మూ॥ శ్రీనారాయణ ఉవాచ :
ఉద్ధవస్యవచః శ్రుత్వా చేతనం ప్రాప్యరాధికా ।
సాచోవాస సముత్థాయ రత్నసింహాసనే వరే ॥
ఉవాచ మధురం దేవీ హృదయేన విధూయతా ।
గోపీభిః సప్తభిః భక్త్యా సేవితా శ్వేత చామరైః ॥
శ్రీరాధికోవాచ :
మధురాంగచ్ఛ వత్సత్వం మాంచ విస్మర సంపదా ।
అతోఽప్యధర్మోనాస్త్యేవ భవతో భవసాగరే ॥
మదీయం వచనం సర్వం గత్వాకథయ సాంప్రతం ।
శ్రీకృష్ణం పరమానందం శీఘ్ర మానయ మత్ర్పభుం ॥
యోషిజ్జన్మనియోషిత్సు సంప్రాప్యతాదృశంపతిం ।
భేదోబభూవ కన్యావామదన్యకాఽపిదుఃఖినీ ॥
కిందదాసి ప్రబోధం మేనాస్తి మే బోధమౌచితం ।
నిష్ఫలోదేహినాం దేహో వినాఽత్మానం సదోద్ధవ ॥
సంప్రీత్యాసహసౌభాగ్యం గౌరవం నిత్య నూతనం ।
అతీవదుర్లభం ప్రేమ రహస్యం నవసంగమం ॥
స్మరామి మనసాశశ్వన్నాన్యోమనసివర్తతే ।
రాత్రౌ నిదాం పరిత్యజ్యస్మరణం శోకవర్ధనం ॥
మాముద్ధరధ్రువం వత్స నిమగ్నాం శోకసాగరే ।
జీవాభయప్రదానేన తీర్థేస్నాన ఫలం నృణాం ॥
ప్రబోధితుంన శక్నోమిదుర్నివారంచ మానసం ।
చింతయేచరణాంభోజం కృష్ణస్య పరమాత్మనః॥
తద్గుణం మహిమానంచ ప్రీతించ ప్రేమసాగరం ।
స్మారం స్మారంచ సౌభాగ్యం మనోమే న సిరం చరం ॥
జగతాంయువతీనాంచ కాసాంవా దుఃఖమీదృశం ।
శ్రీకృష్ణభేద దుఃఖంచ కావా జానాతిమాంవినా॥
కించిఙ్ఞానాతి సీతా సాఽప్యహంచ విధిబోధితం ।
మత్సరా దుఃఖినీనాస్తి కామినీ షుజగత్త్రయే ॥
కావా యాతిప్రతీతింమే శ్రుత్వాచ మానసీం వ్యధాం ।
కాసాంవామత్సమం దుఃఖం యువతీనాం సుతోద్ధవ ॥
రాధికా సదృశీస్త్రీషు నభూతా నభవిష్యతి ।
దుఃఖినీ విరహాతప్తా సుఖసౌభాగ్య వర్జితా ॥
సంప్రాప్య కల్పవృక్షంచ పతించ జగతాం పతిం ।
వాంఛితా హం విధాత్రా చనిర్దయేనచ పాపినా ॥
జీవనం సఫలం జన్మ సుస్నిగ్ధం చక్షుషీమనః ।
తత్పాద పద్మ వక్త్రేందు రూపవేషప్రదర్శనాత్ ॥
యన్నామశ్రుతి మాత్రేణ పంచప్రాణాః ప్రహర్షితాః ।
స్తుతి మాత్రాత్ ప్రపుల్యంతే ఆత్మాసుస్నిగ్ధ ఏవచ ॥
యశ్చ పస్పర్శసురతౌ యశస్త్రి భువనేష్వపి ।
కయావా సంపదావత్స విస్మరామితమీశ్వరం ॥
త్రైలోక్య విజయం రూపం గుణమేవ బిభర్తియత్ ।
న నిర్మితోయో విధినా తేనైవ నిర్మితోవిధిః ॥
తం విధేశ్చ విధాతారం దాతారం సర్వ సంపదాం ।
కల్పవృక్షా త్పరంశాంతం లక్ష్మీకాంతం మనోహరం ॥
సర్వేశం సర్వబీజంచ పరమాత్మాన మీశ్వరం ।
కయావా సంపదాతాత! విస్మరామిచతం పతిం ॥
యస్య నిర్మంథనార్హంచ నచంద్రోనచమన్మథః ।
నైవాశ్వినీ కుమారశ్చ గుణసామ్యంచ విశ్వతం ॥
అను II నారాయణుడిట్లన్నాడు : ఉద్దవుని మాటలు విని రాధిక చైతన్యం పొంది లేచిశ్రేష్ఠమైనరత్న సింహాసనమందు ఆమె కూర్చున్నది. (1) హృదయంలో బాధపడుతూ దేవిమధురంగా ఇట్లా అన్నది. ఏడుగురు గోపికలు భక్తితో తెల్లని చామరలు చేత ధరించి ఆమెను సేవిస్తున్నారు. (2) రాధిక ఇట్లా అన్నది ఓ వత్స! నన్ను సంపదను మరచి, నీవు మధురకు వెళ్ళు. నీకు ఈభవ సాగరమందు దీనివల్ల అధర్మం కలగదు. ఇప్పుడు నా మాటలన్నీ, అక్కడివెళ్ళిచెప్పు. నాప్రభువు, పరమానందుడైన శ్రీకృష్ణుని త్వరగా తీసుకురా. (4) స్త్రీలలో, స్త్రీ జన్మలో, అటువంటి భర్తను పొంది ఎవతెకు భర్తతో విభేదం కల్గింది. నేను తప్ప ఇంకెవడైనా దుఃఖితురాలు ఉందా (5) నాకేమి బోధిస్తావు. నాకు చెప్పతగిన బోధలేదు. ఓ ఉద్దవ! ఆత్మలేకుండా, శరీరధారుల దేహము నిష్పలమైనది. ఎప్పుడూను. (6) ప్రీతితో కూడినసౌభాగ్యమును, నిత్య నూతనమైన గౌరవమును, మిక్కిలి దుర్లభమైన ప్రేమను, రహస్యమైన నవ సంగమమును, (7) ఎప్పుడూ మనస్సులో స్మరిస్తుంటాను. మనస్సులో మరొకటి లేదు. రాత్రిపూట నిద్ర లేక స్మరించటం వల్ల దుఃఖం పెరుగుతుంది. (8) ఓ వత్స! శోకసాగరమందు మునిగిన నన్ను తప్పక ఉద్దరించు. జీవులకు అభయప్రధానం చేస్తే అది నరులకు తీర్ధ స్నానం వల్ల కలిగే ఫలాన్ని ఇస్తుంది. (9) ఎంత బోధించినా కుదుట పడటం లేదు. మనస్సువారింపరానిది. పరమాత్మయైన కృష్ణుని పాదాంబుజములను చింతిస్తున్నాను. (10) ఆతని గుణాలను, మహిమను, ప్రీతిని, ప్రేమసముద్రాన్ని వీటిని స్మరించి స్మరించి ఆసౌభాగ్యం తలచి తలచి నా మనస్సు స్థిరంగా ఉండకుండైంది. చంచలమైంది. (11) జగత్తులో యువతులకు ఇటువంటి దుః ఖమెవరికి ఉంది. శ్రీకృష్ణువియోగ దుఃఖాన్ని నేను తప్ప ఎవరెరుగుదురు. (12) సీతకు కూడా కొంచెం తెలుసు. విధిబోధితురాలనై నేను ఎరుగుదును. నా అంత దుఃఖితురాలు ఈముల్లోకములలో స్త్రీలలో లేదు (13) నా మనోవ్యథను విని ఎవతే ప్రసిద్ధిని పొందుతుంది. ఓ సుత! ఉద్దవ! ఏయువతికి నా అంత దుఃఖం ఉంది. (14) రాధిక వంటి స్త్రీ ఇదివరలో లేదు. ఇకముందు పుట్టదు. దుఃఖిని , విరహతపురాలు, సుఖ సౌభాగ్యములు లేనిది. (15) కల్పవృక్షాన్ని పొంది, జగత్పతియైన పతిని పొంది, నిర్డయుడు, పాపియైన విధాతచే మోసగింపబడ్డాను. (16) ఆతని పాదపద్మములను చంద్రముఖమును రూప వేషములను చూడటం వలన జన్మ జీవనము సఫలము, కళ్ళుమనస్సు స్నిద్దమౌతాయి. (17) ఆతని పేరు విన్నంత మాత్రం చేత ఐదు ప్రాణములు బాగా ఆనందిస్తాయి. స్తుతించినంతనే వికసిస్తాయి,ఆత్మ స్నిగ్ధమౌతుంది. (18) సురత మందు స్పృశించినంత మాత్రం చేత ముల్లోకములలో కీర్తి లభించింది. అట్టి ఈశ్వరుని, ఎంత సంపద '(ఎట్టి) వస్తే మాత్రం ఎట్లా విస్మరిస్తాను, ఓ వత్స! (19) రూపము ముల్లోకాలను. జయించేది. ఆతడు సద్గుణాలనే వహిస్తాడు. ఆతడు విధితో నిర్మింపబడలేదు. అతడే విధిని నిర్మించాడు. (20) విధికి విధాతయైన, అన్నిసంపదలనిచ్చే, కల్పవృక్షమున కంటే పరుడై శాంతుడైన, మనోహరుడైన ఆ లక్ష్మీకాంతుని ఎట్లా మరుస్తాను. (21) సర్వేశుడు, అన్నిటికి బీజరూపుడు, పరమాత్మ ఈశ్వరుడు, అట్టి పతిని, ఎట్టి సంపద వస్తే మరచిపోతాను, ఓ తండ్రి! (22) చంద్రునో, మన్మథునో, అశ్వనీ కుమారులనో మథునం చేస్తే ఇట్టి రూపం రాదు. విశ్వంలో ఈతని గుణసామ్యం కలవాడు లేదు.
మూ॥ ధ్యాయంతే యత్పదాంభోజం బ్రహ్మేశశేష సంజ్ఞకాః ।
కయావా సంపదా తాత విస్మరామిచ తం ప్రభుం ॥
స్వప్నేపశ్యంతి యే రూపమతులంచ మనోహరం ।
తేఽపి సర్వం పరిత్యజ్య ధ్యాయంతే తమహర్నిశం ॥
గుణేన శైల: సలిలం శుష్కకాష్ఠంద్రవేదితి ।
మృతవృక్షోముకులితః స్తంభితశ్చసమీరణః ॥
సూర్యశ్చజలధీశ్చైవ స్థగితోభక్తి భావతః ।
కయావా సంపదాపుత్ర విస్మరామిచతం ప్రియం ॥
యద్భయాద్వాతి వాతోఽయం సూర్యస్తపతి యద్భయాత్ ।
వర్వతీంద్రో దహత్యగ్నిః మృత్యుశ్చరతి జంతుషు ॥
యద్భయాత్ఫలితా వృక్షాః పుష్పితాః సమయేఽపిచ ।
సముద్రాః స్వాత్మవిషయగ్రహాశ్చమునయః సురాః ॥
కాలస్యకాలః సంవర్త: సంహర్తాస్రష్టురీశ్వరః ।
స్వాధీనశ్చ స్వతంత్రశ్చ స్వయమేవాత్మ సంజ్ఞకః ॥
కయావా సంపదా భక్త విస్మరామి చతం ప్రభుం ।
ప్రబోధోనాస్తితద్భేదే యేనమాం బోధయేత్ బుధః ॥
మాంచబోధయితుంశక్తి న సావిత్రీ సరస్వతీ ।
నవేదానచవేదాంగాః కేవాసంతశ్చ కేసురాః ॥
సహస్రవక్త్రో అనంతశ్చ వేదానాంజనకోవిధిః ।
నశంభుః నగణేశశ్చ యోగీంద్రాణాం గురోర్దురుః ॥
స్థితేః గతిశ్చింతనీయా మార్గశూన్యేకుతో గతిః ।
కాలసాధ్యంచ సర్వంచ సుఖందుఃఖం శుభాశుభం ॥
దుర్నివారః సకాలశ్చ కాలసాధ్యం జగత్సుచ ।
ఉత్తిష్ఠ మథురాంగచ్ఛ సుఖం వత్సమనోహరం ॥
ప్రజావాసంపరిత్యజ్య భవాంశ్చ గమనోత్సుకః ।
సుచిరం కృష్ణ విచ్ఛేదో దుఃఖాయ న సుఖాయచ ॥
పశ్యచంద్రముఖం తస్యజన్మ మృత్యుజరాపహం ।
రాధికావచనం శ్రుత్వారురోదభృశముద్ధవః ।
రుదంతీంరాధికాందృష్ట్వా బంధువిచ్ఛేదకాతరాం ॥
ఇతి బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే ఉత్తరార్ధ నారాయణ నారద సంవాదేరాథోద్ధవ సంవాదే పంచనవతితమోఽధ్యాయః ॥
బ్రహ్మ, ఈశుడు,శేషుడు వీరలు ఆపరమాత్మను ధ్యానిస్తారు. ఎట్టి సంపదలభిస్తే ఆ ప్రభువును మరిచిపోతాను, ఓ తండ్రి! (24) సాటిలేని మనోహరమైన ఆ రూపాన్ని కలలో చూస్తారు. అట్టివారు అందరు అన్నీ వదిలి ఆతనినే రాత్రింబగళ్ళు ధ్యానిస్తారు. (25) ఆతని గుణాలతో పర్వతం నీరై ద్రవిస్తుంది. ఎండిన కర్ర కరిగిపోతుంది. చచ్చినచెట్టు మొగ్గ తొడుగుతుంది. గాలి స్తంభిస్తుంది. (26) సూర్యుడు సముద్రము భక్తి భావంతో ఆగిపోతాయి. ఇట్టివానిని ఏ సందవస్తే మాత్రం అట్టి ప్రియునిమరచిపోతాను, ఓ పుత్ర! (27) ఆతని భయంతో గాలి వీస్తోంది. సూర్యుడు ఎండకాస్తున్నాడు. ఇంద్రుడు వర్షిస్తున్నాడు, అగ్ని కాలుస్తున్నాడు. ప్రాణులలో మృత్యువు సంచరిస్తున్నాడు. (28) ఆతని భయంతో చెట్లు పండ్లనిస్తున్నాయి. సకాలంలో పుష్పిస్తున్నాయి. తమ ఆత్మ విషయంలో సముద్రములు, గ్రహములు, మునులు, సురలు భయంగా ఉన్నారు. (29) కాలమునకు కాలము, సంవర్తుడు, స్రష్టనుసహరించేవాడు. ఈశ్వరుడు, స్వాధీనుడు, స్వతంత్రుడు. స్వయంగా ఆత్మ అనే పేరుగలవాడు. (30) ఓ భక్త! ఏ సంపదచూచి ఆ ప్రభువును మరచిపోతాను. ఆతడు విడిపోతే నాకు ప్రబోధం లేదు. ఇక బుధుడు ఎట్లామేల్కొలుపుతాడు. (31) సావిత్రి సరస్వతులు నన్ను మేల్కొలుపటానికి శక్తులు కారు. వేదములు, వేదాంగములు, సజ్జనులు సురలు (32) వేయి తలలవాడు అనంతుడు, వేదములకు జనకుడైన బ్రహ్మ శంభుడు గణేశుడు, యోగీంద్రులు గురువునకు గురువైనవాడు వీరెవరు నన్ను బోధపరుపలేరు. (33) ఉన్నదానికి మార్గం ఆలోచించాలి. మార్గం శూన్యమైతే దిక్కేది. సుఖము,దుఃఖము శుభము, అశుభము, అంతా కాలం వల్లనే సిద్ధిస్తాయి. (34) కాలాన్ని తప్పించలేము. జగత్తులో అంతా కాలం వల్ల సాధించతగిందే . ఓవత్స! లే సుఖంగా, మనోహరమైన మధురకు వెళ్ళు. (35) ప్రజవాసాన్ని వదిలి నీవు కూడా వెళ్ళటానికి ఉత్సాహంగా ఉన్నావు. ఎక్కువ కాలము కృష్ణ వియోగము దుః ఖకారణము, సుఖకారికాదు. (36) జన్మమృత్యుజర అను మూడు స్థితులనుండి రక్షించే చంద్రముఖం ఆతనిది. రాధిక యొక్క ఈమాటలన్ని విని ఉద్ధవుడు అధికంగా ఏడ్చాడు. బంధువుల వియోగంతో భయపడ్డ, ఏడుస్తున్న రాధికను చూచి, ఉద్ధవుడు దుః ఖించాడు. (37) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు రాధ ఉద్ధవ సంవాదమందు తొంబది ఐదవ అధ్యాయము సమాప్తము. ॥
Summary of chapter 95 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Deepening the description of Vraja, this chapter illuminates the confidential sweetness of the sacred bowers of Vṛndāvana and the transcendent glory of Rādhā-Kuṇḍa and Śyāma-Kuṇḍa. Manifested from the divine tears and pastimes of Śrī Rādhā and Śrī Kṛshṇa, these holy ponds represent the liquid form of supreme divine love. Bathing in Rādhā-Kuṇḍa with pure faith grants the rare jewel of unalloyed Rādhā-dāsya, the eternal loving service of Goddess Śrī Rādhā.