివృద్ధి గర్వమేర్పడునంత వరకే జరుగును. గర్వమేర్పడిన తర్వాత ఇక ఉన్నతీ యుండదు అని తలచి నేను బ్రహ్మకు దర్పభంగము చేసితినీ. ఈ బ్రహ్మాండములలో ఎవరెవరికి గర్వము కలుగునో పరాత్పరుడను సర్వులకు ఆత్మనైన నేను అది తెలిసికొని వారిని శిక్షింతును, మొదట బ్రహ్మ గర్వమును చూర్ణము చేసితిని. అట్లే శంకరుని యొక్క, పార్వతి యొక్క, చంద్రసూర్యుల యొక్కయు, అగ్ని, దుర్వాసమునీ, ధన్వంతరుల యొక్క దర్పమును క్రమముగా భంగము చేసితినీ. ప్రియురాలా! ఆ విషయమును చెప్పెదను వినుము. క్షుద్రులకును మహాత్ములకును ఎవరెవరికి గర్వము పుట్టునో వారందరి గర్వమీవిధముగా చూర్ణము చేయుదును.

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ ఋషి పలికెను :

శ్రీకృష్ణస్య వచ: శ్రుత్వా శుష్కకంఠోష్ఠ తాలుకా ।

వవ్రచ్ఛ రాధా యత్నేన సంత్రస్తా భయవిహ్వలా ॥

శ్రీకృష్ణుని వాక్కులు వినగానే కంఠము పెదవులు దవడలు ఎండిపోగా భయముతో మనను చెదరి మిక్కిలి వణకుచున్న రాధాదేవి ప్రయత్నించి ఇట్లు పలికెను.

శ్రీరాధికోవాచ - రాధాదేవి పలికెను :

కస్య కేన ప్రభావేజ మహాదర్పో బభూవ హ।

 త్వయా కేన ప్రభావేణ తస్య భంగః కృతః పురా ॥

కథయస్వ ప్రాణనాధ సర్వేషాం దర్ప భంజన ।

దర్పదో భయదః ప్రాణదానైకకారణేశ్వర ॥

ప్రాణనాథా! అందరి దర్పములను భగ్నము చేయువాడా! దర్పము కల్గించువాడవు భయము కళించువాడవును నీవే. ప్రాణదానమొనర్చుటకు మూలకారణము నీవే! ప్రభూ! ఎవనికే ప్రభావము (శక్తి) వలన మహాదర్పము కల్గినో - పూర్వమే ప్రభావము చేత నీవు వానికి దర్ప భంగము చేసితివో చెప్పుము.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు పలికెను :

యేన భూతం గర్వచూర్ణం వ్రతం త్రిజగతాం విధేః।

అన్యేషాం శ్రూయతాం రాధే వ్యాసేన కథయామి తే ॥

 స్వయం శివో మదంశశ్చ సంహర్తా జగతాం చ యః ।

 తేజసా మత్సమః పూర్ణో జ్ఞానేన చ గుణేన చ ॥

ధ్యాయంతి యోగినో యం స యోగీంద్రాణాం గురోర్గురుః ।

జ్ఞానానంద స్వరూపో యం తస్యాభ్యాసం శ్రుణు ప్రియే ॥

ప్రియా! త్రిలోకములను సృష్టించిన బ్రహ్మ యొక్క గర్వము భంగమైన విధము వినియుంటివి. రాధా! ఇతరుల కథలను వివరించి చెప్పెదను వినుము. జగత్తుల సంహరించెడి లయకర్త) శివుడు స్వయముగా నా ఆంశయైనవాడు. తేజస్సు జ్ఞానము గుణములలో పూర్ణుడు. నాతో సముడు. యోగీంద్రులలో పరమ గురువతడు. యోగులందరతనినే ధ్యానింతురు. జ్ఞానానందములే స్వరూపమైనవాడగు ఆ శివుని కథను చెప్పెదను వినుము.

యుగషష్టి సహస్రాణి తపస్తస్త్వా దివానీశం ।

భూత్వా మత్కలాపూర్ణో బభూవ మత్పమో విభుః ॥

తపసా తేజసా శశ్వతేజోరాశీర్బభూవ హ ।

సూర్యకోటి ప్రభావశ్చ భక్తానాం కల్పపాదపః॥

ధ్యాయం ధ్యాయం చ యోగీంద్రాస్తతేజో బహుకాలతః ।

తదంతరే చ పశ్యంతి స్వరూపమతిసుందరం॥

అరవై వేల యుగములు రేబవళ్లు తపస్సు చేసి నా కలలు నిండి శివుడు నాతో సమానుడయ్యెను. తపస్సు చేత తేజస్సు చేత కోటి సూర్యుల ప్రభావము గలవాడై లేజోరాశియై భక్తులకు కల్పవృక్షమయ్యెను. ఆ తేజోమూర్తిని యోగీంద్రులు బహుకాలము నుండి ధ్యానించి ధ్యానించి ఆ తేజస్సు నడుమ మిక్కిలి సుందరమైన స్వరూపమును దర్శించిరి.

శుద్ధ స్పటిక సంకాశం పంచవక్రం త్రిలోచనం ।

త్రిశూల పట్టిశకరం వ్యాఘ్ర చర్మాంబరం వరం ॥

 జపంతం స్వాత్మనా త్మానం శ్వేతాబ్ద బీజమాలయా ।

ఈషదాస్య ప్రసన్నాస్యం చంద్రచూడం పరాత్పరం ॥

స్వర్ణాకారం జటాభారం దధతం శిరసా ముదా।

శాంతం కాంతం త్రిజగతాం భక్తానుగ్రహకాతరం ॥

 ఆథస్వమీశ్వరం మత్వా ప్రదాతా సర్వసంపదాం ।

 దదాతి సర్వం సర్వేభ్యో వాంఛితం కల్పపాదపః ॥

యో యం వాంఛతి తం తస్మై వరం దత్వా వరేశ్వరః ।

బభూవ గర్వ సంయుక్తః స్వాత్మారామ స్వలీలయా ॥

శుద్ధమైన స్ఫటిక మణివంటి తెల్లదనము గలవాడును, ఐదుముఖములు గలవాడును, మూడు నేత్రములు గలవాడును, త్రిశూలము పట్టేశాయుధము చేత ధరించినవాడును పులితోలును వస్త్రముగా ధరించినవాడు తెల్లని పద్మాక్ష మాలతో తనలో తాను తనను (అంతరాత్మయైన రామ మంత్రమును) జపించువాడును చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖము గలవాడును చంద్రుని సిగ మీద ధరించిన వాడును పరాత్పరుడును బంగారము వలె ప్రకాశించు జడలను తలపై ధరించినవాడు శాంతుడును ముల్లోకములందలి జనులకు మనోహరుడును భక్తుల ననుగ్రహించుటలో త్వరగలవాడును అగు పరమ శివుని యోగులు దర్శించిరి. ఆతడు సర్వ సంపదల నిచ్చు ఈశ్వరునిగా తనను తలచుకోనీ కల్పవృక్షమై సర్వులకు సర్వవాంఛితములను (కోరికలను - వరములను) ఇచ్చును. ఎవడెవడు ఏయే కోరిక కోరునో వాని వానికా వరప్రదాత వరమిచ్చి ఆ స్వాత్మారాముడు (తనయందే ఆనందించువాడు) అగు ఆ శివుడు తన లీల కారణముగా గర్వము గలవాడయ్యెను.

ఏకదా చ వృకో దైత్యస్తవస్తే పే శీవస్య చ ।

 కేదారే చ కరేణ వర్షమేకం దివానిశం ॥

నిత్యం యాతి తత్పమీపం కృపయా చ కృపానిధిః ।

పరం దాతుం యథాభీష్టం న జగ్రాహో సురో వరం ॥

వర్షాంతే శంకరః శశ్వత్త్మ తత్పురతః స్వయం ।

 వరదో భక్తపాతేన క్షణం గంతుం న స క్రమ ॥

 సర్వైశ్వర్యం సర్వసిద్ధిం భుక్తిం ముక్తిం హరేః పదం ।

 దైత్యః కించిన్న గృహ్ణతి పరితః శూలపాణినః॥

 ధ్యాయమానం తత్సదాబ్దం దృష్ట్యా త్రస్తో మహేశ్వరః।

అయాచితారం నిశ్చేష్టం రురోద ప్రేమ విహ్వల॥

ఆతీవ రోదనాత్తస్య ధ్యానభంగో బభూవ హ ।

 దదర్శ పురతః సాక్షాచాటారం సర్వ సంపదాం ॥

ఒకసారి వృకుడను రాక్షసుడు కేదారమను క్షేత్రములో సంవత్సర కాలము రాత్రి పగలు విడువక కఠోర తపస్సు చేసెను. దయానిధియైన శివుడు నిత్యము కోరిన వరమిచ్చుటకు పోవుచుండెను. సంవత్సరము చివర శివుడు మరల పోయి వాని ముందు నీలిచెను. వరదాత కనుక భక్తి పాశము చేత బంధితుడై వాసిని విడిచి పోలేకపోయెను. దైత్యుడు మాత్రము సర్వవిధములైన ఐశ్వర్యములను గానీ సర్వవిధ సిద్దులను గాని భుక్తి ముక్తులను గానీ చివరకు వైకుంఠమును గానీ కోరక శివుని పాదపద్మములను ధ్యానించుచుండెను. ఏమి కోరుకొనక కదలక మెదలక ఉన్న ఆ భక్తుని చూచి భయపడిన శివుడు వానీమీద ప్రేమతో మనస్సు చెదిరి బోరున ఏడ్చెను. శివుడట్లు మిక్కిలి రోదించుట వలన వృకాసురునికి ధ్యానభంగమై కనులు తెరచి తనయెదుట సాక్షాత్కరించిన సర్వసంపదలిచ్చు శివుని చూచెను.

మన్మాయయా వరం వవ్రే దైత్యేంద్రో భక్తి పూర్వకం ।

 హస్తం దధే చ యన్మూర్ద్ని స భస్మ భవితేతి చ ॥

ఓమిత్యుక్వా ప్రయాంతం తం దుద్రావ దైత్యపుంగవః ।

మృత్యుంజయో మృత్యుభయాద్రుద్రావ త్రాసవిహ్వల ॥

పపాత డమరుస్తస్య వ్యాఘ్రచర్మ మనోహరం।

దిగంబరో దశ దిశో భేజే దానవ భీతయే ॥

న హంతి తం చ కృపయా భక్తం చ భక్తవత్సలః ।

దుష్టానుసారం సాధుశ్చ న కరోతి కదాచన ॥

 సాధవో ఘ్నంతి ఘ్నంతం చ భృత్యం పుత్రం ప్రియాం వినా ।

ప్రబోధితుం న శక్తశ్చ స్వాత్మానం కృపయా సమం ॥

నా మాయ వలన ఆ రాక్షసుడు భక్తిని ప్రకటించి గూడ ఎవని శిరస్సు మీద నేను చేయి పెట్టుదునో వాడు భస్మము కావలెను” అని వరము కోరుకొనెను. “అట్లే అగును” అని వెళ్లిపోవుచున్న శివుని వెనుక వృకుడు పరిగెత్తాను. మృత్యుంజయుడైనను శివుడు మనస్సు చెదిరి మృత్యుభయముతో పరుగెత్తుచుండెను. చేతిలోని డమరు క్రింద పడిపోయెను. సుందరమైన వ్యాఘ్ర చర్మము శరీరము నుండి జారీ పడిపోయినను రాక్షసునికి భయపడి శివుడు నగ్నము గానే పది దిక్కులకు పరుగెత్తేను గాని భక్తవత్సలుడు గనుక దయతో వానిని సంహరించలేదు. సాధుపురుషుడు తననాశ్రయించిన వాడు దుష్టుడైనను వానిని శిక్షింపడు గదా! సత్పురుషులు భృత్యుని, పుత్రుని, భార్యను కాక ఇతరులను హంతకులైనప్పుడు దండింతురు, దయతో తనతో సమముగా చూచిన వ్యక్తికి హితబోధ చేయుటకును శివుడశక్తుడయ్యెను.

శివః స్వమృత్యుం మత్వా చ భీతశ్చ నీరహంకృతః ।

 స్మారం స్మారం చ మాం భద్రే మామేవ శరణం యయౌ ॥

దృష్వా స్వాశ్రమమాయాంతం శుష్కకంఠోష్ఠ తాలుక।

హే హరే రక్ష రక్షేతి జపంతం భయ విహ్వలం॥

 సంస్థావ్య తత్సమీ పే చ స దైత్యో బోధితో మయా ।

పృష్ఠశ్చ సర్వ వృత్తాంతం ఉవాచ మాం క్రమేణ చ ॥

 తదా మమాజ్ఞయా తూర్ణం వంచితో మాయయా సురః ।

దత్వా స్వమూరి హస్తం చ సద్యో భస్మ బభూవ హ॥

శివుడు తనకు మృత్యువా దానవుడని తలచి భయపడి ముందటి అహంకారము లేనివాడయ్యెను. నన్ను తలచి తలచి నన్నే రక్షకుడని భావించి శరణుపొందెను. తన స్థానమునకు వచ్చుచు కంఠము పెదవులు దవడలు ఎండిపోయి భయముతో మనస్సు కలతచెంది ఓ శ్రీహరీ రక్షింపుము రక్షింపుము అని జపించుచున్న అతనిని చూచి ప్రత్యక్షమై ఆపితిని. అతనికి దగ్గరగా వచ్చుచున్న వృకాసురుని విషయమేమని ప్రశ్నించితిని. వాడు వరుసగా జరిగిన వృత్తాంతమంతయు చెప్పెను. అప్పుడా దైత్యుడు నా మాయచేత వంచితుడై (మోసగింపబడినవాడై) నా ఆజ్ఞననుసరించి తన శిరస్సు మీద హస్తమును పెట్టుకొని వెంటనే భస్మమై పోయెను.

తదా సిద్ధాః సురేంద్రాశ్చ మునీంద్రా మనవో ముదా ।

 తుష్టువుర్మాం సుభక్త్యా చ లజ్ఞయా లజ్జితః శివః॥

 బభూవ చూర్ణసద్గర్వో జగామ బోధితో మయా ।

 వరం దదాతి వరదస్తుతో బోధ్యో హ్యహం శివః ॥

అప్పుడు సిద్ధులు దేవతాధిపతులు మునీంద్రులు మనువులు సంతోషముతో సద్భక్తితో నన్ను స్తుతించిరి. శివుడు తన స్థితికి మిక్కిలి సిగ్గుపొందెను. అతని గర్వము చూర్ణమై పోయెను. ఇక ముందును అతడు వరములిచ్చువాడు కనుక ఆ విషయములో నేను శివునకు తగిన జ్ఞానమును బోధించితిని.

ఆధ గర్వాన్వితో రుద్రో హంతుం త్రిపురముల్బణం ।

మత్వా మనసి సంహర్తా సర్వేషాం జగతామితి ॥

కోయం పతంగవదైత్య ఇతిమత్వా యయౌ రణం ।

విహాయ శూలం మద్దత్తం మదీయ కవచం పరం ॥

చిరం బభూవ సమరం వర్షమేకం దివానీశం।

స కోపి జేతుం కం శక్తో ద్వౌ నమో నమరే తదా ॥

పృధివ్యాం చరణం కృత్వా దైత్యేంద్రో మాయయా ప్రియే।

అత్యూర్ధ్వం చ నముత్తస్థౌ పంచాశత్కోటి యోజనం॥

ఉత్తస్థౌ శంకరసూర్థం హంతుం దైత్యం జగత్ర్పభుః ।

బభూవ తత్ర యుద్ధం చ మామేకం నిరాశ్రయే ॥

అస్రాణి చాపం చిచ్ఛేద శంకరస్యాసురో బలీ ।

రథం బభంజ దైత్యేంద్రశ్చాపమస్రాణి శంకరాత్ ॥

జఘోష ముష్టిగా రుద్రో ధానవేంద్రం ప్రకోపతః।

వజ్ర ముష్టి ప్రహారేణ సద్యో మూర్చోమవావ నః ॥

పిదప మరియొక సారి రుద్రుడు త్రిపురాసురుని హద్దుమీరిన గర్వపు పొంగునుచూచీ సర్వ జగములను సంహరించువాడను నేను గదా అని తలచి గర్వించెను. పక్షివలె ఆకాశములో ఎగురు నీ రాక్షసుడెవడు అని నేను తనకిచ్చిన శూలమును శ్రేష్ఠమైన కవచమును వదిలి పెట్టియే యుద్ధమునకేగెను. ఆ యిద్దరికి ఒక సంవత్సర కాలము రాత్రింబగళ యుద్ధము నడిచాను. ఇద్దరుసు యుద్ధములో సములే కనుక ఏ యొక్కడు గెలువలేకపోయెను. ప్రియురాలా! త్రిపురాసుడు భూమి మీద ఒక కాలానించి ఏబదికోట్ల యోజనములంత ఎత్తునకు తన మాయాశక్తితో ఆకాశమున కెగిరెను. జగత్ర్పభువైన శంకరుడు కూడ దైత్యుని వధించుట కొరకు అంత యెత్తు కెగిరెను. ఏ ఆధారము లేనీ ఆయాకాశములో వారిద్దరికొక మాసము యుద్ధము నడిచెను. బలవంతుడైన రాక్షసుడు శంకరుని అస్త్రములను ధనుస్సును ఖండించి రథమును గూడ భగ్నము చేసెను. శంకరుని వలన వాడును ఆ స్థితిని పొందెను. మిక్కిలి కోపము పొందిన రుద్రుడు పిడికిలి బిగించి రాక్షసుని గొట్టెను. పిడుగు వంటి ముష్టి దెబ్బకు రాక్షసుడు వెంటనే మూర్ఛిల్లెను.

క్షణేన చేతనాం ప్రాప్య కోపాద్దానవ పుంగవః ।

శివం శయానముత్తోల్య పాతయామాన భూతలే ॥

 సరథే పాతితే రుద్రో దేవా దేవర్షయో ఖియా ।

తుష్టువుర్మాం పరిత్రాహి కృషేత్యుక్త్వా పునః పునః ॥

 హర నస్మార మామేవ నిర్భయే భయకారణం ।

 తుష్ఠావ భక్త్యా స్తోత్రేణ మయా దత్తేన సంకటే ॥

ఒక క్షణములోనే మూర్చ నుండి తేరుకొన్న దానవుడు విశ్రాంతిగా శయనించి యున్న శివుని రెండు చేతులతో లేవనెత్తి భూమి మీద పడవేసెను. అది చూచి దేవతలు దేవఋషులు భయముతో “కృష్ణా! రక్షింపుము. రక్షింపుము” అని నన్ను స్తుతించిరి. భయ రహితుడైన శంకరుడు భయకారణమును చూచి నన్ను స్మరించెను. ఆపదలయందు తలచుకొమ్మని నేనుపదేశించిన స్తోత్రమును భక్తితో పఠించి స్తుతించెను.

తదాఽహం కలయా శీఘ్రం వృషరూపం విధాయ చ।

శయాసం శంకరం ధృత్వా విషాణాభ్యామురుక్రమం॥

దదౌ తస్మై స్వ కవచం స్వశూలమరిమర్ధనం ।

ప్రాప్య తద్దానవ స్థానముత్యూర్ధ్వం చ నిరాశ్రయం॥

మయా దత్తేన శూలేన జఘాన త్రీపురం హరః ।

మామేవ దర్సహంతారం తుషావ ప్రీడితః పునః ॥

సద్యః పపాత దైత్యేంద్రశ్చూర్ణీ భూతశ్చ భూతలే।

దేవతా మునయః సర్వే తుష్టువుః శంకరం ముదా ॥

అప్పుడు నేను వెంటనే నా యంశతో వృషభ (ఎద్దు) రూపమును పొంది పడుకొని యున్న గొప్ప శక్తి గల శంకరుని కొమ్ములతో ధరించి అతనికీ శత్రువులను నశింపజేయు కవచ శూలములను ఇచ్చితిని. శంకరుడు వెంటనే ఆధారము లేని అత్యున్నతమైన ఆ రాక్షసుడున్న చోటికి చేరి నేనిచ్చిన శూలముతో త్రిపురాసురుని గొట్టెను. వెంటనే వాడు పొడిపొడియై భూతలము మీదపడి మరణించెను. దేవతలు మునులు అది చూచి సంతసముతో శంకరుని స్తుతించిరి. తన అశక్తతకు సిగ్గుపడిన శంకరుడు తన ధర్పమును నశింపజేసిన నన్నే మరల మరల స్తుతి చేసెను.

తత్యాజ శంకరో దర్పం విఘ్నబీజం తతో విభుః ।

జ్ఞానానంద స్వరూపశ్చ నిర్లిప్త నర్వకర్మను ॥

తతో హం వృషరూపేణ వహామి తేన తం ప్రియం ।

మమ ప్రియతమో నాస్తి త్రైలోక్యేషు శివాత్పరః ॥

విఘ్నములకు మూలమైన దర్పమును (గర్వము) శంకరుడు త్యజించి తాను చేయునట్టి సర్వకర్మల యందును నిర్లీపుడై (అహంకార మమకారములు సోకనివాడై జ్ఞానానందమయుడయ్యెను. అందువలననే నాకు ప్రియమైన అతనిని వృషభ రూపమెత్తి మోయుచున్నాను. ముల్లోకములలో శివుని కన్న ఇతరుడు నాకు మిక్కిలి ప్రియమైనవాడు లేడు.

మనః స్వరూపో బ్రహ్మా మే జ్ఞానరూపో మహేశ్వరః।

బుద్ధిర్భగవతీ దుర్గా మూల ప్రకృతిరీశ్వరీ ॥

నిద్రాదయః శక్తయో యాస్తాః సర్వాః ప్రకృతేః కలాః।

వాగధిష్ఠాతృదేవీ యా సా స్వయం చ సరస్వతీ ॥

మము కల్యాణాధిదేవో హర్షరూపో గణేశ్వరః ।

పరమార్థః స్వయం ధర్మో మను భక్తో హతాశనః ॥

సర్వైశ్వర్యాధిదేవీ మే సర్వగోలోక వాసినః ।

ప్రాణాధీష్ఠాతృదేవీ త్వం సదా ప్రాణాధికా మమ ॥

గోపాంగనాస్తవ కలా అత ఏవ మమప్రియాః ।

మల్లో మకూపజా గోపాః సర్వే గోలోక వాసినః ॥

 తేజ స్వరూపః సూర్యశ్చ ప్రాణా మే వాయః స్మృతాః ।

జలాధిదేవో వరుణః పృథివీ మే మలోద్భవా॥

మమ శూన్యో మహాకాశో మదనో మాసపోద్భవః।

ఇంద్రాదయః సురా సర్వే మత్కలాంశాంశ సంభవా॥

ఓ రాధా! బ్రహ్మ నా మనస్స్వరూపుడు. మహేశ్వరుడు నా జ్ఞాన స్వరూపుడు. ప్రకృతికి మూలభూతురాలు ఈశ్వరి ఐన భగవతి దుర్గాదేవి నా బుద్ధి. ప్రకృతి యొక్క అంశలైన నిద్రాదులు నా శక్తులు, శబ్దరాశికి అధిష్టాన దేవతయైన సరస్వతీ దేవి నా వాక్కు మంగళములకు అధిదేవుడైన గణేశ్వరుడు నా సంతోషరూపుడు. ధర్మదేవత నా పరమార్థరూపుడు. అగ్నిదేవుడు నా ఆహారస్వరూపుడు. సర్వైశ్వర్యములకు అధి దేవతవైన నీవు నా ప్రాణములకు అధిష్టాన దేవివి. గోలోక వాసులందరును నాకు ప్రాణాధికులు. గోలోకవాసినులైన గోపాంగనలందరు నీ యంశలు కావుననే నాకు ప్రియమైన వారు. గోలోకమందలి గోపాలకులందరు నా రోమ కూపముల నుండి పుట్టినవారు. సూర్యుడు నా తేజ స్వరూపుడు. వాయువులు నా ప్రాణములు. జలములకు అధిదైవతమైన వరుణుడును అట్లే. పృథివీ నా శరీరములము నుండి పుట్టినది. మహాకాశమే నా ఆకాశము. మన్మథుడు నా మనస్సు నుండి ఉద్భవించినవాడు. ఇంద్రాది దేవతలందరు నా కళల యొక్క అంశాంశముల నుండి సంభవించిరి.

ఏతాని సృష్టి బీజాని మహదాదీని చైవ హి ।

సర్వేషాం బీజరూపోహం స్వయమాత్మా నిరాశ్రయః ॥

జీవో మే ప్రతిబింబశ్చ కర్మభోగాధికారకః ।

అహం సాక్షీ నిరీహశ్చ న భోగీ సర్వకర్మసు ॥

 భక్తధ్యానార్థ దేహో యం మన స్వేచ్ఛామయస్య చ ।

ప్రకృతిం పురుషోహం చ ఏక ఏవ పరాత్పరః ॥

ఇత్యేవం కథితం రాధే శివదర్ప విమోచనం ।

సృష్టి బీజం చ శ్రేణు మే పార్వతీ దర్పమోచనం॥

మహత్తు మొదలుకొని పృథివి వరకు గల ఈ సృష్టికి మూలమైనవేవి గలవో వాటికన్నిటీకి బీజరూపుడను (కారణము) నేనే. నేనింకొక దాని పై ఆధారపడి లేని స్వతంత్రుడను. ఈ జీవుడు నాయొక్క ప్రతిబింబము. కర్మఫలము లనుభవించునధికారి. నేను కోరికలు లేనివాడను. సర్వ వ్యవహారములకు సాక్షిభూతుడను. కర్మలు కర్మ ఫలములు నాకు లేవు, స్వేచ్చామయుడ (ఇచ్చననుసరించి వ్యవమరించువాడను) నైన నాయొక్క ఈ దేహము భక్తుల ధ్యానము కొరకే ఏర్పరచుకొన్నది. అది నా ప్రకృతి. నిత్యముక్తులకన్న పరుడను (శ్రేష్ఠుడను) ఐన నేనొకడనే పురుషుడును. రాధా! ఇట్లు నీకు శివుని దర్ప విమోచనము (దర్పము నుండి విడిపించుట)ను చెప్పితిని. సృష్టి బీజమైన పార్వతి యొక్క దర్ప విమోచనమును వినుము.

శ్రీనారాయణ ఉవాచ - నారాయణముని పలికెను :

ఇత్యుక్తవంతం శ్రీకృష్ణం పరమాత్మోనమీశ్వరం ।

పప్రచ్ఛ రాధికా దేవీ నిగూఢమభివాంఛితం ॥

శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు పలుకగా రాధాదేవి మిక్కిలి దాచబడిన తన కోరికనిట్లు అడిగెను.

శ్రీరాధికోవాచ - రాధ పలికెను :

భగవన్ సర్వతత్త్వజ్ఞ సర్వబీజ సనాతన ।

వద మే వాంఛితం ప్రశ్నం సర్వనందేహ భంజనం ॥

 సర్వ జ్ఞానాధిదేవశ్చ శంకరః సర్వ తత్త్వవిత్।

 మృత్యుంజయం కాలకాలో భగవాన్ త్వత్సమో మహాన్ ॥

కథం వీభూతి గాత్రశ్చ పంచవక్రస్త్రిలోచనః ।

దీగంబరో జటాధారీ నాగ సంఘాత భూషణః ॥

వృషేణాటతి దేవేంద్రో విహాయ వరవాహనం ।

న బిభర్త కథం రత్నసార నిర్మాణ భూషణం ॥

 వహ్ని శుద్ధాంశుభం త్యక్త్వా ధత్తే శార్దూల చర్మకం ।

ధత్తే ధుత్తూర కుసుమం పారిజాతం విహాయ చ ॥

నాస్తి రత్నకిరీటేచ్ఛా జటాయాం ప్రీతిరుత్తమా ।

దివ్యలోకం పరిత్యజ్య శ్మశానేమ నృహా విభోః ॥

చందనాగురు కస్తూరీ సుగంధి కుసుమాని చ ।

త్యక్త్వా స్పృహా బిల్వపత్రే బిల్వ కాష్ఠానులేవనే ॥

 ఏతద్వేదీతుమీచ్ఫామీ వ్యా సేన కథయ ప్రభో ।

 శ్రోతుం కౌతూహలం నాథ వర్ధతే మే మనః స్పృహా॥

ఓ సనాతనుడా! సర్వమునకు మూలమైన వాడా! సర్వ తత్త్వములు తెలిసిన భగవంతుడా! సర్వ సందేహములను నశింపజేయు నా ప్రశ్నకు కోరిన సమాధానము చెప్పుము. సర్వజ్ఞానమునకు అధిదైవము సర్వ తత్త్వము లెరిగినవాడు ఐన శంకరుడు మృత్యుంజయుడు కదా! కాలునికి కౌలుడు కదా. ఆ భగవంతుడు నీతో సమానుడు కదా! ఆ పంచవక్రుడు (ఐదు ముఖములు గలవాడు) త్రిలోచనుడు విభూతి పులుముకున్న దేహము గలవాడు ఎందుకయ్యెను? ఉత్తమమైన వాహనము విడిచి ఎద్దునెక్కి ఎందుకు సంచరించును? శ్రేష్ఠమైన రత్నములతో నిర్మించబడిన భూషణముల నెందుకు ధరించడు? అగ్నివలె ప్రకాశించు వస్త్రము వదిలి పులితోలు ధరించునేమి? పారిజాత పుష్పమును త్యజించి ఉమ్మెంతపూలు ధరించుచున్నాడు. రత్నకిరీటమందు కోరిక లేదు. జటాభారమందే (జడల ముడి) అధిక ప్రీతి. ఆ విభునికి దివ్యలోకమును పరిత్యజించి శ్మశాన స్థలములందు కోరిక. చందనము అగురు కస్తూరి పదార్ధములను సువాసనగల పుష్పము లను త్యజించి బిల్వ పత్రములు బిల్వ కాష్ఠ చందనము (మారేడు కర్రయొక్క గంధము) కావలయునని కోరుకొనును. వీటిని గూర్చి తెలిసికొన గోరుచున్నాను. నాథా! దీనిని వినుటకు నా మనస్సులో కోరిక ఆసక్తి పెరుగుచున్నవి. వివరించి చెప్పుము ప్రభూ!”

రాధికా వచనం శ్రుత్వా ప్రహస్య మధు సూదన।

కథాం కథితుమారేభే కృత్వా రాధాం స్వపక్షసి॥

రాధాదేవి మాటవిని మధువను రాక్షసుని సంహరించిన శ్రీహరి నవ్వీ రాధను తన వక్షస్థలమున చేర్చుకొని కౌగిలించుకొని) కథను చెప్పనారంభించెను.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీ కృష్ణుడనెను :

యుగషష్టి సహస్రాణి తపః తస్త్వా మహేశ్వరః ।

విరరామ పూర్ణతమో ధ్వాత్వా మాం మనసా ముదా ॥

ఏతస్మిన్నంతరే మాం చ దదర్శ పురతః స్థితం ।

ఆతీవ కమనీయాంగం కిశోరం శ్యామ సుందరం ॥

అహో నిర్వచనీయం చ దృష్ట్వా రూపమనుత్తమం ।

న బభూవ వితృష్ణశ్చ లోచనాభ్యాం త్రిలోచనః ॥

పశ్యన్నిమేష రహిత ఇతి మత్వా సమాన సే ।

భక్త్యుద్రేకాస్మహాభక్త రురోద ప్రేమ విహ్వల ॥

అరువది వేల యుగములు మహేశ్వరుడు తపస్సు చేసి సంతోషముతో నన్ను ధ్యానించి పూర్ణతముడై తపస్సు చాలించెను. అంతలోనే ఎదురుగా నిలిచియున్న నన్ను చూచేను. మిక్కిలి కోరదగిన ఆకారము గల, బాల్యదశలో నున్న, శ్యామసుందరమైన ఇది ఇట్లనిచెప్పరాని, నా ఉత్తమ రూపమును దర్శించి ఆ త్రిలోచనుడు కన్నుల దప్పిక తీరక - రెప్పపాటు లేని కన్నులతో అట్లే చూచుచు - అత్యంత ప్రేమతో అవయవములు ఆధీనము తప్పగా - ఆ మహాభక్తుడు భక్తి ఉద్రేకములతో బోరుమని ఏడ్చెను.

సహస్ర వదనోనంతో భాగ్యవాంశ్స చతుర్ముఖః ।

బహుభిర్లోచనైర్దృష్వా తుష్టాన బహుభిర్ముఖైః॥

వశ్యామి కిం వా కిం స్తౌమి సంప్రావ్య నాథమీశ్వరం ।

ఆ సైకేన లోచనాభ్యాం చతుర్థా స పునః పునః ॥

స్వమానసే కుర్వతీదం శంకరే చ తపస్విని ।

తద్బభూవ చతుర్వక్రం పూర్వేణ సహ పంచమం ॥

వేయినోళ్లు గల అనంతుడు (నాగరాజు)ను నాల్గు ముఖములు గల బ్రహ్మయు భాగ్యవంతులు. వారు అనేక ముఖములతో అనేక నేత్రములతో భగవంతుని స్తుతించి దర్శింపగలిగిరి అని శివుడు మనస్సులో “నా ఎదుట నాధుడైన పరమాత్మను ఉంచుకొని (పొంది) కూడ ఒక్క ముఖముతో రెండు కన్నులతో ఏమి చూతును? ఏమీ సుతింతును?” అన్న భావనను మరల మరల ఒకటీకి నాల్గుసార్లు అనుకొనగా తపస్సంపద గల శివునకు క్రొత్తగా నాల్గు ముఖములు ఏర్పడి ముందున్న ముఖముతో గలిసి ఐదు ముఖములయ్యెను.

ఏకైక వక్త్రం శుశుభే లోచనైశ్చ త్రిభిస్తీభిః ।

బభూవ తేన తన్నామ పంచవక్షస్త్రిలోచనః ॥

స్తవనాదధిక ప్రీతిః శివస్య దర్శనే మమ ।

తేనాధికొని తస్యైవం బభూపుర్లోచనాని చ ॥

ఒక్కొక్క ముఖము మూడేసి కన్నులతో శోభించినవి. అందుచేత అతనికి పంచవక్రుడు త్రిలోచనుడు అన్న నామము లేర్పడెను. నా దర్శన వేళయందు శివుని యొక్క స్తుతి వలన నాకు అధిక ప్రీతి కలిగినది. శివునికిట్లు ముఖములు నేత్రములు అధికముగా ఏర్పడినవి.

చక్షూంషి గుణరూపాణి తన్య బ్రహ్మ స్వరూపిణః ।

సత్యం రజస్తమ ఇతి తస్య హేతుం విశామయ ॥

సత్త్యాంశేన దృశా శంభుః వశ్యన్ పాతి చ సాత్వికాన్ ।

 రాజ సేన రాజనీకాంస్తామసేన చ తామసాన్ ॥

చక్షుషస్తామసాత్పశ్చాల్లలాటస్థాద్ధరస్య చ।

సంహారకాలే సంహర్తురగ్నిరావిర్భవేత్ క్రుధా॥

కోటి తాల ప్రమాణశ్చ సూర్యకోటి సమప్రభః ।

లేలిహనో దీర్ఘశిఖస్త్రైలోక్యం దగ్ధుమీశ్వరః॥

బ్రహ్మస్వరూపము గల శివుని కన్నులు ప్రకృతి గుణరూపములైన సత్త్వరజస్తమస్సులు. దాని కారణము వినుము. సత్తాంశ గల కంటితో సాత్విక జనమును చూచి కాపాడును. రాజననేత్రముతో రజోగుణము గలవారినీ తామస నేత్రముతో తామసులను చూచి పాలించును. ప్రళయ కాలమందు సృష్టి సంహారకుడైన అతనికి కోపమేర్పడుట వలన హరునీ తామస గుణము గల లలాట నేత్రము {నొసట గల కన్ను) నుండి అగ్నీ ఉద్భవించును. కోటి తాటిచెట్ల ఎత్తును కోటి సూర్యులతో సమానమైన ప్రకాశమును గల ఆ హరుడు నాల్కలు చాచుచున్న పొడవైన అగ్ని జ్వాలలతో ముల్లోకములను దగ్ధము చేయును.

వీభూతి గాత్రః న విభుః సతీ సంస్కార భస్మనా ।

ధత్తే తస్యా ఆస్థిమాలాం ప్రేమ భావేన భస్మ చ ॥

స్వాత్మారామో యద్యపీశస్తథాపి పూర్ణమబ్ధకం ।

సతీ శవం గృహీత్వా చ భ్రామం భ్రామం రురోద హ ॥

ప్రత్యంగం చాపి తస్యాశ్చ వపాత యత్ర యత్ర హ ।

 సిద్ధపీఠస్తత్ర తత్ర బభూవ మంత్రసిద్ధికృత్ ॥

తదా శవావశేషం చ కృత్వా వక్షసి శంకరః ।

పపాత మూర్ఛితో భూత్వా సిద్ధిక్షేత్రే చ రాధికే ॥

 తదా గత్వా మహేశం తం కృత్వా క్రోడే ప్రబోధ్య చ ।

అదదాం దివ్య తత్త్వం చ తస్మై శోక హారం పరం॥

తదా శివశ్చ సంతుష్టః స్వం లోకం చ జగామ హ ।

 మూర్యంతరేణ కాలేన తాం సంప్రావ ప్రియాం సతీం ॥

పరమేశ్వరుడు తన మొదటి భార్యయైన (దక్ష ప్రజాపతి పుత్రిక) సతీదేవి యొక్క శవ సంస్కార భస్మముతో విభూతి గల శరీరము గలవాడయ్యెను. ఆమె యందలి ప్రేమ భావము చేతనే ఆమె భస్మమును ఎముకల పేరును ధరించుచున్నాడు. తన ఆత్మయందే రమించు ఆనందమయుడైనను శంకరుడు సతీదేవి మరణానంతరము ఆమె శవమును పట్టుకొని ఒక సంవత్సరము వరకు అంతట తిరుగుచు తిరుగుచు రోదించెను. ఆ సమయములో సతీదేవి యొక్క శరీరాంగములోక్కొక్కటి ఎక్కడెక్కడ రాలిపడెనో అక్కడక్కడ మంత్రసిద్ధి కల్గించు సిద్ధపీఠము లేర్పడెను. తరువాత శవము యొక్క శేష భాగములను రొమ్ముమీద పెట్టుకొని శంకరుడు ఆయా సిద్ధ క్షేత్రములలో మూర్ఛిల్లిపడిపోయెను. రాధా! అప్పుడు నేను మహేశుని వద్దకేగి నా ఒడిలో కూర్చుండ బెట్టుకొని దుఃఖము నుండి మేల్కొలిపి అతని శోకము హరించునట్టి శ్రేష్ఠమైన దివ్య తత్త్వముపదేశించితిని. అప్పుడు శివుడు సంతుష్టుడై తన లోకమున కేగెను. కొంతకాలము తరువాత వేరొక రూపము పొందిన ఆ ప్రియ సతిని (పార్వతిగా జన్మించిన సాధ్విని) శివుడు పొందెను.

దివ్య స్రగ్దారి యోగేన నేచ్ఛా నిత్యే పరే విభోః ।

జటా తవస్యా కాలీనాం ధత్తేద్యాపి వివేకతః ॥

న చేచ్ఛా కేశ సంస్కారే స్వాంగవే షేణ యోగినః ।

సమతా చందనే పంకే లోష్ఠే రత్నే మణీశ్వరే ॥

గరుడద్వేషిణో నాగాః శంకరం శరణం యయుః।

 బీభర్త కృపయా స్వాంగే తానేన శరణాగతాన్ ॥

వాహనం వృషరూపో హమన్యస్తం వోడుచుక్షమః ।

త్రిపురన్య వధే పూర్వం మత్కలాంశ సముద్భవః॥

పారిజాతాదికం పుష్పం సుగంధి చందనాదికం ।

 మయి సన్యస్య తే ష్వేవం ప్రీతిర్నాస్తి కదాచన ॥

ధత్తూరే తత్పదా ప్రీతిర్భిల్వ పత్రానులేపనే ।

గంధహీనే సుగంధే చ యోగీ ష్టే వ్యాఘ్ర చర్మణీ ॥

శాశ్వతుడు ప్రకృతి కన్న పరుడైన పరమేశ్వరునికి దివ్యపుష్పమాలలు ధరించుట యందాసక్తి లేదు. వివేక మూలమున తపఃకాలమందలి జడలనే నేటికి ధరించుచున్నాడు. యోగియైన అతనికి కేశాలంకారమందుగానీ శరీరాలంకారమందు గాని ఇచ్చలేదు. చందనము, బురద, మట్టి పెల్ల, శ్రేష్ఠ రత్నము అన్నిటియందతనికి సమభావమే. గరుడుని శత్రువులైన నాగరాజులు శంకరుని శరణుపొందిరి, అట్టి శరణాగతులను కృపతో తన శరీరమందు భరించుచున్నాడు. త్రిపుర సంహార కాలములో నా యొక్క కళలలోని అంశతో జనించిన వృషభము శివునికి వాహనము. ఆ వృషభము నేనే. ఇతరుడెవ్వడును అతనిని మోయుటకు సమర్థుడు కాడు. పారిజాతము మొదలగు పుష్పములను మంచి పరిమళము గల చందనాది పదార్దములను నాయందుంచిన (నా కర్పించిన) అతనికి ఆ పదార్థములందెప్పుడు కూడ కోరిక లేదు. అతనికి ఉమ్మెంత పువ్వు బిల్వ పత్రములు మారేడు కర్ర గంధము లందే ఎల్లప్పుడు ప్రీతి. గంధమానములు సుగంధములు అతనికి సమానము. యోగుల కిష్టమైన వ్యాఘ్ర చర్మము (పులితోలు) నందు అతనికాసక్తి.

దివ్యలోకే దివ్యతల్పే జనతాయాం న తన్మనః ।

శ్మశానే తీవ దహసి ధ్యాయతే మామహర్నిశం ॥

ఆ బ్రహ్మ స్తంబపర్యంతం నయం చ మస్యతే శివః ।

 మమానిర్వచనీయబిత్ర రూపే తన్మగ్న మాననం ॥

బ్రహ్మణః పతనేనాపి శూలపాణేః క్షణో భవేత్ ।

 తస్యాయుషః ప్రమాణం చ నాహం జానామీ కా శ్రుతిః ॥

దివ్యలోకమందు గానీ దివ్యమైన శయ్యయందు గాని జన సమూహము నందు గాని అతని మనస్సు లగ్నము కాదు. మిక్కిలి ఏకాంత ప్రదేశమైన శ్మశానము నందుండి రాత్రింబగళ్ళు నన్ను ధ్యానించుచుండును. బ్రహ్మ మొదలుకొని గడ్డి వరకు అన్ని ప్రాణులనతడు సమానముగా మలచును. అనిర్వచనీయమైన నా రూపమందే అతని మనసు మగ్నమై యుండును. ఒక సృష్టికర్త (బ్రహ్మ) యొక్క జీవితకాలము శివునికొక క్షణకాలము. ఇకనతని ఆయుః ప్రమాణము నేనే ఎరుగను. ఆ స్థితిలో వేదమునకెట్లు తెలియును.

జ్ఞానం మృత్యుంజయః శూలం ధత్తే మత్తేజసా సమం ।

వినా మయా న కశ్చిత్తం శంకరం జేతుమీశ్వరః ॥

శంకరః పరమాత్మా మే ప్రాణేభ్యోపీ పరః శివః ।

త్ర్యంబకే మన్మనః శశ్వన్న ప్రేయో మే భవాత్పరః ॥

 బ్రహ్మాండ నికరం ఛన్నం మయా మన్మాయయా సదా ।

 స కంపతి పరం శశ్వన్న చ తం మోహితుం క్షమః ॥

 న సంవసామి గోలోకే వైకురే తవ వక్షసి ।

సదా శివస్య హృదయే నిబద్ధః ప్రేమ పాశతః ॥

స్వరసిధ్ధం సుతానేన పంచ వక్రేణ శంకరః ।

శశ్వద్గాయతి మద్గాథాం తేనాహం తత్సమీపతః ॥

ఆ మృత్యుంజయుడు నా తేజస్సుతో సమమైన జ్ఞానమునకు మారు రూపమైన శూలమును ధరించును. నేను తప్ప మరి యొక్కడెవ్వడును శంకరుని జయించ గల ప్రభువు లేడు సమర్థుడు లేడు), శంకరుడు నాకు ప్రాణముల కంటే అధికుడు. అతడు నా అంతరాత్మ. త్ర్యంబకుని యందే నా మనస్సెప్పుడు నుండును. భవుని కంటే ఇతరుడు ఎవడును నాకు ప్రియుడు లేడు. ఈ బ్రహ్మాండములన్నియు నాచేత ఆక్రమింపబడీ (కప్పబడి} ఉన్నవి. ఎల్లప్పుడు నా మాయచేత అవి వణికి పోవుచున్నవి. కాని అతని నేదియు మోహింపజేయజాలదు. నేను వైకుంఠమున గాని గోలోకమున గాని నీ వక్షస్థలమందుగాని కుదురుగా నివసించుచులేను. ప్రేమ పాశము చేత బంధింపబడినవాడనై శివునీ హృదయమందెల్లప్పుడు నివసింతును. శంకరుడు ఐదు ముఖములతో మంచి రాగచ్ఛాయ గల సప్తస్వరములతో ఎల్లప్పుడు నా కథను పాడుచుండును. ఆ కారణము చేత అతని వద్దనే యుందును.

స్రష్టుం శక్తో హీ నష్టుం చ భ్రూభంగ లీలయాపి యః।

బ్రహ్మాండ నికరం యోగాన్న యోగీ శంకరాత్పరః ॥

దివ్యజ్ఞానేన యః స్రష్టుం నష్టం భ్రూభంగ లీలయా।

మృత్యుం కాలాదీకం శక్తో న జ్ఞానీ శంకరాత్పరః ॥

మమ భక్తిం చ దాస్యం చ ముక్తిం చ సర్వసంపదః ।

సర్వసిద్ధిం దాతుమీశో న దాతా శంకరాత్పరః ॥

పంచవక్రేణ మన్నామ యో హి గాయత్యహర్నిశం ।

మద్రూపం ధ్యాయతే శశ్వన్న భక్తః శంకరాత్పరః ॥

అహం నుదర్శనం శంభు స్తేజపా చ వయం సమాః ।

బ్రహ్మా స్రష్యా చ యోగేన నాస్మాభిస్తేజనే నమః ॥

ఇత్యేవం కథితం సర్వం శంకరస్య యశో మలం।

తథా స్యన్య దర్పభంగం కిం భూయః శ్రోతుమిచ్ఛసి ॥

ఎవడు తన యోగశక్తి వలన కేవలము బొమముడి యొక్క విలాసముతో బ్రహ్మాండములను సృష్టించుటకు నశింపజేయుటకు శకుడో ఆ శంకరుని మించిన యోగి మరొకడు లేడు, దివ్యజ్ఞానముతో బొమముడి విలాసము ద్వారా మృత్యువును కాలాదులను సృష్టించుటకు నశింపజేయుటకు సమర్థుడైన శంకరుని కంటే జ్ఞాని మరియొకడు లేడు. నా భక్తిని నా దాస్యమును నా ముక్తిని సర్వసంపదలను సర్వసిద్ధులను ఇచ్చుటకు శంకరుడే ప్రభువు. అతనిని మించిన దాత వేరొకడు లేడు. ఐదు ముఖములతో నా నామమును రాత్రీబగలు పాడుచు నా రూపము నెల్లప్పుడు ధ్యానించు శంకరుని కన్న భక్తుడు వేరొకడు లేడు. నేను సుదర్శన చక్రము శంభుడు తేజస్సును బట్టి సమానులము. యోగశక్తితో లోకసృష్టి చేయగల బ్రహ్మ, తేజస్సులో మాతో సముడు గాడు. ఇట్లు శంకరుని విమల కీర్తిని నీకు చెప్పితిని. ఇంతవాడైనను శంకరునికి దర్పభంగము సంభవించినది. ఇంకేమి వినగోరుచున్నావు.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే శ్రీకృష్ణకృత శంకర ప్రశంసా నామ షట్ త్రింశోధ్యాయః॥

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదనంవాదరూపమైన శ్రీ కృష్ణుని చేత చేయబడిన శంకర ప్రశంస అనెడి ముప్పది ఆరవ అధ్యాయము సమాప్తము.