120 - అధ్యాయము

మూII శ్రీనారాయణ ఉవాచ :

అథకృష్ణశ్చ భగవాన్ ఉద్ధవేన బలేనచ ।

దూతం ప్రస్థాపయామాస విధాయ మంత్రిణం శుభం II

శివోగణపతిర్యత్రదుర్గా దుర్గతినాశినీ ।

కార్తికేయో భద్రకాళీ చోగ్రచండాచ కోటరీ ॥

ఆగత్యనత్వాదూతశ్చ గణేశంచ శివం శివాం ।

మానవాంశ్చాపిపూజ్యాంశ్చ సమువాచ యథోతం ॥

దూత ఉవాచ:

బాణమాహ్వయతే కృష్ణః సంగ్రామార్థం మహేశ్వర ।

కింవానిరుద్ధమూషించ గృహీత్వాశరణం వ్రజ ॥

రణేనిమంత్రితో యోహినయాతిభకాతరః ।

పరత్రనరకం యాతి సప్తభిః పితృభిః సహ ॥

దూతస్యవచనం శ్రుత్వాసభామధ్యే యథోచితం ।

ఉవాచపార్వతీదేవీ స్వయం శంకర సన్నిధౌ ॥

పార్వత్యువాచ :

గచ్చబాణమహాభాగ గృహీత్వాతవ కన్యకాం ।

సర్వస్వం యౌ తుకందత్వా శ్రీకృష్ణశరణం వ్రజ ॥

సర్వేషామీశ్వరం బీజం దాతారం సర్వసంపదాం ।

వరంవరేణ్యం శరణం కృపాలుంభక్తవత్సలం ॥

పార్వతీవచనం శ్రుత్వాతమూచుస్తే సురేశ్వరాః ।

ప్రశశంసుః సభామధ్యేధన్యధన్యేతి సర్వదా ॥

కోపావిష్ణశ్చ బాణో యముత్తస్థాసహసాసురః ।

 సాన్నాహికోధనుష్పాణిః ప్రణమ్యశంకరం యణా ॥

సర్వైర్నిషిధ్యమానశ్చ కంపితోరక్తలోచనః ।

సాన్నాహికశ్చ దైత్యానాం త్రికోట్యాచమహాబలః ।

కుభాండ: కూపకర్ణశ్చనికుంభః కుంభ ఏవచ ।

సేనాపతీశ్వరశ్చైతే యయుఃసాన్నాహికా స్తథా ।

ఉన్మత్త భైరవశ్చైవ సంహారభైరవస్తథా ।

అసితాంగో భైరవశ్చ రురుభైరవ ఏవచ ॥

మహాభైరవ సంజ్ఞశ్చ కాలభైరవ ఏవచ ।

ప్రచండ భైరవశ్చైవ క్రోధ భైరవ ఏవచ ॥

 ప్రయయుఃశక్తిభిః సార్థం సర్వేసాన్నిహికాశ్చతే ।

కాలాగ్నిరుద్రీభగవాన్ రుదైః సాన్నాహికోయణా ॥

ఉగ్రచండా ప్రచండాచ చండికా చండినాయికా ।

చండేశ్వరీచ చాముండాచండీచండ కపాలికా ॥

అష్టాచనాయికాః సర్వాః ప్రయయుః ఖర్పరాన్వితాః !

కోటరీరత్నయానస్థా శోణిత గ్రామదేవతా ॥

ప్రయహౌసా ప్రఫుల్లాస్యా ఖడ్గఖర్పర ధారిణీ ।

చంద్రాణీవైష్ణవీ శాంతా బ్రహ్మాజీ బ్రహ్మవాదినీ ॥

కౌమారీనారసింహీచ వారాహీవికటాకృతిః ।

మాహేశ్వరీ మహామాయాభైరవీ భీమరూపిణీ ॥

అష్టాచశక్తయః సర్వారథస్థాప్రయయుర్ముదా ।

రత్నేంద్రసారయానస్థా ప్రయమౌ భద్రకాళికా ॥

శ్రీనారాయణుడిట్లా –  ఇక కృష్ణుడు భగవంతుడు, ఉద్ధవుడు బలరాములతో కలసి, శుభమైన కాలాన్ని చూచి మంత్రిని దూతగా పంపాడు. (1) శివుడు, గణపతి, దుర్గతిని నశింపచేసే దుర్గ, కార్తికేయుడు, భద్రకాళి, ఉగ్రచండ, కోటరి ఉన్న చోటికి దూతను పంపాడు. (2) దూతవచ్చి గణేశుని, శివుని, పార్వతిని,పూజ్యులైన మానవులను నమస్కరించి తగిన విధంగా పలికాడు. (3) దూత ఇట్లా - ఓ మహేశ్వర! యుద్ధముకొరకు కృష్ణుడు బాణుని పిలుస్తున్నాడు. లేదా అనిరుద్ధుడు, ఉష, వీరిద్దరిని ఇచ్చి శరణమైనా పొందాలి. (4) యుద్దంలోకి ఆహ్వానింపబడినవాడు, ఎవడైనా భయపడిపారిపోరాదు. పైన, ఏడు తరాల పితరులతో కలసి నరకానికి వెళ్తాడు. (5) సభమధ్యలో తగిన విధంగా మాట్లాడిన దూతమాటలను విని, శంకరుని ఎదుట పార్వతిదేవిస్వయంగా ఇట్లా అంది. (6) పార్వతి వచనమిట్లా - ఓ బాణుడ! మహాభాగ! కన్యను తీసుకొని వెళ్ళు, చెప్పు. నీకున్నదంతా అరణంగా ఇచ్చి శ్రీకృష్ణుని శరణువేడు (7) అందరికి ఈశ్వరుడు, బీజస్వరూపుడు. అన్ని సంపదలను ఇచ్చేవాడు. కోరతగినవాడు, శ్రేష్ఠుడు, కృఫాలుడు, భక్తవత్సలుడు ఆతనిని శరణువేడు. (8) పార్వతి మాటను విని, ఆదేవశ్రేష్ఠులు అతనితో అన్నారు. ప్రశంసించారు. ఎల్లప్పుడు, ధన్యుడ! ధన్యుడ, అని సభామధ్యలో అన్నారు. (9) కోపావిష్టుడై, ఆ అసురుడు బాణుడు త్వరగా లేచాడు. యుద్ధసన్నద్ధుడై, ధనుస్సుచేత ధరించి, శంకరునకు నమస్కరించి వెళ్ళాడు. (10) అందరూ వద్దంటున్నా వణికిపోతూ (కోపంతో) కళ్ళు ఎర్రబడగా, దైత్యుల సైన్యముతో మూడుకోట్ల మందితో, ఆమహాబలుడు (11) వెళ్ళాడు. కుంభాండుడు, కూపకర్ణుడు, నికుంభుడు, కుంభుడు, సేనాపతి ఈశ్వరుడు, ఈ సైనికులంతా వెళ్ళారు. (ఆయుధధారులు) (12) ఉన్మత్త భైరవుడు, సంహారభైరవుడు, అసితాంగుడు భైరవుడు, రురుభైరవుడు, (13) మహాభైరవుడు, కాలభైరవుడు, ప్రచండభైరవుడు, క్రోధభైరవుడు, (14) వీరంతా శక్తులతో కూడా ఆసాన్నాహికులు వెళ్ళారు (కవచధారులు). భగవాన్ కలాగ్నిరుద్రుడు రుద్రులతో కలిసి, కవచము ధరించి వెళ్ళాడు. (15) ఉగ్రచండ, ప్రచండ, చండిక, చండినాయిక, చండేశ్వరి, చాముండ, చండి, చండకపాలిక (16) ఈ ఎనిమిది మంది నాయికలు అంతా తలకు రక్షణమును(ఖర్పరం తలపుర్రె) ధరించి వెళ్ళారు. శోణిత నగరగ్రామదేవత, కోటరి (పేరు) రత్నముల పల్లకిలో వెళ్లింది. (17) ఆమె వికసించిన ముఖం గలదై ఖడ్గము తలకు రక్షణ కవచము ధరించి వెళ్ళింది. చంద్రాణి, వైష్ణవి, (శాంత), బ్రహ్మాణీ, (బ్రహ్మవాదిని) (18) కౌమారి, నారసింహి, వారాహి, (వికటాకృతి), మాహేశ్వరి, (మహామాయా), భైరవి, (భీమరూపిణి), (19) ఎనిమిది మంది శక్తులు అందరు రథముల పై కూర్చొని, ఆనందంగా వెళ్ళారు. భద్రకాళి, వజ్రములతో చేసిన యానం పై కూర్చొని వెళ్ళింది. (20)

మూII రక్తవర్ణాత్రినయనా జీహ్వాలలనభీషణా ।

శూలశక్తిగదాహస్తా ఖడ్గకర్పరధారిణీ ।

ప్రయయౌశూలహస్తశ్చ వృషభస్థామ హేశ్వరః ।

స్కందశ్చశిఖియానస్థః శస్త్రపాణిర్ధనుర్ధరః ।

ఏవంచ ప్రయయు:సర్వేగణేశం పార్వతీం వినా !

ఏభిర్యుక్తం మహాదేవం దృష్ట్వాచ భద్రకాళికాం ॥

ప్రచక్రేచక్రపాణిశ్చ సంభాషాంచ యథోచితాం ।

బాణః శంఖధ్వనింకృత్వా ప్రణమ్య పార్వతీశ్వరం II

ధనుర్ధధార సగుణం దివ్యాస్తేణ నియోజితం ।

బాణం సముద్యతం దృష్ట్వా సాత్యకి: పరవీరహ ॥

నిషిద్ధ్యమాన స్తైః సర్వైః సన్నాహీ ప్రయహౌముదా ।

బాణశ్చిక్షేప దివ్యాస్త్ర మంజనం నామనారద ॥

అవ్యర్థం గ్రీష్మ మధ్యాహ్న మార్తండాభం సుతీక్షకం ।

దృష్ట్వాస్త్రం సాత్యకి సాక్షాత్కంచిన్నమ్రోబభూవసః ।

కింవానదగ్గః ప్రయణా నభోమధ్యం సుదారుణం ।

 వహ్నించిక్షేపబాణశ్చ సాత్యకిర్వారుణేనచ ॥

ప్రజ్జ్వలంతం తాలమానం నిర్వాణంచ చకారసః ।

చిక్షేపపావనం బాణః ప్రచండం ఘోరముల్బణం ॥

చిచ్ఛేదసాత్యకిశ్చైవ పర్వతాస్రణ లీలయా ।

నారాయణాస్త్రం చిక్షేపబాణశ్చరణమూర్ధని ॥

సాత్యకిః దండవద్భూమౌపపాతార్జున శిక్షయా !

మా హేశ్వరం ప్రచిక్షేపబాణః శస్త్ర విదాంవరః ॥

 సాత్య కిః వైష్ణవాస్రణ ప్రచిచ్ఛేదావలీలయా ।

బ్రహ్మాస్త్రంచాపి చిక్షేపణశ్చరణమూర్ధని ।

క్షణంచకార నిర్వాణంబ్రహ్మాస్తేణచ సాత్యకిః ।

నాగాస్త్రం చాపిచిక్షేప బాణో రణ విశారదః ।

సాత్యకినిగరుడేనైవ సంజహార క్షణేనచ !

జగ్రాహ శూలమవ్యర్థం శంకరస్య సుదారుణం ॥

తుష్టావసాత్యకిర్దుర్గాం గలేమాల్యంబభూవహ ।

 జగ్రాహ ధనుషా బాగోబాణం పాశుపతం తథా ॥

బాణంస బాణం జృంభంచ సాత్యకిశ్చచరహ ।

బాణంతం జృంభితం దృష్ట్వా కార్తికేయో మహాబలః ॥

 అర్ధచంద్రంచ చిక్షేపకాయశ్చిచ్ఛేద లీలయా ।

గదాంచిక్షేపచ స్కందః ప్రాతః సూర్యసమప్రభాం ॥

వైష్ణవాస్రణ కామశ్చ నిర్వాణంచ చకారసః ।

 నారాయణాస్త్రం స్కందశ్చప్రక్షిపచ్చ త్వరాన్వితః ॥

పపాతదండవద్భూమౌ ప్రద్యుమ్నః కృష్ణశిక్షయా ।

స్కందః శక్తించ చిక్షేప ప్రలయాన్ని సమప్రభాం ॥

కామోనారాయణాద్రేణ నిర్వాణంచ చకారతాం ।

 బ్రహ్మాస్త్రంచ ప్రచిక్షేప కార్తికోరణమూర్ధని ॥

అను II భద్రకాళి, ఎర్రని రంగు గలది, మూడు కన్నులు గలది, నాలుక చాచి భయంకరంగా ఉంది. శూలము, శక్తి, గద, వీటిని చేత ధరించింది. ఖడ్గము, తలకు రక్షణ ధరించింది. (21) వృషభము పై కూర్చొని మహేశ్వరుడు, శూలము హస్తమందు దరించి వెళ్ళాడు. స్కందుడునెమలి వాహనం పై చేతిలో శస్త్రము ధనుస్సు ధరించివెళ్ళాడు. (22) ఈరకంగా పార్వతి, గణపతి తప్ప అంతా వెళ్ళారు. వీరితో కూడిన మహాదేవుని, భద్రకాలికను చూచి (23) చక్రపాణి, సమయానికి తగిన సంభాషణ చేశాడు. బాణుడు పార్వతీశ్వరునికి నమస్కరించి శంఖధ్వనిని చేసి, (24) దివ్యాస్త్రముతో ఎక్కు పెట్టిన ధనుస్సును ధరించాడు. వచ్చిన బాణాన్ని చూచి, పరవీరులను సంహరించే సాత్యకి (25) వారు అందరు వారిస్తున్నా సన్నద్ధుడై, ఆనందంగా ముందుకెళ్ళాడు. ఓ నారద! అంజనం అనే బాణున్ని బాణుడు వదిలాడు. (26) అది వ్యర్థముకాదు. గ్రీష్మకాలమందలి మధ్యాహ్న సూర్యునిలా వెలుగుతోంది, చాలా తీక్షమైనది. ఆ అస్త్రాన్ని చూచి సాత్యకి సాక్షాత్తుగా ఆతడు కొద్దిగా తలవంచాడు. (27) అన్నింటిని తగులబెడుతూ, చాలా దారుణంగా అది ఆకాశ మధ్యానికి వెళ్ళింది. బాణుడు ఆగ్నేయాస్త్రం వదలగా సాత్యకి వారుణాస్త్రం వదిలాడు. (28) తాటిచెట్టంత మండుతున్న దానిని అది చల్లార్చింది. వాయుబాణాన్ని బాణుడు వదిలాడు. అది భయంకరంగా చాలా ఘోరంగా ఉంది. (29) పర్వతాస్త్రంతో అవలీలగా సాత్యకి దాన్ని ఛేదించాడు. బాణుడు యుద్ధరంగంలో నారాయణాస్త్రాన్ని వదిలాడు. (30) అర్జునుని మాటతో సాత్యకి కర్రవలె భూమి పై పడిపోయాడు. శస్త్రము లెరిగినవారిలో శ్రేష్టుడు బాణుడు. మహేశ్వరాస్త్రం వదిలాడు. (31) సాత్యకి, అవలీలగా వైష్ణవాస్త్రంతో ఛేదించాడు. బాణుడు యుద్ధభూమిలో బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. (32) సాత్యకి ఆ బ్రహ్మాస్త్రం వల్ల క్షణకాలము చైతన్యం కోల్పోయాడు. రణవిశారదుడైన బాణుడు, నాగాస్త్రాన్ని వదిలాడు. (33) సాత్యకి గరుడాస్త్రంతో క్షణంలో దాన్ని నశింపచేశాడు. చాలా భయంకరమైన వ్యర్థముకాని శంకరుని శూలమును తీసుకున్నాడు. (34) సాత్యకి దుర్గను స్తుతించాడు. అది కంఠంలో మాల ఐంది. బాణుడు ధనుస్సుతో పాశుపత బాణాన్ని తీసుకున్నాడు. (35) బాణముతో కూడిన ఆ బాణుని పై సాత్యకి జృంభకాస్త్రం వేశాడు. బాణుడు ఆవలింత తీస్తుండగా చూచి, కార్తికేయుడు మహాబలుడు (36) అర్ధచంద్ర బాణాన్ని వదిలాడు. మన్మథుడు దానిని అవలీలగా ఛేదించాడు. స్కందుడు గదను వేశాడు. అది ఉదయపు సూర్యుని వలే వెలుగుతోంది. (37) కాముడు వైష్ణవాస్త్రంతో దానిని నశింపచేశాడు. వేగంగా స్కందుడు నారాయణాస్త్రం వేశాడు. (38) కృష్ణుని హెచ్చరికతో ప్రద్యమ్నుడు భూమి పై కర్రవలె పడిపోయాడు. ప్రళయాగ్నితో సమానమైన కాంతిగల శక్తిని స్కందుడు వేశాడు. (39) దానిని నారాయణాస్త్రంతో కాముడునశింపచేశాడు. యుద్ధరంగంలో కార్తికేయుడు బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. (40)

మూII బ్రహ్మాస్తేణాపికామశ్చనిర్వాణంచ చకారసః ।

జగ్రాహకార్తికః కోపాత్ దివ్యం పాశుపతం తథా ॥

నిద్రిస్తేణాపి మదనోనిద్రితంచ చకారతం ।

కార్తికం నిద్రితం దృష్ట్వా బాణంచ జృంభితం తథా ॥

కోపాత్కామంచ సరథం జగ్రాహ భద్రకాళికా ।

క్రోడీకృత్వాచబాణంచ స్కందంచ జగతాంప్రసూః ॥ రణస్థలాచ్చప్రయణాయత్రివపార్వతీసతీ ।

కార్తికం బోధయామాస బాణం సుస్థం చకార సా ॥

సహసాసరథః కామో నాసారంధ్రణ వర్త్మనా ।

బహిర్బభూవ సంత్రస్తః ప్రయణాచ రణ స్థలం ॥

దృష్ట్వాకామంచ సరథం జహసుర్యాదవాస్తదా ।

సర్వేశైవాశ్చతత్రస్థాః శుష్కకంఠాభయాకులాః ॥

అథబాణః పునః కృద్గీరథమారుహ్య కోపతః ।

కార్తికేయశ్చ భగవాన్ యుద్ధాయపునరాగతః ॥

బాణః పంచశరాంశ్చైవ చిక్షేపరణ మూర్ధని !

అర్ధచంద్రోణచిచ్ఛేద బలదేవో మహాబలః ॥

రథం బభంజ బాణస్యలాంగలేనచలాంగలీ ।

జఘనసూతమశ్వాంశ్చ ముసలేనావలీలయా ॥

కుర్వంత ముద్యమంఛత్తుం హలినంచ మహాబలః ।

కాలాగ్ని రుద్రోభగవాన్ వారయామాసలీలయా ॥

రథం కాలాగ్ని రుద్రస్య బభంజ లాంగలీరుషా ।

హలేన సూతమశ్వాంశ్చ జఘాన రణమూర్ధని ॥

కాలాగ్ని రుద్రః కో పేన చిక్షేప జ్వరముల్బణం ।

బభూవుర్యాదవాః సర్వేజ్వరాక్రాంతి హరించినా ॥

తందృష్ట్వా భగవాన్ కృష్ణః ససర్జవైష్ణవం జ్వరం ।

తంచీక్షేప జ్వరంహంతుం మహేశంరణమూర్ధని ॥

 బభూవ జ్వరయోర్యుద్ధం ముహూర్తమతి దారుణం ।

వైష్ణవ జ్వరనియీంతో రణమూర్ద్ని పపాతసః

పరంబభూవ నిశ్చేష్టః తుష్టావమాధవం పునః ॥

జ్వర ఉవాచ :

ప్రాణానక్షజగన్నాథ భక్తానుగ్రహ విగ్రహ ।

త్వమాత్మా పురుషః పూర్ణః సర్వత్ర సమతాతవ ॥

జ్వరస్యవచనం శ్రుత్వా సంజహార స్వకం జ్వరం ।

మా హేశ్వరోజ్వరోభీతో రణాదేవహినిర్యయా ॥

బాణశ్ఛపునరాగత్య బాణానాంచ సహస్రకం ।

చిక్షేపమంత్ర పూతంచ ప్రలయాగ్ని శిఖోపమం ॥

ఫాల్గుణః శరజాలేన వారయామాసలీలయా ।

చిక్షేపశక్తిం బాణశ్చ గ్రీష్మ సూర్య సమప్రభాం ॥

చిచ్ఛేదలీలయతాంచ సవ్యసాచీమహాబలః ।

సజగ్రాహ పాశుపతం శతసూర్యసమప్రభం ॥

అత్యర్థమతిఘోరంచ విశ్వసంహారకారకం ।

తద్దృష్టా చక్రపాణిశ్చ చక్రంచీక్షేప దారుణం ॥

అను II కాముడు బ్రహ్మాస్త్రంతో దానిని చల్లార్చాడు. కోపంతో కార్తికుడు దివ్యమైన పాశుపతాన్ని తీసుకున్నాడు. (41) మదనుడు, నిద్రా స్త్రంతో ఆతనిని నిద్రపోయేట్టు చేశాడు. కార్తికుడు నిద్రించటం చూసి, బాణుడు ఆవలిస్తుండటం చూసి (42) భద్రకాలిక కోపంతో కాముని ఆతని రథంతో పాటు తీసుకెళ్ళింది. బాణుని, స్కందుని ఆజగత్తునుకన్నతల్లితన ఒడిలో పెట్టుకున్నది. (43) యుద్దం నుండి పార్వతి ఉన్నచోటికి వెళ్ళిపోయింది. కార్తికుని లేపింది. బాణుడు స్వస్థుడయ్యేట్టు చేసింది. (44) రథంతోపాటు కాముడు త్వరగా, మక్కు రంధ్రము ద్వారా బయటికి వచ్చి, భయపడి యుద్ధభూమికి వెళ్ళాడు. (45) రథముతో పాటు కాముని చూచి యాదవులంతా నవ్వారు. అక్కడున్న శైవులంతా భయంతో వ్యాకులులైనారు. వారికంఠాలు ఎండిపోయాయి. (46) తిరిగి బాణుడు కోపంతో క్రుద్దుడై రథాన్నెక్కి, భగవాన్ కార్తికేయుడు, యుద్ధానికి తిరిగి వచ్చారు. (47) బాణుడు ఐదు బాణాలను యుద్దరంగంలో వేశాడు. మహాబలుడైన బలరాముడు అర్ధచంద్ర బాణంతో వాటిని ఛేదించాడు. (48) నాగలితో బలరాముడు బాణుని రథాన్ని విరిచాడు. రోకలితో అవలీలగా సూతుని, అశ్వములను చంపాడు. (49) ఛేదించుటకు ఉద్యమిస్తున్న బలరాముని మహాబలుడైన కాలాగ్నిరుద్రుడు, భగవానుడు అవలీలగా వారించాడు. (50) కోపంతో బలరాముడు కాలాగ్ని రుద్రుని రథాన్ని విరిచాడు. యుద్ధరంగంలో నాగలితో సూతుని అశ్వములను చంపాడు. (51) కోపంతో కాలిగ్ని రుద్రుడు అధికమైన జ్వరాన్ని వదిలాడు. యాదవులంతా జ్వరంతో బాధపడసాగారు, హరితప్ప. (52) దానిని చూచి భగవాన్ కృష్ణుడు వైష్ణవమైన జ్వరాన్ని వదిలాడు. యుద్ధంలో మహేశ్వర సంబంధమైన జ్వరాన్ని చంపటానికి వైష్ణవ జ్వరాన్ని వదిలాడు. (53) రెండుజ్వరములకు యుద్ధము ముహూర్తకాలము, అతిదారుణంగా జరిగింది. వైష్ణవ జ్వరం నియ్కీంతమై (రాగా) అది (శివ జ్వరం) యుద్ధరంగంలో పడిపోయింది. కాని నిశ్చేష్టమైంది. తిరిగి మాధవుని స్తుతించింది. (54) జ్వరమీట్లా అంది ఓజగన్నాథ! ప్రాణములను రక్షించు, భక్తులను అనుగ్రహించే కొరకై రూపుదాల్చినవాడ! నీవు ఆత్మ, పూర్ణపురుషుడవు, అంతటా నీవు సమంగా ఉంటావు. (55) జ్వరం మాటను విని తన జ్వరాన్ని ఉపసంహరించాడు. మాహేశ్వరుని, జ్వరము భయపడి, యుద్ధం నుండే వెళ్ళిపోయింది. (56) బాణుడు తిరిగి వచ్చి వేయి బాణాలు మంత్రపూతంగా ప్రళయాగ్నిశిఖలవంటి వాటిని వదిలాడు. (57) ఫాల్గుణుడు, అవలీలగా తన బాణజాలంతో వాటిని వారించాడు. బాణుడు, గ్రీష్మకాలమందలి సూర్యునితో సమానమైన కాంతిగల శక్తిని వదిలాడు. (58) మహాబలుడు సవ్యసాచి దానిని అవలీలగా ఛేదించాడు. ఆతడు (బాణుడు) నూరుసూర్యులతో సమాన కాంతిగల పాశుపతమును తీసుకొని వేశాడు. (59) అది మిక్కిలి ఘోరమైనది. విశ్వసంహారమునకు కారణమైనది. దానిని చూచి చక్రపాణి దారుణమైన చక్రాన్ని వదిలాడు. (60)

మూ॥ హస్తానాంచ సహస్రంచస పాశుపతముల్బణం ।

చిచ్చేదరణ మధ్యేచపపాతాచలసీంహవత్ ॥

శస్త్రం పాశుపతం చైవయమౌ పాశుపతేఃకరం ।

అవ్యర్థం దారుణం లోకేప్రలయాన్ని శిఖోపమం I

బాణరక్తసమూ హేన బభూవచమహానదః ।

 బాణః పపాతనిశ్చేష్ణోవ్యధితో హతచేతనః ॥

తత్రాజగామ భగవాన్ మహాదేవో జగద్గురుః ।

రురోదాగత్యమో హేన బాణం కృత్వాస్వవక్షసి II

శివాశ్రుపతనేనైవ సంబభూవ సరోవరం ।

చేతనం కారయామాస కరుణా సాగరః ప్రభుః ॥

బాణంగృహీత్వా ప్రయణాయత్రదేవోజనార్దనః ।

చక్రపద్మార్చితే పాదపద్మే బాణసమర్పణం ॥

తుష్టావ జగతాంనాథం భక్తేశం చంద్రశేఖరః ।

బలినాచస్తుతం యేనవేదోక్తేనచ తేనచ II

హరిరృత్యుంజయం జ్ఞానందదౌ బాణాయధీయతే ।

కరపద్మం దదౌరాత్రే తం చకారాజరామరం ॥

బాణఃస్తోత్రేణ తుష్టావ భక్త్యాబలికృతేనచ ।

వరాం కన్యాం సమానీయ రత్నభూషణ భూషితాం ॥

ప్రదదౌ హరయే భక్త్యాతత్రేవదేవసంసది ।

గజేంద్రాణాంపంచ లక్షం అశ్వానాంచ చతుర్గుణం ॥

దాసీనాంచ సహస్రంచ రత్నభూషణ భూషితం ।

సహస్రంకామధేనూనాం వత్సయుక్తంచ సర్వదం ॥

మాణిక్యానాంచముక్తానాం రత్ననాంశతలక్షకం ।

మునీంద్రాణాం హీరకాణాం శతలక్షం మనోహరం ॥

జలభాజన పాత్రాణి సువర్ణనిర్మితానిచ ।

సహస్రాణి దదౌతస్మై భక్తినమ్రాత్మకంధరః ॥

వరాణిసూక్ష్మ. వస్త్రాణి వహ్ని శుద్ధాంశుకానిచ ।

దదౌబాణశ్చసర్వాణి స్వభక్త్యా శంకరాజ్ఞయా ॥

తాంబూలానాంచ చూర్ణానాం పూర్ణపాత్రాణి నారద ।

సహస్రాణిదదౌ భక్త్యా వరాణివివిధానిచ ॥

కన్యాం సమర్పయామాస పాదపద్మే హరేరపి ।

రురోదోచ్చైః స్వభక్త్యాచ పరిహారంచకారసః ॥

కృష్ణస్త స్మైవరందత్వా వేదోక్తంచ సుభాక్షితం ।

శంకరానుమతేనైవ ప్రయహౌద్వారకాం పురీం II

గత్వాకన్యాం నవోడాం తాంబాణస్యాపి మహాత్మనః ।

రుక్మిణ్యే ప్రదదౌ శీఘ్రం దేవక్యైచ హరిః స్వయం ॥

మహోత్సవం మంగలంచ కారయామాసయత్నతః ।

బ్రాహ్మణాన్ భోజయామాసబ్రాహ్మణేభ్యోధనం దదౌ ।

ఇతిశ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధే నారాయణ నారద సంవాదే బాణ యుద్ధం నామ వింశత్యధిక శతతమోధ్యా యః ॥

వేయి చేతులను, ఉల్బణమైన పాశుపతమును ఛేదించింది. రణమధ్యంలో బాణుడు కదలని సింహమువలె పడిపోయాడు. (61) పాశుపతశస్త్రము పశుపతికరానికి చేరింది. అదిలోకంలో వ్యర్థముకానిది, దారుణమైనది. లోకంలో ప్రళయాగ్ని శిఖవంటిదది. (62) బాణుని రక్తసమూహంతో పెద్దనదము ఏర్పడింది. బాణుడు నిశ్చేష్టుడైపడ్డాడు, బాధపడ్డాడు. చైతన్యం కోల్పోయాడు. (63) భగవాన్! మహాదేవుడు, జగద్గురువు అక్కడికి వచ్చాడు. వచ్చి బాణుని తనవక్షఃస్థలమందుంచుకొని మోహంతో దుఃఖించాడు. (64) శివుని కన్నీళ్ళుపడగానే సరోవరము ఏర్పడింది. కరుణాసాగరుడు ప్రభువు చేతనునిగా చేశాడు. (65) జనార్దనుడున్నచోటికి బాణుని తీసుకొని వెళ్ళాడు. పద్మఅర్చించిన పాదపద్మములందు బాణుని సమర్పించాడు. (66) చంద్రశేఖరుడు, జగన్నాథుని, భక్తులకు ప్రభువును స్తుతించాడు. బలి స్తుతించిన దానితో, వేదోక్తమైన దానితోను స్తుతించాడు. (67) ధీమంతుడైన బాణునకు హరిమృత్యుంజయ జ్ఞానము నిచ్చాడు. శరీరమందు పద్మములవంటి కరములనిచ్చాడు. అతనిని ఆజరునిగా అమరునిగా చేశాడు. (68) బాణుడు, బలిచేసిన స్తోత్రముతో, భక్తితో స్తుతించాడు. రత్నభూషణములతో అలంకరింపబడిన కోరతగిన కన్యను తెచ్చి (69) ఆ దేవసభయందు హరికి భక్తితో ఇచ్చాడు. ఐదు లక్షల గజేంద్రములను, వానికి నాల్గింతల అశ్వములను (70) రత్నభూషణములతో అలంకరింపబడిన దాసీలను వేయిమందిని, అన్నిటిని ఇచ్చే, దూడలతో కూడినవేయి కామధేనువులను (71) మాణిక్యములు, ముత్యములు, రత్నములు వీటిని నూరు లక్షలు, మణీంద్రములు, వజ్రములు నూరు లక్షలు మనోహరమైనవి (72) నీరు, వంటకు కావలసిన పాత్రలు బంగారముతో చేసినవి వేలకొలది ఇవన్నీ ఆతనికి భక్తితో తనతలను వంచి వినముగా ఇచ్చాడు. (73) కోరతగిన సూక్ష్మ వస్త్రములను. వహ్నితో శుద్దమైన వస్త్రములను బాణుడు, తన భక్తితో శంకరుని ఆజ్ఞతో అన్ని ఇచ్చాడు. (74) ఓ నారద! తాంబూలముల, చూర్ణములతో నిండిన పాత్రలను వేలు, భక్తితో, రకరకాలైనవి శ్రేష్టమైనవి ఇచ్చాడు. (75) హరిపాదపద్మమందు కన్యను సమర్పించాడు. తన భక్తితో గట్టిగా ఏడ్చాడు. ఆతడు పరిహారం చేశాడు. (76) కృష్ణుడు ఆతనికి వేదోక్తమైన మంచిమాటను, వరమును ఇచ్చాడు. శంకరుని అనుమతితో ద్వారకా నగరానికి వెళ్ళాడు. (77) వెళ్ళి కొత్తగా వివాహమైన మహాత్ముడైన బాణుని ఆ కూతురును రుక్మిణికిచ్చాడు త్వరగా దేవకికి హరి స్వయంగా ఇచ్చాడు. (78) ప్రయత్నంగా గొప్ప ఉత్సవాన్ని మంగళకార్యాన్ని చేయించాడు. బ్రాహ్మణులను భుజింపచేశాడు. బ్రాహ్మణులకు ధనమిచ్చాడు. (79)

అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు బాణయుద్ధమనునది నూట ఇరువదవ అధ్యాయము.