నారద ఉవాచ - నారదుడు పలికెను :
త్రిషు మా సేష్వతీతేషు తాసాం చ హరిణా నహ ।
వద కేన ప్రకారేణ బభూవ తనుసంగమః ॥
బృందావనం కిం ప్రకారం కింవిధం రాసమండలం।
హరిరేకస్తాశ్చ బహ్వ్యః కేన క్రీడా బభూవ హ ॥
కుతూహలం భవతి మే ఇదం శ్రోతుం నవం నవం।
కథయస్వ మహాభాగ పుణ్య శ్రవణ కీర్తన॥
కథా పురాణ సారాణాం రాసయాత్రా హరేరహో ।
హరిలీలాః పృధివ్యాం తు సర్వాః ప్రతీమనోహరాః ॥
మూడు మాసములు గడచిన తరువాత ఆ గోపికలకు ఏ ప్రకారముగా శ్రీకృష్ణునితో శరీరసంగమము జరిగెను. బృందావన మెటువంటిది? రాసముండల మెట్టిది? శ్రీకృష్ణుడొకడు. గోపికలు అనేకులు. ఏ విధముగా వారి క్రీడ సాగెను ? దీనిని వినుటకు నాకు క్రొంగొత్త కోరిక ఏర్పడుచున్నది. ఓ మహానుభావా! కథాశ్రవణము నామసంకీర్తనముల వలన పుణ్యము కూర్పు స్వామీ! చెప్పుము. ఆశ్చర్యము. శ్రీహరి యొక్క రాసలీల పురాణ సారమైన కథ. ఈ భూమి మీద శ్రీహరి లీలా విలాసములు అన్నియు ప్రతి వ్యక్తి మనస్సును హరించునవి కదా!
సూత ఉవాచ - సూతుడనేను :
నారదన్య వచః శ్రుత్వా ఋషిర్నారాయణః స్వయం।
ప్రహస్య నుప్రసన్నాస్యః ప్రవక్తుముపచక్రమే ॥
నారదుని మాట విని నారాయణ మహర్షి తానును నవ్వి సుప్రసన్నమైన ముఖముతో చెప్పుటకారంభించెను.
శ్రీ నారాయణ ఉవాచ - నారాయణ ఋషి ఇట్లనెను :
ఏకదా శ్రీహరిర్నక్తం వనం బృందాననం య యౌ ।
శుభే శుక్షత్రయోదశ్యాం పూర్ణే చంద్రోదయే మునే॥
యూధీకామాలతీ కుంద మాధవీ పుష్పవాయునా ।
వాసితం కలనాదేన మధుఖాణాం మనోహరం ॥
నవపల్లవ సంయుక్తం పుంస్కోకిలరుత శ్రుతం।
నవ లక్షరాసవాస సంయుక్తం సుమనోహరం ॥
చందనాగురు కస్తూరీ కుంకుమేన సువాసితం ।
కర్పూరాన్విత తాంబూల భోగద్రవ్య సమన్వితం॥
ప్రసూనైశ్చంపకానాం చ కస్తూరీ చందనాన్వితైః।
రతియోగ్యైర్విరచితైర్నానాతలైః నుశోభితం ॥
దీప్తం రత్న ప్రదీపైశ్చ ధూపేన సురభీకృతం ।
నానా పుష్పైశ్చ రచితం మాలాజాలైర్విరాజితం ॥
పరితో వర్తులాకారం తతైన రాసమండలం ।
చందనాగురు కస్తూరీ కుంకుమేన సుసంస్కృతం ॥
పుష్పోద్యానైః పుష్పితైశ్చ యుక్తం క్రీడాసరోవరైః ।
హంస కారండవాకీర్ణార్ణలకుక్కుట కూజితైః ॥
క్రీడనీయైః సుందరైశ్చ సురతశ్రమపరిభిః ।
శుద్ధస్ఫటిక సంకాశ తోయపూర్ణాః సునిర్మలైః॥
దధిపూర్ణ శుక్ల ధాన్య జలైర్నిరంభనీకృతం ।
రంభాస్తంభ సమూహేన సుందరే సుశోభితం॥
ఆమ్రపల్లవ యుక్తేన సూత్ర బంధేన చారుణా ।
భూషితం మంగళ ఘటైః సిందూర చందనాన్వితైః ॥
మాలతీమాల్య సంయుకైర్నారికేల ఫలాన్వితైః ।
స రాసమండలం దృష్ట్వా జహాన మధుసూదనః॥
ఓ మునీ! ఒకసారి శ్రీకృష్ణుడు శుభమైన చైత్ర శుక్ల త్రయోదశి నాటి రాత్రివేళ నిండుగా చంద్రుడుదయించిన కాలములో బృందావనమునకేగెను. అడవి మొల్ల, జాజి, మొల్ల, బండి గురివింద ఫూలగాలితో పరిమళించుచు తుమ్మెదల యొక్క అవ్యక్త మధురమైన ధ్వనితో ఆ ప్రదేశము మనోహరముగా నుండెను. క్రొత్తగా చిగిర్చిన చిగుళ్లతోను గండుకోకిలల ధ్వనులతోను మనస్సునుహరించెడి తొమ్మిది లక్షల రాసమండలులతో ఆ ప్రదేశమొప్పెను. ఆ గృహములు చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వు అనెడి పరిమళ ద్రవ్యములలో సువాసనలు వ్యాపింపజేయుచు పచ్చ కర్పూరముతో కూడిన తాంబూలములు మొదలైన భోగద్రవ్యములతో కూడి యుండెను. సంపంగి పూలతోను కస్తూరీ చందన ద్రవ్యములతోను శృంగార క్రీడకు తగినట్లు సిద్దపరచిన అనేక శయ్యలతోను చక్కగా శోభించుచుండెను. అగురు ధూపములతో పరిమళించునట్లు రత్నదీపములతో ప్రకాశించునట్లు ఏర్పరుచబడి నానావిధ పుష్పముల మాలలతో విరాజిల్లుచుండెను. అక్కడ రాసక్రీడామండలము అన్ని వైపుల గుండ్రముగా (వలయముగా) నుండి చందసము అగురు కస్తూరీ కుంకుమ పువ్వు చూర్ణములతో అలంకరింపబడెను. అంతట పుష్పించిన ఉద్యానవనములు జలక్రీడ కనుకూలమైన సరోవరములు (సరస్సులు) హంసలతో కన్నె లేళ్లతో నీటికోళ్ల కూజితముల (కూతలు - పలుకులు) తో ఇంపుగా నుండెను. ఆ సరస్సులు చాల సుందరముగా శృంగార క్రీడ యొక్క శ్రమను తొలగించునట్టి నిర్మలమైన జలముతో నిండియుండెను. ఆ నీరు స్పటికమణుల వలె ప్రకాశించుచుండెను. క్రీడకనువుగా నుండెను. పెరుగు కడవలు శుక్షధాన్యము జలము నింపిన కడవలు అరటిబోదెలు అందముగా శోభించు చుండెను. మామిడి చిగుళ్లతో సూత్ర బంధములో సుందరముగా కూర్చబడిన సిందూర చందన లేపములతో మంగళ ఘటములు శోభించుచుండెను. జాజి పూలహారములతో నారికేళ ఫలముతో అవి అలంకరింపబడి ఉండెను. అటువంటి రాసమండలమును చూచి శ్రీకృష్ణుడు నవ్వెను.
చకార తత్ర కుతుకాద్వినోద మురలీరవం ।
గోపీనాం కాముకీనాం చ కామవర్ధన కారణం॥
తద్రుత్వా రాధికా సద్యో ముమోహ మదనాతుర ।
బభూవ స్థాణువదేహా ధ్యానైకతాన మానసా॥
క్షణేన చేతనాం ప్రాప్య పునః శశ్రావ సా ధ్వనిం ।
ఉవాన సా నముత్తణ్ణి సముద్విగ్నా పునః పునః॥
త్యక్త్యా చావశ్యకం కర్మ నీకనసార ద్రుతం గృహాత్ ।
యయా తదనుసారేణ ప్రసమీక్ష్య చతుర్దశం॥
ధ్యాయంతీ చరణాంభోజం శ్రీకృష్ణస్య మహాత్మనః ।
తేజసా చ ద్యోతయంతీ వద్రత్నసార భూషణైః ॥
బహిర్బభూవుస్తాస్రస్తా వరేణ హృత చేతనాః ।
కులధర్మం పరిత్యజ్య నిఃశంకాః కామమోహితాః ॥
త్రయస్త్రింశద్వయస్యాశ్చ తాః సుశీలాదయః స్మృతాః ।
రాధికాయాః ప్రియతమా గోపీనాం ప్రవరా యయుః ॥
తాసాం పశ్చాద్యయుధోవ్యస్తాసాం సంభ్యం నిబోధ మే।
నమా వేషేణ వయసా రూపేణ చ గుణేన చ ॥
ఆ ప్రదేశములో శ్రీకృష్ణుడు తనయందు కాముకులైన గోపికల యొక్క కామమును వృద్ధిపొందించునట్లు వినోదార్ధము ధరించిన మురళీని ఆసక్తితో మ్రోగించెను. ఆ మురళీ గానమును విని రాధాదేవి మదన తాపముతో శరీరము మీద స్మృతి తప్పి శరీరము స్తంభించి ధ్యానమగ్నురాలయ్యెను. క్షణము సేపటికి మరల తెలివికి వచ్చి ఆ ధ్వని మరల ఏనెను. కొంత సేపట్లుండి మరల మరల లేచి నిలబడుచుండగా చిత్తము నిలకడ తప్పెను. అవశ్యముగా చేయవలసిన పనిని గూడ త్యజించి గృహము నుండి వేగముగా బయలు దేరెను. నలువైపుల చూచి ఆ శబ్దము వచ్చు వైపు పోయెను. మహానుభావుడైన శ్రీకృష్ణుని పాదపద్మములను ధ్యానించుచు రత్నాభరణముల తేజముతో అంతటిని ప్రకాశింపజేయుచు పోగా మిగిలిన గోపికలు తమ నాథుడు తమ మనసులను హరించగా కులధర్మము త్యజించి సందేహము వదిలి కామమోహితలై సంభ్రమముతో బయట పడిరి (ఇండ్లు వదిలి పోవుచుండిరి). గోపికలలో శ్రేష్ఠురాండ్రును, రాధాదేవికి మిక్కిలి ప్రియమైన వారును ఐన సుశీల మొదలగు ముప్పది ముగ్గురు వయస్యలు (సఖులు)ను, వారివెనుక వేషము వయస్సు రూపము గుణమును బట్టి వారితో సమానమైన గోపికలును వెళ్లిరి. వారి సంఖ్యను వివరింతును. వినుము.
యయుః సుశీలా నహస్రాణి చ షోడశ ।
యయుః చంద్రముఖి పశ్చాత్సహస్రాణి చ షోడశ ॥
ఏకాదశ సహస్రాణి మాధవ్యాల్యశ్చ నిర్యయుః ।
జగ్ముః కదంబమాలాల్యః సహస్రాణి త్రయోదశ ॥
యయుః కుంతీ వయస్యాశ్చ సహస్రాణి దశ స్కతాః ।
చతుర్ధశ సహస్రాణి యయుస్తా యమునానుగాః ॥
జూహ్నవీ నహచారిణ్యః సహస్రాణి యుయుర్నవ ।
యయుర్నవ సహస్రాణి పద్మముఖ్యాల్య ఏవ చ ॥
సావిత్ర్యాలః పంచదశ సహస్రాణి యుయుర్ధ్వజార్।
పారిజాతా వయస్యాశ్చ సహస్రాణి యుయుర్దశ॥
స్వయంప్రభాసుగానవ సహస్రాణి యుయుర్వజాత్ ।
యయు సుధాముఖీ గోప్యః సహస్రాణి చతుర్ధశ॥
శుభానుగా యుయుధోప్యః సహస్రాణి చతుర్ధశ ।
పద్మానుగా యుయుధోప్యః సహస్రాణి చతుర్ధశ॥
గౌరీపద్మా యుయుర్గాప్యః సహస్రాణి చతుర్దశ।
యయుః సర్వమంగలాల్యః సహస్రాణి చ షోడశ॥
కాలికాల్యో యుయుధోవ్యః సహస్రాణి చ షోడశ ।
నీర్యయుః కమలాల్యశ్చ సహస్రాణి త్రయోదశ ॥
దుర్గానుగా యుయుధోప్యః సహస్రాణి చ షోడశ ।
యయు: సరస్వతీ వశ్చాత్సహస్రాడి త్రయోదశ॥
ప్రజగ్ముర్భారతీ పశ్చాత్సహస్రాణి దశ ప్రజాత్ ।
అపర్ణా నహచారిణ్యః సహస్రాటి చతుర్ధశ ॥
రతిపశ్చాద్వయస్యాశ్చ సహస్రాణి యుయుర్దశ ।
గంగే వయస్యాః ప్రయయుః సహస్రాణీ చతుర్ధశ॥
ప్రజగ్మురంబికా పశ్చాత్సహస్రాణి త్రయోదశ ।
సతీ పశ్చాద్యయుధోప్యః సహస్రాణి త్రయోదశ॥
సందినీ నహచారిణ్యః సహస్రాణి యుయుర్ధశ ।
ప్రయయుః సుందరీ వశ్చాత్సహస్రాణి త్రయోదశ॥
యయుః కృష్ణప్రియా వశ్చాత్సహస్రాణి చ షోడశ ।
యయుర్మధుమతీ పశ్చాత్సహస్రాణి చ షోడశ ॥
యయుశ్చంపానుగా గోప్యః సహస్రాణి త్రయోదశ।
చందనాల్యో యయుః పశ్చాత్సహస్రాణి చ షోడశ॥
ఆ రేపల్లె నుండి (జము) సుశీల ననుసరించి 16 వేలమంది గోపికలు, చంద్రముఖి వెనుక 16 వేలమంది గోపికలు, మాధవి చెలులు 11 వేలమంది, కదంబమాల చెలులు 13 వేలు, కుంతి సఖురాండ్రు 16 వేలమంది, యమున ననుసరించిన 14 వేలమంది, జాహ్నవి సహచారిణులు తొమ్మిది వేల మంది, పద్మముఖీ చెలికత్తెలు తొమ్మిది వేలమంది, సావిత్రి సఖురాండ్రు 15 వేలమంది, పారిజాత వయస్యలు 10 వేలమంది, స్వయంప్రభననుసరించినవారు 7 వేలమంది, సుధాముఖికి చెందిన గోపికలు 14 వేలమంది, శుభ చెలికత్తెలు 14 వేలమంది, పద్మననుసరించిన గోపికలు 14 వేలమంది, గౌరీనాయిక పాదములే లక్ష్మిగా భావించు గోపికలు. 14 వేలమంది, సర్వమంగల చెలులు 16 వేలు, కాలిక చెలికత్తెలు 16 వేలు, కమల సఖురాండ్రు 13 వేలమంది, భారతి వెనుక 10 వేలమంది, అపర్ణ సహచారిణులు 14 వేలమంది, రతీ వయస్యలు 10 వేలమంది, గంగ చెలికత్తెలు 14 వేలమంది, అంబిక వేనుక 16 వేలమందీ, సతి 3 వేలమంది గోపికలు, నందిని సహచారిణులు 10 వేలమంది, సుందరి వెనుక 13 వేలమంది, కృష్ణప్రియ వెనుక 16 వేలమంది, మధుమ వెనుక 16 వేలమందీ, చంప ననుసరించి నడచు గోపికలు 13 వేలనుందీ, చందన చెలులు 16 వేలమంది (ఇట్లు 33 రాధాదేవి సఖులు తమ తమ చెలులతో) రాధాదేవి పోయిన మార్గమున పోయిరి.
సర్వా బభూవుకత్ర తత్ర తస్థుః పలం ముదా ।
తత్రాయయుర్గోపికాశ్చ మాలాహస్తాశ్చ కాశ్చన ॥
చారు చందన హస్తాశ్చ కాశ్చితత్రాయుర్ధ్వజాత్ ।
శ్వేత చామర హస్తాశ్చ కాశ్చిత్తత్రాయయుర్ముదా॥
తత్రాయదుర్గోవ కన్యాః కాశ్చిత్కస్తూరీకాకరా! ।
తయయురోపకన్యాః కశ్చిత్కుంకుమ వాహికాః ॥
కొశ్చిత్తత్రాయయురోప్యస్తాంబూలపాత్ర వాహికాః ।
యాప్కంచన వస్త్రాణాం వాహికా గోవకన్యకాః॥
కాశ్చిత్తత్రాయయుః శీఘ్రం యత్ర చంద్రావతీ ముదా ॥
సర్వాత్ర సంభూయ సస్మితాశ్చ ముదాన్వితాః ।
విధాయ రాధికావేషం స్థానాచ్చ ప్రయయుర్ముదా॥
వారందరొక చోటచేరి సంతోషముతో కొద్ది సేపక్కడ నిలిచిరి. అక్కడికి కొందరు గోపికలు పూలదండలు చేతబట్టుకొని మరికొందరు సుందరమైన చందన పాత్రలు చేత బట్టుకొని ప్రజము నుండి అక్కడికి చేరవచ్చిరి. శ్వేతచామరములు పట్టుకొనికొందరు, కస్తూరి పాత్రలను పట్టుకొని మరికొందరు, కుంకుమ పువ్వుపొడి పాత్రలను పట్టుకొని ఇంక కొందరు తాంబూల పాత్రలు ధరించి మరికొందరు గోపికలు అక్కడికి చేరవచ్చిరి. కొందరు గోపకన్యలు కాంచన వస్త్రముల మూటలు మోసుకొని అక్కడికి వచ్చిరి. వారందరు వెన్నెల బయటకు చేరవచ్చిరి. వారందరొక చోట చేరి చిరునవ్వుతో ఆనందముతో రాధాదేవి వలె అలంకరించుకొని ఆ స్థానము నుండి సంతోషముతో ముందుకు పోయిరి.
చక్రు పునః పునస్తాశ్చ హరిశబ్ద జపం వధి ।
ప్రాపుర్భందావనం రమ్యం దదృశారాసమండలం ॥
స్వర్ణేభ్యః సుందరం దృశ్యం రాకావతి కరాన్వితం ।
మవిర్జనం కుసుమితం వాసితం పుష్పవాయునా ॥
నారీణాం కామ జననం ముని మోహన కారణం ।
శుశ్రువుస్తత్ర తాః సర్వాః పుంస్కోకిల కలధ్వవిం ॥
అతి సూక్ష్మకలం చాతీభ్రమరాణాం మనోహరం।
ప్రసూన మధుమర్తానాం భ్రమరీసంగ సంగినాం॥
వారందరు మార్గములో మాటి మాటికీ హరి శబ్దమును జపించుచు రమ్యమైన బృందావనమును చేరిరి. స్వర్గసీమల కంటే సుందరమైన దృశ్యములు గలదియు, పున్నమి చంద్రుని కిరణములతో (వెన్నెల కాంతి) కూడినదియు, జనరహితమును, పుష్పించిన వృక్షములు గలదియు, పూలగాలితో పరిమళించునదియు ఐన రాసమండలమును దర్శించిరి. అక్కడ ఆ గోపికలందరును మునులకు వ్యామోహము కల్గించునదియు, స్త్రీలకు కామము పుట్టించునదియు ఐన గండు కోకిల యొక్క అవ్యక్త మధుర ధ్వనిని వినీరి. పూలయందలి తేనె త్రాగి మత్తుగొన్న ఆడ తుమ్మెదల సంగము నందు చిక్కుకొన్న గండు తుమ్మెదల యొక్క మనోహరమును అతి సూక్ష్మ మధురమైన ధ్వనిని కూడ వినిరి.
శుభే క్షణే ప్రవివేశ రాధికా రాసమండలం।
సర్వాభిరాలిభిస్సార్థం ధ్యాత్వా కృష్ణ పదాంబుజం॥
రాధాదేవి శుభముహూర్తములో మొత్తము చెలులతో బాటు శ్రీకృష్ణ పాదపద్మములను ధ్యానించుచు రాసమండలమును ప్రవేశించెను.
రాధామారాత్త సంవీక్ష్య కృష్ణస్తత్ర ము దాన్వితః ।
జగామాసువ్రజప్రీత్యా సస్మీతో మదనాతురః ॥
మధ్యస్థాం నఖి సంఘానాం రత్నాలంకార భూషితాం।
దివ్యవస్త్ర పరీధానాం సస్మితాం వక్రలోచనాం ॥
గజేంద్ర గామినీం రమ్యాం ముని మానస మోహినీం ।
నవీన వేష పయసా రూపేణాతీ మనోహరాం॥
తలశ్రేజీ నితంబానాం భాదశేషాన్వితాం వరాం ।
చారుచంపక వర్ణాభాం శరచ్చంద్ర నిభాననాం॥
బిభ్రతీం కబరీ భారం మాలతీ మాల్య సంయుతం ॥
తన సఖురాండ్ర నడుమునున్నదియు, రత్నాలంకార భూషితురాలును, దివ్య వస్త్రములను ధరించినదియు, చిరునవ్వు క్రీగంటి చూపులు గలదియు, గజరాజు వంటి గమనముతో సుందరముగా ముని జనుల మనస్సునే మోహింపజేయునదియు, క్రొత్త క్రొత్తగా కన్పించు వేషము వయస్సు రూపములతో తనకు మిక్కిలి మనోహరురాలునగు రాధాదేవినీ దూరమునుండియే శ్రీకృష్ణుడు చూచి మదనుని చేత బాధితుడై సంతోషానురాగములు-చిరునవ్వుతో ఎదురుగా పోయి అక్కడికి చేరెను. వక్షః స్థలము - నడుము క్రింది భాగముల యొక్క భారముతో అందమైన సంపంగి పూవు వన్నె గల శరీరముతో శరత్కాల చంద్రుని వంటి ముఖ మండలముతో, జాజిపూలదండలు ధరించిన పెద్ద కొప్పులో ఆ దేవి శ్రేష్ఠురాలుగా నుండెను.
రాధా దదర్శ శ్రీకృష్ణం కిశోరం శ్యామ సుందరం ।
నవ యావన సంపన్నం రత్నాభరణ భూషితం॥
కందర్ప కోటి లావణ్య లీలాధామ మనోహరం ।
ప్రాణాధికాం తాం పశ్యంతీం పశ్యంతీం వక్రచక్షుషా॥
పరమాద్భుత రూపం చ సర్వత్రానుపమం పరం ।
విచిత్రవేషం చూడాం చ బీభ్రతం నస్మితం ముదా ॥
వక్రలోచన కోణేన దర్శం దర్శం పునః పునః ।
ముఖమాచ్చాదయాంచకే ప్రీడయాం సస్మితా సతీ ॥
మూర్ఛమువాద సా సద్యః కామబాణ ప్రపీడితా ।
వులకొంచీత సర్వాంగీ బభూవ హత చేతనా॥
బౌలరూపమున నుండియు నవ యావన సంపద గలవాడును శ్యామ (నల్లని) వర్ణముతో సుందరముగా నున్నవాడును, రత్నాలంకారములు ధరించినవాడును, కోటి మన్మథుల లావణ్య (శరీర కాంతి) విలాసములకు స్థానమైనవాడును మిక్కిలి అద్భుతమైన రూపముతో పోలికలేనంతగా మనోహరుడును విచిత్రాలంకారములు గలిగి కొండె కొప్పు ధరించిన వాడును చిరునవ్వు చిందించుచున్న శ్రీకృష్ణుని రాధ దర్శించెను. తనను క్రీగంటి వాలు చూపులో చూచుచున్న ప్రాణాధికయగు ప్రియురాలిని అతడును చూచెను. ఆ సాధ్వి కనుచివరల నుండి వ్యాపించు ప్రక్క చూపులతో మరల మరల చూచి చిరునవ్వు సిగ్గులతో ముఖమును (పైట కొంగుతో) కప్పుకొనెను. శరీరావయములన్నియు పులకలెత్తగా కామ బాణ పీడితురాలై చైతన్యము దెబ్బతిని వెంటనే ఆమె మూర్ఛిల్లెను.
కటాక్షరామ బాణేశ్చ విధః క్రీడా రసోన్ముఖః।
మూర్చాం ప్రావ్య న వపాత తస్థౌ స్థాణు సమో హరిః ॥
పపాత మురలీ తస్య క్రీడా కమలముజ్వలం।
ద్వితీయం పీతవస్త్రం చ శిఖిపింఛం శరీరతః ॥
క్షణేన చేతనాం ప్రాప్య యయౌ రాధాంతికం ముదా।
కృత్వా వక్షసి తాం ప్రీత్యా సమాశ్లిష్య చుచుంబ నః॥
ఆమె కటాక్షములనెడి మన్మధ బాణముల చేత కొట్టబడిన వాడైన శ్రీకృష్ణుడు శృంగార క్రీడారసమున పేక్షించి మూర్ఛాగ్రస్తుడయ్యెను. నేలమీద పడిపోక ఒక స్తంభము వలె కదలిక లేక) నిలిచిపోయెను. అతని చేతినుండి మురళీ, విలాసముగా ధరించిన కమలము జారి పడెను. పైన ధరించిన రెండవ పచ్చని వస్త్రము (ఉత్తరీయము) నెమలి పింఛము కూడ శరీరము నుండి జారిపడినవి. క్షణములో చైతన్యము పొంది కృష్ణుడు సంతోషముతో రాధ వద్దకేగి ప్రేమతో ఆమెను వక్షఃస్థలమున చేర్చుకొని బిగ్గరగా ఆలింగనము చేసికొని ముద్దు పెట్టుకొనెను.
శ్రీకృష్ణ స్పర్శ మాత్రేణ సంప్రావ్య చేతనాం సతీ ।
ప్రాణాధికం ప్రాణనాధం సమాశ్లిష్య చుచుంబ హ ॥
శ్రీకృష్ణుడు తనను స్పృశించినంతలోనే రాధ చైతన్యము పొంది ప్రాణాధికుడైన ప్రాణనాధుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను.
మనో జహార రాధాయాం కృష్ణ స్తస్య చ సా మునే ।
జగామ రాధయా సార్థం రసికో రతీమందిరం ॥
రత్న ప్రదీప సంయుక్తం రత్న దర్పణ సంయుతం।
చారు చంపక శయ్యాభీశ్చందనాక్తాభి రాజితం ॥
కర్పూరాన్విత తాంబూలైర్భోగ ద్రవ్యై స్పమవ్వితం ।
ఉవాస రాధయా సార్ధం కృష్ణ సత్ర ముదాన్వితః ॥
ఓ మునీ! శ్రీకృష్ణుడు రాధ మనస్సును రాధ అతని మనస్సును హరించెను. ఆ రసికుడు రాధతో రతిగృహమున కేగెను. ఆ శయ్యామందిరము రత్నదీపములతో రత్నాల దర్పణములతో చందనములో ముంచిన సుందరమైన సంపంగి పూలు పరచిన శయ్యలతో కర్పూరముతో గూడిన తాంబూలము మొదలగు భోగద్రవ్యములతో కూడియుండెను. అక్కడ కృష్ణుడు రాధతో గూడి సంతోషముతో నివసించెను.
రాధయా దత్త తాంబూలం చఖాద మధుసూదనః ।
రాసేశ్వరీ కృష్ణదత్తం తాంబూలం బుభుజే ముదా ॥
దత్తం చర్విత జాంబూలం రాధాయే ప్రభుణా ముదా ।
చఖాద భక్త్యా సాతూర్ణం ప్రహస్య మదనాతురా ॥
రాధా చర్విత తాంబూలం యయాచే మాధవో ముదా।
న దదౌ రాధికా భీతా వపాత చరణాంబుజే ॥
రాధ యిచ్చిన తాంబూలమును ఆ మధుసూదనుడు నమిలెను. కృష్ణుడొసగిన తాంబూలమును ఆ రాసేశ్వరి ముదముతో తినెను. కొంత నమిలీన తాంబూలమును ప్రభువు స్వామి) రాధ కీయగా మన్మధ పీడితురాలైన ఆమె నవ్వి వెంటనే దానిని గ్రహించి నమీలేను. అప్పుడు మాధవుడు ముదముతో రాధ నమిలిన తాంబూలమును తనకిమ్మని అడిగెను. అది విని భయపడిన రాధ తాంబూలమీయక అతని పాద పద్మములపై పడెను.
ఎతస్మిన్నంతరే తత్ర సకామాః సురతోన్ముఖః ।
సుష్వాష రాధయ సార్ధం రతీతల్పే మనోహరే ॥
శృంగారాష్ట్ర ప్రకారం చ విపరీతోదికం విభుః ।
నఖదంత కరాణాం చ ప్రహారం చ యథోచితం॥
కామ శాస్త్రేషు యధ్గోప్యం చుంబనాష్టవిధం పరం ।
రామినీనాం మనోహారి చకార రసికేశ్వరః ॥
అంగైరంగాని ప్రత్యంగైః ప్రత్యంగాని స్మరాతుర: ।
చకారాశ్లేషణం తత్ర కాముకీనాం నుఖావహం ॥
శృంగార కుశలౌ తౌ తు కామశాస్త్ర నుపండితౌ ।
రతీయుద్ధ వీరామశ్చ న బభూవ ద్వయోరపి ॥
ఇంతలో కోరిక గల హరి సుఖాసక్తి గలవాడై మనోహరమైన ఆ శృంగార శయ్య మీద రాధతో గలిసి శయనించెను. ఆ రసిక శేఖరుడు కాముకురాండ్రైన స్త్రీలకు మనస్సున కింపగునట్ను కామశాస్త్రమందు రహస్యముగా నున్న అష్టవిధ శృంగారమును అష్ట విధ చుంబనములను నఖదంతకర ప్రహారములను ఆయా కాలస్థాన దశలకు తగినట్లు ఆచరించెను. ఆ మన్మధ బాధితుడు కాముకీ జనమునకు ను:ఖము కల్గునట్లు తన అంగ ప్రత్యంగములతో ఆమె అంగ ప్రత్యంగములను కౌగిలించుకొనెను. కామశాస్త్ర పండితులును శృంగార క్రియలందు నేర్సు గల ఆ ఉభయులకు విరామము లేకుండ ఆ క్రీడ సాగెను .
ఏవం గృహే గృహే రమ్యే నానామూర్తిం విధాయ చ ।
రేమే గోపాంగనాభిశ్చ సురమ్యే రాసమండలే ॥
ఈ విధముగా మిక్కిలి మనోహరముగా నున్న ఆ రాసమండలములో సుందరమైన ప్రతి గృహములోను స్వోమి అనేక విధముల రూపములను ధరించి గోపాంగనలతో రమించెను.
గోపీనాం నవలక్షాణి గోపానాం చ తథైవ చ ।
లక్షాణ్యష్టాదశ మునే యుక్తానీ రాసమండలే ॥
ముక్తకేశాని నగ్నాని విచ్ఛన్న భూషణాని చ ।
వేషోచ్చిన్నానీ మత్తానీ మూర్ఛితానీ న్మరేణ చ ॥
కంకణానాం కింకిణీనాం వలయానాం చ నారద ।
నద్రత్న నూపురాణాం చ శబ్ధయుక్తానీ సంతతం॥
ఏవం కృత్వా స్థలక్రీడాం మయుస్తాని జలం ముదే ।
కృత్వా తత్ర జలక్రీడాం పరిశ్రాంతాని సాంప్రతం ॥
ఓ మునీ! ఆ రాసమండలములో తొమ్మిది లక్షలమంది గోపికలు పదునెనిమిది లక్షల మంది గోపాకులు అందరును తల వెండ్రుకల ముడులు ఊడిపోయి భూషణములు తెగిపోయి ధరించిన వేషములు (అలంకారములు) చెదిరిపోయి మన్మధావేశముతో మత్తెక్కి నగ్నరూపములతో మూర్ఛిల్లిరి. కాళ్లఅందేలు చేతుల గాజులు దండకడియములు రత్నాల (పాదాభరణములైన) అందెలు ఆగకుండ ధ్వనించుచుండెను. ఇట్లు ఆ గోపికా సమూహములు స్థల క్రీడ అనుభవించి సంతోషముతో నదీజలములలో ప్రవేశించిరి. ఆందులో జలక్రీడలు సలిపి మిక్కిలి అలిసిపోయిరి.
తూర్ణం జలాత్సముత్థాయ వాసాంసీ పరిధాయ చ।
దదృశుర్ముఖ పద్మాని సద్రత్న దర్పణేషు చ ॥
చందనాగురు కస్తూరీ ద్రవ్యాణి పుష్పమాలికాః ।
ముదా పరిదదుస్తానీ సంప్రాపుశ్చేతనాని చ ॥
సకర్పూరం చ తాంబూలం భుక్త్వా సర్వాణి కౌతుకాత్ ।
దదృశుర్ముఖ పద్మాని సద్రత్నే దర్పణేలఽ మలే ॥
త్వరగా జలము నుండి లేచి వచ్చి వస్త్రములను ధరించి మంచి రత్నాల అద్దాలలో తమ ముఖ పద్మములను చూచుకొనిరి. చందనము అగురు కస్తూరీ అను సుగంధ ద్రవ్యములను పుష్పమాలలను ధరించి అప్పుడు సాధారణ చైతన్య స్థితికి వచ్చిరి. అందరు ఆసక్తిగా కర్పూర తాంబూలములను భుజించి స్వచ్ఛమైన రత్న దర్పణములలో (అద్దాలు) తమ ముఖ పద్మములను మరల చూచుకోనిరి.
కాచిత్కామాతురా కృష్ణం బలాదాకృష్య కౌతుకాత్ ।
హస్తాద్వంశీం నిజగ్రాహ వననం చ చకర్ష హ॥
కాచిత్కామ ప్రమత్తా చ నగ్నం కృత్వా తు మాధవం ।
నిజగ్రాహ చ తద్వస్త్రం పరిహన్య పునర్దదౌ ॥
యుక్తిం శ్రుణ్వేషముక్త్వా కాచిత్సంగృహ్య స్వామినం ।
చుచుంబ గండే బింబోష్ఠే సమాశ్లిష్య పునః పునః ॥
నస్మితం సకటాక్షం చ ముఖచంద్రం స్తనోన్నతం ।
కాచిచ్చ్రోణీం సులలితాం దర్శయామాస కామతః ॥
కాచీత్కాంతం కరే కృత్వా సంస్థాప్య శ్రోణిదేశతః ।
చకార చూడా నిర్మాణం మాలతీమాల్య సంయుతం ॥
కాచిచ్నూడం నమాకృష్య మయూరపింఛకం దదౌ ।
గుంజా మాల్యం చ చూడాయాం వేష్టయామాస కాచన॥
ప్రదదౌ స్వామినే కామాత్ప్రేమవర్ధన హేతవే ।
కాత్కాంచిత్సమాకృష్య నగ్నాం కృత్వా తు కామత:॥
ప్రేషయామాన కృష్ణన్య క్రోడే చందన చర్చితే ।
ననృతుశ్చ జగు: కాశ్చిత్ కాంతం కృత్వా తు కామతః ॥
నర్తనం కారయామాన తం చ కాచిద్బలేన చ।
కృష్ణశ్చ వస్త్రం కస్యాశ్చ విచకర్ష కుతూహలాత్ ॥
కాంచిత్కృత్వా తు నగ్నం చ క స్యైచిదంశుకం దదౌ ॥
(మరల ఆ జగన్మోహనుని దర్శించి వ్యామోహము పొందిన గోపికల విలాసములను వర్ణించుచున్నాడు ఒక కామిని ఆసక్తితో కృష్ణుని బలముగా తనవైపు లాగుకొని అతని చేతి నుండి మురళిని లాగి పట్టుకొని అతని వస్త్రములు లాగివేసెను. కామమతురాలైన ఇంకొకతి శ్రీకృష్ణుడు ధరించిన పీతాంబరము లాగి నగ్నముగా జేసి నవ్వి మరల వస్త్రమిచ్చెను. నా రహస్య యుక్తిని వినుమని ఒకటే స్వామిని దగ్గరకు తీసుకొని బిగ్గరగా కౌగిలించుకొని చెక్కిలి మీద దొండపండువంటి పెదవి మీద మాటి మాటికి ముద్దులు పెట్టుకొనెను. ఇంకొకతే చిరునవ్వుతో కడకంటి చూపుతో చంద్ర బింబము వంటి తన ముఖమును స్తనముల ఉన్నతిని సుందరమైన పిరుదులను కామముతో చూపెను. ఇంకొకతె ప్రియుడైన కృష్ణుని చేత బట్టుకొని తన ఒడిలో కూర్చుండ బెట్టుకొని చక్కగా తలవెండ్రుకలు దువ్వి ముడిచి జాజిపూలదండనలంకరించెను. వేరొకతె కొండె కొప్పును పట్టి లాగి దాని పై నేమిలి పింఛము నలంకరించాను. ఇంకొకతే గురివింద పూసల దండను కొండెకొప్పున చుట్టెను. ఇంకొక కామిని ఆసక్తితో శ్రీకృష్ణునికీ తన మీద ప్రేమ వృద్ధి జెందవలెనని మరియొక సుందరిని నగ్నను చేసి శ్రీగంధములు పులుపుకొన్న కృష్ణుని ఒడిలోనికి (కౌగిలికి) పంపి అట్లు స్వామికి సమర్పించెను. కొందరు శ్రీకృష్ణుని బట్టుకొని నర్తనము చేసిరి. కొందరు పాడిరి. ఒకటే శ్రీకృష్ణుని బలవంతపరచి నర్తనము చేయించెను. శ్రీకృష్ణుడు ఆసక్తితో ఒకదానీ వస్త్రము లాగివేసెను. మరోక సుందరిని నగ్నను జేసి దాని వస్త్రమునీంకొక దానీకిచ్చెను.
కృష్ణో రాధాం సమాకృష్య వానయామాన వక్షసి॥
తస్యాశ్చ కబరీం రమ్యాం నునిర్మాణం చకార హ ।
సిందూరం చ దదౌ భాలే కస్తూరీం బిందుభిః నప ॥
అతిసూక్ష్మం చందనేందుం కౌతుకాత్తదధో దదౌ ।
పత్రాసలీం సులలితాం సుకపోలే చకార హ॥
వహ్ని శుద్ధాంశుకం చారు పరీధార్య ప్రయత్నతః।
పదో: సద్రత్న మంజీరే గృహీత్వా చరణాంబుజే ॥
నఖ నిర్మార్జనం కృత్వా సుందరం యావకం దదౌ ।
భూషణైర్భూషితాం కృత్వా సంప్రలిప్యానులేషనైః ॥
దత్త్యా చ మాలతీ మాలాం చుచుంబ చ పునః పునః ।
చారులోచన పద్మే చ చకారాంజన సంయుతే ॥
ప్రదదౌ నాసికా మధ్యే దుర్లభం గజమౌక్తికం ।
శ్రోణి దేశే చ స్తనయోర్నఖచ్ఛిద్రం చకార హ॥
చకార దంత చలనం పక్వబింబాధరే వరే ।
శ్రీకృష్ణుడు రాధాదేవిని దగ్గరకు చేరదీసుకొని తన వక్షస్థలమున కానుకొని కూర్చుండబెట్టుకొనెను. ఆమె వెండ్రుకలను సంస్కరించి చక్కగా కొప్పు ముడిచెను. ఆమె నుదుట సిందూర తిలకము పెట్టి దానిచుట్టు చిన్న చిన్న కస్తూరి చుక్కలు చేర్చి ఆసక్తితో దాని క్రింద చందనముతో చంద్రరేఖను పెట్టెను.. కపోలముల మీద (చెక్కిళ్లు - చెంపలు) సుందరముగా మకరికాపత్రరేఖలను తీర్చెను. (కుంకుమ పువ్వు ద్రవముతో మొసలి ఆకారముగా, ఆకులు పూవులుగా రేఖలు తీర్చుట). అగ్ని వర్ణము గల వస్త్రము ధరింపజేసెను. పాదములకు రత్నాల అందేలు తొడిగి కాలిగోళ్లను బాగుగా తుడిచి పోటీకందముగా లతుక రంగు పెట్టెను. ఆభరణములతో అలంకరించి సుగంధ లేపనమును శరీరమంత పులిమేను. మాలతీ పుష్పముల మాలనలంకరించి తనివిదీర ముద్దులు పెట్టుకొనెను. సుందరమైన నేత్రపద్మములకు కాటుక పెట్టి ముక్కుకు అపురూపమైన ఏనుగు ముత్యమును అలంకరించెను. కటి ప్రదేశమున స్తనమండలము పైనను నఖక్షతములు పండిన దొండపండు వంటి క్రింది పెదవి పై దంత క్షతమును కూర్చెను.
సరసశ్చ తటే రమ్యే పుష్పోద్యానే సునిర్జనే ॥
బహిశ్చంద్రోదయే రమ్యే పుష్పచందన చర్చితే ।
అగురు చందనాక్తేన వాయునా సురభీకృతే ॥
భ్రమర ధ్వని సంయుక్తే పుంస్కోకిలరుత శ్రుతే ।
బహమూర్తీ: సంవిధాయ యోగినాం పరమో గురు:॥
పునశ్చకార శృంగారం గోపీనాం చిత్తహారకః ।
కింకిణీనాం కంకణానాం సూపురాణాం చ నారద॥
శృంగారోద్రేకతస్తత్ర బభూవ నుందరో రవః ।
మూర్ఛామవాపుస్తాన్ఫర్వా: నవసంగమ మాత్రతః ॥
బభూవురచలాస్పందాః పులకాంచిత విగ్రహాః।
శృంగారే విరతే భూతే సంప్రాపుశ్చేతనాం పునః॥
యోగులకు పరమ గురువు గోపికల చిత్తములను హరించిన వాడు ఐన శ్రీకృష్ణుడు సుందరమైన సరస్సు ఒడ్డున, నిర్జనమైన పుష్పోద్యానములో, ఉదయించిన చంద్రుని వెన్నెలలో, పుష్పములతో గంధముతో అలంకరింపబడిన ప్రదేశములో, అగురు చందనముల గాలి వీచి సువాసనలు వెదజల్లు స్థానములో, తుమ్మెదల ఝుంకార ధ్వనులు గండుకోకిలల కుహూ స్వరము వ్యాపించిన చోట తాననేక రూపములు ధరించి గోపికలతో విహరించెను. ఆ శృంగార క్రీడలో చేతి కంకణములు మొలనూలి మువ్వలు పాదముల అందెలు మ్రోగుచుండెను. ఆ క్రొత్త అనుభవమునకు గోపికలందరు శరీరములు పులకరించీ కనురెప్పలు మూతపడీ మూర్ఛపొందిరి. తరువాత మరల స్మృతిలోనికి వచ్చిరి.
నఖ దంత ప్రహారం చ ప్రచకార వరస్పరం ।
కృష్ణ కరరుహాఘాతం దదౌ తాసాం కుచోపరి ॥
శ్రోణి దేశే సుకఠినే నఖ చిహ్నం చకార హ ।
నీవీ విస్రంనీతా తాసాం కబరీ క్షుద్ర ఘంటికా: ॥
దూరీభూతం సువసనం సువేషం సుమనోహరం।
ఆలింగనం నవవిధం చుంబనాష్టవిధం ముదా ॥
శృంగారం షోడశ విధం చకార రసికేశ్వరః ।
ఆంగైరంగాని ప్రత్యంగైః ప్రత్యంగాని చ యోషితాం ॥
చకారాలింగనం ప్రీత్యా కాముకీనాం చ కాముకః ।
నారీనాం షోడశ కలాః శృంగారస్తత్ప్రమాణకః ॥
కాల భేదేన తద్భేదం కామశాస్త్ర విదో విదుః ।
ప్రాకృతం ద్వాదశ వీధం చకార రసికేశ్వరః ॥
నిరూపితం కామశాస్త్రే చకారేశస్తతోఽధికం ।
క్రీడారంభే చ మధ్యే చ వీరతౌ కర్మ యోషితాం ॥
ప్రీత్యర్థమపి కర్తవ్యం చకారేశస్తతోఽధికం ।
గోపీకంకణ రేఖాభిః పాదాలక్తక చిహ్నితః ॥
శశుభే కృష్ణ దేహశ్చ యధాద్రి ర్గైరికేణ చ ॥
ఉభయులు (ఒక కృష్ణుడు గోపిక) నఖదంత ప్రహారములు పరస్పరము చేసికొనిరి. శ్రీకృష్ణుడు గోపికల కఠిన శ్రేణి దేశముల పై వక్షస్థలముల పై నఖచిహ్నములు చేసెను. ఆ స్థితిలో గోపికల కొప్పు ముడులు మొలనూలులు జారిపోయెను. కోక ముడులు వదులై జారిపోయెను. సుందరాలంకారములును వస్త్రములును దూరమయ్యెను. ఆ రసికేశ్వరుడు ఆ కాముకుడు నవవిధాలింగనములతో అష్ట విధచుంబనములతో షోడశ విధ శృంగారక్రియలతో అంగాంగముల ఆలింగనములతో ఆ స్త్రీలను ఆ కాముకీ జనమును ప్రీతితో సంతృప్తి పరచెను. స్త్రీ జనమునకు శరీరమున పదహారు శృంగార కళాస్థానములుండును. కాలభేదమును బట్టి ఆయాస్థానములను కామశాస్త్రవేత్త లెరుగుదురు. ఆ శాస్త్రమున నిరూపించబడిన ద్వాదశ ప్రకృతులును కలవు. ఆ రసికేశ్వరుడైన శ్రీకృష్ణుడు అంతకు మించి క్రీడారంభములో మధ్యలో చివరను స్త్రీల తృషికి చేయవలసిన కర్మలను చెప్పబడిన దాని కన్న అధికముగా ఆచరించెను. అప్పుడు గోపికల కంకణముల రేఖలతోను గోపికల పాదముల పారాణి గుర్తులతోను శ్రీకృష్ణుని దేహము గైరికధాతువులతో గూడిన పర్వతము వలె ప్రకాశించెను.
ఏవం భూతే పూర్ణరాస సంభూతే రాసమండలే ।
సమాజగ్ముః సురాస్సర్వే సకలాత్రాశ్చ సానుగాః ॥
సువర్ణస్యందనస్థాశ్చ కౌతుకాత్స్వగణావృతాః ।
పులకాంచిత సర్వాంగా: కామబాణ ప్రపీడితాః ॥
ఋషయో మునయశ్చైవ సిద్ధాశ్చ పితరస్తథా।
విద్యాధరాశ్చ గంధర్వా యక్ష రాక్షస కిన్నరా:॥
సస్త్రీకాశ్చ సమాజగ్ముర్గదృశుశ్చ ముదాన్వితాః ॥
ఇట్లు రాసమండలము పూర్ణ శృంగార మయము కాగా దేవతలందరు భార్యలతో పరివారముతో బంగారు రథముల మీద తమ తమ గణములతో కూడి ఆసక్తిగా చూడవచ్చిరి. ఆ దృశ్యము చూచి సర్వాంగములు పులకలెత్తగా మన్మధ బాణపీడితులైరి. ఋషులు మునులు సిద్ధులు పితృదేవతలు విద్యాధరులు గంధర్వులు యక్షరాక్షస కిన్నరులు తమ తమ భార్యలతో చేరవచ్చి మోదముతో దర్శించిరి.
దివ్య స్యందనమారుహ్య శాతకుంభ వినిర్మితం ।
నుశోభితం చ మణినా రత్నసార పరీచ్ఛదం ॥
వహ్ని శుద్ధాంశుకేనైవ వేష్టితం నుమనోహరం।
శ్వేత చామర యుక్తం చ సద్రత్న దర్పణాంబుజం ॥
శతచక్రం చిత్రయుక్తం మనోయాయి మనోహరం।
సద్రత్న సార నిర్మాణ కలశోజ్జ్వల శేఖరం ॥
సమాజగామ భగవాన్ పార్వత్యా సహ శంకరః ।
వామ పార్శ్వే మహాకాలో దక్షిణే నందికేశ్వరః ॥
పురతః కార్తికేయశ్చ స్వయం దేవో గణేశ్వరః ।
పింగలాక్షాదయ సర్వే పారదాః పరితస్తయోః ॥
క్షేత్ర పాలా యయుః సర్వే తథాఽష్టౌ భైరవేశ్వరాః।
వక్షఃస్థల స్థితా దుర్గా సస్మితా వక్రలోచనా ॥
బంగారముతో నిర్మించబడిన దివ్యరధమును మణులతో శోభించుచున్న దానిని, రత్నాలంకారములు గల దానిని అన్నీ వర్ణము గల పట్టు వస్త్రము చుట్టిన దానినీ, అందువలన మనోహరమై శ్వేతచామరములతో రత్న దర్పణములతో పద్మములతో గూడి మంచి రత్నముల పొడిలో నిర్మితమైన కలశములు శిఖరమందు గలిగి, సూరు చక్రములతో మనోహరమైన చిత్రములతో గూడి మనస్సు యొక్క వేగముతో నడచు దానీని (రథమును) ఎక్కి పార్వతీదేవితో బాటు భగవంతుడైన శంకరుడక్కడికి వచ్చెను. అతనికి ఎడమవైపున మహాకాలుడును, కుడివైపున నందికేశ్వరుడు ముందు గణపతియు కుమారస్వామియును ఆ దంపతుల చుట్టుగా అన్ని వైపులలో పింగళాక్షుడు మొదలగు పార్షదులు క్షేత్రపాలులైన ఎనమండుగురు భైరవులును ఉండిరి. పరమేశ్వరుని వక్షఃస్థలమున నున్న దుర్గాదేవి (పార్వతి) చిరునవ్వుతో ప్రక్కచూపుతో వెలసియుండెను.
భారత్యా సహ బ్రహ్మా చ శాతకుంభ రథస్థితః ।
వామే సప్తర్షయస్తస్య దక్షిణే సనకాదయః ॥
సువర్ణస్యందనస్థశ్చ ధర్మః సాక్షీ చ కర్మణాం ।
వక్షఃస్థల స్థితా తస్య మూర్తి: స్మేరాననా సతీ ॥
పశ్యంతీ పూర్ణ రాజం చ సకామా వక్రలోచనా।
పరితః పార్షదాస్సర్వే జ్వలంతో బ్రహ్మతేజసా ॥
శచ్యా నమం మహేంద్రశ్చ రోహిణ్యా చ కళానిధి:।
స్వాహా సార్థం స్వయం వహ్ని నూర్యశసంజ్జయా సహా ॥
సమాజగామ కామశ్చ రతిం కృత్వా చ వక్షసి।
సర్వే గ్రహాశ్చ దిక్పాలా ఆజగ్ముః సకలత్ర కాః ॥
ఆకాశస్థాశ్చ దదృశుః సరాసం రాసమండలం ।
కేచిచ్చ ముముహస్తత్ర మూర్ఛామాపుశ్చ కేచన॥
ముహూర్తం చ సురాః సర్వే సస్మితాశ్చ ముదాన్వి తాః ।
చందన ద్రవ వృష్టిం చ పుష్పవృష్టిం చ చిక్షిపుః ॥
కస్తూరీ యుక్త మాల్యానాం వృష్టిం చక్రుర్మునీశ్వరాః।
రాసం దృష్ట్వా దేవపత్న్యః కామ బాణప్రపీడితాః ॥
బంగారు రథమెక్కి భారతీదేవితో (సరస్వతి) బ్రహ్మ ఎడమ ప్రక్కన సప్తర్సులు కుడిప్రక్కన సనకసనందనాదులు సేవింపగా విచ్చే సెను. జీవుల కర్మలకు సాక్షియైన ధర్మదేవత సువర్ణ రథమెక్కి బ్రహ్మలేజస్సుతో వెలుగుచున్న పార్షదులు చుట్టు ముట్టి ఉండగా వక్షఃస్థలమున మూర్తి అనుభార్యను ధరించి వచ్చెను. ఆ సతి చిరునవ్వుతో వాలుచూపులతో రాసక్రీడను చూచుచు కామ భావన గలదయ్యెను. శచీదేవీతో మహేంద్రుడును రోహిణీతో చంద్రుడును స్వాహాదేవితో అగ్నిహోత్రుడును సంజ్ఞాదేవితో సూర్యుడును చేరవచ్చిరి. రతీదేవిని వక్షఃస్థలమున ధరించి మన్మథుడు వచ్చెను. సర్వగ్రహములు దిక్పాలకులు భార్యలతో చేరవచ్చిరి. ఆకాశమందు నీలిచీ ఆసక్తితో రాసముండలమును చూచుచు కొందరు మోహము పొందగా మరికొందరు మూర్ఛిల్లిరి. ఒక ముహూర్త కాలము దేవతలందరు సంతోషముతో చందన ద్రవమును పుష్పములను వర్షించిరి. మునీశ్వరులు కస్తూరీతో గూడిన పూలదండలను వర్షించిరి. ఆ రాసమండలమును చూచి దేవ పత్నులందరు కామబాణముల చేత పీడింపబడిరి.
స్థలే రతిరసం కృత్వా జగామ యమునా జలం।
రాధయా సహ కృష్ణశ్చ పూర్ణ బ్రహ్మ సనాతనః ॥
గోపీభిః సహ జగ్ముశ్చ మాయాః శ్రీకృష్ణరూపికా: ।
ప్రపీడితా కామబాణైః క్రీడాం చక్రుర్జలే ముదా ॥
జలం దదౌ రాధికాయై సకామో మాధవః స్వయం ।
దదౌ సా చ మాధవాయ కామాక్తాయాంజలిత్రయం ॥
వస్త్రం జగ్రాహ తస్యాశ్చ సా చ నగ్నా బభూవ హ ।
మాలాం చిచ్ఛేద కబరీం చకార శిధిలాం హరిః ॥
సిందూర పక్షకం లుప్తం వేషం చ జలతాడనైః ।
భ్రూ విచిత్రమోష్ఠరాగం లుప్తం కజ్జలలోచనం ॥
తాం చ నగ్నం సమశ్లిష్య నిమమజ్జ జలే హరిః ।
ప్రకృత్యాఽభ్యంతరే క్రీడాం సుతస్థౌ చ తయా సహ ॥
తాం చ నగ్నాం దర్శయిత్వా గోపికాం క్రీడయా నతాం ।
సస్మితాం ప్రేరయామాస దూరతో యమునాజలే ॥
సనాతనుడైన ఆ పూర్ణబ్రహ్మ శ్రీకృష్ణుడిట్లు భూమి మీద రతిసుఖమనుభవించి రాధతో గలిసి యమునా జలములోని కేగెను. మాయా కృష్ణులందరును అట్లే క్రీడలాడిరి. మాధవుడు రాధ మీదకి జలము చల్లేను. రాధయు కామారుడైన మాధవుని మీద మూడు దోసిళ్ల నీరు చల్లెను. అతడామె వస్త్రమును లాగివేసి పూమాలను తెంచి వేసి కొప్పును విప్పి వేసెను. ఆమె నగ్నురాలయ్యెను. హరి జలము చల్లుట వలన మకరికా పత్రములు కనుబొమలకు తీర్చిన రంగు కన్నుల కాటుక పెదవుల రంగు చెదిరిపోయి రాధాదేవి వేషాలంకారము లోపించెను. అంతయు బోసిపోయి నగ్నముగా నున్న రాధను స్వామి కౌగిలించుకొని నీళ్లలో మునిగి క్రీడలాడెను. సిగ్గుతో క్రీడతో వంగిపోయి యున్న ఆమెను నగ్నత్వముగా చేసి నీటిలో చాలదూరమునకు నెట్టివేసెను.
సా వేగేన సముత్థాయ బలాజ్జగ్రాహ మాధవం ।
గృహీత్వా మురలీం కోపాత్ ప్రేరయామాస దూరతః ॥
గృహీత్వా పీతవననం తం చకార దిగంబరం ।
వనమాలాం చిచ్ఛేద దదౌ తోయం పునః పునః ।
హరిం పునః సమాకృష్య ప్రేషయామాన పాథసి ॥
గభీరే స్రోతసి మునే నిమమజ జగత్పతి: ।
ఉత్థాయ మాధవః శీఘ్రం తొం గృహీత్వా ప్రహస్య చ॥
కృత్వా వక్షసి నగ్నాం చ చుచుంబ చ పునః పునః ।
ఏవం తా మూర్తయః సర్ర్వ గోపిభిః సహా కౌతుకాత్॥
క్రీడాం విచక్రుర్యమునా తీరనీరే మనోహరే ॥
రాధాదేవి నీటిలో నుండి వేగముగా లేచి మాధవుని బలముగా పట్టుకొని కోపముతో మురళిని తీసుకొని దూరముగా విసిరివేసెను. పీతాంబరమును లాగివేసి వనమాలను తెంచి అతనిని కూడ దిగంబరుని జేసి మరల మరల నీళ్లు చల్లెను. హరిని తన వైపు లాగుకొని జలములో త్రోసి వేసెను. ఆ జగత్పతి లోతైన యమునా ప్రవాహములో మునిగిపోయెను. మాధవుడు శీఘ్రముగా నీటినుండి లేచి నవ్వుచు ఆమెను పట్టుకొని ఆ నగ్నమూర్తీనే వక్షఃస్థలమున చేర్చుకొని మరల మరల చుంబించెను. ఈ విధముగా మయాకృష్ణులు గూడ ఆసక్తితో సర్వ గోపికలను గూడి మనోహరమైన యమునా జలములో జలక్రీడలాడిరి.
తీరం గత్వా తయా సార్థం హరిర్మగశ్చ మగ్నయా ।
సా తం యయాచే వసనం స చ తాం సస్మితాం సతీం ॥
రాధితాయై దదౌ పస్త్రం రమ్యాం మాలాం చ మాధవః।
ప్రదదౌ హరయే వస్త్రం వంశీం రాసేశ్వరీ తథా ॥
చందనాగురు కస్తూరీం సర్వాంగే కుంకుమాన్వితాం।
కృష్ణస్య పరయా భక్త్యా దదౌ శ్రోణిస్థితన్య చ ॥
నీర్మాయ చూడాం లలితాం కామినీ చిత్తమోహినీం।
శోభనైర్మాలతీ మాల్యైశ్చకార వేష్టనం పునః॥
శ్రీకృష్ణో రాధికాయాశ్చ కబరీం సుమనోహరాం।
కృత్వా కుండల సంస్కారం నీరస పత్రకావలీం ॥
దదౌ లలాటే సిందూరం కస్తూరీ బిందుభిః సహ ।
తదధశ్చందనేందుం చ సుసూక్ష్మం సుమనోహరం ॥
నఖాంగం స్తనయోరూర్వోరుర స్యేవ ఘనం ముదా ।
దత్త్వా తాం వాసయామాస వహ్ని శుద్ధాంశుకేన వై ॥
చందనాగురు కస్తూరీ కుంకుమానాం ద్రవేణ సః ।
కృత్వా వక్షసి సంలీప్య చుచుంబ చ ముహర్ముహుః ॥
పునరాశ్లేషణం కృత్వా దదౌ మాలాం గలే పునః ।
భూషణైర్భూషితాం కృత్వా మంజీరం చరణే దదౌ॥
ఆలక్తకం చరణయోర్నఖేషు చ దదౌ పునః ।
ఏవం గోపాశ్చ గోపీనాం దదౌ చ పృథక్ పృథక్ ॥
ఇట్లు గడిపిన శ్రీహరి రాధతో ఒడ్డుకు చేరెను. ఆమె అతనిని వస్త్రమీమ్మని యాచించెను. చిరునవ్వుతో సున్న ఆ సాధ్విని అతడును అట్లే యాచించేను. మాధవుడు రాధకు వస్త్రమును సుందరమైన పుష్పమాలనిచ్చెను. ఆ రాసేశ్వరి హరికీ వస్త్రమును మురళీనిచ్చెను. తన ముందు ఇసుక తిన్నె పై కూర్చున్న కృష్ణునికి గొప్ప భక్తితో రాధాదేవి చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వు ద్రవములను సర్వ శరీరమున పులిమేను. కానీ చిత్తములను మోహింపజేయునట్లుగా సుందరమైన కొండె కొప్పు నిర్మించి మంగళకరమైన పూలతీ పుష్పదామమును చుట్టెను. శ్రీకృష్ణుడు రాధకు వెండ్రుకల కొప్పును మనోహరముగా ముడిచి చెపులకు కుండలములలంకరించి చెంపల మీద మకరికా పత్రములు లిఖించెను, నుదుట ఎర్రని సిందూర తిలకము పెట్టి చుట్టు కస్తూరితో చుక్కలు పెట్టి దాని క్రింద మనోహరముగా సన్నని చంద్రరేఖను చందనముతో నిర్మించెను. స్తనముల పై ఊరుపులపై గోటి గుర్తులు అలంకరించి అగ్ని పర్ణము గల పట్టు వస్త్రమునామకు అలంకరించెను. చందనము అగురు కస్తూరి కుంకుడు ద్రవములను ఆమె వక్షస్థలమున పులిమి కంఠము. ఆలింగనము చేసికొని మరల మరల చుంబించెను. భూషణములతో అలంకరించి పాదములకు ఆండిలు తొడిగి కాళ్లకు పారాణి గోళ్లకు ఎత్తిని రంగును అలంకరించెను. ఈ విధముగనే అందరు గోపాలురు (కృష్ణరూపులు) గోపికలకు వేరు వేరుగా విలాసములను పంచిరి.
పునః ప్రజగ్ము స్తా మత్తాః సుందరం రాసమండలం ।
పూర్ణేందు చంద్రికా యుక్తం రతీయోగ్యం నునిర్జనం ॥
మాధవీ కేతకి కుందమాలతీనాం మనోహరైః ।
చంపయూధీ మల్లికానాం పుషైశ్చ సురభీకృతం॥
యావనమత్తులైన వారందరు తిరిగి పండు వెన్నెలతో కూడియున్న సుందర రాసమండలమునకు పోయిరి. ఆ ప్రదేశము బడిగురివింద, మొగిలి మొల్ల, వీరజాజి, సంపెంగ, అడవి మొల్ల, మల్లెపూల వాసనతో సుగంధ వాతావరణము గలదై, జన రహితమై స్త్రీ పురుషుల ఏకాంతక్రీడకు యోగ్యమై ఉండెను.
దృష్ట్వా చ స్ఫుటితం వుష్పం చయనం కర్తుమీశ్వరీ ।
గోపీర్నియోజయామాస కౌతుకేన చ రాధికా ॥
కాశ్చిన్నియోజయామాస మాలానిర్మాణకర్మణీ ।
కాశ్చిత్తాంబూల సజ్జేషు కాశ్చిచ్చందన ఘర్షణే॥
మాలా చందన తాంబూలం గోపీదత్తం చ సుందరీ ।
దదౌ కృష్ణాయ సంప్రీత్యా సస్మితా వక్రలోచనా॥
కాశ్చిన్నియోజనం చక్షుః కృష్ణ సంగీత కర్మణీ।
మృదంగ మురజాదీనాం వాదనేషు చ కాశ్చన ॥
ఏవం రాసే రతింకృత్వా లీలయా హరిణా సహ ।
విజహార చ సర్వత్ర నిర్జనేషు మనోహరం ॥
ఈశ్వరి ఐన (జగత్తంతయు తన సంపద ఐన) రాధాదేవి అంతట వికసించి యున్న పుష్పమాలను చూచి ఆసక్తితో వాటిని తెంపుటకు {పూలు గోయుటకు) సమస్త గోపికలను ఆజ్ఞాపించెను, కొందరు గోపికలను మాలలు నిర్మించుటకు మరికొందరిని తాంబూలములను సిద్ధము చేయుటకు (సుగంధ ద్రవ్యములను చేర్చి తమలపాకులను చుట్టుట) మరికొందరిని గంధము తీయుటకును నియమించెను. గోపికలు సిద్ధము చేసి ఇచ్చిన చందనమును, పుష్పమాలలను తాంబూలమును ఆ సుందరీ (రాధ) క్రీగంటి చూపుతో చిరునవ్వుతో తృప్తిగా శ్రీకృష్ణునికర్పించెను. తరువాత కొందరిని కృష్ణుని గూర్చి గీతములు పాడుటకు మరికొందరిని మృదంగము మురజము (మద్దెల) లను వాయుంచుటకు నియమించెను. ఇట్లు హరితో విలాసముగా రాసమండలములో రమించి రాధాదేవి నిర్జన ప్రదేశములలో అంతట మనోహరముగా విహరించెను.
పుష్పోద్యానేషు రమ్యేషు సరసాం చ తటేషు చ ।
కందరే కందరే రమ్యే నదీషు చ సదేషు చ ॥
అతీవ నిర్జన స్థానే శ్మశానే గిరిగహ్వరే ।
వాంఛితేషు చ నారీణాం త్రయస్త్రింశద్వనేషు చ ॥
భాండీరే శ్రీవనే రమ్యే కదంబ కాననే తధా।
తులసీ కాననే కుందవనే చంపకననే ॥
నింబారణ్యే మధువనే జంబీర కాననే తథా ।
నాలికేర వనే పూగవనే చ కదలీవనే ॥
బదరీ కాననే బిల్వవనే నారిందకాననే ।
అశ్వత్థకాననే వంశవనే దాడిమ కాసనే ॥
మందార కాననే తాలవనే చూడవనే తథా ।
కేతకీ కాననేఽ శోకవనే ఖర్జూర కాననే ॥
ఆమ్రాతకవనే జంబూగహనే శాలకావనే ।
కటకే కాననే పద్మవనే జాతివనే మునే ॥
న్యగ్రోధగహనే ఘోరే తథా శ్రీఖండ కాననే ।
ప్రహృష్టకేసర వనే సర్వతోఽపీ విలక్షణే ॥
ఏవం రేమే కౌతుకేన కామాత్రింశద్ధివానీశం ।
తథాఽపి మానసం పూర్ణం న చ కించిద్భభూవ హ ॥
సుందరమైన పూలతోటలలో, సరస్సుల తటములలో, రమ్యమైన ప్రతి గుహలో, నదీనదముల యొక్క తటములలో (తూర్చు దిశకు ప్రవహించునది నది. పడమర దిశకు ప్రవహించునది నదము} నిర్ణన శ్మశాన స్థలములలో, గిరీ గుహలలో, స్త్రీలు కోరుకొనెడి ముప్పది మూడు వనములలో వారు విహరించిరి. భాండీర వనము, శ్రీవనము, కదంబ (కడిమి చెట్లు) కాననము, బృందావనము (తులసీవనమని మూలము) కుంద వనము (మొల్లలతోట) చంపకవసము {సంపంగి తోట) నింబారణ్యము (వేపచెట్ల అడవి) మధువనము (ఇప్పచెట్ల అడవి) జంబీర కాననము (నిమ్మతోట) నారికేళవసము పూగవనము {పోకచెట్ల వనము) కదళీ వనము (అరటి తోట) బదరీ వనము, బిల్వవనము (మారేడు) నారింగవనము (నారింజలు) అశ్వత కాననము (రావిచెట్లు) వంశ వనము (వెదురు) దాడిమ కాననము (దానిమ్మతోట) మందార వనము {దేవదారు వృక్షముల అడవి) తొలవనము, చూత (మామిడి) వనము, కేతకీ వనము (మొగిలి} అశోకవనము ఖర్జూరకాననము, ఆమ్రతకవసము (జీడిమామిడి) జంబూవనము (అల్లనేరడి) శాలకవనము కటకకాననము పద్మవనము జాజిపూలతోట, న్యగ్రోధ (మర్రి) కాననము శ్రీఖండ కాననము (శ్రీగంధపు చెట్ల అడవి దట్టమైన పొగడ వృక్షముల అడవి, ఇటు రాధాదేవి శ్రీకృష్ణునితో ముప్పది దినములు రాత్రింబవళ్లు కామాసక్తితో విహరించెను. ఐనను ఆమె మనస్సు నిండలేదు.
న కామినీనాం కామశ్చ శృంగారేణ నీవర్తతే ।
అధికం వర్ధతే శశ్వద్యథాగ్నిర్ఘృతధారయా॥
జగ్ముర్దేవాః స్వగేహాం చ దేవ్యశ్చ మునయస్తథా ।
తే సర్వే ప్రశంశంసుశ్చ విస్మయం చ యయుర్ముదా॥
గే హే గేహే నృపేంద్రాణాం లేభిరే జన్మ భారతే ।
దగ్ధాః కామాగ్నినాంఽశేన దేవ్య: శృంగార లాలసాః ॥
కామినుల యొక్క కామము నెయ్యి పోసినకొద్దీ అగ్ని మండినట్లు అనుభవించిన కొద్ది అధికముగా వర్ధిల్లునే కాని చల్లారదు. తరువాత దేవతలు దేవ గణము మునులు అందరును ఆ లీలలను చూచి ఆశ్చర్యము పొంది తమ తమ గృహములకు వెళ్లిరి. శృంగార లాలస గల ఆ దేవీగణము కామాగ్ని దగ్ధలై తమ అంశలతో భారత ఖండములో రాజుల గృహములలో ఇంటింట జన్మించిరి. (శ్రీహరినీ సేవించిరి).
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే రాసక్రీడా ప్రస్తావో నాము అష్టావింశోఽధ్యాయః॥
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన రాసక్రీడా ప్రస్తావము అనెడి ఇరువది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 28 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Humiliated by his utter failure to move Govardhana Hill and realizing that Kṛshṇa was the Supreme Lord of the universe, Lord Indra descended from the heavens with his elephant Airāvata, falling prostrate at Kṛshṇa's lotus feet in deep repentance. Indra offered exquisite prayers of glorification, begging forgiveness for his arrogant wrath. Goddess Surabhi, the celestial cow, arrived alongside Indra and performed the grand Indrābhisheka ceremony, bathing Kṛshṇa with the milk of wish-fulfilling cows and sacred waters from the heavenly realms, proclaiming Him as the eternal king and protector of all cows and cowherds.