బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

22 - ధేనుక వధము

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :

ఏకదా రాధికానాధో బలేస సహ బాలకైః

జగామ తత్తాలవనం పరిపక్వ ఫలాన్వితం

వృక్షాణాం రక్షితా దైత్య: ఖర రూపీ చ ధేనుకః

కోటి సింహసమబలో దేవానాం దర్పనాశనః

శరీరం పర్వతసమం కూప తుల్యే చ లోచనే

ఈషాపంక్తి సమాదంతా స్తుండం పర్వతగహ్వరం

 శతమస్త పరిమితా జిహ్వా లోలా భయానకా

కాసార సదృశీనాభి: శబ్దస్తస్య భయానకః

దృష్ట్వా తాలవనం బాలా హర్ష మాపురనింది:

 కౌతుకాత్ కృష్ణ మూచుస్తే స్మేరానన నరోరుహాః

ఒకనాడు రాధానాధుడగు శ్రీకృష్ణుడు బలదేవునితో బాలకులతో బాటు బాగుగా పండిన ఫలములు గల తాళవనమున కేగెను. ఆ వృక్షముల రక్షకుడు ఖర (గాడిద) రూపముననున్న ధేనుకుడను దైత్యుడు. వాడు కోటి సింహముల బలము గలవాడు. దేవతల - దర్పమును నశింపజేయువాడు. పోనీ శరీరము పర్వతమంత, రెండు కన్నులు చేద బావులవలె పోని పలువరుస నాగలి కర్రుల వలే వానీ నోరు పర్వత గుహలె వాని నాలుక నూరు హస్తముల పొడవున భయంకరముగా నుండును, పోనీ నాభి ఒక సరస్సు వలెను వాని శబ్దము భయానకముగాను సుండును, గోపబాలకులా తాభవనమును చూచి చాల సంతసించి ఆసక్తితో నవ్వుచు గోపాల బాలకులు శ్రీకృష్ణునితో నిట్లు పలికిరి.

బాలా ఊచుః - బాలకులు పలికిరి :

హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే

మహాబల బలభ్రాతః నమస్త బలినాం వర

అవధానం కురు విభో క్షణార్థం నో నివేదనే

 క్షుధితానాం శిశూనాం చ భక్తానాం భక్తవత్సల

స్వాదూని సుందరాణ్యేవ పశ్య తాలఫలాని చ

భక్తుం చాలయితుం వృక్షాన్ పాతితుం చ ఫలాని చ

నానావర్ణాని పుష్పావి పక్వాని దుర్లభాని చ

ఆజ్ఞాం కరోషి చేత్కృష్ణ చేష్టాం కర్తుం వయం క్షమాః

ఓ కృష్ణా! దయాసముద్రుడా! దీనులకు బంధూ! జగత్పతీ! ఓ మహాబలశాలీ! బలభద్రుని తమ్ముడా! సమస్త బలవంతులలో శ్రేష్టుడా! ప్రభూ! ఒక సగము క్షణము మా నివేదనను చిత్తగించుము. ఓ భక్తవత్సలా!మేము నీ భక్తులము. పసివారము. ఆకలిగొని ఉన్నవారము. కన్నులకింపుగా నాల్కకు రుచిగా సున్న తాళ ఫలములను చూడుము. ఎన్నెన్ని రంగులలో నున్నవో ఎంత పుష్టిగా పెరిగినవో. ఈ ఫలములింకొక చోట లభించవు. ఆ ఫలములను తినుటకు చెట్ల నూపుటకు-పండ్లు రాల్చుటకు నీ వాజ్ఞ " ఇత్తువేని స్వామీ కృష్ణా! ఆ పనిచేయుటకు మేము సమర్శలమగుదుము.

కిం త్వత్ర దైత్యో బలవాన్ ఖరరూపీ చ ధేనుకః

అజిత స్త్రిదశైన్సర్వైః మహాబల పరాక్రమః

దుర్నివార్యశ్చ నర్వేషాం కంసస్య సచివో మహాన్

హింసకః నర్వజంతూనాం వనానామస్తి రక్షితా

 సువిచార్య జగత్కౌంత వద నో వదతాంవర

యుక్తం కార్యమయుక్తం వా కర్తవ్యమథవా న వా

కాని ఒకమాట. ఖరరూపమున నున్న బలవంతుడైన ధేనుకుడన్న రాక్షసుడు సర్వదేవతల చేత గెలువ శక్యము కానివాడు : మహాబలము పరాక్రమము గలవాడు ఈ వనమునకు రక్షకుడు (యజమాని) వాడు కంసునికి మహామంత్రి. అందరికిని అడ్డుకొనరానివాడు.

సర్వజీవులను హింసించు వాడు. కాబట్టి ఓ జగన్నాథుడా! విచారించి చక్కగా మాట్లాడు స్వామీ! మేము కోరు పనీ యోగ్యమైనదా కాదా చేయదగినదా కాదా చెప్పుము.

బాలానాం వచనం శ్రుత్వా భగవాన్మధునూదనః

ఉవాచ మధురం బాలాన్ వచనం తత్సుఖావహం

గోప బాలకుల వాక్యము విని భగవంతుడును మధురాక్షసనాశకుడు నగు శ్రీకృష్ణుడు వారికి సుఖకారణముగా తీయని మాట పలికెను.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :

కిం వో దైత్యాద్భయం బాలా యూయం మత్సహచారిణః

వృక్షాన్ భంక్త్వా చాలయిత్వా ఫలాని ఖాదతాభయం

ఓ బాలులారా! మీరు నా సహచరులు. మీకు దైత్యుని భయమేల ? చెట్లనూపి విరిచి భయము లేకుండ ఫలములు భుజింపుడు.

శ్రీకృష్ణాజ్ఞాం సమాదాయ బాలకా బలశాలినః

ఉత్పేతుర్వృక్షశిఖరం క్షుధితాశ్చ ఫలార్దినః

నానా ప్రకార వర్ణానీ స్వాదూని సుందరాణి చ

ఫలానీ పాతయామాసు: పరిపక్వాని నారద

కేచోద్బభంజుర్వృక్షాంశ్చ చాలయామానురేవ చ

కేచిత్కోలాహలం చక్రుర్ననృతు స్తత్ర కేచన

ఆవరుహ్య తరుభ్యశ్చ బాలకా బలశాలినః

ఫలాన్యాదాయ గచ్ఛంతో దదృశు ర్దైత్య పుంగవం

నారదా! శ్రీకృష్ణుని ఆజ్ఞను స్వీకరించి బలశాలులైన బాలురు ఆకలిగొని యున్నందున ఫలముల తినగోరుచు చెట్ల చివరల వరకొక్కసారి ఎగిరిపడిరి. సౌనావిధ వర్ణములతో సుందరముగా నున్న రుచిగల పండిన ఫలములను రాలగొట్టిరి. కొందరు చెట్లనూపిరి. మరికొందరు చెట్లనే విరగగొట్టిరి. కొందరు పెద్దగా అలజడి చేసిరి. " మరికొందరు నాట్యము చేసిరి. అట్లు బలశాలులైన బాలురు చెట్లనుండి దిగి ఫలములను గ్రహించి నడచుచుండగా రాక్షస రాజు కన్పించెను.

మహాబలం మహాకాయం ఘోరం గర్దభరూపిణం

ఆగచ్ఛంతం మహావేగాత్కుర్వంత శబ్దముల్బణం

తం దృష్ట్వా రురుదుః సర్వే ఫలానీ తత్యజుర్భియా

కృష్ణకృష్ణేతి శబ్దం చ ప్రచక్రుర్భహధా భృశం

మహా బలవంతుడు గొప్ప శరీరము గలవాడు ఘోరమైన గాడిద రూపము ధరించి మహావేగముగా పరుగెత్తి వచ్చుచు భయంకరముగా ధ్వని చేయుచున్న రాక్షసుని చూచి గోపబాలురందరు భయముతో ఫలములు జారవిడిచి అనేక విధములుగా నేడ్చిరి. కృష్ణా కృష్ణాయని మిక్కిలి గొంతెత్తి పిలిచిరి.

అస్మాన్ రక్ష సమాగచ్ఛ హేకృష్ణ కరుణానిధే

హే సంకర్షణ నో రక్ష ప్రాణా నో యాంతీ దానవాత్

హే కృష్ణ హే కృష్ణ హరే మురారే గోవింద దామోదర దీనబంధో

గోపీశ గో పేశ భవార్ణవేలఽ స్మాననంత నారాయణ రక్ష రక్ష

భయేఽ భయే వాధ శుభేఽశుభే వా సుఖేషు దు:ఖేషు చ దీననాథ

 త్వయా వినాన్యం శరణం భవార్జవే న నోఽస్తీ హే మాధవ రక్ష రక్ష

జయజయ గుణసింధో! కృష్ణభ క్తై క బంధో

బహుతర భయయుక్తాన్ బాలకాన్ రక్ష రక్ష

జహీ దనుజ కులానామీశమస్మాకమంతం సుకుల బలదర్పం వర్ధయేమం నిహత్య

ఓ కృష్ణ! ఓ కరుణానిధీ! రమ్ము మమ్ము రక్షించుము. ఓ బలదేవా! పోనవుని వలన మాప్రాణములు పోవుచున్నవి. మమ్ము రక్షించుము. కృష్ణా! కృష్ణా! హరీ! మురారీ! గోవిందా! దామోదరా! దీనబంధూ! గోపీనాధా గోపాల నాయకా! అనంతా! నారాయణా! నంసార సముద్రమందున నున్న మమ్ము రక్షింపుము రక్షింపుము. స్వామీ! ఈ భవార్డములో (సంసార సాగరము) భయకాలమందు గాని క్షేమకాలమందు గాని శుభకాలమందు అశుభ కాలమందు గాని సుఖములందు గాని దుఃఖములందు గాని ఓ మాధవా! ఓ దీననాధా! మాకు నీవు తప్ప వేరు శరణము లేదు. కాపాడుము. కాపాడుము. ఓ గుణ సముద్రుడా! నీకు జయము జయము. భక్తులకు ముఖ్యమైన బంధూ! కృష్ణా! మిక్కిలి భయముతో నున్న ఈ బొలకులను రక్షింపుము, రక్షింపుము. రాక్షస కులములో బలదర్పములు గలవాడు మాకు యముని వలెనున్న ఈ రాక్షస నాథుని సంహరింపుము. వానిని చంపి మమ్ము వర్ధిల్లజేయుము.

 బాలానం విక్లభం దృష్వా బలేన సహ మాధవః

ఆజగామ శిశుస్థానం భయహా భక్త వత్సలః

భయం నాస్తి భయం నాస్తిత్యుక్త్యా దుద్రావ సత్వరం

ఈషద్ధాస్య ప్రసన్నాస్యో నిర్భయం దత్తవాన్ శిశూన్

భక్తులయందు వాత్సల్యము గలవాడును భయమును నశిపంజేయువాడును అగు మాధవుడు బాలుర ఆక్రందనము (దుఃఖము - మొర) వీని బలరామునితో గూడి ఆ చిన్న పిల్లలున్న చోటికి భయము లేదు, భయపడకుడు అని పలుకుచు త్వరగా పరుగెత్తి వచ్చెను. చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖమండలము గలవాడై ఆ శిశువుల కభయమిచ్చెను.

దృష్ట్వా కృష్ణం బలం బాలా ననృతుర్విజహుర్భయం

 హరిస్కృతి శ్చాభయదా సర్వమంగల దాయికా

బలరామకృష్ణులను చూచి బాలురు భయము వదిలి నృత్యము సల్పిరి. పారిస్మరణము అభయమును సర్వమంగళముల నిచ్చునట్టిది కదా!

శ్రీకృష్ణో దానవం దృష్ట్యా గ్రనంతం పురతః శిశూన్

బలం నంబోధ్య బలినమువాచ మధుసూదనః

తనముందు చిన్నపిల్లలను నోటితో పట్టుకొనుచున్న దానవుని చూచి శ్రీకృష్ణుడు బలవంతుడైన బలరాముని పిలిచి ఇట్లు పలికెను

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :

దానవో బలీపుత్రోఽయం నామ్నా సాహసికో బలీ

గర్దభో బ్రహ్మ శాపేన శప్తో దుర్వాసని పురా

పాపిష్ఠో మన వధ్యోఽయం మహాబల పరాక్రమః

అహామేనం వధిష్యామి త్వం రక్ష బాలకాన్ బల

 ఆదాయ బాలకాన్ నర్వాన్ దూరం గచ్ఛేత్యువాచ హ

“ఓ బలదేవా! వీడు రాక్షసుడు. బలి చక్రవర్తి) పుత్రుడు. గొప్ప బలశాలి. దీని పేరు సాహసికుడు. పూర్వము దూర్వాసముని శపించిన కారణముగా గర్దభరూపి (గాడిద) ఐనాడు. వీడు గొప్ప బల పరాక్రమములు గలవాడు కనుక ఈ పాపి నాచేత మాత్రము చంపబడును, వీనిని నేను చంపుదును. నీవీ గోపాల బాలకులను తీసుకొని దూరముగా పోయి వారిని రక్షింపుము" అని పలికెను.

తాన్గృహీత్వా బలః శీఘ్రం జగామ త్వరయాజ్ఞయా

శ్రీకృష్ణుని ఆజ్ఞతో బలరాముడు వారిని తీసుకొని త్వరగా వెళ్లాను.

దృష్ట్వా కృష్ణం దానవేంద్రో మహాబల పరాక్రమః

జగ్రాస లీలయా కోపాజ్వలదగ్ని శిఖోపమం

బభూవాతి దాహయుక్తో మర్తుకామోఽతి తేజసా

ఊజ్జగ్రాస పునర్తెల్యో విభుం తేజస్వినం భీయా

 ఉజ్ఘితం సంత మీశం చ దృష్ట్వా దైత్యో మమోచ హా

ఆతీవ నుందరం శాంతం జ్వలంతం బ్రహ్మతేజసా

కృష్ణ దర్శనమాత్రేణ బభూవాస్య పురాస్మృతిః

 ఆత్మానం ఋబుధే కృష్ణం జగతాం కారణం పరం

 తేజస్వరూప మీశం తం దృష్ట్వా తుషావ దానవః

యథాగమం యధౌజన్మ గుణాతీతం తేః పరం

గొప్ప బలపరాక్రమములు గల ఆ దానవేంద్రుడు శ్రీకృష్ణుని చూచి కోపము పొంది అగ్నిశిఖవలె నున్న ఆ స్వామిని లీలగా పట్టుకొని నమిలి మ్రింగెను. చావదలచినట్లుగా ఆ కర్మ చేసినవాడు స్వామీ యొక్క గొప్పతేజస్సుతో మిక్కిలి దహించి పోయెను. దానికి భయపడి, వాడు అగ్ని తేజోమూర్తియగు ఆ విభుని మరల వెడలగ్రక్కెను. ఒక్కసారి ఎగిరిపడిన ఆ ఈశ్వరుని ఆ దైత్యుడు వదిలి పెట్టి మిక్కిలి సుందరుడు బ్రహ్మతేజస్సుతో వెలుగుచున్న ఆశాంత స్వరూపుని చూచి - కృష్ణ దర్శన మాత్రము చేత పూర్వ స్మృతి కలిగి - తానెవరో తెలిసికొనెను. జగత్తులకు మూలమైన శ్రేష్ఠుడైన కృష్ణుని తెలిసికొనెను. తేజస్వరూపుడైన ఆ పరమాత్మను చూచి ఆ దానవుడు శాస్త్రానుగుణముగా స్వామి అవతారములకనుగుణముగా వేదములకతీతుడు త్రిగుణములకతీతుడునైన స్వామిని స్తుతించెను.

దానవ ఉవాచ - దాసవుడిట్లు పలికెను :

వామనోఽనీ త్వమంశేన మత్సితుర్యజ్ఞభిక్షుకః

రాజ్యహర్తా చ శ్రీహర్తా నుతల స్థలదాయకః

బలేర్భక్తివశో వీరః సర్వేశో భక్తవత్సలః

శీఘ్రం త్వం హింధి మాం పాపం శాపాద్గర్ధభరూపిణం

మునేర్దుర్వానశ్శాపాదదృశం జన్మకుత్సితం

మృత్యురుక్తశ్చ మునినా త్వత్తో మము జగత్పతే

షోడశారేణ చక్రేణ సుతీక్షేనాతి తేజసా

జహి మాం జగతాం నాథ సద్భక్తిం కురు మోక్షద

 త్వమంశేన వరాహాశ్చ నముద్ధరుం వసుంధరాం

వేదానాం రక్షితా నాధ హిరణ్యాక్ష నిమదనః

 త్వం నృసింహః న్వయం పూర్ణో హిరణ్యకశిపోర్వధే

 ప్రప్రదానుగ్రహారాయ దేవానాం రక్షణాయ చ

త్వం చ వేదోద్ధారకర్తి మీనాంశేన దయానిధే

 నృపస్య జ్ఞాన దానాయ రక్షాయై నురవీప్రయోః

శేషాధారశ్చ కూర్మ స్వయంశేన సృష్టి హేతవే

విశ్వాధారశ్చ విశ్వస్వమంతేనా ఏ సహస్రధృక్

 రామో దాశరధి స్వం చ జానక్యుద్ధార హేతవే

 దశకంధర హంతో చ సింధో సేతు విధాయకః

కలయా పరశురామశ్చ జమదగ్ని సుతో మహాన్

 త్రిస్సప్తకృత్వో భూపానాం నిహంతో జగతీపతే

 అంశేన కపిల స్వం చ సిద్ధానాం చ గురోర్దురుః

మాతృజ్ఞాన ప్రదాతా చ యోగశాస్త్ర విధాయకః

అంశేన జ్ఞానినాం శ్రేష్ఠో నరనారాయణావృషీ

 త్వం చ ధర్మసుతో భూత్వా లోక విస్తారకారకః

అధునా కృష్ణరూపస్వం పరిపూర్ణతమః స్వయం

సర్వేషామవతారాణాం బీజరూపననాతనః

స్వామీ! అన్ని అవతారములకు మూలమైన సనాతనుడవు. ఆ మూర్తీయొక్క ఒక అంశతో వామనావతారమెత్తితివి. నీవు సర్వేశ్వరుడవు. భక్తులయందు వాత్సల్యము గలవాడవు. మాతండ్రి యొక్క యజ్ఞమందు భక్షకుడవై వచ్చి రాజ్యమును సంపదను హరించి వేసి భక్తివశుడైన ఆ వీరునికి (బలి) సుతలమును నివాసస్థానముగా నిచ్చితివి. శాపము వలన గార్ధభ రూపము పొందిన పాపినగు నన్ను త్వరగా సంహరించుము. దుర్వాసముని శాపము వలన నిట్టి నీచ జన్మ వచ్చినది. ఓ జగత్చతీ! ఆ మునీయే నీ వలన నాకు మృత్యువని చెప్పెను. గొప్ప తేజస్సు గల వాడియైన, పదునారంచులు గల చక్రముతో నన్ను సంహరించుము. ఓ జగన్నాథా! మోక్షప్రదాతా నాకు సద్బక్తి కలిగించుము. నీవు భూమీనుద్దరించుటకు ఒక అంశతో ఆదివరాహరూపుడవైతివి. హిరణ్యాక్షుని సంహరించి వేదములను రక్షించితివి. దేవతలను రక్షించుటకొరకు ప్రహ్లాదుని అనుగ్రహించుట కొరకు హిరణ్యకశిపుని వధయందు స్వయముగా పూర్ణాంశతో నీవు నరసింహుడవైతివి. ఓ దయాసముద్రా! నీ అంశారూపమైన మత్స్యావతారముతో వేదములనుద్ధరించితివి. దేవబ్రాహ్మణుల రక్షణ కొరకు వైవస్వతమనువునకు జ్ఞానదానమొనర్చుటకెత్తిన అవతోరమది. నీ అంశయే సృష్టికారణముగా శేషునకాధారముగా ఆదికూర్మమైతివి. సహస్ర బాహువులతో విశ్వమున కాధారమైనది నీవే. ఆ విశ్వము నీవే. దశరధపుత్రుడగు రాముడవు నీవే. జానకిని లంకనుండి ఉద్ధరించి' తెచ్చుటకు గాను దశకంఠుని సంహారమునకు గాను సముద్రము మీద సేతువు నిర్మింపజేసితివీ, ఒక అంశతో జమదగ్ని సుతుడగు పరశురాముడవైతివీ. ఓ జగత్పతీ! అపుడు ఇరువది యొక్క పర్యాయములు దుష్టరాజులను సంహరించితివీ. ఒక అంశతో సిద్ధులలో గురువులకు గురువువై యోగశాస్త్రము రచియించి తల్లియైన దేవహూతికి జ్ఞానదానము చేసితివి. ఒక అంశతో నీవు ధర్మఋషి పుత్రుడవై జ్ఞానులలో శ్రేష్టుడవై నరనారాయణ ఋషుల జంటగా (కవలలు) వెలిసితివి. లోకము విస్తరింపజేసితివి. ఇప్పుడు నీ పరిపూర్ణతమమైన లక్షణముతో స్వయముగా శ్రీకృష్ణ రూపమెత్తితివి (ఆవతారము).

యశోదా జీవనో నిత్యో నందైకానంద వర్ధన:

ప్రాణాధిదేవో గోపీనాం రాధా ప్రాణాధిక ప్రియః

వసుదేవ సుతః శాంతో దేవకీ దుఃఖభంజనః

అయోనిసంభవః శ్రీమాన్ పృథివీ భారహారకః

పూతనాయై మాతృగతీం ప్రదాతా చ కృపానిధిః

బకకేశి ప్రలంబానాం మమోపి మోక్షకారక:

 స్వేచ్ఛామయ!గుణాతీత! భక్తానాం భయభంజన

 ప్రసీద రాధికానాధ ప్రసీద కురు మోక్షణం

హేనాథ గర్ధభీ యోనే: సముద్ధర భవార్ణవాత్

మూర్ఖస్త్వద్భక్త పుత్రోఽహం మాముద్ధర్తుం త్వమర్హసి

వేదా బ్రహ్మాదయో యం చ మునీంద్రాః స్తోతుమక్షమాః

కిం స్తౌమి తం గుణాతీతం వురా దైత్యోఽధునా ఖరః

ఏవం కురు కృపాసింధో యేన మే న భవేజ్జసు:

దృష్ట్యా పాదారవిందం తే కః పునర్భవనం ప్రజేత్

 బ్రహ్మా స్తోత్రా ఖరః స్తోతా నోపహాసితుమర్హసి

నదీశ్వరస్య విజ్ఞాన్య యోగ్యాయోగ్యే నమా కృపా

ఇత్యేవముక్త్యా దైత్యేంద్రనస్థౌ చ పురతో హరేః

 ప్రసన్న వదనః శ్రీమానతితుష్టో బభూవ హ

స్వామీ! యశోదా దేవికి నీవు ప్రాణమవు, నందునికి శ్రేష్టమైన ఆనందము వృద్ధించువాడవు. గోపికల ప్రాణములకధి దేవతవు - (ప్రధానదైవము) రాధాదేవికి ప్రాణములకన్న మిక్కిలి ప్రియమైనవాడవు. వసుదేవ సుతుడవు. శాంతమూర్తివి. దేవకీ దేవి దుఃఖములను నశింపజేసినవాడవు. గర్భవాసము లేని జన్మగలవాడవు. లక్ష్మీవల్లభుడవు. భూభారము తొలగించువాడవు. పూతనకు మాతృదశను ఇచ్చిన దయానిధివి. బకుడు, కేశి, ప్రలంబుడు అను వారికి నాకును మోక్షము కల్గించువాడవు. ఓ స్వేచ్ఛాపూర్ణుడా! త్రిగుణములకతీతుడా! భక్తుల భయము భంజించు నశింపజేయు వాడా! రాధికానాథా! అనుగ్రహించుము. అనుగ్రహించి నన్ను శాపశరీరము నుండి విడిపింపుము.

ఓ నాధా! ఈ గర్దభ (గాడిద) జన్మనుండి - సంసార సముద్రము నుండి నన్నుద్ధరింపుము. నేను మూర్ఖుడను. ఐనను నీ భక్తుని - పుత్రుడను. నన్నుద్ధరించుటకు నీవే సమర్థుడవు కనుక తగుదువు. వేదములు - బ్రహ్మాది దేవతలు - మునీంద్రులు ఎవని స్తుతించుటకు శక్తి. గలవారు కారో అట్టి గుణాతీతుని, మొదట రాక్షసుడను ఇపుడు ఖరమును (గాడిద) అగు నేనెట్లు స్తుతింతును ? ఓ దయాసముద్రుడా! నాకు మరల జన్మలేకుండ అనుగ్రహింపుము. నీ పాద పద్మములను దర్శించి మరల ఎవడు జన్మనెత్తును?! బ్రహ్మ నిన్ను స్తుతించెను. ఈ ఖరుడు స్తుతించెను అని నన్ను అపహాస్యము చేయకు స్వామీ! సర్వజ్ఞుడగు పరమేశ్వరునకు యోగ్యుని యందు అయోగ్యుని యందు కృప సమానముగా నుండును కదా!” ఇట్లు పలికి ఆ రాక్షసుడు శ్రీహరి ముందు నిలచేను. ఆ శ్రీనాధుడు మీక్కిలి సంతోషించి ప్రసన్నమైన ముఖము గలవాడాయెను.

ఇదం దైత్యకృతం స్తోత్రం నిత్యం భక్త్యా చ యః పఠేత్

సాలోక్య సార్షి సామీప్యం లీలయా లభతే హరేః

ఇహ లోకే హరేర్భక్తి మంతే దాస్యం నుదుర్లభం

 విద్యాం శ్రియం సుకవితాo పుత్రపౌత్రాన్ యశో లభేత్

ఖరదైత్యుడొనర్చిన ఈ స్తోత్రమును నిత్యము భక్తితో పఠించిన వ్యక్తి - ఇహలోకమున విద్యను సంపదను మంచి కవితాశక్తిని పుత్రపౌత్రులను కీర్తిని పొంది - హరి భక్తి కలవాడై శరీరము విడిచిన తరువాత మిక్కిలి దుర్లభమైన సాలోక్య సారూప్య సామీప్య ముక్తి దశలతో బాటు అనాయాసముగా శ్రీహరి యొక్క దాస్య ముక్తిని పొందగలును.

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :

శ్రుత్వాఽనుమేనే దైత్యేంద్ర స్తవనం కరుణానిధి:

కధం కరోమి సంహారమీదృశం భక్తమీత్యహో

అనుమన్య స్మృతిం తస్య సంజహార హరిః స్వయం

న హి యుక్తో వధః స్తోతు: దుర్వక్తుర్విధిరీశ్వరాత్

ఆ దయాసముద్రుడు దైత్యేంద్రుని స్తోత్రమును విని (కోరిక తీర్చుటకు) అంగీకరించెను. “ఇటువంటి భక్తుని ఎట్లు సంహరింతును? ప్రభువైనవాడు దుష్టముగా నిందించువానిని వధించవలే తప్ప స్తోత్రము చేయువానినని వధింప దగదు గదా" అనీ తలచిన శ్రీహరి స్వయముగా. వాని స్మృతిని (తనజన్మ భగవంతుని అవతారముల యొక్క జ్ఞానమును) హరించి వేసెను.

దానవో మాయయా విష్ణోః వినస్మార పునః న్వకం

దురుక్తిస్తత్కంఠదేశే హ్యధిష్టానం చకార హ

ఉవాచ శ్రీహరిం దైత్య: కోపాత్ ప్రస్ఫురితాధరః

మునే సద్యో మర్తుకామో దైవ గ్రస్తో విచేతనః

ఆ దానవుడు విష్ణుమాయ తన పై ప్రసరించుట వలన మరల తన దుష్టత్వమును చురుక్తులను నిందావాక్యములను జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతని కంఠములో దుష్టవాక్కులు ఎక్కి కూర్చుండిను. నారదమునీ! వాడు అప్పుడే చావ గోరి దైవము చేత పట్టుబడి తెలివి తప్పి కోపముతో పెదవులు వణకగా శ్రీహరినీ గూర్చి ఇట్లు (నిందావాక్యములు) పలికెను.

దైత్య ఉవాచ - దైత్యుడిట్లు పలికెను :

ధ్రువం త్వం మర్తుకామోఽసి దుర్భుద్ధే మానవార్భక

అద్య ప్రస్థావయిష్యామి త్వామహం యమమందిరం

ఆయాసి జీవనాకాంక్షీ మమ తాలవనం శిశో

వ యాస్యసి పునర్గేహం బాంధవం న హి ద్రక్ష్యసి

న కంసో న జరాసంధో నరకో న సమో మము

దేవాః కంపంతి మే నిత్యం కే చాన్యే మత్సమా భువీ

న హి సంహార కర్తా చ మాం సంహర్తుం క్షమ: శివ:

నచ బ్రహ్మా న విష్ణుశ్చ నమృత్యుః కాల ఏవ చ

 మమ తాలతరూన్ భoక్త్యా పాతయిత్వా ఫలాని చ

అహం కరోషి సహసా కిమహో కస్య తేజసా

కన్యం వద వటో సత్యం కమనీయోఽతి సుందర:

దుర్లభం జీవనం దాతుం మహ్యం కథమహాగతః

ఓ దుర్బుద్ధీ! మానవ బాలకా! నీవు నిజముగా చావగోరుచున్నావు. నేడు నిన్ను యముని మందిరమునకు పంపింతును. ఓ శిశూ! బ్రతుక గోరి నా తాళవనమునకు వచ్చితివా? మరల ఇంటికి పోవు. నీ బంధువులను చూడజాలవు. కంసుడు జరాసంధుడు నరకుడు వీరెవ్వరు నాతో సమానులు కారు. దేవత లెప్పుడును నాకు భయపడి వణికిపోదురు. ఈ భూమి మీద నాకు సాటి మరివ్వరు?

సంహారకర్తయైన రుద్రుడు కూడ నన్ను సంహరింపజాలడు. బ్రహ్మ విష్ణువు మృత్యువు కాలపురుషుడు ఎవ్వడును నన్నేమి చేయజాలడు. నా తాళవనమును భగ్నము చేసి పండ్లు రాలగొట్టి హఠాత్తుగా ఎవని తేజస్సుతో అహంకరించుచున్నాను ఆశ్చర్యము. చిన్నవాడా! నీవెవడవు. సత్యము చెప్పుము. చూచుటకు కోరదగినంతగా మిక్కిలీ అందముగా వున్నావు. దుర్లభమైన జీవితమును నాకిచ్చుటకిచ్చటికెందుకు వచ్చితివి?

ఇత్యుక్త్వా మస్తకీ కృత్వా పేరయిత్వా తు తం బలీ

దూరతః పాతయామాస శ్రీకృష్ణం మరణోన్ముఖః

పాతయిత్వా చ తం భూమౌ విషాణాభ్యాం జఘాన స:

 కృష్ణాంగ స్పర్శ మాత్రేణ తద్వీషాణే బభంజతుః

దైత్యో భగ్న విషాణశ్చ తమీశం కోవయన్మునే

జగ్రాస చర్వణం కర్తుం భగ్నదంతో బభూవ హ

తేజసా దగ్ధవక్త్రశ్చ తముజ్జగ్రాహ తత్క్షణే

జజ్వాల వ్యధీత: కోపాద్దదార ఖురతో మహీం

మూర్జయిత్వా తు లాంగూలం శబ్దం కృత్వా భయానకం

స జగామ శిశుస్థానం దుద్రువుర్భాలకా భీయా

ఇట్లు పలికి బలి మృత్యువుకు ఎదురుగా నడచినట్లు శ్రీకృష్ణుని తన తలమీదికి చేర్చుకొని త్రిప్పి త్రిప్పి దూరముగా పడవే సెను. నేలమీద పడగొట్టి తన కొమ్ములతో కొట్టెను. కృష్ణ శరీరమును తాకగనే వాని కొమ్ములు విరిగిపోయెను. ఓ మునీ! ఆ దైత్యుడు కొమ్ములు విరిగి కూడ స్వామికి కోపము తెప్పించుచు నమిలివేయుటకని దంతములతో పట్టుకొనెను. స్వామి తేజస్సు వలన అతని దంతములు కాలిపోయి వెంటనే విడిచి పెట్టెను. అట్లు చాల బాధపడి కోపముతో మండిపోవుచు వాడు భూమిని డెక్కలతో చీల్చివేసెను. తోకను గిరగిర త్రిప్పుచు భయంకరముగా ఓండ్ర పెట్టుచు వాడు గోపాల బాలురున్న చోటికి పరిగెత్తాను. బాలకులు భయపడి దూరముగా పారిపోయిరి.

బలం చ ప్రేరయామాస మస్తకేన మహాబలీ

బలో ముష్టిం దదౌ తస్మై మూర్ఛామాప తతోఽసురః

మహాబలవంతుడగు ఆ రాక్షసుడు బలదేవుని తన తలపై ఎత్తీ శ్రీప్పెను. బలదేవుని వానిని పిడికిటితో గ్రుద్దెను. అపుడు వాడు మూర్ఛిల్లెను.

క్షణేన చేతనాం ప్రాప్య జగామ హరిసన్నిధీం

బల ముష్ట్యా చ వ్యధితః పునర్మూర్భామవాస నః

పునశ్చ చేతనాం ప్రాప్య సముత్తస్థౌ వ్యధకుల:

ఉత్ససర్జ బృహల్లేండం మూత్రం చ భయమాప హా

క్షణాత్ సంధీక్షణం ప్రాప్య మహాబల పరాక్రమః

కృత్వా శిరసి గోవిందం ఘూర్ణయామాస దానవః

పాతయామాన భూమౌ తం ఘూర్ణయిత్వా వునః పునః

ఉత్పాట్య తాలవృక్షం తం తోడయామాన మాధవః

 యథా ఖడ్గ ప్రహారేణ దానవన్య భవేద్వ్యథా

తథా బభూవ దైత్యస్య తాలవృక్షస్య తాడనాత్

గోవర్ధనం సముత్పాట్య ఘాతయామాస తం విభుః

పపాతవేగాచ్చైలేంద్రస్తస్యోపరి మహామునే

ఒక్క క్షణములో వాడు మూర్ఛ తేరి స్మృతికి వచ్చి శ్రీకృష్ణుని సమీపమునకేగెను. మరల బలదేవుని పిడికిలి పోటుకు వ్యధ చెంది తిరిగి మూర్ఛిల్లెను. మరల తెలివికి వచ్చి బాధతో భయముతో లేచి నిలబడి పెద్ద పెద్ద మలపు ముద్దలు మూత్రము విసర్జించెను. వానికి భయమేర్పడెను. ఒక్క క్షణములో అవకాశము లభించి మహాబలపరాక్రముడగు ఆ రాక్షసుడు శ్రీకృష్ణుని శిరస్సున ధరించి గుండ్రముగా తిప్పేను. మరల మరల అటు త్రిప్పి నేలపై పడవేసెను. మాధవుడు ఒక తాలవృక్షమును పెరికి దానితో దానవుని కొట్టెను. కత్తి దెబ్బలకు ఎంతటి వ్యధకలుగునో అంత బాధ తాడిచెట్టు దెబ్బల వలన ఆ రాక్షసునకు కలిగెను. ఓ మహామునీ! సమర్థుడైన శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును పెకలించి ఆ రాక్షసుని పైకి విసరికొట్టెను. ఆ పర్వతరాజము వేగముగా వచ్చి వాని మీద పడెను.

పర్వతస్య ప్రహారేణ మూర్ఛామావ మహాబలః

బభూవ జర్జరాంగశ్చ రుధిరం చ నముద్వమన్

క్షణేన చేతనాం ప్రాప్య సముత్తస్థౌ రుషాఽనురః

గృహీత్వా పర్వతశ్రేష్ఠం ప్రేరయామాస మాధవం

దృష్ట్వా శైలముత్పతంతం వేగేన మధుసూదనః

 జగ్రాహ దక్షిణ కరే యథేక్షు దండపత్ర్పభుః

పూర్వస్థానే పర్వతం తం స్థాపయామాస కౌతుకాత్

గృహీత్వా దైత్య కర్ణాగ్రం పాతయామాస దూరతః

ఉత్పత్య చ మహావేగాత్ చకార వేష్టనం హరేః

పృథివీం ఘర్షయామాస తీక్ష్ణాశ్రేణ ఖురేణ చ

ప్రగృహ్య శ్రీహరిo వేగాతృత్వా మూర్ద్ని మహాసరః

ఉత్సపాత మనోయాయీ లీలయా లక్షయోజనం

 ప్రహరం చ తయోర్యుద్ధం నిర్లక్ష్యే చ బభూవ హ

తతో గృహీత్వా శ్రీకృష్ణం పపాత ధరణీతలే

పునర్ముహూర్తం యుద్ధం చ బభూవ భూతలే తయోః

 ముదా హరి: ప్రశశంస ప్రహస్య దానవేశ్వరం

మహాబలము గల ఆ రాక్షసుడు పర్వతపు దెబ్బతో అంగములన్నియు శిథిలములై రక్తము క్రక్కుచు మూర్ఛిల్లెను. కొద్ది సేపటికి మరల స్మృతికి వచ్చి అసురుడు లేచి నిలబడి తన మీదికి విసరిన ఆ పర్వతమునే గ్రహించి మాధవుని మీదికి విసిరెను. వేగముగా తన మీదికి ఎగిరి వచ్చుచున్న ఆ పర్వతమును మధుసూదనుడు చూచి చెరకు గడను పట్టుకొన్నట్లు కుడిచేత గ్రహించెను. విలాసముగా దానినీ స్వస్థానమున పాదుకొల్పెను. రాక్షసుని చెవులు పట్టుకొని దూరముగా విసరివేసెను. క్రిందపడిన ఆ దైత్యుడు ఎగిరి వచ్చీ శ్రీకృష్ణుని వేగముగా త్రీ ప్పెను. వాడిన డెక్కలతో భూమిని రాపిడి పెట్టెను. ఆ మహాసురుడు శ్రీకృష్ణుని తన శిరస్సున గ్రహించి నిర్లక్ష్యముగా మనోవేగముతో లక్షయోజనముల ఎత్తు ఎగిరెను. ఆకాశమున ఆ ఉభయులకు ముష్టి యుద్ధము జరిగెను. తరువాత శ్రీకృష్ణుని పట్టుకొని నేలమీద పడెను. మరల భూమి మీద ఆ యిద్దరికి ఒక ముహూర్త కాలముయుద్ధము నడచెను. వాని క్రియకు శ్రీహరి నవ్వి సంతోషముతో వానినిటు ప్రశంసించెను.

ముద్భక్తస్య బలేః పుత్ర ధన్యం త్వజ్జీవనం వరం

స్వస్త్యస్తు తే దానవేంద్ర వత్స నిర్వాణతాం వ్రజ

మద్ధర్శనం స్వస్తిబీజం పరం నిర్వాణ కారణం

సర్వాధికం సర్వపరం లభ స్థానం మనోహరం

ఇత్యేవముక్త్యా శ్రీకృష్ణ: సస్మార చక్రముత్తమం

సూర్యకోటీ సమం దీప్త్యా జగ్రాహ తత్సుదర్శనం

చిక్షేవ భ్రామయిత్వా చ షోడశారమనుత్తమం

లీలయాఽవధ్యం బ్రహ్మవిష్ణు మహేశ్వరైః

 పపాత మస్తకం భూమౌ దానవస్య మహాత్మనః

తేజస్సమూహ ఉత్తస్థౌ శతసూర్య సమప్రభః

విలోక్య హరిలోకం సంశ్లిష్టం కృష్ణపదాంబుజే

సంప్రాప్య పరమం మోక్షమహో దానవ పుంగవః

నా భక్తుడగు బలి యొక్క పుత్రుడా! నీ జీవనము ధన్యము. శ్రేష్ఠము. నాయనో, దానవేంద్రా! నీకు మంగళమగుగాక, మోక్షమును పొందుము. నా దర్శనమే పరమ శుభమునకు బీజము. మోక్షమునకు మూలము. అన్ని స్థానముల కంటే అధికమైన అన్నిటికంటే శ్రేష్ఠమైన మనోహరమైన ముక్తిని పొందుము. అని పలికి శ్రీకృష్ణుడు కోటి సూర్యులతో సమమైన తేజస్సు గల తన ఉత్తమమైన చక్రమును స్మరించెను. ప్రత్యక్షమైన ఆ సుదర్శనమను పదహారు అంచులు గల అత్యుత్తమ చక్రమును గ్రహించి గిరగిర త్రిప్పి విసరివే సెను. బ్రహ్మవిష్ణు మహేశ్వరులచేత గూడి చంపబడకుండ సున్న ఆ రాక్షసుని లీలగా ఆ చక్రము నరికివేసెను. మహానుభావుడైన ఆ దానవుని శిరస్సు నేలమీద పడెను. వంద సూర్యులతో సమానమైన వెలుగుతో ఒక తేజోరాశి పైకెగి సెను. ఓహో! ఆశ్చర్యము. ఆ తేజస్సు శ్రీకృష్ణుని పాదపద్మములలో లీనమయ్యెను. ఆ దానవ శ్రేష్ఠుడు హరిలోకమును దర్శించి పరమమోక్షమును పొందెను.

గగనస్థాః సురాః సర్వే మునయశ్చ భృశం ముదా

పారిజాత ప్రసూనాం చక్రుస్తే తత్ర వర్షిణం

నేదుర్దుందుభయ: స్వర్గే ననృతు శ్చాప్సరోగణాః

జగుర్గంధర్వ నికరాస్తుష్టువుర్మునయో ముదా

సుత్వా జగ్ముః సురా: సర్వే మునయో హర్ష విహ్వలా:

ఆకాశమందున్న దేవతలు మునులు మిక్కిలి సంతోషముతో పారిజాత పుష్పములను అక్కడ వర్షించిరి. స్వర్గములో దుందుభులు మ్రోగెను, అప్సరసలు నాట్యమాడిరి. గంధర్వులు గానమొనర్చిరి. మునులు సంతోషముతో స్తుతించిరి. హర్ష పరవశులైన మునులు దేవతలు అందరు స్తోత్రములొనర్చీ తమ తమ స్థానములకు పోయిరి.

ధేనుకస్య వధం దృష్ట్వా తత్రాజగ్ముశ్చ బాలకాః

బలశ్చ బలిసాం శ్రేష్టన్తుష్టావ పురుషోత్తమం

తుష్టువుర్బాలకాస్సర్వే ననృతుశ్చ ముదాన్వీతాః

దత్త్వా కృష్ణ బలాభ్యాం చ ప్రపక్వాని ఫలాని చ

సర్వాణి భక్షయామానుర్బాలాః ప్రహృష్ట మానసాః

భుక్త్యా పీత్వా హరిః శీఘ్రం బలేన బాలకైన్సహ

జగామ స్వాలయం బ్రహ్మన్నిహత్య దానవేశ్వరం

ధేనుకుని వధను చూచి గోపాల బాలకులక్కడికి చేరవచ్చిరి. బలవంతులలో శ్రేష్ఠుడైన బలదేవుడు పురుషోత్తముని స్తుతించెను. బాలకులందరు ముదముతో స్తోత్రమొనర్చి సాట్యము చేసిరి. బాగుగా పండిన తాళఫలములను బలదేవ కృష్ణులకు సమర్పించి మిక్కిలి హర్షముతో బాలకులాఫలములన్నింటినీ భక్షించిరి. ఇట్లు శ్రీకృష్ణుడు తిని త్రావి బలదేవునితో బాలకులతో కలిసి దానవేశ్వరుని వధించి శీఘ్రముగా తన గృహమునకు చేరబోయెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే ధేనుకవధో సోమ ద్వావింశోఽధ్యాయః.

ఇది బ్రహ్మవైవర్తపురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూషమైన ధేనుక వధ యను ఇరువది రెండవ అధ్యాయము నమాప్తము.