బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

54 - రాధికాశ్రీకృష్ణ సంవాదము

నారద ఉవాచ - నారదముని అనెను :

అత పరం కిం రహస్యం బభూవ మునిసత్తమ

కథం జము భగవాన్మధుధం నందిమందిరాత్

వందే దధార ప్రాణాంశ్చ విచ్చేదేన హరేః కథం

గోపాంగనా యశోదో వా కృషెడతావనవసాః

చక్షుర్నమేష విచ్చేదాద్యా రాధా న హి జీవతి

 కథం దధార సా దేవీ ప్రాణాన్ ప్రాజేశ్వరం ఏ

 యే యే తత్పంగినో గోపాః శయవాసన భోగరః

కథం వీసస్మరుస్తే చ తాదృశం బాంధవం ప్రజే

శ్రీకృష్ణో మధురాం గత్వా కిం కిం కర్మ చకార సః

స్వర్గారోహణ పర్యంతం తద్భవాన్ వక్తుమర్హతి

ఓ మునిశ్రేష్టుడా! ఆ తరువాత ఆ పరమాత్మ యొక్క లీలా చరిత్రములో ఏయే రహస్యము జరిగెను? శ్రీకృష్ణ పరమాత్మ సందుని గృహము నుండి (రేపల్లె నుండి) మధురకిల్లెను. ఆ హరి యొక్క వియోగము చేత కృష్ణుని యందే నిలుపుకున్న మనస్సు గల నందుడు గాని, గోపికలు గాని యశోద గాని ప్రాణములెటు నిలుపుకొనిరి? కనురెప్ప పాటు అంత సమయము కూడ కృష్ణ వియోగము కళినచో జీవించనట్టి రాధాదేవి ప్రాణేశ్వరుడు లేకుండ తన ప్రాణముల. నెటు నిలుపుకొనెను? ఏఏ గోపాలుడు పండుకొన్నను కూర్చున్నను భోగములనుభవించినను కృష్ణుని వెన్నంటియే అతని సంగములో నుండిరో అంతటి బంధువును ఎడబాసి ప్రజములో ఎట్లు జీవించిరి? అతనిని ఎట్లు మరచిరి? శ్రీకృష్ణుడు మధురానగరమునకు పోయి ఏయే అద్భుత కర్మలు చేసెను? తన లీలో శరీరమును వదిలి స్వస్థానమునకు (గోలోకము) చేరబోవు వరకు ఏమీ జరిగెను? ఆ వృత్తాంతమంతటిని నాకు చెప్పుదువు గాక.

శ్రీనారాయణ ఉవాచ - శ్రీనారాయణ మహర్షి పలికెను:

కంస శ్పకార యజ్ఞం చ సమూహూతో ధనుర్మఖం

 జగామ తత్ర భగవాంస్తేన రాజా నిమంత్రితః

రోజా ప్రస్థావయామాస చక్రూరం భగవత్రియం

అక్రూరః ప్రేరితే రాజ గత్వా చ నంద మందిరం

శ్రీకృషంచ గృహీత్వా స సగణం మధురాం గతః

కృష్ణ శ్రీమధురాం గత్వా జనన సృపతిం మునే

జఘాన రజకం చైన చాణూరం ముష్టికం గజం

చతార పిత్తోరుద్గారం భాందవానం చ బాంధవః

కంసుడు శ్రీకృష్ణుని రప్పించుటకై ఒక మీషగా ధనుర్యము నాచరించెను. ఆ యజ్ఞమును దర్శించవలెనని రాజుచేత ఆహ్వానింపడిన భగవంతుడు (శ్రీకృష్ణుడు) మధురానగరమునకు పోయెను. కంసుడు కృష్ణుని తోడ్కొని వచ్చుటకై రేపల్లెకు భగవంతునికి ప్రియుడైన అక్రూరుని పంపెను. అక్రూరుడు బలరామాదులతో బాటు శ్రీకృష్ణుని తీసుకొని మధురకు వచ్చాను, కృష్ణుడు తన జన్మచేత పవిత్రము చేయబడిన మధురకేగి (తనను తిరస్కరించిన ఒక చాకలివానీని ఎదిరించిన) చాణూరముష్టికులనెడి మల్లురను, కువలయాపీడమనెడి గజమును సంహరించి రాజైన కంసుని సంహరించెను. ఆపన్నులకు బంధువైన శ్రీహరి తన తలిదండ్రులైన దేవకీ వసుదేవులను ఉగ్రసేనుడు మొదలగు బంధువులను వారి ఆపదల నుండి ఉద్ధరించెను.

కుబ్దయా సహ శృంగారం కృత్వా చ కౌతుకేన చ

తాం చ ప్రస్తావయామాస గోలోకం గోపికాపతిః

చకార కృపయా వీసుర్మాలాకారస్య మోక్షణం

కృపయా చోర్ధపద్వారా బోధయామాస గోపికాః

తదోషనీతో భగవాసవంతీ నగరం యయా

చకార విద్యాగ్రహణం మునేః సాందీపనేర్గురోః

తనను వాంఛించిన కుళ్ళతో వేడుకగా శృంగార క్రీడ జరిపి గోపికానాథుడు ఆ కుబను శరీరబంధము తొలగించి గోలోకమును పొందించెను (ముక్తిని ప్రసాదించెను). తనకు పూమాలలు సమర్పించిన మాలాకారునికి కృపతో మోక్షమిచ్చెను. తన అంతరంగ భక్తుడైన ఉద్ధవుని ప్రజమునకు పంపి (తన వియోగమునకు తపించిపోవుచున్న) గోపికలకు అతని ద్వారా జ్ఞానోపదేశము చేసెను. తరువాత ఉపనయన సంస్కారమును (గర్గుని ద్వారా) పొంది జ్ఞాన శక్త్యాది షడజైశ్వర సంపన్నుడైనను అవంతీనగరమందున్న సాందీపని ముని వద్దకేగి ఆ గురువు వద్ద విద్యలను గ్రహించెను.

తతో జీత్వా జరాసంధం నిహత్య యవనేశ్వరం

ఉగ్రసేనం చ నృవతీం చకార విధిపూర్వకం

గత్వా సముద్ర నికటం నిర్మాయ ద్వారకాం పురీం

జహార రుక్మిణీం దేవీం జీత్యా నృపతి సంఘకం

కాలిందం లక్షణాం శైబ్యాం నత్యాం జాంబవతీం సతీం

మిత్రవిందాం నాగ్నజితిం నముద్వాహం చకార సః

తరువాత జరాసంధుని జయించి కాలయవనుని సంహరించీ మధురానగరమున ఉగ్రసేనుని శాస్త్రీయముగా రాజునొనర్చెను. పశ్చిమ సముద్ర తీరమునకేగి అక్కడ (విశ్వకర్మతో) ద్వారకాపురిని నిర్మింపజేసి (దానిని యాదవుల రాజధానిగా జేసి నివసించేను). తననెదిరించిన నీచరాజసమూహమును జయించి రుక్మిణీదేవిని హరించెను (అగ్రమహిషిని చేసికొనెను) కాళింది, లక్షణ, శైబ్య, (భద్రాదేవి) సత్యభాష, జాంబవతీ మిత్రవింద నాగ్నజితి అను రాజకన్యలను వివాహము చేసికొనెను.

నిహత్య నరకం భూపం రణేన దారుణేన చ

పత్నీషోడశ సాహస్రం విహారం చ చకార సః

ఆహార పారిజాతం చ జ్వి శక్రం చ లీలయా

చిచ్ఛేద బాణహస్తాంశ్చ జీడ్వో చ చంద్రశేఖరం

పౌత్రస్య మోక్షణం కృత్వా పునరాగత్య ద్వారకాం

ఆత్మానం దర్శయామాస లోకాంశ్చ ప్రతిమందిరం

భయంకరమైన యుద్ధములో ప్రాగ్జ్యతీషపురికి రాజైన నరకాసురుని సంహరించి అతనిచేత బంధింపబడిన రాజకన్యలను పదునారు వేలమందిని వారి కోరిక ప్రకారము వివాహము చేసికొని అందరితో విహరించెను. స్వర్గమునకు పోయి ఇంద్రుని అవలీలగా జయించి పారిజాత వృక్షమును (సత్యభామ కోరికననుసరించి) అపహరించెను. భక్తరక్షణ కొరకై తన నెదిరించిన శంకరుని గెలిచి బాణాసురుని యొక్క వేయి హాస్తములను ఖండించెను. తన పౌత్రుడైన (ప్రద్యుమ్నుని కుమారుడగు) అనిరుద్ధుని విడిపించుకొని తిరిగి ద్వారకకు వచ్చెను. తరువాత ఏకకాలములో అందరు భార్యల గృహములలో ఏకరూపమున తనను చూపించి లోకులననుగ్రహించెను.

యోగే చ వసుదేవస్య తీర్థయాత్రా ప్రసంగతః

ప్రాణాధిష్ఠాతృదేవీం చ దదర్శ తత్ర రాధికాం

పూర్ణే చ శతవయే చ సుదామ్నః శాపమోక్షణే

పునర్యయా తయా సార్థం పుణ్యం బృందావనం వనం

పునశ్చతుర్దశాబ్దం చ తయా సార్థం జగత్పతిః

చకార రానం రాసే చ పుణ్యక్షేత్రే చ భారతే

పూర్ణమేకాదశాబ్దం చ నివృత్య నందమందిరే

మధురాయాం ద్వారకాయాం పూర్ణమబ్దశతం విభుః

తీర్థయాత్రల సందర్భమున వసుదేవుడు యోగమందుండగా (ధ్యానమగ్నుడై) - అక్కడ తన ప్రాణముల కధిష్టాన దేవతయైన రాధాదేవిని హరి దర్శించెను. నిండుగా నూరు సంవత్సరములు గడచిపోగా సుదాముని యొక్క శాపము (రాధాదేవికి) విమోచనమైన కాలములో - (మరల రాధను దర్శించిన స్వామి) ఆమెను తీసుకొని తిరిగి పుణ్యవంతమైన బృందావనమునకు పోయెను. ఆ జగన్నాథుడక్కడ రాధతో బాటు పదునాల్గు సంవత్సరములు భారత వర్షమందలి పుణ్యక్షేత్రమైన రాసమండలములో రాసక్రీడలొనర్చిను. అక్కడి నుండి మరల నందమందిరమునకు వచ్చి పదకొండు సంవత్సరములు గడిపి - ఆ విభుడు మధురలో ద్వారకలో నిండుగా వందసంవత్సరములు నివసించెను.

చకార భాగహరణం వృథివ్యాం పృథువిక్రమః

పంచవింశతి వద్దే చ శతవర్షాధికం మునే

తిష్ఠన్ జగామ గోలోకం పృధివ్యాం చ పురాతనః

యశోదాయై చ నందాయ వృషభాసాయ ధీమతే

రాధామా కలావత్యై దదౌ సామీప్య మోక్షణం

కృష్ణన సార్ధం గోపీ చ రాధికా చ కుతూహలాత్

నిబధ్య ధర్మ సేతుం చ. వేదోక్తం చ యుగే యుగే

ఇత్యేవం కథితం నర్వం నమాసేన మహామునే

జగములన్నిటిలో విస్తరించిన పరాక్రమము (శక్తి) గల శ్రీకృష్ణుడు తన అవతార ప్రయోజనమైన భూ భారమును తొలగించి ఒక వంద ఇరువది యైదు సంవత్సరములు భూమండలమందు నివసించి - అత్యంత ప్రాచీనుడై ఉండి అత్యంతము నవీనుడుగా ప్రకాశించి గోలోకమును చేరబోయెను. యశోదానందులకు రాధాదేవి తల్లిదండ్రులైన కలావతీ వృషభానులకును స్వామి తన గోలోకమందు సమీపమున వర్తించగల మోక్షస్థితినీ (సామీప్య మోక్షము) కృపజేసెను. శ్రీకృష్ణునితో బాటు గోలోకేశ్వరి గోపీనాయిక ఐన రాధాదేవియు ఆసక్తితో వేడుకలో - యుగయుగమందును భూమండలమున వేదోక్తమైన ధర్మ సేతువు బంధించి (శిథిలమగుచున్న ధర్మమును తిరిగి తిరిగి తమ అవతారములతో దృఢపరచి జీవకోటిని రక్షించుచుందురు. ఓ నారద మహర్షి సంక్షేపముగా ఇట్లు శ్రీకృష్ణచరిత్ర) మొత్తము చెప్పబడినది సుమా.

శ్రీకృష్ణ చరితం రమ్యం చతుర్వర్గ ఫలప్రదం

ఈ శ్రీకృష్ణ చరిత్ర చాల మనస్సునానందింపజేయునది. ధర్మార్థ కామమోక్షములనెడి చతుర్విధ పురుషార్థములను ఫలముగా విన్నవారికి - చదువు వారికి ఇచ్చునది.

 బ్రహ్మాదిస్తంబ పర్యంతం సర్వం నశ్వరమేవ చ

భజంతం పరమానందం సానందం నందనందనం

స్వేచ్ఛామయం పరంబ్రహ్మ పరమాత్మానమీశ్వరం

  పరమవ్యయమవ్యక్తం భక్తానుగ్రహ విగ్రహం

 సత్యం నిత్యం స్వతంత్రం చ సర్వేశం ప్రకృతేఃపరం

నిర్గుణం చ నిరీహం చ నిరాకారం నిరంజనం

నారదా! ఈ సృష్టిలో చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని ఒక చిన్న గడ్డి వేరు వరకు అంతయు నశించునదియే. కనుక పరమానంద . దాత ఆనందమయుడు ఐన ఆనందనందనునే రాధాకృష్ణ యుగళ రూపమున నున్న స్వామిని భజింపుము. ఆ పరంబ్రహ్మ తన. ఇచ్ఛననుసరించి రూపములు ధరించువాడు. జీవకోటికంతటికి అంతరాత్మ ఐనవాడు సర్వమునకు ప్రభువైనవాడు ప్రకృతికతీతుడు అవ్యయుడు (క్షీణవృద్ధులు లేనివాడు) ఇట్టివాడనీ ఎవరికిని వ్యక్తముగాకున్నను (స్పష్టముగా తెలియకున్నను) భక్తులననుగ్రహించుట కొరకు ఒక రూపము ధరించువాడు. సత్యనిత్య స్వతంత్రుడు - సర్వేశ్వరుడు. ప్రకృతి కంటే అతిశయించి ఉన్నవాడు. త్రిగుణములు లేనివాడు సర్వకాముడు కనుక వాంఛలు లేనివాడు. ఒక్క ఆకారమన్నది లేనివాడు. (సర్వాకారుడు కనుక), మిక్కిలి రంజించు ఆనందమయుడు. అట్టి ఆనందరూపుడైన శ్రీకృష్ణుని భజింపుము.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే రాధికాశ్రీకృష్ణ సంవాదే చతుఃపంచాశత్తమోధ్యాయః

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణమందలి శ్రీకృష్ణ జన్మఖండములో నారాయణ మహర్షి నారదుల నడుము సంవాద రూపమున నున్న రాధికాశ్రీకృష్ణ సంవాదమును ఏబది నాల్గవ అధ్యాయము సమాప్తము.

*****

శ్రీకృష్ణజన్మఖండే పూర్వార్ధం సమాప్తం

శ్రీకృష్ణజన్మఖండము యొక్క పూర్వార్థము సమాప్తము.