బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

87 - అధ్యాయము

మూ నంద ఉవాచ :

త్వాంజ్ఞాతుం నహిశక్తాశ్చ వేద వేద ప్రభుం స్వయం

పురా బ్రహ్మేశ శేషాద్యా ముని సిద్ధాదయ స్తథా

కోభవానితి విజ్ఞాతుం పరంకౌతూహలం మమ

తత్ససర్వం స్వాత్మ యాథార్థ్యం నిర్జనే కథయ ప్రభో

శ్రీనారాయణ ఉవాచ:

ఏతస్మిన్నంత రే తత్ర కృష్ణం ద్రష్టుం మునీశ్వరాః

ఆజగ్ముః సహసా వత్స జ్వలంతో బ్రహ్మతేజసా

పులహశ్చపులస్త్యశ్చ క్రతుశ్చ భృగురంగిరాః

ప్రచేతాశ్చ వసిష్ఠశ్చ దుర్వాసాః కణ్వ ఏవచ

కాత్యాయనః పాణినిశ్చ కణాదో గౌతమస్తథా

సనకశ్చ సనందశ్చ తృతీయశ్చ సనాతనః

కపిలశ్చాసురిశ్చైవ వాయుః పంచశిఖస్తథా

విశ్వామిత్రో వాల్మీకిశ్చ కశ్యపశ్చ పరాశరః

విభాండకో మరీచిశ్చ శుక్రోఽత్రిశ్చ బృహస్పతిః

గార్గ్యశ్చాపితథా వాత్స్యో వ్యాసశ్చజైమినిస్తథా

మితవాగృష్యశృంగశ్చ యాజ్ఞవల్క్యః శుకస్తథా

సౌభరిః శుద్ధజటిలో భరద్వాజః సుభద్రకః

మార్కండేయో లోమశశ్చ ఆసురీశ్చ విటంకణః

అష్టావక్రో శతానందో వామదేవశ్చ భాగురిః

సంవర్తశ్చా ప్యుతథ్యశ్చ నరోఽహంచాపినారదః

జాబాలిః పర్షురామశ్చా ప్యగస్త్య: పైల ఏవచ

యుధామన్యుః గౌరముఖోఽప్యుపమన్యుః శ్రుతశ్రవాః

మైత్రేయ శ్చ్యవనశ్చైవ వరరుచ్యర్షి రేవచ

తాన్ దృష్ట్వా సహసోత్థాయ నమస్కృత్య పుటాంజలిః

సింహాసనేషు రమ్యేషు వాసయామాస సాదరం

పూజయామాస విధివత్ కుశల ప్రశ్న పూర్వకం

పరస్పరంచ సంభాష్య మధ్యే కృష్ణ ఉవాస సః

ఏతస్మిన్నంతరే కృష్ణ: తేజోరాశిం దదర్శసః  

దదృశుస్తే చ మునయోఽప్యాకాశేచ సముజ్జ్వలం

తేజసోఽభ్యంతరే వత్సంకుమారం కనకప్రభం

యథైవ పంచవర్షీయం నగ్నం బాలక మీప్సితం

ఆవిర్బభూవ సహసా సభామధ్యేచ నారద

ఉత్తిష్ఠమానం సహసా తద్దృష్ట్వా మునిపుంగవాః

అను II నందుడిట్లన్నాడు:

స్వయముగా వేదమునకు ప్రభువైన నిన్ను వేదములు కూడా తెలుసుకొనలేవు. సురలు, బ్రహ్మ శివుడు, శేషాదులు, మునులు, అట్లాగే సిద్ధాదులు తెలుసుకొనలేరు. (1) నీవెవరో తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉండి అదంతా నీయదార్థ విషయాన్ని ఒంటరిగా నాకు చెప్పండి. ఓ ప్రభు! (2) శ్రీనారాయణుని వచనమిట్లా - ఇంతలో కృష్ణుని చూడటానికి అక్కడికి మునీశ్వరులు, బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్న వారు త్వరగా వచ్చారు, ఓవత్స! (3) పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, అంగిరుడు, ప్రచేతుడు, వసిష్టుడు, దుర్వాసుడు, కణ్వుడు (4) కాత్యాయనుడు, పాణిని, కణాదుడు, గౌతముడు, సనకుడు, సనందుడు, సనాతనుడు (5) కపిలుడు, ఆసురి, వాయువు, పంచశిఖుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి, కశ్యపుడు, పరాశరుడు (6) విభాండకుడు, మరీచి, శుక్రుడు అత్రి, బృహస్పతి, గార్యుడు, వాత్యుడు, వ్యాసుడు, జైమిని (7) తక్కువగా మాట్లాడే ఋష్యశృంగుడు, యాజ్ఞవల్క్యుడు, శుకుడు, సౌభరి, శుద్ధమైన జడలు గల భరద్వాజుడు, సుభద్రకుడు (8) మార్కండేయుడు, లోమశుడు, ఆసురి, విటంకణుడు, అష్టావక్రుడు, శతానందుడు, వామదేవుడు, భాగురి (9) సంవర్తుడు, ఉతథ్యుడు, నరుడు, నారదుడు అంతా వచ్చారు. జాబాలి, పర్పురాముడు, అగస్త్యుడు, పైలుడు (10) యుధామన్యువు, గౌరముఖుడు, ఉపమన్యువు, శ్రుతశ్రవుడు, మైత్రేయుడు, చ్యవనుడు, వరరుచి, అర్షి వీరంతవచ్చారు. (11) వారిని చూచి త్వరగా లేచి చేతులు జోడించి నమస్కరించి ఆదరంతో అందమైన సింహాసనముల పై కూర్చో పెట్టాడు. (12) శాస్త్ర ప్రకారము కుశలప్రశ్న పూర్వకముగా పూజించాడు. పరస్పరము అందరితో మాట్లాడి, మధ్యలో ఆ కృష్ణుడు కూర్చున్నాడు. (13) ఇంతలో ఆ కృష్ణుడు తేజోరాశిని చూశాడు. ఆమునులు కూడా ఆకాశంలో వెలిగిపోతున్న కాంతిని చూశారు. (14) ఓవత్స! తేజస్సు మధ్యలో బంగారు కాంతిగల కుమారుని ఐదు సంవత్సరాల వయస్సు వానిని నగ్నంగా ఉన్న బాలుని కోరతగిన వానిని చూచారు. (15) ఓ నారద! సభామధ్యంలో త్వరగా ఆవిర్భవించాడు. త్వరగా సభలో పైకి వస్తున్న దానిని చూచి మునిపుంగవులంతా.

మూప్రణేము మునయః సర్వే శౌరిశ్చ ప్రణనామ తం

సస్మితం స్నిగ్ధ నేత్రంచ కృత్వా యుక్తించ సాదరం

స సర్వాంశ్చా శిషం కృత్వా సమువాసచ సంసది

ఉవాచ తాంశ్చ శారించ భగవంతం సనాతనం

సనత్కుమార ఉవాచ –

భద్రం వోమునయశ్శశ్వత్ తపసాం ఫలమీప్సితం

కృష్ణస్య కుశల ప్రశ్నం శినబీజస్య నిష్ఫలం

సాంప్రతంకుశలం వశ్చదర్శనం పరమాత్మనః

భక్తానురోధాద్దేహస్య పరస్యప్రకృతేరపి

నిర్గుణస్య నిరీహస్య సర్వబీజస్యతేజసా

భారావతరణాయైవ చావిర్భూతస్య సాంప్రతం

శ్రీ కృష్ణ ఉవాచ

శరీరధారిణశ్చాపి కుశలప్రశ్నమీప్సితం

తత్కథం కుశల ప్రశ్నం మయి విప్ర నవిద్యతే

సనత్కుమార ఉవాచ

శరీరే ప్రాకృతేనాథ సతతంచ శుభావహం

నిత్యదే హే క్షేమ బీజే శివప్రశ్న మనర్థకం

శ్రీభగవానువాచ:

యోయోవిగ్రహకారీచసచ ప్రాకృతికః స్మృతః

దేహో న విద్యతే విప్ర తాం నిత్యాం ప్రకృతిం వినా

సనత్కుమార ఉవాచ:

రక్తబిందూద్భవాదేహాః తేచ ప్రాకృతికాః స్మృతాః

కథం ప్రకృతినాథస్య బీజస్య ప్రాకృతం వపుః

సర్వబీజస్య సర్వాది: భవాంశ్చ భగవాన్ స్వయం

సర్వేషామవతారాణాం ప్రధానం బీజమవ్యయం

కృత్వావదంతివేదాశ్చ నిత్యం నిత్యం సనాతనం

జ్యోతి స్వరూపం పరమం పరమాత్మాన మీశ్వరం

మాయయా సగుణంచైవ మాయేశం నిర్గుణం పరం

ప్రవదంతిచ వేదాంగాః తథావేద విదః ప్రభో

శ్రీకృష్ణఉవాచ :

సాంప్రతం వాసుదేవోఽహం రక్తవీర్యాశ్రితంవపుః

కధం న ప్రాకృతో విప్రశివప్రశ్నమభీప్సితం

పడు సనత్కుమార ఉవాచ:

వాసు:సర్వ నివాసశ్చ విశ్వానియస్యలోమసు

తస్యదేహః పరంబ్రహ్మ వాసుదేవ ఇతీరితః

వాసుదేవేతి తన్నామ వేదేషుచ చతుర్పుచ

పురాణే ష్వితిహా సేషుయాత్రాదిషుచ దృశ్యతే

రక్త వీర్యాశ్రితోదేహః క్వతే వేదేనిరూపితః

సాక్షిణేమునయశ్చైవ ధర్మః సర్వత్ర ఏవచ సాక్షిణేమమవేదాశ్చ రవిచంద్రౌచ సాంప్రతం

మునులంతా నమస్కరించారు. శారికూడా ఆతనికి నమస్కరించాడు. చిరునవ్వుతో, స్నేహ పూర్వకపు చూపులతో, ఆదర పూర్వకంగా తగిన విధంగా పలకరించాడు. (17) ఆతడు అందరికి ఆశీస్సులను చేసి సభలో కూర్చున్నాడు. వారితో, సనాతనుడైన భగవానుడైన శౌరితో ఇట్లన్నాడు. (18) సనత్కుమారుని వచనమిట్లా - ఓమునులారా ! మీరు క్షేమమేనా! ఎల్లప్పుడు మీ తపస్సుకు తగిన ఫలితం లభిస్తోందా, మంగళకరమైన బీజము గల కృష్ణుని కుశలప్రశ్న వేయుట వ్యర్థము. (19) మీరుకుశలమేనా. పరమాత్మదర్శనమైంది. పరుడైన ప్రకృతికి గూడా భక్తులు అభ్యర్థించటం వలన దేహధారణము కల్గింది. (20) నిర్గుణుడు, నిరీహుడు (నిష్కాము) తన తేజస్సుతో అందరికి బీజభూతుడు. ఇప్పుడు భూభారం తగ్గించే కొరకే అవతరించినవాడు. (21) శ్రీకృష్ణుని వచనమిట్లాశరీరము ధరించినా కుశలప్రశ్న వేయాలి. ఓ విప్రుడ! నన్ను కుశల ప్రశ్న వేయవేమిటి. (22) సనత్కుమారుని వచనమిట్లా - ప్రాకృత శరీరమందును ఎప్పుడూ శుభమే ఉంటుంది, ఓనాథ! నిత్యమైన దేహం విషయంలో, క్షేమమునకు బీజమైన దానికై కుశలప్రశ్న అనర్దకమైనది. (23) భగవంతుడిట్లా- శరీరాన్ని ధరించిన వారంతా ప్రాకృతికులే. నిత్య ప్రకృతి తప్ప దేహంలేదు, ఓవిప్రుడ! (24) సనత్కుమారుడిట్లా- రక్తము, బిందువుల వల్ల కల్గినవి శరీరాలు అవన్నీ ప్రాకృతికములు. ప్రకృతి నాథుడవైన నీకు బీజునకు ప్రాకృత శరీరమెట్లా వస్తుంది. (25) అన్ని బీజములకు అన్నిటికి మొదలు నీవు స్వయంగా భగవానుడవు. అన్ని అవతారములకు ప్రధాన బీజమువు. అవ్యయుడవు. (26) నిన్ను ప్రధానుణ్ణి చేసి వేదములు, నిత్యమైనది, నిత్యమైనది సనాతమైనది అని చెప్తున్నాయి. జ్యోతి: స్వరూపుడవు. పరముడవు పరమాత్మవు, ఈశ్వరుడవు. (27) మాయతో సగుణుడవు, మాయకు ఈశుడవు, నిర్గుణుడవు, పరమైనవాడివి, అని వేదాంగములు, అట్లాగే వేదవిదులు అంటారు ఓ ప్రభు! (28) శ్రీకృష్ణుడిట్లన్నాడు - ఇప్పుడు నేను వాసుదేవుడను. రక్త వీర్యముల నాశ్రయించిన శరీరమిది. ఓ విప్రుడ! ప్రాకృతుడను ఎట్లా కాకుండాపోతాను. క్షేమప్రశ్న అడగవలసినదే. (29) సనత్కుమారుడిట్లన్నాడు - వాసు అనగా అందరికి నివాసము, ఆతని రోమములలో అన్నిలోకములున్నాయి. ఆతని శరీరము పరబ్రహ్మము. అందుకే వాసుదేవుడని పిలువబడ్డాడు. (30) వాసుదేవుడనే పేరు నాలుగు వేదములందు పురాణ ఇతి హాసములందు యాత్రాదులందుకన్పిస్తుంది. (31) రక్త వీర్యాశ్రితమైన నీ దేహము వేదములలో ఎక్కడ చెప్పబడింది. మునులు సాక్షులు. అంతటా ధర్మమే. నాకు వేదములు సూర్యచంద్రులు ఇప్పుడు సాక్షులు.

మూII భృగురువాచ :

సత్యంవదసి విప్రేంద్ర త్వమేవ వైష్ణవాగ్రణీః

స్వాగతం కుశలం శశ్వత్ కిన్నిమిత్తమిహాగతః

సనత్కుమార ఉవాచ :

శ్రూయతాం మునయః సర్వేశ్రూయతాం కృష్ణ సాంప్రతం

అహోయేన నిమిత్తేన చాతిశీఘ్ర మహాగతః

శ్రీకృష్ణ ఉవాచ:

భగవన్ సర్వధర్మజ్ఞకిం నిమిత్తమిహాగతః

సర్వంజానాసి సర్వజ్ఞ త్వమేవవిదుషాంవర

సనత్కుమార ఉవాచ :

ధన్యోఽసి భగవన్ శశ్వత్ మాన్యోఽసి జగనామపి

సర్వేశ్వరేశ్వరోఽసిత్వం త్వత్సరోనాస్తి విశ్వతః

శ్రీకృష్ణ ఉవాచ:

యజ్ఞానాంచ ప్రతనాంచ తపస్యానాం ద్విజేశ్వర

సతతం ఫల దాతాఽహం దక్షిణాభిః స హేతిచ

ఇతిశ్రుత్వా కుమారశ్చ జవేన ప్రయయౌచ తే

మత్వాశ్చర్యంచ వచనం వారయామాస తేఽపి తం

ఋషయ ఊచుః

హే సిద్ధేంద్ర మహాభాగ కుమార కరుణామయ

కా శంకితకథా ప్రోక్తా భగవత్కృష్ణ సన్నిధౌ

కిం పుత్ర దృష్టమాశ్చర్యం వ్రతం కిమపి కుత్రచిత్

అతీవకృత్వావిస్తీర్ణమస్మాకం వక్తుమర్హసి

ఏతస్మిన్నంతరే బ్రహ్మా పార్వత్యాసహశంకరః

అనంతశ్చాపిధర్మశ్చ శ్రీసూర్యశ్చ నిశాకరః

ఆదిత్యావసవోరుద్రా దిక్పాలాద్యాశ్చ దేవతాః

శ్రీకృష్ణం సహసోత్థాయ సంభావ్యచపృథక్ పృథక్

మధుపర్కాదికం దత్వాపూజయామాస భక్తితః

ప్రణేముః ఋషయస్సర్వే శేషం శంభుం విధిం శివాం

పరస్పరంచ సంభాషా బభూవ ద్విజదేవయోః

సమువాసాసనే మధ్యేకుమారః కనక ప్రభః కథాంకథితుమారేభే సంసది ద్విజ దేవయోః

సనత్కుమార ఉవాచ :

మయాగతశ్చ గోలోకో న దృష్టో రాధికాపతిః

తతోగతంచ వైకుంఠం తత్రనాస్తి చతుర్భుజః

తతోగతశ్చక్షీరోదః తత్రనాస్తి హరి: స్వయం

పరిశ్రాంతో విషణ్ణశ్చ స్నాతం క్షీరోదధేస్తటే

విస్తీర్ణ వాలుకామధ్యే కచ్ఛపః శతయోజనః

భీతశకంపితస్తత్ర దృష్టో దుఃఖీచశుషితః

 నిఃసారితో రాఘవేణ మీనేన చ మహాత్మనా

ధన్యోఽసీతి మయోక్తశ్చ నాహం ధన్య ఉవాచ సః

క్షీరోదః సాగరోధన్యః జంతవోయత్ర మద్విధాః

మత్తో మహత్తరాశ్చాపి హ్యసంఖ్యాశ్చ మహామునే

భవాన్ ధన్యోఽసి క్షీరోద తేనోక్తో నాహమేవచ

ధన్యావసుంధరా దేవీయత్రైవ సప్తసాగరాః

ధన్యాసి వసుధేత్యుక్తా నాహ మేవెత్యువాచ సా

ధన్యోఽనంతో మమాధార: కృష్ణాంశో నాగరాడ్విభుః

అను!! భృగువిట్లన్నాడు :

ఓవిప్రేంద్ర! నిజం చెబుతున్నావు. నీవే వైష్ణవులలో అగ్రణివి. స్వాగతము, కుశలమేనా ఎప్పుడూ. ఎందుకొరకు ఇక్కడి కొచ్చావు. (33) సనత్కుమారుడిట్లా - ఓ మునులారా! అంతా వినండి. ఓ కృష్ణ! ఇప్పుడు, విను. ఏకారణంగా చాలా త్వరగా ఇక్కడికి వచ్చానో ఆ కథ విను. (34) కృష్ణుని వచనమిట్లా - ఓ భగవంతుడ! అన్ని ధర్మములు తెలిసినవాడ! ఇక్కడికి ఎందుకొచ్చావు. ఓ సర్వజ్ఞ! అన్ని నీకు తెలుసు. నీవు విద్వాంసులలో శ్రేష్టుడవు. (35) సనత్కుమారుడిట్లా - ఓ భగవన్! ఎప్పుడూ ధన్యుడవు, జగత్తునకంతా మాన్యుడవు కూడా. నీవు సర్వేశ్వర, ఈశ్వరుడవు. విశ్వంలో నీకన్నపరుడు లేడు (36) శ్రీకృష్ణుడిట్లా - ఓ ద్విజశ్రేష్ఠ! యజ్ఞములకు, వ్రతములకు తపస్సులకు ఎప్పుడూ, ఫలమిచ్చేవాడిని నేను . దక్షిణలతో సహా, అని (37) దానిని విని కుమారులు కూడా, వారు వేగంగా వెళ్ళారు. ఈ మాటనువారు ఆశ్చర్యంగా భావించి వారు, ఆతనిని వారించారు. (38) ఋషులిట్లన్నారు - ఓ సిద్దేంద్రుడ! మహాభాగ! కుమార! దయామయ! భగవంతుడైన కృష్ణుని సన్నిధిలో ఏశంకించదగిన కథ (చెప్పదలచారు) చెప్పారు. (39) ఓపుత్ర! ఏదైనా ఆశ్చర్యాన్ని చూచారా, ఎక్కడైనా ఏదైనా విన్నారా. దానిని పెద్దగా చేసి వివరించి మాకు చెప్ప సమర్థుడవు. (40) ఇంతలో బ్రహ్మ పార్వతితో సహా శంకరుడు, అనంతుడు, ధర్ముడు, శ్రీసూర్యుడు, చంద్రుడు, (41) ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు దిక్పాలాదులు దేవతలు వచ్చారు. శ్రీకృష్ణుడు త్వరగా లేచి, విడివిడిగా అందరిని గౌరవించాడు. (42) మధుపర్కాదులు ఇచ్చి భక్తితో పూచించాడు. ఋషులంతా శేషుని, శంభుని, బ్రహ్మను పార్వతిని నమస్కరించారు. (43) ద్విజులకు దేవులకు పరస్పరం సంభాషణ జరిగింది. ఆసనంలో వారిమధ్య కుమారుడు బంగారు కాంతి గలిగిన వాడై కూర్చున్నాడు. ద్విజదేవతలమధ్యకూర్చొని ఆసభలో కథను చెప్పటం ఆరంభించాడు. (44) సనత్కుమారుడిట్లా - నేను గోలోకానికి వెళ్ళాను. అక్కడ రాధికాపతి కన్పించలేదు. అక్కడి నుండి వైకుంఠానికి వెళ్ళాను. అక్కడ ఆచతుర్భుజుడు లేడు. (45) ఆపై పాలసంద్రానికి వెళ్ళాను. అక్కడ హరి స్వయంగా లేడు. అలసిపోయి విచారిస్తూ పాలసంద్రపు ఒడ్డున స్నానం చేశాను. (46) విస్తరించిన ఇసుకమధ్యలో సూరు యోజనముల విస్తారమైన తాబేలు కన్పించింది. భయపడుతూ, వణుకుతూ, దుఃఖిస్తూ, బక్కచిక్కి కన్పించింది. అది (47) మహాత్ముడైన రామునితో మీనంతో తొలగింపబడ్డావు. నీవు ధన్యుడవు అని నేనన్నాను. ఆతడు, నేను ధన్యుణ్ణి కానని అన్నాడు. (48) పాలసముద్రము సాగరము ధన్యము, నాలాంటి జంతువులెన్నో ఉన్నాయి కూడ. నాకంటే పెద్దవి, అసంఖ్యాకంగా ఉన్నాయి. ఓమహాముని! (49) ఓ పాలసముద్రమా! నీవు ధన్యురాలవు అని అనగా అది నాతో అంది. ఈ వసుంధర, దేవి ధన్యురాలు, దీని పైనే గదా ' ఏడు సముద్రాలున్నాయి. (50) ఓవసుధ! నీవు ధన్యురాలవు అని అనగా ఆమె అంది నేనే ధన్యురాలను కాదు, అని నాకు ఆధారమైన అనంతుడు ధన్యుడు. ఆనాగరాటైన విభువు కృష్ణుని అంశ.

మూ సహస్రమూర్ధ్నాం మధ్యేఽహం మూర్ద్నీ శూర్పేచ సర్షపః

ధన్యోఽసిశే షేత్యుత్తోఽయం ధన్యోనాహమువాచవై

ధన్య: కూర్మోమమాధారో గచ్ఛ తత్రైవ వైమునే

ధన్యోఽసికూర్మేత్యుక్తోఽయం నాహం ధన్యోఽస్మి వై మునే

వాయునా ధార్యమాణోఽహం మత్తాధన్యతమశ్చ సః

ధన్యోఽసీత్యుక్తః పవనోధన్యో నాహమువాచ సః ధన్యశ్చ భగవాన్భ్రహ్మా విధాతా జగతమపి

ధన్యోఽసితత్రధాతాచ ధన్యోనాహ మువాచసః

ధన్యోమ హేశ్వరోదేవో యోగీంద్రాణాం గురోర్గురుః

సర్వారాధ్యః సర్వపూజ్యోధర్మరూపః సనాతనః

కాలకాలశ్చసంహర్తా స్వయం మృత్యుంజయః ప్రభుః ధన్యోఽసీ తత్ర శంభుశ్చ ధన్యోనాహమువాచస:

సర్వాధౌపూజనం యస్య జ్ఞానినాంచ గురోర్గురుః

ధన్యోగణేశ్వరీదేవో దేవానాం ప్రవరః పరః

 సిద్ధేంద్రేషు మునీంద్రేషు దేవేంద్రేషు శ్రుతౌశ్రుతం

యోగీంద్రేషుచ ప్రాజ్ఞేషు న గణేశా త్పరః పుమాన్

 నిమ్నగాసు యథా గంగా తీర్ధేషు పుష్కరం యథా

వేదప్రణిహితోధర్మో హ్యధర్మస్తద్వీపర్యయః

వేదోనారాయణః సాక్షాత్ వయంపూజ్యా వ్యవస్థయా

తస్మాచ్చాస్రాణి సర్వాణి పురాణానిచ సంతివై

తస్మాన్నిరూపితో ధర్మశ్చేతిహాసశ్చ సంహితాః

తస్మాద్ధన్యాశ్చ తే వేదావందత్యత్ర మనీషిణః

యూయంధన్యాశ్చమాన్యాశ్చేత్యుక్తా వేదామయా తతః

ఊచుస్తే నవయం ధన్యా యజ్ఞ సంఘశ్చ సాంప్రతం

వయంవ్యవస్థాకర్తారో యజ్ఞౌఘః ఫలదః స్వయం

తస్మాద్ధన్యఃస ఏవాపిగచ్ఛగచ్ఛ మహామునే

ధన్యోఽసియజ్ఞసంఘోఽసీత్యుక్త స్తత్ర మయావిభో

ఊచుస్తే నవయం ధన్యా ధన్యం కర్మశుభంమునే

శుభకర్మాసి ధన్యంత్వం నాహం ధన్యమువాచతత్

కర్మణాంఫలదాతాయః కర్మ హేతుశ్చ సాంప్రతం

ధాతుర్విధాతాభగవాన్ సర్వాది: సర్వకారకః

శ్రీకృష్ణ పరమాత్మా చధన్యోమాన్యశ్చ నిశ్చితం

ధన్యాలయం తతో గత్వా నదృష్ట్వా జగదీశ్వరం

మధురా మాగతం ద్రష్టుం పరిపూర్ణతమం ప్రభుం

యజ్ఞానాంతపసాంచైవ వ్రతానాం శుభకర్మణాం

ఈశ్వరం ఫలదాతారం పరమాత్మానమేవచ

కారణంకారణానాంచ బ్రహ్మాదీనాం పురః సరం

ధన్యోఽసీతి మయోక్తశ్చ దక్షిణాభిః స హేతిచ

ఇత్యుక్తేన భగవతా కథితం సర్వకారణం

దక్షిణాభిశ్చ ఫలదో హతయజ్ఞోహ్య దక్షిణః

దక్షిణావిప్రముద్దిశ్య తత్కాలే తునదీయతే

ఏకరాత్రే వ్యతీతేతు తద్దానంద్విగుణంభవేత్

అను!! చాటలో ఆవగింజంత వేయి తలల మధ్యలో నేను నాగరాజు తలలో ఉండటం, అంది వసుధ. ఓ శేషుడ! నీవు ధన్యుడవనగా, ఆతడు నేను ధన్యుడనుకానన్నాడు. (52) నాకు ఆధారం ఆదికూర్మము.కనుక ఓముని! అక్కడకువెళ్ళు, అని శేషుడన్నాడు. ఓ కూర్మమ! నీవు ధన్యురాలవు అనగా, ఓ ముని! నేను ధన్యురాలనుకాను (53) నన్ను గాలి ధరిస్తోంది. కనుక నాకన్న వాయువు ధన్యతముడన్నాడు. వాయువుతో, నీవు ధన్యుడవనగా, నేను ధన్యుడను కాదన్నాడు. భగవాన్, బ్రహ్మజగత్తులకు విధాత, ఆతడు ధన్యుడన్నాడు. (54) ఓ ధాత! నీవు ధన్యుడవనగా, నేను ధన్యుడను కానన్నాడాయన. మహేశ్వరుడు ధన్యుడు., యోగీంద్రులకు దేవుడు, గురువునకు గురువు. (55) అందరికి ఆరాధ్యుడు, పూజ్యుడు, ధర్మరూపుడు, సనాతనుడు. కాలమునకు కాలము, సంహారకర్త. ఆప్రభువు స్వయంగా మృత్యుంజయుడు ఆతడు ధన్యుడు అనగా, ఓ శంభు! నీవు ధన్యుడవనగానేను ధన్యుడనుకానన్నాడాయన (56) అన్నింటి మొదట ఎవరిని పూజస్తారో జ్ఞానులకు గురువునకు ఎవరు గురువో, దేవతలలో ప్రవరుడెవరో, పరుడెవ్వడో, ఆ గణేశుడు ధన్యుడన్నాడు. (57) సిద్దేంద్రులలో, మునీంద్రులలో, దేవేంద్రులలో, యోగీంద్రులలో, ప్రాజ్ఞులలో, గణేశుని మించినపురుషుడు లేడని శ్రుతులలో విన్నాము (58) క్రిందుగా ప్రవహించే నదులలో గంగ, తీర్థములలో పుష్కరతీర్థము ఎట్లాగో అట్లా, వేదం చెప్పింది ధర్మం. దానికి విరుద్ధమైంది అధర్మం. (59) వేదమనగా సాక్షాన్నారాయణుడే. శాస్త్రం చెప్పిన నియమాన్ననుసరించి (వ్యవస్థ) ఆతని పూజించాలి. ఆవేదముల నుండే శాస్త్రాలు, అన్ని పురాణాలు ఏర్పడ్డాయి. (60) ఆ వేదం నుండే ధర్మం నిరూపించబడింది, ఇతి హాసము, సంహితలు అన్నీను అదుండే. అందువల్ల ఆ వేదములు ధన్యమైనాయి, అని బుద్ధిమంతులంటారు. (61) అప్పుడు నేను వేదములతో, మీరు ధన్యమైనవారు, మాన్యులు అని అన్నాను. మేము ధన్యులము కాము యజ్ఞసంఘములు ధన్యమైనవీ అని అవి అన్నాయి. (62) మేము వ్యవస్థను చేసే వాళ్ళము. యజ్ఞసమూహము స్వయంగా ఫలమిస్తాయి కనుక అవే ధన్యమైనాయి అక్కడికి వెళ్ళు ఓముని! అని అనగా (63) ఓ విభు! నేను వానిదగ్గరకు వెళ్ళి, ఓయజ్ఞసంఘమా! మీరు ధన్యము అని అనగా అవి అన్నాయి, మేము ధన్యులం కాదు. శుభ కర్మ ధన్యమైంది అని అవిఅన్నాయి. (64) శుభకర్మతో, నీవు ధన్యురాలవు అని అనగా, నేను ధన్యురాలను కానంది. కర్మలకు హేతువు, కర్మఫలము నిచ్చేవాడెవో వాడు ధన్యుడు. (65) ధాత కు విధాత, భగవంతుడు, సర్వాది, సర్వకారకుడు, పరమాత్మ శ్రీకృష్ణుడు ధన్యుడు. మాన్యుడు, నిశ్చయము. (66) ధర్మాలయమునకు వెళ్ళి జగదీశ్వరుడు కన్పించకపోతే, పరిపూర్ణతముడైన ప్రభువును చూడటానికి మధురకు వచ్చాను, ఆతడు ఇక్కడికి వచ్చాడు కనుక. (67) యజ్ఞములకు, తపస్సులకు, వ్రతములకు, శుభకర్మలకు ఫలదాత ఈశ్వరుడు (ప్రభువు). పరమాత్మ (68) కారణకారణుడు, బ్రహ్మాదులందరికి మొదటివాడు. అందుకే ధన్యుడవు అని నేనన్నాను, దక్షిణలతో కూడా అని. (69) భగవంతుడన్న దానికి సర్వకారణాన్ని చెప్పాను. యజ్ఞము దక్షిణలతోనే ఫలాన్నిస్తుంది. దక్షిణలేని యజ్ఞం వ్యర్థము. (70) బ్రాహ్మణునకు యజ్ఞంలో అప్పుడేదక్షిణ నివ్వాలి. ఇవ్వకపోతే, ఒకరాత్రి గడిస్తే ఈయవలసిన దానం రెట్టింపౌతుంది. (రెట్టింపు ఇవ్వాలి).

మూ మా సేశతగుణం ప్రోక్తం ద్విమా సేతు సహస్రకం

సంవత్సరే వ్యతీతేతు సదాతా నరకం వ్రజేత్

వర్షాణాంచ సహస్రంచ మూత్రకుండే నిపత్యచ

తత శ్చాండాలతాంయాతి వ్యాధియుక్తశ్చపాతకీ

దాత్రానదీయతే దానం గ్రహీత్రాచేన్న గృహ్యతే

ఉభౌతౌనరకం ప్రాప్తౌ వర్షాణాంచ సహస్రకం

యజమానశ్చ చాండాలో బ్రాహ్మణస్త త్పురోహితః

వ్యాధియుక్తా వుభౌతౌచ పాపినౌ కర్మణః ఫలాత్

సర్వేదేవాశ్చము నయో జహసుః విస్మయం యయుః

విస్మయంచ యయౌ నందః తత్యాజ పుత్రభావకం

రురోదచ సభామధ్యే లజ్జాహీనః శుచాకుల:

త్యజమోహమితీత్యుక్త్వా బోధయామాస పార్వతీ

శ్రీనంద ఉవాచ :

అమ్యూరత్నం మాణిక్యం యథా కుజన్మనోగృహే

స్థితంతేనచ దేవేశ తథాఽహం వంచితః ప్రభో

మమాపరాధం భగవన్ క్షమస్వ ప్రకృతేః పర

యాస్యామి నపునర్గేహం గోకులం యమునాతటం

వృందావనం తథా వాసం క్రీడావాసం గదాగ్రజ

తత్సర్వంచ యశోదాయా గోపికాంతిక మేవచ

కింబ్రవీమి యశోదాంచ ప్రేయసీం రాధికామపి

ప్రేమపాత్రంచ బాలౌఘంవదభో కథయామికిం

ఇత్యుక్త్వాచ సభామధ్యే మూర్ఛాం సంప్రాపనారద

క్రోడేకృత్వా జగన్నాథో బోధయామాస తత్ క్షణం

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే ఉత్తరార్ధ నారాయణ నారద సంవాదే భగవన్నంద సంవాదే సప్తాశీతి తమోఽధ్యాయః

అను నెలగడిస్తే నూరింతలెక్కువౌతుంది. రెండు నెలలకు వేయింత లెక్కువౌతుంది. సంవత్సరానికి ఎక్కువైతే ఆదాత, నరకానికి పోతాడు. (72) వేల సంవత్సరాలు మూత్రకుండంలో ఉండి, ఆ పైన చండాలుడౌతాడు రోగగ్రస్తుడు, పాతకి ఔతాడు. (73) దాత ఇవ్వకపోతే ప్రతిగ్రహీత దానం తీసుకోకపోతే, ఆ ఇద్దరు నరకానికి పోతారు. వేల సంవత్సరాలు అక్కడుంటారు. (74) యజమానుడు చండాలుడౌతాడు, బ్రాహ్మణుడు వాని పురోహితుడౌతాడు. ఇద్దరు రోగగ్రస్తులై, కర్మఫలం వల్ల పాపులౌతారు. (75) దేవతలు, మునులు అంతా నవ్వారు. ఆశ్చర్యపడ్డారు. నందుడు ఆశ్చర్యపడ్డాడు. కొడుకు అనే భావాన్ని విడిచి పెట్టాడు (కృష్ణుని పై) (76) సభామధ్యలో సిగ్గువిడిచి దుఃఖముతో వ్యాకులుడై ఏడ్చినాడు. మోహమును విడిచి పెట్టు అని, పార్వతి అతనికి బోధించసాగింది.నందుడిట్లన్నాడు - కు(నీచ) జన్మగలవాని ఇంట్లో అమూల్య రత్నము, మాణిక్యము ఉన్నట్లు, కృష్ణుడు ఉన్నాడు మా ఇంట్లో ఓ దేవేశ! ప్రభు! నేను వంచింపబడ్డాను. (78) ప్రకృతికీపరమైనవాడ ఓభగవాన్! నా అపరాధాన్ని క్షమించు. తిరిగి ఇంటికి, గోకులానికి, యమునాతటానికి వెళ్ళను. (79) ఓగదాగ్రజ! ఆవాసము వృందావనము. క్రీడకు ఆవాసము. అదంతా యశోదకు, గోపికల సమీపానికి (80) యశోదకు ఏమి చెప్పాలి, ప్రేయసియైన రాధికకు ఏమి చెప్పాలి. ప్రేమపాత్రులైన గోపబాలురకు ఏం చెప్పను. (81) ఇట్లా పలికి సభామధ్యలో నందుడు మూర్చనొందాడు, ఓ నారద! అప్పుడు జగన్నాథుడు, ఆతనినితన వక్షః స్థలమందుంచుకొని బోధించసాగాడు. (82) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధమందు, నారాయణ నారద సంవాదమందు, భగవన్నంద సంవాదమందు ఎనుబది ఏడవ అధాయ్యము.