77 - అధ్యాయము

మూ॥ నంద ఉవాచ:

కేన స్వప్నేన కిం పుణ్యం కేన మోక్షో భవేత్సుఖం ।

కోఽపికోఽపిచసుస్వప్నః తత్సర్వం కథయ ప్రభో ॥

శ్రీభగవానువాచ:

వేదేషు సామవేదశ్చ ప్రశస్తః సర్వకర్మసు ।

తథైవ కణ్వశాఖాయాం పుణ్యకాండే మనోహరే ॥

స వ్యక్తి యశ్చ దుఃస్వప్న: శశ్వత్పుణ్యఫలప్రదః ।

తత్సర్వం నిఖిలం తాత కథయామి నిశామయ ॥

స్వప్నాధ్యాయం ప్రవక్ష్యామి బహుపుణ్య ఫలప్రదం ।

స్వప్నాధ్యాయం నరః శ్రుత్వా గంగాస్నాన ఫలం లభేత్ ॥

స్వప్నస్తు ప్రథమే, భాగే సంవత్సర ఫలప్రదః ।

ద్వితీయే చాష్టభిర్మా సై: త్రిభిర్మాసైః తృతీయకే ॥

చతుర్ధే చార్ధమాసేన స్వప్నః స్వాత్మ ఫలప్రదః ।

దశా హే ఫలదః స్వప్నోఽప్యరుణోదయ దర్శనే ॥

ప్రాతః స్వప్నశ్చ ఫలదః తత్క్షణం యదిబోధితః ।

ది నే మనసి యద్దృష్టం తత్సర్వంచ లభేద్ద్రువం ॥

చిన్తా వ్యాధి సమాయుక్తో నరః స్వప్నంచ పశ్యతి ।

తత్సర్వం నిష్ఫలంతాత! ప్రయత్యేవ న సంశయః ॥

జడో మూత్రపురీషేణ పీడితశ్చ భయాకులః ।

దిగంబరో ముక్త కేశో న లభేత్స్వప్నజం ఫలం ॥

దృష్ట్వా స్వప్నంచ నిద్రాలుర్యది నిద్రాం ప్రయాతిచ ।

విమూడో వక్తి చేద్రాత్రౌన లభేత్స్వప్నజం ఫలం ॥

ఉక్త్వా కాశ్యపగోత్రంచ విపత్తం లభతే ద్ధ్రువం ।

దుర్గతే దుర్గతిం యాతి నీచే వ్యాధిం ప్రయాతిచ ॥

శత్రౌ భయంచ లభతే మూర్ఖేచ కలహంలభేత్ ।

కామిన్యాం ధనహానిస్స్యాత్ రాత్రౌ చోర భయంభవేత్ ॥

నిద్రాయం లభతే శోకం పండితే వాంఛితం ఫలం ।

న ప్రకాశ్యశ్చ స స్వప్న: పండితైః కాశ్య పే వ్రజ ॥

గవాంచ కుంజరాణాంచ హయానాంచ ప్రజేశ్వర ।

ప్రాసాదానాంచ శైలానాం వృక్షాణాం చ తథైవచ ॥

ఆరోహణంచ ధనదం భోజనం రోదనంతథా ।

ప్రతిగృహ్య తథా వీణాం సస్యాఢ్యం భూమిమా లభేత్ ॥

శస్త్రాస్త్రేణ యదా విద్దో వ్రణేన కృమిణా తథా ।

విష్ఠయా రుధిరేణైవ సయుక్తోఽప్యర్థవాన్ భవేత్ ॥

స్వప్నేఽప్యగమ్యాగమనో భార్యాలాభం కరోతి యః ।

మూత్రసిక్తః పిచేచ్ఛుక్రం నరకం చ విశత్యపి ॥

నగరం ప్రవిశేద్రక్తం సముద్రం వా సుధాం పిబేత్ ।

శుభవార్తా మవాప్నోతి విపులంచార్థమాలభేత్ ॥

గజంకృపంసువర్ణంచ వృషభం దేనుమేవచ ।

దీపమన్నంఫలం పుష్పం కన్యాంఛత్రం రథంధ్వజం ॥

కుటుంబంలభతే దృష్ట్వా కీర్తించవిపులాంశ్రియం ।

పూర్ణకుంభం ద్విజం వహ్నిం పుష్పతాంబూలమందిరం ॥

నందుడిట్లన్నాడు - ఏకలవస్తే ఏమిపుణ్యము, దేని వలన మోక్షము సుఖమౌతుంది. ఓప్రభు! ఏదేది మంచి స్వప్నమో అదంతా చెప్పు.(1) భగవానుడిట్లన్నాడు - వేదములలో సామవేదము ప్రశస్తము అన్ని కర్మలలోను. అట్లాగే కణ్వశాఖలో పుణ్యకాండములు మనోహరమైనవి.(2) దుఃఖ స్వప్నము స్పష్టంగా వస్తే ఎప్పుడూ పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఓ తండ్రి! అదంతా పూర్తిగా చెబుతాను, విను (3) బహుపుణ్యఫలమునిచ్చే స్వప్నాధ్యాయమును చెప్తాను. నరుడు స్వప్నాధ్యాయాన్ని వింటే గంగా స్నానఫలితాన్ని పొందుతాడు.(4) ప్రథమయామంలోని (గం)కల సంవత్సర కాలములో ఫలమునిచ్చేది. ద్వితీయయామంలోది ఎనిమిది నెలలో ఫలించేది. తృతీయమామంలోది మూడు నెలలో ఫలించేది (5) నాల్గవ యామములోనిది పది హేను రోజులలో ఫలించేది. స్వప్నము ఆత్మ ఫలమునిచ్చేది. అరుణోదయ కాలంలో వచ్చిన స్వప్నము పది రోజులలో ఫలితాన్నిచ్చేది. (6) ప్రాతఃకాల స్వప్నము, ఒకవేళ మెలకువ వస్తే అప్పుడే ఫలితాన్నిచ్చేది. పగటిపూట మనస్సులో ఏది చూస్తాడో అదంతా తప్పక లభిస్తుంది. (7) చిత్త, వ్యాధి, వీనితో కూడిన నరుడు ఒకవేళ కలగంటే అదంతా నిష్పలము, ఓ తండ్రి! పోతుంది, అనుమానం లేదు (8) జడుడు, మూత్రపురీషములతో పీడింపబడేవాడు, భయాకులుడు, దిగంబరుడు, వెంట్రుకలు విరియబోసుకొన్నవాడు వీరు స్వప్నం వల్ల కలిగే ఫలితాన్ని పొందరు. (9) నిద్రమత్తుడు, స్వప్నముచూచి తిరిగి నిద్రపోతే, విమూఢుడు, రాత్రి ఆకలగూర్చి చెబితే స్వప్నం వల్ల కలిగే ఫలితాన్ని పొందడు. (10) కాశ్యప గోత్రాన్ని చెప్పితే ఆపదను పొందుతాడు, నిశ్చయము. కలలో దుర్గతుడైతే దుర్గతిని, నీచుడైతే వ్యాధిని పొందుతాడు (11) శత్రువుకన్పిస్తే భయాన్ని, మూర్ఖుడు కన్పిస్తే కలహాన్ని పొందుతాడు, కామిని కన్పి స్తే ధనహానిఔతుంది. రాత్రిఐతే దొంగల భయమౌతుంది. (12) నిద్రలో దుఃఖాన్ని పొందితే పండితుడు కోరిన ఫలాన్ని పొందుతాడు. పండితుడు ఆస్వప్నాన్ని కాశ్యపగోత్రునకు చెప్పరాదు. ఓప్రజ! (13) ఓప్రజేశ్వర! ఆవులు, ఏనుగులు, గుఱ్ఱములు, మేడలు, పర్వతముల, వృక్షములు, (14) వీనిని (కలలో) ఎక్కినట్లైతే, ధనములభిస్తుంది. భుజించిన కలవస్తే రోదనములభిస్తుంది. వీణను గ్రహించినకలైతే పంటగలభూమిని పొందుతాడు. (15) శస్త్రాస్త్రములతో కొట్టబడినట్టు వ్రణంతో, పురుగుతో, మలముతో, రక్తంతో కూడినట్టు కన్పిస్తే అర్ధవంతుడౌతాడు. (16) కలలో పొందరానిది లభిస్తే భార్యాలాభమౌతుంది. మూత్రంతో తడిసి, శుక్రాన్ని తాగి, నరక ప్రవేశంచేసి (17) నగర ప్రవేశంచేసి, రక్తము, సముద్రము, అమృతము తాగినట్టు ఇట్లా కలలు వస్తే శుభవార్తను వింటాడు. విపులముగా అర్ధలాభమౌతుంది. (18) గజము, రాజు, బంగారము, వృషభము, ధేనువు, దీపము, అన్నము, ఫలము, పుష్పము, కన్య, ఛత్రము, రథము, ధ్వజము (19) వీటిని చూస్తే కలలో, కుటుంబాన్ని పొందుతాడు విపులమైన కీర్తిని, శ్రీని, పొందుతాడు. పూర్ణకుంభము, ద్విజుడు, అగ్ని, పుష్పములు, తాంబూలము, మందిరము వీనిని 

మూ॥ శుక్లం వాన్యంనటంవేశ్యాం దృష్ట్వాశ్రీయమవాప్నుయాత్ ।

గోక్షీరంచ ఘృతం దృష్ట్వా చార్ధం పుణ్యధనం లభేత్ ॥

పాయసం పద్మపత్రేచ దధిదుగ్ధంఘృతం మధు ।

మిష్టాన్నం స్వస్తికంభుక్త్వాధ్రువంరాజాభవిష్యతి ॥

పక్షిణాంమానుషాణాంచ భుంక్తే మాంసంనరోయది ।

బహ్వర్థం శుభవార్తాంచలభతేవాంఛితం ఫలం ॥

ఛత్రంవా పాదుకాంవాపి లబ్ధ్వాధాన్యంచ గచ్ఛతి ।

అసించ నిర్మలం తీక్ష్ణం తత్తథైవ భవిష్యతి ॥

హేలయాసంతరేద్యోహి సప్రధానోభవిష్యతి ।

దృష్ట్వాచ ఫలితం వృక్షం ధనమాప్నోతి నిశ్చితం ॥

సర్పేణ భక్షితో యోహి అర్థలాభశ్చతద్భవేత్ ।

స్వప్నేసూర్యం విధుందృష్ట్వా ముచ్యతేవ్యాధిబంధనాత్ ॥

బడబాంకుక్కుటీందృష్ట్వా క్రౌంచీంభార్యాం లభేద్ద్రువం ।

స్వప్నేయోనిగడైర్భద్ధః ప్రతిష్టాంపుత్రమాలభేత్ ॥

దధ్యన్నం పాయసంభుంక్తే పద్మపత్రేనదీతటే ।

విశీర్ణపద్మపాత్రేచ సోపిరాజాభవిష్యతి ॥

జలౌకసంవృశ్చికంచ సర్పంచ యదిపశ్యతి ।

ధనం పుత్రంచ విజయం ప్రతిష్టాంవాలభేదితి ॥

శృంగిభిఃదంష్ట్రిభిః కోలైఃవానరైః పీడితో యది ।

నిశ్చితంచభవేద్రాజా ధనంచ విపులం లభేత్ ॥

మత్స్యం మాంసంమౌక్తికంచ శంఖం చందనహీరకం ।

వస్తుపశ్యతి స్వప్నాంతే విపులంధనమాలభేత్ ॥

సుతంచ రుధిరం స్వర్ణం భుక్త్వా విష్ఠాం ధనం లభేత్ ।

ప్రతిమాంశివలింగం చలభేద్దృష్ట్వా జయంధనం ॥

ఫలితం పుష్పితం బిల్వం ఆమ్రం దృష్ట్వాలభేద్ధనం ।

దృష్ట్వాచ జ్వలదగ్నించ ధనం బుద్ధింశ్రియం లభేత్॥

ధాత్రీఫలంచామలకం ఉత్పలంచ ధనాగమం ।

దేవతాశ్చ ద్విజాగావః పితరోలింగినస్తథా ॥

యద్దదాతిమిథః స్వప్నే తత్తథైవభవిష్యతి ।

శుక్లాంబరధరాచార్యః శుక్లమాల్యానులేపనాః ॥

సమాశ్రిష్యంతియం స్వప్నేతస్యశ్రీః సర్వతఃసుఖం ।

పీతాంబరధరాంనారీం పీతమాల్యానులేపనాం ।

అవగూహతియః స్వప్నే కళ్యాణంతస్య జాయతే ॥ సర్వాణిశుక్లానిప్రశంసితానిభస్మాస్థికార్పాస వివర్జితాని ।

సర్వాణి కృష్ణాన్యతినిందితానిగోహస్తి వాజిద్విజదేవవర్జ్యం ॥

దివ్యాస్త్రీసస్మితా విప్రారత్నభూషణ భూషితా ।

యస్యమందిరమాయాతిసప్రియం లభతే ధ్రువం ।

స్వప్నేచ బ్రాహ్మణోదేవో బ్రాహ్మణీ దేవకన్యకా ॥

బ్రాహ్మణో బ్రాహ్మణీవాఽపి సంతుష్టాసస్మితా సతీ ।

ఫలందదాతి య స్మైచ తస్యపుత్రో భవిష్యతి ॥

యంస్వప్నేబ్రాహ్మణా నందకుర్వంతిచ శుభాశిషం ।

యద్వదంతిభవేత్త స్యత స్యైశ్వర్యంభవేద్ద్రువం ॥

తెలుపు లేదా నలుపో నటుని వేశ్యను చూచిన (కలలో), శ్రీనిపొందుతాడు. ఆవుపాలు, నేయి వీటిని చూచి అర్దమును పుణ్యమైన ధనమును పొందుతాడు.(21) పాయసము, పద్మపాత్రలో, దధి, దుగ్ధము, నేయి, తేనె, మథురమైన అన్నము, మంగళమైన వస్తువు వీటిని తిన్నచో తప్పక రాజు ఔతాడు. (22) పక్షుల, మనుష్యుల మాంసమును నరుడు తింటే బాగా డబ్బును శుభవార్తను, వాంఛిత ఫలమును పొందుతాడు. (23) ఛత్రి, పాదుకలు పొందిన (కలలో) ధాన్యము పోవును. నిర్మలము తీక్షముఐన కత్తిని పొందితే (కలలో) అది అట్లాగే ఔతుంది. (24) విలాసంగా చేసినది ప్రధానమౌతుంది. పండిన వృక్షాన్ని చూస్తే, ధనాన్ని పొందుతాడు నిశ్చయము. (25) కలలో పామువల్ల తినబడితే అది అర్థలాభాన్ని కల్గిస్తుంది. కలలో సూర్యచంద్రులను చూస్తే వ్యాధి బంధనముల నుండి ముక్తుడౌతాడు. (26) ఆడగుఱ్ఱమును, కోడి పెట్టను, క్రౌంచి (పక్షి)ని చూసిన భార్యను పొందుతాడు నిశ్చయము. కలలో బేడెముతో బంధిపబడ్డవాడు, ప్రతిష్ఠను, పుత్రుని పొందుతాడు. (27) పెరుగన్నము, పాయసము పద్మపత్రమందునదీ తటమందు, చినిగిన పద్మపాత్రయందు భుజిస్తే (కలలో) వాడుకూడా రాజౌతాడు. (28) నీటిలో ఉండేదానిని తేలును, పామును, కలలో చూస్తే ధనమును, పుత్రుని, విజయమును, ప్రతిష్టను కాని పొందుతాడు, అని (29) కోరలు గలది, కొమ్ములది, పంది, కోతి వీనితో కలలో పీడింపబడితే తప్పకుండా రాజౌతాడు, చాలా ధనములభిస్తుంది. (30) చేప, మాంసము, ముత్యము, శంఖము, చందనము, వజ్రము కలలో చివరగా వీనిని చూస్తే చాలా ధనాన్ని పొందుతాడు. (31) కొడుకును, రక్తాన్ని, బంగారాన్ని, మలమును తిన్నట్టు కలగంటే ధనాన్ని పొందుతాడు. ప్రతిమను శివలింగాన్ని చూస్తే జయమును, ధనమును పొందుతాడు. (32) పండిన, పుష్పించిన మారేడు, మామిడి వృక్షాలను చూస్తే (కలలో) ధనమును పొందుతాడు. మాడుతున్న అగ్నిని చూస్తే ధనమును, బుద్దిని, శ్రీని పొందుతాడు. (33) ఉసిరికాయ, పండు, కలువ వీనిని చూస్తే ధనం వస్తుంది. దేవతలు, ద్విజులు, గోవులు, పితరులు, లింగధారిని చూస్తే వారు (34) కలలో ఏది ఇస్తే, అది అట్లాగే ఔతుంది. తెల్లచీర ధరించిన స్త్రీలు, తెల్లని మాలలు, సుగంధపు పూతగల వారు(35) కలలో కౌగిలించుకుంటే వానికి శ్రీలభిస్తుంది. అన్ని దిక్కుల నుండి సుఖం కల్గుతుంది. పీతాంబరము ధరించిన స్త్రీని, పచ్చని మాలలు అనులేపనము గల స్త్రీని కలలో కౌగిలించుకుంటే వానికి కళ్యాణం కల్గుతుంది. (36) శుక్లమైన వన్ని ప్రశంసించ తగినవే, భస్మము, అస్థికలు, దూది ఇవి తప్ప. నల్లవైనవన్ని మిక్కిలి నిందించతగినవే, గోవులు, ఏనుగులు, గుఱ్ఱములు, బ్రాహ్మణులు, దేవుళ్ళు తప్ప (37) దేవతాస్త్రీ, నవ్వుతూ రత్నభూషణములతో అలంకరింపబడ్డ బ్రాహ్మణస్త్రీ ఎవని ఇంటికి వస్తే వాడు మంచిని పొందుతాడు, నిశ్చయము. (38) కలయందు, బ్రాహ్మణుడు దేవుడు, బ్రాహ్మణ స్త్రీ, దేవకన్యక, బ్రాహ్మణుడు లేదా బ్రాహ్మణ స్త్రీ కాని ఆనందంతో నవ్వుతూ (కన్పిస్తే), ఫలాన్ని ఇస్తే వానికి పుత్రుడు కలుతాడు. (39) ఓ నంద! బ్రాహ్మణుడు కలలో శుభాశీస్సులనిస్తే, ఏది మాట్లాడితే, అది వాని కౌతుంది, వానికైశ్వర్యం కల్గుతుంది. నిశ్చయము.

మూ॥ పరితుష్టో ద్విజశ్రేష్ఠశ్చాయాతి యస్య మందిరం ।

నారాయణఃశివో బ్రహ్మా ప్రవిశేత్తు తదాశ్రమం ॥

సంపత్తిస్తస్యభవతి యశశ్చవిపులం శుభం ।

పదేపదే సుఖంతస్య సమానం గౌరవం లభేత్॥

అకస్మాదపిస్వప్నేతు లభతే సురభింయది ।

భూమిలాభోభవేత్తస్య భార్యాచాపి పతివ్రతా ॥

కరేణకృత్వాహస్తీయం మస్తకే స్థాపయేద్యది ।

రాజ్యలాభోభవేత్తస్య నిశ్చితంచ శ్రుతౌ మతం ॥

స్వప్నేతుబ్రహ్మణస్తుష్టః సమాశ్రిష్యతియం ప్రజ ।

తీర్థస్నాయీభవేత్సోపి నిశ్చితం చశ్రియాన్వితః ॥

స్వప్నేదదాతి పుష్పంచ యస్మైపుణ్యవతే ద్విజః ।

జయయుక్తో భవేత్సోపియశస్వీచ ధనీసుఖీ ॥

స్వప్నేదృష్ట్వాచ తీర్థాని సౌధరత్నగృహాణిచ ।

జయయుక్తశ్చ ధనవాంస్తీర్థస్నాయీ భవేన్నరః ॥

స్వప్నేతుపూర్ణకలశం కశ్చిత్క స్మై దదాతిచ ।

పుత్రలాభోభవేత్తస్య సంపత్తిం వాసమాలభేత్ ॥

హస్తేకృత్వాతు కుడవమాడకం వారసుందరీ ।

యస్యమందిరమా యాతి సలక్ష్మీంలభతే ధ్రువం ॥

దివ్యాస్త్రీ యధ్గృహంగత్వా పురీషం విసృజేద్ద్విజ ।

అర్ధలాభోభవేత్తస్య దారిద్ర్యంచ ప్రయాతిచ ॥

యస్యగేహం సమాయాతి బ్రాహ్మణో భార్యయా సమా ।

పార్వత్యాసహశంభుర్వా లక్ష్మ్యా నారాయణోఽథవా ॥

బ్రాహ్మణో బ్రాహ్మణీవాఽపి స్వప్నేతస్మై ప్రదీయతే ।

ధాన్యంపుష్పాంజలిం వాఽపి తస్య శ్రీః సర్వతో ముఖీ ॥

ముక్తాహారం పుష్పమాల్యంచందనంచ లభేద్ర్వజ ।

స్వప్నే దదాతి విప్రశ్చ తస్య శ్రీః సర్వతో ముఖీ ॥

గోరోచనం పతాకాంవా హరిద్రామిక్షు దండకం ।

సిద్ధాన్నంచ లభేత్ స్వప్నేతస్య శ్రీః సర్వతోముఖీ ॥

బ్రాహ్మణోబ్రాహ్మణీవాఽపి దదాతి యస్యమస్తకే ।

ఛత్రంవాశుక్ల ధాన్యంవా సచరాజా భవిష్యతి ॥

స్వప్నే రథస్థః పురుషః శుక్లమాల్యాను లేపనః ।

తత్రస్థోదధి భుంక్తేచ పాయసంవానృపోభవేత్ ॥

పరితుష్టుడై బ్రాహ్మణు శ్రేష్ఠుడు ఇంటికి వస్తే, వాని ఇంటికి నారాయణుడు, శివుడు, బ్రహ్మ వస్తారు. (41) వానికి సంపత్తి కల్గుతుంది. శుభమైన, విశాలమైన కీర్తి లభిస్తుంది. అడుగడుగునా సుఖము, మానము, గౌరవము. వానికి లభిస్తాయి. (42) అకస్మాత్తుగా కలలో సురభిని పొందితే, వానికి భూమి లాభమౌతుంది, వాని భార్య పతివ్రత ఔతుంది. (43) ఏనుగు తొండముతో పట్టుకొని, తనతల పై ఉంచుకుంటే, వానికి రాజ్యలాభమౌంతుంది, నిశ్చయము, ఇది శ్రుతి సమ్మతము (44) ఆనందంతో బ్రాహ్మణుడు కలలో కౌగిలించుకుంటే, ఓ ప్రజ! వాడు తీర్థస్థానం చేసిన (సే) వాడౌతాడు. సంపదకల వాడౌతాడు. (45) ద్విజుడు కలలో కన్పించి పూవును ఇచ్చిన యెడల, ఆ పుణ్యాత్మునకు జయం లభిస్తుంది (తీసుకొన్నవానికి). కీర్తి మంతుడు, ధనవంతుడు, సౌఖ్యవంతుడౌతాడు (46) కలలో తీర్థాలను చూచిన సౌధములు, రత్నగృహములు చూచిన, జయం కలవాడు, ధనవంతుడు, తీర్థములలో స్నానంచేసేవాడు ఔతాడు. (47) కలలో ఒకడు మరొకనికి పూర్ణకలశమును ఇస్తున్నట్టుచూస్తే వానికి పుత్ర లాభమౌతుంది. సంపత్తిని పొందుతాడు. (48) మానిక, తూము (కొలమానములు) చేత ధరించి వారసీ ఇంటికి వస్తే, వానికి లక్ష్మి కల్గుతుంది, నిశ్చయము (49) ఓద్విజ! దేవతస్తీ ఇంటికి వచ్చి పురీషం వదిలితే, దానికి అర్థలాభమౌతుంది, దారిద్ర్యము పోతుంది. (50) బ్రాహ్మణుడు భార్యతో కూడి, (కలలో) ఇంటికివస్తే, పార్వతితో శివుడు, లక్ష్మితో నారాయణుడు (51) బ్రాహ్మణుడు, బ్రాహ్మణి కాని కలలో కన్పించి, ధాన్యము పుష్పాంజలికాని ఇచ్చినట్లైతే, వానికి సర్వతోముఖమైన శ్రీ కల్గుతుంది. (52) ముత్యాలహారము, పుష్పమాల, చందనము కలలో లభిస్తే ఓ ప్రజ! లేదా విప్రుడెవడైనా ఇస్తే కలలో, వాని శ్రీ సర్వతోముఖంగా వర్ధిల్లుతుంది. గోరోచనము, పతాకము, పసుపు, చెరుకుగడ సిద్దాన్నము (తయారైనది) కలలో కన్పిస్తే, వాని శ్రీసర్వతోముఖాభివృద్ధి కలదౌతుంది. (54) బ్రాహ్మణుడు లేదా బ్రాహ్మణి, తల పై గొడుగును లేదా తెల్ల ధాన్యాన్ని, తల పై ఉంచినట్లైతే వాడు రాజౌతాడు. (55) కలలో రథం పై పురుషుడు కన్పించి తెల్లని మాలలు సుగంథములు ధరించి ఉంటే, అక్కడే ఉండి పెరుగు లేదా పాయసం తిన్నట్టుగా కన్పిస్తే వాడు రాజౌతాడు.

మూ॥ స్వప్నేదదాతి విప్రశ్చ బ్రాహ్మణీచ సుధాందధి ।

ప్రశస్తపాత్రంయ స్మైవాసోఽపిరాజాభవేద్ధ్రువం ॥

కుమారీచాష్ట వర్షియారత్న భూషణ భూషితా ।

యస్య తుష్టా భవేత్స్వప్నే సభవేత్కచి పండితః ॥

దదాతిపుస్తకం స్వప్నే య స్మై పుణ్యవతేచసా ।

సభవే ద్విశ్వ విఖ్యాతః కవీంద్రః పండితేశ్వరః ॥

యంపాఠయతి స్వప్నేవామాతేవచసుతం యథా ।

సరస్వతీసుతః సోఽపితత్పరోనాస్తి పండితః ॥

బ్రాహ్మణః పాఠయేద్యంచ పితేవయత్నపూర్వకం !

దదాతి పుస్తకం ప్రీత్యాసచతత్సదృశోభవేత్ ॥

ప్రాప్నోతి పుస్తకంస్వప్నే పథివాయత్ర తత్రవా ।

సపండితో యశస్విచ విఖ్యాతశ్చ మహీతలే ॥

స్వప్నోయతో మహామంత్రం విప్రోవిప్రేదదాతిచేత్ ।

సభవేత్పురుషః ప్రాజ్ఞోధనవాన్గుణ వాన్సుధీః ॥

స్వప్నేదదాతి విప్రంవా ప్రతిమాంవాశిలామయీం ।

య స్మైదదాతివిప్రశ్చ మంత్రసిద్ధిశ్చ తద్భవేత్ ॥

విప్రౌవిప్ర సమూహంచ దృష్టానత్వాఽశిషం లభేత్ ।

రాజేంద్రః సభవేద్వా పికింవాచ కవిపండితః ॥

శుక్ల ధాన్యయుతాంభూమిం యస్మై విప్ర: సముత్సృజేత్ ।

స్వప్నేఽపి పరితుష్టశ్చసభవేత్సృథివీపతిః॥

స్వప్నే విప్రోరథేకృత్వానానా స్వర్గం ప్రదర్శయేత్ ।

చిరంజీవీభవేదాయుః ధనవృద్ధిర్భవేద్ధ్రువం ॥

విప్రాయవిప్రః సంతుష్టో య స్మై కన్యాం దదాతిచ ।

స్వప్నేచ సభవేన్నిత్యం ధనాడ్యోభూపతిస్స్వయం ॥

స్వప్నేసరోవరం దృష్ట్వా సముద్రం వానదీంనదం ।

శుక్లాహింశుక్లశైలంచ దృష్ట్వాశ్రియమవాప్నుయాత్ ॥

యంపశ్యంతి మృతం స్వప్నే సభవేచ్చిరజీవినః ।

అరోగిరోగిణం దుఃఖిసుభినంచ ధ్రువంభవేత్ ॥

దివ్యాస్త్రీయం ప్రవదతి మమస్వామీభవానితి ।

స్వప్నేదృష్ట్వాచ జాగర్తి సచరాజాభవే ద్దృఢం ॥

స్వప్నేవాకాలికాం దృష్ట్వా లబ్ధ్వాస్ఫాటికమాలికాం ।

ఇంద్రచాపంశక్రవజ్రం సప్రతిష్ఠాం లభేద్ద్రువం ॥

స్వప్నేవదతియం విప్రోమమదాసోభవేతిచ ।

హరిదాస్యంచ మద్భక్తి: సలబ్ధ్వావైష్ణవోభవేత్ ॥

స్వప్నే విప్రోహరిః శంభుః బ్రాహ్మణీకమలాశివా ।

శుక్లాస్త్రీ దేవమాతావాజాహ్నవీ వాసరస్వతీ ॥

గోపాలికావేషధారీ బాలికా రాధికా మమ ।

బాలశ్చ బాలగోపాలః స్వప్నవిద్భిః ప్రకాశితః ॥

ఏషతేకథితోనంద సుస్వప్నః పుణ్య హేతుకః ।

శ్రోతుమిచ్ఛసికింవా, త్వం కింభూయః కథయామితే ॥

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే సుస్వప్న దర్శనం నామసప్త సప్తతితమోఽధ్యాయః ॥

అను ॥ బ్రాహ్మణుడు, బ్రాహ్మణి, కలలో కన్పించి, అమృతమును, దధిని ఇచ్చినట్టుగా కన్పిస్తే లేదా ప్రశస్తమైన పాత్రను ఇస్తే, పొందినవాడు రాజౌతాడు, నిశ్చయము. (57) ఎనిమిది సంవత్సరాల కుమారి, రత్న అలంకారము గలది, ఆనందించినట్టుగా కలలో కన్పిస్తే, వాడు కవి, పండితుడు ఔతాడు (58) స్త్రీ కలలో కన్పించి పుస్తకం. ఇచ్చినట్లైతే ఆ (పొందిన) పుణ్యాత్ముడు విశ్వ విఖ్యాతుడౌతాడు, కవీంద్రుడు, పండిత (శ్రేష్టు)డౌతాడు. (59) తల్లి కొడుకును చదివించినట్లుగా, కలలో ఆమె చదివిస్తే, వాడు సరస్వతీ సుతుడౌతాడు. వానిని మించిన పండితుడుండడు. (60) తండ్రిలా ప్రయత్నపూర్వకముగా బ్రాహ్మణుడు కలలో చదివిస్తే, ప్రేమతో పుస్తకమిస్తే, వాడు వాడితో సమానమౌతాడు. (61) పుస్తకాన్ని కలలో, ఎక్కడో ఒకచోటకాని దారిలో కాని పొందితే వాడు పండితుడు, కీర్తిమంతుడు, విఖ్యాతుడు ఔతాడు, ఈ భూమి పైన (62) కలలో బ్రాహ్మణుడు, బ్రాహ్మణునకు మంత్రాన్ని బోధిస్తే, ఆతడు ప్రాజ్ఞుడౌతాడు, ధనవంతుడు, గుణవంతుడు, బుద్ధిమంతుడౌతాడు (63) కలలో బ్రాహ్మణునకు రాతి ప్రతిమనుకొని, ఇచ్చినట్లైతే, పొందిన వానికి మంత్రిసిద్ది ఔతుంది. (64) ఇద్దరిని, లేదా అనేక మంది బ్రాహ్మణులను (కలలో) చూచి నమస్కరించి ఆశీస్సులను పొందితే వాడు రాజుకాని, కవి, పండితుడుకాని ఔతాడు (65) బ్రాహ్మణుడు, తెల్లని ధాన్యము గల భూమిని ఎవనికిస్తాడో, సంతుష్టినందుతాడో కలలో, వాడు రాజౌతాడు. (66) విప్రుడు కలలో రథమందుండి రకరకాల స్వర్గములను చూపిస్తాడు. చూచిన వానికి ఆయుస్సు, ధనము, వృద్ధినందుతాయి. వాడు చిరంజీవిఔ తాడు, నిశ్చయము. (67) బ్రాహ్మణుడు, మరో బ్రాహ్మణునకు ఆనందంతో కన్యనిస్తే కలలో, వాడు (పొందిన) ఎల్లప్పుడు ధనాఢ్యుడు, భూపతి(స్వయంగా) ఔతాడు. (68) కలలో సరోవరాన్ని, సముద్రాన్ని, నదిని, నదమును (పడమర వైపున ప్రవహించేది ) చూచిన, తెల్లసర్పాన్ని, తెల్ల పర్వతాన్ని చూచిన శ్రీని పొందుతాడు. (69) కలలో ఎవనినైనా చనిపోయినట్టుగా చూస్తే వాడు చిరంజీవిఔతాడు. రోగినిచూస్తే రోగంలేని వాడౌతాడు, సుఖవంతుని చూస్తూ దుఃఖవంతుడౌతాడు నిశ్చయము. (70) దివ్యస్తీ కలలో కన్పించి నా స్వామివి నీవు అని అంటే, వెంటనే మెలకువవస్తే, వాడు రాజౌతాడు, నిశ్చయము. (71) కలలో కాళికను చూచిన, స్పటికమాలను పొందిన, ఇంద్రచాపమును, ఇంద్రుని వజ్రాయుధమును చూచిన వాడు కీర్తిని పొందుతాడు, నిశ్చయము. (72) కలలో బ్రాహ్మణుడు కన్పించిన నీవు నా దాసుడవుకా అని అంటే, వాడు హరిదాస్యమును విష్ణుభక్తిని పొంది వైష్ణవుడౌతాడు. (73) కలలో బ్రాహ్మణుడు, విష్ణువు, శివుడు, బ్రాహ్మణి, లక్ష్మి, పార్వతి, తెల్లని స్త్రీ, దేవమాతకాని గంగ, సరస్వతి (74) గోపాలిక వేషం ధరించిన బాలిక, నా రాధిక, బాలుడు, బాలగోపాలుడు, కన్పిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని స్వప్నఫలమెరిగినవారు చెప్తారు. (75) ఓ నంద! దీన్ని నీకు చెప్పాను మంచి కల పుణ్యమునకు కారణము. ఇంకేం వినదలిచావు. నీకింకేం చెప్పాలి (76) అని బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు సుస్వప్న దర్శనమనునది డెబ్బది ఏడవ అధ్యాయము.