11 - తృణావర్తవధము

శ్రీనారాయణ ఉవాచ :

ఏకదా గోకులే సాధ్వీ యశోదా నంద గేహినీ ।

గృహకర్మణి నంనక్తా కృత్వా బాలం స్వపక్షసి ॥

వాత్యారూపం తృణావర్తమాగచ్ఛంతం చ గోకులం।

 శ్రీహరిర్మనసా జ్ఞాత్వా భారయుక్తో బభూవ హ॥

భారాక్రాంతా యశోదా చ తత్యాజ బాలకం తదా ।

శయనం కారయిత్వా చ జగాను యమునాo మునే ॥

నారాయణముని పల్కెను:

ఒకసారి రేపల్లెలో ఇంటిపనులలో మునిగియున్న నందుని గృహిణియగు యశోదాదేవి తన కుమారుని తన వక్షస్థలమున చేర్చుకొని యుండెను, సుడిగాలి రూపమున గోకులమును చేరవచ్చుచున్న తృణావర్త రాక్షసుని శ్రీకృష్ణుడు ముందుగా తెలిసికొని తన దేహము తల్లికి భాధమగునట్లు మార్చిను. అప్పుడు యశోద బరువైన బాలకుని మోయజాలక దించి పడకపై పండబెట్టి యమునా నదికీ వెల్లెను.

ఏతస్మిన్నంతరే తత్ర వాత్యారూపధరోఽసురః ।

 ఆదాయ తం భ్రమయిత్వా గత్వా చ శతయోజనం ॥

 బభంజ వృక్ష శాఖాశ్చ హ్యాంధీభూతం చ గోకులం ।

చకార సద్యో మాయావీ పునస్తత్ర పపాత హ ॥

అసురోఽపీ పరిస్పర్శాజ్జగామ హరిమందిరం ।

సుందరం రథమారుహ్య కృత్వా కర్మక్షయం స్వకం ॥

 పాండ్య దేశోద్భవో రాజా శాపాద్దుర్వాససోఽసురః।

శ్రీకృష్ణ చరణ స్పర్శాధ్గోలోకం న జగామ హ ॥

ఇంతలో సందుని మందిరమునకు సుడిగాలీ రూపుదాల్చిన రాక్షసుడు వచ్చి బాలుని లేవనెత్త (ఆకాశములో) త్రిప్పి నూరు యోజనముల దూరము వరకు పోయి అప్పటికప్పుడే గోకులమంతట చిమ్మచీకటి చేసి గాలితో చెట్ల కొమ్మలను విరిచి చివరకు నేల మీద పడిపోయెను. వాడు రాక్షసుడైనను హారీ స్పర్శ వలన తన కర్మను నొశము చేసుకొని (శరీరము వదిలి దివ్యదేహము దాల్చి) సుందరమైన రథము నెక్కి హరీ మందిరమునకు పోయెను. (పూర్వజన్మలో పాండ్య దేశమున బుట్టిన రోజు దూర్వాసుని శాపము వలన రాక్షసుడై శ్రీకృష్ణుని చరణములను స్పృశించినందు వలన గోలోకమునకు పోయెను.

వాత్యారూపే గతే గోపా గోప్యశ్చ భయవిహ్వలా।

న దృష్ట్వా బాలకం తత్ర శయనం శయనే మునే ॥

సర్వే నీజఘ్ను: స్వం వక్షస్థలం శేకాకులా భయాత్।

కేచిన్మూర్భామవాపుశ్చ దురుదుశ్చాపి కేచన ॥

అన్వేషణం ప్రకుర్వంతో దదృశుర్భాలకం వ్రజే ।

ధూలీధూసర సర్వాగం పుష్పోద్యానాంతర స్థితం॥

బాహ్యైకదేశే నరనస్తేరే నీరసమన్వతే ।

పశ్యంతం గగనం శశ్వద్వదంతం భయాకాతరం ॥

గృహీత్వా బాలం నందః కృత్వా వక్షసి సత్వరం ।

 దర్శం దర్శం ముఖం తస్య రురోద చ శుచాఽన్వితః ॥

 యశోదా రోహిణీ శీఘ్రం దృష్ట్వా బాలం గురోద చ ।

 కృత్వా వక్షసి తద్వక్త్రం చుచుండ చ ముహర్ముహాః ॥

మంగలం కారయామాస స్నాపయామాస బాలకం ।

 స్తనం దదౌ యశోదా చ ప్రసన్నవదనేక్షణా ॥

సుడిగాడ్పు తగ్గగానే గోపాలురు గోపికలు భయముతో మనస్సు చెదరి ముంచములో పండుకొని యున్న బాలకుని చూడక భయముతో శోకముతో వ్యాకులులై తమ తమ రొమ్ములను కొట్టుకొనిరి. కొందరు మూర్ఛిల్లిరి. కొందరు దుఃఖించరీ. వెదడుచు పోయి ప్రజములో బయట ఒక ప్రదేశమున నీరు నిండియున్న సరస్సు ఒడ్డున ఒక పుష్పోద్యానములో పడియున్న బాలుని చూచిరి. శరీరమంతయు దుమ్ముతో నిండియుండెను. ఆకాశమును చూచుచు భయముతో బెదరుచు మాటి మాటికేదో మాటాడుతున్న బాలుని నందుడు స్వీకరించి త్వరగా వక్షః స్థలమున కదుముకొనీ మాటి మాటికి బాలుని ముఖము చూచుచు దుఃఖముతో నేడ్చెను. యశోదయు రోహిణియు బాలునీ చూడగనే ఏడ్చి మాటి మాటికి ముద్దులు పెట్టుకొనిరి. వక్షః స్థలముననదుముకొనిరి. యశోద కలకలలాడు ముఖముతో ప్రసన్నమైన . చూపులతో పిల్లవానిని స్నానమాడింపజేసి మంగళ రక్ష చేయించి స్తన్యము (చనుబాలు) నిచ్చెను.

నారద ఉవాచ :

కథం శశాప దుర్వాసాః పాండ్య దేశోద్భవం నృపం ।

నువిచార్య వద బ్రహ్మాన్నితిహాసం పురాతనం ॥

నారదుడు పల్కెను:

ఓ పరమాత్మా! పాండ్యదేశరాజును దుర్వాసుడెందుకు శపించెను? ఈ ప్రాచీనమైన ఇతిహాసమును బాగుగా ఆలోచించి చెప్పుము.

 శ్రీనారాయణ ఉవాచ :

పాండ్య దేశాధిహారాజా సహస్రాక్షః ప్రతాపవాన్ ।

స్త్రీ సహస్రం సమాదాయ కామ బాణ ప్రపీడితః ॥

మనోహరే నీర్జనే చ పర్వతే గంధమాదనే ।

విజహార నదీతీరే వుష్పోద్యానే మనోరమే ॥

 నానా ప్రకార శృంగారం వీపరీతాదికం నృపః ।

నఖ దంతక్షతాంగం చ కామినీనాం చకార సః ॥

కృత్వా మూర్తి సహస్రం చ యోగీంద్రో నృపతీశ్వరః ।

 కృత్వా స్థలవిహారం చ జలక్రీడాం చకార హ ॥

నార్యో వివసనాః సర్వా నగ్నాశ్చ నృపయోషితః ।

విజహ్రుశ్చ పుష్ప భద్రానదీ తీరే మనోహరే ॥

పాండ్య దేశపు ప్రభువు సహస్రాక్షుడన్న రాజు గొప్ప ప్రతాపవంతుడు. అతడు గొప్పశక్తి సాధించిన యోగీంద్రుడు. అతడొకసారి వేయిమంది తన స్త్రీలను (భార్యలను) వెంటబెట్టుకొని మనోహరము జనరహితము ఐన గంధమాదన పర్వత ప్రాంతమున నున్న పుష్ప భద్రాతీరమున సుందర పుష్పోద్యానమున విహరించుచు తన యోగశక్తితో వేయి రూపములు ధరించి కామీనీ జనమును నఖక్షత దంతక్షతములు విపరీత కాముకక్రీడలు నానావిధ శృంగార చేష్టలతో అనుభవించెను. స్థలవిహారము తరువాత ఆరాజు స్త్రీలు వస్త్రములు వదలి నగ్నము గా భర్తతో జలక్రీడలొనర్చిరి.

ఏతస్మిన్నంతరే తత్ర సమాయాతో మహామునిః ।

శిష్యలకై పరివృతో గచ్ఛన్వై శంకరం ప్రతి ॥

దృష్ట్వా మునిం మహామత్తో నోత్తస్థౌ న ననామ హ ।

వాచా హస్తేన రాజా చ నంభాషాం న చకార హ ॥

దృష్ట్వా చుకోప నృపతిం శశాప స్ఫురితాధరః ।

ఇంతలో అక్కడికి లక్షమంది శిష్యులతో బాటు కైలాసమునకు శంకరదర్శనమునకై పోవుచు దూర్వాస మహర్షి వచ్చెను. కామ మదమత్తుడై యున్న సహస్రాక్ష నృపతి మునిని చూచియు లేచి నిలబడుట గాని నమస్కరించుట గాని మాటమాత్రము పలుకుట గాని ఎట్టి ఆదరము చేయలేదు. అది చూచీ కోపించి ముని వణకుచున్న పెదవులతో ఇట్లు శపించెను.

అసురో భవ పాపిష్ఠ యోగాద్రృష్టో భువం వ్రజ ॥

 భారతే లక్షవర్షం చ స్థాతవ్యం తే నరాధమ ।

 తతో హరివదంపర్శాద్గోలోకం యాన్యసి ధ్రువం॥

 స్థానే స్థానే హే మహిష్యో జనం లభత భారతే।

రాజేంద్ర గేహే రాజేంద్రాద్భవిష్యథ మనోహరాః ॥

 ఇత్యుక్త్వా తు మునీంద్రను జగామ శంకరాలయం।

హాహా శబ్దం విచక్రుశ్చ శిష్య సంఘ కృపాళవః॥

ఓ పాపాత్ముడా! నీ యోగశక్తి భ్రష్టమై పోయి భూమి మీద రాక్షసుడుగా జన్మింతువు గాక. నరాధముడా! నీవు లక్షీండ్లు అట్లు భారత వర్షమున నుందువు. ఆ తరువాత శ్రీహరి పాదస్పర్శ వలన గోలోకమును పొందగలవు. ఇది సత్యము. నీ భార్యలు అదే భారతవర్షమున అక్కడక్కడ రాజేంద్రుల యిండ్లలో నీ కన్న సుందరాంగులుగా జన్మింతురుగాక" ఇట్లు పలికి దూర్వాసముని శంకరాలయమున కేగెను. దయావంతులైన అతని శిష్యులు అయ్యో! హా అనుకొనుచు వెళ్ళిరి.

గతే మునీంద్రే రాజేంద్రో రురోద చ నరిత్తటే ।

రురుదూ రమణీయాశ్చ రమణ్యో విరహాతురాః ॥

హే నాథ! రమణ శ్రేష్ఠేత్యుచ్చార్య చ పునః పునః ।

త్వం వినా వాక్వ యాస్యామో వయం త్వం వా క్వయాన్యసి॥

వయం నో విహరిష్యామస్త్వయాసార్థం సునిర్జనే ।

న కరిష్యసి రాజ్యం త్వం న యాస్యామో గృహం వయం ॥

శరచ్చంద్ర ప్రభాముష్టం న ద్రక్ష్యామో ముఖం తవ।

 ప్రసారితాభ్యాం బాహుభ్యాం నానయిష్యాము ఇత్యతః ॥

మునీంద్రుడు వెళ్లిన తరువాత ఆ నదీ తీరమున రాజు గడచిన దానికి మిక్కిలి ఏడ్చెను. అంతవరకు సుఖమనుభవించిన ఆ సుందరీమణులు అతని ఎడబాటుకు భయపడుచు ఇట్లు దుఃఖించిరి. “ఓ నాథుడా! ప్రేమమూర్తీ! నీవు లేకుండ మేమెక్కడికి పోదుము మేము లేకుండ నీవెక్కడికేగుదువు? ఏకాంత ప్రదేశమున ఇక మేము నీతో విహరించబోము కదా! నీవిక రాజ్యమేలవుకదా! మనము రాజగృహమునక్క ఫోముకదా! శరత్కాల చంద్రుని కాంతిని దొంగిలించిన నీ ముఖమునిక చూడజాలము. చాచిన చేతులతో మమ్మిక నీదగ్గరకు తీసుకోవు కదా.

ఇత్యుక్త్వా రురుదు స్సర్వాః పురస్కృత్య నరాధిపం।

మూర్ఛామవావుశ్చరణం ధృత్వా రాజ్జస్సరిత్తటే ॥

రాజాఽ గ్ని కుండమాధాయ నారీభస్పహ నారద ।

స్మృత్వా హరిపదాంభోజం జ్వలదగ్నిం వివేశ హ ॥

 హాహాకారం సురాస్సర్వే విచక్రుర్గగనే స్థితాః ।

ఇత్యూచుర్మునయ శ్చైవం దైవం చ బలవత్తరం ॥

న చ రాజా తృణావర్తో జగామ హరిమందిరం ।

మహిష్యో భారతే వర్షే లేభిరే జన్మ వాంఛితం॥

ఇత్యేవం కథితం సర్వం హరేర్మాహాత్మ్య ముత్తమం ।

మోక్షణం నృపతే శ్చైవ మునీంద్ర శాప హేతుకం ॥

రాజు ముందర నీట్గా స్త్రీలు దుఃఖించి అతని పాదములు పట్టుకొని మూర్ఛిల్లిరి. ఆ నదీ తటమున రాజు అగ్నిగుండ మేర్పరచి శ్రీహరి పాద పద్మములు స్మరించుకొనుచు భార్యలతో బాటు మండుచున్న అగ్నిలో ప్రవేశించి శరీర త్యాగము చేసిను. ఆకాశమున నున్న దేవతలది చూచుచూ హా హా యని అరచిరి. మునులు అన్నిటి కన్న దైవము మిక్కిలి బలమైనది” అని పలికిరి. ఆ రోజు తృణావర్తుడుగా జన్మించి హరిపాద స్పర్శతో గోలోకము పొందెను. అతని భార్యలు భారత వర్షమున కోరుకున్న జన్మలెత్తిరి. ఇట్లు సహసాక్షనృవతీ దూర్వాసముని శాప మూలముగా జన్మరాహిత్యము పొందిన శ్రీహరి మహిమ నీకెరింగించితిని.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే నారాయణ నారద సంవాదే తృణావర్తవధో నామ ఏకాదశోఽధ్యాయః॥

ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండములో నారాయణ నారద సంవాదములో తృణావర్త వధయను పదకొండవ అధ్యాయము సమాప్తము.