నారద ఉవాచ :
జన్మాష్టమీ వ్రతం బ్రూహీ వ్రతానాం వ్రత ముత్తమం ।
ఫలం జయంతీ యోగన్య సామాన్యేనైవ సాంప్రతం ॥
కోవా దోషోఽవ్యకరణే భోజనే వా మహామునే ।
ఉపవాన ఫలం కిం వా జయంత్యాం చ సునమ్మతం ॥
ప్రతం పూజా విధానం చ నంయపుస్య చ సాంప్రతం।
ఉపవాస పారాయణయోః సువీచార్య వద ప్రభో ॥
నారదుడిట్లు పలికెను :
ఓ నారాయణ మహామునీ! వ్రతములలో ఉత్తమ వ్రతమైన జన్మాష్టమీ వ్రతమును గూర్చి నాకు తెలుపుము. ఇప్పుడు జయంతీయోగము యొక్క ఫలమును సాధారణముగానైనను తెలుపుము. శ్రీకృష్ణజయంతి నాడు సజ్జన సమ్మతమైన ఉపవాసమునకు ఫలమేమి? వ్రతమునకు ఏమి నీయమములు ఎట్టి పూజ విధానముండును? దానితో పాటు ఉపవాస పారాయణములయొక్క విధానము కూడ బాగుగా విచారించి తెలుపుము..
నారాయణ ఉవాచ :
కృత్వా హవిష్యం సప్తమ్యాం సంయతః పారణే తథా ।
అరుణోదయ వేళాయాం సముత్థాయ పరేఽహని॥
ప్రాతః కృత్యం సంవిధాయ స్నాత్వా నంకల్పమాచరేత్ ।
ప్రతాపవానయోర్ బ్రహ్మన్ శ్రీకృష్ణప్రీతి హేతుకం ॥
మన్వాది దివసే ప్రాప్తే యత్ఫలం స్నాన పూజనైః ।
ఫలం భాద్రపదేఽష్ఠమ్యాం భవేత్ కోటిగుణం ద్విజ ॥
నారాయణ మహర్షి ఇట్లు పలికెను :
నియమనిష్ఠలుగలవాడై సప్తమినాడు హవిష్యము వండి (బియ్యము కడుగకుండ గంజివార్చకుండ వండిన అన్నము) దైవమునకు నివేదించి పారణము (ప్రతభోజనము) చేసి మరునాడు తూర్పున ఎఱ్ఱని రేఖలేర్పడు వేళకే మేల్కొని ప్రాతఃకాల దేహానిధులు తీర్చుకొని స్నానము చేసి జయంతీ వ్రత సంకల్పము చేయవలెను. అనగా ప్రేత ఉపవాసములు చేయ బూనుకొనవలెను. ఇది శ్రీకృష్ణ ప్రీతికి మూలము. మన్వాదులు యుగాదులు అన్న దివసములు సంభవించినప్పుడు చేయునట్టి స్నాన దేవపూజలాచరించుట వలన ఏ ఫలము లభించునో అంతకంటే కోటిరెట్లు ఫలము భాద్రపద బహుళమున వచ్చు కృష్ణాష్టమీ వ్రతాచరణము వలన లభించును.
తస్యాం తిధౌ వారిమాత్రం పితృణాం యః ప్రయచ్ఛతి ।
గయాశ్రాద్ధం కృతం తేన శతాబ్దం నాత్ర సంశయః ॥
ఆ తిథినాడు పితృదేవతలకెవడు జలదానము (నువ్వులు నీళ్లు వారి గోత్రనామములు చెప్పుచు దర్భల పై వీడుచుట, (పితృతర్పణము} చేయునో వాడు నూరు సంవత్సరములు గయాశ్రాద్ధము చేసిన ఫలము పొందుననుటలో సంశయము లేదు.
స్నాత్వా నీత్యక్రియాం కృత్వా నిర్మాయ సూతికాగృహం।
లోపాఖండ వహ్నిజాలైర్యుక్తం రక్షక సంఘకైః ॥
తత్ర ద్రవ్యం బహు విధం నాభిచ్ఛేదన కర్తనం ।
ధాత్రీస్వరూపాం నారీం చ యత్నతః స్థాపయేద్భుధః॥
పూజాద్రవ్యాణి చారాణి సోపచారాణి షోడశ ।
ఫలాన్యష్టౌ చ మిష్టాని ద్రవ్యాణ్యేవ హి నారద ॥
జాతీఫలం చ కంకోలం దాడిమం శ్రీఫలం తథా।
నారికేరం చ జంబీరం కూష్మాండం చ సువాసనం ॥
ఆననం వసనం పాద్యం మధుపర్కం తథైవ చ।
అర్ఘ్యమాచమనీయం చ స్నానీయం శయనం తథా॥
గంధం పుష్పం చ నైవేద్యం తాంబూలమసులేపనం।
ధూపదీపౌ భూషణం వై చోపచారాంశ్చ షోడశ॥
శ్రీకృష్ణజయంతీ వ్రతము చేయదలచిన వాడు ఆనాడు ఉదయమున స్నానము చేసి సంధ్యావందనాదులు (నిత్యకర్మలు) ముగించి సూతికాగృహము నిర్మించుకోవలెను (కృష్ణ జననగృహము). అందులో ఇనుప శలాకలను అగ్నిని సూతికాగృహ రక్షకులను అనేక ద్రవ్యములను బోర్డును కత్తిరించు కత్తెరను ధాత్రీ స్వరూపిణి {పురుడు పోసుకొనుటకు సహకరించు స్త్రీ విగ్రహమును ప్రయత్నముతో సమకూర్చుకోవలెను. షోడశోపచార పూజకు తగిన సామగ్రినీ సుందర వస్తుజాలమును, ఎనిమిది రకముల ఫలములను రుచికరమైన పిండివంటలను సంగ్రహించవలేను. దానిమ్మపండు మారేడు పండు నారికేళము గజనిమ్మపండు, గుమ్మడిపండు అర్ఘ్యపాద్య ఆచమనీయ మధుపర్కములు స్నానవస్త్ర గంధపుష్పములు భూషణములు ధూపదీపములు, కస్తూరి మొదలగునవి నైవేద్య తాంబూలములు శయ్యాసనము మొదలగు షోడశోపచార పూజకు తగినవి సమకూర్చుకోవలెను.
పాదప్రక్షాళనం కృత్వా ధృత్వా ధౌతే చ వాననీ ।
ఆచమ్య చాసనే స్థిత్వా స్వస్తివాచన పూర్వకం ॥
ఘటస్యారోపణం కృత్వా సంపూజ్య పంచదేవతా: ।
ఘటే హ్యావాహనం కృత్వా శ్రీకృష్ణం పరమేశ్వరం ॥
వసుదేవం దేవకీం చ యశోదాం నందమేవ చ ।
రోహిణీం బలదేవం చ షష్ఠిదేవీం వసుంధరాం ॥
రోహిణీం బ్రాహ్మణీం చైవ అష్టమీం స్థానదేవతాం ।
అశ్వత్థామ్నా సహబలిం హనుమంతం విభీషణం ॥
కృషం పరశురామం చ వేదవ్యాసం మృకండకం।
నర్వస్యావాహనం కృత్వా ధ్యానం కుర్యాద్ధరేస్తదా ॥
(స్నాన సంధ్యాదులు ముగించుకొన్న కర్త ప్రతమునకు కావలసిన సామగ్రిని కూర్చుకొన్న తరువాత) పాదములు కడుగుకొని ఉదికి ఆరవేసిన దోవతి ఉత్తరీయములు ధరించి ఆసనముపై కూర్చుండి ఆచమనము చేసి పుణ్యాహవాచనము చేసి ఒక కలశమును స్థాపించి పంచలోకపాలక దేవతలనర్చించిన పిదప ఆ కలశమున పరమేశ్వరుడైన శ్రీకృష్ణుని ఆవాహన చేయవలెను. దేవకీ వసుదేవులను, యశోదానందులను, రోహిణీదేవిని బలరాముని షష్ఠిదేవతను భూదేవినీ, నక్షత్ర దేవతయగు రోహిణిని, స్నానదేవతయగు అష్టమీ తీథినీ, - అశ్వత్థామ, బలి చక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, వేదవ్యాసుడు, మార్కండేయుడు అను వారినందరిని కలశమున ఆవాహన చేయవలెను. ఆ వెనుక శ్రీహరి ధ్యానము చేయవలెను.
పుష్పకం మస్తకే న్యస్య పునర్ధ్యాయేద్విచక్షణః ।
ధ్యానం చ సామవేదోక్తం శృణు వక్ష్యామి నారద ॥
ఒక పుష్పమును తన తల ఫై ఉంచుకొని విశుద్ధ జ్ఞానముతో మరల స్వామిని ధ్యానించవలెను. నారదా! సామవేదమున చెప్పబడిన ఆధ్యాన (విధమును-మంత్రమును మును వినుము.
బ్రహ్మణా కథితం పూర్వం కుమారాయ మహాత్మనే ॥
ఈ ధ్యానమంత్రమును మహానుభావుడైన సనత్కుమారునకు బ్రహ్మదేవుడు చెప్పెను.
బాలం నీలాంబజాభమతిశయ రుచిరం స్మేర వక్త్రాంబుజం తం ।
బ్రహ్మేశానంత ధర్మై: కతికతి దివ సైః స్తూయమానం పరం యత్ ॥
ధ్యానాసాధ్యం ఋషీంధ్రై ర్ముని గణమనుజైః సిద్ధ సంఘైరసాధ్యం ।
యోగీంద్రాణా మచింత్యమతిశయముతులం సాక్షిరూపం భజేఽహం ॥
బాలరూపుడును సల్లకలువ వంటి కాంతీ గలవాడును మిక్కిలి సుందరుడును చిరునవ్వుతో వెలుగు ముఖపద్మము గలవాడును బ్రహ్మరుద్రుడు ఆదిశేషుడు ధర్మదేవత అనువారిచేత దీనముల కొలది ఎన్నో విధముల స్తోత్రములు చేయబడు ఏ పరమాత్మ గలడో - ధ్యానమున కందనివాడును ఋషులు, మునులు, మనుజులు, సిదలకు ఎవడు సాధింపరానివాడో - యోగీంద్రులకును ఊహకందనీ ఆతిశయము గల సాటిలేని అట్టి సాక్షిరూప పరచూత్మను నేను భజించును.
ధ్యాత్వా పుష్పం చ దత్వా చ తత్సర్వం చ నివేదయేత్ ।
ఏవం ప్రతీ వ్రతం కుర్యాచ్ఛృణు మంత్రక్రమం మునే ॥
ఇట్లు ధ్యానము చేసి ఆ పుష్పమును (కలశము పై ఉంచి పూజాసామగ్రిని మొత్తమును మంత్రములు చెప్పుచు షోడశోపచార పూజను సమర్పించవలెను. ఇట్లు శ్రీకృష్ణజయంతీవ్రతమొనర్చు వాడావ్రతము చేయవలెను. నారదమునీ! మంత్ర క్రమము వినుము.
ఆసనం సర్వశోభాడ్యం సద్రత్నమణి నిర్మితం ।
విచిత్రం చ విచిత్రేణ గృహ్యతాం శోభనం హరే॥
ఓ శ్రీహరీ! శ్రేష్ఠములైన రత్నమాణిక్యములతో నిర్మించబడిన సర్వవిధ శోభలతో కూడిన - చిత్తరువులతో ఆశ్చర్యకరమైన - మంగళకరమైన ఆసనమును స్వీకరింతువు గాక (మంత్రరూపములైన ఈ శ్లోకములన్నీటికినీ కూడ పాఠకులకు తెలియుట కొరకు భావము వ్రాయబడుచున్నది. అనువాదకుడు).
వసనం వహ్ని శౌచం చ నిర్మితం విశ్వకర్మణా ।
ప్రతప్త స్వర్ణ ఖచితం చిత్రీతం గృహ్యతాం హరే ॥
ఓ శ్రీహరీ! విశ్వకర్మ నిర్మితమును అగ్నివలే పవిత్రము ప్రకాశవంతమును - స్వచ్ఛమైన బంగారు తీగలు పొదిగినదియు - పలురంగులు కలదిగా చేసినదియు అగు వస్త్రమును స్వీకరింతువు గాక.
పాదప్రక్షాళనార్థం చ స్వర్ణపాత్రస్థిత జలం ।
పవిత్రం నిర్మలం చారు పాద్యం చ గృహ్యతాం హరే ॥
శ్రీహరీ! నీ పాదములు కడుగుటకై బంగారు పాత్రలో ఉన్న పవిత్రము స్వచ్ఛము ఐన జలమును పాద్యముగా స్వీకరింతువు గాక.
మధు నర్పిదధిక్షీరం శర్కరా సంయుతం పరం ।
స్వర్ణపాత్ర స్థితం దేయం స్నానార్ధం గృహ్యతాం హరే ॥
శ్రీహరీ! తేనె నెయ్యి పెరుగు పాలు శర్కరతో కూర్చీ బంగారు గిన్నెలో ఉన్న మధుపర్కమును స్నానాంగముగా స్వీకరించవయ్యా.
దూర్వాక్షతం శుక్లపుష్పం స్వచ్ఛతోయ సమన్వితం ।
చందనాగురు కస్తూరీ సహితం గృహ్యతాం హరే ॥
శ్రీహరీ! పచ్చిగరికమొలకలు అక్షతలు తెల్లని పుష్పములు వేసి చందనము అగురుద్రవ్యము కస్తూరి కలిసియున్న స్వచ్చజలమును స్వీకరింపుము.
సుస్వాదు స్వచ్ఛతోయం చ వాసితం గంధవస్తునా।
శుద్ధమాచమనీయం చ గృహ్యతాం పరమేశ్వర॥
ఓ పరమేశ్వరా! సుగంధ ద్రవ్యములతో పరిమళము చేకూర్చిన, తీయని మంచినీటిని శుద్ధ ఆచమనముగా స్వీకరింపుము.
గంధద్రవ్య సమాయుక్తం విష్ణో తైలం సువాసితం ।
ఆమలక్యా ద్రవం చైవ స్నానీయం గృహ్యతాం హరే ॥
ఓ విష్ణుమూర్తీ! గంధద్రవ్యములతో కూడిన, సువాసనగల నూనెను, ఉసిరికగుజ్జును స్నానపదార్థముగా స్నానమునకై స్వీకరించుము.
నద్రత్న మణిసారేణ రచితాం సుమనోహరాం ।
ఛాదితాం సూక్ష్మవస్త్రేణ శయ్యాం చ గృహ్యతాం హరే॥
శ్రేష్ఠమైన మణుల చూర్ణముతో నిర్మించబడి మిక్కిలి మనోహరముగా నుండి సన్నని వస్త్రము పైన పరచిన శయ్యను స్వీకరించుము స్వామీ!
చూర్ణం చ వృక్ష భేదానాం మూలానాం ద్రవ సంయుతం ।
కస్తూరీ ద్రవ సంయుక్తం గంధం చ గృహ్యతాం హరే ॥
శ్రీహరీ! రకరకముల వృక్షముల యొక్క చూర్ణములతో వేరుల ద్రవములతో కస్తూరి కలిపిన గంధమును స్వీకరింపుము.
పుష్పం సుగంధి యుక్తం చ సంయుక్తం కుంకుమేన చ ।
సుప్రియం సర్వదేవానాం సాంప్రతం గృహ్యతాం హరే॥
ఓ శ్రీహరీ! పుప్పొడితో గూడిన సువాసన గల పుష్పమును సర్వదేవతలకు మిక్కిలి ప్రియమైనదానిని ఇప్పుడు స్వీకరింపుము.
గృహ్యతాం స్వస్తికాక్తం చ మిష్టద్రవ్య సమన్వితం ।
సుపక్వఫలసంయుక్తం నైవేద్యం గృహ్యతాం హరే॥
లడ్డుకం మోదకం చైవ సర్పిఃక్షీరం గుడం మధు ।
నవోద్దృతం దధి చక్రం నైవేద్యం గృహ్యతాం హరే ॥
శీతలం శర్కరా యుక్తం క్షీరస్వాదు సుపక్వకం ।
నేల అలికి స్వస్తికాకారపు ముగ్గు వేసి ఆ స్థలమున బాగుగా పండిన పండ్లు రుచిగల పిండిపదార్ధములు లడ్డూలు మోదకములు రుచిగల పాలతో చక్కగా వండిన పదార్థములు నెయ్యిపాలు తేనె బెల్లము పెరుగు మజ్జిగ వెన్న చల్లని శర్కర పానకము ఇట్లు అన్ని పదార్థములతో గూడిన నైవేద్యమును ఓ శ్రీహరీ నీవు స్వీకరింతువు గాక.
తాంబూలం భోగసారం చ కర్పూరాది సమన్వితం ॥
భక్త్యా నివేదితమిదం గృహ్యతాం వరమేశ్వర।
చందనోగురు కస్తూరీ కుంకుమ ద్రవ సంయుతం॥
అబీర చూర్ణం రుచిరం గృహ్యతాం పరమేశ్వర।
ఓ పరమేశ్వరా! భోగపదార్థములలో శ్రేష్ఠమైన భక్తితో అర్చించబడిన పచ్చ కర్పూరము మొదలగు వానితో కూడిన తాంబూలమును. స్వీకరింతువు గాక! స్వామీ! చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వుద్రవములతో. కూడిన కన్నులకు ఇంపైన. ఈ ఆబీరమును స్వీకరించుము.
తరుభేద రసోత్కర్షో గంధయుక్తోఽగ్నినా సహ ॥
సుప్రియ: సర్వదేవానాం ధూపోఽయం గృహ్యతాం హరే ।
వివిధములైన చెట్లు జిగురు పదార్థములనగ్నిలో వేయగా ఏర్పడిన పరిమళమంతమైన ఈ పొగను (ఊదుకార్చగా పచ్చుపొగ సర్వదేవతలకు ప్రియమైన ధూపముగా స్వీకరించుము హరీ !
ఘోరాంధకార నాశైక హేతు రేవ శుభాపహః ॥
సుప్రదీపో దీప్తికరో దీపోఽయం గృహ్యతాం హరే ।
ఘోరమైన (సంసారమును} అంధకారమును నశింపజేయుటకు మూలమై శుభములను కూర్చునట్టి - బాగుగా వెళ్లించబడిన కాంతులు ఉమ్మడి ఈ దీపమును స్వీకరించుము స్వామీ!
పవిత్రం నిర్మలం తోయం కర్పూరాది సువాసితం ॥
జీవనం నర్వ బీజానా పానార్థం గృహ్యతాం హరే ।
కర్పూరము మొదలగు సుగంధ వస్తువులు చేర్చి సువాసన కల్గునట్లు చేసిన పవిత్రము నిర్మలమునైన జలమును సమస్త బీజములకు ప్రాణప్రదమైన దానిని పానీయముగా (త్రాగుటకు జలముగా) స్వీకరించుము శ్రీహరీ!
నానా పుష్ప సమాయుక్తం గ్రథితం సూక్ష్మ తంతునా॥
శరీర భూషణ వరం మాల్యం చ ప్రతి గృహ్యతాం ।
శరీరాలంకారములలో శ్రేష్ఠమైన సన్నని దారముతో కూర్చిన నానావిధ పుష్పములతో కూడిన పుష్పమాలను స్వీకరించుము.
దత్త్వా దేయాని ద్రవ్యాణి పూజోపయోగితాని చ ॥
ప్రతస్థాన స్థితం ద్రవ్యం హరయే దేయమేవ చ ।
వ్రతము చేయు ప్రదేశమున నుంచిన పదార్దములు పూజలోనుపయోగించినవి అన్నియు స్వామికి సమర్పించవలసినవే కనుక శ్రీహరి కర్పించవలెను.
ఫలాని తరువీజాని స్వాధూని సుందరాణి చ॥
వంశవృద్ధి కరాణ్యేవ గృహ్యతాం పరమేశ్వర ।
ఓ పరమేశ్వరా! ఈ ఫలములు చెట్ల విత్తనములు (బీజములు} వంశవృద్ధి చేయునవి. కన్నుల కింపైన నాల్కకు రుచియైన ఈ ఫలములను బీజములను గ్రహింతువు గాక.
ఆవాహితంశ్చ దేవాంశ్చ ప్రత్యేకం పూజయేద్ర్వతీ ॥
తాన్ పూజ్య భక్తి భావేన దద్యాత్పుష్పాంజలి త్రయం।
జయంతీవ్రతము చేయు వ్యక్తి కలశముపై మొదట ఆవాహన చేసిన దేవతలందరికి విడివిడిగా పూజ చేయవలయును. వారందరిని పూజించి పిదప భక్తితో మూడు మారులు దోసిలితో పూలు సమర్పించి నమస్కరించవలెను.
సునంద నంద కుముదాన్ గోపాన గోపీశ్చ రాధికాం II
గణేశం కార్తికేయం చ బ్రహ్మాణం చ శివం శివాం ।
లక్ష్మీం నరస్వతీం చైవ0 దిక్పాలాంశ్చ గ్రహాం స్తథా ॥
శేషం నుదర్శనం చైవ పార్షద ప్రవరాంన్తథా ।
సంపూజ్య సర్వ దేవాంశ్చ ప్రణమ్య దండవద్భువి॥
బ్రాహ్మణేభ్యశ్చ నైవేద్యం దత్త్వా దద్యాచ్చ దక్షిణాం ॥
కథాం చ జన్మాధ్యాయోక్తాం శృణుయాద్భక్తి భావతః ।
తదా కుశాసనే స్థిత్వా కుర్యాజ్ఞాగరణం ప్రతీ ॥
ప్రభాతే చాహ్నికం కృత్వా నంపూజ్య శ్రీహరి తదా।
బ్రాహ్మణాన్ భోజయిత్వా చ కారయేద్ధరికీర్తనం॥
ప్రతము చేయువాడు ప్రధాన పూజ తరువాత పరివార పూజనిట్లు చేయవలెను. నందసునంద కుముదాది గోపాలకులను, గోపికలను, రాధాదేవిని, గణేశుని, కుమారస్వామిని, బ్రహ్మను, శివునీ, పార్వతిని, లక్ష్మిని, సరస్వతిని, దిక్పాలకులను, నవగ్రహములను, ఆదిశేషుని, సుదర్శన చక్రమును, గోలోకములో నుండు కృష్ణ పారదులను ఇట్లు సర్వదేవతలను పూజించి నేల పై సాష్టాంగ దండ ప్రణామములు చేయవలెను. బ్రాహ్మణులకు నివేదించిన ప్రసాదము నిచ్చి దక్షిణలిచ్చి భక్తిభావముతో జన్మాధ్యాయములో చెప్పబడిన కథను వినవలెను. దర్భల చాప పై కూర్చుండి జాగరణము (నిద్ర లేకుండ భజన సంకీర్తనలను చేయవలెను. తెల్లవారగనే స్నాన సంధ్యాది నిత్యకర్మలు చేసికొని శ్రీహరిని షోడశోపచారములతో పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి శ్రీహరి నామసంకీర్తనము చేయించవలెను.
నారద ఉవాచ :
వ్రతకాల వ్యవస్థాం చ వేదోక్తాం సర్వసమ్మతాం ।
వేదార్థం చ సమాలోచ్య సంహితాం చ పురాతనీం ॥
ఉపవాసే జాగరణే ప్రతే కిం వా ఫలం మునే ।
కిం వా పావం తత్ర భుక్త్వా వద వేదవిదాం వర॥
నారదుడిట్లు పలికెను :
వేదవేత్తలలో శ్రేష్టుడవైన ఓ నారాయణమునీ! పురాతన సంహితను (వేదమును) వేదార్థమును బాగుగా ఆలోచించి వేదమందు చెప్పబడిన - సర్వజనులకు సమ్మతమైన సమాధానములు చెప్పుము. ఈ వ్రతము చేయవలసిన కాలనియమమెట్టిది? ఈ వ్రతమును దానికంగము ఉపవాస జాగరణములను చేసినందువలన ఏమిఫలము కల్గును? ఆనాడు భోజనము చేసినచో ఏమీ పాపము సంభవించును? అన్నిటిని తెలుపుమని అడిగెను.
శ్రీ నారాయణ ఉవాచ :
అష్టమీర్క్ష సంయుక్త రాత్ర్యర్దే యది దృశ్యతే ।
స ఏవ ముఖ్య కాలశ్చ తత్ర జాత: స్వయం హరిః॥
జయుం పుణ్యం చ కురుతే జయంతీ తేన సంస్కృతా ।
తత్రోపోష్య వ్రతం కృత్వా కుర్యాజ్జాగరణం బుధః ॥
సర్వాపవాదః కాలోఽయం ప్రధానః సర్వ సమ్మత: ।
ఇతి వేదవిదాం వాణీ చేత్యుక్తా వేధసా పురా॥
తత్ర జాగరణం కృత్వా యశ్చోపోష్య వ్రతం చరేత్ ।
కోటి జన్మార్జితాత్పాపాత్ ముచ్యతే నాత్ర సంశయః ॥
వర్ణనీయా ప్రయత్నేన సప్తమీ సహితాష్టమీ।
ఆవిద్ధాయాంక ఋక్షాయం జాతో దేవకీ నందనః ॥
వేదవేదాంగ గుప్తేతి విశిష్టం మంగళక్షణే ।
వ్యతీతే రోహిణీ ఋక్షే ప్రతీ కుర్యాచ్చ పారణాం॥
తిథ్యంతేచ హరిం స్కృత్వా కృత్వా దేవార్చనం ప్రతీ ।
పారణం పావనం పుంసాం సర్వపాపప్రణాశనం॥
ఉపవాసాంగ భూతం చ ఫలదం సిద్ధిఠారణం ।
సర్వే ష్వేవోపవాసేషు దివాపారణమిష్యతే ॥
అన్యధా ఫలహానిస్స్యాత్ కృతే ధారణ పారణే ।
న రాత్రౌ పారణం కుర్యాదృతే వై రోహిణీప్రతాత్ ॥
నిశాయాం పారణం కుర్యాద్వర్జయిత్వా మహానిశాం ।
పూర్వాహ్ణే పారణం శస్తం కృత్వా విప్రసురార్చనం ॥
బ్రహ్మ అధి దేవతగా గల రోహిణీ నక్షత్రముతో కూడిన అష్టమి తిథి ఏ అర్ధరాత్రి యందు కన్పించునో (తగిలియుండునో) అదియే జయంతీ వ్రతమునకు ముఖ్యకాలము. శ్రీహరి ఆ సమయముననే స్వయముగా (తన పూర్ణాంశతో) జన్మించెను (అవతరించెను).
జయమును పుణ్యమును కల్గించునది అగుట వలన “జయంతి” యని చెప్పబడినది. అది ఎరిగిన బుధుడు {పండితుడు. సజ్జనుడు) ఆ దినము ఉపవాసముండి వ్రతమాచరించి జాగరణ మొనర్పవలెను. వివాదరహితముగా సర్వబుధ సమ్మతముగా జయంతి వ్రతమున కీది ప్రధానమైన కాలముగా వేదవేత్తలు పల్కుదరని పూర్వము బ్రహ్మ చెప్పెను. ఆనాడెవడు ఉపవాసము ప్రతాచరణము జాగరణము చేయునో వాడు కోటి జన్మలలలో ఆర్జించిన పాపము నుండి విముక్తి పొందును. ఈ విషయమున సందేహము లేదు. రోహిణీ నక్షత్రముతో కూడియున్నను సప్తమీ తిథితో కూడియున్న అష్టమిని తప్పక విడువ వలయునే కాని సప్తమీ సహితాష్టమినాడు జయంతీవ్రతము చేయగూడదు. వేదవేదాంగములు ఎరుగని తత్త్వమైన దేవకీనందనుడు కృత్తికా వీధలేని రోహిణీ నక్షత్రమున జన్మించెను అన్నది విశేష లక్షణము. జయంతీవ్రతమాచరించిన వ్యక్తి రోహిణీ నక్షత్రము గడిచిపోయిన శుభ సమయములో పారణము (ఉపవాస కాలము తరువాత స్వీకరించు భోజనము) చేయవలెను. వ్రతము చేయు వ్యక్తి తిథీ చివర హరిని స్మరించి దేవపూజ చేసి పవిత్రమైన పారణము చేయవలెను. ఇట్టి పారణము జీవుల సర్వపాపములను నశింపజేయును. అన్ని విధముల ఉపవాసములందును దైవానుగ్రహము సిద్ధించుటకు మూలము సత్ఫలమిచ్చునది. ఉపవాస వ్రతమునకు ఒక అంగముగా నున్న పారణము (భోజనము) పగలే చెప్పబడినది. ఈ చెప్పిన ప్రకారముగా కాక ప్రత - ఉపవాసదీక్షలు పారణము ఇంకొక విధముగా చేసినచో ఫలము నశించును. ఒక్క రోహిణీ నక్షత్రమున తప్ప ఇతరత్ర రాత్రిపూట పారణము చేయరాదు (ఒక పక్షముగా జయంతీవ్రతోపవాసమునకు పారణము రాత్రి కాలమున అంగీకరింపబడినది) మధ్యరాత్రిని వదిలివేసి రాత్రియందు పారణము చేయవచ్చును. మరునాటి ఉదయము మొదటి జాములో దేవతార్చనము బ్రాహ్మణ భోజనము జరిపించి పారణమొనర్చుట ఉత్తమ పద్ధతిగా చెప్పబడినది.
(విద్ధయనగా సూర్యోదయము తరువాత కొంతకాలము ఒక తీథిగానీ నక్షత్రము గాని ఉండి ఆ తరువాత ఇంకొక తిథిగాని నక్షత్రముగానీ వచ్చినచో క్రమముగా ఆ తరువాతి తిథి నక్షత్రములు వేధ పొందినవి (విద్దలు) అందురు. సప్తమీ వద్దగల అష్టమీ, కృత్తికావిధ్ధగల రోహిణీ జయంతీ వ్రతాచరణకు పనికిరావనీ తాత్పర్యము).
సర్వేషాం సమ్మతం కుర్యాదృతే వై రోహిణీ వ్రతం।
రోహిణీ వ్రతమున తప్ప మిగిలిన అన్నిటికీ శాస్త్ర సమ్మతమైన పారణకాలమే ఆచరణయోగ్యము.
బుధసోమ సమాయుక్తా జయంతీ యద లభ్యతే॥
నకుర్యా ధ్గర్భవాసం చ తత్ర కృత్వా వ్రతం ప్రతీ ।
బుధ సోమవారములలో నొకదానితో కలిసి వచ్చిన జయంతీ లభించెనేని ఆనాడు జయంతీవ్రతమాచరించిన వ్యక్తి మరల తల్లి గర్భమున నివాసముండడు ఆ వ్యక్తికి పునర్జన్మ లేదనీ భావము}.
ఉదయే చాష్టమి కించి న్నవమీ సకలాయది ॥
భవే ద్బుధేందు సంయుక్తా ప్రాజాపత్యర్ణ సంయుతా।
ఆపి వర్ష శతేనాపి లభ్యతే వా నలభ్యతే ॥
వ్రతం తత్ర ప్రతీ కుర్యాత్పుంసాం కోటిం సముద్ధరేత్ ।
నృణాం వినా వ్రతే నాది భక్తానాం హీన సంపదాం ॥
కృతేనైవోపవాసేన ప్రీతో భవతి మాధవః ।
ఉదయకాలమున కొద్దిగా అష్టమీతిథి ఉండి మిగిలిన దినమంతయు నవమి తిథి, బుధసోమవారములలో నొకవారము, రోహిణీ నక్షత్రము కూడి వచ్చుట అరుదుగా సంభవించును. అట్టి పుణ్యకాలము నూరేళ్లకొకమారు లభించునో లభించదో! అట్లు లభించిననాడు నీయమవంతుడు జయంతీవ్రత మొనర్చినచో తన పూర్వులను తరువాతి వారిని కోటిమందినీ నరకము నుండి ఉద్ధరించును. సంపద లేక ఈ వ్రతమును చేయలేని భక్తజనులు ఒక్క ఉపవాసమాచరించినను లక్ష్మీవల్లభుడు సంతసించును.
భక్త్యా నానోపచారేణ రాత్రౌ జాగరణేన చ ॥
ఫలం దదాతి దైత్యారిర్జయంతీవ్రత నంభవం ।
విత్త శాఠ్య మకుర్వాణః సమ్యక్ఫలమవాప్నుయాత్ ॥
కుర్వాణోవిత్తశార్యం చ లభతే సదృశం ఫలం ।
భక్తిశ్రద్ధలతో షోడశోపచార పూజ చేసి రాత్రి యందు జాగరణ చేయుట వలన శ్రీహరి, జయంతీవ్రత ఫలమును ప్రసాదించును. ద్రవ్యలోభము చేయకుండ చక్కగా జరిపినవానికి మంచిఫలము సంభవించును. శక్తి ఉండికూడ ద్రవ్యలోభము చేసిన యెడల తదనుగుణమైన ఫలము పొందును.
అష్టమ్యామథ రోహిణ్యాం న కుర్యా త్పారణం బుధః ॥
హన్యాత్సురాకృతం పుణ్యం చోపవాసార్జితం ఫలం ।
తిధిరష్టగుణం హంతి నక్షత్రం చ చతుర్గుణం ॥
తస్మాత్ప్రయత్నతః కుర్యాత్తిధి భాంతే చ పారణం।
మహానిశాయాం ప్రాప్తాయాం తీధిభాంతం యదో భవేత్ ॥
తృతీయేఽహ్ని మునిశ్రేష్ఠ పారణం కురుతే బుధః ।
తెలిసినవాడు అష్టమి తిథి, రోహిణి నక్షత్రములలో పారణము చేయకూడదు. చేసినచో పూర్వపుణ్యము ఉపవాసము వలన పొందిన ఫలము రెండు నశించును. తిథి ఎనిమిది పాలు, నక్షత్రము నాలుగు పాళ్లు పుణ్యమును చెరచును కావున ప్రయత్నించి తిథియునక్షత్రము (అష్టమి రోహిణీ) ముగిసిన తరువాత పారణము చేయవలెను. మధ్యరాత్రీకి తిథి నక్షత్రము ముగియుట సంభవించునేని బుధుడైనవాడు మూడవ దినము పారణము చేయును. (ఈ పరిస్థితిలో ప్రతదివసము కన్న ముందు దినమునకే తిథి నక్షత్ర స్పర్శ సంభవించును కనుక ఆనాడును ప్రతదీనమునాడును ఉపవాసము మూడవనాడు ఉదయము పారణమని తాత్పర్యము).
షణ్ముహూర్తే వ్యతీతేతు రాత్రావేవ మహానిశా ॥
లభతే బ్రహ్మ హత్యా చ తత్ర భుక్త్యా చ నారద ।
ఓ నారదా! రాత్రీకాలమున ఆరవముహూర్తము గడవగానే మహానీశాకాలము. అప్పుడు భుజించినచో బ్రహ్మహత్యాదోషము సంభవించును.
గోమాంస వీణ్మూత్ర సమం తాంబూలం చ ఫలం జలం ॥
పుంసామభక్ష్యం శుద్ధానామోదనస్య చ కా కథా।
త్రియామం రజనీం ప్రాహుస్త్యక్వాద్యం చ చతుష్టయం ॥
నాడీనాం తదుభే సంధ్య దీవసాద్యంత సంజ్ఞితే ।
సూర్యుడు వెలుగుచుండు కాలమునకు దివసము (పగలు) అని వ్యవహారము. సూర్యోదయమునకు ముందు నాలు గడియల - కాలము సూర్యాస్తమయము తరువాత నాలు గడియల కొలను ఇవి రెండును సంధ్యాకాలములు అనబడును. రాత్రిలోనీ ఆద్యంతకాలములు సంధికాలము లేనందున ఇక మిగిలిన రాత్రికాలము మూడు జాములే కనుక రాత్రికి “త్రియామ" (మూడు జాములు కలది) అనీ పేరు ఏర్పడినది. అట్టి రాత్రిలో మహానిశ యందు (16 గడియలు గడచుకోలము) తాంబూలము నమలినినచో గోమాంస భక్షణము చేసినట్లు ఫలము భుజించినచో మలము భుజించినట్లు, జలము త్రాగినచో మూత్రపానము చేసినట్లు అగును. కావున సదాచారము గలవారు మహానిశలో ఏమియు స్వీకరించకూడదు. ఇక భోజనము మాట చెప్పనేల!
జన్మాష్టమ్యాం చ శుద్ధాయాం కృత్వా జాగరణం ప్రతం ॥
శతజన్మకృతాత్పాపాన్ముచ్యతే నాత్ర సంశయః ।
జన్మాష్టమ్యాం చ శుద్ధాయాముపోష్య కేవలం నరః ॥
ఆశ్వమేధ ఫలం తస్య వ్రతం జాగరణం వినా।
యద్భాల్యే యచ్చ కౌమారే యౌవనే యచ్చ వార్థకే॥
సప్త జన్మకృతాత్నాపాన్ముచ్యతే నాత్ర సంశయః।
శుద్ధమైన జన్మాష్టమినాడు వ్రతము జాగరణము చేసిన వ్యక్తి నూరుజన్మలలో ఒనర్చిన పాపములనుండి విముక్తుడగును. సందేహము. లేదు. శుద్ధ జన్మాష్టమినాడు వ్రతము జాగరణము చేయజాలక కేవలము ఉపవాసము చేసినను ఆ వ్యక్తి బాల్యకౌమార యావన వృద్ధ దశలలోను ఏడు జన్మలలోను చేసిన పాపముల నుండి విముక్తి పొంది అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందుననుటలో సందేహము లేదు.
శ్రీకృష్ణ జన్మదివసే యశ్చ భుంక్తే నరాధమః ॥
న భవేన్మాతృగామీ చ బ్రహ్మహత్యాశతం లభేత్ ।
కోటి జన్మార్జితం పుణ్యం తస్య సశ్యతి నిశ్చితం ॥
అనర్హ శ్చాశుచిః శశ్వద్ధైవే పిత్ర్యే చ కర్మణి ।
అంతే వ సేత్కాలసూత్రే యావచ్చంద్ర దివాకరౌ॥
కృషిభిః శూల తుల్యైశ్చ తీక్ష్ణ దంష్ట్రైశ్చ భక్షితః।
పాపీ తతన్సముత్థాయ భారతే జన్మ చేల్లభేత్ ॥
షష్టివర్ష సహస్రాణి విష్టాయాం చ కృమిర్భవేత్ ।
గృధ్రకోటి సహస్రాణి శతజన్మాని సూకర: ॥
శ్వాపదః శతజన్మాని సృగాలః సప్తజన్మ చ ।
సప్తజన్మసు సర్పశ్చ కాకశ్చ సప్తజన్మను॥
తతో భవేన్నరో మూకో గలత్కుష్ఠీ సదాఽతుర: ।
తతో భవేత్సశుఘ్నశ్చ వ్యాలగ్రాహీ తతో భవేత్ ॥
తదంతే చ భవేద్దస్యుః ధర్మ హీనశ్చ గృధ్రకః ।
తతో భవేత్స రజకస్తైలకారస్తతో భవేత్ ॥
తతో భవేద్దేవలకో బ్రాహ్మణశ్చ సదాఽ శుచిః ।
శ్రీకృష్ణ జన్మదివసము నాడు ఏ నీచమానవుడు భుజించునోవాడు కామముతో తల్లిని బొందినవాడగును. నూరు బ్రహ్మహత్యలు చేసిన ఫలమునందును, గడచిన కోటి జన్మలలో వాడార్జించిన పుణ్యము నశించుట నిశ్చయము. వాడు అపవిత్రుడై దైవ పితృకర్మలొనర్చుటకు అనర్హుడు యోగ్యత లేని వాడు) అగును. మరణానంతరము వాడు సూర్యచంద్రులున్నంత వరకు శూలముల వంటి వాడీ కోరలు గల పురుగులతో భక్షింపబడుచు నరకమున నివసించును. ఆ నరకానుభవము తరువాత ఆ పాపి భారతమున జన్మించెనేని అరువది వేలయేండ్లు మలములో పురుగుగాను, ఆ తరువాత కోటి సహస్ర వరములు గ్రద్ధగాను ఆ వెనుక నూరు జన్మలు పందిగాను, నూరు జన్మలు క్రూరమృగము గాను, ఏడు జన్మలు నక్కగాను, ఏడు జన్మలు పాముగాను, ఏడు జన్మలు కాకిగాను గడపుచు ఆ వెనుక మూగవాడుగా, కుష్టువ్యాధిగల రోగిగాను జన్మనెత్తును. ఆ పిదప పశువధ చేయువాడుగాను పాముల బట్టువాడుగాను జన్మించును. ఆ పిదప చోరుడుగా ధర్మహీనుడుగా ఆ వెనుక చాకలివాడుగా తరువాత నూనెగానుగు నాడించువాడుగా జన్మలెత్తును. ఆ తరువాత దేవతంబళియై అనాచారవంతుడు అపవిత్రుడైన బ్రాహ్మణుడుగా పుట్టును.
ఉపవాసా సమర్థశ్చేదేకం విప్రం చ భోజయేత్॥
తావద్ధనాని వా దద్యాద్యద్భుక్తం ద్విగుణం భవేత్ ।
సహస్ర సమ్మితాం దేవీం జపేద్వా ప్రాణసంయమాన్॥
కుర్యాద్ద్వాదశ సంఖ్యాకాన్ యథార్థం తద్ర్వతే నరః ।
ఇత్యేవం కథితం వత్స శ్రుతం యద్ధర్మ వక్త్రతః ॥
వ్రతోపవాస పూజానాం విధానమకృతే చ యత్ ॥
ఉపవాసము చేయుటకు శక్తిలేనివాడు ఒక సద్బ్రాహ్మణునికీ భోజనము పెట్టవలెను. లేదా ఆ భోజన ద్రవ్యమునకు రెండింతలు ధనమునైనను ఈయవలెను. ఆ శక్తిలేనివాడు సహస్ర గాయత్రిని జపించవలెను. పన్నెండు పర్యాయములు ప్రాణాయామము చేయవలెను. ఈ విధముగా ఓ నారదా! ధర్మదేవత ద్వారా విన్న విషయము నీకు చెప్పితిని. జయంతీవ్రతము ఉపవాసము పూజలయొక్క నియమవిధులు పాటించనిచో ఏర్పడు దోషములను కూడ చెప్పితిని.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే నారాయణ నారద సంవాదే శ్రీకృష్ణ జన్మష్టమీ వ్రత పూజోవవాన నిరూపణం నామాష్టమోఽధ్యాయః॥
ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండములో నారాయణ నారద సంవాదములో శ్రీకృష్ణ జన్మాష్టమీ ప్రత, పూజా, ఉపవాసముల నిరూపణము అను ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 8 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
By the supreme will of Lord Śrī Kṛshṇa, the infant miraculously transformed into a tiny, tender newborn baby, and Vasudeva was instructed to carry Him immediately across the raging, flooded Yamunā river to the safety of Gokula. As Vasudeva lifted the child into a simple basket and walked out of the prison cell, all the guards fell into a deep, supernatural slumber, and the heavy iron prison gates swung open by themselves. Reaching the banks of the Yamunā, Vasudeva stepped into the turbulent waters, which parted to create a safe dry path, while the multi-headed serpent Pūtanā's brother, the great serpent Ananta, shadowed them to shield the infant from the pouring rain with his hoods.