మూ॥ నంద ఉవాచ :
కేదారకన్యా ప్రస్తావాత్కథితం కర్మకీర్తనం ।
కృత్యా స్త్రీణాం ప్రసంగేన తద్వ్యా సేన వద ప్రభో ॥
కేదారకన్యా సాకావా కోవాకేదార భూపతిః ।
కస్యవంశ్చత జ్జన్మ తన్మే వ్యాఖ్యాతుమర్హసి ॥
శ్రీభగవానువాచ-
పురాతు బ్రహ్మణః పుత్రోమనుః స్వాయం భువస్తథా ।
తస్యసీ శతరూపాచ ధన్యామాన్యాచయోషితాం ॥
ప్రియవ్రతోత్తాన పాదౌతయోః పుత్రౌ బభూవతుః ।
ఉత్తానపాదపుత్రశ్చ ధ్రువ ఏవమహాయశాః ॥
తత్పుత్రో నందసావర్ణి: కేదారశ్చతదాత్మజః ।
సప్త ద్వీపపతిః శ్రీమాన్ కేదారోవైష్ణవః స్వయం ॥
తస్యరక్షానిమిత్తేన తత్సభాయాం సుదర్శనం ।
గవాంలక్షం నవం శుద్ధం స్వర్ణశృంగంచ భూషితం ॥
వహ్నిశుద్ధాని వస్త్రాణి దత్తాని వరుణేనచ ।
సువర్ణానాంతథా లక్షం సర్వసస్యా వసుంధరా ॥
మణిరత్నంచ ముక్తాశ్చ హీరకం పరమంతథా ।
మాణిక్య మశ్వరత్నానాం లక్షం లక్షంచ హస్తినాం ॥
రౌప్యం ప్రవాలం మిష్టాన్నం శతధాన్యాచలంవరం ।
నిత్యం నిత్యం బ్రాహ్మణేభ్యో దదౌచరత్న భూషణం ॥
శతలక్షం బ్రాహ్మణానాం భోజయామాస నిత్యశః ।
జలభోజనపాత్రాణి సువర్ణానందధౌ నృపః ॥
సువర్ణానాం యజ్ఞసూత్ర మంగుళీయక ముత్తమం ।
ఆసనం స్వర్ణ రత్నానాం బ్రాహ్మణేభ్యో దదౌముదా ॥
బ్రాహ్మణానాంచ లక్షంచ సూపకారం నృపస్యచ ।
బ్రాహ్మణానాం ద్విలక్షంచ పరివేషణ కారకం ॥
ఘృతకుల్యామధుకుల్యా దధికుల్యామనోహరాః ।
గుడకుల్యా దుగ్ధతుల్యానిత్యం ప్రార్థన మీప్సితం ॥
ప్రాతరారభ్య సంధ్యాంతం విప్రాణాం భోజనం తథా ।
దుఃఖినాం భిక్షుకాణాంచ ధనదానం యథోచితం ॥
ఫలమూలాశనో రాజా వైష్ణవశ్చ జితేంద్రియః ।
సర్వం మదర్పణం కృత్వాజపన్మాంచ దివానిశం ॥
ఏకదాసూపకారశ్చ తమువాచ నృపేశ్వరం ।
విప్రాణాం భోజనాయైవ దశలక్ష ముపస్థితం ॥
భుంజితే బ్రాహ్మణాశ్చాద్య రూక్షమన్నం వదప్రభో ।
కుర్వంతు భక్షణం తేవైవిప్రాః సూపాదినా నృప ॥
చతు ర్యోజనపర్యంత మధికారోనృపస్యచ ।
యోరాజాతచ్చత గుణః సఏవమండలేశ్వరః ॥
నందుడిట్లన్నాడు కేదారకన్యా ప్రస్తావ సందర్భంలో కర్మ యొక్క కీర్తనను చెప్పారు. స్త్రీల ప్రసంగంలో చేయతగినదన్నారు. దాన్ని విస్తరంగా చెప్పండి, ప్రభు! (1) కేదార కన్య ఎవరు, కేదార భూపతి ఎవరు, ఆతని జన్మ ఏ వంశంలో, దానిని నాకు వివరించండి. (2) శ్రీ భగవంతుని వచనమిట్లా - ఇదివరలో బ్రహ్మపుత్రుడు స్వాయంభువమనువున్నాడు. అతని భార్యశతరూప. స్త్రీలతో గౌరవింప తగినది, మాన్యురాలు (3) వారికి ప్రియవ్రత ఉత్తానపాదులని ఇద్దరు పుత్రులు జన్మించారు. ఉత్తానపాదుని పుత్రుడే ధ్రువుడు, మహాశయుడు (4) ఆతని పుత్రుడు నందసావర్ణి. ఆతని పుత్రుడు కేదారుడు. ఆతడు ఏడు దీవులకధిపతి, శ్రీమంతుడు, స్వయంగా వైష్ణవుడు కేదారుడు. (5) ఆతని రక్షణ కొరకు , ఆసభలో సుదర్శనమును, (చూడతగిన) కొత్తవి శుద్ధమైని, బంగారు కొమ్ములు గలవి అలంకరింపబడ్డవిఇట్టి లక్ష గోవులు, (6) వహ్ని శుద్ధమైన వస్త్రములు, వరుణుడిచ్చాడు. అట్లాగే లక్ష బంగారు నాణెములు, అన్ని పంటలు గల భూమిని ఇచ్చాడు. (7) మణిరత్నము, ముత్యములు ఉత్తమ వజ్రము, మాణిక్యము, రత్నముల్లాంటి లక్ష గుర్రములు, ఏనుగులు లక్ష (8) వెండి, పగడము, మధురాన్నము. నూరు, ధాన్యముల కొండలు ఇచ్చాడు. ప్రతిరోజు బ్రాహ్మణులకు, రత్నభూషణములిచ్చాడు రాజు. (9) ప్రతిరోజు నూరు లక్షల బ్రాహ్మణులను భుజింపజేశాడు రాజు. బంగారువి, జలపాత్రలు, భోజనపాత్రలు ఇచ్చాడు రాజు. (10) బంగారు యజ్ఞోపవీతములు మంచి ఉంగరములు దానమిచ్చాడు. ఆనందంతో బ్రాహ్మణులకు, బంగారు, రత్నములు గల ఆసనముల నిచ్చాడు. (11) రాజునకు వంట బ్రాహ్మణులు లక్ష ఉన్నారు. వడ్డించే బ్రాహ్మణులు రెండు లక్షలు. (12) నెయ్యి కాలువలు, తేనె కాలువలు, పెరుగు కాలువలు, మనోహరంగా ఉన్నాయి. కాల్వల కొద్ది బెల్లము, కాల్వల కొద్దిపాలు, ప్రతిరోజు కావలసింది కోరటమే (13) ప్రొద్దుటి నుండి సాయంకాలం దాకా బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. దుఃఖితులకు, భిక్షులకు తగినట్లుగా ధనం దానం చేశారు. (14) రాజు ఫలములు, గడ్డలు తినేవాడు, వైష్ణవుడు, జితేంద్రియుడు, అంతా నాకే అర్పించి, రాత్రింబగళ్ళు నన్ను జపిస్తూ (15) ఉండేవాడు ఒక రోజు వంటవాడు ఆరాజుతో ఇట్లా అన్నాడు. భోజనం కొరకు పదిలక్షల బ్రాహ్మణులొచ్చారు. (16) ఓ ప్రభు! ఈవేళ బ్రాహ్మణులు కరుకైన అన్నాన్ని (ప్రేమలేని) తింటున్నారు. రాజా! ఆ బ్రాహ్మణులు పప్పు మొదలగు వానితో భోజనం చేయని (17) రాజుకు నాలుగు యోజనముల వరకు అధికారము. దానికి నూరింతల అధికారం గలవాడు మండలేశ్వరుడు.
మూ॥ తత్తద్దశగుణోరాజా రాజేంద్రః పరికీర్తితః ।
రాజేంద్రాణాంపంచ లక్షం నిత్యంకేదార సంసది ॥
అమూల్యరత్నమాణిక్యం ముక్తాహారం మణీశ్వరం ।
గజరత్న మశ్వరత్నం కేదారాయ కరం దదౌ ॥
కమలాకలయా జాతా యజ్ఞ కుండసముద్భవా ।
వహ్నిశుద్దాంశుకాధానా రత్నభూషణ భూషితా॥
కాముకీ కామినీ శ్రేషా కన్యాకమలలోచనా ।
కన్యాఽస్మితే మహారాజేత్యు వాచనృపతించసా ॥
రాజా సంపూజ్య తాంభక్త్యా తస్థాపత్నీం సమర్ప్యచ ।
సా విజ్ఞాయ ప్రసూం తాతం కృత్వాచ వినయం ముదా ॥
యయౌ పుణ్యవనం రమ్యం తప సేయమునాంతికం ।
తత్తపస్యావనం యస్మాత్త స్మాద్వృందావనం స్మృతం ॥
తపసా వరయామాస మాం వరంచ వరం వరం ।
బ్రహ్మా దదౌ వరం తస్యై పశ్చాత్కృష్ణం లభిష్యసి ॥
సాచ్చైకదా నదీతీరే వసంతే సస్మితా సతీ ।
శయానాపుష్ప శయ్యాయాం రత్నాభరణ భూషితా ॥
బ్రహ్మాపరీక్షితుం యాతః సాధ్వీంచ సుమనోహరాం ।
దదర్శ కన్యారహసి యువానం పురుషం పరం ॥
చందనోక్షిత సర్వాంగం రత్నభూషణ భూషితం ।
సస్మితం కాముకం రమ్యం రమణీనాంచ వాంఛితం ॥
యథాషోడశ వర్షీయం కుమారం కనకప్రభం ।
కోటికందర్పలీలాభం పీతాంబరధరం వరం ॥
శరత్పార్వణ చంద్రస్యం శరత్పద్మసులోచనం ।
దృష్ట్వా తంచ సముత్థాయ వాసయామాస సన్నిధౌ ॥
పూజాం చకార భక్త్యాచ ఫలం మూలందదౌముదా ।
సువాసితం జలందత్వా ప్రణనామ ముదాన్వితా ॥
పూజాం గృహీత్వాముదితః సాదరాం తామువాచహ ।
విప్రరూపీచ భగవాన్ ప్రజ్వల బ్రహ్మతేజసా
కాముకీనాంచ కామ్యంచ సతీనాందుష్కరం వ్రజ ॥
ధర్మఉవాచ :
భవతీ కస్యకన్యావా కింతే నామ మనోహరే ।
కింకరోషిరహ స్యేవ తన్మేకథితుమర్హసి ॥
కస్య హోతో: తపస్యా తే కిందా వాంఛసి సుందరి ।
వరం వృణీష్వ భద్రంతే యత్తే మనసివాంచితం ॥
వృందోవాచ:
విప్ర కేకన్యాఽహం వృందా వృందావనే స్థితా ।
తపఃకరోమి రహసి చింతయామి హరింపతిం ॥
యదిదాతుం సమరోఽసి దేహిమే వాంఛితం వరం ।
అసమర్దోఽసిచేద్దచ్చ కింతే ప్రశ్నేన బ్రాహ్మణ ॥
ధర్మ ఉవాచ:
నిరీహమవితర్క్యంచ పరమాత్మానమీశ్వరం ।
నిర్గుణంచ నిరాకారం భక్తానుగ్రహ విగ్రహం ॥
కా క్షమా తంపతిం కర్తుం వినాలక్ష్మీం సరస్వతీం ।
చతుర్భుజస్యద్వేభార్యే హరేర్త్వేకుంఠశాయినః ॥
గోలోకే ద్విభుజస్యాపి శ్రీవంశీవాదనస్యచ ।
కిశోరగోపవేషస్య పరిపూర్ణతమస్యచ ॥
వానికన్న పదింతలెక్కువ అధికారంగల రాజు రాజేంద్రుడుగా చెప్పబడుతాడు. ఐదు లక్షల రాజేంద్రులు ఎప్పుడూ కేదారుని సభయందుంటారు. (19) అమూల్యమైన రత్నములు మాణిక్యము, ముత్యాల హారము శ్రేష్ఠమైన మణిని, శ్రేష్ఠమైన ఏనుగు, గుర్రము, వీనిని కేదారునకు పన్నుగా (కప్పం) ఇచ్చారు. (20) కమల (లక్ష్మి) కాంతితో పుట్టిన, యజ్ఞకుండమందుద్భవించిన, వహ్నితో శుద్ధమైన వస్త్రము ధరించిన, రత్నభూషణములతో అలంకరింపబడిన (21) సంభోగేచ్ఛగల, స్త్రీలలో శ్రేష్టురాలైన కమలముల వంటి కళ్లుగల, కన్య వచ్చి ఓ మహారాజ! నేను నీకూతురును, అని రాజుతో ఆమె పలికింది. (20) రాజు ఆమెను భక్తితో పూజించి భార్యకు అప్పగించి నిల్చున్నాడు. ఆమెను తల్లిగా గుర్తించి, తండ్రినిగా వినయంగా ఆనందంగా అతని ననుమతించి (23) రమ్యమైన పుణ్యమైన వనమునకు, యమునానది సమీపమునకు తపస్సు కొరకు వెళ్ళింది. ఆమె తపస్సు చేసి నందువల్ల ఆవనము వృందావనమని పిలువబడింది. (24) తపస్సుతో ఆమె, వరములకు వరమైన నన్ను వరంగా కోరింది. తరువాత కృష్ణుని పొందుతావు అని ఆమెకు బ్రహ్మ వరమిచ్చాడు. (25) ఒకరోజు ఆమె వసంతమాసంలో నదీతీరమందు చిరునవ్వు నవ్వుతూ, రత్న ఆభరణములతో అలంకరించుకొని, పుష్పముల పడకయందు పడుకుంది. (26) సుమనోహరమైన ఆ సాధ్విని పరీక్షించుటకు బ్రహ్మ వచ్చాడు. ఆ కన్య రహస్య ప్రదేశంలో ఉత్తముడైన పురుషుణ్ణి యువకుణ్ణి చూచింది. (27)రత్నభూషణములు అలంకరించుకున్నాడు, వంటి నిండా చందనం పూసుకున్నాడు, చిరునవ్వు నవ్వుతున్నాడు కామేచ్ఛగలవాడు, అందగాడు, స్త్రీలకూ కోరతగినవాడు, (28) పదహారు సంవత్సరాల వయస్సుగల కుమారునిలా ఉన్నాడు. బంగారమేని కాంతివాడు, కోటి మన్మథుల విలాసం వంటి విలాసం కలవాడు పీతాంబరమును ధరించినవాడు, శ్రేష్టుడు (29) శరత్పూర్ణిమ నాటి చంద్రునివంటి ముఖకాంతిగలవాడు, శరత్కాలమందలి పద్మములవంటి కనులుగలవాడు, అట్టి వానిని చూచి ఆమె లేచి తన సన్నిధిలో కూర్చోబెట్టుకుంది. (30) భక్తితో పూజించింది. ఆనందంగా పండ్లు, గడ్డలు ఇచ్చింది. వవాసనగల నీరును (మంచి) త్రాగుటకు ఇచ్చి ఆనందంగా నమస్కరించింది. (31) పూజను స్వీకరించి, ఆనందించి, ఆదరముగల ఆమెతో ఇట్లన్నాడు. ఆతడు భగవన్! బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నాడు. భోగేచ్చగల స్త్రీలకు కోరతగినవాడు, సతులకు దుష్కరుడు ఓప్రజ! (32) ధర్ముడిట్లన్నాడు - నీవు ఎవరికన్యవు, ఓ మనోహరి! నీ పేరేమి, రహస్యంగా ఏమిచేస్తున్నావు, దాన్నినాకు చెప్పండి (33) ఏకారణంగా తపమాచరిస్తున్నావు. ఓ సుందరి! నీవు ఏమి కోరుకుంటున్నావు. నీకు మనస్సులో ఏది కావాలని ఉందో, ఆ వరాన్ని కోరుకో, నీకు క్షేమమగుగాక, అని. (34) వృంద ఇట్లా అంది - ఓ బ్రాహ్మణ! నేను కేదారుని కన్యను, నేను వృందను. వృందావనమందున్నాను. రహస్యంగా తపస్సు చేస్తున్నాను. హరిని పతిగా కోరుకుంటున్నాను. (35) ఇవ్వటానికి సమర్ధుడవైతే, నేను కోరిన వరాన్ని ఇవ్వు. అసమర్ధుడవైతే వెళ్ళిపో. ఓ బ్రాహ్మణ! నీప్రశ్నతో పనేమి (36) ధర్ముడిట్లన్నాడు - నిరీకాడు ఊహించరానివాడు (కందని) పరమాత్ముడు, ఈశ్వరుడు, నిర్గుణుడు, నిరాకారుడు, భక్తులనను గ్రహించుటకై రూపమెత్తినవాడు (37) ఆతనిని భర్తగా పొందుటకు ఎవతేసమర్ధురాలు, లక్ష్మి, సరస్వతులు తప్ప, వైకుంఠమందు నిదురించే హరికి, నాలుచేతుల వానికి ఇద్దరు భార్యలు. (38) గోలోకమందలి రెండు చేతుల వానికి కూడా, వేణువు నూదేవానికి, కిశోరంగా (బాల) గోపవేషమందున్న వానికి, పరిపూర్ణతమునకు.
మూ॥ తస్యభార్యా స్వయం రాధా మహాలక్ష్మీః పరాత్పరా ।
బ్రహ్మ స్వరూపా పరమా పరమాత్మాన మీశ్వరం ॥
భజతే సతతంశాంతం సురమ్యం శ్యామసుందరం ।
కోటికందర్ప సౌందర్య నిందితం సుకలేవరం ॥
అమూల్యరత్నాభరణం సత్యంచ నిత్యవిగ్రహం ।
పీతాంబరధరం రమ్యం దాతారం సర్వసంపదాం ॥
శ్రీకృష్ణశ్చ ద్విధారూపో ద్విభుజశ్చ చతుర్భుజః ।
చతుర్భుజశ్చ వైకుంఠే గోలోకే ద్విభుజఃస్వయం ॥
యన్నిమేషో భవేద్వృందే బ్రహ్మణః పతనేనచ ।
పంచవింశత్సహస్రేణ యుగేనేంద్రస్య పాతనం ॥
చతుర్దశేంద్రావచ్ఛిన్నకాలేన బ్రహ్మణోదినం ।
తావతీతి నిశా తస్య విధాతుర్జగతా మపి ॥
ఏవం త్రింశద్దినైర్మాసం ద్విషట్ కేమాసివర్షకం ।
ఏవం శతాయుక్త స్యైవ నిబోధ బోధతత్పరం ॥
యావజ్జీవన పర్యంతం సేవంతే సనకాదయః ।
కల్పానాం కోటికోటించ తన్నసాధ్యశ్చయోవిభుః ॥
సహస్ర వక్త్రః శేషశ్చ సేవతేచ జపేత్సదా ।
దివానీశంచ యంభక్త్యా కల్పకోటిశతం శతం ॥
తన్నసాధ్యో హితకరో దురారాధ్యః పరాత్పరః ।
బ్రహ్మా బ్రహ్మస్వరూపం తం భజేజ్జన్మని జన్మని ॥
వక్రైశ్చతుర్భిస్సతతం స్తౌతి నిత్యం సనాతనం ।
వేదేఽనిర్వచనీయశ్చ వేదానాంజనకో విధిః ॥
విదాతా ఫలదాతాచ దాతాచ సర్వసంపదాం ।
తన్న సాధ్యోహి భగవాన్ కాలకాలాంతకాంతకః ॥
సంహారకర్తా జగతాం కలయా రుద్రరూపతః ।
సస్తౌతి పంచవక్త్రైస్తుకోఽన్యోఽన్యస్యాపి కాకథా ॥
తత్పరశ్చ ప్రియోనాస్తి వృందే భగవతః శ్రుణు ।
సర్వశక్తి స్వరూపానీ దుర్గా దుర్గతి నాశినీ ॥
బ్రహ్మస్వరూపా పరమా మూలప్రకృతి రీశ్వరీ ।
నారాయణీ విష్ణుమాయా వైష్ణవీసా సనాతనీ ॥
యన్మాయయా జగద్ర్భాంత మనిత్యే భ్రమతేసదా ।
సాస్తౌతి భక్త్యా యం దేవం వృందే ప్యంగే దివానీశం ॥
సౌతి భక్త్యా స్వశక్త్యాచ గజవక్త్రః షడాననః ।
ధ్యాయతే యం గణేశశ్చ సర్వాదౌ యస్య పూజనం ॥
భగవాన్ సర్వదేవేశో జ్ఞానినాంచ గురోర్గురుః ।
సిద్ధేంద్రేషుచ దేవేంద్రే యోగీంద్రే జ్ఞానినాంగురౌ ॥
నగణేశాత్పరో విద్వాన్గణేశశ్చ సురాధిపః ।
సరస్వతీ చ యంస్తోతుమశక్తా పరమేశ్వరీ ॥
దివానిశం పాదపద్మం భక్త్యా పద్మాం న సేవతే ।
యత్కటాక్షాజ్జగత్సర్వం పరిపూర్ణతమం శివం ॥
యద్భయాద్యాతి వాతోఽయం సూర్యస్తపతి యద్భయాత్ ।
వర్షతీంద్రో దహత్యగ్ని ర్మృత్యుశ్చ రతి జంతుషు ॥
పృధివీ సేవయా యస్య సర్వాధారా వసుంధరా ।
సముద్రానిశ్చలాశైలా యస్య భీతాశ్చసుందరి ॥
ఆతనికి పరాత్పరురాలైన, మహాలక్ష్మి, రాధ స్వయంగా భార్య. ఆమె బ్రహ్మ స్వరూప, ఉత్తమురాలు. పరమాత్మయైన ఈశ్వరుని (40) శాంతుని చాలా అందమైన వానిని శ్యామసుందరుని ఎప్పుడూ సేవిస్తోంది. కోటికందర్పుల సౌందర్యమును నిందించే అందగాడు, మంచి శరీరం కలవాడు (41) అమూల్యమైన రత్నముల ఆభరణములు కలవాడు, సత్యరూపుడు, శాశ్వతమైన విగ్రహం (శరీరం) కలవాడు, పీతాంబరము ధరించినవాడు, అందగాడు, అన్ని సంపదలనిచ్చేవాడు (42) ఆతడు శ్రీకృష్ణుడు రెండు రూపములు కలవాడు రెండు చేతులవాడు, నాలుగు చేతులవాడు, వైకుంఠంలో నాలుగు చేతులవాడు, గోలోకంలో స్వయంగా రెండు చేతులవాడు. (43) ఓ వృంద! బ్రహ్మపతనమైతే ఆతనికి నిమేషము (రెప్పపాటు), ఇరవై ఐదువేల యుగములతో ఇంద్రుని పతనము (44) పదునాలుగు ఇంద్రులంత కాలమైతే బ్రహ్మకు పగలు. ఆ విధాతకురాత్రి కూడా అంతే జగత్తులకు కూడా (45) ఈవిధంగా ముప్పది దినములతో మాసము. పన్నెండు నెలలు ఒక సంవత్సరం. ఇట్లా ఆతనికీ నూరేళ్ళు అని తెలుసుకో. అతడు బోధనయందు తత్పరుడు. (46) సనకాదులు బ్రతికినంతకాలంఆతనిని సేవిస్తారు. ఆవిభు, కోటికోటి కల్పములకైనా సాధ్యుడు కాడు. (47) వేయినోళ్ళుగల శేషుడు కూడా సేవిస్తాడాతనిని. ఎప్పుడూ జపిస్తాడు. నూర్లనూర్ల కోట్ల కల్పముల కాలము రాత్రింబగళ్ళు భక్తితో సేవించినా (48) ఆతడు సాధ్యుడు కాడు. ఆతడు హితం చేసేవాడు. అతికష్టంగా ఆరాధించతగినవాడు, పరాత్పరుడు బ్రహ్మ, బ్రహ్మస్వరూపుడైన ఆతనిని జన్మజన్మలలో భజించాలి (49) నాలుగు ముఖములతో బ్రహ్మ ఎప్పుడూ స్తుతిస్తాడు. ఎప్పుడూ ఆసనాతనుని స్తుతిస్తాడు. వేదములందు అనిర్వచనీయుడు వేదములకు జనకుడు, విధి . (50) విధాత, ఫలదాత, అన్ని సంపదలదాత. అతడు కాలమును, కాలాన్ని అంతంచేసే వానికి అంతకుడు, ఆ భగవంతుడు సాధ్యుడుకాడు. (51) రుద్రుని రూపంతో ఆకళతో జగత్సంహారం చేసేవాడు. ఆతడు ఐదు ముఖములతో స్తుతిస్తున్నాడు. ఇతరుడెవడున్నాడు. ఇతరుల సంగతి చెప్పేదేముంది. (52) ఓ వృంద! భగవత్పరమైన వాడు ప్రియుడు భగవంతునికి లేడు, విను. దుర్గతిని నశింపచేసే దుర్గ సర్వశక్తి స్వరూపురాలు. (53) బ్రహ్మ స్వరూపురాలు, పరమమైనది. మూలప్రకృతి, ఈశ్వరి. నారాయణి, విష్ణుమాయ ఆమె సనాతనమైనది, వైష్ణవి. (54) ఆమె మాయతో జగత్తు భ్రమ చెందింది. ఎల్లప్పుడు అనిత్యమైన దానిలో తిరుగుతోంది. ఆమె భక్తితో ఆదేవుని స్తుతిస్తోంది, ఓ వృంద! మనస్సులో రాత్రింబగళ్ళు స్తుతిస్తోంది. (55) గణపతి, కుమారస్వామి వీరు తమ శక్తి కొలది భక్తితో స్తుతిస్తారు. అన్నింటికి మొదట ఎవని పూజ చేస్తారో ఆ గణేశుడు ఆతనిని ధ్యానిస్తాడు. (56) భగవంతుడు, సర్వదేవతలకు ఈశుడు, జ్ఞానులకు, గురువుకు గురువు. సిద్దేంద్రులలో,దేవేంద్రుని యందు, యోగీంద్రుని యందు జ్ఞానులకు గురువుగా (57) గణేశుని మించిన విద్వాంసుడు లేడు గణేశుడు, సురాధిపుడు. పరమేశ్వరి సరస్వతి ఆతనిని స్తుతించుటకు అశక్తురాలు. (58) భక్తితో పాదపద్మములను రాత్రింబగళ్ళు సేవిస్తుంది. పద్మను సేవించదు. ఆతని దయవల్ల జగమంతా పర్ణిపూర్ణమైనది. మంగళకరమైనది. (59) ఆతని భయంవల్ల గాలి వీస్తోంది, సూర్యుడు వేడి నిస్తున్నాడు. ఇంద్రుడు వర్షిస్తున్నాడు, అగ్ని కాలుస్తున్నాడు, ప్రాణులలో మృత్యువు తిరుగుతోంది. (60) సర్వప్రాణులకాధారమైన వసుంధర, భూమి ఆతని సేవతో నిలుస్తోంది, సముద్రాలు నిశ్చలంగా ఉన్నాయి. పర్వతాలు కదలటం లేదు ఆతనికి భయపడి, ఓ సుందరి!
మూII తీర్థసారాచ సా గంగా పవిత్రాముక్తిదాయినీ ।
జగతాం పావనీ దేవీయస్య పాదాబ్జ సేవయా ।
పవిత్రా తులసీ దేవీ స్మరణాద్యస్య సేవనాత్ ।
నవగ్రహాశ్చదిక్పాలా భీతా యస్య ప్రతాపతః ॥
బ్రహ్మాండేషుచ సర్వేషు బ్రహ్మవిష్ణు శివాత్మకాః ।
అన్యేయే యే సురేశాశ్చ శేషాద్యా మునయస్తథా ॥
కేచిత్కలాస్వరూపాశ్చాప్యంశరూపాశ్చ కేచన ।
కేచిత్కలాంశా: కృష్ణస్య కేచిచ్చపరమాత్మనః ॥
పతిమిచ్ఛసి కల్యాణి ప్రకృతేః పరమీశ్వరం ।
గోలోకే రాధికా సాధ్యో నాన్యేషాంచ కదాచన ॥
మాంభజస్వ మహాభాగే నృపాణా మీశ్వరం పతిం ।
బలవంతంచ దేవేభ్యో దైత్యేభ్యశ్చ వరాననే ॥
సుఖానియాని కల్యాణి త్రిషులోకేషు సంతివై ।
భుంక్ష తాన్యేవసర్వాణి మత్రసాదా న్న సంశయః ॥
సప్తసాగరపారేచ కాంచనీరుచిరావరే ।
దేవానాంక్రీడనార్థాయ విధాత్రా నిర్మితాపురీ ॥
తత్రైవ గచ్చ భద్రంతే రమ రామే మయా సహ ।
మ హేంద్రస్య ప్రియవనం పుష్పోద్యాన సమన్వితం ॥
గచ్ఛ స్వర్ణమయీంలంకాం నానారత్న విభూషితాం ।
తత్రైవ గచ్ఛభద్రంతే రమరామేమయాసహ ॥
విస్పందకం సువసనం నందకం పుష్పభద్రకం ।
తత్రైవ గచ్ఛభద్రంతే రమరామేమయా సహ ॥
సుమేరుగహ్వరం వాపి క్షీరోదంవా మనోహరం ।
తత్రైవ గచ్ఛభద్రంతే రమరామేమయా సహ ॥
సత్యలోకం బ్రహ్మలోకం రమ్యం సద్మరహః స్థలం ।
తత్రైవ గచ్ఛభద్రంతే రమరామేమయా సహ ॥
మలయం నిలయం రమ్యం మహేంద్ర సార నిర్మితం ।
సుగంధియుక్తం సతతం శుద్ధం చందనవాయునా ॥
మాలతీ యూధికా రమ్యాకేతకీ మాధవీతథా ।
చారుచంపకపుష్పాణాం గంధేన సుమనోహరం
తత్రైవ గచ్ఛ భద్రంతే రమ రామే మయా సహ ॥
పికానాం భ్రమరాణాంచ మధురధ్వని సంయుతం ।
తత్రైవ గచ్ఛభద్రంతే రమరామే మయా సహ ॥
ఇంద్రస్యవరణ స్యైవ వాయోరపి యమస్యచ ।
ధనేశ్వరస్య వహ్నేశ్చ ధర్మస్య శశినస్తథా ॥
సురమ్యంలోకమేతేషాం మధ్యేదేవి యథేచ్ఛసి ।
తత్రైవ గచ్ఛభద్రంతే రమరామే మయా సహ ॥
రత్నద్వీపం మణిద్వీపం రమ్యం చంద్ర సరోవరం ।
తత్రైవ గచ్ఛభద్రంతే రమరామే మయా సహ ॥
ఇత్యేవముక్త్వా సంభోత్తుం గచ్ఛంతం తం ఛలేనచ ।
న వాస్తవ పరీక్షార్థం సతీత్వం బోధితుంవ్రజ ॥
ఉవాచ సా నృపసుతా కోపవక్త్రాస్యలోచనా ।
హితం సత్యం యోగయుక్తం ధర్మార్థంచ యషస్కరం ॥
శ్రీవృందోవాచ:
ధైర్యం కురు మహాభాగ శ్రేష్థో జాతీషు బ్రాహ్మణః ।
బ్రాహ్మణానాం తపోమూలం సత్యం వేదవ్రతం ధృతిః ॥
ఆ గంగ తీర్థముల సారము పవిత్రమైనది, ముక్తినిచ్చేది. ఆమె పాదాబ్జములను సేవిస్తే ఆమెలోకములను పవిత్రం చేసేది. (62) తులసిదేవి పవిత్రమైనది. ఆమెను స్మరిస్తే, సేవిస్తే నవగ్రహములు, దిక్పాలురు ఆమె ప్రతాపానికి భయపడుతారు. (63) బ్రహ్మాండములన్నింటిలో బ్రహ్మవిష్ణు శివాత్మకులెవరున్నారో, ఇతరులైన ఏఏ దేవతలున్నారో శేషాదులు, మునులున్నారో (64) కొందరు కలస్వరూపులు, కొందరు అంశరూపులు. కొందరు కృష్ణుని కలలో అంశములు, కొందరు పరమాత్మకలాంశలు. (65) ఓ కల్యాణి! భర్త కావాలనుకుంటే ప్రకృతికి పరుడైన ఈశ్వరుని కోరితే ఆతడు గోలోకంలో రాధికకు సాధ్యుడు, ఇతరులకు ఎప్పుడూకాదు. (66), ఓ మహాభాగిని! నృపులకు ఈశ్వరుడనైన నన్ను పతిగా పొందు. దేవతలకన్న, దైత్యులకన్న బలవంతుణ్ణి ఓవరానన! (67) ముల్లోకములలో ఉన్న సుఖములన్నీ ఓ కల్యాణి! ఆవన్నీ! నా అనుగ్రహంతో అనుభవించు, అనుమానం లేదు. (68) ఓవర! ఏడు సాగరముల ఆవల బంగారుమయమైన, అందమైన పురమును దేవతల క్రీడ కొరకు బ్రహ్మనిర్మించాడు. (69) అక్కడికి వెళ్ళు, నీకు శుభమౌతుంది. ఓరామ! (స్త్రీ) నాతో రమించు. పుష్పోద్యానములతో కూడిన మహేంద్రుని ప్రియమైన వనము(70)నకు వెళ్ళు. నానా రత్నములతో అలంకరింపబడిన స్వర్ణమయమైన లంకకు వెళ్ళు. అక్కడికే వెళ్ళు నీకు మేలౌతుంది. ఓ రామ! (అందమైనదాన) నాతో రమించు. (71) మంచి కదలికలు కలది, మంచి వాసస్థానమైనది, ఆనందింప చేసేది, పుష్పములతో శుభమైనది అక్కడికి వెళ్ళు. (72) సుమేరుగుహకుకాని, మనోహరమైన పాలసంద్రానికిగాని వెళ్ళు. (73) సత్యలోకము బ్రహ్మలోకము రహస్య స్థలమునకు, । అందమైన గృహమునకు వెళ్ళు. (74) మహేంద్రముల సారముతో నిర్మింపబడిన, అందమైన మలయ పర్వత నివాసమునకు ఎప్పుడు మంచివాసనగల, చందనపు గాలితో శుద్దమైన (75) మాలతిపూల సమూహంతో అందమైన, మొగిలి, మాధవి వృక్షములు గల, అందమైన చంపక పుష్పముల గంధముతో చాలా మనోహరమైన అక్కడికి వెళ్ళు. (76) కోయిలల, తుమ్మెదల మధుర ధ్వని అక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళు (77) ఇంద్రుని, వరుణుని, వాయువు, యముడు, కుబేరుడు, అగ్ని, ధర్ముడు చంద్రుడు (78) వీరిలోకముల మధ్యలో అందమైన లోకము కావాలనుకుంటే, ఓదేవి! అక్కడికి వెళ్ళు. (79) రత్నదీపము, మణిద్వీపము, అందమైన చంద్ర సరోవరము అక్కడున్నాయి అక్కడికి వెళ్ళు. నీకుమేలౌతుంది. ఓరామ! నాతో రమించు అక్కడ (80) అని పలికి అనుభవించుటకు వెళ్తున్న ఆతనితో ఆమె అంది. ఆతడు వ్యాజంగా, ఆమె సతీత్వమును తెలుసుకొనుటకు (నిజంగా ఆచరించటానికి కాదు) వెళ్ళాడు. (81) అప్పుడు ఆ రాకుమారి, కోపగించిన ముఖం, పెదవులు (నోరు) కళ్ళు గలదై ఇట్లా అంది. ఆ మాటలు హితమైనవి, సత్యమైనవి, పొందికైనవి, ధర్మముకొరకైనవి, కీర్తికరమైనవి. (82) వృంద వచనమిట్లా - ఓ మహాభాగ! ధైర్యం వహించు (బలహీనుడవు కాకు) జాతులలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. బ్రాహ్మణులకు తపస్సు, సత్యము, వేదవతము, ధృతి మూలమైనవి (ప్రధానం).
మూ॥ పరస్త్రీ సహసంభోగః స్వభావశ్చాష్య ధర్మిణాం ।
అధర్మేణైవ హేవిప్ర దుష్టోఽభద్రాణిపశ్యతి
తతః సపత్నేజయతి సమూలస్థోవినశ్యతి ॥
పతివ్రతానాం గమనే బలాత్కారేణ నిశ్చితం ।
మాతృగామీ భవేత్సద్యో బ్రహ్మహత్యాశతం భవేత్ ॥
కుంభీపాకే పచ్యతేచ యావచ్చంద్రదివాకరౌ ।
ప్రదగ్ధ స్తై లతప్రేషు నమృతః సూక్ష్మ దేహతః ॥
తాడితోయమదూతైశ్చ లోహదండేన మూర్ధని ।
క్షణం సుఖం చిరందుఃఖం సర్వనాశస్య కారణం ॥
అగమ్యాగమనం దుఃఖం ధర్మిష్ఠోనైవ వాంఛతి ।
క్షమస్వ గచ్చ భద్రం తే బ్రాహ్మణ జ్ఞానదుర్బల ॥
యథాదీపశిఖాందృష్ట్వా కీటః పతతినిశ్చితం ।
మిష్టందృష్ట్వా బడీశాగ్రే లుబ్దమీనోమృగోయథా ॥
యథా విషాక్తం భక్ష్యంచ భుంక్తే భోక్తా బుభుక్షితః ।
గృహ్ణాతి దుష్టో దుష్టంచ విషకుంభంపయోముఖం ॥
తథాదృష్ట్వా పరస్త్రీణాం ముఖపద్మం మనోహరం ।
వినాశ బీజం మో హేన భ్రంతో భవతి లంపటః ॥
ముఖంచ రుచిరంస్త్రీణాం శ్రోణియుగ్మం స్తనౌ తథా ।
కామాధారం నాశబీజం అధర్మస్థలమేవచ ॥
భగం నరకకుండంచ లాలామూత్ర సమన్వితం ।
దుర్గంధియుక్తం పాపంచ యమదండస్య కారణం॥
యథాలింగం విశత్యేవ పాపయోనౌచ యోషితాం ।
తథాపుమాన్విశత్యేవ రౌరవేచ యుగేయుగే ॥
రహస్యం చాపదం దృష్ట్వా మాం త్వం ధర్షితుమిచ్ఛసి ।
అత్రైవ సర్వదేవాశ్చ లోకపాలాశ్చ బ్రాహ్మణ ॥
జాజ్వల్యమానో ధర్మశ్చ సాక్షిశాస్తాచ కర్మణాం ।
యమశ్చ దండకర్తాచ స్థాపితో హరిణాస్వయం ॥
స్వయంకృష్ణశ్చ ధర్మాత్మా జ్ఞానరూపోమ హేశ్వరః ।
దుర్గా బుద్ధిర్మనో బ్రహ్మా చేంద్రియాణి సురాస్తథా ॥
సర్వప్రాణిషుతిష్ఠంతి సాక్షిణః కర్మణాంద్విజ ।
క్వగుప్తం క్వరహస్యం బ్రాహ్మణ జ్ఞానదుర్బల ॥
క్షమస్వ గచ్ఛ భద్రంతే అవధ్యాశ్చ ద్విజాతయః ।
శక్తాఽహంభస్మసాత్కర్తుం గచ్ఛవత్సయథా సుఖం ॥
తపస్యాసు మమగత మష్టోత్తర శతం యుగం ।
నాస్తిగోత్రం మ త్సితుశ్చ నమాతా న పితామమ ॥
సర్వాంత రాత్మా భగవాన్ కృష్ణో రక్షతి మాం ద్విజ ।
కృష్ణేన స్థాపితో ధర్మో మాంచ రక్షతినిత్యశః ॥
ఆదిత్యశ్చ తథా చంద్రః పవనశ్చ హుతాశనః ।
బ్రహ్మాశంభు ర్భగవతీ దుర్గారక్షతి మాం సదా ॥
యేనశుక్లీకృతా హంసాః శుకాశ్చహరితా కృతాః ।
మయూరాశ్చిత్రితా యేన సమే రక్షాం కరిష్యతి ॥
అనాథ బాలవృద్ధానాం రక్షకాః సర్వదేవతా : ।
నారీ బుద్ధ్యా న మాంధర్మః త్యక్త్వా గచ్ఛేద్ధి సర్వదా ॥
మాం మాతరం పరిత్యజ్య గచ్ఛవత్సయథా సుఖం ।
ఇత్యేవముక్త్వా దేవీసా తస్థౌతత్ర ధరాయథా ॥
అను ॥ అధర్ములకు పరస్త్రీలతో సంభోగము స్వభావము. ఓ విప్ర! అధర్మంతోనే దుష్టుడు అశుభములను పొందుతాడు. ఆ పైన శత్రువు జయి స్తే, వీడు మూలంతో సహనశిస్తాడు. (84) బలాత్కారంగా పతివ్రతలను పొందితే, వెంటనే తల్లిని పొందినంత పాపి ఔతాడు, నిశ్చయము. నూరు బ్రహ్మహత్యల పాపం పొందుతాడు. (85) సూర్యచంద్రులున్నంత వరకు కుంభీపాక నరకంలో వండబడుతాడు. కాగిన నూనెలో కాల్చబడ్డా చావడు. సూక్ష్మదేహంతో ఉంటాడు. (86) యమదూతలచే లోహదండములతో తల పై కొట్టబడుతాడు. క్షణకాల సుఖము చిరకాల దుఃఖానికి కారణము. అంతా నశించటానికి కారణము. (87) చేరరాని దానిని చేరి, ధర్మిష్ణుడు దుఃఖాన్ని తెచ్చుకోడు. క్షమించు. వెళ్ళు నీకు మేలు కలుగని. ఓ బ్రాహ్మణ! జ్ఞానదుర్బల! (88) దీప శిఖను చూచి (తాకి) పురుగు తప్పకుండా పడిపోతుంది. గాలం చివర మాంసాన్ని చూచి లుబ్దమీనము నశిస్తుంది. మృగం అట్లాగే (89) ఆకలిగొన్న భోక్త విషం కలిసిన తను పదార్థాన్ని తింటాడు (చస్తాడు). దుష్టుడు విషము లోపల కలిగి పైకి పాలవంటి స్వచ్ఛమైన ముఖంగల దుష్టుని చేరుతాడు. (90) అట్లా మనోహరమైన పరస్త్రీ, పద్మం లాంటి ముఖాన్ని చూచి మోహంతో భ్రాంతుడై లంపటుడౌతాడు. ముఖము రుచిరమైంది. పిరుదులు, స్తనములు అందమైనవి. కామమునకు ఆధారము. నాశనమునకు బీజము. అధర్మమునకు స్థానము. (92) లాల మూత్రములతో కూడిన భాగము (యోని) నరక కుండము. దుర్గంధము కలది. పాపమైనది. యముని దండనమునకు కారణము. (93) స్త్రీల యొక్క పాపమైన యోనియందు, లింగము (పురుష మర్మావయవం) ప్రవేశించగానే పురుషుడు ప్రతియుగంలో రౌరవనరకంలో ప్రవేశిస్తాడు. (జంట) (94) రహస్యమైన ఆపదను చూచి నీవు నన్ను తిరస్కరింప చూస్తున్నావు. ఇక్కడే దేవతలు, లోకపాలురు అంతా, ఓ బ్రాహ్మణ! (95) వెలుగుతూన్న ధర్మము సాక్షిగా ఉన్నారు. కర్మలకు శాసకుని యముని దండకర్తగా విష్ణువు స్వయంగా స్థాపించాడు. (96) స్వయంగా కృష్ణుడు ధర్మాత్ముడు. జ్ఞానరూపుడు, మహేశ్వరుడు. దుర్గ బుద్ధి. బ్రహ్మ మనస్సు. ఇంద్రియములు దేవతలు (97) ప్రాణులందరిలో కర్మలకు సాక్షిగా వీరుంటారు. ఓద్విజ! గుప్తమైనది, రహస్యమైనది, ఎక్కడుంది, ఓ జ్ఞాన దుర్బలుడ! బ్రాహ్మణ! (98) క్షమించు, వెళ్ళు, నీకు క్షేనుంకలగని బ్రాహ్మణ జాతిని చంపరాదు. నేను నిన్ను భస్మంగా చేయగలను, సమర్థురాలిని. కాని ఓవత్స! సుఖంగా వెళ్ళు. (99) నూట ఎనిమిది యుగముల నుండి నేను తపస్సు చేస్తున్నాను. నా తండ్రి గోత్రం లేదు. నాకు తల్లిదండ్రులు లేరు. (100) సర్వాంతరాత్ముడైన భగవాన్ కృష్ణుడు నన్ను రక్షిస్తున్నాడు, ఓ ద్విజ! కృష్ణుడు స్థాపించిన ధర్మమునన్ను ఎల్లప్పుడూ రక్షిస్తోంది (101) సూర్యుడు, చంద్రుడు. గాలి, అగ్ని ,బ్రహ్మ, శివుడు, భగవతి దుర్గ వీరు నన్ను ఎప్పుడూ రక్షిస్తున్నారు (102) హంసలను తెల్లగా సృష్టించినవాడు, చిలుకలను పచ్చగా చేసినవాడు, నెమళ్ళను రకరకాల రంగులు కలవానిగా చేసిన ఆ దేవుడే నన్ను రక్షిస్తాడు (103) అనాధలు బాలలు, వృద్ధులు, వీరిని దేవతలంతా రక్షిస్తారు. సాధారణ స్త్రీగా భావించి ధర్మాన్ని వదిలి, ఎప్పుడూ నన్ను చేరరాదు. (104) తల్లినైన నన్ను వదిలి, ఓ వత్స! సుఖంగా వెళ్ళు, అని పలికి ఆ దేవి అక్కడ భూమిలాగా నిలబడింది.
మూ! ఆగచ్ఛంతంచ సంభోక్తుం మాయా తం బోధనేనచ ।
శశా పేతిచ సాకోపాత్ బ్రహ్మ బంధోక్షయో భవ ॥
క్షయోభవ దురాచార హేపాపిష్ఠ క్షయోభవ ।
పునః శప్తం స్వయం సూర్యో వారయామాస యత్నతః ॥
ఏతస్మిన్నంతరే తాత తత్రైవ జగదీశ్వరాః ।
ఆ జగ్మురతి సంత్రస్తా బ్రహ్మ విష్ణు శివాదయః ॥
ధర్మం దృష్ట్వా కలారూపం రురుదుస్త్రిదశేశ్వరాః ।
కృత్వా క్రోడేఽతీవకృశం కుహ్వాభీతం యథా విధుం ॥
నిశ్చేష్టం మలినం దగ్ధం సతికోపాగ్నినా వ్రజ ।
నిశ్చేష్టం మలినం దగ్గం సతీకోపాగ్నినా వ్రజ ॥
శ్రీభగవానువాచ :
క్షమస్వవృందే మద్భక్తీ జన్మమృత్యు జరాహరే ।
ధర్మం జీవయ మద్భక్తం రక్షధర్మం పతివ్రతే ॥
బ్రహ్మోవాచ :
ధ్వాంతపూర్ణం జగత్సర్వం వినాధర్మం బభూవహ ।
కంపితౌ చంద్రసూర్యౌచ శేషశ్చాపి వసుంధరా ॥
మహాదేవ ఉవాచ
ప్రనష్టంచ జగత్సర్వం వినాధర్మేణ సుందరి ।
ధర్మం జీవయభద్రంతే స్వస్తి తేస్తు వరాననే ॥
సూర్య ఉవాచ –
వరం వృణీష్వ భద్రంతే యత్తే మనసి వాంఛితం ।
ధర్మం జీవయ భద్రంతే రక్ష సృష్టిం పతివ్రతే ॥
అనంత ఉవాచ –
ధర్మం కరోషితపసా కథం ధర్మం విహంసిచ ।
ధర్మం జీవయ భద్రంతే సర్వధర్మోభవేత్తవ ॥
చంద్ర ఉవాచ –
ద్విజరూప ధరోధర్మః త్వాం పరీక్షితు మాగతః ।
బ్రహ్మణా ప్రేరితశ్చైవ నిర్దోషశ్చ విహింసితః ॥
మ హేంద్ర ఉవాచ –
తపసోపార్జితో ధర్మో ధర్మేణచ ఫలం నృణాం ।
కథం ఫలంచ తపసాంయది ధర్మః క్షయం గతః ॥
వరుణ ఉవాచ –
ధర్మం జీవయ ధర్మిష్ఠే ధర్మం రక్ష సనాతనం ।
నిష్ఫలం కర్మిణాంకర్మ వినా ధరేణ ధార్మికే ॥
పవన ఉవాచ –
జగత్పూతం కురు శుభే ధర్మం జీవయ సాంప్రతం ।
ధర్మే ప్రనష్టే తపసాం తవాపూర్వం వినంక్ష్యతి ॥
వహ్నిరువాచ –
స్వధర్మోపార్జనంకర్తుమాగతాఽసిచభారతం ।
విహంసి ధర్మ మజ్ఞాత్వా పునర్జీవయ సుందరి ॥
యమ ఉవాచ –
వేదోక్త కర్మకర్మణా మహం విశ్వేశ్వరాననే ।
ధర్మానుసారాత్ఫలదో ధర్మం జీవయ సత్వరం ॥
దేవానాం వచనం శ్రుత్వా సముత్థాయ పతివ్రతా ।
నమస్కృత్య సురేశాంశ్చ తానువాచ తపస్వినీ ॥
వృందోవాచ-
అహం దేవనజానామి ధర్మం బ్రాహ్మణ రూపిణం ।
కృతః క్షయో మయా కోపాన్నాం పరీక్షితుమాగతః ॥
జీవయా మిధ్రువం ధర్మం యుష్మాకంచ ప్రసాదతః ।
ఇత్యేవ ముక్త్యాసా వృందా చేత్యు వాచ ప్రజేశ్వర ॥
సంభోగించుటకు వస్తున్న ఆతనిని మాయబోధనతో, కోపంతోనూ, ఓ బ్రహ్మ బంధు! నీవు నశించిపో అని ఆమె శాపం పెట్టింది (106) ఓ దురాచారుడ నీవు నశించు. ఓ పాపిష్టుడ! నశించు. ఆమె శపించగా, సూర్యుడు స్వయంగా ప్రయత్నపూర్వకముగా నివారించాడు. (107) ఓ తండ్రి! ఇంతలో అక్కడ జగదీశ్వరులైన బ్రహ్మ విష్ణు శివాదులు మిక్కిలి భయపడి వచ్చారు (108) మొద్దులాగా ఉన్న ధర్ముని చూచి త్రిదశేశ్వరులు దుఃఖించారు. తన రొమ్ముపై ఉంచుకొన్న కుహువుకు (రాహువుకు) భయపడిన, చాలా కృశించిన చంద్రునివలె ఉన్నాడు,నిశ్చేష్టుడైనాడు మలినుడు, కాలిన వాడు ఐనాడు సతీకోపాగ్నితో, ఆతడు!ఓ ప్రజ! (109) భగవంతుని వచనమిట్లా - ఓ వృంద! నా భక్తురాల! జన్మమృత్యు ముసలితనములను హరించుదాన, క్షమించు. నాభక్తుడైన ధర్ముని రక్షించు. ఓపతివ్రత! ధర్మాన్ని రక్షించు (110) బ్రహ్మవచనమిట్లా - ధర్మం లేకపోతే జగమంతా చీకటితో నిండిపోతుంది. చంద్రసూర్యులు కంపించి పోతారు. శేషుడు కూడా కంపిస్తాడు, ఓ వసుంధర! (111) మహాదేవునివచనమిట్లా - ఓ సుందరి! ధర్మం లేకపోతే లోకమంతా నశిస్తుంది. ధర్ముణ్ణి బ్రతికించు. నీకు శుభం జరుగుతుంది. ఓవరానన! నీకు మంచి జరగని (112) సూర్యుని వచనమిట్లా - ఓ వృంద! నీ మనస్సులో ఏకోరిక ఉందో దాన్ని కోరుకో, నీకు మేలౌతుంది. ధర్ముణ్ణి బ్రతికించు నీకు మేలౌతుంది. ఓ పతివ్రత! సృష్టిని రక్షించు. (113) అనంతుడిట్లన్నాడు - తపస్సుతో ధర్మాన్ని ఆచరిస్తున్నావు. ధర్మాన్నేట్లా సంహరిస్తావు. ధర్ముణ్ణి బ్రతికించు. నీకు మేలౌతుంది. నీకు అన్ని ధర్మాలు సిద్ధిస్తాయి. (114) చంద్రుడిట్లన్నాడు - బ్రాహ్మణ రూపమును ధరించి ధర్ముడు నిన్ను పరీక్షించటానికి వచ్చాడు. బ్రహ్మ పంపగా వచ్చాడు. దోషం లేకుండానే శిక్షింపబడ్డాడు. (115) మ హేంద్రుడిట్లన్నాడు - తపస్సుతో ధర్మాన్ని సంపాదించావు. ధర్మంతో నరులకు ఫలం లభిస్తుంది. ఒకవేళ ధర్మం నశిస్తే తపస్సులకు ఇంకాఫలమేమి ఉంటుంది. (116) వరుణుడిట్లన్నాడు - ఓ ధర్మిష్ఠురాల! ధర్మాన్ని బ్రతికించు సనాతనమైన ధర్మాన్ని రక్షించు. ఓ ధార్మికురాల! ధర్మంలేకపోతే కర్మలు చేసేవారి కర్మ నిష్ఫలమౌతుంది. (117) వాయువిట్లన్నాడు - ఇప్పుడు ధర్ముని బ్రతికించు, ఓ శుభురాల! జగత్తును పవిత్రంగా చేయి. ధర్మం నశిస్తే నీ తపస్సులవల్ల కలిగే అపూర్వము నశిస్తుంది (118) అగ్నివచనమిట్లా - నీ ధర్మమును సంపాదించుట కొరకు భారతమునకు వచ్చావు. తెలియక ధర్మాన్ని చంపుతున్నావు. ఓసుందరి! తిరిగి ధర్మాన్ని బ్రతికించు (119) యముని వచనమిట్లా - విశ్వేశ్వరునకు ఆననమైనదానా (విశ్వేశ్వరుని ఆననంగా కలదానా) వేదోక్తంగా కర్మలు చేసే వారికి నేను ధర్మాన్ననుసరించి ఫలాన్ని ఇస్తాను. త్వరగా ధర్ముణ్ణి జీవింపజేయి (120) దేవతల మాటలను విని లేచి, ఆపతివ్రత, దేవతలందరికి నమస్కరించి, తపస్విని వారితో ఇట్లా అంది. (121) వృందవచనమీట్లో - బ్రాహ్మణ రూపంలో ఉన్నవానిని ధర్మునిగా నేను తెలుసుకోలేక పోయినాను, ఓ దేవతలార! నన్ను పరీక్షించటానికి వచ్చిన ఆతనిని కోపంతో నేను నశింపజేశాను. (122) మీ అనుగ్రహం వల్ల,ధర్ముణ్ణి తప్పకుండా బ్రతికిస్తాను. అని పలికి ఆవృంద, ఇట్లా అంది, ఓ వ్రజేశ్వర!
మూII తపఃసత్యం యదిమమ సత్యంచ విష్ణు పూజనం ।
తేనపుణ్యేన సద్యోఽత్ర ద్విజోభవతు విజ్వరః ॥
యదిమేచ భవేత్సత్యం వ్రతం సత్యం తపఃశుచి ।
తేనపుణ్యేన సత్యేన ద్విజోభవతు విజ్వరః ॥
యది నారాయణః సత్యః సర్వాత్మా నిత్య విగ్రహః ।
జ్ఞానాత్మకః శివః సత్యోద్విజోభవతు విజ్వరః ॥
బ్రహ్మసత్యంచ తేదేవాః ప్రకృతిః పరమాయది ।
యజ్ఞః సత్యస్తపః సత్యం ద్విజోభవతు విజ్వరః ॥
ఇత్యేవముక్త్వాసా వృందా ధర్మం క్రోడే చకారచ ।
తందృష్ట్వాచ కలా రూపం రూరోద కృపయా సతీ ॥
ఏతస్మిన్నంతరేమూర్తి: ధర్మభార్యా శుచాఽకులా ।
నిపత్య విష్ణుపాదేచ శిరసా చేత్యువాచసా ॥
మూర్తిరువాచ –
హేనాథ! కరుణా సింధో దీనబంధో కృపాంకురు ।
తూర్ణం జీవయ కాంతంమే జగన్నాథ కృపామయ ॥
పతిహీనాచ యానారీ పాపినీ సాభవార్ణవే ।
యథాస్యం చక్షుర్విరతం ప్రాణహీనా యథా తనూః ॥
మీతందదాతి హీపితా మితంభ్రాతా మితం సుతః ।
మితం బంధు మితం మాతా సర్వదాతో పతిః ప్రభుః ॥
ఇత్యేవముక్త్యా సాదేవీ తత్రతస్థౌ రురోదచ ।
ఉవాచ వృందాం భగవాన్ సర్వాత్మా ప్రకృతేః పరః ॥
శ్రీభగవానువాచ :
త్వయాఽయుస్తపసాలబ్ధం యావదాయుశ్చబ్రాహ్మణః ।
తదేవ దేహి ధర్మాయ గోలోకం గచ్ఛ సుందరి ॥
తన్వానయాచ తపసా పశ్చాన్మాం చ లభిష్యసి ।
పశ్చాధ్గోలోకమాగత్య వారా హేచ వరాననే
వృషభానసుతా త్వంచ రాధాచ్ఛాయా భవిష్యసి ॥
మత్కలాంశశ్చ రాహణ స్త్వాంవివాహేగ్రహీష్యతి ।
మలంభిష్యసి రాసేచ గోపీబీ రాధయా సహ ॥
రాధా శ్రీధామశాపేన వృషభాన సుతాయదా ।
సాచైవ వాస్తవీ రాధాత్వంచ ఛాయా స్వరూపిణీ ॥
వివాహకాలే రాపాణః త్వాంచ ఛాయాంగ్రహీష్యతి ।
త్వాం దత్వావాస్తవీ రాధా సాంఽతర్ధానా భవిష్యతి ॥
రాధైవేతి విమూఢాశ్చ విజ్ఞాస్యంతిచ గోకులే ।
స్వప్నే రాధా పదాంభోజం నహి పశ్యంతి వల్లవాః ॥
స్వయం రాధామమక్రోడే ఛాయా రాపాణ కామినీ ।
విష్ణోశ్చ వచనం శ్రుత్వా దదా వాయుశ్చ సుందరీ ॥
ఉత్తస్థౌ పూర్ణధర్మశ్చ తప్తకాంచన సన్నిభః ।
పూర్వస్మా త్సుందరః శ్రీమాన్ ప్రణనామ పరాత్పరం ॥
వృందోవాచ –
దేవాః శృణుత మద్వాక్యం దుర్లం ఘ్యం సావధానతః ।
నహి మిథ్యాభవేద్వాక్యం మదీయంచ నిశామయ ॥
క్షయోభవేతి వాక్యంచ మయోక్తం కోపభీతయా ।
వారత్రయం పునర్వక్తుం వారయామాస భాస్కరః ॥
నా తపస్సు సత్యమైతే,నా విష్ణుపూజ సత్యమైతే, ఆ పుణ్యంతో, ఇక్కడి ద్విజుడు వెంటనే జ్వర రహితుడుకాని (124) నా వ్రతము - సత్యమైనట్లైతే, నా తపస్సు శుచిగలది సత్యమైనట్లైతే, ఆ సత్యమైన పుణ్యంతో ఈ బ్రాహ్మణుడు జ్వర రహితుడుకాని. (125) అన్ని ఆత్మలందుండే, నిత్యవిగ్రహుడైన నారాయణుడుసత్యమైతే, జ్ఞానాత్మకుడైన శివుడు సత్యమైతే ఈ ద్విజుడు జ్వరరహితుడుకాని (126) బ్రహ్మ సత్యమైతే ఆ దేవతలు సత్యమైతే ప్రకృతి పరమమైనదైతే, యజ్ఞము తపస్సు ఇవి సత్యమైనవైతే ఈ బ్రాహ్మణుడు జ్వరరహితుడుకాని (127) అని పలికి ఆ వృంద, ధర్ముని తన ఒడియందుంచుకొన్నది. కలారూపంలో ఉన్న ఆతనిని చూచి దయతో ఆసతి దుఃఖించింది. (128) ఇంతో ధర్ముని భార్య దుఃఖంతో కలతచెంది మూర్తి అను పేరు గలది వచ్చి, విష్ణువు పాదమందు శిరముంచి,నమస్కరించి ఆమె ఇట్లా పలికింది. (129) మూర్తి వచనమిట్లా - ఓనాథ! కరుణా సింధు దీన బంధు! నా పై దయజూపు. ఓ! జగన్నాథ! కృపామయ! నా భర్తను త్వరగా జీవింపజేయి. (130) పతిహీనమైన స్త్రీ, ఆమె సంసారసాగరమందుపాపిని, కళ్ళులేని ముఖంలా ప్రాణహీనమైన తనువులాంటిదామె. (131) తండ్రి పరిమితంగానే ఇస్తారు. బంధువులు, తల్లి వీరూ మితంగానే ఇస్తారు. సోదరుడు మితంగానే ఇస్తాడు. కొడుకు మితంగానే ఇస్తాడు. అన్నింటిని ఇచ్చేవాడు, ప్రభువు, పతి. (132) అని పలికి ఆదేవి, అక్కడే నిలిచి, దుఃఖించసాగింది. అప్పుడు సర్వాత్ముడు, ప్రకృతికి పరమైనవాడు అగు భగవంతుడు వృందతో ఇట్లన్నాడు. (133) భగవంతుని వచనమిట్లా - నీవు ఆయస్సును తపస్సువల్ల పొందావు. బ్రాహ్మణునకు నీవు పొందిన ఆయుస్సునే ధర్మునకు ఇవ్వు. ఓ సుందరి! నీవు గోలోకానికి పో (134) ఈ శరీరంతో, తపస్సుతో నన్ను తరువాత పొందుతావు. పిదప గోలోకానికి వచ్చి ఓ వరానన! వారాహమందు నీవు వృషభానసుతవై రాధాచ్చాయమౌతావు. (135) నాకలాంశమైన రాపాణుడు, వివాహమందు నిన్ను గ్రహిస్తాడు. రాసక్రీడయందు, గోపికలతో రాధతో కూడా నన్ను పొందుతావు. (136) రాధ శ్రీరాముని శాపం వల్ల వృషభానసుతయైతే ఆమెనే నిజమైన రాధ, నీవు ఛాయా స్వరూపిణి. (137) వివాహ కాలమందు రాపాణుడు (నీడవైన) ఛాయవైన నిన్ను స్వీకరిస్తాడు. నిన్ను ఇచ్చి వాస్తవమైన రాధ అంతార్ధనమౌతుంది. (138) గోకులమందలి మూడులంతా రాధయనే గ్రహిస్తారు (నిన్ను). రాధ పాదాంబజములను, వల్లవులు , కలలో కూడాచూడలేరు. (139) నిజమైన రాధ నారక్షణయందుంది. ఛాయా రాధ రాపాణుని కామిని. విష్ణువు మాటను విని, సుందరి, ఆయువునిచ్చింది. (140) కాల్చిన బంగారంలా వెలిగిపోతున్న పూర్ణధర్ముడు లేచాడు. ముందుకన్నా సుందరంగా ఉన్నాడు. శోభావంతుడుగా ఉన్నాడు. పరాత్పరునకు నమస్కరించాడు. (141) వృందవచనమిట్లా - ఓ దేవతలారా! తప్పించుకో వీల్లేని నామాటను సావధానంగా వినండి. నామాట అబద్ధంకాదు, వినండి (142) కోపంతో భయంవల్ల 'నశించు', అనేమాటను నేనన్నాను. మూడుసార్లు అట్లా మళ్ళీ అనకుండా, భాస్కరుడు,నన్ను నివారించాడు.
మూII సత్యేచ పరిపూర్ణోఽయం యథాపూర్వోయథా ధునా ।
త్రిపాదశ్చాపి త్రేతాయాం ద్వీపాదోద్వాపరే తథా॥
ఏక పాదశ్చ ధర్మోఽయం కలేశ్చ ప్రథమేహరే ।
శేషఃకలాషోడశాంశః పునః సత్యేయథాపురా ॥
త్రిర్నిర్గతం మమ ముఖాత్ క్షయస్తే న తతః క్రమాత్ ।
పునరుక్తేచమనసి వారయామా సభాస్కరః ॥
తేనైవ హేతునాఽయంచ కలిశేషే కలామయః ।
తథాశప్తః స్థితోదుర్గే కలిశేషే తథా ధ్రువం ॥
ఏతస్మిన్నంతరే నంద దదృశుర్దేవతారథం।
గోలోకాదాగతం వేగాదతీవ సుందరం శుభం ॥
అమూల్యరత్న నిర్మాణ హీరహార పరిష్కృతం ।
మణిమాణిక్యముక్తాభిర్వ స్త్రైశ్చ శ్వేతచామరైః ॥
విభూషితం భూషణైశ్చ రుచిరైః రత్నదర్పణైః ।
నత్వాహరిం హరం వృందాబ్రహ్మాణం సర్వదేవతాః ॥
సమారుహ్య రథం దృష్ట్వా గోలోకం చ జగామసా ।
దేవా జగ్ముశ్చ స్వస్థానం కిం భూయః శ్రోతు మిచ్ఛసి ॥
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే నారాయణ నారద సంవాదే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే భగవన్నంద సంవాదే షడశీతితమోఽధ్యాయః ॥
ఇదివరలో ఎట్లాగో ఇప్పుడూ అట్లాగే సత్యంతో పరిపూర్ణమైందిది. త్రేతాయుగమందు మూడు పాదములు, ద్వాపరమందు రెండు పాదములు సత్యము. (144) ఓహరి! కలిప్రథమ పాదమందు ఈ ధర్మము ఒకే పాదం కలదిగా ఉంటుంది. మిగిలిన షోడశాంశకల తిరిగి సత్యమందు ఇదివరలో వలె ఉంటుంది (145) నా నోటినుండి మూడుసార్లు నాశనము అని వచ్చింది అందువల్ల ఆ పిదప క్రమంగా క్రమంగా అట్లే. మనస్సులో మళ్ళీ అనుకుంటుంటే భాస్కరుడు వారించాడు. (146) అందువల్లనే ఈతడు కలిశేష మందు కళామయుడైనాడు. అట్లా శపింపబడి ఉన్నాడు. ఓదుర్గ! కలిశేషమందు అట్లా ఉండటం నిశ్చయము. (147) ఇంతలో ఓ నంద! దేవతలు రథాన్ని చూశారు. గోలోకం నుండి వేగంగా వచ్చింది. చాలా సుందరమైంది, శుభమైంది. (148) అమూల్య రత్నములతో నిర్మింపబడింది. వజ్రముల హారముతో అలంకరింపబడింది. మణుములు, మాణిక్యములు, ముత్యములు, వస్త్ర ములు, తెల్లని చామరములు వీనితో (149) అలంకరింపబడింది. భూషణములతో, అందమైన రత్న దర్పణములతో అలంకరింపబడింది. హరిని, హరుని బ్రహ్మను, దేవతలందరికిని వృంద నమస్కరించింది. (150) రథాన్ని చూచి దాని పైకి ఎక్కి ఆమె గోలోకానికి వెళ్ళింది. దేవతలు తమ స్థానానికి వెళ్ళారు. ఇంకా ఏం వినదలచావు (151) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు నారాయణ నారద సంవాద మందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధమందు భగవంతుడు, నందుడు వీరిద్దరి సంవాదమందు ఎనుబది ఆరవ అధ్యాయము.
Summary of chapter 86 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Reaffirming the sacred dignity of cattle in Vaishṇava culture, this chapter presents a profound eulogy on the divine nature of cows, who are recognized as the mothers of all creation. The text explains that all Devas, holy pilgrimage sites, and sacred scriptures reside within the body of a cow, making cow protection an essential spiritual duty. Feeding cows, protecting them from slaughter, and worshipping them with devotion grants immense material prosperity, moral integrity, and ultimate ascension to Goloka.